Top Stories
ప్రధాన వార్తలు

టీడీపీ బరితెగింపు.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను తిరువూరు వెళ్లకుండా కుట్రలు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు బరి తెగించేశారు.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, వైసీపీ నేతలను తిరువూరు వెళ్లకుండా చేసేందుకు కుట్రలకు తెరతీశారు. తిరువూరు వెళ్లే మార్గంలో రామచంద్రాపురం, చీమల పాడు వద్ద టీడీపీ.. భారీగా కార్యకర్తలను మోహరింపచేసింది. కాగా.. భద్రత కల్పించడంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాలను కూడా పోలీసులు లెక్కచేయడం లేదు. తిరువూరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల రక్షణ విషయంలో వితండవాదం చేస్తున్నారు.తిరువూరు వస్తేనే భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. నిన్న టీడీపీ గూండాల దాడితో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ఎన్నిక జరిగే వరుకు కౌన్సిల్ హాలు వరకు రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి నేటికి (మంగళవారం) వాయిదా వేశారు.

గాజాపై దాడులు ఆపకుంటే.. ఇజ్రాయెల్‌కు యూకే, ఫ్రాన్స్, కెనడా హెచ్చరిక
టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో పూర్తి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్(Israel) నిరంతరం తన దాడులను కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు ఇజ్రాయెల్ జరుపుతున్న తాజా సైనిక దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే ఆపకపోతే కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్(Gaza Strip)లో తాజాగా ‘ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్’ అనే పేరుతో కొత్త సైనిక దాడిని ప్రారంభించింది. ఉత్తర, దక్షిణ గాజాలో వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోంది. వీటిని మే 17 నుంచి ప్రారంభించింది. ఈ దాడులలో వందలాది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. మే 14, 2025న జబాలియాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులలో 48 మంది మరణించారు. వీరిలో 22 మంది పిల్లలు ఉన్నారని స్థానిక ఆసుపత్రులు తెలిపాయి.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఇటీవల ఈ దాడులను పూర్తి విజయం సాధించే వరకు కొనసాగిస్తామని, హమాస్‌ను నాశనం చేయడం, నిరాయుధీకరణ చేయడం, బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు మే 19, ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్ చేపడుతున్న అత్యంత దారుణమైన చర్యలను ఖండించారు. ఇజ్రాయెల్ తన సైనిక దాడులను ఆపకపోతే, సహాయ నిరోధకాలను ఎత్తివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ మూడు దేశాలు గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్‌లు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికాయి. కాగా ఇజ్రాయెల్ గత మార్చి నుండి గాజాకు ఆహారం, వైద్య సామగ్రి, ఇంధన సహాయాన్ని నిరోధించింది. దీని వల్ల గాజాలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. కాగా ఉత్తర గాజాలో పౌరులు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలావుండగా మే 19న ఇజ్రాయెల్ ఒక ప్రాథమిక పరిమాణంలో ఆహార సహాయాన్ని గాజాకు అనుమతిస్తామని ప్రకటించింది. ఫలితంగా అక్కడ ఆహారం సంక్షోభం నివారణ జరుగుతుందని తెలిపింది. అయితే, ఐక్యరాష్ట్ర సమితి (యూఎన్ఓ) ఈ సహాయాన్ని సముద్రంలో ఒక చుక్కగా అభివర్ణించింది.ఖతార్‌లోని దోహాలో.. గాజాలో కాల్పుల విరమణ, బందీల మార్పిడికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. హమాస్.. 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 సహాయ ట్రక్కుల అనుమతి తదితర ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఇజ్రాయెల్ ఈ దీనిపై ఇంకా బహిరంగంగా స్పందించలేదు. గతంలో గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించడానికి, యుద్ధాన్ని ముగించడానికి నిరాకరించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. హమాస్ నిరాయుధీకరణ దిశగా ముందడుగు వేస్తేనే గాజా యుద్ధం ముగుస్తుందని ఖతార్ చర్చలలో స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. హార్డ్ డిస్క్‌లు మాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్ భవన్లో చోరీ కలకలం రేపింది. చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుధర్మ భవన్లో నాలుగు హార్డ్ డిస్క్‌లు చోరీ అయినట్లు అధికారులు నిర్థారించారు. మొదటి అంతస్తులోని రూమ్ నుంచి హార్డ్ డిస్క్‌లను అపహరించారు.14వ తేదీన హెల్మెట్ ధరించిన వ్యక్తి.. నాలుగు హార్డ్ డిస్క్‌లను చోరీ చేశాడు. హార్డ్ డిస్క్‌లో కీలకమైన సమాచారం, ఫైల్స్ ఉన్నట్లుగా రాజ్ భవన్ అధికారులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చోరీ ఘటన బయటపడింది. పంజాగుట్ట పోలీసులకు రాజ్‌భవన్ అధికారలు ఫిర్యాదు చేశారు.

విజయనగరం ఉగ్రమూలాల కేసు.. వెలుగులోకి కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్: విజయనగరం ఉగ్రకుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహా్మన్, హైదరాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక, మహా రాష్ట్ర యువకులు సైతం వీరి గ్యాంగ్‌లో ఉన్నట్టు తెలిసింది. వీరంతా ఇటీవలే హైదరాబాద్‌లో సమావేశమై బాంబుపేలుళ్ల కుట్రలకు సంబంధించి పలు అంశాలు పంచుకున్న ట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా సిరాజ్, సమీర్‌లను ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విజయనగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రలింకుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సైతం రంగంలోకి దిగారు. సోమవారం విజయనగరం వెళ్లి స్థానిక పోలీసులు, ఇరు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి కీలక సమాచారం సేకరించారు. సౌదీ హ్యాండ్లర్ నుంచి వచి్చన ఆదేశాల మేరకు భారీ పేలుళ్ల కుట్రకు తెరతీసినట్టు కీలక ఆధారాలు ఉండటంతో ఎన్ఐఏ ప్రత్యేకంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిసింది. ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్ గ్రూపు ఈ కుట్రలో సిరాజ్, సమీర్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారు కలిపి మొత్తం ఆరుగురు ఉన్నట్టు గుర్తించారు. వీరంతా ఇన్‌స్టా్రగామ్‌లో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకోగా.. సౌదీ హ్యాండ్లర్ అన్ని కీలక విషయాలను వీరి గ్రూప్ కు పంపుతున్నాడు. ఇప్పటికే వీరంతా హైదరాబాద్‌లో సమీర్ సహాయంతో ఒక రహస్య ప్రాంతంలో 3 రోజులపాటు గడిపినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందు లో ప్రధానంగా బాంబుల తయారీ, అందుకు అవసరమైన వస్తువుల కొనుగోలు, డమ్మీ బ్లాస్టులు చేయడం, ఆ తర్వాత ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిని కలవాలి, తదుపరి కార్యాచరణ వంటి అనేక విషయాలు చర్చించుకున్నారు. సమీర్, సిరాజ్‌కు బాంబుల తయారీ పదార్థాల కొనుగోలు, తయారీ బాధ్యతను హ్యాండ్లర్ అప్పగించాడు. యూట్యూబ్‌లో వీరిద్దరూ బాంబుల తయారీ విధానం చూసినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని, విజయనగరానికి చెందిన సిరాజ్‌కు ఆ బాధ్యత అప్పగించారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు అవసరమైన టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ అమెజాన్‌లో ఆర్డర్ చేసినట్లు తేలింది. ఏపీ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు రిహార్సల్స్ నిర్వహించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్టింగ్స్, ఆ తరువాత వరుస పేలుళ్లకు కుట్ర చేసినట్టు గుర్తించారు. సమీర్ గురించి ఆరా.. సికింద్రాబాద్‌లో లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తున్న సమీ ర్.. బోయిగూడ రైల్ కళారంగ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇక్కడే ఉంటూ ఇన్‌స్టా్రగామ్ గ్రూప్ ద్వారా ఇతర నిందితులకు, సౌదీలోని హ్యాండ్లర్కు టచ్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్ కేంద్రంగా మిగిలిన ఆరుగురు సభ్యులకు షెల్టర్ ఇవ్వడం.. బాంబుల తయారీలో సిరాజ్‌కు సహకారం అందించడంలో కీలకంగా ఉంటున్నాడు. సమీర్ ఇంకా ఎవరెవరితో సన్నిహితంగా ఉండేవాడు.. సమీర్‌తో కాంటాక్ట్‌లో ఉన్న వారు ఎవరు అన్న విషయాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది.

IPL 2025: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిన్న (మే 19) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊరట పొందే విజయం సాధించింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్‌కు ఒరిగిందేమీ లేనప్పటికీ.. లక్నో ప్లే ఆఫ్స్ ఆశలను మాత్రం ఆవిరి చేసింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సన్‌రైజర్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఈ స్టేడియంలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లక్నో నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ స్టేడియంలో 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొదటిసారి (నాలుగు ప్రయత్నాల్లో).మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఎయిడెన్ మార్క్రమ్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో పూరన్ (26 బంతుల్లో 45) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. రిషబ్ పంత్ (7) తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మిగతా బ్యాటర్లలో ఆయుశ్ బదోని 3, అబ్దుల్ సమద్ 3, శార్దూల్ ఠాకూర్ 4, ఆకాశ్‌దీప్ (6 నాటౌట్) పరుగులు చేశారు.ఓపెనర్లు అందించిన శుభారంభానికి ఈ మ్యాచ్‌లో లక్నో ఇంకాస్త భారీ స్కోర్ సాధించి ఉండాల్సింది. అయితే చివరి ఓవర్లలో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు కోల్పోయారు. నితీశ్ రెడ్డి వేసిన చివరి ఓవర్లో లక్నో మూడు వికెట్లు (2 రనౌట్లు) కోల్పోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఎషాన్ మలింగ 2, నితీశ్ రెడ్డి, హర్షల్ పటేల్, హర్ష్ దూబే తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అభిషేక్ శర్మ తన సహజ శైలిలో ఊచకోత (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కోసి సన్‌రైజర్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో ఇషాన్ కిషన్ (35), క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32 రిటైర్డ్ హర్ట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగా.. అనికేత్ వర్మ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) మ్యాచ్‌లను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ 2, విలియమ్ ఓరూర్కీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా గొడవ పడిన అభిషేక్, దిగ్వేశ్ మ్యాచ్ పూర్తయ్యాక ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. రాజీవ్ శుక్లా ఈ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చాడు.

ఎన్టీఆర్ పుట్టినరోజు ప్రత్యేకం.. అందుకే ఆల్‌రౌండర్ అయ్యాడు
జూనియర్ ఎన్టీఆర్‌కు ఒక చరిత్ర ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ అంశ ఈ తారకరాముడు. నందమూరి వంశంలో నేడు అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నటుడు.. ఒకరకంగా చెప్పాలంటే నందమూరి అనే బ్రాండ్‌కు తారక్ ఒక ఐకాన్ అని చెప్పవచ్చు. బాల నటుడిగా తెరంగేట్రం చేసి, నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డ్లను దాటుకుంటూ విరుచుకపడ్డాడు. ఇండస్ట్రీలో అందరూ తారక్‌ను ఆల్‌రౌండర్ అంటారు.. దానికి కారణం భారీ డైలాగ్స్, కళ్లు చెదిరే డ్యాన్స్, దుమ్మురేపే యాక్షన్ సీన్స్, కంటతడి పెట్టించే నటన ఇలా అన్నింటిలోనూ ఆయన అగ్రగామి. క్లాస్, మాస్ అంటూ తేడా ఉండదు. సినీ అభిమానులు అందరూ ఆయనకు ఫ్యాన్సే.. నటనలో తారక్ తర్వాతే ఎవరైనా.. అనేలా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చిత్రపరిశ్రమలో సెట్ చేశాడు. నేడు ఎన్టీఆర్ (NTR) పుట్టిన రోజు (1983 మే 20).. ఈ సందర్భంగా ఆయన గురించి పలు విషయాలపై ఓ లుక్కేద్దాం (Happy Birthday NTR)..తారక్ @ 'మ్యాన్ ఆఫ్ మాసెస్'ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్, పవర్ స్టార్స్ ఉన్నారు కానీ యంగ్ టైగర్‌కు మాత్రమే ఉన్న ఏకైక బిరుదు 'మ్యాన్ ఆఫ్ మాసెస్'. ఈ బిరుదుకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. ఇండియన్ మార్కెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరనీ ఆశ్చర్యపరుస్తుంది. కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్‌తో తిరిగొచ్చాడు.తారక్ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం🎥 తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.🎥 పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు.🎥ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.🎥 యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్ మెప్పించారు.🎥 జపాన్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.🎥 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్ వాటంన్నిటినీ సింగిల్ టేక్‌లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు.🎥 నంబర్ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు.🎥 మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం.🎥 'ఫోర్బ్స్ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు.🎥 పూరీ జగన్నాథ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.🎥సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు.🎥 2016లో వచ్చిన జనతా గ్యారేజ్‌తో కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అవార్డును IIFA నుంచి అందుకున్నాడు🎥కంత్రి, అదుర్స్,బృందావనం చిత్రాలకు గాను ఉత్తమ హీరోగా ఫిలింఫేర్ అవార్డులను అందకున్న తారక్🎥 బాల రామాయణము,ఆది నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందకున్నాడు 🎥తారక్‌కు ఫేవరెట్ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట🎥 తారక్- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు.🎥 జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, తారక్, దేవర అయనకున్న పేర్లు🎥అమ్మ (శాలనీ) చిరకాల కలను తీర్చిన తారక్.. ఆమె స్వగ్రామం కుందాపురంలో ఉన్న ఉడుపి శ్రీకృష్ణ ఆలయ దర్శనం చేసుకోవాలనే ఆమె కోరికను కొడుకుగా తీర్చాడు.

‘యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం.. కానీ’
కాల్పుల విరమణ దిశగా రష్యా, ఉక్రెయిన్ తక్షణం చర్చలు మొదలు పెడతాయని.. ఇరు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీ ఇందుకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.. పుతిన్‌తో ట్రంప్ సోమవారం రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా ఫోన్ చర్చలు జరిపారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ కూడా చర్చించారు.ఈ క్రమంలో యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదంటూ జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. రష్యా నియమాలు ఏంటో తనకు తెలియదన్న జెలెన్స్కీ.. ఈ యుద్ధంలో మేము చాలా కోల్పోయామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా పూర్తి కాల్పుల విరమణకు తాము సిద్ధం.. కానీ.. రష్యా అందుకు రెడీగా ఉన్నట్లు తనకు అనిపించడం లేదంటూ జెలెన్స్కీ చెప్పుకొచ్చారు.ముందుగా కాల్పుల విరమణను రష్యా అంగీకరించాలని.. ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలంటూ జెలెన్స్కీ కోరారు. మరో వైపు, ఈ కాల్పుల విరమణను ప్రతిపాదించినందుకు ట్రంప్‌నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

బాబు ప్రభుత్వ ‘చావు’ తెలివి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలకు మరింతగా బరితెగిస్తోంది. ఎంతగా అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సహజ మరణాలు, వృద్ధాప్య, అనారోగ్యసమస్యలతో మరణాలనూ వక్రీకరిస్తూ అక్రమ కేసుల నమోదుకు తెగబడుతోంది. 2022, మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 16 మంది మరణించారు. కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలతో వారు మరణించారు.వీటిపై అప్పట్లోనే ఎల్లో మీడియా సహకారంతో అప్పటి ప్రతిపక్ష టీడీపీ రాద్ధాంతం చేసింది. కల్తీసారా తాగి మరణించారని దుష్ప్రచారం చేసింది. అప్పట్లోనే విచారణ చేపట్టిన అధికారులు ఆ 16 మంది అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే మరణించారని నిర్ధారించారు. కాగా ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ మరణాలపై విచారణ పేరుతో కొత్త కుట్రకు తెరతీయడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ వత్తాసు⇒ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుమరో అక్రమ కేసుకు తెరతీయాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వత్తాసు పలికారు. మూడేళ్ల క్రితం నాటి సహజ మరణాలపై తాజాగా ఆయన సందేహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. ఆ మరణాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదిక పంపారు. కల్తీ సారా వల్లే ఆ మరణాలు సంభవించాయని ఎఫ్ఎస్ఎల్ వెల్లడించిందని కూడా ఆయన ఏకపక్షంగా ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. విచారణతో నిమిత్తం లేకుండా ఏకంగా డీజీపీనే ఏకపక్షంగా కల్తీ సారా అని చెప్పేయడం విడ్డూరంగా ఉంది.అంటే రాబోయే నివేదిక ఎలా రూపొందించాలన్నది కూడా ఆయన పోలీసు అధికారులకు పరోక్షంగా స్పష్టం చేశారు. ఇక తాము అనుకున్నట్టుగా డీజీపీ ద్వారా నివేదిక రాగానే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ మరణాలపై దర్యాప్తునకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిశోర్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగం అధిపతి కె.ఉమామహేశ్వరరావుతో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 2022లో జంగారెడ్డిగూడెంలో 16మంది మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, అప్పటి అధికారులు చేపట్టిన విచారణలో లోపాలు ఉంటే గుర్తించాలని, తదుపరి తీసుకోవాల్సిన న్యాయ, పరిపాలన, సాంకేతికపరమైన చర్యలను సూచించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే 16 మంది మృతి⇒ ఆనాడే అధికారుల దర్యాప్తులో వెల్లడిజంగారెడ్డిగూడెంలో 2022 మార్చిలో 16మంది మృతిపై అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే దర్యాప్తునకు ఆదేశించింది. అప్పటి పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేశారు. ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, డీఎంహెచ్‌వో బి. రవి నేతృత్వంలో రెవెన్యూ, వైద్య అధికారులు మరణించిన 16 మంది నివాసాలకు వెళ్లి విచారణ చేశారు. మృతుల బంధువుల వాంగ్మూలాలను నమోదు చేశారు.వారి కుటుంబ పరిస్థితులను అధ్యయనం చేశారు. వైద్య నివేదికలు పరిశీలించారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నిర్ధారించారు. వారిలో ముగ్గురికి మాత్రమే మద్యం వ్యసనం ఉందని కూడా తేల్చారు. వారు కూడా జంగారెడ్డిగూడెంలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. వారి మరణానికీ కేవలం మద్యంపానం ఒక్కటే కారణం కాదు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం ఆ 16 మంది మృతికి కారణాలు ఇవీ...నాటి ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ విచారణలోనూ అదే వెల్లడిఆయనే ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ మరణాలపై పోలీసు విచారణ కూడా నిర్వహించింది. అప్పటి ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఆ విచారణ నిర్వహించారు. ఆయన జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. అప్పటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హైమావతి, ఆర్డీవో ప్రసన్న లక్ష్మి, డీఎంహెచ్‌వో బి.రవి, డిప్యూటీ డీఎంహెచ్‌వో మురళీకృష్ణ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి, సూపరింటెండెంట్ బి.అరుణ కుమారి, డీఎస్పీ కేవీ సత్యనారాయణ తదితరులతో సమీక్షించారు.వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నివేదించారు. అప్పుడు దర్యాప్తు నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు కూడా. కానీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి అక్రమ కేసు నమోదుకు సిద్ధపడుతుండటం కేవలం రాజకీయ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది.

వికారాబాద్: లారీని ఢీకొన్న పెళ్లి బస్సు.. నలుగురి మృతి
సాక్షి, వికారాబాద్ జిల్లా: పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టూరిస్టు బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చందనవెళ్లి గ్రామానికి చెందిన పలువురు టూరిస్టు బస్సులో పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

పాక్ చెప్పిందంతా అబద్ధం
ఇస్లామాబాద్: రెండు నెలల క్రితం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఉదంతంలో ఆ దేశ ప్రభుత్వం, సైన్యం చెప్పినదంతా అబద్ధమని బలూచిస్తాన్ వేర్పాటువాదుల గ్రూప్ అయిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) సోమవారం ప్రకటించింది. రైలు హైజాక్ ఘటనలో తమదే పైచేయి అని పేర్కొంటూ సాక్ష్యాధారాలతో సవివరంగా ఒక వీడియోను రూపొందించి తాజాగా విడుదలచేసింది. పాకిస్తాన్లో విస్తీర్ణంపరంగా అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధిలో ఆమడదూరంలో నిలిచిపోయిన బలూచిస్తాన్ ప్రజలు ఏకమై తమ ప్రాంత స్వయంప్రతిపత్తే లక్ష్యంగా ఉద్యమిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఉద్యమంలో భాగంగా మార్చి 11వ తేదీన పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును వందలాది మంది బలూచ్ సాయుధులు రైలు పట్టాలను పేల్చేశాక హైజాక్ చేయడం తెల్సిందే. అయితే ఈ ఘటనలో బలూచ్ మిలిటెంట్లను హతమార్చి వందల మంది ప్రయాణికులను కాపాడామని పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ప్రకటించాయి. అయితే అదంతా అబద్ధమంటూ 36 నిమిషాల వీడియోను బలూచ్ ఆర్మీ మీడియా విభాగం హక్కాల్ ఒక వీడియోను బయటపెట్టింది. అందులో దాడికి ముందే సుశిక్షితులైన వందలాది మంది బీఎల్ఏ ఫైటర్లు షూటింగ్ ప్రాక్టీస్ చేయడం, రైలును హైజాక్ చేశాక ఏ బోగీ జనాలను ఎటువైపు తీసుకెళ్లాలి? ఎవరి బాధ్యతలు ఏమిటి? వంటి వాటితోపాటు బందీలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా జాగ్రత్తగా రైలు నుంచి దూరంగా తీసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. బందీలను చిత్రహింసలకు గురిచేసి కొందరిని చంపేశామన్న పాక్ సైన్యం వాదనల్లో నిజంలేదని బీఎల్ఏ ఈ వీడియోతో నిరూపించింది. బందీల్లో 200 మంది పాక్ పోలీసులు, అధికారులు ఉన్నారు. వాళ్లను రెండు రోజులపాటు బంధించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులను హింసించారన్న వాదనలో వాస్తవం లేదని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. అసలు దాడి చేయడానికి గల కారణాలు, ఆవశ్యకతను బీఎల్ఏ సీనియర్ నేత ఒకరు ఈ వీడియో మొదట్లోనే స్పష్టంచేశారు. ‘‘మా పోరాటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఉద్యమం కీలకదశకు చేరుకుంటోంది. ఈ దశలో సంక్షిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చంది. మా యువ ఫైటర్లు ఇలాంటి కఠిన నిర్ణయాలను అమలుచేయాల్సి వచి్చంది. ఇలాంటి నిర్ణయాలుకాకుండా మరే ప్రత్యామ్నాయాలు లేవని మా వాళ్లకూ అర్థమైంది. తుపాకీని నిలువరించాలంటే తుపాకీని పట్టుకోవాల్సిందే. తుపాకీ పేలుడు శబ్దం కూడా కొంత దూరం వరకే వినిపిస్తుంది. తన తండ్రి కోసం తనయుడు ప్రాణత్యానికైనా సిద్ధమయితే అదే కొడుకు కోసం తండ్రి కూడా ఎంతకైనా తెగిస్తాడు’’అని ఆయన చెప్పాడు. హైజాక్ ప్రణాళిక రచన, అమలు, ముందుండి నడిపించి ఫిదాయీ ఫైటర్ యూనిట్ మజీద్ బ్రిగేడ్ వివరాలు, ఫొటోలు, సభ్యుల స్పందనలను వీడియోకు జతచేశారు. పాక్ సైన్యం ప్రతిదాడిచేసినా అత్యల్ప స్థాయిలో తమ వైపు ప్రాణనష్టం జరిగిందంటూ వీరమరణం పొందిన వాళ్లకు నివాళులు అరి్పంచిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 30 గంటలపాటు సైనిక ఆపరేషన్ తర్వాత 33 మంది రెబల్స్‌ను మట్టుబెట్టామని పాక్ సైన్యం ఆనాడు ప్రకటించింది. బందీలను విడిపించే క్రమంలో 23 మంది జవాన్లు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు చనిపోయారని తెలిపింది. అయితే తాము మాత్రం బందీలుగా ఉన్న 214 మంది పాకిస్తాన్ పోలీసులందరినీ చంపేశామని రెబల్స్ ప్రకటించారు.
యాపిల్ ఎయిర్‌పాడ్స్ కొత్త వర్షన్ రిలీజ్ ఎప్పుడంటే..
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన నేపాల్, థాయ్‌లాండ్
‘యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం.. కానీ’
ఎన్టీఆర్ పుట్టినరోజు ప్రత్యేకం.. అందుకే ఆల్‌రౌండర్ అయ్యాడు
మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసు
గాజాపై దాడులు ఆపకుంటే.. ఇజ్రాయెల్‌కు యూకే, ఫ్రాన్స్, కెనడా హెచ్చరిక
ఎస్బీఐ ఎఫ్డీ రేట్లలో కోత
IPL 2025: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ఆత్మహత్య వెనుక.. ప్రొఫెసర్‌తో ప్రేమ
తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. హార్డ్ డిస్క్‌లు మాయం
అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఇండియా ఇంత బలహీనమైనదా?
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
కోట్ల విలువైన విల్లా కొనుగోలు చేసిన బిగ్‌బాస్ రోహిణి.. ధర ఎంతంటే?
నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే..
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
బంగ్లా ప్లేయర్ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
వారికి నా కంటే అందగాడు కనిపించలేదేమో!
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
యాపిల్ ఎయిర్‌పాడ్స్ కొత్త వర్షన్ రిలీజ్ ఎప్పుడంటే..
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన నేపాల్, థాయ్‌లాండ్
‘యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం.. కానీ’
ఎన్టీఆర్ పుట్టినరోజు ప్రత్యేకం.. అందుకే ఆల్‌రౌండర్ అయ్యాడు
మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసు
గాజాపై దాడులు ఆపకుంటే.. ఇజ్రాయెల్‌కు యూకే, ఫ్రాన్స్, కెనడా హెచ్చరిక
ఎస్బీఐ ఎఫ్డీ రేట్లలో కోత
IPL 2025: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ఆత్మహత్య వెనుక.. ప్రొఫెసర్‌తో ప్రేమ
తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. హార్డ్ డిస్క్‌లు మాయం
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఇండియా ఇంత బలహీనమైనదా?
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
కోట్ల విలువైన విల్లా కొనుగోలు చేసిన బిగ్‌బాస్ రోహిణి.. ధర ఎంతంటే?
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే..
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
బంగ్లా ప్లేయర్ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
వారికి నా కంటే అందగాడు కనిపించలేదేమో!
ఇది పనికిమాలిన చర్య.. మరోసారి చేయకండి: సూరి
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
సినిమా

యంగ్ టైగర్ బర్త్ డే.. వార్-2 అప్డేట్ వచ్చేసింది!
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో వార్ -2 మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వార్-2 గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. జూనియర్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ పోస్టర్ షేర్ చేశారు. ఈ తాజా ప్రకటనతో వార్-2 అప్డేట్స్ కోసం ఎదురు చూస్తోన్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.అత్యధిక ధరకు తెలుగు రైట్స్..తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వార్ 2 పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్, దేవర... ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగ వంశీ, సునీల్ నారంగ్ ఈ డీల్‌ను చేజిక్కించుకున్నారు. విడుదలకి ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలొస్తున్నాయి. #HappyBirthdayNTR Can’t wait for this BANGER 💥💥💥💥💥💥 pic.twitter.com/2hg9aAZgNJ— thaman S (@MusicThaman) May 19, 2025

ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. స్టేజీపై డ్యాన్స్‌తో అదరగొట్టిన హీరోయిన్!
హీరోయిన్ ఆదితి శంకర్ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ.. వేదికపై స్టెప్పులతో అభిమానులను అలరించింది. ఓ వెన్నెల అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అక్కడున్న వారిని మెప్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. కోలీవుడ్ హీరోయిన్ ఆదితి శంకర్ భైరవం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందు వస్తోంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా నటించారు. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంది, దివ్య పిళ్లై కూడా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న భైరవం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. #AditiShankar Live Dance Performance for #OVennela Song at #Bhairavam Event#BellamkondaSaiSreenivas #ManchuManoj #NaraRohith pic.twitter.com/ehgv08ARi5— The Cult Cinema (@cultcinemafeed) May 18, 2025 View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial)

భారత్- పాక్ వార్.. రూ.50 లక్షల ఆఫర్ వదులుకున్న సింగర్!
విరాట్ కోహ్లీతో వివాదంతో వార్తల్లో నిలిచిన సింగర్ రాహుల్ వైద్య మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల కోహ్లీపై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఇండియా- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశభక్తిని చాటుకున్నారు. టర్కీలో తాను ప్రదర్శన ఇవ్వడానికి నిరాకరించాడు. ఓ పెళ్లిలో ప్రదర్శన ఇచ్చేందుకు దాదాపు రూ.50 లక్షలు ఆఫర్ చేశారని వెల్లడించాడు. పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీ వ్యవహరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగర్ రాహుల్ తెలిపారు.రాహుల్ వైద్య మాట్లాడుతూ.."టర్కీలో నాకు వచ్చిన ఆఫర్‌కు రూ. 50 లక్షలు ఇస్తామన్నారు. కానీ డబ్బు కంటే.. నా దేశ ప్రయోజనాలను ముఖ్యమని వారికి చెప్పా. వారు నాకు ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. కానీ నేను వద్దన్నది డబ్బు గురించి కాదని మరోసారి స్పష్టం చేశా. ఎందుకంటే డబ్బు కంటే చాలా ముఖ్యమైన అంశం. ఇది ఒక వ్యక్తిగా కాదు.. నా దేశం గురించే ఈ నిర్ణయం. మన దేశానికి అండగా నిలబడాలన్నదే నా ఆశయం." అని పంచుకున్నారు. మన దేశానికి శత్రువుగా అంటూ మనల్ని అగౌరవపరిచే దేశాన్ని సందర్శించడంలో తనకు ఆసక్తి లేదని రాహుల్ పేర్కొన్నారు.ఇటీవల బాలీవుడ్ నటి రూపాలి గంగూలీ సైతం టర్కీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సినీ ప్రముఖులు, మనదేశ ప్రయాణికులు టర్కీ బుకింగ్‌లను రద్దు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా.. ఇప్పటికే టర్కీ విషయంలో భారత్ పలు ఆంక్షలు విధించింది. ఇకపై టర్కీలో భారతీయ సినిమాలు షూటింగ్‌లు ఉండవని స్పష్టం చేసింది. టర్కిష్ సంస్థలతో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆదేశించింది.

'ఛత్రపతి' రీమేక్ అందుకే ఫెయిలైంది: బెల్లంకొండ శ్రీనివాస్
తెలుగులో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. మధ్యలో హిందీలో సినిమా చేశాడు. చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ ఇక్కడ 'భైరవం' చిత్రం చేశాడు. మే 30న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో పాల్గొన్న ఇతడు.. ఛత్రపతి హిందీ రీమేక్ ఫ్లాప్ కావడం గురించి మాట్లాడాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)'హిందీలో సినిమాలు చేసిన తెలుగు హీరోలు పెద్దగా లేరు. ప్రస్తుతం రానా, రామ్ చరణ్ మాత్రమే చేశారు. చరణ్ చేసింది 'జంజీర్' రీమేక్. హిందీ మూవీని మళ్లీ హిందీలో చేయడం వల్ల ప్రేక్షకులు అలా తీసుకున్నారేమో తెలియదు. నేను చేస్తున్నది సౌత్ మూవీ కదా అనుకున్నాను. రాజమౌళి హిట్ సినిమా, ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అవుతారని అనుకున్నాం''పైగా సవతి తల్లి, బిడ్డల సెంటిమెంట్ లాంటివి హిందీలో పెద్దగా ఉండవని నిర్మాత భరోసా ఇచ్చారు. దీంతో వర్కౌట్ అవుతుందేమోనని అనుకున్నాం. కానీ ఛత్రపతి మూవీని రీమేక్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే అప్పటికే సౌత్ సినిమాల్ని హిందీ ప్రేక్షకులు బాగా చూసేశారు. ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఇది వర్కౌట్ అవుతుందా? అనే టెన్షన్ వల్ల పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాను' అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'డ్రాగన్' షూటింగ్ లో ప్రేమ.. ఇప్పుడు ఏకంగా పెళ్లి)
న్యూస్ పాడ్‌కాస్ట్

సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?. బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడమా?

హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం... 17 మంది మృత్యువాత... మృతుల్లో 8 మంది చిన్నారులు

మద్యం కుంభకోణం పూర్తిగా కట్టుకథే... ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కేసే... ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్.. దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసిన సిట్

రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు.. ఏపీలో మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం... కూటమి ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

విచారణ పేరుతో వేధింపులు... న్యాయస్థానం తీర్పు బేఖాతరు... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి పట్ల అభ్యంతకరంగా ఏపీ సిట్ తీరు

లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే.. ఆధారాలతో సహా గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ... ఆ కేసులో ముందస్తు బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు

భారత వాయుసేనకు వందనం, పాకిస్తాన్‌కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు... ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, జవాన్లను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ

‘అణు’మాత్రం బెదరం. దాయాదికి మోదీ హెచ్చరికలు. ఉగ్ర భూతంపై ఆపరేషన్ సిందూర్

పాకిస్తాన్ తూటాలకు క్షిపణులతో బదులివ్వండి... ప్రతి దుశ్చర్యకూ మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పాల్సిందే...

కాల్పుల విరమణకు అంగీకారం.. కొద్దిసేపట్లోనే మళ్లీ కాల్పులు... పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం
క్రీడలు

లక్నోను ముంచిన సన్‌రైజర్స్
లక్నో: ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట ఇదివరకే ముగిసింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి వారి ‘ప్లే ఆఫ్స్’ ఆశల్ని కూడా ముంచింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో లక్నోపై జయభేరి మోగించింది. ముందుగా లక్నో నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (39 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్రమ్ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), పూరన్ (26 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. ఇషాన్ మలింగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), క్లాసెన్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. దిగ్వేశ్ రాఠి 2 వికెట్లు తీశాడు. సెంచరీ భాగస్వామ్యం మిచెల్ మార్ష్ దూకుడుతో లక్నో ఆట మొదలైంది. కమిన్స్ తొలి బంతికి 4, నాలుగో బంతికి 6 కొట్టాడు. ఇదే జోరుతో హర్ష్ దూబే రెండో ఓవర్లో మార్ష్ మరో సిక్స్ బాదాడు. మూడో ఓవర్లో బౌండరీతో మార్క్రమ్ టచ్‌లోకి వచ్చాడు. నాలుగో ఓవర్ తొలి బంతికే మార్క్రమ్ అవుటవ్వాల్సింది. క్రీజు వదిలి ఆడిన అతన్ని ఇషాన్ కిషన్ స్టంపౌట్ చేయలేకపోయాడు. ఇలా బతికిపోయిన మార్క్రమ్ 6, 4లతో రెచి్చపోయాడు. దీంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. మార్ష్ దంచే పనిలో ముందున్నాడు. హర్షల్, ఇషాన్ మలింగ ఓవర్లలో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఓపెనింగ్ జోడీ పవర్‌ప్లేలో 69 పరుగులు చేసింది. కాసేపటికే మార్ష్ 28 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. 9వ ఓవర్లో మార్క్రమ్కు మరోమారు లైఫ్ వచి్చంది. జీషాన్ బౌలింగ్‌లో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను డీప్ ఎక్స్ట్రా కవర్లో అనికేత్ వదిలేశాడు. దీంతో అదే ఓవర్లో లక్నో 100 పరుగులు దాటింది. తర్వాత ఎట్టకేలకు మార్ష్ వికెట్ తీసిన హర్ష్ దూబే 115 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. లక్నో కెపె్టన్ రిషభ్ పంత్ (7) ఎక్కువసేపు నిలువలేదు. ఇషాన్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. రెండు లైఫ్‌లను సది్వనియోగం చేసుకున్న మార్క్రమ్ 28 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. పూరన్ మధ్యలో పడిపోయిన రన్‌రేట్ పెంచేందుకు బ్యాట్ ఝుళిపించాడు. హర్షల్ 16వ ఓవర్లో సిక్స్ బాదిన మార్క్రమ్ అదే ఓవర్లో బౌల్డయ్యాడు. నితీశ్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో భారీ సిక్సర్ బాదిన పూరన్‌తో పాటు శార్దుల్ (4)కూడా రనౌటయ్యారు. సమద్ (3)ను బౌల్డ్ చేయగా... ఆకాశ్ దీప్ (6) సిక్స్‌తో జట్టు స్కోరు 200 దాటింది. 20వ ఓవర్లో నితీశ్ 20 పరుగులిచ్చాడు. అభిషేక్ అదరహో రెండు ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు 23/1. అప్పటికి అభిషేక్ ఒక పరుగే చేశాడు. ఆకాశ్‌దీప్ మూడో ఓవర్ నుంచి అతని విధ్వంసం మొదలైంది. 4, 6 బాదిన అభిషేక్ తర్వాతి రూర్కే ఓవర్లోనూ దీన్ని రిపీట్ చేశాడు. దీంతో 3.3 ఓవర్లోనే జట్టు స్కోరు 50కి చేరింది. అవేశ్ ఖాన్ బౌలింగ్‌కు దిగితే వరుస బౌండరీలతో జోరు కనబరచడంతో పవర్‌ప్లేలో హైదరాబాద్ 72/1 స్కోరు చేసింది. ఆ తర్వాత ఓవర్ వేసిన రవి బిష్ణోయ్‌కి అభిషేక్ చుక్కలు చూపించాడు. 6, 6, 6, 6లతో 26 పరుగులు రాబట్టాడు. మూడో సిక్స్ బాదేసరికే 18 బంతుల్లో అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. మరుసటి ఓవర్లో అభిషేక్ జోరుకు దిగ్వేశ్ రాఠి బ్రేక్ వేశాడు. ఈ సందర్భంగా రాఠి, అభిషేక్ మాటామాట పెంచుకున్నారు. అంపైర్లు సముదాయించి పంపారు. 35 బంతుల్లోనే 82 పరుగుల ధనాధన్ రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత ఇషాన్ కిషన్ (28 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), క్లాసెన్‌లు ధాటిని కొనసాగించడంతో సన్‌రైజర్స్ లక్ష్యంవైపు దూసుకెళ్లింది. కిషన్ అవుటయ్యాక ‘దంచే’పనిని క్లాసెన్, కమిందు మెండిస్ (21 బంతుల్లో 32 రిటైర్డ్‌హర్ట్; 3 ఫోర్లు) చక్కబెట్టారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు పెవిలియన్‌కు చేరినా... మిగతా లాంఛనాన్ని అనికేత్ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) పూర్తి చేశారు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) మలింగ (బి) హర్ష్ 65; మార్క్రమ్ (బి) హర్షల్ 61; పంత్ (సి అండ్ బి) మలింగ 7; పూరన్ (రనౌట్) 45; బదోని (సి) నితీశ్ (బి) మలింగ 3; సమద్ (బి) నితీశ్ 3; శార్దుల్ (రనౌట్) 4; బిష్ణోయ్ (నాటౌట్) 0; ఆకాశ్‌దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–115, 2–124, 3–159, 4–169, 5–194, 6–199, 7–199. బౌలింగ్: కమిన్స్ 4–0–34–0, హర్ష్ దూబే 4–0–44–1, హర్షల్ పటేల్ 4–0–49–1, ఇషాన్ మలింగ 4–0–28–2, జీషాన్ అన్సారి 2–0–22–0, నితీశ్ 2–0–28–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అథర్వ తైడే (సి) దిగ్వేశ్ (బి) రూర్కే 13; అభిషేక్ (సి) శార్దుల్ (బి) దిగ్వేశ్ 59; కిషన్ (బి) దిగ్వేశ్ 35; క్లాసెన్ (సి) పంత్ (బి) శార్దుల్ 47; కమిందు (రిటైర్డ్‌హర్ట్) 32; అనికేత్ (నాటౌట్) 5; నితీశ్ రెడ్డి (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.2 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–17, 2–99, 3–140, 4–195. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 3–0–33–0, రూర్కే 2.2–0–31–1, దిగ్వేశ్ రాఠి 4–0–37–2, అవేశ్ ఖాన్ 3–0–25–0, రవి బిష్ణోయ్ 1–0–26–0, మార్క్రమ్ 1–0–14–0, శార్దుల్ 4–0–39–1.

ఎస్ఆర్హెచ్ చేతిలో చిత్తు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో ఔట్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంత్ టీమ్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు.అభిషేక్ శర్మ విధ్వంసం.. అనంతరం 206 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్లాసెన్(47), ఇషాన్ కిషన్(35), మెండిస్(32) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ సింగ్ రెండు, విలియం ఓ రూర్క్ వికెట్ సాధించారు.

దిగ్వేష్ సింగ్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రథీ మరోసారి తన సెలబ్రేషన్స్‌లో అతి చేశాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. 206 పరుగుల లక్ష్య చేధనలో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ దూకుడుగా ఆడాడు.ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అభిషేక్ ఏకంగా నాలుగు సిక్స్‌లతో 26 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అతడి దూకుడుకు కళ్లెం వేసేందుకు దిగ్వేష్ సింగ్‌ను లక్నో కెప్టెన్ ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు. అయితే పంత్ నమ్మకాన్ని దిగ్వేష్ వమ్ము చేయలేదు. ఆ ఓవర్లో మూడో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ ఔటయ్యాడు. ఈ క్రమంలో దిగ్వేష్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. అభిషేక్ వైపు చూస్తూ కోపంగా ఇక ఆడింది చాలు తన నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో డగౌట్‌కు వెళ్లేందుకు సిద్దమైన అభిషేక్ మళ్లీ వెనక్కి వచ్చి దిగ్వేష్‌పై ఫైరయ్యాడు. అతడు కూడా అభిషేక్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి వాగ్వాదానికి దిగాడు. వెంటనే అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటికే దిగ్వేష్ సింగ్‌పై బీసీసీఐ రెండు సార్లు కొరడా ఝళిపించింది. ఓసారి అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం, మరోసారి 50 శాతం కోత బీసీసీఐ విధించింది.Fight between Digvesh Rathi and Abhishek Sharma 😳 pic.twitter.com/8ngcvpnIVK— 𝑺𝒉𝒆𝒓𝒂 (@SheraVK18) May 19, 2025

చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో హిస్టరీలోనే
టీమిండియా వెటరన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా ( బంతులు పరంగా) 150 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్‌గా హర్షల్ నిలిచాడు. 2381 బంతుల్లో ఈ ఫీట్‌ను పటేల్ అందుకున్నాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను పటేల్ నమోదు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేస్ బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ(2444 బంతులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మలింగ రికార్డును హర్షల్ పటేల్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో హర్షల్ పటేల్(117) రెండో స్దానంలో నిలిచాడు. తొలి స్ధానంలో మలింగ(105) కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో బంతులు పరంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..2381- హర్షల్ పటేల్2444- లసిత్ మలింగ2543- చాహల్2656- డ్వైన్ బ్రావో2832- జస్ప్రీత్ బుమ్రామ్యాచ్ల పరంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..లసిత్ మలింగ- 105హర్షల్ పటేల్- 117యుజ్వేంద్ర చాహల్-118రషీద్ ఖాన్- 122జస్ప్రీత్ బుమ్రా- 124
బిజినెస్

బిట్‌కాయిన్‌పై స్పష్టమైన విధానం ఎందుకు లేదు?
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల నియంత్రణ విషయంలో స్పష్టమైన విధానాన్ని కేంద్రం ఎందుకు తీసుకురాలేకపోతోంది? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బిట్‌కాయిన్ ట్రేడింగ్‌ను చట్టవిరుద్ధమైనదిగా, హవాలా వ్యాపారంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాంతర మార్కెట్ కలిగి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొంది. నియంత్రణల ద్వారా క్రిప్టోకరెన్సీ ట్రేడ్లపై దృష్టి సారించొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. గుజరాత్లో బిట్‌కాయిన్ ట్రేడ్ వ్యాపారానికి సంబంధించిన కేసులో నిందితుడు శైలేష్ బాబూలాల్ భట్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసింది. 2020లో ఆర్బీఐ సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో దేశంలో బిట్‌కాయిన్ ట్రేడింగ్ చట్టవిరుద్ధం కాదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

సుప్రీం కోర్టులో వొడాఫోన్ పిటిషన్ డిస్మిస్
న్యూఢిల్లీ: ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) బాకీల నుంచి మినహాయింపు కోరుతూ వొడాఫోన్, ఎయిర్టెల్, టాటా టెలీసరీ్వసెస్ దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చుంది. ఒక బహుళ జాతి కంపెనీ ఇలాంటి పిటీషన్ వేయడం తమను షాక్‌కి గురి చేసిందని వ్యాఖ్యానించింది. ఒకవేళ ప్రభుత్వం తనంతట తాను ఏదైనా సహాయం చేయదల్చుకుంటే న్యాయస్థానం జోక్యం చేసుకోబోదని తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. టెలికం సంస్థలు లైసెన్సింగ్, స్పెక్ట్రం వినియోగ ఫీజుల కింద నిర్దిష్ట మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం టెలికం సేవలతో పాటు టెల్కోలకు వచ్చే ఇతరత్రా వనరుల నుంచి కూడా వచ్చే ఆదాయాన్ని వాటి మొత్తం ఆదాయంగా (ఏజీఆర్) నిర్వచిస్తూ, దాని ప్రాతిపదికగా చెల్లింపులు జరపాలంటూ ప్రభుత్వం, న్యాయస్థానం గతంలో సూచించడం వివాదానికి దారి తీసింది. ఏజీఆర్‌పరమైన బకాయిలను తప్పుగా లెక్కించడం వల్ల తమపై ఆర్థిక భారం గణనీయంగా పెరిగిపోతుందని, దీన్ని మినహాయించాలని లేదా పునఃసమీక్షించాలని న్యాయస్థానాన్ని టెల్కోలు ఆశ్రయించాయి. రూ. 30,000 కోట్ల బాకీల నుంచి మినహాయింపునివ్వాలంటూ వొడాఫోన్ కోరింది. గత ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వం సహాయం చేయలేకపోతోందన్న పిటీషనర్ వాదనలను సుప్రీం కోర్టు తోసిపుచి్చంది. జూలై వరకు వాయిదా వేయాలని లేదా ఉపసంహరించుకునేందుకు అనుమతించాలన్న అభ్యర్ధనలను పక్కన పెట్టింది. ప్రభుత్వమే స్వయంగా సహాయం చేయదలిస్తే న్యాయస్థానం అడ్డుకోబోదని స్పష్టం చేసింది.

ఎస్బీఐ లాభాలకు యోనో దన్ను
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ లాభాలకు డిజిటల్ విభాగం గణనీయంగా తోడ్పాటు అందిస్తోంది. ఈ విభాగం చిన్నదే అయినప్పటికీ భారీగా ప్రయోజనాలను చేకూర్చుతోందని మార్కెటింగ్ గురు, దేశీ ఫిలిప్ కోట్లర్గా పేరొందిన రాజేంద్ర శ్రీవాస్తవ విశ్లేషించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ రూ. 70,901 కోట్ల లాభం ప్రకటించింది. నికరలాభంపరంగా గ్లోబల్ టాప్ 100 కంపెనీల్లో మన దేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీల సరసన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిల్చింది. ఎస్బీఐ ఈ ఘనత సాధించడంలో, 2017లో బ్యాంక్ ఆవిష్కరించిన డిజిటల్ ప్లాట్‌ఫాం ’యూ ఓన్లీ నీడ్ వన్’ (యోనో) యాప్ కూడా కీలక పాత్ర పోషించిందని శ్రీవాస్తవ తెలిపారు. కానీ దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే యూజర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. అందరికీ ఆర్థిక సేవలు అందించేందుకు లక్షల మంది ఉద్యోగులు, వేల సంఖ్యలో బ్రాంచీలను ఉపయోగించడం కన్నా డిజిటల్ విభాగాన్ని ఇంకా సమర్ధవంతంగా వినియోగించుకోవడంపై దృష్టి పెడితే మరింత ప్రయోజనం లభించగలదని తెలిపారు. ‘ఎస్బీఐలో దాదాపు 50 కోట్ల ఖాతాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఇంత మందికి సేవలందిస్తున్న అగ్రగామి బ్యాంకు. కానీ ఈ ఖాతాదారుల్లో 7.4 కోట్ల మంది మాత్రమే (సుమారు 14 శాతం మంది) యోనో యూజర్లు ఉన్నారు. ఈ చిన్న విభాగమే ఎస్బీఐ లాభాలకు దన్నుగా నిలుస్తోంది. తక్కువ మార్జిన్, అధిక సర్వీస్ వ్యయాలు ఉండే ఖాతాలు 37 కోట్ల పైగా ఉంటున్నాయి. అందరికీ ఆర్థిక సేవలు అందించాలన్న నినాదం కింద ప్రారంభించిన చాలా మటుకు ఖాతాల్లో బ్యాలెన్సులు తక్కువగా ఉంటున్నాయి. లేదా వినియోగంలోనే ఉండటం లేదు. వీటి వల్ల నిర్వహణ వ్యయాల భారం అధికంగా ఉంటోంది‘ అని శ్రీవాస్తవ వివరించారు. యోనోకు మరింత ప్రాధాన్యమివ్వాలి .. రికార్డు లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ ఎస్బీఐ పీబీ నిష్పత్తి (ప్రైస్–టు–బుక్) ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే తక్కువగా 1.4 స్థాయిలో ఉందని శ్రీవాస్తవ చెప్పారు. అదే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.8), ఐసీఐసీఐ బ్యాంకుల (3.3) మార్కెట్ వేల్యుయేషన్ అధిక స్థాయిలో ఉంటోందని వివరించారు. ఇవి డిజిటల్ మాధ్యమాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుంటూ, కార్యకలాపాల వ్యయాల భారాన్ని తక్కువ స్థాయికి పరిమితం చేసుకోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఆర్థిక పనితీరు కన్నా, వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోలేకపోవడం వల్లే దేశీ మార్కెట్లో పోటీ సంస్థలతో పోలిస్తే ఎస్బీఐ పీబీ నిష్పత్తి డిస్కౌంట్లో ఉంటోందని శ్రీవాస్తవ విశ్లేíÙంచారు. ఈ నేపథ్యంలో యోనోను సమర్ధంగా వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం ఆధార్, యూపీఐ, ఇంటర్నెట్ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీలాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడి, గ్రామీణ ప్రాంతాల వారు కూడా మొబైల్ ఫోన్స్ ద్వారా లావాదేవీలు జరుపుతున్న పరిస్థితుల్లో భౌతిక శాఖల విషయంలో బ్యాంకు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.మరిన్ని ముఖ్యాంశాలు..→ ఫిన్‌టెక్ విప్లవానికి స్పందనగా 2017లో ప్రారంభించిన యోనో ఇప్పుడు ఎస్బీఐ వృద్ధి వ్యూహానికి మూలస్తంభంగా మారింది. ప్రైవేట్ దిగ్గజాలు, ఫిన్‌టెక్ స్టార్టప్‌లకు దీటుగా 7.4 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ. 3.2 లక్షల కోట్ల రుణాల వితరణకు ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడింది. రోజువారీగా యోనోలో లాగిన్స్ 1 కోటి పైగా ఉంటాయి. ప్రస్తుతం ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి 65 శాతం లావాదేవీలు దీని ద్వారానే జరుగుతున్నాయి. యోనో కేవలం బ్యాంకింగ్కే పరిమితం కాకుండా వివిధ సర్వీసులు అందిస్తోంది. దీని ద్వారా ఖాతాలు తెరవొచ్చు, మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు, బీమా పాలసీలు కొనుగోలు చేయొచ్చు, ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు, రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రభుత్వ సర్వీసులను కూడా పొందవచ్చు. → వ్యయ–ఆదాయ నిష్పత్తి, కస్టమర్లను దక్కించుకునేందుకు చేసే వ్యయాలు, అసెట్స్‌పై రాబడులు తదితర అంశాల విషయంలో డిజిటల్ బ్యాంకులు ఎన్నో ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న బ్యాంకులకు మించి నిలకడగా రాణిస్తున్నాయి. భారత్‌లో పేటీఎం, ఫోన్‌పే, జీరోధాలాంటి ఫిన్‌టెక్ సంస్థలు ఒక్కసారిగా ఎగిశాయి. వాటికి భిన్నంగా ఎస్బీఐకి భారీ స్థాయి, విశ్వసనీయత, రెగ్యులేటరీ సంస్థ నుంచి మద్దతులాంటి సానుకూలాంశాలు ఉన్నాయి. ఆర్థిక సమ్మిళితత్వానికే కాకుండా పోటీపడి, రాణించేందుకు కూడా వీటిని బ్యాంకు ఉపయోగించుకోవాలి. → శాఖల నెట్వర్క్, ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయకుండానే మార్కెట్ క్యాపిటలైజేషన్ను రెట్టింపు చేసుకునే సామర్థ్యం ఎస్బీఐకి ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఖాతాదారులకు యాప్‌ను మరింత చేరువ చేసి, యోనో యూజర్లను పెంచుకోవాలి. → కాస్తంత పెట్టుబడులు పెడితే, కస్టమర్లను డిజిటల్ యూజర్లుగా మార్చుకోవచ్చు. తద్వారా సేవల వ్యయాలను తగ్గించుకోవచ్చు. పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని శాఖలు, ఏటీఎంలువంటి ఆర్వోఐ (పెట్టుబడిపై రాబడి) తక్కువ స్థాయిలో ఉండే భౌతిక మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దశలవారీగా తగ్గించుకోవావాలి. అలాగే, నిద్రాణ స్థితిలో ఉన్న ఖాతాలు, లేదా లో–బ్యాలెన్స్ ఖాతాలకు సంబంధించి నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవాలి. యోనో ద్వారా మరిన్ని ఉత్పత్తులను విక్రయించవచ్చు. యోనోను అనుబంధ సాధనంగా కాకుండా కస్టమర్లకు చేరువయ్యేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక చోదకంగా పరిగణించాలి.

మళ్లీ ఐపీఓల సందడి!
న్యూఢిల్లీ: గత కొద్ది నెలలుగా కళతప్పిన ప్రైమరీ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి మొదలైంది. 2025లో అడపాదడపా వస్తున్న పబ్లిక్ ఇష్యూలు ఇకపై జోరందుకోనున్నాయి. ఈ నెలాఖరులోగా ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్ తలుపుతట్టనున్నాయి. మొత్తం మీద వచ్చే పది రోజుల్లో రూ.11,669 కోట్లు సమీకరించేందుకు రంగం సిద్ధమైంది. టెక్స్టైల్ కంపెనీ బొరానా వీవ్స్ నేడు (20న) ప్రారంభమై 22న ముగుస్తుంది. ఇక పుణేకు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఇష్యూ 21న ఆరంభమై 23న క్లోజవుతుంది. మిగిలిన నాలుగు కంపెనీలు వచ్చే వారంలో పబ్లిక్ ఆఫర్ చేపట్టనున్నాయి. లీలా ప్యాలెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌కు చెందిన స్లోస్ బెంగళూరు లిమిటెడ్, ఏజిస్ వోప్యాక్ టెరి్మనల్స్, అరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్, స్కోడా ట్యూబ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వారంలోనే ఈ నాలుగూ ప్రైస్ బ్యాండ్లను ప్రకటించనున్నాయి. ధరల శ్రేణి ఇలా... బొరానా వీవ్స్ రూ.144 కోట్ల సమీకరణ కోసం చేపడుతున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 205–216 ధరల శ్రేణి (ప్రైస్ బ్యాండ్) ప్రకటించింది. బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఈ ఇష్యూ ద్వారా రూ.2,150 కోట్లు సమీకరిస్తోంది. దీనికి ధరల శ్రేణి రూ. 85–90గా నిర్ణయించింది. స్లోస్ బెంగళూరు రూ.3,000 కోట్ల తాజా ఈక్విటీతో పాటు ఓఎఫ్ఎస్ ద్వారా రూ.2,000 కోట్ల ప్రమోటర్ షేర్లను కూడా విక్రయించనుంది. ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ సంస్థ ఏజిస్ వోప్యాక్ టెర్మినల్స్ తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.3,500 కోట్లు సమీకరించనుంది. ఇక నిర్మాణ రంగ మెటీరియల్ సరఫరాదారు ఆరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్ రూ.600 కోట్లు, స్కోడా ట్యూబ్స్ రూ.275 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.ఇప్పటిదాకా 10...: ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు ట్రంప్ టారిఫ్ వార్ దెబ్బకు ఈ ఏడాది మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో మన సూచీలు ఆల్‌టైమ్ గరిష్టం నుంచి దాదాపు 17 శాతం మేర దిద్దుబాటుకు గురయ్యాయి. ఈ ప్రభావంతో కంపెనీలు ఐపీఓలకు ముఖం చాటేశాయి. 2024లో రికార్డు స్థాయిలో 91 పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1,6 లక్షల కోట్లు సమీకరించగలిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పొలోమంటూ వచి్చన ఇష్యూకల్లా సబ్స్క్రయిబ్ చేయడంతో ప్రైమరీ మార్కెట్ కళకళలాడింది. అయితే, 2025లో ఇప్పటిదాకా కేవలం 10 కంపెనీలు మాత్రమే ఐపీఓలకు వచ్చాయి. కాగా, టారిఫ్ యుద్ధానికి ట్రంప్ 90 రోజుల విరామం ప్రకటించడం.. ట్రేడ్ డీల్స్‌పై జోరుగా చర్చలు జరుగుతుండటంతో మార్కెట్లు మళ్లీ తాజా కనిష్టాల నుంచి బాగానే బౌన్స్ అయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్టానికి మరో 4 శాతం దూరంలోనే ఉన్నాయి. సెకండరీ మార్కెట్ దన్నుతో ఐపీఓలకు కంపెనీలు మళ్లీ ముందుకొస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, సెబీ నుంచి దాదాపు 57 కంపెనీలకు ఐపీఓల కోసం దాదాపు లైన్ క్లియర్ కాగా.. మరో 74 కంపెనీల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని యాక్సిస్ క్యాపిటల్ వెల్లడించింది. ఇందులో సోలార్/పునరుత్పాదక ఇంధనం నుంచి కో–వర్కింగ్ స్పేస్, ఫార్మా, హెల్త్‌కేర్, తయారీ, కెమికల్స్, రియల్టీ తదితర రంగాలకు చెందిన సంస్థలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఇష్యూగా నిలిచిన ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఏథర్ ఎనర్జీ దాదాపు రూ.3,000 కోట్లు సమీకరించడం విదితమే. అయితే, పేలవంగా లిస్టయ్యి.. ఇప్పటికీ ఇష్యూ ధర (రూ.321) కంటే దిగువనే ఉండటం గమనార్హం.కోల్ ఇండియా సబ్సిడరీలు కూడా..ప్రభుత్వరంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాకు చెందిన రెండు అనుబంధ సంస్థలు.. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్), సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ (సీఎంపీడీఐ) ఐపీఓకు సన్నద్ధమవుతున్నాయి. ఈ రెండూ త్వరలోనే సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేయనున్నట్లు కోల్ ఇండియా డైరెక్టర్ దేబశిష్ నందా వెల్లడించారు. బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లను నియమించుకున్నామని, మార్కెట్ పరిస్థితులను బట్టి ఇష్యూ ఉంటుందని చెప్పారు. కోల్ ఇండియాకు 7 సబ్సిడరీలు ఉండగా. దేశీ బొగ్గు ఉత్పత్తిలో 80% వాటా దీని చేతిలోనే ఉంది.
ఫ్యామిలీ

ఈ డ్రగ్‌తో జాగ్రత్త సుమీ! 2 గ్రాములు చాలు
ఈ మధ్య కాలంలో ఓ మహిళా వైద్యురాలు 53 గ్రాముల కొకైన్‌తో పట్టుబడి వార్తలకెక్కడంతో కొకైన్‌పై చర్చ మరోసారి బయలుదేరింది. కొకైన్ డోస్ 30 నుంచి 70 మిల్లీగ్రాములు తీసుకుంటే చాలు, రెండు లేదా మూడు నిమిషాల్లో మెదడులో స్వైరకల్పనలు మొదలై ఎక్కడికో వెళ్ళిపోతుంది. పోను పోనూ అలవాటు ముదిరితే 1 గ్రాము వరకు ఒకేసారి తీసుకోగలరు.అంతకుమించి 2 గ్రాముల వరకు ఒకేసారి తీసుకుంటే చావు-బ్రతుకుల మధ్య ఉన్నట్లే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతిరోజూ 5 గ్రాముల దాకా విడతలు, విడతలుగా తీసు కునే వారి శరీరంలో అనేక అవయవాలు దెబ్బతింటాయి. కిడ్నీలు, ప్రేవులు, ఊపిరితిత్తులు నాశనమవుతాయి. కేంద్ర నాడీమండల వ్యవస్థ పాడై మానసిక భ్రాంతులు కలగడం, వణుకు రావడం, ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు... ఇలా ఎన్నో రుగ్మతలు వస్తాయి. సాధారణంగా కొకైన్‌ని ముక్కుతో పీల్చడం, ఇంజెక్ట్ చేసుకోవడం, సిగరెట్లలో పెట్టి కాల్చడం వంటి పద్ధతుల్లో తీసు కుంటారు. తీసుకున్న తర్వాత ఒక్కొక్కరికి రకరకాల తేడాలతో భ్రాంతులు కలుగుతాయి. కోకా ఆకులు నుంచి కొకైన్‌ని తయారు చేస్తారు. కొలంబియా, పెరూ, బొలీవియా వంటి దేశాల్లో ఈ కోకా పంట విరివిగా పండుతుంది. మొట్టమొదట స్థానికులు అజీర్ణానికి, చురుకుగా ఉండటానికి ఈ ఆకుల్ని మందుగా నమిలేవారు. అయితే జర్మన్ రసాయన శాస్త్రవేత్త అల్బర్ట్ నీమన్ ఒకసారి ఈ ఆకుల్ని నమలగా విచిత్ర అనుభూతి కలిగింది. దాంతో ఆయన కోకా ఆకుల్లో నుంచి రసాన్ని పిండి, దానికి కొన్ని రసాయనాలు కలిపి కొకైన్ అనే తెల్లటి పదార్థాన్ని 1860లో తయారు చేశాడు. ఆ విధంగా ఇప్పుడు మనం చూసే కొకైన్ పుట్టింది.ఒక కిలోగ్రామ్ కొకైన్ తయారు చేయాలంటే వెయ్యి కిలో గ్రాముల కోకా ఆకులు కావాలి. దానికి మరిన్ని రసాయనాలు కలుపుతారు. ప్రపంచంలోని మొత్తం కొకైన్‌లో 70 శాతం పైగా ఒక్క కొలంబియాలోనే తయారవుతుంది. ఆ తర్వాత స్థానం పెరూ, బొలీవియా దేశాలది. కేవలం ఈ కొకైన్ వల్లనే కొలంబియా దేశం వారానికి 400 మిలియన్ డాలర్లు ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఈ కొకైన్ డ్రగ్ మాఫియా ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించింది. – మూర్తి కేవీవీఎస్

అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్
బాల్య ప్రేమికులు,గత ఏడాది జూలైలో వివాహం బంధంలోకి అడుగపెట్టిన లవ్‌బర్డ్స్ అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ షాపింగ్‌లో సందడిగా కనిపించారు. జియో ప్లాజాలో భార్య రాధిక మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ ఆదివారం షాపింగ్ చేయడం సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. అంబానీ అప్డేట్ పేజీ ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.అనంత్ , రాధిక జియో వరల్డ్ ప్లాజా ప్రాంగణంలో షాపింగ్ చేశశారు. జియో వరల్డ్ ప్లాజాలోని భద్రతా సిబ్బంది వెంటరాగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పెళ్లి అయ్యి దాదాపు ఏడాది కావస్తున్నా కొత్తజంటలా జియో షాపింగ్ మాల్లో సందడి చేశారు. అనంత్ కాల్లో బిజీగా ఉండగా, రాధిక చేయి పట్టుకుని ఉల్లాసంగా నడుస్తు, విలాసంగా కనిపించింది. అనంత్ నేవీ బ్లూ షర్ట్, త్రీ-ఫోర్త్స్ బ్లాక్ షార్ట్స్, బ్లాక్ సాక్స్, బ్లూ షూస్ ధరించాడు. ఇక అంబానీ చోటీ బహూ ఎప్పటిలాగానే తన సింపుల్ స్టైల్‌ను చాటుకుంది. రాధిక తెల్లటి స్లీవ్‌లెస్ క్రాప్ టాప్ ధరించి, గిరిజాలజుట్టును అలా వదిలేసి సైడ్ బ్యాగ్ వేసుకుని చాలా క్యాజువల్ స్టైల్లో కనిపించింది.అయితే జంట దేని కోసం షాపింగ్ చేశారో స్పష్టంగా తెలియదు. ఫ్యాన్స్‌కి మాత్రం అనంత్-రాధిక షాపింగ్ వీడియో తెగ నచ్చేసింది. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..! దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ తన చిన్ని నాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌ను గత ఏడాది జైలూ12న పెళ్లాడాడు. ప్రపంచంలోనే కనీవినీ ఎరుగనిరీతిలో వివాహ వేడుకలు జరిగాయి. అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహానికి ఇండియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది బిలియనీర్లు హాజరైన సంగతి తెలిసిందే.

ఆ ఫుడ్..నాట్ గుడ్..!
ఉరుకుల పరుగుల జీవనయానంలో ప్రజల జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఆహారపు అలవాట్లు కూడా చాలా వరకు మారిపోయాయి. సామాజిక స్థాయిలు మారాయి. నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కిట్టీ పార్టీ కల్చర్ వచ్చింది. బర్త్‌డేలు, మ్యారేజ్ డేలు, నిశ్చితార్థాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు.. సందర్భం ఏదైనా స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి హోటళ్లల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఆ ఆహారమే అనారోగ్యమని గుర్తించలేపోతున్నారు. మురికి కాలువ గట్ల మీద ఉండే చిన్నపాటి తినుబండారాల తోపుడుబండి నుంచి పెద్దపెద్ద భవనాల్లో ఉండే ఖరీదైన హోటళ్ల వరకు అన్ని వేళలా ఆహార ప్రియులతో కిటకిటలాడుతుంటాయి. శుభకార్యాల నుంచి అశుభకార్యాల వరకు అన్ని సందర్భాల్లోనూ వడ్డించే ఫుడ్ కోసం హోటల్స్‌కు ఆర్డర్లు ఇస్తున్నారు. ఇంటి భోజనం కంటే హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు, బేకరీ ఫుడ్‌కు బాగా ప్రాధాన్యత పెరిగింది. అయితే ఇక్కడ తయారయ్యే ఆహారాలు, నిల్వ ఉన్న పదార్థాలు, పలు రసాయనాలతో చేసినవి కావడంతో ఆ వంటకాలు తిని పలువురు రోగాల బారిన పడుతున్నారు. క్యాన్సర్ రోగుల్లో 53 «శాతం మంది హోటల్స్ ఆహారంతోనే సమస్య తెచ్చుకుంటున్నారని పలు సర్వేలు వెల్లడించడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. ఆహారాల్లో ప్రమాదకర రసాయనాలు హోటళ్లల్లో ఆహారాలు కలర్ ఫుల్, రుచికరంగా ఉండేందుకు ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తుండడంతో అనేక రోగాలకు కారణమవుతున్నాయి. మెటానియల్ ఎల్లో వాడకం నిషేధించినప్పటికీ చాలా హోటళ్లలో వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై వెంటనే దుష్ప్రభావం చూపించదు. నెమ్మదిగా క్యాన్సర్‌కు కారకమవుతోంది. చిన్నారుల్లో నిద్రలేమి, నరాల సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి. వంటకాల్లో రంగు కోసం వాడే నిషేధిత టార్ట్రాజిన్ చాలా ప్రమాదకరం. దీంతో మానసిక వ్యాధితోపాటు థైరాయిడ్, క్యాన్సర్, ఎలర్జీ, దద్దుర్లు, తామర, రక్తకణ జాలంలో హానికర కణ జాలల వృద్ధి చెందడం, డీఎన్ఏ నష్టపోవడం, నిద్రలేమి, నీరసం వస్తాయి. స్వీట్లు, బిస్కెట్లలో ఆరెంజ్ రంగు కోసం వాడే సన్‌సెటన్, పసుపు రంగు కోసం వాడే కాటారజ్, గ్రీన్ కలర్ కోసం వాడే బ్రిలియంట్ బ్లూ, టారా్ట్రాజీన్లు ప్రమాదకరమే. చాకెట్లలో వాడే రోడ్మన్–బీ కూడా ప్రాణాంతకమే. అయినా చాక్లెట్లు, చిన్న పిల్లలు తినే రంగుల ఆహార పదార్థాల్లో వీటిని వినియోగిస్తున్నారు. పార్టీ కల్చర్.. ప్రమాదకరం కొన్నేళ్ల క్రితం వరకు పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లినా.. సమయానికి ఇంటికి రాలేని పరిస్థితుల్లో కొందరు హోటళ్లలో తినేవారు. కొందరైతే ఎంత సమయమైనా ఇంటికి వచ్చే భోజనం చేసేవారు. ఇప్పుడు కల్చర్ మారింది. సామాజిక నడతలో మార్పు వచ్చింది. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కల్చర్ వచ్చింది. నలుగురు స్నేహితులు కలిస్తేనే కాదు.. వీకెండ్ ఫ్యామిలీస్‌తో కలిసి లంచ్, డిన్నర్ బయటే చేస్తున్నారు. ఖరీదైన ఆహారం తింటున్నామనే భ్రమలో అనారోగ్యం బారిన పడుతున్నామని గ్రహించలేకపోతున్నారు. నిల్వ ఉంచిన ఆహారం, ప్రమాదకర రసాయనాలు కలిపిన ఆహారాలతో అప్పటికప్పుడు నష్టం లేకపోయినా దీర్ఘకాలంలో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.నిబంధనలు బేఖాతర్ జిల్లాలో చిన్నా, పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలు, చాట్ బండార్లు, నూడిల్స్ షాపులు, అన్ని కలుపుకుని 5 వేలకు పైగా ఉంటాయి. ఒక్క నగరంలోనే 3 వందల వరకు హోటల్స్ ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. వాస్తవానికి హోటల్స్ యజమానులు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంది. ఆ శాఖ నిబంధనల మేరకు ఆహారం తయారు చేయాలి. ఈ చట్టం 2006 నుంచి అమల్లో ఉంది. ఆ శాఖ పరిధిలో జిల్లా స్థాయి అధికారితోపాటు ఓ గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, మరో ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీరు నెలకు 12 శాంపిల్స్ సేకరించాలి. శాంపిల్స్‌ను ప్రయోగశాలకు పంపి, పరిశీలన తర్వాత అవి ప్రమాణాల మేరకు లేకపోతే కేసులు నమోదు చేయాల్సి ఉంది. కల్తీని బట్టి క్రిమినల్ లేదా సివిల్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించే వీలుంది. కానీ ఇవి జరగడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని తమ వద్దకు ఎవరూ రారన్న ధీమాతో వ్యాపారులు చెలరేగిపోతున్నారు. విచ్చలవిడిగా ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు.నాసిరకం.. రంగుల మయం హోటళ్లల్లో తయారయ్యే ఆహార పదార్థాలు నాసిరకం.. రంగుల మయంగా ఉంటాయి. పశువుల ఎముకలను సేకరించి వాటిని బట్టీలో అత్యధిక ఉష్ణోగ్రతపై మరిగించి ద్రావణాన్ని తీస్తున్నారు. ఆ ద్రావణాన్ని సాధారణ నూనెల్లో కలిపి విక్రయిస్తున్నారు. దీని వల్ల జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మిరప కాయల్లో ఎరుపు రంగు రావడానికి సూడాన్ రంగులు వాడుతుంటారు. పసుపులో మెటానిల్ ఎల్లో అనే పదార్థాన్ని కలుపుతారు. వీటిని వంటలో వినియోగిస్తే క్యాన్సర్ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆహారాన్ని వండే సమయంలో వాడిన నూనెనే మళ్లీ మళ్లీ కాచి వినియోగిస్తున్నారు. దీని వల్ల క్యాన్సర్, అల్సర్లు వచ్చే ప్రమాద మున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చికెన్, మటన్ బిర్యానీలు, తందూరిలో ఆకట్టుకునేందుకు ఎక్కువగా హానికరమైన రంగులను వాడుతున్నారు. అనారోగ్యానికి గురైన, ప్రమాదాల్లో చనిపోయిన గొర్రెలు, పొట్టేళ్లు, మేకలతోపాటు అనారోగ్యానికి గురైన వాటిని వధించి వినియోగదారులకు విక్రయిస్తున్నారు.చిన్న చిన్న హోటళ్లు, కర్రీస్ పాయింట్లలో వేడి వేడి కూరలు, పప్పు, సాంబారు వంటి ఆహార పదార్థాలు పల్చటి పాలిథిన్ కవర్లలో వేసి ఇస్తున్నారు. పదార్థాల వేడికి ప్లాస్టిక్ కరిగి వాటిని తినే వారికి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. ∙నిషేధిత క్యాట్ ఫిష్‌లను సైతం కొర్రమీనుగా విక్రయిస్తున్నారు. జిల్లాలో వీటిని చికెన్, మటన్ వ్యర్థాలతో గుంతల్లో పెంచుతున్నారు.అల్లం, వెల్లుల్లి పేస్టులను సైతం కల్తీ చేస్తున్నారు. వీటి ధర ఎక్కువగా ఉండడంతో అందులో ఆలుగడ్డ, ఉల్లిగడ్డ పేస్ట్‌ను కలుపుతున్నారు.నిత్యం తనిఖీలు చేస్తున్నాంహోటల్స్, ఐస్‌క్రీం పార్లర్లు, రెస్టారెంట్లు, పండ్ల దుకాణాలను నిత్యం తనిఖీలు చేస్తూనే ఉన్నాం. పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా చాలా వరకు కాలం చెల్లినవి, ఉంటున్నాయి. 2024–25లో పలు హోటల్స్‌ను తనిఖీ చేసి 296 శ్యాంపిల్స్‌ను సేకరించగా 20 శాంపిల్స్‌లో నాణ్యత తక్కువగా ఉన్నట్లు, 18 శాంపిల్స్ ప్యాకెట్స్‌పై వివరాలు లేకుండా ఉన్నట్లు గుర్తించాం.– వెంకటేశ్వరరావు, జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ కల్తీ వల్ల ఆరోగ్య సమస్యలుకల్తీ ఆహారం తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. అవసరమైన పదార్థాలు అందక శరీరం బలహీనమవుతుంది. పోషకాహారం తీసుకుంటున్నామని ప్రజలు భావిస్తున్నప్పటికీ, కల్తీ వల్ల జీవనక్రియలు నిలిచిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీలైనంత వరకు బయట ఫుడ్‌కు స్వస్తి చెప్పి ఇంటి ఆహారాన్ని తీసుకోవడం శ్రేయస్కరం. ఆరోగ్యానికి ఎంతో మంచిది. – డాక్టర్ ఎంవీ రమణయ్య, రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల(చదవండి: ప్లీజ్..నో సప్లిమెంట్స్..! )

మెరిసిన చేనేత.. మురిసిన భామలు
పోచంపల్లి ఇక్కత్ చీరలు, ఇక్కత్ వస్త్రాలు, విశ్వవ్యాప్తంగా తరలివచ్చిన సుందరాంగుల మనసు దోచుకున్నాయి. చేనేత కళాకారుల వస్త్ర డిజైన్లను చూసి వారు ముగ్ధులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రపంచ సిల్క్ సిటీ భూదాన్ పోచంపల్లిలో.. ప్రపంచ సుందరీమణుల పోటీదారుల పర్యటనలో అడుగడుగునా చేనేత వస్త్ర కళా వైభవం కళ్లకు కట్టింది. చేనేత చీరలు, వస్త్రాలను చూసి విదేశీ వనితలు మురిసిపోయారు. ఈ సందర్భంగా కొన్ని వస్త్రాలను ధరించి ఇక్కత్ చీరల తయారీ ప్రక్రియ, డిజైన్ల వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్ చీరల నేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి మరోసారి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. తెలంగాణ పర్యాటక శాఖ.. చేనేతను మరింత ప్రచారంలోకి తీసుకురావడంలో విజయవంతమైంది.అందగత్తెలతో ప్రపంచం దృష్టికి..పోచంపల్లిలో అందాల భామల పర్యటనతో చేనేత, ఇక్కత్ వస్త్రాలు ప్రపంచానికి మరోసారి పరిచయమైనట్లయింది. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చేనేత కళాకారుల ప్రతిభకు గుర్తింపు దక్కేలా ప్రభుత్వం కృషి చేసింది. పోచంపల్లికి వచ్చిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు.. పోచంపల్లి చీరల తయారీ, డిజైన్, అద్దకం ఇక్కత్ వస్త్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క చీర తయారీకి కళాకారులు తీసుకునే శ్రమ, డిజైన్ల సృజనాత్మకత.. పోటీదారుల మనస్సును హత్తుకున్నాయి. చీరలపై భిన్న డిజైన్లను తిలకించిన అందగత్తెలు పరవశించిపోయారు. రంగు రంగుల డిజైన్లతో ఉన్న ఇక్కత్, డబుల్ ఇక్కత్ చీరలు, శాలువాలు, డ్రెస్ మెటీరియల్, కాటన్, పట్టు చీరలను చేతితో తడిమి మరీ చూశారు. పోచంపల్లి, వెంకటగిరి ,గొల్లభామ, నారాయణపేట చీరలు, వస్త్రాల ప్రదర్శన సుందరీమణులను ఆకట్టుకుంది.ర్యాంప్ వాక్‌తో మెరుగులు దిద్ది..అందగత్తెలకే అసూయ పుట్టేలా నిర్వహించిన ఫ్యాషన్ షో.. పోచంపల్లి సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ అందగత్తెలే అచ్చెరువొందేలా హైదరాబాద్, ఢిల్లీకి చెందిన భారతీయ మోడల్స్.. ఇక్కత్ చీరలు, వస్త్రాల ఫ్యాషన్ షో అద్భుతంగా సాగింది. సంప్రదాయం, ఆధునికత ఉట్టిపడేలా రూపొందించిన డిజైన్లు ధరించిన చేనేత, ఇక్కత్ వస్త్రాలతో యువతీ యువకులు ప్రపంచానికి ఆధునికత జోడించిన చేనేత దుస్తులను పరిచయం చేశారు. ర్యాంప్‌వాక్ అదుర్స్ర్యాంప్వాక్లో చేనేత డిజైన్లతో మోడల్స్ ధరించిన దుస్తులను..ప్రపంచ అందగత్తెలు కళ్లార్పకుండా చూ స్తూ చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహించారు. ప్రపంచ సుందరీమణులు, స్థానిక మోడల్స్ ధరించిన చేనేత వస్త్రాలతో వేదిక చేనేతను విశ్వవ్యాప్తం చేసింది. 1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం పోచంపల్లి టైఅండ్‌డై ఇక్కత్ చేనేత కళారంగం ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం పడింది. మొదటిసారిగా పోచంపల్లికి చెందిన కర్నాటి అనంతరాములు, తడక పెద్దయాదగిరిలు నిలువు, పేక పద్ధతిలో సహజరంగులతో పట్టు చీరలను నేశారు. నాటి నుంచి ఎందరో చేనేత కళాకారులు ప్రయోగాలు చేస్తూ నూతన డిజైన్లు సృష్టిస్తూ చేనేత కళను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ప్రపంచాధినేతల ఆకట్టుకునేలా ఇక్కత్ వస్త్రాలుపోచంపల్లి ఇక్కత్ కళ ప్రపంచ వ్యాప్తమైంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య బ్రిగ్గేట్టే మెక్రాన్‌కు.. ఇక్కడి నేతన్నలు నేసిన ఇక్కత్ చీరను బహూకరించారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ పర్యాటక సంస్థ.. 2021లో పోచంపల్లికి ‘అంతర్జాతీయ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు’ బహూకరించడంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. చేనేత కుటీర పరిశ్రమ ద్వారా సంప్రదాయ వృత్తి, వారసత్వ సంపదను కాపాడుకుంటూనే పలువురు ఉపా«ధి పొందుతున్నందుకు ఈ గుర్తింపు ఇచ్చారు. పోచంపల్లి వస్త్రాలు తప్పనిసరి.. దేశ, విదేశాల్లో జరిగే అంతర్జాతీయ సదస్సుల్లో అతిథులకు పోచంపల్లి శాలువాను కప్పడం సంప్రదాయంగా మారింది. ఇక్కత్ చేనేత వస్త్రాలను సిల్క్, కాటన్, సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజయ్ (క్విల్స్), స్టోల్స్, స్కార్ప్, దుప్పట్టా, డోర్, టేబుల్ కర్టెన్లు, పిల్లో కవర్లు తదితర వెరైటీలు దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆఫ్రికా, యూరప్, అమెరికాలకు వెళ్తున్నాయి. ముస్లిం దేశాలలో మహిళలు ముఖానికి ధరించే స్కార్ఫ్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇక అపెరల్ ఫ్యాబ్రిక్, హోమ్ ఫర్నిషింగ్, డ్రెస్ మెటీరియల్స్‌ను యూరప్ దేశాల ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు.పేటెంట్ హక్కులతో ముందుకు..పోచంపల్లి వస్త్రాలకు మొట్టమొదటిసారిగా 2003లో కేంద్ర ప్రభుత్వం జియొగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ (పేటెంట్) సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక్కత్ కళ దేశంలో మరెక్కడా లేదు. మారుతున్న కాలానుగుణంగా ఇక్కడి చేనేత కళాకారులు పోచంపల్లి ఇక్కత్ డిజైన్లలో గద్వాల, కంచి, ధర్మవరంతో పాటు కొత్త కొత్త డిజైన్లు వచ్చేలా వినూత్న ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. కాగా పేటెంట్ హక్కులు పొందినప్పటికీ.. నకిలీ వస్త్రాల తయారీ చేనేత వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇక్కత్ యూనివర్సల్ బ్రాండ్ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పోచంపల్లి టై అండ్ డైలోనే ఇక్కత్ ఉంది. ఇక్కత్ అనేది ఒక యూనివర్సల్ బ్రాండ్. చేనేత చీరలు పూర్తిగా చేతితో మగ్గంపై ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న సంప్రదాయ కళ. నూలు ఉడకబెట్టడం, రంగుల అద్దకం వంటి చేతి వృత్తి. ఎంతో మంది మహిళలు ఇక్కత్ చీరల పనితో జీవనోపాధి పొందుతున్నారు. పోచంపల్లి చీరల డిజైన్ కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో గుర్తింపు పొందాయి. – ఎం.హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లాచేనేతకు ప్రభుత్వం చేయూత తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ సుందరీమణుల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన అందాల భామలు పోచంపల్లి చీరలు, వస్త్రాలకు ముగ్ధులయ్యారు. ప్రపంచ పటంలో పోచంపల్లి కళాకారులు రూపొందించిన వస్త్రం సంపద వెల కట్టలేనిది. సీఎం రేవంత్ అధ్వర్యంలోని ప్రభుత్వం చేనేతకు చేయూత నిస్తోంది. – కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి(చదవండి: మన శక్తిని నమ్ముకుందాం నటాషా న్యో న్యో జీ.. మిస్ యుగాండా! )
ఫొటోలు


ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)


జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)


పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)


ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)


హైదరాబాద్ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)


కాజల్ బర్త్‌డే స్పెషల్.. ఆ సినిమాతోనే స్టార్డమ్ (ఫొటోలు)


23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్ హీరోయిన్స్ (ఫోటోలు)


విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)


ట్యాంక్ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)


వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)
అంతర్జాతీయం

సముద్రగర్భంలో పెను విస్ఫోటం!
అగ్నిపర్వతం బద్దలైనప్పుడు నిప్పులు చిమ్ముతూ లావా నింగిలోకి ఎగసిపడటం, విపరీతంగా ధూళి సమీప గ్రామాలపై దుమ్ము దుప్పటి కప్పేయడం టీవీల్లో చూసే ఉంటారు. వీటికి పూర్తిభిన్నమైన అగ్నిపర్వతం అతి త్వరలో బద్దలుకానుందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని ఆస్టోరియా నగర తీరానికి 300 మైళ్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రం లోపల ఈ అగ్నిపర్వతం దాగి ఉంది. దీని పేరు యాక్సియల్ సీమౌంట్. భూ ఉపరితలం మీద కాకుండా పసిఫిక్ మహాసముద్రం ఉపరితలానికి 1.4 కిలోమీటర్ల లోతులో ఉండటమే ఈ అగ్నిపర్వతం ప్రత్యేకత. ఎందుకంత ప్రత్యేకత? ఈ అగ్నిపర్వతం రెండు భూ పలకలు ఢీకొనే చోట ఏర్పడింది. పసిఫిక్ భూ పలక, జువాన్ డీ ఫ్యూకా భూ పలకలు తరచూ అత్యంత స్వల్పంగా కదులుతుంటాయి. ఈ క్రమంలో ఇవి పరస్పరం తగులుతూ భూమి ఉపరితల పొరల కదలికలకు కారణం అవుతున్నాయి. వీటి సమీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం త్వరలో బద్దలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలోని హ్యాట్‌ఫీల్డ్ మెరైన్ సైన్స్ సెంటర్లో పరిశోధకుడైన బిల్ చాడ్విక్ ఈ వివరాలను వెల్లడించారు. ‘‘భూకేంద్రంలో ద్రవరూపంలోని శిలలు అగ్నిపర్వతం ద్వారా బయటకు వస్తాయి. ఈ శిలాద్రవం (మాగ్మా) వెంటనే సముద్ర జలాలకు తగిలి చల్లబడుతుంది. ఈ క్రమంలో అక్కడి సముద్ర జలాలు వేడెక్కుతాయి’’ అని చాడ్విక్ చెప్పారు.వేల కొద్దీ భూకంపాలు! ‘‘అగ్నిపర్వతం ఎత్తు కేవలం 3,300 అడుగులు. కానీ అత్యంత క్రియాశీలంగా తయారైంది. ఇటీవలికాలంలో శిలాద్రవం బయటికొచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. భూమి కంపిస్తోంది. అగ్నిపర్వతం తాజా స్థితిని తెల్సుకునేందుకు మేం సమీప ప్రాంతం దాకా కేబుల్ వ్యవస్థ ద్వారా భూకంప తీవ్రతలను కనిపెట్టే ఏర్పాట్లుచేశాం’’ అని ఆయన చెప్పారు. ‘‘ అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు భూమి వందల సార్లు కంపిస్తుంది. ఇక అగ్నిపర్వతం బద్దలైన సందర్భాల్లో వేల సార్లు కంపిస్తుంది. 2015 ఏప్రిల్‌లో చివరిసారిగా అగ్నిపర్వతం బద్దలైంది. అప్పుడు విపరీతంగా శిలాద్రవం బయటకు ఎగజిమ్మింది. అప్పుడు 24 గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో 10,000 చిన్నపాటి భూకంపాలు వచ్చాయి. ఈసారి కూడా అదే స్థాయిలో భూమి కంపించే వీలుంది’’ అని ‘యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ ఓషనోగ్రఫీ’లో మెరైన్ జియోఫిజిసిస్ట్, ప్రొఫెసర్ విలియం విల్కుక్ స్పష్టంచేశారు. జీవవైవిధ్యానికి బాసట అగ్నిపర్వతం బద్దలైనప్పుడు భారీ స్థాయిలో శిలాద్రవం మహాసముద్రజలాల్లో కలిసిపోతుంది. ఈ శిలాద్రవంలో ఎన్నో రకాల మూలకాలు ద్రవరూపంలో ఉంటాయి. ఇవన్నీ సముద్రజలాల్లో సమ్మిళితమై అక్కడి సూక్ష్మజీవులకు ఆహారంగా మారతాయి. ఈ సూక్ష్మజీవులపై ఆధారపడిన చిన్న జలచరాలు, వాటిని ఆహారం తీసుకునే చేపలు.. ఇలా ఆహార చక్రం సదా సవ్యంగా కొనసాగేందుకు అగ్నిపర్వతం పరోక్షంగా సాయపడుతోంది. అత్యంత వేడితో సెగలు కక్కే మాగ్నా సముద్ర ఉపరితలానికి ఎగసిపడగానే అక్కడ జీవులు కొన్ని చనిపోయినా తర్వాత మాత్రం అక్కడ జీవరాశి పెరుగుదలకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలో జీవం మనుగడకు అగ్నిపర్వతాలు సైతం తమ వంతు సాయం చేస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో మెరైన్ జియోలజీ, జియోఫిజిక్స్ విభాగ ప్రొఫెసర్ డెబీ కెల్లీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్

పాక్‌కు ఐఎంఎఫ్ మరో 11 షరతులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు బెయిల్ ఔట్ ప్యాకేజీ నిధులు విడుదల చేసే విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) 11 కొత్త షరతులు విధించింది. అలాగే భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకోవడం తగదని హితవు పలికింది. ఉద్రిక్తతలు పెంచుకొంటే మీకే ఎక్కువ సమస్యలు వస్తాయని తేల్చిచెప్పింది. ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, సంస్కరణ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుందని తేల్చిచెప్పింది. బిలియన్ డాలర్ల(రూ.8,540 కోట్లు) రుణానికి సంబంధించిన నిధులు పొందాలంటే షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. తాజాగా విధించిన 11 షరతులతో కలిపి పాకిస్తాన్‌పై విధించిన ఐఎంఎఫ్ షరతుల సంఖ్య 50కి చేరుకోవడం గమనార్హం. రూ.17.6 ట్రిలియన్ల బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలపాలని, విద్యుత్ బిల్లులపై రుణ సరీ్వసింగ్ సర్‌చార్జి పెంచాలని, మూడేళ్లు దాటిన పాత కార్ల దిగుమతిపై ఆంక్షలు ఎత్తివేయాలని ఐఎంఎఫ్ పేర్కొంది. మొత్తం బడ్జెట్లో రూ.1.07 ట్రిలియన్ల సొమ్మును అభివృద్ధి కోసం కేటాయించాలని నిర్దేశించింది. పాక్‌లోని నాలుగు ప్రావిన్సుల్లో కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలని అమలు చేయాలని తేల్చిచెప్పింది.

ట్రంప్ సలహా సంఘంలో మాజీ ఉగ్రవాదులు
వాషింగ్టన్: కరడుగట్టిన అల్‌కాయిదా, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందిన మాజీ ఉగ్రవాదులకు ఏకంగా అమెరికా అధ్యక్షుని సలహా సంఘంలో చోటు దక్కింది! వారిలో ఒకరు ఉగ్రవాదం, సంబంధిత కేసుల్లో దోషిగా జైలుశిక్ష అనుభవించి విడుదలైన ఇస్మాయిల్ రాయర్ కాగా మరొకరు హమాస్, ముస్లిం బ్రదర్హుడ్లతో సంబంధాలున్న మాజీ ఉగ్రవాది షేక్ హమ్జా యూసుఫ్. వారిని రిలీజియస్ లిబర్టీ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్‌లో సభ్యులుగా ట్రంప్ సర్కారు ఎంపిక చేసింది. వారిద్దరూ అమెరికాలో ఇస్లామిక్ బోధనల్లో ప్రముఖులుగా మంచిపేరు తెచ్చుకున్నారని చెప్పుకొచి్చంది. కరడుగట్టిన ఉగ్ర చరిత్ర ఉన్న మాజీలను సలహా సంఘంలోకి కూర్చోబెడతారా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ రెండో హయాంలో అమెరికాలో నెలకొన్న అవ్యవస్థకు ఇది మరో నిదర్శనమంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ సలహా సంఘం మతస్వేచ్ఛ, మత విశ్వాసాలకు అనుగుణంగా విధాన నిర్ణయాల్లో అధ్యక్షుడికి సలహాలిస్తుంది.ఎవరీ ఇస్మాయిల్? ఇతను అమెరికా జాతీయుడు. అసలు పేరు ర్యాండల్ టోడ్ రాయర్. 1992లో ఇస్లాం స్వీకరించి ఇస్మాయిల్‌గా పేరు మార్చుకున్నాడు. లష్కరే తోయిబా, ఈజిప్‌్టలోని ముస్లిం బ్రదర్హుడ్, ‘వర్జీనియా జిహాద్ నెట్వర్క్’, పాలస్తీనాలోని హమాస్ ఉగ్ర సంస్థతో సత్సంబంధాలున్నాయి. ప్రత్యేక ఉగ్రశిక్షణ కోసం 2000లో పాక్ వెళ్లాడు. అమెరికాపై యుద్ధం కోసం పలువురికి ఉగ్ర తర్ఫీదు ఇచ్చేలా ప్రణాళికలు వేశాడు. జమ్మూ కశీ్మర్లో సైనిక స్థావరాలపై రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్ దాడికి సహచర ఉగ్రవాదికి శిక్షణ ఇచ్చాడు. అల్ఆయిదా, లష్కరేలకు సాయపడ్డ నేరానికి 2003లో ఇస్మాయిల్‌పై కేసు నమోదైంది. దోషిగా తేలడంతో 20 ఏళ్ల జైలుశిక్ష పడ్డా స్రత్పవర్తన కారణంగా 2017లో విడుదలయ్యాడు. అమెరికాలోని రిలీజియస్ ఫ్రీడం ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్‌గా ఉన్నాడు.ఎవరీ షేక్హమ్జా యూసుఫ్? అమెరికాలో తొలి ముస్లిం లిబరల్ ఆర్ట్స్ కాలేజీ అయిన జేతునా కాలేజ్ సహవ్యవస్థాపకుడు. ఈ కాలేజీలో షరియా చట్టాలను బోధిస్తారు. యూసుఫ్‌కు ముస్లిం బ్రదర్హుడ్, హమాస్‌లతో లింకులున్నట్టు తేలింది. వాటితో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిన్తున్నట్టు చెబుతారు. ఇతని బోధనలకు పలువురు ఉగ్రవాదులు ఆకర్షితులైనట్టు స్పష్టమైంది. అమెరికా జాత్యహంకార దేశమంటూ వ్యాఖ్యలు చేశాడు. 1990ల నాటి శకంలో న్యూయార్క్ బాంబు దాడుల కేసు నిందితుడు షేక్ ఒమర్ అబ్దుల్ రహా్మన్పై దర్యాప్తులో అమెరికా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శలు గుప్పించాడు. అమెరికా పోలీస్ ఉన్నతాధికారిని హత్య చేసిన జమీల్ అల్ అమీన్ అనే వ్యక్తికి మద్దతుగా యూసుఫ్ ప్రసంగించాడు. తర్వాత రెండు రోజులకే అమెరికాపై 9/11 దాడి జరిగింది. దాంతో అతన్ని ఎఫ్‌బీఐ విచారించింది. ముస్లిం దేశాల్లో అత్యంత ప్రముఖ ఇస్లామిక్ విద్యావేత్తగా పేరొందాడు.

భారత్ అడుగుజాడల్లో...
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్, పరస్పర సైనిక చర్యల తర్వాత ప్రతి అంశంలో భారత్‌ను పాకిస్తాన్ అనుసరిస్తోంది. పాక్ వైఖరిని అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు అన్ని పార్టీల ఎంపీలు తదితరులతో ఏడు బృందాలను పలు దేశాలకు పంపుతుండటం తెలిసిందే. పాక్ కూడా అదే తరహాలో పలు దేశాలకు ఎంపీల బృందాలను పంపుతున్నట్టు హడావిడిగా ప్రకటించింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు వాటికి సారథ్యం వహిస్తారని చెప్పుకొచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ‘‘సొంత ఆలోచనే లేకుండా భారత్ ఏం చేస్తే పాక్ అదే చేస్తోంది. మక్కికి మక్కి పాలసీని అలవర్చుకుంది. ‘కాపీక్యాట్ పాక్’’ అంటూ నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. ఇందుకు పలు ఉదంతాలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు.బహిష్కరణల నుంచి బృందాల దాకా.. పహల్గాం ఉదంతం తర్వాత భారత్ వెంటనే భారత్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని సిబ్బందిని భారీగా కుదించింది. వాళ్లను తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశించింది. పాకిస్తాన్‌లోని భారతీయ హైకమిషన్‌లోనూ కొంత సిబ్బందిని వెనక్కివచ్చేయాలని సూచించింది. పాక్ కూడా అచ్చం అవే చర్యలకు దిగింది. మనం ఆపరేషన్ సిందూర్ అని పేరు పెడితే తానూ ‘ఆపరేషన్ బున్యాన్ మో§అల్ మర్సూస్’ అని నామకరణం చేసింది. మోదీ బాటలో షహబాజ్... ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన ఎయిర్‌ఫోర్స్ బలగాలను మెచ్చుకునేందుకు ప్రధాని మోదీ పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. సుదర్శన చక్ర(ఎస్–400) గగనతల రక్షణ వ్యవస్థ ఎదుట ఎయిర్‌ఫోర్స్ క్యాప్ ధరించి జవాన్లనుద్దేశిస్తూ ప్రసంగించారు. మర్నాడే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అచ్చం ఇలాగే చేశారు. సియాల్కోట్లోని పస్రూర్ కంటోన్మెంట్లో యుద్ధట్యాంక్పై నిలబడి సైనిక యూనిఫామ్‌లో జవాన్లనుద్దేశించి ప్రసంగించారు. గూఢచర్యం ఆరోపణలపై ఢిల్లీలోని పాక్ హై కమిషన్ ఉద్యోగిని బహిష్కరిస్తే మర్నాడే పాక్ కూడా అదే పనిచేసింది. నిజానికి ఆ భారత ఉద్యోగిని కేంద్రం అప్పటికే వెనక్కి రప్పించడం ఇందులో కొసమెరుపు!
జాతీయం

బెంగళూరులో భారీ వర్షం.. కర్ణాటక అతలాకుతలం.. షాకింగ్ వీడియోలు
బెంగళూరు: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజులు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు.. రెండు రోజులుగా కర్నాటకలో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం బెంగళూరు నగరంలో ఈ సీజన్లోనే అతిపెద్ద వర్ష పాతం నమోదైంది. దీంతో, రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో సహాయక చర్యలను పరిశీలించేందుకు వరద నీటిలోనే ఎమ్మెల్యే జేసీబీపై వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షం (rain) కురవడంతో వరదలు వచ్చాయి. మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, బాగలకుంటె, జక్కూరు, హొరమావు, శెట్టిహళ్లి, విశ్వేశ్వరపురా, విద్యాపీఠ, హెమ్మిగెపురా, సిల్క్ బోర్డులో ప్రాంతాలు నీట మునిగాయి. బెంగళూరు రూరల్, కోలార్, చిక్కబళ్లాపూర్, రామనగర, మైసూరు, హాసన్, తుమకూరు మరియు ఇతర జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. యలహంక, కేఆర్‌పురం, ఇతర ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.Silk Board Metro Station, Bengaluru…Congress is ruling the state so it’s ok…. pic.twitter.com/reKKwbMTdE— Mr Sinha (@MrSinha_) May 19, 2025 Today: Significant flooding in Bengaluru, Karnataka, India, leading to major traffic disruptions and impacting daily activities for residents. #BengaluruRains #KarnatakaRains pic.twitter.com/0Ph7vHBHUt— Weather Monitor (@WeatherMonitors) May 19, 2025భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బస్వరావు సహాయక చర్యలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోకి జేసీబీపై వెళ్లారు. స్థానికులను పరామర్శించి.. వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు.After hiking the price of bus ride and metro fare ; Karnataka Congress Govt to launch FERRY SERVICE? Seems so.Congress CM Siddaramaiah has 'gifted' people of Karnataka and Bengaluru especially lakes in the form of water stagnation.This is Congress govt for you. They can't… pic.twitter.com/dKvPLqTnUx— Cons of Congress (@ConsOfCongress) May 19, 2025 #bengalururains #BangaloreRains Avoid Koramangala 80 feet road with knee deep water and bus stranded in it. Video footage time 8 AM. pic.twitter.com/ctyhefMwH9— Agan (@ngrjms) May 19, 202522 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. బెంగళూరు సహా 22 జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. మే 22 వరకు ఉడిపి, బెలగావి, ధారవాడ, గడగ్, హవేరి ప్రాంతాల్లో 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు వారం రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు ప్రయాణించవద్దని సూచించింది. ಮುಂದಿನ 7 ದಿನಗಳ #ಹವಾಮಾನ #ಮುನ್ಸೂಚನೆ ಮತ್ತು #ಎಚ್ಚರಿಕೆಗಳು: (ಮೂಲ: IMD)ರಾಜ್ಯದಾದ್ಯಂತ ಅಲ್ಲಲ್ಲಿ ಗುಡುಗು, ಮಿಂಚು ಸಹಿತ ಕರಾವಳಿ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಚದುರಿದಿಂದ ವ್ಯಾಪಕವಾಗಿ ಸಾಧಾರಣ ಮಳೆ ಹಾಗೂ ಅಲ್ಲಲ್ಲಿ ಭಾರಿ ಮಳೆ, ದಕ್ಷಿಣ ಒಳನಾಡು ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಇಂದು ಮತ್ತು ನಾಳೆ, ಉತ್ತರ ಒಳನಾಡು ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಮೇ 19 ರಿಂದ 22 ರವರೆಗೆ ಹಾಗೂ pic.twitter.com/OHLsQQ5j6d— Karnataka State Natural Disaster Monitoring Centre (@KarnatakaSNDMC) May 19, 2025#BengaluruRains The Hennur-Bagalur Road, which is the alternative route to Kempegowda International airport in Bengaluru, was flooded. Motorists & traffic cops had a tough time. (📹 by TOI Syed Asif)@timesofindia pic.twitter.com/xZTRTU9Btv— TOI Bengaluru (@TOIBengaluru) May 19, 2025BANGALORE WATER PARK #Bengaluru #bengalurufloods #BengaluruRains pic.twitter.com/QpBqXmgl5T— Bihar Buzz (@buzz_bihar) May 19, 2025

జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు.. హైదరాబాద్, పూరీలో ఏం జరిగింది?
ఢిల్లీ: దాయాది పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తూ పలువురు భారతీయులు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పటికే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ కాగా, తాజాగా యూపీకి చెందిన షహజాద్ అనే వ్యక్తిని.. అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఉంటూ పాకిస్తాన్ కు కీలక సమాచారాన్ని అందిస్తున్నట్లు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. మరోవైపు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ జ్యోతి మల్హోత్రా జాడలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒకసారి చైనాకూ వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. పహల్గాం సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు నిర్ధరించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. Jyoti Malhotra met Mariyam Nawaz in Pakistan, Hindu influencers are trapped by ISI, Sources claimed ISI motto is to prepare a Hindu to do terrorist attack in IndiaNaam : Jyoti MalhotraKaam : Gaddari A Woke Girl Can never be a True Patriot!!#JyotiMalhotra #YouTuber pic.twitter.com/7H5mPMgoeb— Sumit (@SumitHansd) May 17, 2025హైదరాబాద్‌తో టచ్‌లో..జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్‌లోనూ కనిపించాయి. 2023 సెప్టెంబరులో ప్రధాని మోదీ వర్చువల్‌గా హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. తాజాగా ఆమె అరెస్ట్ కావడంతో అప్పటి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిశారా? కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారా? అన్న కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.YouTuber से जासूस तक: Jyoti Malhotra का चौंकाने वाला सफर #JyotiMalhotraArrested #JyotiMalhotraYoutuber #jyotimalhotra pic.twitter.com/UJ2PkufpSA— Rubika liyaquat (@RubikaLiyakatFC) May 19, 2025పూరీలోనూ జాడలు..ఇదిలా ఉండగా.. తాజాగా జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధంపై ఒడిశా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాక్‌కు గూఢచర్యం కేసులో జ్యోతితోపాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, ఆమెకు ఒడిశాలోని పూరీకి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు. ఆ విషయాన్ని పూరీ పోలీసు యంత్రాంగానికి తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.News Flash 🔴 ବେଶ୍ ନିବିଡ଼ ଥିଲା ଜ୍ୟୋତି ଓ ପ୍ରିୟଙ୍କାଙ୍କ ସମ୍ପର୍କ❗ପାକିସ୍ତାନ ପାଇଁ ଗୁପ୍ତଚରୀ ଅଭିଯୋଗରେ ଗିରଫ ୟୁଟ୍ୟୁବର ଜ୍ୟୋତି ମାଲହୋତ୍ରା ଲିଙ୍କର ଖୋଳତାଡ଼, ପୁରୀର ୟୁଟ୍ୟୁବର ପ୍ରିୟଙ୍କା ସେନାପତିଙ୍କୁ ଇଣ୍ଟେଲିଜେନ୍ସ ବ୍ୟୁରୋ ପରେ ପୁରୀ ପୋଲିସର ପଚରାଉଚରା ସୂଚନା #ONL #Jyoti #PriyankaSenapati #Puri #Odisha pic.twitter.com/WSbg7BziAi— OdishaNewsLive (@OdishaNews_Live) May 18, 2025 2024 సెప్టెంబరు 26న పూరీ వచ్చిన జ్యోతి.. ఇక్కడి శ్రీక్షేత్రాన్ని సందర్శించినట్లు తెలిసింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగారు. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల కళ్లున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథస్వామి దర్శనానికి వచ్చారా? లేక రెక్కీ చేసి, పాక్‌కు ఏదైనా సమాచారం అందించారా? అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ప్రియాంక మూడు నెలల క్రితం పాక్‌లోని కర్తార్‌పుర్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ దేశానికి ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అన్న అంశాలు కీలకంగా మారాయి.Puri: IB questioned Odisha YouTuber Priyanka Senapati over suspected Pakistan ties, following Jyoti Malhotra's espionage arrest. Jyoti had visited Puri last year, including the Jagannath Temple, raised security concerns due to sensitive footage.#JyotiMalhotra #PriyankaSenapati pic.twitter.com/MTjO5EuYh8— Ishani K (@IshaniKrishnaa) May 18, 2025 BIG BREAKING 🚨#YouTuber Jyoti Malhotra was arrested on charges of Spying for Pakistan.📍Pakistan Link According to an FIR, #JyotiMalhotra met Ehsan-ur-Rahim alias Danish, a Pakistan High Commission staffer in New Delhi, in 2023. Danish, her alleged handler, connected her… pic.twitter.com/dNRKDq5ogP— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) May 17, 2025

నాజిల్ సమస్యే!.. నాలుగో దశను కూల్చివేసిన ఇస్రో
పీఎస్ఎల్వీ.. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది నాలుగు అంచెల రాకెట్. ఈ రాకెట్లో తొలి, మూడో దశల్లో ఘన ఇంధనం వాడతారు. ఇక రెండు, నాలుగో దశల్లో ద్రవ ఇంధనం వినియోగిస్తారు. 101వ ఉపగ్రహం ‘రీశాట్-1బి’ని రోదసికి పంపేందుకు నేటి ‘శతాధిక’ ప్రయోగంతో కలిపి పీఎస్ఎల్వీతో ఇస్రో 63 ప్రయోగాలు నిర్వహించింది. వీటిలో ఈ రాకెట్ విఫలమైన సందర్భాలు మూడు. 2017 తర్వాత రాకెట్లో లోపం కనిపించడం ఇదే తొలిసారి. నిజానికి మూడో దశలో రాకెట్ ఫెయిల్ కావడం అరుదు. 114 సెకండ్లపాటు సాగే ఈ మూడో దశలో హెచ్టీపీబీ (హైడ్రాక్సిల్-టర్మినేటెడ్ పాలీబ్యూటడీన్) ఘన ఇంధన మోటార్ వాడతారు. ఈ ఇంధనం ఆదర్శ స్థితిలో 240 కిలో న్యూటన్ల చోదకశక్తి ఇస్తుంది. తాజా ప్రయోగ వైఫల్య కారణాలను నిగ్గుతేల్చేందుకు ఇస్రో నుంచి ఒకటి, ప్రభుత్వం నుంచి మరొకటి వంతున రెండు కమిటీలు రంగంలోకి దిగాయి. రాకెట్ వేగం, ఎత్తు, ఇంజిన్ల పనితీరు అంశాలపై అవి అధ్యయనం చేస్తాయి. మోటారులో ఇంధన ప్రవాహం సరిగా లేదా? నాజిల్ సమస్యలు తలెత్తాయా? మోటారు డిజైన్/తయారీపరమైన లోపాలున్నాయా? ఇలా పలు కోణాల్లో విశ్లేషణ కొనసాగనుంది. కచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ... రాకెట్ మూడో దశలో మోటార్ కేస్ లోపలి చాంబర్ ప్రెజర్లో అకస్మాత్తుగా పీడనం తగ్గడానికి ఫ్లెక్స్ నాజిల్ నియంత్రణ వ్యవస్థలో తలెత్తిన లోపమే కారణమని ఇస్రో ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. రాకెట్ వేగం, చోదక దిశలను నిర్దేశించేది ఈ కీలక భాగమే. ‘కంబశ్చన్ చాంబర్’లో ఇంధనం దహనమై విపరీత పీడనంతో వేడి వాయువులు నాజిల్ గుండా వెలుపలికి తన్నుకొస్తేనే రాకెట్ ప్రయాణం ముందుకు (పైకి) సాగుతుంది. ఈ ‘చర్యకు ప్రతిచర్య’ అనే మౌలిక సూత్రం ఆధారంగానే రాకెట్ పనిచేస్తుంది. రబ్బరు లాంటి స్థితిస్థాపక గుణం (లేయర్డ్ ఎలాస్టోమెరిక్) గల పదార్థాల పొరలతో ఫ్లెక్సిబుల్ నాజిల్స్ తయారవుతాయి. హైడ్రాలిక్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చి తద్వారా వాల్వులను కదిలిస్తూ ద్రవ/వాయు ప్రవాహాలను నియంత్రించేందుకు సాధారణంగా హైడ్రాలిక్ యాక్చువేటర్లను వినియోగిస్తుంటారు. వీటి పనితీరు సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే పీఎస్ఎల్వీ రాకెట్ మూడో దశ మోటారులో హైడ్రాలిక్ యాక్చువేటర్లు కాకుండా… పరిమిత కోణాల్లోనే అయినప్పటికీ అన్ని దిశల్లో కదులుతూ కచ్చితమైన చోదకశక్తిని అందించేందుకు ఫ్లెక్సిబుల్ బేరింగ్ గల ఫ్లెక్స్ నాజిల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థలో ఉత్పన్నమైన సమస్య వల్లనే తాజా ప్రయోగం విఫలమైనట్టు అనుమానిస్తున్నారు. నాజిల్ యాక్చువేటర్లు, ఫ్లెక్సిబుల్ జాయింట్, కంట్రోల్ సిగ్నల్స్... వీటిలో ఏదో ఒక సమస్య ఏర్పడి చాంబర్ ప్రెజర్లో పీడనం తగ్గి, మరింత ఎత్తుకు ప్రయాణించడానికి చాలినంత చోదకశక్తి లభించక రాకెట్ గతి తప్పడం ఆరంభించింది. దాన్ని అలాగే వదిలేస్తే జనావాసాలపై కూలి ప్రాణ-ఆస్తి నష్టం సంభవించే అవకాశముంది. అందుకే భద్రతా నిబంధనల ప్రకారం ఇస్రో దాన్ని ‘మిడ్ ఎయిర్-అబార్ట్’ చేసింది. అంటే... రాకెట్లో పేలోడ్ (ఉపగ్రహం) ఉన్న చివరిదైన నాలుగో దశను వేరే దారి లేక ఇస్రో కూల్చివేయాల్సి వచ్చింది.-జమ్ముల శ్రీకాంత్..

వీడియో: కంటతడి పెట్టించిన రైతు కష్టం.. స్పందించిన కేంద్రమంత్రి
ముంబై: ఇటీవల కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టించి పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాలు కురుస్తుండటంతో పంటను కాపాడుకునేందుకు ఎంతో కష్టపడుతున్నారు. తాజాగా వర్షం నీటిలో కొట్టుకుపోతున్న పంటను కాపాడేందుకు ఓ రైతు పడిన కష్టం వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఈ క్రమంలో బాధితుడితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన రైతు గౌరవ్ పన్వార్ తన వేరుశనగ పంటను అమ్ముకోవడానికి వాషిమ్ మార్కెట్‌కు తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా భారీ వర్షం కురవడంతో పంట నీటిలో కొట్టుకొనిపోయింది. దీంతో రైతు గౌరవ్ భారీ వర్షంలో తడుస్తూనే కొట్టుకుపోతున్న వేరుశనగను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ, వరద నీటిలో పంట కొట్టుకొనిపోయింది. ఈ హృదయవిదారక వీడియో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి రావడంతో.. స్వయంగా ఆయనే బాధిత రైతుకు ఫోన్ చేసి మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. వీడియోలో మాట్లాడుతూ..‘ఈ విషయం నన్ను చాలా బాధించింది. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తాం. మీరు, మీ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా చూస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలపై చాలా సున్నితంగా వ్యవహరిస్తోంది. దీనిపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాను. అంతా మంచే జరుగుతుంది’ అని అన్నారు. ▶️ This video will touch your heart.➡️ Union Minister for Agriculture and Farmers' Welfare and Rural Development, Shivraj Singh Chouhan says - “Seeing Gaurav Panwar’s video shook my heart. I spoke to him and assured support. No farmer will be left unheard - we stand… pic.twitter.com/N96OAq3zNO— Saurabh Dandariyal (@DandariyalUk) May 18, 2025
ఎన్ఆర్ఐ

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ గారు సింగపూర్ లో పనిచేస్తున్న తెలంగాణ మరియు ఇతర కార్మికులకు అందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మే డే సందర్భంగా సింగపూర్ లో మల్టీనేషనల్ కంపెనీ (Toa Corporation) లో పని చేస్తున్న అందరికీ దాదాపు 200 మంది కార్మికులకు పండ్లు, శీతల పానీయాలు అందజేసి ఆ కంపెనీకి అలాగే అందులో పని చేస్తున్న ప్రతి కార్మికుడికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన చెట్టిపల్లి మహేష్ తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి ,చల్ల కృష్ణ మొదలగు వారు అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా “రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – “85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు” అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తినికల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘననివాళులర్పించారు. విశిష్టఅతిథులుగా - ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు), రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు), డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు), చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు), మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి), గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించి వారిరువురికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఒక సంస్థ ఎనిమిదన్నర దశాబ్దాలగా నిరాటంకంగా కొనసాగడం ఒక చరిత్ర అని, ఏ ఆశయంతో రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఈ బాలానందం స్థాపించారో, అదే స్ఫూర్తితో ఉత్సాహంగా ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి (పాప) వారి కార్యవర్గ సభ్యులకు, ఈ నాటి కార్యక్రమంలో శ్రావ్యంగా పాటలు పాడి ఆనందపరిచిన 25 మందికి పైగా పిల్లలకు, పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.
క్రైమ్

మాజీ ప్రధానిగా నటనకు ప్రశంసలు, హత్యాయత్నం కేసులో అందాల నటి
ఆమె ఒక అందాల నటి. తన నటనా చాతుర్యంతో అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయింది. ఢాకాలోని షాజహాన్ లాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం కేసులో ఆదివారం ఆమెను అరెస్టు చేశారు. ఇంతకీ ఎవరా నటి? ఆమె చేసిన తప్పేంటి? పోలీసలు ఆమెపై ఎందుకు కన్నేశారు? తెలుసుకుందాం.హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను అరెస్ట్ చేసిన పోలీసులు గట్టి భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు. ఢాకాలోని స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించడంతో ఆమెను జైలులోనే ఉండనుంది. దీనిపై నుస్రత్ ఫరియా న్యాయవాది బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీన్ని ఈ నెల(మే) 22న విచారిస్తుంది. గత సంవత్సరం షేక్ హసీనా ప్రభుత్వం కూల్చివేత, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దారితీసిన నిరసనలతో ఈ అరెస్ట్ ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నుస్రత్ ఫరియాపై అవామీ లీగ్‌కు నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.నివేదికల ప్రకారం ఫరియా థాయిలాండ్‌కు వెళ్లాల్సి ఉండగా విమానాశ్రయంలో పోలీసులు అడ్డకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి హసీనా పాత్రను ఫరియా పోషించి పాపులర్ అయింది ఫరియా. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్' చిత్రంలో హసీనా పాత్ర ఫరియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2023నాటి ఈ మూవీకి శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్ , భారతదేశం కలిసి నిర్మించగా అరిఫిన్ షువూ టైటిల్ పాత్రలో నటించారు.చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్గత నెల వరకు,హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత సంవత్సరం జరిగిన నిరసనలకు సంబంధించి కనీసం 137 మంది జర్నలిస్టులు 32 కేసుల్లో చిక్కుకున్నారు. కేసులోని వివరాల ప్రకారం నుస్రత్ ఫరియా, నటుడు అపు బిశ్వాస్, నిపున్ అక్తర్, అష్నా హబీబ్ భబ్నా, జాయెద్ ఖాన్ మరో 12 మందితో కలిసి భటారా ప్రాంతంలో జరిగిన వివక్ష వ్యతిరేక ఉద్యమం సందర్భంగా నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. షేక్ హసీనా, 283 మందిపై కూడా ఇదే కేసులో ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారా ఎన్నుకునే వరకు పాలనను నిర్ధారించేలా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, కొంతమందివ్యక్తులను, పత్రికలను లక్ష్యంగా చేసుకున్నట్లు పౌర హక్కుల సంస్థలు, నేతలు మండి పడుతున్నారు. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి, తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటి నుండీ ఉగ్రవాదులు జైలు నుండి విడుదలవుతున్నారు. ప్రస్తుత పాలనలో ఉగ్రవాదులకు మద్దతుగా, భారత వ్యతిరేక స్వరాలకు ఊతమిచ్చినట్టవుతోందనే విమర్శలు బాగా విని పిస్తున్నాయి. నుస్రత్ ఫరియా 2013లో టెలివిజన్ యాంకర్‌గా పనిచేసింది. అందుకు ముందు రేడియో జాకీగా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆమె కొన్ని నాటకాల్లో కూడా నటించింది. 2015లో బంగ్లాదేశ్-భారత్ సంయుక్తంగా నిర్మితమైన ‘ఆషికి’ ద్వారా వెండితెరకు పరిచయం మంది. అరంగేట్రంలోనే అందరి దృష్టినీ తమనవైపు తిప్పుకుంది. అనేక సినిమాల్లో నటించింది. ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..!

అంతా నా ఇష్టం..
నంగునూరు(సిద్దిపేట): ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తుండటంతో పోలీసులకు సైతం తలనొప్పులను తెస్తోంది. ఇటీవల ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితుల ఎదుటే సిబ్బందిపై చిందులు తొక్కడంతో అక్కడే ఉన్న ఎస్ఐ, పోలీసులు అవాక్కయ్యారు. ఇంత జరుగుతున్నా ఆమెపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో సివిల్ వివాదాల్లో సహితం జోక్యం చేసుకుంటున్నారు. రెండు రోజుల కిందట ఏకంగా మండల మెజి్రస్టేట్, తహసీల్దార్‌కు ఫోన్ చేసి రిజి్రస్టేషన్ ఆపాలని చెప్పడంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్.. రిసెప్షన్ గదిలో విధులు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుగా ఆమెనే కలవాల్సిరావడం అనుకూలంగా మార్చుకున్నారు. కేసులకు సంబంధించిన ఫిర్యాదులో జోక్యం చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారం రోజుల కిందట తనపై అధికారిపై ఎస్ఐ, సిబ్బంది, బాధితుల ఎదుటే వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ ఆపాలంటూ తహసీల్దార్‌కు ఫోన్.. నంగునూరుకు చెందిన ఓ వ్యక్తి తన కూతురు పేరిట రెండెకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు శనివారం స్లాట్ బుక్ చేసుకున్నాడు. రిజి్రస్టేషన్ చేయొద్దని అతని కుమారుడు అడ్డు చెప్పడంతో వివాదం రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ఈ విషయంపై మహిళా హెడ్‌కానిస్టేబుల్ రిజి్రస్టేషన్ ఆపాలని తహసీల్దార్‌కు ఫోన్ చేయడంతో ఆశ్చర్యానికి గురైన సదురు అధికారి.. ఎస్ఐకి, మరో ఉన్నతాధికారికి ఫోన్ చేసిన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రిసెప్షనిస్ట్ విధుల నుంచి తొలగించాం ఈ విషయమై రాజగోపాల్‌పేట ఎస్ఐ ఎండీ అసీఫ్ను వివరణ కోరగా.. మహిళా హెడ్ కానిస్టేబుల్ తహసీల్దార్‌కు ఫోన్ చేయడం నిజమేనన్నారు. దీంతో తహసీల్దార్ సరిత తనతో పాటు ఏసీపీతో ఫోన్లో మట్లాడారన్నారు. ఆమెను రిసెప్షనిస్ట్ విధుల నుంచి తొలగించి సాధారణ విధులు అప్పగించామన్నారు.

పాతబస్తీలో అంతులేని విషాదం
ఆదమరచి నిద్రపోయిన ఆ కుటుంబ సభ్యులకు అదే శాశ్వత నిద్ర అని తెలియలేదు. రోజు మాదిరిగానే నిద్రపోయినా...రోజు మాదిరిగా నిద్ర లేవలేదు. ఎగసిన అగ్నికీలలు.. ఉక్కిరి బిక్కిరి చేసిన పొగతో నిద్ర నుంచి మేల్కొన్నా.. ఏం జరిగిందో తెలియక.. ఎటు వెళ్లాలో అర్థంకాక.. అంటుకున్న మంటలతో కాలిన గాయాలై కొందరు, దట్టమైన పొగతో ఊపిరాడక మరికొందరు మృత్యు ఒడికి చేరిపోయారు. ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్ సమీపంలోని ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది చిన్నారులు సహా 17 మంది మృతిచెందడం పాతబస్తీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మంటల కంటే పొగపీల్చి ఎక్కువ మంది కన్నుమూశారు.విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబాలకు కుటుంబాలే అగ్నికి ఆహుతి అవడం వారిని తీవ్రంగా కలచివేసింది. ఒక అగ్నిప్రమాదంలో ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం నగర చరిత్రలోనే మొదటిసారని తెలిసి.. ‘అయ్యో ఇలా జరిగిందేంటి’ అనుకుంటూ స్థానికులంతా సానుభూతి వ్యక్తం చేశారు. మృతదేహాలను తరలిస్తున్న హృదయ విదారక దృశ్యాలు చూసి కన్నీరుపెట్టారు. రద్దీ పెరిగితే.. ముప్పు పెరిగేది! సాక్షి, సిటీబ్యూరో: దివాన్ దేవిడీలోని మదీనా అండ్ అబ్బాస్ టవర్స్... దిల్‌సుఖ్‌నగర్‌లోని చందనా బ్రదర్స్... కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్... బషీర్‌బాగ్‌లోని మొఘల్ కోర్ట్‌లో ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ... నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా... పంజాగుట్టలోని మీనా జ్యువెలర్స్... ఇలా నగరంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదాలన్నీ రాత్రి వేళల్లో చోటు చేసుకున్నాయి. ఫలితంగా అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి మంటలను అదుపు చేయగలిగాయి. పాతబస్తీలో ఆదివారం నాటి ‘మోదీ ఇంట్లో’ ఉదంతం కూడా తెల్లవారుజామున జరిగింది. మరికొంత ఆలస్యంగా జరిగి ఉంటే చార్మినార్‌తో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలు జనసమర్థంగా మారేవి. రోడ్లన్నీ వాహనాలతో నిండేవి. ఒకవేళ రోడ్లు రద్దీగా ఉండే పగటి వేళ ఇలాంటి ప్రమాదాలు జరిగితే... నష్టం అపారంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో ఉండే రోడ్లు, నిర్మాణాలు, ట్రాఫిక్ నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన విధంగా ఫైర్ స్టేషన్లు, ఫైర్ ఇంజన్లు లేకపోవడమే దీనికి కారణం. ఈ అంశంలో 2016 నాటి ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ సిఫార్సులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. నిబంధనలు... వాస్తవాలు... 1. నిబంధనల ప్రకారం నగరంలో ప్రతి 5 చదరపు కిమీలకు ఒక అగ్నిమాపక శకటం అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం 15 నుంచి 20 చదరపు కిమీకి ఒకటి చొప్పున అందుబాటులో ఉన్నాయి. ప్రతి 50 వేల మంది రక్షణకు ఓ అగ్నిమాపకశకటం అవసరం. ఈ రకంగా చూస్తే గ్రేటర్లో కనీసం 250 ఫైర్ ఇంజన్లు అవసరం. ఇప్పుడు ఇందులో కనీసం సగం కూడా అందుబాటులో లేవు. అగ్నిమాపక శకటం గంటకు 100 కిమీ వేగంతో ప్రయాణించగలగాలి. ఇటీవల విడుదలైన టామ్ టామ్ నివేదిక ప్రకారం చూసినా ప్రస్తుతం నగరంలో వాహనాల సరాసరి వేగం 20 నుంచి 25 కిమీ మించట్లేదు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు గరిష్టంగా 15 నిమిషాల్లో అగ్నిమాపక శకటం అక్కడకు చేరాలి. అయితే ప్రస్తుతం నగర రోడ్ల పరిస్థితిని బట్టి రద్దీ వేళల్లో ఏ వాహనమైనా ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లాలంటే కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది. బహుళ అంతస్తు భవనాల్లో మంటల్ని ఆర్పడానికి ఉపకరించే హైడ్రాలిక్ ఫైరింజన్ కేవలం సికింద్రాబాద్‌లోనే ఉంది. వీటికి తోడు అగ్నిమాపక శాకలో ఉండాల్సిన మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది సంఖ్యతో ఇబ్బంది ఉండనే ఉన్నాయి. 2016లో పార్లమెంట్ అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. దీని అధ్యయనం ప్రకారం పరిధిని బట్టి కాకుండా సమాచారం తెలిసిన తర్వాత ఘటనాస్థలికి చేరడానికి పట్టే సమయం (రెస్పాన్స్ టైమ్) ఆధారంగా ఫైర్ స్టేషన్లు ఉండాలని సిఫార్సు చేసింది. ఈ రెస్పాన్స్ టైమ్ నగరాలు, పట్టణాల్లో ఐదు నుంచి ఏడు నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 20 నిమిషాలుగా నిర్ధారించింది. ఈ స్థాయిలో ఫైర్స్టేషన్ల ఏర్పాటు కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని, రాష్ట్రాలకు అవసరమైన నిధులు కేటాయించాలని సిఫార్సు చేసింది. ఇవన్నీ ఇప్పటికీ ఫైళ్లకే పరిమితమయ్యాయి.పేరులోనే ఫైర్! సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర అగ్నిమాపక సేవల చట్టం కోరల్లేని పాములాగా తయారైంది. తరచుగా భారీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ఉల్లంఘనదారుల్లో భయం కనిపించడంలేదు. ఈ చట్టం కింద అభియోగాలు నమోదు చేసే ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. ఒకవేళ నేరం రుజువైనా పెద్దగా శిక్షలు లేకపోవడం, నామమాత్రపు జరిమానాలే ఉండటం ఇందుకు కారణం. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏపీ ఫైర్ సరీ్వసెస్ యాక్ట్. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టమే ఇప్పటికీ వినియోగంలో ఉండటమే ప్రధాన కారణం. పోలీసులు ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే తప్ప నిందితులను అరెస్టు చేసే అవకాశం లేకపోవడంతో అగ్ని మాపక సేవల చట్టం నామమాత్రంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అగి్నమాపక శాఖ ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ ఉల్లంఘనలు గుర్తించినా నేరుగా చర్యలు తీసుకునే అవకాశం లేకుండాపోయింది. పలు మార్లు నోటీసులు జారీ చేసి.. గడువిచ్చాక డీజీ అనుమతి మేరకు విచారణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కేసు నమోదు చేసి నివేదికను న్యాయస్థానంలో సమరి్పస్తారు. ఏళ్ల తరబడి విచారణ జరిగిన తర్వాత చాలా కేసులు సరైన ఆధారాల్లేక వీగిపోతుంటాయి. ఒకవేళ కేసు రుజువైనా అగ్నిమాపక సేవల చ ట్టం ప్రకారం పడే జరిమానా రూ.వేలల్లోనే ఉంటుంది. శిక్షలు తక్కువే.. ఏదైనా నేరానికి సంబంధించి పోలీసు విభాగం ఐపీసీ కింద కేసు నమోదు చేస్తుంటుంది. నేరం, నేరగాడి తీరుతెన్నుల్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుంది. ఆపై జైలు, బెయిలు, కోర్టులో కేసు విచారణ తదితరాలు ఉంటాయి. అదే ఫైర్ సరీ్వసెస్ యాక్ట్ వద్దకు వచ్చేసరికి ఆ చట్టం, అగి్నమాపక శాఖకు ఉన్న అధికారాలు వేరు. వీళ్లు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మినహా అరెస్టుకు ఆస్కారం లేదు.ఈ కేసు కోర్టు వరకు వెళ్లినా సాధారణ కేసుల్లా విచారణ ఉండదు. అది ఎందరి ప్రాణాలు తీసిన ఉదంతం, ఎంత తీవ్రమైన ఉల్లంఘన అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ కేసుల విచారణ సివిల్ కోర్టుల్లో సమరీ ట్రయల్ విధానంలో జరుగుతుంది. ఈ చట్టంలోని అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 90 శాతం ఉల్లం ఘనలకు జరిమానా మాత్రమే విధించే ఆస్కారం ఉంది. మిగిలిన వాటిలోనూ గరిష్ట శిక్ష కేవలం 3 నెలలు మాత్రమే. ఈ సెక్షన్లకు సంబంధించిన ఉల్లంఘనల్లోనూ పెనాల్టీ విధించే ఆస్కారం ఉంది. కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు లేకపోవడంతో ఉల్లంఘనదారుల్లో భయం లేదని అభిప్రాయం వెల్లడవుతుంది.ఏళ్లుగా నిరీక్షణ.. తెలంగాణ అగ్నిమాపక శాఖ 2020 జూన్‌లో అగ్ని మాపక చట్టానికి పలు సవరణలు సూచిస్తూ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించింది. భారీ జరిమానాలు, జప్తు చేయడం తదితర కఠిన నిబంధనలు ఇందులో చేర్చారు. వీటికి ఆమోదం లభిస్తే ఢిల్లీ తర్వాత దేశంలోనే బలమైన చట్టం గల రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అగ్నిమాపక శాఖ నమోదు చేసిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌కు సంబంధించినవే ఉన్నాయి. గత దశాబ్ధ కాలలో నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. ఆకాశహార్మ్యాలు, వాణిజ్య భవనాలు కోకొల్లలుగా వెలిశాయి. ఈ స్థాయిలో అగ్నిమాపక శాఖ కూడా అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక యంత్రాలు, రోబోలతో పాటు చట్ట సేవరణ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అగ్నిమాపక శాఖ 2020 జూన్‌లో అగ్నిమాపక చట్టానికి పలు సవరణలు సూచిస్తూ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించింది. భారీ జరిమానాలు, జప్తు చేయడం తదితర కఠిన నిబంధనలు ఇందులో చేర్చారు. వీటికి ఆమోదం లభిస్తే ఢిల్లీ తర్వాత దేశంలోనే బలమైన చట్టం గల రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

తమ్ముడి మృతితో ఆగిన అక్క పెళ్లి
ఆలూరు రూరల్(కర్నూలు): అందరూ వివాహ వేడుకల్లో ఆనందంగా ఉన్నారు. మరి కొద్ది గంటల్లో కల్యాణ తంతు నిర్వహించాల్సి ఉంది. ఇంతలోనే విషాదం. వధువు తమ్ముడు రోడ్డు ప్రమా దంలో దుర్మరణం చెందడంతో అక్క వివాహం నిలిచిపోయింది. శనివారం రాత్రి హుళేబీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆస్పరికి చెందిన ఆనంద్ (19) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని స్నేహితులు పూర్ణచంద్ర, తిమ్మప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆదోని ఆస్పత్రిలో పూర్ణచంద్ర, కర్నూలు ఆస్పత్రిలో తిమ్మప్ప చికిత్స పొందుతున్నారు. ఆస్పరికి చెందిన తిమ్మన్న, శుకుంతల కుమారుడు ఆనంద్.. కాగా అతని సోదరి వివాహం హొళగుంద మండలం వందవాగిలి గ్రామంలో ఆదివారం ఉదయం జరగాల్సి ఉంది. ఆనంద్, పూర్ణచంద్ర, తిమ్మప్ప గుంటూరులోని ఆర్‌వీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. పూర్ణచంద్ర స్వగ్రామం ప్రకాశం జిల్లా కంభం గ్రామం కాగా తిమ్మప్పది ఆస్పరి మండలం చిగిళి గ్రామం. శనివారం రాత్రి ఆనంద్ సోదరి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ మృతితో అతని సోదరి పెళ్లి ఆగిపోయింది. అక్క పెళ్లికి వచ్చి తమ్ముడి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.ఎమ్మెల్యే పరామర్శ.. ఆనంద్ మృతి బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆదివారం ఆయన ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆనంద్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వీడియోలు


రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!


అల్లు అర్జున్ తో నిహారిక లవ్ స్టోరీ


కమ్మేస్తోన్న కరోనా కాటేరమ్మ కొడుకునూ వదలని వైరస్


సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ


అందాల పోటీల మీదనే కాదు.. ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టాలి: కేటీఆర్


గుల్జార్ హౌస్ లో అసలేం జరిగింది?


YSRCP కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన టీడీపీ గూండాలు


ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు


పాక్‌కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం


ఓటమి భయంతో YSRCP నేతలపై దాడి