Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Meets With Public Representatives Of Local Bodies Updates1
మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం: వైఎస్‌ జగన్‌

తాడేపల్లి: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు. కేసులకు, జైళ్లకూ భయపడకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి:’’ అంటూ వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మంగళవారం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్‌ జగన్‌.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.మన హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం స్వీప్‌ చేశాం. తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16. టీడీపీ వాళ్లని లాక్కుందామని ఎమ్మెల్యే అడిగాడు. కాని, మన పార్టీ ఎమ్మెల్యేను మనం హౌస్ అరెస్ట్‌ చేయించాం. ప్రజాస్వామ్యంగా అక్కడ ఎన్నిక జరిగేలా చూశాం, కాబట్టే అక్కడ టీడీపీ గెలిచింది. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా, చివరకు టీడీపీ వాళ్ల సమస్యలనూ తీర్చాం. జగనన్నకు చెబుదాం నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు వెంటనే స్పందించి పరిష్కారం చూపాం. స్పందన కార్యక్రమం ద్వారా కూడా వివక్ష లేకుండా పరిష్కారాలు చూపాం. అత్యధికంగా టీడీపీ వాళ్లకు చెందిన సమస్యలకు పరిష్కారాలు చూపి మంచి పరిపాలన అందించాం. ఇవాళ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీచేస్తున్నాడు’’ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..👉స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు👉తిరువూరులో సంఖ్యాబలం లేని చోటకూడా టీడీపీ పోటీకి పెట్టి, లాగేసుకునే ప్రయత్నంచేస్తోంది👉అయినా సరే మెజార్టీ వైయస్సార్‌సీపీ ఉండడంతే ఎన్నికను ఆపుతున్నారు:👉పోలీసులు వైయస్సార్‌సీపీ వాళ్లని అరెస్టు చేస్తున్నారు, టీడీపీ వాళ్లని రోడ్డుపై విడిచిపెడుతున్నారు👉సంఖ్యాబలం లేకపోయినా నర్సారావుపేట, కారంపూడిల్లో గెలిచామని ప్రకటించుకున్నారు👉కుప్పం మొదలుకుని ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే👉రాప్తాడులో రామగిరి ఉప ఎన్నికలో అరాచకాలకు అంతులేదు👉ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గుర్తుమీద, ఒక పార్టీ బి-ఫాం మీద గెలిచినప్పుడు, సంఖ్యాబలంలేకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్లు అక్రమాలను ప్రోత్సహించడం ఎంతవరకూ సమంజసం👉పోలీసులను పెట్టి బెదిరిస్తున్నారు👉యలమంచిలిలో మన వాళ్లు గట్టిగా నిలబడి గెలుపును సాధించుకున్నారు👉ఏ ప్రభుత్వంపైన అయినా వ్యతిరేక రావాలంటే సమయం పడుతుంది👉కాని చంద్రబాబుగారి పరిపాలనలో నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది👉మనకన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు👉జగన్‌ ఇచ్చేవన్నీ ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు👉కాని వాటన్నింటినీ తుంగలో తొక్కాడు 👉కాని, మన ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త మనం అమలు చేసిన మేనిఫెస్టోతో ప్రతి ఇంటికీ వెళ్లాడు👉గడపగడపకూ కార్యక్రమం కింద మూడుసార్లు ప్రతి ఇంటికీ వెళ్లారు:👉99శాతం హామీలను అమలు చేసిన పార్టీ భారతదేశ చరిత్రలో వైయస్సార్‌సీపీ మాత్రమే👉మనం చేసిన మంచి ఎక్కడకూ పోదు👉10 శాతం ప్రజలు చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మారు👉ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్‌బాల్‌ తన్నినట్టు ఈ ప్రభుత్వాన్ని తంతారు👉వైఎస్సార్‌సీపీ మాదిరిగా ప్రతి ఇంటికీ వెళ్లే ధైర్యం టీడీపీకి ఉందా?👉హామీల అమలుపై గట్టిగా నిలదీస్తారనే భయం వారికి ఉంది👉మాట ఇవ్వడం అంటే వెన్నుపోటు మాత్రమే అని చంద్రబాబుగారు నిరూపించారు👉పేదవాడి వైద్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు👉ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు👉రూ.3600 కోట్లు పెండింగ్‌లో పెట్టారు👉ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు👉వైద్యంకోసం అప్పులు పాలు అయ్యే పరిస్థితి👉ఏ పంటకూ కనీస మద్దతు ధర రావడంలేదు👉ప్రభుత్వం రంగంలో వైయస్సార్‌సీపీ తీసుకొచ్చిన కాలేజీలను చంద్రబాబు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నాడు:👉కొత్తగా మూడు పోర్టులు నిర్మాణం ప్రారంభించాం👉శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లాం👉ఇప్పుడు ఆమూడు పోర్టులను కమీషన్లకోసం అమ్మేసేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడు👉ట్రైబల్‌ ప్రాంతాన్ని అభివృద్ధి పథాన నడిపించాం👉ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు, ట్రైబల్‌ యూనివర్శిటీ, మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు పెట్టాం👉బోగాపురం ఎయిర్‌పోర్టుకు గత చంద్రబాబు హయాంలో అనుమతులు లేవు, భూసేకరణ లేదు👉మనం అన్నీచేసి 30శాతం పనులు చేశాం👉రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి పనులు కేవలం వైయస్సార్‌సీపీ హయాంలోనే జరిగాయి👉ఈరోజు ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి👉వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నాడు👉ప్రజలను వెన్నుపోటు పొడిచాడు👉ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పరిస్థితులను తీసుకు వచ్చాడు👉రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు👉ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నాడు👉చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు👉తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారు 👉గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు👉పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు👉ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాను👉జగన్‌ 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది👉కోవిడ్‌ కారణంగా ఐదేళ్లపాలనలో అనుకున్నంతమేర సరిగ్గా చేయలేకపోయాం👉ఇవాళ మీ కష్టాలను చూస్తున్నాను 👉రేపు కచ్చితంగా వై​ఎస్సార్‌సీపీకి కార్యకర్తే నంబర్‌ ఒన్‌👉అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి👉కొడతానంటే.. కొట్టమనండి👉కాని, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి👉కాని, ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం👉రిటైర్డ్‌ అయిన వారినీ లాక్కుని వస్తాం👉దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం👉అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం👉మనకూ టైం వస్తుంది👉చంద్రబాబు నాటిని విత్తనాలు.. కచ్చితంగా ఈ పరిస్థితులకు దారితీస్తాయి👉చంద్రబాబు దుర్మార్గపు పాలనవల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డవారి కథలు వింటే చాలా ఆవేదన కలుగుతోంది👉మహిళలను అని చూడకుండా నెలలతరబడి జైళ్లలో పెడుతున్నారు👉ఒక కేసులో బెయిల్‌ వస్తుంది, అది రాగానే మరో కేసు పెడుతున్నారు👉ఇలా కేసులు మీదు కేసులు పెడుతన్నారు👉వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చేశారు👉దళితుడైన ఎంపీ నందిగం సురేష్‌ విషయంలోనే ఇలాగే దారుణాలు చేస్తున్నారు👉సుమారు నెలన్నరకుపైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కేసుపెట్టి జైల్లో వేశారు👉తనను, తన కుటుంబ సభ్యులను తిడితే, ఎందుకు తిట్టావన్నందుకు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు👉చంద్రబాబు ఇవాళ నాటిన విత్తనం రేపు మహావృక్షం అవుతుందని మరిచిపోవద్దు👉రాబోయే రోజుల్లో ప్రజల తరఫున గట్టిగా పోరాటాలు చేద్దాం👉వచ్చేది మన ప్రభుత్వమే👉మంచి రోజులు కచ్చితంగా వస్తాయి

Tiruvuru Municipal Chairman Election Postponed Indefinitely2
తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా

సాక్షి, విజయవాడ: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా పడింది. కోరం లేక ముగించిసనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. నిన్న, ఈ రోజు టీడీపీ అరాచకం వల్ల ఎన్నిక జరగలేదు. ఎన్నికలు జరగకుండా టీడీపీ గూండాలు అల్లర్లు సృష్టించారు. టీడీపీ గూండాల బీభత్సంతో రెండు రోజులు ఎన్నిక జరగలేదు. వైసీపీ కౌన్సిలర్లు తిరువురు వెళ్లకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.హైకోర్టు చెప్పినా కానీ పోలీసులు భద్రత కల్పించలేదు. టీడీపీ నేతల దాడితో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఎన్నికకు హాజురుకాలేకపోయారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కౌన్సిల్ సభ్యులు రాకపోవడంతో ఆర్డీవో కే.మాధురి ముగించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం తదుపరి కార్యచరణ ఉంటుందని ఆర్డీవో ప్రకటించారు.దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసు వాహనం ఎక్కనివ్వకుండా టీడీపీ టీడీపీ నేత రమేష్ రెడ్డి, టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై కూడా టీడీపీ గూండాల దాడి చేశారు. దేవినేని అవినాష్ , మొండితోక అరుణ్ కుమార్‌లను రెడ్డిగూడెం స్టేషన్‌కు పోలీసులు తరలిస్తున్నారు.

Kaleshwaram Commission Issues Notice to Kcr and Harish Rao and Etela Rajender3
కేసీఆర్‌,హరీష్‌ రావు,ఈటలకు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు

సాక్షి,హైదరాబాద్‌: కేసీఆర్, హరీష్, ఈటల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది.15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని గడువు ఇచ్చింది. వ‌చ్చే జూన్ 5న కేసీఆర్‌, జూన్ ఆరున హ‌రీష్ రావు,తొమ్మిదిన ఈటెల రాజేంద‌ర్ విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశాలు జారీ చేసింది

Tdp Conspiracy Politics In Tiruvuru Municipal Chairman Elections4
వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడి

👉వైఎస్సార్‌సీపీ నేతలు అరెస్ట్‌దేవినేని అవినాష్‌, అరుణ్‌కుమార్‌లు అరెస్ట్‌తిరువూరు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులురెడ్డిగూడెం స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు👉తిరువూరులో టీడీపీ గూండాల అరాచకంవైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడిదేవినేని అవినాష్‌, అరుణ్‌కుమార్‌ వాహనాలపై దాడివైఎస్సార్‌సీపీ నేతల కారు అద్దాలు పగలగొట్టిన టీడీపీ గూండాలుదారికాసి వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ గూండాలుఎ.కొండూరు మండలం రేపూడి క్రాస్‌ వద్ద టీడీపీ గూండాల విధ్వంసంసాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు బరి తెగించేశారు.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, వైసీపీ నేతలను తిరువూరు వెళ్లకుండా చేసేందుకు కుట్రలకు తెరతీశారు. తిరువూరు వెళ్లే మార్గంలో రామచంద్రాపురం, చీమల పాడు వద్ద టీడీపీ.. భారీగా కార్యకర్తలను మోహరింపచేసింది. వైఎస్సార్‌సీపీ నేత స్వామిదాస్‌ ఇంటిని టీడీపీ గూండాలు ముట్టడించారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల కుటుంబసభ్యులపై టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగారు.వైఎస్సార్‌సీపీ నేతల్ని దారికాసి టీడీపీ గూండాలు అడ్డగించారు. అవినాష్‌, స్వామిదాస్‌ అరుణ్‌ వాహనాలను అడ్డగించారు. వాహనాలు కదలకుండా టీడీపీ గూండాలు చుట్టుముట్టారు. అవినాష్‌, స్వామిదాస్‌పై టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది. 13వ వార్డు కౌన్సిలర్‌ తండ్రితో టీడీపీ ఫిర్యాదు చేయించింది. ఓటమి భయంతో టీడీపీ గూండాలు దౌర్జన్యాలు చేస్తున్నారు. కాగా.. భద్రత కల్పించడంలో ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలను కూడా పోలీసులు లెక్కచేయడం లేదు. తిరువూరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల రక్షణ విషయంలో వితండవాదం చేస్తున్నారు.తిరువూరు వస్తేనే భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. నిన్న టీడీపీ గూండాల దాడితో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ఎన్నిక జరిగే వరుకు కౌన్సిల్‌ హాలు వరకు రక్షణ కల్పించాలని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఈసీకి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్‌ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి నేటికి (మంగళవారం) వాయిదా వేశారు.

Gold and silver rates today on market in Telugu states5
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం పసిడి ధరలు కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,100 (22 క్యారెట్స్), రూ.95,020 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.450, రూ.490 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,020 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.450 దిగి రూ.87,250కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.490 తగ్గి రూ.95,170 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినట్లే వెండి ధరల్లోనూ(Silver Price) మార్పులొచ్చాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే మంగళవారం కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,08,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

New evidence emerges in Jyoti Malhotra espionage case6
NIA విచారణ, జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు

చండీఘడ్‌: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఎన్‌ఐ విచారణలో ఆమె పాకిస్తానీ ఏజెంట్లతో నేరుగా సంబంధాలు కొనసాగించిందని, వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్‌క్రిప్టెడ్‌ డివైజ్‌లు వినియోగించిన‌ట్లు తేలింది. ఎన్ఐఏ విచార‌ణ‌లో ఆమె సోషల్ మీడియాను వీడియోలు పోస్టు చేస్తూ ప్ర‌పంచానికి తాను వ్లాగ‌ర్‌గా ప్ర‌మోట్ చేసుకుంటుంది. కానీ అస‌లు విష‌యం ఏంటంటే? ఎన్‌క్రిప్టెడ్ డివైజ్‌ల‌ను ఉప‌యోగించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాకిస్తానీ ఏజెంట్లతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉండేద‌ని హర్యానా పోలీసులు తెలిపారు. హర్యానా రాష్ట్రం హిస్సార్‌కు చెందిన జ్యోతి ‘ట్రావెల్‌ విత్‌ జో’పేరిట ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 3.77 లక్షల మంది సబ్‌స్కైబ‌ర్లు ఉన్నారు. ఈమె ట్రావెల్‌విత్‌జో1 ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. అమె తీసిన యూట్యూబ్ వీడియోలు, సోష‌ల్ మీడియా పోస్టుల్లో భారతీయుల‌కు పాకిస్తాన్ మంచి దేశంగా చూపించే ప్ర‌య‌త్నం చేయ‌డం,ఉగ్ర‌దాడికి ముందు ప‌హ‌ల్గాంలో ప‌ర్య‌ట‌న, ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాల‌యం ఉద్యోగి ఇషాన్ దార్‌తో స‌న్నిహితంగా ఉండ‌డంతో మే 16న జ్యోతిపై సివిల్‌ లైన్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ ఐఆర్ న‌మోదైంది.గూఢ‌చ‌ర్యం కేసులో ఆమెను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ విచారణలో ఈషాన్ దార్‌తో సన్నిహిత సంబంధాలు, పాకిస్తాన్‌లో పర్యటన, ఐఎస్‌ఐతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు పహల్గామ్‌ ఉగ్రదాడికి ముందు కశ్మీర్‌ సందర్శన, కశ్మీర్‌ పర్యటనకు ముందు పాకిస్తాన్‌కు వెళ్లడం, ఈ రెండు పర్యటనల మధ్య సంబంధం ఉందా? అన్న కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రా అరెస్ట్‌పై ఆమె తండ్రి హరీష్ మల్హోత్రాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం కొత్త అనుమానాలకు తెరతీసినట్లైంది.ఒక సారి తన కుమార్తె జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ కోసం వీడియోలు షూట్ చేసేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు తనకు చెప్పిందని, కానీ పాకిస్తాన్‌కు వెళ్లిన విషయం తనకు తెలియదని చెప్పారు. మరోసారి ఢిల్లీకి కాదు తాము ఉంటున్న ఇంట్లోనే వీడియోలు తీసేదని చెప్పారు. ఇంకోసారి తన కూతురు తాను ఏం చేస్తుందో ఎప్పుడూ చెప్పలేదని జ్యోతి తండ్రి హరీష్‌ మల్హోత్రా చెప్పడంపై చర్చాంశనీయంగా మారింది.

Mumbai Indians Rope In Bairstow, Gleeson And Asalanka As Replacement For IPL 2025 Playoffs Push7
IPL 2025: ముంబై ఇండియన్స్‌లోకి బెయిర్‌స్టో.. మరో ఇద్దరి పేర్లు కూడా ఖరారు

జాతీయ జట్టు విధుల కారణంగా ప్లే ఆఫ్స్‌కు దూరం కానున్న ర్యాన్‌ రికెల్టన్‌ (సౌతాఫ్రికా), కార్బిన్‌ బాష్‌ (సౌతాఫ్రికా), విల్‌ జాక్స్‌ (ఇంగ్లండ్‌) స్థానాలను ముంబై ఇండియన్స్‌ మరో ముగ్గురితో భర్తీ చేసుకుంది. విల్‌ జాక్స్‌కు ప్రత్యా​మ్నాయంగా జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్‌), ర్యాన్‌ రికెల్టన్‌కు ప్రత్యామ్నాయంగా రిచర్డ్‌ గ్లీసన్‌ (ఇంగ్లండ్‌), కార్బిన్‌ బాష్‌కు ప్రత్యామ్నాయంగా చరిత్‌ అసలంకను (శ్రీలంక) జట్టులోకి తీసుకుంది. వీరు ముగ్గురు ఒకవేళ ​ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తే అందుబాటులో ఉంటారు. లీగ్‌ చివరి మ్యాచ్‌ వరకు జాక్స్‌, రికెల్టన్‌, బాష్‌ అందుబాటులో ఉంటారు. బెయిర్‌స్టోను ముంబై యాజమాన్యం రూ.5.25 కోట్లకు సొంతం చేసుకుంది. గ్లీసన్‌ను రూ. కోటికి, అసలంకను రూ. 75 లక్షలకు దక్కించుకుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు (గుజరాత్‌, ఆర్సీబీ, పంజాబ్‌) ఖరారయ్యాయి. మిగిలిన ఏకైక బెర్త్‌ కోసం ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇరు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, వీరి ప్లే ఆఫ్స్‌ భవితవ్యం మే 21న జరిగే మ్యాచ్‌తో దాదాపుగా డిసైడైపోతుంది. ఆ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ, ముంబై తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఇంకో మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ అప్పుడే ఖరారు కాదు. ఆ జట్టు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌పై (మే 24) కూడా గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారవుతుంది. ఒకవేళ ఢిల్లీ.. ముంబైపై గెలిచి, పంజాబ్‌ చేతిలో ఓడినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై సందిగ్దత కొనసాగుతుంది. మే 26న జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ముంబై ఆ మ్యాచ్‌లో కూడా ఓడితే లీగ్‌ నుంచి నిష్క్రమిస్తుంది.కాగా, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమితో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కూడా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ఇదివరకే సీఎస్‌కే, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన గుజరాత్‌, ఆర్సీబీ, పంజాబ్‌ లీగ్‌ దశలో తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఈ మ్యాచ్‌ల్లో జయాపజాలు టాప్‌-2 బెర్త్‌లను డిసైడ్‌ చేస్తాయి. లీగ్‌ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి టాప్‌-2 పోజిషన్స్‌లో ఉండే జట్లకు ప్లే ఆఫ్స్‌లో ఓ మ్యాచ్‌ ఓడినా మరో అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లకు ఆ అవకాశం ఉండదు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడే జట్టు లీగ్‌ నుంచి నిష్క్రమిస్తుంది.

Astrophysicist Jayant Vishnu Narlikar Passed Away8
ప్రముఖ శాస్త్రవేత్త నార్లికర్ కన్నుమూత.. సాగించిన పరిశోధనలివే..

పూణే: ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్(Scientist Jayant Vishnu Narlikar) మహారాష్ట్రలోని పూణేలో నేడు (మే 20) కన్నుమూశారు. భారతదేశంలో ఖగోళ భౌతిక శాస్త్ర పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడంలో నార్లికర్ గణనీయమైన పాత్ర పోషించారు. విశ్వోద్భవ శాస్త్రం, బిగ్ బ్యాంగ్‌కు ప్రత్యామ్నాయ సిద్ధాంతాల రూపకల్పనలో నార్లికర్‌ విశేష కృషి చేశారు. పూణేలోని ఇంటర్-యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్(Inter-University Center for Astronomy and Astrophysics) (ఐయూసీఏఏ) వ్యవస్థాపక డైరెక్టర్‌గా పేరొందారు. 1938, జూలై 19న మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించిన ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అక్కడ ఆయన ఫ్రెడ్ హోయిల్‌తో కలిసి హోయ్ల్-నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఇది సాంప్రదాయ విశ్వోద్భవ నమూనాలను సవాలు చేసింది.తన శాస్త్రీయ రచనలతో పాటు నార్లికర్ పలు సంక్లిష్టమైన శాస్త్రీయ భావనలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పుస్తకాలు, వ్యాసాలు రాశారు. ఆయన మరాఠీలో సైన్స్ ఫిక్షన్ కూడా రాశారు. నార్లికర్‌ రచనలు కొత్త తరాల పరిశోధకులకు స్ఫూర్తినిస్తున్నాయి. ఖగోళ భౌతిక శాస్త్ర రంగాల్లో నార్లికర్ చేసిన కృషిగా గాను ఆయన పద్మభూషణ్ (1965), పద్మవిభూషణ్ (2004), మహారాష్ట్ర భూషణ్ (2010) తదితర ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1980ల చివరలో ఆయన ప్రముఖ టీవీ షో ‘కాస్మోస్: ఎ పర్సనల్ వాయేజ్‌’లో కనిపించారు. ఇది ఖగోళ భౌతిక శాస్త్రంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న గుర్తింపును మరోమారు గుర్తు చేసింది.ఇది కూడా చదవండి: World Bee Day... అప్పుడు మనిషి జీవితం నాలుగేళ్లే!

Twist In Telangana Raj Bhavan Hard Disk Theft Case9
తెలంగాణ రాజ్‌భవన్‌ హార్డ్ డిస్క్‌ చోరీ కేసులో ట్విస్ట్

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజ్‌భవన్‌ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సస్పెండైన ఉద్యోగి శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌భవన్‌ చోరీ కేసు నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేయడం ఇది రెండోసారి. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేయగా.. ఆ కేసులో మొదటిసారి అరెస్ట్‌ చేశారు. కాగా.. హార్డ్ డిస్క్‌ల చోరీ కేసులో రెండోసారి చేశారు. ఆ ఉద్యోగి వారంలో రెండుసార్లు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. సస్పెండ్‌ అయినా కానీ.. సెక్యూరిటీని మాయ చేసి రాత్రి సమయంలో రాజ్‌భవన్‌లోకి ప్రవేశించాడు. రాజ్ భవన్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో శ్రీనివాస్.. ఓ మహిళకు కొన్ని మార్ఫింగ్ ఫొటోలను చూపించాడు. ఎవరో తనకు ఈ ఫోటోలు పంపిస్తున్నారు జాగ్రత్త అంటూ భయపెట్టాడు. దీంతో కలవరపాటుకు గురైన ఆ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మార్ఫింగ్ ఫోటోలను సృష్టించింది.. శ్రీనివాసేనని తేల్చారు. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు పంపారు. రాజభవన్ అధికారులు శ్రీనివాస్‌ సస్పెండ్ చేశారు.జైలకు వెళ్లిన శ్రీనివాస్.. రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుండి వచ్చిన శ్రీనివాస్ రాత్రి సమయంలో సెక్యూరిటీని మభ్యపెట్టి లోపలికి వెళ్ళాడు. తన కంప్యూటర్‌లో ఉన్న హార్డ్ డిస్క్‌ను చోరీ చేసుకుని వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై రాజభవన్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు సీసీ కెమెరాల ద్వారా శ్రీనివాస్ చోరీని గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి.. హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్‌లో మహిళకు సంబంధించిన ఫోటోలు ఉండడంతో ఆ సాక్ష్యాలను డిలీట్ చేసే ప్రయత్నంలో చోరీకి పాల్పడాడ్డని తెలిసింది.

Rashi khanna Injured In Movie Shooting10
గాయాలతో రాశి ఖన్నా.. ఫోటోలు వైరల్‌

హీరోయిన్ రాశి ఖన్నా స్వల్పంగా గాయపడ్డారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె షేర్‌ చేశారు. ఒక సినిమా షూటింగ్‌లో కథ డిమాండ్‌ మేరకు చాలా రిష్క్‌ ఉన్న యాక్షన్‌ సీన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అందువల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా 'ది సబర్మతి రిపోర్ట్‌'తో మెప్పించిన ఆమె 'ఫర్జీ2' వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. ఇందులో భాగంగానే ఆమెకు గాయాలు అయినట్లు సమాచారం.గాయాలతో ఉన్న ఫోటోలు షేర్‌ చేసిన రాశి ఖన్నా ఇలా చెప్పుకొచ్చింది. 'ఒక్కోసారి కథ డిమాండ్‌ చేస్తే గాయలను కూడా లెక్కచేయకూడదు. ఈ క్రమంలో మీ గాయాలు కూడా ఒక్కోసారి మీ శరీరం, మీ శ్వాస మీద ప్రభావం చూపవచ్చు.' అంటూ పోస్ట్‌ చేసింది. షూటింగ్‌లో చిన్నచిన్న గాయాలైనట్లు రాశి ఖన్నా తెలిపింది.కాగా.. రాశీ ఖన్నా దాదాపు ఒక దశాబ్దం పాటు అనేక తెలుగు, తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. 2013లో హిందీ చిత్రం మద్రాస్ కేఫ్‌తో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సౌత్ సినిమాల్లోకి ప్రవేశించింది. ఎందుకంటే ఆమెకు హిందీలో కలిసి రాకపోవడంతో సౌత్‌వైపు అడుగులేసింది. అయితే 2022లో రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ అనే సైకలాజికల్ క్రైమ్ సిరీస్‌తో హిందీ పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా అనే చిత్రంలో కనిపించనుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తోంది. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్‌గా చేయనుంది. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement