International
-
దక్షిణ కాలిఫోర్నియా.. ఇళ్లపైకి దూసుకెళ్లిన విమానం
శాన్‌డియాగో: దక్షిణ కాలిఫోర్నియాలో జనావాసాల్లోకి ఓ చిన్నపాటి విమానం దూసుకెళ్లింది. దీంతో 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్ల కూడా దెబ్బతిన్నాయి. భారీ మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో మృతుల వివరాలపై ఇప్పటి వరకు శాన్‌డియాగో పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున పొగమంచు కారణంగా విమానం.. ఇళ్లలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. The Cessna 550 plane crashed in San Diego's Murphy Canyon neighbourhood around 3.47am during a period of dense fog.A huge fireball erupted after the crash, setting multiple homes and cars ablaze. At least 15 properties have been affected.https://t.co/QAxenqSOWk via @MailOnline pic.twitter.com/jN4dr6T4Es— Tamra M McDougall (@TamraMcDougall) May 22, 2025 -
ఉంగరంతో ప్రపోజ్ చేద్దామనుకున్నాడు, ఈలోపే..
చూడచక్కని జంట. ఒకే దగ్గర కలిసి పని చేస్తున్నారు. ఒకరినొకరు గాఢంగా ఇష్టపడ్డారు. జీవితాంతం కలిసి బతకాలనుకుంది. కానీ, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు.. విధి ఆడిన వింత నాటకంలో అనూహ్యంగా ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు.యారోన్, సారా.. ఇద్దరూ ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది. బుధవారం సాయంత్రం వాషింగ్టన్‌లోని యూదుల మ్యూజియం వద్ద జరిగిన వేడుకలో కలిసే పాల్గొన్నారు. అయితే ఓ దుండగుడు అత్యంత సమీపంగా నలుగురు ఉన్న బృందంపైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఈ ఇద్దరే మరణించారు. ఆ తర్వాతే తెలిసింది ఏంటంటే.. త్వరలో ఆ యువకుడు ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నాడని!యారోన్, సారా మంచి మిత్రులు మాత్రమే కాదు.. ఒకరికొకరు ఇష్టపడ్డారు కూడా. వచ్చే వారం జెరూసలేంలో సారాకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేయాలని యారోన్ సిద్ధంగా ఉన్నాడు. ఈలోపే ఇలా జరిగింది. ఎంతో జీవితం ఉన్న ఆ యువ జంట జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడం నిజంగా బాధాకరం అని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచెయిల్ లెయిటర్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఉగ్రదాడిలో యువ జంట మరణించడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పుల ఘటన తర్వాత దుండగుడ్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను ఫ్రీ పాలస్తీనా నినాదాలు చేశాడు. అతన్ని చికాగోకు చెందిన ఎలియాస్ రోడ్జిగూజ్‌గా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతన్ని దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఇదీ చదవండి: ఇలాంటివి అమెరికాలో కుదరవు-ట్రంప్ -
హమాస్ నేత ముహమ్మద్ సిన్వార్ హతం?
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) సంచలన ప్రకటన చేశారు. హమాస్ నేత ముహమ్మద్ సిన్వార్‌ను తమ సైన్యం చంపివుండవచ్చని పేర్కొన్నారు. జెరూసలేంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు .. గాజాలో 20 మంది బందీలు బతికే ఉన్నారని, 38 మంది వరకూ మరణించి ఉంటారని, అక్కడ చిక్కుకున్న బందీలను త్వరలోనే తీసుకువస్తామని ఆయన ఇజ్రాయెల్ ప్రజలకు హామీ ఇచ్చారు.గాజాలో తమ సైనిక లక్ష్యాల కోసం నిర్మాణాత్మక ప్రణాళిక కొనసాగుతున్నదని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. అలాగే తాము పదివేల మంది ఉగ్రవాదులను తదముట్టించామని, హమాస్ నేతలు డీఫ్, హనియే, యాహ్యా సిన్వార్, మొహమ్మద్ సిన్వార్ నాయకులను అంతమొందించామని నెతన్యాహు చెప్పినట్లు సీఎన్ఎన్ పేర్కొంది.ఇజ్రాయెల్(Israel) ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాలో సైనిక కార్యకలాపాలను విస్తరించడాన్ని యూకే, ఫ్రాన్స్, కెనడాలు తప్పుపట్టాయి. కాగా హమాస్‌పై సంపూర్ణ విజయం సాధించడానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని నెతన్యాహు పునరుద్ఘాటించారు. ఇది అనాగరికతపై నాగరికతా యుద్ధమని, దీనిలో పూర్తి విజయం సాధించే వరకు ఇజ్రాయెల్ న్యాయపరమైన మార్గాల ద్వారా తనను తాను రక్షించుకుంటూనే ఉంటుందని నెతన్యాహు పేర్కొన్నారు. పాలస్తీనా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొరబడి, 1,200 మంది అమాయకులను హత్య చేసి, 250 మందికి పైగా అమాయకులను గాజాలో బంధించిన నేపధ్యంలో ఈ యుద్ధం ప్రారంభమైందని నెతన్యాహు గుర్తుచేశారు.ఇది కూడా చదవండి: 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ -
వాషింగ్టన్లో ఉగ్రదాడి!.. ట్రంప్ ఆగ్రహం
అమెరికలో దౌత్య పరమైన విషాదం నెలకొంది. ఓ ఆగంతకుడు జరిపిన దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ(Israel Embassy Staff) సిబ్బంది మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే వాళ్లను హతమార్చినట్లు నిర్ధారణకు వచ్చారు.స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం వాషింగ్టన్ డీసీలోని యూదుల మ్యూజియం(Jewish Museum) వద్ద ఈ ఘోరం జరిగింది. మ్యూజియంలో ఓ ఉత్సవం జరుగుతుండగా.. ఎంబసీ స్టాఫ్‌తో పాటు పలువురు హాజరయ్యారు. అంతలో.. అత్యంత సమీపం నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. ఘటనలో సిబ్బంది ఇద్దరు మరణించారు. కాల్పులకు పాల్పడ్డ దుండగుడు పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ‘‘ ఫ్రీ పాలస్తీనా.. ఫ్రీ పాలస్తీనా(Free Palestine) ’’ అంటూ జెండా కప్పేసుకుని అక్కడే కూర్చుని నినాదాలు చేశాడు. దీంతో ఉగ్రదాడి కోణంలోనే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణతో.. గాజాలో తీవ్ర దాడులు(Gaza War) జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతుండటంతో పాలస్తీనీయులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ పరిణామాల వేళ.. కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మరోవైపు.. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. “These horrible D.C. killings, based obviously on antisemitism, must end, NOW! Hatred and Radicalism have no place in the USA. Condolences to the families of the victims. So sad that such things as this can happen! God Bless You ALL!” —President Donald J. Trump pic.twitter.com/Z30bjAQOpZ— The White House (@WhiteHouse) May 22, 2025జెవిష్ మ్యూజియం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అమెరికాలో ద్వేషానికి, ఉగ్రవాదానికి చోటు లేదని.. యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న భయంకరమైన ఈ తరహా దాడులు, హత్యలు తక్షణమే ఆగాలని హెచ్చరించారాయన. మరోవైపు ఘటనపై ఇజ్రాయెల్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇతర దేశాల్లోని ఎంబసీలను మాత్రం అప్రమత్తం చేసినట్లు సమాచారం. -
ట్రంప్‌కు కోపమొచ్చింది.. ఏం మాట్లాడుతున్నావ్ వెళ్లిపో అంటూ..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి కోపమొచ్చింది. ప్రశ్నించిన ఓ విలేకరిపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఏం మాట్లాడుతున్నావ్?. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ట్రంప్ చిందులు తొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..తాజాగా వైట్‌హౌస్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ట్రంప్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌కు ఖతార్.. విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ప్రకటించిన విషయమై ట్రంప్‌ను ఎన్బీసీ ఛానెల్ విలేకరి ప్రశ్నించారు. సదరు విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఊగిపోయారు. అనంతరం, ట్రంప్ మాట్లాడుతూ.. ‘నువ్వు ఏం మాట్లాడుతున్నావ్?. నువ్వు తెలివితక్కువ వాడివి. ఇక్కడ మేం మాట్లాడుతున్న దానికి, ఖతార్ విమానానికి సంబంధం ఏంటి? వాళ్లు విమానం ఇస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో. దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతుల సమస్యలు, హింస తదితర సమస్యల నుంచి దారి మళ్లించడానికే నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు. విలేకరిగా విధులు నిర్వహించే అర్హత నీకు లేదు’ అని ట్రంప్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆ వార్తా సంస్థపై కూడా ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దానిపై విచారణ జరపాల్సి ఉందని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షడు ట్రంప్‌కు ఖతార్ పాలక కుటుంబం విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జంజో జెట్ విమానాన్ని స్వీకరించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. తాజాగా ఈ విమానం ట్రంప్ స్వీకరించడానికి అమెరికా రక్షణశాఖ కూడా ఆమోదం తెలిపింది. ఇక, దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్‌ఫోర్స్ వన్) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీవిరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్ ‘ఎయిర్‌ఫోర్స్ వన్’కు కొత్త వెర్షన్‌గా ఉపయోగించాలని ప్రణాళికలు చేస్తున్నారు. President Trump Slams NBC reporter 🔥 "GET OUT OF HERE"You ought to go back to your studio at NBC because Brian Roberts and the people that run that place, they ought to be investigated. They are so terrible the way you run that network. And you're a disgrace. No more questions… pic.twitter.com/ezuE4vXstc— Steve Gruber (@stevegrubershow) May 21, 2025 -
ప్రమాదం బారిన జీవవైవిధ్యం
సృష్టిలోని అన్ని జీవరాశులలో ఏ ఒక్కటీ అధికం కాదు, ఏదీ అల్పం కాదు. అన్నీ సమానమే. అవన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. మనిషి తన అవసరాలకు ప్రకృతిపై ఆధారపడతాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం ముందుకు సాగదు. దీనిని గమనించిన నిపుణులు, శాస్త్రవేత్తలు జీవవైవిధ్య చక్రం సక్రమంగా సాగేలా చూడాలని ఎన్నోఏళ్లుగా మొరపెట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఐక్యరాజ్యసమితి ప్రతీఏటా మే 22న అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవాన్ని(International Day for Biological Diversity) నిర్వహిస్తూ వస్తోంది.దెబ్బతీస్తున్న జీవనశైలిప్రస్తుతం భూమిపై ఉన్న కోట్లాది జాతుల వైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామంగా చెబుతారు. మనిషి జీవనశైలి కారణంగా పర్యావరణంలో కాలుష్యం(Pollution) వ్యాపించి, భూగోళం వేడెక్కిపోతున్నది. ఫలితంగా జీవవైవిధ్యం దెబ్బతింటోంది. పర్యవసానంగా పలు జీవజాతులు అంతరించిపోతున్నాయి. ప్రపంచంలో గల 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో భారతదేశం ఒకటి. ఇక్కడ ఒకనాడు సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతుజాతులు ఉండేవి. వివిధ కారణాలతో అనేక జీవాలు కనుమరుగవుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికి పైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటివనరులు అంతరించిపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్లను స్వార్థ ప్రయోజనాల కోసం ఎండగట్టారు. అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి అంతమొందిస్తున్నారు.అక్కడ జీవవైవిధ్యం పదిలంవ్యవసాయంలో రసాయనిక ఎరువులు, కీటకనాశనుల వినియోగానికి ప్రాధాన్యత పెరిగింది. దీంతో నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి పరిస్థితి ఏర్పడింది. అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా భారత్ గుర్తింపు పొందింది. అయితే దేశంలో ఆదివాసులు అధికంగా ఉన్నచోట జీవవైవిధ్యం పదిలంగా ఉందని చెప్పుకోవచ్చు. మన దేశంలో 53 మిలియన్లకు మించిన ఆదివాసులు నివసిస్తున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌లో 80 శాతానికి మించిన రీతిలో గిరిజనులున్నారు. దీంతో అక్కడ జన్యువైవిధ్యం ఎక్కువగా ఉంది. మరోవైపు ఇటీవలి కాలంలో అనుసరిస్తున్న జన్యుమార్పిడి విధానం జీవవైవిధ్యాన్ని దెబ్బ తీస్తోంది. వీటిని రూపొందించి, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.మానవ మనుగడ ప్రశ్నార్థకంవైవిధ్యమే సృష్టి లక్షణం అంటారు స్వామి వివేకానంద. చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప, కప్పను తిని పాము, పామును తిని గద్ద జీవిస్తుంది. గద్ద మరణించాక దానిని వివిధ క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టులా సాగుతుంది. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా, మిగతా అన్నిటి మీదా ప్రభావం పడుతుంది. దీనికి మనిషి అడ్డుపడితే అది వినాశనానికి దారి తీస్తుంది. భూమిపై ఏ ఒక్క జీవి అంతరించినా, మానవ మనుగడ(Human survival) ప్రశ్నార్థకమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా వేలాది జీవరాశులు అంతరించిపోతున్నాయి. అయితే వాతావరణ సమతుల్యానికి, పర్యావరణ పరిరక్షణకు జీవరాశులను కాపాడుకోవడం అత్యవసరం. అందుకే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇది కూడా చదవండి: నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే.. -
ఇండియన్ ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు!
వాషింగ్టన్: అమెరికాను మరోసారి గొప్పదేశంగా మారుస్తానంటూ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్ణయాలతో అమెరికాలో ఉంటున్న భారతీయుల బెంబేలెత్తిపోతున్నారు. ఎవరిని ఎప్పుడు వెళ్లగొడతారో తెలియక హడలిపోతున్నారు. అక్రమ వలసదారుల పేరిట 300 మంది భారతీయులను ఇటీవల అమెరికా నుంచి వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. అమెరికాలోకి భారతీయులు అక్రమంగా అడుగుపెట్టడానికి ఇండియన్ ట్రావెల్ ఏజెంట్లే ధనదాహమే కారణమని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అందుకే సదరు ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతోంది. ‘‘అమెరికాకు భారతీయులను అక్రమంగా పంపిస్తున్న ఏజెంట్లను గుర్తించే పనిలో మిషన్ ఇండియాకు సంబంధించిన కాన్సులర్ అఫైర్స్ అండ్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీసు సిబ్బంది నిమగ్నమయ్యారు. మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం’’అని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్రమాలకు పాల్పడుతున్న ఇండియన్ ట్రావెల్ ఏజెన్సీల యజమానులు, ప్రతినిధులపై వీసా ఆంక్షలు విధించడానికి చర్యలు చేపట్టామని స్పష్టంచేసింది. ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధమైన వలసలను ప్రోత్సహిస్తే శిక్ష తప్పదని తేలి్చచెప్పింది. మనుషుల స్మగ్లింగ్ అనేది పెద్ద నేరమని వెల్లడించింది. అమెరికాకు రావాలనుకుంటే ముందు తమ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలని విదేశీయులకు సూచించింది. చట్టాలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. అక్రమంగా వలస వచ్చినవారికే కాకుండా.. అలా రావడానికి సహకరించిన వారికి కూడా శిక్షలు ఉంటాయని ఉద్ఘాటించింది. హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి మరోవైపు హెచ్–1బీ వీసాలపై అమెరికాలోని అతివాదుల దృష్టి పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి వీసాలను ఎందుకు రద్దు చేయకూడదని అధికార డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారు లారా ఎలిజబెత్ లూమర్ ప్రశ్నించారు. చట్టపరమైన ఈ తాత్కాలిక వర్క్ వీసాలతో భారతీయులు ప్రయోజనం పొందుతున్న సంగతి తెలిసిందే. హెచ్–1బీ వీసాలను రద్దు చేయాలంటూ ట్రంప్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ వాదనలు వినిపిస్తున్నారు. ‘‘అక్రమ వలసదారులను బయటకు పంపిస్తున్నాం, బాగానే ఉంది.. మరి హెచ్–1బీ వీసాదారుల సంగతేమిటి?’’అని లారా ఎలిజబెత్ లూమర్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘హెచ్–1బీ వీసాల కుంభకోణాన్ని ట్రంప్ ప్రభుత్వం అడ్డుకోకపోతే కోట్లాది మంది అమెరికన్లకు అసంతృప్తే మిగులుంది’’అని మరో పౌరుడు పోస్టు చేశాడు. గత 30 ఏళ్లుగా కుంభకోణం జరుగుతోందని ఆరోపించాడు. టెక్నాలజీ కంపెనీలు ఈ స్కామ్‌ను అడ్డం పెట్టుకొని వందల కోట్ల డాలర్లు ఆర్జించాయని విమర్శించాడు. అవే కంపెనీలు 2020లో ట్రంప్‌ను ఓడించాయని చెప్పాడు. అమెరికన్ల ప్రయోజనాలను పణంగా పెట్టి టెక్ కంపెనీలకు ట్రంప్ చీఫ్ లేబర్‌ను కానుకగా ఇస్తున్నాడని మండిపడ్డాడు. విదేశీయులను బయటకు వెళ్లగొట్టి, ఉద్యోగాలన్నీ అమెరికన్లకే ఇవ్వాలని మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) గ్రాడ్యుయేట్లతో ఈ పని ప్రారంభించాలని చెప్పాడు. అమెరికాను అమ్మకానికి పెట్టొద్దని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరాడు. -
ఎవరెస్టుపైకి యమా స్పీడుగా
కఠ్మాండు: బ్రిటన్‌కు చెందిన నలుగురు పర్వతారోహకుల బృందం సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోకెల్లా ఎత్తైన ఆ శిఖరాన్ని ఎలాంటి ముందస్తు సన్నద్ధతా లేకుండా ఐదంటే ఐదు రోజుల్లోపే అధిరోహించి అబ్బురపరిచింది. 8,849 మీటర్ల ఎత్తులో ఉండే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలంటే నేపాల్‌లోని బేస్ క్యాంప్ వద్ద కనీసం కొద్ది నెలల పాటు శారీరకంగా, మానసికంగా సన్నద్ధమవడం తప్పనిసరి. బ్రిటిష్ బృందం మాత్రం అలాంటిదేమీ లేకుండానే పని కానిచ్చేసింది. మే 16న లండన్ నుంచి బయల్దేరి కఠ్మాండు చేరింది. అదే రోజు మధ్యాహ్నం ఎవరెస్టు బేస్ క్యాంపు చేరుకుని నేరుగా అధిరోహణ మొదలు పెట్టేసింది. బుధవారం ఉదయానికల్లా విజయవంతంగా శిఖరాగ్రం చేరింది. ఈ మొత్తానికీ పట్టింది కేవలం 4 రోజుల 18 గంటలు మాత్రమే. ఈ బృందంలోని నలుగురూ స్పెషల్ ఫోర్సెస్‌లో సైనికులుగా పని చేసి రిటైరైనవాళ్లే కావడం విశేషం. పైగా వారిలో ఒకరు మాజీ మంత్రి కూడా. వారంతా మూడు నెలలపాటు బ్రిటన్‌లోనే పక్కా ప్రణాళికతో సన్నద్ధమయ్యారు. అందుకోసం ఎవరెస్టు ఆరోహణ క్రమంలో ఎదరయ్యే పరిస్థితులన్నింటినీ లండన్‌లోనే కృత్రిమంగా సృష్టించుకున్నారు. హైపోక్సియా టెంట్లు, జెనాన్ వాయువు, ఇతర సాంకేతికతను ఉపయోగించుకున్నారు. ఏమిటీ టెంట్లు? సాధారణంగా పైకి వెళ్తున్న కొద్దీ వాతావరణం పలుచబడుతూ వస్తుంది. దాంతోపాటే ఆక్సిజన్ స్థాయి కూడా తగ్గిపోతుంటుంది. 8 కి.మీ. ఎగువన భూ ఉపరితలంతో పోలిస్తే కేవలం మూడో వంతు ఆక్సిజనే అందుబాటులో ఉంటుంది. దాంతో శ్వాసించడం కష్టతరంగా మారుతుంది. అది ఎన్నో ఇతర సమస్యలకూ దారితీస్తుంది. ఎవరెస్టు ఎత్తేమో ఏకంగా 8.8 కి.మీ. పై చిలుకు. అందుకే పర్వతారోహకులు దాన్ని ముద్దుగా డెత్ జోన్ అని పిలుచుకుంటారు. ఎంతటి కొమ్ములు తిరిగిన పర్వతారోహకులైనా అక్కడి అత్యంత ప్రతికూల పరిస్థితులకు ముందుగానే సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అందుకోసం కఠ్మాండులోనో, ఎవరెస్టు బేస్ క్యాంప్ వద్దో కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలైనా గడపడం తప్పనిసరి. సన్నద్ధతలో భాగంగా బేస్ నుంచి ఎవరెస్టుపైకి వెళ్లే దారిలోని ఎగువ క్యాంపులకు ప్రాక్టీస్ రన్ తదితరాలు చేపడతారు. అంతా ఓకే అనుకున్నాకే శిఖరాగ్రానికి బయల్దేరతారు. అయితే బేస్ క్యాంప్ వద్ద ఎంతకాలం సన్నద్ధతలో గడపాలన్న దానిపై నేపాల్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలూ విధించలేదు. బ్రిటిష్ బృందం సభ్యులు తమ సన్నద్ధతలో భాగంగా లండన్‌లో ఆరు వారాల పాటు హైపోక్సియా టెంట్లలో నిద్రించారు. అనంతరం జర్మనీలో ఓ క్లినిక్‌లో రెండు వారాల పాటు జెనాన్ వాయువును పీలుస్తూ వచ్చారు. హైపోక్సియా టెంట్లలోని ప్రత్యేక జనరేటర్ ఆక్సిజన్‌ను పీల్చేస్తుంది. దాంతో టెంట్ల లోపల ఆక్సిజన్ స్థాయి మూడో వంతుకు తగ్గుతుంది. ‘‘జెనాన్ వాయువు ఆలి్టట్యూడ్ సిక్‌నెస్‌ను అరికడుతుంది. అంతేగాక శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందనప్పుడు ఏర్పడే హైపోక్సియా తరహా పరిస్థితిని ఎదుర్కొనేందుకు దోహదపడే ఎరిత్రోపొయిటెన్ అనే ప్రొటీన్ ఉత్పత్తిని పెంచుతుంది’’అని ఈ యాత్రను ఆర్గనైజ్ చేసిన లూకాస్ ఫర్టెన్‌బాచ్ వివరించారు. నలుగురూ క్షేమంగా ఉన్నారని, శిఖరాగ్రం నుంచి కిందకు దిగడం మొదలు పెట్టారని చెప్పారు. ‘‘ఈ కొత్త పద్ధతి వల్ల నేపాల్‌లో నెలల తరబడి గడపాల్సిన అవసరం తగ్గుతుంది. కనుక ఎవరెస్టు యాత్ర ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది’’అన్నారు. అయితే జెనాన్ వాయువు వాడటం వంటివి మంచి పద్ధతులు కావని పర్వతారోహణ నిపుణులు అంటున్నారు. ‘‘అది ఆక్సిజన్ కొరత ప్రభావాన్ని అడ్డుకుంటుందనేందుకు శాస్త్రీయ రుజువులేమీ లేవు. పైగా దాని వాడకం ప్రమాదకరం కూడా కావచ్చు’’అని హెచ్చరిస్తున్నారు.11 గంటల రికార్డు పదిలమే అత్యంత వేగంగా ఎవరెస్టును అధిరోహించిన రికార్డును మాత్రం బ్రిటిష్ బృందం బద్దలు కొట్టలేకపోయింది. లాక్పా గెలు షెర్పా 2003లో బేస్ క్యాంప్ నుంచి మొదలుపెట్టి కేవలం 10 గంటల 58 నిమిషాల్లోనే ఎవరెస్టు శిఖరాగ్రం చేరారు. ఇప్పటిదాకా ఎవరూ దాని దరిదాపులకు కూడా రాలేకపోయారు. -
8 రోజుల్లో మరో పాక్ అధికారి ఔట్
న్యూఢిల్లీ: భారతీయులను పలు విధాలుగా ప్రలోభపెట్టి గూఢచర్యానికి వినియోగించుకున్నాడన్న నేరానికి మే 13న ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగిని భారత్ బహిష్కరించిన 8 రోజులకే మరో ఉద్యోగిపైనా భారత్ అదే వేటు వేసింది. అధికార విధులను మీరి ప్రవర్తిస్తున్నాడని, హోదాకు తగ్గట్లు ప్రవర్తించట్లేడనే కారణంగా 24 గంటల్లోపు భారత్‌ను వీడాలని బుధవారం ఆదేశించింది. ఈమేరకు పాక్ హైకమిషన్‌లో సంబంధిత వ్యవహారాల ఉన్నతాధికారి సాద్ వరాయిచ్‌కు ‘అధికారికంగా దౌత్య నిరసన’ నోటీసును అందజేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
పొరపాటున నోరు జారి.. జపాన్ మంత్రి రాజీనామా
టోక్యో: జపాన్ వ్యవసాయ శాఖ మంత్రి పొరపాటున చేసిన వ్యాఖ్యలు ఆయన రాజీనామాకు దారి తీశాయి. దేశంలో సాంప్రదాయ ఆహారమైన బియ్యం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలనుద్దేశించి మాట్లాడిన మంత్రి టాకు ఎటో... ఎవరో ఒకరు బియ్యం బహుమతిగా ఇస్తుండటంతో తాను ఇంతవరకూ బియ్యం కొనాల్సిన అవసరం రాలేదని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు బ్రౌన్ రైస్‌కు సంబంధించినవేనని, తాను తెల్లబియ్యం కొంటానని మంత్రి తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అయినా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. జూలైలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయని భావించిన మంత్రి బుధవారం రాజీనామా సమర్పించారు. బియ్యం ధరలతో జనం ఇబ్బంది పడుతుంటే అనుచితవ్యాఖ్యలు చేశానని రాజీనామా అనంతరం మంత్రి ఎటో మీడియాతో అన్నారు. -
అగ్రరాజ్యానికో గోల్డెన్ డోమ్!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అగ్రరాజ్యం, అతిపెద్ద ఆర్థికవ్యవస్థ, అమేయమైన సైనిక శక్తి.. ఇలా అన్నీ ఉన్నా అమెరికాను సువిశాలమైన, విస్తారమైన భూభాగం భయపెడుతోంది. భూమి ఎక్కువుంటే ఎందుకు భయపడాలనే సందేహం రావొచ్చు. దేశం ఓ మోస్తరు విస్తీర్ణంలో ఉండే ఉన్న భూభాగమంతటికీ సమగ్ర స్థాయిలో రక్షణ కల్పించొచ్చు. అదే విశాల భూభాగమైతే శత్రు దేశ క్షిపణులు ఎక్కడ పడతాయో ఊహించడం కూడా కష్టం. అమెరికాను వేధిస్తున్న ఈ సమస్యకు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థతో చెక్ పెడతానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో ప్రకటించారు. మొత్తంగా 175 బిలియన్ డాలర్ల వ్యయంతో గోల్డెన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాట్లుచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 2029 జనవరిలోగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి యావత్ అమెరికా భూభాగాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఈ గోల్డెన్ డోమ్ వ్యవస్థను ఏర్పాటుచేయడం అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారమని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ స్పష్టంచేసింది. భూమి మీదే కాదు ఆకాశంలోనూ ఇందుకు సంబంధించి లేజర్ కాంతిపుంజం వెదజల్లే వ్యవస్థలను ప్రవేశపెట్టాల్సి ఉంటుందని బడ్జెట్ ఆఫీస్ తెలిపింది. ఇంతటి సంక్లిష్టమైన అధునాతన సాంకేతికతతో కూడిన అసాధారణ వ్యవస్థ నిర్వహణకు రాబోయే 20 సంవత్సరాల్లో ఏకంగా 542 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనావేసింది. ప్రస్తుతానికి అమెరికా పార్లమెంట్లో ట్రంప్ తొలి దఫాగా ప్రాజెక్ట్ కోసం కేవలం 25 బిలియన్ డాలర్లు మాత్రమే ప్రతిపాదించారని బడ్జెట్ ఆఫీస్ తెలిపింది.ఏమిటీ గోల్డెమ్ డోమ్?ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్ క్షిపణులను మన భూభాగంపై మోహరించిన సుదర్శన చక్ర(ఎస్–400) గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. మార్గమధ్యంలోనే ఆ మిస్సైళ్లను కూల్చేసింది. గాజా భూభాగం మీద నుంచి హమాస్ సాయుధులు సంధించిన వందలాది క్షిపణులను సైతం ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ గగనతల రక్షణ వ్యవస్థ ఇలాగే నేలమట్టంచేసి తమ నేలను కాపాడుకుంది. ఎస్–400, ఐరన్‌డోమ్‌లు భూతలం మీద మొహరించిన రక్షణ వ్యవస్థలు. వాహనాలపై బిగించిన రాకెట్ లాంఛర్ ఇందులో కీలకం. అయితే అమెరికా సిద్ధంచేయబోతున్న గోల్డెన్ డోమ్ కాస్తంత భిన్నమైంది. ఇది భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మేళవింపు. లేజర్ కాంతి ఎంతటి కఠినమైన లోహాలనైనా కోసి పారేస్తుంది. ఆకాశంలోని ఉపగ్రహం లాంటి వ్యవస్థ ఈ లేజర్ కాంతి పుంజాన్ని శత్రు క్షిపణులపై ప్రయోగించి వాటిని సెకన్ల వ్యవధిలో నాశనం చేస్తుంది. గోల్డెన్ డోమ్‌లో ఈ లేజర్‌కాంతి విభాగమే అత్యంత కీలకమైంది. గోల్డెన్డోమ్లో భాగంగా పెద్దసంఖ్యలో ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టి వాటిని నిఘా, దాడి వ్యవస్థలుగా తీర్చిదిద్దనున్నారు.లేజర్ కాంతి, సెన్సార్లు, శాటిలైట్ల సమ్మేళనంఈ గోల్డెన్ డోమ్‌ను లేజర్ కాంతి, సెన్సార్లు, పలు ఉపగ్రహాల, క్షిపణుల సమ్మేళనంగా చెప్పొచ్చు. అన్నీ కలిసి ఏకకాలంలో సమన్వయంతో పనిచేస్తూ నవతరం ‘మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్’గా నిలిచిపోనున్నాయి. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే సెన్సార్లను భూతలం మీద ఉండే గగనతల రక్షణ వ్యవస్థతో అనుసంధానిస్తారు. ఫలానా ప్రాంతం నుంచి శత్రు క్షిపణి దూసుకొస్తున్న విషయాన్ని భూతల, గగనతల సమ్మిళిత వ్యవస్థలు గుర్తించి వెంటనే ఆకాశంలోని లేజర్ కాంతిపుంజ విభాగానికి చేరవేస్తాయి. లేజర్‌కాంతి అవసరంలేని సందర్భాల్లో శత్రు క్షిపణిని అడ్డుకునేందుకు వెనువెంటనే క్షిపణులను ప్రయోగిస్తారు. సొంత క్షిపణితో పనికాదని నిర్ధారించుకోగానే అత్యంత తీక్షణమైన లేజర్ కాంతిని ఆ శత్రు క్షిపణిపై ప్రసరింపజేస్తారు. నేల మీద మొబైల్ లాంఛర్ నుంచి, యుద్ధవిమానం నుంచి వచ్చే క్షిపణులనూ ఈ లేజర్‌కాంతి నాశనం చేయగలదు. అలా అమెరికా గగనతలంలో కీలకమైన చోట్ల ఈ లేజర్‌బీమ్ లైటింగ్ సిస్టమ్స్‌ను సిద్ధంచేస్తారు. ఈ బహుళ అంచెల వ్యవçస్థలన్నీ ఎల్లవేళలా సమన్వయంతో పనిచేస్తూ అమెరికాను కంటికి రెప్పలా కాపాడతాయి. గోల్డెన్ డోమ్ ముఖ్యంగా నాలుగు పనులు చేస్తుంది. 1. ఫలానా చోట శత్రు క్షిపణి క్రియాశీలకంగా మారిందని గుర్తించగానే అది లాంఛర్‌ను దాటి బయటికొచ్చేలోపే నాశనంచేస్తుంది. 2. ఒకవేళ అప్పటికే బయల్దేరితే తొలిదశలోనే అడ్డుకుంటుంది. 3. లేదంటే మార్గమధ్యంలో నేలకూలుస్తుంది. 4. అప్పటికీ చేయిదాటిపోతే అది లక్ష్యాన్ని ఢీకొట్టే చిట్టచివరి నిమిషంలోనైనా మిస్సైల్‌ను మట్టుబెడుతుంది. ఈ పనులను కృత్రిమమేధ ఆధారిత కమాండ్ సిస్టమ్ చూసుకుంటుంది.స్టార్‌వార్స్ సిద్ధాంతం నుంచి..అంతరిక్షం నుంచి కాంతిపుంజాన్ని ప్రయోగించడమనేది ఇంకా ప్రయోగదశలోనే ఉందని అమెరికా ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మెయింక్ మంగళవారం వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖ, యూఎస్ నార్తర్న్ కమాండ్లు సమష్టిగా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుపై పనిచేస్తు న్నాయి. ‘‘ సంప్రదాయక క్రూయిజ్, బాలిస్టిక్, హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లతోపాటు అణ్వస్త్ర సామర్థ్య క్షిపణులనూ ఈ గోల్డెన్ డోమ్ విజయవంతంగా అడ్డుకుంటుంది’’ అని రక్షణ మంత్రి పీట్ హెగ్సత్ చెప్పారు. యూఎస్ స్పేస్‌ఫోర్స్ జనరల్ మైఖేల్ గెటెలిన్ ఈ ప్రాజెక్ట్‌కు సారథ్యంవహిస్తారు. ఫోర్స్టార్ జనరల్ అయిన గెటెటిన్కు వైమానిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. తాము సైతం ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా చేరతామని కెనడా తన ఆసక్తిని వెల్లడించింది. ఆయుధరంగ దిగ్గజం ‘లాక్‌హీడ్ మార్టిన్’ సంస్థ గోల్డెన్ డోమ్ ఉపకరణాలను అభివృద్ధిచేయనుంది. 80వ దశకంలో అమెరికా అధ్యక్షునిగా సేవలందించిన రొనాల్డ్ రీగన్ ‘స్టార్‌వార్స్’ సిద్ధాంతం, ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ వ్యవస్థల నుంచే గోల్డెన్ డోమ్ ఆలోచన పురుడుపోసుకుంది. క్షిపణులను అడ్డుకునే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్, ఏగిస్ సిస్టమ్‌లనూ గోల్డెన్ డోమ్‌లో వినియోగించనున్నారు.సందేహాలు, అనుమానాలుఇంతవరకు అంతరిక్షంలో పరీక్షించని ఈ వ్యవస్థను కేవలం నాలుగేళ్లలోపు ఎలా అందుబాటులోకి తెస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. గోల్డెన్ డోమ్‌లో పెద్ద సంఖ్యలో కొత్త ఉపగ్రహాలు, ఏఐ సెన్సార్లు అవసరం. ప్రపంచంలోనే అత్యధిక రుణభారాన్ని మోస్తున్న అమెరికా సర్కార్ ఈస్థాయి కొత్త భారీ బడ్జెట్‌ను ఇంత తక్కువ సమయంలో సమకూర్చుకోగలదా? అసలు ఇది సమర్థవంతంగా పనిచేస్తుందా? అనే సందేహాలు ఎక్కువయ్యాయి. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం తొలినాళ్లలో ఒకేరోజు ఒకేసారి 20 నిమిషాల వ్యవధిలో హమాస్ 5,000 స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. వాటిని అడ్డుకోవడంలో ఐరన్‌డోమ్ విఫలమైంది. ఈ నేపథ్యంలో ఒక సాయుధ సంస్థే ఇన్ని మిస్సైళ్లను ప్రయోగించగల్గితే పేద్ద యుద్ధమే వస్తే రష్యాలాంటి దేశం ఇంకెంత స్థాయిలో విరుచుకుపడుతుందో ఊహించడం కూడా కష్టం. ఈ నేపథ్యంలో గోల్డెన్ డోమ్ శక్తిసా మర్థ్యాలు ఏపాటివో అందుబాటులోకి వస్తేగానీ చెప్పలే మని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు.చైనా, రష్యా నుంచి ముప్పు..రష్యా, చైనా తమ ఉపగ్రహాలకు అధునాతన శక్తిసామర్థ్యాలను సంతరింపజేశాయి. అవి అమెరికా ఉపగ్రహాలను నిర్వీర్యంచేయగలవు. ఈ నేపథ్యంలో గోల్డెన్ డోమ్ అవసరం ఏర్పడిందని అమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. కేవలం అంతరిక్షంలో వాడేందుకు రష్యా ఒక కొత్తతరహా అణ్వాయుధాన్ని తయారుచేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ అణ్వాయుధం అంతరిక్షంలో సంచరిస్తూ విడతలవారీగా పేలుతూ సమీప శత్రుదేశ ఉపగ్రహాలను నాశనంచేయగలదని అమెరికా వాదిస్తోంది. అమెరికా గోల్డెన్ డోమ్ ఆలోచనను ఇప్పటికే రష్యా, చైనాలు తీవ్రంగా తప్పుబట్టాయి. శక్తివంతమైన లేజర్‌కాంతి వ్యవస్థలను అంతరిక్షంలో ఏర్పాటుచేసి ఉప గ్రహాలు సంచరించే కక్ష్యలను రణక్షేత్రాలుగా మార్చొద్దని ఇరు దేశాలు గోల్డెన్ డోమ్ ఆలోచనపై అభ్యంతరం వ్యక్తంచేశాయి. -
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
శత్రువుకి శత్రువు.. మిత్రుడు. అలాగే శత్రువుకి మిత్రుడు కూడా శత్రువే కదా!. కానీ, ఆ శత్రువునే తమ మిత్రుడిగా మార్చుకునేందుకు ఆఘమేఘాల మీద చైనా చేస్తున్న ప్రయత్నాలపై ‘‘అయ్యో.. పాపం’’ అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. సీపీఈసీ ప్రాజెక్టును ఆప్ఘనిస్థాన్ వరకు పొడిగించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం.పాక్, అఫ్గనిస్తాన్ ప్రతినిధుల మధ్య బుధవారం చైనా ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్యవర్తిత్వం వహించారు. ఈ భేటీ తర్వాత చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ఆ ఇరు దేశాలు దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. ఇందుకుగానూ ఇరు దేశాల పరస్పరం రాయబారులను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. సీపీఈసీ ప్రాజెక్టు ఒప్పందం అదే విషయం. అయితే.. పాక్-అఫ్గన్ దేశాల మధ్య బంధం ఎంతటి ధృడమైందో యావత్ ప్రపంచానికి తెలుసు. అఫ్గనిస్తాన్‌ను ఉగ్రవాదుల స్వర్గధామంగా పాక్ తరచూ అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే అఫ్గన్ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. 2024 డిసెంబర్లో అఫ్గన్ పాక్టికా ప్రావిన్స్‌లో పాక్ వైమానిక దాడులు జరిపి 50 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘోరంలో మరణించింది ఎక్కువగా మహిళలు, పిల్లలే. అయితే తాము ఉగ్ర శిబిరాలపై దాడి చేశామంటూ పాక్ ప్రకటించుకోవడం గమనార్హం. ఈ పరిణామంపై అఫ్గన్ రగిలిపోతూ వస్తోంది. అలాంటిది.. ఇప్పుడు, ఈ ఇరు దేశాలు ఇప్పుడు దగ్గరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ఎందుకీ తొందర?2021లో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. కానీ, ప్రపంచంలోని ఏ దేశం కూడా ఆ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. దీంతో అది తాత్కాలిక ప్రభుత్వంగానే కొనసాగుతోంది. అయితే చైనా, పాక్, రష్యా,ఇరాన్ దేశాలు సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నాయి. ఉగ్రవాద లిస్ట్ నుంచి ఆ దేశాన్ని తొలగించాయి. అయితే తాలిబన్ సర్కార్‌కు గుర్తింపు ఇవ్వకున్నా.. ఆ దేశం తరఫున తమ దగ్గర రాయబారికి అనుమతించింది చైనా. ఇక..భారత్ అఫ్గన్ తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. కానీ, వాళ్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు ప్రధానాంశంగా పలుమార్లు చర్చలు కూడా జరిపాయి. వాటిలో పురోగతి లేకున్నా.. మానవతా సాయం, అక్కడి పౌరుల బాగోగుల మీద దృష్టిసారిస్తూనే వస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడేందుకు దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే.. దౌత్యపరమైన సమావేశాలు గత ఏడాది కాలంలో చాలానే జరిగాయి. ఈ ఏడాది జనవరిలో భారత విదేశాగం కార్యదర్శి విక్రమ్ మిస్రీ, తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముట్టాఖితో దుబాయ్‌లో భేటీ అయి కీలక అంశాలపై చర్చించారు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా అమీర్ ఖాన్ ముట్టాఖితో కీలక సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామం.. భారత్‌లో దౌత్యవేత్తల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కాన్సులర్ సేవలతో పాటు పలు నగరాల్లో వ్యాపార, విద్య, వైద్యం కోసం వచ్చే అఫ్గన్ పౌరులకు సేవల అనుమతికి అంగీకారం తెలపడం లాంటి నిర్ణయాలకు వేదికైంది. ఇది ఓర్వలేక.. కుటిల బుద్ధితో.. భారత్ వ్యతిరేకిస్తున్న సీపెక్‌లో అఫ్గన్‌ను భాగం చేసిందని, హడావిడిగా తాలిబన్లకు చైనా ప్రాధాన్యం ఇస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు. -
అమెరికా గోల్డెన్ డోమ్.. భారత్ ఐరన్ డోమ్ ఇదే
ఢిల్లీ: అతి శక్తిమంతమైన ఆయుధాలు. అంతకు మించిన నిఘా సంపత్తి. అవడానికి చిన్న దేశమే అయినా సైనిక సంపత్తిలో మాత్రం ఇజ్రాయెల్ అక్షరాలా అమేయ శక్తే. సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంలో అటు ఇరాన్, ఇటు హిజ్బొల్లాలు ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడి చేశాయి. అయితే ఈ దాడిలో రాకెట్లను ఐరన్ డోమ్ అడ్డంగించింది.రాడార్ టెక్నాలజీ సాయంతో అడ్డగించి తుత్తునియలు చేసి తన సామర్థ్యం ఏంటో ఇజ్రాయెల్ ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ ఐరన్ డోమ్ వ్యవస్థపై ప్రపంచ దేశాలు కన్నేశాయి. మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఐరన్‌డోమ్‌తో శత్రు దుర్భేద్య దేశంగా పేరొందేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడీ ఐరన్ డోమ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికాను బాలిస్టిక్,క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షించేందుకు 175 బిలియన్ డాలర్ల వ్యవస్థతో గోల్డెన్ డోమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అసలు ఐరన్ డోమ్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఇది ఎలా పనిచేస్తోంది?వంటి వివరాలు చూద్దాం.గోల్డెన్ డోమ్ అంటే ఏమిటి?గోల్డెన్ డోమ్ అనేది అమెరికా కోసం రూపొందించబడిన అంతరిక్ష ఆధారిత క్షిపణి నిరోధక కవచం. శుత్రువులు ప్రయోగించిన రాకెట్లను భూమి మీదకు చేరుకునే లోపే అడ్డుకునేలా టెక్నాలజీని వినియోగిస్తోంది. ఉదాహరణకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌లు భూమి మీద ఉన్న ఇంటర్సెప్టర్లు (Interceptors) ఆధారంగా పనిచేస్తే, అమెరికా గోల్డ్ డోమ్ పూర్తిగా అంతరిక్షంలో శాటిలైట్ ద్వారా పనిచేస్తాయి. ఈ గోల్డెన్ డోమ్‌లో శాటిలైట్స్ ఉంటాయి. ఇవి క్షిపణులు ఎగురటం ప్రారంభమైన వెంటనే వాటిని గుర్తించి, ప్రారంభ దశలోనే వాటిని నిలువరించే సామర్ధ్యం సత్తా దీని సొంతం.ఈ సాంకేతికత అమెరికా భూమిపైకి మాత్రమే కాకుండా ఇతర ఖండాల నుండి లేదా అంతరిక్షం నుండి వచ్చే క్షిపణుల నుండి కూడా రక్షణ కలిగిస్తుంది. ఇది చైనా, రష్యా, ఉత్తర కొరియా, భవిష్యత్తులో ఇరాన్ లాంటి దేశాలు తలపెట్టే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అమెరికా రూపొందిస్తోంది.బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూయిజ్ క్షిపణుల నుంచి దేశాన్ని రక్షిస్తోంది. గోల్డెన్ డోమ్‌లో అవుటర్ లేయర్ స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్ (SBIRS),గ్రౌండ్-బేస్డ్ రాడార్స్తో పాటు,మిసైల్ లాంఛర్లను అడ్డుకుంటుంది. భారత్‌కు ఆకాశ్ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, అమెరికా గోల్డెన్‌డోమ్.. భారత్‌కు ఆకాశ్. ఆకాశ్ భారత్ క్షిపణి రక్షక వ్యవస్థ. 30 కి.మీ. దూరంలో, 18,000 మీ. ఎత్తులో ఎగురుతున్న శత్రు విమానాల్ని కూల్చేస్తుంది. గాల్లో ఎగురుతున్న యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గాలి నుండి భూమికి ప్రయోగించే క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులనూ నిర్వీర్యం చెయ్యగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. ఒక్కో ఆకాశ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు, ఒక్కో లాంచరులో మూడేసి క్షిపణులూ ఉంటాయి. ఇందులో ఒక రాజేంద్ర 3డీ పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎర్రే రాడార్ కూడా ఉంటుంది. ప్రతీ బ్యాటరీ ఏకకాలంలో 64 లక్ష్యాలను పరిశీలిస్తుంది. వాటిలో 12 లక్ష్యాలను ఛేదించగలదు.ఒక్కో క్షిపణిలో 60 కిలోగ్రాము శకలాలతో కూడుకున్న వార్‌హెడ్ ఉంటుంది.ఆకాశ్ వ్యవస్థ తేలిగ్గా ఎక్కడికంటే అక్కడికి తరలించవచ్చు. -
నీటి వివాదం.. పాక్ హోంమంత్రి ఇంటికి నిప్పు
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను దెబ్బ కొడుతూ భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ నదీ జలాలతో ముడిపడిన అంశం ఒకటి. భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. నీళ్లు లేకపోవడంతో పాక్ ప్రజలు ఎదురు తిరిగారు. పాక్ హోంమంత్రి జియా ఉల్ హసన్ ఇంటిని తగలబెట్టారు.ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీటి కటకటతో నిరసనకారులు హోమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగంగా ఏకే 47 గన్నుతో గాల్లోకి కాల్పులు జరుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్లో నీటి సంక్షోభంసింధు నది నుండి నీటిని మళ్లించి,పంజాబ్‌కు నీటి సరఫరాను పెంచేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కాలువను నిర్మించాలని యోచిస్తోంది. కానీ సింధ్‌లోని స్థానికులు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల తమ వ్యవసాయ భూములకు,తాగునీటికి ముప్పు వాటిల్లుతుందని,ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నామని ఈ ప్రాజెక్ట్ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు,ఐఎంఎఫ్ ఒత్తిడితో పంటలకు కనీస మద్దతు ధర (MSP) నిలిపివేయడంకార్పొరేట్ వ్యవసాయం కోసం వారసత్వ భూములను బలవంతంగా సేకరించడంలాభం కోసం పాకిస్తాన్ సైన్యం సైతం వ్యవసాయంలో భాగస్వామ్యం కావడం.. వంటి అంశాలపై పాక్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. తాజాగా, ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్థానికులు జాతీయ రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంతో అక్కడ నిరసనలు మిన్నంటాయి. పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఆందోళనకు దారితీసింది. ఇది ఘర్షణలకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు.పోలీసు అధికారులతో సహా అనేక మంది గాయపడ్డారు. నిరసనకారులు మోరోలోని హోంమంత్రి ఇంటిపై కూడా దాడి చేసి తగలబెట్టారు. House of Sindh Interior Minister Ziaul Hasan🇵🇰 pic.twitter.com/hQdD02tBBj— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) May 21, 2025పోలీసు చర్యకు ఆదేశించినందుకు స్థానికులు మంత్రిపై మండిపడుతున్నారు. నీటి కొరత కారణంగా సింధ్ విధ్వంసానికి దారితీసే విధానాలకు ఆయన మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. నిరసనకారులు ఆసుపత్రిలో గాయపడిన పోలీసు అధికారులపై దాడి చేయడంతో మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారులు యూరియా ఇతర ఎరువులతో వెళ్తున్న ట్రక్కులను దోచుకుని ఆపై వాటిని తగలబెట్టారు.స్పందించిన పాక్ ప్రభుత్వంఈ ఆందోళనపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సింధ్‌లో భద్రతను బలోపేతం చేసే దిశగా పారామిలిటరీ దళాలను మోహరించారు. దాడులలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పహల్గాం ఉగ్రదాడితో పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి అనంతరం సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ డీల్ ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్ కు హక్కులు లభించాయి. సింధూ నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు దక్కాయి. ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.దీంతో పాక్‌లో నీటి సమస్య ఉత్పన్నమవుతున్నాయి. -
హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లు
అమెరికాలో హెచ్ 1 బీ వీసా సాధించాలనేది ఐటీ ఉద్యోగుల కల. భారతీయ IT నిపుణులు, టెక్ సంస్థల నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఇచ్చే హెచ్1 బీ వీసాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. తాజాగా హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ దారుణంగా పడిపోయినట్టు కనిపిస్తోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత వీసా దరఖస్తులు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది.యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డేటా ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసా దరఖాస్తుల సంఖ్య నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య 26.9 శాతం తగ్గిందని యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ సంవత్సరం కేవలం 358,737 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి - ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 480,000లతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2025 లో 470,342 అర్హత గల రిజిస్ట్రేషన్లు 343,981 చేరాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ దరఖాస్తుల 308,613గా ఉంది.ప్రత్యేక లబ్ధిదారులు 442,000 నుండి 339,000 కు తగ్గారు ఒక్కో దరఖాస్తుదారుని సగటు రిజిస్ట్రేషన్లు 1.06 నుండి 1.01 కి తగ్గాయి. బహుళ రిజిస్ట్రేషన్లు కలిగిన లబ్ధిదారుల తరపున కేవలం 7,828 దరఖాస్తులు మాత్రమే దాఖలు కాగా గత ఏడాది ఈ సంఖ్య 47,314గా ఉంది. అయితే, పాల్గొనే కంపెనీల సంఖ్య 57,600 వద్ద సాపేక్షంగా స్థిరంగా ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, అనిశ్చితులే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వాదనలను కొట్టిపారేసిన యూఎస్సీఐఎస్ రిజిస్ట్రేషన్ శాతం తగ్గడానికి కారణం ట్రంప్ విధానాలు, వీసా నిబంధనలు కాదని వెల్లడించింది.. మోసాలు, అన్యాయమైన రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు తాము తీసుకుంటున్న చర్యలే కారణమని పేర్కొంది.ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో ట్రంప్ పరిపాలనలో విధానాలు, యుఎస్ చట్టాన్ని ఒక్కసారి ఉల్లంఘించిన వ్యక్తుల వీసాలను రద్దు చేసే "క్యాచ్-అండ్-రివోక్" నియమాన్ని తిరిగి ప్రవేశపెట్టడం. వీసా సంబంధిత రుసుము పెంపు, ప్రక్రియను మరింత క్లిష్టంగా మార్చిందంటున్నారు టెక్ సంస్థ యజమానులు. జనవరిలో, H-1B రిజిస్ట్రేషన్ రుసుమును 10 డాలర్ల నుంచి 215 కు పెంచిన సంగతి తెలిసిందే. ఈ చర్య ముఖ్యంగా స్టార్టప్‌లు. చిన్న సంస్థలకు చాలాఎక్కువగా ప్రభావితం చేసిందని గ్రాడింగ్.కామ్ వ్యవస్థాపకురాలు మమతా షెఖావత్ అన్నారు. అయితే హెచ్ 1-బి వీసాల డిమాండ్ గత సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా తగ్గినా, 2026లో అందుబాటులో ఉన్న 85,000 వీసాల కోసంరిజిస్ట్రేషన్ల సుమారు 3.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం.చదవండి: అల్జీమర్స్‌ను గుర్తించే రక్తపరీక్ష : వచ్చే నెలనుంచి అందుబాటులోకి -
అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణహత్య, షాకింగ్ రీజన్!
అమెరికాలోని టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఒక పబ్లిక్ బస్సులో హెల్త్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు దారుణ హత్య విషాదాన్ని నింపింది. భారత సంతతి కి వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా (30)ని తోటి భారతీయుడే పొడిచి చంపాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై అనూహ్యంతా కత్తితో విరుచుకు పడ్డాడు. దీంతో అక్షయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.అక్షయ్ గుప్తా మే 14వ తేదీన ఆస్టిన్లోని ఒక బస్సులో ప్రయాణిస్తుండగా, బస్సు వెనుక సీట్లో కూర్చుని ఉన్నట్టుండి ఎటాక్ చేశాడు. వేట కొడవలి లాంటి కత్తాడో పొడిచి పారిపోయాడు. నిందితుడిని 31 ఏళ్ల దీపక్ కండేల్గా గురించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ గుప్తాను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది..గుప్తా సంఘటన స్థలంలోనే మరణించినట్లు ఆస్టిన్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది.అక్షయ్ గుప్తాకు, నిందితుడు దీపక్ కండేల్‌కు మధ్య ఎలాంటి ఘర్షణ కానీ, వాగ్వాదం కానీ జరగలేదనేది సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అప్పటివరకు కామ్‌గా కూర్చున్న నిందుతుడు వేటకత్తితో బాధితుపై దాడి చేశాడన్నారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడు కండేల్‌ను గుర్తించి అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.దీపక్ నేర చరిత్రస్థానిక మీడికా కథనం ప్రకారం, కాండెల్కు 2016 నుండి నేర చరిత్ర ఉంది. తీవ్రమైన నేరాలు సహా విస్తృతమైన అరెస్టు చరిత్ర ఉందని, కానీ ఎప్పుడూ విచారణ జరగలేదు. ప్రాసిక్యూటర్లు అతనిపై అనేకసార్లు కేసు నమోదు చేయడానికి నిరాకరించారని కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. గతంలో 12 సార్లు అరెస్ట్ అయినట్టు సమాచారం. హత్యకు షాకింగ్ రీజన్అక్షయ్పై ఎటాక్ చేసిన కాండెల్ ఇతర ప్రయాణీకులతో కలిసి వాహనం నుండి దిగి వెళ్ళిపోయాడు. వెంటనే పెట్రోల్ అధికారులు కాండెల్ను పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన మామను పోలి ఉండటం వల్ల గుప్తాను పొడిచి చంపినట్లు నిందితుడు అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. -
175 బిలియన్ డాలర్లతో ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’.. చైనా, రష్యా ఆందోళన..
వాషింగ్టన్: ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధం వాతావరణం కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ వార్.. ఇక, ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ వంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, రక్షణ వ్యవస్థల గురించి చాలా చర్చలు జరిగాయి. ఇలాంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ దేశానికి కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. ఈ ‘గోల్డెన్ డోమ్’ కోసం ఏకంగా దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా( 175 బిలియన్ డాలర్లు)ఖర్చు చేస్తామని వెల్లడించారు.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి మూడేళ్లలోనే ‘గోల్డెన్ డోమ్’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతానికి 25 బిలియన్ డాలర్ల ప్రారంభ నిధులు కేటాయిస్తున్నామని, అంతిమంగా 175 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజల కోసం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.అత్యంత సాంకేతికతతో కూడిన మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాజెక్ట్ ను ఆమోదిస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్రంప్ తెలిపారు. గోల్డెన్ డోమ్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అవతలి నుంచి అమెరికాపై క్షిపణి దాడులు చేసినా ఇది తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. స్పేస్ నుంచి దాడులు చేసినా అమెరికాకు ఏమీ కాదన్నారు. మన దేశం విజయంలో.. మనం భూమి మీద నివసించాలంటే ఇలాంటివి అవసరం అని ట్రంప్ పేర్కొన్నారు.🚨 #BREAKING: President Trump and Secretary Hegseth have announced the GOLDEN DOME missile defense system for the U.S."Golden Dome will be capable of catching missiles from across the world or even SPACE.""We'll be completing the job Reagan started 40 years ago!"Trump also… pic.twitter.com/MX1URx1fa0— Nick Sortor (@nicksortor) May 20, 2025యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ నాయకత్వంలో గోల్డెన్ డోమ్ నిర్మాణం జరుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీని నిర్మాణంలో భాగం కావడానికి కెనడా సైతం ఆసక్తిని చూపినట్లు తెలిపారు. డోమ్ నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. దీనికి 542 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుండొచ్చని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేశాన్ని క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లు, అణు దాడుల నుంచి రక్షించడమే లక్ష్యంగా దీని ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.చైనా, రష్యా ఆందోళన..ఇక, ఇప్పటికే ఇజ్రాయెల్.. ఐరన్ డోమ్ వ్యవస్థను 2011 నుంచి ఉపయోగిస్తోంది. ప్రత్యర్థుల క్షిపణులు దూసుకొచ్చినా.. ఉక్కు కవచంలా వాటిని అడ్డుకునేందుకు టెల్అవీవ్ ఈ డోమ్‌ను ఉపయోగిస్తుంది. దీని నిర్మాణానికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. దీంతో అటువంటి గోల్డెన్ డోమ్‌ను అభివృద్ధి చేసుకునేందుకు అమెరికా (USA) సైతం సిద్ధమయ్యింది. అయితే, ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా, రష్యా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విధానం వల్ల అంతరిక్షం యుద్ధభూమిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. ప్రపంచంలో అస్థిర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశాయి. . @SecDef "The Golden Dome for America’s game changer. A generational investment in security in America and Americans..." pic.twitter.com/uazlPcCytR— DOD Rapid Response (@DODResponse) May 20, 2025 -
జైళ్లనిండా బుల్లి ఫోన్లే
ఇది రికార్డుల కోసం తయారు చేసిన బుల్లి ఫోన్ కాదు. ఎంచక్కా పని చేస్తుంది. ఫ్రాన్స్ జైళ్లలో ఖైదీలు వీటిని విచ్చలవిడిగా వాడుతున్నారు. జైలు నుంచే దర్జాగా డ్రగ్ డీల్స్ మొదలుకుని కాంట్రాక్ట్ హత్యల దాకా నానా దందాలూ చక్కబెట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంపై కొన్నాళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెంచి జైళ్లలో నిబంధనల జాడే లేనంతగా అరాచకం రాజ్యమేలుతోందని జనం మండిపడుతున్నారు. దాంతో జైళ్లలో ఫోన్ల వాడకంపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ‘ప్రిజన్ బ్రేక్’ పేరిట మంగళవారం దేశవ్యాప్తంగా ఏకంగా 66 జైళ్లలో ఏకకాలంలో తనిఖీ ఆపరేషన్ నిర్వహించారు. కరడుగట్టిన ఖైదీల వద్ద ఇలాంటి బుల్లి ఫోన్లు వేలాదిగా దొరకడంతో విస్తుపోయారు. కేవలం సిగరెట్ లైటర్ పరిమాణంలో ఉండే ఈ ఫోన్లన్నీ చైనా పీసులేనని విచారణలో తేలడం విశేషం! ఆపొరి్టక్ అనే ఫ్రెంచి కంపెనీ వీటిని విక్రయిస్తోంది. జైళ్లలో జరిపే ఎలాంటి ఎల్రక్టానిక్ తనిఖీలకూ ఇవి చిక్కవని వెబ్సైట్లో బాహాటంగా ప్రచారం చేసుకుంటోంది! దాంతో సదరు కంపెనీని ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టింది. -
పాక్ ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్
ఇస్లామాబాద్: భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అత్యున్నత మిలటరీ హోదా అయిన ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్ పొందారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ప్రధాని షరీఫ్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కట్టబెట్టేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై చర్చించి, ఆమోదం తెలిపిందని పేర్కొంది.ఇటీవల భారత్‌తో తలెత్తిన సైనిక ఉద్రిక్తతల సమయంలో పాక్ బలగాలను విజయం దిశగా నడిపించిన మునీర్ పదోన్నతి పొందారని స్థానిక మీడియా తెలిపింది. ఈ విషయంలో ఆయన అద్వితీయమైన పాత్ర పోషించారని ప్రశంసించింది. యుద్ధంలో తమదే విజయమంటూ పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటుండగా, భారత్ మాత్రం సాక్ష్యాధారాలతో వివిధ అంతర్జాతీయ వేదికలపై వాస్తవాలను వివరిస్తూ వస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ తిరుగులేని అధికారాలను చెలాయిస్తున్న మునీర్‌కు ఇటీవల ఆ దేశ సుప్రీంకోర్టు మరిన్ని అధికారాలను కట్టబెట్టడం తెల్సిందే. తాజాగా, ఆయనకు ప్రమోషన్ సైతం లభించడం గమనార్హం. Government of Pakistan has promoted Army Chief General Asim Munir to the rank of Field Marshal. ⭐⭐⭐⭐⭐ pic.twitter.com/NNrAM9Npzp— Ambassador Murad Baseer (@muradbaseer) May 20, 2025 -
అశ్లీల కంటెంట్‌పై అమెరికా కొరడా
వాషింగ్టన్: ఆన్లైన్లో అశ్లీల కంటెంట్‌పై అమెరికా కొరడా ఝళిపించింది. దాని నియంత్రణకు ‘టేకిట్ డౌన్’ పేరిట కొత్తం చట్టం తెచ్చింది. దీనిప్రకారం వ్యక్తుల తాలూకు అశ్లీల, అభ్యంతరకర ఫొటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా ఆన్లైన్, సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేయడానికి వీల్లేదు. సోషల్ ప్లాట్‌ఫాంలు అలాంటి కంటెంట్‌ను తమ దృష్టికి రెండు రోజుల్లోగా తొలగించాల్సి ఉంటుంది.ఈ నిబంధన డీప్‌ఫేక్ కంటెంట్‌కు కూడా వర్తిస్తుంది. ఈ చట్టం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ఎన్నాళ్లుగానో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత బిల్లుపై సోమవారం ఆమె సమక్షంలోనే ట్రంప్ సంతకం చేశారు. అనంతరం ఆయన కోరిక మేరకు మెలానియా కూడా బిల్లుపై సంతకం చేయడం విశేషం. ‘‘దీనికోసం మెలానియా ఎంతగానో పోరాడింది. కనుక ఆమె సంతకానికి అర్హురాలు’’ అని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. -
బ్రిటిష్ కశ్మీరీ ప్రొఫెసర్ ఓసీఐ రద్దు.. కారణమిదే..
లండన్: భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నవారిపై ప్రభుత్వం దృష్టిసారించింది. తాజాగా లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన బ్రిటిష్ అకాడమిక్ నితాషా కౌల్(Nitasha Kaul)కు చెందిన ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) స్టేటస్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా సాయంతో వెల్లడించారు.తాను భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నానని, ప్రత్యేకించి తన రచనలు, ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులు.. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని భారత ప్రభుత్వం తనపై ఆరోపణలు గుప్పించిందని నితాషా కౌల్ ఆ పోస్టులో పేర్కొన్నారు. గోరఖ్‌పూర్‌లో జన్మించిన కౌల్ కశ్మీరీ పండిట్, బ్రిటిష్ పౌరురాలు. ఆమె వెస్ట్మిన్స్టర్ విశ్వవిద్యాలయం(University of Westminster)లో సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ (సీఎస్డీ) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, యాక్టివిస్ట్‌గా కూడా పనిచేస్తున్నారు. భారత ప్రభుత్వం తన ఓసీఐ స్టేటస్‌ను రద్దు చేయడాన్ని క్రూరమైన, ప్రతీకార చర్యగా ఆమె అభివర్ణించారు.2024 ఫిబ్రవరిలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ‘రాజ్యాంగం, భారత ఐక్యత" అనే అంశంపై ఒక సమావేశంలో ప్రసంగించేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న నితాషాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని, లండన్‌కు తిరిగి పంపించారు. ఆమె రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను విమర్శించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు నాడు తెలిపారు. భారత ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో నితాషా కౌల్.. భారతదేశ సార్వభౌమత్వంపై దురుద్దేశపూరితంగా, వాస్తవాలు లేదా చరిత్రను పట్టించుకోకుండా రచనలు, ప్రసంగాలు, జర్నలిస్టిక్ కార్యకలాపాటు సాగించినట్లు పేర్కొంది. లండన్‌లోని భారత హైకమిషన్ నిర్దేశించిన ఓసీఐ నిబంధనల ప్రకారం, భారత ప్రభుత్వం ఏ వ్యక్తి కి చెందిన ఓసీఐ రిజిస్ట్రేషన్‌ను అయినా కొన్ని నిర్దిష్ట కారణాలతో రద్దు చేయవచ్చు.ఇది కూడా చదవండి: ప్రముఖ శాస్త్రవేత్త నార్లికర్ కన్నుమూత.. సాగించిన పరిశోధనలివే.. -
World Bee Day... అప్పుడు మనిషి జీవితం నాలుగేళ్లే!
తేనె.. ఎంత రుచికరమో అంత ఆరోగ్యదాయకం. ప్రతిరోజూ తగిన మోతాదులో తేనె(Honey)ను తీసుకోవడం ద్వారా పలు అనారోగ్యాల బారి నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. భూమిమీద కష్టించే జీవుల జాబితాలో తేనెటీగలు ముందుంటాయి. ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుతూ, మరోవైపు మనకు ఆరోగ్యాన్ని అందిస్తున్న తేనెటీగలకు సంబంధించిన చాలా విషయాలు మనకు తెలియదు. రాయల్ జియోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ లండన్ సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం భూమి మీద తేనెటీగలు లేకపోతే మనిషి జీవితం దుర్భరమవుతుంది. నేడు (మే 20) ప్రపంచ తేనేటీగల దినోత్సవం. ఈ సందర్భంగా తేనెటీగలు పర్యావరణానికి అందించే సాయాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి మీద బతికే హక్కు మనిషికి ఎంత ఉందో, మిగతా జీవరాశులకూ అంతే ఉంది. అయితే మనిషి తన అవసరాల కోసం మిగిలిన జీవుల ఉనికికి ముప్పు వాటిల్లే పనులు చేస్తున్నాడు. జీవ వైవిధ్యం(Biodiversity) కరువైతే ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింటుంది. చివరికి ఆ ప్రభావం మనిషి మీదే పడుతుంది. రాయల్ జియోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ లండన్ సైంటిస్టులు చెప్పినదాని ప్రకారం తేనెటీగలు లేని భూమి మీద మనిషి కేవలం నాలుగేళ్లు మాత్రమే బతకగలడు. మిగిలిన జీవులు కూడా దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంటాయి. నాడు ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ కూడా ‘తేనెటీగలు లేకపోతే మనిషి నాలుగేళ్ల కన్నా ఎక్కువ కాలం జీవించడం కష్టం’ అని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య అంతకంతకూ క్షీణిస్తోంది. దాదాపు 90 శాతం తేనెటీగలు ఇప్పటికే అంతరించిపోయాయి. ప్రస్తుతం పదిశాతం మాత్రమే మిగిలాయి. భవిష్యత్తులో తేనెటీగలను ల్యాబ్‌లలో ప్రత్యేకంగా పెంచుకోవావల్సిన పరిస్థితులు ఏర్పడేలా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచంలో పండించే 100 రకాల పంటలలో.. 90 రకాల పంటలు ఫలదీకరణం చెందాలంటే తేనెటీగలు ఎంతో అవసరం. దీని ప్రకారం చూస్తే, అధికశాతం శాతం వ్యవసాయం తేనెటీగల వల్లే జరుగుతోందని చెప్పుకోవచ్చు.ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్ వినియోగం మరింతగా పెరిగింది. సెల్ ఫోన్ సిగ్నల్స్(Cell phone signals) తేనెటీగలకు హాని కలిగిస్తున్నాయి. అవి తాము కట్టుకున్న గూడుకు వెళ్లే దారిని మర్చిపోయేలా చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో తేనెటీగలు మరణిస్తున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. మన పర్యావరణ వ్యవస్థలను సజీవంగా ఉంచడంలో తేనెటీగలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉంది.ఇది కూడా చదవండి: Meghalaya: మూక దాడి.. 15 ట్రక్కులు ధ్వంసం -
‘యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం.. కానీ’
కాల్పుల విరమణ దిశగా రష్యా, ఉక్రెయిన్ తక్షణం చర్చలు మొదలు పెడతాయని.. ఇరు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీ ఇందుకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.. పుతిన్‌తో ట్రంప్ సోమవారం రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా ఫోన్ చర్చలు జరిపారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ కూడా చర్చించారు.ఈ క్రమంలో యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదంటూ జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. రష్యా నియమాలు ఏంటో తనకు తెలియదన్న జెలెన్స్కీ.. ఈ యుద్ధంలో మేము చాలా కోల్పోయామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా పూర్తి కాల్పుల విరమణకు తాము సిద్ధం.. కానీ.. రష్యా అందుకు రెడీగా ఉన్నట్లు తనకు అనిపించడం లేదంటూ జెలెన్స్కీ చెప్పుకొచ్చారు.ముందుగా కాల్పుల విరమణను రష్యా అంగీకరించాలని.. ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలంటూ జెలెన్స్కీ కోరారు. మరో వైపు, ఈ కాల్పుల విరమణను ప్రతిపాదించినందుకు ట్రంప్‌నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
గాజాపై దాడులు ఆపకుంటే.. ఇజ్రాయెల్‌కు యూకే, ఫ్రాన్స్, కెనడా హెచ్చరిక
టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో పూర్తి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్(Israel) నిరంతరం తన దాడులను కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు ఇజ్రాయెల్ జరుపుతున్న తాజా సైనిక దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే ఆపకపోతే కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్(Gaza Strip)లో తాజాగా ‘ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్’ అనే పేరుతో కొత్త సైనిక దాడిని ప్రారంభించింది. ఉత్తర, దక్షిణ గాజాలో వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోంది. వీటిని మే 17 నుంచి ప్రారంభించింది. ఈ దాడులలో వందలాది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. మే 14, 2025న జబాలియాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులలో 48 మంది మరణించారు. వీరిలో 22 మంది పిల్లలు ఉన్నారని స్థానిక ఆసుపత్రులు తెలిపాయి.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఇటీవల ఈ దాడులను పూర్తి విజయం సాధించే వరకు కొనసాగిస్తామని, హమాస్‌ను నాశనం చేయడం, నిరాయుధీకరణ చేయడం, బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు మే 19, ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్ చేపడుతున్న అత్యంత దారుణమైన చర్యలను ఖండించారు. ఇజ్రాయెల్ తన సైనిక దాడులను ఆపకపోతే, సహాయ నిరోధకాలను ఎత్తివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ మూడు దేశాలు గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్‌లు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికాయి. కాగా ఇజ్రాయెల్ గత మార్చి నుండి గాజాకు ఆహారం, వైద్య సామగ్రి, ఇంధన సహాయాన్ని నిరోధించింది. దీని వల్ల గాజాలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. కాగా ఉత్తర గాజాలో పౌరులు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలావుండగా మే 19న ఇజ్రాయెల్ ఒక ప్రాథమిక పరిమాణంలో ఆహార సహాయాన్ని గాజాకు అనుమతిస్తామని ప్రకటించింది. ఫలితంగా అక్కడ ఆహారం సంక్షోభం నివారణ జరుగుతుందని తెలిపింది. అయితే, ఐక్యరాష్ట్ర సమితి (యూఎన్ఓ) ఈ సహాయాన్ని సముద్రంలో ఒక చుక్కగా అభివర్ణించింది.ఖతార్‌లోని దోహాలో.. గాజాలో కాల్పుల విరమణ, బందీల మార్పిడికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. హమాస్.. 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 సహాయ ట్రక్కుల అనుమతి తదితర ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఇజ్రాయెల్ ఈ దీనిపై ఇంకా బహిరంగంగా స్పందించలేదు. గతంలో గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించడానికి, యుద్ధాన్ని ముగించడానికి నిరాకరించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. హమాస్ నిరాయుధీకరణ దిశగా ముందడుగు వేస్తేనే గాజా యుద్ధం ముగుస్తుందని ఖతార్ చర్చలలో స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి -
తక్షణ చర్చలకు రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయి: ట్రంప్
వాషింగ్టన్: కాల్పుల విరమణ దిశగా రష్యా, ఉక్రెయిన్ తక్షణం చర్చలు మొదలు పెడతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీ ఇందుకు అంగీకరించినట్టు వెల్లడించారు. చర్చల విధి విధానాలను ఆ దేశాలే నిర్ణయించుకుంటాయని చెప్పారు. పుతిన్‌తో ట్రంప్ సోమవారం రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా ఫోన్ చర్చలు జరిపారు. అనంతరం జెలెన్స్కీతోనూ చర్చించారు.‘‘యుద్ధం ముగిశాక అమెరికాతో రష్యా భారీ ఎత్తున వ్యాపారం చేయాలని పుతిన్ అభిలషించారు. అందుకు నేను సరేనన్నాను’’ అని చెప్పుకొచ్చారు. తద్వారా ఉక్రెయిన్ కూడా భారీగా లబ్ధి పొందుతుందని అభిప్రాయపడ్డారు. యుద్ధానికి తెర దించడంపై పుతిన్, ట్రంప్ మధ్య ఇది మూడో ఫోన్ సంభాషణ కావడం విశేషం! చర్చల వివరాలను జెలెన్స్కీతో పాటు యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ తదితర దేశాధినేతలతో పంచుకున్నట్టు అధ్యక్షుడు వివరించారు. -
ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి
అరిజోనా: అమెరికాకు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. టిక్‌టాక్ ఇన్ఫ్లుయెన్సర్ ఎమిలీ కైసర్ మూడేళ్ల కుమారుడు ట్రిగ్ కైసర్ తమ ఇంటి వెనుకవున్న స్విమ్మింగ్ పూల్‌లో స్పృహలేని స్థితిలో కనిపించాడు. ఈ ఘటన అరిజోనాలోని చాండ్లర్‌లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే మే 12న సాయంత్రం ఏడు గంటల సమయంలో, చాండ్లర్ పోలీస్ విభాగానికి అష్లే డ్రైవ్‌లోని ఒక ఇంటి నుంచి కాల్ వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఇన్ఫ్లుయెన్సర్ ఎమిలీ కైసర్ కుమారుడు ట్రిగ్గా గుర్తించారు. వారు వెంటనే కార్డియోపల్మనరీ రిససిటేషన్(సీపీఆర్) చేశారు. అనంతరం బాలుడిని తొలుత చాండ్లర్ రీజినల్ హాస్పిటల్‌కు, ఆ తర్వాత ఫీనిక్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరు రోజుల తర్వాత, మే 18 ట్రిగ్ మృతి చెందాడు. అనంతరం చాండ్లర్ పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఈ వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలుడు పూల్‌లో మునిగి ఎలా మృతిచెందాడనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కాగా 26 ఏళ్ల ఎమిలీ కైసర్ టిక్‌టాక్ ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు పొందారు. ఆమెకు 3.4 మిలియన్ టిక్‌టాక్ ఫాలోవర్స్, వన్ మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె భర్త బ్రాడీ కైసర్. వీరి కుటుంబం అరిజోనాలోని చాండ్లర్‌లో 2024 నవంబర్ నుంచి ఉంటోంది.ఎమిలీ తన రోజువారీ జీవితం, భార్యగా, తల్లిగా తన అనుభవాలను, శుభ్రత, జీవనశైలి, బ్యూటీ టిప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ ఘటన తర్వాత, ఎమిలీ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మానేయడంతో ఆమె ఫాలోవర్స్ ఆందోళన చెందుతున్నారు. వారు ఆమెకు సానుభూతి సందేశాలు పంపుతున్నారు. కాగా అమెరికాలో పలువురు చిన్నారుల మరణానికి ఈత కొలనులు కారణంగా నిలుస్తున్నాయనిసెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(డీసీసీ) తెలిపింది.ఇది కూడా చదవండి: హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి -
హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి
టెక్సాస్: భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత రోహిత్ జాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘హెచ్–1బీ వీసాలను రద్దు చేయాలి. ఆ కార్యక్రమాన్నే ఆపేయాలి. హెచ్–1బీ వీసాదారులను అమెరికా నుంచి పంపించేయాలి’’అంటూ ట్రంప్ సర్కారుకు మతిలేని సూచనలు చేశారు. హెచ్–1బీ, ఇతర వీసాదారుల వీసాలు పునరుద్ధరించాలన్న రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్కారి్మక్ వ్యాఖ్యలను జాయ్ వ్యతిరేకించారు. అమెరికాను పోటీలో ముందు నిలపడంలో హెచ్–1బీ వీసా విధానం పాత్ర ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై ఆన్లైన్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. హెచ్–1బీ వీసాదారుల్లో అత్యధికులు భారతీయులేనన్నది తెలిసిందే. వారంతా జాయ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఆయన తన వలస నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. ‘మీరు సౌకర్యవంతంగా స్థిరపడ్డాక అందుకు దోహదపడ్డ నిచ్చెనను లాగేయాలని అనుకుంటున్నారా?’అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాయ్ కుటుంబం ఆ వీసా పథకం ద్వారానే లబ్ధి పొందిన విషయాన్ని మర్చిపోవద్దని అంటున్నారు. అమెరికా కంపెనీలు నిపుణులైన విదేశీయులను నియమించుకునేందుకు హెచ్–1బీ వీసా వీలు కలి్పస్తుంది. 2022లో జారీ అయిన 3.2 లక్షల హెచ్–1బీ వీసాల్లో 77 శాతం భారతీయులే దక్కించుకున్నారు. 2023లో 3.86 లక్షల వీసాల్లోనూ 72.3 శాతం వాటా వారిదే. హెచ్–1బీ వర్క్ వీసా తొలుత మూడేళ్లపాటు చెల్లుబాటవుతుంది. తరువాత ఆరేళ్ల పొడిగించుకోవచ్చు. -
స్వర్ణదేవాలయంపైనే దాడికి తెగించిన పాక్
అమృత్సర్: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశీ్మర్(పీఓకే)లోని ఉగ్రస్థావరాలపై భారత దాడులతో వెర్రెక్కిపోయిన పాకిస్తాన్ బలగాలు మే 8వ తేదీన పంజాబ్‌లోని ప్రఖ్యాత స్వర్ణదేవాలయాన్ని కూల్చేందుకు దుస్సాహసం చేశాయని తాజాగా వెల్లడైంది. గోల్డెన్టెంపుల్పై గగనతల దాడుల వివరాలను తాజాగా భారత ఆర్మీ మేజర్ జనరల్ కార్తీక్ సి.శేషాద్రి బహిర్గతంచేశారు. శేషాద్రి ఆర్మీలోని 15వ ఇన్ఫాంట్రీ డివిజన్లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్(జీఓసీ)గా సేవలందిస్తున్నారు. మే 8వ తేదీన పాక్ జరిపిన దాడులు, ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎలా తుత్తునియలు చేసిందో శేషాద్రి సోమవారం వివరించారు. ముందే అంచనా వేశాం ‘‘ఆపరేషన్ సిందూర్‌తో అనూహ్య దాడులను చవిచూసిన పాకిస్తాన్ వెంటనే భారత ఆర్మీ బేస్‌లతోపాటు జనావాసాలను లక్ష్యంగా చేసుకుంది. ఇవి చాలవన్నట్లు మత సంబంధ ప్రాంతాలపైనా విరుచుకుపడుతుందని మేం ముందే అంచనావేశాం. ఇందులో సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంపై క్షిపణులు ప్రయోగించే వీలుందని ఊహించాం. వెంటనే గగనతల రక్షణ వ్యవస్థను స్వర్ణదేవాలయం వద్ద మొహరించాం. ఆ ప్రాంత గగనతల రక్షణ వ్యవస్థను శత్రు దుర్బేధ్యంగా మార్చేశాం. ఊహించినట్లే పాకిస్తాన్ మానవరహిత గగనతల ఆయుధాలతో పాక్ స్వర్ణదేవాలయంపైకి దాడులు మొదలెట్టింది. దూసుకొస్తున్న డ్రోన్లు, క్షిపణులు, చిన్నపాటి అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్(యూఏవీ)లను భారత ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ గురిచూసి నేలమట్టంచేశారు. స్వర్ణదేవాలయానికి ఒక్క గీత కూడా పడనివ్వలేదు’’అని శేషాద్రి వివరించారు. మరోవైపు స్వర్ణదేవాలయం సహా పంజాబ్‌లోని పలు ప్రాంతాలను ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, ఎల్–70 డిఫెన్స్ గన్స్లతో తమ జవాన్లు ఎలా కాపాడారో భారత ఆర్మీ సోమవారం వివరించింది. సంబంధిత ఆయుధ వ్యవస్థల పనితీరును చూపే వీడియోను విడుదలచేసింది. -
యూకే ప్రొఫెసర్ ఓసీఐ హోదా రద్దు
లండన్: భారత సంతతికి చెందిన నితాషా కౌల్ అనే విద్యావేత్త ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) హోదాను కేంద్రం రద్దు చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘పలు అంతర్జాతీయ, సోషల్ మీడియా వేదికల్లో భారత్‌కు వ్యతిరేకంగా రాస్తున్నారు. ప్రసంగాలు చేస్తున్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని, దేశంలోని సంస్థలను లక్ష్యంగా చేసుకుని దురుద్దేశంతో, వాస్తవాలను పూర్తిగా విస్మరించి, చరిత్ర పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది’’ అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం పంపిన లేఖను కౌల్ ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘విద్యా రంగంలో చేసిన కృషికి నన్నిలా శిక్షించారు. అత్యంత దారుణం. మోదీ ప్రభుత్వ మైనారిటీ వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలకు మరో నిదర్శనం’’ అంటూ ఆరోపణలు గుప్పించారు. విదేశీ పౌరసత్వమున్న భారత సంతతి వ్యక్తులకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక హోదా ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా. ఇది జీవితకాలపు వీసా. ఇది ఉన్నవారు భారత్‌ను సందర్శించడానికి ఎలాంటి పరిమితులూ ఉండవు.విమానాశ్రయం నుంచే బహిష్కరణ‘ప్రజాస్వామ్యం– రాజ్యాంగ విలువలు’ అంశంపై ప్రసంగించేందుకు కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది కౌల్‌ను బెంగళూరుకు ఆహ్వానించింది. విమానాశ్రయంలో దిగగానే అధికారులు ఆమెను అడ్డుకుని 24 గంటల్లోనే బ్రిటన్‌కు తిప్పి పంపారు. ఆరెస్సెస్‌ను విమర్శి స్తున్నందుకే ఇలా చేశారని ఆమె అప్పట్లో ఆరోపించారు. ‘‘కర్నాటక ప్రభుత్వం ఆహ్వానంపై వస్తే కేంద్రం నాకు ప్రవేశం నిరాకరించింది. నా దగ్గర బ్రిటన్ పాస్‌పోర్ట్, ఓసీఐ కార్డు, ఇలా చెల్లుబా టయ్యే పత్రాలన్నీ ఉన్నాయి. ఇది నాకు మాత్రమే కాదు, నన్ను ఆహ్వానించిన బీజేపీ యేతర (కాంగ్రెస్) ప్రభుత్వానికి కూడా జరిగిన అవమానం’’ అని ఆక్షేపించారు. భారత్ విచ్ఛి న్నం కావాలని కోరుకునే కౌల్ వంటి ఓ పాక్ సానుభూ తిపరురాలిని ఆహ్వానించడం దారు ణమని బీజేపీ అప్పట్లో ఆరోపించింది. ఇలాంటి చర్యలతో కర్నాటక కాంగ్రెస్ సర్కారు దేశ ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తోందంటూ మండిపడింది.ఎవరీ కౌల్?నితాషా కౌల్ లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయంలో పాలిటిక్స్, అంతర్జాతీయ సంబంధాల విభాగంలో అధ్యాపకురాలు. జమ్మూ కశ్మీర్ నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌కు వలస వచ్చిన కశ్మీరీ పండిట్ల కుటుంబంలో జన్మించారు. ఢిల్లీలో పెరిగారు. ఢిల్లీ వర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ ఆనర్స్ చేశారు. 1997లో హల్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేయడానికి 21 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ వెళ్లారు. ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్, ఆర్థిక, తత్వశాస్త్రాల్లో పీహెచ్డీ చేశారు. బ్రిస్టల్ బిజినెస్ స్కూల్లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశారు. 2010లో భూటాన్‌లోని రాయల్ థింఫు కళాశాలలో సృజనాత్మక రచనలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమె రచయిత్రి, కవయిత్రి కూడా. -
పాక్ చెప్పిందంతా అబద్ధం
ఇస్లామాబాద్: రెండు నెలల క్రితం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఉదంతంలో ఆ దేశ ప్రభుత్వం, సైన్యం చెప్పినదంతా అబద్ధమని బలూచిస్తాన్ వేర్పాటువాదుల గ్రూప్ అయిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) సోమవారం ప్రకటించింది. రైలు హైజాక్ ఘటనలో తమదే పైచేయి అని పేర్కొంటూ సాక్ష్యాధారాలతో సవివరంగా ఒక వీడియోను రూపొందించి తాజాగా విడుదలచేసింది. పాకిస్తాన్లో విస్తీర్ణంపరంగా అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధిలో ఆమడదూరంలో నిలిచిపోయిన బలూచిస్తాన్ ప్రజలు ఏకమై తమ ప్రాంత స్వయంప్రతిపత్తే లక్ష్యంగా ఉద్యమిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఉద్యమంలో భాగంగా మార్చి 11వ తేదీన పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును వందలాది మంది బలూచ్ సాయుధులు రైలు పట్టాలను పేల్చేశాక హైజాక్ చేయడం తెల్సిందే. అయితే ఈ ఘటనలో బలూచ్ మిలిటెంట్లను హతమార్చి వందల మంది ప్రయాణికులను కాపాడామని పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ప్రకటించాయి. అయితే అదంతా అబద్ధమంటూ 36 నిమిషాల వీడియోను బలూచ్ ఆర్మీ మీడియా విభాగం హక్కాల్ ఒక వీడియోను బయటపెట్టింది. అందులో దాడికి ముందే సుశిక్షితులైన వందలాది మంది బీఎల్ఏ ఫైటర్లు షూటింగ్ ప్రాక్టీస్ చేయడం, రైలును హైజాక్ చేశాక ఏ బోగీ జనాలను ఎటువైపు తీసుకెళ్లాలి? ఎవరి బాధ్యతలు ఏమిటి? వంటి వాటితోపాటు బందీలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా జాగ్రత్తగా రైలు నుంచి దూరంగా తీసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. బందీలను చిత్రహింసలకు గురిచేసి కొందరిని చంపేశామన్న పాక్ సైన్యం వాదనల్లో నిజంలేదని బీఎల్ఏ ఈ వీడియోతో నిరూపించింది. బందీల్లో 200 మంది పాక్ పోలీసులు, అధికారులు ఉన్నారు. వాళ్లను రెండు రోజులపాటు బంధించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులను హింసించారన్న వాదనలో వాస్తవం లేదని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. అసలు దాడి చేయడానికి గల కారణాలు, ఆవశ్యకతను బీఎల్ఏ సీనియర్ నేత ఒకరు ఈ వీడియో మొదట్లోనే స్పష్టంచేశారు. ‘‘మా పోరాటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఉద్యమం కీలకదశకు చేరుకుంటోంది. ఈ దశలో సంక్షిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చంది. మా యువ ఫైటర్లు ఇలాంటి కఠిన నిర్ణయాలను అమలుచేయాల్సి వచి్చంది. ఇలాంటి నిర్ణయాలుకాకుండా మరే ప్రత్యామ్నాయాలు లేవని మా వాళ్లకూ అర్థమైంది. తుపాకీని నిలువరించాలంటే తుపాకీని పట్టుకోవాల్సిందే. తుపాకీ పేలుడు శబ్దం కూడా కొంత దూరం వరకే వినిపిస్తుంది. తన తండ్రి కోసం తనయుడు ప్రాణత్యానికైనా సిద్ధమయితే అదే కొడుకు కోసం తండ్రి కూడా ఎంతకైనా తెగిస్తాడు’’అని ఆయన చెప్పాడు. హైజాక్ ప్రణాళిక రచన, అమలు, ముందుండి నడిపించి ఫిదాయీ ఫైటర్ యూనిట్ మజీద్ బ్రిగేడ్ వివరాలు, ఫొటోలు, సభ్యుల స్పందనలను వీడియోకు జతచేశారు. పాక్ సైన్యం ప్రతిదాడిచేసినా అత్యల్ప స్థాయిలో తమ వైపు ప్రాణనష్టం జరిగిందంటూ వీరమరణం పొందిన వాళ్లకు నివాళులు అరి్పంచిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 30 గంటలపాటు సైనిక ఆపరేషన్ తర్వాత 33 మంది రెబల్స్‌ను మట్టుబెట్టామని పాక్ సైన్యం ఆనాడు ప్రకటించింది. బందీలను విడిపించే క్రమంలో 23 మంది జవాన్లు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు చనిపోయారని తెలిపింది. అయితే తాము మాత్రం బందీలుగా ఉన్న 214 మంది పాకిస్తాన్ పోలీసులందరినీ చంపేశామని రెబల్స్ ప్రకటించారు. -
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుందని, బంగారం ధరలు భారీగా పెరుగుతాయని చెప్పిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు తాజాగా రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి హెచ్చరికను జారీ చేశారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.1998లో వాల్ స్ట్రీట్ కలిసి హెడ్జ్ ఫండ్ LTCM: లాంగ్ టర్మ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ను బెయిల్ చేసింది. 2008లో సెంట్రల్ బ్యాంకులు వాల్ స్ట్రీట్‌ను బెయిల్ అవుట్ చేయడానికి కలిసి వచ్చాయి. 2025లో, చిరకాల స్నేహితుడు జిమ్ రికార్డ్స్, సెంట్రల్ బ్యాంకులను ఎవరు బెయిల్ అవుట్ చేయబోతున్నారని అడుగుతున్నాడు?, అని రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సంక్షోభానికి మాజీ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కారణమని ఆయన ఆరోపించారు. ప్రతి సంక్షోభం పెద్దదిగా మారుతుంది, ఎందుకంటే అవి సమస్యను ఎప్పటికీ పరిష్కరించవు. 971లో నిక్సన్ యూఎస్ డాలర్‌ను బంగారు ప్రమాణం నుంచి తొలగించినప్పుడు ప్రారంభమైన సమస్య.. 1.6 ట్రిలియన్ డాలర్ల స్టూడెంట్ లోన్ ద్వారా ప్రేరేపితమైంది.ఇదీ చదవండి: ప్రభుత్వ పథకంతో రోజుకు రూ. 10వేలు సంపాదించొచ్చా?: పీఐబీ క్లారిటీ..నేను (రాబర్ట్ కియోసాకి) 25 సంవత్సరాల క్రితం రిచ్ డాడ్ పూర్ డాడ్లో చెప్పినట్లుగా.. ''ధనవంతులు డబ్బు కోసం పని చేయరు'', ''పొదుపు చేసేవారు ఓడిపోతారు''. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం డబ్బును ఆదా చేయడం కాదు. రాబోయే సంక్షోభం నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం.. బంగారం, వెండి, బిట్కాయిన్లను ఆదా చేయడం మాత్రమే. ప్రత్యామ్నాయ మార్గాలు లేవని ఆయన స్పష్టం చేశారు.2012లో రిచ్ డాడ్స్ ప్రాఫసీలో నేను హెచ్చరించిన క్రాష్ ప్రారంభమైంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. బంగారం, వెండి, బిట్కాయిన్లను ఆదా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రాబోయే సంక్షోభం నుంచి కాపాడుకోండని రాబర్ట్ కియోసాకి తన సుదీర్ఘ ట్వీట్ ముగించారు.In 1998 Wall Street got together and bailed out a hedge fund LTCM: Long Term Capital Management.In 2008 the Cental Banks got together to bail out Wall Street.In 2025, long time friend, Jim Rickards is asking who is going to bail out the Central Banks?In other words each…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 18, 2025 -
మాజీ ప్రధానిగా నటనకు ప్రశంసలు, హత్యాయత్నం కేసులో అందాల నటి
ఆమె ఒక అందాల నటి. తన నటనా చాతుర్యంతో అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయింది. ఢాకాలోని షాజహాన్ లాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం కేసులో ఆదివారం ఆమెను అరెస్టు చేశారు. ఇంతకీ ఎవరా నటి? ఆమె చేసిన తప్పేంటి? పోలీసలు ఆమెపై ఎందుకు కన్నేశారు? తెలుసుకుందాం.హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను అరెస్ట్ చేసిన పోలీసులు గట్టి భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు. ఢాకాలోని స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించడంతో ఆమెను జైలులోనే ఉండనుంది. దీనిపై నుస్రత్ ఫరియా న్యాయవాది బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీన్ని ఈ నెల(మే) 22న విచారిస్తుంది. గత సంవత్సరం షేక్ హసీనా ప్రభుత్వం కూల్చివేత, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దారితీసిన నిరసనలతో ఈ అరెస్ట్ ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నుస్రత్ ఫరియాపై అవామీ లీగ్‌కు నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.నివేదికల ప్రకారం ఫరియా థాయిలాండ్‌కు వెళ్లాల్సి ఉండగా విమానాశ్రయంలో పోలీసులు అడ్డకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి హసీనా పాత్రను ఫరియా పోషించి పాపులర్ అయింది ఫరియా. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్' చిత్రంలో హసీనా పాత్ర ఫరియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2023నాటి ఈ మూవీకి శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్ , భారతదేశం కలిసి నిర్మించగా అరిఫిన్ షువూ టైటిల్ పాత్రలో నటించారు.చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్గత నెల వరకు,హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత సంవత్సరం జరిగిన నిరసనలకు సంబంధించి కనీసం 137 మంది జర్నలిస్టులు 32 కేసుల్లో చిక్కుకున్నారు. కేసులోని వివరాల ప్రకారం నుస్రత్ ఫరియా, నటుడు అపు బిశ్వాస్, నిపున్ అక్తర్, అష్నా హబీబ్ భబ్నా, జాయెద్ ఖాన్ మరో 12 మందితో కలిసి భటారా ప్రాంతంలో జరిగిన వివక్ష వ్యతిరేక ఉద్యమం సందర్భంగా నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. షేక్ హసీనా, 283 మందిపై కూడా ఇదే కేసులో ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారా ఎన్నుకునే వరకు పాలనను నిర్ధారించేలా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, కొంతమందివ్యక్తులను, పత్రికలను లక్ష్యంగా చేసుకున్నట్లు పౌర హక్కుల సంస్థలు, నేతలు మండి పడుతున్నారు. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి, తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటి నుండీ ఉగ్రవాదులు జైలు నుండి విడుదలవుతున్నారు. ప్రస్తుత పాలనలో ఉగ్రవాదులకు మద్దతుగా, భారత వ్యతిరేక స్వరాలకు ఊతమిచ్చినట్టవుతోందనే విమర్శలు బాగా విని పిస్తున్నాయి. నుస్రత్ ఫరియా 2013లో టెలివిజన్ యాంకర్‌గా పనిచేసింది. అందుకు ముందు రేడియో జాకీగా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆమె కొన్ని నాటకాల్లో కూడా నటించింది. 2015లో బంగ్లాదేశ్-భారత్ సంయుక్తంగా నిర్మితమైన ‘ఆషికి’ ద్వారా వెండితెరకు పరిచయం మంది. అరంగేట్రంలోనే అందరి దృష్టినీ తమనవైపు తిప్పుకుంది. అనేక సినిమాల్లో నటించింది. ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..! -
అగ్నిపర్వతం బద్దలు.. అధికారుల్లో టెన్షన్.. కారణం ఇదే..
పడాంగ్: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం ధాటికి దాదాపు ఆరు కిలోమీటర్ల ఎత్తుకు మందంపాటి బూడిద ఎగసి పడింది. దీంతో, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకి-లకిలో ఉన్న అగ్నిపర్వతం సోమవారం ఉదయం బద్దలైంది. ఈ సందర్భంగా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవొటోబి లకిలకిలో విస్ఫోటనాలు ఏర్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో మరిన్ని విస్ఫోటనాలు సంభవించే అవకాశం ఉందని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ అధిపతి ముహమ్మద్ వాఫిద్ పేర్కొన్నారు. ఈ సమయంలో వర్షాలు పడితే అగ్నిపర్వతం చుట్టూ ఉన్న ప్రాంతాలకు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అన్నారు.ఇదే సమయంలో అగ్నిపర్వతం నుంచి దాదాపు 6 కి.మీ ఎత్తుకు మందంపాటి బూడిద ఎగసిపడుతున్నట్లు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. త్వరగా గ్రామాలను ఖాళీ చేయించి, అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.VIDEO: Indonesia's Mount Lewotobi Laki-Laki -- located on the tourist island of Flores -- erupts again, spewing thick ash up to 6,000 meters above its peak. pic.twitter.com/1afAM1qe3K— AFP News Agency (@AFP) May 18, 2025 -
బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్.. స్పందించిన ట్రంప్, కమలాహారిస్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. బైడెన్ ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తాజాగా ఆయన కార్యాలయం వెల్లడించింది. ఇటీవల ఆయనకు జరిపిన ఆరోగ్య పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధరణ అయినట్లు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. బైడెన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల బైడెన్‌కు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా ఆయన ప్రొస్టేట్‌లో చిన్న కణతి ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో, పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని అందులో వెల్లడించింది. దీనికి సంబంధించి చికిత్స అందించే అంశంపై బైడెన్ కుటుంబసభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ స్పందించారు. బైడెన్ క్యాన్సర్ అనే విషయం తనను కలచి వేసిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బైడెన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బైడెన్ పోరాట యోధుడని పేర్కొన్న ఆమె.. ఈ క్యాన్సర్‌ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.Doug and I are saddened to learn of President Biden’s prostate cancer diagnosis. We are keeping him, Dr. Biden, and their entire family in our hearts and prayers during this time. Joe is a fighter — and I know he will face this challenge with the same strength, resilience, and… pic.twitter.com/gG5nB0GMPp— Kamala Harris (@KamalaHarris) May 18, 2025మరోవైపు.. బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ కావడంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్.. ‘జో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ కావడం దురదృష్టకరం. ఈ విషయం తెలిసి నేను, మెలానియా చాలా బాధపడ్డాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. "Melania and I are saddened to hear about @JoeBiden’s recent medical diagnosis. We extend our warmest and best wishes to Jill and the family, and we wish Joe a fast and successful recovery." –President Donald J. Trump 🇺🇸 pic.twitter.com/6HjermTGK7— The White House (@WhiteHouse) May 18, 2025 -
Operation Smiling Buddha: బుద్ధుడు నవ్విన వేళ
51 ఏళ్ల క్రితం. 1974 మే 18. ఆ రోజు థార్ ఎడారిలోని ఇసుక మేటల్లో పుట్టిన ‘భూకంపం’ యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ’ పేరుతో రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో భారత్ తొలి అణుపరీక్ష నిర్వహించింది. శాస్త్ర సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటింది. ఐరాస భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల తర్వాత అణుపరీక్ష చేసిన తొలి దేశంగా అవతరించింది. పోఖ్రాన్–1 న్యూక్లియర్ టెస్ట్‌గా పిలిచే ఈ ప్రయోగాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ సారథ్యంలో అత్యంత రహస్యంగా చేపట్టారు.ఏ దేశాలు వ్యతిరేకించాయి? అణుబాంబుల బాధిత దేశమైన జపాన్ మొట్టమొదట ఈ పరీక్షలను తీవ్రంగా ఖండించింది. భారత్‌పై కఠిన ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఆ్రస్టేలియా సైతం ఇదే పాట పాడింది. రెండ్రోజుల తర్వాత జరిగిన ఐరాస నిరాయుదీకరణ సమావేశంలో ఆ్రస్టేలియా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ అణుబాంబురహిత అవని కోసం అంతా ఎదురుచూస్తుంటే పేలుళ్లతో అందరి ముఖం మీద భారత్ చెంప వాచిపోయేలా కొట్టింది’’ అని ఆ్రస్టేలియా ప్రతినిధి జాన్ క్యాంప్‌బెల్ వ్యాఖ్యానించారు. ద.కొరియా, మలేసియా, న్యూజిలాండ్ సైతం ఇలాగే స్పందించాయి.అమెరికా కన్నుగప్పి...1974 ప్రయోగంలో అణు విచ్చిత్తి సిద్ధాంతంతో తయారైన అణుబాంబును పరీక్షించారు. అత్యధిక పీడనం, ఒత్తిడితో అత్యల్ప పరిమాణంలోకి ఇమిడ్చిన ప్లుటోనియంను పేలేలా చేశారు. కేంద్రక విచ్చిత్తిలో బరువైన ఫ్లుటోనియం అణువులోని కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక ఉష్ణశక్తి వెలువడుతుంది. ఆ క్రమంలో జరిగే భారీ విస్ఫోటం పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన అణుబాంబులు ఈ రకానివే. ఈ ప్రయోగం కోసం కోసం ముంబై సమీపంలోని కెనడా ఇండియా రియాక్టర్ యుటిలిటీ సర్వీసెస్ (సిరస్) నుంచి తెప్పించిన ఆరు కిలోల ప్లుటోనియం వాడారు. అది పేలడానికి పొలోనియం–బేరియం పేలుడు పదార్థాన్ని జతచేశారు. దాన్ని పేల్చే వ్యవస్థను చండీగఢ్, పుణెల్లో అభివృద్ధిచేశారు. షట్కోణాకృతిలోని 1,400 కిలో బాంబు అమెరికా నిఘా కంటికి చిక్కకుండా ఇసుకతో కప్పేసి రైలు మార్గాన థార్‌కు తరలించారు!చాన్నాళ్ల క్రితమే బీజం అణుబాంబు తయారీ కోసం భారత్ 1967 నుంచే విస్తృత పరిశోధనలు మొదలు పెట్టింది. ప్రఖ్యాత అణు భౌతిక శాస్త్రవేత్త రాజా రామన్న సారథ్యంలో పీకే అయ్యంగార్, రాజగోపాల చిదంబరం వంటి 75 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అణుబాంబు తయారీలో తలమునకలయ్యారు. 1972 సెపె్టంబర్ 7న ప్రధాని ఇందిర బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)ను సందర్శించారు. అణుపరీక్షపై ముందుకెళ్లాలని శాస్త్రవేత్తల బృందానికి దిశానిర్దేశం చేశారు. ప్రయోగానికి ఒక రోజు ముందు, అంటే 1974 మే 17న రాజా రామన్నకు ఇందిర ఫోన్ చేశారు. ‘‘డాక్టర్ రామన్నా! ఇక మనమేంటో చూపిద్దాం. మనం చేసే పని దేశానికి ఎంతో మేలు చేకూరుస్తుంది’’ అన్నారు. ఆ మర్నాడు జరిగిన అణుపరీక్షకు పోఖ్రాన్ టెస్ట్ రేంజ్‌లోని ఇండియన్ ఆర్మీ బేస్ వేదికైంది. అణుపరీక్ష అత్యంత శాంతియుతంగా జరిగిందని విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రపంచదేశాలు మాత్రం భారత్ అణ్వస్త్ర వ్యాప్తికి పాల్పడుతోందని కుతకుతలాడాయి. మనపై ఆంక్షల కత్తి దూశాయి.ఆ మీట నొక్కిందెవరు?మే 18 ఉదయం 8.05 గంటలకు శాస్త్రవేత్త ప్రణబ్ రేబతిరంజన్ దస్తీదార్ ఫైరింగ్ బటన్ నొక్కారు. ‘‘బటన్‌ను నొక్కేందుకు అంతా ఆసక్తి చూపారు. దాంతో ట్రిగ్గర్ తయారీలో కీలకపాత్ర పోషించిన ప్రణబ్‌కే చాన్సివ్వాలని నిర్ణయించాం’’ అని రాజా రామన్న తన ‘ఇయర్స్ ఆఫ్ పిల్గ్రిమేజ్’ పుస్తకంలో వెల్లడించారు. నాడు బార్క్ గ్రూప్ డైరెక్టర్‌గా ఉన్న ప్రణబ్ తర్వాత ఐరాస అణుఇంధన సంస్థ డైరెక్టర్‌గా చేశారు. భారత తొలి దేశీయ అణుఇంధన జలాంతర్గామి తయారీలో కీలకపాత్ర పోషించారు.‘స్మైలింగ్ బుద్ధ’ ఎందుకు? 1974లో బుద్ధ పూరి్ణమ మే 18న వచి్చంది. అందుకే ప్రయోగానికి ఇందిర ఆ పేరు పెట్టారు. ఆ మేరకు సైంటిస్ట్ రాజా రామన్నకు రహస్య సందేశం పంపారు. ప్రయోగం విజయవంతం అయ్యాక ‘ఎట్టకేలకు బుద్ధుడు నవ్వాడు’ అంటూ ఆయన ఇందిరకు మెసేజ్ పంపారు.1998లో పోఖ్రాన్–2 అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో రెండు దశాబ్దాల పాటు భారత్ అణుపరీక్షలకు దూరంగా ఉంది. ఆ సమయంలో పుష్కలంగా కూడగట్టుకున్న అణు సాంకేతికతను జోడించి 1998లో ‘ఆపరేషన్ శక్తి’ పేరిట మళ్లీ అణుపరీక్షలకు దిగింది. దీన్నే పోఖ్రాన్–2 అని కూడా అంటారు. అప్పుడూ మే లోనే ప్రయోగం జరగడం విశేషం. అమెరికా నిఘా సంస్థ సీఐఏ కళ్లుగప్పి మే 11న థార్ ఎడారిలో మరోసారి దిగి్వజయంగా ప్రయోగం నిర్వహించింది. అణు, హైడ్రోజన్ బాంబులను ఏకకాలంలో పేలి్చంది. రెండు రోజులకు మే 13న మరో రెండు అణుబాంబులను పేల్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎవరెస్ట్‌పైకి 19వసారి!
కఠ్మాండు: ప్రఖ్యాత బ్రిటిష్ పర్వతారోహకుడు కెంటన్ కూల్ (51) సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ను రికార్డు స్థాయిలో 19వ సారి అధిరోహించారు. ఈ ఘనత సాధించిన తొలి షెర్పాయేతరుడిగా నిలిచారు. ఈ విషయంలో కూల్ తన రికార్డును తానే అధిగమించడం విశేషం. మౌంటెయిన్ గైడ్ అయిన కూల్ ఇతర అధిరోహకులతో కలిసి ఆదివారం 8,849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఆయన 2004లో తొలిసారి ఎవరెస్ట్‌ను అధిరోహించారు. అప్పటినుంచి 2014, 2015, 2020ల్లో మినహా ఏటా ఎవరెస్ట్ ఎక్కుతూ వస్తున్నారు. మంచు చరియలు విరిగిపడటం వల్ల 2014లో, భూకంపంతో 2015లో, కరోనా కారణంగా 2020లో ఎవరెస్ట్ యాత్ర జరగలేదు. ఎవరెస్ట్‌ను అత్యధిక పర్యాయాలు అధిరోహించిన రికార్డు మాత్రం నేపాలీ షెర్పాలదే. షెర్పా గైడ్ కమి రిటా అత్యధికంగా 30సార్లు ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం ఆయన మరోసారి శిఖరాన్ని చేరుకునే ప్రయత్నంలోనే ఉండటం విశేషం! -
సముద్రగర్భంలో పెను విస్ఫోటం!
అగ్నిపర్వతం బద్దలైనప్పుడు నిప్పులు చిమ్ముతూ లావా నింగిలోకి ఎగసిపడటం, విపరీతంగా ధూళి సమీప గ్రామాలపై దుమ్ము దుప్పటి కప్పేయడం టీవీల్లో చూసే ఉంటారు. వీటికి పూర్తిభిన్నమైన అగ్నిపర్వతం అతి త్వరలో బద్దలుకానుందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని ఆస్టోరియా నగర తీరానికి 300 మైళ్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రం లోపల ఈ అగ్నిపర్వతం దాగి ఉంది. దీని పేరు యాక్సియల్ సీమౌంట్. భూ ఉపరితలం మీద కాకుండా పసిఫిక్ మహాసముద్రం ఉపరితలానికి 1.4 కిలోమీటర్ల లోతులో ఉండటమే ఈ అగ్నిపర్వతం ప్రత్యేకత. ఎందుకంత ప్రత్యేకత? ఈ అగ్నిపర్వతం రెండు భూ పలకలు ఢీకొనే చోట ఏర్పడింది. పసిఫిక్ భూ పలక, జువాన్ డీ ఫ్యూకా భూ పలకలు తరచూ అత్యంత స్వల్పంగా కదులుతుంటాయి. ఈ క్రమంలో ఇవి పరస్పరం తగులుతూ భూమి ఉపరితల పొరల కదలికలకు కారణం అవుతున్నాయి. వీటి సమీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం త్వరలో బద్దలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలోని హ్యాట్‌ఫీల్డ్ మెరైన్ సైన్స్ సెంటర్లో పరిశోధకుడైన బిల్ చాడ్విక్ ఈ వివరాలను వెల్లడించారు. ‘‘భూకేంద్రంలో ద్రవరూపంలోని శిలలు అగ్నిపర్వతం ద్వారా బయటకు వస్తాయి. ఈ శిలాద్రవం (మాగ్మా) వెంటనే సముద్ర జలాలకు తగిలి చల్లబడుతుంది. ఈ క్రమంలో అక్కడి సముద్ర జలాలు వేడెక్కుతాయి’’ అని చాడ్విక్ చెప్పారు.వేల కొద్దీ భూకంపాలు! ‘‘అగ్నిపర్వతం ఎత్తు కేవలం 3,300 అడుగులు. కానీ అత్యంత క్రియాశీలంగా తయారైంది. ఇటీవలికాలంలో శిలాద్రవం బయటికొచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. భూమి కంపిస్తోంది. అగ్నిపర్వతం తాజా స్థితిని తెల్సుకునేందుకు మేం సమీప ప్రాంతం దాకా కేబుల్ వ్యవస్థ ద్వారా భూకంప తీవ్రతలను కనిపెట్టే ఏర్పాట్లుచేశాం’’ అని ఆయన చెప్పారు. ‘‘ అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు భూమి వందల సార్లు కంపిస్తుంది. ఇక అగ్నిపర్వతం బద్దలైన సందర్భాల్లో వేల సార్లు కంపిస్తుంది. 2015 ఏప్రిల్‌లో చివరిసారిగా అగ్నిపర్వతం బద్దలైంది. అప్పుడు విపరీతంగా శిలాద్రవం బయటకు ఎగజిమ్మింది. అప్పుడు 24 గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో 10,000 చిన్నపాటి భూకంపాలు వచ్చాయి. ఈసారి కూడా అదే స్థాయిలో భూమి కంపించే వీలుంది’’ అని ‘యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ ఓషనోగ్రఫీ’లో మెరైన్ జియోఫిజిసిస్ట్, ప్రొఫెసర్ విలియం విల్కుక్ స్పష్టంచేశారు. జీవవైవిధ్యానికి బాసట అగ్నిపర్వతం బద్దలైనప్పుడు భారీ స్థాయిలో శిలాద్రవం మహాసముద్రజలాల్లో కలిసిపోతుంది. ఈ శిలాద్రవంలో ఎన్నో రకాల మూలకాలు ద్రవరూపంలో ఉంటాయి. ఇవన్నీ సముద్రజలాల్లో సమ్మిళితమై అక్కడి సూక్ష్మజీవులకు ఆహారంగా మారతాయి. ఈ సూక్ష్మజీవులపై ఆధారపడిన చిన్న జలచరాలు, వాటిని ఆహారం తీసుకునే చేపలు.. ఇలా ఆహార చక్రం సదా సవ్యంగా కొనసాగేందుకు అగ్నిపర్వతం పరోక్షంగా సాయపడుతోంది. అత్యంత వేడితో సెగలు కక్కే మాగ్నా సముద్ర ఉపరితలానికి ఎగసిపడగానే అక్కడ జీవులు కొన్ని చనిపోయినా తర్వాత మాత్రం అక్కడ జీవరాశి పెరుగుదలకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలో జీవం మనుగడకు అగ్నిపర్వతాలు సైతం తమ వంతు సాయం చేస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో మెరైన్ జియోలజీ, జియోఫిజిక్స్ విభాగ ప్రొఫెసర్ డెబీ కెల్లీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్‌కు ఐఎంఎఫ్ మరో 11 షరతులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు బెయిల్ ఔట్ ప్యాకేజీ నిధులు విడుదల చేసే విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) 11 కొత్త షరతులు విధించింది. అలాగే భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకోవడం తగదని హితవు పలికింది. ఉద్రిక్తతలు పెంచుకొంటే మీకే ఎక్కువ సమస్యలు వస్తాయని తేల్చిచెప్పింది. ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, సంస్కరణ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుందని తేల్చిచెప్పింది. బిలియన్ డాలర్ల(రూ.8,540 కోట్లు) రుణానికి సంబంధించిన నిధులు పొందాలంటే షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. తాజాగా విధించిన 11 షరతులతో కలిపి పాకిస్తాన్‌పై విధించిన ఐఎంఎఫ్ షరతుల సంఖ్య 50కి చేరుకోవడం గమనార్హం. రూ.17.6 ట్రిలియన్ల బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలపాలని, విద్యుత్ బిల్లులపై రుణ సరీ్వసింగ్ సర్‌చార్జి పెంచాలని, మూడేళ్లు దాటిన పాత కార్ల దిగుమతిపై ఆంక్షలు ఎత్తివేయాలని ఐఎంఎఫ్ పేర్కొంది. మొత్తం బడ్జెట్లో రూ.1.07 ట్రిలియన్ల సొమ్మును అభివృద్ధి కోసం కేటాయించాలని నిర్దేశించింది. పాక్‌లోని నాలుగు ప్రావిన్సుల్లో కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలని అమలు చేయాలని తేల్చిచెప్పింది. -
ట్రంప్ సలహా సంఘంలో మాజీ ఉగ్రవాదులు
వాషింగ్టన్: కరడుగట్టిన అల్‌కాయిదా, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందిన మాజీ ఉగ్రవాదులకు ఏకంగా అమెరికా అధ్యక్షుని సలహా సంఘంలో చోటు దక్కింది! వారిలో ఒకరు ఉగ్రవాదం, సంబంధిత కేసుల్లో దోషిగా జైలుశిక్ష అనుభవించి విడుదలైన ఇస్మాయిల్ రాయర్ కాగా మరొకరు హమాస్, ముస్లిం బ్రదర్హుడ్లతో సంబంధాలున్న మాజీ ఉగ్రవాది షేక్ హమ్జా యూసుఫ్. వారిని రిలీజియస్ లిబర్టీ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్‌లో సభ్యులుగా ట్రంప్ సర్కారు ఎంపిక చేసింది. వారిద్దరూ అమెరికాలో ఇస్లామిక్ బోధనల్లో ప్రముఖులుగా మంచిపేరు తెచ్చుకున్నారని చెప్పుకొచి్చంది. కరడుగట్టిన ఉగ్ర చరిత్ర ఉన్న మాజీలను సలహా సంఘంలోకి కూర్చోబెడతారా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ రెండో హయాంలో అమెరికాలో నెలకొన్న అవ్యవస్థకు ఇది మరో నిదర్శనమంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ సలహా సంఘం మతస్వేచ్ఛ, మత విశ్వాసాలకు అనుగుణంగా విధాన నిర్ణయాల్లో అధ్యక్షుడికి సలహాలిస్తుంది.ఎవరీ ఇస్మాయిల్? ఇతను అమెరికా జాతీయుడు. అసలు పేరు ర్యాండల్ టోడ్ రాయర్. 1992లో ఇస్లాం స్వీకరించి ఇస్మాయిల్‌గా పేరు మార్చుకున్నాడు. లష్కరే తోయిబా, ఈజిప్‌్టలోని ముస్లిం బ్రదర్హుడ్, ‘వర్జీనియా జిహాద్ నెట్వర్క్’, పాలస్తీనాలోని హమాస్ ఉగ్ర సంస్థతో సత్సంబంధాలున్నాయి. ప్రత్యేక ఉగ్రశిక్షణ కోసం 2000లో పాక్ వెళ్లాడు. అమెరికాపై యుద్ధం కోసం పలువురికి ఉగ్ర తర్ఫీదు ఇచ్చేలా ప్రణాళికలు వేశాడు. జమ్మూ కశీ్మర్లో సైనిక స్థావరాలపై రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్ దాడికి సహచర ఉగ్రవాదికి శిక్షణ ఇచ్చాడు. అల్ఆయిదా, లష్కరేలకు సాయపడ్డ నేరానికి 2003లో ఇస్మాయిల్‌పై కేసు నమోదైంది. దోషిగా తేలడంతో 20 ఏళ్ల జైలుశిక్ష పడ్డా స్రత్పవర్తన కారణంగా 2017లో విడుదలయ్యాడు. అమెరికాలోని రిలీజియస్ ఫ్రీడం ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్‌గా ఉన్నాడు.ఎవరీ షేక్హమ్జా యూసుఫ్? అమెరికాలో తొలి ముస్లిం లిబరల్ ఆర్ట్స్ కాలేజీ అయిన జేతునా కాలేజ్ సహవ్యవస్థాపకుడు. ఈ కాలేజీలో షరియా చట్టాలను బోధిస్తారు. యూసుఫ్‌కు ముస్లిం బ్రదర్హుడ్, హమాస్‌లతో లింకులున్నట్టు తేలింది. వాటితో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిన్తున్నట్టు చెబుతారు. ఇతని బోధనలకు పలువురు ఉగ్రవాదులు ఆకర్షితులైనట్టు స్పష్టమైంది. అమెరికా జాత్యహంకార దేశమంటూ వ్యాఖ్యలు చేశాడు. 1990ల నాటి శకంలో న్యూయార్క్ బాంబు దాడుల కేసు నిందితుడు షేక్ ఒమర్ అబ్దుల్ రహా్మన్పై దర్యాప్తులో అమెరికా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శలు గుప్పించాడు. అమెరికా పోలీస్ ఉన్నతాధికారిని హత్య చేసిన జమీల్ అల్ అమీన్ అనే వ్యక్తికి మద్దతుగా యూసుఫ్ ప్రసంగించాడు. తర్వాత రెండు రోజులకే అమెరికాపై 9/11 దాడి జరిగింది. దాంతో అతన్ని ఎఫ్‌బీఐ విచారించింది. ముస్లిం దేశాల్లో అత్యంత ప్రముఖ ఇస్లామిక్ విద్యావేత్తగా పేరొందాడు. -
భారత్ అడుగుజాడల్లో...
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్, పరస్పర సైనిక చర్యల తర్వాత ప్రతి అంశంలో భారత్‌ను పాకిస్తాన్ అనుసరిస్తోంది. పాక్ వైఖరిని అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు అన్ని పార్టీల ఎంపీలు తదితరులతో ఏడు బృందాలను పలు దేశాలకు పంపుతుండటం తెలిసిందే. పాక్ కూడా అదే తరహాలో పలు దేశాలకు ఎంపీల బృందాలను పంపుతున్నట్టు హడావిడిగా ప్రకటించింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు వాటికి సారథ్యం వహిస్తారని చెప్పుకొచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ‘‘సొంత ఆలోచనే లేకుండా భారత్ ఏం చేస్తే పాక్ అదే చేస్తోంది. మక్కికి మక్కి పాలసీని అలవర్చుకుంది. ‘కాపీక్యాట్ పాక్’’ అంటూ నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. ఇందుకు పలు ఉదంతాలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు.బహిష్కరణల నుంచి బృందాల దాకా.. పహల్గాం ఉదంతం తర్వాత భారత్ వెంటనే భారత్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని సిబ్బందిని భారీగా కుదించింది. వాళ్లను తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశించింది. పాకిస్తాన్‌లోని భారతీయ హైకమిషన్‌లోనూ కొంత సిబ్బందిని వెనక్కివచ్చేయాలని సూచించింది. పాక్ కూడా అచ్చం అవే చర్యలకు దిగింది. మనం ఆపరేషన్ సిందూర్ అని పేరు పెడితే తానూ ‘ఆపరేషన్ బున్యాన్ మో§అల్ మర్సూస్’ అని నామకరణం చేసింది. మోదీ బాటలో షహబాజ్... ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన ఎయిర్‌ఫోర్స్ బలగాలను మెచ్చుకునేందుకు ప్రధాని మోదీ పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. సుదర్శన చక్ర(ఎస్–400) గగనతల రక్షణ వ్యవస్థ ఎదుట ఎయిర్‌ఫోర్స్ క్యాప్ ధరించి జవాన్లనుద్దేశిస్తూ ప్రసంగించారు. మర్నాడే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అచ్చం ఇలాగే చేశారు. సియాల్కోట్లోని పస్రూర్ కంటోన్మెంట్లో యుద్ధట్యాంక్పై నిలబడి సైనిక యూనిఫామ్‌లో జవాన్లనుద్దేశించి ప్రసంగించారు. గూఢచర్యం ఆరోపణలపై ఢిల్లీలోని పాక్ హై కమిషన్ ఉద్యోగిని బహిష్కరిస్తే మర్నాడే పాక్ కూడా అదే పనిచేసింది. నిజానికి ఆ భారత ఉద్యోగిని కేంద్రం అప్పటికే వెనక్కి రప్పించడం ఇందులో కొసమెరుపు! -
హత్యాయత్నం కేసు.. ప్రముఖ నటి అరెస్ట్
బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ నటి నుసారత్ ఫరియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేశారు ఆ దేశ పోలీసులు. ఆమె థాయ్ లాండ్ కు వెళుతున్న క్రమంలో ఢాకా షహజలాల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. . ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.గతేడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఆమెతో పాటు మరో 17 మందిపై హత్యాయత్నం అభియోగాలు నమోదయ్యాయిఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారం ఆధారంగా తమ బృందం విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకోవడానికి వెళ్లినట్లు పోలీస్ అధికారి సుజన్ హక్ తెలిపారు. కోర్టు కూడా ఆమెపై హత్యాయత్నం కేసు అభియోగాన్ని సమర్థించిన విషయాన్ని సదరు పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆమెపై పతరా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలిపారు. గతేడాది బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక 2023లో తెరకెక్కిన ముజిబ్: ద మేకింగ్ ఆఫ్ నేషన్ చిత్రంలో షేక్ హసీనా పాత్రలో నటించింది నుసారత్ ఫరియా. -
యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు
లండన్: ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. హౌస్ ఆఫ్ లార్డ్స్ గా పిలువబడే యూకే పార్లమెంట్ ఎగువ సభలో రోహాంప్టన్ విశ్వవిద్యాలయ చాన్సలర్, యూకే మాజీ మంత్రి బారోనెస్ వర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపారు.. ఈ కార్యక్రమానికి చిలీ, బెలిజ్ జపాన్ తదితర దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, రాయబారులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు.ఈ సందర్బంగా వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ కళారూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన కళాకారులు ప్రార్థన నృత్యం, మోహినీ అట్టం, కరగట్టం, మిథిలా, జిజియా నృత్యం, గోవా సాంగ్స్ తో అలరించారు. దీనిలో భాగంగా భారత మాజీ రాయభారి అభయకుమార్ రాసిన ఆన్ ఎర్త్ గీతానికి హైదరాబాద్‌కు చెందిన రాగసుధ వింజమూరి భరతనాట్యం ప్రదర్శించారు. ఇక చిలీ సంప్రదాయ నృత్యాన్ని డేనియల్ పెరెజ్ మున్స్టర్ ఆధ్వర్యంలో ఆ దేశ రాయబార కార్యాలయం అధికారులు ప్రదర్శించారు. దీనిలోభాగంగా బారోనెస్ వర్మ ప్రసంగిస్తూ.. సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంతో పాటు, అందులో శాంతిని పెంపొందించడానికి దోహద పడే అంశాల గురించి ప్రస్తావించారు. ఇందుకు వివిధ దేశాలకు చెందిన భిన్న సంస్కృతులను ఏకతాటిపై తీసుకురావడానికి చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ఇది ప్రస్తుత సమాజంలో ఆహ్వానించదగ్గ పరిణామమని ఆమె స్పష్టం చేశారు. -
లష్కరే టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతం
లష్కరే టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు పాకిస్థాన్‌లో ఖలీద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తన నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లిన ఖలీద్‌ను దాడి చేసి హతమార్చారు. లష్కరే కమాండర్లతో కలిసి ఖలీద్ పనిచేశాడు. 2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో ఖలీద్ సూత్రధారి.నాగపూర్, రాంపూర్, బెంగుళూరు దాడుల్లో ఖలీద్ హస్తం ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఖలీద్‌కు పాకిస్థాన్ సర్కార్ భద్రత కల్పించింది. నేపాల్‌లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించిన ఖలీద్.. ఇటీవల సింధ్ ప్రావిన్స్‌లోని బాదిక్ జిల్లాకు మకాం మార్చాడు. ఇవాళ అక్కడే హతమయ్యాడు. 2001లో రాంపుర్లోని సీఆర్పీఎఫ్ శిబిరంపై, 2005లో బెంగళూరులోని ఐఐఎస్‌సీపై జరిగిన దాడుల్లోనూ ఖలీద్ హస్తం ఉంది. -
మరోసారి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 100 మంది మృతి
జెరూసలేం: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో మహిళలు, చిన్నారులు సహా 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. దాడుల్లో వందలాదిగా గాయపడ్డారని పేర్కొంది. గురువారం నుంచి కొనసాగుతున్న భీకర దాడుల్లో మొత్తం 250 మంది మృత్యువాతపడ్డారని ఆరోగ్య విభాగం వివరించింది.శనివారం అర్ధరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరపడంతో ఖాన్‌యూనిస్, ఉత్తర గాజా, జబాలియాలోని శరణార్థి శిబిరంలో మొత్తం 100 మంది మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 100 మందిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు చిన్నారులు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి మొదలైన ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 53 వేల మందికి పైగా చనిపోయినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. వీరిలో అత్యధికులు మహిళలు, చిన్నారులేనని వివరించింది. క్షతగాత్రుల సంఖ్య లక్షల్లోనే ఉంటుందని పేర్కొంది. ఉత్తర, మధ్య గాజాలోని వారిని నివాసాలు, టెంట్లు విడిచిపెట్టి వెళ్లాలని హెచ్చరికలు చేస్తూ భీకర దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ఆర్మీ కీలకమైన మరో ఆపరేషన్‌కు తెరతీసింది.లక్షిత ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ఆపరేషన్ ‘గిడియన్ చారియట్స్’ను తమ సైన్యం పూర్తి సామర్థ్యంతో కొనసాగిస్తుందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు. మరికొద్ది రోజుల్లోనే వేలాదిగా ఇజ్రాయెల్ బలగాలు గాజాలో ప్రవేశించి ఆపరేషన్ మొద లుపెట్టనున్నాయి. ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్ ప్రకటనతో హమాస్ కాస్తంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా అన్ని అంశాలపైనా చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయెల్‌తో చర్చలకు హాజరవుతామని తెలిపింది. అయితే, పాలస్తీనా ఖైదీల విడుదల, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం సంపూర్ణ ఉపసంహరణ తమ కీలక డిమాండ్లని స్పష్టం చేసింది. -
పాకిస్తాన్‌కు ఊహించని షాక్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన IMF
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగిలింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఫుల్ ఫోకస్ పెట్టింది. పాకిస్తాన్‌పై కొత్త ఆర్థికపరమైన షరతులను విధించింది. దీంతో, పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం.వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌పై మరో 11 కొత్త ఆర్థికపరమైన షరతులను ఐఎంఎఫ్ విధించింది. తాజాగా విధించిన షరతులతో ఐఎంఎఫ్ విధించిన షరతుల సంఖ్య 50కి చేరుకుంది. పాకిస్తాన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్‌ను రూ.2.414 ట్రిలియన్గా ప్రణాళిక వేస్తోంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే రూ.252 బిలియన్లు అంటే 12% అధికం. ఈ నేపథ్యంలోనే ఐఎంఎఫ్ కొత్త షరతులు విధించినట్టు తెలుస్తోంది.కొత్త షరతులు ఇవే.. జూన్ 2025 లోగా ఐఎంఎఫ్ లక్ష్యాలకు అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదించాలి. ఐఎంఎఫ్ సూచించిన గవర్నెన్స్ డయాగ్నొస్టిక్ అసెస్మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపేతానికి చేపట్టే చర్యల ప్రణాళికను ప్రభుత్వం ప్రచురించాలి. అంతేకాకుండా 2027 తర్వాతి ఆర్థిక రంగం పరిపాలన, నియంత్రణ గురించి ప్రణాళిక రూపొందించాలి. ఇది 2028 నుండి సంస్థాగత మరియు నియంత్రణ వాతావరణాన్ని వివరిస్తుంది.🚨BREAKING: IMF imposes 11 new conditions on Pak, warns it against risks to bailout programme: Report#IndiaPakistanWar #IndiaPakistanTensions pic.twitter.com/CqBS9vF6eF— 8bit Market (@8bit_market) May 18, 2025అలాగే, జూన్ నెల లోపు నాలుగు రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి. దీని కోసం పన్ను ప్రక్రియ, రిజిస్ట్రేషన్, ప్రచార కార్యక్రమం ఇంకా వాటి అమలుకై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఎనర్జీ రంగంలో కొత్త షరతులను తీసుకురావాలని తెలిపింది. ఇందులో భాగంగా.. ఫిబ్రవరి 15, 2026 నాటికి గ్యాస్ చార్జీలను సవరించాలని, ఇంకా మే నెలాఖరులోపు ఈ ఆర్డినెన్స్‌ను శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది.ఇంకా ప్రస్తుతం ఉన్న రూ.3.21 యూనిట్ పరిమితిని జూన్ లోపు తొలగించాలని తెలిపింది. వీటితోపాటు, 2035 నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాల్సిందిగా పాకిస్తాన్ సర్కార్‌ను ఐఎంఎఫ్ కోరింది. దీని కోసం ఈ ఏడాది చివర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. అలాగే జూలై చివరి నాటికి, వాణిజ్య ప్రయోజనాల కోసం ఐదు సంవత్సరాలలోపు వాడిన కార్ల దిగుమతికి అనుమతి చట్టసభకు సమర్పించాలని తెలిపింది. ఈ క్రమంలో ఐఎంఎఫ్ విధించిన కొత్త షరతులతో పాకిస్తాన్‌కు టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. -
ఛీ ఛీ.. ఈమె టీచరేనా.. బాలుడి జీవితం సర్వనాశనం!
మాస్కో: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ వివాహిత టీచర్.. విద్యార్థితో అనుచితంగా ప్రవర్తించింది. 11 ఏళ్ల బాలుడితో హద్దులు దాటి ప్రవర్తించింది. సదరు బాలుడిని లైంగికంగా వేధింపులకు గురిచేసి.. తన శారీరక అవసరాలను తీర్చుకుంది. ఈ విషయం బాలుడి తల్లికి తెలియడంతో.. ఆమె వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో, ఆమెకు తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ దారుణ రష్యాలో చోటుచేసుకుంది. ఈ మేరకు ది న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది.వివరాల ప్రకారం.. రష్యాలో ఉన్న సెయింట్ పీటర్స్బర్గ్ ఉత్తర శివారులోని పాఠశాలలో అన్నా ప్లాక్సుక్ (27) టీచర్లో పనిచేస్తున్నారు. అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థి(11)తో ఆమె అనుచితంగా ప్రవర్తించారు. ఆమె శారీరక అవసరాల కోసం అతడిలో లైంగిక వాంఛలకు ప్రేరేపించారు. క్లాస్‌రూమ్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో తన శారీరాన్ని తాకే విధంగా ప్రవర్తించింది. అతడి పెదవులను సైతం ముద్దాడింది. అంతేకాకుండా సదరు విద్యార్థికి వాట్సాప్‌లో ఆమె నగ్న చిత్రాలను పంపించింది. మెసేజ్‌లు చేయడం, వీడియోలు పంపించడం చేసింది. దీంతో, బాలుడు.. ఆమె చేసే పనులను అడిక్ట్ అయిపోయాడు.ఒకానొక సమయంలో బాలుడు.. ఇంట్లో ఉండగా వింతగా ప్రవర్తించాడు. అనుమానం వచ్చిన అతడి తల్లి.. ఫోన్ చెక్ చేయడంతో టీచర్ బండారం బయటకు వచ్చింది. దీంతో, ఆమెను పేరెంట్స్ నిలదీశారు. పాఠశాల ప్రిన్సిపాల్‌కు టీచర్‌పై తల్లి ఫిర్యాదు చేసింది. అనంతరం, వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కోర్టు టీచర్ ప్లాక్సుక్కు తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఒక సంవత్సరం పాటు బోధించకుండా నిషేధం విధించింది.Shocking: Anna Plaksyuk, a 27-year-old married primary school teacher from Toksovo, Russia, sentenced to 9 years for sexually abusing an 11-year-old boy. The “dream teacher” sent naked selfies, exposed by the victim’s mother. Justice served! pic.twitter.com/SXv0WrZHxs— Make Europe Great Again - M.E.G.A (@ScaryEurope) May 16, 2025 -
గాల్లో విమానం.. పైలట్ లేకుండా ప్రయాణం!
గాల్లో విమానం.. 200 మందికి పైగా ప్రయాణికులు.. కానీ పైలట్ లేడు.. పరిస్థితి తలుచుకుంటేనే గుండె జలదరిస్తోంది కదా.. బలహీనమైనవారైతే పై ప్రాణాలు పైనే పోతాయి! స్పెయిన్ కు వెళ్తున్న ఓ విమానంలో ఇలాగే జరిగింది. ఆ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న వారంతా కొన్ని నిమిషాలపాటు వణికిపోయారు. తర్వాత ఏం జరిగిందీ.. ప్రయాణికులు ఎలా బయటపడ్డారన్నదీ.. ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన గురించి జర్మనీ వార్తా సంస్థ డీపీఏ తాజాగా తెలిపింది.గత ఏడాది స్పెయిన్ కు వెళ్తున్న లుఫ్తాన్సా విమానం కో పైలట్ స్పృహ తప్పి పడిపోయినా 10 నిమిషాల పాటు అలాగే ప్రయాణించిందని డీపీఏ వెల్లడించింది. 2024 ఫిబ్రవరి 17న ఫ్రాంక్ఫర్ట్ నుంచి స్పెయిన్‌లోని సెవిల్లెకు ఎయిర్‌బస్ ఏ321 విమానం బయలుదేరింది. ఫ్టైట్ కెప్టెన్ రెస్ట్ రూమ్‌కు వెళ్లిన సమయంలో కాక్‌పిట్‌లో ఒక్కడే ఉన్న కో పైలట్ స్పృహ తప్పి పడిపోయాడని స్పానిష్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ సీఐఏఐఏసీ నివేదికను ఉటంకిస్తూ డీపీఏ వివరించింది.అలా 199 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఈ విమానం పైలట్ లేకుండానే 10 నిమిషాల పాటు ఎగిరింది.దర్యాప్తు నివేదిక గురించి తమకు తెలుసని, తమ సొంత ఫ్లైట్ సేఫ్టీ విభాగం కూడా దర్యాప్తు జరిపిందని లుఫ్తాన్సా డీపీఏకు తెలిపింది. అయితే దర్యాప్తు ఫలితాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదని డీపీఏ తెలిపింది.తర్వాత ఏం జరిగింది?అపస్మారక స్థితిలో ఉన్న కో-పైలట్ అనుకోకుండా నియంత్రణలను ఆపరేట్ చేసినప్పటికీ చురుకైన ఆటోపైలట్ కారణంగా విమానం కుదుపులు లేకుండా గాల్లో స్థిరంగా ఎగరగలిగింది. ఈ సమయంలో వాయిస్ రికార్డర్ కాక్ పిట్ లో వింత శబ్దాలను రికార్డ్ చేసిందని, అవి తీవ్రమైన ఆరోగ్య అత్యవసర పరిస్థితికి అనుగుణంగా ఉన్నాయని డీపీఏ నివేదించింది.ఫ్లైట్ కెప్టెన్ రెస్ట్ రూం నుంచి వచ్చి కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు రెగ్యులర్ డోర్ ఓపెనింగ్ కోడ్ ను ఎంటర్ చేయడానికి ప్రయత్నించాడు. ఇది కాక్ పిట్ లో బజర్ ను ప్రేరేపిస్తుంది. దీంతో కో-పైలట్ డోర్ తెరుస్తారు. కానీ లోపల ఉన్న కో పైలట్ నుంచి స్పందన లేదు. ఇలా అయిదు సార్లు ప్రయత్నించినా ఫలితం లేదు. క్రూ సిబ్బంది ఒకరు ఆన్‌బోర్డ్ టెలిఫోన్ ద్వారా కో పైలట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించారు.అయినా కో పైలట్ స్పందించలేదు. దీంతో చేసేదేమీ లేక కెప్టెన్ చివరి ఎమర్జెన్సీ కోడ్ టైప్ చేశాడు. అది కెప్టన్ స్వయంగా తలుపు తెరవడానికి అనుమతిస్తుంది. అయితే డోర్ ఆటోమేటిక్ గా తెరుచుకునేలోపు స్పృహలోకి వచ్చిన కో పైలట్ లోపలి నుంచి డోర్ ఓపెన్ చేశారు. తర్వాత మాడ్రిడ్ లో విమానాన్ని ల్యాండింగ్ చేసి అక్కడ అతన్ని ఆసుపత్రికి తరలించారు. -
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
ఢిల్లీ: ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదని స్పష్టం చేసింది. ఈ రోజు డీజీఎంవో చర్చలు లేవని తెలిపింది. కాల్పుల విరమణ కొనసాగుతుందని పునరుద్ఘాటించింది.పహల్గాం ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. ఆపరేషన్ సిందూర్‌తో దాయాది దేశం విలవిల్లాడింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్ (Pakistan)శరణుగోరింది. పాక్ అర్జించడంతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) స్థాయిలో కాల్పుల విరమణ అవగాహనపై ఒప్పందం కుదర్చుకున్నాయి. ఈ తరుణంలో కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. Some media houses are reporting that the ceasefire between India and Pakistan is ending today. In addition, queries are also being received if a DGMO-level talk is scheduled today.According to the Indian Army, no DGMO talks are scheduled today. As far as the continuation of a…— ANI (@ANI) May 18, 2025 -
అమెరికాలో కలకలం.. బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన నౌక
వాషింగ్టన్: న్యూయార్క్ నగరంలో నౌక ప్రమాదం కలకలం రేపింది. మెక్సికన్ నేవీకి చెందిన ఒక శిక్షణ నౌక ‘కువౌటెమోక్’ (Cuauhtemoc) బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల మేరకు.. ప్రయాణ సమయంలో కువౌటెమోక్ నౌకకు ఏర్పాటు చేసిన మూడు అడుగుల తెర భాగం బ్రిడ్జ్‌ను ఢీకొట్టింది. దీంతో నౌకకు ఏర్పాటు చేసిన తెరతోపాటు బ్రూక్లిన్ బ్రిడ్జ్ ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Just watched the Brooklyn Bridge get smoked live by a boat with a massive Mexican flag pic.twitter.com/R8eJKwJaJ2— Nelson Slinkard (@TheWillieNelson) May 18, 2025 మెక్సికోకు చెందిన ఈ నౌక సుమారు 297 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో ఉంది. శిక్షణ కోసం వినియోగించిన ఈ నౌక బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీ కొట్టడంతో ప్రయాణం ఆగిపోయింది.Just watched the Brooklyn Bridge get smoked live by a boat with a massive Mexican flag pic.twitter.com/R8eJKwJaJ2— Nelson Slinkard (@TheWillieNelson) May 18, 2025 ఈ నౌక ప్రతి సంవత్సరం శిక్షణ ముగిశాక ప్రపంచ పర్యటనలో భాగంగా పలు పోర్ట్‌లకు వెళ్లుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 6న మెక్సికోలోని అకపుల్కో పోర్ట్ నుంచి ప్రయాణం మొదలైంది. 277 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ నౌక 15 దేశాల్లోని 22 పోర్ట్‌లను సందర్శించాలని ప్రణాళిక వేసుకుంది. ఇందులో కింగ్స్టన్ (జమైకా), హవానా (క్యూబా), కోసుమెల్ (మెక్సికో), న్యూయార్క్ (అమెరికా), రేక్జావిక్ (ఐస్లాండ్), బోర్డో, సేంట్ మాలో, డంకిర్క్ (ఫ్రాన్స్), అబెర్డీన్ (స్కాట్లాండ్) ఉన్నాయి. మొత్తం 254 రోజుల ప్రయాణంలో 170 రోజులు సముద్రంలో గడపాల్సి ఉంది. -
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. యువతితో మస్క్‌పై పుతిన్ కుట్ర?
వాషింగ్టన్: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం ప్రారంభంలో రహస్యాల్ని తెలుసుకునేందుకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk)పై రష్యా యువతితో వలపు వల విసిరినట్లు మాజీ ఎఫ్‌బీఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఏజెంట్ జోనాథన్ బౌమా సంచలన వ్యాఖ్యలు చేశారు.జర్మన్ బ్రాడ్‌కాస్టర్ జెడ్‌డీఎఫ్ తీసిన డాక్యుమెంటరీలో జోనాథ్ బౌమా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ యుద్ధానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా రష్యా ఇంటెలిజెన్స్ సాయంతో ఎలాన్ మస్క్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్‌పై ఓ యువతి ప్రయోగించారు. మస్క్‌కు ఉన్న జూదం,మత్తు పదార్ధాల వినియోగంలాంటి వీక్నెస్ను అడ్డం పెట్టుకుని యుద్ధం సమాచారం సేకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. పుతిన్‌కు ఆపరేషన్ గురించి తెలుసా?ఇక మస్క్, పీటర్ థీల్‌పై జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్ పుతిన్ కనుసన్నల్లోనే జరిగింది. పుతిన్ అనుమతి లేకుండా స్పై చేయరు కదా? అని జోనాథన్ బౌమా అన్నారు. అయితే, రష్యా జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌లో మస్క్, పీటర్ థీల్ చిక్కుకున్నారా? లేదా? అనే విషయాల్ని వెల్లడించేందుకు జోనాథన్ బౌమా విముఖత వ్యక్తం చేశారు.కాగా, ఎఫ్‌బీఐలో 16 ఏళ్లు పని చేసిన జోనాథ్ బౌమా ఓ మీడియా సంస్థకు రహస్య సమాచారాన్ని అందించారు. దీంతో అమెరికా ప్రభుత్వం జోనాథ్ బౌమాను అరెస్ట్ చేసింది. చివరకు లక్షడాలర్ల పూచికత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారు. -
మరో సౌరవ్యవస్థలో గడ్డ కట్టిన నీరు
వాషింగ్టన్: జీవుల మనుగడకు ప్రాణాధారమైన నీరు అంతరిక్షంలో మరెక్కడుందోననే ప్రశ్నకు సమాధానం వెతికినట్లు ప్రఖ్యాత జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ తాజాగా ప్రకటించింది. మన సౌరమండలం తరహాలోనే ఇతర నక్షత్ర వ్యవస్థల్లో గడ్డ కట్టిన స్థితిలో నీరు ఉంటుందనే వాదనకు బలం చేకూరుస్తూ నాసా వారి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పలు సాక్ష్యాధారాలను సంపాదించింది. ఒక యువ నక్షత్ర మండలంలో గడ్డకట్టిన నీటి జాడలను కనిపెట్టినట్లు నాసా తాజాగా ప్రకటించింది. నక్షత్రం చుట్టూ తిరుగుతున్న దుమ్ము ధూళితో కూడిన అంతరిక్ష శిలలు, శకలాలు, శిథిలాల వలయాల్లో నీరు గడ్డకట్టి ఉందని నాసా వెల్లడించింది. మన సౌరవ్యవస్థ వయసుతో పోలిస్తే తక్కువ వయసున్న ఈ కొత్త నక్షత్ర మండలం ‘హెచ్డీ 181327’మన భూమికి 155 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని నాసా తెలిపింది.వెబ్ టెలిస్కోప్ పంపిన ‘స్పె్రక్టా’డేటాలో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. విశాల అంతరిక్షంలో ఎక్కడో ఓ చోట నీరు నిక్షిప్తమై ఉంటుందని నాసా వారి స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ 2008లోనే కొంత డేటాను పంపించింది. ఆ తర్వాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇలా నీటిజాడలను వెతికిపట్టడం ఇదే తొలిసారి. ‘‘కేవలం నీటిని మాత్రమేకాదు మరీముఖ్యంగా స్ఫటికాకృతిలో ఉండే గడ్డ కట్టిన నీటి జాడను వెబ్ టెలిస్కోప్ కనుగొంది. ఈ ధూళి వలయాల్లోని ప్రతి దుమ్ము కణంతో నీటి అణువులు కలిసిపోయి ఉన్నాయి. ఈ అణువులను సమీప–పరారుణ స్పెక్ట్రోగ్రాఫ్ ఉపకరణంతో చూసినప్పుడు ఇవన్నీ మంచు బంతుల్లా కనిపించాయి. గతంలో ఇలాంటి క్రిస్టల్ ఐస్‌ను మన సౌరవ్యవస్థలో శనిగ్రహ వలయాల్లో, క్యూపర్ బెల్ట్‌లో చూశాం’’అని ఈ పరిశోధనా పత్రం ముఖ్య రచయిత చెన్ గ్జీ చెప్పారు. చెన్ గ్జీ.. మేరిలాండ్‌లోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ(బాలీ్టమోర్)లో అసిస్టెంట్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా సేవలందిస్తున్నారు. సంబంధిత వివరాలు ‘నేచర్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. నీరే కీలకం అంతరిక్షంలో నక్షత్రాల చుట్టూతా గ్రహ వ్యవస్థ పురుడుపోసుకోవడానికి నీరే ప్రధాన కారణం. యువ నక్షత్రాల చుట్టూతా పరుచుకున్న దుమ్ము, ధూళి వలయాల్లో ప్రధాన ముడి సరకు నీరే. ఒక రకంగా పట్టిఉంచే నీరు సైతం ధూళి, దుమ్మ గట్టిపడి గ్రహాల ఆవిర్భావానికి దారితీస్తుంది. తక్కువ గురుత్వాకర్షణ సందర్భాల్లో తోకచుక్కలు, గ్రహశకలాల వంటివి ఏర్పడతాయి. ఒకవేళ బలాలు బలపడితే ఇవన్నీ కలగలిసిపోయి పెద్ద గ్రహాలుగా రూపాంతరం చెందుతాయి. మన భూమి సైతం తొలినాళ్లలో ఇలాగే ఏర్పడింది. తాజాగా వెబ్ టెలిస్కోప్ సేకరించిన సమాచారంతో ఇతర ఖగోళ అధ్యయనకారులు సైతం నూతన నక్షత్రవ్యవస్థల్లో కొత్త గ్రహాలు ఎలా ఏర్పడతాయి వంటి అంశాలపై మరింత శోధన చేసేందుకు అవకాశం లభించనుందని మరో రచయిత క్రిస్టీన్ చెన్ చెప్పారు. ఈ ‘హెచ్డీ 181327’నక్షత్ర వ్యవస్థ కేవలం 2.3 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. మన సూర్యుడు ఏకంగా 460 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించాడు. వయసులో చిన్నదైనా సరే ఈ యువ నక్షత్రం మన సూరీడి కంటే బరువు ఎక్కువగా ఉంది. వేడి కూడా మరింత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. -
భారత్–పాక్ మధ్య అణు యుద్ధం ఆపేశా..
వాషింగ్టన్: భారత్–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కోసం తానే చొరవ తీసుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. ఆ క్రెడిట్ తనకే దక్కాలని పేర్కొన్నారు. ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి, ఉద్రిక్తతలు ఆగిపోవడం ఇప్పటిదాకా తాను సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఫాక్స్ న్యూస్ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన జోక్యం వల్లే పాకిస్తాన్‌పై ఇండియా సైనిక చర్య నిలిచిపోయిందని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని నివారించానని తెలిపారు. రెండు బలమైన దేశాలైన భారత్–పాక్ మధ్య మొదలైన ఘర్షణలు అతి తక్కువ సమయంలోనే అణుయుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడిందని, తాను కల్పించుకోవడంతో అది ఆగిపోయిందని వివరించారు. అయితే, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ వెనుక ట్రంప్ ప్రమేయం ఎంతమాత్రం లేదని భారత్ ఇప్పటికే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. మూడో పక్షం జోక్యాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని భారత్ వెల్లడించింది. అయినప్పటికీ ట్రంప్ తన నోటి దురుసు తగ్గించుకోకపోవడం గమనార్హం. భారత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పినప్పటికీ ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించడం ద్వారా ఆయన ఏం సాధించదల్చుకున్నారో అర్థం కావడం లేదని నిపుణులు అంటున్నారు. టారిఫ్‌ల రద్దుకు ఇండియా సంసిద్ధత భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు నివారించి, శాంతిని నెలకొల్పడానికి వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుకున్నానని డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను 100 శాతం రద్దు చేయడానికి ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసిందని పునరుద్ఘాటించారు. అమెరికా–ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదరడం ఖాయమని తెలిపారు. అయితే, ఈ ఒప్పందం కోసం తాను తొందరపడడంలేదన్నారు. తమతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పటిదాకా 150 దేశాలు ఇలాంటి ఒప్పందం కోసం ముందుకొచ్చాయన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం ఇండియా అంటూ ట్రంప్ మరోసారి విమర్శించారు. వ్యాపారాలు చేయడం అసాధ్యం అనే పరిస్థితులు ఇండియాలో సృష్టించారని తప్పుపట్టారు. కానీ, అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు పూర్తిగా రద్దు చేయడానికి ఇండియా సుముఖంగా ఉందని వివరించారు. కేవలం అమెరికా కోసం ఇండియా ఈ మేలు చేయడానికి సిద్ధపడిందని అన్నారు. -
పాక్‌పై దౌత్య యుద్ధానికి బృంద సారథులు వీరే
సాక్షి, న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టిన భారత్ దౌత్యపరంగానూ బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది. పాక్ అరాచకాలను, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాలకు వివరించనుంది. ఇందుకోసం పలు పార్టిల నేతలు, ఎంపీలు, దౌత్యవేత్తలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందం నాలుగు నుంచి ఐదు దేశాల్లో పర్యటించనుంది. విపక్షాల నుంచి శశి థరూర్ (కాంగ్రెస్), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ–పవార్), అధికార ఎన్డీఏ కూటమి నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), శ్రీకాంత్ షిండే (శివసేన–షిండే) వాటికి సారథ్యం వహిస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ శనివారం ఈ మేరకు వెల్లడించింది. బృందాల్లో సభ్యులుగా అనురాగ్ ఠాకూర్, అపరాజితా సారంగి, మనీశ్ తివారీ, అసదుద్దీన్ ఒవైసీ, అమర్ సింగ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, సమిక్ భట్టాచార్య, బ్రిజ్‌లాల్, సర్ఫరాజ్ అహ్మద్, ప్రియాంక చతుర్వేది, విక్రమ్‌జిత్ సాహ్నీ, సస్మిత్ పాత్ర, భువనేశ్వర్ కలితాతో పాటు కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తదితరులు ఉంటారు. వారంతా ఈ నెలాఖర్లో ఐరాస భద్రతా మండలితో పాటు పలు కీలక దేశాల్లో పర్యటిస్తారు.ఏ బృందం ఏ దేశానికి... శశి థరూర్: అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా సుప్రియా సూలే: ఈజిప్‌్ట, ఖతర్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా కనిమొళి: రష్యా, స్పెయిన్, గ్రీస్, స్లొవేనియా, లాతి్వయా సంజయ్ కుమార్ ఝా: జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, మలేషియా, ఇండోనేసియా రవిశంకర్ ప్రసాద్: ఈయూ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్ బైజయంత్ పండా: సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా శ్రీకాంత్ షిండే: యూఏఈ, లైబీరియా, కాంగో, సియెర్రా లియోన్ -
ట్రంప్ ‘బిగ్‌బాస్’ షో!
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ ఏంచేసినా వినూత్నమే. వివాదాస్పదమే. అదే పరంపరను కొనసాగిస్తూ ట్రంప్ సొంతంగా సరికొత్త రియాలిటీ షోకు తెరలేపనున్నారన్న వార్త ఇప్పుడు అగ్రరాజ్యంలో చక్కర్లు కొడుతోంది. బిగ్‌బాస్ రియాలిటీ షో తరహాలో ఇందులో పాల్గొనేవారంతా భిన్న రకాలైన పనులు(టాస్క్ లు) పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా అమెరికా జాతీయత కోణం దాగి ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే అనధికారికంగా అమెరికాకు పోటెత్తిన వలసదారులను మాత్రమే ఈ రియాలిటీ షోలో అభ్యర్థులుగా స్వీకరిస్తారు. గెలిచిన వారికి అమెరికా పౌరసత్వాన్ని కట్టబెడతారు. స్వదేశంలో అంతర్యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అసాధారణ, అనివార్య పరిస్థితుల్లో కొందరు వలసదారులు తిరిగి స్వదేశానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. అలాంటి వారిని ఎంపిక చేసి అమెరికా పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఎంపికకు రియాలిటీ షో మార్గాన్ని ట్రంప్ ప్రభుత్వం ఎంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రియాలిటీ షో వివరాలు ఇంకా బహిర్గత కాలేదు. ఇది ఇంకా అమెరికా ప్రభుత్వ వర్గాల వద్ద ప్రతిపాదన దశలోనే ఉందని తెలుస్తోంది. అన్ని రకాల అనుమతులు దాటుకుని ఈ రియాలిటీ షో వాస్తవరూపం దాల్చితే ఈ షోకు అనూహ్య ఆదరణ లభించడం ఖాయమని భావిస్తున్నారు. ఈ షోలో గెలిచిన విజేతకు మాత్రమే అమెరికా పౌరసత్వం బేషరతుగా ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎవరిదీ ఆలోచన? కెనడియన్–అమెరికన్ నిర్మాత రాబ్ వార్సాఫ్ ఈ ప్రతిపాదన తెచ్చారు. రియాలిటీ షో నియమ నిబంధనలతో సమగ్రంగా 35 పేజీల్లో ఒక రిపోర్ట్‌ను తయారుచేసి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) విభాగానికి సమరి్పంచారు. రాబ్ వార్సాఫ్ గతంలో సృష్టించిన ‘డక్ డినాస్టీ’, ‘ది మిలియనీర్ మ్యాచ్‌మేకర్’రియాలిటీ షోలు విజయవంతమైంది. ‘‘రాబ్ చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. నిజంగా ఇదొక మంచి ఆలోచన. హక్కులతోపాటు అమెరికన్లలో దేశభక్తి, పౌరవిధులను మరోసారి స్పష్టంగా స్మరణకు తెచ్చేలా షో ఉంటే బాగుంటుంది’’అని హోంల్యాండ్ సెక్యూరిటీలో ప్రజాసంబంధాల మహిళా అసిస్టెంట్ సెక్రటరీ ట్రీసియా మెక్‌లానిన్ అన్నారు. ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉందన్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ వద్ద పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఎలాంటి టాస్క్ లు ఉండొచ్చు? ‘ది అమెరికన్’పేరిట జరగబోయే ఈ రియాలిటీ టీవీ షోలో వలసదారుల్లో దేశభక్తి పెంచడంతోపాటు బాధ్యతాయుత పౌరునిగా మెలగాలంటే ఉండాల్సిన అర్హతలు, లక్షణాలను స్మరణకు తెచ్చేలా టాస్క్ లు రూపొందించనున్నారు. వీటితోపాటు ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉండేందుకు పలు రకాల టాస్క్‌లు పెట్టనున్నారు. టెక్సాస్ లేదా ఫ్లోరిడాలో నాసా ప్రయోగకేంద్రాల వద్ద చిన్నపాటి రాకెట్ ఎగరేయడం, శాన్ఫ్రాన్సిస్కో గనిలో బంగారాన్ని తవ్వితీయడం(గోల్డ్ రష్), డెట్రాయిట్లో ఆటోమొబైల్ అసెంబ్లీ లైన్ల వద్ద మోడల్ ‘టి’కారు ఛాసిస్‌ను బిగించడం, కన్సాస్‌లో గుర్రపుస్వారీ చేస్తూ తపాలాలు భటా్వడా చేయడం వంటి వినూత్న టాస్క్‌లు వలసదారులు పూర్తిచేయాల్సి ఉంటుంది. -
'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'
భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయం.. అమెరికాలో ఉంటున్న భారతీయులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. నిర్దిష్ట గడువు దాటిన తరువాత కూడా అక్కడే (అమెరికాలో) ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.నిర్దిష్ట గడువు తరువాత కూడా అమెరికాలో ఉంటే.. వారిపై బహిష్కరణ వేటు ఉంటుంది. అంతే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టడానికి సాధ్యం కాదు, అంటే శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని తన ఎక్స్ ఖాతాలో యూఎస్ ఎంబసీ ఇండియా వెల్లడించింది.యూఎస్ ఎంబసీ ఇండియా చేసిన ప్రకటన.. అమెరికాలో విద్యార్థి, పర్యాటక, వర్క్ పర్మిట్ వంటి వీసాలతో ఉంటున్న భారతీయులకు వర్తిస్తుంది. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా అక్కడే ఉంటే.. వారు భవిష్యత్తులో ఎప్పుడూ మళ్ళీ అమెరికాలో అడుగుపెట్టలేరు. నిర్దిష్ట గడువు తరువాత.. ఏవైనా అనుకోని ఇబ్బందులు ఎదురైతే, చట్టపరమైన చర్యల నుంచి బయటపడటానికి యూఎస్సీఐఎస్ (U.S. Citizenship and Immigration Services) ని సంప్రదించాలని, యూఎస్ ఎంబసీ ఇండియా పేర్కొంది.ఇదీ చదవండి: ఇదీ పాకిస్తాన్ పరిస్థితి..!వీసా గడువు ముగిసిన తరువాత కూడా దేశంలో ఉంటున్నవారు యూఎస్ విడిచి వెళ్లిపోవాలని.. హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ ఏప్రిల్‌లోనే చెప్పారు. గడువు దాటిన 30 రోజుల వరకు కూడా దేశంలోనే ఉన్నవారు ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. లేకుంటే.. అలాంటి వారిని క్రిమినల్ కేసులు కింద అరెస్ట్ చేసి జైలులో ఉంచే అవకాశం ఉంది. జరిమానా కూడా విధించవచ్చు.If you remain in the United States beyond your authorized period of stay, you could be deported and could face a permanent ban on traveling to the United States in the future. pic.twitter.com/VQSD8HmOEp— U.S. Embassy India (@USAndIndia) May 17, 2025 -
అమెరికాకు షాక్.. రేటింగ్‌కు కోత పెట్టిన మూడీస్
అగ్రరాజ్యంగా చెప్పుకొనే అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అమెరికా క్రెడిట్ రేటింగ్‌కు కోత పెట్టింది.పెరుగుతున్న జాతీయ రుణం, ఆర్థిక అస్థిరతపై ఆందోళనలను ఉటంకిస్తూ యునైటెడ్ స్టేట్స్ క్రెడిట్ రేటింగ్‌ను ట్రిపుట్ ఎ (AAA) నుండి ఎఎ 1 (AA1) కు తగ్గించింది. అగ్రరాజ్యం తన టాప్ ర్యాంకింగ్‌ను కోల్పోవడం చరిత్రలో ఇదే తొలిసారి.అమెరికా ఆర్థిక పథంపై పెరుగుతున్న భయాందోళనలకు ఇది సంకేతంగా నిలుస్తోంది. గతంలో 2023లో ఫిచ్ రేటింగ్స్, 2011లో స్టాండర్డ్ అండ్ పూర్స్ ఏజెన్సీలు ఇలాగే అమెరికా రేటింగ్‌కు కోతలు పెట్టాయి. తాజాగా మూడీస్ తొలిసారిగా అగ్రరాజ్యం ర్యాంక్‌ను తగ్గించింది. ఫెడరల్ లోటు 2024లో జీడీపీలో 6.4 శాతం నుంచి 2035 నాటికి దాదాపు 9 శాతానికి పెరుగుతుందని మూడీస్ అంచనా వేసింది.క్రెడిట్ రేటింగ్ తగ్గడం వల్ల వ్యాపార సంస్థలు, వినియోగదారులకు రుణ వ్యయాలు పెరుగుతాయని, తనఖా రేట్లు, కారు రుణాలు, క్రెడిట్ కార్డు వడ్డీపై ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడీస్ స్థిరమైన దృక్పథాన్ని కొనసాగించినప్పటికీ ఆ దేశ ఆర్థిక సవాళ్లను పరిష్కరించడంలో రాజకీయ గందరగోళం ప్రధాన అవరోధంగా పేర్కొంది.ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్ను కోతలు, వ్యయ తగ్గింపులను అమలు చేయాలని భావిస్తున్న తరుణంలో మూడీస్ నుంచి ఈ ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. రేటింగ్‌ను తగ్గించడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వైట్ హౌస్ కొనసాగుతున్న రికవరీ ప్రయత్నాలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందని వాదించింది. అయితే రేటింగ్ కోత ప్రస్తుత పాలనలో పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితికి ప్రతిబింబంగా విమర్శకులు భావిస్తున్నారు.ఈ వార్తలపై ప్రపంచ మార్కెట్లు స్పందిస్తుండగా, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ఫెడరల్ రిజర్వ్, విధాన నిర్ణేతలు ఎలా స్పందిస్తారో ఆర్థికవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. ఈ డౌన్ గ్రేడ్ అమెరికాలో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం గురించి కొత్త ఆందోళనలను రేకెత్తిస్తుంది. పెరుగుతున్న రుణ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనాలని పాలకులపై ఒత్తిడిని పెంచుతుంది. -
ఇటలీ ప్రధాని మెలోనీ ఖుషీ.. మోకాలిపై కూర్చొని దేశాధినేత స్వాగతం
టిరానా: అల్బేనియా దేశాధినేత ఎడీ రమా చర్చల్లో నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ఆయన స్వాగతం పలికిన తీరు ఆసక్తికరంగా మారింది. మోకాలిపై కూర్చొని ఎడీ.. ఆమెను ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అల్బేనియా రాజధాని టిరానాలో ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి యూరోపియన్ యూనియన్ దేశాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వచ్చారు. అనంతరం, మెలోనీ కారు దిగి వేదిక వద్దకు వస్తుండగా.. అల్బేనియా ప్రధాని ఎడీ మోకాలిపై కూర్చొని చేతులు జోడించి నమస్కారం చెబుతూ స్వాగతం పలికారు. రెడ్ కార్పెట్ మీద ఆమెను సాదరంగా ఆహ్వానించారు.‼️ The Prime Minister of Albania greeted Italian 🇮🇹 Prime Minister Giorgia Meloni with a deep bow and genuflectionA rare display of respect, elegance, and old-world chivalry pic.twitter.com/lKyoNXL8zN— Mambo Italiano (@mamboitaliano__) May 16, 2025ఇక, వర్షంలోనూ ఆయన పలికిన ఈ ఆత్మీయ ఆహ్వానానికి మెలోనీ ఫిదా అయ్యారు. మెలోనీ తన ‘ఇటాలియన్ సిస్టర్’ అని చెప్పే ఎడీ రమా ఆమె ఎప్పుడు కన్పించినా సరే ఇలాగే పలకరిస్తారు. ఈ ఏడాది జనవరిలో మెలోనీ పుట్టినరోజు నాడు ఓ సదస్సులో కలిసిన ఎడీ.. ఆమెకు మోకాలిపై కూర్చొని స్కార్ఫ్‌ను కానుకగా ఇచ్చారు. ఇటాలియన్ భాషలో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Bend it like Albanian PM not like #Bekcham. Grand welcome with respect for Italian PM #GiorgiaMeloni, truly commands the utmost respect of world leaders. pic.twitter.com/a4zSQFelwn— Vinay Kumar (@vinatanycost) May 16, 2025 -
అవును.. భారత్ క్షిపణుల దెబ్బ మాకు తగిలింది: పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌పై ఇన్నాళ్లూ బుకాయించిన పాకిస్తాన్.. తాజాగా అసలు నిజాలను వెల్లడించింది. నూర్ ఖాన్, ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ వివరించారని వెల్లడించారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని షరీఫ్ పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్‌లు కశ్మీర్ సహా తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికి మూడు సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి సైనికులకు నివాళులర్పించే కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ..‘భారత్, పాకిస్తాన్‌లు ఇప్పటి వరకు మూడుసార్లు యుద్ధాలు చేసినా ఏమీ సాధించలేకపోయాయి. జమ్మూకశ్మీర్ వంటి అన్ని ప్రధాన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. లేకుంటే మనం ప్రశాంతంగా ఉండలేం’ అని పేర్కొన్నారు.Pakistan PM Shahbaz Sharif says, "At around 2:30 am on 10 May, General Syed Asim Munir called me on secure line and informed me that India's ballistic missiles have hit Nur Khan Airbase and other areas.#nurkhanairbase #Pakistan #PakistanArmy pic.twitter.com/RKnWGP8WeS— Manish Shukla (@manishmedia) May 17, 2025తమది శాంతికాముక దేశమైనా స్వీయరక్షణకు తగినట్లు స్పందించే హక్కు ఉందని షెహబాజ్ అన్నారు. ‘భారత్‌కు దీటుగా జవాబిచ్చి’ పాక్ సైనిక చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారని కొనియాడారు. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ముందుకు వస్తే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకరిస్తామని భారత్‌కు హామీ ఇచ్చారు. కాల్పుల విరమణకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అనంతరం, పాక్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇశాక్ దార్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ల మధ్య అపరిష్కృత, వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుదామని కామెంట్స్ చేశారు. మరోవైపు.. తమపై భారత్ ఎలాంటి దురాక్రమణకు దిగినా దానికి బదులిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణకు భారత్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలని ఈ శాఖ అధికార ప్రతినిధి షఫ్ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశారు. ఇక, కృతజ్ఞతా దినం సందర్భంగా ఇస్లామాబాద్‌లో 31 సార్లు, ప్రావిన్సుల రాజధానుల్లో 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలతో సైనికదళాలకు సంఘీభావం ప్రకటించారు. -
భారత్ దిశగా చైనా గూఢచార నౌక
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ డ్రాగన్ దేశం కపటబుద్ధి మరోసారి బయట పెట్టుకుంది. ఆ దేశానికి చెందిన గూఢచార నౌక ‘ద యాంగ్ యి హవో’ భారత్ దిశగా వస్తోంది. ఈ విషయాన్ని డామియెన్ సిమోన్ అనే ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు తెలిపారు. చైనాకున్న గూఢచార నౌకల్లో ఇదొకటి. వీటిని పరిశోధన నౌకలని చైనా చెప్పుకుంటున్నప్పటికీ, వీటిని నిఘా నౌకలుగానే భారత్ తదితర దేశాలు పరిగణిస్తున్నాయి. శాస్త్రీయ పరిశోధనలతో పాటు పౌర, సైనిక అవసరాలను తీర్చేలా వీటిని రూపొందించారు. సముద్ర జలాల్లో పరిశోధనలు, సముద్ర గర్భం మ్యాపింగ్, ఖనిజ, జీవ వనరుల అన్వేషణ పేరుతో సంచరించే ఈ నౌకలు క్షిపణుల గమనాన్ని ట్రాక్ చేయగలవు, సబ్మెరీన్ల కదలికలను పసిగట్టడం వంటివి చేయగలవు. తాజాగా, మలక్కా నుంచి బయలుదేరిన ఈ నౌక శ్రీలంక దక్షిణ తీరం దిశగా సాగుతున్నట్లు మ్యాప్‌ను బట్టి సిమోన్ విశ్లేషించారు. ఈ నౌకతో ప్రమాదమేమంటే.. ఇందులో మనుషులతో అవసరం లేకుండా సముద్రం అడుగున సంచరిస్తూ నిఘా కార్యకలాపాలను నిర్వహించే వాహనాలుంటాయి. సముద్రం అడుగున మందుపాతరలు, ఇతర సైనిక కార్యకలాపాలను కనిపెట్టి మ్యాపింగ్ చేస్తాయి. భారత్‌లో క్షిపణి పరీక్షలు, ఇతర సైనిక కార్యకలాపాల సమయంలో చైనా నిఘా నౌకలు పొరుగుదేశాలకు చేరుకుని గూఛచర్యం చేయడం ఇటీవలి కాలంలో మామూలై పోయింది. గతేడాది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని–5ను ప్రయోగించిన సమయంలో చైనాకే చెందిన జియాంగ్ యాంగ్ హాంగ్ 01 అనే గూఢచర్య మన దేశ సమీపానికి వచ్చింది. ఒడిశాలోని బాలాసోర్ తీరం వెంబడి క్షిపణి పరీక్షలప్పుడు సైతం చైనా నిఘా నౌకలు తూర్పు తీరానికి సమీపంలోకి వచ్చినట్లు తెలిసింది. విశాఖ తీరంలోని సబ్మెరీన్లలోని అణు క్షిపణుల సిగ్నళ్లను సైతం ఇవి కనిపెట్టే అవకాశముందని సమాచారం. -
‘86 47’ సంకేతం వెనుక ఏముంది?
వాషింగ్టన్: ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) మాజీ బాస్ జేమ్స్ కొమీ సోషల్ మీడియాలో పెట్టిన ‘86 47’సంకేత పోస్ట్‌పై దర్యాప్తు చేపట్టామని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్ గురువారం వెల్లడించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు పన్నిన కుట్రలో ఇదో భాగమని భావిస్తున్నట్లు ఆమెతోపాటు పలువురు రిపబ్లిక్ పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. అంతకుముందు కోమీ ఇన్‌స్టా పోస్ట్‌లో ‘బీచ్‌లో నడుస్తుండగా నత్త గుల్లలు ‘86 47’ఆకారంలో కనిపించాయి’అంటూ ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులోని 86ను తొలగించడం, వదిలించుకోవడం అనే అర్థమొచ్చేలా వాడుతారు. 47ను ట్రంప్‌ను సూచిస్తూ వాడిన రహస్య సంఖ్య. ఆయన అమెరికాకు 47వ అధ్యక్షుడు. మొత్తమ్మీద అధ్యక్షుడిని హత్య చేసేలా ప్రేరేపించడమే దీని వెనుక అర్థమని ట్రంప్ ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు అంటున్నారు. దీనిపై డీహెచ్ఎస్, సీక్రెట్ సరీ్వస్ దర్యాప్తు చేపట్టి తగు రీతిలో స్పందిస్తాయని నోమ్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా తన తండ్రిని చంపాలని పిలుపునిస్తూ కొమీ ఈ పోస్ట్ పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీక్రెట్ సర్వీస్ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోందని ఎఫ్‌బీఐ చీఫ్, భారత సంతతికి చెందిన కాశ్ పటేల్ తెలిపారు. పశి్చమాసియాలో అధ్యక్షుడు ట్రంప్ పర్యటిస్తున్న సమయంలో ఆయన్ను చంపాలని ఉగ్రవాదులకు ఈ సంకేతం ద్వారా కొమీ ప్రేరేపించారని వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జేమ్స్ బ్లయిర్ ఆరోపించారు. నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తుల్సి గబ్బార్డ్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఈ పోస్ట్‌ను తీసిపారేయరాదు. ఇది చాలా ప్రమాదకరమైన పోస్ట్. అధ్యక్షుడు ట్రంప్‌పై ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి’అని ఆమె అన్నారు. ఈ ఆరోపణలపై జేమ్స్ కొమీ స్పందించారు. ‘రాజకీయ ఉద్దేశంతో పెట్టిన పోస్ట్‌పై హింసను ప్రేరేపించేలా ఉందంటూ కొందరు విపరీతార్థాలు తీస్తారని నేను ఊహించలేదు. హింసకు నేను పూర్తిగా వ్యతిరేకిని’అంటూ ఆయన తన పోస్ట్‌ను తొలగించారు. 2013–2017 మధ్య కాలంలో జేమ్స్ కొమీ ఎఫ్‌బీఐ చీఫ్‌గా పనిచేశారు. -
కరోనా వల్ల 1.8 ఏళ్లు తగ్గిపోయిన సగటు జీవితకాలం
న్యూయార్క్: కోవిడ్–19 సృష్టించిన విలయం మర్చిపోలేనిది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవిత కాలం 1.8 సంవత్సరాలు పడిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఈ తాజాగా ‘ప్రపంచ ఆరోగ్య గణాంకాలు–2025’ నివేదికను విడుదల చేసింది. మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించడమే కాదు, జీవన నాణ్యతను సైతం దెబ్బతీసినట్లు నివేదిక పేర్కొంది. 2019 నుంచి 2021 మధ్య సగటు జీవిత కాలం 1.8 ఏళ్లు పడిపోయిందని, చరిత్రలో ఇదే అతిపెద్ద పతనమని స్పష్టంచేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు... → కరోనా విపత్తు సమయంలో కేవలం ఆందోళన, కుంగుబాటు వల్ల ఆరోగ్యకరమైన సగటు జీవితకాలం ఆరు వారాలు పడిపోయింది. → ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో కొంత ప్రగతి నమోదైనప్పటికీ, సాధించాల్సింది ఇంకెంతో ఉంది. → పొగ తాగడం తగ్గించుకోవడం, మెరుగైన వాయు నాణ్యత, సురక్షితమైన తాగునీరు, పారిశుధ్య వసతులు అందుబాటులోకి రావడం వల్ల 1.4 బిలియన్ల మంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. → మరోవైపు అత్యవసర వైద్య సేవలు పొందడం వేగంగా మెరుగుపడడం లేదు. కేవలం 431 మిలియన్ల మంది మాత్రమే ఈ సేవలు పొందగలుగుతున్నారు. → మాత, శిశు మరణాలు ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. 2000 నుంచి 2023 దాకా ఈ విషయంలో కొంత ప్రగతి సాధ్యమైంది. బాలింతల మరణాలు 40 శాతం తగ్గాయి. → ఆరోగ్య రంగానికి ప్రభుత్వాలను తగనన్ని నిధులు కేటాయించడం లేదు. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. → ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే 2030 నాటికి అదనంగా 7 లక్షల మాత మరణాలు, 80 లక్షల శిశు మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. → ప్రస్తుతం 70 ఏళ్లలోపు వయసున్న వారిలో అత్యధిక మరణాలకు హృదయ సంబంధిత వ్యాధులు, గుండె పోటు, క్యాన్సర్, డయాబెటిస్ కారణమవుతున్నాయి. → చైల్డ్‌హుడ్ వ్యాక్సినేషన్ రేటు కోవిడ్‌కు ముందున్న స్థాయికి ఇంకా చేరుకోలేదు. దీనివల్ల బాలలకు ముప్పు పొంచి ఉంది. -
యుద్ధ ఖైదీల మార్పిడి
ఇస్తాంబుల్: సర్వత్రా ఆసక్తి రేపిన రష్యా, ఉక్రెయిన్ యుద్ధ విరమణ చర్చలు ఆశాజనకంగా మొదలయ్యాయి. వెయ్యి మంది యుద్ధ ఖైదీల పరస్పర మార్పిడికి అంగీకారం కుదిరింది. రష్యా ప్రతినిధి వ్లాదిమిర్ మెడిన్స్కీ ఈ మేరకు వెల్లడించారు. వాటిమధ్య దాదాపు మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఇదే అతి పెద్ద ఖైదీల మార్పిడి కానుంది. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు శుక్రవారం ఇస్తాంబుల్‌లో సమావేశమై తమ తమ డిమాండ్లు వినిపించారు. 2022లో యుద్ధం మొదలయ్యాక వాటి మధ్య ఇది తొలి ముఖాముఖి కావడం విశేషం. ఉక్రెయిన్ ప్రతినిధి వర్గానికి రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్, రష్యా బృందానికి అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు మెడిన్స్కీ సారథ్యం వహించారు. తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ చర్చలను ప్రారంభించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇరు పక్షాలను కోరారు. తక్షణం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం ముఖ్యమన్నారు. ‘‘కాల్పుల విరమణ ప్రతిపాదనలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించాం. పుతిన్, జెలెన్స్కీ భేటీ ఏర్పాటు చేయాలన్న ఉక్రెయిన్ విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పాం. చర్చలను కొనసాగించేందుకు రష్యా సిద్ధంగా ఉంది’’ అని మెడిన్స్కీ వెల్లడించారు. కీలకాంశాలను పరిష్కరించుకుని, చర్చల్లో పురోగతి సాధించాలని సూత్రప్రాయంగా అభిప్రాయానికి వచ్చినట్టు ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే రష్యా ముందెన్నడూ ప్రస్తావించని డిమాండ్లను ముందుకు తెచ్చిందని విమర్శించారు. కాల్పుల విరమణ పూర్తిస్థాయిలో అమలవాలంటే ఆక్రమిత ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సైన్యాలను ఉపసంహరించాలన్నది అందులో ఉన్నట్టు చెప్పారు. రెండు గంటల్లోపే చర్చలు ముగిసినట్టు తుర్కియే పేర్కొంది.పుతిన్‌కు ఆసక్తి లేదు: జెలెన్స్కీచర్చల పురోగతిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పెదవి విరిచారు. కాల్పుల విరమణకు కూడా అంగీకారం కుదరలేదంటే దౌత్య మార్గంపై పుతిన్‌కు విశ్వాసం లేదని అర్థమన్నారు. అల్బేనియా రాజధాని టిరానాలో 47 యూరప్ దేశాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. చర్చల్లో రష్యా ప్రతిపాదనలు అంగీకారయోగ్యంగా లేవని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ పేర్కొన్నారు. ‘‘చర్చలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జెలెన్స్కీ ఫోన్లో చర్చించారు. ఈ విషయంలో మేమంతా సహకారంతో సాగుతాం. సమష్టి బాధ్యత వహిస్తాం. ట్రంప్‌తో చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్ కూడా ఆమోదించాయి’’ అని వెల్లడించారు.త్వరలో పుతిన్‌తో భేటీ: ట్రంప్రష్యా ఉక్రెయిన్ చర్చలపై ట్రంప్ స్పందించారు. పుతిన్‌తో తాను అతి త్వరలో భేటీ అయ్యే అవకాశముందన్నారు. ‘‘మా భేటీతో యుద్ధం ముగియవచ్చు, ముగియకపోవచ్చు. అయితే యుద్ధం కొనసాగితే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అంటూ గమ్మత్తైన వ్యాఖ్యలు చేశారు. ఇస్తాంబుల్ చర్చలకు తాను వెళ్లని కారణంగానే పుతిన్ కూడా హాజరవలేదని ట్రంప్ గురువారం పేర్కొనడం తెల్సిందే. తన కుమార్తె టిఫానీకి కొడుకు పుట్టిన కారణంగానే ఉన్నట్టుండి అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ‘అందమైన నా మనవడిని చూడాలనుంది’ అని పేర్కొన్నారు. పుతిన్, ట్రంప్ భేటీకి వేళైందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ కూడా అన్నారు. వారి శిఖరాగ్రానికి ఏర్పాట్లకు సమయం పడుతుందని చెప్పారు. -
మసూద్ అజార్‌కు రూ.14 కోట్లు
భుజ్: జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్‌కు రూ.14 కోట్లు ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించిందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలపాలను మరింత విస్తృతం చేయడానికి ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా శిబిరాలను పాక్ ప్రభుత్వం మళ్లీ నిర్మిస్తోందని చెప్పారు. మురిద్కే, బహవల్పూర్లో ఈ నిర్మాణాలు మొదలయ్యాయని వెల్లడించారు. శుక్రవారం గుజరాత్‌లోని భుజ్‌లో రాజ్‌నాథ్ సింగ్ పర్యటించారు. భుజ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో సైనికాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు. పాకిస్తాన్ ప్రజల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తున్న సొమ్మంతా ఉగ్రవాదుల జేబుల్లోకే వెళ్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. పాకిస్తాన్‌కు ఆర్థిక సాయంపై ఐఎంఎఫ్ పునరాలోచించాలి పాకిస్తాన్‌కు ఎవరైనా ఆర్థిక సాయం అందిస్తే ఆ సొమ్మంతా ఉగ్రవాద కార్యకలాపాలకే ఖర్చవుతుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. విదేశాల నుంచి వచ్చే డబ్బుతో భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోయడం పాకిస్తాన్‌కు అలవాటేనని మండిపడ్డారు. ఆ దేశానికి 2.3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించడంపై పునరాలోచన చేయాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)ను కోరారు. దుష్ట పాకిస్తాన్ సంగతి తెలిసి కూడా పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాలనుకోవడం సరైంది కాదని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం అందిస్తే ఉగ్రవాదులకు సాయం చేసినట్లేనని పేర్కొన్నారు. అందుకే పాక్‌కు ఆర్థిక సాయంపై మరోసారి ఐఎంఎఫ్ ఆలోచించాలని, భవిష్యత్తులో ఎలాంటి సాయం అందించకూడదని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదం అంతమయ్యే దాకా తమ పోరాటం ఆగదని రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై ఇప్పటిదాకా తాము తీసుకున్న చర్యలన్నీ కేవలం ట్రైలర్ మాత్రమేనని, అవసరమైతే ఫుల్ పిక్చర్ చూపిస్తామని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు. -
ఎన్నారైలపై ట్రంప్ మరో పిడుగు
మీరు అమెరికాలో ఉంటున్నారా? భారత్‌లోని మీ కుటుంబానికి ప్రతి నెలా డబ్బులు పంపుతున్నారా? అయితే ఇకపై మరో పన్ను బాదుడుకు సిద్ధంగా ఉండండి. అలా పంపే ప్రతి లక్ష రూపాయలకూ రూ.5 వేల చొప్పున ట్రంప్ ముక్కు పిండి మరీ వసూలు చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భారత అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న అధ్యక్షుడు ఈ మేరకు ప్రతిపాదనను తాజాగా తెరపైకి తెచ్చారు. దాని ప్రకారం అమెరికాలోని వలసదారులు (Migrants) తమ మాతృదేశాలకు పంపే మొత్తాలపై 5 శాతం పన్ను విధించనున్నారు. అమెరికా పౌరులు కానివారందరికీ ఇది వర్తిస్తుంది. గ్రీన్‌కార్డుదారులతో పాటు హెచ్–1బీ, ఎఫ్–1 లేదా జే–1 తదితర వీసాలపై అక్కడ ఉంటున్న భారతీయులంతా ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితులవుతారు. ట్రంప్ దీనికి ‘వన్ బిగ్, బ్యూటిఫుల్ బిల్’ అని పేరు పెట్టుకుని మురిసిపోతున్నారు. ఈ బిల్లుకు అధికార రిపబ్లికన్లు మద్దతిస్తుండగా ఎన్నారైల (NRIs) మద్దుతుదారుగా పేరున్న విపక్ష డెమొక్రటిక్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిల్లు ప్రస్తుతం ప్రతినిధుల సభ పరిశీలనలో ఉంది. అక్కడ, అనంతరం సెనేట్‌లో ఆమోదముద్ర పడితే జూలై 4 నుంచి అమల్లోకి వస్తుంది. మనోళ్లకు పెద్ద దెబ్బ అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య 45 లక్షల పై చిలుకే. వారిలో చాలామంది ఉన్నత స్థాయి ఉద్యోగులు, వ్యాపారవేత్తలు తదితరులే. వాళ్లు భారత్‌కు ఏటా భారీ మొత్తాలు పంపుతుంటారు. మామూలు ఉద్యోగులు చేసేవాళ్లు కూడా భారత్‌లోని తమ కుటుంబాల పోషణ, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు తదితరాల నిమిత్తం ప్రతి నెలా టంచనుగా డబ్బులు పంపుతుంటారు. ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు.రెమిటెన్స్ పన్ను (remittance tax) దెబ్బకు ఇకపై మనవాళ్లు పంపే మొత్తాలు భారీగా తగ్గడం ఖాయమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మన విదేశీ మారకద్రక్య నిల్వలపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చంటున్నారు. ‘‘భారత్ తిరిగొచ్చి ఇక్కడే స్థిరపడాలని భావించే అమెరికా ఎన్నారైలు సంపాదించే ప్రతి డాలర్‌పైనా 5 శాతం కోత పడ్డట్టే లెక్క. భారీ మొత్తాలు పంపే ఆలోచనలో ఉన్నవాళ్లు జూలైకి ముందే ముగించుకోవడం మేలు’’ అని సూచిస్తున్నారు.జీవనాధారంపై దెబ్బ రెమిటెన్సుల పన్ను వర్తింపు విషయమై ప్రతిపాదనలో ఎలాంటి మినహాయింపులూ ప్రతిపాదించలేదు. కనుక ఎంత తక్కువ మొత్తం పంపినా బాదుడు ఖాయమే. దాంతో వాటిపైనే ఆధారపడే ఎన్నో భారత కుటుంబాలను ఇది తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ‘‘పిల్లల్ని అమెరికా పంపిన తల్లిదండ్రుల్లో చాలామంది వారిపైనే ఆధారపడి ఉంటారు. ఇంటి అద్దె, లేదా ఈఎంఐలు మొదలుకుని వైద్య ఖర్చుల దాకా పిల్లలు నెల నెలా పంపే డబ్బులే ఆధారం. రెమిటెన్సులంటే కేవలం ఆర్థిక కార్యకలాపాలు కావు. లక్షలాది మందికి జీవనాధారాలు. దీన్ని ఆ మానవీయ కోణం నుంచి చూడాలి. కానీ ట్రంప్ పక్కా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారు’’ అంటూ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నారై రెమిటెన్సులపై బాగా ఆధారపడే మన రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం ఖాయమని చెబుతున్నారు.రెమిటెన్సుల్లో భారతే టాప్ → ప్రపంచం మొత్తంలో విదేశాల నుంచి అత్యధికంగా రెమిటెన్సులు వచ్చేది భారత్‌కే. → 2024లో వాటి మొత్తం ఏకంగా 130 బిలియన్ డాలర్లు! అంటే దాదాపు రూ.10.7 లక్షల కోట్లు. → అందులో 28 శాతం, అంటే రూ.3 లక్షల కోట్ల (32 బిలియన్ డాలర్ల) మేరకు వాటా భారత అమెరికన్లదే. → ఆ లెక్కన 5 శాతం రెమిటెన్సు పన్ను రూపేణా అమెరికాకు ఏటా ఒక్క ఎన్నారైల మీదే అప్పనంగా రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది! అక్రమ పన్నే! రెమిటెన్స్ పన్ను విధింపు చట్టారీత్యా చూసినా సరికాదన్నది ఆర్థిక నిపుణుల వాదన. ‘‘ఇది చాలా అన్యాయమైన ప్రతిపాదన. వేలాది మైళ్లు వలస వెళ్లి అనేక కష్టాలకోర్చి తమవారికి అండగా నిలుస్తున్నందుకు, స్వదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నందుకు శిక్షిస్తున్నట్టుగా ఉంది. పైగా అమెరికాకు అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర పన్నులు చెల్లించిన మీదట మిగుల్చుకున్న మొత్తంపై దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది కచ్చితంగా అక్రమమే. ఇందులో రాజకీయ ఉద్దేశాలు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి’’ అని వారంటున్నారు. ఈ ప్రతిపాదనపై డెమొక్రాట్ సభ్యులు కాంగ్రెస్‌లో తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చారు. వలస సమాజాలను, ముఖ్యంగా అల్పాదాయ కుటుంబాలను ఈ పన్ను అన్యాయంగా పీల్చి పిప్పి చేస్తుందని వాదించారు. మితవాద రిపబ్లికన్లు కూడా వారితో గొంతు కలుపుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన రక్షణ వ్యవస్థ కల్గిన దేశాల జాబితాలో భారత్ కు ప్రత్యేక స్థానం ఉందనే విషయం ఆపరేషన్ సిందూర్ తో మరోసారి నిరూపితమైంది. అత్యంత శక్తిమంతమైన ఆర్మీ కల్గిన దేశాల జాబితాలో భారత్‌ది నాల్గో స్థానం. ఇక్కడ చైనా కంటే భారత్ ఒక స్థానం కిందే ఉంది. టాప్ 5లో ఉన్న దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, దక్షిణకొరియాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో భారత్ బలం మరింత పెరిగిందని అంటున్నారు యుద్ధ రంగ నిపుణులు. అది కూడా అమెరికాకు చెందిన యుద్ధ రంగ నిపుణుడు రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్ యుద్ధ నైపుణ్యంలో తిరుగులేదని నిరూపించుకుందన్నారు. అటు ఎఫెన్స్, ఇటు డిఫెన్స్ అయినా భారత్ శక్తి అమోఘమని కొనియాడారు. ఇక్కడ ప్రధానంగా భారత్ కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిపై ప్రశంసలు కురిపించారు. భారత్ రక్షణ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మోస్ పని తీరును ఎంత పొగిడినా తక్కువే అంటూ కితాబిచ్చారు. బ్రహ్మోస్ తరహా క్షిపణులు అటు పాకిస్తాన్ లోనే కాదు, చైనాకు కూడా లేవని బల్లగుద్దీ మరీ చెప్పారు. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో భారత్ లో ఉన్న బ్రహ్మోస్ తో సరిపోల్చే క్షిపణులు కానీ ఆయుధ సామాగ్రి గానీ లేవన్నారు జాన్ స్పెన్సార్.. ఈ విషయాల్ని జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు జాన్ స్పెన్సార్.‘ చైనా వైమానికి రక్షణ వ్యవస్థలు కానీ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు కానీ భారతదేశ రక్షణ వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ సామర్థ్యం కల్గి ఉన్నాయి. భారత్ బ్రహ్మోస్ క్షిపణి.. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల్లో ఉన్న దానికంటే అధికరెట్లు బలంగా ఉంది. పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలను, ఎయిర్ బేస్ లను భారత్ సునాయాసంగా ఛేదించడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ భారత్ క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. పాకిస్తాన్ లోని ఏ ప్రదేశాన్నైనా సునాయాసంగా ఛేదించగలదనే సందేశాన్ని భారత్ చాలా క్లియర్ గా పంపింది’ అని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే.. -
వింత డ్యాన్స్‌తో ట్రంప్‌కు స్వాగతం.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమ దేశాల పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చేరుకున్నారు. ట్రంప్‌కు యూఏఈలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు అక్కడి సంప్రదాయ నృత్యం అల్ అయ్యాలా (Al-Ayyala)తో స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదేం డ్యాన్స్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.వివరాల ప్రకారం.. అధ్యక్షుడు ట్రంప్ యూఏఈ (UAE) చేరుకున్నాక అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. అనంతరం, ఇద్దరు నేతలు కలిసి అధ్యక్ష భవనం ఖషర్ అల్-వాటన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు బాలికలు జుట్టు విరబోసుకొని సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా తలలు ఊపుతూ ట్రంప్‌నకు స్వాగతం పలికారు. పక్కనే కొందరు డబ్బులు వాయిస్తుండగా ఇద్దరు నేతలు ముందుకు కదిలారు. వారి డ్యాన్స్ చూసిన ట్రంప్.. ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.In a symbolic gesture of respect, the #UAE welcomed Donald Trump with the traditional Al-Ayyala dance — a beautiful display of heritage, unity, and yes, the iconic hair-flippic.twitter.com/rjYe0y0VJu— Jordan Kyle (@_Jordan_Kyle_) May 15, 2025ఇదిలా ఉండగా, యునెస్కో (UNESCO)ప్రకారం.. అల్- అయ్యాలా అనేది యూఏఈ, ఒమన్లలో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ నృత్యం. సంప్రదాయ దుస్తులు ధరించిన బాలికలు వారి పొడవాటి జుట్టును విరబోసుకొని.. సంగీతానికి అనుగుణంగా తలలను ఊపుతుంటారు. వేడుకలు, వివాహాల సమయాల్లో అల్- అయ్యాలాను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. వయసు, లింగం, సామాజిక బేధం వంటి తేడాలు లేకుండా అందరినీ ఒకచోట చేర్చేదిగా దీన్ని భావిస్తారు. వీరంతా తలలు ఊపుకుంటూ డ్యాన్స్ చేసినట్టుగా ఊగిపోతారు.It is actually a traditional Emirati dance called Al Ayyala or Al Razfa depending on the region. The hair movement by the women symbolizes pride and beauty and is part of a heritage performance that reflects unity and strength. What you saw was not just a show. It was culture. pic.twitter.com/JKcAlXOmGd— Khalid Alkaabi (@alyarwani) May 15, 2025 -
పార్లమెంట్లో ప్రసంగం.. నవ్వుల పాలైన పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్
ఇస్లామాబాద్: పాక్ ఉప ప్రధాని ఇషాక్‌దార్ మరోసారి నవ్వుల పాలయ్యారు. ఫేక్ వార్తను పార్లమెంట్లో చదివి వినిపించి గొప్పలు చెప్పుకున్నారు. పాక్ ఎయిర్‌ఫోర్స్‌ను విదేశీ మీడియా ప్రశంచిందంటూ ప్రకటించుకున్నారు. అయితే విదేశీ మీడియా తమ ఎయిర్‌ఫోర్స్ గురించి నిజంగా ప్రశంసలు కురిపించిందా? అని పాకిస్తాన్ మీడియా సంస్థ ‘డాన్’ నిజనిర్ధారణ చేసింది. అందులో విదేశీ మీడియా కథనం బూటకమని తేల్చి చెప్పింది. అసలు ఇషాక్ దార్ చెప్పినట్లుగా సదరు మీడియా సంస్థ సైన్యానికి సంబంధించిన ఎలాంటి వార్తల్ని ప్రచురించలేదని తెలిపింది.ఇంతకీ ఏం జరిగిందంటే? పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను కీర్తిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన డైలీ టెలిగ్రాఫ్ అందుకు భిన్నంగా ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ వ్యవహరించిన తీరును ప్రశంసంపై ఓ కథనాన్ని ప్రచురించింది’ అంటూ డైలీ టెలిగ్రాఫ్ హెడ్‌లైన్‌ను పార్లమెంట్లో ఇషాక్ దార్ ప్రస్తావించారు. అసలు విషయం ఏంటంటే?Pakistan's Deputy Prime Minister and Foreign Minister Ishaq Dar falsely told the Senate that The Telegraph headlined the PAF as the ‘Undisputed King of the Skies’—a far-fetched claim that even Dawn News felt compelled to fact-check him. pic.twitter.com/piho3z9Zha— DD India (@DDIndialive) May 16, 2025 ‘గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్’ వాస్తవానికి డైలీ టెలిగ్రాఫ్ ఆ హెడ్‌లైన్‌ను రాయలేదు. పాకిస్తానీయులే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో తప్పుడు వార్తను సృష్టించారు. దాన్నే నిజమనుకుని ఇషాక్‌దార్ భ్రమపడ్డారు. ‘గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్’ అంటూ విదేశీ మీడియా కీర్తించిందని ప్రకటన చేశారు. దీంతో కంగుతిన్న డైలీ టెలిగ్రాఫ్ .. అసలు తాము అలాంటి హెడ్లైన్ పెట్టలేదని స్పష్టం చేసింది. డైలీ టెలిగ్రాఫ్ మాత్రమే కాదు.. పాక్ దేశ మీడియా సంస్థ డాన్‌న్యూస్ సైతం ఇదే విషయాన్ని చెప్పింది. పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.ఇషాక్ దార్‌వి పచ్చి అబద్ధాలు ‘పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆకాశాలలో తిరుగులేని రాజు’ అని పేర్కొంటూ డైలీ టెలిగ్రాఫ్ వార్త రాసిందా? లేదా? అని డాన్ మీడియా ప్రతినిధులు పరిశీలించారు. ఇషాక్ దార్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నట్లుగా మే 10న ది డైలీ టెలిగ్రాఫ్ ఫ్రంట్ పేజీలో ఉన్న వార్తకి.. ఇషాక్ దార్ చదివి వినిపించిన హెడ్‌లైన్‌కు పొంతన లేదని తేలింది. ఆ పత్రిక ఎప్పుడూ అలాంటి కథనాల్ని ప్రచురించలేదని డాన్ తేల్చింది. దీంతో పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్‌పై నెటిజన్లు చూసికోవాలని కదాయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
Earthquake: చైనాలో భూకంపం
బీజింగ్: చైనాలో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది.భారత కాలమానం ప్రకారం ఉదయం 6:29 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. భూమి లోతులో 10 కిలోమీటర్ల లోపల భూకంపం నమోదైనట్లు ఎన్సీఎస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు భూకంప వివరాలను ఎన్సీఎస్ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈనెల మే 12న తెల్లవారుజామున 2:41 గంటలకు టిబెట్, చైనా పలు ప్రాంతాల్లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంపం భూమిలో 9 కిలోమీటర్ల లోతులో నమోదైంది.EQ of M: 4.5, On: 16/05/2025 06:29:51 IST, Lat: 25.05 N, Long: 99.72 E, Depth: 10 Km, Location: China. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/08mQNfOwyd— National Center for Seismology (@NCS_Earthquake) May 16, 2025 -
ఆపరేషన్ సిందూర్‌కి ముందు ట్రంప్,పాక్‌ల మధ్య చీకటి ఒప్పందం?
వాష్టింగన్: పహల్గాంలో ఉగ్రదాడి, ఆ దాడిపై భారత చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్ ప్రభుత్వంతో జరిపిన ఓ చీకటి ఒప్పందం బట్టబయలైంది. ఆ చీకటి ఒప్పందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు సైతం సంబంధం ఉండడం మరింత అనుమానాలకు తెరతీసింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల వయసున్న (అప్పటికి ఏర్పాటు చేసి నెలరోజులే) క్రిప్టో కౌన్సిల్‌తో కుదుర్చుకున్న ఈ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్ కలిపి 60శాతం వాటా ఉంది. గత నెలలో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ఒప్పందం చేసుకున్నారని తెలిపే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైతం ఉంది.ఆఘమేఘాల మీదఈ ఒప్పందం తర్వాత వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తమ సలహాదారుగా బైనాన్స్ వ్యవస్థాపకుడు ఛాంగ్‌పెంగ్ జావోను పాక్ ప్రభుత్వం నియమించింది. ఘన స్వాగతం పలికిన ఆసిమ్ మునీర్ ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన ఓ ప్రతినిధి బృందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా ఆ అమెరికన్ బృందానికి నాయకత్వం వహించింది మరెవరో కాదు ట్రంప్ అత్యంత సన్నిహితుడు,వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్. జాకరీ విట్కాఫ్ ప్రస్తుతంప్రస్తుత మిడిల్ ఈస్ట్‌కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. జాకరీ విట్కాఫ్ బృందం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో రహస్య సమావేశం సైతం నిర్వహించింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్‌కాయిన్ అభివృద్ధి, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి లభించనుంది. దీని ద్వారా పాకిస్తాన్లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. పాక్-ట్రంప్ చీకటి ఒప్పందంపై అనుమానంపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందంపై ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందానికి వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. అయితే, ఈ ఒప్పందంపై అటు ట్రంప్ కుటుంబం, ఇటు వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
మేపలేక ‘తెల్ల ఏనుగు’.. ట్రంప్ ముఖాన డంప్!
ప్రపంచంలో సొంతంగా అతి పెద్ద ప్రైవేట్ జెట్స్ శ్రేణి కలిగిన యజమానుల్లో ఖతార్ రాజకుటుంబం ఒకటి. తమకు ఆర్థిక భారంగా పరిణమించిన కొన్ని భారీ విమానాలను అది తాపీగా వదిలించుకుంటోంది. ప్రయోజనం లేని, నిర్వహణ భారం మితిమీరిన ‘తెల్ల ఏనుగు’ లాంటి తమ ‘బోయింగ్ 747 జంబో’ను అచ్చం రాజకుటుంబం లాగే పోషించగల డొనాల్డ్ ట్రంప్ లాంటి సరైన వ్యక్తిని ఖతార్ రాజకుటుంబం ఎట్టకేలకు పట్టుకోగలిగింది!. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి లబ్ధి పొందడానికే ఖతార్ అత్యంత విలాసవంతమైన విమానాన్ని ఆయనకు బహుమతిగా ఇస్తోందని ఊహాగానాలు వినిపించినా ఈ వ్యవహారం వెనక అసలు కారణం.. ఖతార్ రాజవంశీయులకు ఆ విమానంతో అవసరం తీరిపోవడం!. నిజానికి వారు 2020లోనే ఆ విమానాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ, కొనుగోలుదారు దొరక్క విక్రయంలో విఫలమయ్యారు. తమకు అవసరం లేని ఆ ‘చెత్త’ విమానాన్ని ఇప్పుడు ట్రంప్ ముఖాన ‘డంప్’ చేస్తున్నారు కనుక వారికి నిర్వహణ ఖర్చులు, స్టోరేజి వ్యయం బాగానే తగ్గుతాయని వైమానికరంగ నిపుణులు అంటున్నారు. ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్టు.. అలా అటు ఖతార్ రాజకుటుంబానికి ఖర్చూ తగ్గింది, ఇటు ట్రంప్ కూడా ఫ్రీ గిఫ్టుతో ఉబ్పితబ్బిబ్బవుతున్నారు. మొత్తానికి ఖతార్ ఒక బోయింగ్ 747 జంబో పీడను ఇలా వదిలించుకుంది.ఇంకా ఇలాంటివే మరో రెండు విమానాలు దాని దగ్గరున్నాయి. పరిమాణంలో పెద్దవైన, సుందరంగా అలంకరించిన, వాడకపోయినా నిరంతరం సరైన స్థితిలో (కండిషన్లో) ఉంచాల్సిన, ఇంధనం విపరీతంగా తాగే, పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు ఉద్దేశించిన ఇలాంటి విమానాలకు డిమాండ్ పడిపోయిందని తాజా ఉదంతం చాటుతోంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఈ విమానాలను కొనేవారు లేరు. అందుకే రాజకుటుంబాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు దశాబ్ద కాలంగా ఈ ‘తెల్ల ఏనుగు’లను వదిలించుకునే పనిలో ఉన్నాయి.Qatar gifted this Boeing 747 Jumbo Jet to the US defence department during the visit of Presidnet Donald Trump. pic.twitter.com/d5ad0k2Q0M— Aftab Chaudhry (@AftabCh81) May 15, 2025ఇతర ఆధునిక దేశాల మాదిరిగానే ఖతార్ కూడా ప్రస్తుతం నాజూకైన, బహుళ ప్రయోజనకర, ఆర్థిక అంశాలు కలిసొచ్చే, అధికారిక ప్రయాణాలకు అనువుగా ఉండే విమానాల వైపు మొగ్గు చూపుతోందని దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ ‘బీఏఏ & పార్టనర్స్’ మేనేజింగ్ డైరెక్టర్ లైనస్ బాయర్ ‘ఫోర్బ్స్’కు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడికి బోయింగ్ 747-8 విమానాన్ని ఖతార్ అప్పగించడాన్ని ఓ ‘సృజనాత్మక పరిష్కార వ్యూహం’గా, ‘ఆకాశంలో పోటాపోటీ బలప్రదర్శన అనే గతించిన నమూనాకు వీడ్కోలు’గా బాయర్ అభివర్ణించారు.అంతా ‘ఆయిల్ అండ్ గ్యాస్’ మహిమ!సౌదీ అరేబియా పక్కనే పర్షియన్ సింధుశాఖలో సుమారుగా అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్ర భూభాగం సైజులో ఉంటుంది ఖతార్ ద్వీపకల్పం. చమురు, సహజ వాయువు నిక్షేపాలు తెచ్చిపెట్టిన సంపద ఈ దేశాన్ని తలసరి జీడీపీ పరంగా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలబెట్టింది. అటు ఖతార్ పాలకులనూ ఆగర్భ శ్రీమంతులను చేసింది. అలా ఖతార్ ఎమిర్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని కుటుంబం సిరి సంపదలతో అలరారుతోంది. దీంతో దాదాపు డజను ఎయిర్ బస్, బోయింగ్ విమానాల శ్రేణిని థాని కుటుంబం సమకూర్చుకుంది. కొద్దిమంది వ్యక్తులు విలాసవంతమైన ప్రయాణాలు చేయడానికి వీలుగా ఆ విమానాలకు మార్పులు చేయించారు.ఇవి కాకుండా రాజ కుటుంబానికి చిన్నపాటి బంబార్డియర్, డసాల్ట్ బిజినెస్ జెట్స్ ఎలాగూ ఉన్నాయి. ట్రంప్ కు బహూకరించిన 747 విమానం తోకపై ‘ఏ7-హెచ్బీజే’ (A7-HBJ) అని ఉంటుంది. 2007 నుంచి 2013 వరకు ఖతార్ ప్రధానమంత్రిగా వ్యవహరించిన హమద్ బిన్ జసిమ్ బిన్ జబర్ అల్ థాని పేరులోని తొలి మూడు పదాల ప్రధమ అక్షరాలను ‘హెచ్బీజే’ (HBJ) స్ఫురింపజేస్తుంది.ప్రస్తుతం ఖతార్ ‘రాజ’ విమానాల శ్రేణిలో ఉన్న మూడు 747-8 విమానాల్లో ఈ విమానం ఒకటి. ‘ఖతార్ అమీరీ ఫ్లైట్’ సంస్థ దీని నిర్వహణను చూస్తోంది. 13 ఏళ్ల కిందట 2012లో కొనుగోలు చేసినప్పుడు ఈ విమానం ఖరీదు 367 మిలియన్ డాలర్లు. అంటే రూ.3,130 కోట్లు. కొన్న తర్వాత మూడేళ్లపాటు వందల కోట్లు కుమ్మరించి విమానం లోపలి స్వరూపాన్ని (ఇంటీరియర్) సుందరంగా తీర్చిదిద్దారు. సాధారణ బోయింగ్ 747-8 విమానంలో 467 మంది ప్రయాణించవచ్చు. కానీ ‘ఎగిరే ప్యాలెస్’గా అభివర్ణిస్తున్న ‘హెచ్బీజే’లో 89 మంది మాత్రమే ప్రయాణించేలా మార్పులు చేసి హంగులు అద్దారు. రెండు పడక గదులు, వినోద గది, సమావేశ గదులు అందులో ఉన్నాయి.ఎగిరితే గంటకు రూ.20 లక్షల ఖర్చు!బోయింగ్ తయారుచేసే 747 సిరీస్ విమానాలు 1970 నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. వైమానిక దూర ప్రయాణాలను అవి ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చాయి. అయితే పెరుగుతున్న ఇంధనం ధర ఆకాశవీధిలో ఈ నాలుగు భారీ ఇంజిన్ల విమానం ప్రయాణాన్ని వ్యయభరితంగా మార్చింది. ‘కార్పొరేట్ జెట్ ఇన్వెస్టర్’ అంచనా ప్రకారం 747-8 వీఐపీ వెర్షన్ విమానాన్ని ఆపరేట్ చేయడానికి గంటకు 23 వేల డాలర్లు (రూ.20 లక్షలు) ఖర్చవుతుంది. వ్యయభారం తట్టుకోలేక గత దశాబ్ద కాలంగా పలు విమానయాన సంస్థలు బోయింగ్ 747, నాలుగు ఇంజిన్ల ఎయిర్ బస్ ఏ340 విమానాలను సేవల నుంచి తప్పిస్తున్నాయి. వీటి బదులుగా రెండు ఇంజిన్లు గల వెడల్పాటి బోయింగ్ 787, ఎయిర్ బస్ ఏ350 విమానాలపై ఆధారపడుతున్నాయి. నాలుగు ఇంజిన్ల 747 సిరీస్ విమానాలు ఇంధనాన్ని విపరీతంగా తాగుతాయి!.ఈ ‘ఎగిరే భవనాలు’ను ఒక్క ఖతారే కాదు.. సౌదీ అరేబియా, బ్రూనై, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ కూడా క్రమంగా వదిలించుకుంటున్నాయి. తక్కువ ఇంధన సామర్థ్యం అటుంచి పెద్ద విమానాలతో భద్రతాపరమైన సమస్యలున్నాయని, వాటిని పెద్ద లక్ష్యాలుగా ఎంచుకునే ప్రమాదం ఉందని ఏరోడైనమిక్ అడ్వైజరీ మేనేజింగ్ డైరెక్టర్ రిచర్డ్ అబౌలాఫియా చెప్పారు. పెద్ద విమానాలు దిగాలంటే పొడవైన రన్ వేలు కావాలని, దాంతో ఆ విమానాల వినియోగం పరిమితమేనని వివరించారు. సన్నటి విమానాలకైతే చాలా ఎయిర్ పోర్టులు, సంప్రదాయ బిజినెస్ జెట్స్ అయితే మరిన్ని విమానాశ్రాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. 2020లో మార్కెట్లో అమ్మకానికి పెట్టడానికి ముందు ఐదేళ్లలో ఖతారీ విమానం ప్రయాణించింది మొత్తం కలిపి 1,059 గంటలే.ఇక ఖతార్ దగ్గరున్న మిగతా రెండు వీఐపీ 747-8 విమానాల్లో ఒకదాన్ని పూర్తిగా క్రియాశీల సేవల తప్పించారని లైనస్ బాయర్ తెలిపారు. 2018లో ఖతార్ ఇలాంటి 747-8 విమానాన్నే తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కు కూడా ఇచ్చింది. మరో పాత 747-ఎస్పీ విమానాన్ని ఓ అసెట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించగా దాన్ని ఆ సంస్థ స్టోరేజికి తరలించింది. ఇలాంటి ఉదాహరణలు బోలెడు. సౌదీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సాద్ 2011లో మరణించాడు. అతడి మరణానికి ముందు ఓ విలాసవంతమైన 747-8 విమానాన్ని అతడి కోసం సేవల్లోకి తీసుకున్నారు. కేవలం 42 గంటలే ప్రయాణించిన ఆ విమానాన్ని చివరికి 2022లో తుక్కు కింద ముక్కలు చేశారు. ప్రస్తుతం సౌదీలో రాజకుటుంబ ఉపయోగంలో ఉన్న 747 విమానాల శ్రేణిని ఒకే ఒక విమానానికి కుదించారు. సౌదీ యువరాజు మఃహమ్మద్ బిన్ సాల్మన్ ప్రస్తుతం బోయింగ్ 737, 787-8 వంటి చిన్న విమానాలు వినియోగిస్తున్నారు.అయితే లోపల ఖాళీ ప్రదేశం అధికం కనుక బోయింగ్ 747-8లకు సరకు రవాణా (కార్గో) రంగంలో మంచి డిమాండ్ ఉంది. 2023లో కర్మాగారం నుంచి బయటికొచ్చిన చివరి 747-8తో కలిపి బోయింగ్ ఇప్పటివరకు మొత్తం 155 విమానాలను విక్రయించగా వాటిలో రెండొంతులు సరకు రవాణాలోనే నిమగ్నమయ్యాయి. కేవలం కొద్దిమంది దూర ప్రయాణాల కోసమని స్వరూపం పరంగా, యాంత్రికంగా, కస్టమ్ ఇంటీరియర్స్ పరంగా మార్పులు చేసిన ఖతారీ 747-8 విమానాలను కార్గో విమానాల రూపంలోకి తేవడం కష్టమని బాయర్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక బహుమతిగా ట్రంప్ స్వీకరిస్తున్న ఖతార్ విమానాన్ని పరికిస్తే... భద్రతపరమైన నిబంధనలను సడలిస్తే తప్ప... ఆ విమానాన్ని విడదీసి పునర్నిర్మించడానికి కనీసం ఐదేళ్లు పడుతుందని రిచర్డ్ అబౌలాఫియా అంచనా. అంటే అప్పటికి అధ్యక్షుడిగా ట్రంప్ రెండో విడత పుణ్యకాలం... ఆ విమానంలో తిరగాలనే ఆయన బులపాటం తీరకుండానే ముగిసిపోతుంది! - జమ్ముల శ్రీకాంత్ Source: Forbes -
పాక్ ప్రధాని సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: భారత్ శక్తి, సామర్థ్యం తెలుసుకున్న పాకిస్తాన్.. చివరకు దిగి వచ్చింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎట్టకేలకు కీలక ప్రకటన చేశారు. భారత్‌తో చర్చలకు పాక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని షరీఫ్ వెల్లడించారు.పాక్‌లోని పంజాబ్ ప్రావిన్సులో కామ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ షరీఫ్ సందర్శించారు. అనంతరం, షరీఫ్ పాక్ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ శాంతి కోసం సిద్ధంగా ఉంది. అందుకు భారత్‌తో చర్యలకు సిద్ధం. భారత్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే, కశ్మీర్ అంశం కూడా చర్చల్లో చేర్చాలనేది తమ షరతు అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ పదేపదే స్పష్టం చేస్తున్నా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.పాక్ ప్రధాని ప్రకటన చేసిన సమయంలో షెహబాజ్‌తో పాటు ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, వైమానిక దళ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ వైరం వద్దని వారంతా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక.. భారత్, పాకిస్తాన్ యుద్ధం తర్వాత.. పాక్ ప్రధాని షరీఫ్ రక్షణ కేంద్రాన్ని సందర్శించడం ఇది రెండోసారి.Peace and Pakistan, Biggest Joke of the decade 😆“Pakistan's prime minister, Shehbaz Sharif, said on Thursday he was ready to engage in peace talks with India. Prime Minister Shehbaz Sharif extended an offer of talks to India, saying Pakistan is ready to engage "for peace". pic.twitter.com/NHvt1DNqsB— Vaibhav Rathi 🇮🇳 (@Vaibhavrathi05) May 16, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు పాకిస్తాన్ అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కీలక ప్రకటన చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్తాన్ ఎలా ఖాళీ చేయాలనే అంశంపైనైతే ఆ దేశంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌తో కేవలం ద్వైపాక్షిక సంబంధాలే ఉంటాయని, అనేక ఏళ్లుగా దానిపై ఏకాభిప్రాయంతో ఉన్నామని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి ముష్కరులపై చర్యలు చేపట్టాల్సిందేనని ఐరాస భద్రతామండలి కూడా నొక్కిచెప్పిందని, ఆపరేషన్ సిందూర్ ద్వారా ఈ నెల 7న అదే చేశామని పేర్కొన్నారు. ఆపరేషన్‌ను ప్రారంభించడానికి ముందే పాక్‌కు సందేశం పంపించాం. ఉగ్రస్థావరాలపైనే దాడులు చేస్తామని, సైనిక స్థావరాల జోలికి వెళ్లబోమని చెప్పాం. దానిని వారు పెడచెవినపెట్టారు. మనం వారికి ఎంత నష్టం కలిగించామో, వారు ఎంత స్వల్పంగా మనకు నష్టపరిచారో అందరికీ తెలుసు. శాటిలైట్ చిత్రాలే దీనికి సాక్ష్యం. అందుకే నాలుగు రోజుల్లో వారు వైఖరి మార్చుకున్నారు. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారు అని తెలిపారు. This video explains the extent of damage caused by @IAF_MCC in Pakistan. Pak PM took a dusty road to reach the PAF base. You know why? Watch this. 👇pic.twitter.com/XYQLEWWB0P— Pramod Kumar Singh (@SinghPramod2784) May 15, 2025 -
పుతిన్ లేకుండానే ఉక్రెయిన్–రష్యా చర్చలు
ఇస్తాంబుల్: తుర్కియే వేదికగా ఉక్రెయిన్‌తో జరిగే మొట్టమొదటిసారిగా జరిగే ప్రత్యక్ష శాంతి చర్చలకు అధ్యక్షుడు పుతిన్ హాజరుకావడం లేదని రష్యా తెలిపింది. అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు వ్లాదిమిర్ మెడిన్స్కీ సారథ్యంలోని బృందం గురువారం తుర్కియే రాజధాని అంకారా చేరుకుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు. ముగ్గురు సభ్యులతో కూడిన సీనియర్ అధికారుల బృందానికి సాయంగా నలుగురితో కూడిన నిపుణుల బృందం కూడా ఉందన్నారు. ఉక్రెయిన్‌తో జరిగే చర్చలకు అధ్యక్షుడు పుతిన్ వెళ్లడం లేదన్నారు. మూడేళ్లుగా జరిగే యుద్ధానికి ముగింపు పలికేందుకు తుర్కియేలో జరిగే శాంతి చర్చలకు రావాలని పుతిన్‌కు జెలెన్స్కీ సవాల్ విసిరారు. తాజా పరిణామంపై తుర్కియేలోని అంటాల్యాలో జరుగుతున్న నాటో సమావేశానికి హాజరైన జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ.. కీలకమైన విధాన నిర్ణయాలను తీసుకునే అధికారం ఆ బృందంలోని వారెవరికీ లేదని వ్యాఖ్యానించారు. అందుకే చర్చలకు తాను సైతం వెళ్లనని, రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్ సారథ్యంలో ప్రతినిధి బృందాన్ని పంపుతానని ప్రకటించారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌తో మాట్లాడాక చర్చల తేదీ, ప్రాంతం వెల్లడిస్తామన్నారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తామన్న యూరప్ నేతల హెచ్చరికలు, ట్రంప్ ఒత్తిడితో పుతిన్ ఈ చర్చలకు హాజరయ్యే అవకాశముందని సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. చివరికి ఇరుదేశాల అధ్యక్షులకు బదులుగా ప్రతినిధి బృందాలను పంపడం నిరాశ కలిగించిందని పరిశీలకులు అంటున్నారు. నేను వెళ్లనిదే పుతిన్ రారు తుర్కియేలో జరిగే చర్చలకు పుతిన్ హాజ రు కాకపోవడంపై ఖతార్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయం తనకు ఆశ్చ ర్యం కలిగించలేదన్నారు. ‘నేను వెళ్లనిదే ఆ యన అక్కడికి రావడం అసాధ్యం’అంటూ పుతిన్ నిర్ణయాన్ని సమరి్ధస్తూ మాట్లాడారు. -
ఖాన్‌యూనిస్ వాసులకు కాళరాత్రి
ఖాన్‌యూనిస్: గాజాలోని ఖాన్‌యూనిస్ నగర పాలస్తీనియన్లకు వరుసగా రెండో రోజు రాత్రి కూడా కాళరాత్రే అయ్యింది. ఇజ్రాయెల్ వైమానిక దళాలు బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఖాన్యూనిస్తోపాటు గాజా నగరం, జబాలియాలపై యథేచ్ఛగా సాగించిన వైమానిక దాడుల్లో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. నక్బాకు 77 ఏళ్లవుతున్న వేళ ఈ దారుణాలు కొనసాగుతుండటంపై పాలస్తీనియన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఖాన్‌యూనిస్‌పై 10, జబాలియా, చుట్టుపక్కల ప్రాంతాలపై కనీసం 13 భారీ బాంబు దాడులు జరిగినట్లు మీడియా తెలిపింది. మొత్తం 59 చనిపోయారని స్థానిక పౌర రక్షణ దళాలు తెలిపాయి. కొన్ని మృతదేహాలు ఛిద్రమయ్యాయని పేర్కొన్నాయి. సరైన యంత్ర సామగ్రి లేకపోవడంతో శిథిలాల్లో చిక్కుకున్న బాధితులను వెలికి తీయడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఖాన్‌యూనిస్‌పై జరిగిన దాడిలో ఖతార్ టీవీ ‘అల్ అరబీ’జర్నలిస్ట్ హసన్ సమౌర్ సహా అతడి కుటుంబంలోని 11 మంది చనిపోయినట్లు సోషల్ మీడియా పేర్కొంది. గాజాపై మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ సాగించిన వైమానిక దాడుల్లో సుమారు 25 మంది చిన్నారులు సహా 70 వరకు ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. హమాస్‌ను తుదముట్టించాలన్న తమ మిషన్ మరికొద్ది రోజుల్లోనే పూర్తవనుందని, అప్పటి వరకు దాడులను ఆపేదిలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టం చేశారు. గాజాతోపాటు వెస్ట్‌బ్యాంక్‌లోని నగరాలు, టుబాస్, నబ్లుస్, బెత్లెహెం, కలండియా, యాబాద్, ఫవ్వర్, అస్కర్ శరణార్థి శిబిరాలపై గురువారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేపట్టాయి. ఇంటింటి సోదాలు, అరెస్ట్‌లను ముమ్మరం చేశాయి. ‘నక్బా’ ప్రాముఖ్యం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలస్తీనియన్లు ఏటా మే 15వ తేదీని నక్బా లేదా జాతి నిర్మూలన దినంగా పాటిస్తారు. పాలస్తీనా భూభాగం నుంచి 1948 మే 14వ తేదీన బ్రిటిష్ బలగాలు వైదొలగాయి. మే 15వ తేదీన ఇజ్రాయెలీలతో కూడిన జియోనిస్ట్ బలగాలు బ్రిటన్ దన్నుతో చారిత్రక పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్, గాజా స్ట్రిప్ మినహా 78 శాతం ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. ఇక్కడున్న 7.50 లక్షల పాలస్తీనియన్లను వెళ్లగొట్టి ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాయి. జియోనిస్ట్ మూకల మారణకాండలో 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నగరాలు, పట్టణాలతోపాటు 530 పాలస్తీనా గ్రామాలు ధ్వంసమయ్యాయి. దారుణాలు జరిగిన మే 15ను పాలస్తీనియన్లు ‘నక్బా’గా ఏటా పాటిస్తారు. కూడు, నీడ కోల్పోయిన పాలస్తీనియన్లు గాజా, వెస్ట్ బ్యాంక్‌తోపాటు పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్, ఈజిప్టుల్లో ఏర్పాటు చేసిన 58 శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గాజాలోని 70 శాతం మంది శరణార్థులే. ఇంత సుదీర్ఘకాలంపాటు అపరిష్తృతంగా ఉన్న శరణార్థుల సమస్య ఇదే కావడం గమనార్హం. -
తుర్కియేకు భారీ ఝలక్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ వేళ ఆత్మాహుతి డ్రోన్లు, శిక్షణా సిబ్బందిని పాకిస్తాన్‌కు తరలించిన పాపానికి తుర్కియేపై భారత్ ఆగ్రహం మరింత ఎక్కువైంది. దీంతో తుర్కియేపై నిరసన చర్యల్లో భాగంగా ఆ దేశానికి చెందిన వైమానిక సేవల సంస్థకు గతంలో ఇచ్చిన భద్రతా క్లియరెన్స్‌ను భారత్ రద్దుచేసింది. ఈ మేరకు సెలెబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌కు ఇచ్చిన క్లియరెన్స్‌ను రద్దుచేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) గురువారం ప్రకటించింది. తుర్కియే మాతృసంస్థకు చెందిన రెండు అనుబంధ సంస్థలను అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విమానాల వద్ద గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ విధుల నుంచి తప్పించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, గోవా, అహ్మదాబాద్, కానూర్, కొచ్చిన్‌లలో సెలెబీ అనుబంధ సంస్థలే గత 15 సంవత్సరాలుగా పలు రకాల సేవలు అందించాయి. ఈ సంస్థల సిబ్బందే ఇన్నాళ్లూ విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్‌సైడ్ జోన్లలో విధుల్లో ఉన్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను వీళ్లే చూసుకున్నారు. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లే నెరవేర్చారు. ఇకపై ఈ పనులను వేరే సంస్థలకు అప్పగించనున్నారు. బీసీఏఎస్ ఆదేశాలకు అనుగుణంగా ఇకపై ఢిల్లీలో విమానాశ్రయంలో కార్గో సేవలు అందిస్తున్న ‘సెలెబీ ఢిల్లీ కార్గో టెర్మినల్ మేనేజ్మెంట్ ఇండియా’ సంస్థతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ఢిల్లీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ (డీఐఏఎల్) గురువారం ప్రకటించింది. ప్రయాణికులకు, సరకు రవాణాకు ఎలాంటి ఇబ్బంది, ఆటంకం కల్గకుండా సత్వర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. జామియా మిలియా సైతం..విద్యా సంస్థలు సైతం బహిష్కరణ నినాదం చేస్తున్నాయి. ఇప్పటికే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం తుర్కియేకు చెందిన ఇనోను యూనివర్సిటీతో ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. తుర్కియేలోని విద్యాసంస్థలతో ఒప్పందాలను తక్షణం నిలిపేస్తున్నట్లు ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ గురువారం ప్రకటించింది. యూనుస్ అమీర్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం ఆపేస్తున్నట్లు హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రకటించింది. పుణె వ్యాపారులు సైతం తుర్కియే ఆపిల్లను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. ఇకపై తుర్కియే నుంచి పండ్ల దిగుమతులు ఆపేస్తామన్న ట్రేడర్ల నిర్ణయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్వాగతించారు.తుర్కియే, అజర్‌బైజాన్‌కు వెళ్లొద్దు!‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం జోరందుకున్న నేప థ్యంలో ఇకపై పర్యా టకం, ప్రీ–వెడ్డింగ్, సిని మాల చిత్రీకరణల కోసం తుర్కియే, అజర్‌బైజాన్‌లకు వెళ్లొద్దని భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచన చేయబోతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తుర్కియేలో షూటింగ్ కోణంలో సినీరంగానికి ప్రభుత్వ మద్దతు ఆపేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సినిమా కార్మిక సంఘాలు సైతం కేంద్రసర్కార్ నిర్ణయానికి మద్దతు పలికాయి. భారతీయ నటులు, నిర్మాతలు తుర్కియేకు ప్రాధాన్యత నివ్వడాన్ని పూర్తిగా మానుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్(ఎఫ్‌డబ్ల్యూఐసీఈ), ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్(ఏఐసీడబ్ల్యూఏ) కోరాయి. కార్పొరేట్ సమావేశాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను తుర్కియేలో జరపొద్దని ప్రభుత్వం పలు రంగాలకు సూచించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పర్యాటకానికి సంబంధించిన పలు భారతీయ ట్రావెలింగ్ ఏజెన్సీలు బుకింగ్‌లు నిలిపేశాయి. అక్కడి వెళ్లాలని గతంలో భావించిన వాళ్లు భారీ సంఖ్యలో క్యాన్సలేషన్లు చేసుకుంటున్నారు. -
అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో జీరో టారిఫ్!
దోహా: భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉన్న వేళ కాల్పుల విరమణకు ఇరుదేశాలు సమ్మతించాయని అందరికంటే ముందే ప్రకటించి అభాసుపాలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు తొందరపాటు ప్రకటన చేశారు. టారిఫ్‌లు విధించకుండానే అమెరికా నుంచి వస్తూత్పత్తుల దిగుమతికి భారత్ అత్యుత్సాహం చూపిస్తోందని ట్రంప్ గురువారం అనూహ్య ప్రకటన చేశారు. దీంతో వెంటనే భారత్ స్పందించింది. అలాంటిదేమీ లేదని, టారిఫ్‌ల ఖరారుపై విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతు న్నాయని, చర్చలు ఇప్పట్లో ముగిసిపోవని భారత్ స్పష్టంచేసింది. జీరో టారిఫ్ ప్రతిపాదన లేదని కుండబద్దలు కొట్టింది.మోదీ మౌనమేల?: కాంగ్రెస్ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించట్లేరని విపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది. ‘‘ అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఖరారు చర్చల కోసం మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ జీరో టారిఫ్ అంటూ ప్రకటన చేశారు. ఈ సున్నా టారిఫ్‌కు, ఆపరేషన్ సిందూర్ ఆగిపోవడానికి మధ్య సంబంధమేంటి?. ఈ అంశంలో మోదీ ఎందుకు మౌనం వహించారు?. అమెరికాతో డీల్ కుదుర్చుకునేందుకు మోదీ ఏమేం అంశాల్లో తలూపారు?’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ ‘ఎక్స్’లో ప్రశ్నించారు.ట్రంప్ ఏం మాట్లాడారు?గురువారం ఖతార్ రాజధాని దోహాలో వ్యాపారదిగ్గజాలు, సంస్థలతో ట్రంప్ సమావేశమయ్యారు. చైనా, అమెరికా టారిఫ్‌ల యుద్ధం నేపథ్యంలో భారత్‌లో అత్యధికంగా ఐఫోన్లను తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేయబోతున్నట్లు యాపిల్ సంస్థ ఇటీవల ప్రకటించడం తెల్సిందే. ఈ విషయం నచ్చని ట్రంప్ ఇదే అంశాన్ని దోహా భేటీలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వద్ద ప్రస్తావించారు. ‘‘అమెరికాలో యాపిల్ సంస్థను ఇంతబాగా చూసుకుంటున్నా మీరేమో భారత్‌లో ఐఫోన్లను మరింత ఎక్కువగా తయారుచేస్తామంటున్నారు. అక్కడే కర్మాగారాలను విస్తరిస్తున్నారు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. అమెరికా ఉత్పత్తులపై భారత్ చాలా ఎక్కువ టారిఫ్‌లు విధిస్తోంది. ప్రపంచంలో అధిక టారిఫ్‌లు విధించే దేశాల్లో భారత్ కూడా ఉంది. టారిఫ్‌లు పెంచాక అత్యధిక ధరలకు మీరు భారత్‌లో వస్తువులను విక్రయించడం చాలా కష్టమవుతుంది. మీకో విషయం చెప్పనా. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ ఒక చక్కని ప్రతిపాదన తెచ్చింది. అసలు టారిఫ్‌లే లేకుండా వస్తువులను భారత్‌లోకి దిగుమతి చేసుకోవడానికి వాళ్లు దాదాపు అంగీకారం తెలిపారు. మీరు భారత్‌లో ఐఫోన్ల తయారీ కర్మాగారాలను నిర్మించినా అక్కడి సర్కార్ మిమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు. వాళ్లకు స్వప్రయోజనాలే ముఖ్యం’’ అని టిమ్‌కుక్‌తో ట్రంప్ మాట్లాడారు. ఈ విషయాలను మీడియాకు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తనతో మాట్లాడిన తర్వాత అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు టిమ్‌కుక్ అంగీకారం తెలిపారని ట్రంప్ ప్రకటించారు. భారతీయ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ ఏప్రిల్ 9వ తేదీన ప్రకటించారు. అయితే 90 రోజులపాటు ఈ పెంపును తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు తర్వాత ట్రంప్ వెల్లడించడం తెల్సిందే.ఖండించిన భారత్ట్రంప్ మాటల్లో వాస్తవం లేదని భారత్ గురువారం ప్రకటించింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ‘‘ టారిఫ్లుసహా సమగ్ర వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇవి సంక్లిష్టమైనవి. చర్చలు ముగిసిపోలేదు. ప్రతి అంశంపైనా కూలంకషంగా చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా ఏ అంశంపైనా తుది నిర్ణయాలు వెలువడలేదు. ఒప్పందం కుదుర్చుకుంటే అది ఇరుపక్షాలకు ప్రయోజనకారిగా ఉండాలి. రెండు దేశాలకూ లబ్ధిచేకూరాలి. మేం ఇదే కోరుకుంటున్నాం. చర్చలు పూర్తికాకుండానే దీనిపై మాట్లాడటం తొందరపాటు చర్యే అవుతుంది’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. 2024లో ఇరుదేశాల మధ్య 129 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. -
తుర్కియేను కుదిపేసిన భూకంపం.. భయంతో జనం పరుగులు
తుర్కియేలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదైయినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ఇస్తాంబుల్‌లో బలమైన ప్రకంపనలు రాగా, ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయందోళనకు గురై.. ప్రాణ భయంతో ప్రజలంతా రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో రహదారులపై వెళ్తున్న కార్లు భూకంప తీవ్రతకు ఊగిపోయాయి.ఈ భూకంపం టర్కీలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్స్‌ను తాకినట్లు సమాచారం. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలొ వైరల్‌గా మారాయి. భూకంపం కారణంగా భయాందోళనలకు గురైన కొందరు భవనాల నుండి దూకడానికి ప్రయత్నించగా.. కొందరు గాయపడినట్లు సమాచారం. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.🚨BIG BREAKING: Earthquake HITS Turkey🇹🇷 pic.twitter.com/Hd6NEFu15t— Manobala Vijayabalan (@ManobalaV) May 15, 2025 -
టర్కీకి భారత్ ఫస్ట్ స్ట్రోక్.. ఇక సర్దేసుకోవడమే!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పై ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సిందూర్ ను భారత్ చేపట్టగా, దానికి వ్యతిరేకంగా పని చేసింది టర్కీ(తుర్కియే). ఇక్కడ ప్రత్యక్షంగా పాకిస్తాన్ కు సాయం చేసి భారత్ ను దెబ్బ కొట్టాలని యత్నించింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లలో సింహ భాగం టర్కీకి చెందినవే కావడమే కాకుండా, ఆ డ్రోన్లకు ఆపరేటర్లను కూడా సప్లై చేసింది టర్కీ. ఇది భారత్ కు మరింత కోపం తెప్పించింది. టర్కీ నుంచి ఏమైనా డ్రోన్లను కొనుగోలు చేశారా అని తొలుత భావించినా, ఆ డ్రోన్ల ఆపరేటర్లు కూడా ఆ దేశానికే చెందిన వారే కావడంతో వారి పన్నాగం బయటపడింది.దాంతో టర్కీపై విమర్శలు వెల్లువెత్తాయి. వరదల సమయంలో ఏ దేశం కూడా సాయం చేయడానికి ముందుకు రాకపోతే భారత్ వారికి ఆపన్న హస్తం అందించింది. దానిని మరిచిపోయి మన వేలితో మనల్నే పొడాలని చూసింది టర్కీ. ఇప్పుడు టర్కీకి బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది.సెక్యూరిటీ క్లియరెన్స్ అనుమతులు రద్దు..!భారతదేశంలోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాలలో సింహభాగాన్ని నిర్వహిస్తున్న టర్కిష్ సంస్థ తన భద్రతా అనుమతిని కోల్పోయింది. ఈ రోజు(గురువారం) సాయంత్రం భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ టర్కీకి చెందిన సంస్థకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. జాతీయ భద్రత దృష్ట్యాసెలెబి గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి ఇది..!భారత్‌లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా అంశాల్లో కూడా తుర్కియే పరోక్షపాత్ర ఉంది. .వాటిలో కార్గో హ్యాండ్లింగ్ వంటి కీలక కాంట్రాక్టులను తుర్కియేకు చెందిన సెలెబీ ఏవియేషన్ కంపెనీ చెందిన అనుబంధ సంస్థ సంపాదించింది. భారత్‌లో 2008 నుంచి ఈ సంస్థ సేవలందిస్తోంది. ఏటా 58,000 విమానాలు, 5.4 లక్షల టన్నుల సరకు రవాణా బాధ్యతలను చూసుకుంటోంది. అందులో 7,800 మంది సిబ్బంది ఉన్నారు.హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్ వంటి కీలక విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ బాధ్యతలు సెలెబీవే! గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ విధులను ఈ సంస్థే చూస్తోంది. విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్‌సైడ్ జోన్లన్లా సంస్థ సిబ్బందే విధుల్లో ఉంటున్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను చూసుకునేదీ వాళ్లే. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లకే అప్పగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దాంతో భారత ప్రభుత్వం.. చర్యలు చేపట్టి ఆ సంస్థకు చెందిన అనుమతులను రద్దు చేసింది. ఇది తుర్కియేగా పిలువబడుతున్న టర్కీకి భారత్ ఇచ్చిన తొలి స్ట్రోక్. -
Covid-19 మళ్లీ వచ్చేసింది : కేసులు, మరణాలు, అధికారుల హెచ్చరికలు
ఆసియాలో కోవిడ్మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆసియా అంతటా కోవిడ్ న్యూ వేవ్ ఆందోళన రేపుతోంది. హాంకాంగ్, సింగపూర్‌లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల మరణాలు కూడా నమోదవుతున్నాయి. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి కనిపిస్తుండటం మరింత ఆందోళనకరంగా మారింది. ఆసియాలోని ఈ రెండు అతిపెద్ద నగరాల్లో వైరస్ కేసులు క్రమానుగతంగా పెరుగుతున్నందున, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులు బూస్టర్ షాట్లు తీసుకోవాలని, ప్రజలు తమ టీకాలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులు పిలుపునిచ్చారు.జనసాంద్రత ఎక్కువగా ఉన్న హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని స్థానిక ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హాంకాంగ్‌లో వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని నగరంలోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆయు స్థానిక మీడియాతో అన్నారు. హాంకాంగ్‌లో కోవిడ్-పాజిటివ్ కేసుల శాతం అత్యధిక స్థాయికి చేరిందన్నారు. మే 3 నుండి వారంలో మరణాలతో సహా తీవ్రమైన కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాదిలో అత్యధిక స్థాయికి చేరుకుని 31కి చేరుకున్నాయని అక్కడి లెక్కల ద్వారా తెలుస్తోంది. 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత రెండేళ్లలో కనిపించిన కేసులతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరికలు బాగా పెరిగాయని తెలిపారు.అటు సింగపూర్‌లో మే 3 నుండి వారంలో గత ఏడు రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య 28 శాతం పెరిగి 14,200 కు చేరగా, రోజువారీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య దాదాపు 30 శాతం పెరిగింది. దీనికి సంబంధించి నగర-రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఈ నెలలో కోవిడ్ డేటాను విడుదల చేసింది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల కేసులు పెరగవచ్చు, అయితే, మహమ్మారి సమయంలో కంటే ప్రసరణ వేరియంట్లు వ్యాప్తి, తీవ్రమైన కేసులకు సంబంధించిన సూచనలు లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ఇలా ఉంటే..హాంకాంగ్ గాయకుడు ఈసన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. ఈ వారం చివర్లో తైవాన్‌లోని కావోసియుంగ్‌లో తన కచేరీలను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చైనీస్ సోషల్ మీడియా వీబోలోని కచేరీ అధికారిక ఖాతా గురువారం తెలిపింది.ఇదీ చదవండి: పురుషులూ మేలుకోండి.. హాట్ టాపిక్‌గా ఇద్దరు మహిళల పెళ్లి!అటు చైనా కూడా కోవిడ్ కేసులను, వ్యాప్తిని నిశితంగా గమనిస్తోంది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం, ప్రస్తుతం గత సంవత్సరం వేసవిలో కోవిడ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకునే దిశగా చైనా పయనిస్తోంది. మే 4 దాకా ఐదు వారాల్లో ప్రధాన ఆసుపత్రులలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువ పెరగడం గమనార్హం.చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా? -
అమెరికాలో ఘోరం : భారత సంతతి పర్వతారోహకుడి సహా ముగ్గురు దుర్మరణం
అమెరికాలోని వాషింగ్టన్లో పర్వతారోహణ చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఇందులో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డితో సహా ముగ్గురు పర్వతారోహకులు మరణించారు. అయితే, నాల్గవ సహచరుడు తీవ్రంగా గాయపడ్డాడు. పర్వతారోహణంపై ఆసక్తితో ఎంతో ఉత్సాహంగా మొదలైన వీరి ప్రయాణం విషాదాంతమైంది. దీంతో బాధిత కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.పశ్చిమ ఉత్తర అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ కాస్కేడ్స్ పర్వతాలపై ఈ ప్రమాదంచోటు చేసుకుంది. ఈ క్లైంబింగ్ ప్రమాదంలో మరణించిన ముగ్గురిలో భారత సంతతికి చెందిన టెక్కీ విష్ణు ఇరిగిరెడ్డి కూడా ఉన్నారు. సియాటిల్ నివాసి అయిన 48 ఏళ్ల విష్ణు తన ముగ్గురు స్నేహితులు టిమ్ న్గుయెన్ (63), ఒలెక్సాండర్ మార్టినెంకో (36) ఆంటన్ సెలిక్‌లతో (38), త్సేలిఖ్ లతో కలిసి శనివారం కాస్కేడ్స్‌లోని నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్ ప్రాంతాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని NBC న్యూస్ నివేదించింది. అయితే ఈ ఘోర ప్రమాదంనుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక అధిరోహకుడు త్సేలిఖ్,తన ముగ్గురు స్నేహితుల మరణానికి దారి తీసిన ప్రమాదం గురించి అధికారులకు తెలియజేయడానికి 64 కిలోమీటర్లు ప్రయాణించాడు. త్సేలిఖ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు ,అంతర్గత రక్తస్రావం, మెదడు గాయానికి చికిత్స పొందుతున్నాడు.అయితే పైకి ఎక్కుతున్నపుడు తుఫాను ప్రమాదాన్ని గుర్తించిన వీరు వెనక్కి తగ్గినప్పటికీ ఫలితం లేకపోయింది. కిందికి దిగుతున్న సమయంలో జట్టు యాంకర్ పాయింట్ విఫలం కావడంతో వారు 200 అడుగుల కిందకు పడిపోయారని క్లైంబింగ్ వెబ్సైట్ నివేదించింది. ఈ ప్రమాదంలోపై విష్ణు స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర విచారాన్ని వ్యకతం చేశారు. విష్ణు అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడని ప్రకృతిని బాగా ఇష్టపడేవారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు సియాటిల్‌లో అత్యంత నైపుణ్యమున్న టెక్నీషియన్లలో గొప్పవాడని, తనదైన విలువలతో జీవితాన్ని నిర్మించు కున్నాడంటూ కంట తడిపెట్టుకున్నారు. విష్ణు గౌరవార్థం అతని స్నేహితులు , కుటుంబ సభ్యులు రెండు లాభాపేక్షలేని సంస్థలకు విరాళాలు అందించనున్నారు. అలాగే మే 22 వరకు ఆ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వాలని వారు ఇతరులకు విజ్ఞప్తి చేశారు.విష్ణు గ్రేటర్ సియాటిల్ ప్రాంతంలోని టెస్ట్ పరికరాల తయారీ సంస్థ ఫ్లూక్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు. విష్ణు గొప్ప టీం లీడర్ అనీ, ఆయన మరణం తీరని లోటు అంటూ కంపెనీ కూడా నివాళులర్పించింది. నార్త్ కాస్కేడ్స్‌లోని లిబర్టీ బెల్ సమూహంలోని గ్రానైట్ శిఖరం, నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్, అనుభవజ్ఞులైన పర్వాతారోహకులకు ప్రసిద్ధి చెందింది. -
అమెరికాలో కొత్త ట్యాక్స్.. అమలైతే ఎన్ఆర్ఐల జేబులు ఖాళీ!
అమెరికాలో మరో కొత్త రకం పన్నుకు ట్రంప్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఇది గనుక అమలులోకి వస్తే అక్కడ నివస్తున్న ప్రవాస భారతీయులపై (NRI) తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి సంబంధించి అమెరికా హౌస్ ఆఫ్ రిపబ్లికన్స్‌లో మే 12న ఓ బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం అంతర్జాతీయ మనీ ట్రాన్స్‌ఫర్‌పై 5 శాతం పన్ను విధించనున్నారు.స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 2028 వరకు 2,500 డాలర్లకు పెంచడం ద్వారా 2017 పన్ను కోతలు, ఉద్యోగాల చట్టాన్ని శాశ్వతం చేయాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రెండోసారి అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే ఈ చట్టాన్ని 'గ్రేట్' అని అభివర్ణిస్తూ, రిపబ్లికన్లు దీనిని ఆమోదించేలా చూడాలని కోరారు. మే 26 మెమోరియల్ డే నాటికి బిల్లును ఆమోదించాలని సభ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత అది సెనేట్‌కు వెళుతుంది. జూలై 4వ తేదీలోగా చట్టంగా మార్చాలని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.కొత్తగా వసూలు చేసే 5 శాతం రెమిటెన్స్ పన్నును పన్ను విరామాలకు నిధులు సమకూర్చడానికి, సరిహద్దు భద్రతా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు చెబుతున్నారు. ఇది యూఎస్ ట్రెజరీకి బిలియన్లకొద్దీ ఆదాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ కష్టపడి డబ్బులు సంపాదించుకుని వాటిని తమ దేశాల్లోని కుటుంబాలకు పంపించే విదేశీయులకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.ఎన్ఆర్ఐలపై తీవ్ర ప్రభావంభారత్లోని తమ కుటుంబాలకు డబ్బు పంపే ఎన్ఆర్ఐలకు ఈ పన్ను తీవ్ర ఆర్థిక ప్రభావాలను కలిగిస్తుంది. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి భారత్‌కు ఏటా 8,300 కోట్ల డాలర్ల రెమిటెన్స్ లు పంపుతుండగా, అందులో ఎక్కువ భాగం అమెరికా నుంచే అందుతున్నాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం ఎన్ఆర్ఐలు భారత్‌లోని తమ కుటుంబాలకు పంపే ప్రతి లక్ష రూపాయలకు రూ.5,000 పన్ను రూపంలో యూఎస్ ప్రభుత్వానికి వెళ్తుంది. -
పాక్ సిబ్బందితో భారత్‌కు నౌక
పారాదీప్: సింగపూర్ మీదుగా దక్షిణకొరియా నుంచి భారత్‌కు వచ్చిన చమురు రవాణా నౌకలో మొత్తం సిబ్బందిలో 21 మంది పాక్ జాతీయులు ఉన్నట్లు తేలడంతో ఒడిశాలోని పారాదీప్ ఓడరేవులో ఒక్కసారిగా కలకలం రేగింది. పరస్పర సైనిక చర్యలతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ వ్యతిరేక వర్గాలు నౌకాశ్రయానికి చేరుకుని ఆందోళన చేపట్టకుండా ఉండేందుకు పోర్ట్ అధికారులు వెంటనే అలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం విదేశాల నుంచి తీసుకొచ్చిన ముడి చమురును నౌక నుంచి కిందకు దింపే వరకు నౌకాశ్రయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు చేపట్టారు. పారాదీప్ పట్టణంలో ఒడిశా పోలీసులు వెంటనే భద్రతను పెంచారు. 25 మంది సిబ్బందితో ‘ఎంటీ సైరన్ ఐఐ’ పేరున్న సరకు రవాణా నౌక బుధవారం తెల్లవారుజామున పారాదీప్ పోర్ట్‌కు రాగానే అధికారులు సిబ్బంది గురించి వాకబుచేశారు. వీరిలో ఒక శ్రీలంకన్, ఒక థాయిలాండ్ దేశస్తుడు, ఇద్దరు భారతీయులు, 21 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇమిగ్రేషన్శాఖ నుంచి సంబంధిత సమాచారాన్ని ఒడిశా మెరైన్ పోలీస్‌కు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు చేరవేశామని మెరైన్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ బబితా చెప్పారు. ప్రస్తుతం ఓడ నౌకాశ్రయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రజలాల్లో లంగరు వేసి ఉంది. క్రూడ్ ఆయిల్ అన్లోడింగ్ అవగానే సిబ్బందితో నౌక వెళ్లిపోతుందని జగత్సింగ్పూర్ ఎస్పీ భవానీశంకర్ స్పష్టంచేశారు. అప్పటిదాకా పాకిస్తాన్ సిబ్బందిని నౌక నుంచి బయటకు అనుమతించబోమని చెప్పారు. -
బహమాస్‌లో భారత విద్యార్థి మృతి
బోస్టన్: భారత సంతతికి చెందిన ఓ అమెరికా విద్యార్థి బహమాస్ ద్వీపంలో ప్రమాదవశాత్తూ మరణించాడు. 25 ఏళ్ల గౌరవ్ జైసింగ్ అమెరికాలో బెంట్లీ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చదువుతున్నాడు. శనివారం వర్సిటీ అండర్ గ్రాడ్యుయేషన్ వేడుక నేపథ్యంలో సీనియర్ విద్యార్థులు బహమాస్ పర్యటనకు వెళ్లారు. అట్లాంటిస్ ప్యారడైజ్ ఐలాండ్ రిసార్ట్ అండ్ క్యాసినోలో బస చేశారు. మే 11 రాత్రి హోటల్ గదిలో మిత్రులతో కలిసి గడుపుతున్న గౌరవ్ పై అంతస్తు బాల్కనీ నుంచి పడిపోయాడు. అత్యవసర వైద్యం అందించి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని ధ్రువీకరించారు. దర్యాప్తు కొనసాగు తోంది. బోస్టన్‌కు 12 మైళ్ల దూరంలో ఉండే బెంట్లీ ఓ చిన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయం. -
ఇవేంటి! ఇంత అద్భుతంగా ఉన్నాయ్!
దోహా: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడు. అపర కుబేరుడు. అలాంటి ట్రంప్ సౌదీ అరేబియా, ఖతార్ అధినేతల ప్రాభవం చూసి నోరెళ్లబెట్టారు. వారి రాజభవనాలను చూసి అసూయపడ్డానని స్వయంగా చెప్పారు. ఖతార్ రాజప్రాసాదాల ఠీవి, సౌకర్యాలు చూసి, ‘‘ఇవేంటి ఇంత అద్భుతంగా ఉన్నాయి! వీటిని జీవితంలో కొనలేం’’ అని వ్యాఖ్యానించారు. తన అత్యాధునిక ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానం కంటే అత్యంత విలాసవంత, అధునాతన బోయింగ్–747 రకం విమానాలను ఖతార్, సౌదీల్లో చూశానని చెప్పుకొచ్చారు. ఖతార్ నుంచి విమానాన్ని కానుకగా తీసుకోవడానికి సంకోచించబోనని బల్లగుద్దిమరీ చెప్పారు. ఖతార్ పాలకుడు అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ రాజభవనం ‘అమీర్ దివాన్’ను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యానని వెల్లడించారు. ‘‘స్వతహాగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. నిర్మాణ నైపుణ్యం, కట్టడాల నేర్పు ఇట్టే పసిగడతా. మీ నివాసాలు భూలోక స్వర్గాలు. ఇంద్రభవనాలు. ఎంత పర్ఫెక్ట్గా కట్టారో!’’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. -
చైనా పత్రికలపై భారత్
న్యూఢిల్లీ: చైనా పాల్పడుతున్న భారత వ్యతిరేక ప్రచారంపై కేంద్రం కన్నెర్రజేసింది. పాకిస్తాన్‌కు అనుకూలంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నందుకు గ్లోబల్ టైమ్స్, జిన్హువా పత్రికల ఎక్స్ ఖాతాలను నిషేధించింది. అవి రెండూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కరపత్రాల వంటివి. భారత ప్రభుత్వం ధ్రువీకరించని విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న చైనా మీడియాకు మన రాయబార కార్యాలయం గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది. అయినా అదే ధోరణి కొనసాగడంతో తాజా చర్యలు తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత మూడు భారత యుద్ధ విమానాలను పాక్ కూల్చేసిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇలా పచ్చి అబద్ధాలు ప్రచురించడం బాధ్యతారాహిత్యమని, జర్నలిజం విలువలకు విరుద్ధమని భారత రాయబార కార్యాలయం విమర్శించింది. భారత్–పాక్ ఉద్రిక్తతలపై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడంపై ఆగ్రహించింది. అయితే గ్లోబల్ టైమ్స్పై నిషేధాన్ని బుధవారం అర్ధరాత్రి ఎత్తేసింది. -
ఖతార్‌తో 200 బిలియన్ డాలర్ల డీల్
దోహా/రియాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబి యా పర్యటన ముగించుకొని బుధవారం ఖతార్ చేరుకున్నారు. ఖతార్‌లో ఆయన ఘన స్వాగతం లభించింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 160 విమానాలు కొనుగోలు చేసేందుకు ఖతార్ ఒప్పందం చేసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ డీల్ విలువ 200 బిలియన్ డాలర్లు అని తెలిపారు. ఖతార్ పాలకుడు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్–థానీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ పర్యటన కంటే ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ఖతార్ నుంచి ఒక విమానాన్ని బహుమతిగా స్వీకరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఖతార్ ఇచ్చే విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ వన్‌గా వాడుకుంటానని వ్యాఖ్యానించారు. మరోవైపు తుర్కియేలో పర్యటించాలన్న ఆకాంక్షను ట్రంప్ వ్యక్తంచేశారు. ఉక్రెయిన్, రష్యా అధినేతలు జెలెన్స్కీ, పుతిన్ తుర్కియేలో ముఖాముఖి భేటీ కాబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ భేటీ పట్ల ట్రంప్ ఆసక్తి కనబరుస్తున్నారు. తాను తుర్కియేకు వెళ్తే పుతిన్ ఎంతగానో సంతోషిస్తారని ట్రంప్ చెప్పారు.ఒకప్పుడు ఉగ్రవాదుల జాబితాలో ఉన్న సిరియా అధ్యక్షుడితో ట్రంప్ సమావేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సౌదీ అరేబియాలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్– షారాతో సమావేశమయ్యారు. రెండు దేశాల అధినేతలు కలుసుకోవడం గత 25 ఏళ్లలో ఇదే మొదటిసారి. 50 ఏళ్లుగా అస్సద్ కుటుంబ పాలనలో అంతర్యుద్ధంతో నలిగిపోయి న సిరియాకు ఇటీవలే విముక్తి లభించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌తో అల్–షారా కీలక అంశాలపై చర్చించినట్లు తెలు స్తోంది. ఇజ్రాయెల్ దేశాన్ని అధికారికంగా గుర్తించాలని, సిరియా నుంచి విదేశీ ఉగ్రవాదులను బయటకు వెళ్లగొట్టాలని అల్–షారాను ట్రంప్ కోరినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. అల్– షారాతో భేటీ అనంతరం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. సిరియా అధ్యక్షు డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఆకర్ష ణీయంగా కనిపిస్తున్న అందమైన యువకుడు అంటూ కొనియాడారు. బలమైన వ్యక్తి, ఫైటర్ అంటూ శ్లాఘించారు. సిరియాపై ఆంక్షలు రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సిరియా ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తమ కు మంచి రోజులు వచ్చా యని ఆనందం వ్యక్తంచేశారు. అస్సద్ ప్రభుత్వ హయాంలో తిరుగుబాటు నాయకుడిగా గుర్తింపు పొందిన అల్–షారాను అమెరికా ప్రభుత్వం 2013లో అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఆయనపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. అదే అల్–షారా అధ్యక్షుడు కావడం, డొనల్డ్ ట్రంప్ ఆయనతో భేటీ కావడం విశేషం. -
మన వేలితో మన కన్నే..!
రెండేళ్ల క్రితం భయానక భూకంపం వేళ తుర్కియేకు అందరికంటే ముందు ఆపన్న హస్తం అందించింది భారతే. ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట భారీ సాయం చేసింది. కానీ ఆ దేశం మాత్రం తిన్నింటి వాసాలే లెక్కబెడుతోంది. సాయుధ సంఘర్షణ వేళ దాయాది పాకిస్తాన్‌కు ఎడాపెడా డ్రోన్లు, ఇతర ఆయుధాలను అందజేసి కృతఘ్నుతకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. విశ్వాస ఘాతుకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. వాటితో పాటు సైనికులను, శిక్షణా సిబ్బందిని కూడా పాక్‌కు తుర్కియే భారీగా పంపినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. డ్రోన్ల వాడకం తదితరాల్లో వాళ్లు పాక్ జవాన్లకు పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చినట్టు తేలింది. పాక్‌కు తుర్కిష్ కంపెనీ ఆసిస్‌గార్డ్ సోంగార్ పంపిన బైరక్తార్ టీబీ2, ఈహా డ్రోన్లు ఆత్మాహుతి తరహావి. లక్ష్యంపై పడి పేలిపోతాయి. ఈ డ్రోన్ల తయారీలో భారత్ ఎగుమతి చేసే కీలకమైన మూలకాలు, ముడి సరుకులే ప్రధాన వనరులు కావడం విశేషం! మనకు వ్యతిరేకింగా ఇలా నిస్సిగ్గుగా బరితెగించిన తుర్కియేకు ఆ కీలక ఎగుమతులను తక్షణం నిలిపేయాలని రక్షణ నిపుణులు సూచిస్తున్నారు. కంట్రోలర్ల నుంచి రిసీవర్ దాకా... ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రశిబిరాలను భారత్ కుప్పకూలి్చన కొద్ది గంటలకే పాక్ దాదాపు 400 డ్రోన్లతో సరిహద్దు ప్రాంతాలపై దాడికి తెగించడం తెలిసిందే. తుర్కియేకు భారత ఎగుమతుల్లో సింహభాగం అల్యూమినియం, అల్యూమినియం సంబంధ ఉపకరణాలు, ఆటో ఉత్పత్తులు, విమానాల విడిభాగాలు, టెలికం ఉపకరణాలు, ఎలక్ట్రిక్ వస్తువులు, పరికరాలు తదితరాలే. వీటిలో చాలావరకు డ్రోన్ల తయారీలో కీలకం. డ్రోన్లలోని కంట్రోలర్, ఫ్రేమ్, మోటార్, ప్రొపెల్లర్, కెమెరా, ఫైట్ కంట్రోల్, రిసీవర్, వీడియో ట్రాన్స్మిటర్, యాంటెన్నా, స్పీడ్ కంట్రోలర్, కంట్రోలర్లను కూడా భారత్ నుంచే తుర్కియే దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ ఎగుమతులు ఎక్కువచయ్యాయి. ఆ విడిభాగాలతో రూపొందించిన డ్రోన్లను పాక్‌కు అందజేయాలన్నది తుర్కియే అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ నిర్ణయమేనని తెలుస్తోంది. అతనికి అంతులేని భారత విద్వేíÙగా పేరుంది. తమ డ్రోన్లు, ఆయుధాలను భారత్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించకూడదనే ఒట్టు పెట్టుకున్నారు! మన విమానాశ్రయాల భద్రతతుర్కియే సంస్థ చేతుల్లో! భారత్‌లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా అంశాల్లో కూడా తుర్కియే పరోక్షపాత్ర ఉందని వెలుగులోకి వచ్చింది. వాటిలో కార్గో హ్యాండ్లింగ్ వంటి కీలక కాంట్రాక్టులను తుర్కియేకు చెందిన సెలెబీ ఏవియేషన్ కంపెనీ చెందిన అనుబంధ సంస్థ సంపాదించిందని తేలింది. భారత్‌లో 2008 నుంచి ఈ సంస్థ సేవలందిస్తోంది. ఏటా 58,000 విమానాలు, 5.4 లక్షల టన్నుల సరకు రవాణా బాధ్యతలను చూసుకుంటోంది. అందులో 7,800 మంది సిబ్బంది ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్ వంటి కీలక విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ బాధ్యతలు సెలెబీవే! గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ విధులను ఈ సంస్థే చూస్తోంది. విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్‌సైడ్ జోన్లన్లా సంస్థ సిబ్బందే విధుల్లో ఉంటున్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను చూసుకునేదీ వాళ్లే. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లకే అప్పగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆరు దేశాల్లోని 70 విమానాశ్రయాల్లో కూడా సెలెబీ కాంట్రాక్టులు సంపాదించింది.ముమ్మరంగా ‘బ్యాన్ తుర్కియే’ పాక్‌కు సైనికసాయం చేస్తున్నందుకు నిరసనగా తుర్కియే ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. ఇకపై తుర్కియే యాపిల్ పండ్లను దిగుమతి చేసుకోవద్దని మహారాష్ట్రలోని కీలకమైన పుణె పండ్ల మార్కెట్ ట్రేడర్లు నిర్ణయించుకున్నారు. ‘‘మన సైన్యానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నాం. తుర్కియేకు బదులు ఇక హిమాచల్, ఉత్తరాఖండ్ ఇరాన్ నుంచి ఆపిల్స్ తెప్పిస్తాం’’ అని పుణె వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ ట్రేడర్ సుయోగ్ జిందే చెప్పారు. పుణెలో తుర్కియే యాపిల్స్ టర్నోవర్ రూ.1,200 కోట్ల పై చిలుకే. దాంతో ఈ నిర్ణయం ఆ దేశానికి పెద్ద దెబ్బే కానుంది. తుర్కియే నుంచి తెల్ల చలువరాయి దిగుమతులనూ నిషేధించాలన్ల డిమాండ్లు విని్పస్తున్నాయి.యాత్రలూ బంద్! తుర్కియేకు మనోళ్ల విహార యాత్రలు కూడా భారీగా తగ్గాయి. ఆ దేశానికి క్యాన్సలేషన్లు భారీగా పెరుగుతున్నాయని ఈజ్‌మైట్రిప్, ఇగ్జిగో వంటి ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫాంలు తెలిపాయి. తుర్కియే ప్రభుత్వ వార్తా చానల్ ‘టీఆర్టీ’ తాలూకు ‘ఎక్స్’ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. టర్కీతో మన వాణిజ్యం కూడా తగ్గుముఖం పడుతోంది. 2024–25 మధ్య తుర్కియేకు మన ఎగుమతులు 5.2 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు బాహాటంగా మద్దతు ప్రకటించిన అజర్‌బైజాన్‌కు కూడా ఇదే సెగ తగులుతోంది. దాని రాజధాని బకు ఇటీవలి దాకా భారత పర్యాటకులకు ఫేవరెట్ డెస్టినేషన్లలో ఒకటిగా ఉండేది. ఏటా లక్షలాది మంది అక్కడికి వెళ్లేవారు. బకుకు బుకింగులు కూడా ఇప్పుడు భారీగా తగ్గిపోతున్నాయి. జేఎన్‌యూ కటీఫ్ తుర్కియే విద్యాసంస్థలతోనూ తెగదెంపులు చేసుకోవాలనే డిమాండ్ల నేపథ్యంలో ఆ దేశంలోని ఇనోను వర్సిటీతో అవగాహన ఒప్పందాన్ని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) రద్దు చేసుకుంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. గత ఫిబ్రవరిలో కుదిరిన ఈ మూడేళ్ల ఒప్పందం ప్రకారం రెండు వర్సిటీల విద్యార్థులు, అధ్యాపకుల మారి్ప డికి అవకాశముండేది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కెనడా కేబినెట్లో మనోళ్లు
ఒట్టావా: కెనడాలో మార్క్ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి నేతలకు కీలక పదవులు దక్కాయి. విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్ (58) , అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రిగా మణీందర్ సిద్ధూ (41) బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ వ్యవహారాల సహాయ మంత్రిగా రణ్‌దీప్ సరాయ్ (50), నేర నియంత్రణ శాఖ సహాయ మంత్రిగా రూబీ సహోటా (44) ప్రమాణస్వీకారం చేశారు. అనిత భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. ‘‘ఇది నాకు గర్వకారణం. కెనడియన్లకు సురక్షితమైన, న్యాయమైన ప్రపంచాన్ని అందించడానికి ప్రధాని మార్క్ కార్నీ బృందంతో కలిసి పని చేయనున్నా’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. అనిత కెనడా లిబరల్ పారీ్టలో సీనియర్ సభ్యురాలు. గతంలో ప్రజా సేవలు, ఇన్నొవేషన్, సైన్స్, పరిశ్రమలు, రక్షణ మంత్రిగా పలు పదవులు నిర్వహించారు. మంత్రివర్గంలో స్థానం దక్కడం తనకు జీవిత కాలపు గౌరవమని సిద్ధూ పేర్కొన్నారు. ఆమెకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయం సాధించిన రెండు వారాల అనంతరం కార్నీ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. మంత్రివర్గం సంఖ్యను 39 నుంచి 28కి కుదించారు. వారిలో సగం మహిళలే కావడం విశేషం! కెనడా–యూఎస్ సంబంధాల ఉద్రిక్తతల మధ్య కెనడియన్లు కోరుకునే, అవసరమైన మార్పును అందించడానికి మంత్రివర్గాన్ని ఎన్నుకున్నట్లు కార్నీ తెలిపారు. కెనడాలోనే పుట్టి పెరిగిన అనిత అనిత ఆనంద్ 1967 మే 20న కెనడాలోని కెంట్విల్లేలో భారతీయులైన వైద్య దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి ఎస్వీ ఆనంద్‌ది తమిళనాడు కాగా తల్లి సరోజ్ డి రామ్ పంజాబీ. వారు 1960ల్లో భారత్ నుంచి కెనడాకు వలస వెళ్లారు. 1985లో ఒంటారియోలో పొలిటికల్ సైన్స్‌లో అకడమిక్ డిగ్రీ, ఆక్స్ఫర్డ్ నుంచి న్యాయశాస్త్రంలో ఆనర్స్, డల్హౌసీ వర్సిటీ నుంచి బ్యాచిలర్స్, టొరంటో వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. న్యాయవాద వృత్తిలో, బోధన, ప్రజా సేవలో బలమైన కెరీర్‌ను నిర్మించుకున్నారు. 1995లో న్యాయవాది, వ్యాపారవేత్త జాన్ నోల్టన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు. అనిత 2019లో కెనడా మంత్రివర్గంలో అడుగుపెట్టారు. ఆ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. రక్షణ మంత్రిగా ఆమె క్రమశిక్షణ, పనితీరుకు ప్రశంసలు లభించాయి. నిరసనల ఫలితంగా గతేడాది జస్టిన్ ట్రూడో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాక ఆయన వారసునిగా అనిత పేరు ప్రముఖంగా విని్పంచింది. ఇక సిద్ధూవి పంజాబీ మూలాలు. తల్లిదండ్రులతో కలిసి బాల్యంలోనే కెనడా వెళ్లారు. బ్రాంప్టన్ ఈస్ట్ ఎంపీగా ఉన్నారు. పలువురు మంత్రులకు పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేశారు. రూబీవీ పంజాబీ మూలాలే. ఆమె టొరంటోలో జని్మంచారు. సరాయ్ తల్లిదండ్రులు కెనడా వలస వెళ్లారు. బ్రిటిష్ కొలంబియాలో జన్మించిన ఆయన నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. ఇటీవలి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 22 మంది భారత సంతతి నేతలు ఎంపీగా గెలవడం తెలిసిందే. -
పాకిస్తాన్ వైమానిక శక్తి...మూడోవంతు ఊడ్చుకుపోయింది!
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్‌కు అలా ఇలా తగల్లేదు. మన ప్రతి దాడుల దెబ్బకు దాయాది ఏకంగా మూడో వంతు వైమానిక శక్తిని కోల్పోయింది! ఆ నష్టాల తాలూకు పూర్తి వివరాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. మన బ్రహ్మోస్ తదితర క్షిపణులు పాక్‌లోని 11 కీలక వైమానిక స్థావరాలపై విరుచుకుపడడం తెలిసిందే. వాటి ధాటికి అవి కోలుకోలేనంతగా దెబ్బ తిన్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలతో పాటు రక్షణ నిపుణులు తేల్చారు. ‘‘పాక్ వైమానిక స్థావరాల్లోని కీలక వ్యవస్థలన్నీ భారీగా దెబ్బతిన్నాయి. పాక్ ఎంతోకాలంగా మిడిసిపడుతున్న ఎఫ్ 16, జేఎఫ్ 17 వంటి అత్యాధునిక అమెరికా, చైనా తయారీ యుద్ధ విమానాల్లో చాలావరకు కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నాయి’’ అని వెల్లడించారు. సైనిక ఆపరేషన్లలో స్వావలంబన ప్రస్థానంలో ఆపరేషన్ సిందూర్‌ను మైలురాయిగా రక్షణ శాఖ అభివర్ణించింది. భారత రక్షణ పాటవానికి, ఆ రంగంలో సాధించిన స్వావలంబనకు ప్రతీకగా నిలిచిందని పేర్కొంది. ‘‘సరిహద్దులు దాటకుండానే పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలతో పాటు ఆ దేశ నలుమూలల్లోని కీలక సైనిక, వైమానిక వ్యవస్థలను కూడా తుత్తునియలు చేసి చూపించాం. పాక్ మాత్రం సైనికపరంగా కేవలం విదేశీ సాయాన్నే నమ్ముకుంది. మనపై దాడులకు చైనా తయారీ పీఎల్–15, తుర్కియేకు చెందిన ‘యిహా’ డ్రోన్లు, యూఏవీలను వాడింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ద్వారా తిరుగులేని రుజువులను ప్రపంచానికి చూపించాం’’ అని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.ఐఏఎఫ్ చీఫ్‌దే కీలకపాత్ర పాక్ వైమానిక స్థావరాలపై మన దాడుల్లో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్సింగ్దే కీలక పాత్ర. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ దాడులు పూర్తిగా ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి. ముఖ్యంగా అతి కీలకమైన రావల్పిండిలోని చక్లాలా (నూర్ ఖాన్) ఎయిర్‌బేస్‌పై దాడి ప్లానింగ్ పూర్తిగా ఆయనదే. ఆ దాడిలో పాల్గొన్న పైలట్ల ఎంపిక తదితరాలను కూడా సింగ్ స్వయంగా ఎంపిక చేశారు. శనివారం తెల్లవారుజామున చక్లాలాలో మూడు ప్రాంతాలపై మన క్షిపణులు విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించాయి. వాటి దెబ్బకు పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ మూడు గంటలు బంకర్లో తలదాచుకోవడమే గాక తన నివాసాన్ని సురక్షిత ప్రాంతానికి మార్చేశారట!నేవీ త్రిముఖ వ్యూహం పాక్‌పై మన దాడుల సందర్భంగా నేవీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి పాక్‌ను అష్టదిగ్బంధం చేసేసింది. అందులో భాగంగా పాక్‌కు జీవనాడి వంటి కరాచీ ఓడరేవుపై మన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక పూర్తిస్థాయిలో గురిపెట్టింది. ఏకంగా 36 నావికా దళాలను మోహరించింది. ఏడు డి్రస్టాయర్లు, ఐఎన్ఎస్ తుషిన్ వంటి యుద్ధనౌకలు వాటిలో ఉన్నాయి. అవన్నీ బ్రహ్మోస్, ఎంఆర్ఎస్ఏఎం తదితర క్షిపణులను ఎక్కుపెట్టి ఏ క్షణమైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచాయి. అంతేగాక వరుణాస్త్ర వంటి అత్యాధునిక టార్పెడోలతో జలాంతర్గాములను కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా సన్నద్ధం చేసింది. దాంతో మరో దారిలేక పాక్ నేవీ కేవలం పోర్టుకే పరిమితం కావాల్సి వచ్చింది.నవాజ్ కనుసన్నల్లోనే...! భారత్‌పై పాక్ సైనిక చర్యలను పూర్తిగా ప్రధాని షహబాజ్ సోదరుడు నవాజ్ షరీఫే పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. మనపై దాడులన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగినట్టు సమాచారం. నవాజ్ మూడుసార్లు పాక్ ప్రధానిగా చేశారు. ప్రస్తుతం అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) సారథి. 1999లో ఆయన ప్రధానిగా ఉండగానే కార్గిల్ యుద్ధం జరిగింది. మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడం, పాక్, పీఓకేల్లోని 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడం తెలిసిందే. ఆ మర్నాడు షహబాజ్ ఏర్పాటు చేసిన కీలక భేటీలో ప్రభుత్వపరంగా ఏ హోదా లేని నవాజ్ కూడా పాల్గొన్నారు.మా మద్దతు పాక్‌కే: తుర్కియే అంతర్జాతీయంగా ఛీత్కారాలు ఎదురవుతున్నా తుర్కియే బుద్ధి మాత్రం మారడం లేదు. అన్నివేళలా పాక్‌కే మద్దతుగా ఉంటామని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ బుధవారం కుండబద్దలు కొట్టారు. ‘‘పాక్ మా నిజమైన మిత్రదేశం. మా దేశాల సోదర భావం నిజమైన స్నేహానికి నిదర్శనం. పాక్–తుర్కియే దోస్తీ జిందాబాద్!’’ అని చెప్పుకొచ్చారు. -
‘నవాజ్ షరీఫ్ కనుసన్నుల్లోనే పాక్ సైనిక దాడులు’
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ను కోలుకోలేని విధంగా చావుదెబ్బ తీసింది. అయితే ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో భారత్‌పై పాక్ సైనిక దాడికి దిగింది. ఆ దాడికి వ్యూహ రచన చేసింది పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంటూ ఆ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఆజ్మా బుఖారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆజ్మా బుఖారీ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో భారత్‌పై పాక్ సైనిక దాడికి దిగింది. పాక్ సైన్యం.. భారత్‌పై ఎలా దాడి చేయాలనే ప్లాన్ మొత్తం నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలో జరిగింది. ఆయన చిన్న స్థాయి నాయకుడు కాదు.. ఆయన చేసిన పనే ఆయన గురించి చెబుతుంది’ అని అజ్మా బుఖారీ వ్యాఖ్యానించారు. ఇటీవల భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్లో బీభత్సం సృష్టించింది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. వాళ్లకు శిక్షణ ఇచ్చే స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్.. భారత్‌పై మే 8, 9, 10 తేదీల్లో భారత సైనిక స్థావరాలపై ప్రతిదాడికి ప్రయత్నించింది. అయినప్పటికీ భారత్ శక్తి, యుక్తులు ముందు అవి తేలిపోయాయి. దీంతో పాకిస్తాన్ సైన్యంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆజ్మా బుఖారీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
భారత్‌కు పాకిస్తాన్ లేఖ
ఇస్లామాబాద్: భారత్‌కు పాకిస్తాన్ లేఖ రాసింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, సింధూ జలాల ఒప్పందంపై (indus waters treaty) సమీక్షించుకోవాలని ప్రాధేయపడింది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సిందూర్‌పై (operation sindoor) జాతినుద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదం, వ్యాపారం కలిసి సాగలేవు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు’ అంటూ ఉగ్రవాదంపై భారత్ వైఖరి గురించి పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్‌పై భారత్ విధించిన ఆంక్షలు కొనసాగుతాయని సూచించారు.👉పాక్‌పై భారత్ సింధూ అస్త్రం.. ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి (2025 Pahalgam attack) తర్వాత పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దీనిలో భాగంగా సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు నిలిపివేసే వరకు సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ దేశంతో వాణిజ్యం రాకపోకలను నిషేధించింది. గగనతలాన్ని మూసివేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో ఈ వివరాల్ని వెల్లడించారు. అయితే, సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపి వేయడంతో దాయాది దేశంలో నీటి కటకట మొదలైంది. ఈ ఏడాది మొత్తం ఖరీఫ్ పంటపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో బుధవారం పాకిస్తాన్.. భారత్‌కు లేఖ రాసింది. ఆ లేఖలో సింధూ జలాల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయం విషయంలో పునఃసమీక్ష చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా.. భారత జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఓ అధికారిక లేఖ రాసారు. సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించేలా భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని లేఖలో కోరారు. -
మీ వైఖరేంటో?... మొన్న కాల్పుల విరమణ.. నేడు డిన్నర్!
డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు. ఆయన రెండోసారి అధ్యక్షుడైన దగ్గర్నుంచి సుంకాల పెంపుతో ప్రపంచ దేశాల్ని రాజీకి వచ్చేలా చేయడం, ఆపై దేశాల మధ్య సమస్యలకు, యుద్ధాలకు మధ్యవర్తిత్వం వహించడం మాత్రమే చేస్తున్నారు. ట్రంప్.. ఇదే పనిలో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అసలు అమెరికా ఎలా ఉందో చూసుకుంటున్నారో, లేదో కానీ మిగతా దేశాలపై ఆసక్తి మాత్రం ట్రంప్‌లో విపరీతంగా పెరిగిపోయింది.ఇటీవల కాలంలో ట్రంప్ శాంతి మంత్రం జపిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఆపై భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని తెగ చెప్పేసుకుంటున్నారు ట్రంప్. ఇది దొంగ జపమా.. నిజమైన తపనా?, ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడానికి ట్రంప్ ఇలా చేస్తున్నారనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఉవ్విళూరుతున్నది ట్రంప్ నేతృత్వంలోని అమెరికా. ఎటువంటి ప్రయోజనం లేకుండా అగ్రరాజ్యం ఇలా చేస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.భారత్, పాకిస్తాన్ ల యుద్ధాన్ని తానే ఆపేశానని ;పదే పదే చెప్పుకుంటున్నారు ట్రంప్. ఇది మంచిదే. యుద్ధం ఏ దేశానికి మంచిది కాదు. అయితే ఏ సందర్బంలో పాక్ బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది.ఉగ్రదాడులతో జనాల ప్రాణాల్ని తీసేస్తుంటే, భారత్ కు యుద్ధ పరిస్థితిని కల్పించింది దాయాది పాక్ . అది ఆపరేషన్ సిందూర్ తో మొదలుపెట్టింది. ఇక్కడ పాక్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ షురూ చేసింది. అయితే పాక్ కవ్వింపు చర్యలతో పాకిస్తాన్ రక్షణ స్థావరాలపై దాడులకు చేసి ఆ దాయాది దేశానికి చెందిన పలు ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసి తగిన బుద్ధి చెప్పింది.మిమ్మల్ని అడిగింది ఎవరు?అసలు విషయం వదిలేసి, కొసరు విషయం చెప్పే అలవాటు ట్రంప్ కే ఉందా.. లేదా అగ్రరాజ్యమే అలా ఉంటుందా? అనేది మరో ప్రశ్న. భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ గురించి ప్రకటించిన ట్రంప్.. యుద్ధం ఆపడానికి తనను ఎవరు ఆశ్రయించారనే విషయాన్ని ఎక్కడా వెల్లడించలేదు.భారత్, పాక్‌ల కాల్పుల విరమణ అంటూ తనకు తానుగా ప్రకటించారు ట్రంప్. తమకు క్లయింట్ అయిన పాకిస్థాన్‌కు పూర్తి సహకారం అందిస్తూనే, మరొకవైపు ఇండియాతో స్నేహాన్ని నటిస్తున్నారనేది భారత ప్రజలకు బాగా అర్ధమైంది. భారత్ దాడి ముమ్మరం చేసిన వేళ.. పాక్ ప్రధాని మిమ్మల్ని ఆశ్రయించారా? లేదా? అనేది మీరు చెప్పకపోయినా భారత్ ప్రజలకు ఆ విషయం అర్దమైంది. పాక్ భారీగా నష్టపోతుందనే ఉద్దేశంతోనే కాల్పుల విరమణకు ఒప్పించారని అంతా అనుకుంటున్నారు. కశ్మీర్ సమస్యను కూడా పరిష్కరిస్తే ఓ పనైపోతుందన్నట్టుగా ట్రంప్ చేసిన వాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్ అంశంలో ఎవరి జోక్యం అవసరం లేదని, పీవోకేను భారత్‌కు పాక్ అప్పగించడమే ఒక్కటే మార్గమని క్లియర్ చేసేశారు.ఇప్పుడు కలిసి డిన్నర్ చేయాలా?తాజాగా ట్రంప్ మరో రాగం అందుకున్నారు. భారత్, పాకిస్థాన్‌లు కలిసి డిన్నర్ చేయాల్సిందేనని అంటున్నారు. రెండోసారి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్.. తొలిసారి మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో పర్యటించారు. దీనిలో భాగంగా సౌదీ అరేబియాలో మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్‌లు కలిసి డిన్నర్ చేస్తే చూడాలని అంటున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో భారత్ ఎలా కలిసి డిన్నర్ చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాల్పుల విరమణ అన్న మూడు గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడిందని మరి ఆ దేశాన్ని ఎలా నమ్మాలని కొంతమంది నిలదీస్తున్నారు. మీ వైఖరేంటో మాకు బాగా అర్ధమైందని మరికొందరు ట్రంప్‌ను విమర్శిస్తున్నారు. -
ఖతార్‌లో ట్విస్ట్.. ట్రంప్ ఆశ... అడియాస?
ఖతార్ రాజకుటుంబం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత విలాసవంతమైన బోయింగ్ 747-8 విమానాన్ని బహుమతిగా స్వీకరిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ పని సముచితమేనా అని ఎవరైనా అడిగితే.. ‘అంత ఖరీదైన విమానాన్ని ఖతార్ ఉచితంగా ఇస్తానంటుంటే వద్దని చెప్పడానికి నేనేమైనా వెర్రివాడినా?’ అని ట్రంప్ ఎదురు ప్రశ్నిస్తున్నారు.వాస్తవానికి ఖతార్ జెట్ నెల క్రితమే టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకున్నట్టు ఫ్లైట్ రికార్డులను ఉదహరిస్తూ ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఆ విమానాన్ని మెరుగ్గా తీర్చిదిద్దే ఏర్పాట్లు ఆరంభమై ఉండొచ్చని కూడా పేర్కొంది. ఈ నెల 8న విమానం శాన్ ఆంటోనియో చేరుకుందని, అప్పట్నుంచి అది అక్కడే ఉందని ‘శాన్ ఆంటోనియో ఎక్స్‌ప్రెస్ న్యూస్’ తెలిపింది. విమానం రెట్రో ఫిట్టింగ్ పనులను డిఫెన్స్ కాంట్రాక్టర్ ‘ఎల్3 హ్యారిస్ టెక్నాలజీస్’కు ట్రంప్ పురమాయించినట్టు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ మరో కథనం ప్రచురించింది. ఖతార్ ఫ్రీగా ఇస్తున్న 13 ఏళ్లనాటి ఆ విమానం ధర 400 మిలియన్ డాలర్లు (రూ.3,400 కోట్లు) ఉంటుందని అంచనా వేసినప్పటికీ దాని విలువ సుమారు 250 మిలియన్ డాలర్లు (రూ.2,100 కోట్లు) మాత్రమేనని ఆ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తి ఒకరు వెల్లడించారు.ఇక చావు కబురు చల్లగా చెప్పినట్టు.. అమెరికా అధ్యక్షుడి ప్రయాణానికి అనువుగా, ఎయిర్ ఫోర్స్ వన్ ప్రమాణాలకు తగ్గట్టుగా మార్పు చేర్పులు (ఓవర్ హాలింగ్) చేపట్టడానికి ఆ విమానం విలువకు మూడు రెట్లు లేదా అంతకంటే ఎక్కువే ఖర్చవుతుందని లెక్కలు వేస్తున్నారు. 40 ఏళ్ల నాటి తమ పాత ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానాలను తాత్కాలికంగా పక్కనపెట్టి ఖతార్ సూపర్ లగ్జరీ విమానంలో దర్పంతో తిరగాలని ట్రంప్ ఉబలాటపడుతున్నారు. దీనిపై ఆయన సొంత రిపబ్లిక్ పార్టీ నేతలే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ ‘కమాండర్ ఇన్ చీఫ్’ హోదాలో అధ్యక్షుడి సురక్షిత ప్రయాణానికి వీలుగా ఖతార్ విమానానికి ‘ఎయిర్ ఫోర్స్ వన్’ తరహాలో మార్పులు చేయడానికి బాగానే సమయం పడుతుందట.కమ్యూనికేషన్, రక్షణ సామర్థ్యాలతోపాటు విమానంలో భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడానికి కొన్ని నెలల నుంచి రెండేళ్ల దాకా వ్యవధి పట్టవచ్చని భావిస్తున్నారు. అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చని, అధ్యక్షుడిగా ట్రంప్ రెండో టర్మ్ ముగిసేలోపు ఆ ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని అమెరికా అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పైగా ఖతార్ విమానంతో గూఢచర్యం, నిఘా సమస్యలున్నాయని రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రజ్ వ్యాఖ్యానించారు. ఖతార్ కానుకను అంగీకరించడమంటే తమ భద్రతాపరమైన కీలక వ్యవస్థలు, కమ్యూనికేషన్స్ వ్యవస్థల్లోకి చొరబడటానికి ఓ విదేశానికి అనుమతి ఇవ్వడమేనని డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్ జాక్ రీడ్ అభిప్రాయపడ్డారు.మిలిటరీ కమాండ్ అండ్ కంట్రోల్ పాయింట్!అమెరికా అధ్యక్షుడి ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానం.. కదిలే వ్యవస్థ లాంటిది. అధ్యక్షుడి భద్రతలో అమెరికా రక్షణ విభాగం రాజీపడదు. భద్రతాపరమైన లోపాలకు తావివ్వదు. అందుకే ఖతార్ విమానాన్ని ‘ఈకకు ఈక, తోకకు తోక పీకినట్టు’ ఫ్రేమ్ వరకు భాగాలుగా విడగొట్టి అమెరికా తొలుత దాన్ని ఆసాంతం శోధించాలి. బగ్స్ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత అవసరమైన కమ్యూనికేషన్స్, సెక్యూరిటీ ఎక్విప్మెంట్ అమర్చి విమానాన్ని పునర్నిర్మించాలి. ఇంత పెద్ద తతంగం ఉంది మరి!.విమానంలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను అన్యులెవరూ హైజాక్ చేయకుండా చూడాలి. ఎందుకంటే దేశాధ్యక్షుడు విమానంలో ప్రయాణించే సమయంలో మిలిటరీ ‘కమాండ్ అండ్ కంట్రోల్’కు ఆ ఎలక్ట్రానిక్ వ్యవస్థలే ఆయువుపట్టు. ఖతార్ విమానాన్ని ఇలా అప్‌గ్రేడ్ చేయడానికి, మెరుగ్గా తీర్చిదిద్ది ముస్తాబు చేయడానికి చాలా కాలం పట్టవచ్చు. ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపుకునే వెసులుబాటు ఉంది. అయితే దేశాధ్యక్షుడు ప్రయాణంలో ఉండగా ‘ఎయిర్ ఫోర్స్ వన్’కు గాల్లోనే ఇంధనం నింపిన సందర్భం ఇప్పటివరకు ఒక్కటీ లేదు. ఖతారీ సంప్రదాయ బోయింగ్ 747 విమానానికి గాలిలో ఇంధనం నింపుకునే సామర్థ్యం లేదు. ఉదాహరణకు అణుదాడి జరిగిన సందర్భంలో నేలపై దిగకుండా అమెరికా అధ్యక్షుడి విమానం సురక్షితంగా ఎక్కువసేపు గాల్లోనే ఉండాల్సివస్తే... ఆ విమానానికి మిడ్-ఎయిర్ రీఫ్యూయెలింగ్ సామర్థ్యం తప్పనిసరి! -జమ్ముల శ్రీకాంత్. -
భారత సైన్యంపై రష్యన్ మహిళ ప్రశంసల జల్లు..!
భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఒక రష్యన్ మహిళ భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ..ఓ వీడియోని నెటింట షేర్ చేసింది. ఆ వీడియో నెటిజన్ల మనసును గెలుచుకుంది. అంతేగాదు ఆ వీడియోలో భారత్‌ని సురక్షితమైన సొంత ఇంటిగా అభివర్ణించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు ఆ వీడియోకి ఇచ్చిన క్యాప్షన్ సైతం మనసుకు హత్తుకునేలా ఉంది. ఇంతకీ ఎవరా ఆ రష్యన్ మహిళ అంటే..రష్యన్ బనియాగా పిలిచే పోలినా అగర్వాల్ ఇన్‌స్టా వీడియోలో భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ..హృదయపూర్వక సందశాన్ని షేర్ చేశారు. గురుగ్రామ్ నివాసిస్తున్న ఈ రష్యన్ మహిళ పోలినా అగర్వాల్ వీడియోలో తన అమ్మమ్మ భారత్‌లోని ఉద్రిక్త పరిస్థితులు గురించి విని తక్షణమే రష్యాకు వచ్చేయాలని ఆదేశించిందని అన్నారు. అందుకు తానే ఏమని బదులిచ్చిందో వివరించింది. పోలినా ఏం చెప్పారంటే..భారతదేశం అచ్చం మన సొంతిల్లు మాదిరిగా సురక్షితమైనదని చెప్పానని అన్నారు వీడియోలో. రష్యా అందించిన ఆయుధ సంపత్తి తోపాటు భారత్ మిలటరీకి ఉన్న సైన్యం తదితరాలు ఆ దేశానికి ఉన్న అతి బలమైన రక్షణ వ్యవస్థ అని కొనియాడింది. భారత్ మిలటరీ వద్ద అధునాత ఆయుధాలు, వాయు రక్షణ వ్యవస్థలు, అన్ని రకలా డ్రోన్లు, విమానాలు ఉన్నాయి. దానికి తోడు అక్కడ స్త్రీ పురుష భేదం లేకుండా పాటుపడే సైనికుల నిస్వార్థ సేవ , అంకితభావం తదతరాలు అంతకమించిన వజ్రాయుధాలని పేర్కొంది. వాళ్లంత తమ ప్రాణాలు పణంగా పట్టి ఆహర్నిశలు దేశాన్ని సంరక్షిస్తున్నారు. అందువల్ల మేమంతా ఇక్కడ హాయిగా మా జీవితాలను జీవించగలుగుతున్నాం. యుద్ధ జరుతుందన్న భయం కూడా మా దరి చేరదు. అంతలా రక్షణ అందిస్తారు ఆ వీరసైనికులు. అందుకు నేను వారికి ఎంతగానే కృతజ్ఞతతో ఉన్నాను. వారి రక్షణలో ఉన్న భారత్‌ని ప్రశాంతమైన ఇల్లుగా చెప్పగలనని పోలినా నమ్మకంగా చెప్పింది. అంతేగాదు ఆ వీడియోకి " ఇక్కడ రాత్రిపూట మేమంతా హాయిగా నిద్రపోతున్నాం అంటే అందుకు కారణం భారత సైనికులనే వారికి సదా రుణపడి ఉంటామని" క్యాప్షన్ కూడా ఇచ్చారామె. ఆ వీడియోకి ఏకంగా లక్షకు పైగా వ్యూస్, వేలల్లో లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు సైతం ప్రతిరోజూ మమ్మల్ని రక్షించే మా సైనికుల అంకితభావం, ధైర్యానికి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. వారి త్యాగాన్ని విదేశీయురాలుగా మీరు కూడా గుర్తించినందుకు ధన్యవాదాలు అని పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Polina Agrawal (@pol.explorer) (చదవండి: Meghan Markle: నటి మేఘన్ మార్కెల్ పేరెంటింగ్ పాఠం..! పిల్లలకు అద్భుతమైన బహుమతి అదే..!) -
వివాదంలో పాకిస్తాన్ హైకమిషనర్.. యువతితో వీడియోలు లీక్
ఢాకా: పాకిస్తాన్ హైకమిషనర్ హనీట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ తరఫున బంగ్లాదేశ్‌కు హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో తిరుగుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. సదరు అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.వివరాల ప్రకారం.. సయ్యద్ అహ్మద్ మరూఫ్ పాకిస్తాన్ తరఫున బంగ్లాదేశ్‌కు హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 2023లో బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ హైకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే, మరూఫ్ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఉన్న తిరుగుతున్న ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసింది. మరూఫ్ మే 11న ఢాకా నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్‌కు విమానంలో వెళ్లారని బంగ్లాదేశ్ దినపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. హనీట్రాప్ కారణంగా అతడు బంగ్లాదేశ్ వీడినట్టు చెప్పుకొచ్చింది.The Pakistani Ambassador to Bangladesh, Syed Ahmed Maroof, was in a relationship with a Bangladeshi Muslim girl. After some intimate details became public, he was sent on leave. There was a time when Pakistanis used to rape Bangladeshi Muslim women nowadays, some Bangladeshi… pic.twitter.com/p60WkJJslU— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) May 12, 2025అయితే, అధికారులు మాత్రం.. మారూఫ్ అధికారికంగా సెలవులో ఉన్నారని నిర్ధారించారు. కానీ, ఎన్ని రోజులు అతను సెలవులో ఉన్నారనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ విషయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు.. ఢాకాలోని పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్ ముహమ్మద్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.Pakistan Ambassador to Bangladesh Syed Ahmed Maroof is reportedly untraceable after his honey trapped videos emerged online.There's a leaked video too. pic.twitter.com/UfYmLYfKVl— Avinash K S🇮🇳 (@AvinashKS14) May 13, 2025ఇక, ఇటీవల మరూఫ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో ఆయన సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత బంధం ఉందని తెలుస్తోంది. ఆయన వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్ ఆ యువతితో పంచుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా.. గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగాలపై ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయ అధికారి ఒకరిని భారత్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయన్ని అవాంఛిత వ్యక్తి (పర్సనా నాన్‌గ్రేటా)గా ప్రకటించి 24 గంటల్లోగా మన దేశాన్ని వీడివెళ్లిపోవాలని గడువు విధించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉన్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
ప్రధాని మోదీ ప్రసంగంపై పాక్ ఓవరాక్షన్.. హెచ్చరిక అంటూ..
ఇస్లామాబాద్: భారత్, పాక్ ఘర్షణల వేళ పాకిస్తాన్ వ్యవహారశైలిని పరిశీలిస్తామని, భవిష్యత్తులో ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని ప్రధాని మోదీ (Modi) హెచ్చరించిన నేపథ్యంలో పాక్ స్పందించింది. మోదీ వ్యాఖ్యలు 'రెచ్చగొట్టే విధంగా, వివాదాస్పదమైనవి'గా ఉన్నాయని పేర్కొంటూ పాక్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.పాకిస్తాన్ యుద్ధం, కాల్పుల విరమణ తదనంతర పరిణామాలపై ప్రధాని మోదీ ప్రసంగించారు. మోదీ ప్రసంగంపై తాజాగా పాక్ విదేశాంగశాఖ స్పందిస్తూ సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో..‘భారత ప్రధాని చేసిన రెచ్చగొట్టే, వివాదాస్పద వ్యాఖ్యలను పాకిస్తాన్ తిరస్కరిస్తోంది. ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ కట్టుబడి ఉంది. ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. భారత్ కూడా ప్రాంతీయ స్థిరత్వానికి, తమ పౌరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తుందని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరిగినా పూర్తిస్థాయిలో ప్రతిఘటిస్తామని కూడా హెచ్చరించింది. కాల్పుల విరమణను తామే కోరినట్లు చెప్పడంలో వాస్తవం లేదని తెలిపింది. భారత్ చర్యలు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదం అంచుల్లో పడేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతంగా పూర్తిచేసిన భారత సాయుధ బలగాలను అభినందించారు. ఈ ఆపరేషన్‌లో కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని, డజన్ల కొద్దీ ఉగ్రవాదులు హతమయ్యారని, 'అత్యంత కీలక' లక్ష్యాలు అనదగ్గ కొందరు ఉగ్రవాదులు కూడా మృతుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలను భారత్ కేవలం విరామం ఇచ్చిందని, పూర్తిగా ముగించలేదని మోదీ గట్టిగా హెచ్చరించారు. ఉగ్రవాదం-వాణిజ్యం, ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి సాధ్యం కావు. ఒకేచోట నీళ్లు, రక్తం ప్రవహించదు. అణుబాంబు బెదిరింపుల్ని భారత్ సహించదని.. ఈ ముసుగులో విజృంభిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన, నిర్ణయాత్మకమైన దాడి చేస్తుందని హెచ్చరించారు. భారత్ చేసిన దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందన్నారు.మంగళవారం కూడా పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ మరో తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో వైమానిక దళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత్‌లో మరో ఉగ్రదాడికి పాకిస్తాన్ అనుమతిస్తే మట్టికరవక తప్పదని హెచ్చరించారు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుంది, కానీ దాడి జరిగితే శత్రువును తుదముట్టించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. -
మా సైనికులు చనిపోయారు.. మరణాలపై పాక్ ప్రకటన
ఇస్లామాబాద్: భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలో తమ సైనిక సిబ్బందిలో కేవలం 11 మంది చనిపోయారని పాకిస్తాన్ మంగళవారం ప్రకటించింది. వీరిలో స్క్వాడ్రాన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్ సైతం ఉన్నట్లు పేర్కొంది. భారత వైమానిక, క్షిపణి, డ్రోన్ దాడుల్లో సాయుధ బల గాలకు సంబంధించి 78 మంది గాయపడ్డారని పాకిస్తాన్ ఒక ప్రకటనలో పేర్కొంది.భారత్ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా మే ఆరో తేదీ అర్ధరాత్రి తర్వాత భారత్ జరిపిన దాడుల్లో 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, 121 మంది పౌరులు గాయపడ్డారని తెలిపింది. చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పోరల్ టెక్నీషియన్ ఫరూఖ్, సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్ సైతం ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. వీళ్లంతా ఏ పరిస్థితుల్లో మరణించారో, మరణానికి కారణాలను పాకిస్తాన్ బయటపెట్టలేదు. ఒక యుద్ధవిమానం పాక్షికంగా ధ్వంసమైందని తెలిపింది.అయితే అది ఏ సంస్థ తయారీ, ఏ రకానికి చెందినది అనే వివరాలనూ పాక్స్తాన్ వెల్లడించలేదు. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా ‘మర్కా–ఇ–హక్ (ఘన విజయం)’ లక్ష్యంగా ‘ఆపరేషన్ బుని యాన్ అల్ మర్సుస్’ను చేపట్టామని ఆ ప్రకటన తెలిపింది. గాయపడిన సైనికులు, పౌరులను పరామర్శించేందుకు సోమవారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ రావల్పిండిలోని కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రిని సందర్శించడం తెల్సిందే. గాయపడిన సైనికాధికారులు, జవాన్లను ఓదార్చేందుకు లాహోర్‌లోని కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రిని పంజాబ్ మహిళా ముఖ్యమంత్రి మర్యం నవాజ్ సందర్శించారు. -
బద్దలైన బేస్‌లు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ కొనసాగింపులో భాగంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో కీలక మౌలిక సదుపాయాలు తుడిచిపెట్టుకుపోయాయని స్పష్టమైంది. తాజాగా విడుదలైన శాటిలైట్ ఉపగ్రహాల స్పష్టమైన ఫొటోలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మే 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ వ్యాప్తంగా 11 మిలటరీ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయి. వైమానిక స్థావరాల్లోని విమాన రన్వేలు, విమానాలను నిలిపి ఉంచే హ్యాంగర్లు ధ్వంసమైనట్లు ఈ శాటిలైట్ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఒక ప్రైవేట్ వాణిజ్య ఉపగ్రహ సంస్థ ఈ హై–రెజల్యూషన్ ఫొటోలను తీసింది. ఏమాత్రం అటూఇటూగా కాకుండా, గురిచూసి సరిగ్గా వాయుసేన స్థావరాల మీదనే బాంబులు పడేసినట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. భారత్‌పై మరింతగా దాడులకు తెగిస్తే ఆకాస్త స్థావరాలనూ పూర్తిగా నేలమట్టం చేస్తారనే భయంతోనే మూడ్రోజులకే పాకిస్తాన్ కాళ్లబేరానికి వచి్చందనే వాదనకు పూర్తి బలం చేకూర్చేలా ఫొటోలు ఉన్నాయి. మాక్సార్ అనే శాటిలైట్ సంస్థ తీసిన ఈ ఫొటోలు ఇప్పుడు జాతీయమీడియాలో మంగళవారం ప్రత్యక్షమయ్యాయి. సింధ్‌లోని సిక్కూర్, రావర్పిండిలోని నూర్ ఖాన్, దక్షిణ పంజాబ్ ప్రావిన్స్‌లోని రహీం యార్ ఖాన్, సర్గోధాలోని ముషాఫ్, ఉత్తర సిం«ద్‌లోని జకోబాబాద్, ఉత్తర థటా జిల్లాలోని భోలారీ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమైన తీరు ఫొటోలో వివరంగా తెలుస్తోంది. దాడి తర్వాత కీలక మిలటరీ బేస్‌లలో రన్‌వేలపై భారీ గొయ్యి, కార్యనిర్వాహక భవనాలు, నిల్వ కేంద్రాల పైకప్పులకు పెద్ద రంధ్రాలు పడటం, భవంతుల గోడలు కూలి శిథిలాలు, శకలాలు సమీప ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిన వివరాలు ఫొటోల్లో తెలుస్తున్నాయి. పస్రూర్, సియాల్కోట్లోని రాడార్ కేంద్రాలు క్షిపణుల దెబ్బకు పేలిపోయాయి. సుక్కూ ర్ ఎయిర్‌బేస్‌లో రెండు విమాన షెల్టర్లు కూలిపోయాయి. చక్లాలాలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో భారీ సైనిక, సరకు రవాణా వాహనాలు రెండు బాగా దెబ్బతిన్నాయి. రహీం యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ఒక్కటే రన్‌వే ఉంది.దానిపై బాంబులేయడంతో 19 అడుగుల విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడింది. 43 అడుగుల పరిధిలో రన్‌వే పాక్షికంగా ధ్వంసమైంది. ముషాఫ్ ఎయిర్‌బేస్ రన్‌వేపై రెండు పేద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. ఒకటి 10, మరోటి 15 అడుగుల విస్తీర్ణంలో ఏర్పడ్డాయి. దీంతో ఇక్కడి విమానాల రాకపోకలు ఆగిపోయాయి. సమీప రవాణా వాహనాలూ దెబ్బతిన్నా యి. జకోబాబాద్‌లోని షాబాజ్ ఎయిర్‌బేస్‌తోపాటు భోలారీ ఎయిర్‌బేస్‌లో చెరో విమాన హ్యాంగర్‌కు భారీ నష్టం జరిగింది. హ్యాంగర్‌లో నిలిపిఉంచిన విమానాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. -
బంగ్లా మాజీ అధ్యక్షుడు హమీద్ పరార్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్(Mohammed Abdul Hamid)(81) ఎవరికీ చెప్పాపెట్టకుండా రహస్యంగా దేశం విడిచి వెళ్లిపోయారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి థాయ్ ఎయిర్వేస్ విమానంలో గుర్తుతెలియని ప్రాంతానికి చేరుకున్నారు. ఇంటి నుంచి చక్రాల కురీ్చలో వెళ్లే సమయంలో ఆయన ఒంటిపై లుంగీ మాత్రమే ఉండడం గమనార్హం. మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు.గత ఏడాది షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను బలవంతంగా అణచివేసిన కేసులో మొహమ్మద్ అబ్దుల్ హమీద్‌పై దర్యాప్తు జరుగుతోంది. ఆయనపై హత్య కేసు సైతం నమోదైంది. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిపోవడం ప్రాధాన్యం సంచలనాత్మకంగా మారింది. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ వ్యవహారం పట్ల బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పారిపోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసు అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం పట్ల మండిపడింది. కొందరు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేసింది.మరికొందరికి బదిలీ వేటు వేసింది. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ పరారీపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సలహాదారు సి.ఆర్.అబ్రార్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. హమీద్ 2013 నుంచి 2023 మధ్యలో రెండుసార్లు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2024లో షేక్ హసీనాతోపాటు ఆమె అనుచరులపై నమోదైన హత్య కేసులో ఆయన సహ నిందితుడిగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 14న కిశోర్‌గంజ్ సదర్ పోలీసు స్టేషన్లో ఆయనపై హత్య కేసు నమోదైంది. వైద్యం కోసమేనా? కేవలం వైద్యం కోసమే హమీద్ థాయ్‌లాండ్ వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయనతోపాటు సోదరుడు, బావమరిది కూడా వెళ్లినట్లు తెలిపారు. అయితే, దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికే దేశం నుంచి హమీద్ పరారైనట్లు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పారీ్టలో హమీద్ చురుగ్గా వ్యవహరించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అవామీ లీగ్ విద్యార్థి విభాగమైన ఛాత్రా లీగ్ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఛాత్రా లీగ్‌ను గత ఏడాది అక్టోబర్‌లో మధ్యంతర ప్రభుత్వం నిషేధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఇంటిని ఇస్లామిక్ రాడికల్స్ కూల్చివేశారు. -
మీ సేవలు చాలు.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి: భారత్
ఢిల్లీ :న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక పాకిస్తాన్ అధికారి తన దౌత్య కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సదరు అధికారిని భారత ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉన్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పాకిస్తాన్ పై దాడికి దిగింది భారత్. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ ను ఆరంభించి దాయాది దేశంలోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ లో ని పలు ఎయిర్ బేస్ లను సైతం భారత్ నేలమట్టం చేసింది. పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడిన తరుణంలో భారత్ ఆపరేషన్ సిందూర్ తో తన సత్తా ఏమిటో చూపెట్టింది. -
కాశ్మీర్ అంశంపై మా విధానంలో మార్పు లేదు: విదేశాంగ శాఖ
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌కు భారత్ గట్టి గుణపాఠం చెప్పింది. పహల్గాం ఘటన తరువాత సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. భారత్ అమెరికా నాయకులు మాట్లాడారు. అయితే ఇందులో వాణిజ్యపరమైన అంశాలపై చర్చలు జరగలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి 'రంధీర్ జైస్వాల్' పేర్కొన్నారు.కాల్పుల విరమణకు కోసం పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఈ విషయంపై రెండు దేశాల DGMOల మధ్య అవగాహనా కుదిరింది. సింధూ నదీ జలాల రద్దు ఒప్పందం కొనసాగుతుంది. పాక్ ఉగ్రవాదాన్ని ఆపేవరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.కాశ్మీర్ అంశంపై ద్వైపాక్షింగా చర్చిస్తాం. ఈ అంశంపై మా విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైన చర్చలు ఉంటాయి. టీఆర్ఎఫ్ లష్కరితోయోబా సంస్థ. దీనిపైన అంతర్జాతీయంగా నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో భారత్‌కు ఉన్న ఏకైక పరిష్కారం కాని సమస్య.. అక్రమంగా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి ఇవ్వడం. పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని విడిచిపెట్టడం అనేది పరిష్కారం కాని విషయం' అని జైస్వాల్ అన్నారు. -
లుంగీలోనే దేశం దాటేసిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని 'షేక్ హసీనా' ఇప్పటికే దేశం విడిచి ఇండియాలో తలదాచుకుంటోంది. కాగా తాజా ఆ దేశ మాజీ అధ్యక్షుడు 'మహమ్మద్ అబ్దుల్ హమీద్' లుంగీలోనే.. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్ ఎయిర్వేస్ విమానం ఎక్కి దేశం విడిచి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది.అబ్దుల్ హమీద్ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు (2013 నుంచి 2023 వరకు) పనిచేశారు. 2024లో జరిగిన ఆందోళన కాలంలో పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనా.. ఆమె సహాయకులపై నమోదైన ఒక హత్య కేసులో ఆయన కూడా సహ నిందితుడు ఉన్నట్లు సమాచారం. హసీనాను పదవీచ్యుతురాలిని చేయడానికి బయలుదేరిన నిరసనకారులపై కాల్పులు జరిపి, వారిని చంపిందని ఆరోపణలు వచ్చాయి.ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం.. జనవరి 14న కిషోర్‌గంజ్ సదర్ పోలీస్ స్టేషన్లో నమోదైన హత్య కేసులో మహమ్మద్ అబ్దుల్ హమీద్ నిందితుడిగా ఉన్నారు. హసీనా.. ఆమె కుటుంబ సభ్యులు షేక్ రెహానా, సజీబ్ వాజెద్ జాయ్, సైమా వాజెద్ పుతుల్ కూడా సహ నిందితులుగా ఉన్నారు. మాజీ మంత్రి ఒబైదుల్ ఖాదర్ కూడా ఈ కేసులో ఒక నిందితుడు.మాజీ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ థాయిలాండ్‌కు వెళ్లడంపై దర్యాప్తు చేయడానికి.. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం విద్యా సలహాదారు సీఆర్ అబ్రార్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని యునైటెడ్ న్యూస్ ఆఫ్ బంగ్లాదేశ్ వార్తా సంస్థ తెలిపింది.మహమ్మద్ అబ్దుల్ హమీద్.. కుటుంబ సభ్యులతో కలిసి వైద్య చికిత్స కోసం వెళ్లారని చెబుతున్నారు. కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థులు బంగ్లాదేశ్‌లో విచారణ నుంచి తప్పించుకోవడానికి పారిపోయారని చెబుతున్నారు. -
వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఉండరు: జిన్‌పింగ్
అమెరికా - చైనా ప్రతీకార సుంకాల విషయంలో ఒక డీల్ కుదుర్చుకున్న తరువాత.. బీజింగ్‌లో బ్రెజిల్, కొలంబియా, చిలీ అధ్యక్షులతో సహా లాటిన్ అమెరికా, కరేబియన్ అధికారుల శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు 'జిన్‌పింగ్' మాట్లాడారు. బెదిరింపులు, ఆధిపత్య ధోరణి వల్ల ఎదురుదెబ్బలు తగులుతాయని, ఒంటరిని చేస్తాయని అన్నారు.ప్రతీకార సుంకాలు లేదా వాణిజ్య యుద్ధాలలో విజేతలు ఉండరు. వివిధ దేశాలు కలిసి పనిచేస్తేనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని జిన్‌పింగ్ అన్నారు. ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఒక దేశం ఇంకో దేశానికి సహకరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.టారిఫ్‌లకు 90 రోజులు బ్రేక్అమెరికా దిగుమతులపైన చైనా రెండు దేశాలు ఇప్పటికి విధించిన సుంకాలలో 115 శాతం తగ్గించుకున్నాయి. అంటే చైనా.. అమెరికాపై విధించిన 125 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయగా.. అమెరికా, చైనాపై విధించిన సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితం చేసింది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది. -
ఎయిర్ ఫోర్స్ వన్... ఫ్రీ!.. అమెరికా అధ్యక్షుడికి ఖతార్ గిఫ్ట్?
జనానికి ‘ఫ్రీ’ అనే పదం వినపడినంత సొంపుగా మరొకటి చెవులకు సోకదు. ఫ్రీ అంటే ఫినైల్ తాగేవాడుంటాడని ప్రతీతి. ‘ఉచితం’ దేశాధ్యక్షులకూ బహు ప్రీతి. ఈ ఉచితం... ‘ఉచితమా’? సముచితమా? కాదా? అని ఆలోచించరు. అమెరికా అధ్యక్షుడూ ఇందుకు మినహాయింపు కాదు. ‘ఉచిత’ ఎయిర్ ఫోర్స్ వన్. ఖతారోడు ఫ్రీగా జంబోజెట్ ఇస్తాట్ట. అది సూపర్ లగ్జరీ ‘బోయింగ్ 747-8’ విమానం. ‘ప్యాలెస్ ఇన్ ద స్కై’ అంటున్నారు. ‘ఆకాశంలో ఎగిరే హర్మ్యం’గా అభివర్ణిస్తున్నారు. ప్రైవేటు బెడ్రూం సూట్, బోర్డు రూమ్స్, పాలరాయితో అలంకరించిన స్నానాలగదులు, గ్రాండ్ స్టెయిర్‌కేస్ వంటి ఫీచర్స్ అందులో ఆ విమానాన్ని ఖతార్ ఇస్తే ట్రంప్ తీసుకోవడమేనా? ఎవడో విసిరే బిస్కట్ కోసం అగ్రరాజ్యం అంతగా కక్కుర్తిపడుతోందా?అమెరికా అంతర్జాతీయ పేరు ప్రతిష్ఠలు కేవలం ‘విమానాల సేకరణ’ స్థాయికి దిగజారిందా? ఖతార్ రాజకుటుంబం ఇచ్చే బహుమతిని అమెరికా అధ్యక్షుడు పుచ్చుకోవడం అనైతికం, చట్ట విరుద్ధం అంటున్నారు విమర్శకులు. పైగా భద్రత పరంగా కూడా ప్రమాదకరమని విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీ రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత వస్తోంది. ఆ విమానం ధర 400 మిలియన్ డాలర్లు. అంటే రూ.3,400 కోట్లు. అయితే ఖతార్ గిఫ్టుగా ఇచ్చే విమానంలో తాను తిరగబోనని చెబుతున్నారు ట్రంప్. గతంలో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ వాడిన బోయింగ్ 707 విమానాన్ని సేవల నుంచి తప్పించి మ్యూజియంలో ఓ వస్తువుగా ప్రదర్శనకు పెట్టినట్టే... తన పదవీకాలం ముగిశాక భవిష్యత్తులో ‘ప్రెసిడెంట్ లైబ్రరీ’కి ఆ విమానాన్ని దానంగా ఇస్తామని అంటున్నారు ట్రంప్.అధ్యక్షుడిగా తన పదవీకాలం పూర్తవగానే అది ప్రెసిడెంట్ లైబ్రరీకి వెళ్లిపోతుందని ఆయన వివరించారు. ఇక అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విషయానికొస్తే.. అవి రెండు విమానాలు. దాదాపు 40 ఏళ్లుగా వాటిని అమెరికా వినియోగిస్తోంది. భద్రతపరంగా అవి మేలైనవి. కమ్యూనికేషన్ సామర్థ్యాలు, క్షిపణి దాడుల నుంచి కాచుకోవడం, గాల్లోనే ఇంధనం నింపుకోవడం వంటి ఫీచర్స్ వాటి సొంతం. అయితే ఆ పాత, డొక్కు విమానాలు అధ్యక్షుడికి నచ్చడం లేదు. వాటిని మార్చాలని ట్రంప్ ఉత్సాహపడుతున్నారు. బోయింగ్ కూడా అదే పనిలో నిమగ్నమైంది. రష్యాకు చెందిన ఓ విమానయాన సంస్థ కోసం బోయింగ్ గతంలో 747 విమానాలు తయారుచేసింది.బోయింగ్ నుంచి విమానాలు కొంటామన్న రష్యన్ విమానయాన సంస్థ ప్రస్తుతం ఉనికిలో లేదు. దీంతో ఆ 747 విమానాలకు బోయింగ్ మార్పుచేర్పులు చేస్తూ అదనపు సొబగులు అద్దుతోంది. కీలక సబ్ కాంట్రాక్టర్ దివాలా తీయడం, అర్హత గల సిబ్బంది కొరత కారణాల నేపథ్యంలో సుమారు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ ‘747 విమానాల మేకప్ తతంగం’ ఇంకొన్నాళ్లు పట్టేట్టుంది. ట్రంప్ ప్రస్తుత రెండో టర్మ్ ముగిసేలోపు ఆ విమానాలు సిద్ధమయ్యేట్టు లేవు. దీంతో దేశాధ్యక్షుడిలో అసహనం పెరిగిపోతోంది. కొందరు అరబ్ నేతలు ‘ఎయిర్ ఫోర్స్ వన్’ కంటే మెరుగైన విమానాల్లో ప్రయాణిస్తున్నారంటూ ట్రంప్ ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. మధ్యప్రాచ్యంలో ఖతార్ గడ్డపై అమెరికాకు అతి పెద్ద సైనిక స్థావరం ఉంది.ప్రస్తుతం ట్రంప్ అటువైపే పర్యటనకు బయల్దేరారు. మే 13-16 తేదీల్లో ఆయన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈల్లో పర్యటిస్తారు. కొసమెరుపు- ‘కాంగ్రెస్ (చట్టసభలు) అనుమతి లేకుండా ఫెడరల్ అధికారులు విదేశీ ప్రభుత్వాల నుంచి విలువైన వస్తువులు, లాభాలు/ప్రయోజనాలు పొందరాదు’ అని అమెరికా రాజ్యాంగం స్పష్టీకరిస్తోంది. మరి ‘ఖతార్ గిఫ్ట్’ అంశంలో ట్రంప్ ఏం చేస్తారో! అధ్యక్షుడైనా చట్టానికి అతీతం కాదు. విమానాన్ని అమెరికా అధ్యక్షుడికి బహుమతిగా ఇవ్వజూపడం వెనుక ఖతార్ ప్రయోజనాలు ఏం దాగున్నాయో!::జమ్ముల శ్రీకాంత్(Source: Huffpost, American Broadcasting Company news) -
బుర్కినా ఫాసోలో మారణహోమం..100 మందికి పైగా మృతి
ఔగాడౌగౌ: పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అధిక సంఖ్యలో సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక అధికారుల సమాచారం మేరకు.. బుర్కినా ఫాసోలో ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. ఉత్తర బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఇందులో సైనిక స్థావరంతో పాటు డజిబో పట్టణం సైతం ఉంది. బుర్కినా ఫాసో సహెల్ ప్రాంతంలో తీవ్రవాదం పేట్రేగిపోతున్న సమయంలో అక్కడ యాక్టివ్‌గా ఉన్న అల్ ఖైదా అనుబంధ గ్రూప్ జేఎన్ఐఎమ్ ఈ దాడికి పాల్పడింది.ఏక కాలంలో ఎనిమిది ప్రాంతాల్లో దాడులుజేఎన్ఐఎమ్ ముష్కరులు ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిపినట్లు ఓ సహాయ కార్యకర్త తెలిపారు. ముష్కరులు బుర్కినా ఫాసో ఎయిర్‌పోర్టును ధ్వంసం చేసే లక్ష్యంతో ఈ దాడికి తెగబడ్డారు. ముందుగా డజిబో నగరంలోకి ప్రవేశించే దారుల్ని నిర్బందించారు. అనంతరం సైనిక శిబిరాలపై దాడి చేశారు. స్పెషల్ యాంటీ టెర్రరిజం యూనిట్ శిబిరాల్లో బీభత్సం సృష్టించారని చెప్పారు. Presidente de Burkina Faso, Ibrahim Traoré, gran líder de África que lucha contra el colonialismo de Francia, Alemania, Israel y EEUU. pic.twitter.com/s2uFuVA7pP— El Fantasma (@AlTopeyPunto198) May 13, 2025అత్యంత భద్రతా సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రాంతంగా సహెల్ బుర్కినా ఫాసో దేశంలో సైనిక పాలన కొనసాగుతుంది. ఆఫ్రికాలోని 11 దేశాల భూ భాగాల్లో సహెల్ ప్రాంతం ఒకటి. ఆ 11 దేశాల్లో 2.3 కోట్ల జనాభా ఉన్న బుర్కినా ఫాసో ఒకటి. అయితే ఆఫ్రికా దేశాల్లో సహెల్ ప్రాంతం అత్యంత భద్రతా సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం దాదాపు సగానికి పైగా భూభాగంపై సైనిక ప్రభుత్వం పట్టును కోల్పోయింది. అనునిత్యం బుర్కినా ఫాసో దేశాన్ని ఆక్రమించేందుకు ఆల్‌ఖైదాలాంటి ఉగ్ర సంస్థలు మారణహోమం సృష్టిస్తూనే ఉంటాయి. ఈ హింస వల్లే 2022లో రెండు సార్లు భారీ ఎత్తున సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశ భద్రతా దళాలు కూడా చట్టవిరుద్ధమైన హత్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
వాషింగ్టన్: అమెరికాలోని లాంకాస్టర్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఒహియోలోని క్లీవ్‌లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మృతి చెందినట్లు భారత కాన్సులేట్ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మానవ్ పటేల్(20), సౌరవ్ ప్రభాకర్(23) మృతిచెందినట్లు ప్రకటిస్తూ కాన్సులేట్ సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేసింది.మే 10న లాంకాస్టర్ కౌంటీలోని పెన్సిల్వేనియా టర్న్‌పైక్ వద్ద వారి వాహనం చెట్టును ఢీకొట్టి.. ఆపై వంతెనను ఢీకొట్టిందని పెన్సిల్వేనియా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో వ్యక్తి గాయపడగా.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాకర్ వాహనాన్ని నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. Deeply saddened to learn about the unfortunate road accident in which two Indian students from Cleaveland State University, Manav Patel and Saurav Prabhakar lost their lives;Our thoughts and prayers are with their families during this difficult time. The Consulate is in touch…— India in New York (@IndiainNewYork) May 12, 2025 -
స్కూల్‌పై మయన్మార్ సైన్యం దాడి.. 20 మంది విద్యార్థులు మృతి
బ్యాంకాక్: మయన్మార్ సైన్యం సోమవారం ఓ పాఠశాల భవనంపై జరిపిన వైమానిక దాడిలో 20 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులకు సమీపంలోని సగయింగ్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. డెపాయిన్ పట్టణ సమీపంలోని గ్రామంపై జరిగిన ఈ దాడిలో 50 మంది విద్యార్థులు గాయపడినట్లు ప్రైవేట్ మీడియా సంస్థలు తెలిపాయి.ప్రజాస్వామ్య అనుకూల వాదులు ఈ స్కూలును నడుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం, ప్రభుత్వ మీడియా ఈ దారుణంపై స్పందించలేదు. 2021లో అంగ్‌సాన్ సుకీ సారథ్యంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. సాయుధ గ్రూపులకు వ్యతిరేకంగా సైనిక జుంటా భారీ వైమానిక దాడులు కొనసాగిస్తోంది. ఆర్మీ దాడుల్లో ఇప్పటి వరకు కనీసం 6,600 మంది పౌరులు చనిపోయినట్లు అంచనా. -
అఫ్గానిస్తాన్‌లో చెస్‌ను నిషేధించిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం చెస్‌ను నిషేధించింది. జూదం వంటి ఈ ఆట.. ఇస్లామిక్ చట్టం షరియా ప్రకారం చట్ట విరుద్ధమని తాలిబన్ క్రీడా డైరెక్టరేట్ తెలిపింది. మతపరమైన ఆందోళనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ ఆందోళనలు పరిష్కారమయ్యే వరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకకు అఫ్గానిస్తాన్‌లో చెస్ నిషేధంలో ఉంటుందని తేల్చి చెప్పింది.ఇప్పటికే తాలిబన్లు దేశంలో అనేక క్రీడలకు పరిమితులు విధించారు. హింసాత్మకమైనది, ఇస్లా ప్రకారం సమస్యాతమైనదంటూ మార్షల్ ఆర్ట్స్‌ను నిషేధించారు. ఇక మహిళలకు మొత్తం క్రీడల నుంచే దూరం పెట్టారు. ఈ నేపథ్యంలో చెస్‌పై నిషేధం చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో కాబూల్‌లోని అజీజుల్లా గుల్జాదా కేఫ్ చెస్ పోటీలు నిర్వహించింది.ఇతర ముస్లిం మెజారిటీ దేశాల్లోనూ చెస్ ఆడతారని, అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లు ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ నిషేధం తన వ్యాపారంతోపాటు ఆటను ఆస్వాదించేవారిని దెబ్బతీస్తుందని.. అయినా తాను నిషేధాన్ని గౌరవిస్తానని వెల్లడించారు. యువతకు పెద్దగా కార్యకలాపాలు లేవని, దీంతో కొందరు యువకులు వచ్చి ఓ కప్పుటీ తాగి, స్నేహితులతో చెస్ ఆడతారని వెల్లడించారు. -
జైళ్ల నుంచి జర్నలిస్ట్‌లను విడిచిపెట్టాలి
వాటికన్ సిటీ: జైళ్లలో ఉన్న జర్నలిస్ట్‌లందరినీ వెంటనే విడుదల చేయాలని నూతన పోప్ లియో 14 పిలుపునిచ్చారు. పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం మనకున్న విలువైన కానుకలని ఆయన నొక్కి చెప్పారు. మొట్టమొదటి సారిగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. వాటికన్ సిటీలో ఆడిటోరియంలోకి ఆయన ప్రవేశించడంతోనే అందరూ లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. శాంతి బలోపేతమయ్యేలా, యుద్ధాన్ని తిరస్కరించేలా రాయాలని, అణగారిన వారికి గొంతుకగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా సత్యాన్ని కనుగొనే క్రమంలో జైళ్ల పాలైన జర్నలిస్టులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఇటువంటి వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన పిలుపునివ్వగానే ప్రాంగణంమంతా చప్పట్లతో ప్రతిధ్వనించడం విశేషం. ‘ఇటువంటి వారిని చర్చి గుర్తిస్తుంది. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి యుద్ధం పురోగతిని గురించి బయటి ప్రపంచానికి తెలిపే వారి గురించే నా తపనంతా. గౌరవం, న్యాయం, ప్రజల సమాచార హక్కును కాపాడే ధీరులు వీరంతా. ఎందుకంటే, సమాచారం ఉంటేనే కదా ఎంపికలో స్వేచ్ఛ ఉండేది!’అని పోప్ పేర్కొన్నారు. మనం ఇతరులను చూసే విధానం, వారి మాట వినడం, వారి గురించి మాట్లాడే విధానం ద్వారా శాంతి మనతోనే ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. పోప్ ఎన్నికను కవర్ చేసేందుకు ప్రపంచ దేశాల నుంచి తరలివచి్చన సుమారు 6వేల మంది పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభంలో కొద్ది సేపు ఇంగ్లి‹Ùలో మాట్లాడిన ఆయన..ఆ తర్వాత మొత్తం ఇటాలియన్‌లోనే కొనసాగించారు. ముందు వరుసల్లో ఉన్న కొందరు జర్నలిస్టులను పోప్ లియో 14 పలకరించారు. హాలు నుంచి తిరిగి బయటకు వెళ్లేటప్పుడు కొందరితో కరచాలనం చేశారు. ఆటోగ్రాఫ్‌లపై సంతకం చేశారు. కొందరితో సెల్ఫీలకు పోజిచ్చారు. -
విమానాశ్రయాలు పునఃప్రారంభం
న్యూఢిల్లీ: భారత్–పాక్ ఉద్రిక్తతల కారణంగా మే 9 నుంచి మూసివేసిన విమానాశ్రయాలన్నింటినీ భారత్ సోమవారం తిరిగి ప్రారంభించింది. కాల్పుల విరమణ చర్చల మధ్య పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు తగ్గడంతో 32 విమానాశ్రయాలు తిరిగి తెరిచారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి కేంద్రం సోమవారం ఉదయం నోటామ్ (ఎయిర్‌మెన్‌కు నోటీసు) జారీ చేసింది. ‘‘15 మే 2025 ఉదయం 05:29 గంటల వరకు తాత్కాలికంగా పౌర విమాన కార్యకలాపాల కోసం మూసివేసిన 32 విమానాశ్రయాలు ఇప్పుడు తక్షణమే సేవల్లోకి వస్తాయి’’అని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు విమాన స్థితిని నేరుగా ఎయిర్‌లైన్స్‌తో తనిఖీ చేసుకోవాలని, మార్పుచేర్పులకోసం ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లను పరిశీలించాలని సిఫార్సు చేసింది. దీంతో చండీగఢ్, శ్రీనగర్ సహా ప్రభావిత ప్రాంతాల్లోని విమానాశ్రయాలు తెరుచుకున్నాయి. క్రమంగా విమాన కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. 3 గంటల ముందే విమానాశ్రయానికి... విమానాశ్రయాలలో కఠినమైన భద్రతా ప్రోటోకాల్ కోసం గురువారం జారీ చేసిన ఉత్తర్వులు మే 18 వరకు అమలులో ఉంటాయి. విమానాశ్రయాలలోకి సందర్శకులకు అనుమతి ఉండదు. చెక్–ఇన్, బోర్డింగ్ సజావుగా జరిగేందుకు ప్రయాణికులు విమానం షెడ్యూల్ చేసిన సమయానికి కనీసం మూడు గంటల ముందే సంబంధిత విమానాశ్రయాలకు చేరుకోవాల్సి ఉంటుంది. క్రమంగా రాకపోకల పెరుగుదలఆదేశాన్ని అనుసరించి మే 12 నుంచి ఉదయం 10 గంటలకు చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. శ్రీనగర్, అమృత్సర్, లూథియానా, భుంటార్, కిషన్‌గఢ్, పాటియాలా, సిమ్లా, కాంగ్రా–గగ్గల్, భటిండా, జైసల్మేర్, జోధ్‌పూర్, బికనీర్, హల్వారా, పఠాన్‌కోట్, జమ్మూ, లేహ్, ముంద్రా, జామ్‌నగర్, హిరాసర్, భుందార్, పోర్బందర్, రాజ్‌కోట్, సర్సావా, సిమ్లా, థోయిస్, ఉత్తరలై విమానాశ్రయాలు కూడా తమ కార్యకాలాపాలను ప్రారంభించాయి. తమ విమానాల రాకపోకలు క్రమంగా పెరుగుతాయని ఇండిగో తెలిపింది. విమానాల షెడ్యూలింగ్‌లో కొంత జాప్యం ఉంటుందని, వివరాల కోసం ప్రయాణికులు తమ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించింది. ప్రయాణికులు ప్రయాణ ప్రణాళికలను పునఃపరిశీలించాలనుకుంటే.. మే 22 వరకు మార్పు, రద్దు రుసుము మినహాయింపులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. -
చూపింది శాంపిలే
న్యూఢిల్లీ: దాయాదికి మన సైన్యం మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ‘‘పాక్ ఇప్పుడు చవిచూసిన తీవ్ర సైనిక నష్టాలు కేవలం శాంపిల్ మాత్రమే. మరోసారి యుద్ధమంటూ వస్తే అది పూర్తి భిన్నంగా, వాళ్లూ ఊహించలేనంత తీవ్రంగా ఉంటుంది’’ అని స్పష్టం చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ (డీజీఏఓ) ఎయిర్ మార్షల్ ఏకే భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ (డీజీఎన్‌ఓ) వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ సోమవారం మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘‘మన సైనిక వ్యవస్థలు, స్థావరాలు నిరంతరం అప్రమత్తంగా, పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయి. అవసరమైతే ఎలాంటి ఆపరేషన్లౖMðనా క్షణాల్లో రంగంలోకి దిగిపోతాయి’’ అని ప్రకటించారు. ‘‘మనం పోరాడింది కేవలం ఉగ్రవాదులతో. కానీ వారికి దన్నుగా పాక్ సైన్యం రంగంలోకి దిగడం శోచనీయం. ఆ దేశాన్ని ఎవరు నియంత్రిస్తున్నారో చెప్పేందుకు ఇంతకంటే మరో ఉదాహరణ అక్కర్లేదు’’ అని డీజీఏఓ భారతి అన్నారు. మన వైమానిక దాడుల్లో కరాచీ సమీపంలోని మరో కీలక వైమానిక స్థావరం కూడా నేలమట్టమైందని ఆయన వెల్లడించారు. అయితే పాక్ తన అణ్వాయుధ, అణు కమాండ్ వ్యవస్థలను దాచి ఉంచినట్టు చెబుతున్న కిరానా హిల్స్‌పై తాము దాడులు చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లేనన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కూల్చేసిన అత్యాధునిక పాక్ యుద్ధ విమానాల్లో ఒక మిరాజ్ కూడా ఉందని చెప్పారు. అనంతరం దాని తాలూకు శకలాల ఫొటోలను సైన్యం ఎక్స్‌లో షేర్ చేసింది.ఆకాశ్.. హైలైట్మనవి కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలని డీజీఎంఓ రాజీవ్, డీజీఏఓ భారతి గుర్తు చేశారు. పాక్ దాడులను తిప్పికొట్టడంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ హైలైట్‌గా నిలిచిందంటూ కొనియాడారు. ‘‘నిరంతరాయంగా దూసుకొచ్చిన డ్రోన్లను ఆకాశ్, కాస్ వంటి దేశీయ రక్షణ వ్యవస్థలు అడ్డుకుని కూల్చేసిన తీరు మనకు గర్వకారణం. దశాబ్ద కాలంగా మన రక్షణ వ్యవస్థలు సాధించిన అద్భుత ప్రగతికి నిదర్శనం’’ అని చెప్పారు. పాక్‌కు అతి కీలకమైన రహీంయార్ ఖాన్ వైమానిక స్థావరంలో జరిగిన విధ్వంసం తాలూకు వీడియో, ఫొటోలను ఈ సందర్భంగా విడుదల చేశారు. రాజస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఈ స్థావరంలో ఎక్కడ చూసినా భారీ గోతులే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా రన్‌వేపై అతి భారీ గొయ్యి ఏర్పడింది. దాన్ని పూర్తిగా పూడ్చి సరిచేసేదాకా అక్కడ ఎలాంటి వైమానిక కార్యకలాపాలూ జరిగే అవకాశం లేదు. ఇవన్నీ మన దాడుల తాలూకు కచ్చితత్వానికి తిరుగులేని నిదర్శనాలని డీజీఏఓ భారతి చెప్పారు.యోధుని నోట రాముని మాటపాక్పై దాడులు తదితర వివరాలతో సీరియస్‌గా సాగుతున్న మీడియా భేటీలో డీజీఏఓ భారతి ఉన్నట్టుండి రామయణంలోని వారధి ఉదంతాన్ని ఉటంకించి ఆకట్టుకున్నారు. ‘‘లంకకు వెళ్లేందుకు దారివ్వాలని మర్యాదగా కోరితే సముద్రుడు మూడు రోజులైనా స్పందించలేదు. భయపెట్టనిదే పనికాదంటూ రాముడు ఆగ్రహంతో కోదండం ఎక్కుపెట్టగానే తక్షణం కాళ్లబేరానికి వచ్చాడు’’ అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించి రామచరిత్ మానస్‌లోని ‘వినయ్ న మానత్ జలధి...’ పద్య పంక్తులను ఆశువుగా చెప్పి అలరించారు. ‘‘నేనేం చెప్పదలచిందీ అర్థమైందిగా! తెలివైనవాడికి కనుసైగ చాలు’’ అంటూ చమత్కరించడంతో అంతా నవ్వుల్లో మునిగిపోయారు. పాక్ నిరంతర కవ్వింపులు మనం గట్టిగా బదులివ్వక తప్పని పరిస్థితి కల్పించాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆది, సోమవారాల్లో సైనిక డీజీల మీడియా బ్రీఫింగ్ సందర్భంగా కూడా రాయబార ఘట్టంలో కౌరవులకు కృష్ణుని హిత వచనాలు, హెచ్చరికలకు సంబంధించిన పద్యాలు, శివతాండవ స్తోత్రం తదితరాలను నేపథ్యంలో విన్పించడం విశేషం.ఎయిర్ డిఫెన్స్‌కు క్రికెట్‌పరంగా భాష్యంమన వైమానిక స్థావరాలను, సైనిక కేంద్రాలను లక్ష్యం చేసుకోవడం అత్యంత కష్టమని డీజీఎంఓ రాజీవ్ స్పష్టం చేశారు. పాక్ దాడుల వేళ మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎంత శత్రు దుర్భేద్యంగా నిలిచిందో క్రికెట్ పరిభాషలో వివరించి అలరించారు. ‘‘1970ల్లో జరిగిన ఓ యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ద్వయం జెఫ్ థామ్సన్, డెన్నిస్ లిల్లీ ఇంగ్లండ్‌కు వణుకు పుట్టించింది. అయితే జెఫ్, లేకపోతే లిల్లీ అన్నట్టుగా సిరీస్ పొడవునా ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలు చేశారు. ఎస్–400 మొదలుకుని ఆకాశ్, కాస్, ఏడీ గన్స్ దాకా పలు శ్రేణులతో కూడిన మన ఎయిర్ డిఫెన్స్ కూడా అంతే. వాటిలో ఏదో ఒక వ్యవస్థ పాక్ వైమానిక దాడులను దీటుగా అడ్డుకుని పూర్తిగా తిప్పికొట్టింది’’ అని చెప్పారు. సోమవారమే టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ తన అభిమాన క్రికెటర్ అని చెప్పారాయన. -
హమాస్ చెర నుంచి అమెరికా బందీ విడుదల
దెయిర్ అల్–బలాహ్: తమ చెరలో ఉన్న అమెరికా పౌరుడైన ఇజ్రాయెల్ సైనికుడు ఈడన్ అలెగ్జాండర్‌ను గాజాలోని హమాస్ సాయుధ సంస్థ సోమవారం రెడ్ క్రాస్ సిబ్బందికి అప్పగించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ శ్రేణులు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మెరుపుదాడి చేపట్టి వందలాది మందిని చంపడంతోపాటు 250 మందిని బందీలుగా పట్టుకుపోవడం తెల్సిందే. వీరిలో ఈడన్ సహా ఇప్పటికీ చెరలోనే ఉన్న 59 మందిలో 24 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు చెబు తున్నారు. పట్టుబడిన సమయంలో ఇతడు ఇజ్రాయెల్ సైన్యంలోని ఇన్ఫాంట్రీ విభాగంలో విధుల్లో ఉన్నాడు. దాదాపు 19 నెలలపాటు గాజాలో హమాస్ వద్ద సజీవంగా ఉన్న వారిలో అమెరికాకు చెందిన ఏకైక వ్యక్తి ఈడన్. ఈడన్ కోసం సురక్షిత కారిడార్ ఏర్పాటు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ట్రంప్ ప్రభుత్వంపై సాను కూల ధోరణితోనే ఈడన్ను వదిలిపెట్టినట్లు హమాస్ ప్రకటించింది. యుద్ధం ముగిసే దిశగా సానుకూల పరిణామమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. -
పాక్‌కు సైనిక సామగ్రి తరలింపు అబద్ధం: చైనా
బీజింగ్: పాకిస్తాన్‌కు సరుకు రవాణా విమానంలో సైనిక సామగ్రిని తాము సరఫరా చేశామంటూ వస్తున్న వార్తలను చైనా ఖండించింది. ఇటువంటి వదంతులను వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జియాన్ వై–20 రకం విమానంలో పెద్ద మొత్తంలో సామగ్రిని పాకిస్తాన్ తరలించినట్లు ఆన్లైన్లో వస్తున్న వార్తలు అసత్యాలని పేర్కొంది. ‘ఇంటర్నెట్ చట్టానికి అతీతం కాదు. సైనిక సంబంధమైన వదంతులను, అసత్యాలను వ్యాప్తి చేసే వారిని బాధ్యులను చేస్తాం’అని స్పష్టం చేసింది. భారత్‌తో కాల్పుల విరమణకు అంగీకారం కుదిరాక పాక్‌కు అత్యవసరమైన సామగ్రిని చైనా పంపించిందంటూ ఆన్లైన్లో వార్తలు షికారు చేశాయి. పాక్, చైనాల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. పాక్ ఆయుధ సామగ్రి, వ్యవస్థల్లో ఏకంగా 81 శాతం చైనా నుంచి కొనుగోలు చేసినవేనని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రి) తెలిపింది. -
మోహరింపుల తగ్గింపు!
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: సరిహద్దుల వెంబడి బలగాల మోహరింపును కనీస స్థాయికి తగ్గించే అంశాన్ని పరిశీలించేందుకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. ఇరుదేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) మధ్య సోమవారం ఈ అంశంపై కీలక చర్చలు జరిగాయి. పాక్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా, భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ హాట్లైన్లో 45 నిమిషాలకు పైగా సంప్రదింపులు జరిపారు. సైనిక చర్యకు తెర దించే మార్గాలపైనా చర్చ జరిపారు. ఇరువైపుల నుంచీ ఒక్క తూటా కూడా కాల్చకుండా సంయమనం పాటించాలని గత భేటీలో తీసుకున్న నిర్ణయం అమలు దిశగా చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాక జరిగిన తొలి ఉన్నతస్థాయి సమావేశం ఇదే. తొలుత నిర్ణయించినట్టు మధ్యాహ్నం 12 గంటలకు బదులు భేటీ సాయంత్రం ఐదింటికి జరిగింది. మే 10న కాల్పుల విరమణకు డీజీఎంఓ స్థాయిలోనే సూత్రప్రాయంగా అంగీకారం కుదరడం తెలిసిందే. అనంతర పరిణామాలు తదితరాలపై తాజా భేటీలో డీజీఎంఓలు ఎవరి వాదన వారు వినిపించినట్లు తెలుస్తోంది. భేటీపై అధికారికంగా ప్రకటన రాలేదు. వివరాలను త్వరలో వెల్లడిస్తామని సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. -
కిరానా హిల్స్ కథేంటి ?
న్యూఢిల్లీ/ ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్ కొండప్రాంతంపై బాంబులు వేశారనే వార్తలను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది. పాకిస్తాన్ అణు స్థావరాల జోలికి వెళ్లలేదని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి సోమవారం స్పష్టంచేశారు. ‘‘ ఆ కొండలో అణుస్థావరం ఉన్నట్లు మాకైతే తెలీదు. ఇప్పుడు మీరు చెప్తేనే తెల్సింది. రహస్యం చెప్పినందుకు థాంక్యూ’’ అని ఏకే భారతి సరదాగా మాట్లాడారు. తర్వాత సీరియస్‌గా సమాధానం చెప్పారు. ‘‘ పాక్ అణుస్థావరాలపై భారత్ ఎలాంటి దాడులు చేయలేదు. ముఖ్యంగా మీరు చెబుతున్న కిరానా న్యూక్లియర్ బేస్‌పై బాంబులు వేయలేదు’’ అని సోమవారం మీడియా ప్రతినిధులకు ఏకే భారతి స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ఈ కిరానా కొండల గురించి చర్చ మొదలైంది. పాకిస్తాన్ అణుస్థావరాలు భద్రంగా ఉన్నాయా?. వాటిపై నిజంగానే భారత్ దాడులు చేసిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కిరానా హిల్స్ విశేషాల కోసం నెటిజన్లు ఆన్లైన్లో తెగ వెతికేస్తున్నారు. కొండల్లో అణుబాంబులు!?పాకిస్తాన్ తన అణువార్హెడ్లను పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోదా జిల్లాలోని కిరానా కొండల్లో దాచిందని దశాబ్దాల క్రితం వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత వాయుసేన ఇక్కడ కూడా కొన్ని క్షిపణులు, బాంబులను పడేసిందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ కొండల్లో పేలుళ్లు వినిపించాయని, కనిపించాయంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. రక్షణ శాఖ పరిధిలోని అణు విభాగానికి సంబంధించిన స్థావరం ఈ కొండల్లో ఉందని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ కొనసాగింపులో భాగంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులుచేయడం తెల్సిందే. రావల్పిండి సమీపంలోని నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌పైనా క్షిపణులు వేసింది. ఈ ఎయిర్‌బేస్‌కు అత్యంత సమీపంలోనే పాక్ ‘స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్’ ఉంది. పాక్ అణు వార్హెడ్ల నిర్వహణ బాధ్యతలను ఇదే చూసుకుంటుంది. ఎయిర్‌బేస్‌పై దాడిచేసినప్పుడే స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్పైనా భారత్ దాడి చేసిందని వార్తలొచ్చాయి. అదీగాక ముషాఫ్ ఎయిర్‌బేస్‌పైనా భారత్ దాడిచేసింది. ఈ బేస్ అడుగుభాగంలోనే అణువార్హెడ్ల నిల్వకేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. సర్గోదా ఎయిర్‌బేస్‌కు రోడ్డుమార్గంలో కిరానా హిల్స్ కేవలం 20 కి.మీ.ల దూరంలో ఉంది. కుషాబ్ అణుకేంద్రానికి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అణ్వాయుధంలో వాడే ప్లుటోనియం తయారీకోసం నాలుగు భారజల రియాక్టర్లు కుషాబ్లో పనిచేస్తున్నట్లు 3 నెలల క్రితం వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ నివేదించింది. 68 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఆ కొండప్రాంతంలో 39 కి.మీ.ల పరిధిని మిలటరీ జోన్‌గా పాక్ ఏనాడో ప్రకటించింది. ఇక్కడ బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసింది. ఇక్కడ స్పెషల్ వర్క్స్ శాఖ 10 సొరంగాలను తవ్వింది. పొరపాటున లోపల పేలుళ్లు జరిగినా సమీప జనావాసాల్లో ప్రాణనష్టం జరక్కుండా సొరంగాల గోడలను అత్యంత మందంగా నిర్మించారని భారత ఆర్మీలో రిటైర్డ్ కల్నల్ వినాయక్ భట్ ఎనిమిదేళ్ల క్రితం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. -
బ్రిటన్ వీసా నిబంధనలు మరింత కఠినం
లండన్: గత ప్రభుత్వాల ఉదారవాద విధానాల కారణంగా బ్రిటన్‌లోకి వలసలు పోటెత్తాయని, స్థానికులకు ఉపాధి అవకాశాలు భారీగా తగ్గిపోయాయని ఆరోపిస్తూ అధికార లేబర్ పార్టీ కఠిన నిబంధనలను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. బ్రిటన్‌లో వలసకార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడమే లక్ష్యంగా కొత్త నిబంధనలను అమలుచేయనుంది. వలసదారులు బ్రిటన్‌లో శాశ్వత నివాస హోదా పొందాలంటే ఇకపై ఐదేళ్లకు బదులు కనీసం పదేళ్లు యూకేలో నివసిస్తూ ఉండాలని నిబంధనను కఠినతరం చేయనున్నారు. దీంతో అత్యధిక వర్క్ వీసాల పొందే భారతీయుల బ్రిటన్ శాశ్వత స్థిరనివాస కలలు నెలవేరడం మరింత కష్టంకానుంది. భారతీయులు ఎక్కువగా వైద్యం, ఐటీ, ఇంజనీరింగ్, విద్య, ఆతిథ్యం, కేటరింగ్, వాణిజ్యవిభాగాల్లో పనిచేసేందుకు వీసాలు పొంది బ్రిటన్‌కు వస్తుంటారు. 2024 జూన్‌లో ముగిసిన 12 నెలల కాలానికి 1,16,000 మంది భారతీయులు వర్క్ వీసాలు పొంది బ్రిటన్‌లో పలు రకాల్లో వృత్తుల్లో స్థిరపడ్డారు. వీసా నిబంధనల్లో ముఖ్యమైన మార్పులేంటి?చిన్నారులు, వృద్ధులు, రోగుల బాగోగులు చూసుకునే ఓవర్సీస్ కేర్ వర్కర్లకు ఇచ్చే వీసాలను ఇకపై ఆపేయనున్నారు. ఇకపై విదేశీయులను కేర్ వర్కర్లుగా నియమించుకోకూడదనే నిబంధనను అమల్లోకి తేనున్నట్లు పార్లమెంట్లో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టనున్న హోం శాఖ మంత్రి వెట్టీ కూపర్ చెప్పారు. దీంతో ఈ ఉద్యోగాలు స్థానికులకు లభిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. నైపుణ్యమున్న వాళ్లకు మంజూరుచేసే స్కిల్డ్ వర్కర్ వీసాను ఇకపై కనీసం గ్రాడ్యుయేషన్ విద్యార్హత ఉన్న వ్యక్తులకే ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. వైద్యులు, ఇంజనీర్లు, కృత్రిమ మేధ ఉద్యోగులు ఇలా నైపుణ్యమున్న వాళ్లకే స్కిల్డ్ వర్కర్ వీసా మంజూరుచేయాలని శ్వేతపత్రంలో ప్రతిపాదించారు. నిబంధనలను పాటిస్తూ దేశార్థికాన్ని తమ వంతు తోడ్పాటునందించే వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్కిల్డ్ వర్కర్ వీసా కోరే వాళ్లు కనీసం యూనివర్సిటీ డిగ్రీ పట్టభద్రులై ఉండాలి. ఈ నిబంధనలతో బ్రిటన్ హోం శాఖ సోమవారం ఒక శ్వేతపత్రం విడుదలచేసింది.డిపెండెంట్లకూ ఇంగ్లిష్ పరీక్షవీసాదారులపై ఆధారపడి బ్రిటన్‌లో అడుగుపెట్టే వారి జీవితభాగస్వాములు, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు ఇంగ్లిష్ భాషపై కనీస పరిజ్ఞానం, పట్టు ఉండాల్సిందే. వీళ్లంతా ఏ1–లెవల్ ఇంగ్లిష్ టెస్ట్‌ను పాసవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ ఉంటున్నారు?. ఏ పని మీద వచ్చారు?. ఏం చేస్తారు? ఇలా బ్రిటన్ పోలీసులు ఎక్కడైనా ప్రశ్నిస్తే కనీసం సమాధానం ఇంగ్లిష్‌లో చెప్పేలా బేసిక్ లెవల్ ఇంగ్లిష్ తెలిసి ఉండాలనే నిబంధనను జతచేయనున్నారు. వీసా గడువు కాలాన్ని వర్కర్లుగానీ, వాళ్ల కుటుంబసభ్యులుగానీ పెంచుకోవాలనుకుంటే వారిపై ఆధారపడే వాళ్లు హై లెవల్ ఏ2 ఇంగ్లిష్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. బ్రిటన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న విదేశీ విద్యార్థులు అదనంగా మరో 24 నెలలపాటు బ్రిటన్‌లోనే ఉండేందుకు వెసులుబాటు ఉండేది. దానిని ఇప్పుడు 18 నెలలకు కుదించారు. ఊహించనంతగా చట్టబద్ధంగా, అక్రమంగా వస్తున్న వారితో బ్రిటన్ ‘అపరిచితుల ద్వీపం’గా తయారవుతోందని సోమవారం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రధాని స్టార్మర్ వ్యాఖ్యానించారు. -
ఇటు30 అటు10
జెనీవా: ఎడాపెడా టారిఫ్‌లు విధించుకుంటూ వాణిజ్యయుద్ధాన్ని మొదలెట్టిన అమెరికా, చైనా ఎట్టకేలకు శాంతించాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాలే పరమావధిగా సమష్టిగా సంధికి ఆమోదముద్ర వేశాయి. ఇందులోభాగంగా సోమవారం స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగర వేదికగా వాణిజ్య ఒప్పందాన్ని కుదర్చుకుని టారిఫ్ రణానికి ముగింపు పలికినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. చైనా ఉత్పత్తులపై 145 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ సర్కార్, అందుకు దీటుగా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం టారిఫ్ వసూలుచేస్తామని జిన్‌పింగ్ ప్రభుత్వం గతంలో ప్రకటించడం తెల్సిందే. సోమవారం కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందంతో ఈ టారిఫ్‌లు భారీగా దిగిరానున్నాయి. ఒప్పందం మేరకు ఇకపై చైనా ఉత్పత్తులపై అమెరికా 30 శాతం టారిఫ్‌లు విధించనుంది. అమెరికా ఉత్పత్తులపై చైనా కేవలం 10 శాతం టారిఫ్‌లు విధించనుంది. తొలుత 3 నెలలపాటు అమలుతొలుత 90 రోజులపాటు ఈ టారిఫ్‌లనే అమలుచేసి, సమీక్ష జరిపి అందుకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు. జెనీవాలో ఈ మేరకు అమెరికా, చైనా తరఫున అత్యున్నత స్థాయి అధికారులు మంతనాల జరిపి ట్రేడ్ డీల్‌ను ఖరారుచేశారు. ఐక్యరాజ్యసమితిలో స్విస్ రాయబారి అధికారిక నివాసంలో జరిగిన ఈ చర్చల్లో అమెరికా తరఫున అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్, వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి జేమ్సన్ గ్రీర్ పాల్గొన్నారు. ఆర్థిక, వాణిజ్యం సంబంధాలపై ఇకమీదటా ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతాయని స్కాట్బెసెంట్ అన్నారు. ‘‘ ఇరువైపులా పెరిగిన అత్యధిక టారిఫ్‌లతో వాణిజ్యం ఒక్కసారిగా స్తంభించిపోయింది. చైనాతో వాణిజ్యబంధం బలోపేతానికే కృషిచేస్తున్నాం. అందుకే పెంచిన టారిఫ్‌లను మళ్లీ తగ్గిస్తున్నాం. సమతుల వాణిజ్యం కోరుకుంటున్నాం. ఈ తరహా వాణిజ్యాన్ని సాకారాంచేస్తాం’’ అని బెసెంట్ వ్యాఖ్యానించారు. తర్వాత చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ ఇరువైపులా 91 శాతం టారిఫ్ తగ్గించుకున్నాం. మేం మరో 90 రోజులకోసం మరో 24 శాతం తగ్గించాం. దీంతో అమెరికాపై మా టారిఫ్ 10 శాతానికి దిగొచ్చింది. ఏప్రిల్ రెండో తేదీన అమెరికా టారిఫ్‌లు పెంచాక మేం తీసుకున్న ప్రతీకార నిర్ణయాలనూ ఉపసంహరించుకుంటున్నాం’’ అని చైనా ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే 90 రోజులపాటు ఈ రేట్లనే కొనసాగించి తర్వాత సమీక్ష జరపనున్నారు. దీనిపై కొందరు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ‘‘ ఇది తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం లాంటిదే. 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’’ అని క్యాపిటల్ ఎకనమిక్స్‌లో చీఫ్ ఆసియా ఎకానమిస్ట్ మార్క్ విలియమ్స్ వ్యాఖ్యానించారు. ‘‘ 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందనే ఇక్కడ అసలు ప్రశ్న’’ అని చైనాలో యురోపియన్ యూనియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జేన్స్ ఎస్కీలెండ్ అన్నారు. సింథటిక్ డ్రగ్ అయిన ఫెంటానిల్‌ను తమ దేశంలోకి చైనా పోటెత్తిస్తోందంటూ ట్రంప్ సర్కార్ తొలుత టారిఫ్‌ల పెంపు జెండా ఎగరేయడం తెల్సిందే. -
'అణు'మాత్రం బెదరం!.. దాయాదికి ప్రధాని మోదీ హెచ్చరిక
న్యూఢిల్లీ: ‘‘ఉగ్రవాద చర్యలకు ఇకపై ఆపరేషన్ సిందూర్‌తోనే బదులిస్తాం. ఇదే భారత ప్రభుత్వ నీతి. ఇదే మన నూతన విధానం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ‘‘దాయాది అణు బెదిరింపులకు దిగితే సహించే ప్రసక్తే లేదు. అంతేకాదు, ఉగ్రవాదాన్నీ, దానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న పాక్ ప్రభుత్వాన్నీ ఇకనుంచి వేర్వేరుగా చూడబోం. పాక్ చర్యలన్నింటినీ ఇకపై ‘సిందూర్’ గీటురాయితోనే పరిశీలిస్తాం. మనపై ఎలాంటి దుశ్చర్యకు పాల్పడ్డా ‘సిందూర్’ తరహాలో ఆ దేశంపై నిర్ణాయక రీతిలో దాడులు చేస్తాం. జన్మలో మర్చిపోలేని రీతిలో గుణపాఠం నేర్పుతాం’’ అని కుండబద్దలు కొట్టారు. పాక్ ‘అణు’ ఆటలు మనముందు సాగవని ఆ దేశ సైనిక స్థావరాలపై జరిపిన దాడులతో ప్రపంచానికి ఇప్పటికే నిరూపించామన్నారు. ‘‘కశ్మీర్ మంచుకొండల నుంచి రాజస్తాన్ ఎడారుల దాకా పాక్ దాడులన్నింటినీ తిప్పికొట్టాం. కేవలం మన సరిహద్దులపై దాడికి ప్రయత్నించినందుకే దాయాది ఆయువుపట్లను తూట్లు చేశాం. అది గొప్పగా చెప్పుకునే వైమానిక స్థావరాలన్నింటినీ పూర్తిగా నేలమట్టం చేసి కాళ్లబేరానికి తీసుకొచ్చాం. భారత్‌తో యుద్ధానికి దిగిన ప్రతిసారీ పాక్‌ను మట్టి కరిపించాం’’ అని గుర్తు చేశారు. ఆ విజయ పరంపరలో ఆపరేషన్ సిందూర్‌ను కలికితురాయిగా అభివర్ణించారు. పాక్ ప్రభుత్వం, సైన్యం కలసికట్టుగా దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాద భూతం చివరికి ఆ దేశాన్నే కబళిస్తుందని మోదీ హెచ్చరించారు. ‘‘ఆ దేశం మనుగడ సాగించాలంటే ఉగ్రవాదాన్ని దాని గడ్డపై నుంచి కూకటివేళ్లతో పెకిలించాల్సిందే. దానికి మరో మార్గం లేదు’’ అంటూ హితవు పలికారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని తొలిసారిగా సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాక్‌పై మన సైనిక విజయాన్ని దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కూతురికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... సిందూర్... దేశ భావనకు ప్రతిరూపం ‘‘సిందూరం కేవలం పేరు కాదు. సరైన న్యాయానికి అఖండ ప్రతిజ్ఞ. కోట్లాది భారతీయుల భావనలకు ప్రతిరూపం. ఉగ్రవాదం తాలూకు వికృత రూపమే పహల్గాం దాడి! అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి నన్నెంతగానో కలచివేసింది. భార్యాపిల్లల కళ్లముందే ఒక్కొక్కరిని కాల్చి పొట్టన పెట్టుకున్న వికృతత్వాన్ని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. అందుకు ప్రతీకారం కోసం దేశమంతా ఒక్కటైంది. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. వారు కలలో కూడా ఊహించని విధంగా పాక్, పీఓకేలోని బహావల్పూర్, మురిద్కే తదితర ఉగ్రవాద కేంద్రాలు, శిక్షణ శిబిరాలపై మన సైన్యం విరుచుకుపడి నేలమట్టం చేసింది. అవన్నీ నిజానికి ప్రపంచ ఉగ్రవాద యూనివర్సిటీలు. అమెరికాపై 9/11, లండన్ మెట్రో తదితర దాడులన్నింటికీ అక్కడినుంచే పథకరచన జరిగింది. అలాంటి కేంద్రాలతో పాటు ఉగ్రవాదుల స్థైర్యాన్ని కూడా మన ధ్వంసం చేసింది. దశాబ్దాలుగా పాక్ గడ్డపై బాహాటంగా రొమ్ములు విరుచుకుని సంచరిస్తున్న 100 మందికి పైగా అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులను హతమార్చింది. మన మహిళల నుదుటి సిందూరం తుడిపేస్తే ఏమవుతుందో ప్రతి ఉగ్ర ముఠాకూ తెలిసొచ్చేలా చేశాం. ఉగ్రతండాలనే సమూలంగా తుడిచిపెట్టేశాం. కాల్పులకు కేవలం విరామమే ఉగ్ర కేంద్రాలపై మన దాడితో పాక్ బిక్కచచ్చిపోయింది. మన దాడుల్లో హతమైన ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది. వాటిలో పాక్ సైనిక ఉన్నతాధికారులు బాహాటంగా పాల్గొన్నారు. పాక్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారనేందుకు ఇది తిరుగులేని రుజువు. తన గడ్డ మీది ఉగ్ర శిబిరాలు తుడిచిపెట్టుకుపోయాయనే నిరాశతో పాక్ దుస్సాహసానికి దిగింది. ఉగ్ర పోరులో మనతో కలిసి రావాల్సింది పోయి మనపైనే దాడులకు తెగబడింది. విచక్షణ కోల్పోయి మన సైనిక స్థావరాలతో పాటు విద్యా సంస్థలు, ప్రార్థనాలయాలు, ఇళ్లను కూడా లక్ష్యం చేసుకుంది. కానీ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది. పాక్ డ్రోన్లు, క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎక్కడివక్కడ నేలకూల్చింది. మనం అంతటితో ఆగలేదు. వాళ్లు సరిహద్దులపై దాడి చేస్తే నేరుగా పాక్ గుండెకాయకే గురిపెట్టాం. ప్రధాన నగరాల్లోని వాళ్ల కీలక సైనిక, వైమానిక స్థావరాలన్నింటినీ నేలమట్టం చేశాం. పాక్ సైన్యానికి ఊహించలేనంత నష్టం మిగిల్చాం. ఆ క్రమంలో మన బలగాలు అంతులేని సామర్థ్యాన్ని, సంయమనాన్ని ఏకకాలంలో అద్భుత రీతిలో ప్రదర్శించాయి. మన దేశీయ ఆయుధ వ్యవస్థ తాలూకు పాటవాన్ని పూర్తిస్థాయిలో రుచిచూపాయి. దాంతో బెంబేలెత్తిపోయి దాయాది కాళ్లబేరానికొచ్చింది. ఎలాగోలా పరువు కాపాడుకునే ప్రయత్నాలకు దిగింది. కాపాడండంటూ ప్రపంచ దేశాలను వేడుకుంది. మే 10న మన పాక్ డీజీఎంఓ మన డీజీఎంఓకు కాల్ చేశారు. ‘‘ఇకపై మా గడ్డపై ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలూ, సైనిక దుస్సాహాసాలూ జరగబోవు’’ అని స్పష్టంగా హామీ ఇచ్చారు. అప్పటికే పాక్ గుండెలపై పుట్టుకొచ్చిన ఉగ్ర తండాలన్నింటినీ మనం నేలమట్టం చేయడమే గాక దాని పీచమణచాం. కనుక వారి అభ్యర్థనపై ఆలోచించాం. అయినా కాల్పులకు కేవలం విరామం మాత్రమే ఇచ్చాం. ఎలాంటి కవి్వంపులకు దిగినా పాక్‌కు మరోసారి బుద్ధి చెప్పేందుకు మన సైన్యం, వైమానిక, నావికా దళాలు, బీఎస్ఎఫ్ సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. ఐక్యతే మన శక్తి ఉగ్రవాదాన్ని ఇకముందు ఏమాత్రమూ సహించేది లేదు. మన ఐక్యతే దానికి మరణశాసనం. అదే మన అతిపెద్ద శక్తి. ఇది యుద్ధాల యుగం కాదు. నిజమే. కానీ ఉగ్రవాద యుగం కూడా కాదని ప్రపంచమంతా ఒక్కతాటిపైకి వచ్చి స్పష్టమైన సందేశమివ్వాలి. 21వ శతాబ్దపు అధునాతన యుద్ధ రీతులతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే మెరుగైన సమాజానికి బాటలు పరిచిన వాళ్లమవుతాం.’’ పీఓకేను అప్పగించాల్సిందే ఏ చర్చలైనా ఆ అంశంపైనే ఉగ్రవాదంపై భారత వైఖరి సుస్పష్టమని మోదీ చెప్పారు. ‘‘ఉగ్రవాదం, వాణిజ్యం, చర్చలు ఏకకాలంలో కొనసాగలేవు. నీళ్లు, రక్తం కలసికట్టుగా పారడం జరగని పని’’ అని స్పష్టం చేశారు. తద్వారా ఉగ్రవాదానికి పాక్ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేదాకా ఆ దేశంపై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు, సింధూ జలాల ఒప్పందం నిలిపివేత తదితర చర్యలు కొనసాగుతాయని చెప్పకనే చెప్పారు. ‘‘ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించి తీరాల్సిందే. పాక్‌తో ఏ చర్చలైనా కేవలం ఈ రెండు అంశాలపైనే జరుగుతాయి. పాక్‌తో పాటు ప్రపంచ దేశాలకు కూడా ఈ విషయం స్పష్టం చేస్తున్నా’’ అంటూ ప్రధాని కుండబద్దలు కొట్టారు. శక్తితోనే శాంతి ‘‘నేను బుద్ధపూర్ణిమ. ప్రపంచానికి బుద్ధుడు చూపిన శాంతిమార్గం కూడా శక్తి గుండానే సాగుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. ‘ప్రతి భారతీయుడూ శాంతియుతంగా జీవించాలి. వికసిత భారత స్వప్నం సాకారం కావాలి. అందుకు భారత్ శక్తిమంతమైన దేశంగా మారడం తప్పనిసరి. ఆ శక్తిని అవసరమైనప్పుడు ప్రదర్శించి చూపాలి. గత కొద్ది రోజులుగా మనం చేసింది సరిగ్గా అదే. ఆ యజ్ఞంలో భాగస్వాములైన సైనిక బలగాలకు, నిఘా వర్గాలకు, శాస్త్రవేత్తలకు అందరికీ ప్రతి భారతీయుని తరఫునా నా సెల్యూట్. -
భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్
వాషింగ్టన్: భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపా. అణుయుద్ధం జరిగి ఉంటే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారు. అందుకే అణుయుద్ధాన్ని ఆపేలా భారత్-పాక్‌లపై ఒత్తిడి తెచ్చా. యుద్ధం కొనసాగిస్తామంటే మీతో వ్యాపారం చేయనని చెప్పా. దీంతో ఆ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దాయాది దేశాల కాల్పుల విరమణ క్రెడిట్ నాదే’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు యుద్ధం విషయంలో ప్రస్తుతం భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ చెప్పారు. త్వరలో పాక్‌తో కూడా మాట్లాడుతానని వివరించారు. #WATCH | US President Donald Trump says, "...I'm very proud to let you know that the leadership of Indian and Pakistan was unwavering and powerful, but unwavering in both cases - they really were from the standpoint of having the strength and the wisdom and fortitude to fully… pic.twitter.com/rFbznHMJDF— ANI (@ANI) May 12, 2025 -
పాకిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం
పాకిస్థాన్‌లో ఇవాళ మధ్యాహ్నం మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉన్నప్పటికి పలు ప్రాంతాల్లో భారీగా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. భూకంప కేంద్రం తజికిస్తాన్లోని అష్కాషెమ్కు పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఎన్సీఎస్ తెలిపింది.కాగా, అంతకుముందు.. ఈ నెల 10న భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. 4.0 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆందోళనకు గురైన పాకిస్థాన్ ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. తాజాగా, మరో భూకంపం రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎన్సీఎస్ నివేదిక ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని.. 29.67 డిగ్రీల ఉత్తర అక్షాంశం... 66.10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద నమోదైంది. -
పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి.. పలువురు పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. దాయాది దేశం పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్లో తాజాగా ఆత్మాహుతి దాడి ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పాకిస్తాన్ పోలీసులు మృతిచెందగా.. పలువురు గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. An explosion near Ring Road, Mal Mandi in Peshawar, the capital of Khyber Pakhtunkhwa, leaves two dead and three injured. pic.twitter.com/oIwp31n0Sq— Aftab Mohmand (@AftabMohmand101) May 12, 2025 -
ట్రంప్ ఖతార్ పర్యటన.. భారీ బహుమతి రెడీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖతార్ భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని ట్రంప్‌కు బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఖతార్‌కు వచ్చినపుడు ఈ కానుకను ప్రకటించే అవకాశముంది. దీనిపై ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారంలో మధ్యప్రాచ్య పర్యటనకు వెళ్లనున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్.. ఖతార్ పాలక కుటుంబం నుంచి విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని బహుమతిగా స్వీకరించనున్నట్లు సమాచారం. ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఖతార్‌కు వచ్చినపుడు ఈ కానుకను ప్రకటించే అవకాశముంది. దీనిపై ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఒక విదేశీ ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద కానుకను అమెరికా అధ్యక్షుడు స్వీకరించడం, దాని చట్టబద్ధతపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.Qatar to Gift $400 Million Plane to President Trump:▪️According to ABC News, the Trump administration is set to accept a luxury Boeing 747-8 jumbo jet—valued at around $400 million—from the Qatari royal family.▪️The plane will serve as Air Force One for Trump until just… pic.twitter.com/d1H7OdyNmD— Beau Bannon🇺🇸 (@BeauBannon) May 11, 2025అయితే, విదేశీ ప్రభుత్వం నుండి ఇంత పెద్ద బహుమతిని అధ్యక్షుడు స్వీకరించడంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అమెరికా రాజ్యాంగంలోని జీతాల నిబంధన, ఆర్టికల్ I, సెక్షన్ 9, క్లాజ్ 8, ప్రభుత్వ పదవిలో ఉన్న ఎవరైనా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏదైనా.. రాజు, యువరాజు లేదా విదేశీ రాష్ట్రం.. నుండి ఏదైనా బహుమతి, జీతం, కార్యాలయం లేదా బిరుదును స్వీకరించడాన్ని నిషేధిస్తుంది. ఈ నేపథ్యంలో, అమెరికా అధికారులు దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్‌ఫోర్స్ వన్) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీ విరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్ ‘ఎయిర్‌ఫోర్స్ వన్’కు కొత్త వెర్షనుగా ఉపయోగిస్తారు. సురక్షితమైన కమ్యూనికేషన్లు, ఇతర అవసరమైన సౌకర్యాలు జోడించాలని యోచిస్తున్నారు. -
అవును.. మా యుద్ద విమానం ధ్వంసమైంది: పాక్ అధికారిక ప్రకటన
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. భారత ముప్పెట దాడి చేస్తూ పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ యుద్ధ విమానంపై అటాక్ చేయడంతో అది ధ్వంసమైంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారి ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు.పాకిస్తాన్ సైన్యం, వైమానిక దళం, నావికాదళ సీనియర్ అధికారులు ఆదివారం అర్ధరాత్రి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల భారత్ జరిపిన దాడిలో పాకిస్తాన్ యుద్ధ విమానం ధ్వంసమైందని అధికారికంగా ప్రకటించారు. భారత్ దాడులను ఎదుర్కొనే క్రమంలో ఇలా జరిగిందన్నారు. అయితే నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే, భారత్-పాకిస్తాన్ మధ్య శనివారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ ప్రకటన చేయడం గమనార్హం.ఇదే సమయంలో భారత పైలట్.. పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడ్డారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చౌదరి స్పందించారు. ఇది ఫేక్ వార్త అని ఖండించారు. భారత్ పైలట్ ఎవరూ తమ ఆధీనంలో లేరని స్పష్టం చేశారు. అలాగే, భారత్ దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చారు. పాక్‌ను దెబ్బకొట్టాం..మరోవైపు.. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సాధించిన విజయాలను మన సైన్యం ఆదివారం వెల్లడించిన విషయం తెలిసిందే. పాక్ విమానాలను నేల కూల్చామని ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి తెలిపారు. అయితే, ఆ సంఖ్య ఎంత అన్నది ఆయన చెప్పలేదు. ‘‘మన సరిహద్దు లోపలికి పాక్ యుద్ధవిమానాలను రాకుండా నిరోధించాం. కాబట్టి వాటి శకలాలు మా దగ్గర లేవు. కాకపోతే కచ్చితంగా కొన్ని విమానాలను కూల్చాం’’ అని తెలిపారు.బ్రహ్మోస్ సూపర్ పవర్..ఇదిలా ఉండగా.. భారత్, పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్నువిరిచేలా చేసింది. తన అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో.. అప్పటి వరకూ అణ్వాయుధాలున్నాయంటూ ప్రగల్బాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకుపుట్టింది. మొత్తం పరిస్థితే మారిపోయింది. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా.. పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలోని ఆ దేశ ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున భారత్ లక్ష్యంగా ఎంచుకున్న పాక్‌లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్ ఖాన్ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైనది. ఇక్కడ గగనతల రీఫ్యూయలర్ ట్యాంకర్ విమానాలు, భారీ రవాణా విమానాలు ఉన్నాయి. అప్పటికే పాకిస్థాన్ సైన్యం దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్-11 బాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు... గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400తో మధ్యలోనే పేల్చివేసింది. శుక్రవారం అర్ధరాత్రి శ్రీనగర్ నుంచి నలియా వరకు 26 లక్ష్యాలపైకి పాక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా వాటన్నింటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. -
నక్షత్రాన్నే నమిలేస్తూ.. మింగేస్తూ.. అదృశ్యం చేస్తున్న మహా కృష్ణబిలం
నక్షత్రం అంటేనే అంతులేని ఉష్ణంతో, దేదీప్యమానంగా వెలిగిపోతూ వందల కోట్ల కిలోమీటర్ల దాకా కాంతిని వెదజల్లే శక్తియంత్రం. అలాంటి నక్షత్రాన్ని అరటిపండులా అమాంతం మింగేస్తున్న రాకాసి కృష్ణబిలం జాడను అత్యంత అధునాతన హబుల్ టెలిస్కోప్ కనిపెట్టింది. నక్షత్రం మొత్తాన్ని తనలో కలిపేసుకుంటున్న ఈ బ్లాక్çహోల్ మిగతా కృష్ణబిలాల్లా నక్షత్రమండలం(గెలాక్సీ) కేంద్రస్థానంలో కాకుండా కోట్ల కోట్ల కిలోమీటర్ల దూరంగా ఉండటం మరో విశేషం.గెలాక్సీ మధ్యలో కాకుండా చాలా దూరంగా సైతం భారీ కృష్ణబిలాలు మనగల్గుతాయని, వాటి అపారమైన గురుత్వాకర్షణ బలాలు సమీప స్టార్లనూ సమాధి చేస్తాయని తొలిసారిగా వెల్లడైంది. సాధారణంగా నక్షత్రాలను కృష్ణబిలం తనలో కలిపేసుకునే (టైడల్ డిస్ట్రప్షన్ ఈవెంట్–టీడీఈ) దృగ్విషయం గెలాక్సీ మధ్యలో చోటుచేసుకుంటుంది. కానీ ఇలా టీడీఈ అనేది గెలాక్సీ మధ్యలో కాకుండా వేరే చోట సంభవించడాన్ని తొలిసారిగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి ‘ఏటీ2024టీవీడీ’అని పేరు పెట్టారు. మింగేస్తున్న ఈ కృష్ణబిలం ద్రవ్యరాశి ఆ అంతర్థానమవుతోన్న నక్షత్రం ద్రవ్యరాశికంటే ఏకంగా 10 కోట్ల రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. నక్షత్రమండలం కేంద్రస్థానం చుట్టూ తిరిగే ఏదైనా నక్షత్రం అనుకోకుండా కృష్ణబిలం చెంతకు వచి్చనప్పుడు మాత్రమే అక్కడ బ్లాక్‌హోల్ ఉందనే విషయం తెలుస్తుంది.బ్లాక్ తాను మింగేసే ఖగోళ వస్తువును ఉన్నది ఉన్నట్లుగాకాకుండా ఆకారాన్ని నూడుల్స్‌లాగా సాగదీసి సాగదీసి లోపలికి లాగేసుకుంటుంది. ఈ ప్రక్రియనే స్పాగెటిఫికేషన్ అంటారు. తాజాగా నక్షత్రాన్ని మింగేస్తున్న క్రమంలోనే ఈ కృష్ణబిలం ఉనికి వెలుగులోకి వచ్చింది. అమెరికా శాండిగోలోని పాలోమార్ అబ్జర్వేటరీలోని ఆప్టికల్ కెమెరా తొలిసారిగా దీనిని గుర్తించింది. ఈ బ్లాక్‌హోల్ మన భూమికి ఏకంగా 60 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. హబుల్ టెలిస్కోప్ దీనిపై మరింత పరిశోధన చేసింది. సాధారణంగా కృష్ణబిలంలోకి నక్షత్రం లాగబడే క్రమంలో ఆ నక్షత్రం ఊహించనంత స్థాయిలో అతినీలలోహిత కాంతిని బయటకు వెదజల్లుతుంది. తర్వాత బ్లాక్‌హోల్ లోపలికి వెళ్లిపోయి ఆ స్టార్ అంతర్థానమవుతుంది. కేంద్రం నుంచి ఎంతో దూరంలో బ్లాక్‌హోల్ ఈ బ్లాక్‌హోల్ తనకు ఆశ్రయం ఇచ్చిన నక్షత్రమండలానికి సంబంధించిన కేంద్రస్థానంలో ఉండకుండా ఏకంగా 2,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీంతో కేంద్రస్థానంలోని బ్లాక్‌హోల్స్ కంటే ఇది భిన్నంగా ప్రవర్తిస్తుందేమో అని తెల్సుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రంగంలోకి దిగింది. ఈ కృష్ణబిలంపై ఓ కన్నేశామని చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీ, నేషనల్ రేడియో ఆస్ట్రోనమీ అబ్జర్వేటరీలోని వెరీ లార్జ్ అరే రేడియో టెలిస్కోప్ పరిశోధకుల బృందాలు తెలిపాయి.రెండు గెలాక్సీల విలీనం తర్వాత ఇలాంటి కృష్ణబిలాలు ఇలా సుదూరంగా మిగిలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. లేదంటే రెండు అయస్కాంతాల తరహాలో రెండు కృష్ణబిలాల వ్యతిరేక బలాల వల్ల ఇది సుదూరంగా నెట్టివేయబడి ఉండొచ్చని ఇంకొందరు అధ్యయనకారులు అంచనావేస్తున్నారు. ‘‘కేంద్రస్థానంలో స్థిరంగా ఉండిపోకుండా ఇలా సంచార జీవిలా ఎక్కడో మౌనంగా ఉన్న ఇలాంటి కృష్ణబిలాలు కొత్త తరహా పరిశోధనలకు సాయపడతాయి’’అని బెర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలో సంబంధిత పరిశోధనలో ప్రధాన రచయిత, ఖగోళశాస్త్రంలో పోస్ట్ డాక్టోరల్ యుహాన్ యాఓ చెప్పారు. త్వరలో అందుబాటులోకి రానున్న వెరీ సి.రూబిన్ అబ్జర్వేటరీ సాయంతో ఇలాంటి ఖగోళ వింతలను మరింత పరిశోధన జరగనుంది. -
అండమాన్ సమీపంలో కూలిన ‘కాస్మోస్’
న్యూఢిల్లీ: సోవియట్ యూనియన్ హయాంలో 53 ఏళ్ల క్రితం ప్రయోగించిన అంతరిక్ష నౌక తన ప్రస్థానాన్ని ముగించుకుంది. విఫలమైన ‘కాస్మోస్ 482’శనివారం ఉద యం భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అండమాన్ దీవికి పశ్చిమాన 560 కిలోమీటర్ల దూరంలో హిందూ మహా సముద్రంలో పడిపోయింది. కాస్మోస్ కారణంగా ఎవరికీ ఎటువంటి అపాయం కలగలేదని రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ ప్రకటించింది. దీని గమనాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఈయూ స్పేస్ సర్వైలెన్స్ ట్రాకింగ్ నెట్వర్క్ సహా పలు అంతరిక్ష సంస్థలు దగ్గర్నుంచి పరిశీలిస్తూ వస్తున్నాయి. ఇటీవల ఇది భూ వాతావరణంలో ప్రవేశించినట్లు జర్మన్ రాడార్ స్టేషన్ గుర్తించిన విషయాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అత్యంత వేడి వాతావరణంతో ఉండే శుక్రగ్రహం లక్ష్యంగా ప్రయోగించిన గోళా కార 500 కిలోల ‘కాస్మోస్’కు టైటానియంతో కూడిన రక్షణ కవచం ఉంది. అందుకే ఇది భూవాతావరణంలో ప్రవేశించాక మండిపోకుండా యథాతథంగా పడిపోయింది. అంతర్జాతీయ అంతరిక్ష నిబంధనల ప్రకారం.. కాస్మోస్ శకలాలు రష్యాకే చెందుతాయి. ఒక వేళ భూమిపై పడినా దీనితో ప్రమాదం కలిగే అవకాశాలు చాలా తక్కువని నిపు ణులు తెలిపారు. కాస్మోస్తో భూమ్మీదున్న ప్రతి 10 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే ప్రమాదం సంభవిస్తుందని ఏరోస్పేస్ కార్పొరేషన్ అంచనా వేసింది. -
నక్షత్రాన్నే నమిలేస్తూ.. మింగేస్తూ
నక్షత్రం అంటేనే అంతులేని ఉష్ణంతో, దేదీప్యమానంగా వెలిగిపోతూ వందల కోట్ల కిలోమీటర్ల దాకా కాంతిని వెదజల్లే శక్తియంత్రం. అలాంటి నక్షత్రాన్ని అరటిపండులా అమాంతం మింగేస్తున్న రాకాసి కృష్ణబిలం జాడను అత్యంత అధునాతన హబుల్ టెలిస్కోప్ కనిపెట్టింది. నక్షత్రం మొత్తాన్ని తనలో కలిపేసుకుంటున్న ఈ బ్లాక్‌హోల్ మిగతా కృష్ణబిలాల్లా నక్షత్రమండలం(గెలాక్సీ) కేంద్రస్థానంలో కాకుండా కోట్ల కోట్ల కిలోమీటర్ల దూరంగా ఉండటం మరో విశేషం. గెలాక్సీ మధ్యలో కాకుండా చాలా దూరంగా సైతం భారీ కృష్ణబిలాలు మనగల్గుతాయని, వాటి అపారమైన గురుత్వాకర్షణ బలాలు సమీప స్టార్లనూ సమాధి చేస్తాయని తొలిసారిగా వెల్లడైంది. సాధారణంగా నక్షత్రాలను కృష్ణబిలం తనలో కలిపేసుకునే (టైడల్ డిస్ట్రప్షన్ ఈవెంట్–టీడీఈ) దృగ్విషయం గెలాక్సీ మధ్యలో చోటుచేసుకుంటుంది. కానీ ఇలా టీడీఈ అనేది గెలాక్సీ మధ్యలో కాకుండా వేరే చోట సంభవించడాన్ని తొలిసారిగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి ‘ఏటీ2024టీవీడీ’అని పేరు పెట్టారు. మింగేస్తున్న ఈ కృష్ణబిలం ద్రవ్యరాశి ఆ అంతర్థానమవుతోన్న నక్షత్రం ద్రవ్యరాశికంటే ఏకంగా 10 కోట్ల రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. నక్షత్రమండలం కేంద్రస్థానం చుట్టూ తిరిగే ఏదైనా నక్షత్రం అనుకోకుండా కృష్ణబిలం చెంతకు వచ్చినప్పుడు మాత్రమే అక్కడ బ్లాక్‌హోల్ ఉందనే విషయం తెలుస్తుంది. బ్లాక్ తాను మింగేసే ఖగోళ వస్తువును ఉన్నది ఉన్నట్లుగాకాకుండా ఆకారాన్ని నూడుల్స్‌లాగా సాగదీసి సాగదీసి లోపలికి లాగేసుకుంటుంది. ఈ ప్రక్రియనే స్పాగెటిఫికేషన్ అంటారు. తాజాగా నక్షత్రాన్ని మింగేస్తున్న క్రమంలోనే ఈ కృష్ణబిలం ఉనికి వెలుగులోకి వచ్చింది. అమెరికా శాండిగోలోని పాలోమార్ అబ్జర్వేటరీలోని ఆప్టికల్ కెమెరా తొలిసారిగా దీనిని గుర్తించింది. ఈ బ్లాక్‌హోల్ మన భూమికి ఏకంగా 60 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. హబుల్ టెలిస్కోప్ దీనిపై మరింత పరిశోధన చేసింది. సాధారణంగా కృష్ణబిలంలోకి నక్షత్రం లాగబడే క్రమంలో ఆ నక్షత్రం ఊహించనంత స్థాయిలో అతినీలలోహిత కాంతిని బయటకు వెదజల్లుతుంది. తర్వాత బ్లాక్‌హోల్ లోపలికి వెళ్లిపోయి ఆ స్టార్ అంతర్థానమవుతుంది. కేంద్రం నుంచి ఎంతో దూరంలో బ్లాక్‌హోల్ ఈ బ్లాక్‌హోల్ తనకు ఆశ్రయం ఇచ్చిన నక్షత్రమండలానికి సంబంధించిన కేంద్రస్థానంలో ఉండకుండా ఏకంగా 2,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీంతో కేంద్రస్థానంలోని బ్లాక్‌హోల్స్ కంటే ఇది భిన్నంగా ప్రవర్తిస్తుందేమో అని తెల్సుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రంగంలోకి దిగింది. ఈ కృష్ణబిలంపై ఓ కన్నేశామని చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీ, నేషనల్ రేడియో ఆస్ట్రోనమీ అబ్జర్వేటరీలోని వెరీ లార్జ్ అరే రేడియో టెలిస్కోప్ పరిశోధకుల బృందాలు తెలిపాయి. రెండు గెలాక్సీల విలీనం తర్వాత ఇలాంటి కృష్ణబిలాలు ఇలా సుదూరంగా మిగిలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. లేదంటే రెండు అయస్కాంతాల తరహాలో రెండు కృష్ణబిలాల వ్యతిరేక బలాల వల్ల ఇది సుదూరంగా నెట్టివేయబడి ఉండొచ్చని ఇంకొందరు అధ్యయనకారులు అంచనావేస్తున్నారు. ‘‘కేంద్రస్థానంలో స్థిరంగా ఉండిపోకుండా ఇలా సంచార జీవిలా ఎక్కడో మౌనంగా ఉన్న ఇలాంటి కృష్ణబిలాలు కొత్త తరహా పరిశోధనలకు సాయపడతాయి’’అని బెర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలో సంబంధిత పరిశోధనలో ప్రధాన రచయిత, ఖగోళశాస్త్రంలో పోస్ట్ డాక్టోరల్ యుహాన్ యాఓ చెప్పారు. త్వరలో అందుబాటులోకి రానున్న వెరీ సి.రూబిన్ అబ్జర్వేటరీ సాయంతో ఇలాంటి ఖగోళ వింతలను మరింత పరిశోధన జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముందు కాల్పుల విరమణ
మాస్కో/కీవ్: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో 30 రోజులపాటు సంపూర్ణ, బేషరతు కాల్పుల విరమణ పాటించాలని యూరప్ ప్రధాన దేశాల నేతలు ఇచ్చిన పిలుపుపై రష్యా అధ్యక్షుడు పుతిన్ శనివారం రాత్రి స్పందించారు. ఎలాంటి షరతులు లేకుండా తుర్కియేలోని ఇస్తాంబుల్ వేదికగా ఉక్రెయిన్‌తో తక్షణమే ముఖాముఖి చర్చలకు తాము సిద్ధమని ప్రకటించారు. చర్చల సమయంలో కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశముంటుందని పుతిన్ పేర్కొన్నారు. అయితే, కాల్పుల విరమణను ముందుగా అమల్లోకి వచ్చాకే చర్చలకు కూర్చుందామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం స్పష్టం చేశారు. కాల్పుల విరమణ చర్చలకు సానుకూల సంకేతమని తెలిపారు. దీని కోసమే యావత్ ప్రపంచం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కాగా, పుతిన్ ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం ప్రకటించారు. ‘ఈ ప్రతిపాదన రెండు దేశాలకూ మంచిదే. చర్చలకు అవకాశం కల్పించేందుకు రెండు దేశాలతోనూ కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా’అని పేర్కొన్నారు. -
‘నూర్ఖాన్’ నేలమట్టం
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌పై భారత్ చేస్తున్న మెరుపుదాడుల్లో ఆ దేశ వైమానిక స్థావరాలు నేలమట్టమవుతున్నాయి. తాజాగా ఇస్లామాబాద్, రావల్పిండి జంట నగరాల సమీపంలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం మీదా భారత్ దాడులు చేసిన విషయం తాజాగా చైనా ఉపగ్రహ చిత్రాలతో స్పష్టమైంది. చైనాకు చెందిన కృత్రిమ ఉపగ్రహాల సంస్థ ‘మిజాజ్విజన్’ తీసిన తాజా శాటిలైట్ ఫొటోలు భారత దాడి తీరును బహిర్గతం చేశాయి. ఇప్పటికే రఫీఖీ, మురీద్, నూర్ ఖాన్, ఛునియన్, సుక్కూర్‌లలో వైమానిక స్థావరాలపై దాడి చేసినట్లు భారత్ ప్రకటించింది. ఈ దాడులను పాకిస్తాన్ సైతం ధృవీకరించింది. రావల్పిండిలోని నూర్‌ఖాన్‌తోపాటు ఛక్వాల్‌లోని మురీద్ స్థావరం, పంజాబ్ ప్రావిన్స్‌లోని ఝంగ్ జిల్లాలోని రఫీఖీ బేస్‌పైనా బాంబులు పడ్డాయని పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మెద్ షరీఫ్ వెల్లడించారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు అత్యంత సమీపంలోని నూర్ఖాన్ బేస్ ఆ దేశానికి చాలా కీలకమైన వైమానిక స్థావరం. ఇక్కడ చాలా ప్రధానమైన స్క్వాడ్రాన్లు ఉంటాయి. సైనిక, సరకు రవాణా సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. సీ–130 హెర్క్యులస్, సాబ్ –2000 సైనిక ఉపకరణాల రవాణా విమానాలను ఇక్కడే నిలిపి ఉంచుతారు. గాల్లోనే విమానాలకు ఇంధనాన్ని నింపే ఐఎల్–78 వంటి రీఫ్యూయిలర్ విమానాలతోపాటు పాక్‌లోని వీవీఐపీలకు సంబంధించిన చిన్న విమానాలకూ ఇదే కీలక స్థావరం. -
మధ్యవర్తిత్వం ప్రసక్తే లేదు
న్యూఢిల్లీ/న్యూయార్క్/వాషింగ్టన్: రావణకాష్టంగా రగిలిపోతున్న, దశాబ్దాలుగా ఎటూ తేలకుండా సందిగ్ధత, సంఘర్షణలకు కారణమైన జమ్మూకశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అక్కర్లేదని భారత్ పునరుద్ఘాటించింది. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ఆసక్తి కనబరుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఆదివారం స్పందించింది. ‘‘కశ్మీర్‌పై మాకు స్పష్టమైన విధానం ఉంది. చర్చలంటూ జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించడం గురించే. అంతకంటే మాట్లాడేది ఏదీ లేదు. ఉగ్రవాదుల అప్పగింత గురించి పాక్ మాట్లాడదల్చుకుంటే సిద్ధంగా ఉన్నాం. అంతకు మించి మాట్లాడటానికి మరో టాపికేమీ లేదు. ఇతర అంశాలపై ఇతరుల మధ్యవర్తిత్వం ఆశించట్లేము. ఇతరులు మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు’’ అని ప్రకటించింది. జేజేలు అంటూనే జోక్యానికి యత్నం కాల్పుల విరమణకు ముందడుగు వేసి అత్యంత యుక్తితో వ్యవహరించిన శక్తివంతమైన భారత్, పాక్ అగ్రనాయకత్వాలను చూసి ఎంతో గరి్వస్తున్నానని ఓవైపు పొగుడుతూనే మరోవైపు కశ్మీర్ అంశంలో మధ్యవర్తిగా నిలబడతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అసలు ఉద్దేశ్యాన్ని బయటపెట్టారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌చేశారు. ‘‘ ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించుకోకపోతే వినాశనం తప్పదని భవిష్యత్ దర్శనం చేసి కాల్పుల విరమణకు మొగ్గుచూపిన భారత్, పాక్ నాయకత్వాలను చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. అయితే దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండి పోయిన కశ్మీర్ అంశానికి పరిష్కారం కనుగొనేందుకు మీ రెండు దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ జోక్యాన్ని స్వాగతించిన పాక్ మధ్యవర్తిగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ స్పందించింది. ‘‘ కాల్పుల విరమణ అంశంలో మధ్యవర్తిగా వ్యవహరించి నిర్మాణాత్మక పాత్ర పోషించినందుకు అమెరికాను అభినందిస్తున్నాం. ఇక జమ్మూకశ్మీర్ వివాద పరిష్కారానికి కృషిచేస్తానని ట్రంప్ ప్రకటన చేయడం ఎంతో సంతోషకరం. ఆయన సుముఖత వ్యక్తంచేయడాన్ని మేం అభినందిస్తున్నాం’’ అని పాకిస్తాన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
పాక్‌ను చావుదెబ్బ కొట్టాం రాజధానిపైనే దాడి చేశాం
న్యూఢిల్లీ: త్రివిధ బలగాలు నాలుగు రోజుల పాటు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో పాకిస్తాన్ కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నట్టు భారత సైన్యం వెల్లడించింది. పాక్ సైన్యం అత్యంత తీవ్రస్థాయిలో నష్టాలు చవిచూసిందని తెలిపింది. ఇకముందు కూడా పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమని స్పష్టం చేసింది. ‘‘పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. కానీ గంటల్లోనే ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం కాల్పులు, దాడులకు దిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే మన ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది. మన బలగాలు అందుకు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు దీటుగా స్పందించేందుకు బలగాలకు సైన్యాధ్యక్షుడు పూర్తి అధికారాలిచ్చారు’’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ప్రకటించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్(డీజీఏఓ) ఎయిర్ మార్షల్ ఏకే భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్(డీజీఎన్‌ఓ) వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్‌తో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్, తదనంతరం సరిహద్దు రాష్ట్రాలపై పాక్ దాడులు, మన సైనిక ప్రతిచర్య తదితరాల అంశాలను కూలంకషంగా వివరించారు. మొత్తం ఆపరేషన్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులైనట్లు వెల్లడించారు. అమర జవాన్లకు, పాక్ మతిలేని దాడుల్లో దుర్మరణం పాలైన భారత పౌరులకు ఘనంగా నివాళులు అరి్పంచారు. సైనిక ఆపరేషన్ల గురించి త్రివిధ దళాల అత్యున్నతాధికారులు ఇలా సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించడం అత్యంత అరుదు కావడం విశేషం. ఆ ముష్కరులు హతం ‘‘పలు అత్యాధునిక పాక్ యుద్ధ విమానాలను నేలకూల్చాం. మనకున్న సమాచారం మేరకే 40 మందికి పైగా పాక్ సైనికులు మరణించారు. 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో కరడుగట్టిన ఉగ్రవాదులు యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ తదితరులు ఉన్నారు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసినవారు, 2019లో పుల్వామా దాడికి పాల్పనవారు మరణించారు. పాక్, పీఓకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ ఉగ్రవాద శిక్షణ పొందిన కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు కూతవేటు దూరంలోని అతి కీలకమైన చక్లాలా సహా ప్రధాన వైమానిక స్థావరాలన్నీ మన దాడుల్లో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. లాహోర్ తదితర సైనిక స్థావరాల్లోని కీలక రాడార్ వ్యవస్థలు నేలమట్టమయ్యాయి. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు’’ అని డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ వివరించారు. ఇకపై తమ భూభాగంలో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని పాకిస్తాన్‌కు పూర్తిస్థాయిలో తెలిసొచ్చిందన్నారు. ‘‘మనం ఎంతో సంయమనం పాటించాం. కేవలం పాక్ ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని కచ్చితత్వంతో కూడిన దాడులు చేశాం. సామాన్య ప్రజల నివాసాలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తపడ్డాం. మన దేశ సార్వ¿ౌమత్వం ప్రాదేశిక సమగ్రతకు, పౌరుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లినా నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తాం’’ అని ఉద్ఘాటించారు. పాకిస్తాన్ డీజీఎంఓ శనివారం మధ్యాహ్నం తనతో మాట్లాడారని, దాడులు ఆపాలని కోరారని తెలిపారు. ఉగ్రవాద క్యాంపులు భస్మీపటలం పాక్ దాడుల్లో భారత్ కూడా యుద్ధ విమానాలు నష్టపోయిందా అని ప్రశ్నించగా, యుద్ధంలో కొన్ని నష్టాలు సహజమని ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి బదులిచ్చారు. అయితే, ‘‘లక్ష్యాలన్నీ సాధించాం. మన పైలెట్లంతా సురక్షితంగా తిరిగొచ్చారు’’ అని చెప్పారు. ‘‘పాక్ యుద్ధ విమానాలు మన భూభాగంలోకి ప్రవేశించకుండా తిప్పికొట్టాం. అయితే, కచ్చితంగా ఎన్ని యుద్ధ విమానాలు కూల్చేశామన్నది ఇప్పుడే బయటపెట్టలేం. పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు, కమాండ్ సెంటర్లు, సైనిక మౌలిక సదుపాయాలు, గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేశాం. పాక్ రాజధాని ఇస్లామాబాద్ దాకా చొచ్చుకెళ్లాం. అక్కడ వైమానిక స్థావరాన్ని నేలమట్టం చేశాం. ఉగ్రవాదుల క్యాంప్‌లను నామరూపాల్లేకుండా చేయాలన్న లక్ష్యం ఇప్పటికే సాధించాం. ఈ ఫలితాలు మొత్తం ప్రపంచానికి అనుభవంలోకి వస్తాయి’’ అని ఎ.కె.భారతి స్పష్టం చేశారు. పాక్ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టాన్ని ఫొటోల సాయంతో వివరించారు.పాక్ హార్బర్లకు తీవ్ర నష్టం ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా సముద్రంతోపాటు భూఉపరితలంపై నిర్దేశిత లక్ష్యాలపై కచ్చితత్వంతో కూడిన దాడులు చేశామని వైస్ అడ్మిరల్ ఎ.ఎన్.ప్రమోద్ చెప్పారు. పాకిస్తాన్లో ప్రధానమైన కరాచీలోనూ దాడులు జరిగాయని తెలిపారు. ‘‘పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం మేము అప్రమత్తమయ్యాం. అరేబియా సముద్రంలో లైవ్–ఫైరింగ్ డ్రిల్స్, లాంచ్ టెస్టులు, కాంబాట్ ఆపరేషన్ డ్రిల్స్ నిర్వహించాం. పాకిస్తాన్ ముష్కరులకు గుణపాఠం నేర్పాలన్న లక్ష్యంతో మా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. మన సైనిక దళాలు అరేబియా సముద్రంలో నిత్యం అప్రమత్తంగా ఉన్నాయి. ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురైనా ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాం. పాకిస్తాన్ సైన్యం దాడులను గట్టిగా తిప్పికొట్టాం. పాక్ నావికాదళంపై మన నావికాదళం పైచేయి సాధించింది. పాక్ ఎత్తుగడలు గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాం. ఇండియన్ నేవీ దాడుల్లో పాక్ హార్బర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాక్ చర్యల పట్ల మన ప్రతిస్పందన దీటుగా, ప్రణాళికాబద్ధంగా సాగింది’’ అని ఎ.ఎన్.ప్రమోద్ స్పష్టం చేశారు. -
పాక్ తూటాలకు... క్షిపణులతో బదులివ్వండి
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ ప్రతిస్పందన ఇకపై సరికొత్త రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ‘‘పాక్‌తూటాలకు కచ్చితంగా క్షిపణులతో సమాధానం చెప్పండి. అది చేపట్టే ఒక్కో దుశ్చర్యకూ కలలో కూడా ఊహించనంత బలంగా బదులివ్వండి’’ అని సైనిక దళాలను ఆదేశించాశారు. త్రివిధ దళాల అధినేతలతో ఆయన ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై విస్తృతంగా చర్చించారు. పాక్ దాడులను సహించడానికి ఏ మాత్రమూ వీల్లేదంటూ మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై, ముష్కరులపై ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చెల్లించాల్సిన మూల్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కశ్మీర్ అంశంలో విదేశీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేది లేదని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌తో జరిగే ఏ చర్చలైనా సరే కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను, పాక్‌లో దాక్కున్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించడంపైనే ఉంటాయని కేంద్రం తేల్చిచెప్పింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న పీఓకేను, ఉగ్రవాద మూకలను భారత్‌కు అప్పగించాల్సిందేనని, పాక్‌కు మరో గత్యంతరం లేదని స్పష్టం చేసింది. ‘‘ఆ దేశంతో చర్చలు వీటిపై మాత్రమే జరుగుతాయి. అది కూడా కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయిలో మాత్రమే కొనసాగుతాయి’’ అని కేంద్రం ఉద్ఘాటించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా ఉగ్రవాదుల అప్పగింతపై తప్ప మరో అంశంపై చర్చించే ప్రసక్తే లేదని తెలిపింది. ఉగ్రవాదానికి పాక్ మద్దతు కొనసాగుతున్నంత కాలం సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం తథ్యమని పేర్కొంది. విదేశాంగ మంత్రులు, లేదా జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరగాలని పాక్ ప్రతిపాదిస్తుండగా అందుకు భారత్‌కు అంగీకరించడం లేదు.దాడి చేస్తే గట్టిగా ఎదురుదెబ్బజేడీ వాన్స్‌కు మోదీ స్పష్టీకరణ న్యూఢిల్లీ/వాషింగ్టన్: పాకిస్తాన్ ఒకవేళ భారత్‌పై మళ్లీ దాడికి దిగితే అంతకంటే గట్టిగానే ఎదురుదెబ్బ తీస్తామని అమెరికాకు మోదీ తేల్చిచెప్పారు. తమ ప్రతిస్పందన అత్యంత తీవ్రస్థాయిలో, దాయాదికి వినాశకరంగా ఉంటుందని స్పష్టంచేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం మోదీతోఫోన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి ప్రస్తావించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌తో కూడా వాన్స్ చర్చించారు. పాక్ కాల్పులు ఆపితేనే సంయమనం పాటిస్తామని అమెరికాకు భారత్ తేల్చిచెప్పినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత్–పాక్ ఘర్షణల గురించి అమెరికా నిఘా వర్గాల నుంచి ఆందోళనకరమైన సమాచారం అందిన కారణంగానే మోదీ తో వాన్స్ మాట్లాడారని సమాచారం. సున్నితమైన అంశం కావడంతో బయటకు వెల్లడించలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ పాక్ దాడులను తిప్పికొట్టాలని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆదేశం న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం దాడులకు దిగితే గట్టిగా ప్రతిస్పందించాలని, తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లకు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. దాడులను తిప్పికొట్టే విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. సైనిక చర్యలు నిలిపివేస్తూ అంగీకారానికి వచ్చినట్లు భారత్, పాక్ శనివారం ప్రకటించడం తెలిసిందే. అయినప్పటికీ పాక్ సైన్యం కవి్వంపు చర్యలకు పాల్పడింది. శనివారం రాత్రి సరిహద్దుల్లో కాల్పులు జరపగా, భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ పరిణామాలపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సమీక్ష జరిపారు. మరోసారి పాక్ సైన్యం కాల్పులకు గట్టిగా ప్రతిస్పందించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన తేల్చిచెప్పారు. -
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
మాంగోచార్ తమకు స్వతంత్ర దేశం కావాలని ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న బలూచ్ తిరుగుబాటు దారులు.. మరోసారి కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా గుర్తించాలంటూ డిమాండ్ చేశారు. అదే సమయంలో పాక్ ఉగ్రస్థావరాలపై దాడులకు దిగిన భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్‌పై భారత్ సైనిక చర్య తీసుకుంటే, పశ్చిమ సరిహద్దుల నుంచి పాక్‌పై తిరుగుబాటు చేస్తామన్నారు. భారత్‌కు సైనిక శక్తిగా నిలుస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్లో 40 శాతం భూభాగం తమదేనని, తమకు ప్రత్యేక దేశం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్‌కు నిద్ర పట్టకుండా చేస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదులు ఏరివేతే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టగా, అందుకు బలూచ్ తిరుగుబాటుదారులు సైతం మద్దతు తెలుపుతున్నారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. -
2019 Pulwama attack: ‘పుల్వామా దాడి చేసింది మేమే’: పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ (Pakistan) మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. 2019 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో (2019 Pulwama attack) 40మంది భారత సీఆర్పీఎఫ్ (central reserve police force) జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడి వెనుక తమ హస్తం ఉందని అంగీకరించింది. ఇన్ని రోజులు పుల్వామా దాడిలో తమకు ప్రమేయం లేదన్న పాక్.. ఇప్పుడు బహిరంగంగా అంగీకరించడంపై అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్‌కు భారత్ తగిన గుణం పాఠం చెబుతోంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో ఇండియన్ ఆర్మీ.. పాక్,పాక్ ఆక్రమిత కశ్మీర్లో క్షిపణి దాడులు చేసింది. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరాల్ని, ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేసింది. దీంతో భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. భారత్ కొనసాగిస్తున్న ఆపరేషన్ సిందూర్‌పై బహిరంగంగా స్పందించింది.Did he really admit about Pulwama attack,,,😳😳😳#ceasefireviolations#IndiaPakistanWar #IndiaFightsTerroristan pic.twitter.com/6C4l5ohSjb— Vyky Garia (@VkyGaria) May 11, 2025 ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీ ఐఎస్పిఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి,పాక్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్ వైస్ మార్షల్,పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్ ఔరంగజేబ్ అహ్మద్ ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పుల్వామా దాడితో మా ఎత్తుగడ ఎలాంటిదో చూపించాం. మా దేశ గగనతలం, భూమి, జలాలు, ప్రజలకు ముప్పు పొంచి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోం. దేశ ప్రజల రుణం తీర్చుకుంటాం. ఇప్పటికే పుల్వామాలో మా వ్యూహాత్మక చతురత ప్రదర్శించాం’ అని ఔరంగజేబ్ అహ్మద్ అన్నారు.ఔరంగజేబ్ అహ్మద్ ప్రకటనతో ఇన్ని రోజులు పుల్వామా దాడి వెనుక తమ పాత్రలేదని బుకాయించిన పాకిస్తాన్ ఇప్పుడు బహిరంగంగా ఉగ్రవాదంతో నెరుపుతున్న సంబంధాల గురించి ప్రకటన చేయడంపై విమర్శలకు దారి తీసింది. -
ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్
న్యూఢిల్లీ: -అగ్రరాజ్యం అమెరికా సాక్షిగా భారత్-పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ చర్చలకు ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీకి యూఎస్ఏ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్ చేసి మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలపై మోదీతో మాట్లాడారు జేడీ వాన్స్. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జేడీ వాన్స్. అయితే పాక్ దాడి చేస్తే తాము దాడికి దిగుతామంటూ జేడీ వాన్స్‌కు మోదీ స్పష్టం చేశారు. తమ సంయమనం బలహీనత కాదని, దేశ భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని మోదీ పేర్కొన్నారు ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదని జేడీ వాన్స్‌కు తేల్చిచెప్పారు నరేంద్ర మోదీ. రేపు(సోమవారం) పాకిస్తాన్ తో కాల్పుల విరమణ అంశానికి సంబంధించి చర్చలు జరుగుతున్న సమయంలో జేడీ వాన్స్ ఫోన్ చేసి మాట్లాడటం చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ నేతృత్వంలో భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అంశంపై చర్చలు జరుగునున్న తరుణంలో జేడీ వాన్స్ ముందగా పోన్ చేసి మోదీతో మాట్లాడారు. అయితే అంతకమునుపే కశ్మీర్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పీవోకే విషయంలో భారత్ రాజీపడే ప్రసక్తే ఉండదన్నారు. దీనికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని అమెరికాకు పరోక్షంగా చెప్పేశారు మోదీ. పీవోకే తమదేనని, ఇందులో ఎవరు జోక్యం అవసరం లేదన్నారు. పీవోకేను తమకు అప్పగించడం ఒక్కటే పాకిస్తాన్ కు ఉన్న ఆప్షన్ అని మోదీ తెగేసి చెప్పేశారు. కాగా, భారత్, పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి. పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలు పంపింది భారత ప్రభుత్వం. -
ఘోరం..లోయలో పడిన బస్సు.. 21 మంది ప్రయాణికులు దుర్మరణం
కొలంబో: శ్రీలంకలో (Sri Lanka) పెను విషాదం చోటు చేసుకుంది. కోట్మాలేలోని కరండీ ఎల్లా ప్రాంతం నుంచి 78 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయ పడ్డారు. Over 20 people have been killed after a bus fell down a precipice in Kotmale in the Gerandi Ella area on Sunday.Deputy Minister of Transport Dr. Prasanna Gunasena said that at least 77 people were in the bus at the time of the accident.#Srilanka #lka #accident pic.twitter.com/8V6jEBKByD— Easwaran Christian Rutnam (@easwaranrutnam) May 11, 2025ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు,రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.మరోవైపు,పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణించ వల్లే ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండడం, కోట్మాలే ప్రాంతంలో బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు సమాచారం. దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు. -
భారత్, పాక్‌పై ట్రంప్ ఆసక్తికర కామెంట్స్.. ఈసారి కశ్మీర్ అంటూ..
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అమెరికా మధ్యవర్తిత్వంతో సద్దుమణిగింది. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇరుదేశాల నేతలతో చర్చించి కాల్పుల విరమణకు వచ్చేలా చేశారు. అయితే, భారత్-పాక్ అంశంపై తాజాగా ట్రంప్ మరోసారి స్పందించారు. ఈసారి కశ్మీర్ అంశం ప్రస్తావించి కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా ట్రుత్‌తో స్పందిస్తూ..‘కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్-పాక్‌తో కలిసి పనిచేస్తాం. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాను. వెయ్యి సంవత్సరాల కశ్మీర్ విషయంలో ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను. అలాగే, భారత్, పాకిస్తాన్‌ను చూసి నేను గర్వపడుతున్నాను. ప్రజల మరణానికి, నాశనానికి దారితీసే ప్రస్తుత యుద్ధాన్ని ఆపాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయం పూర్తిగా అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం, ధైర్యాన్ని రెండు దేశాలు కలిగి ఉన్నాయి. అచంచలమైన శక్తివంతమైన నాయకత్వం రెండు దేశాలకు ఉందని కితాబిచ్చారు.యుద్ధం కారణంగా లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంది!. మీ ధైర్యవంతమైన చర్యల ద్వారా మీ వారసత్వం బాగా మెరుగుపడింది. ఈ చారిత్రాత్మక, వీరోచిత నిర్ణయం తీసుకోవడంలో అమెరికా మీకు సాయం చేయగలిగినందుకు నేను గర్విస్తున్నాను. ఇలాంటి చారిత్రక నిర్ణయంలో అమెరికా సాయపడటం గర్వంగా ఉంది. ఈ రెండు గొప్ప దేశాలతో నేను వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాను’ అని చెప్పుకొచ్చారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - May 10, 2025, 11:48 PM ET )I am very proud of the strong and unwaveringly powerful leadership of India and Pakistan for having the strength, wisdom, and fortitude to fully know and understand that it was time to stop… pic.twitter.com/RKDtlex2Yz— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) May 11, 2025ఇదిలా ఉండగా.. జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేశారు. దాంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకారం అంటూ పాకిస్తాన్.. భారత్‌పై సైనిక చర్యకు దిగింది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతూ, సాధారణ పౌరులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి తెగబడింది. భారత్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అడ్డుకోవడంతో పాటు పాక్‌పై ప్రతిదాడి చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి మరింత తీవ్రమవుతున్న క్రమంలో అమెరికా జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించింది. -
పాకిస్తాన్‌కు మద్దతుపై చైనా కీలక ప్రకటన
బీజింగ్: పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పష్టంచేశారు. పాక్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఆయన శనివారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్‌తో ఫోన్లో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, తాజా పరిణామాలను ఇషాఖ్ దార్ వివరించారు.ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని వాంగ్ యీ ప్రశంసించారు. పాక్ సంయమన ధోరణిని కొనియాడారు. మిత్రదేశమైన పాక్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్తోనూ ఇషాఖ్ దార్ ఫోన్లో మాట్లాడారు. -
భారత్‌పై పాక్ ప్రధాని ఓవరాక్షన్ కామెంట్స్.. నెటిజన్లు ఫైర్
ఇస్లామాబాద్: సరిహద్దుల్లో మూడు రోజులుగా జరుగుతున్న భీకర పోరులో అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకుంటూ రెచ్చగొట్టే విధంగా సరిహద్దులో కాల్పులు జరిపింది. అంతటితో ఆగకుండా.. పాక్ ప్రధాని విచిత్రంగా తమదే గెలుపు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత షెహబాజ్ షరీఫ్ పాకిక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా షరీఫ్ మాట్లాడుతూ.. భారత్‌తో యుద్ధంలో తాము విజయం సాధించినట్టు పేర్కొన్నారు. తమ దేశాన్ని, తమ పౌరులను రక్షించుకోవడానికి తాము ఏది చేయడాకైనా వెనుదిరిగేది లేదన్నారు. పాక్‌ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు. భారత్ తమ దేశంలోని మసీదులు, సామాన్య పౌరులపై డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులు చేసిందని.. అనేకమంది సాధారణ పౌరుల చావుకు భారత్ కారణమైందని మండిపడ్డారు. తమదేశంపై నిరాధార ఆరోపణలు కూడా చేస్తుందని.. భారత్‌కు తగిన బుద్ధి చెప్పామని.. తమ జోలికి వస్తే ఏదైనా చేయగలమని చూపించామంటూ ఓవరాక్షన్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.JUST IN: 🇵🇰🇮🇳 Pakistani PM Shehbaz Sharif declares victory over India.pic.twitter.com/go5V3JsGN8— Whale Insider (@WhaleInsider) May 10, 2025 12 Pakistan air bases destroyed, many of their jets shot down by the Indian Army… hundreds of terrorists killed deep inside Pakistan territory.Yet this man, with zero iota of shame, Shehbaz Sharif, says we have won against India. 🤡🤡 pic.twitter.com/qoI7u7NKYY— BALA (@erbmjha) May 10, 2025 ఇక, ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. పాక్ ప్రధాని తీరును ఎండగడుతున్నారు. అమెరికా మధ్యలోకి రాకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. భారత్ దాడులను తట్టుకోలేక తోక ముడిచి.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌కు ఇంత నష్టం జరిగినా మీది ఎలా గెలుపు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. 🇵🇰Pakistan Prime Minister Shehbaz Sharif tweets, praises trump & declares victory over India: “We have won, this is victory.”Also, Pakistani people are celebrating victory all over the country.THIS IS SHAMELESS 🤮🤮 pic.twitter.com/1N9YhfGrya— Vaishnavi (@vaishu_z) May 10, 2025 Shehbaz Sharif won the war in twitter 😂 pic.twitter.com/TTGaMKN86t— Mr. Nice Guy (@Mr__Nice__Guyy) May 10, 2025 ఇదిలా ఉండగా.. ఒకవైపు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే, మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా, సౌదీ అరేబియా తదితర దేశాలకు పాక్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడాన్ని యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా స్వాగతించాయి. ఉద్రిక్తతల నివారణకు ఇది కీలకమైన ముందడుగు అని యూరోపియన్ యూనియన్ పేర్కొంది. ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండేలా అన్ని ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించింది. Shehbaz Sharif knows the nation is uneducated and will believe whatever they're told, so he quickly declared victory. He's totally an army puppet. It's honestly laughable to watch him.🤣🤣🤣 #ceasefire #PakistanIndianWar pic.twitter.com/dDUr5ONLhI— Sandeep Pathak⛳ (@iPandit_Pathak) May 10, 2025Pakistan PM Shahbaz Sharif, "we won the war against India. Our attack destroyed the enemy's Air Bases".- Welcome to comedy nights hosted by a country's PM in front of the media. pic.twitter.com/gbcaKX64En— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2025 -
బంగ్లాదేశ్ షేక్ హసీనాకు బిగ్ షాక్
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. ఉగ్రవ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్‌ను నిషేధించినట్లు శనివారం సాయంత్రం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. సలహాదారుల మండలి(కేబినెట్) నిర్ణయం మేరకే నిషేధం విధించామని, నిషేధానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.అవామీ లీగ్, ఆ పార్టీ అగ్ర నేతలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్‌లో కొనసాగుతున్న కేసుల విచారణ ముగిసేదాకా ఈ రాజకీయ పార్టీపై నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. షేక్‌హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 2024 జూలైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు, సాక్షుల భద్రత, పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 1949లో అవామీ లీగ్ పార్టీ ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాళీలకు స్వయంప్రతిపత్తి హక్కులు దఖలుపడాలన్న లక్ష్యంతో అప్పట్లో అవామీ లీగ్ ఉద్యమం చేసింది. చివరకు స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైంది.🇧🇩 In Bangladesh, students and the public have been continuously protesting for the past 48 hours, demanding a ban on the Awami League, the party of former autocratic and murderous Prime Minister Sheikh Hasina. ✊ #HasinaOut #BanAwamiLeague #BangladeshCrisis pic.twitter.com/YueL4gwhc4— Ibnul Wasif Nirob (@Wasifvibes) May 10, 2025NEW! #Bangladesh’s interim government on Saturday banned deposed prime minister Sheikh Hasina’s Awami League under anti-terrorism law.The announcement to ban Hasina’s Awami League came after the student-led newly-floated National Citizen Party (NCP) activists rallied since… pic.twitter.com/0Zwfd6DdU1— DOAM (@doamuslims) May 10, 2025 -
కమికాజ్ డ్రోన్లను ప్రయోగించిన పాక్
న్యూఢిల్లీ: స్వార్న్ డ్రోన్లతోపాటు కమికాజ్ డ్రోన్లను భారత్‌లో విధ్వంసానికి పాకిస్తాన్ ప్రయోగించగా భారత్ వాటిని విజయవంతంగా అడ్డుకుని ముక్కలుచెక్కలు చేసింది. పహల్గాం ఉదంతం తర్వాత భారత్, పాక్ మధ్య మొదలైన సైనిక చర్యల పర్వంలో పాకిస్తాన్ ఈ కామికాజి డ్రోన్లను ఉపయోగించడం ఇదే తొలిసారి అని రక్షణరంగ నిపుణులు శనివారం వెల్లడించారు. గతంలో అర్మేనియా–అజర్బైజాన్ సాయుధ సంఘర్షణలో, ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యద్ధంలో ఈ కమికాజ్ డ్రోన్ల వినియోగం ఎక్కువైంది. ఇప్పుడు భారత్ పైకి పాకిస్తాన్ కమికాజ్ డ్రోన్లను పెద్ద ఎత్తున ప్రయోగించడంతో ఈ తరహా డ్రోన్లపై చర్చ మొదలైంది. కమికాజ్ డ్రోన్‌ను ఆత్మాహుతి డ్రోన్‌గా పేర్కొంటారు. బాంబును లేదా క్షిపణిని మోసుకొస్తూ సంబంధిత లక్ష్యంగా బాంబు/క్షిపణిని జారవిడవడం లేదంటే స్వయంగా అదే కూలిపోయి, పేలిపోవడం ఈ కమికాజ్ డ్రోన్ ప్రత్యేకత. విరుచుకుపడిన వందల కొద్దీ డ్రోన్లు మే 8వ తేదీ అర్ధరాత్రి తర్వాత లేహ్ నుంచి సర్ క్రీక్ ఉప్పుకయ్య దాకా 36 వేర్వేరు ప్రదేశాల గుండా సరిహద్దు ఆవలి నుంచి దాదాపు 400 డ్రోన్లు దూసుకొచ్చాయి. దీంతో క్షణాల్లో అప్రమత్తమైన పలు రకాలైన భారత గగనతల రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను అడ్డుకుని కూల్చేశాయి. భారత్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన సాంకేతికతతో గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసిన కారణంగానే ఈ డ్రోన్లను నిరీ్వర్యం చేయగలిగిందని, లేదంటే తీవ్ర నష్టం చవిచూడాల్సి వచ్చేదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఈ డ్రోన్లను కూల్చేశాక వీటి శకలాలను భారత మిలటరీ అధికారులు ల్యాబ్‌లకు తరలించి పరిశీలించడంతో ఇవి కమికాజ్ రకానికి చెందినవని నిర్ధారించారు. పంజాబ్, రాజస్తాన్‌లలో ఈ తరహా డ్రోన్ల శకలాలు లభించాయి. తుర్కియే నుంచే తెప్పించారు తుర్కియే దేశంలోని అసిస్‌గార్డ్ సోన్‌గర్ డ్రోన్ కంపెనీ ఈ కామికాజి డ్రోన్లను తయారుచేస్తుంది. దీంతో వీటిని పాకిస్తాన్ తుర్కియే నుంచే తెప్పించినట్లు స్పష్టమైంది. శనివారం తెల్లవారుజామున సైతం బైకర్ వైఐహెచ్ఏ– ఐఐఐ కమికాజ్ డ్రోన్లు పంజాబ్, రాజస్తాన్ సరిహద్దుల గుండా భారత గగనతలంలోకి వచ్చాయి. వీటిని ఎయిర్ డిఫెన్స్ గన్స్‌తో నేలమట్టం చేశామని రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. ఎందుకీ పేరు? కమికాజ్ అనేది జపాన్ పేరు. జపాన్ వైమానిక దళంలోని ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేక దళం ఇది. ఇది ఆత్మాహుతి ఫైటర్ పైలట్ల విభాగం. రెండో ప్రపంచ యుద్ధకాలంలో శత్రుదేశాల యుద్ధనౌకలను పేల్చేసేందుకు జపాన్ పైలట్లు తమ యుద్ధవిమానాలను వాటితో ఢీకొట్టించేవారు. అలా రెండో ప్రపంచ యుద్ధకాలంలో దాదాపు 3,800 మంది కమికాజ్ పైలట్లు ఆత్మాహుతి దాడులతో ఏకంగా 7,000 మంది శత్రుదేశాల నావికా సిబ్బందిని చంపేశారు. ఈ స్ఫూర్తితో తయారుచేసిన డ్రోన్లకు కమికాజ్ అని పేరుపెట్టారు. -
పాక్‌కు ఐఎంఎఫ్ రుణంపై విమర్శల వెల్లువ
న్యూయార్క్: పాకిస్తాన్ దన్నుతో ఉగ్రవాదులు పహల్గాంలో అనాగరిక దాడులకు తెగబడినందుకే సైనిక చర్య చేపట్టామని భారత్ ఓవైపు అంతర్జాతీయ సమాజానికి చెబుతుంటే మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) అదే దాయాదిదేశానికి భారీ సాయం చేయడం వివాదాస్పదమైంది. ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపడంతో ఉగ్ర, పాక్ దోస్తీ బట్టబయలైన సమయంలోనే ఇంటర్నేషన్ మానిటరీ ఫండ్ ఇలా నిధులు ఇవ్వడమేంటని పలువురు అంతర్జాతీయ ఆర్థికరంగ నిపుణులు విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్‌కు మరో 1 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.8,540 కోట్లు వెంటనే ఇచ్చేందుకు ఐఎంఎఫ్ శుక్రవారం అంగీకరించడమే ఈ విమర్శలకు అసలు కారణం. ఇటీవలే మరో 1.1 బిలియన్ డాలర్ల విడుదలకు ఐఎంఎఫ్ పచ్చజెండా ఊపడంతో మొత్తంగా పాకిస్తాన్‌కు 2.1 బిలియన్ డాలర్ల నిధుల వరద పారనుందని తెలుస్తోంది. వాతావరణ సంబంధ ప్రాజెక్టులు, పనుల నిమిత్తం పాకిస్తాన్ ఈ నిధులను కోరగా రుణంగా అందజేసేందుకు ఐఎంఎఫ్ ఒప్పుకుంది. అయితే ప్రజాపనుల నిమిత్తం నిధులు ఇస్తున్నాసరే, ఉద్రిక్తతల వేళ నిధుల విడుదల సహేతుకంగా లేదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే పరస్పర సైనిక చర్యల కారణంగా ఆయుధాల సేకరణ అనేది పాకిస్తాన్‌కు అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మారింది. ఈ సమయంలో ఒకేసారి వేల కోట్ల రూపాయల నిధులు వచి్చపడితే వాటిని సంబంధిత లక్ష్యం కోసం కాకుండా సైనిక సన్నద్ధత, ఆయుధాల కొనుగోలు కోసం దురి్వనియోగం చేసే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వెలిబుచ్చారు. సమకాలీన పరిస్థితులను, కనీసం భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న తాజా పరిస్థితులను బేరీజు వేసుకుని అయినా నిధుల విడుదలపై ఐఎంఎఫ్ పునరాలోచన చేస్తే బాగుండేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అభ్యంతరం తెలిపిన భారత్ పాకిస్తాన్‌కు అదనపు నిధుల విడుదల(ఈఎఫ్ఎఫ్)పై శుక్రవారమే ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశం జరిగింది. రెసీలెన్స్ అండ్ సస్టేనబిలిటీ ఫెసిలిటీ పథకంలో భాగంగా పాక్‌కు అదనపు నిధులు ఇవ్వడంపై సమావేశం నిర్వహించారు. ఇందులో సభ్యదేశంగా భారత్ పాల్గొని ఉద్రిక్తత వేళ పాక్‌కు రుణవితరణ ఆపాలని డిమాండ్చేసింది. అయితే ఇక్కడ ఐక్యరాజ్యసమితి, భద్రత మండలి తరహాలో ఓటింగ్‌లో గైర్హాజరు వంటి అవకాశం ఉండదు. కేవలం అభ్యంతరం మాత్రమే వ్యక్తంచేయగలం. దీంతో గతంలో ఒప్పుకున్న 7 బిలియన్ డాలర్ల రుణాల్లో భాగంగా కొంతమేర నిధుల విడుదల చేయాలని ఎగ్జిక్యూటివ్ బోర్డ్ నిర్ణయించింది. సైనిక చర్యలో మునిగిన దేశానికి నిధులెలా ఇస్తారని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబాల్ తప్పుబట్టారు. ఐఎంఎఫ్ తన చేతులకు అనవసరంగా రక్తం అంటించుకుంటోందని యశ్వంత్ దేశ్‌ముఖ్ విమర్శించారు. పాక్ తన ఆర్థిక సంస్కరణల ఊసే మర్చిపోయి మారణాయుధాల కొనుగోళ్లకు ఈ నిధులను కేటాయించడం ఖాయమని ‘అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్’లో నిపుణుడు సుశాంత్ సరీన్ అన్నారు. గత 35 సంవత్సరాల్లో పాకిస్తాన్ ఇలా 28 రుణాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఐఎంఎఫ్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. కానీ వాటిని సవ్యంగా అమలుచేసిన చరిత్ర ధూర్తదేశానికి లేదని భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ భారత్‌పై బాంబులేస్తున్న వేళ ఈ రుణవితరణ ఏవిధంగా హేతుబద్ధం అనిపించుకుంటుందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘రుణగ్రస్త పాకిస్తాన్‌ను ఐఎంఎఫ్ నిధుల సాయంతో ఒడ్డున పడేయట్లేదు. మరింతగా నెత్తుటేర్లు పారించేందుకు సాయపడుతోంది. ఇలా హంతక పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సంస్థలు ఇంకెన్నాళ్లు నిధులిస్తాయి?’అని ప్రవాసంలో గడుపుతున్న అఫ్గానిస్తాన్ మహిళా ఎంపీ మరియం సోలాయ్మన్ఖిల్ అన్నారు. -
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఐదుగురు హతం!
న్యూఢిల్లీ: పహల్గాం పాశవిక ఉగ్రదాడికి ప్రతిస్పందనగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరాలను భారత్ మే 7వ తేదీ అర్ధరాత్రి తర్వాత దాడిచేయడం తెల్సిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ గడ్డపై జరిపిన ఈ క్షిపణి దాడుల్లో తొమ్మిది కీలకమైన ఉగ్ర స్థావరాలు నేలమట్టమై కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన ఐదుగురు సైతం చనిపోయినట్లు కేంద్రం సంబంధిత వివరాలను శనివారం వెల్లడించింది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులతో పాటు లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో కీలక ఉగ్రవాది, మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టినట్లు భారత అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ ఉన్నతాధికారులు, పోలీసులు సిబ్బంది హాజరయ్యారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సు మహిళా ముఖ్యమంత్రి మర్యం నవాజ్ తరఫున అధికారులు పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించిన ఫొటోలు మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో ఉగ్రసంస్థలతో పాక్ ప్రభుత్వ చెలిమి మరోసారి బహిరంగంగా బట్టబయలైంది. ఆ ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల గురించి క్లుప్తంగా..మొహమ్మద్ యూసుఫ్ అజార్ భారతసర్కార్ గతంలో తయారుచేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో 21వ నంబర్‌గా మొహమ్మద్ యూసుఫ్ అజార్ పేరు ఉంది. దాదాపు 50 ఏళ్లకుపైబడిన వయస్సుండే ఇతను జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు బావమరిది. 1999 డిసెంబర్లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఐసీ–814 విమానం హైజాక్ ఉదంతంలో ఇతను కీలక సూత్రధారి. 1998లో అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తిద్వారా తప్పుడు పాస్‌పోర్ట్‌తో భారత్‌లోకి వచ్చాడు. జైషేకు చెందిన బహావల్పూర్ ప్రధాన స్థావరంలో కొత్త ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే బాధ్యతలను యూసుఫ్ చూసుకునేవాడు. యూసుఫ్ కుటుంబం సైతం అదే స్థావరప్రాంగణంలో నివసిస్తోంది. ఇతనికి ఉస్తాద్ జీ, మొహమ్మద్ సలీమ్, ఘోసీ సాహెబ్ వంటి మారు పేర్లు ఉన్నాయి. ఆయుధాలను ఎలా వాడాలో యువతకు శిక్షణ ఇస్తాడు. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు పథకరచన చేశాడు. ఇతనికి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ గతంలోనే రెడ్‌నోటీస్ ఇచి్చంది. ఇతడిని తమకు అప్పగించాలని 2002లోనే భారత్ పాకిస్తాన్‌ను కోరింది. అజార్‌ను జమ్మూ జైలు నుంచి తప్పించేందుకు పలుమార్లు ప్లాన్లు వేసి విఫలమయ్యాడు. చివరకు భారత ఎయిర్‌పోర్టులో భద్రతావైఫల్యాలు ఉన్నట్లు పసిగట్టి హైజాక్ ప్లాన్‌ను అమలుచేశాడు. హైజాక్ జరిగిన 26 ఏళ్ల తర్వాత సూత్రధారిని భారతబలగాలు అంతం చేశాయి. హఫీజ్ మొహమ్మద్ జమీల్ఇతను కూడా జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు పెద్ద బావమరిది. యూసుఫ్‌కు ఇతను అన్నయ్య అవుతాడు. జైషేకు చెందిన మర్కాజ్ సుభాన్ అల్లాహ్‌లోని అతిపెద్ద శిక్షణా కేంద్రానికి ముహమ్మెద్ జమీల్ ఇన్చార్జ్గా ఉన్నాడు. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేసి, టెర్రరిస్ట్‌లుగా మార్చాల్సిన ప్రధాన బాధ్యత ఇతనిదే. జైషే ఉగ్రసంస్థలో కీలకమైన వ్యక్తి. జైషే సంస్థ కోసం నిధులను సేకరించడంలోనూ అత్యంత చురుగ్గా ఉంటాడు. ముదస్సార్ ఖదియాన్ ఖాస్ లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో ముదస్సార్ ఖదియాన్ ఖాస్ అత్యంత కీలకమైన వ్యక్తి. ఇతనికి అబూ జుందాల్ అనే మారుపేరు ఉంది. సరిహద్దు నుంచి కేవలం పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిద్కేలోని మర్కాజ్ తైబా ఉగ్రస్థావరానికి ఇతనే సారథ్యం వహిస్తున్నాడు. ముంబైదాడుల్లో ప్రాణాలకు తెగించి పోలీసులు పట్టుకున్న ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఈ స్థావరంలోనే శిక్షణ పొందాడు. మే 7 అర్థరాత్రి తర్వాత భారత దాడుల్లో ఖదియాన్ హతమయ్యాడు. ఈ వార్త తెల్సి పాకిస్తాన్ సైన్యం ఉలిక్కిపడింది. వెంటనే ఇతని అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించింది. లష్కరే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో అంత్యక్రియలు జరిగాయి. ఆర్మీ చీఫ్ మునీర్ తరఫున లెఫ్టినెంట్ జనరల్, పోలీస్‌విభాగం తరఫున పంజాబ్ ప్రావిన్సు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హాజరయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఇతని మృతదేహం వద్ద సైనికవందనం చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. దీంతో పాక్ ఆర్మీ, ఉగ్రసంస్థలకు మధ్య ఉన్న సత్సంబంధాలు ఇతని అంత్యక్రియల వీడియోతో మరోసారి ప్రపంచానికి తెల్సివచ్చాయి. ఖలీద్ అలియాస్ అబూ అకాషా లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కమాండర్ అయిన ఖలీద్ అలియాస్ అబూ అకాషా సైతం ఈ దాడుల్లో హతమయ్యాడు. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులతో ఇతని ప్రత్యక్ష సంబంధం ఉంది. అఫ్గానిస్తాన్ నుంచి లష్కరే తోయిబా కోసం ఆయుధాలను అక్రమంగా తీసుకొచ్చేవాడు. ఇతని అంత్యక్రియలు పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పాక్ ఆర్మీ సీనియర్ అధికారులు, పోలీస్‌విభాగం తరఫున పైసలాబాద్ డెప్యూటీ కమిషనర్ ఈ ఖనన క్రతువులో పాల్గొన్నారు. మొహమ్మద్ హసన్ ఖాన్ జమ్మూకశ్మీర్‌లో వేర్వేరు ఉగ్రదాడులకు సమన్వయం చేయడంలో, సహాయసహకారాలు అందించడంలో మొహమ్మద్ హసన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రస్థావర నిర్వహణ బాధ్యతలను చూసుకునే సీనియర్ ఉగ్రవాది ముఫ్తీ అస్ఘర్ ఖాన్ కశ్మీరీ కుమారుడే ఈ హసన్ ఖాన్. -
సరిహద్దుల్లో కాల్పుల మోత
న్యూఢిల్లీ/జమ్మూ/శ్రీనగర్: సరిహద్దుల వెంబడి పాక్ సైన్యం కాల్పులు శనివారం వరుసగా పదహారో రోజు కూడా కొనసాగాయి. దాంతో పశ్చిమ సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లాయి. ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ (పడగొట్టలేని దృఢమైన గోడ) పేరిట శుక్రవారం అర్ధరాత్రి నుంచి జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా సైన్యం భారీ కాల్పులకు పాల్పడింది. సైనిక స్థావరాలతో పాటు సాధారణ జనావాసాలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, హోషియార్పూర్, అమృత్సర్, ఫిరోజ్‌పూర్, తార్న్‌తరన్, హరియాణాలోని సిర్సాలో కాల్పులు, పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. పాక్ కాల్పులను సైన్యం దీటుగా తిప్పికొట్టింది. మన ప్రతిదాడుల భయంతో శనివారం తెల్లవారుజాము 3.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పాక్ తన గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. ప్రభుత్వాధికారి సహా ఆరుగురి మృతి పాక్ కాల్పుల్లో జమ్మూలో ఆరుగురు మరణించారు. 8 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది సహా 20 మంది గాయపడ్డారు. మృతుల్లో రాజౌరీ జిల్లా అభివృద్ధి విభాగం అదనపు కమిషనర్ రాజ్‌కుమార్ థాపా, ఓ సైనికాధికారితో పాటు రెండేళ్ల బాలిక ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పాక్ సైన్యం సామాన్యులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటమే గాక డ్రోన్లు ప్రయోగించిందని పేర్కొన్నారు. జమ్మూ సహా పలు పట్టణాలు, గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. సైరన్లు నిరంతరాయంగా మోగుతుండడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం ఉదయం 5 గంటలకు భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాజ్‌కుమార్ థాపా అధికారిక నివాసంపై కాల్పుల్లో ఆయనతో పాటు ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. థాపా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దాంతో స్థానికంగా విషాదం అలుముకుంది. థాపా శుక్రవారం సైతం విధుల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రితో కలిసి జిల్లావ్యాప్తంగా పర్యటించారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. పాక్ దాడుల్లో రాజౌరీ టౌన్లో ఐషా నూర్ (2), మొహమ్మద్ షోహిబ్(35) మృతిచెందారు. పూంఛ్ జిల్లాలో రషీదా బీ(55) ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయాలపాలయ్యారు. జమ్మూ జిల్లా ఆర్.ఎస్.పురా సెక్టార్లో అశోక్ కుమార్ అనే పౌరుడు విగతజీవిగా మారాడు. పూంఛ్‌లోని కృష్ణఘాటీ సెక్టార్లో బాంబు పేలుడులో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్ అమరుడయ్యాడు. జమ్మూ శివార్లలోని ఖేరీ కేరాన్ గ్రామంలో జకీర్ హుస్సేన్ (45) మరణించాడు. శ్రీనగర్‌లో భారీ పేలుళ్లు శ్రీనగర్ శనివారం పేలుళ్లతో దద్దరిల్లింది. ఉదయం 11.45 గంటల వేళ ఎయిర్‌పోర్టు సమీపంలో రెండు శక్తిమంతమైన పేలుళ్లు సంభవించినట్లు అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంతకుముందు నగరంలో పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. శ్రీనగర్‌లోని ఓల్డ్ ఎయిర్‌ఫీల్డ్ వైపు దూసుకొచి్చన ఓ డ్రోన్‌ను సైన్యం కూల్చివేసింది. సీఎం ఒమర్ సంతాపం రాజ్‌కుమార్ థాపా మరణం పట్ల జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం ప్రకటించారు. అంకితభావం కలిగిన సీనియర్ అధికారిని కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. జమ్మూలో దాడులు జరిగిన ప్రాంతాల్లో ఒమర్ పర్యటించారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి ప్రజలకు స్థైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.హిమాచల్‌లో డ్రోన్, క్షిపణుల శకలాలు హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం ఉనా జిల్లాలోని బెహాద్ గ్రామంలో శనివారం క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. కాంగ్రా జిల్లా నూర్పూర్లో రెండుచోట్ల డ్రోన్, మిస్సైల్ విడిభాగాలను గుర్తించారు. అవి సైన్యం కూల్చివేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల విడిభాగాలని అంచనా వేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అక్కడ భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సైనిక పోస్టులు, ఉగ్ర లాంచ్ప్యాడ్లు ధ్వంసం జమ్మూ సమీపంలో పాకిస్తాన్ భూభాగంలో సైనిక పోస్టులతో ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ‘‘భారత్‌పై డ్రోన్ దాడులకు ఈ లాంచ్ప్యాడ్లనే వాడారు. ఇవి పాక్‌లోని సియాల్కోట్ జిల్లా లూనీలో ఉన్నాయి’’ అని బీఎస్ఎఫ్ వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ భూభాగం నుంచి జరిగిన కాల్పులకు గట్టిగా బదులిచ్చామని వెల్లడించింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బీఎస్ఎఫ్ పోస్టులే లక్ష్యంగా పాక్ సైన్యం దాడులకు దిగింది. దాంతో పాక్ రేంజర్ల క్యాంపులపై బీఎస్ఎఫ్ విరుచుకుపడింది.మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలుకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూ: పాకిస్తాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సరిహద్దు ప్రాంతాల్లోని వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, జమ్మూ సెక్టార్లపై నాలుగు రోజుల పాటు జరిగిన కాల్పుల్లో జిల్లా అదనపు అభివృద్ధి కమిషనర్ సహా 19 మంది చనిపోయారు. ‘పాక్ వైపు నుంచి జరిగిన కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర వేదన కలిగించింది. మా ప్రజలకు కలిగిన నష్టాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటాం. ఆప్తులను కోల్పోయిన వారి వేదనను తగ్గించలేకపోవచ్చు గానీ ఆ కుటుంబాలకు మా వంతు మద్దతుగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తాం’అని సీఎం ఒమర్ పేర్కొన్నారు. -
భూమి దిశగా దూసుకొస్తున్న ‘కాస్మోస్’
కేప్ కనవెరాల్(యూఎస్ఏ): సోవియట్ కాలం నాటి అంతరిక్ష నౌక కాస్మోస్ భూమిపైకి దూసుకొస్తోంది. శుక్ర గ్రహంపైకి ప్రయోగించిన ‘కాస్మోస్ 482’విఫలమైంది. అర్ధ శతాబ్దానికి పైగా వివిధ కక్ష్యల్లో తిరుగుతున్న ఈ అంతరిక్ష నౌక తదుపరి కక్ష్యల్లో కనిపించడం లేదని జర్మనీ రాడార్ స్టేషన్ ఇటీవల గుర్తించినట్లు యూరోపియన్ యూనియన్ స్పేస్ సరై్వలెన్స్ అండ్ ట్రాకింగ్ విభాగం తెలిపింది. ఈ అనియంత్రిత కాస్మోస్ భూమిపైకి తిరిగి మళ్లిందని ఈ సంస్థ తాజాగా ధ్రువీకరించింది. 1972లో సోవియట్ యూనియన్ శుక్రగ్రహంపై చేపట్టిన మిషన్లలో ‘కాస్మోస్ 482’ప్రయోగం ఒకటి. రాకెట్ విఫలం కావడంతో సుమారు 500 కిలోల బరువున్న ఈ అంతరిక్ష నౌక భూ కక్ష్యలోనే ఉండిపోయింది. అనంతరం సుమారు దశాబ్దం కాలంపాటు కాస్మోస్ విడి భాగాల్లో చాలా వరకు విడిపోయి, భూమిపై పడ్డాయి. అయితే, సౌర కుటుంబంలోని అత్యంత వేడిగా ఉండే శుక్ర గ్రహం లక్ష్యంగా ప్రయోగించిన కాస్మోస్‌కు టిటానియం రేకు రక్షణగా ఉండటంతో చెక్కుచెదరలేదని నిపుణులు అంటున్నారు. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్న కాస్మోస్ కచ్చితంగా ఎక్కడ, ఎప్పుడు భూమిపై పడుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమని సైంటిస్టులు, సైనిక నిపుణులు చెబుతున్నారు. -
మదర్సా విద్యార్థులే రక్షణ కవచాలు!
అతివాద నెట్‌వర్క్‌లతో పాక్ సైన్యానిది విడదీయరాని బంధమని మరోసారి రుజువైంది. దాయాది యుద్ధోన్మాదం చివరికి మత శిక్షణ సంస్థలను కూడా వదలడం లేదు. భారత్‌తో పోరులో సైన్యం చేతులెత్తేసే పరిస్థితి నెలకొనడంతో పాక్ ముసుగులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతు న్నాయి. అవసరమైతే మదర్సా విద్యార్థులను కూడా యుద్ధ రంగంలోకి పంపుతామని బాహాటంగా ప్రకటించేసింది. మతిలేని, వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధుడైన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శనివారం సాక్షాత్తూ పాక్ పార్లమెంటులోనే ఈ మేరకు ప్రకటన చేశారు. వారిని ‘సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్’గా ఆయన అభివర్ణించారు. అవసరమైనప్పుడు మదర్సా విద్యార్థులను యుద్ధ విధుల్లో 100 శాతం వాడుకుని తీరతామని కుండబద్దలు కొట్టారు. భారత డ్రోన్లన్నింటినీ ఎక్కడికక్కడ అడ్డుకుని కూల్చేశామని ఒకవైపు పాక్ సైన్యం ప్రకటించగా, అ లాంటిదేమీ లేదంటూ ఆసిఫ్ కొట్టిపారేయ డం తెలిసిందే. ‘‘భారత డ్రోన్లను కూల్చ కపోవడానికి కారణముంది. మా సైనిక స్థావరాలకు సంబంధించిన సున్ని తమైన సమాచారం లీక్ కావద్దనే అలా చేశాం’’ అంటూ విచిత్రమైన వివరణ ఇచ్చి ఇంటాబయటా నవ్వులపాలయ్యా రు. భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో చెప్పుకుని, రుజువులడిగితే, ‘అలాగని భారత సోషల్ మీడియాలోనే వస్తోందిగా’ అని చెప్పి అభాసు పాలయ్యారు. రక్షణ మంత్రి అయ్యుండి సోషల్ మీడియా వార్తల ఆధారంగా ప్రకటనలు చేస్తారా అంటూ సీఎన్ఎన్ విలేకరి ఆండర్సన్ నిలదీయడంతో నీళ్లు నమిలారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐ మానవాళికి ప్రధాన సవాల్
వాటికన్ సిటీ: మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత సంక్లిష్టమైన సవాళ్లలో కృత్రిమ మేధ(ఏఐ)ఒకటని నూతన పోప్ లియో 14 పేర్కొన్నారు. దివంగత పోప్ ఫ్రాన్సిస్ అనుసరించిన ప్రాథమ్యాల్లో కొన్నిటిని తానూ కొనసాగిస్తానని ప్రకటించారు. శనివారం వాటికన్ సిటీలోని సినోడ్ హాల్లో కార్డినల్స్ ను ఉద్దేశించి ఆయన ఇటాలియన్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రాన్సిస్ పేరును పదేపదే తలచుకుంటూ నివాళులర్పించారు. 2013లో పోప్‌గా బాధ్యతలు చేపట్టే సమయంలో ఫ్రాన్సిస్ చేసిన ప్రకటనను ఉదహరిస్తూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. కేథలిక్ చర్చిని మరింత సమ్మిళితంగా మార్చేందుకు విశ్వాసులకు దగ్గరయ్యేందుకు, తిరస్కృతులను అక్కున చేర్చుకునేలా తయారు చేసేందుకు కట్టుబడి ఉంటానన్నారు. చర్చిని ఆధునీకరించేందుకు 1960ల్లో వాటికన్ రెండో కౌన్సిల్ ప్రకటించిన సంస్కరణలను అమలు చేస్తానని స్పష్టం చేశారు. ‘మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఏఐ ఒకటి. ఇది మనిషి గౌరవం, న్యాయం, శ్రమను రక్షించడంలో సవాళ్లు విసురుతోంది’అని అన్నారు. పోప్ ఫ్రాన్సిస్ సైతం ఏఐతో తలెత్తనున్న సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అడ్డుకునేందుకు చట్టాలు చేయాలని ప్రపంచ దేశాలను సైతం ఆయన కోరారన్నారు. లియో 14గా తన పేరును ఎంపిక చేయడంలో ఏఐ పాత్రను ఆయన వివరించారు. 1878–1903 వరకు పోప్‌గా లియో 13 కొనసాగారు. ఆధునిక కేథలిక్ సామాజిక ఆలోచనకు పునాది వేసిందీయనే. పారిశ్రామికీకరణ ప్రారంభంలో కారి్మకుల హక్కులు, పెట్టుబడిదారీ విధానాన్ని ఉద్దేశించి 1891లో ఈయన రోమన్ కేథలిక్ చర్చి బిషప్‌లకు రాసిన లేఖ ప్రముఖంగా మారింది. లియో 13 పేర్కొన్న విధంగా ‘క్రైస్తవులం మనం అనేకులమైనప్పటికీ, ఒకే క్రీస్తులో మనమంతా ఒక్కటే’అన్న సెయింట్ ఆగస్టీన్ మాటలను ఈ సందర్భంగా ఉటంకించారు. అంతకుముందు, ప్రసంగించేందుకు వస్తున్న లియో 14కు కార్డినల్స్ అంతా లేచి నిలబడి చప్పట్లతో ఆహ్వానం పలికారు. పోప్ తయారు చేసిన ప్రసంగ పాఠాన్ని చదువుతూ మధ్యమధ్యలో తలెత్తి చూశారు. సెయింట్ పీటర్స్ బసిలికా వేదిక నుంచి గురువారం రాత్రి మొట్టమొదటి సారిగా కనిపించిన సమయంలో కూడా ప్రసంగ పాఠాన్నే చదివి వినిపించారు.