వివాదంలో పాకిస్తాన్‌ హైకమిషనర్‌.. యువతితో వీడియోలు లీక్‌ | Pakistan High Commissioner Syed Ahmed Maroof Gone On Leave After Honeytrap Videos Viral | Sakshi
Sakshi News home page

వివాదంలో పాకిస్తాన్‌ హైకమిషనర్‌.. యువతితో వీడియోలు లీక్‌

May 14 2025 8:55 AM | Updated on May 14 2025 1:22 PM

Pakistan High Commissioner Syed Ahmed Maroof honeytrap

ఢాకా: పాకిస్తాన్‌ హైకమిషనర్‌ హనీట్రాప్‌ వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్‌ తరఫున బంగ్లాదేశ్‌కు హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్న సయ్యద్‌ అహ్మద్‌ మరూఫ్‌ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో తిరుగుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. సదరు అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన పాక్‌ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.

వివరాల ప్రకారం.. సయ్యద్‌ అహ్మద్‌ మరూఫ్‌ పాకిస్తాన్‌ తరఫున బంగ్లాదేశ్‌కు హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 2023లో బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ హైకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే, మరూఫ్‌ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఉన్న తిరుగుతున్న ఫొటోలు లీక్‌ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన పాక్‌ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసింది. మరూఫ్ మే 11న ఢాకా నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్‌కు విమానంలో వెళ్లారని బంగ్లాదేశ్ దినపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. హనీట్రాప్ కారణంగా అతడు బంగ్లాదేశ్‌ వీడినట్టు చెప్పుకొచ్చింది.

అయితే, అధికారులు మాత్రం.. మారూఫ్ అధికారికంగా సెలవులో ఉన్నారని నిర్ధారించారు. కానీ, ఎన్ని రోజులు అతను సెలవులో ఉన్నారనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ విషయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు.. ఢాకాలోని పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్ ముహమ్మద్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఇక, ఇటీవల మరూఫ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో ఆయన సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఆమెతో పాక్‌ దౌత్యవేత్తకు సన్నిహిత బంధం ఉందని తెలుస్తోంది. ఆయన వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్‌ ఆ యువతితో పంచుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగాలపై ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌ కార్యాలయ అధికారి ఒకరిని భారత్‌ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయన్ని అవాంఛిత వ్యక్తి (పర్సనా నాన్‌గ్రేటా)గా ప్రకటించి 24 గంటల్లోగా మన దేశాన్ని వీడివెళ్లిపోవాలని గడువు విధించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉ‍న్న సమయంలో  ఏమైనా విరుద్ధ  కార్యకలాపాలకు  పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్‌ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement