భారత్‌పై పాక్‌ ప్రధాని ఓవరాక్షన్‌ కామెంట్స్‌.. నెటిజన్లు ఫైర్‌ | Pakistan PM Shehbaz Sharif declares victory | Sakshi
Sakshi News home page

భారత్‌పై పాక్‌ ప్రధాని ఓవరాక్షన్‌ కామెంట్స్‌.. నెటిజన్లు ఫైర్‌

May 11 2025 8:01 AM | Updated on May 11 2025 8:11 AM

Pakistan PM Shehbaz Sharif declares victory

ఇస్లామాబాద్‌: సరిహద్దుల్లో మూడు రోజులుగా జరుగుతున్న భీకర పోరులో అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్‌ తన వక్రబుద్ధిని చాటుకుంటూ రెచ్చగొట్టే విధంగా సరిహద్దులో కాల్పులు జరిపింది. అంతటితో ఆగకుండా.. పాక్‌ ప్రధాని విచిత్రంగా తమదే గెలుపు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత షెహబాజ్ షరీఫ్ పాకిక్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా షరీఫ్‌ మాట్లాడుతూ.. భారత్‌తో యుద్ధంలో తాము విజయం సాధించినట్టు పేర్కొన్నారు. తమ దేశాన్ని, తమ పౌరులను రక్షించుకోవడానికి తాము ఏది చేయడాకైనా వెనుదిరిగేది లేదన్నారు. పాక్‌ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు. భారత్ తమ దేశంలోని మసీదులు, సామాన్య పౌరులపై డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులు చేసిందని.. అనేకమంది సాధారణ పౌరుల చావుకు భారత్ కారణమైందని మండిపడ్డారు. తమదేశంపై నిరాధార ఆరోపణలు కూడా చేస్తుందని.. భారత్‌కు తగిన బుద్ధి చెప్పామని.. తమ జోలికి వస్తే ఏదైనా చేయగలమని చూపించామంటూ ఓవరాక్షన్‌ కామెంట్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

 ఇక, ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. పాక్‌ ప్రధాని తీరును ఎండగడుతున్నారు. అమెరికా మధ్యలోకి రాకపోతే పాకిస్తాన్‌ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. భారత్‌ దాడులను తట్టుకోలేక తోక ముడిచి.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌కు ఇంత నష్టం జరిగినా మీది ఎలా గెలుపు అవుతుందని ప్రశ్నిస్తున్నారు.

 

 ఇదిలా ఉండగా.. ఒకవైపు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే, మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా, సౌదీ అరేబియా తదితర దేశాలకు పాక్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడాన్ని యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీ అరేబియా స్వాగతించాయి. ఉద్రిక్తతల నివారణకు ఇది కీలకమైన ముందడుగు అని యూరోపియన్ యూనియన్ పేర్కొంది. ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండేలా అన్ని ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement