
హోటల్ బాల్కనీ నుంచి పడి దుర్మరణం
బోస్టన్: భారత సంతతికి చెందిన ఓ అమెరికా విద్యార్థి బహమాస్ ద్వీపంలో ప్రమాదవశాత్తూ మరణించాడు. 25 ఏళ్ల గౌరవ్ జైసింగ్ అమెరికాలో బెంట్లీ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చదువుతున్నాడు. శనివారం వర్సిటీ అండర్ గ్రాడ్యుయేషన్ వేడుక నేపథ్యంలో సీనియర్ విద్యార్థులు బహమాస్ పర్యటనకు వెళ్లారు.
అట్లాంటిస్ ప్యారడైజ్ ఐలాండ్ రిసార్ట్ అండ్ క్యాసినోలో బస చేశారు. మే 11 రాత్రి హోటల్ గదిలో మిత్రులతో కలిసి గడుపుతున్న గౌరవ్ పై అంతస్తు బాల్కనీ నుంచి పడిపోయాడు. అత్యవసర వైద్యం అందించి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని ధ్రువీకరించారు. దర్యాప్తు కొనసాగు తోంది. బోస్టన్‌కు 12 మైళ్ల దూరంలో ఉండే బెంట్లీ ఓ చిన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయం.