
న్యూఢిల్లీ: భారత్‌లో స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (ఎస్‌ఏవీడబ్ల్యూఐపీఎల్) గొడుగు కిందికి మరో బ్రాండ్ వచ్చి చేరింది. బ్రిటన్‌కు చెందిన సూపర్ లగ్జరీ బ్రాండ్ బెంట్లీని ఆరో బ్రాండ్‌గా చేర్చుకున్నట్లు సంస్థ తెలిపింది.
దీంతో ఇకపై బెంట్లీ వాహనాల దిగుమతులు, విక్రయం, సరీ్వసింగ్ మొదలైనవన్నీ ఎస్‌ఏవీడబ్ల్యూఐపీఎల్ చేపడుతుంది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. బెంట్లీ ఇండియా బ్రాండ్ డైరెక్టరుగా అబీ థామస్ నియమితులయ్యారు. భారత్‌లో పెరుగుతున్న అత్యంత సంపన్న వర్గాలకు(యూహెచ్‌ఎన్‌ఐ) ఈ డీల్‌తో ప్రయోజనం చేకూరుతుందని ఎస్‌ఏవీడబ్ల్యూఐపీఎల్ ఎండీ పీయుష్ ఆరోరా తెలిపారు.