
వాషింగ్టన్: భారత్-పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్-పాకిస్తాన్‌ల మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపా. అణుయుద్ధం జరిగి ఉంటే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారు. అందుకే అణుయుద్ధాన్ని ఆపేలా భారత్-పాక్‌లపై ఒత్తిడి తెచ్చా. యుద్ధం కొనసాగిస్తామంటే మీతో వ్యాపారం చేయనని చెప్పా. దీంతో ఆ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దాయాది దేశాల కాల్పుల విరమణ క్రెడిట్ నాదే’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు యుద్ధం విషయంలో ప్రస్తుతం భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ చెప్పారు. త్వరలో పాక్‌తో కూడా మాట్లాడుతానని వివరించారు.
#WATCH | US President Donald Trump says, "...I'm very proud to let you know that the leadership of Indian and Pakistan was unwavering and powerful, but unwavering in both cases - they really were from the standpoint of having the strength and the wisdom and fortitude to fully… pic.twitter.com/rFbznHMJDF
— ANI (@ANI) May 12, 2025