కాశ్మీర్ అంశంపై మా విధానంలో మార్పు లేదు: విదేశాంగ శాఖ | No Changes in Jk Policy Says Ministry of External Affairs | Sakshi
Sakshi News home page

కాశ్మీర్ అంశంపై మా విధానంలో మార్పు లేదు: విదేశాంగ శాఖ

May 13 2025 6:21 PM | Updated on May 13 2025 6:50 PM

No Changes in Jk Policy Says Ministry of External Affairs

ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌కు భారత్ గట్టి గుణపాఠం చెప్పింది. పహల్గాం ఘటన తరువాత సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. భారత్ అమెరికా నాయకులు మాట్లాడారు. అయితే ఇందులో వాణిజ్యపరమైన అంశాలపై చర్చలు జరగలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి 'రంధీర్ జైస్వాల్' పేర్కొన్నారు.

కాల్పుల విరమణకు కోసం పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఈ విషయంపై రెండు దేశాల DGMOల మధ్య అవగాహనా కుదిరింది. సింధూ నదీ జలాల రద్దు ఒప్పందం కొనసాగుతుంది. పాక్ ఉగ్రవాదాన్ని ఆపేవరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

కాశ్మీర్ అంశంపై ద్వైపాక్షింగా చర్చిస్తాం. ఈ అంశంపై మా విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైన చర్చలు ఉంటాయి. టీఆర్ఎఫ్ లష్కరితోయోబా సంస్థ. దీనిపైన అంతర్జాతీయంగా నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో భారత్‌కు ఉన్న ఏకైక పరిష్కారం కాని సమస్య.. అక్రమంగా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి ఇవ్వడం. పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని విడిచిపెట్టడం అనేది పరిష్కారం కాని విషయం' అని జైస్వాల్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement