
ఆ తర్వాతే శాంతి చర్చలు
పుతిన్ పత్రిపాదనపై జెలెన్‌స్కీ
మాస్కో/కీవ్: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో 30 రోజులపాటు సంపూర్ణ, బేషరతు కాల్పుల విరమణ పాటించాలని యూరప్ ప్రధాన దేశాల నేతలు ఇచ్చిన పిలుపుపై రష్యా అధ్యక్షుడు పుతిన్ శనివారం రాత్రి స్పందించారు. ఎలాంటి షరతులు లేకుండా తుర్కియేలోని ఇస్తాంబుల్ వేదికగా ఉక్రెయిన్‌తో తక్షణమే ముఖాముఖి చర్చలకు తాము సిద్ధమని ప్రకటించారు. చర్చల సమయంలో కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశముంటుందని పుతిన్ పేర్కొన్నారు.
అయితే, కాల్పుల విరమణను ముందుగా అమల్లోకి వచ్చాకే చర్చలకు కూర్చుందామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం స్పష్టం చేశారు. కాల్పుల విరమణ చర్చలకు సానుకూల సంకేతమని తెలిపారు. దీని కోసమే యావత్ ప్రపంచం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కాగా, పుతిన్ ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం ప్రకటించారు. ‘ఈ ప్రతిపాదన రెండు దేశాలకూ మంచిదే. చర్చలకు అవకాశం కల్పించేందుకు రెండు దేశాలతోనూ కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా’అని పేర్కొన్నారు.