లుంగీలోనే దేశం దాటేసిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని | Bangladeshs Former President Mohammad Abdul Hamid Has Left the Country Check details here | Sakshi
Sakshi News home page

లుంగీలోనే దేశం దాటేసిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని

May 13 2025 5:19 PM | Updated on May 13 2025 5:29 PM

Bangladeshs Former President Mohammad Abdul Hamid Has Left the Country Check details here

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని 'షేక్ హసీనా' ఇప్పటికే దేశం విడిచి ఇండియాలో తలదాచుకుంటోంది. కాగా తాజా ఆ దేశ మాజీ అధ్యక్షుడు 'మహమ్మద్ అబ్దుల్ హమీద్' లుంగీలోనే.. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్ ఎయిర్‌వేస్ విమానం ఎక్కి దేశం విడిచి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది.

అబ్దుల్ హమీద్ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు (2013 నుంచి 2023 వరకు) పనిచేశారు. 2024లో జరిగిన ఆందోళన కాలంలో పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనా.. ఆమె సహాయకులపై నమోదైన ఒక హత్య కేసులో ఆయన కూడా సహ నిందితుడు ఉన్నట్లు సమాచారం. హసీనాను పదవీచ్యుతురాలిని చేయడానికి బయలుదేరిన నిరసనకారులపై కాల్పులు జరిపి, వారిని చంపిందని ఆరోపణలు వచ్చాయి.

ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం.. జనవరి 14న కిషోర్‌గంజ్ సదర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో మహమ్మద్ అబ్దుల్ హమీద్ నిందితుడిగా ఉన్నారు. హసీనా.. ఆమె కుటుంబ సభ్యులు షేక్ రెహానా, సజీబ్ వాజెద్ జాయ్, సైమా వాజెద్ పుతుల్ కూడా సహ నిందితులుగా ఉన్నారు. మాజీ మంత్రి ఒబైదుల్ ఖాదర్ కూడా ఈ కేసులో ఒక నిందితుడు.

మాజీ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ థాయిలాండ్‌కు వెళ్లడంపై దర్యాప్తు చేయడానికి.. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం విద్యా సలహాదారు సీఆర్ అబ్రార్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని యునైటెడ్ న్యూస్ ఆఫ్ బంగ్లాదేశ్ వార్తా సంస్థ తెలిపింది.

మహమ్మద్ అబ్దుల్ హమీద్.. కుటుంబ సభ్యులతో కలిసి వైద్య చికిత్స కోసం వెళ్లారని చెబుతున్నారు. కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థులు బంగ్లాదేశ్‌లో విచారణ నుంచి తప్పించుకోవడానికి పారిపోయారని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement