బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్గా ఓ హిందువు నియామకం | Bangladesh gets its first Hindu Chief Justice | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్గా ఓ హిందువు నియామకం

Jan 12 2015 6:51 PM | Updated on Oct 5 2018 9:09 PM

బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు - Sakshi

బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు

ముస్లిం జనాభా అధికంగా ఉండే బంగ్లాదేశ్లోని అత్యున్న న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా తొలిసారి ఓ హిందువు నియమించారు.

 ఢాకా: ముస్లిం జనాభా అధికంగా ఉండే బంగ్లాదేశ్లోని అత్యున్న న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా తొలిసారి ఓ హిందువు నియమించారు. అత్యున్నత కోర్టులో సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎస్‌కే సిన్హా(64)ను బంగ్లా అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్ సీజేగా నియమించారు. అధ్యక్ష భవనంలో జనవరి 17న జస్టిస్ సిన్హా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన  దాదాపు మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.

కాగా, బంగ్లాబంధుగా పేరుగాంచిన షేక్ ముజిబుర్ రహ్మాన్ హత్య కేసు, 5వ, 13వ రాజ్యాంగ సవరణలతో  సహా పలు సంచలనాత్మక కేసుల్లో జస్టిస్ సిన్హా కీలక తీర్పులు ఇచ్చారు. ఆయన ఈ దేశంలో ముస్లిమేతర వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం ఇదే మొదటిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement