
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's World Cup 2025) సంచలనం నమోదైంది. పాకిస్తాన్‌ను (Pakistan) వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ (Bangladesh) చిత్తుగా ఓడించింది. కొలొంబో వేదికగా నిన్న (అక్టోబర్ 2) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. బంగ్లా బౌలర్ల ధాటికి 389.3 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది.
షోర్నా అక్తర్ 3, మరుఫా అక్తర్, నహిద అక్తర్ చరో 2, నిషిత అక్తర్, ఫహీమా ఖాతూన్, రబేయా ఖాన్ తలో వికెట్ తీసి పాక్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు.
పాక్ ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన రమీన్ షమీమ్ టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ ఫాతిమా సనా (22), మునీబా అలీ (17), అలియా రియాజ్ (13), సిద్రా నవాజ్ (15), డయానా బేగ్ (16 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమైమా సోహైల్, సిద్రా అమీన్ డకౌట్లయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 31.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రుబ్యా హైదర్ (54) అజేయ అర్ద సెంచరీతో బంగ్లాదేశ్‌ను గెలిపించింది.
కెప్టెన్ నిగార్ సుల్తానా (23), శోభన మోస్తరి (24 నాటౌట్) రుబ్యాకు సహకరించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, డయానా బేగ్, రమీన్ షమీమ్‌కు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబో వేదికగా జరుగనుంది.
చదవండి: IND VS WI 1st Test: ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా