
తుర్కియేలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదైయినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ఇస్తాంబుల్‌లో బలమైన ప్రకంపనలు రాగా, ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయందోళనకు గురై.. ప్రాణ భయంతో ప్రజలంతా రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో రహదారులపై వెళ్తున్న కార్లు భూకంప తీవ్రతకు ఊగిపోయాయి.
ఈ భూకంపం టర్కీలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్స్‌ను తాకినట్లు సమాచారం. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలొ వైరల్‌గా మారాయి. భూకంపం కారణంగా భయాందోళనలకు గురైన కొందరు భవనాల నుండి దూకడానికి ప్రయత్నించగా.. కొందరు గాయపడినట్లు సమాచారం. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
🚨BIG BREAKING: Earthquake HITS Turkey🇹🇷 pic.twitter.com/Hd6NEFu15t
— Manobala Vijayabalan (@ManobalaV) May 15, 2025