breaking news
quake effect
-
తుర్కియేను కుదిపేసిన భూకంపం.. భయంతో జనం పరుగులు
తుర్కియేలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదైయినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ఇస్తాంబుల్‌లో బలమైన ప్రకంపనలు రాగా, ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయందోళనకు గురై.. ప్రాణ భయంతో ప్రజలంతా రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో రహదారులపై వెళ్తున్న కార్లు భూకంప తీవ్రతకు ఊగిపోయాయి.ఈ భూకంపం టర్కీలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్స్‌ను తాకినట్లు సమాచారం. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలొ వైరల్‌గా మారాయి. భూకంపం కారణంగా భయాందోళనలకు గురైన కొందరు భవనాల నుండి దూకడానికి ప్రయత్నించగా.. కొందరు గాయపడినట్లు సమాచారం. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.🚨BIG BREAKING: Earthquake HITS Turkey🇹🇷 pic.twitter.com/Hd6NEFu15t— Manobala Vijayabalan (@ManobalaV) May 15, 2025 -
ఏపీలోని పలు జిల్లాల్లోనూ కంపించిన భూమి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా భూకంప ప్రభావం కనిపించింది. రిక్టర్ స్కేలు మీద దీని తీవ్రత 5.4 గా నమోదైనట్లు తెలుస్తోంది. విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. మధురవాడ, పీఎం పాలెం, మాధవధార, మురళీనగర్, విశాలాక్షి నగర్ తదితర ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. అయితే నగరంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రభావం అంతగా లేదని విశాఖపట్నానికి చెందిన సురేష్ తెలిపారు. తాను ఆఫీసు పనిమీద ఉదయమే బయటకు వచ్చేశానని, తల్లిదండ్రులు, స్నేహితులు చెబితే తప్ప అసలు విశాఖలో భూకంపం వచ్చినట్లే అనిపించలేదని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, కాళ్లకూరు, మొగల్తూరు, నరసాపురం తదితర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పరిసరాల్లోని కొన్ని ప్రాంతాలపై భూకంపం ప్రభావం కనిపించింది. కృష్ణాజిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. విజయవాడలోని బెంజి సర్కిల్ కృష్ణలంక, భవానీపురం తదితర ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్లు చెబుతున్నారు.