
అమెరికా - చైనా ప్రతీకార సుంకాల విషయంలో ఒక డీల్ కుదుర్చుకున్న తరువాత.. బీజింగ్‌లో బ్రెజిల్, కొలంబియా, చిలీ అధ్యక్షులతో సహా లాటిన్ అమెరికా, కరేబియన్ అధికారుల శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు 'జిన్‌పింగ్' మాట్లాడారు. బెదిరింపులు, ఆధిపత్య ధోరణి వల్ల ఎదురుదెబ్బలు తగులుతాయని, ఒంటరిని చేస్తాయని అన్నారు.
ప్రతీకార సుంకాలు లేదా వాణిజ్య యుద్ధాలలో విజేతలు ఉండరు. వివిధ దేశాలు కలిసి పనిచేస్తేనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని జిన్‌పింగ్ అన్నారు. ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఒక దేశం ఇంకో దేశానికి సహకరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
టారిఫ్‌లకు 90 రోజులు బ్రేక్
అమెరికా దిగుమతులపైన చైనా రెండు దేశాలు ఇప్పటికి విధించిన సుంకాలలో 115 శాతం తగ్గించుకున్నాయి. అంటే చైనా.. అమెరికాపై విధించిన 125 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయగా.. అమెరికా, చైనాపై విధించిన సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితం చేసింది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది.