ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం, తిథి: శు.చతుర్దశి సా.5.42 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: పూర్వాషాఢ ప.1.43 వరకు, తదుపరి ఉత్తరషాఢ,వర్జ్యం: రా.10.28 నుండి 12.13 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.05 వరకు, తదుపరి రా.10.58 నుండి 11.43 వరకు,అమృత ఘడియలు: ఉ.8.24 నుండి 10.10 వరకు.సూర్యోదయం : 5.40సూర్యాస్తమయం : 6.32రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకుమేషం.. మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరుత్సాహం. కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.వృషభం... వ్యవహారాల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగులకు అదనపు పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. కళాకారులకు ఒత్తిడులు.మిథునం... చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి. పుణ్యక్షేత్రాలు సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి. బంధువుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. విందువినోదాలు.కర్కాటకం....కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో విజయం. బంధువులతో సఖ్యత. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. తీర్థయాత్రలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.సింహం... రుణబాధలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.కన్య... ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ఖర్చులు అధికం. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల కలయిక. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు.తుల... నూతన పరిచయాలు. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సఖ్యత. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. ఆహ్వానాలు అందుతాయి.వృశ్చికం... కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యయప్రయాసలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగాలలో అదనపు పనిభారం.ధనుస్సు... సోదరులు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి..మకరం.... ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో స్వల్ప అవాంతరాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలలో నిరుత్సాహమే. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు..కుంభం.. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.మీనం.. పలుకుబడి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. నూతన ఉద్యోగప్రాప్తి. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. విందువినోదాలు.
జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం..
హైదరాబాద్: ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు గాయమైంది. ఈరోజు(సోమవారం, జూలై 27వ తేదీ) సాయంత్రం జూ. ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసిన ఎన్టీఆర్ కార్యాలయం.. డా. జె. మధుసూదన్ రావు మరియు డా. ఆర్. ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు స్పష్టం చేసింది. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసింది. ఎన్టీఆర్ ఆరోగ్యం, కోలుకునే ప్రక్రియకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని తగిన సమయంలో ఎప్పటికప్పుడు అందిస్తామని ఎన్టీఆర్ టీమ్ పేర్కొంది. NTR sustained an unfortunate shoulder injury and advised 6 to 8 weeks of complete Rest! pic.twitter.com/y5B0gYJ8kI— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) July 27, 2026
రజత రాజా... వెండి జ్ఞానేశ్వరి
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. భారత వెయిట్‌లిఫ్టర్లు ఈ మూడు పతకాలు అందించారు. పురుషుల విభాగంలో రాజా ముత్తుపండి, మహిళల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్‌లకు రజతాలు లభించగా... మణిపూర్ ప్లేయర్ బింద్యారాణి దేవి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం భారత్ ఒక స్వర్ణం, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఆరు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 42 పతకాలతో (18 స్వర్ణాలు, 9 రజతాలు, 15 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. మహిళల 53 కేజీల కేటగిరీలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం గెలుచుకుంది. స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీల బరువెత్తి (మొత్తం 199 కేజీలు) ఆమె రెండో స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన ఒనోమ్ ఒమొలొలా దీదీ మొత్తం 206 కేజీలు (93+113) స్వర్ణం సాధించి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పగా... రెబెకా గ్రోక్స్ (కెనడా–178 కేజీలు) కాంస్యం అందుకుంది. స్నాచ్‌లో వరుసగా 82, 85, 88 కేజీల బరువుతో తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్న జ్ఞానేశ్వరి...క్లీన్ అండ్ జర్క్‌లో కూడా వరుసగా మూడు ప్రయత్నాల్లో 103, 107, 111 కేజీల బరువును ఎత్తింది. వెయిట్‌లిఫ్టింగ్ పురుషుల విభాగంలో భారత్‌కు రాజా ముత్తుపండి రజతంతో మెరిశాడు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 126 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 160 కేజీలు కలిపి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తిన రాజాకు రజతం లభించింది. ఈ ఈవెంట్లో అజ్నిల్ బిన్ బిదిన్ ముహమ్మద్ (మలేసియా) కామన్వెల్త్ రికార్డు 299 కేజీలు (133+166)తో స్వర్ణం గెలుచుకోగా, మోరియా బారు (పవువా న్యూ గినియా; 282 కేజీలు)కు కాంస్యం లభించింది. ఈసారి కాంస్యం.. మహిళల 58 కేజీల కేటగిరీలో బింద్యారాణి దేవి సొరొఖైబమ్కు కాంస్య పతకం దక్కింది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలుచుకున్న ఆమె ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని బరిలోకి దిగినా... కాంస్యానికే పరిమితమైంది. ఒకదశలో స్వర్ణం దిశగా సాగుతున్నట్లు అనిపించినా... చివర్లో ఆమె తడబడింది. ఓవరాల్‌గా 199 కేజీలు (స్నాచ్‌లో 87 + క్లీన్ అండ్ జర్క్‌లో 112) బరువు ఎత్తిన బింద్యారాణి మూడో స్థానంతో ముగించింది. ఈ పోటీల్లో రఫియతు లవాల్ (నైజీరియా; 229 కేజీలు) కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకోగా... ఆన్ సోఫీ (కెనడా; 215 కేజీలు)కు రజతం దక్కింది. బింద్యారాణి గతంలో కామన్వెల్త్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఒక స్వర్ణం, 2 రజతాలు సాధించింది.పోలీస్ ఖాతాలో పతకం... ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌కు చెందిన 23 ఏళ్ల జ్ఞానేశ్వరి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)గా పని చేస్తోంది. చిన్న వయసులో ముందు పవర్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి చూపించిన ఆమెను వెయిట్‌లిఫ్టింగ్ మరింతగా ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక క్రీడాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జ్ఞానేశ్వరి వెలుగులోకి వచ్చింది. ఎల్రక్టీషియన్ అయిన తండ్రి దీపక్ యాదవ్ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురైనా... కూతురిని ఆమె లక్ష్యం దిశగా ప్రోత్సహించడంలో ఎప్పుడూ వెనుకాడలేదు. జూనియర్ స్థాయిలో పలు విజయాలతో గుర్తింపు దక్కించుకున్న ఆమె... పాటియాలాలోనే ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో శిక్షణ పొందుతోంది. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 5వ స్థానంలో నిలిచిన జ్ఞానేశ్వరి ఇటీవలే ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకుంది. ఈ కామన్వెల్త్ క్రీడల కోసం గ్లాస్గోలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో బర్మింగ్‌హామ్‌లోని వార్లీ వెయిట్‌లిఫ్టింగ్ క్లబ్లో ప్రత్యేకంగా సిద్ధమై ఫలితం సాధించింది.ఫైనల్లో సాజన్ ప్రకాశ్ స్విమ్మింగ్ పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో భారత స్టార్ సాజన్ ప్రకాశ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కేరళకు చెందిన ‘డబుల్ ఒలింపియన్’ సాజన్ హీట్–2లో 1ని:58.59 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఆరో ఫాస్టెస్ట్ స్విమ్మర్‌గా సాజన్ ఫైనల్లో చోటు సంపాదించాడు. క్వార్టర్స్‌లో అంకుశ్, సచిన్ పురుషుల బాక్సింగ్ ఈవెంట్లో భారత బాక్సర్లు అంకుశ్, సచిన్ సివాచ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పతకాలు ఖరారు చేసుకోవడానికి విజయం దూరంలో నిలిచారు. 80 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో అంకుశ్ 5:0తో జాన్ జలాన్ (అంటిగ్వా అండ్ బార్బుడా)పై గెలుపొందగా... 60 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో సచిన్ 4:1తో విలియమ్ హెవిట్ (ఇంగ్లండ్)ను ఓడించాడు.నిరాశపరిచిన సమంత మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఫైనల్లో భారత జిమ్నాస్ట్ ప్రొతీస్థా సమంత నిరాశ పరిచింది. సమంత 12.883 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. లియా మోనిక (కెనడా; 14.000 పాయింట్లు) స్వర్ణం, అబిగెయిల్ మార్టీన్ (ఇంగ్లండ్; 13.799 పాయింట్లు) రజతం, రోపెర్ (వేల్స్; 13.433 పాయింట్లు) కాంస్యం నెగ్గారు.లాంగ్‌జంప్ ఫైనల్లో శ్రీశంకర్అథ్లెటిక్స్ ఫీల్డ్ ఈవెంట్ లాంగ్‌జంప్‌లో భారత్ నుంచి ఇద్దరు ఫైనల్లోకి అడుగు పెట్టారు. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో రజతం నెగ్గిన శ్రీశంకర్తోపాటు లోకేశ్ సత్యనాథన్ ఫైనల్లోకి ప్రవేశించారు. క్వాలిఫయింగ్‌లో శ్రీశంకర్ 8.01 మీటర్ల దూరం గెంతి నేరుగా ఫైనల్‌కు చేరాడు. క్వాలిఫయింగ్ ప్రమాణం 8 మీటర్ల కావడంతో శ్రీశంకర్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించాడు. లోకేశ్ 7.77 మీటర్ల దూరం గెంతి ఓవరాల్‌గా ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్ శిర్సే కూడా ఫైనల్లోకి ప్రవేశించాడు. హీట్ రేసును తేజస్ 13.76 సెకన్లలో ముగించి ఓవరాల్‌గా ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల 100 మీటర్ల విభాగంలో జాతీయ చాంపియన్ గురీందర్వీర్ సింగ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. గురీందర్వీర్ 10.39 సెకన్లలో గమ్యానికి చేరి ఓవరాల్‌గా 28వ స్థానంలో నిలిచాడు.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో డేటా చోరీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో భారీ హ్యాకింగ్ చోటు చేసుకుంది. ఏకంగా 1 టీబీ (1000 జీబీ) డేటా లీకయ్యింది. ఇందులో కస్టమర్ల సమాచారంతో పాటు బ్యాంకు అంతర్గత వివరాలు కూడా ఉన్నాయి. సైబర్ చోరీకి పాల్పడింది తామేనని ప్రకటించుకున్న ట్రిపుల్ఎక్స్ అనే హ్యాకింగ్ గ్రూప్.. ఈ డేటాను డార్క్ వెబ్‌లో ఉచితంగా పోస్ట్ చేసింది. డార్క్ వెబ్ ప్లాట్‌ఫాం ర్యాన్సమ్వేర్. లైవ్‌లో జూలై 24న పెట్టిన పోస్ట్ ప్రకారం ట్రిపుల్ఎక్స్ తస్కరించిన డేటాలో 1,00,000 నుంచి 3,00,000 వరకు కస్టమర్ అప్లికేషన్ ఫారంలు ఉన్నాయి. ఖాతా తెరిచేటప్పుడు కస్టమర్లు ఇచ్చిన ఫొటోలు, ఐడెంటిటీ డాక్యుమెంట్లు, సేవింగ్స్..కరెంటు ఖాతాల సమాచారం, రుణ దరఖాస్తు రికార్డులు, నెట్‌బ్యాంకింగ్ యూజర్ వివరాలు, ఎన్నారై, కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన సమాచారం ఉంది. ఆడిట్ రిపోర్టులు, రుణాల మదింపు పత్రాలు, విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ రికార్డులు, బీవోబీ వరల్డ్ ఆడిట్ రిపోర్టుల్లాంటి బ్యాంకు అంతర్గత వివరాలు కూడా ఇందులో ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు. దీన్నొక ’సైబర్ విపత్తు’గా వారు అభివరి్ణంచారు. ఆర్థిక సంస్థల డేటాను ట్రిపుల్ఎక్స్ దొంగిలించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలోనే ఇండోనేసియాకి చెందిన ప్రభుత్వ రంగ బ్యాంక్ నెగారా ఇండోనేసియా నుంచి 2 టీబీ డేటాను చోరీ చేసింది. ఫోరెన్సిక్ విచారణ చేపట్టిన బ్యాంకు.. ఒక ఉద్యోగి ఈమెయిల్ని ఉపయోగించుకుని హ్యాకర్లు అనధికారికంగా డేటాను దక్కించుకున్నట్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో బీవోబీ వెల్లడించింది. దీన్ని సత్వరం గుర్తించి, నష్టనివారణ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. దీనిపై సమగ్ర ఫోరెన్సిక్ విచారణ చేపట్టినట్లు వివరించింది. అయితే, లీక్ ఎప్పుడు జరిగింది, ఏయే వివరాలు చోరీకి గురయ్యాయి, సదరు ఉద్యోగి హోదా మొదలైన విషయాలను వెల్లడించలేదు. తమ కోర్ బ్యాంకింగ్ సిస్టం సురక్షితంగానే ఉందని, అందులోకి హ్యాకర్లు చొరబడలేదని బ్యాంకు స్పష్టం చేసింది. కీలక డేటాను సురక్షితంగా ఉంచేందుకు పటిష్టమైన భద్రత ప్రమాణాలు పాటిస్తున్నామని వివరించింది.
మార్క్‌ఫెడ్ ద్వారా రూ.300 కోట్లు అప్పు
చావనైనా చస్తాం.. 'భూములు ఇవ్వం'
బ్యాంక్ ఆఫ్ బరోడాలో డేటా చోరీ
దగా డీఎస్సీపై తిరుగుబాటు
అప్పుల ఊబిలో ఆంధ్రా రైతులు
ఏపీఈఆర్సీ ఫ్యూజులు పీకేశారు
ఫుడ్ ఫెస్టివల్లో కాల్పుల కలకలం
శిశువు కోసం ‘సమరం’
చెయ్యేరుకు గర్భశోకం!
ఏపీ డీఎస్సీపై కేంద్రం స్పందన
మన టార్గెట్ రీచ్ అయ్యాం!
జియో రీచార్జ్.. కొత్త రూ.200 ప్లాన్
మరో కలకలం రేపిన ఇరాన్.. ఇక ట్రంప్ ఊరుకుంటారా?
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా
సడెన్‌గా నా కార్‌వ్యాన్‌లోకి వచ్చి బట్టలిప్పేసాడు.!
భార్య జైనాబ్‌పై ట్రోలింగ్.. అఖిల్ స్పందన
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
చైతూ-శోభిత గుడ్ న్యూస్ చెప్పనున్నారా?
రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడికి ఈ-కేవైసీ తప్పనిసరి
మిస్ యూ నానమ్మ.. పూరీ కూతురు పోస్ట్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఎప్పటికైనా ఆ ఇద్దరి దర్శకత్వంలో నటిస్తే చాలు: భాగ్యశ్రీ
బంగారం, వెండి ధరలు ఇలా..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. యత్నకార్యసిద్ధి
వేదికపై ఒక్కరే.. వెనుక ఏడుగురు
ఉద్యోగం పోగొట్టిన రూ.4.5 కోట్ల జీతం!
ఎట్టకేలకు... కదలిన కృష్ణమ్మ
ప్రధాన్ రాజీనామాపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు!
ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు భారీ జరిమానా..
మార్క్‌ఫెడ్ ద్వారా రూ.300 కోట్లు అప్పు
చావనైనా చస్తాం.. 'భూములు ఇవ్వం'
బ్యాంక్ ఆఫ్ బరోడాలో డేటా చోరీ
దగా డీఎస్సీపై తిరుగుబాటు
అప్పుల ఊబిలో ఆంధ్రా రైతులు
ఏపీఈఆర్సీ ఫ్యూజులు పీకేశారు
ఫుడ్ ఫెస్టివల్లో కాల్పుల కలకలం
శిశువు కోసం ‘సమరం’
చెయ్యేరుకు గర్భశోకం!
ఏపీ డీఎస్సీపై కేంద్రం స్పందన
మన టార్గెట్ రీచ్ అయ్యాం!
జియో రీచార్జ్.. కొత్త రూ.200 ప్లాన్
మరో కలకలం రేపిన ఇరాన్.. ఇక ట్రంప్ ఊరుకుంటారా?
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా
సడెన్‌గా నా కార్‌వ్యాన్‌లోకి వచ్చి బట్టలిప్పేసాడు.!
భార్య జైనాబ్‌పై ట్రోలింగ్.. అఖిల్ స్పందన
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
చైతూ-శోభిత గుడ్ న్యూస్ చెప్పనున్నారా?
రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడికి ఈ-కేవైసీ తప్పనిసరి
మిస్ యూ నానమ్మ.. పూరీ కూతురు పోస్ట్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఎప్పటికైనా ఆ ఇద్దరి దర్శకత్వంలో నటిస్తే చాలు: భాగ్యశ్రీ
బంగారం, వెండి ధరలు ఇలా..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. యత్నకార్యసిద్ధి
వేదికపై ఒక్కరే.. వెనుక ఏడుగురు
ఉద్యోగం పోగొట్టిన రూ.4.5 కోట్ల జీతం!
ఎట్టకేలకు... కదలిన కృష్ణమ్మ
ప్రధాన్ రాజీనామాపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు!
ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు భారీ జరిమానా..
ఫొటోలు
ISSF World Cup: అదరగొట్టిన భారత షూటర్లు.. సింగ్‌కు స్వర్ణం, మనుకు కాంస్యం (ఫొటోలు)
'మహేంద్రగిరి వారాహి' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు మనవి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. (ఫొటోలు)
గర్ల్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ (ఫొటోలు)
మీనాక్షి చౌదరి అమెరికా ట్రిప్.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)
ఏపీ : విశాఖపట్నం దగ్గరలో అద్భుతమైన జలపాతం... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
డాక్టర్ సతీశ్‌రెడ్డికి 'ఛేంజ్ మేకర్' పురస్కారం అందజేసిన చిరంజీవి (ఫొటోలు)
శ్రీకాళహస్తి : ధర్మరాజులస్వామి ఆలయంలో శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం (ఫొటోలు)
'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బోనాలు (ఫోటోలు)
సినిమా
జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం..
హైదరాబాద్: ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు గాయమైంది. ఈరోజు(సోమవారం, జూలై 27వ తేదీ) సాయంత్రం జూ. ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసిన ఎన్టీఆర్ కార్యాలయం.. డా. జె. మధుసూదన్ రావు మరియు డా. ఆర్. ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు స్పష్టం చేసింది. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసింది. ఎన్టీఆర్ ఆరోగ్యం, కోలుకునే ప్రక్రియకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని తగిన సమయంలో ఎప్పటికప్పుడు అందిస్తామని ఎన్టీఆర్ టీమ్ పేర్కొంది. NTR sustained an unfortunate shoulder injury and advised 6 to 8 weeks of complete Rest! pic.twitter.com/y5B0gYJ8kI— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) July 27, 2026
ఓటీటీలో క్రేజీ క్రైమ్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
ఓటీటీల్లోకి వచ్చే సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో కొన్ని కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా అలానే రెస్పాన్స్ అందుకుంటాయి. అలా నాలుగేళ్ల క్రితం వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కి సంబంధించి కొత్త సీజన్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి లవ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)2022లో ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో 'వదంది' అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయిన దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ మర్డర్ నేపథ్యంగా దాన్ని తెరకెక్కించారు. ఆ సీజన్ అక్కడితో ముగిసిపోయింది. అయితే ఈ సిరీస్‌లో రెండో సీజన్‌ని కొత్త స్టోరీ, కొత్త పాత్రలతో తెరకెక్కించారు. ఆగస్టు 07 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.'వదంది : ది మిస్టరీ ఆఫ్ మణి' పేరిట తీసిన ఈ సిరీస్‌లో శశి కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఆండ్రూ లూయిస్ ఈ సీజన్‌కు దర్శకుడు కాగా స్టార్ డైరెక్టర్స్ పుష్కర్-గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో ప్రధాన పాత్రధారి అయిన ఎస్సై చేసిన తప్పు వల్ల ఓ అమాయకుడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తన తప్పు తెలుసుకున్న ఎస్సై.. సదరు వ్యక్తిని జైలు నుంచి ఎలా విడిపించాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
ఎన్నిసార్లు విడాకులు అడిగినా ఆమె ఇవ్వలేదు
బాలీవుడ్ తొలితరం సూపర్‌స్టార్ రాజేశ్ ఖన్నా.. 2012లో చనిపోయారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం రాజేశ్ మాజీ భాగస్వామి అనితా అద్వానీ. కొన్నాళ్ల క్రితం తమ సహజీవనానికి చట్టబద్ధ గుర్తింపు కోరుతూ బాంబే హైకోర్టులో ఈమె పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని న్యాయస్థానం కొట్టేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనిత.. రాజేశ్ ఖన్నా, ఆయన భార్య డింపుల్ కపాడియా గురించి సంచలన కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)1973లో తనకంటే చాలా చిన్న వయసున్న డింపుల్ కపాడియాని రాజేష్ ఖన్నా పెళ్లి చేసుకున్నారు. వీరికి ట్వింకిల్ ఖన్నా(హీరో అక్షయ్ కుమార్ భార్య), రింకీ ఖన్నా అనే కూతుళ్లు ఉన్నారు. 1982లో డింపుల్, రాజేష్ ఖన్నా ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా బతికారు గానీ అధికారికంగా విడాకులు తీసుకోలేదు. అయితే డింపుల్ దూరమైన తర్వాత రాజేశ్ ఖన్నా.. 2012లో మరణించే వరకు అనితా అద్వానీ అనే మహిళతో కలిసున్నారు. ఈ క్రమంలోనే తమ బంధానికి చట్టబద్ధ గుర్తింపు ఇవ్వాలని అనిత.. బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 1న ఈమె అప్పీల్‌ని హైకోర్టు కొట్టివేసింది. ఇది లివ్-ఇన్ రిలేషన్షిప్ మాత్రమేనని, హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే పెళ్లిగా పరిగణించలేదని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనితా అద్వానీ.. నా కేసుని హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద విచారించడం సరైనది కాదు. నన్ను భార్యగా గుర్తించలేమని కోర్టు పేర్కొంది. చెప్పాలంటే రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాని ఎన్నోసార్లు విడాకులు అడిగారు. కానీ ఆమె అంగీకరించలేదు. విడాకులు ఇవ్వాలంటే ఆస్తులన్నీ తమ పేరు మీద బదిలీ చేయాలని షరతు విధించింది. రాజేష్ ఖన్నా, డింపుల్ చాలా ఏళ్లుగా కలిసి జీవించలేదు. అయితే వాళ్లు విడాకులు కూడా తీసుకోకపోవడం వల్ల నాలాంటి వ్యక్తికి ఎలాంటి చట్టపరమైన హక్కులు లేకుండా పోయాయి. ఒక వ్యక్తి జీవితంలో కొత్తగా వచ్చిన వ్యక్తికి చట్టపరమైన రక్షణ లభించకపోవడం బాధాకరం అని అనితా అద్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమె చేసిన వ్యాఖ్యలపై డింపుల్ కపాడియా లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేదు.(ఇదీ చదవండి: 'నీట్' వైరల్ గర్ల్.. ఇన్ స్టాతో రూ.10 లక్షల సంపాదనా?)
'నీట్' వైరల్ గర్ల్.. ఇన్ స్టాతో రూ.10 లక్షల సంపాదనా?
నీట్ పేపర్ లీకేజీ విషయమై కొన్నిరోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా ఎంతలా విద్యార్థి నిరసనలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ ప్రధాన్ రాజీనామా చేయడంతో అంతా సద్దుమణిగింది. అయితే గత బుధవారం ముంబైలో నిరసన జరుగుతున్న టైంలో పోలీస్ వ్యాన్ని అడ్డుకుని ఓ అమ్మాయి తెగ వైరల్ అయిపోయింది. ఆమెనే రియా యాదవ్. ఈమె నటి, మోడల్ అయిన ఈమె వైరల్ ఫొటోని సెలబ్రిటీలు కూడా షేర్ చేశాడు. అయితే తనకొచ్చిన ఫేమ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఇన్‌స్టాలో సబ్స్క్రిప్షన్ మొదలుపెట్టిందని, ఏకంగా రూ.10 లక్షల వరకు సంపాదించేసిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె చెవినపడేసరికి ఘాటుగా స్పందించింది.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)'ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ద్వారా నేను ఎలాంటి ఆదాయం పొందలేదు. చెప్పాలంటే ఇప్పటికే వచ్చిన ఆదాయాన్ని స్వీకరించేందుకు నా బ్యాంక్ ఖాతాని కూడా ఇన్ స్టాకి కనెక్ట్ చేయలేదు. నిజాలు తెలుసుకోకుండా నాపై విమర్శలు చేస్తున్నవారు.. జీవితంలో ఏదైనా సాధించకుండా ఇతరులపై ఆరోపణలు చేయడం సులభమే. నాపై విమర్శలు చేస్తున్న వారిలో ఒక్కరూ నాతో ప్రత్యక్షంగా మాట్లాడలేదు. ఎలాంటి పరిచయం కూడా లేదు''ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాపై లేదా మరెవరిపైనా నెగిటివ్, సైబర్ వేధింపులకు సంబంధించిన పోస్టులు కనిపిస్తే వాటిని రిపోర్ట్ చేయండి. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ఓ అభిప్రాయం ఏర్పరుచుకోండి. పౌరుల హక్కుల కోసం నిలబడటంతో పాటు తోటి పౌరుల పట్ల బాధ్యతతో వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం. నేను తీసుకున్న వైఖరి ఉద్దేశం అదే. సత్యమేవ జయతే' అని రియా యాదవ్ పోస్ట్ పెట్టింది.రియా యాదవ్ ఎవరు?రియా యాదవ్ నిరసనకారిణి మాత్రమే కాదు. నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించింది. చేతితో తయారు చేసే దుస్తుల కోసం 'రిహియాసత్' పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్ కూడా నిర్వహిస్తోంది. మొన్నటివరకు రూ.140 నెలవారీ రుసుముతో సబ్స్క్రిప్షన్ ఉంచిన ఈమె.. ఇప్పుడు విమర్శలు రావడంతో దానిని పూర్తిగా తొలగించింది.(ఇదీ చదవండి: చెన్నైలో 'జన నాయగన్' షోలకు బ్రేక్.. కారణమేంటంటే?) View this post on Instagram A post shared by ʀʜɪʏᴀ ʏᴀᴅᴀᴠ (@rhiyaahir)
క్రీడలు
నేపాల్ పేసర్ చారిత్రక ఘనత
నేపాల్ పేస్ బౌలర్ కరణ్ కేసీ వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి నేపాల్ పేసర్‌గా, సందీప్ లామిచ్ఛానే తర్వాత రెండో నేపాల్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ లీగ్-2లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కరణ్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కరణ్ 10 ఓవర్లలో కేవలం 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో రెండో వికెట్‌తో అతను 100 వికెట్ల మైలురాయిని తాకాడు.2018లో నెదర్లాండ్స్‌పై వన్డే అరంగేట్రం చేసిన కరణ్.. 72 ఇన్నింగ్స్‌ల్లో 103 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ సామర్థ్యం కూడా కలిగిన కరణ్, ఈ ఫార్మాట్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 700 పరుగులు కూడా చేశాడు. 34 ఏళ్ల కరణ్ టీ20 ఫార్మాట్లోనూ సత్తా చాటుతే 112 వికెట్లు తీశాడు.నమీబియా-నేపాల్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ (100) సెంచరీతో సత్తా చాటగా.. స్టీన్‌క్యాంప్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉండగా.. నమీబియా భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే కరణ్ (10-2-29-5) అద్భుత స్పెల్‌తో వారి ఆశలు అడియాశలు చేశాడు.
'అతడిని పక్కన పెట్టాల్సిన టైమ్ వచ్చేసింది'
జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ... స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ మాత్రం మేనెజ్మెంట్ను తీవ్ర కలవరపెడుతోంది. ఇంగ్లండ్ టూర్లో ఆశించిన స్థాయిలో రాణించలేపోయిన అభిషేక్.. జింబాబ్వే గడ్డపై అంతకంటే దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఈ ఎస్ఆర్హెచ్ స్టార్ ఓపెనర్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 11 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ బదులుగా సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలని శ్రీకాంత్ సూచించాడు.కాగా టీ20 వరల్డ్‌కప్-2026 హీరో శాంసన్‌ను జింబాబ్వే పర్యటన నుంచి సెలక్టర్లు తప్పించారు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అతడి స్ధానంలో అవకాశమిచ్చారు. అంతకుముందు ఇంగ్లండ్ టూర్లోనూ మూడు మ్యాచ్‌లకు సంజూను తుది జట్టు నుంచి పక్కన పెట్టారు. అయితే ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో మాత్రం ఈ కేరళ ఆటగాడు ఉన్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ మెరుగ్గా రాణించడంతో ఆసియా గేమ్స్ నుంచి కూడా శాంసన్‌ను తప్పించే అవకాశముంది."అభిషేక్ శర్మ బలహీనతను ప్రత్యర్ధి జట్లు పసిగట్టేశాయి. వన్డే వరల్డ్‌కప్ నుంచి అతడి ప్రదర్శనలు అంతంతమాత్రమే గానే ఉన్నాయి. అతడి విషయంలో సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోక తప్పుదు. అభిషేక్ శర్మ స్ధానంలో సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలి. అతడికి కచ్చితంగా సెలక్టర్ల నుంచి పిలుపు వస్తుందని నమ్ముతున్నాను. అదేవిధంగా జింబాబ్వే పర్యటనలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన యువ పేసర్ మయాంక్ యాదవ్‌పై శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. మయాంక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 6.5 ఏకానమీ రేటుతో 5 వికెట్లు పడగొట్టాడు.
రాజీనామా డిమాండ్ల మధ్య 'గంభీర'మైన పోస్ట్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో చేసిన ఓ క్రిప్టిక్ పోస్ట్ చర్చనీయాంశమైంది. ఇటీవల భారత జట్టు వరుస సిరీస్‌ల్లో నిరాశపరిచిన తర్వాత కొందరు అభిమానులు గంభీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొందరు నెటిజన్లు దానిని గంభీర్ పరిస్థితితో పోలుస్తూ మీమ్స్‌ను వైరల్ చేశారు.ఈ పరిస్థితి మధ్య గంభీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో "Jab desh ka sabse Gambhir insaan muskura de…" అంటూ నవ్వుతున్న ఎమోజీలతో కూడిన పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ పోస్ట్‌ను ఆయనపై వస్తున్న విమర్శలకు పరోక్ష సమాధానంగా పలువురు అభిమానులు భావిస్తున్నారు. అయితే గంభీర్ మాత్రం తన పోస్టులో ఎక్కడా రాజీనామా డిమాండ్లు లేదా విమర్శలను ప్రస్తావించలేదు.గంభీర్ మార్గదర్శకత్వంలోని భారత జట్టు ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 0-2తో, ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 0-4తో, వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వరుస పరాజయాల తర్వాత గంభీర్‌పై విమర్శలు తారాస్థాయికి చేరాయి.మరోవైపు, గంభీర్ విశ్రాంతిలో ఉండగా వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా జట్టుతో కలిసి జింబాబ్వే పర్యటనకు వెళ్లాడు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు అక్కడ 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో, లక్ష్మణ్‌ను శాశ్వత ప్రధాన కోచ్‌గా నియమించాలనే డిమాండ్లు తీవ్రమయ్యాయి.అయితే గంభీర్ కోచ్‌గా ఉన్న కాలంలో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకున్న విషయాన్ని కూడా అభిమానులు గుర్తుంచుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఆయన పదవిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ముంబైలో ఫ్లాట్ కొన్న విరుష్క జోడీ.. ఎన్ని కోట్లంటే?
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ జంట ముంబైలోని వర్సోవా ప్రాంతంలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ జాప్కీ.కామ్ ప్రకారం.. ఈ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు విరుష్క జోడీ రూ. 18.29 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాట్ సుమారు 2,644 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్లాట్‌తో పాటు మూడు కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించబడ్డాయి. దీనికి సంబంధించి జూలై 21న రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. దీని కోసం కోహ్లీ దంపతులు రూ.1.09 కోట్ల స్టాంప్ డ్యూటీతో పాటు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. కాగా ముంబైలోని వర్లీలో ఇప్పటికే వీరికి లగ్జరీ అపార్ట్మెంట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లి ఫ్యామిలీ ఎక్కువగా లండన్‌లో ఉంటుంది. అక్కడ కూడా విలాసవంతమైన ఇంటిని కోహ్లి కొనుగోలు చేశాడు.చివరగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత తరపున బరిలోకి దిగిన కింగ్ కోహ్లి.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. సెప్టెంబర్ 27న వెస్టిండీస్‌తో జరగనున్న వన్డేలో కోహ్లి తిరిగి భారత జెర్సీలో కనిపించనున్నాడు.
న్యూస్ పాడ్‌కాస్ట్
రెండేళ్ల బాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తం... ‘కాగ్’ గణాంకాల సాక్షిగా వాస్తవాలు బహిర్గతం
ప్రశ్నపత్రాల లీకేజీ దోషులకు పదేళ్ల జైలుశిక్ష.. పది కోట్ల రూపాయల జరిమానా... ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
కృష్ణా, గోదావరి డెల్టాలో వరి వేయొద్దని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
చంద్రబాబు సర్కారును నిద్ర లేపుతాం... పొగాకు రైతుల సమస్యలపై గట్టిగా పోరాడుతాం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన
ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించిన ప్రతిపక్షాలు..
ఏపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
రామాయపట్నంలో భారీ స్కామ్... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
తెలంగాణలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లయితే రాజకీయ సన్యాసం చేస్తా... సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
నంబర్ 1 నుంచి నేలచూపులే... నీతి ఆయోగ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు భారీగా పతనం
ఏపీ సమస్యలపై ఎలుగెత్తాలి. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
బిజినెస్
సీఎన్జీ కార్లకు ఫుల్ డిమాండ్: కారణం ఇదే!
పశ్చిమ ఆసియా సంఘర్షణ తర్వాత.. ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి సమయంలో చాలామంది వాహన వినియోగదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. దీంతో ఈ వాహనాలకు డిమాండ్ బలంగా కొనసాగుతుందని మారుతి సుజుకి ఇండియా అంచనా వేస్తోంది.మారుతి సుజుకి FY27లో సుమారు 9 లక్షల సీఎన్జీ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 7 లక్షలకు పైగా యూనిట్లతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరుగుదలను సూచిస్తుంది.ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మారుతి సుజుకి సుమారు 2.2 లక్షల సీఎన్జీ వాహనాలను విక్రయించిందని, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 58 శాతం పెరుగుదలను సూచిస్తుందని మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బానర్జీ వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే ఈ ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ తన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందనిపిస్తోంది.పశ్చిమ ఆసియా యుద్ధం తర్వాత ఇంధన ధరలు పెరగడం కూడా డిమాండ్ పెరుగుదలకు ఒక కారణమని, దీనివల్ల కొనుగోలుదారులు తక్కువ నిర్వహణ ఖర్చులున్న వాహనాలను పరిగణనలోకి తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మారుతి సుజుకి ప్రస్తుతం దేశీయ మార్కెట్లో లైట్ వెయిట్ కమర్షియల్ వాహనాలతో సహా 15 సీఎన్జీ మోడళ్లను అందిస్తోంది. గత నెలలో కంపెనీ మొత్తం అమ్మకాలలో సీఎన్జీ వాహనాల వాటా 42 శాతంగా ఉంది.
జియో రీచార్జ్.. కొత్త రూ.200 ప్లాన్
దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినోదాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని కొత్త రూ.200 OTT పాస్‌ను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది సాధారణ డైలీ డేటా ప్లాన్ కాకుండా, 28 రోజుల పాటు 30GB హైస్పీడ్ డేటాతో పాటు 15 ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌ల యాక్సెస్‌ను అందించే ప్రత్యేక యాడ్-ఆన్ ప్లాన్‌గా జియో ప్రకటించింది. ఈ ప్లాన్ ప్రస్తుతం జియో వెబ్సైట్, మైజియో యాప్‌లో అందుబాటులో ఉంది.ఈ ప్లాన్‌లో రోజుకు 1GB లేదా 2GB చొప్పున డేటా ఇవ్వరు. బదులుగా మొత్తం 30GB డేటా ఒకేసారి లభిస్తుంది. వినియోగదారులు 28 రోజుల చెల్లుబాటు వ్యవధిలో తమ అవసరానికి అనుగుణంగా ఈ డేటాను వినియోగించుకోవచ్చు. తరచూ వీడియో స్ట్రీమింగ్ చేసే వారు లేదా ఒకేసారి ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.ఈ OTT పాస్‌లో యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్ట్స్, హోయిచోయ్, ఫ్యాన్‌కోడ్ తదితర మొత్తం 15 OTT సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అదనంగా జియోటీవీ ద్వారా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను కూడా వీక్షించే అవకాశం కల్పించింది. అయితే స్పోర్ట్స్ ఛానళ్లకు ఈ ప్యాక్‌లో పూర్తి యాక్సెస్ ఉండదని జియో స్పష్టం చేసింది.అయితే ఈ ప్లాన్‌కు సంబంధించి వినియోగదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది డేటా-ఓన్లీ యాడ్-ఆన్ ప్యాక్. ఇందులో వాయిస్ కాల్స్ లేదా SMS ప్రయోజనాలు ఉండవు. అలాగే ఈ OTT ప్రయోజనాలను పొందాలంటే సాధారణంగా యాక్టివ్ జియో బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం. యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ వంటి సేవలను మైజియో యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మానవాళికి కొత్త సవాల్.. ఎలాన్ మస్క్ హెచ్చరిక!
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒకటి. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా వంటి అనేక రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కృత్రిమ మేధస్సు ఎంత ఉపయోగకరమో, అంతే ప్రమాదకరమని పలువురు భావిస్తున్నారు. ఈ తరుణంలో దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.రాబోయే పదేళ్లలో ఏఐ మనుషుల కంటే ఎంతో తెలివిగా మారే అవకాశం ఉంది. 2036 నాటికి బాట్లు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయని మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఏఐ మానవాళిని పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం 10 నుంచి 20 శాతం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ విషయాన్ని వివరించడానికి ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. మనుషులు చింపాంజీల కంటే ఎంతో తెలివైనవారు కాబట్టి, ప్రపంచాన్ని చింపాంజీలు నియంత్రించడం సాధ్యం కాదు. అదే విధంగా.. ఏఐ మనుషుల కంటే తెలివిగా మారితే, భవిష్యత్తులో మనుషులకే నియంత్రణ ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐ వల్ల ప్రయోజనాలుఇదే సమయంలో మస్క్.. ''ఏఐ వల్ల మానవాళికి అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో AI సహాయంతో ఉత్పత్తి పెరుగుతుంది, పనులు వేగంగా పూర్తవుతాయి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అందరికీ అవసరమైన వస్తువులు, సేవలు సమృద్ధిగా అందుబాటులోకి రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. AI అభివృద్ధిని పూర్తిగా ఆపడం కష్టమని, దానిని సరైన విధంగా ఉపయోగించుకోవడం మంచిదని కూడా అభిప్రాయపడ్డారు''.ఏఐ సింగ్యులారిటీఏఐ గురించి ఓపెన్ఏఐ సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. ''ప్రస్తుతం ప్రపంచం సింగ్యులారిటీ అనే కొత్త దశలోకి అడుగుపెడుతోందని అన్నారు. అంటే.. ఏఐ వ్యవస్థలు మానవ మేధస్సును అధిగమించే స్థితికి చేరుకుంటున్నాయని వెల్లడించారు''.ఇదీ చదవండి: నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా పేదవాడినే!
దేశానికి రూ .14 లక్షల కోట్ల సమస్య ఇది..
సాధారణంగా పెద్దగా పట్టించుకోని తుప్పు (Corrosion) సమస్య ఏటా దేశానికి రూ .14 లక్షల కోట్ల నష్టాన్ని కలిగిస్తోందంటే నమ్ముతారా? తుప్పు సమస్య భారత ఆర్థిక వ్యవస్థపై భారీ భారం మోపుతోందని జపాన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ నోమురా తాజా నివేదిక వెల్లడించింది. వంతెనలు, రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, విద్యుత్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ఆస్తులు తుప్పు కారణంగా ముందుగానే దెబ్బతింటుండటంతో దేశానికి ఏటా సుమారు రూ.14.15 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోందని అంచనా వేసింది. ఇది భారత స్థూల దేశీయోత్పత్తి (GDP)లో దాదాపు 4.3 శాతానికి సమానమని నివేదిక పేర్కొంది.తుప్పు వల్ల పెరుగుతున్న ఆర్థిక భారంతుప్పు (Rust) అనేది కేవలం ఇంజినీరింగ్ సమస్య మాత్రమే కాదని, అది దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ వ్యయం, ప్రజా భద్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపే అంశమని నివేదిక స్పష్టం చేసింది. ఉక్కు నిర్మాణాలు కాలక్రమేణా బలహీనపడటంతో వాటి మరమ్మతులు, మార్పిడి కోసం ప్రభుత్వాలు, పరిశ్రమలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫలితంగా కొత్త మౌలిక సదుపాయాల నిర్మాణానికి వినియోగించాల్సిన నిధులు పాత ఆస్తుల సంరక్షణకే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ ఆర్థిక ఒత్తిడి పెరగడంతో పాటు జాతీయ ఆస్తుల ఉత్పాదకత కూడా తగ్గుతోందని నివేదిక హెచ్చరించింది.అత్యధిక ప్రభావం విద్యుత్, మౌలిక సదుపాయాలపైనే..తుప్పు ప్రభావం అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి, ప్రసార రంగంపై పడుతోందని నోమురా తెలిపింది. ఆ తర్వాత టెలికమ్యూనికేషన్స్, ఆటోమోటివ్, మౌలిక సదుపాయాలు, రైల్వేలు ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. మౌలిక సదుపాయాల రంగానికే ఏటా రూ.1.41 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుండగా, విద్యుత్ రంగంలో రూ.53,860 కోట్లు, టెలికమ్యూనికేషన్స్‌లో రూ.38,320 కోట్లు, రైల్వేల్లో రూ.23,788 కోట్లు, ఆటోమోటివ్ రంగంలో రూ.87,098 కోట్ల మేర ఆర్థిక నష్టం సంభవిస్తున్నట్లు నివేదిక అంచనా వేసింది.వాతావరణమే ప్రధాన సవాలుభారత్లోని భారీ రుతుపవనాలు, అధిక తేమ, తీరప్రాంతాల్లో ఉప్పు గాలులు తుప్పు తీవ్రతను మరింత పెంచుతున్నాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా వంతెనలు, రహదారులు, ఓడరేవులు వంటి నిర్మాణాలు ఈ ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాయి. అమెరికా, జపాన్ వంటి దేశాలు వాతావరణ పరిస్థితులను బట్టి వేర్వేరు తుప్పు నిరోధక ప్రమాణాలు అమలు చేస్తున్నప్పటికీ, భారత్‌లో మాత్రం చాలా ప్రాంతాల్లో ఒకే తరహా నిర్మాణ ప్రమాణాలను అనుసరించడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని నోమురా అభిప్రాయపడింది.కఠిన ప్రమాణాల అమలే పరిష్కారంబ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) తుప్పు నిరోధక చర్యలను సూచించినప్పటికీ, ఏ వాతావరణ పరిస్థితుల్లో ఏ సాంకేతికతను ఉపయోగించాలనే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు లేవని నివేదిక పేర్కొంది. దీంతో కాంట్రాక్టర్లు కనీస స్థాయి రక్షణతోనే సరిపెడుతున్నారని తెలిపింది. తప్పనిసరి తుప్పు నిరోధక ప్రమాణాలు, కఠినమైన అమలు, మెరుగైన పర్యవేక్షణ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత నిర్మాణ విధానాలను నవీకరించడం ద్వారా మౌలిక సదుపాయాల ఆయుష్షు పెరగడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా గణనీయమైన లాభం చేకూరుతుందని నోమురా సూచించింది. సమర్థవంతమైన తుప్పు నిరోధక చర్యలు అమలు చేస్తే దేశ జీడీపీకి 1.5 శాతం వరకు అదనపు వృద్ధి సాధ్యమవుతుందని నోమురా అభిప్రాయపడింది.ఇదీ చదవండి: కేంద్ర విద్యాశాఖ మంత్రికి జీతం ఎక్కువా?
ఫ్యామిలీ
గురవే సర్వలోకానాం..
జ్ఞానం అనే చీకటిని పారద్రోలి, జీవితానికి దిశానిర్దేశం చేసే మహనీయుడే గురువు. అటువంటి గురువులను స్మరించుకుని, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకునే పవిత్రమైన రోజే గురు పౌర్ణమి. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి రోజున ఈ పండుగను దేశమంతటా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. దీనినే వ్యాసపౌర్ణమి అని కూడా పిలుస్తారు.గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని ఎందుకు అంటారో తెలుసుకుంటే ఈ రోజు ప్రాముఖ్యత మరింత అర్థమవుతుంది. మహాభారతం, పద్దెనిమిది పురాణాలు, బ్రహ్మసూత్రాలు రచించిన మహర్షి వేదవ్యాసుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి లోకానికి అందించిన మహానుభావుడు ఆయనే. ఆయన జన్మదినమే ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి. అందుకే ఈ రోజును వ్యాసుని జన్మదినంగా జరుపుకుంటూ, ఆయన ద్వారా మనకు అందిన జ్ఞాన సంపదకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. వ్యాసుడే మానవాళికి మొదటి గురువుగా భావిస్తారు. ఆయన నుండి ప్రారంభమైన గురు పరంపర ఈనాటికీ కొనసాగుతోంది. నారాయణుడు, బ్రహ్మ, వశిష్టుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు, గౌడపాదుడు, గోవిందుడు, శంకరాచార్యుల వరకు సాగిన ఈ పరంపరకు ఈ రోజు నమస్కరిస్తాం.ఈ రోజు ఆధ్యాత్మికంగా కూడా చాలా విశేషమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహాన్ని దేవగురువు అంటారు. నవగ్రహాలలో గురువు స్థానం చాలా బలంగా ఉంటే విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం అన్నీ శుభంగా జరుగుతాయని నమ్మకం. జాతకంలో గురు దోషం ఉన్నవారు ఈ రోజు గురు పూజ చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా చాతుర్మాస దీక్షలకు ఈ రోజే బీజం పడుతుంది. సాధువులు, సన్యాసులు ఈ రోజు నుండే ఒక చోట స్థిరంగా ఉండి చాతుర్మాస వ్రతం ప్రారంభిస్తారు.గురు పౌర్ణమి రోజున భక్తులు తమ గురువులను దర్శించుకుని పాదపూజ చేస్తారు. కొత్త వస్త్రాలు, పుష్పాలు, ఫలాలు, దక్షిణ తాంబూలాలతో గురువును సత్కరిస్తారు. గురు గీత, గురు స్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రం పారాయణ చేస్తారు. విద్యార్థులు ఈ రోజు ప్రత్యేకంగా సరస్వతీ దేవితో పాటు హయగ్రీవ స్వామిని పూజిస్తారు. ఎందుకంటే హయగ్రీవుడు జ్ఞానానికి అధిపతి. ఈ రోజు సత్యనారాయణ వ్రతం చేయడం, దానధర్మాలు చేయడం, అన్నదానం చేయడం వల్ల విశేష ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. రాత్రి సమయంలో చంద్రుని కిరణాలలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేస్తే మానసిక ప్రశాంత లభిస్తుందని కూడా ఒక నమ్మకం. గురు పౌర్ణమి అనేది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కృతజ్ఞతా భావానికి నిదర్శనం. ఈ రోజు మనం గురువులకు నమస్కరించడం ద్వారా జ్ఞానానికి, విద్యకు, సంస్కారానికి నమస్కరిస్తున్నాం. గురువు చూపిన బాటలో నడవాలని, ఆయన ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకునే రోజు ఇది. గురువుల ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించవచ్చు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే ఈ పవిత్రమైన గురు పౌర్ణమిని మనం భక్తిశ్రద్ధలతో జరుపుకుని, గురు తత్వాన్ని మన జీవితంలో ఆచరించాలి. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు మాత్రమే కాదు. మన జీవితంలో మంచి మార్గం చూపిన ప్రతి ఒక్కరూ గురువే. తల్లిదండ్రులు మొదటి గురువులు. వారు మనకు నడవడం, మాట్లాడడం నేర్పుతారు. ఆ తరువాత బడిలో టీచర్లు, జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ప్రకృతి కూడా మనకు గురువులే. 29, బుధవారం గురుపౌర్ణమి– కుందా శ్రీ కృష్ణ శాస్త్రి.
ఫ్లైట్ జర్నీలో ఫేస్ షీట్‌మాస్క్‌తో త్రిష..ఇది మంచిదేనా?
చర్మసంరక్షణ అనేది కేవలం ఉదయం లేదా సాయంత్రం దినచర్యకు మాత్రమే పరిమితం కాదు. ఎప్పుడు, ఎక్కడ ఉపయోగిస్తున్నారు, పరిసరాలు, ఆహారం వంటి వాటిపై కూడా ఆధారపడి ఉంటుందట. జస్ట్ ఇంట్లోనే సీరమ్‌లు, మాయిశ్చరైజర్లు, మాస్క్‌లు, సన్స్క్రీన్లు వంటి చర్మసంరక్షణ చర్యలు పరిమితం కాదని అంటున్నారు నిపుణులు. విమాన ప్రయాణాల్లో కూడా చర్మ సంరక్షణ తప్పనిసరని చెబుతున్నారు.ఇటీవల నటి త్రిష కృష్ణన్ విమానంలో షీట్ మాస్క్‌తో కనిపించిన ఒక రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇలా ప్రియాంక చోప్రా వంటి అనేకమంది సెలబ్రిటీలు గతంలో మాస్క్‌తో తమ సెల్ఫీలను పోస్ట్ చేశారు కూడా. ఇలా ఫ్లైట్జర్నీలో ఫేస్ మార్క్షీట్లు ఉపయోగించడం తప్పనిసరా? అంటే..విమాన ప్రయాణాలలో షీట్ మాస్క్‌లను ఉపయోగించడం సురక్షితమేనని చెబుతున్నారు డెర్మటాలజిస్టులు. అయితే ముఖానికి వేసుకునే మాస్క్ రకంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ముఖ్యంగా విమానం క్యాబిన్ లోపల ఉండే పొడి వాతావరణంలో, హైడ్రేటింగ్ షీట్ మాస్క్‌లు లేదా జెల్ ఆధారిత మాస్క్‌లు చర్మానికి తాత్కాలికంగా తేమను అందిస్తాయని అన్నారు. హైలురోనిక్ యాసిడ్, సెరామైడ్స్, గ్లిజరిన్, అలోవెరా, పాంథెనాల్ వంటి పదార్థాలు ఉన్న మాస్క్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ప్రయాణ సమయంలో ఎక్స్‌ఫోలియేటింగ్ రసాయనాలు, చార్కోల్ మాస్క్‌లు, బలమైన క్రియాశీల పదార్థాలు, పీల్-ఆఫ్ మాస్క్‌లు, క్లే మాస్క్‌లను ఉపయోగించవద్దని ఈ చర్మవ్యాధి నిపుణురాలు సలహా ఇచ్చారు.కలిగే లాభాలు..ఇది చర్మానికి తేమను అందించి, పొడిబారకుండా చేస్తుంది. చర్మం బిగుతుగా ఉందన్న భావనను తగ్గిస్తుంది. అలాగే చర్మాన్ని మృదువుగా, సౌకర్యవంతంగా ఉంచుతుంది. విమానం క్యాబిన్‌లోని తక్కువ తేమ వల్ల డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలాంటివి చర్మసంరక్షణకు ఎంతో మంచివి. అలాగే వాటిపై సూచించిన విధంగా అన్ని నిమిషాలే ఉంచాలని, ఆ తర్వాత మిగిలిని సీరమ్ చర్మంలోకి వెళ్లేలా సున్నితంగా మసాజ్ చేయాలని అంటున్నారు. దీంతోపాటు రెండు చుక్కల ఫేషియల్ సీరమ్‌ను అప్లై చేసి, ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ను వాడితో మంచిది. ఎవరికి మంచిది కాదంటే..ఏమైనా చర్మ సమస్యలు ఉంటే ఉపయోగించకపోవడమే మంచిది. సున్నితమైన చర్మం ఉన్నవారు షీట్ మాస్క్‌ల జోలికి వెళ్లకపోవడమే మంచిదిఅలాంటి వాళ్లు మాయిశ్చరైజర్‌ను మాత్రమే ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.చివరగా విమాన ప్రయాణంలో ఇలాంటి చర్మ సంరక్షణ దినచర్య కొంచెం అదనంగా అనిపించవచ్చు, కానీ ఇది చర్మాన్ని చికాకు, చర్మ సమస్యలు, పర్యావరణ కారకాల నుంచి రక్షించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు చర్మ వ్యాధి నిపుణులు.(చదవండి: అరుదైన 'మెదడు'ని పోలిన తల చర్మ వ్యాధి..! చివరికి లైఫ్‌నే..)
అరుదైన 'మెదడు'ని పోలిన తల చర్మ వ్యాధి..! చివరికి లైఫ్‌నే..
కొన్ని అరుదైన వ్యాధులు ఎందువల్ల వస్తాయనేది అంతుచిక్కదు. పోనీ నయం చెయ్యొచ్చ అంటే అదికూడా కష్టమే. అలాంటి వ్యాధిని నయం చేసి అతడి రూపాన్నే మార్చేసి బాధపెట్టిన మనోవ్యధకు ఉపశమనం కలిగించారు వైద్యలు. ఇంతకీ అతడికి వచ్చిన రుగ్మత ఏంటంటే..చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన లీ అనే 23 ఏళ్ల యువకుడు మానవ మెదడు ఉపరితలాన్ని పోలిన లోతైన మడతల తల చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. అతుడు ఈ సమస్యను చిన్నతనంలో గమనించాడు. తన చర్మం గట్టిపడటాన్ని గమనించాడు. చూస్తుండగానే మందంగా మారి పెద్ద అసమాన మడతలు వచ్చేశాయి. అతనికి 14 ఏళ్లు వచ్చేసరికి, ఈ అసాధారణ పెరుగుదల అతని తల చర్మంలో దాదాపు సగానికి వ్యాపించి అతడి రూపురేఖల్నే మార్చింది. అది కాస్తా అతడి ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపింది. ఏళ్ల తరబడి పలు ఆస్పత్రులలో చికిత్స పొందాడు. ఫలితంగా ఆరోగ్యకరమైన తల చర్మం కణజాలం చాలా తక్కువగా మిగిలి, విపరీతమైన మచ్చలను మిగిల్చింది. పైగా పెద్దగా ఫలితం లేదు. దాంతో పలు ఆస్పత్రులను సంప్రదించగా..ఆరోగ్యకరమైన చర్మ కణజాలం లేనందున సర్జరీ ప్రమాదకరమని నిరాకరించాయి. లీ చివరకు జోంగ్నాన్ ఆసుపత్రిలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో డాక్టర్ జౌ బృందాన్ని సంప్రదించారు. ఆ వైద్యులు వీలైనంత ఎక్కువ ఆరోగ్యకరమైన తల చర్మాన్ని కాపాడటానికి వారు అతని ఇప్పటికే ఉన్న మచ్చల రేఖలను ఉపయోగించుకున్నారు. గతేడాది వైద్యులు అతని తల చర్మంలోని రెండు ప్రాంతాల కింద టిష్యూ ఎక్స్పాండర్లను అమర్చారు.తదుపరి 11 నెలల పాటు, వారు క్రమంగా ఎక్స్పాండర్లలోకి ద్రవాన్ని ఎక్కించి, పునర్నిర్మాణం కోసం తగినంత కణజాలాన్ని సృష్టించడానికి ఆరోగ్యకరమైన చర్మాన్ని నెమ్మదిగా సాగదీశారు. ఫలితంగా తగినంత ఆరోగ్యకరమైన తల చర్మం అభివృద్ధి చెందింది. ఆ తర్వాత వైద్యులు అసాధారణ కణజాలాన్ని తొలగించి, ప్రభావిత ప్రాంతాన్ని బాగుచేయడానికి మూడు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం లీ తల చర్మం సాధారణంగా కనిపించడమే గాక, చర్మంపై జుట్టు సాధారణంగా పెరగగలదని వైద్యులు తెలిపారు. దీంతో ఇన్నాళ్ల నుంచి లీ అనుభవించిన మనోవ్యధకు మగింపు పలికినట్లయింది. (చదవండి: ఆ గ్రామం కనుమరుగ్వకుండా పోరాడిన ఒకేఒక్కడు..! ఇవాళ ప్రపంచమే..)
కుంచె పట్టి..ఆ గ్రామాన్ని రక్షించిన ఒకేఒక్కడు..!
ఒక్కడిగా పోరాడితే ఫలితం ఏం ఉంటుంది అనిపిస్తుంది. ఓ పదిమంది కలిసి ఐక్యంగా చేస్తేనే ఏదైనా సాధ్యం అనుకుంటాం. కానీ అవన్ని కరెక్ట్ కాదని నిరూపించాడు ఈ తాత. అంతేగాదు మనసుపెట్టి..పోరాడితే ఒక్కడే ఏదైనా సాధించగలడు అని నిరూపించాడు. యావత్తు ప్రపంచం తలెత్తి తనవైపు చూసేలా చేశాడు. అది కూడా కేవలం కాలక్షేపం కోసం చేసిన కళతోనే ఈ ఘనత సృష్టించడం విశేషం. పైగా సృజనాత్మకత గొప్పతనం, కళతో ఏం చేయొచ్చో.. కనవిప్పు కలిగించాడు. ఇంతకీ ఆ తాత ఏం చేశాడంటే..తైవాన్‌లోని తైచుంగ్‌లో శిథిలావస్థలో ఒక సైనిక స్థావరం ఉంది. అక్కడ హువాంగ్ యుంగ్-ఫు అనే మాజీ అధికారి ఒక్కే నివాసం ఉంటున్నాడు. అతడి కారణంగా ఆగ్రామం ఉనికి నిలిచింది, యావత్తు ప్రపంచానికి తెలిసింది. ఆ తాత అసాధారణ కథ వింటే విస్తుపోవడం ఖాయం. అద్భుత పాఠాన్ని నేర్పించిన తాత..ఆ గ్రామాన్ని 1940 చివరలో నిర్మించారు. దీన్ని చైనా అంతర్యుద్ధం తర్వాత తైవాన్‌కు తరలివచ్చిన కువోమింటాంగ్ (జాతీయవాద సైన్యం) సైనికులకు తాత్కాలిక నివాసంగా ఇచ్చారు. ఈ నివాస ప్రాంతంలో సుమారు 1,200 ఇళ్లు ఉండేవి. వాటిల్లో వేలాది కుటుంబాలు ఉండేవి. అయితే, దశాబ్దాలు గడిచేకొద్దీ, యువ తరాలు వలస వెళ్లిపోయాయి, భవనాలు శిథిలమయ్యాయి. దాంతో డెవలపర్లు పునరాభివృద్ధి కోసం ఆ భూమిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. 2000వ దశాబ్దం చివరి నాటికి, దాదాపు ప్రతి నివాసి వెళ్లిపోయారు, కేవలం కొన్ని ఇళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దాంతో దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న హువాంగ్ యుంగ్-ఫు, తైవాన్‌లో తనకు తెలిసిన ఏకైక ఇంటిని విడిచి వెళ్లడానికి నిరాకరించాడు. నిజానికి అతడొక్కడే మిగిలాడు అక్కడ. ఒంటరిగా ఏం పాలుపోక.. 86 ఏళ్ల వయసులో ఒక పెయింట్ బ్రష్ తీసుకుని తన ఇంటి లోపల గోడపై ఒక చిన్న పక్షి చిత్రాన్ని గీశాడు. ఆ ఒక్క చిత్రం త్వరలోనే గ్రామం అంతటా గోడలు, కాలిబాటలు, తలుపులు, కిటికీలను కప్పివేసేలా వేలాది రంగురంగుల కుడ్యచిత్రాలుగా విస్తరించింది.నిజానికి ఆయన చిత్ర కళాకారుడు కాదు. తన రోజులని చక్కగా గడిచిపోయేలా కాలక్షేపం కోసం చేసి పని మంచి ఉద్దేశ్యాన్నిచ్చే అభిరుచిగా మారిందని అన్నారు. ఆయన విలక్షణమైన శైలి, ప్రకాశవంతమైన రంగులు, బాల్యపు ఊహశక్తితో గీసిన చిత్రాలు ఒక్కసారిగా ఆ గ్రామాన్ని రంగులుమయంగా చేశాయి. ఆ కళే గ్రామానికి రక్షగా..సమీప విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రొఫెసర్లు ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు హువాంగ్ చిత్రాలను చూసి ఆకర్షితులవుతారు. అలా శిథిలావస్థలో ఉన్న ఆ సైనిక స్థావరం సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించి..ఆ గ్రామాన్ని కూల్చివేయకుండా పరిరక్షించాలని తైచుంగ్ నగర ప్రభుత్వాన్ని కోరుతూ వారు ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి ప్రజల నుంచి విస్తృత మద్దతు లభించడంతో, చివరికి అధికారులే పునరాభివృద్ధి ప్రణాళికలను విరమించుకున్నారు.అలా సైనిక విలేజ్ కాస్త రెయిన్బో విలేజ్‌గా సాంస్కతిక ఆకర్షణగా పరిరక్షించబడింది. అంతేగాదు హువాంగ్‌కి రెయిన్బో తాతగా పేరొచ్చింది కూడా. దీనివల్ల హువాంగ్ తన ఇంట్లోనే ఉండగలిగాడు, అదే సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు వచ్చి అతని కళాఖండాలను ఆరాధించడం మొదలుపెట్టారు. అంతేగాదు అక్కడి తైవాన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకారం, హువాంగ్ చిత్రాలు ఒకప్పుడు నిర్మానుష్యంగా మారిన ఆ ప్రదేశాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పర్యాటక కేంద్రంగా మార్చాయి. ఒకప్పుడు కనుమరుగవడానికి సిద్ధంగా ఉన్న ఒకగ్రామానికి అవి కొత్త జీవం పోశాయి. ఇదిలా ఉండగా దురదృష్టవశాత్తు హువాంగ్ యుంగ్-ఫు 2024 జనవరిలో తన 100వ ఏట కన్నుమూశారు. ఆయన వెళ్తూ.. వెళ్తూ..రెయిన్బో విలేజ్‌లోని రంగురంగుల గోడల కన్నా ఎంతో విశాలమైన వారసత్వాన్ని వదిలి వెళ్లారు. ఈ తాత హువాంగ్ కథ కళ కేవలం అందాన్ని ఇవ్వడానికే కాకుండా, భద్రపరచడానికి,ప్రజలను అనుసంధానించడానికి, సమాజాన్ని ప్రభావితం చేయడానికి ఉపయోగ పడుతుందని నిరూపించింది. అంతేగాదు నిరసనలు, రాజకీయాలు సాధించలేని దానిని సృజనాత్మకత కొన్నిసార్లు సాధించగలదని హువాంగ్ యుంగ్-ఫు కథ నిరూపించింది కదూ..!. View this post on Instagram A post shared by JOTA (@jackofftoart) (చదవండి: టీసీఎస్ ఉద్యోగాన్ని కాదనుకుని రైస్ వ్యాపారం..! కట్‌చేస్తే ఏడాదికి..)
అంతర్జాతీయం
‘నన్ను అరెస్ట్ చేస్తారా?’.. మమ్దానీపై విరుచుకుపడ్డ నెతన్యాహు
వాషింగ్టన్/జెరూసలేం: అంతర్జాతీయ నేరాల న్యాయస్థానం (ఐసీసీ) జారీ చేసిన అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి (యూఎన్జీఏ)హాజరైతే అరెస్టు చేస్తామంటూ న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్దానీ వ్యాఖ్యలు సమాజంలో ద్వేషాన్ని నూరిపోసేలా ఉన్నాయని ఆరోపించారు. మేయర్‌గా ఉన్న వ్యక్తి యూదులు, క్రైస్తవులు, ముస్లింలతో సహా పౌరులందరికీ ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.‘ఫాక్స్ న్యూస్’ ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ.. ‘మమ్దానీ తీరు వల్ల ప్రస్తుతం యూదు అమెరికన్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, సెప్టెంబరు 8న ప్రారంభమయ్యే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి నేను హాజరై, ఇజ్రాయెల్ తరఫున, ఇజ్రాయెల్-అమెరికా భాగస్వామ్యం తరఫున సత్యాన్ని చాటిచెబుతాను’ అని స్పష్టం చేశారు. ఐసీసీ తనపై మోపిన యుద్ధ నేరాల ఆరోపణలను ఆయన ‘న్యాయ ప్రక్రియకే వికృత రూపం’ అని అభివర్ణించారు. ఆ కోర్టుకు ఇజ్రాయెల్ లేదా అమెరికాపై ఎటువంటి అధికార పరిధి లేదని, అది ఒక ‘కంగారూ కోర్టు’ అని కొట్టిపారేశారు.గాజా యుద్ధంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 2024 నవంబరులో నెతన్యాహు, ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్‌లపై ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అంతర్జాతీయ చట్టాలు అందరికీ సమానంగా వర్తించాలని, ఈ వారెంట్‌ను తీవ్రంగా పరిగణించాలని మమ్దానీ పేర్కొనగా, నెతన్యాహు అరెస్టు కాకుండా చూస్తామని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. గాజాలో నెరపిన మిలిటరీ చర్యలపై వచ్చిన అన్ని ఆరోపణలను, ఐసీసీ పరిధిని ఇజ్రాయెల్ ఇప్పటికే తోసిపుచ్చింది.ఇది కూడా చదవండి: ఎన్డీఏ పాలనలో విద్యాశాఖ వివాదాలు
ఇజ్రాయెల్‌కు సవాల్.. హెజ్బొల్లాకు ఖమేనీ భరోసా
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన ప్రకటన విడుదల చేశారు. మరోసారి షియా సాయుధ సంస్థ హెజ్బొల్లాకు బహిరంగంగా అండగా నిలిచారు. ఇజ్రాయెల్, అమెరికా ఒత్తిళ్లు ఎంత పెరిగినా ప్రతిఘటన ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తూ.. హెజ్బొల్లాను ఉద్దేశించి ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హెజ్బొల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసెమ్‌కు పంపిన సందేశంలో "జిహాద్, ప్రతిఘటనే ముందుకు సాగే ఏకైక మార్గం" అని పేర్కొన్నారు. తన సందేశంలో ఖమేనీ, హెజ్బొల్లా ప్రస్తుతం "ప్రతిఘటన చరిత్రలో కీలక దశ"లో ఉందని పేర్కొన్నారు. యుద్ధాలు, ఆంక్షలు, నాయకత్వ మార్పులు వచ్చినా ప్రతిఘటన ఆగదని, పోరాట స్ఫూర్తే తమ బలమని చెప్పారు. హెజ్బొల్లా యోధులు లెబనాన్ ప్రజల హక్కులు, గౌరవాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారని ప్రశంసించారు.ఇటీవలి నెలల్లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఘర్షణలు, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, అనంతరం కాల్పుల విరమణతో మధ్యప్రాచ్య పరిస్థితులు కొంత మారాయి. ఇదే సమయంలో లెబనాన్‌లో హెజ్బొల్లా వద్ద ఉన్న ఆయుధాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ పరిణామాల మధ్య ఖమేనీ చేసిన తాజా వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇరాన్‌కు హెజ్బొల్లా కేవలం మిత్ర సంస్థ మాత్రమే కాదు. ఇజ్రాయెల్, అమెరికా ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రాంతీయ "యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్"లో అది కీలక భాగంగా టెహ్రాన్ భావిస్తోంది. అందుకే హెజ్బొల్లాకు రాజకీయ, వ్యూహాత్మక మద్దతు కొనసాగుతుందని ఖమేనీ తాజా ప్రకటన ద్వారా మరోసారి స్పష్టం చేశారు. లెబనాన్‌లో ఇరాన్ ప్రభావం తగ్గలేదనే సంకేతాన్ని కూడా ఈ సందేశం ఇస్తోందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం హెజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయి. ఆ సంస్థ సైనిక సామర్థ్యాన్ని బలహీనపర్చేందుకు లెబనాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దేశంలోని అన్ని ఆయుధ బలగాలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని లెబనాన్ ప్రభుత్వం కూడా చెబుతోంది. అయితే ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఉన్నంత వరకు ఆయుధాలను వదిలే ప్రసక్తే లేదని హెజ్బొల్లా స్పష్టం చేస్తోంది.ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతల తర్వాత టెహ్రాన్ వైఖరిలో మార్పు వస్తుందేమోనని అంతర్జాతీయ వర్గాలు భావించాయి. అయితే ఖమేనీ తాజా ప్రకటనతో అలాంటి సంకేతాలు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరిని కొనసాగిస్తూనే, తమ మిత్ర బలగాలకు మద్దతు తగ్గబోదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసినట్లయింది.ఖమేనీ వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులపై మరోసారి చర్చ మొదలైంది. ఒకవైపు శాంతి చర్చలు, కాల్పుల విరమణ ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు "జిహాద్, ప్రతిఘటనే ముందుకు సాగే మార్గం" అనే సందేశం వెలువడటం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఉద్రిక్తతలు, ఇరాన్ పాత్రపై ప్రపంచ దృష్టి మరోసారి మధ్యప్రాచ్యంపైనే కేంద్రీకృతమైంది.
ఫ్రాన్స్,స్పెయిన్‌లను దహిస్తోన్న కార్చిచ్చు
పారిస్: ఫ్రాన్స్,స్పెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో భీకర కార్చిచ్చు దహించివేస్తోంది. ఇప్పటి వరకు రెండు దేశాల్లో 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం గిరాండ్‌లో సుమారు 42వేల హెక్టార్ల మేర అడవి కాలిపోయింది. సమీప 240 ఇళ్లు కాలిపోయాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన 75 మంది సిబ్బంది గాయపడ్డారు. 18 విమానాలు, హెలికాప్టర్లతో 2,500కి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బోర్డో నగర ప్రధాన రహదారిని పాక్షికంగా మూసేశారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ చుట్టుపక్కల కార్చిచ్చు వ్యాపించింది. స్పెయిన్‌లో 76వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాలెన్సియా శివారు ప్రాంతం మనిసెస్లో కార్చిచ్చులో ఒకరు మరణించారు.ఓరెగాన్‌లో వ్యాపిస్తున్న కార్చిచ్చుఅమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రం వార్మ్ స్ప్రింగ్స్ సమీపంలో బెంచ్ఫైర్ కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. దీంతో, ఆ ప్రాంత జెఫెర్సన్ కౌంటీ నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ అధికారులు హెచ్చరికలు చేశారు. వార్మ్ స్ప్రింగ్స్ సమీపంలోని 26వ నంబర్ రహదారిని అధికారులు మూసివేశారు.
ఉక్రెయిన్‌లో నౌకపై దాడి
లండన్/న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయంలో ఉన్న ఓ వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు గల్లంతయ్యారు. ‘ఎంవీ ఏజీఎన్ రగ్నార్’ నౌకలో ఉన్న మరో ఇద్దరు భారతీయ నావికులు మాత్రం దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారని కీవ్ నగరంలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. శనివారం జరిగిన ఈ ఘటనలో గల్లంతైన భారతీయుల ఆచూకీ కనుగొనేందుకు ఉక్రెయిన్ అధికారులతో సంప్రతింపులు జరుపుతున్నామని ఎంబసీ వివరించింది. రష్యా– ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో తరచూ రష్యా నల్ల సముద్ర తీరంలోని ఒడెసా పోర్టుపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతోంది. అయితే, తాజా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఈ ప్రాంతంలో ఏప్రిల్ నుంచి వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు కనీసం ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అప్రమత్తంగా ఉండండి: విదేశాంగ శాఖ నల్ల సముద్ర ప్రాంతం వంటి సంక్షోభాలు కొనసాగుతున్న చోట్ల విధులు నిర్వహించాల్సిన పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం భారతీయ నావికులు, సిబ్బందిని కోరింది. ఈ మేరకు ఆదివారం ఒక అడ్వైజరీ జారీ చేసింది. అటువంటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని, భద్రతా పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేసుకోవాలని సూచించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా నల్ల సముద్రం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని హెచ్చరించింది.
జాతీయం
ఇండిగో విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
దుబాయ్ నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఇండిగో (IndiGo) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఉన్నట్టుండి విమానంలోని కార్గో ఏరియా నుంచి పొగలు రావడంతో, సోమవారం రోజున గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.మొత్తం 194 మంది సిబ్బందితో దుబాయ్ నుండి ముంబైకి బయలుదేరిన IGO 1452 విమానంలో మధ్యాహ్నం2:45 గంటలకు ఎయిర్‌లైన్ సిబ్బంది పొగను గుర్తించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించగా, రాజ్‌కోట్ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి (Emergency) ప్రకటించారు. మధ్యాహ్నం 3:27 గంటలకు విమానం రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. లోపల ఉన్న 194 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పాల్చుకున్నారు.రాజ్‌కోట్ విమానాశ్రయ డైరెక్టర్ దిగంత బోరా, ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.పి. తరేతియా ఈ ఘటనపై స్పందిస్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదనీ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని వెల్లడించారు.ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసిందిప్రమాదం ఏమీ లేదుముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పైలట్ అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారని అధికారులు తెలిపారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ టెక్నికల్ టీమ్ వెంటనే విమానాశ్రయానికి చేరుకుని విమానాన్ని తనిఖీ చేసింది. తనిఖీల అనంతరం విమానంలో ఎలాంటి మంటలు (Fire) చెలరేగలేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి : రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ,1.69 లక్షల కంపెనీ!ఇదీ చదవండి: వీకెండ్ క్లాస్‌లో ఐఐఎం ప్రొఫెసర్ సర్ప్రైజ్, నెటిజన్లు ఫిదా
‘ఆ ప్రభుత్వ ఉద్యోగాలు చెల్లవు’.. సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ
సాక్షి,చెన్నై: మద్రాస్ హైకోర్టులో సీఎం విజయ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాట కుటుంబాలకు సీఎం విజయ్ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను రద్దు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో టీవీకే నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు నేతృత్వంలో తమిళనాడు రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం, సీబీఐ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి.ఈ క్రమంలో గత నెలలో సీఎం విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలలోని 32 మందికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందించారు. ఆ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై సోమవారం మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో కరూర్ బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు చెల్లవని స్పష్టం చేసింది. రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరించాలని ఆదేశించింది. బాధితులకు ఆర్ధిక సాయం అందించవచ్చు. కానీ ఉద్యోగం ఇవ్వడం సమంజసం కాదని తెలిపింది. ప్రభుత్వ బస్సుల్లో మరణించినవారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది అర్హత, నిర్దేశిత నియామక ప్రక్రియ (TNPSC వంటి పరీక్షలు) ద్వారా రావాలే తప్ప, ఇలా ఉచితంగా పంచేది కాదని స్పష్టం చేసింది.ఇది సాధారణ అభ్యర్థుల సమానత్వ హక్కును దెబ్బతీస్తుందని పేర్కొంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఎంతైనా ఆర్థిక సాయం అందించుకోవచ్చని, కానీ రాజ్యాంగ నిబంధనలు, పరిమితులను దాటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. అర్హత ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పెట్టేది కాదని వ్యాఖ్యానిస్తూ కరూర్ బాధితులకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని తీర్పు ఇచ్చింది. దీంతో సీఎంగా విజయ్‌కు తొలిసారి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సీఎం విజయ్ తీసుకున్న ఈ ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది.
జంతర్‌మంతర్ .. ఢిల్లీలో మునిగితే ముస్సోరిలో తేలాడు
సాక్షి, ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసనకారులకు ఆహరం పంపిణీ చేసిన వ్యక్తిని పోలీసులు విచారించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జునైద్ అనే వ్యక్తి అక్కడి నిరసన కారులకు ఆహరం సరఫరా చేశారు. దీనిని గమనించిన పోలీసులు అతనిని భిన్న విధాలుగా ప్రశ్నించి చివరికి కళ్లకు గంతలు కట్టి ముస్సోరిలో వదిలేశారు. ఈ వివరాలను ఆ బాధితుడు సోషల్ మీడియావేదికగా పంచుకున్నారు.వివరాల్లోకి వెళితే గత శుక్రవారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారులకు జునైద్ ఆహరం సరఫరా చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు అతని వద్దకు వచ్చి ప్రశ్నించడం మెుదలు పెట్టారు. నువ్వు ఈ ఆహరం ఎందుకు పంపిణీ చేస్తున్నావు. దీనికోసం నీకు ఎవరు సహాయం చేస్తున్నారు. రాత్రంతా పోలీసుల అదుపులో ఉంచుకొని ఆ బాధితుడు కళ్లకు గంతలు కట్టి క్యాబ్‌లో తీసుకెళ్లి ముస్సోరిలో వదిలివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఈ వివరాలు తెలుసుకున్న విద్యార్థుల న్యాయ సహాయ బృందం తనను సంప్రదించిందన జునైద్ తెలిపారు. కాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ధర్నా చేయగా ఎట్టకేలకు మంత్రి రాజీనామా చేశారు. దీంతో సీజేపీ నిరసన ముగిసింది.Mohammad Junaid Used and Thrown by CJP Founders!!Mohammad Junaid who played the biggest part in CJP Protest by supplying Non Stop Bread Pakodas, Samosas, Biryani and various other dishes for 40 days is now feeling cheated by CJP Founders!!During an Interview the reporter… pic.twitter.com/L9j8qiwyaa— Rohit (@Iam_Rohit_G) July 26, 2026
రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!
Satyanarayan Nuwal Success Story అత్యంత తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి, విజయం సాధించి బిలియనీర్‌గా అవతరించిన వ్యాపారవేత్తల విజయగాథల గురించి చాలానే విన్నాం. అయితే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా, ఎన్న సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ఏకంగా రూ.72000 కోట్ల ఆస్తికి యజమాని అయిన సక్సెస్ స్టోరీ విన్నారా? చేతిలో చిల్లి గవ్వ లేని స్థితి నుండి.. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పడుకునే స్థాయి నుండి మొదలై.. పట్టుదలతో దేశంలోనే అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరిగా నిలిచిన సత్యనారాయణ్ నువాల్ జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. పదండి ఈ వివరాలేంటో తెలుసుకుందాం.రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన అతని పేరే 72 ఏళ్ల సత్యనారాయణ్ నువాల్ (Satyanarayan Nuwal). సుమారు రూ. 45,650 కోట్ల నికర ఆస్తితో నాగ్‌పూర్‌లోని అత్యంత ధనవంతుడు. సత్యనారాయణ్ నువాల్ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల 10వ తరగతితోనే చదువు ఆపేసాడు. 18-19 ఏళ్లకే వివాహం, బాధ్యతలు నెత్తినపడ్డాయి. రాజస్థాన్‌లోని భిల్వారాలో పట్వారీగా పనిచేసిన అతని తండ్రి 1971లోనే రిటైర్ అయ్యారు. తాతగారు ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవారు, సపోర్ట్ చేయడానికి ఎలాంటి కుటుంబ వ్యాపారం లేదు. 18 ఏళ్ల వయసులో సిరా (Ink) తయారీ యూనిట్‌ను ప్రారంభించినా అది విఫలమైంది. దాంతో బతుకుదెరువు కోసం కొత్త ప్రాంతానికి వచ్చాడు.చేతిలో పైసా లేకుండా, ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో చేరుకున్నాడు. 1977లో, మహారాష్ట్రలోని బల్హార్షా రైల్వే స్టేషన్‌కు చేరాడు. ఆ రాత్రి అతనికి ఆశ్రయం ఆ రైల్వే ప్లాట్‌ఫారమే అయింది. ఆ రాత్రి ప్లాట్‌ఫారమ్‌పై పడుకున్నప్పుడు, భవిష్యత్తులో తన జీవితం ఎలా మారబోతోందో అతనికి కనీసం ఊహ కూడా లేదు.ఇల్లు అద్దెకు తీసుకోవడానికి కూడా ఆయన దగ్గర తగినంత డబ్బు ఉండేది కాదు. దీంతో ఆయన చాలా రాత్రులు రైల్వే స్టేషన్లోనే గడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం ఆయన ఫౌంటెన్ పెన్నులు కూడా అమ్మేవారు.చిన్న అడుగుతో మొదలైన వ్యాపారంబల్హార్షాలో నువాల్‌కు అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్ పరిచయమయ్యారు. ఆయన బావులు తవ్వడానికి, రోడ్లు వేయడానికి, బొగ్గు గనులకు ఉపయోగించే పేలుడు పదార్థాల (Explosives) వ్యాపారి. నువాల్ దీనిని ఒక అవకాశంగా మలుచుకున్నాడు. నెలకు వెయ్యి రూపాయల అద్దె చెల్లించి అబ్దుల్ సత్తార్ లైసెన్స్‌ను ఉపయోగించుకుని వ్యాపారం ప్రారంభించాడు. 25 కేజీల పేలుడు పదార్థాలను రూ. 250కి కొని, రూ.800కి అమ్మేవాడు. లాభాలు తక్కువే అయినా, అది నిజాయితీతో కూడిన శ్రమ.#WATCH | Solar Group Chairman Satyanarayan Nuwal receives Padma Shri award from President Droupadi Murmu for his contribution to India's defence manufacturing ecosystem pic.twitter.com/xEuTePY74k— ANI (@ANI) May 25, 2026త్వరలోనే ఆయన కష్టపడే తత్వాన్ని, నిజాయితీని బ్రిటిష్ కంపెనీ 'ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్' అధికారులు గుర్తించారు. ఇది ఆయనకు వ్యాపారంలో సరికొత్త తలుపులు తెరిచింది. ఒక చిన్న వ్యాపారిగా ఉన్న నువాల్, ఎక్స్‌ప్లోజివ్స్ బిజినెస్లోని మెళకువలను లోతుగా నేర్చుకున్నాడు.'సోలార్ ఇండస్ట్రీస్' అద్భుత ప్రగతి1995లో, తన 37వ ఏట నువాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ.60 లక్షల రుణం తీసుకుని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా (Solar Industries India) పేరుతో ఒక చిన్న తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. చాలామంది ఇది పెద్ద రిస్క్ అనుకున్నారు, కానీ నువాల్ తనపై నమ్మకంతో ముందడుగు వేశారు.2006 IPOఐపీఓ (IPO)కి వెళ్లే సమయానికి రూ.78 కోట్ల టర్నోవర్, రూ.11 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సోలార్ ఇండస్ట్రీస్ భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో, 29 నగరాల్లో తయారీ కేంద్రాలను కలిగి ఉంది. వీటితో పాటు జాంబియా, ఘనా, నైజీరియా, టర్కీ, టాంజానియా మరియు సౌత్ ఆఫ్రికాలలో 6 విదేశీ యూనిట్లను నడుపుతోంది.రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర2010లో భారతదేశ రక్షణ దళాలకు (Defence Forces) వార్హెడ్ల కోసం పేలుడు పదార్థాలను తయారు చేసే లైసెన్స్‌ను భారత ప్రభుత్వం నుండి పొందిన మొదటి ప్రైవేట్ కంపెనీగా సోలార్ ఇండస్ట్రీస్ రికార్డు సృష్టించింది.'మేక్ ఇన్ ఇండియా' మిషన్‌లో భాగంగా కంపెనీ ఎక్స్‌ప్లోజివ్స్, ప్రొపెల్లెంట్స్, గ్రెనేడ్లు, డ్రోన్లు మరియు వార్హెడ్ల తయారీని ప్రారంభించింది. పినాకా (Pinaka) రాకెట్లు: ఈ రాకెట్ల కమర్షియల్ ప్రొడక్షన్ కంపెనీకి ఒక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రక్షణ రంగం నుంచి అంతర్జాతీయ ఆర్డర్లు భారీగా పెరుగుతున్నాయి. కంపెనీ రాబడిలో మెజారిటీ భాగం ఎగుమతుల (Exports) ద్వారానే వస్తోంది.2026 జులై నాటికి సోలార్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ,1.69 లక్షల కోట్లకు చేరుకుంది. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం పొందిన నువాల్ ఆస్తి విలువ సుమారు రూ.7.5 బిలియన్ డాలర్లు (రూ.72,000 కోట్లకు పైగా).ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసిందిపద్మశ్రీ పురస్కారం2026, మే 25న రాష్ట్రపతి భవన్లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను పెంపొందించినందుకు గాను సత్యనారాయణ్ నువాల్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'పద్మశ్రీ' అవార్డును ప్రదానం చేశారు. ఇంతఎత్తుకు ఎదిగినా ఆయన తన మూలాలను మరచిపోలేదు. నాగ్‌పూర్ పరిసర ప్రాంతాలలో విద్య, సమాజ అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు విస్తృతంగా విరాళాలు అందిస్తూ గొప్ప దాతగా పేరు గాంచారు.ఇదీ చదవండి: వీకెండ్ క్లాస్‌లో ఐఐఎం ప్రొఫెసర్ సర్ప్రైజ్, నెటిజన్లు ఫిదా
ఎన్ఆర్ఐ
తాత వారసత్వం.. అమెరికాలో మెరిసిన మనవడు కార్తీక్!
తల్లిదండ్రులు పుట్టింది భారత దేశంలో.. ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. కాకినాడకు చెందిన తాతయ్య పద్మనాభానికి క్రీడలంటే ఎంతో మక్కువ. జిల్లాలో సీనియర్ క్రీడాకారుడిగా, ఒలింపిక్ సంఘ కార్యదర్శిగా క్రీడారంగానికి ఎనలేని సేవలు అందించారు. తాతయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మనుమడు కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం అమెరికా దేశంలోని శాన్ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో క్రీడలపరంగా గుర్తింపు తెచ్చుకుని తండ్రి పురిటి గడ్డ కీర్తిని ప్రవాసాంధ్రుడిగా రెపరెపలాడిస్తున్నారు. అమెరికా నుంచి కాకినాడకు ఇటీవల వచ్చిన కార్తీక్ ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా.. కాకినాడకు చెందిన కె.పద్మనాభం, యమునలకు జన్మించిన సంతానం రామకృష్ణ. సాఫ్ట్వేర్ ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. ఆయనకు పద్మజతో వివాహం జరిగింది. రామకృష్ణ, పద్మజలకు 2005లో కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం జన్మించాడు. చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ పెంచుకోవడంతో అమెరికాలో తల్లిదండ్రులు స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇప్పించారు. అనతి కాలంలోనే స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్‌లో ప్రావీణ్యం సంపాదించి శాన్ఫ్రాన్సిస్కో రాష్ట్రానికి కార్తీక్ ప్రాతినిధ్యం వహించి పోటీల్లో పతకాలు కైవసం చేసుకున్నాడు. పదేళ్ల వయసులో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన మినీ ఒలింపియాడ్ ర్యాలీలో పాల్గొని అందరి మన్ననలు అందుకున్నాడు. అమెరికాలో స్విమ్మింగ్‌లో శిక్షణ పొందుతున్న కృష్ణస్వామి కార్తీక్ బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్‌తో పాటు టెన్నిస్‌లో కూడా క్రీడా ఓనమాలు కాకినాడలోనే కార్తీక్ నేర్చుకున్నాడు. అమెరికాలో 9 నుంచి 12వ తరగతి వరకు మేరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెయింట్ లూయిస్ కంట్రీ డే స్కూల్లో చదవి అక్కడే బాస్కెట్‌బాల్ మెరుగైన శిక్షణను కోచ్ ట్రవీస్ వ్యాలీస్ వద్ద తీసుకున్నాడు. తొలిసారి కార్తీక్ సారథ్యంలో ఇంటర్ స్కూల్ స్టేట్ పోటీల్లో చాంపియన్ షిప్‌ను సాధించారు. తాతయ్య జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కావడం, మనవడు క్రీడా వారసత్వాన్ని అందిపుచ్చుకుని క్రీడల్లో రాణిస్తుండడంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఎంఎస్సీ కర్రి పద్మశ్రీ, రెడ్‌క్రాస్ చైర్మన్, మాజీ ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు వైడీ రామారావులు ఇటీవల కార్తీక్‌ను అభినందించారు. నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ)
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కత్తితో దాడి
అమెరికాలోని ఓ షాపింగ్ మాల్లో హైదరాబాద్ యువకుడిపై కత్తితో దాడితో చేశారు. హైదరాబాద్ టౌలిచౌకికి చెందిన సయ్యద్ సోహైల్‌పై ఓ దుండగుడు 15 సార్లు కత్తితో దాడి చేశాడు. దాడి ఘటన జులై 13న జరగ్గా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ సోహైల్.. వెస్ట్ వ్యాలీ సిటీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 37 ఏళ్ల సయ్యద్ సోహైల్.. గత రెండున్నరేళ్లుగా ఆ షాపింగ్ మాల్లో చిన్న వ్యాపార దుకాణం నిర్వహిస్తున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకోకముందే, మాల్లోని కొందరు వ్యక్తులు దాడి చేసిన వ్యక్తిని నిలువరించి.. అతని చేతిలోని కత్తిని లాక్కున్నారు. నిందితుడిని పీటర్ మైఖేల్ లార్సెన్గా గుర్తించారు.ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు విన్నవిస్తూ.. ఈ సమస్యను అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. తాము అమెరికా వెళ్లేందుకు అవసరమైన వీసాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ దాడి గురించి తెలిసి.. సోహైల్ భార్య అమ్రీన్ ఫిర్దౌస్ స్పృహతప్పి పడిపోయారు. ఈ దంపతులకు ఐదేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.Indian stabbed in US over his religionA 37-year-old Indian national Syed Sohailuddin was st*bbed more than 15 times at a kiosk inside Valley Fair Mall in West Valley City, Utah. Suspect Peter Michael Larsen, 48, allegedly told police he targeted the Muslim victim and intended… pic.twitter.com/6rso7E03XX— Piyush Rai (@Benarasiyaa) July 16, 2026
అమెరికాలో ఏపీ యువతి మృతి
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి మృతి చెందింది. మృతురాలిని పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్నగా గుర్తించారు. ఆమె ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా వెళ్లారు. ఇటీవలే చదువు పూర్తి చేసిన ప్రసన్న ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు.న్యూజెర్సీలో ప్రసన్న తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె స్నేహితులకు గాయాలు కాగా, ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెద్ద కుమార్తె మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని.. సాయం అందించాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
18 ఏళ్ల ఎన్ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్ పోస్ట్ వైరల్
అమెరికాలో సుమారు రెండు దశాబ్దాలు గడిపిన తర్వాత ఒక టెకీ భారత దేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను చూసుకోవడం కోసం మాతృదేశానికి వచ్చానంటూ మెటా (Meta) ఇంజనీరింగ్ లీడర్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. తన 18 ఏళ్ల అమెరికా జీవితాన్ని డజనుకు పైగా సూట్‌కేసులలో సర్దేసి, బెంగళూరుకు మారిపోయినట్లు ఒక ఎయిర్పోర్ట్ ట్రాలీ ఫోటోను ఆయన షేర్ చేశారు.మెటాలో సీనియర్ ఇంజనీరింగ్ లీడర్‌గా పనిచేసిన బాలాజీ గురురాజన్, లింక్డ్ఇన్ పోస్ట్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన నిర్ణయంతో పెద్దవాళ్లైపోయిన తన కన్నవాళ్లకు దగ్గరగా ఉండటంతోపాటు, పిల్లలు తమ గ్రాండ్ పేరెంట్స్‌ను ఎక్కడో దూరం నుంచి చూస్తూ ఉండేకన్నా, ఉమ్మడి కుటుంబంలో కలిసి పెరిగే అవకాశం కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు.18 ఏళ్ల ప్రయాణంమైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్, మెటా వంటి దిగ్గజ సంస్థలలో పనిచేసిన ఆయన, అమెరికా తనకు కెరీర్‌ను, మంచి స్నేహితులను ఇచ్చిందని చెబుతూ, అక్కడ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇపుడిక తన పుట్టిన నేల, చిన్న వయసులో చూసిన బెంగళూరు నగరంలో ఇప్పుడు పిల్లల స్కూళ్లు, ఇల్లు, నిత్య జీవితాన్ని మళ్లీ మొదటి నుండి ప్రారంభించడం ఒక సరికొత్త అనుభవమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందినెటిజన్ల స్పందనఈ పోస్ట్‌కు నెటిజన్ల నుండి భారీగా మద్దతు, ప్రశంసలు లభించాయి. ఒక యూజర్ స్పందిస్తూ, బెంగళూరులోని సాంకేతిక పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని, ఇది "రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్" (ప్రతిభావంతులు తిరిగి స్వదేశానికి రావడం) కు సంకేతమని పేర్కొన్నారు.తల్లిదండ్రుల కళ్లలో కనిపించే ఆనందాన్ని డాలర్లతో కొనలేం మంచి నిర్ణయం తీసుకున్నారని కొంతమంది ఆయన నిర్ణయాన్ని అభినందించారు. అంతేకాదు గతంలోనే భారత్‌కు తిరిగి వచ్చిన పలువురు నెటిజన్లు ఆయనకు స్వాగతం పలుకుతూ, ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి కొన్ని చిట్కాలను కూడా పంచుకోవడం విశేషం.ఇదీ చదవండి: ఘనంగా పెళ్లి : రూ. కోటి నగలు, నగదుతో రాత్రికి రాత్రే వధువు జంప్
క్రైమ్
అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు
హైదరాబాద్: నిత్యం తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.. వారి కూతుళ్లు విసిగి వేసారిపోయారు.. సొంతూరికి వెళ్లి ఏదైనా పని చేసుకుని బతుకుదామని భావించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రైలెక్కారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు దోమలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. ఆదివారం గాందీనగర్ ఏసీపీ కార్యాలయంలో సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అడిషనల్ డీసీపీ నరసయ్య, ఏసీపీ యాదగిరి, దోమలగూడ సీఐ అంజద్ అలీతో కలిసి వివరాలు వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తోటరాం, రాంధులారి దంపతులు 2 నెలల క్రితం నగరానికి వలస వచ్చి దోమలగూడ ఫరీద్ బస్తీలో నివసిస్తున్నారు. హిమాయత్‌నగర్‌లోని ఓ హోటల్లో పనిచేస్తున్నారు. ఆ దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండటంతో భరించలేక వారి కుమార్తెలు సహిత కుమారి(17), స్నేహ కుమారి(16)తోపాటు సమీప బంధువైన లత(15) గత ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఇంట్లోంచి పారిపోయారు. పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాదాపు 262 సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు.రైలెక్కి.. ఛత్తీస్‌గఢ్ చేరి..హిమాయత్‌నగర్ మెయిన్ రోడ్లో ఆటో ఎక్కిన బాలికలు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు, అక్కడ నుంచి మరో ఆటోలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఘన్పూర్ ఎక్స్‌ప్రెస్‌లో నాగ్‌పూర్ చేరుకోగా ఓ వ్యక్తి చేరదీసి ఫాంహౌస్‌లో పనులు చేసేందుకు గడ్చిరోలి మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని పతంజూరుకు చెందిన బిశ్వజిత్ అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినట్లు గుర్తించిన బిశ్వజిత్ దోమలగూడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకర్ పోలీసుల సహకారంతో బాలికలను తీసుకొచ్చి సఖీ సెంటర్‌కు అప్పగించారు. తల్లిదండ్రులు స్నేహపూర్వక వాతావరణంలో పిల్లల్ని పెంచాలని డీసీపీ సూచించారు.
ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
దేవరపల్లి: న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన సంఘటన నల్లజర్ల మండలం దూబచర్లలో ఆదివారం జరిగింది. తన ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో ఆమె బైఠాయించి పోరాటం చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని తనను శారీరకంగా వాడుకుని, ముఖం చాటేస్తున్న అనిల్ కుమార్‌కు డీఎన్ఏ పరిక్ష చేసి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.సంఘటనకు సంబంధించి బాధితురాలి కథనం ప్రకారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడేనికి చెందిన అడబాల హేమలత నల్లజర్ల మండలం దూబచర్లలో ఓ జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేసే సమయంలో ఫ్యాక్టరీ యజమాని కుమారుడు అనిల్‌కుమార్ తనకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానని లొంగదీసుకున్నట్టు ఆమె తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా అలాగేనని నమ్మించి ముఖం చాటుశాడని ఆమె తెలిపారు. దీనిపై ఏడాది క్రితం నల్లజర్ల పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది.అయినప్పటికి తనకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. తనను మోసం చేసిన వ్యక్తికి ఇంతవరకు డీఎన్ఏ పరీక్ష చేయించలేదని ఆమె తెలిపారు. ఆమె తల్లి అడబాల లక్ష్మి కుమార్తెకు అండగా ఉన్నారు. దీనిపై నల్లజర్ల సీఐ రవికుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఈ సంఘటన 2025లో జరిగిందన్నారు. బాధితురాలు హేమలత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు పూర్తయిందని ఆయన తెలిపారు. అయితే అనిల్‌కుమార్‌కు డీఎన్ఏ పరీక్ష చేయించాలని హేమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారు.
కిరాయి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..!
నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వరంగల్–ఖమ్మం హైవేపై పెద్దనాగారం పరిధిలోని వశ్రాంతండా స్టేజీ వద్ద నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై సమాచారం మేరకు నర్సింహులపేట పోలీసులు శనివారం అర్ధరాత్రి మెరుపుదాడి చేశారు. పెద్దనాగారానికి చెందిన ఓ వ్యక్తి వశ్రాంతండా స్టేజీ వద్ద ఉన్న ఇంటిని కిరాయికి తీసుకున్నాడు. రాత్రి కాగానే అక్కడ ఒక్క మనిషి కన్పించడు. పెద్దనాగారానికి చెందిన నిర్వాహకుడు నడిపిస్తున్న వ్యభిచార గృహంపై పక్కా సమాచారంతో ఎస్సై బానోత్ వెంకన్న సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఇందులో ఓ మహిళ, ముగ్గురు విటులు పట్టుబడ్డారు. పెద్దనాగారానికి చెందిన ఓ వ్యక్తి పరారయ్యాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన మహిళగా, తొర్రూరుకు చెందిన వ్యక్తులుగా ముగ్గురిని గుర్తించారు. తొర్రూరుకు చెందిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అని తెలుస్తోంది. దీనిపై ఎస్సై వెంకన్నను వివరణ కోరగా సమాచారం మేరకు దాడులు చేయగా ఒక మహిళ, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఒకరు పరారీలో ఉన్నారన్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, ప్రశాంత వాతావరణంలో ఉన్న నర్సింహులపేట మండలంలో వ్యభిచార గృహం నడుస్తుందనే విషయం తేలియగానే పలువురు ఆశ్చర్యపోతున్నారు.
మొన్నే చంద్రబాబుతో ముచ్చటించింది.. ఇంతలోనే విషాదం
సాక్షి, పోలవరం: రంపచోడవరం మండలంలోని ఇర్లపల్లి కొత్త కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రేకు షేడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.మృతురాలిని రంపచోడవరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముర్రం శివానిగా గుర్తించారు. సోమవారం ఉదయం బాలిక మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.పేరెంట్ టీచర్ మీటింగ్‌లో సీఎం పక్కన..ఇటీవల జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్‌లో శివానికి ప్రత్యేక అవకాశం లభించింది. ఈనెల 24న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఆమె మాట్లాడింది. ఆపై ఆయనతో ఫొటో కూడా దిగింది. చంద్రబాబుతో ముచ్చటించిన బాలిక ఇలా అనూహ్యంగా మృతి చెందడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.అనుమానాస్పద మృతిగా కేసుఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏమిటన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. శివాని మృతితో పాఠశాల ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్నారి మృతికి అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.చంద్రబాబు దిగ్భ్రాంతివిద్యార్థిని మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని.. తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శివాని మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించింది. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని… pic.twitter.com/9NZE0spqgv— N Chandrababu Naidu (@ncbn) July 27, 2026విద్యార్థులు, యువత సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలని.. ఒత్తిడి, నిరాశకు లోనుకావద్దని సూచించారు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని, తమ బాధలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు.
వీడియోలు
ఏ మొహం పెట్టుకొని ఇంటింటికి వెళ్తున్నారు. చనిపోయిన వ్యక్తిపై ఎందుకు అంత ద్వేషం..!
మీకు ఆ దమ్ముందా..? చంద్రబాబుకు బోండా ఉమా కౌంటర్
ఇప్పుడు ఎవరు తప్పించుకోలేరు..! హైదరాబాద్ లో కొత్త AI కెమెరాలు
విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై కేసులు పెడతాం
హైడ్రా ముసుగులో రియల్ ఎస్టేట్ దందా..
High Court: సీఎం రేవంత్‌కు చెంప దెబ్బ
16 డిమాండ్లతో కార్మికుల పోరు! ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటమే..!
తిరుపతిలో జనసేన నాయకుడు ఆత్మహత్య
అస్మిత్ రెడ్డిపై షాకింగ్ ఆరోపణలు.. ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు
డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?


