breaking news
Fire Accident
-
సికింద్రాబాద్ మోండా మార్కెట్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: సికింద్రాబాద్ మోండా మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 19వ తేదీ) రాత్రి ఇస్లామియా హైస్కూల్ ఎదురుగా ఉన్న శ్రీరామ ఎంటర్‌ప్రైజస్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనిపై అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటీనా అక్కడకు చేరుకుని చర్యలు చేపట్టారు. పక్క షాపులకు సైతం మంటలు వ్యాపించాయి. ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది తెలియరాలేదు. -
ఇండిగో విమానంలో లూత్రా సోదరులు ఇండియాకు
గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం (Goa Nightclub Fire) తరువాత బ్యాంకాక్ పారిపోయిన ప్రధాన ప్రధాన నిందితులు క్లబ్ ఓనర్లు గౌరవ్ (Gaurav Luthra), సౌరభ్ లూత్రా (Saurabh Luthra) థాయిల్లాండ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఇండిగో విమానంలో (6E1064) తిరిగి తీసుకువస్తున్నారు. బ్యాంకాక్ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 1:45 గంటలకు (IST) బయలుదేరాల్సి ఉంది. ఢిల్లీ చేరిన తరువాత వీరిని ఇద్దరినీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరుస్తారు, అధికారులు వారి ట్రాన్సిట్ రిమాండ్ కోరుతున్నారు. అనంతరం వీరిని గోవాకు తరలించాలని యోచిస్తున్నట్టు సమాచారం. గోవాలోని 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. విషాదం జరిగిన కొన్ని గంటల తర్వాత థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోయారు. ఈ ఘటన తరువాత లూత్ర సోదరులపై నేరపూరిత హత్య మరియు నిర్లక్ష్యం కేసు నమోదైనాయి. వీరిని అరెస్ట్ చేసే క్రమంలోనే లూత్రా బ్రదర్స్ పాస్‌పోర్టులను కూడా అధికారులు రద్దు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు సిబ్బందినిఅరెస్టు చేశారు, వారిలో మేనేజర్ కూడా ఉన్నారు. క్లబ్ కు పర్మిట్లు, లైసెన్సులు జారీ చేయడంలో పాల్గొన్న అనేక ప్రభుత్వ విభాగాల అధికారులను కూడా విచారిస్తున్నారు. తాను "సైలెంట్ పార్టనర్" అని చెప్పుకున్నప్పటికీ, మూడవ భాగస్వామి అజయ్ గుప్తాను కూడా ఢిల్లీలో అరెస్టు చేశారు. డిసెంబర్ 9న థాయిలాండ్‌లోని తమ హోటల్ నుండి భోజనం కోసం బయటకు వచ్చిన తర్వాత ఇద్దరినీ థాయిలాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. -
గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం
-
గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం
గుడివాడ: నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడివాడలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం(ఢిసెంబర్ 14వ తేదీ) ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సమీపంలోని ఇతర షాపులకు మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలంలో పొగలు దట్టంగా అలుముకున్నాయి. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైరిజజన్ల సాయంతో అక్కడకు వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. -
చుట్టూ అగ్నికీలలున్నా బెదరలే, తెగువ చూపింది!
ఆపద సమయంలో చురుగ్గా స్పందించాలి. అది ఎంతటి ప్రమాదమైనా సరే.. గాభరా పడకుండా తప్పించుకునే మార్గాలున్నాయా అనేది ఆలోచించాలి. ఆందోళన పడితే బుర్ర పనిచేయదు.. ఏం చేయాలో తోచదు. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని ధైర్యంగా అడుగుముందుకేయాలి. ఫిలిప్పీన్స్‌లోని సెబులోని మాండ్యూ నగరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఒక మహిళ సరిగ్గా ఇలాగే చేసింది. తన పెంపుడు కుక్కల్ని కూడా కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఫిలిప్పీన్స్‌లో ఇటీవల భారీ అగ్న ప్రమాదం చోటు చేసుకుంది. మహిళ నివసిస్తున్న భవనంలో మంటలు చుట్టుముట్టాయి. ఎటు చూసినా దట్టమైన, నల్లటి తీవ్రమైన పొగ వ్యాపించింది. తన రెండు పోమెరేనియన్లను కుక్కల్ని వదిలి వెళ్లడానికి మనసొప్పలేదు. అందుకే అంత ఆపదలోనూ తెలివిగా, అంతకుమించిన మానవత్వంతో ఆలోచించిందా మహిళ. భవనంలో మంటలు చెల రేగుతున్న సమయంలో వాటిని మూడో అంతస్తులోని రైలింగ్‌పైకి విసిరి వాటిని కాపాడింది. ఆ తరువాత అగ్నిమాపక సిబ్బంది వేసిన ల్యాడర్ ద్వారా చాలా జాగ్రత్తగా కిందికి దిగింది. రెండు నిమిషాల వీడియో ఆన్లైన్లో ఆకర్షణీయంగా మారింది. దీంతో ఆమెను షీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ఏకంగా 30 లక్షలకుపైగా వ్యూస్‌ను సాధించడం విశేషం. ICYMI: This is real courage.During a massive fire in Mandaue City, Cebu, Philippines, a woman refused to leave without her dogs.As flames spread, she climbed onto a ladder, threw each dog down to safety, then hung by her hands from the railing while firefighters climbed up to… pic.twitter.com/unDE6PcyUG— Tony Lane 🇺🇸 (@TonyLaneNV) December 13, 2025 -
విజయనగరంలో ఘోర అగ్నిప్రమాదం.. వృద్ధురాలు మృతి
-
‘గోవా కలెక్టర్ ఫోన్ చేసి..’ బిగ్గరగా రోదించిన బాధితురాలు..
న్యూఢిల్లీ: గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఢిల్లీకి చెందిన భావనా జోషి అయినవారిని కోల్పోయి, తీవ్ర ఆవేదనతో కుమిలిపోతున్నారు. గత శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఆమె తన భర్త వినోద్ కుమార్ (43)తో పాటు తన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. కమలా జోషి (42), అనితా జోషి (41), సరోజ్ జోషి (39)లను కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 25 మంది మృతిచెందగా, భావన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్లబ్‌లోని అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చూస్తున్నంతలోనే ఎగసిపడి, కొందరి జీవితాలను బుగ్గిపాలు చేశాయి. క్లబ్లో నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, పైరోగన్ల వాడకం, గడ్డితో కూడిన పైకప్పు, పలు భద్రతా లోపాల కారణంగా మంటలు నిముషాల వ్యవధిలోనే అంతటా చుట్టుముట్టాయి.నృత్య కార్యక్రమం సందర్భంగా వెలిగించిన విద్యుత్ పైరోగన్లే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ క్లబ్లో తగినన్ని నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, మండే పదార్థాల వాడకం, మద్యం సీసాల నిల్వలు మొదలైనవి మంటల తీవ్రతను పెంచి, ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం అందజేస్తామని గోవా కలెక్టర్ కార్యాలయం నుండి తనకు కాల్స్ వస్తున్నాయని భావనా జోషి తెలిపారు. అయితే తమకు ఎలాంటి పరిహారం అవసరం లేదని, న్యాయం కావాలని అని ఆమె కోరారు. వారు ఇచ్చే రెండు లక్షలు నా కుటుంబాన్ని తిరిగి తీసుకువస్తాయా? అని ఆమె ప్రశ్నించారు. పరిహారం కంటే న్యాయమే తనకు ముఖ్యమని ఆమె రోదిస్తూ తెలిపారు.మృత సోదరీమణుల తల్లి మీనా మీడియాతో మాట్లాడుతూ ‘నేను నా పిల్లలను కోల్పోయాను. అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయాను. నేరస్థులు బెయిల్‌పై లేదా జరిమానాతో తప్పించుకోకుండా కఠిన శిక్షలు ఎదుర్కొనేలా చూడాలని’ ఆమె డిమాండ్ చేశారు. కమల భర్త నవీన్ కూడా అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు చేస్తూ.. పలు రెస్టారెంట్లు, క్లబ్‌లలో నిబంధనలు పాటించడం లేదని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలావుండగా నైట్‌క్లబ్ సహ యజమానులు, ఢిల్లీకి చెందిన సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులు అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఢిల్లీ నుండి థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోయారు. వారిని భారతదేశానికి తీసుకురావడానికి దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.నిందితులు గోవాలో ఈ క్లబ్ నిర్వహణకు భూ ఒప్పందపు నకిలీ కాపీని ఉపయోగించారని పోలీసు దర్యాప్తులో తేలింది. కాగా నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఢిల్లీ కోర్టు దానిని తిరస్కరించింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ నిందితులను త్వరలోనే సంయుక్త దర్యాప్తు బృందం భారతదేశానికి తిరిగి తీసుకువస్తుందన్నారు. ఈ విచారణను కేవలం క్లబ్ యజమానులే కాకుండా, కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతులు మంజూరు చేసిన అధికారులు కూడా ఎదుర్కొంటున్నారు.ఇది కూడా చదవండి: ‘అయితే భద్రత గాలికే?’.. రైల్వే యూనియన్ల మండిపాటు -
స్టీల్ ప్లాంట్ లో మంటలు భారీ శబ్దాలతో కార్మికుల పరుగులు
-
పోలీసులు అదుపులో లూథ్రా బ్రదర్స్
గోవా అగ్నిప్రమాద ఘటనలో ప్రధాన నేరారోపణలు ఎదుర్కొంటున్న లుథ్రా బ్రదర్స్‌ను ఎట్టకేలకు థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకొని వారికి సంకెళ్లు వేశారు. ఈ రోజు ఊదయం భారత విదేశాంగ శాఖ సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలిద్దరి పాస్ పోర్టులను సస్పెండ్ చేసిన కొద్దిసేపటికే వారి అరెస్టు జరిగింది.గత శనివారం గోవాలోని బిర్చ్ బై రోమియో నైట్‌క్లబ్‌లో అగ్రి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే ఈ క్లబ్ యజమానులైన లూథ్రా బ్రదర్స్ థాయిలాండ్ పరారయ్యారు. దీంతో ప్రమాదంపై తీవ్రంగా స్పందించిన గోవా ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో నిందితులను వదలబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వారి ఇద్దరిపై పోలీసులు లూకౌట్ జారీ చేశారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఏజెన్సీ వారిద్దరిపై బ్లూకార్నర్ ఇష్యూ చేసింది. దీంతో థాయిలాండ్ పోలీసులు ఫుకెట్‌లోని ఓ రెస్టారెంట్లో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి బేడీలు వేశారు. కాగా వీరిద్దరిని పట్టుకోవడానికి ఇదివరకే గోవా పోలీసులు థాయిలాండ్‌కు బయిలు దేరినట్లు తెలుస్తోంది.అధికారిక ప్రక్రియ పూర్తయిన అనంతరం వారిద్దరిని గోవా పోలీసులకు అప్పగిస్తున్నట్లు సమాచారం. భారత్- థాయిలాండ్ దేశాల మధ్య 2013లో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ జరిగింది. దీనిప్రకారం ఒక దేశంలో నేరం చేసి మరో దేశంలో తలదాచుకుంటే ఆ నేరస్థులను సంబంధిత దేశానికి అప్పగించాలి. ఈ ఒప్పందానికి అనుగుణంగా ప్రస్తుతం థాయిలాండ్ లూథ్రా బ్రదర్స్‌ను భారత్‌కు అప్పగిస్తుంది. ఈ ఒప్పందం 2015 జున్ 9నుంచి అమలులోకి వచ్చింది. కాగా ఈ శనివారం అర్థరాత్రి గోవాలోని నైట్ రోమియో నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టాగా క్లబ్లో సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో క్లబ్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇది వరకే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
గోవా అగ్నిప్రమాదం: పోలీసుల ఉచ్చులో లూథ్రా బ్రదర్స్
గోవా: ఇటీవల గోవాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులైన సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులపై గోవా పోలీసులు ఉచ్చు బిగించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే దేశం విడిచి థాయిలాండ్‌కు పారిపోయిన లూథ్రా బ్రదర్స్ పాస్‌పోర్ట్‌లను పోలీసులు సస్పెండ్ చేశారు. 1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 10A నిబంధనల ప్రకారం విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఈ చర్యకు మద్దతు పలికింది. దీంతో లూథ్రా బ్రదర్స్ విదేశాలకు ప్రయాణించకుండా అడ్డుకట్ట పడింది.లూథ్రా సోదరులు డిసెంబర్ 7న తెల్లవారుజామున 1:17 గంటలకు వారు మేక్మైట్రిప్ (ఎంఎంటీ)లో లాగిన్ అయ్యి విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. ఇమ్మిగ్రేషన్ రికార్డుల ప్రకారం ఇద్దరూ అదే రోజు ఉదయం 5:30 గంటలకు ఇండిగో విమానం 6ఈ 1073లో ఢిల్లీ నుండి నేరుగా థాయిలాండ్‌కు వెళ్లిపోయారని వెల్లడయ్యింది. ఈ దుర్ఘటనలో మరణించిన 25 మందిలో 20 మంది క్లబ్ సిబ్బంది, ఐదుగురు పర్యాటకులు ఉన్నారు.ప్రస్తుతం థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో తలదాచుకున్న లూథ్రా సోదరులు లుక్-అవుట్ నోటీసులు, ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసును ఎదుర్కొంటున్నారు. ఇంతలో గోవా పోలీసులు నైట్‌క్లబ్ యజమానులలో ఒకరైన అజయ్ గుప్తాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ తాను లూథ్రాలతో కేవలం స్లీపింగ్ పార్టనర్‌ను మాత్రమేనని తెలిపారు. కాగా క్రిమినల్ కేసుల్లో నిందితులు దేశం విడిచి పారిపోకుండా నిరోధించేందుకు పాస్‌పోర్ట్‌లు సస్పెండ్ చేస్తారు. వీటిని తిరిగి యాక్టివేట్ చేయడానికి చట్టపరమైన విధానాలు అనుసరించాల్సి ఉంటుంది.ఈ కేసుపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్రంగా స్పందించారు. నిందితులను ఎంతమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్డిటివికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సావంత్ మాట్లాడుతూ ‘అది థాయ్‌లాండ్ అయినా లేదా మరే ఇతర ప్రదేశమైనా సరే, మేము వారిని అక్కడి నుండి పట్టుకొచ్చి జైల్లో పెడతాం’ అని స్పష్టంగా ప్రకటించారు.ఇకపై బాణసంచాకు శాశ్వత నిషేధంగోవాలోని అర్పోరా నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దరిమిలా ఉత్తర గోవా పరిపాలనా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇక్కడి నైట్‌క్లబ్‌లు, హోటళ్లు, ఇతర పర్యాటక ప్రాంతాలలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు. ఈ అగ్నిప్రమాదంలో 20 మంది సిబ్బంది, ఐదుగురు పర్యాటకులు సహా మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు.ప్రాథమిక దర్యాప్తులో నైట్‌క్లబ్ లోపల నృత్య ప్రదర్శన సందర్భంగా విద్యుత్ బాణసంచా (పైరోటెక్నిక్స్) ఉపయోగించడం వల్లే మంటలు చెలరేగాయని వెల్లడయ్యింది. ఈ తాజా నిషేధం ద్వారా ఈ రకమైన ప్రమాదకర ప్రదర్శనలకు అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనకు బాధ్యులైన క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూత్రా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఐదుగురు మేనేజర్లు,సిబ్బందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పారిపోయిన క్లబ్ యజమానుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: Year Ender 2025: ఇడ్లీ విప్లవం.. ఉగాది పచ్చడికి పట్టం! -
Surat: భారీ అగ్నిప్రమాదం కాలిబూడిదైన టెక్స్టైల్ మార్కెట్
-
సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి సూరత్: గుజరాత్ సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ స్తానికంగా ఉన్నరాజ్ టెక్స్టైల్స్ మిల్లులో భారీగా మంటలు చెలరేగాయి. కంపెనీ ఏడవ అంతస్తులో భారీగా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే యత్నం చేస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీసుల అదుపులో గోవా నైట్‌క్లబ్ యజమాని
గోవాలో మారణహోమం సృష్టించిన బిర్చ్ బై నైట్ రోమియ్ నైట్ క్లబ్ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆ క్లబ్ యజమానులు సౌరవ్, గౌరవ్ లపై ఇంటర్‌ఫోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీచేయగా తాజాగా ఆ క్లబ్లో సహా యజమానిగా ఉన్న అజయ్ గుప్తా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ శనివారం గోవాలోని బిర్చ్ బై రోమియో నైట్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం జరిగి 25 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై సీరియస్‌గా ఉన్న ఆ రాష్ట్ర సీఎం ఆ యజమానులకు చెందిన మరో క్లబ్‌ను కూల్చివేయాలని నిన్న అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు నిన్న మరో క్లబ్‌ను నేలమట్టం చేశారు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం జరిగిన క్లబ్‌కు కో పార్టనర్‌గా ఉన్న అజయ్ గుప్తా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో కేవలం తాను క్లబ్ పార్టనర్ మాత్రమేనని అంతకు మించి తనకు ఏమి తెలియదని గుప్తా తెలిపినట్లు సమాాచారం. అజయ్ గుప్తాను విచారణ నిమిత్రం పోలీసులు రిమాండ్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రమాద ఘటన జరిగిన కొద్దిసేపటికే క్లబ్ యజమానులు సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలిద్దరూ థాయ్‌లాండ్ పారిపోయారు. దీంతో వారిద్దరిపై పోలీసులు లూకౌట్ నోటీలుసు ఇష్యూ చేయగా, ఇంటర్నేషనల్ ఏజేన్సీ ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. బ్లూకార్నర్ నోటీసులు జారీ చేయడానికి సాధారణంగా వారం రోజుల సమయం పడుతుందని కానీ ఈ ప్రమాద ఘటన తీవ్రత నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీలు తక్షణమే స్పందించి కేవలం రెండు రోజుల్లో బ్లూకార్నర్ నోటీసులు వచ్చేలా కృషి చేశాయని గోవా పోలీసు అధికారులు తెలిపారు.అంతేకాకుండా ప్రస్తుతం పరారీలో ఉన్న లూథ్రాబ్రదర్స్ను పట్టుకోవడానకి గోవాకు చెందిన ప్రత్యేక పోలీసుల బృందం థాయ్‌లాండ్‌కు వెళ్లాయని పేర్కొన్నారు. గోవా ప్రమాద ఘటనకు కారణమైన వారిని పట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామని దానికోసం సీబీఐతోపాటు ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. లూథ్రా బ్రదర్స్‌కు ఆర్థిక కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. న్యూఢిల్లీలోని రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీస్ లూథ్రా బ్రదర్స్ పాస్‌పోర్ట్ ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని వారికి నోటీసులు జారీ చేసింది.ఈ శనివారం అర్థరాత్రి బిర్చ్ బై నైట్ రోమియ్ నైట్ క్లబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదానికి కారణం ఆ క్లబ్ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే అని తేలింది. నైట్ క్లబ్‌కు వెళ్లే దారులు ఇరుకుగా ఉండడంతో సరైన సమయానికి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోలేక పోయిందని అధికారులు తెలిపారు. దానితో పాటు క్లబ్ నిర్మాణం తాటాకులతో చేపట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని పేర్కొన్నారు. -
విశాఖ: అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖ: విశాఖ బీచ్ రోడ్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫార్చ్యూన్ అపార్ట్మెంట్లో ఉవ్వెత్తున అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనకర వాతావరణం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోనికి తెస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఇటీవలే విశాఖపట్టణంలోని కింజ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలోని పలు టేబుల్లు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. నాడు కేజీహెచ్ ఆర్ ఎం ఓ బంగారయ్య మాట్లాడుతూ ఆస్పత్రిలోని డేటా ఎంట్రీ రూమ్ నుంచి పొగలు రావడాన్ని సిబ్బంది గమనించారని, వెంటనే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారన్నారు. ఆస్పత్రిలోని రోగులు అందరినీ షిఫ్ట్ చేశామని, ప్రమాదంలో ఎవరికీ, ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదన్నారు. ప్రమాదంపై వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ స్పందించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. రోగుల పట్ల ప్రభుత్వానికీ, అధికారులకు శ్రద్ద లేదన్నారు. కేజీహెచ్‌లో అధికారుల మధ్య సమన్వయం లేదని, ఎక్కడా సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని గణేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ఓవర్ లోడ్ కారణంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందన్నారు. ఇంత జరిగినా కలెక్టర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. -
గోవా నైట్ క్లబ్ ప్రమాదం... ఇద్దరిపై లుకౌట్ నోటీసులు
న్యూఢిల్లీ/పనజీ: 25 నిండు ప్రాణాలు బలిగొన్న గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదం ఉదంతంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనికి సంబంధించి క్లబ్ యజమానులుగా భావిస్తున్న అజయ్ గుప్తా అనే భారతీయునితో పాటు సురేందర్ కుమార్ ఖోస్లా అనే బ్రిటిష్ జాతీయునిపై మంగళవారం లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రాథమిక యజమానులుగా చెబుతున్న సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే థాయ్ లాండ్ కు పారిపోవడం తెలిసిందే.వారిని తిరిగి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం వారిపై ఇంటర్ ఆయిల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసినట్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా ఐదుగురిని అరెస్టు చేసినట్టు డీఐజీ వర్షా శర్మా తెలిపారు. మరోవైపు నిబంధనలు ఉల్లంఘించి కట్టిన ఆ క్లబ్ మొత్తాన్నీ మంగళవారం నేలమట్టం చేశారు. -
ఇండోనేసియాలో అగ్ని ప్రమాదం
జకార్తా: ఇండోనేసియా రాజధాని నగరం జకార్తాలో ఏడంతస్తుల భవంతిలో ఉవ్వెత్తున ఎగసిపడిన అగ్నికీలల ధాటికి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నిండు గర్భిణి సైతం అగ్నికి ఆహుతయ్యారు. జకార్తా సిటీలోని కెమయోరన్ ప్రాంతంలోని ఒక భవంతిలోని మొదటి అంతస్తులో నిల్వచేసిన డ్రోన్ బ్యాటరీల్లో ఒకటి పేలడంతో అంటుకున్న నిప్పు రవ్వలు మెరుపువేగంతో పై అంతస్తులకు ఎగబాకి పెద్దస్థాయిలో మంటల్ని రాజేశాయి. దీంతో భవంతిలోని వాళ్లు వెంటనే తప్పించుకునే అవకాశం లేకుండాపోయిందని సెంట్రల్ జకార్తా పోలీస్ చీఫ్ సుసత్యో పూర్ణోమో కాండ్రో వెల్లడించారు. బుధవారం సిబ్బంది మధ్యాహ్న భోజనాలు చేసే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.భవనానికి నిప్పు అంటుకుందని తెల్సిన వెంటనే వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, 28 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ఒక డ్రోన్ల తయారీ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఈ బహుళ అంతస్తుల భవంతిలో ఉంది. మొదటి అంతస్తులో బ్యాటరీలను నిల్వచేయడంతోపాటు పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశా రు. ఇక్కడి బ్యాటరీ పేలడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. బ్యాటరీలకు చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి మెరుపులు వచ్చి చివరకు అగ్గిరాజుకుందని మరో ప్రత్యక్ష సాక్షి ఇన్టాన్ పుష్పిత చెప్పారు.మంటలు పై అంతస్తులకు ఎగబాకుతుండటంతో పొడవాటి నిచ్చెనల సాయంతో ఆరో అంతస్తులో చిక్కుకున్న కొందరు కార్మికులకు ఎలాగోలా బయటకు తీసుకురాగలిగారు. బ్యాట రీలు పేలడంతో వెలువడిన పొగ భవంతిని కమ్మేసిన దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక చాలా మంది చనిపోయారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఘటనకు వాస్తవిక కారణా లను ఆధా రసహి తంగా కనిపెట్టాల్సి ఉందని పోలీసులు తెలిపారు. భవంతిలో అత్యయిక పరిస్థి తుల్లో తప్పించుకునే ఏర్పాట్లు లేవని ఘటనాస్థలిని పరిశీలించిన జకార్తా గవర్నర్ ప్రమోనో అనున్గ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రమాదం జరిగిన భవంతిలో పీటీ రెట్రా డ్రోన్ ఇండోనేసియా అనే కంపెనీ కార్యాలయం నడుస్తోంది. ఇది నిర్మాణం, గనులు, ముడిచమురు, సహజవాయువు, ఇంధన, వ్యవ సాయం, పట్టణ ప్రణాళిక రంగ కంపెనీలకు డ్రోన్ల ను సమకూరుస్తోంది. -
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. 20 మంది సజీవ దహనం!
ఇండోనేషియా రాజధాని జకార్తలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి.. 20 మంది దాకా సజీవ దహనం అయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు.సెంట్రల్ జకార్తాలోని ఓ భవనంలో మంగళవారం మధ్యాహ్నా సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో ప్రారంభమైన మంటలు శరవేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి. దట్టమైన పొగ, మంటలు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సహయక బృందాలు రంగంలోకి దిగాయి. మృతుల్లో 15 మంది పురుషులు, ఐదుగుర మహిళలు ఉన్నారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం సంభవించిన భవనంలో టెర్రా డ్రోన్ ఇండోనేషియా అనే సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్థానిక టీవీ చానెల్స్ ప్రసారం చేస్తున్న విజువల్స్‌లో .. అగ్నిమాపక సిబ్బంది బాధితులను బయటకు తీసుకువస్తూ.. కొందరి బాడీ బ్యాగ్‌లను మోసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పై అంతస్తుల నుండి కొంతమంది ఉద్యోగులు పోర్టబుల్ లాడర్లు ఉపయోగించి బయటకు తప్పించుకున్న విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సహాయం కోసం కొందరు బిల్డింగ్ పైన నిల్చున్న దృశ్యాలు నెట్టింటకు చేరుతున్నాయి.#இந்தோனேசியா தலைநகர் #ஜகார்த்தா-வில் வணிக கட்டிடம் ஒன்றில் இன்று ஏற்பட்ட தீ விபத்தில் 5 பெண்கள், 15 ஆண்கள் என குறைந்தது 20 பேர் பலியாகியுள்ளனர்.#indonesia #jakarta #FireAccident pic.twitter.com/yh9wKi6V0G— patrikai.com (@Patrikaidotcom) December 9, 2025ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. లంచ్ టైంలో ఘటన చోటు చేసుకుందని ప్రాణాలతో బయటపడిన కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చి సహాయక చర్యలు ముగిశాకే ప్రమాదంపై ఓ స్పష్టమైన ప్రకటన చేయస్తామని అధికారులు అంటున్నారు. -
గోవా ప్రమాదం.. మరో నైట్ క్లబ్ కూల్చివేత
ఇటీవల గోవాలో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదం జరిగిన "బిర్చ్ బై రోమియో నైట్ క్లబ్" యజమానులకు సంబంధించిన మరో క్లబ్ ను మంగళవారం కూల్చివేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గోవాలోని నైట్ క్లబ్ లో శనివారం అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 25మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి కారణం అక్రమ నిర్మాణంతో పాటు సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడమే అని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నైట్ క్లబ్ యజమాని గౌరవ్ లూథ్రాకు చెందిన బీచ్ షేక్ అనే మరో క్లబ్ ను కూల్చివేయాల్సిందిగా ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో అధికారులు ఆ బీచ్షేక్ను కూల్చివేశారు. ఈ రోజు ఉదయం అక్కడే ఉన్న ఓ అధికారి మాట్లాడుతూ "అక్రమంగా నిర్మించిన పోర్షన్ ను కూల్చివేయమని పర్యాటక శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. నార్త్ గోవా కలెక్టర్ ఆకట్టడాన్ని కూల్చివేయాల్సిందిగా పోలీసుశాఖ, ఇతర అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వారు ఈ రోజు కూల్చివేతలు చేపడతారు" అని అన్నారు.నైట్ క్లబ్ నిర్మాణం తాటాకులతో ఉండడంతో పాటు ఆ క్లబ్ కు వెళ్లే దారులు ఇరుకుగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఇరుకైన దారులు కావడంతో సహాయక బృందాలు సరైన సమాయానికి ప్రమాద ఘటనా స్థలానికి చేరుకోలేకపోయాయన్నారు. గతంలోనూ ఆ క్లబ్ ను కూల్చివేయాలంటూ నోటీసులిచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆ ప్రాంతంలోని నాయకులు తెలిపారు.కాగా ఈ రోజు ఉదయం గోవా పోలీసులు విచారణ నిమిత్తం ఢిల్లీలోని నైట్ క్లబ్ యజమానుల ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ గౌరవ్ లూథ్రా, సౌరవ్ లూథ్రాలు లేరు. వీరిద్దరూ ప్రమాదం జరిగిన అనంతరం థాయ్‌లాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఆ నైట్‌క్లబ్ ఓనర్ గౌరవ్ లూథ్రా థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్టులో ఉన్న చిత్రాలు బయిటకి వచ్చాయి. కాగా వీరిద్దరిపై అధికారులు లుక్ అవుట్ సర్క్యూలర్ తో పాటు ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీచేశారు. -
దాద్రానగర్ హవేలీలో భారీ అగ్ని ప్రమాదం
-
ఢిల్లీలో గోవా పోలీసుల తనిఖీలు
న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదం సంభవించిన గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేట్’నైట్ క్లబ్ యజమానులు గౌరవ్ లూథ్రా, సౌర భ లూథ్రాల న్యూఢిల్లీ నివాసానికి పోలీసు బృందం సోమవారం చేరుకుంది. హడ్సన్ లే న్లోని వారి ఇంట్లో తనిఖీలు చేయగా లూథ్రా సోదరులు కనిపించలేదు. వారి ఆచూకీని తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. నైట్ క్లబ్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే భరత్ కోహ్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గోవా పోలీసులు ఇప్పటివరకు క్లబ్ చీఫ్ జనరల్మేనేజర్ రాజీవ్ మోదక్, జనరల్ మేనేజర్ వివేక్ సింగ్, బార్ మేనేజర్ రాజీవ్ సింఘానియా, గేట్ మేనేజర్ రియాన్షు ఠాకూర్లను అరెస్టు చేశారు. క్లబ్ మేనేజర్‌ను విచారిస్తుండగా భరత్ కోహ్లీ ప్రస్తావన రావడంతో.. ఆయనను అరెస్టు చేశారు. -
నిర్లక్ష్యం మంటలు!
ఎక్కడ ఎలాంటి ఉపద్రవాలు చోటుచేసుకుంటున్నా నిర్లిప్తంగా, నిమిత్తమాత్రంగా మిగిలిపోతున్న వ్యవస్థలున్నచోట మరో ఘోరం జరిగిపోయింది. గోవాలోని అర్పోరా గ్రామ సమీపంలో ఆదివారం వేకువజామున ఒక నైట్ క్లబ్లో చెలరేగిన మంటల్లో చిక్కు కుని, పొగతో ఊపిరాడక 25 మంది కన్నుమూశారు. మరో ఆరుగురు గాయపడ్డారు.రెండేళ్లుగా ఎలాంటి అనుమతులూ, లైసెన్సులూ లేకుండా అక్కడ వ్యాపారం సాగు తున్నా నిమ్మకు నీరెత్తినట్టున్న ప్రభుత్వం ఇప్పుడు సంతాపం ప్రకటించి, నష్టపరిహారం వాగ్దానం చేసింది. ఈ క్లబ్ నిర్మాణాన్ని గ్రామ పంచాయతీ సకాలంలో పసిగట్టి 2023 డిసెంబర్లో నోటీసులు జారీచేసింది. పర్యావరణపరంగా అది అత్యంత సున్నితమైన ప్రాంతం గనుక అక్కడ ఎలాంటి నిర్మాణాలూ జరపరాదని తెలిపింది. 2024 ఏప్రిల్‌లో దాన్ని కూల్చేయాలంటూ నోటీసులిచ్చింది. అటుతర్వాత ఏం జరగాలో అదే జరిగింది. స్థల యజమాని పంచాయతీరాజ్ డిప్యూటీ డైరెక్టర్ వద్ద అప్పీల్ చేశాడు. ఆ వెంటనే స్టే జారీ అయింది. మొన్న ఆగస్టులో బీజేపీ సభ్యుడు సంకల్ప్ అమోంకర్ దీన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. ఉప్పు మడులు, పంటపొలాలు ఉన్నచోట యథేచ్ఛగా, చట్టవిరుద్ధంగా నైట్ క్లబ్‌లు నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. కానీ జరిగిందేమీ లేదు. అధికారులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అంటున్నారు. మంచిదే. కానీ శాసనసభలో ప్రస్తావనకొచ్చి మూణ్ణెల్లు దాటుతున్నా చేసిందేమిటి?మంటలు ఆర్పడానికొచ్చిన అగ్నిమాపక వాహనాలు 400 మీటర్ల అవతలే నిలిచి పోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో ఊహించవచ్చు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకున్నా చాలాసేపు నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది. శనివారం రాత్రి 11.30 ప్రాంతంలో డీజేల హోరుమధ్య బెల్లీ డ్యాన్స్ కార్యక్రమం సాగు తుండగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో బాణాసంచా కాల్చడం, అలంకరణ కోసం పైకప్పుపై వెదురు, ఫైబర్, గడ్డి వగైరాలతో చేసిన నిర్మాణంపై ఆ నిప్పు రవ్వలు పడటం వల్ల ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఆ సమయానికి బయటకు పోయేందుకు ఉన్న ఒకే ఒక తోవ ఇరుగ్గా ఉండటంతో బయటపడటం కష్టమైందనీ, దాంతో కొందరు బేస్మెంట్వైపున్న మెట్లు దిగార నీ, అటు వెళ్లినవారంతా దట్టమైన పొగ వ్యాపించటంతో ఊపిరాడక చనిపోయారనీ ప్రత్యక్ష సాక్షుల కథనం. క్లబ్ నిర్మించాక అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు దాన్ని సందర్శించి ఉంటే ఇలాంటి విషాదాన్ని ముందే ఊహించేవారు. ఎక్కడెక్కడ వెలుపలికి పోయే మార్గాలుండాలో, మంటలు ఆర్పటానికి తోడ్పడే పరికరాలను ఎక్కడ అందుబాటులో ఉంచాలో సూచించేవారు.మంటల కారణంగా విద్యుత్ నిలిచిపోయాక ఆ ప్రాంతమంతా గాఢాంధకారం అలుము కుని తొక్కిసలాట చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గోవాలో క్లబ్‌ల కొచ్చేవారిలో అత్యధిక శాతం యువత. విదేశీయులతోపాటు వేర్వేరు రాష్ట్రాల్లో కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేవారు వారాంతంలో బృందాలుగా గోవాకు వస్తుంటారు. ఎంతో బంగారు భవిష్యత్తుగల ఈ యువత కారణంగా కోట్లాది రూపాయల వ్యాపారం సాగించే క్లబ్‌లు కనీస రక్షణ చర్యలు తీసుకోవటంలో విఫలం కావటం, పన్నుల రూపంలో ఆదాయాన్ని ఆర్జించే ప్రభుత్వం కూడా పట్టనట్టు వ్యవహరించటం దుర్మార్గం. ఇలాంటి క్లబ్బుల్లో అడపా దడపా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఉదంతాలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో బయటపడుతున్నాయి. అయినా ముందు జాగ్రత్తలు లేవు.పాశ్చాత్య విష సంస్కృతిని అరువు తెచ్చుకుని వ్యాపారం సాగించటం ఈ బాపతు క్లబ్బుల బతుకుతెరువు. మద్యం ఏరులై పారే, జూదం చోటుచేసుకునే ఇలాంటి వాటిని నడవనీయరాదన్న ఉన్నతాశయం ప్రభుత్వాలకు ఎటూ ఉండటం లేదు. కనీసం వాటిని నియంత్రించటమైనా తమ బాధ్యతగా భావించకపోవటం విషాదకరం. క్లబ్బులే కాదు... ఆకాశాన్ని తాకే భవంతులు సైతం ఎలాంటి ప్రమాణాలూ పాటించకుండానే నిర్మాణ మవుతున్నాయి. అసలు మన దేశంలో అగ్నిమాపక వ్యవస్థ అత్యంత నాసిరకమైనది. అగ్నిమాపక కేంద్రాలు తక్కువ. అక్కడి సిబ్బంది వాడే పరికరాలు, వాహనాలు చాలా భాగం కాలం చెల్లినవి. కనీసం తాజా ఉదంతమైనా పాలకుల కళ్లు తెరిపిస్తుందా? ఆ రంగం సమూల ప్రక్షాళనకు పురిగొల్పుతుందా? -
గోవా ప్రమాదం: తొలిసారి స్పందించిన నైట్‌క్లబ్
గోవా: గోవాలోని నార్త్ గోవా నైట్‌క్లబ్ ‘బిర్చ్ బై రోమియో లేన్’లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన అనంతరం క్లబ్ యజమాని సౌరభ్ లూత్రా పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.తాజాగా క్లబ్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. జరిగిన ప్రాణనష్టంపై తాము తీవ్రంగా చలించిపోయామని విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చింది. కాగా క్లబ్ వ్యవహారాలను చూస్తున్న మేనేజర్ భరత్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత, లూత్రా అదృశ్యం చర్చనీయాంశమైంది. భారతదేశం అంతటా 50 రెస్టారెంట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్న లూత్రా, ‘రోమియో లేన్’, ‘బిర్చ్ అండ్ మామాస్ బుయోయి’కి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా గోవాకు చెందిన సామాజిక కార్యకర్త తాహిర్ నోరోన్హా మాట్లాడుతూ లూత్రా.. గోవాకు అరుదుగా వస్తుంటాడని, చట్టపరమైన చర్యలకు దూరంగా ఉంటూ, అన్నింటికీ తన ప్రతినిధులను పంపుతాడన్నారు. క్లబ్ సిబ్బంది మాట్లాడుతూ లూత్రా నెలకు ఒకసారి మాత్రమే క్లబ్‌ను సందర్శిస్తారని, ఉద్యోగులతో అరుదుగా మాట్లాడతారని తెలిపారు. పరారీలో ఉన్న లూత్రో కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. Goa restaurant fire that claimed 25 lives | Saurabh Luthra, owner of Birch restaurant, issues a statement following the deadly fire that broke out in the restaurant on 7 December. pic.twitter.com/EFh9HZl35V— ANI (@ANI) December 8, 2025అగ్నిప్రమాదం జరిగిన సమయంలో సుమారు 100 నుండి 200 మంది డ్యాన్స్ ఫ్లోర్లో ఉన్నారని సమాచారం. మంటలు చుట్టుముట్టడంతో, ప్రాణాలను కాపాడుకోవడానికి కొందరు వంటగదివైపునకు పరుగెత్తారు. అక్కడే వారు సిబ్బందితో పాటు చిక్కుకుపోయారు. కాగా గోవా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. యజమాని సౌరభ్ లూత్రాను, అతని సోదరులను పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.ఈ క్రమంలో లూత్రా కోసం దేశవ్యాప్తంగా లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. అగ్నిప్రమాదానికి దారితీసిన సంఘటనల పూర్తి క్రమాన్ని, భద్రతా ఉల్లంఘనలను అధికారులు పరిశీలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో క్లబ్లో సరైన నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడం తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు.ఇది కూడా చదవండి: తొలిసారి గోవా వెళ్లి.. ఢిల్లీ కుటుంబం విషాదాంతం! -
తొలిసారి గోవా వెళ్లి.. ఢిల్లీ కుటుంబం విషాదాంతం!
న్యూఢిల్లీ: గోవాలో ఎంజాయ్ చేసేందుకు తొలిసారిగా వెళ్లిన ఢిల్లీకి చెందిన ఒక కుటుంబానికి తీరని విషాదం ఎదురయ్యింది. జీవితంలో మరిచిపోలేని అనుభూతిని పొందాలని ఆశపడుతూ, సాగిన వారి పర్యటన చివరికి వారిని మృత్యు ఒడికి చేర్చింది. ఆదివారం తెల్లవారుజామున ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వినోద్ కుమార్, ఆయన భార్య భావన, ఆమె సోదరీమణులు అనిత, కమల, సరోజ్లతో పాటు కమల భర్త నవీన్, పిల్లలు కలిసి గోవా ట్రిప్‌కు బయలుదేరారు. అంతా సవ్యంగానే సాగుతున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున క్లబ్లో సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో టిఫిన్ చేసి, తిరిగి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ఆ కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. ఎలాగోలా బయటకు పరుగుపెట్టిన భావన, తన సోదరీమణులు లోపల చిక్కుకోవడాన్ని గమనించి ఉలిక్కిపడింది.మరోవైపు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగెడుతున్న జనాన్ని చూసి కూడా.. భావన తన అక్కాచెల్లెళ్లను కాపాడేందుకు ధైర్యంగా మంటల్లోకి వెళ్లారు. వినోద్ కుమార్ కూడా ఇదే ప్రయత్నంలో భావన వెంట వెళ్లారు. అంతకంతకూ ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగకు తోడు బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడంతో వారు కూడా ఆ మంటల మధ్యలో చిక్కుకున్నారు. ఈ ప్రయత్నంలో ముగ్గురు సోదరీమణులు.. అనిత, కమల, సరోజ్, భావన భర్త వినోద్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. భావన మాత్రం ఎలాగోలా బయటపడగలిగారు.కుటుంబంలో నలుగురు మరణించిన విషయం తెలియడంతో ఢిల్లీలోని కరావాల్ నగర్‌లోని వారి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఈ విషయాన్ని ఆ ఇంటి పెద్ద అయిన వృద్ధురాలికి ఇంకా చెప్పలేదని కుటుంబ స్నేహితుడు హరీష్ సింగ్ తెలిపారు. ‘వారు గోవాకు వెళ్లడం ఇదే మొదటిసారి. వారంతా చాలా ఉత్సాహంగా వెళ్లారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. వారి తల్లి ఆరోగ్యం బాగోలేదు. అందుకే ఆమెకు ఈ విషయం చెప్పకుండా జాగ్రత్త పడుతున్నాం’ అని సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందారు.ఇది కూడా చదవండి: గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు -
నైట్ క్లబ్బుల్లో మరణ శాసనాలు
నిత్య జీవితంలో రోజువారీ పనులతో అలసిపోయి సరదాగా గడపడానికి నైట్‌క్లబ్‌లకు వెళితే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోంది. గోవా నైట్‌క్లబ్బులో 25 మంది మరణించడం సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా నైట్క్లబ్సుల్లో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కాలక్షేపం, వినోదం, విశ్రాంతి కోసం వచ్చిన పర్యాటకులు విగత జీవులుగా మారారు. 2015 అక్టోబర్: రొమేనియా దేశంలోని బుకారెస్ట్ కలెక్టివ్ నైట్‌క్లబ్‌లో అగి్నప్రమాదం జరగడంతో 64 మంది మృతి. 2016 డిసెంబర్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఘోస్ట్షిప్ క్లబ్లో మంటలు చెలరేగడంతో 36 మంది బలి. 2022 జనవరి: ఆఫ్రికా దేశం కామెరూన్‌లోని యావోన్డే నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది మృతి. 2022 జనవరి: ఇండోనేషియాలో వెస్ట్పపువా ప్రావిన్స్‌లో సోరోంగ్ నైట్‌క్లబ్‌లో మంటలు. తుదిశ్వాస విడిచిన 19 మంది టూరిస్టులు. 2022 ఆగస్టు: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని మౌంటైన్ బీ క్లబ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు. 23 మంది అగ్నికి ఆçహుతి. 2023 అక్టోబర్: స్పెయిన్‌లోని మర్సియాలో నైట్‌క్లబ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం. 13 మంది మృతి. 2024 ఏప్రిల్: టర్కీలోని ఇస్తాంబుల్‌లో మస్కరేడ్ నైట్‌క్లబ్‌లో చెలరేగిన మంటలు. 29 మంది అక్కడికక్కడే మృతి. 2025 మార్చి: ఉత్తర మాసిడోనియాలోని నైట్‌క్లబ్‌లో బాణాసంచా కాలుస్తుండగా మంటలు అంటుకోవడంతో 62 మంది మృతి. ఇదీ చదవండి: గోవాలో భారీ అగ్ని ప్రమాదం.. 25 మంది సజీవదహనం -
గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు
గోవా: ఉత్తర గోవాలోని ఆర్పోరాలో గల 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. మృతులలో నలుగురు పర్యాటకులు ఉన్నారు. ఈ దుర్ఘటనపై అంజునా పోలీసులు సదరు క్లబ్ యజమానులు, భాగస్వాములు, మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్లపై కేసు నమోదు చేశారు.పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ నవనీత్ గోల్టేకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. దీనిలో రోమియో లేన్ చైర్మన్ సౌరభ్ లూత్రా, ఆయన సోదరుడు గౌరవ్ లూత్రా సహా ఇతర మేనేజింగ్ సిబ్బందిని నిందితులుగా పేర్కొన్నారు. సరైన అగ్నిమాపక భద్రతా పరికరాలు, భద్రతా గాడ్జెట్లు అందుబాటులో నిందితులు ప్రదర్శనను నిర్వహించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఎఫ్ఐఆర్లో వివరించారు. The tragic loss of lives in a fire accident in Arpora, Goa, is deeply painful. My sincerest condolences to the families of those who lost their lives and prayers for the speedy recovery of the injured @goacm Goa CMO is taking the necessary actions on fire safety. pic.twitter.com/NCDe1AdkZF— INTERNATIONAL HUMAN RIGHTS - INHRF (@DirectorINHRFHC) December 7, 2025ఎఫ్ఐఆర్ లోని వివరాలు క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని వెల్లడించాయి. రెస్టారెంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు డెక్‌లో అత్యవసర నిష్క్రమణ తలుపు లేకపోవడం ఎఫ్ఐఆర్లో గమనించదగిన అంశం.vTerrifying video of the Goa accident pic.twitter.com/HrCWMPM1A3— kamal Bhardwaj (@bhardwaj_k9310) December 7, 2025 అత్యవసర పరిస్థితుల్లో జనాన్ని ఖాళీ చేయించడానికి అనుమతించే మార్గం అందుబాటులో లేకపోవడం వల్లనే మృతుల సంఖ్య పెరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ రెస్టారెంట్/క్లబ్‌కు సంబంధిత అధికారుల నుండి ఎటువంటి అనుమతులు, లైసెన్సులు లేవని తేలింది. Deeply pained by the tragic fire in Arpora, Goa that has claimed more than 20 innocent lives. My heartfelt condolences to the bereaved families, and prayers for the speedy recovery of those injured.This is not just an unfortunate accident — it reflects a grave failure of safety… pic.twitter.com/azA2bamXQY— Durgesh Shukla (@mydurgeshshukla) December 7, 2025నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)సెక్షన్లు 105 (నేరపూరిత నరహత్య), 125 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్య), 125 (ఎ), 125 (బి), 287 (అగ్ని లేదా మండే పదార్థానికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం)తో పాటు సెక్షన్ 3 (5) (సాధారణ ఉద్దేశ్యం) కింద అభియోగాలు మోపారు. ఈ ఘటనను మానవ తప్పిదంగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Goa Night Club: ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వైరల్ వీడియో -
ఈయన క్లబ్‌లోనే మంటలు.. షాకిస్తున్న ఓనర్ బ్యాక్‌గ్రౌండ్
గోవా: గోవాలోని అర్పోరాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని 25 మంది ప్రాణాలు కోల్పోవడం దేశంలోని అందరినీ ఆవేదనకు గురిచేసింది. ఈ నేపధ్యంలో ప్రమాదం జరిగిన ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్ ఎవరిదనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నైట్‌క్లబ్‌ను ఒక గోల్డ్ మెడలిస్ట్ స్థాపించాడని తెలియగానే పలువురు ఆశ్చర్యపోతున్నారు. సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి బీటెక్‌లో బంగారు పతకం అందుకున్న సౌరభ్ లూత్రానే ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్ యజమాని. చదువు పూర్తయిన తర్వాత లూత్రా అంతర్జాతీయ క్లయింట్ల కోసం బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్‌గా పనిచేశారు. తరువాత తన కెరీర్‌ను రెస్టారెంట్, నైట్‌లైఫ్ వ్యాపారం వైపు మళ్లించాలని నిర్ణయించుకున్నారు. 2016లో ఆహారపానీయాల (ఎఫ్ అండ్ బీ) పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అదే ఏడాది న్యూఢిల్లీలో ‘రోమియో లేన్’ అనే బ్రాండ్‌ను స్థాపించారు.ఈ బ్రాండ్ వేగంగా విస్తరించింది. అంతర్జాతీయంగా కూడా విస్తరించాలని లూత్రా ప్రణాళికలు వేశారు. అతని నైట్‌క్లబ్ వెబ్సైట్ ప్రకారం రోమియో లేన్ ప్రస్తుతం భారతదేశంతో సహా నాలుగు దేశాలలోని 22 నగరాల్లో ఔట్లెట్లను కలిగి ఉంది. ఈ విస్తరణ అతని వ్యాపార దార్శనికతకు నిదర్శనంగా నిలిచింది. అతని బ్రాండ్‌కు లభించిన పలు అవార్డులు.. ఫోర్బ్స్ ఇండియాలో ఈ బ్రాండ్ ఫీచర్ కావడం మొదలైనవి అతని వ్యాపార విజయాలకు అద్దం పడుతున్నాయి.లూత్రాకు చెందిన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం అతను రోమియో లేన్‌కు మాత్రమే కాకుండా ‘బిర్చ్’, ‘మామాస్ బుయోయి’ తదితర సంస్థలకు కూడా ఛైర్మన్‌గా ఉన్నారు. ఇది ఆయన నైట్‌లైఫ్, హాస్పిటాలిటీ రంగంలో ఎంతటి విజయం సాధించారో తెలియజేస్తుంది. అయితే గోవాలోని అతని క్లబ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం అతని వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ఈ నైట్‌క్లబ్‌లో సిలిండర్ పేలుడు వల్ల మంటలు చెలరేగి, 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్యాన్స్ ఫ్లోర్లో 100 మందికి పైగా జనం ఉన్నట్లు సెక్యూరిటీ గార్డు తెలిపారు. ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో.. క్లబ్ యాజమాన్యం అగ్నిమాపక భద్రతా నియమాలను విస్మరించిందని వెల్లడయ్యింది. మృతులలో ఎక్కువ మంది వంటగది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. పోలీసులు నైట్‌క్లబ్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ‘మా ఆయన సీఎం కావాలి’: సిద్ధూ భార్య -
Goa Night Club: ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వైరల్ వీడియో
ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్స్ నైట్ క్లబ్ లో అర్థరాత్రి గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 25 మంది మరణించగా 50 మందికి తీవ్రగాయాయలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వారిలో అధికమంది క్లబ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా మిగితా వారంతా ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు.. మెహబూబా పాటకు డ్యాన్స్.. బ్యాక్‌గ్రౌండ్ మంటలుబాలీవుడ్ మూవీ షోలే సినిమాలోని మెహబూబా ఓ మెహబూబా పాటకు డ్యాన్స్ చేస్తున్న సమయంలో అంతా మంచి జోష్‌లో ఉన్నారు. ఆ ప్రాంగణమంతా ఈలలు-కేరింతలు అన్నట్లు ఉంది. అయితే సడెన్‌గా అంఆ నిశ్భబ్దం అయ్యారు. డ్యాన్సర్ వెనుకాల గోడకు అమర్చిన చెక్క నుంచి మంటల జాడ కనిపించడంతో ఏదో జరగబోతుందని గ్రహించారు. కొంతమంది ఏం జరుగుతుందోనని పైకి వెళ్లగా, మరికొంతమంది వంట గదిలో దాక్కునే యత్నం చేశారు. ఇక డ్యాన్సర్లు, మ్యుజిషియన్లు అంతా బయటకు పరుగులు తీశారు. వారి మ్యూజికల్ సామాగ్రిని అక్కడే వదిలి బయటకు వెళ్లిపోయే యత్నం చేశారు. ఆ క్లబ్‌ను అంతే వేగంగా మంటలు చుట్టుముట్టాయి. ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం జరిగిపోయింది. ఈ ఘటనలో 25 మంది వరకూ ప్రాణాలు కోల్సోగా, అందులో ఎక్కువమంది ఆ క్లబ్ సిబ్బంది ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. ఆ క్లబ్ యాజమాన్యం అజాగ్రత్త వల్ల జరిగిందా.. లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు అధికారులు. Watch the roof as the fire erupts.Final Moments before the deadly Arpora goa fire.At least 25 ppl dead. Bodies charred in the deadly fire which erupted from a suspected cylinder blast pic.twitter.com/OnCrR5eTyH— Shivan Chanana (@ShivanChanana) December 7, 2025 ఎంట్రీ-ఎగ్జిట్ ద్వారం గందరగోళంమంటలు చెలరేగిన తర్వాత అక్కడున్న తమ ప్రాణాలను కాపాడుకునే క్రమంలో బయటకు ఎలా వెళ్లాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. చిన్నపాటి, ఇరుకుగా ఉన్నటువంటి ఎంట్రీ-ఎగ్జిట్ ద్వారంతో వారిలో ఆందోళన మరింత పెరిగింది. అయితే చాలామంది అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పటికీ , 25 మంది చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గోవాలో ఇలా జరగడం ఇదే తొలిసారి.. : సీఎంఈ విషాదకర ఘటనపై గోవా సీఎం ప్రమోద సావంత్ స్పందించారు. ‘ గోవాలో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు. తన దృష్టికి వచ్చిన దాని ప్రకారం ఆ క్లబ్లో పై ఫ్లోర్ నుంచి మంటల వ్యాపించాయని, అక్కడ డోర్స్ ఏర్పాటు కూడా సరిగా లేదన్నారు. చాలామంది తప్పించుకునే యత్నం చేశారని, కొంతమంది మాత్రం అక్కడ నుంచి బయటపడలేకపోయి ప్రాణాలు కోల్పోయారన్నారు. చాలామందికి ఏమీ చేయాలో తెలియక అండర్ గ్రౌండ్ ఏరియాకు వెళ్లి మృత్యువాత పడ్డారన్నారు. గోవా ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం -
గోవా ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
గోవాలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానూభూతి తెలియజేశారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిర్స్ నైట్ క్లబ్ లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో మాట్లాడినట్లు మోదీ పేర్కొన్నారు. కేంద్రం మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.బిర్స్ నైట్ క్లబ్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనా స్థలాన్ని సీఎం అధికారులతో కలిసి పరిశీలించారు. బిర్స్ నైట్ క్లబ్ సరైన నిబంధనలు పాటించలేదని ప్రాథమిక విచారణలో తేలిందని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్స్ నైట్ క్లబ్ లో అర్థరాత్రి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 25 మంది మరణించగా 50 మందికి తీవ్రగాయాయలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వారిలో అధికమంది క్లబ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా మిగితా వారంతా ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పి సహాయక చర్యలు ప్రారంభించాయి. -
అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
అమెరికా బర్మింగ్‌హామ్‌లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరణించిన వారిలో మేడ్చల్ జిల్లా పోచారానికి చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. మృతులిద్దరూ హైదరాబాద్ వాసులు. కాగా అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. హఠాత్తుగా చెలరేగిన మంటలకు అందులో చిక్కుకున్న విద్యార్థులు ఉక్కిరి బిక్కిరయ్యారు. విద్యార్థులు శ్వాస తీసుకోలేక పెద్దగా కేకలు పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. తీవ్ర గాయాలైన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లాగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా అక్కడి అలబామా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు. -
రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం
సాక్షి హైదరాబాద్ : సోమాజిగూడ శ్రీ కన్య కంఫర్ట్ రెస్టారెంట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ ఐదవ అంతస్థులో ఉన్న రెస్టారెంట్ లో అగ్గి రాజుకొని మంటలు వ్యాపించాయి దీంతో హుటాహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉన్న వారిని బయిటకి పంపించారు. ఫైర్ ఇంజన్లు మంటలార్పే యత్నం చేస్తున్నాయి. కాంప్లెక్స్ నాలుగవ అంతస్థులో GRT జ్యూవెలర్స్ ఉంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
కాలి బూడిదైన కారు..
-
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో అగ్నిప్రమాదం
-
నర్సీపట్నం శారదనగర్ లో అగ్నిప్రమాదం
-
ఒక్క సిగరెట్.. 146 ప్రాణాలు బలి!
నిప్పుతో చెలగాటం ఆడొద్దని పెద్దలు చెబుతుంటారు. ఏమరుపాటుగా ఉంటే క్షణంలో నిప్పు జీవితాలను తలక్రిందులు చేస్తుంది. అగ్గిరాజుకుంటే కలిగే నష్టాన్ని ఊహించం చాలా కష్టం. ఆస్తి నష్టమే కాదు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చివరకు బూడిద మాత్రమే మిగులుతుంది. అందుకే పెద్దోళ్లు హెచ్చరిస్తూ ఉంటారు.. అగ్నితో ఆటలు వద్దని. తాజా విషయానికి వస్తే హాంగ్‌కాంగ్‌లో నిప్పు సృష్టించిన విలయం పెను విషాదాన్ని మిగిల్చింది. టై పొ టౌన్‌లోని వాంగ్ ఫుక్ కోర్టు అపార్టుమెంట్ సముదాయంలో నవంబర్ 26న చెలరేగిన అగ్ని కీలలు ఇప్పటివరకు 146 మందిని బలితీసుకున్నాయి. 40 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. మరో 18 మంది ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.1948 తర్వాత హాంగ్‌కాంగ్‌లో చోటుచేసుకున్న అతిపెద్ద అగ్నిప్రమాదమని అధికార యంత్రాంగం వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు హాంగ్‌కాంగ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఎలా అంటుకున్నాయనే దాని గురించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. ఇందుకోసం ఇంటర్ డిపార్ట్మెంటల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. నగర అవినీతి నిరోధక నిఘా సంస్థ అగ్నిప్రమాదానికి సంబంధించి 11 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ముగ్గురిని పోలీసులు హత్యా నేరం పోలీసులు అరెస్ట్ చేశారు.వెలుగులోకి వీడియోహాంగ్కాంగ్ అగ్నిప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. కాల్చి పారేసిన సిగరెట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. 'ఆర్టీ ఇండియా' షేర్ చేసిన ఈ వీడియోలో.. వాంగ్ ఫుక్ కోర్టు అపార్టుమెంట్ సముదాయంలో మంటలు చెలరేగడానికి కొన్ని క్షణాల ముందు భవనం బయటి గోడ దగ్గర ఒక కార్మికుడు పొగ తాగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే అధికారికంగా హాంగ్‌కాంగ్ పోలీసులు ఇంకా ఎటువంటి నిర్ధారణకు రాలేదు. కాగా, అపార్ట్మెంట్ కిటికీలకు రక్షణగా బిగించిన స్టీరోఫోమ్ ఫ్రేమ్‌లు కూడా మంటల తీవ్రత పెరగడానికి కారణమయ్యాయన్న వాదనలు కూడా విన్పిస్తున్నాయి.కొనసాగుతున్న గాలింపువాంగ్ ఫుక్ కోర్ట్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న ఎనిమిది టవర్లలో ఏడు పూర్తిగా దగ్ధమయ్యాయి. మూడు రోజుల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడికల్ స్టాప్, వలంటీర్లు అన్వేషణ, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. దగ్ధమైన ప్రతి అపార్ట్మెంట్లోకి అగ్నిమాపక సిబ్బంది టార్చ్లైట్లు పట్టుకుని వెళ్లి మృతదేహాల కోసం వెతుకుతున్నారు. మంటల ధాటికి అపార్ట్మెంట్ భవనాలు పూర్తిగా దెబ్బతినడంతో వెతుకులాటకు ఎక్కువ సమయంలో పడుతోందని పోలీసులు తెలిపారు.కాలిపోయిన అపార్ట్మెంట్లలో సహాయక చర్యలకు సంబంధించిన ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. మంటల ధాటికి బూడిదగా మారిన వస్తువులు, ధ్వంసమైన గోడలు ఈ ఫొటోల్లో కనిపించాయి. విపత్తు బాధితుల గుర్తింపు యూనిట్ (DVIU)కు చెందిన వందలాది మంది సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు అగ్నిప్రమాదంతో చనిపోయిన వారికి నివాళులు అర్పించడానికి ఆదివారం హాంకాంగ్ అంతటా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. పుష్పగుచ్ఛాలు ఉంచి కన్నీటి నివాళి అర్పించారు.వాటికి ప్రమాదం లేదువాంగ్ ఫుక్ కోర్ట్ హౌసింగ్ కాంప్లెక్స్‌ను 1,984 ఫ్లాట్లతో 1983 సంవత్సరంలో నిర్మించారు. 2021 జనాభా లెక్కల ప్రకారం వీటిల్లో దాదాపు 4,600 మంది నివసిస్తున్నారు. వీరిలో దాదాపు 40 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వృద్ధులేనని తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గురైన 8 అపార్ట్మెంట్ బ్లాక్‌లలో ఆరింటిని సర్వే చేశామని, వాటి మొత్తం నిర్మాణానికి "తక్షణ ప్రమాదం లేదు" అని హౌసింగ్ డిపార్ట్మెంట్ తెలిపింది. -
‘వేలంపాడు ప్రమాదం.. మాకేం సంబంధం లేదు’
తిరుపతి, సాక్షి : శ్రీకాళహస్తి మండలం వేలంపాడు గ్రామంలో ఇటీవల ఘోరం జరిగింది. ఓ టైల్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ ఘటనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ కీలక ప్రకటన చేసింది.ప్రమాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ వీ వెట్రిసెల్వకుమార్ అంటున్నారు. ‘‘ఆ ప్రమాదం ఎల్పీజీ ట్యాంకర్ ట్రక్ పేలుడు వల్ల జరగలేదు. పరిశ్రమ ప్రాంగణంలో ఒక ప్రైవేట్ ఆపరేటర్ నైట్రోజన్‌తో వెసల్/ట్యాంక్‌కు ప్రెజర్ టెస్టింగ్ నిర్వహిస్తుండగా జరిగింది. అందువల్ల ఆ ఘటనతో ఎల్పీజీకి ఎటువంటి సంబంధం లేదు’’ అని ఒక ప్రకటనలో స్పష్టత ఇచ్చారాయన.వేలంపాడు సోమేనీ ఫ్యాక్టరీలో నైట్రోజన్ గ్యాస్ పేలడంతో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంకటగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుల్ని చీరాలకు చెందిన పోతురాజు, ఒడిశాకు చెందిన పాండే గా గుర్తించారు. అయితే.. ఘటన తర్వాత బాధిత కుటుంబాలను, వైద్య సిబ్బందిని, మీడియాను లోపలకు అనుమతించకపోవడంతో యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. -
కొండగట్టులో అగ్ని ప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు
-
ఢిల్లీలోని టిగ్రి ఎక్స్ టెన్షన్ లో భారీ అగ్నిప్రమాదం
-
అన్నా, చెల్లెలు సజీవ దహనం
ఢిల్లీ ఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని టిగ్రి ఎక్స్టెన్షన్ నాలుగు అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారరు. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దుర్మరణం చెందిన వారిలో ఇద్దరు అన్నా చెల్లెళ్లు సజీవ దహనం అయ్యారు. బిల్డింగ్ యజమాని సతీందర్, ఆయన చెల్లెలు అనితలు అగ్ని ప్రమాదం బారిన పడి మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం జరిగిందని పసిగట్టి తేరుకునేలోపే నిమిషాల్లో ఆ బిల్డింగ్‌ను మంటలు చుట్టుముట్టాయి. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న నాలుగు ఫైరింజన్లు.. మంటలన అదుపులోకి తెచ్చాయి. అప్పటికే ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీస్ అధికారులు. కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. -
కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం..
జగిత్యాల: జిగిత్యాల జిల్లాలోని కొండగట్టులో భాభీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో నిన్న అర్థరాత్రి దుకాణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో 30 చిన్న దుకాణాలను మంటలు చుట్టుముట్టాయి. ఒకదానికొకటి అంటుకుని 30 షాప్స్ అంటుకోవడంతో భారీగా ఆస్తి నష్టం..వాటిల్లింది. దుకాణాలు అంటుకోవడంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలోబొమ్మల దుకాణాలు కాలి బూడిదైపోయాయి. దుకాణాలనే నమ్ముకుని బ్రతుకుతున్న వ్యాపారులు లబోదిబో మంటున్నారు. ఫైర్ ఇంజిన్స్ సాయంతో మంటలను ఆర్పేసిన ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల తెలంగాణలో పలు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ, మధురానగర్ ప్రాంతాల్లో జరిగిన ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ (బోయిగూడ, ఛత్రినాక పరిధి)లో ఈ ఏడాది మే 20, జీ ప్లస్ 2 భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రెండో అంతస్తులో ఉన్న చెప్పుల గోదాంలో మంటలు వ్యాపించాయి అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.పాతబస్తీలోని శాలిబండలో -నవంబర్ 24, 2025న గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మంది గాయపడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. -
భవిష్యత్తు అగమ్య గోచరం
హాంకాంగ్: హాంకాంగ్‌లోని అపార్టుమెంట్ సముదాయంలో బుధవారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం 128 మందిని బలి తీసుకుంది. మరో 200 మంది వరకు జాడ తెలియడం లేదు. హాంకాంగ్‌లోని మొత్తం 75 లక్షల జనాభాకు గాను ప్రమాదం జరిగిన శివారు టై పొ టౌన్లోనే 3 లక్షల మంది వరకు నివసిస్తున్నారు. 1948 తర్వాత హాంకాంగ్‌లో చోటుచేసుకున్న అతిపెద్ద అగ్ని ప్రమాదమిది. 1980ల్లో నిర్మించిన వాంగ్ ఫుక్ కోర్టు అపార్టుమెంట్ సముదాయంలో 4,600 మంది ఉన్నట్లు అంచనా. తాజా విషాద ఘటనలో 32 అంతస్తులున్న ఈ కాంప్లెక్స్‌లో పైఫ్లోర్లలో ఉన్న వారిపై ఎక్కువ ప్రభావం పడింది. మొత్తం 8 అపార్టుమెంట్లకుగాను ఏడు అపార్టుమెంట్లలో దాదాపు 40 గంటలపాటు మంటలు మండుతూనే ఉన్నాయి. విలియం లి కుటుంబం సురక్షితంసెప్టెంబర్ నెలలో తమ అపార్టుమెంట్‌లోని 29వ ఫ్లోర్ నుంచి రెండో ఫ్లోర్‌కు మారిన విలియం లి కథ సుఖాంతమనే చెప్పాలి. ఎందుకంటే, ఈ ప్రమాదం నుంచి ఆయన త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన కుటుంబంలోని మిగతా ముగ్గురూ ఆ సమయంలో వేర్వేరు పనులపై బయటే ఉన్నారు. విలియం లి మాత్రం భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందంటున్నారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న అపార్టుమెంట్లోకి తిరిగి వెళ్లడం అసాధ్యం, మరి ప్రభుత్వం తమను ఎలా ఆదుకుంటుందన్న ఆలోచన ఆ కుటుంబాన్ని వెంటాడుతోంది. ప్రమాదం జరిగిన రోజు ఏమైందంటే.. ఆ రోజు సాయంత్రం విలియం లికి సెలవు. బయటకు వెళ్లాలని అనుకుంటుండగా ఎన్నడూ లేంది సాయంత్రం 3 గంటలప్పుడు భార్య నుంచి ఫోన్ వచ్చింది. తమ అపార్టుమెంట్‌ను మంటలు చుట్టుముట్టాయని ఓ స్నేహితురాలు చెబితే ఫోన్ చేశానంది. లి నమ్మలేదు. అంతా బాగానే ఉంది. పొగ లేదు, మంటలూ లేవు ప్రమాదం లేదంటూ బదులిచ్చారు. దాదాపు 8 నిమిషాల తర్వాత ఆయన డోర్ తెరిచి చూశారో లేదో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. అంతా నల్లగా కనిపించింది. అప్పుడు ఆయన ప్రమాదం శంకించారు. హాల్లోకి వెళ్లి చూశారు. పొగ తీవ్రతకు తాళ లేక తిరిగి తన ఫ్లాట్‌లోకి వచ్చేశారు. ఇక తనకు మృత్యు ఘడియలు దగ్గర పడినట్లేననుకున్నారు. ఆ తర్వాత కారిడార్ గుండా వెళ్లేందుకు యత్నించారు. అక్కడ ఇద్దరు వృద్ధులున్నారు. ఈలోగా ఫైర్ ఫైటర్లు నిచ్చెన అందించడంతో ముందుగా ఇద్దరు వృద్ధులు కిందికి దిగేందుకు సాయం చేశారు. ఆ తర్వాత ఫైర్ ఫైటర్లు పంపిన నిచ్చెనపైకి ఎక్కారు. కిందికి దిగేలోపు మంటలను ఆయనను దహించి వేయకుండా నీళ్లు చిమ్ముతూనే ఉన్నారు. ఎలాగోలా కిందికి చేరుకున్న లి సజీవంగా బయటపడినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అక్కడే తన కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న భార్య, కూతురు, కుమారుడు కనిపించారు. అప్పటికి సాయంత్రం 5 గంటలైంది. ‘మాలాంటి వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న హాంకాంగ్ ప్రజలకు కృతజ్ఞతలు’అని ఈ కుటుంబం అంటోంది.మా భవిష్యత్తు ఎలా ఉంటుందో..?ప్రమాదం జరిగిన రోజు ఉదయం ఉద్యోగానికి వెళ్లిన 70 ఏళ్ల చాన్ తాముండే వాంగ్ ఫుక్ కోర్టు కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. భారీగా వ్యాపిస్తున్న మంటలను దూరం నుంచి చూసి షాకయ్యారు. అలా చూస్తూ ఉండటం మినహా చేయగలిగిందేమీ లేకుండాపోయింది. ఇలాంటి ప్రమాదాన్ని జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆమె తెలిపారు. అదృష్టవశాత్తూ ఆమె భర్త ఐఎన్ కాంగ్ ఆ సమయంలో ఇంట్లో లేరు. చాన్, కాంగ్ వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తుంటారు. దాదాపు పదేళ్లుగా ఉంటున్న ఆ ఇల్లు ఇప్పుడు నివాస యోగ్యంగా ఏమాత్రం లేదు. ఇప్పుడిక ఏం చేయడమా అన్న ఆలోచన వారిని వెంటాడుతోంది. ప్రభుత్వం వారిని ప్రస్తుతం ఓ హోటల్లో ఉంచింది. ‘రెండు రోజులుగా నాకు నిద్రపట్టడం లేదు. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలి. ఏంచేయాలి? ఇవే మమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నలు’అని చాన్ అంటున్నారు. ‘ప్రభుత్వం అత్యవసర సాయం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దాతల నుంచి కూడా వస్తువులు, డబ్బు అందుతూనే ఉన్నాయి. అయితే, భవిష్యత్తు జీవితానికి అవి ఏమాత్రం అక్కరకు వస్తాయనేది తెలీడం లేదు’అని తెలిపారు. -
విశాఖ KGH ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
-
కేజీహెచ్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖ : విశాఖపట్టణంలోని కింజ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్)లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది కేజీహెచ్‌కు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలోని పలు టేబుల్లు, కంప్యూటర్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది.ఈ ఘటనతో ఆస్పత్రిలో భయాందోళనకర వాతావారణం ఏర్పడింది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. సాక్షి టీవీతో కేజీహెచ్ ఆర్ ఎం ఓ బంగారయ్య మాట్లాడుతూ ఆస్పత్రిలోని డేటా ఎంట్రీ రూమ్ నుంచి పొగలు రావడాన్ని సిబ్బంది గమనించారని, వెంటనే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశామన్నారు. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఆస్పత్రిలోని రోగులు అందరినీ షిఫ్ట్ చేశామని, ప్రమాదంలో ఎవరికీ, ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదన్నారు. ప్రమాదంపై వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ స్పందించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. రోగుల పట్ల ప్రభుత్వానికీ, అధికారులకు శ్రద్ద లేదన్నారు. కేజీహెచ్‌లో అధికారుల మధ్య సమన్వయం లేదని, ఎక్కడా సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని గణేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ఓవర్ లోడ్ కారణంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందన్నారు. ఇంత జరిగినా కలెక్టర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. -
ఆ స్లీపర్ బస్సులపై వేటు
ఇటీవలి కాలంలో స్లీపర్ బస్సులలో ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భద్రతా నిబంధనలను ఉల్లంఘించే అన్ని స్లీపర్ కోచ్ బస్సులను తొలగించాలని భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ధర్మాసనం, ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని NHRC అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలిచ్చింది. దూర ప్రాంతాలకు ప్రయాణించేవారికి స్లీపర్ బస్సులు ఒకప్పుడు చాలా మంది భారతీయులకు సులభమైన, చౌకైన రాత్రి ప్రయాణం. కానీ లోపభూయిష్టమైన భద్రతా ప్రమాణాలు, తనిఖీలు లేకపోవడంతో భారీ ప్రమాదాలు సంభవించాయి. అనేక మందిని పొట్టన పెట్టుకున్నాయి. దీంతో స్లీపర్ బస్సులలోని భద్రతా ప్రమాణాలపై భారీ ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు, జైసల్మేర్‌లో జరిగిన సంఘటనల తర్వాత మరింత చర్చనీయాంశంగా మారింది. ఇవి యాదృచ్చికంగా జరిగినవి కావనీ, సరైన భద్రతా పద్ధతులను పాటించకపోవడం, బస్సుల రూపకల్పనలో సమస్యలు, నిబంధనలు, సరైన తనిఖీలు లేకపోవడమే ప్రధాన కారణమని ఉన్నాయని అలు నివేదికలు చెబుతున్నాయి .The National Human Rights Commission of India (NHRC) bench, headed by memeber Priyank Kanoongo, issued directions to all Chief Secretaries of states to remove all sleeper coach buses that violate safety norms. pic.twitter.com/MGCHSCeyVh— ANI (@ANI) November 29, 2025భద్రతా ప్రమాణాలుభారతదేశంలో ఇప్పటికే AIS-052 ,AIS-119 వంటి నియమాలు ఉన్నాయి. స్లీపర్ బస్సులలో అత్యవసర నిష్క్రమణలు, అగ్ని-సురక్షిత ఇంటీరియర్లు, పైకప్పు హాచ్లు, తప్పించుకునేందుకు సరైన మార్గాలు ఉండాలని ఈ నియమాలు చెబుతున్నాయి. కానీ చాలా బస్సులు వీటిని పాటించవు. చాలా మంది ఆపరేటర్లు సాధారణ సీటర్ బస్సులను తీసుకొని చిన్న వర్క్‌షాప్‌లలో స్లీపర్ బస్సులుగా మారుస్తారు. ఈ సందర్భంగా కొన్ని మార్గాలను బ్లాక్ చేయడం, అదనపు బెడ్స్ వేయడం, మండే షీట్లను ఉపయోగించడం, తప్పించుకోవడానికి స్థలం లేకుండా చేయడం లాంటివి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని రవాణా రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.ఇదీ చదవండి : పాతికేళ్లకే యంగెస్ట్ బిలియనీర్.. అమన్ అంటే అమేయ ప్రతిభకొన్ని బస్సుల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు పగలగొట్టలేని కిటికీలులేకపోవడం, లోపలినుంచి బైటికి వచ్చే మార్గాలు సరిగ్గా లేకపోవడం వల్లన లోపల చిక్కుకుపోతున్నారని పలువురు నిపుణులు పేర్కొన్నారు. కొంతమంది రవాణా నిపుణులు బహిరంగంగా ఈ బస్సులు చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి బస్సుల డిజైన్ అస్సలు సురక్షితం కాదని మాజీ IOC చైర్మన్ శ్రీకాంత్ ఎం. వైద్య కూడా స్పష్టం చేశారు. అంతేకాదు. కొన్ని స్లీపర్ బస్సులను మరమ్మతులు చేయడం, అప్ గ్రేడ్ చేయడంకాకుండా వాటిని తొలగించాలని కూడా పేర్కొన్నారు. అటు చాలా దేశాలు తమ నియమాలను మార్చుకున్నాయి. చైనా కూడా 2012లో మల్టీ-బంక్ స్లీపర్ బస్సులను నిషేధించింది. ఇదీ చదవండి: 17 ఏళ్లకే ఏఐ రోబో టీచర్‌తో సంచలనం -
Hyd: టైర్ల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, మేడ్చల్: పేట్ బషీరాబాద్ పరిధిలోని సుచిత్ర సెంటర్లో గల ఒక టైర్ల దుకాణంలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం నాలుగు గంటల సమీపంలో ఇక్కడి శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ లోని సన్ రైస్ వాటర్ వాష్ అండ్ వీల్ అలైన్మెంట్ షాప్‌లో ఈ ప్రమాదం సంభవించింది. నాలుగు ఫైర్ ఇంజన్ల సహకారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. చుట్టుపక్కల వారిచ్చిన సమాచారంతో సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన కారణంగా దుకాణంలోని సామగ్రి అంతా కాలి బూడిదయ్యింది. ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. -
హాంకాంగ్ ఘటనలో 128కి పెరిగిన మరణాలు
హాంకాంగ్/బీజింగ్: హాంకాంగ్‌లో నలభై ఏళ్ల క్రితం కట్టిన ఎత్తయిన భవనసముదాయాలను నలువైపులా అగ్నికీలలు చుట్టుముట్టిన ఘటనలో మరణాల సంఖ్య శుక్రవారానికి 128కి పెరిగింది. ఇంకా 200 మంది జాడ తెలీడంలేదని అధికారులు చెప్పారు. పలువురు గాయపడి ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక భవనానికే అంటుకున్న మంటలు ఎలా అంతవేగంగా మరో ఆరు భవనాలకు వ్యాపించయనే అంశం మీదనే దర్యాప్తు అధికారులు ప్రధానంగా దృష్టిసారించారు. బుధవారం మధ్యాహ్నం మొదలైన మంటలను ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 10 గంటలకు పూర్తిగా ఆర్పేయగలిగారు. నిప్పులకుప్పగా మారిన బహుళ అంతస్తుల భవనాల అపార్ట్మెంట్లలోకి అధికారులు ఒక్కోటిగా తనిఖీలుచేయడం మొదలెట్టారు. దీంతో అగ్ని, పొగ, ఊపిరాడక పోవడం వంటి కారణాలతో చనిపోయిన మరికొంత మంది మృతదేహాలు బహిర్గతమవుతున్నాయి. శుక్రవారానికి మరణాల సంఖ్య 128కి పెరిగిందని, ఈ సంఖ్య మరింత అధికమయ్యే అవకాశముందని హాంకాంగ్ ప్రభుత్వంలో భద్రతాశాఖ కార్యదర్శి క్రిస్ టాంగ్ పింగ్ కుంగ్ చెప్పారు. మరోవైపు భవనాల మరమ్మతు, ఆధునీకరణ పనులతో సంబంధమున్న ఎనిమిది మందిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్‌చేశారు. -
నిలువెత్తు నిప్పుకణిక
హాంకాంగ్/బీజింగ్: హాంకాంగ్‌లో గత 100 సంవత్సరాల చరిత్రలో అతిపెద్ద అగ్నిప్రమాదంగా పరిణమించిన వాంగ్ ఫుక్ కోర్ట్ హౌసింగ్ కాంప్లెక్స్ ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిలువెత్తు నిప్పుకణికగా తయారైన బహుళఅంతస్తుల భవనాల్లో ఇంకా మంటలు చెలరేగడంతో మరికొందరు అపార్ట్‌మెంట్‌వాసులు అగ్నికి ఆహుతయ్యారు. గురువారంనాటికి మరణాల సంఖ్య 83కు పెరిగింది. వీరిలో ఇండోనేసియా వలసకార్మికులు సైతం ఉన్నారు. 76 మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. వీరిలో 15 మంది ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. భవనాల్లో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది జాడ తెలియాల్సి ఉందని హాంకాంగ్ స్థానిక యంత్రాంగం గురువారం ప్రకటించింది. పైఅంతస్తుల్లోకి మంటలు ఇంకా విస్తరిస్తూ, అగ్ని కీలలు ఎగసిపడుతుండటంతో వాటిని అదుపుచేయడం అగ్నిమాపక దళాలకు చాలా కష్టంగా మారింది. ఎనిమిది భవనాల సమాహారంగా నిర్మితమైన వాంగ్ ఫుక్ కోర్ట్‌లో ఏడింటికి నిప్పు అంటుకోగా నాలుగు భవనాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. మిగతా మూడు భవనాల్లో పరిస్థితి అదుపులోలేదు. ఒక్కోటి 32 అంతస్తుల ఎత్తుండటంతో ఆ ఎత్తులోకి వెళ్లి మంటల్ని ఆర్పడం అసాధ్యంగా మారింది. 304 ఫైర్‌ఇంజిన్లు, వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడికల్ సిబ్బంది, వలంటీర్లు అన్వేషణ, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మసిబొగ్గులా మారిన ఒక్కో అపార్ట్మెంట్లోకి అగ్నిమాపక సిబ్బంది టార్చ్లైట్లు పట్టుకుని వెళ్లి మృతదేహాల కోసం వెతుకుతున్నారు. భవనాల ఆధునీకరణ బాధ్యతలు చూస్తున్న ఒక కాంట్రాక్టర్‌కు చెందిన ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌ను, ఇద్దరు డైరెక్టర్లను నిర్లక్ష్యానికి కారకులంటూ పోలీసులు గురువారం అరెస్ట్‌చేశారు. ‘‘ మంటలు ఎగసినప్పుడు నేను భవనంలో లేను. వెంటనే భార్యకు ఫోన్‌చేసి తప్పించుకో అని హెచ్చరించా. ఫ్లాట్ నుంచి బయటికొస్తే మెట్ల వద్ద, కారిడార్‌లో మొత్తం మంటలే ఉన్నాయి. దీంతో మళ్లీ ఆమె ఫ్లాట్‌లోకి పరుగులుతీసింది. తర్వాత ఆమె ఏమైందో తెలీడం లేదు’’ అని అపార్ట్‌మెంట్‌వాసి లారెన్స్లీ బోరున విలపించారు. ‘‘మంటలంటుకోగానే ఇంట్లోంచి బయటికొచ్చాం. ఇప్పుడు మా ఫ్లాట్ ఎలాగుందో. నిద్రలేని రాత్రిని గడిపాం’’ అని 75 ఏళ్ల వృద్ధదంపతులు వింటర్, శాండీ చంగ్ కన్నీరుమున్నీరయ్యారు. అగ్గిరాజేసిన స్టీరోఫోమ్ కిటికీలు భవనాలకు ఆవలివైపు నుంచి దాదాపు రూ.379 కోట్లతో గత కొన్ని నెలలుగా మరమ్మత్తులు, ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. దుమ్ము, ధూళి, నిర్మాణసంబంధ పరికరాలు, శబ్దాల నుంచి రక్షణ కోసం దాదాపు ప్రతి అపార్ట్మెంట్ కిటికీలకు రక్షణగా స్టీరోఫోమ్తో చేసిన ఫ్రేమ్‌లను బిగించారు. అయితే వీటికి అత్యంత వేగంగా మండే స్వభావం ఉంది. వెదురుకర్రల చుట్టూతా కప్పిన ఆకుపచ్చ మెష్‌కు తొలుత మంటలు అంటుకుని, అవి వెనువెంటనే వెదురు కర్రలకు అంటుకున్నాయి. బహిరంగంగా ఉండటంతోపాటు ఎత్తయిన ప్రదేశంకావడంతో గాలులు తోడై ఆ మంటలు వెంటనే స్టీరోఫోమ్ కిటికీ ఫ్రేమ్లకు అంటుకోవడంతో అగ్నికీలలు అమాంతం ఎగసిపడి భారీ అగ్నిప్రమాదం సంభవించిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. 40 శాతం మంది వృద్ధులే.. బాధితులకు తక్షణ సాయం అందించేందుకు హాంకాంగ్ ప్రభుత్వం రూ.385 కోట్లతో సహాయక నిధిని ఏర్పాటుచేసింది. వందలాది మంది అపార్ట్‌మెంట్‌వాసులను అధికారులు హుటాహుటిన తాత్కాలిక శిబిరాలకు తరలించి నిత్యావసర సరకులు అందిస్తున్నారు. ఈ హౌసింగ్ కాంప్లెక్స్‌ను 1,984 ఫ్లాట్లతో 1983 సంవత్సరంలో నిర్మించారు. 2021 జనాభా లెక్కల ప్రకారం వీటిల్లో దాదాపు 4,600 మంది నివసిస్తున్నారు. అపార్ట్మెంట్ జనాభాలో దాదాపు 40 శాతం మంది 65ఏళ్లు పైబడిన వృద్ధులేనని స్పష్టమవుతోంది.పనిచేయని అలారమ్వ్యవస్థ భవనాలు రిపేర్‌లో ఉండటంతో అలారమ్ వ్యవస్థలను పనిచేయకుండాచేశారని, అందుకే అగ్నిప్రమాదం వేళ ఎలాంటి అలారమ్ శబ్దాలు రాలేదని అపార్ట్‌మెంట్‌వాసులు చెప్పారు. తోటి అపార్ట్మెంట్ వాసుల ఇళ్లకు వెళ్లి బెల్ కొట్టడం, డబడబ అంటూ తలుపుతట్టడం, వాళ్లను అప్రమత్తంచేయడం, మళ్లీ మరో ఇంటికి వెళ్లడం ఇవే దృశ్యాలు అక్కడ కనిపించాయని మరో స్థానికుడు చెప్పారు. ప్రభావిత ఒక్కో అపార్ట్‌మెంట్‌వాసులకు తక్షణ సాయంగా రూ.1,14,000 ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. మృతులకు నివాళులర్పిస్తూ పోప్ లియో గురువారం హాంకాంగ్ బిషప్కు సంతాప సందేశలేఖను పంపించారు. మృతులకు అమెరికా, బ్రిటన్‌సహా పలు దేశాలు సంతాపసందేశాలు పంపాయి. ఘటనపై నేరం కోణం పోలీసులు, నిర్లక్ష్యం కోణంలో హౌసింగ్ బ్యూరో, అవినీతి కోణంలో అవినీతినిరోధక శాఖలు వేర్వేరుగా దర్యాప్తు ప్రారంభించాయి. -
హాంగ్ కాంగ్ అగ్ని ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
-
హాంకాంగ్ ప్రమాదానికి కారణం ఏంటంటే..
హాంకాంగ్ వాంగ్ హాక్ కోర్ట్ టవర్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 65కు చేరుకుంది. 70 మంది తీవ్రగాయాలపాలవగా , 237 మంది ఆచూకీ లభించడంలేదు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు. ఇంత తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. బుధవారం హాంకాంగ్ లోని వాంగ్ పుక్ కోర్ట్ టవర్స్ లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 65 మంది దుర్మరణం చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాద ఘటనపై ఆదేశ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాలలో ఇంత పెద్దఎత్తున మంటలు చెలరేగడానికి ఆ భవన మరమ్మత్తులో ఉపయోగిస్తున్న సామాగ్రి కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. భవన నిర్మాణం ప్రతి కిటికీలలో స్టైరోఫామ్ తో తయారు చేయబడిన వస్తువులను ఉపయోగించారని దాని కారణంగానే మంటలు ఇంత పెద్దఎత్తున వ్యాపించాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్టైరోఫామ్ అనేది పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్. దీనిని నిర్మాణరంగంలో, ఫుడ్ ప్యాకేజింగ్ లలో అధికంగా ఉపయోగిస్తారు. అయితే స్టైరోఫామ్ కు మండే స్వభావం అధికంగా ఉంటుంది. దీనికి మంటలు అంటుకుంటే అంత తేలికగా ఆర్పలేము. ఉష్ణోగ్రత తక్కువ ఉన్న ప్రదేశాలలో కూడా ఇది అధికంగా మండుతుంది. అంతేకాకుండా ఇది మండుతున్నప్పుడు అధిక మోతాదులో కార్బన్ డై యాక్సైడ్ విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో భవన మరమ్మత్తులో ఇంత హానీకర వస్తువులను ఎందుకు ఉపయోగించారు అని పోలీసులు విచారణ చేపడుతున్నారు.కాగా హాంకాంగ్ లోని అసోసియేయేట్ ప్రెస్ ప్రచురించిన నివేదిక ప్రకారం మరమ్మత్తులు చేపడుతున్న ఇంజినీరింగ్ కంపెనీ ఎటువంటి భద్రత ప్రమాణాలు పాటించలేదని నివేదించింది. హాంకాంగ్ లో నిన్న ప్రమాదం జరిగిన భవంతి 1980లో నిర్మించారు. ఆ టవర్స్ లో 2వేలకు పైగా అపార్ట్ మెంట్స్ ఉండగా 4వేలకు మందికి పైగా నివసిస్తున్నారు. ఇటీవల ఆ భవనాలకు మరమ్మత్తులు చేస్తుండగా ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. -
సిగాచీ ఘటన.. పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి హైదరాబాద్: సిగాచీ పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఇది సాధారణ ఘటన కాదని 54 మంది కార్మికులు సజీవ దహానమైన భారీ ప్రమాదమని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ అన్నారు. ఇంత తీవ్రమైన ప్రమాద ఘటనలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడమేంటని ఏఏజీ తేరా రజినీకాంత్ రెడ్డిని ప్రశ్నించారు.సంగారెడ్డిలో సిగాచీ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో దర్యాప్తు జరుగుతున్న తీరుపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. 54 మంది కార్మికులు మృతిచెందితే ఇంకా దర్యాప్తు జరుగుతుంది అని చెప్పడమేంటని ఏఏజీ తేరా రజనీకాంత్ రెడ్డిని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ఇంత పెద్దఘటనకు డీఎస్పీని ఎందుకు దర్యాప్తు అధికారిగా నియమించారని అడిగారు. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాల్సి ఉండవచ్చుగా అని ప్రశ్నించారు. 237మంది సాక్షులను విచారించినా ఇప్పటి వరకూ కేసులో ఎలాంటి పురోగతి లేదా అని అడిగారు.సిగాచీ ప్రమాద ఘటనపై బాబురావు అనే వ్యక్తి ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. పేలుడు సంబవించి ఐదు నెలలు దాటినా ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిపుణుల కమిటీ సైతం పరిశ్రమ నిర్వహణలో లోపాలున్నాయని తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వచేశారని కమిటీ గుర్తించిందని న్యాయవాది పేర్కొన్నారు. పేలుడు తీవ్రతతో ఎనిమిది మంది శరీరాలు ఆనవాళ్లు లేకుండా కాలిపోయాయని కోర్టుకు తెలిపారు.వాదనలు విన్న కోర్టు పోలీసు దర్యాప్తు నివేదిక కోర్టుకు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ తొమ్మిదికి వాయిదా వేసింది. ఆ విచారణకు డీఎస్పీ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా పాశామైలారంలోని సిగాచీ ఫార్మా ప్లాంట్ లో ఈ ఏడాది జూన్ 30 న భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. -
హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం (ఫొటోలు)
-
హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం
హాంకాంగ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తాయ్ జిల్లాలోని నూతనంగా నిర్మిస్తున్న ఒక బహుళ అంతస్థుల భవన సముదాయంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.కొంతమంది మంటలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళాలు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే యత్నం చేస్తున్నాయి. కాగా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న భవంతి కావడంతో వెలుపలి భాగంలో వెదురుబొంగులను అమర్చారు. మంటలు వాటికి అంటుకోవడంతో పెద్దఎత్తున అగ్నిజ్వాలలు ఎగిసిపడి దట్టమైన పొగ కమ్ముకుంది. మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.తాయ్ పో నగరం హాంకాంగ్ ఉత్తర భాగంలో ఉంటుంది. హాంకాంగ్‌లో భవన నిర్మాణరంగంలో వెదురు బొంగుల వాడకం అనేది సర్వసాధారణం. వీటి వల్ల భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రభుత్వానికి ఇది వరకే అక్కడి అధికారులు నివేదించినట్లు తెలుస్తోంది. దానిపై స్పందించిన అక్కడి ప్రభుత్వం నిర్మాణం రంగంలో వెదురుబొంగుల వాడకం దశలవారీగా తొలిగిస్తామని ఈ ఏడాది ప్రారంభంలో తెలిపినట్లు సమాచారం. -
హైదరాబాద్ శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం
-
గోమతి ఎలక్ట్రానిక్స్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం
సాక్షి, హైదరాబాద్: సోమవారం రాత్రి ఓల్డ్ సిటీలోని శాలిబండ క్లాక్ టవర్ పక్కన ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనలో దుకాణం సమీపంలో ఆగి ఉన్న ఒక కారు, ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమయ్యాయి. CNG వాహనం అయిన ఆ కారు గ్యాస్ సిలిండర్ నుండి మంటలు చెలరేగిన వెంటనే పేలిపోయింది. దాంతో మంటలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.స్థానికులు చెప్తున్న వివరాలు.. షాప్ ముందు పార్క్ చేసిన కారుకు మంటలు వేగంగా వ్యాపించాయి. ఆ కారులో ఉన్న డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. కారు పేలుడు వల్ల అగ్నిప్రమాదం జరిగిందా? లేక షాప్‌లో ఉన్న కంప్రెషర్ పేలుడే అసలు కారణమా? అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. పేలుడు శబ్దాలు వినిపించగానే పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. -
ఓఆర్ఆర్పై కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
శామీర్‌పేట్: ఓఆర్ఆర్ రోడ్డుపై పక్కన ఆగి ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా వ్యక్తి సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జైగిరి గ్రామానికి చెందిన తల్లపల్లి దుర్గాప్రసాద్ (34) వృత్తి రీత్యా ఓ టీవీ చానెల్ నడుపుతున్నారు. పని నిమిత్తం ఆదివారం రాత్రి టీఎస్ 03 ఎఫ్డీ 7688 నంబరు గల ఇకో స్పోర్ట్స్ కారులో నగరానికి వచ్చారు.రాత్రి మియాపూర్‌లోని తన బంధువుల ఇంట్లో ఉండి ఉదయం 4:30 నిమిషాలకు ఓఆర్ఆర్ మీదుగా తన స్వగృహానికి బయల్దేరాడు. ఈ క్రమంలో శామీర్‌పేట పరిధిలోకి రాగానే కారును రోడ్డు పక్కన ఆపగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారులో పూర్తిగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దుర్గాప్రసాద్ పూర్తిగా కాలిపోయాడు. సమాచారం అందుకున్న అగి్నమాపక, పోలీసుశాఖ అధికారులు మంటలను అదుపుచేశారు. కానీ అప్పటికే దుర్గాప్రసాద్ పూర్తిగా కాలిపోయి అస్థిపంజరంలా మారారని, క్లూస్ టీంతో పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ఆగి ఉన్నపుడే మంటలు వ్యాపించినట్లు గుర్తించామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని శామీర్‌పేట సీఐ శ్రీనాథ్ వెల్లడించారు. -
ORRపై ఘోర ప్రమాదం.. కారులోనే డ్రైవర్ సజీవ దహనం..
-
కారు దగ్ధానికి ఏసీ కారణమా? నిపుణులేమంటున్నారు?
ఇటీవలి కాలంలో రోడ్లపై పలు కార్లు ఉన్నట్టుండి దగ్ఢం కావడాన్ని చూస్తున్నాం. దీనికి కారణాలు అనేకం ఉన్నా కారులోని ఏసీనే మంటలకు కారణమనే వాదన వినిపిస్తుంటుంది. అయితే ఇది ఎంతవరకూ నిజం? నిపుణులేమంటున్నారు? కారులోని ఏసీ వ్యవస్థ నేరుగా మంటలను సృష్టించకపోయినా, దానిలోని విద్యుత్, యాంత్రిక భాగాలు అధిక వేడిని ఉత్పత్తి చేయడం ద్వారా మంటలు చెలరేగడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.ప్రధాన కారణం ఇదే..కారులో మంటలు చెలరేగడానికి విద్యుత్ లోపాలు ప్రధాన కారణం. అలాగే కారు ఎయిర్ కండిషనింగ్ (ఏసీ)వ్యవస్థలో ఏర్పడే సమస్యలు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. ఏసీ కంప్రెషర్, బ్లోవర్ మోటార్ లేదా దాని కంట్రోల్ యూనిట్‌కు విద్యుత్ సరఫరా చేసే వైర్లు అరిగిపోవడం, కోసుకుపోవడం లేదా నాణ్యత లేని మరమ్మతుల కారణంగా షార్ట్ సర్క్యూట్లు ఏర్పడతాయి. ఫలితంగా సర్క్యూట్లో విద్యుత్ నిరోధకత హఠాత్తుగా తగ్గిపోయి, కరెంటు ప్రవాహం (Amperage) విపరీతంగా పెరుగుతుంది. ఈ అనూహ్యమైన విద్యుత్ పెరుగుదల వల్ల వైర్లు తీవ్రంగా వేడెక్కి (ఓవర్‌హీట్), వాటి ప్లాస్టిక్ ఇన్సులేషన్ మండుతుంది. దీంతో మంటలు క్షణాల్లో ఇంజిన్ కంపార్ట్మెంట్లోకి లేదా డ్యాష్‌బోర్డ్ లోపలికి వ్యాపిస్తాయి.కంప్రెషర్ జామ్ అయినప్పుడు..మంటలకు కారణమయ్యే మరో అంశం ఏసీ వ్యవస్థలోని విద్యుత్ భాగాలపై పడే ఓవర్‌లోడ్. ఉదాహరణకు బ్లోవర్ మోటార్ బేరింగ్లు పాతబడి లేదా మురికి వల్ల జామ్ అయినప్పుడు, అది మోటార్‌ను పనిచేయించడానికి ప్రయత్నిస్తూ సాధారణం కంటే ఎక్కువ కరెంటును వినియోగిస్తుంది. ఈ అధిక వినియోగం (ఓవర్లోడింగ్) వల్ల మోటార్ వైండింగ్లు, దాని ఫ్యూజ్ లేదా రిలే బాక్స్‌లోని కనెక్షన్లు తీవ్రంగా వేడెక్కుతాయి. అలాగే ఏసీ కంప్రెషర్ యాంత్రికంగా జామ్ అయినప్పుడు, దాని ఎలక్ట్రో-మ్యాగ్నెటిక్ క్లచ్‌పై అధిక ఒత్తిడి పడి, అది కూడా ఓవర్‌హీట్ అయ్యి మంటలకు దారితీయవచ్చు. ఇటువంటి సందర్భాల్లో సరైన సామర్థ్యం (Amperage) లేని ఫ్యూజులను వాడినా లేదా ఫ్యూజ్లను తీగలతో బైపాస్ చేసినా, విద్యుత్ లోపాన్ని అరికట్టే రక్షణ వ్యవస్థ పనిచేయక, మంటలు తక్షణమే చెలరేగే అవకాశం ఉంటుంది.ముందస్తు సంకేతాలుకారులోని ఏసీ వ్యవస్థ మంటల్లో చిక్కుకునే ముందు హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. వాటిలో ముఖ్యమైనవి.. ప్లాస్టిక్ లేదా రబ్బరు కాలిపోయి తీవ్రమైన వాసన రావడం, ఏసీని ఆన్ చేసినప్పుడు ఫ్యూజులు పదేపదే కాలిపోవడం, డ్యాష్‌బోర్డ్ లేదా హుడ్ కింద నుండి పొగ రావడం జరుగుతుంటుంది. ఈ సంకేతాలను ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. ఇటువంటి ప్రమాదాల నివారణకు కారు ఏసీ వ్యవస్థ వైరింగ్‌ను, ముఖ్యంగా కంప్రెషర్, బ్లోవర్ మోటార్ కనెక్షన్లను, అరిగిపోకుండా లేదా వదులు కాకుండా ఎప్పటికప్పుడు మెకానిక్‌తో తనిఖీ చేయించుకోవాలి. అధిక నాణ్యత గల విడి భాగాలను మాత్రమే ఉపయోగించాలి.తక్షణం ఏం చేయాలి?కారులో మంటలు లేదా పొగను గమనించిన వెంటనే సురక్షితమైన ప్రదేశంలో కారును ఆపి, ఇంజిన్‌ను వెంటనే ఆపివేయాలి, తద్వారా ఇంధనం, విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. కారులోని వారందరూ తక్షణమే కిందకు దిగి, కారు నుండి కనీసం 50 నుండి 100 అడుగుల దూరంలోకి వెళ్లిపోవాలి. వెంటనే అగ్నిమాపక విభాగానికి కాల్ చేసి సమాచారం అందించాలి. అయితే మంటలు చాలా చిన్నగా ఉన్నట్లయితే , మీ వద్ద సరైన ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉన్నప్పుడు, హుడ్ను పూర్తిగా తెరవకుండా కొద్దిగా పైకి లేపి మంటలను ఆర్పడానికి ప్రయత్నించాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ విలువైన వస్తువుల కోసం కారులోకి తిరిగి వెళ్లకూడదు. అలాగే విద్యుత్ లేదా ఇంధనం నుంచి వస్తున్న మంటలపై నీరు చల్లకూడదు. అగ్నిమాపక విభాగం వచ్చే వరకూ వేచి చూడాలి. ఇది కూడా చదవండి: అమెరికా హెచ్చరికలు.. వెనిజులాకు పలు దేశాల షాక్! -
పల్నాడులో అగ్నిప్రమాదం
సాక్షి,అమరావతి: పల్నాడు జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. రెంటచింతల మండలంలో బయోడీజిల్ బంక్‌లో పేలుడు సంభవించింది. బయోడీజిల్ అన్లోడ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంది. ఫైరింజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తోంది. గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదంలో మరణించిన వ్యక్తి గురజాలకు చెందిన రషీద్‌గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. -
Brazil: ఐరాస కాప్30 సదస్సులో అగ్నిప్రమాదం
బెలెం: బ్రెజిల్‌లోని బెలెం నగరంలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి COP30 వాతావరణ సదస్సు ప్రధాన వేదిక వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కీలక సమావేశాలు జరిగే "బ్లూ జోన్"లో ఈ ప్రమాదం జరగడంతో వేలాది మందిని తరలించారు. అగ్ని ప్రమాదం సందర్బంగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే వారికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. They chopped down acres of old growth Amazonian rain forest to hold this COP30 event. Then it catches fire. 😂 Absolute metaphor for how the fake climate agenda is burning down.We need more CO2 to feed plants, not less.#COP30 pic.twitter.com/WqZpT2Zm4j— Bruce (@bruce_barrett) November 20, 2025వివరాల ప్రకారం.. బ్రెజిల్లో ఐక్యరాజ్యసమితి COP30 వాతావరణ సదస్సు జరుగుతోంది. ఈ సమావేశంలో దాదాపు 200 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ వాతావరణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి సంధానకర్తలు ప్రయత్నిస్తున్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎగ్జిబిషన్ పెవిలియన్ వద్ద మంటలు చెలరేగి భవనం గోడలు, పైకప్పును కప్పి ఉంచిన ఫాబ్రిక్ షెల్ పైకి వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో 13 మంది గాయపడ్డారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.#COP30 in #Belem has been a logistical nightmare. I hope lessons can be learnt from this experience @Cop30noBrasil pic.twitter.com/z9XvJrtEYD— Elizabeth Gulugulu (@lizgulaz) November 20, 2025ఇక, అగ్ని ప్రమాదం నేపథ్యంలో వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కేవలం ఆరు నిమిషాల్లోనే మంటలను అదుపు చేసినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, విద్యుత్ పరికరాలు, మైక్రోవేవ్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
టెక్స్టైల్ కంపెనీలో అగ్నిప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి
సాక్షి,మహబూబ్‌నగర్: గొల్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించగా.. పలువురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. జిన్నింగ్ మిల్లు యాజమాన్యం ఫిర్యాదుతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. గాయపడిన బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
kolkata: భారీ అగ్ని ప్రమాదం.. 300 దుకాణాలు దగ్ధం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో గల ఎజ్రా స్ట్రీట్‌లో శనివారం తెల్లవారుజామున సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 300 దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పక్కనే ఉన్న భవనాల్లో నివసిస్తున్న వారిని సకాలంలో ఖాళీ చేయించడంతో ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కోల్‌కతా సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇందిరా ముఖర్జీ ఈ ఘటనను ధృవీకరించారు.షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మంటలను అదుపు చేయడానికి తొలుత ఆరు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో మరో 20 అగ్నిమాపక యంత్రాలను రప్పించాల్సి వచ్చింది. ఎజ్రా స్ట్రీట్‌లోని ఇరుకైన సందుల్లో గల ఎలక్ట్రికల్ వస్తువులు, చెక్క, ప్లైవుడ్ తదితర మండే స్వభావం గల పదార్థాలను నిల్వ చేసే దుకాణాలు, గోడౌన్లలో మంటలు వేగంగా వ్యాపించాయి. #WATCH | West Bengal: A massive fire broke out at an electronics warehouse at 26, Ezra Street in Kolkata. Fire tenders present at the spot. Firefighting operations are underway. More details awaited. pic.twitter.com/uPn6Bf5Iu7— ANI (@ANI) November 15, 2025దట్టమైన నల్లటి పొగతో ఆ ప్రాంతమంతా నిండిపోవడంతో అగ్నిమాపక సిబ్బంది లోపలికి ప్రవేశించడానికి ఇబ్బంది పడ్డారు. అధికారులు ఆ ప్రాంతం చుట్టూ ఉన్న అన్ని రహదారులను మూసివేశారు. ప్రస్తుతానికి మంటలను అదుపులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని, ఆ తర్వాతే దర్యాప్తు జరుగుతుందని సీనియర్ అగ్నిమాపక, అత్యవసర సేవల అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.స్థానిక కౌన్సిలర్ సంతోష్ పాఠక్ అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. గత 22 సంవత్సరాలుగా భవనంలోని పేలవమైన భద్రతా ప్రమాణాల గురించి స్థానిక అధికారులకు, పోలీసులకు చాలాసార్లు లేఖలు రాసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాగా ఇటీవల సెంట్రల్ కోల్‌కతాలోని ఆర్ ఎన్ ముఖర్జీ రోడ్లో ఒక గోడౌన్లో కూడా అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఆ గోడౌన్‌లోని కంప్యూటర్లు, మోటార్లు, కారు విడిభాగాలు బూడిదయ్యాయి.ఇది కూడా చదవండి: Bihar Election: డబుల్ షాక్‌లో ‘బిహార్ సింగం’ -
జీవ వైవిధ్యానికి 'కార్చిచ్చు'
సాక్షి, అమరావతి: అడవిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పర్యావరణంపై పంజా విసురుతున్నాయి. ఇప్పటివరకు చెట్ల నరికివేత, కాంక్రీట్ జంగిల్‌గా మార్చడమే పచ్చదనం తగ్గడానికి కారణంగా భావించాం. అయితే, ఎ ప్లానెట్ ఆన్ ది బ్రింక్ అనే సంస్థ ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది. పలు దేశాలలోని అడవుల్లో రేగుతున్న కార్చిచ్చు పర్యావరణానికి పెను సవాల్‌గా మారిందని పేర్కొంది. గ్లోబల్ ట్రీ కవర్ నష్టం 2023లో పోల్చితే ఏకంగా 370 శాతం పెరిగిందని వివరించింది. అడవుల్లో చెలరేగిన మంటల కారణంగా 3.1 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడినట్లు తెలిపింది. ఇది మానవ ప్రేరేపిత ఉద్గారాల్లో సుమారు 8 శాతమని, జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించింది. రెండేళ్ల కిందటి పరిస్థితి ప్రస్తుతం కూడా కొనసాగుతోందని, మేల్కొనకపోతే పర్యావరణంతో పాటు మానవ మనుగడకు ముప్పు తప్పదని హెచ్చరించింది. ఎ ప్లానెట్ ఆన్ ది బ్రింక్ అధ్యయనం ప్రకారం...» అమెరికాలోని కాలిఫోర్నియాలో జనవరిలో చెలరేగిన మంటల కారణంగా 57 వేల ఎకరాలకుపైగా దహనమయ్యాయి. 250 మిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. మార్చిలో జపాన్‌లో చెలరేగిన కార్చిచ్చుతో 370 హెక్టార్లలో, దక్షిణ కొరియాలో 48 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు దెబ్బతిన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా చెలరేగిన మంటలు కెనడాలో 1.58 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని బూడిద చేశాయి. ఇలాంటి సమయంలో భారీగా విడుదలయ్యే కర్బన ఉద్గారాలు భూతాపాన్ని పెంచుతాయి.» కార్చిచ్చు ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. పొగ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు అనారోగ్యం బారిన పడడంతో పాటు మరణాలు అధికమవుతున్నాయి.» పలు దేశాల్లో అడవుల్లో ఏదో ఒకరకంగా విధ్వంసం జరుగుతోంది. అమెజాన్‌కు నెలవైన బ్రెజిల్లో మొక్కల పెంపకం, పక్కాగా పరిరక్షణ చర్యలు చేపట్టడంతో అడవుల్లో అలజడి తగ్గింది. కానీ, తీవ్రమైన కరువు కారణంగా ఈ ప్రాంతంలో కార్చిచ్చు గణనీయంగా పెరిగింది.73 శాతం తగ్గిపోయిన వన్యప్రాణులుఐదు దశాబ్దాల్లో వన్యప్రాణుల సంఖ్య 73 శాతం పడిపోయింది. వాతావరణంలో వచ్చిన మార్పులు జీవ వైవిధ్యాన్ని అతలాకుతలం చేశాయి. అడవులు తగ్గిపోవడం భౌగోళిక ప్రాంతంతో పాటు వాటి పరిధిలోని జాతులను ప్రభావితం చేస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా 3,500 కంటే ఎక్కువ వన్యప్రాణుల జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అనేక జాతులు ఇప్పటికే అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.వాతావరణ మార్పులతో ముప్పుఅతిపెద్ద అడవి అమెజాన్ ప్రాంతంలో వచ్చిన వాతావరణ మార్పులు మానవ మనుగడకు ముప్పుగా పరిణమించాయి. ఇలాంటి పరిస్థితుల్లో అడవులను కాపాడుకోవడంతో పాటు అగ్నికి ఆహుతైన ప్రాంతాల్లో భారీగా పచ్చదనం పెంపు చర్యలు చేపట్టాలి. ఆర్థిక రంగంపైనా దెబ్బఅడవుల క్షీణత వల్ల తలెత్తుతున్న పరిణామాలను అర్థం చేసుకుని ప్రభుత్వాలు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలి. లేదంటే పర్యావరణం దెబ్బతినడంతో పాటు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. వాతావరణ వ్యత్యాసాలు పెరిగి వ్యవసాయం, ఆహార భద్రత, వినోదం, పర్యాటక రంగాలపై ప్రభావం పడుతుంది. వ్యాధుల ముప్పు కూడా పొంచి ఉంది. వాతావరణ మార్పుల కారణంగా జంతువులకు వ్యాధులు సంక్రమించి, వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.పగడపు దీవులపై దాడిపర్యావరణ మార్పులు ఆఖరికి సముద్రపు జీవుల మనుగడను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే పగడపు దీవులు నాశనమవుతున్నాయి. సముద్రం వేడెక్కడం, మత్స్య సంపదను అతిగా వేటాడడంతో పాటు కాలుష్యం పగడపు దీవులకు శాపంగా పరిణమించింది. -
తెలంగాణలో మరో బస్సు ప్రమాదం
-
రన్నింగ్ బస్సులో మంటలు.. RTC బస్సు దగ్ధం..!
-
కార్తీక దీపం.. ఇంటినే కాల్చేసింది!
చిత్తూరు జిల్లా: ఇంటి వద్ద కార్తీక శుక్రవారం సందర్భంగా వెలిగించిన దీపం వారి ఇంటినే కాల్చేసింది. ఈ ఘటన మండలంలోని కాగతి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్కూటర్ కాలిపోగా.. సుమారు రూ.4 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. గ్రామస్తుల కథనం.. పుంగనూరు–బోయకొండ ప్రధాన రహదారిలో కాగతి ఉంది. రోడ్డు పక్కన ఎల్.ఉదయ్‌కుమార్, తల్లి శారదమ్మ కలిసి చిల్లర అంగడి నిర్వహిస్తున్నారు. వీటితోపాటు పెట్రోల్, గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో కార్తీక శుక్రవారం కావడంతో షాపు, ఇంటి గడపలో దీపం వెలిగించి పెట్టారు. పెట్రోల్ బాటిళ్లు, క్యాన్‌తోపాటు బైక్ వరండాలో ఉంచారు. దీపం నుంచి పెట్రోల్‌కు మంటలు చెలరేగి బైక్‌కు వ్యాపించాయి. మంటలు ఎగసి పడడంతోపాటు పొగ కమ్మేసింది. మంటలను అదపుచేసేందుకు స్థానికులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. గ్యాస్ సిలిండర్లు ఉన్నాయన్న భయంతో పరుగులు తీశారు. తీరా ఉదయ్‌కుమార్ ఇంట్లోనే ఉండిపోవడంతో గ్రామస్తులు, యువకులు సాహసం చేసి ఇంటి కిటికీలు ధ్వసం చేసి అతన్ని బయటకు తీసుకొచ్చారు. అతనికి స్వల్పగాయాలు కాగా.. ప్రాథమిక చికిత్స అందించారు. ఇంట్లోని సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, కొయ్య సామగ్రి మొత్తం కాలిబూడిదైంది. ఈ ఘటనతో గ్రామంలోని ప్రజలు, చుట్టుపక్కల నివాసమున్నవారు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. పుంగనూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
ఢిల్లీ విమానాశ్రయం వద్ద బస్సులో మంటలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ)లోని టెర్మినల్ 3 వద్ద మంగళవారం మధ్యాహ్నం ఒక బస్సులో మంటలు చెలరేగాయి. ఈ బస్సును ఏఐ శాట్స్(టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిర్ ఇండియా లిమిటెడ్-శాట్స్లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్) నడుపుతోంది. ఇది ఎయిర్ ఇండియాకు గ్రౌండ్-హ్యాండ్లింగ్ సేవలను అందిస్తుంది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన టెర్మినల్ 3 వద్ద బే 32 సమీపంలో జరిగింది. ఆసమయంలో బస్సు ఎయిర్ ఇండియా విమానానికి కొన్ని అడుగుల దూరంలో టాక్సీవే ప్రాంతంలో ఉంది. సంఘటన జరిగిన సమయంలో విమానంలో ప్రయాణికులు లేరు. An Air India bus at Delhi Airport’s Terminal 3, not too far away from a parked aircraft, suddenly caught fire on Tuesday. Officials confirmed that no passengers were onboard at the time.The bus was operated by AI SATS, a ground-handling service provider for Air India, near bay… pic.twitter.com/UdP6Aa1qGP— Breaking Aviation News & Videos (@aviationbrk) October 28, 2025బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలో హెచ్చరికలు జారీ చేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఐజీఐఏ అధికారులు తెలిపారు. వారు మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బస్సులో మంటలు భారీగా ఎగసిపడుతున్నట్లు కనిపిస్తోంది. అయతే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో విమానాశ్రయ కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, విమానాశ్రయంలోని ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. -
Rajasthan: మంటల్లో మరో బస్సు.. ఇద్దరు మృతి
జైపూర్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జరిగిన స్లీపర్ బస్సు ప్రమాద ఘటన మరువకముందే, రాజస్థాన్‌లోని మనోహర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడి గ్రామంలో ఇటువంటి ప్రమాదమే చోటుచేసుకుంది. కార్మికులను తీసుకెళ్తున్న బస్సు హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను తాకడంతో విద్యుదాఘాతం సంభవించింది. దీంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఇంతలో బస్సులో మంటలు చెలరేగడంతో, దాదాపు 12 మంది గాయాల పాలయ్యారు.ఉత్తరప్రదేశ్ నుండి రాజస్థాన్‌లోని మనోహర్ పూర్ పరిధిలోని తోడిలో గల ఇటుకల బట్టీకి కార్మికులను బస్సులో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మార్గం మధ్యలో బస్సు ప్రమాదవశాత్తూ 11 వేల వోల్ట్ల విద్యుత్ లైన్ కు తగిలింది. ఫలితంగా బస్సు గుండా విద్యుత్ ప్రవహించింది. తరువాత బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఆకస్మిక ఘటనతో బస్సులోని ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. VIDEO | Shahpura, Rajasthan: Two people were killed and over a dozen were injured after a bus caught fire upon coming in contact with a high-tension wire on the Jaipur-Delhi highway.#Rajasthan #JaipurDelhiHighway(Source - Third party)(Full video available on PTI Videos –… pic.twitter.com/reQQSmtkR3— Press Trust of India (@PTI_News) October 28, 2025సమాచారం అందుకున్న మనోహర్ పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని షాపురా సబ్-జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడుతున్న ఐదుగురు కార్మికులను మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోనికి తెచ్చారు. రెండు మృతదేహాలను పోలీసులు పోస్ట్ మార్టం కోసం తరలించారు.ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: మరో వివాదంలో ప్రశాంత్ కిశోర్.. రెండు చోట్ల ఓటు.. టీఎంసీ ఆఫీసే చిరునామా! -
అన్ని బస్సుల్లోనూ అగ్నిమాపక పరికరాలు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో తాజాగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు మంటలంటుకొని 19 మంది సజీవదహనమైన నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ అప్రమత్తమైంది. ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ప్రయా ణికులు వీలైనంత వేగంగా తప్పించుకునేలా వారిలో అవగాహన కల్పించే ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రయాణికులకు వివరించాలని డ్రైవర్లకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ అమలు కానుంది. అలాగే పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సుల్లో అగ్నిమాపక పరికరా లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.ఎయిర్ హోస్టెస్ తరహాలో...: విమానం బయలుదేరే ముందు ఎయిర్ హోస్టెస్ ప్రయాణికులను విధిగా అప్రమత్తం చేస్తారు. విమానంలోని అత్యవసర మార్గాలు, ఆక్సిజన్ మాస్కులను ధరించాల్సిన విధానం, లైఫ్ జాకెట్ పొందే తీరు, అందులో గాలి నింపే పద్ధతి.. ఇలా అన్ని అంశాలనూ ప్రయాణికులకు వివరిస్తారు. ఇదే తరహాలో ఇకపై బస్సు డ్రైవర్లు కూడా ప్రారంభ స్టేషన్లో ప్రయాణికులకు కొన్ని సూచనలు చేయనున్నారు. తొలుత తనను తాను పరిచయం చేసుకొని ఆపై కండక్టర్ పేరు వెల్లడిస్తారు. అలాగే బస్సు ఎప్పుడు బయలుదేరి తుది గమ్యం ఏ వేళకు చేరుకుంటుందో వివరిస్తారు. బస్సులో అగ్నిమాపక పరికరాలను ఉంచిన ప్రదేశం.. వాటిని వాడే విధానం.. అత్యవసర తలుపు ఉండే చోటు.. దాన్ని తెరిచే పద్ధతి.. అత్యవసర సమయంలో కిటికీ అద్దాలను పగలగొట్టేందుకు వాడే సుత్తిని ఎలా వాడాలో, దాన్ని బస్సులో ఎక్కడ ఉంచారో వెల్లడిస్తారు. ఏసీ బస్సుల్లో రూఫ్ హాచెస్ తెరిస్తే పొగ బయటకు వెళ్లిపోతుందని, అత్యవసర సమయాల్లో వాటి నుంచి కూడా ప్రయాణికులు బయటపడే వీలుంటందని కూడా వివరించనున్నారు. మరోవైపు ప్రస్తుతం ఏసీ బస్సుల్లోనే సుత్తులు ఉంటుండగా ఇటీవల కొన్ని సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ అందుబాటులో ఉంచుతున్నారు. ఇక నుంచి ఏసీ సహా అన్ని సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా సుత్తులు, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచనున్నారు. -
మరో ప్రైవేటు స్లీపర్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
లక్నో: యూపీకి చెందిన ఓ ప్రైవేటు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డబుల్ డెక్కర్ ఏసీ స్లీపర్ బస్సులో మంటలు వ్యాపించినప్పటికీ డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం(అక్టోబర్ 26వ తేదీ) ఉదయం ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై వెళుతున్న సమయంలో ఓ ఏసీ స్లీపర్ బస్సు టైర్ల కింద నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే బస్సును ఆపేసి ప్రయాణికుల్ని కిందకు దించేశాడు. అదే సమయంలో పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మంటల్ని అదుపు చేశారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం కానీ, గాయాల బారిన పడటం కానీ జరగలేదన్నారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా వస్తున్న సమయంలో జరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో 39 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. టోల్ ప్లాజాకు 500 మీటర్ల దూరంగా ఉండగా బస్సులో మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు. బస్సు టైర్ల కింద నుంచి మంటలు రావడంతో దాన్ని రోడ్డుపైనే నిలిపేసిన డ్రైవర్ జగత్ సింగ్ చాలా చాక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు ప్రశంసించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్ వేపై చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిందని, బస్సును అక్కడ నుంచి తొలగించిన తర్వాత ట్రాఫిక్ మళ్లీ యథావిధికి వచ్చినట్లు పేర్కొన్నారు పోలీసులు. लखनऊ आगरा एक्सप्रेस वे पर दिल्ली से आ रही डबल डेकर बस के पिछले पहिए में रेवरी टोल प्लाजा से पहले आग लग गई । जिससे पूरी बस धू धू कर जल गई। हालांकि बस में सवार 39 सवारी सुरक्षित रही। pic.twitter.com/jTkFQvdztM— Ajay Srivastav (@ajaysridj) October 26, 2025 A major accident was averted on the Lucknow-Agra Expressway early Sunday morning. A double-decker bus from #Delhi to Gonda caught fire after a tyre burst, but all passengers were safely evacuated before the flames engulfed the vehicle.(Video/Picture Courtesy : X) pic.twitter.com/wPERgIbV84— Deccan Chronicle (@DeccanChronicle) October 26, 2025 -
బస్సులో ఉండాల్సిన రక్షణ వ్యవస్థలు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ప్యాసింజర్లు మరణించడం అత్యంత దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు ప్రయాణికుల భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ, స్లీపర్ బస్సుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా వ్యవస్థలు, వాటిని ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడానికి కింది భద్రతా వ్యవస్థలు, సదుపాయాలు ఎంతో అవసరం అవుతాయి.ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక భద్రత)అగ్నిప్రమాదాల వల్ల బస్సుల్లో తీవ్రత అధికంగా ఉంటుంది. ఏసీ, స్లీపర్ బస్సుల్లో కిటికీలు తెరవడానికి వీలులేకపోవడం, తక్కువ ఎంట్రీ/ ఎక్జిట్ మార్గాలు ఉండడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్ లేదా ఇతర భాగాల్లో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పొగ వచ్చినప్పుడు వెంటనే డ్రైవర్‌ను, ప్రయాణికులను అప్రమత్తం చేసే సెన్సార్ ఆధారిత అలారం వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా, సులభంగా ఉపయోగించగలిగే కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫైర్ ఎక్స్‌టింగ్యుషర్లు ఉండాలి.ఎమర్జెన్సీ ఎక్జిట్సాధారణ ఎంట్రీ/ ఎక్జిట్ ద్వారాలు కాకుండా బస్సులో కనీసం రెండు సులభంగా తెరవగలిగే అత్యవసర ద్వారాలు (కిటికీలు లేదా హాచ్లు) తప్పనిసరిగా ఉండాలి. ఈ మార్గాలను స్పష్టంగా గుర్తించేలా ఏర్పాటు చేయాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిప్రమాదం తీవ్రతను తగ్గించడానికి ఇంధన సరఫరాను ఆటోమేటిక్‌గా నిలిపివేసే వ్యవస్థ ఉండాలి.ఫస్ట్ ఎయిడ్ (ప్రథమ చికిత్స) కిట్ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో బ్యాండేజీలు, యాంటీసెప్టిక్ వైప్స్, కత్తెర, పట్టీలు, నొప్పి నివారణ మందులు (చిన్న గాయాలు, తలనొప్పి, వాంతులు మొదలైన వాటికి), బర్న్ క్రీమ్స్ వంటి ప్రాథమిక వైద్య సామాగ్రి అందుబాటులో ఉంచాలి. డ్రైవర్, అటెండర్లు ఈ పరికరాలను ఉపయోగించడంపై శిక్షణ పొంది ఉండాలి.ఇతర భద్రతా అంశాలుఅత్యవసర పరిస్థితుల్లో (ముఖ్యంగా అగ్నిప్రమాదం లేదా బస్సు నీటిలో పడినప్పుడు) కిటికీల అద్దాలు పగలగొట్టి బయటపడేందుకు ఉపయోగపడే సేఫ్టీ హ్యామర్లు బస్సులో కనీసం 4-6 చోట్ల ఏర్పాటు చేయాలి.స్లీపర్ బెర్త్‌ల్లో ఇవి లేకపోయినా సీటింగ్ విధానం ఉన్న బస్సుల్లో కచ్చితంగా సీట్ బెల్ట్‌లు ఉండాలి.ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌ను, ఇతరులను అప్రమత్తం చేయడానికి ఉపయోగించే అత్యవసర బటన్ ఉండాలి.ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు కూడా మార్గాలు కనిపించేలా అత్యవసర లైటింగ్ వ్యవస్థ ఉండాలి.భద్రతా వ్యవస్థలను ఉపయోగించే విధానంఅగ్నిప్రమాదం సంభవించినప్పుడు మొదట డ్రైవర్‌ను, తోటి ప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేయాలి. అత్యవసర బటన్‌ను నొక్కాలి. అగ్ని ప్రమాద సమయంలో దగ్గరలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్యుషర్ను ఉపయోగించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాలి. మంటలు అదుపు తప్పితే వెంటనే బయటకు వెళ్లాలి. ప్రమాద సమయాల్లో అత్యవసర ద్వారాలు లేదా కిటికీలు (సేఫ్టీ హ్యామర్‌తో పగలగొట్టి) ద్వారా బయటకు రావాలి.బస్సు నుంచి బయటకు వచ్చిన తర్వాత గాయాలు తగిలిన వారికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ఉన్న యాంటీసెప్టిక్ ద్రవంతో శుభ్రం చేసి, బ్యాండేజీ వేయాలి. ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే శుభ్రమైన గుడ్డ లేదా ప్యాడ్‌తో గాయంపై గట్టిగా నొక్కి పట్టుకోవాలి. వీలైనంత త్వరగా వైద్య సాయం అందేలా చూడాలి.ఇదీ చదవండి: భారత్‌లో సొంతింటి కోసం తంటాలు.. కానీ చైనాలో.. -
సంగారెడ్డి: స్కూల్ బస్సులో మంటలు.. తప్పిన ఘోర ప్రమాదం
సాక్షి, సంగారెడ్డి: డ్రైవర్ అప్రమత్తతో ఘోర ప్రమాదం తప్పింది. జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే స్థానికుల సాయంతో డ్రైవర్ పిల్లలను దించేయడంతో అంతా క్షేమంగా బయటపడ్డారు. శనివారం ఉదయం నారాయణఖేడ్‌లో విజ్ఞాన్ పాఠశాల బస్సు పిల్లలతో బయల్దేరింది. అయితే ఒక్కసారిగా బస్సు నుంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. స్థానికులను కేక వేసి పిల్లలను వెంటనే దించేశాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.గురువారం అర్ధరాత్రి టైంలో.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వీ కావేరీ ట్రావెల్స్ వోల్వో బస్సు కర్నూల్ శివారులో ఉల్లిందకొండ క్రాస్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మంటలు ఎగసి పడి బస్సు దగ్ధమైపోగా.. అందులోని ప్రయాణికుల్లో 19 మంది సజీవ దహనం అయిపోయారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీవో అధికారుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: కర్నూలు ఘటన.. ఎట్టకేలకు డ్రైవర్ అరెస్ట్ -
మృతుల గుర్తింపునకు ఆరు పద్ధతులు
సాక్షి, హైదరాబాద్: మొన్న మహబూబ్‌నగర్ సమీపంలోని పాలెం... నిన్న కర్ణాటకలోని కలబురిగి ప్రాంతం... తాజాగా కర్నూలు సమీపంలోని చిన్న టేకూరు... ఇలా అనేక సందర్భాల్లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సులు అగ్నిప్రమాదాలకు లోనవుతున్నాయి. ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాల్లో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మాడిమసైపోతున్నాయి. ఆయా సందర్భాల్లో మృతులను గుర్తించడానికి పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ప్రధానంగా ఆరు రకాల పద్ధతుల్ని అనుసరిస్తుంటారు. 1. సీటు నంబర్ ఇది ప్రాథమిక అంశం. మృతదేహం పడి ఉన్న సీటు నంబర్‌ను బస్సు బయలుదేరే ముందు రూపొందించిన ప్రయాణికుల జాబితాతో సరిచూస్తారు. దీనిద్వారా ఆ సీటులో ఎవరు కూర్చున్నారో తెలుస్తుంది. అయితే మార్గమధ్యలో సీట్లు మారే అవకాశం ఉండటంతోపాటు ప్రమాద ప్రభావం వల్ల మృతులు సీట్లలో ఉండకపోవచ్చు. దీంతో ఈ విధానాన్ని పూర్తి ప్రామాణికంగా తీసుకోరు. 2. ఆభరణాలు మృతదేహాలను స్వా«దీనం చేసుకొనే సందర్భంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తారు. అందులో మృతదేహాన్ని ఏ సీటు నుంచి స్వా«దీనం చేశారనే అంశంతోపాటు మృతదేహంపై ఒకవేళ నగలు, ఆభరణాలు ఉంటే ఆ వివరాలను పొందుపరుస్తారు. భద్రపరిచిన ఆభరణాలను సంబం«దీకులకు చూపి గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తారు. 3. దుస్తులు, వస్తువులు ప్రయాణం ప్రారంభించే ముందు ఆయా ప్రయాణికులు ధరించిన దుస్తులు, వెంట తీసుకువెళ్తున్న వస్తువులు సైతం ఈ తరహా ప్రమాదాల్లో కీలక ఆధారాలుగా నిలుస్తాయి. మృతదేహంపై లభించే దుస్తులకు సంబంధించిన ఆనవాళ్ల కోసం ప్రయతి్నస్తారు. ఒకవేళ ఫలితం లేకుంటే కాలిపోగా మిగిలిన సూట్‌కేసులు, బ్యాగులు, సెల్ఫోన్లు, లైటర్ల వంటివి సేకరిస్తారు. వాటిని కూడా పంచనామాలో పొందుపరిచి వాటి ఆధారంగానూ మృతుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తారు. 4. శరీరం, గాయాలు ఎత్తు, ఒడ్డు, పొడుగు వంటి శరీరాకృతులను, ఎముకల ద్వారా తెలుసుకోవడంతోపాటు గాయాలు, అంగవైకల్యాలు తదితరాలు సైతం మృతదేహాల గుర్తింపునకు ఉపకరిస్తాయి. కుటుంబీకుల నుంచి చనిపోయిన వ్యక్తి వైద్య చరిత్రతోపాటు దంతాల వివరాలను సేకరించి వాటిని మృతదేహాలతో పోలి్చచూస్తారు. గతంలో ఆపరేషన్లు జరిగినా, కాళ్లు–చేతులు తదితరాలు విరిగాయా? తదితర వివరాలన్నింటితోనూ మృతుల్ని గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. 5. బ్లడ్, డీఎన్ఏ మృతదేహం పూర్తిగా కాలిపోయినా అంతర్గత అవయవాల్లో కొంతవరకు రక్త నమూనాలు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదీ సాధ్యం కానప్పుడు బోన్‌మ్యారోను సేకరించడం ద్వారా బ్లడ్‌గ్రూప్‌ను విశ్లేషిస్తారు. దీన్ని రక్త సంబం«దీకులతో సరిపోల్చి మృతుల్ని గుర్తిస్తారు. బ్లడ్ గ్రూపింగ్తోపాటు ఇతర విధానాలకు అవకాశం లేని సందర్భాల్లో డీఎన్ పరీక్షలే శరణ్యమవుతాయి. అత్యధిక కేసుల్లో వాటి ద్వారానే గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది. మృతదేహంలోని అతిచిన్న ఆధారం నుంచైనా డీఎన్ఏ సేకరించే అవకాశం ఉండటం కలిసొచ్చే అంశం. 6. సూపర్ ఇంపొసిషన్ గుర్తించాల్సిన మృతదేహం ఫలానా వారిదనే అనుమానం ఉండి డీఎన్ఏ–బ్లడ్ శాంపిల్స్ సేకరించే అవకాశం లేనప్పుడే ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఘటనాస్థలిలో లభించిన పుర్రెను అత్యా«ధునిక పరికరాలతో విశ్లేషించి కంప్యూటర్ సాయంతో దానికి ముఖాకృతిని ఇస్తారు. దీన్ని అనుమానితుల ఫొటోలతో సరిపోల్చడం ద్వారా మృతులను గుర్తిస్తారు. ఇది అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. -
బస్సు సూపర్ ఫిట్... మంత్రి క్లీన్ చిట్ పై SV మోహన్ రెడ్డి ఫైర్
-
అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్ ప్రాసెస్ ఎలా?
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరుగుతుంటుంది. తాజాగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదబారిన పడడంతో మంటలు చెలరేగి కొందరు ప్యాసింజర్లు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సంబంధీకుల ప్రాణనష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. ప్రమాదంలో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బీమా చేయించిన ఇతర విలువైన వస్తువుల నష్టాన్ని ఇన్సూరెన్స్ ద్వారా కొంత భర్తీ చేయవచ్చు. ఇలాంటి సందర్భంలో బీమా ఎలా క్లెయిమ్ చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఎలాబీమా కంపెనీకి సమాచారం అందించాలి: అగ్నిప్రమాదం జరిగిన వెంటనే బీమా ప్రొవైడర్‌కు సమాచారం ఇవ్వండి. అవసరమైతే, అత్యవసర ఖర్చుల కోసం ముందస్తు ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించండి. సంఘటన జరిగిన తేదీ, సమయం, స్థలం వంటి ముఖ్యమైన వివరాలను అందించడంతో పాటు.. ఎంత నష్టం జరిగిందో అంచనా వేయండి.నష్టాన్ని డాక్యుమెంట్ చేయండి: అగ్నిప్రమాదం జరిగిన తరువాత.. స్థలాన్ని శుభ్రపరచడానికి ముందు.. అక్కడ పరిసరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీయండి. కాలిన వస్తువులను పారవేయకూడదు. బీమా కంపెనీ స్పందించడానికి ముందే రిపేర్ చేయడం వంటి చేయకూడదు.క్లెయిమ్ ఫైల్ చేయండి: ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారాన్ని ఆన్లైన్లో లేదా బీమా కంపెనీ కార్యాలయంలో సబ్మిట్ చేయండి. మీ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ, నష్టాన్ని తెలియజేసే ఫోటోలు, వీడియోలు, పాడైపోయిన వస్తువుల జాబితా వాటి విలువను తెలిపే రసీదులు లేదా ఇన్వాయిస్లు, అధికారిక నివేదిక వంటి అవసరమైన డాక్యుమెంట్స్ అందించాల్సి ఉంటుంది.కంపెనీకి సహకరించండి: ఇన్సూరెన్స్ కంపెనీ నష్టాన్ని అంచనా వేయడానికి ఒక వ్యక్తిని నియమించే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తికి సహకరించండి. తనకు అవసరమైన సమాచారం, పత్రాలను అందించాలి. నష్టపోయిన ఆస్తిని పరిశీలించడానికి అనుమతి ఇవ్వాలి.క్లెయిమ్ సెటిల్మెంట్: మీ క్లెయిమ్ ఆమోదం పొందిన తరువాత.. పాలసీ నిబంధనల ప్రకారం నష్టపరిహారం కంపెనీ చెల్లిస్తుంది. చెల్లింపు విధానం గురించి సంస్థ మీకు తెలియజేస్తుంది.Note: ఈ దశలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. మీ నిర్దిష్ట పాలసీ, ఇన్సూరెన్స్ కంపెనీని అనుసరించి విధానాలు మారవచ్చు. కాబట్టి మీ పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.ఇదీ చదవండి: ఇండిపెండెంట్ ఇల్లు Vs అపార్ట్మెంట్లో ఫ్లాట్ -
కర్నూలు శివారులో ఘోరం..
సాక్షి, కర్నూలు/హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదై పోయింది. ఫిట్నెస్ లేని బస్సు, పైగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం సంభవించిందని అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో మరణాలపై ఏపీ హోమంత్రి అనిత అధికారిక ప్రకటన చేశారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. 27మంది ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. గాయపడ్డ ఆరుగురిలో ముగ్గురికి ప్రాక్చర్లు అయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే.. కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059 అలాగే.. ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061, కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075, ఇక.. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు 9494609814, 9052951010గా కర్నూలు కలెక్టర్ డా. సిరి తెలిపారు. బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చని సూచించారు. మృత్యు ప్రయాణం ఇలా..వి కావేరి ట్రావెల్స్ మెయిన్ ఆఫీస్ పటాన్ చెరులో ఉంది. కూకట్ పల్లిలో మరో కార్యాలయం ఉంది. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు(డీడీ01ఎన్9490).. రాత్రి 9.30గం. పటాన్చెరు నుంచి ప్రారంభమైంది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకొని బెంగళూరు వైపు బయల్దేరింది. .. అర్ధరాత్రి 3గం.30ని. ప్రాంతంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్‌ను ఢీ కొట్టింది. బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ను అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లడం.. దాని పెట్రోల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగడంతో మంటలు వ్యాపించాయి. దీంతో.. బస్సును ఆపేసిన డ్రైవర్.. విషయాన్ని హెల్పర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి వాటర్ బబుల్‌తో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బస్సు హఠాత్తుగా ఆగడంతో కొందరు ప్రయాణికులకు మెలుకువ వచ్చి ఏం జరుగుతుందా? అని లేచి చూశారు. ఈలోపే.. మంటలు బస్సుకు అంటుకోవడం ప్రారంభించాయి. అది గమనించి డ్రైవర్ పారిపోగా.. హెల్పర్ ప్రయాణికులను అరుస్తూ బయటకు పిలిచాడు. డోర్ తెరిచి లేకపోవడంతో, ఎమర్జెన్సీ ద్వారం కూడా తెరుచుకోకపోవడంతో.. అద్దాలు పగలకొట్టుకుని కొందరు బయటకు దూకేశారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. గాఢ నిద్రలోఉన్నవాళ్లు, స్లీపర్ బెర్త్‌లో నిద్రిస్తున్నవాళ్లు.. మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేశారు. నిమిషాల్లో బస్సుకు మంటలు వ్యాపించి అందులోనే సజీవ దహనం అయ్యారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న నవీన్ తన కారులో గాయపడ్డ ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. హైమారెడ్డి అనే మరో మహిళ మంటలు చెలరేగడాన్ని చూసి అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో అందరూ వీడియోలు తీస్తున్నారని వాపోతూ ఆమె తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. (Kurnool Travels Bus Fire Accident)డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని.. బైక్‌ను ఢీ కొట్టినప్పుడే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘‘మంటలు అంటుకోగానే అద్దాలు బద్దలు కొట్టి బయటకు దూకేశాం. అప్పటికే మా సోదరుడి కుటుంబం మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్ వాళ్ల రక్షణ వాళ్లు చూసుకున్నారు. ప్రమాణికులను పట్టించుకోలేదు’’ అని గాయపడ్డ ఓ ప్యాసింజర్ వాపోయారు. అలాగే.. ఘటన జరిగిన తర్వాత వాళ్ల రక్షణ చూసుకున్నారే తప్ప.. తమను అప్రమత్తం చేయలేదని, అది జరిగి ఉంటే ప్రయాణికులంతా క్షేమంగా బయటపడేవాళ్లని చికిత్స పొందుతున్న మరో ప్రయాణికుడు తెలిపాడు.మృతుల సంఖ్య పెరగొచ్చు: డీఐజీప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే ఘోరం జరిగిపోయింది. ఘటన నుంచి 23 మంది బయటపడ్డారు. ప్రమాద తీవ్రతను డ్రైవర్ అంచనా వేయలేదు. ఇప్పటిదాకా 11 మృతదేహాలను వెలికి తీశాం. చికిత్స పొందుతున్నవాళ్ల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరగొచ్చు అని డీఐజీ కోయప్రవీణ్ అన్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన బైక్ సైతం బస్సు కిందే కాలిన స్థితిలో ఉండిపోగా.. బైకర్ మృతదేహం రోడ్డు పక్కనే పడి ఉంది. అతని పేరు శివ శంకర్‌గా తెలుస్తోంది. కొడుకు మృతితో యశోదమ్మ బోరున విలపిస్తూ కనిపించింది.ట్రావెల్స్ నిర్లక్ష్యం కూడా..ఘటన నేపథ్యంలో.. కూకట్‌పల్లిలోని వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన కార్యాలయం వద్దకు మీడియా చేరుకోగానే సిబ్బంది మూసేస్తూ కనిపించారు. ప్రమాదంపై నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఘటనకు వీ కావేరీ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా కారణం ఉందని అధికారుల మాటలతో స్పష్టవుతోంది. బస్సు నిర్మాణంలో ప్రికాషన్స్ లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేలా బస్సులో ఎలాంటి ఏర్పాట్లు లేవని డీఐజీ చెబుతున్నారు. అదే సమయంలో.. ట్రావెల్స్ ఓనర్ పేరు వేమూరి వినోద్ అని, బస్సు ఫిట్నెస్ వాలిడిటీ ఈ ఏడాది మార్చితోనే(31-03-2025) ముగిసిందని, అలాగే.. ఇన్సూరెన్స్ వాలిడిటీ, పొల్యూషన్ కాల పరిమితి కిందటి ఏడాది ఏప్రిల్‌తోనే ముగిశాయని ప్రచారం నడుస్తోంది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ప్రయాణికుల జాబితాలో.. 39 మంది, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రయాణికుల్లో చాలామంది హైదరాబాద్‌కు చెందిన వాళ్లే ఉన్నారు. బస్సులో ఎక్కువగా 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు ఉన్నట్లు లిస్ట్‌ను బట్టి అర్థమవుతోంది. ప్రమాదం నుంచి బయటపడ్డవాళ్లు.. రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం.. మరికొందరు. -
తగలబడిన బస్సు.. నిద్రలోనే ప్రాణాలు..!
-
ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కర్నూలు ఘోర బస్సు ప్రమాదంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (YS Jagan On Kurnool Bus Accident). ఘటన ఎంతో కలిచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన ఆయన.. వాళ్లకు ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని, అలాగే.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ‘‘కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు సజీవ దహనమవడం అత్యంత విషాదకరం. ఈ ఘోర ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి’’ అని ట్వీట్ చేశారు. The news of the tragic bus fire accident near Chinna Tekur village in Kurnool district is deeply distressing. I extend my heartfelt condolences to the families who lost their loved ones. I urge the government to ensure all necessary assistance and medical support to the injured…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2025మరోవైపు.. ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన విచారం వ్యక్తం చేశారని సమాచారం(CM Chandrababu On Kurnool Accident). ఆ వెంటనే సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి.. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.I am shocked to learn about the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district. My heartfelt condolences go out to the families of those who have lost their loved ones. Government authorities will extend all possible support to the injured and…— N Chandrababu Naidu (@ncbn) October 24, 2025ఇటు.. కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుములు రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (CM Revanth Reddy On Kurnool Bus Accident). మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ప్యాసింజర్స్ లిస్ట్‌లో అత్యధికం హైదరాబాద్‌కు చెందిన వారే ఉండడం గమనార్హం.కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు.…— Telangana CMO (@TelanganaCMO) October 24, 2025కేటీఆర్ దిగ్భ్రాంతి.. కర్నూలు బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఎంతో దురదృష్టకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.స్థానిక అధికారులు అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపట్టి క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలని,ప్రభుత్వo బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నాను అని అన్నారు. మంత్రి నారా లోకేష్.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురి కావడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఘటన ఎంతో బాధించిందని.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారాయన. The news of the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district is heartbreaking. I extend my deepest sympathies to the families who have lost loved ones. Wishing speedy recovery to those injured.— Lokesh Nara (@naralokesh) October 24, 2025ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్..కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుల పరిస్థితిని కర్నూలు జీజీహెచ్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు మంత్రికి వివరించారు. దీంతో.. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు సూచించారు. ‘‘బస్సులోనే ఇంకా భౌతిక కాయాలున్నాయి. పరిస్థితులకనుగుణంగా ఘటనా స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఫోరెన్సిక్ వైద్యులను ఘటనా స్థలానికి పంపించాం. భౌతిక కాయాల తరలింపునకు మహాప్రస్థానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నాం. స్వల్పగాయాలతో 12 మంది ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుల్లో ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. బస్సులో (ఎత్తు) నుంచి దిగడంవల్ల ఒకరికి ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది’’ అని ఆయన అన్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న ఓల్వో బస్సు కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైందని తెలిసి తీవ్ర ద్రిగ్బాంతి గురి చేసింది. బస్సు ప్రమాద ఘటన పై కర్నూలు జిల్లా అధికారులతో మాట్లాడడం జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధం అయినట్టు తెలిసింది.మృతుల కుటుంబాలకు నా ప్రగడ సంతాపాన్ని తెలియజేస్తున్న. వెంటనే క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్న.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారం.. కర్నూలు జిల్లాలో బస్ ఘోర ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బస్ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం రావడం పట్ల ఆయన ఆందోన వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి..ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు మరణించడం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.ఇదీ చదవండి: బైక్‌ను ఢీ కొట్టడం వల్లే బస్సు కాలిపోయిందా? -
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం
-
Kurnool: ఘోర అగ్ని ప్రమాదం
-
Mumbai: భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
ముంబై: మహానగరం ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున నవీ ముంబైలోని వాషీలోగల రహేజా రెసిడెన్సీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. 10వ అంతస్తులో తెల్లవారుజామున 12.40 గంటలకు ప్రారంభమైన మంటలు 11, 12 అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసీ)పరిధిలోని అగ్నిమాపక విభాగం తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం.. ప్రమాదం జరిగిన వెంటనే వాషి, నెరుల్, ఐరోలి, కోపర్ఖైరేన్ స్టేషన్ల నుండి అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది హోస్ లైన్లు వేసి, వెంటనే మంటలను అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేశారు.‘ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. 15 మందిని సురక్షితంగా బయటకు తరలించాం’ అని ఎన్‌ఎంఎంసీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ పురుషోత్తం జాదవ్ తెలిపారు.10వ అంతస్తులోని ఒక ఫ్లాట్ నుండి మంటలు చెలరేగాయని, ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదన్నారు. మృతులంతా రహేజా రెసిడెన్సీ నివాసితులేననని జాదవ్ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మంటలను అదుపులోనికి తెచ్చేందుకు చాలా సమయం పట్టిందని, ఎవరూ లోపల చిక్కుకోకుండా అగ్నిమాపక బందాలు పర్యవేక్షించాయని అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై వాషి అగ్నిమాపక కేంద్రంతోపాటు ఎన్‌ఎంఎంసీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిమ్స్‌లో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం
లక్డీకాపూల్ : ఎలక్రి్టక్ బైక్ దగ్ధమైన సంఘటన శనివారం నిమ్స్ మార్చురీ సమీపంలోని స్టాఫ్ పార్కింగ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే ఆస్పత్రిలో పని చేస్తున్న అన్‌స్కిల్డ్ వర్కర్ బాలచందర్ తన ఈవీ బైక్‌ను స్టాఫ్ పార్కింగ్‌లో పార్క్ చేసి విధులకు హాజరయ్యాడు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పార్క్ చేసిన వాహనం నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అప్రమత్తమైన నిమ్స్ సెక్యూరిటీ అధికారి రామారావు వాహనాన్ని సిబ్బంది సహయంతో స్టాఫ్ పార్కింగ్ నుంచి బయటకి తీయించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది. -
Air China: విమానంలో కలకలం.. గాల్లో ఉండగానే మంటలు
హాంగ్జౌ: ఎయిర్ చైనా విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడి లగేజీలో మంటలు చెలరేగాయి. హాంగ్జౌ నుంచి దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌కు బయలుదేరిన విమానంలో ఓ ప్రయాణికుడి లగేజీలోని లిథియం బ్యాటరీ పేలింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాకంపితులయ్యారు. ఓవర్‌హెడ్ బిన్ నుంచి మంటలు రాగా.. విమానం లోపలంతా పొగ వ్యాపించింది.అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విమానాన్ని షాంఘైకి మళ్లించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఎయిర్ చైనా వెల్లడిచింది. ఓ ప్రయాణికుడు ఈ ఘటనకు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.Air China flight CA139 made emergency landing in Shanghai today after a lithium battery in overhead luggage self-ignited. No injuries reportedThat’s why Emirates has now restricted power bank charging onboardpic.twitter.com/KNDVKpINKJ— حسن سجواني 🇦🇪 Hassan Sajwani (@HSajwanization) October 18, 2025 -
ఢిల్లీ: ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీ: ఎంపీల నివాస సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. చిన్నారులు టపాసులు కాలుస్తుండగా ఫర్నీచర్‌కి మంటలు అంటుకోవడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. బీడీ మార్గ్‌లోని ఈ అపార్ట్మెంట్.. పార్లమెంట్ హౌస్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో మూడు అంతస్తులు దగ్ధమయ్యాయి. ప్రాణ నష్టం తప్పింది. పలువురికి గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదం ఫోన్ కాల్ తర్వాత 40 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నట్లు తెలిసింది. ఆలస్యంగా రావడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు అంటున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా బాణాసంచా కారణమని స్థానికులు చెబుతున్నారు. పార్కింగ్ ఏరియాలో ఫర్నిచర్ ఉంచడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అపార్ట్మెంట్ వాసులు అంటున్నారు. సీపీడబ్ల్యూడి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అపార్ట్మెంట్ వాసుల ఆరోపిస్తున్నారు. #WATCH | A fire broke out at Brahmaputra Apartments in New Delhi. Six vehicles have been dispatched to the spot. Efforts are underway to put out the fire. https://t.co/QfqJWbteUi pic.twitter.com/0RY9JOzGbq— ANI (@ANI) October 18, 2025 -
Amritsar: ‘గరీబ్ రథ్’లో అగ్నిప్రమాదం..
సిర్హింద్: పంజాబ్‌లోని సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం అమృత్సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12204)లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రైలులోని ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లలో ఒకదానిలో నుండి పొగలు రావడంతో ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ రోజు ఉదయం 7:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో వందల మంది ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. వీరంతా అమృత్సర్ నుంచి సహర్సాకు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఒక ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి.రైల్వే అధికారుల కథనం ప్రకారం.. రైలులోని జీ-19 కోచ్ నుండి పొగలు రావడాన్ని తొలుత ప్రయాణికులు గమనించారు. వెంటనే వారిలోని ఒకరు అత్యవసర గొలుసును లాగారు. రైలు ఆగిపోయింది. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ కోచ్‌లోని ప్రయాణికులను తరలించే ప్రయత్నం చేశారు. నిమిషాల వ్యవధిలో మంటలు పక్కనే ఉన్న రెండు కోచ్‌లకు వ్యాపించాయి. దీంతో అధికారులు ఆ మూడు కంపార్ట్మెంట్లను రైలు నుంచి వేరు చేశారు. ఈ మూడు బోగీలు దెబ్బతిన్నాయి. ఒక ప్రయాణికురాలికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. రైల్వే బోర్డు ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. VIDEO | Sirhind, Punjab: A major train accident was averted near Sirhind railway station when a fire broke out in the Garib Rath Express travelling from Amritsar to Saharsa, just half a kilometre ahead of Ambala. The train was halted immediately after smoke was seen billowing… pic.twitter.com/vXwHoqTEJB— Press Trust of India (@PTI_News) October 18, 2025ప్రయాణికులు వెంటనే అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు.. అగ్నిమాపక సిబ్బంది, రైల్వే, స్థానిక పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే 32 ఏళ్ల మహిళా ప్రయాణికురాలు గాయాలపాలు కాగా, ఆమెను ఫతేఘర్ సాహిబ్ సివిల్ ఆసుపత్రికి తరలించామని రైల్వే అధికారి రతన్‌లాల్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
ప్రకాశం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, ప్రకాశం: ప్రకాశం(Prakasam) జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. టంగుటూరు మండలంలోని కలికివాయి బిట్రగుంటలో పొగాకు గోదాంలో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిరిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు.వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలో బెల్లం కోటయ్యకు చెందిన పొగాకు గోదాంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేనప్పటికీ భారీగా జరిగిన ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. -
నల్లగొండ: హాలియా ఎస్బీఐలో అగ్నిప్రమాదం.. ఆన్‌లో ఉన్న కంప్యూటర్ వల్లే!
సాక్షి, నల్లగొండ: హాలియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటాక అగ్నిప్రమాదం చోటు చేసుకుంది(Haliya SBI Fire Accident). అయితే స్థానికంగా ఒకరు సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం కూడా తప్పింది. ఘటన గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఓ అంచనాకి వచ్చారు.హాలియా ఎస్బీఐలో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టంగా మంటలు.. పొగ రావడాన్ని గమనించిన స్థానిక మిల్క్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఆ అపార్ట్మెంట్ పైన నివసిస్తున్న వాళ్లను అప్రమత్తం చేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో కంప్యూటర్లు, ఫర్నీచర్, ఇతర సామాగ్రి బూడిద అయ్యాయి. ష్యూరిటీ పత్రాలు, నగదు పరిస్థితి ఏంటన్నది తేలియాల్సి ఉంది. అయితే.. బ్యాంకు సిబ్బంది ఓ కంప్యూటర్ షట్ డౌన్ చేయకుండా వదిలేశారు. ఆ కంప్యూటర్ వద్దే రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్(Computer Short Circuit) జరిగి మంటలు రాజుకున్నాయి. అలా.. ఒక్కసారిగా మంటలు బ్యాంకు మొత్తం వ్యాపించాయి. అంతకంతకు పెరిగి బ్యాంకును దగ్ధం చేశాయి’’ అని అధికారి ఒకరు తెలిపారు.ఇదీ చదవండి: రేషన్ కార్డులు.. అందరికీ కాదు! -
Erramanzil: పెట్రోల్ కొట్టించడానికి వచ్చిన కారులో మంటలు
-
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఏడుగురు రోగులు మృతి
-
రాజస్థాన్: ఐసీయూలో విష వాయువులు.. ఏడుగురి దుర్మరణం
జైపూర్: రాజస్థాన్ రాజధానిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది(Rajasthan Fire Accident). ఈ ఘటనలో మృతుల సంఖ్య 7కి చేరింది. చికిత్స పొందుతున్న వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి జైపూర్‌లోని సవాయ మాన్సింగ్(SMS Hospital Mishap) ఆస్పత్రిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. రెండో అంతస్తులోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని చెలరేగి.. ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.ਸਵਾਈ ਮਾਨ ਸਿੰਘ ਸਰਕਾਰੀ ਹਸਪਤਾਲ ਦੇ ICU 'ਚ ਲੱਗੀ ਅੱ+ਗਝੁਲ.ਸ ਗਏ ਕਿੰਨੇ ਹੀ ਮਰੀਜ਼ ! ਦੇਖੋ ਰਾਜਸਥਾਨ ਦੇ ਸਰਕਾਰੀ ਹਸਤਪਾਲ ਦੀਆਂ ਤਸਵੀਰਾਂ #jaipur #rajasthan #accident #LatestNews #Bignews #PunjabiNews #DailypostTV pic.twitter.com/kvlIRlBb4I— DailyPost TV (@DailyPostPhh) October 6, 2025 ప్రమాదంలో ఐసీయూలో ఉన్న వైర్లు, ఫైల్స్ కాలిపోయి మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఆపై విషపు వాయివులు వెలువడడంతో పేషెంట్లు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ ఘటనలో అక్కడిక్కడే ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురికి సీరియస్‌గా ఉండగా.. చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకి చేరుకుంది. #WATCH | Jaipur, Rajasthan | A massive fire broke out in an ICU ward of Sawai Man Singh (SMS) Hospital, claiming the lives of six patients pic.twitter.com/CBM6vcTMfZ— ANI (@ANI) October 5, 2025ఘటన సమయంలో ఐసీయూ, సెమీ ఐసీయూలో కలిపి 24 మంది పేషెంట్లు ఉన్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ప్రమాదంతో దట్టమైన పొగ అలుముకోగా.. ఆస్పత్రిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాణ భయంతో అంతా బయటకు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటల్ని అదుపు చేసినట్లు సమాచారం. जयपुर के SMS हॉस्पिटल के ट्रॉमा सेंटर के लगी आग.#Jaipur pic.twitter.com/q9Q6OQfma8— Dr. Ashok Sharma (@ashok_Jodhpurii) October 5, 2025సిబ్బందిపై ఆరోపణలుఅయితే ఘటన సమయంలో ఆస్పత్రి సిబ్బంది పేషెంట్లతో సంబంధం లేదన్నట్లు తమ ప్రాణాల కోసం పరుగులు తీశారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఘటన సమయంలో ఐసీయూ నుంచి దట్టమైన పొగ ఆస్పత్రి మొత్తం వ్యాపించిందని.. దీంతో తాము కంగారు పడ్డామని, ఆ సమయంలో మమ్మల్ని అప్రమత్తం చేయకుండా సిబ్బందే ముందుగా బయటకు పారిపోయారని వాళ్లు అంటున్నారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగగా.. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఆ ఆరోపణలను నిర్వాహకులు కొట్టిపారేశారు. తమ సిబ్బంది పేషెంట్లను బయటకు తీసుకొచ్చారని.. సీసీటీవీ ఫుటేజీలే అందుకు సాక్ష్యాలని అంటున్నారు. విష వాయువుల పొగ కారణంగా పేషెంట్లు అపస్మారక స్థితికి చేరుకున్నారని, సీపీఆర్‌తో రక్షించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని వైద్యులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు ప్రకటించారు.ప్రధాని దిగ్భ్రాంతిజైపూర్ ఎస్ఎంఎస్ ఆస్పత్రి విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.The loss of lives due to a fire tragedy at a hospital in Jaipur, Rajasthan, is deeply saddening. Condolences to those who have lost their loved ones. May the injured recover soon: PM @narendramodi— PMO India (@PMOIndia) October 6, 2025 #WATCH | Jaipur, Rajasthan | SMS Hospital Trauma centre Incharge Anurag Dhakad says, "Our trauma centre has two ICUs on the second floor: a trauma ICU and a semi-ICU. We had 24 patients there; 11 in the trauma ICU and 13 in the semi-ICU. A short circuit occurred in the trauma… pic.twitter.com/cjMwutRCl3— ANI (@ANI) October 5, 2025 -
బేగం బజార్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్: బేగంబజార్ కనిష్క జ్యువెల్లరీ షాపులో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగినదా లేదా అనే విషయంపై ఇంకా అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
Hyderabad మద్యం లారీలో మంటలు.. బాటిళ్ల కోసం ఎగబడిన స్థానికులు
హైదరాబాద్: నగరంలోని రామంతాపూర్‌లో మద్యం లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. దీంతో మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై లారీని నిలిపివేశాడు. స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో పలు మద్యం బాటిళ్లు పాక్షికంగా కాలిపోగా.. మరో వైపు మద్యం బాటిళ్ల కోసం స్థానికులు ఎగబడ్డారు. -
Gujarat: భారీ అగ్నిప్రమాదం.. తగలబడుతున్న ‘సంఘ్వి ఆర్గానిక్స్’
భరూచ్: గుజరాత్‌లోని భరూచ్ జిల్లా, పనోలిలో గల సంఘ్వి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగల మధ్య భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పారిశ్రామిక ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి,ప్రాణ నష్టం వివరాలు ఇంకా వెల్లడికాలేదు. VIDEO | Bharuch, Gujarat: Fire breaks out in Sanghvi Organics Pvt Ltd in GIDC Panoli. Thick smoke and flames were visible from a distance as multiple fire tenders rushed to the spot and began firefighting operations. More details are awaited.(Source: Third Party)(Full video… pic.twitter.com/UMVi3UgoN6— Press Trust of India (@PTI_News) September 14, 2025గుజరాత్లో ఏప్రిల్ 2న బనస్కాంత జిల్లాలోని దీసాలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటన మరువకముందే ఈ తాజా ఘటన చోటుచేసుకుంది. నాడు అక్రమ బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో 21 మంది మృతిచెందారు. మధ్యప్రదేశ్‌కు నుంచి వలస వచ్చిన కార్మికులు అధికంగా ఈ ప్రమాదం బారిన పడ్డారు. సంఘ్వి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం దరమిలా, దగ్గమైన పొగ ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టింది. గిడ్డంగిలో కొంత భాగం ఆహుతయ్యిందని సమాచారం. కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారని తెలియవస్తోంది. పోలీసులు ఈ పరిశ్రమను అక్రమంగా నడిపిస్తున్న యజమాని ఖుబ్చంద్ థక్కర్,అతని కుమారుడిని అరెస్టు చేశారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్ఎంహెచ్పీ విభాగం వద్ద కోకింగ్ కోల్లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్ కోల్ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి. -
హెచ్పీసీఎల్లో అగ్ని ప్రమాదం.. పెట్రోలియం ట్యాంక్‌పై పిడుగు
సాక్షి, విశాఖపట్నం: హెచ్పీసీఎల్లో అగ్ని ప్రమాదం జరిగింది. పెట్రోలియం ట్యాంక్‌పై పడిన పిడుగు పడింది. 20 ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి.ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపు చేయడంతో పాటు మరొక ఈతనల్ ప్లాంట్‌కి మంటలు వ్యాపించకుండా అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
Nagpur: సోలార్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. పలువురు కార్మికులు గాయాలు
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని కల్మేశ్వర్ తహసీల్ పరిధిలోని చందూర్ గ్రామంలో బజార్‌గావ్‌లోని సోలార్ ఇండస్ట్రీస్‌లో భారీ పేలుడు సంభవించింది. గురువారం తెల్లవారుజామున 1:00 గంటల ప్రాంతంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనతో కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ప్రాథమిక నివేదికల ప్రకారం, ఘటన జరిగిన సమయంలో కంపెనీలో 900 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాదం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి మరణాలు నమోదు కాలేదు. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయని, మరో ఎనిమిదికి స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది. గాయాలపాలైనవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గాయపడిన ఒక కార్మికుడు మీడియాతో మాట్లాడుతూ ‘రియాక్టర్ నుండి పొగలు రావడాన్ని చూసి, తామంతా బయటక వచ్చేశామన్నారు. 25 నిమిషాల తర్వాత పేలుడు సంభవించిందని, పేలుడు కారణంగా ఎగిరిపడిన రాళ్ల కారణంగా దాదాపు 50 మంది గాయపడ్డారు’ అని తెలిపారు. #WATCH | Nagpur, Maharashtra | Explosion in Solar Industries, Bazargaon: An injured worker says, "The incident took place around 12-12:30 AM. When we saw smoke coming from the reactor, we all came out. After continuous smoke for around 20-25 minutes, there was a blast. Due to the… https://t.co/MlKIJsoKFL pic.twitter.com/n9L0vUvgcw— ANI (@ANI) September 4, 2025కాగా సోలార్ యూనిట్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మొదటిసారేమీ కాదని, గతంలో కూడా ఇలాంటి పేలుడు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయని నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పోద్దార్ తెలిపారు. కాగా ఈ పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. -
విశాఖ ఆర్టీసీ బస్సులో మంటలు
-
విశాఖ: మంటల్లో ఆర్టీసీ బస్సు దగ్దం.. ఓవర్‌లోడ్ కారణమా?
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని శాంతిపురం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. అయితే, ఎలక్ట్రిక్ బస్సుల్లో విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.వివరాల ప్రకారం.. కుర్మన్నపలెం నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి పురం జంక్షన్ వద్ద బస్సు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో, బస్సులో ఉన్న ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై బస్సు పూర్తిగా దగ్దమైంది. అయితే, బస్సులో ఓవర్‌లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పలువురు చెబుతున్నారు. బస్సు కెపాసిటీ 65 మంది కాగా 100కు పైగా మంది ప్రయాణించినట్టు తెలిసింది. వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు సమాచారం. -
హైదరాబాద్ కుషాయిగూడలో అగ్నిప్రమాదం
-
Punjab: నడిరోడ్డుపై ఎల్పీజీ ట్యాంకర్ దగ్ధం.. ఇద్దరు మృతి
హోషియార్పూర్: పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో దడపుట్టించే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మాండియాలా గ్రామంలోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది. రోడ్డు ప్రమాదం అనంతరం గ్యాస్ ట్యాంకర్‌కు మంటలు అంటుకోగా, అవి సమీపంలోని 15 దుకాణాలను, ఐదు నివాస గృహాలను దగ్ధం చేశాయని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. #WATCH | A massive fire broke out in Mandiala village of Hoshiarpur in Punjab. According to Deputy Commissioner Aashika Jain, it is suspected that the fire was caused by a road accident in an industrial area involving an LPG tanker, and one casualty has been reported. Fire… pic.twitter.com/JMZYi4VT3J— ANI (@ANI) August 22, 2025శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్ జైన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ కుమార్ మాలిక్ సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు అంబులెన్స్‌లలో తరలించారు. హోషియార్పూర్ డిప్యూటీ కమిషనర్ ఆషికా జైన్ మీడియాతో మాట్లాడుతూ ‘రోడ్డు ప్రమాదం కారణంగా గ్యాస్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగాయి. ప్రమద బాధితులను ఆస్పత్రులకు తరలించారు. రోడ్డు ప్రమాదం తర్వాత గ్యాస్ లీక్ అయ్యిందని తెలిపారు. #WATCH | Hoshiarpur, Punjab | At the incident spot where a fire broke out in Mandiala village, Deputy Commissioner Aashika Jain says, "... The fire broke out, probably due to a road accident. Patients with burn injuries have been admitted to the hospital... One casualty has been… https://t.co/1jgGIYZKdD pic.twitter.com/OS3kQZw76X— ANI (@ANI) August 22, 2025ఘటనా స్థలానికి పంజాబ్ మంత్రి రవ్‌జోత్ సింగ్ చేరుకుని, పరిస్థితులను, సహాయక చర్యలను పరిశీలించారు. ‘పరిస్థితి వర్ణించలేని విధంగా ఉంది. చాలా విషాదకరమైన ప్రమాదం జరిగింది. ఎంత మంది గల్లంతయ్యారో ఇంకా తెలియదు. ఒక ట్యాంకర్.. కారును ఢీకొంది. ఆ తర్వాత గ్యాస్ లీక్ కావడం వల్ల పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి’ అని మీడియాకు తెలిపారు. కాగా ప్రమాద బాధితులను హోషియార్పూర్ సివిల్ ఆసుపత్రికి తరలించేలోపే ఇద్దరు మృతిచెందారని, మరో 20 మంది వరకు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సివిల్ సర్జన్ పవన్ కుమార్ తెలిపారు. #WATCH | Hoshiarpur, Punjab | At the incident spot where a fire broke out in Mandiala village, Punjab Minister Ravjot Singh says, "The situation is such that it cannot be described. A very tragic accident has happened... It is not yet known how many people are missing. People are… https://t.co/1jgGIZ0i3b pic.twitter.com/IVWi9ArEis— ANI (@ANI) August 22, 2025 -
ఎయిరిండియా విమానంలో మంటలు
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం. ఎయిరిండియా విమానంలో మంటలు వ్యాపించాయి. మంగళవారం (జూలై 22) హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 315 ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ జరిగిన కొద్ది సేపటికే విమానం ఏపీయూలో (Auxiliary Power Unit)లో మంటలు చెలరేగాయి.ప్రమాదంతో అప్రమత్తమైన ఢిల్లీ ఎయిర్ పోర్టు సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఏపీయూ అనేది విమానాల్లో తోక భాగంలో గ్యాస్ టర్బైన్ ఇంజిన్‌లా పనిచేస్తుంది. విమానంలో లైట్లు, కంప్యూటర్లు, నావిగేషన్ వ్యవస్థలు మొదలైనవి ఈ ఏపీయూ వ్యవస్థ ద్వారా పని చేస్తాయి. విమానం ఇంజిన్ ప్రారంభం కావాలంటే తగినంత గాలి కావాలి. ఆ గాలిని ఈ ఏపీయూ అందిస్తోంది. అంతేకాదు కేబిన్‌లో ప్రయాణికులకు చల్లటి గాలిని అందించడంలో సహాయపడుతుంది. విమానానికి ఉన్న మెయిన్ ఇంజిన్ విఫలమైతే ఏపీయూ ద్వారా గాలి,కరెంట్ ఉత్పత్తి అవుతుంది. -
అగ్ని కీలల్లో ఐటీసీ గిడ్డంగి
తగరపువలస: విశాఖజిల్లాలో ఐటీసీ గిడ్డంగి దగ్ధం కావడంతో రూ. కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు భస్మీపటలం అయ్యాయి. ఉపాధి కల్పనపైన కూడా ప్రభావం చూపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం, గండిగుండం పంచాయతీలోని రామవరం రోడ్డులో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఐటీసీ గిడ్డంగి శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రూ. కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఈ గిడ్డంగి ఉత్తరాంధ్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరుకుల లోడింగ్, అన్లోడింగ్ కేంద్రంగా పనిచేస్తోంది. నూతన్ రాజ్మని ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, మిస్టర్ రాఘవా ఇన్ఫ్రా శ్రీదత్తా మెడోస్ పేరుతో ఈ గిడ్డంగి ఉంది. ఈ గిడ్డంగిలో సుమారు 300 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లలో నిల్వ ఉంచిన నిత్యావసర సరుకులు– సాల్ట్, గోధుమపిండి, వంటనూనె, సబ్బులు, మసాలాలు, పసుపు, అగరబత్తీలు, సిగరెట్లు, ఫ్లోర్ క్లీనర్లు, బిస్కెట్లు, పచ్చళ్లు, నూడిల్స్, ఎనర్జీ డ్రింకులు అన్నీ పూర్తిగా కాలిపోయాయి. అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రాణాపాయం తప్పినట్లు భావిస్తున్నారు. ఘటన స్థలంలో ఉన్న ఒక లారీకి నిప్పు అంటుకుని అందులో ఉన్న మసాలా పదార్థాలు, ఆటా, పసుపు, కారం తదితర వస్తువులు కాలిపోయాయి. సమీపంలోని పలు ప్రాంతాల నుంచి అధికారులు ఎనిమిది అగ్నిమాపక శకటాలను రప్పించి తెల్లవార్లూ మంటలు ఆర్పడానికి శ్రమించినా, శనివారం మధ్యాహ్నం వరకు మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. అగ్నిప్రమాదం గురించి ముందుగా స్పందించిన స్థానిక సర్పంచ్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండ్రెడ్డి శ్రీనివాస్ ఆనందపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి అప్రమత్తం చేశారు. -
Visakhapatnam: ఐటీసీ గోడౌన్ లో చెలరేగిన మంటలు
-
తిరుపతిలో రైలు అగ్నిప్రమాదం (ఫొటోలు)
-
తిరుపతి రైలులో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందంటే
-
తిరుపతిలో రైలు ప్రమాదం
-
తమిళనాడు: రైలు నుంచి ఎగిసిపడుతున్న మంటలు.. ట్రైన్స్ నిలిపివేత
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తిరువళ్లూరులో డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అన్ని వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి. దీంతో, వ్యాగన్లు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా అప్రమత్తమైన అధికారులు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అలాగే, ట్రాక్ సమీపంలోని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు.వివరాల ప్రకారం.. అరక్కోణం నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్ రైలులో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. పెరియకుప్పం సమీపంలో గూడ్స్ రైలులో మంటలు వ్యాపించాయి. ఓడరేవు నుండి చమురుతో వెళ్తున్న గూడ్స్ రైలు కావడంలో మంటలు చెలరేగుతున్నాయి. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. రైలులో ఇంధనం ఉండటంతో మంటలు మరింత వ్యాపిస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తిరువళ్ళూరు ఎస్టీ కాలనీ, వరదరాజ నగర్‌కు చెందిన 300 కుటుంబాలను జిల్లా అధికారులు ఖాళీ చేయించారు. ఘటనా స్థలానికి తిరువళ్ళూరు కలెక్టర్ ప్రతాప్, ఎస్పీ శ్రీనివాస్ పెరుమాళ్, రైల్వే డీఆర్ఎం విశ్వనాథన్ చేరుకున్నారు.🚨 #Breaking: Massive fire engulfs a diesel freight train near Tiruvallur, Tamil Nadu. Several major trains from MGR Chennai Central have been canceled for today, July 13, as a safety precaution. Passengers are advised to check with @GMSRailway for updates.#TrainFire #TamilNadu… pic.twitter.com/1ipJg4q94M— Shubham Rai (@shubhamrai80) July 13, 2025ఇక, గూడ్స్ రైలుకు మొత్తం 52 ట్యాంకర్లు ఉండగా.. ఇంజన్ వైపున రెండో ట్యాంకర్ నుండి తొమ్మిదో ట్యాంకర్ వరకు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎనిమిది ట్యాంకర్లు అగ్నికి ఆహుతి కాగా.. మిగిలిన ట్యాంకర్లను అధికారులు రైలు నుంచి సురక్షితంగా తప్పించినట్టు సమాచారం. 40 ట్యాంకర్లు సురక్షితంగా ఉన్నాయి. ఒక్కో ట్యాంకర్లో 70వేల లీటర్లు క్రూడ్ ఆయిల్ ఉంది.Major fire broke out very near tiruvallur railway station! Oil trail got collapsed n breakup a major fire.. #tiruvallur #tiruvallurrailwaystation #railway #SouthernRailway @RailMinIndia @IRCTCofficial @GMSRailway @UpdatesChennai @THChennai @polimernews pic.twitter.com/YJ8G534hpc— arsath ajmal (@ajmalji) July 13, 2025 A fuel-laden railway tanker caught fire near Tiruvallur.Thick black smoke and intense flames engulfed the area, disrupting train services.Firefighters are on the scene, & officials are investigating the cause.#TrainFire #BreakingNews #ChennaiUpdates @NewIndianXpress@xpresstn pic.twitter.com/Pc3jwtJJDd— Ashwin Prasath (@ashwinacharya05) July 13, 2025 అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు పదికి పైగా అగ్నిమాపక యంత్రాలు ప్రయత్నిస్తున్నాయి. మంటల కారణంగా, అరక్కోణం మీదుగా సెంట్రల్‌కు వచ్చే ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ ప్రదేశాలలో నిలిపివేశారు. అదనంగా ఉదయం 5.50 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ వందే భారత్ రైలును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ శతాబ్ది రైలును కూడా నిలిపివేశారు. తిరుపతి, వేలూరు, మైసూరు, సేలం నుంచి చెన్నైకు వెళ్ళే రైళ్లు రాకపోకలకు అంతరాయం కలిగింది. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 🚨 BREAKING: Goods train derails and catches fire near Tiruvallur railway station in Tamil Nadu. Rescue operations currently underway. 🚂🔥#TiruvallurTrainAccident #TamilNadu #TrainDerailment #RescueOperations #Breaking #IndianRailways #Emergency #SafetyFirst pic.twitter.com/NShYM4uw8K— Benefit News 24 (@BenefitNews24) July 13, 2025Southern Railway tweets, "Due to a fire incident near Tiruvallur, overhead power has been switched off as a safety measure. This has led to changes in train operations. Passengers are advised to check the latest updates before travel." pic.twitter.com/LTvTAFYNqu— ANI (@ANI) July 13, 2025 -
పాశమైలారం: మరో పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, సంగారెడ్డి: పాశమైలారంలోని మరో పరిశ్రమలో తాజాగా భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎన్ వీరో వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాద ఘటన నుంచి తేరుకోక ముందే మరో ప్రమాదం జరగడం స్థానికులను, కార్మికులను భయాందోళనకు గురిచేసింది.వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలో ఆదివారం ఉదయం మరో భారీ అగ్నిప్రమాద ఘటన వెలుగు చూసింది. ఎన్ వీరో వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మంటల ముప్పులో 2.6 లక్షల కుటుంబాలు
సాక్షి, హైదరాబాద్: గుల్జార్‌హౌస్ వద్ద ఓ ఇంట్లో ఈ ఏడాది మే 18న చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన 17 మందిని పొట్టనపెట్టుకుంది. ఈ దుర్ఘటన షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటుచేసుకోగా... మంటలు విస్తరించడానికి ఆ ఇంటి ఆవరణలో జరుగుతున్న వాణిజ్య వ్యవహారాలే కారణమయ్యాయి. ఈ ఒక్క కుటుంబమే కాదు.. హైదరాబాద్‌లోని 2.6 లక్షల కుటుంబాలు, అందులోని 13 లక్షల మంది కుటుంబీకులు అగ్నిప్రమాదాల కోణంలో వెరీ హైరిస్క్ జోన్లో ఉన్నట్లు ముగ్గురు ప్రొఫెసర్లు చేపట్టిన అధ్యయనం స్పష్టం చేస్తోంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీ, నిజాం కాలేజీ, భోపాల్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జియోగ్రఫీ ప్రొఫెసర్లు వీణ రాపర్తి, కె.వెంకటేశ్, దుర్గేశ్ కుర్మి ‘హాట్ స్పాట్ అనాలసిస్ ఆఫ్ స్ట్రక్చర్ ఫైర్స్ ఇన్ అర్బన్ అగ్లోమరేషన్: ఎ కేస్ స్టడీ ఆఫ్ హైదరాబాద్ సిటీ’పేరుతో సాగిన ఈ అధ్యయనం ఇటీవల ఏషియన్ జర్నల్ ఆఫ్ జియోగ్రాఫికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. సెంట్రల్ జోన్లోనే 64.86 శాతం... భాగ్యనగరంలో నానాటికీ జనసాంద్రత పెరిగిపోవడంతోపాటు నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు కలిసిపోవడం కూడా అగ్నిప్రమాదాల ముప్పు పెరగడానికి ప్రధాన కారణమని ఈ అధ్యయనం తేల్చింది. ఒకప్పుడు హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నివాస, వాణిస్య ప్రాంతాలంటూ విడివిడిగా ఉండేవి. అయితే మారుతున్న పరిస్థితులతోపాటు భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల ధరలకు రెక్కలు రావడంతో నివాస ప్రాంతాల్లోనే వాణిజ్య లావాదేవీలు చేసే సంస్థలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ప్రాంతాలే అగ్నిప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్న ఏరియాలుగా మారిపోతున్నాయి. అన్ని జోన్ల కంటే సెంట్రల్ జోన్‌లోని 64.86 శాతం ప్రాంతాలకు అగ్నిప్రమాదాల ముప్పు పొంచి ఉందని ఈ అధ్యయనం తేల్చింది. ఈ ప్రాంతాలు వెరీ హైరిస్క్ పరిధిలో... నిపుణుల అధ్యయనం ఆధారంగా చూస్తే హైదరాబాద్‌లోని 35 డివిజన్లు వెరీ హైరిస్క్ జోన్లో ఉన్నాయి. 131 చదరపు కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాల్లో 13.14 లక్షల మంది నివసిస్తున్నారని... ఈ లెక్కన వారు ప్రతి చదరపు కి.మీ.కి 17,669 మంది ఉంటున్నట్లని సర్వే లెక్కకట్టింది. ఈ ప్రాంతంలో ఉన్న 2,63,197 కుటుంబాలకూ ఈ ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది. 2017–24 మధ్య చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న అధ్యయన బృందం ఈ విషయాన్ని ఖరారు చేసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, వైరింగ్, ఉపకరణాల్లో ఉన్న లోపాలే అగ్నిప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని తేల్చిన అధ్యయనం.. ఆయా అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాన్ని నొక్కిచెప్పింది. ఒక ఏడాది కాలంలో చోటుచేసుకొనే అగ్నిప్రమాదాల్లో 12–12.5 శాతం మార్చి, ఏప్రిల్ నెలల్లోనే జరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఫైర్ స్టేషన్లను పునర్వ్యవస్థీకరించాలి... ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఫైరింజన్లు ఎంత త్వరగా ఘటనాస్థలికి రాగలిగితే నష్టం అంత తగ్గించే అవకాశం ఉంటుందన్నది తెలిసిందే. 2017–2024 మధ్య చోటుచేసుకున్న ఉదంతాల ఆధారంగా చూస్తే నగరవ్యాప్తంగా చోటుచేసుకున్న అగ్నిప్రమాదాల్లో అత్యధికం (95.19 శాతం) అరగంటలోనే మంటలు అదుపులోకి వచ్చాయి. 0.09 శాతం ఉదంతాలు గంటలో, 0.48 శాతం ఉదంతాలు రెండు గంటల్లో, 0.23 శాతం ఉదంతాలు నాలుగు గంటల్లో అదుపులోకి రాగా.. 4.02 శాతం ఉదంతాల్లో మాత్రం అగ్నిమాపక శకటాలు నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు శ్రమించాల్సి వచ్చింది. గచ్చిబౌలి, చందానగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, తిరుమలగిరి మినహా మిగిలిన ప్రాంతాల్లోని ఫైర్ స్టేషన్లను ప్రాంతాలను బట్టి పునర్వ్యవస్థీకరించాలని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. వెరీ హైరిస్క్‌లో ఉన్న కీలక ప్రాంతాలు వెంకటేశ్వర కాలనీ, గాం«దీనగర్, రెడ్‌హిల్స్, హిమాయత్‌నగర్, భోలక్‌పూర్, ముషీరాబాద్, బౌద్ధనగర్, అడిక్‌మెట్, రామ్‌నగర్, కవాడిగూడ, బంజారాహిల్స్, ఖైరతాబాద్, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, మోండా మార్కెట్, బాలానగర్, సోమాజీగూడ, అమీర్‌పేట్, సనత్‌నగర్, ఫతేనగర్, వెంగళ్రావునగర్, బర్కత్‌పుర, నాంపల్లి, మెహదీపట్నం, మల్లేపల్లి, నానల్‌నగర్, విజయ్‌నగర్ కాలనీ, కంటోన్మెంట్. -
Pashamylaram: 43కి చేరిన ‘సిగాచి’ మరణాలు
సాక్షి, సంగారెడ్డి: పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి కంపెనీలో అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 43కి చేరింది. పటాన్ చెరువులోని ధృవ ఆస్పత్రిలో ఆరు రోజుల పాటు చికిత్స పొందుతూ ఇవాళ మరో కార్మికుడు జితేందర్ మృతి చెందాడు. పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగి దుర్ఘటనలో క్షతగాత్రులైన వారు ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు.తీవ్రగాయాలై ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో శుక్రవారం కార్మికుడు భీంరావు మృతి చెందగా, శనివారం మరో కార్మికుడు మున్‌మున్‌చౌదరి మృత్యువాత పడ్డారు. ఇవాళ(ఆదివారం) మరో కార్మికుడు మరణించాడు. ఇవాళ మరో మృతదేహాన్ని కూడా గుర్తించారు. ఆచూకీ లేని తొమ్మిది మందిలో ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఇంకా ఏడుగురి ఆచూకీ లభించడం లేదు. ఈ దుర్ఘటనలో మరణాల సంఖ్య 43కి చేరింది. ఆ రెండు మృతదేహాలు ఎవరివి? పటాన్చెరు ప్రభుత్వాస్పత్రిలో రెండు ఫుల్ డెడ్‌బాడీలు ఉన్నాయి. ఈ మృతదేహాలు ఎవరివనేది తేలడం లేదు. అవి ఆయా కుటుంబసభ్యుల డీఎన్ఏలతో సరిపోవడం లేదు. దీంతో ఆయా కుటుంబాల్లోని ఇతర సభ్యుల రక్తం శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన వారివి కాకుండా ఆ కుటుంబంలోని మరొకరి రక్తం శాంపిల్‌ను తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ నివేదికలు వచ్చాకే ఈ రెండు ఫుల్ డెడ్‌బాడీలను సంబంధిత కుటుంబాలకు అప్పగిస్తామని అధికారులు ప్రకటించారు. డీఎన్ఏ రిపోర్టులు వచ్చిన మూడు డెడ్‌బాడీలను శనివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శిథిలాల కింద మరిన్ని శరీరభాగాలు లభ్యంశనివారం శిథిలాల కింద మరిన్ని శరీరభాగాలు లభించాయి. ఎముకలు, చేతివేళ్లు, ఇతర శరీరభాగాలు లభించడంతో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇప్పటికే 15 శరీరభాగాలు మార్చురీలో ఉన్నాయి. వీటి డీఎన్ఏ రిపోర్టులు వచి్చ నా, అవి శాంపిల్స్ ఇచ్చిన వారి కుటుంబాలకు సరిపోవడం లేదు.కొనసాగుతున్న రెస్క్యూపేలుడు జరిగిన స్థలంలో ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా అధికారుల రెస్క్యూ ఆపరేషన్ ఆదివారం కూడా కొనసాగుతోంది. శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయ్యింది. కానీ పేలుడు తీవ్రతకు భూమిలోకి దంతాలు, ఎముకలు వంటి శరీరభాగాలు ఏమైనా చొచ్చుకుని పోయాయా? మరేదైనా ఆనవాళ్లు లభిస్తాయోనని ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులు పంట చేలో కలుపు తీసిన మాదిరిగా ఆనవాళ్ల కోసం చేతులతో తవ్వుతున్నారు. -
మాల్లో మంటలు.. లిఫ్ట్‌లో విద్యార్థి చిక్కుకుని..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో లిఫ్ట్‌లో చిక్కుకున్న ఒక విద్యార్థి దుర్మరణం చెందాడు. నాలుగు అంతస్తుల వాణిజ్య సముదాయ భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు అంతస్తుల వాణిజ్య భవనంలోని రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. తొలుత ఫ్యాబ్రిక్, కిరాణ దుకాణంలో మంటలు అంటుకున్నాయి. ఫలితంగా విద్యుత్ నిలిచిపోయి లిఫ్ట్ ఆగిపోయింది. ఆ లిఫ్ట్‌లో చిక్కకున్నవిద్యార్థి కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్(25) ప్రాణాలు కోల్పోయాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను చల్లార్చేందుకు పలు ఇబ్బందులు పడ్డారు. ఈ భవనంలో ఒకే ప్రవేశ మార్గం, ఒకే నిష్క్రమణ మార్గం ఉంది. వివిధ వస్తువుల స్టాక్‌తో మెట్ల మార్గం అంతా మూసుకుపోయింది.దీంతో పైఅంతస్తులకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దట్టమైన పొగ వెంటిలేషన్‌ను అడ్డుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు గోడను బద్దలు కొట్టవలసి వచ్చింది. మొత్తం పదమూడు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే పనిలో పాల్గొన్నాయి. ఈ అగ్నిప్రమాదానికి ప్రాథమిక కారణం షార్ట్ సర్క్యూట్ అనే అనుమాలున్నప్పటికీ, దర్యాప్తు తర్వాత అసలు కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన మరోసారి వాణిజ్య ప్రదేశాలలో పటిష్టమైన భద్రతా అవసరాలను గుర్తుచేస్తోంది. ఇది కూడా చదవండి: Jharkhand: కూలిన బొగ్గు గని.. ఒకరు మృతి.. పలువురు విలవిల -
తిరుపతిలో అగ్నిప్రమాదం
-
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో పరుగు తీసిన భక్తులు
సాక్షి, తిరుపతి: తిరుపతిలో భారీ అగ్నిప్రమాద ఘటన వెలుగుచూసింది. గోవిందరాజుస్వామి ఆలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న మంటలను చూసి భయంతో భక్తులు పరుగు తీశారు.వివరాల ప్రకారం.. తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజుస్వామి ఆలయం సమీపంలోని ఓ షాపులో మంటలు చెలరేగాయి. దీంతో, ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. భారీగా ఎగిసి పడుతున్న మంటలను చూసి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది.. అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా షాపులో ఉన్న ఇత్తడి సామాన్లు, బొమ్మలు దగ్దమయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
పేలింది డ్రయ్యర్ ఛాంబర్!
సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదానికి రియాక్టర్ పేలుడో, బాయిలర్ పేలుడో కారణం కాదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అక్కడ పేలింది స్ప్రే డ్రయ్యర్ బ్లాక్ అని చెబుతున్నారు. ఔషధ మాత్రల తయారీలో ప్రధాన ఔషధానికి సహాయకారిగా ఉపయోగించే మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్‌ను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, దీనివల్ల ఇంత భారీ పేలుడు సాధ్యం కాదని చెబుతున్నారు. రికార్డుల్లో చూపిస్తున్నదానికి భిన్నంగా మరేదైనా ఉత్పత్తి జరుగుతోందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూడంతస్తుల భవనం పిల్లర్లు కూడా కూలిపోయేలా విస్ఫోటనం జరగడానికి మరేదో బలమైన పేలుడు పదార్థం కారణం కావచ్చని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి తెలిపారు. దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగిన దాఖలాలు లేవని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇంత భారీస్థాయిలో పేలుడు జరగడం తమకు కూడా దిగ్భ్రాంతి కలిగిస్తోందని డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్ ఉన్నతాధికారులు అంటున్నారు. అసలు విషయంలో దర్యాప్తులోనే తేలుతుందని చెబుతున్నారు. మరోవైపు పేలుడులో కూలిపోయిన భవనంపై మూడు డ్రమ్ముల్లో ఏదో రసాయనాలు నిల్వచేశారని, ప్రమాదం తీవ్రత పెరగటానికి ఆ రసాయనాలే కారణం అయి ఉండవచ్చని అక్కడ పనిచేస్తున్న బిహార్‌కు చెందిన సమీర్ అహ్మద్ తెలిపాడు. -
Pashamylaram Incident: మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం
-
Pashamylaram Factory: ప్రమాదస్థలాన్ని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
-
ఉత్తరప్రదేశ్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం
-
వినుకొండలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలోని వినుకొండలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. చెత్త సేకరించే కంపెనీలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫైరింజన్లతో మంటలను అర్పుతున్నప్పటికీ ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మహాసముద్రంలో మంటలు.. వేలాది వాహనాల కార్గో షిప్ మునక
మెక్సికో సిటీ: నార్త్ అమెరికాలోని మెక్సికోకు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు పలు ఆటోమొబైల్స్‌ను తీసుకెళ్తున్న కార్గో షిప్ ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడం, అననుకూల వాతావరణం కారణంగా భూమి నుండి 415 మైళ్ల దూరంలో ‘మార్నింగ్ మిడాస్’ షిప్ మునిగిపోయింది.600 అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ కార్గో షిప్ జూన్ 3న అలాస్కా తీరానికి 300 మైళ్ల దూరంలో మంటల్లో చిక్కుకుంది. ఈ షిప్ మూడు వేల కొత్త వాహనాలను మెక్సికోకు డెలివరీ చేసేందుకు తరలివెళుతోంది. వాటిలో 800 ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి. ఆన్‌బోర్డ్‌లో మంటలు చెలరేగడంతో ప్రమాదం భారీగా జరిగిందని సమాచారం. లండన్‌కు చెందిన ‘జోడియాక్ మారిటైమ్’ తెలిపిన వివరాల ప్రకారం, అలాస్కాలోని అలూటియన్ దీవుల అంతర్జాతీయ జలాల్లో షిప్ మునిగిపోయింది.ఈ సంఘటన తర్వాత విపరీతమైన కాలుష్య ప్రభావం కనిపించలేదని యూఎస్ఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాలుష్య నియంత్రణ కోసం రెండు సాల్వేజ్ టగ్‌లను క్యారియర్ మునిగిపోయిన ప్రాంతంలో ఉంచినట్లు ఆయన తెలిపారు. అలాస్కా తీరానికి 300 మైళ్ల దూరంలో 600 కార్గో షిప్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నప్పుడు, ఆ షిప్‌లోని సిబ్బంది ఈ సమాచారాన్ని యూస్ కోస్ట్ గార్డ్‌కు అందించారు. వెంటనే స్పందించిన కోస్ట్ గార్డ్ ప్రమాద స్థలానికి చేరుకుని, 22 మందిని లైఫ్ బోట్లలో తరలించింది. క్యారియర్ సమీపంలోని ఒక మర్చంట్ మెరైన్ నౌక సహాయక చర్యల్లో పాల్గొంది.ఇది కూడా చదవండి: ‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్‌లు అప్పటికే.. -
ఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రిఠాలా మెట్రోస్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. ఢిల్లీలోని రిఠాలా మెట్రోస్టేషన్ సమీపంలో ఉన్న పాలిథీన్ ఫ్యాక్టరీలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి నుంచి మంటల చెలరేగుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 16 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.#WATCH | Delhi: 3 people died and three were injured after a fire broke out in a polythene factory near the Rithala metro station yesterday at around 7.30 pm, say Delhi police The search operation is still going on.(Morning visuals from the spot) pic.twitter.com/RmMXSE0nef— ANI (@ANI) June 25, 2025 -
గాల్లో ఉండగా మంటలు.. 8 మంది దుర్మరణం
బ్రెజిల్ గగనతలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు చెలరేగి ఎనిమిది మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. శాంటా కాటరినా రాష్ట్రం ప్రియాగ్రాండే నగరంలో శనివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. బెలూన్ గాల్లో ఉన్న సమయంలోనే మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అది నేలపై కూలిపోయింది. ఆ సమయంలో బెలూన్‌లో మొత్తం 22 మంది పర్యాటకులు ఉన్నారు. వాళ్లలో 13 మంది ప్రాణాలతో బయటపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.#Brazil: At least eight people have died following an accident involving a hot air balloon in the southern region of Santa Catarina.Governor Jorginho Mello said, rescue teams were searching for other people, as preliminary information indicated there were 22 people on board.… pic.twitter.com/usUJ3Mzfh0— All India Radio News (@airnewsalerts) June 21, 2025వారం కిందట సావో పాలో రాష్ట్రంలో కూడా ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. వారం వ్యవధిలో వరుస ఘటనల నేపథ్యంలో హాట్ ఎయిర్ బెలూన్ పర్యటనల భద్రతపై పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.🚨🇧🇷 BREAKING: A hot air balloon caught FIRE and CRASHED with 22 people on board in Santa Catarina, Brazil.🎥 Shocking footage shows one person jumping out to escape the flames mid-air.#Brazil #Balloon #SantaCatarina pic.twitter.com/fisGaJHjrd— Breaking News (@PlanetReportHQ) June 21, 2025 -
సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: తిరుపతి-సికింద్రాబాద్ సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ పెను ప్రమాదం తప్పింది. బోగి చక్రాల మధ్యలో మంటలు చెలరేగాయి. ధర్మవరం మండలం చిగిచెర్ల వద్ద ఘటన జరిగింది. సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ నిన్న రాత్రి (సోమవారం) తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరింది. రాత్రి సుమారు 8-30 గంటల సమయంలో రైలు శ్రీసత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం పరిధిలోని చిగిచెర్ల రైల్వేస్టేషన్ సమీపంలోకి చేరుకుంది. ఆ సమయంలో రైలు వెనుక భాగంలోని ఒక బోగీ చక్రాల వద్ద సడన్‌గా మంటలు చెలరేగాయి.బోగీ నుంచి మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. వారి అరుపులు విన్న రైలు వెనుక భాగంలో ఉన్న గార్డు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆయన లోకో పైలట్‌కు సమాచార అందించడంతో రైలును నిలిపివేశారు. అనంతరం సిబ్బంది బోగీ చక్రాల వద్ద మంటలను ఆర్పివేశారు.రైల్లో అధికారులు పూర్తి తనిఖీలు చేశారు. సుమారుగా అరగంట పాటు ఆగిన రైలు నిలిచిపోయింది. ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రేకులు వేయడంతోనే మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
దుబాయ్: 67 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం..
దుబాయ్: అరబ్ దేశం దుబాయ్‌లో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ‘టైగర్ టవర్’గా పేరొందిన 67 అంతస్తుల ‘మెరీనా పినాకిల్’ భవనంలో అర్ధరాత్రి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సహాయక బృందాలు.. 3,820 మంది నివాసితులను సురక్షితంగా బయటకు తరలించాయి. ఇక, ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు.వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ‘మెరీనా పినాకిల్’ భవనంలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దాదాపు 6 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో సహాయక బృందాలు 764 ఫ్లాట్ల నుంచి 3,820 మంది నివాసితులను సురక్షితంగా బయటకు తరలించాయి.A massive fire broke out at the 67-story Marina Pinnacle (also known as Tiger Tower) in Dubai Marina on June 13, 2025, starting around PM. Dubai Civil Defense teams evacuated 3,820 residents from 764 apartments, with no reported injuries or casualties. The fire, which began… pic.twitter.com/OOsWDHj6pu— EternalChaos (@EternalChaos158) June 14, 2025 ఇక, అగ్ని ప్రమాదం కారణంగా ప్రమాదస్థలిలో అంబులెన్సులు, వైద్యసిబ్బందిని మోహరించారు. ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు. మెరీనా పినాకిల్‌లో మంటలు చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. 2015లోనూ 47వ అంతస్తులో మంటలు చెలరేగి.. 48వ అంతస్తుకు వ్యాపించాయి. సహాయక సిబ్బంది మంటలార్పారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడయాలో వైరల్‌గా మారాయి. 🚨 BREAKING: Scenes from Dubai, As Projectile from Yemen hits a Marina Pinnacle Tower or Tiger Tower in Dubai Marina. This is a first inclident during the ongoing Iran Israel war in UAE pic.twitter.com/eVxPrJ6Wyu— True Pulse Global (@truepulseglobal) June 14, 2025 -
Tirumala: తిరుమల కొండల్లో అగ్ని ప్రమాదం
సాక్షి, తిరుపతి: తిరుమల శేషాచలం కొండల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శిలాతోరణం, శ్రీవారి పాదాలకు వెళ్లే అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నాం మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఫైరింజన్లకు సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది. కెమికల్ ల్యాబ్‌లో తప్పిన ప్రమాదంమరోవైపు జిల్లాలోని ఏర్పేడు మండలం ఐసర్ విద్యా సంస్థ కెమికల్ ల్యాబ్‌లో మంగళవారం మధ్యాహ్నాం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ల్యాబ్‌లో ఉన్న విద్యార్థులు బయటకు పరుగులు తీయగా.. సకాలంలో సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకుని మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. -
Delhi: అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ద్వారకలోని శబ్ద్ అపార్ట్మెంట్ పైఅంతస్తును అగ్నికీలలు చుట్టుముట్టాయి. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అపార్ట్మెంట్లోని తొమ్మిదవ అంతస్తు నుంచి ఇద్దరు చిన్నారులతో సహా వారి తండ్రి కిందకు దూకేసి, తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, కొద్దిసేపటి తరువాత వారి తండ్రి కూడా మృతిచెందాడని వైద్యులు తెలిపారు. అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. दिल्ली के द्वारका इलाके में एक अपार्टमेंट में लगी भीषण, द्वारका के सेक्टर 13 स्थित Shabd अपार्टमेंट की घटना, तीन लोग ऊपर से कूदे हैं, तीनों की हालत काफी गंभीर है। pic.twitter.com/Rjt3FteA8b— NBT Hindi News (@NavbharatTimes) June 10, 2025ఢిల్లీలో ప్రస్తుతం తీవ్రమైన తీవ్రమైన వేడి వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయ. ద్వారకలోని శబ్ధ్ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న దరమిలా స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. భవనం నుంచి ఇద్దరు చిన్నారులతో పాటు వారి తండ్రి కూడా దూకేశాడు. వారు తీవ్ర గాయాటలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అగ్ని ప్రమాదం సమయంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. అగ్నిమాపక దళానికి చెందిన సిబ్బంది అపార్ట్మెంట్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు శాయశక్తులా కృషిచేశారు.ఇది కూడా చదవండి: ‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్ -
కేరళ సమీపంలో నౌకలో అగ్నిప్రమాదం
కొచ్చి: సింగపూర్ జెండాతో శ్రీలంక నుంచి ముంబైకి బయల్దేరిన విదేశీ కంటైనర్ సరకు రవాణా నౌక కేరళ సమీప సముద్రజలాల్లో అగ్నిప్రమాదానికి గురైంది. 22 మంది సిబ్బంది ఉన్న ఈ నౌక నుంచి 18 మందిని భారత తీర గస్తీ బలగాలు కాపాడాయి. 270 మీటర్ల పొడవైన ఎంవీ వాన్ హాయ్503 పేరు గల ఈ నౌకలో నలుగురి జాడ గల్లంతయింది. కేరళలోని కన్నూర్ జిల్లాలోని అఝిక్కల్ పట్టణ తీరం నుంచి 44 నాటికల్ మైళ్ల దూరంలో సోమవారం ఉదయం 9.20 గంటలకు ఈ దుర్ఘటన సంభవించింది. విషయం తెల్సిన వెంటనే భారత గస్తీ బలగాలు రంగంలోకి దిగి 18 మంది సిబ్బందిని కాపాడాయి. నౌకలో ఎనిమిది మంది చైనా, ఆరుగు తైవాన్, ఐదుగురు మయన్మార్, ముగ్గురు ఇండోనేసియాకు చెందిన సిబ్బంది ఉండగా వారిలో 18 మందిని రక్షించగాలిగారు. వీరిని ఐఎన్ఎస్ సూరత్ నౌకలో మంగళూరు పోర్ట్‌కు తీసుకొచ్చారు. షెడ్యూల్ ప్రకారం నౌక జూన్10వ తేదీకల్లా ముంబైలోని నవాషేవా ప్రాంతానికి చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలోనే ప్రమాదానికి గురైంది. గత 30 రోజుల్లో కేరళ సమీపంలో సరకు రవాణానౌక ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి. మే 24న లైబీరియా జెండాతో వెళ్తున్న కార్గో నౌక తీరానికి 14.6 మైళ్లదూరంలో మునిగిపోయింది. -
3,000 కొత్త కార్లు సముద్రంపాలు!
యాంకరేజ్: ఏకంగా 3,000 కొత్త కార్లతో చైనా నుంచి మెక్సికోకు బయల్దేరిన భారీ సరుకు రవాణా నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు మరింతగా విస్తరిస్తుండటతో నౌకను సిబ్బంది నడిసంద్రంలో వదిలేయాల్సి వచ్చింది. లైఫ్‌బోట్ సాయంతో 22 మంది సిబ్బందిని రక్షించగలిగారు. లండన్ కేంద్రంగా పనిచేసే జోడియాక్ మేరిటైమ్ సంస్థ ఈ ‘ది మార్నింగ్ మిడాస్’నౌకను నిర్వహిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికాలోని అలాస్కా రాష్ట్ర పరిధిలోని అడాక్ దీవి సమీపంలో ఈ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు సమీపంలో ప్రయాణిస్తున్న కోస్కో హెలాస్ సరకు రవాణానౌకలోని సిబ్బంది అప్రమత్తమై మిడాస్ నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించారు. ఘటన జరిగినప్పుడు నౌకలో 800 కొత్త విద్యుత్ కార్లు సహా 3,000 కార్లు ఉన్నాయి. అగ్నికీలలను ఎలా అదుపులోకి తేవాలనే దానిపై జోడియాక్ సంస్థతో సంప్రతింపులు జరుపుతున్నామని అమెరికా తీరగస్తీ 17వ జిల్లా కమాండర్ రియర్ అడ్మిరల్ మెగాన్ డీన్ చెప్పారు. చైనాలో తయారైన ఈకార్లతో మే 26వ తేదీన నౌక బయల్దేరింది. మెక్సికోలోని లజారో కార్డెనాస్ నౌకాశ్రయానికి ఇది చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలో ఇలా అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. ఈ నౌకను 2006లో చైనాకు చెందిన నౌకాతయారీ సంస్థ తయారుచేసింది. ఈ నౌక బరువు ఏకంగా 46,800 టన్నులు. -
ఈశాన్యాన భగభగలు
ఈశాన్య భారతంలో పచ్చదనానికి మారుపేరైన అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్‌లో అటవీ విస్తీర్ణం శరవేగంగా తగ్గిపోతోంది. కార్చిచ్చులను సకాలంలో గుర్తించి అదుపు చేయకపోవడం, విచ్చలవిడి పోడు వ్యవసాయం, గంజాయి వంటివాటి అక్రమ సాగు, రోడ్లు, రైల్వే తదితర మౌలిక అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారీగా భూ సేకరణ తదితరాలు ఇందుకు కారణమని ప్రముఖ భూ పరిశీలన, విశ్లేషణ సంస్థ సుహోరా టెక్నాలజీస్ అధ్యయనం వెల్లడించింది. రెండు రాష్ట్రాలకు సంబంధించి గత నాలుగేళ్ల ఉపగ్రహ డేటాను లోతుగా విశ్లేíÙంచిన మీదట ప్రమాదకర అంశాలు వెలుగులోకి వచి్చనట్టు తెలిపింది. ముఖ్యంగా దట్టమైన అడవుల లోపలి, మారుమూల ప్రాంతాల్లో రేగే కార్చిచ్చులు పెను నష్టానికి కారణమవుతున్నాయి. అరుణాచల్‌లోని నందిపార్ ప్రాంతంలో గత ఏప్రిల్ 24న రేగిన భారీ కార్చిచ్చు భారీ నష్టం మిగిల్చింది. ఒక్క రోజులోనే ఏకంగా 10 వేల ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం బుగ్గిగా మారింది. ప్లానెట్స్కోప్ ఉపగ్రహ చిత్రాల సాయంతో జరిపిన విశ్లేషణ ద్వారా సుహోరా ఈ మేరకు వెల్లడించింది. ఇలాంటి కార్చిచ్చులను ఉపగ్రహ డేటా సాయంతో ఆదిలోనే గుర్తించి అదుపు చేయవచ్చని పేర్కొంది. ఇక జీవవైవిధ్యానికి మారుపేరైన మణిపూర్‌లో 2001 నుంచే అటవీ విస్తీర్ణంలో భారీ తగ్గుదల నమోదవుతూ వస్తోంది! రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 21,100 హెక్టార్ల అటవీ భూమి మాయమైనట్టు గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ పేర్కొంది. ఇందులో ఏకంగా 17,800 హెక్టార్ల అటవీ భూమిని ఒక్క 2024లోనే కోల్పోయిందని వెల్లడించింది. ఫలితంగా 91 కోట్ల మెట్రిక్ టన్నుల అదనపు కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలైనట్టు పేర్కొంది. కార్చిచ్చుకు తోడు పోడు, గంజాయి వంటివాటి అక్రమ సాగు, జనం వంట చెరుకుపై ఆధారపడుతుండటం, రోడ్లు, రైల్వే వంటి మౌలిక ప్రాజెక్టులు ఇందుకు కారణమని అధ్యయనం తేల్చింది. పచ్చదనపు తొడుగు లేకపోవడంలో కొన్నేళ్లుగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరగడమే గాక వర్షపాత ధోరణులు కూడా బాగా మారిపోయినట్టు వివరించింది. తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో ఈశాన్య భారతంలో పెను పర్యావరణ సంక్షోభం తప్పదని హెచ్చరించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సరిపడా నీళ్లు లేవు.. ఉన్న పైపులకూ రంధ్రాలు పరికరాల్లేకే ప్రాణనష్టం!
పంజగుట్ట (హైదరాబాద్): హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందడానికి.. అగి్నమాపక సిబ్బంది వద్ద సరైన పరికరాలు లేకపోవడం, ఫైర్ సిబ్బంది సరిగా స్పందించక పోవడమే కారణమని ఈ ఘోర ప్రమాదంలో తన తల్లిదండ్రులు, కుమార్తె, ఇతర కుటుంబసభ్యులను పోగొట్టుకున్న సంతోష్‌గుప్తా (భవన యజమాని ప్రహ్లాద్ మోదీ కుమార్తె) ఆరోపించారు. ‘ఫైర్ ఇంజన్లో సరిపడా నీళ్లు లేవు. పైపులకు రంధ్రాలు ఉండడంతో మన ఇంట్లో ట్యాప్‌లో ఎలా వస్తాయో అలా నీళ్లు బయటకు వస్తున్నాయి. ఆక్సిజన్ మాస్‌్కలు లేవు. సిబ్బంది వద్ద కనీసం టార్చ్‌లైట్ కూడా లేదు. తలుపులు, గోడలు పగలగొట్టేందుకు ఎలాంటి పరికరాలు లేవు.దీంతో బాధితులను కాపాడేందుకు వారు ప్రయత్నించలేదు. ఉదయం 6:45కు ఫైర్ ఇంజన్లతో వచి్చనా 8:04 వరకు ఏం చెయ్యలేకపోయారు. ఈ సమయంలో లోపల ఉన్నవారు దట్టమైన పొగ కారణంగా బయటకు రాలేక, ఆ పొగ పీల్చుకోవడంతో మృతి చెందారు..’అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 18వ తేదీ ఉదయం జరిగిన ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుని బయటకు వచి్చన ప్రహ్లాద్ మోదీ ఇద్దరు కుమార్తెల్లో ఈమె ఒకరు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తన కుమారుడు నితీష్, సమీప బంధువు అతుల్ అగర్వాల్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. నేను, నా సోదరి బయటికొచ్చాం..: ‘ఉదయం 5:55కు పొగ వాసన వస్తుండటంతో నిద్ర లేచా. కుటుంబ సభ్యులు కొందరిని అప్రమత్తం చేశా. పొగ ఎక్కడనుండి వస్తోందో చూసేందుకు నేను, నా సోదరి ఒకామె 6:05 సమయంలో కిందకు వెళ్లాం. నలుగురు పైకి వెళ్లారు. అప్పటికే మొదటి అంతస్తు నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయి. తర్వాత పెద్ద శబ్దంతో పాటు ఆవరణలో మంటలు వచ్చాయి. ఉదయం 6:12కు అగ్నిమాపక సిబ్బందికి (101కు) ఫోన్ చేశాం. 6:16కు 100కు ఫోన్ చేసి బాధితులు ఎక్కువగా ఉన్నారని కనీసం 10 అంబులెన్సులు పంపించాలని కోరాం. మమ్మల్ని టార్చిలైట్ తెమ్మన్నారు.. ఉదయం 6:45కు ఒక ఫైర్ ఇంజన్, ఒక అంబులెన్స్ వచి్చంది. ఫైర్ ఇంజన్ పైపులకు రంధ్రాలు ఉండడంతో ప్రెజర్ రావడం లేదు. ఫైర్ సిబ్బంది పైపులను సరిచెయ్యలేకపోయారు. వారి వద్ద కనీసం టార్చ్‌లైట్ కూడా లేదు. మమ్మల్ని టార్చ్ తెమ్మని అడిగారు. కొందరు స్థానికులు లోనికి వెళ్లేందుకు ప్రయతి్నంచారు కానీ సిబ్బంది మాత్రం సరైన సమయంలో లోనికి వెళ్లలేకపోయారు. అంబులెన్సులో సౌకర్యాలు లేవు.. నితీష్‌తో పాటు స్థానికులు కొంతమంది 8:04 సమయంలో ధైర్యంగా లోనికి వెళ్లి కొంతమందిని బయటకు తీసుకువచ్చా రు. కానీ అప్పటికే వారు బాగా పొగ పీల్చడంతో అప స్మారక స్థితిలోకి వెళ్లారు. ఇక అంబులెన్సుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్క అంబులెన్సులో ఆక్సిజన్ లేదు. బయటకు తీసుకువచి్చన బాధితులకు సిబ్బంది కనీసం సీపీఆర్ కూడా చెయ్యలేదు..’అని సంతోష్ గుప్తా ఆరోపించారు. కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. ‘అంబులెన్సు డ్రైవర్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళదాం అంటే ఒప్పుకోకుండా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడకు తీసుకువెళ్లిన ముగ్గురు అప్పటికి బతికే ఉన్నారు. కానీ ఉస్మానియా వైద్యులు ఎఫ్ఐఆర్ చూపించాలని, లేనిపక్షంలో పోలీస్ అధికారులు వచ్చి చెబితేనే చికిత్స చేస్తామని పట్టుబట్టి కూర్చున్నారు..’అని నితీష్ తెలిపారు. డాక్టర్ కాళ్లు పట్టుకున్నా తాను చికిత్స చెయ్యను అంటే చెయ్యను అన్నా రని చేసేది లేక 15 నిమిషాల తరువాత మలక్‌పేట యశోదా ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఈలోగా బతికి ఉన్నవారు కూడా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.కమిటీ మమ్మల్ని సంప్రదించలేదురాష్ట్రపతి, ప్రధాని, సీఎంకు లేఖలు ఘోర అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినా, సదరు కమిటీ ఏదీ ఇప్పటివరకు తమను సంప్రదించలేదని బాధితులు తెలిపారు. ఫైర్ సిబ్బంది వద్ద సరైన పరికరాలు ఉండి ఉంటే, సుమారు గంటన్నర సమయం వృధా చేసి ఉండకపోతే, సరైన సిబ్బంది ఉండి ఉంటే.. అన్ని ప్రాణాలు పోయేవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యావత్ ఉదంతంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఢిల్లీలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ విభాగానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి సైతం లేఖలు రాసినట్లు వెల్లడించారు. -
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో పేలిన ఏసీ కంప్రెసర్లు
సాక్షి, హైదరాబాద్: మధురానగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఏసీ కంప్రెసర్లు పేలిపోయాయి. G+5 బిల్డింగ్‌లో సెకండ్ ఫ్లోర్లో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి అగ్నిమాపక దళాలు చేరుకున్నాయి. మంటలను అదుపు చేస్తున్నారు.నగర వాసులను వరుస అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఈ నెలలోనే చార్మినార్ గుల్జార్‌హౌస్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. షార్ట్స్ సర్క్యూట్ జరిగిన ప్రమాదంలో మొత్తం 17మందిని ఆస్పత్రికి తరలించారు. ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు.అంతకుముందు పాతబస్తీలోలోని మహారాజ్‌గంజ్‌లోని స్క్రాప్ గోదాం(ప్లాస్టిక్ గోడౌన్)లో మంటలు ఎగిసిపడి మూడు అంతస్తులకు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్నవారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మొదటి అంతస్తులో డిస్పోజబుల్ ప్లేట్స్ గోడౌన్, రెండో అంతస్తులో యజమాని నివాసం ఉంటున్నారు. ఇక, మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న మరో కుటుంబం. ప్లాస్టిక్ సమాన్లు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. -
ఢిల్లీ షహదరాలో అగ్ని ప్రమాదం.. ఈ-రిక్షా ఛార్జింగ్ స్టేషన్లో మంటలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని షహదరాలో అగ్ని ప్రమాదం జరిగింది. మోతీ రామ్ రోడ్డులోని ఈ-రిక్షా ఛార్జింగ్ స్టేషన్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. సంఘటన స్థలం నుంచి రెండు కాలిపోయిన మృతదేహాలను వెలికితీసినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ వెల్లడించింది.కాగా గత ఆదివారం.. ఓల్డ్ రాజేందర్‌నగర్‌లోని బడాబజార్ రోడ్డులోని కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. -
కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌పై కుట్ర!
పారిస్: ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్న సమయంలోనే గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం నిర్వాహకులను ఆందోళనకు గురిచేసింది. దక్షిణ ఫ్రాన్స్‌లోని అల్పిస్–మారిటైమ్స్ ప్రాంతంలో శనివారం ఉదయం 1.60 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఇదే ప్రాంతంలో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతోంది. కరెంటు లేకపోవడంతో కొన్ని కార్యక్రమాలు రద్దు చేయాల్సి వచ్చింది. అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించడంతో ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం ఫిలిం ఫెస్టివల్ ముగింపు వేడుకలు యథాతథంగా జరిగాయి. కరెంటు సరఫరా హఠాత్తుగా ఆగిపోవడానికి కారణం ఏమిటన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం రాత్రి కాన్స్ సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీనివల్ల విద్యుత్ గ్రిడ్‌లో సమస్యలు తలెత్తాయి. హై–ఓల్టేజీ కరెంటు లైన్ ఒకటి కూలిపోయిందని విద్యుత్ శాఖ సిబ్బంది చెప్పారు. దీనివల్ల అల్పిస్–మారిటైమ్స్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. అయితే, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరగడం వెనుక కుట్ర ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు అంతరాయం కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈ కుట్ర జరిగినట్లు అంచనా వేస్తున్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం
-
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)లో శుక్రవారం వేకువ జామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్(SMS)-2 మిషన్‌లో షార్ట్ సర్క్యూట్‌తో హైడ్రాలిక్ ఆయిల్ లీక్ అయ్యి మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ టీం అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే నష్టం తాలుకా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. -
అగ్ని ప్రమాదంపై ఉన్నతాధికారుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: గుల్జార్ హౌస్ అగ్నిప్రమా దం ఘటనపై సమగ్ర విచారణ కోసం ఆరుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నెల 18న ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫైర్ విభాగం డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ , టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్లతో కూడిన కమిటీని నియమించినట్లు మంత్రి తెలిపారు. ఘటనకు గల కారణాలు, ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై సీఎంకు కమిటీ సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయి లో ప్రజలకు ఇవ్వాల్సిన సూచనలతో ప్రతిపాదనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం దాని ఆధారంగా సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులు సమీక్ష చేసి చర్యలు చేపడతారని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలన చార్మినార్: అగ్ని ప్రమాదం సంభవించిన భవనాన్ని మంగళవారం క్లూస్, ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలించింది. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత తొలిసారిగా భవనంలో ప్రవేశించిన అధికారుల బృందం.. భారీ స్థాయిలో అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలతో పాటు భవనంలోని ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసింది. భవనంలో దాదాపు 14 ఏసీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గాలి, వెలుతురు సక్రమంగా లేకుండా ఏసీలు పనిచేస్తుండడంతో అవి అధిక ఒత్తిడికి గురైనట్లు భావిస్తున్నారు. అధిక ఒత్తిడి కారణంగా ఏసీ కంప్రెషర్ ఏదైనా పేలిపోయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఫ్లోరింగ్ ధ్వంసం.. గోడలన్నీ బీటలు బయటకు వెళ్లేందుకు సొరంగం లాంటి ఇరుకు మెట్ల దారి ఉండడం వల్లే బాధితులు ప్రమాదం నుంచి బయట పడలేకపోయారని అధికారులు నిర్ధారించారు. తీవ్రమైన మంటలకు గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. గదుల గోడలన్నీ బీటలు వారాయి. షాబాద్ ఫ్లోరింగ్ పూర్తిగా ధ్వంసం అయింది. భవనం మొత్తం పనికిరాని విధంగా తయారయ్యింది. రాబోయే రోజుల్లో నివాసానికి పనికి రాదని ఫోరెన్సిక్ నిపుణుల బృందం నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలు 125 ఏళ్లకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నట్లు విచారణలో తేలింది. కాగా భవనం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. మృతులకు సంబంధించిన వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. -
నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. -
గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇదే.. తేల్చేసిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని విచారణ అధికారులు నిర్దారించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను వినియోగించడంతో ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుల్జార్‌హౌస్ ప్రమాదానికి గల కారణాల్ని వెల్లడించారు. అధికారుల తెలిపిన వివరాల మేరకు.. గుల్జార్‌హౌస్ ప్రమాదానికి కారణంగా ఏసీ కంప్రెషర్లే. ఏసీ కంప్రెషర్లు పేలి పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లకు మంటలు వ్యాపించాయి. ఫలితంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పలు ఏసీల్లో ప్రమాదం జరగడంతో దట్టంగా పొగకమ్ముకుంది. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లో దట్టంగా పొగకమ్ముకోవడంతో కుటుంసభ్యులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. టెర్రస్ నుంచి బయటకు రాలేక కిందకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా మెట్ల మార్గం వైపు రావడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో ప్రాణభయంతో లోపలే ఉండిపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చే సరికే అపస్మారస్థితిలోకి వెళ్లారు’ అని చెప్పారు. కాగా, గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. -
గుల్జార్‌హౌస్ ప్రమాదం.. అడుగడుగునా నిర్లక్ష్యమే
సాక్షి, హైదరాబాద్/చార్మినార్: హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ వద్ద ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న భవనం నిబంధనల ఉల్లంఘనకు నిలువెత్తు నిదర్శనంగా ఉంది. ‘మోదీ పెరల్స్, శ్రీకృష్ణ పెరల్స్’సహా మొత్తం తొమ్మిది దుకాణాలు, నివాస గృహాలతో కూడిన ఈ భవనంలో అడుగడుగునా ఫైర్ సేఫ్టీ నిబంధనలు అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎలాంటి ప్రమాద హెచ్చరిక వ్యవస్థలు లేకపోవటం వల్లనే నిప్పంటుకున్న విషయాన్ని అందులోనివారు సకాలంలో గుర్తించలేకపోయారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి నివాస గృహాలతో కూడిన మార్కెట్లు చాలా ఉన్నాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో వాటి పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. నిబంధనల ప్రకారం ఇలాంటి వాణిజ్య, నివాస సముదాయాల్లో ఉండాల్సిన వ్యవస్థలు, అగ్నిప్రమాదం (Fire Accident) జరిగిన భవనం వద్ద ఉన్న పరిస్థితి ఇదీ..అగ్నిప్రమాదం జరిగిన భవనంలోని కమర్షియల్ భాగం గ్రౌండ్ ప్లస్ వన్‌గా, రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ భాగం గ్రౌండ్ ప్లస్ టూ విధానంలో విడివిడిగా నిర్మితమైంది. మొత్తం భవన విస్తీర్ణంలో 1/3 వంతు ఖాళీ స్థలం ఉండాలి. కానీ, ఖాళీ స్థలం మాట అటుంచితే కనీసం రాకపోకలు సాగించడానికి అవసరమైన స్థాయిలో దారి, మెట్లు కూడా లేవు. భవనం చుట్టూ అగ్నిమాపక శకటాలు స్వేచ్ఛగా తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. కానీ, ముందు వైపు ఉన్న ప్రధాన రహదారి తప్ప మరెక్కడికీ ఫైర్ ఇంజిన్ కాదు కదా.. ద్విచక్ర వాహనం కూడా పోలేని విధంగా ఉంది.ప్రమాదం జరిగితే బయటపడానికి వెలుపలి వైపు కూడా మెట్లు ఉండాలి. ఈ భవనానికి ప్రధానంగా ఒకే ప్రవేశ, నిష్క్రమణ మార్గం ఉంది. మరొకటి ఉన్నప్పటికీ అది కేవలం ఒక అడుగు వెడల్పుతో ఉంది. ఇవి తప్ప మరో మార్గం లేదు. మంటలార్పేందుకు భవనంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉండాలి. ఈ భవనంలో కనీసం ఇసుక బక్కెట్లు కూడా లేవు. భవనంలో విద్యుత్ ఫైర్ అలారం, మాన్యువల్ ఫైర్ అలారం తప్పనిసరి. ఇక్కడ ఈ రెండూ కనిపించట్లేదు.ఇక్కడ అనుమతులు ఉండవు హైదరాబాద్‌లోని పాతబస్తీలో భవన నిర్మాణాల్లో చాలావరకు భద్రతా చర్యలు పాటించరనే అపవాదు ఉంది. 10–20 గజాల్లో అగ్గిపెట్టె లాంటి గృహ నిర్మాణాలు ఉంటాయి. జీహెచ్ఎంసీ (GHMC) టౌన్ ప్లానింగ్ అనుమతులు అసలే ఉండవు. అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్నిమాపక వాహనాలు పెళ్లేందుకు దారులు కూడా సక్రమంగా ఉండవు. దీంతో శకటాలను ప్రధాన రోడ్లపైనే దూరంగా నిలిపి సందుల్లోకి పైపులతో నీటిని తరలించాల్సి వస్తోంది. 10–20 గజాల్లో ఐదారు అంతస్తుల వరకు భవనాలను నిర్మించటంతోపాటు.. ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లార్లను సైతం నిర్మించి వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు.గుల్జార్ హౌస్, పటేల్ మార్కెట్, ఘాన్సీ బజార్, కోకర్ వాడి, మీరాలం మండి, పురానీ హవేలి, కోట్లాఅలీజా, రైన్ బజార్, డబీర్ పురా, తలాబ్ కట్ట, భవానీనగర్, గంగానగర్, యశ్రబ్ నగర్, నర్కీపూర్బాగ్, సుల్తాన్ షాహి, అల్ జుబేర్ కాలనీ, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బహదూర్‌పురా, కోకాకి తట్టి, దూద్ బౌలి, పురానాపూల్ (Puranapool) తదితర ప్రాంతాల్లో ప్రధాన రోడ్ల వరకే అగ్నిమాపక యంత్రాలు వెళ్లడానికి వీలుంటోంది. దీంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది.భవనం పటిష్టతను పరీక్షించాలన్న ఎంపీ అసద్సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గుల్జార్ హౌస్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన భవనాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కార ణాలు, ఇతర వివరాలు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డిని అడిగి తెలుసు కున్నారు. ఆ భవనం నివాస యోగ్యమా, కాదా? అంటూ ప్రశ్నించారు. భవనం పటిష్టతను పరీక్షించాలని సూచించారు. ఆ కుటుంబీకులు ఎవరైనా మళ్లీ అదే భవనంలో ఉండటానికి ప్రయత్నిస్తే, జరగరానిది జరిగితే భారీ ప్రాణనష్టం సంభవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని నాగిరెడ్డి చెప్పారు. చదవండి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్లకు కారణాలు ఇవే.. ఇలా చేస్తే సేఫ్.. -
అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..
అసలే వేసవి కాలం.. భానుడి భగభగలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే సాధారణంగా అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్లు జరుగుతుంటాయి. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని 'గుల్జార్‌హౌస్'లో జరిగిన అగ్ని ప్రమాదంలో.. ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సంబంధీకుల ప్రాణనష్టాన్ని ఎలాగో పూడ్చలేరు. కానీ ఆస్తి నష్టాన్ని ముందుగానే తీసుకున్న ఇన్సూరెన్స్ ద్వారా కొంత భర్తీ చేయవచ్చు. ఇలాంటి సందర్భంలో బీమా ఎలా క్లెయిమ్ చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఎలాబీమా కంపెనీకి సమాచారం అందించాలి: అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మీ బీమా ప్రొవైడర్‌కు సమాచారం ఇవ్వండి. అవసరమైతే, అత్యవసర ఖర్చుల కోసం ముందస్తు ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించండి. సంఘటన జరిగిన తేదీ, సమయం, స్థలం వంటి ముఖ్యమైన వివరాలను అందించడంతో పాటు.. ఎంత నష్టం జరిగిందో అంచనా వేయండి.నష్టాన్ని డాక్యుమెంట్ చేయండి: అగ్నిప్రమాదం జరిగిన తరువాత.. స్థలాన్ని శుభ్రపరచడానికి ముందు.. అక్కడ పరిసరాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయండి. కాలిన వస్తువులను పారవేయకూడదు. భీమా కంపెనీ స్పందించడానికి ముందే.. రిపేర్ చేయడం వంటి చేయకూడదు.క్లెయిమ్ ఫైల్ చేయండి: ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారాన్ని ఆన్లైన్లో లేదా బీమా కంపెనీ కార్యాలయంలో సబ్మిట్ చేయండి. మీ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ, నష్టాన్ని తెలియజేసే ఫోటోలు & వీడియోలు, పాడైపోయిన వస్తువుల జాబితా.. వాటి విలువను తెలిపే రసీదులు లేదా ఇన్వాయిస్లు, ఫైర్ బ్రిగేడ్ నివేదిక వంటి అవసరమైన డాక్యుమెంట్స్ అందించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?సర్వేయర్‌తో సహకరించండి: ఇన్సూరెన్స్ కంపెనీ నష్టాన్ని అంచనా వేయడానికి ఒక సర్వేయర్‌ను నియమిస్తుంది. సర్వేయర్‌కు పూర్తిగా సహకరించండి. వారికి అవసరమైన సమాచారం & పత్రాలను అందించండి. నష్టపోయిన ఆస్తిని పరిశీలించడానికి వారికి అనుమతి ఇవ్వండి.క్లెయిమ్ సెటిల్మెంట్: మీ క్లెయిమ్ ఆమోదం పొందిన తరువాత.. పాలసీ నిబంధనల ప్రకారం నష్టపరిహారం కంపెనీ చెల్లిస్తుంది. అయితే చెల్లింపు విధానం గురించి సంస్థ మీకు తెలియజేస్తుంది.Note: ఈ దశలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. మీ నిర్దిష్ట పాలసీ, ఇన్సూరెన్స్ కంపెనీ విధానాలు కొద్దిగా మారవచ్చు. కాబట్టి, మీ పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను సంప్రదించండి. -
అందాల పోటీల మీదనే కాదు.. ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టాలి: కేటీఆర్
-
గుల్జార్ హౌస్ లో అసలేం జరిగింది?
-
‘అందాల పోటీల మీదే కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టండి’
సాక్షి,హైదరాబాద్: అందాల పోటీల మీదే కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి హితువు పలికారు. ఆదివారం ఉదయం చోటు చేసుకున్న పాతబస్తీ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు.అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..‘అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూడండి. రాజకీయంగా మాట్లాడడానికి రాలేదు. ప్రభుత్వాలు ప్రజలకు ప్రాణాలు కాపాడాలి. రూ.5 లక్షల పరిహారం ఇవ్వడం కాదు ప్రాణాలపై దృష్టి పెట్టాలి. రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.ముఖ్యమంత్రే హోమ్ మినిస్టర్‌గా ఉన్నారు కాబట్టి ఘటన స్థలానికి వచ్చి ఉంటే అధికారులు ఇంకా బాగా పనిచేసేవారు.సమ్మర్ వచ్చే ముందు అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. ఫైర్ ఇంజన్లు వచ్చాయి కానీ వాటర్ లేవు. సిబ్బందికి సరైన మాస్కులు లేవు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్లు లేకపోవడం దురదృష్టకరం.హైదరాబాదులో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం.నిన్నటి రోజు దుర్భరమైన రోజుగా ప్రమాద ఘటనపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని’ అన్నారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్లకు కారణాలు ఇవే..
నిర్దేశిత లోడు కంటే ఎక్కువ కరెంట్‌ను వినియోగించడం.. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంతర్గత కేబుళ్లను ఇప్పటికీ మార్చక పోవడం.. కేబుల్ సామర్థ్యానికి మించి ఎలక్ట్రికల్ పరికరాలు వాడటం.. వైర్ల మధ్య జాయింట్లు ఎక్కువగా ఉండటం.. సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్య తలెత్తుతుండటం.. ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, గీజర్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, ఒవెన్లు, ఐరన్ బాక్సులు, కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు, లైట్లు రోజంతా ఆన్‌లోనే ఉంచడం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు సంభవించడానికి ఇవే కారణాలు. వీటివల్లనే కేబుళ్లు హీటెక్కి, మీటర్, జాయింట్ల వద్ద నిప్పు రవ్వలు (స్పార్క్‌లు) చెలరేగుతున్నాయి. ఇలా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల ఫలితంగా మాల్స్, దుకాణాలు, ఇళ్లలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్దయెత్తున ఆస్తి నష్టం జరుగుతోంది. కొన్ని ఘటనల్లో అగ్నికీలల్లో చిక్కు కోవడం, పొగతో ఊపిరాడకపోవడం లాంటి కారణాలతో పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. హైదరాబాద్‌లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు లైన్లు, వైర్లు, ప్లగ్ లు, ఎంసీబీలు, ఎర్త్రాడ్ల పని తీరును పరిశీలించి, దెబ్బతిన్న కేబుళ్లను గుర్తించి, వాటి స్థానంలో కొత్తవి అమర్చుకోవాల్సి ఉన్నా వాణిజ్య, గృహ వినియోగదా రులు పట్టించుకోవడం లేదు. పాతబస్తీలోని పురాతన భవనాల్లోనే కాకుండా, కొత్తగా సీఈఐజీ అనుమతి పొందిన హైరైజ్ భవనాల్లోనూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు (Short Circuit) జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాతబస్తీ అయినా.. కొత్త హైరైజ్లైనాపాతబస్తీలో ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్లోనే కాదు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నార్సింగి, మణికొండ, నానక్రాంగూడల్లో కొత్తగా నిర్మించే హైరైజ్ బిల్డింగ్స్‌లోనూ విద్యుత్ లైన్లు సరిగా ఉండటం లేదు. భవిష్యత్తు అవసరాల మేరకు లోడు ఎంపిక మొదలు..లైన్ల ఏర్పాటు వరకు అన్నీ లోపభూయిష్టంగానే ఉంటున్నాయి. భవన నిర్మాణ సమయంలో ఉన్న ఆలోచనకు, అవసరాలకు భిన్నంగా ఆ తర్వాత ఇంట్లోకి అనేక విద్యుత్ పరికరాలు వచ్చి చేరుతున్నాయి. వాణిజ్య భవనాల్లో తక్కువ సామర్థ్యంతో లైన్లు, కేబుళ్లు వేయడం జరుగుతోంది. నిర్మాణ ఖర్చులు తగ్గించుకునే క్రమంలో కనీస అనుభవం, అర్హత లేని ప్రైవేటు విద్యుత్ కాంట్రాక్టర్లతో విద్యుత్ పనులు చేయిస్తున్నారు. వీరు భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం తాత్కాలిక అవసరం కోసం లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. నాసిరకం కేబుళ్లు, ఏబీ స్విచ్‌లు, ఎంసీబీలు వాడుతున్నారు. కంటికి కన్పించే ప్లగ్‌లు, స్విచ్ బోర్డులు, లైట్లు మినహా గోడలు, స్లాబులో వాడే వైర్లు నాసిరకంగా ఉంటున్నాయి. సరైన ఎర్తింగ్ ఉండటం లేదు. మరోవైపు ఒకే ప్లగ్/ వైరు నుంచి మల్టిపుల్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఒకే సాకెట్ నుంచి ఒకటికి మించిన ఏసీ కనెక్షన్లు ఉంటున్నాయి. ఇలా సామర్థ్యానికి మించి ఏసీలు, వాషింగ్ మెషీన్లు, గీజర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు విద్యుత్ ఎక్కువగా వినియోగించడం వల్ల బలహీనంగా ఉన్న కేబుళ్లు తట్టుకోలేకపోతున్నాయి. కేబుళ్ల జాయింట్ల వద్ద స్పార్క్‌లు చెలరేగుతున్నాయి.పేలుతున్న ఏసీ కంప్రెషర్లుఒకప్పుడు ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కన్పించే ఏసీలు, కూలర్లు, వాషింగ్ మెషీన్లు, గీజర్లు.. ప్రస్తుతం సాధారణ మధ్య తరగతి ప్రజల ఇళ్లలోనూ దర్శనమిస్తున్నాయి. మారుతున్న జీవనశైలి ఇందుకు దోహదపడుతోంది. ప్రతిఒక్కరూ సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు తగినట్టుగా తయారీ కంపెనీలతో పాటు పలు బ్యాంకులు జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నాయి. వాయిదా పద్ధతుల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో సాధారణ ప్రజలు కూడా విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని చాలాచోట్ల 60 నుంచి 100 గజాల స్థలంలోనూ ఐదారు అంతస్తుల్లో భవనాలు నిర్మిస్తున్నారు. కొందరు కింద షాపులను ఏర్పాటు చేసి, పైన నివాసానికి వీలుగా చిన్న చిన్న గదులను నిర్మిస్తున్నారు. నివాసితులు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఏసీలూ వినియోగిస్తున్నారు. ఒక ఇంట్లోనే రెండు, మూడు ఏసీలు ఉంటున్నాయి. అయితే ఇరుకు గదుల్లో గాలి, వెలుతురు కూడా సరిగా ఉండటం లేదు. వైరింగ్ సరిగా లేకపోవడం, సామర్థ్యానికి మించి కరెంటు వాడటం, మండే ఎండల్లో రోజంతా ఏసీలు ఆన్‌లో ఉంటుండటం వల్ల కంప్రెషర్లు పేలిపోతున్నాయి.బయటకు రాలేక, మంటల్లో చిక్కుకుని..కిటికీ, డోర్ కర్టెన్లు, పరుపులు, దుస్తువులకు నిప్పు అంటుకుని వేగంగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఆ సమయంలో బయటికి వెళ్లేందుకు ఇరుకైన దారి ఉండటం, తలుపులకు తాళాలు వేసి ఉండటం, ఇతరత్రా కారణాలతో బయటకు వెళ్లలేక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. మొన్న అఫ్జల్‌గంజ్‌లోని మూడంతస్తుల భవనం, తాజాగా చార్మినార్ (Charminar) సమీపంలోని గుల్జార్‌హౌస్, మైలార్‌దేవ్‌పల్లిలో జరిగిన అగ్ని ప్రమాదాలకు ఇలాంటి పరిస్థితులే కారణమని స్పష్టమవుతోంది.ఇలా చేస్తే సేఫ్...⇒ బీఐఎస్ ప్రమాణాలతో తయారు చేసిన ఎలక్ట్రిక్ ఉపకరణాలనే భవనాల్లో ఉపయోగించాలి. ⇒ విద్యుత్ మరమ్మతులు క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్‌తో మాత్రమే చేయించాలి. ⇒ అతుకుల తీగలు, లూజ్ వైరింగ్ ప్రమాదకరం. ⇒ విద్యుత్ ద్వారా నడిచే రిఫ్రిజిరేటర్, ఓవెన్లను గాలి, వెలుతురు బాగా వచ్చే చోట ఉంచాలి. ⇒ అధిక ఓల్టేజీ ఉన్న ఉపకరణాలకు ఎర్తింగ్ ఉన్న 3 పిన్ సాకెట్లను వాడాలి. ⇒ ల్యాప్‌టాప్, మొబైల్ చార్జింగ్ (Mobile Charging) బెడ్ దగ్గర పెట్టకూడదు. ⇒ విద్యుత్ పరికరాలకు నిప్పు అంటుకుంటే నీళ్లతో ఆర్పవద్దు. దీని వల్ల కరెంట్ షాక్ తగిలి ప్రాణాపాయం కలగొచ్చు. ⇒ వెంటనే విద్యుత్‌ను ఆఫ్‌చేసి, పొడి ఇసుకతో లేదా కార్బన్ డయాక్సైడ్ ఎక్ట్సింగ్విషర్తో మంటలను ఆర్పాలి.చదవండి: పాతబస్తీ ప్రమాదంలో విస్తుపొయే విషయాలు.. అక్రమ కనెక్షనే కారణమా?⇒ ఎత్తయిన భవన నిర్మాణాలకు స్థానిక అగ్నిమాపకశాఖ అధికారి నుంచి అనుమతి తప్పనిసరి. హైడ్రెంట్లు, ఫైర్ ఎగ్జిట్లు, స్ప్రింక్లర్లు, పంప్ రూమ్ వంటివి ఏర్పాటు చేయాలి. ⇒ ప్రతి అంతస్తులో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతపై సైన్ బోర్డులు ప్రదర్శించాలి. స్మోక్ అలారం (Smoke Alarm) ఏర్పాటు చేయడంతోపాటు ఏటా భద్రతా తనిఖీలు నిర్వహించాలి. ⇒ ప్రతి అంతస్తులో ఫైర్ ఎక్ట్సింగ్విషర్లు ఉండాలి. మూడు నెలలకోసారి ఫైర్ డ్రిల్స్ నిర్వహించాలి. ⇒ అగ్నిప్రమాదాలు జరిగితే కంగారుపడకుండా ఫైర్ అలారం మోగించి అప్రమత్తం చేయాలి. లిఫ్టులకు బదులు మెట్ల మార్గాన్ని వినియోగించాలి. ⇒ మంటలు ఎక్కువగా ఉన్న సమయంలో నడవకుండా ముఖానికి గుడ్డ కప్పుకొని, పాకుతూ అక్కడి నుంచి బయటికి రావాలి. ⇒ మంటల్లో చిక్కుకుంటే బిగ్గరగా అరుస్తూ, చేతి రుమాలును కిటికీ లేదా బాల్కనీ నుంచి ఊపుతూ బయట ఉన్న వాళ్లకు సమాచారం ఇవ్వాలి. -
పాతబస్తీ ప్రమాదంపై విస్తుపోయే విషయాలు.. అక్రమ కనెక్షన్ కారణమా?
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం వెనుక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అగ్నిప్రమాదం వెనక అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ కరెంట్‌పై పోలీసులు, ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం కారణంగా 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ కరెంట్ కనెక్షన్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు, ఫైర్ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.నగల దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్ నుంచి.. కొక్కేల ద్వారా స్థానికులు కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు. ఈ అక్రమ కరెంట్‌తో బాధిత కుటుంబం కరెంట్ మీటర్‌పై లోడ్ పడింది. ఆ కరెంట్ లోడ్‌తో బాధిత కుటుంబం మీటర్ బాక్స్‌లో మంటలు చెలరేగాయి. మీటర్ బాక్స్ పక్కన ఉన్న ఉడెన్ షోకేజ్‌కు మంటలు అంటుకున్నాయి. ఉడెన్ షోకేజ్ నుంచి ఏసీ కంప్రెషర్‌ను మంటలు తాకాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ కరెంట్‌పై పోలీసులు, ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా. గుల్జార్‌హౌజ్ అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులున్నారు. అపస్మారకస్థితికి చేరిన నలుగురు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ పెనువిషాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, డీజీపీ జితేందర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్రం రూ.2 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాయి. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశించారు. -
Charminar Gulzar House: ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి
-
పాతబస్తీలో అంతులేని విషాదం
ఆదమరచి నిద్రపోయిన ఆ కుటుంబ సభ్యులకు అదే శాశ్వత నిద్ర అని తెలియలేదు. రోజు మాదిరిగానే నిద్రపోయినా...రోజు మాదిరిగా నిద్ర లేవలేదు. ఎగసిన అగ్నికీలలు.. ఉక్కిరి బిక్కిరి చేసిన పొగతో నిద్ర నుంచి మేల్కొన్నా.. ఏం జరిగిందో తెలియక.. ఎటు వెళ్లాలో అర్థంకాక.. అంటుకున్న మంటలతో కాలిన గాయాలై కొందరు, దట్టమైన పొగతో ఊపిరాడక మరికొందరు మృత్యు ఒడికి చేరిపోయారు. ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్ సమీపంలోని ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది చిన్నారులు సహా 17 మంది మృతిచెందడం పాతబస్తీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మంటల కంటే పొగపీల్చి ఎక్కువ మంది కన్నుమూశారు.విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబాలకు కుటుంబాలే అగ్నికి ఆహుతి అవడం వారిని తీవ్రంగా కలచివేసింది. ఒక అగ్నిప్రమాదంలో ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం నగర చరిత్రలోనే మొదటిసారని తెలిసి.. ‘అయ్యో ఇలా జరిగిందేంటి’ అనుకుంటూ స్థానికులంతా సానుభూతి వ్యక్తం చేశారు. మృతదేహాలను తరలిస్తున్న హృదయ విదారక దృశ్యాలు చూసి కన్నీరుపెట్టారు. రద్దీ పెరిగితే.. ముప్పు పెరిగేది! సాక్షి, సిటీబ్యూరో: దివాన్ దేవిడీలోని మదీనా అండ్ అబ్బాస్ టవర్స్... దిల్‌సుఖ్‌నగర్‌లోని చందనా బ్రదర్స్... కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్... బషీర్‌బాగ్‌లోని మొఘల్ కోర్ట్‌లో ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ... నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా... పంజాగుట్టలోని మీనా జ్యువెలర్స్... ఇలా నగరంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదాలన్నీ రాత్రి వేళల్లో చోటు చేసుకున్నాయి. ఫలితంగా అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి మంటలను అదుపు చేయగలిగాయి. పాతబస్తీలో ఆదివారం నాటి ‘మోదీ ఇంట్లో’ ఉదంతం కూడా తెల్లవారుజామున జరిగింది. మరికొంత ఆలస్యంగా జరిగి ఉంటే చార్మినార్‌తో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలు జనసమర్థంగా మారేవి. రోడ్లన్నీ వాహనాలతో నిండేవి. ఒకవేళ రోడ్లు రద్దీగా ఉండే పగటి వేళ ఇలాంటి ప్రమాదాలు జరిగితే... నష్టం అపారంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో ఉండే రోడ్లు, నిర్మాణాలు, ట్రాఫిక్ నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన విధంగా ఫైర్ స్టేషన్లు, ఫైర్ ఇంజన్లు లేకపోవడమే దీనికి కారణం. ఈ అంశంలో 2016 నాటి ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ సిఫార్సులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. నిబంధనలు... వాస్తవాలు... 1. నిబంధనల ప్రకారం నగరంలో ప్రతి 5 చదరపు కిమీలకు ఒక అగ్నిమాపక శకటం అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం 15 నుంచి 20 చదరపు కిమీకి ఒకటి చొప్పున అందుబాటులో ఉన్నాయి. ప్రతి 50 వేల మంది రక్షణకు ఓ అగ్నిమాపకశకటం అవసరం. ఈ రకంగా చూస్తే గ్రేటర్లో కనీసం 250 ఫైర్ ఇంజన్లు అవసరం. ఇప్పుడు ఇందులో కనీసం సగం కూడా అందుబాటులో లేవు. అగ్నిమాపక శకటం గంటకు 100 కిమీ వేగంతో ప్రయాణించగలగాలి. ఇటీవల విడుదలైన టామ్ టామ్ నివేదిక ప్రకారం చూసినా ప్రస్తుతం నగరంలో వాహనాల సరాసరి వేగం 20 నుంచి 25 కిమీ మించట్లేదు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు గరిష్టంగా 15 నిమిషాల్లో అగ్నిమాపక శకటం అక్కడకు చేరాలి. అయితే ప్రస్తుతం నగర రోడ్ల పరిస్థితిని బట్టి రద్దీ వేళల్లో ఏ వాహనమైనా ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లాలంటే కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది. బహుళ అంతస్తు భవనాల్లో మంటల్ని ఆర్పడానికి ఉపకరించే హైడ్రాలిక్ ఫైరింజన్ కేవలం సికింద్రాబాద్‌లోనే ఉంది. వీటికి తోడు అగ్నిమాపక శాకలో ఉండాల్సిన మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది సంఖ్యతో ఇబ్బంది ఉండనే ఉన్నాయి. 2016లో పార్లమెంట్ అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. దీని అధ్యయనం ప్రకారం పరిధిని బట్టి కాకుండా సమాచారం తెలిసిన తర్వాత ఘటనాస్థలికి చేరడానికి పట్టే సమయం (రెస్పాన్స్ టైమ్) ఆధారంగా ఫైర్ స్టేషన్లు ఉండాలని సిఫార్సు చేసింది. ఈ రెస్పాన్స్ టైమ్ నగరాలు, పట్టణాల్లో ఐదు నుంచి ఏడు నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 20 నిమిషాలుగా నిర్ధారించింది. ఈ స్థాయిలో ఫైర్స్టేషన్ల ఏర్పాటు కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని, రాష్ట్రాలకు అవసరమైన నిధులు కేటాయించాలని సిఫార్సు చేసింది. ఇవన్నీ ఇప్పటికీ ఫైళ్లకే పరిమితమయ్యాయి.పేరులోనే ఫైర్! సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర అగ్నిమాపక సేవల చట్టం కోరల్లేని పాములాగా తయారైంది. తరచుగా భారీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ఉల్లంఘనదారుల్లో భయం కనిపించడంలేదు. ఈ చట్టం కింద అభియోగాలు నమోదు చేసే ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. ఒకవేళ నేరం రుజువైనా పెద్దగా శిక్షలు లేకపోవడం, నామమాత్రపు జరిమానాలే ఉండటం ఇందుకు కారణం. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏపీ ఫైర్ సరీ్వసెస్ యాక్ట్. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టమే ఇప్పటికీ వినియోగంలో ఉండటమే ప్రధాన కారణం. పోలీసులు ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే తప్ప నిందితులను అరెస్టు చేసే అవకాశం లేకపోవడంతో అగ్ని మాపక సేవల చట్టం నామమాత్రంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అగి్నమాపక శాఖ ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ ఉల్లంఘనలు గుర్తించినా నేరుగా చర్యలు తీసుకునే అవకాశం లేకుండాపోయింది. పలు మార్లు నోటీసులు జారీ చేసి.. గడువిచ్చాక డీజీ అనుమతి మేరకు విచారణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కేసు నమోదు చేసి నివేదికను న్యాయస్థానంలో సమరి్పస్తారు. ఏళ్ల తరబడి విచారణ జరిగిన తర్వాత చాలా కేసులు సరైన ఆధారాల్లేక వీగిపోతుంటాయి. ఒకవేళ కేసు రుజువైనా అగ్నిమాపక సేవల చ ట్టం ప్రకారం పడే జరిమానా రూ.వేలల్లోనే ఉంటుంది. శిక్షలు తక్కువే.. ఏదైనా నేరానికి సంబంధించి పోలీసు విభాగం ఐపీసీ కింద కేసు నమోదు చేస్తుంటుంది. నేరం, నేరగాడి తీరుతెన్నుల్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుంది. ఆపై జైలు, బెయిలు, కోర్టులో కేసు విచారణ తదితరాలు ఉంటాయి. అదే ఫైర్ సరీ్వసెస్ యాక్ట్ వద్దకు వచ్చేసరికి ఆ చట్టం, అగి్నమాపక శాఖకు ఉన్న అధికారాలు వేరు. వీళ్లు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మినహా అరెస్టుకు ఆస్కారం లేదు.ఈ కేసు కోర్టు వరకు వెళ్లినా సాధారణ కేసుల్లా విచారణ ఉండదు. అది ఎందరి ప్రాణాలు తీసిన ఉదంతం, ఎంత తీవ్రమైన ఉల్లంఘన అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ కేసుల విచారణ సివిల్ కోర్టుల్లో సమరీ ట్రయల్ విధానంలో జరుగుతుంది. ఈ చట్టంలోని అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 90 శాతం ఉల్లం ఘనలకు జరిమానా మాత్రమే విధించే ఆస్కారం ఉంది. మిగిలిన వాటిలోనూ గరిష్ట శిక్ష కేవలం 3 నెలలు మాత్రమే. ఈ సెక్షన్లకు సంబంధించిన ఉల్లంఘనల్లోనూ పెనాల్టీ విధించే ఆస్కారం ఉంది. కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు లేకపోవడంతో ఉల్లంఘనదారుల్లో భయం లేదని అభిప్రాయం వెల్లడవుతుంది.ఏళ్లుగా నిరీక్షణ.. తెలంగాణ అగ్నిమాపక శాఖ 2020 జూన్‌లో అగ్ని మాపక చట్టానికి పలు సవరణలు సూచిస్తూ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించింది. భారీ జరిమానాలు, జప్తు చేయడం తదితర కఠిన నిబంధనలు ఇందులో చేర్చారు. వీటికి ఆమోదం లభిస్తే ఢిల్లీ తర్వాత దేశంలోనే బలమైన చట్టం గల రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అగ్నిమాపక శాఖ నమోదు చేసిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌కు సంబంధించినవే ఉన్నాయి. గత దశాబ్ధ కాలలో నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. ఆకాశహార్మ్యాలు, వాణిజ్య భవనాలు కోకొల్లలుగా వెలిశాయి. ఈ స్థాయిలో అగ్నిమాపక శాఖ కూడా అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక యంత్రాలు, రోబోలతో పాటు చట్ట సేవరణ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అగ్నిమాపక శాఖ 2020 జూన్‌లో అగ్నిమాపక చట్టానికి పలు సవరణలు సూచిస్తూ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించింది. భారీ జరిమానాలు, జప్తు చేయడం తదితర కఠిన నిబంధనలు ఇందులో చేర్చారు. వీటికి ఆమోదం లభిస్తే ఢిల్లీ తర్వాత దేశంలోనే బలమైన చట్టం గల రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. -
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..
రాజేంద్రనగర్/మణికొండ/బంజారాహిల్స్: ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన 17 మందిలో 10 మృతదేహాలకు ఆదివారం సాయంత్రం ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ పెద్ద ప్రహ్లాద్ మోదీ, ఆయన భార్య మున్నీ, కుమారుడు పంకజ్, కోడలు వర్ష, తమ్ముడు రాజేందర్ మోదీ, మరదలు సుమిత్ర, తమ్ముని కుమారుడు అభిషేక్, మనుమలు, మనమరాళ్లు అనుయాన్, ఇదిక, ఐరాజ్‌ల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం పురానాపూల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదంలో బంజారాహిల్స్ రోడ్ నెం.3లో నివసించే ఏడేళ్ల బాలిక హర్షాలి గుప్తా కన్నుమూశారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవటంతో కుటుంబ సభ్యులు అస్తికలకు ఆదివారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.పుట్టింటికి వెళ్లి మృత్యువాతసనత్‌నగర్: వేసవి సెలవులు కదా..? పిల్లలను తీసుకుని ఇంటికి రా.. తల్లీ! అని ఆ తండ్రి ఆశగా అడగడంతో కొడుకును తీసుకుని తన పుట్టిల్లు అయిన గుల్జార్‌హౌస్‌కు వెళ్లింది. అదృష్టవశాత్తూ తండ్రి పిలుపు మేరకు కొడుకు ముందు రోజు రాత్రే వెళ్లిపోగా, తల్లి అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వస్త్ర వ్యాపారి వినోద్‌కుమార్ అగర్వాల్ తన భార్య రజనీ అగర్వాల్ (45), కొడుకు కుషాల్ అగర్వాల్, కుమార్తె తనూలతో కలిసి సనత్‌నగర్‌లో ఉంటున్నాడు. కుమార్తె ముంబైలో ఎంబీఏ చదువుతుండగా, కుమారుడు కుషాల్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఈ క్రమంలో కుమారుడు కుషాల్‌ను తీసుకుని రజని గుల్జార్ హౌస్‌కు వెళ్లింది. అయితే కుషాల్ ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చేశాడు. అక్కడే ఉన్న రజని మాత్రం ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించింది.సరదాగా వెళ్లారు.. శవాలై వచ్చారురహమత్‌నగర్: బంధువులతో సరదాగా గడపాలని వెళ్లారు. శవాలుగా తిరిగొచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్‌నగర్ బస్తీ వాసులను కలచి వేసింది. గుల్జార్ హౌస్ ఆగ్ని ప్రమాదంలో రాజీవ్‌నగర్‌కు చెందిన తల్లి, కొడుకు, కుమార్తె మృతి చెందారు. ఆటో మొబైల్స్ వ్యాపారం చేసే రాజేష్ జైన్ రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. ఆయనకు భార్య శీతల్ (35), ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా శనివారం ఉదయం శీతల్ తన తండ్రి ఇంటికి పిల్లల్ని తీసుకుని వెళ్లింది. అయితే పెద్ద కుమార్తె రాశి తాను చదువుకోవాలంటూ శనివారం సాయంత్రమే రాజీవ్‌నగర్ లోని తమ నివాసానికి తిరిగి వచ్చింది. అక్కడే ఉండిపోయిన శీతల్, అరుషి, రిషబ్ మాత్రం ప్రమాదంలో చనిపోయారు. -
హైదరాబాద్ చరిత్రలో అతిపెద్ద ప్రమాదాలు ఇవే.. 2002 తర్వాత..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని దుకాణాలు, కంపెనీలు, గోదాముల్లో ఏటా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, భారీ ప్రాణనష్టాలతో కూడిన వి మాత్రం తక్కువే. 2002లో ఉస్మాన్‌గంజ్‌లోని శాంతి ఫైర్ వర్క్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం ప్రాణ నష్టం పరంగా ఇప్పటివరకు ప్రథమ స్థానంలో ఉండేది. ఆదివారం పాత బస్తీలోని గుల్జార్‌హౌస్ వద్ద ‘మోదీ ఇంట్లో’జరిగిన ప్రమా దం దాన్ని దాటేసింది. ఒకే ప్రమాదంలో 17 మంది మృతిచెందటంతో నగర చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం కూడా ఇదే తొలిసారి. గతంలో నగరంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదాల్లో కొన్ని ఇవీ...23.10.2002:ఉస్మాన్‌గంజ్‌లోని శాంతి ఫైర్ వర్క్స్‌లో చోరీ చేయడానికి వచ్చిన దొంగ మారుతి నయీం.. అందులో నగదు లభించకపోవడంతో నిప్పు పెట్టాడు. ఈ ఉదంతంలో ఫైర్వర్క్స్ పై అంతస్తులో ఉన్న కార్తికేయ లాడ్జిలో బస చేసిన కస్టమర్లు, సిబ్బంది మొత్తం 12 మంది చనిపోయారు.21.10.2006:సోమాజిగూడలోని మీనా జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతుండగా, పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రించారు. కింది ఫ్లోర్లో జరిగిన అగ్నిప్రమాదంతో పెయింట్లకు నిప్పంటుకొని విడుదలైన విషవాయువుల ప్రభావానికి ముగ్గురు చనిపోయారు. 24.11.2012:పుప్పాలగూడలోని బాబానివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్‌మన్‌తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా మరో పదిమంది ప్రాణాలతో బయటపడ్డారు. 22.02.2017:అత్తాపూర్‌లోని ఒక చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. కూలర్లు తయారుచేసే ఈ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఒడిశాకు చెందిన ఆరుగురు వలస కార్మికులు చనిపోయారు. 23.02.2022:న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బిహార్ నుంచి వచ్చిన వలస కార్మికులు 11 మంది చనిపోయారు. 16.05.2023:సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో క్యూ నెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్‌లో పని చేసే ఆరుగురు మరణించారు. 13.11.2023:నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో ఉన్న నాలుగంతస్తుల భవనం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. భవనం కింది అంతస్తులో ఉన్న కార్ఖానాలో మంటలు చెలరేగి భవనం మొత్తం కాలిపోయింది.ఆ భవనాల్లో మరిన్ని జాగ్రత్తలు అవసరంఫైర్ సేఫ్టీ విషయంలో వాణిజ్య భవనాలకు ఇచ్చిన ప్రాధాన్యం నివాస భవనాలకు ఇవ్వట్లేదు. వ్యాపార సంస్థలు, గృహాలు కలిసి ఉన్న భవనాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే ఫైర్ అలారమ్స్, అగ్నిమాపక పరికరాలు లభిస్తున్నాయి. వీటిని ఇళ్లలోనూ ఏర్పాటు చేసుకుంటే దుర్ఘటనలు తగ్గుతాయి. ప్రమాదం జరిగినా ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.– వై.నాగిరెడ్డి, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ -
హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం... 17 మంది మృత్యువాత... మృతుల్లో 8 మంది చిన్నారులు
-
ఘోర అగ్నిప్రమాదం 17మంది బలి
సాక్షి, హైదరాబాద్/చార్మీనార్/దూద్‌బౌలి: అది హైదరాబాద్ పాతబస్తీలోని ఓ భవనం. ముందు దుకాణాలు ఉంటే, వెనుక అంతస్తుల్లో ఇళ్లు ఉన్నాయి. తెల్లవారుజామున అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. దీంతో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి, రెండో అంతస్తుల్లోకి దట్టమైన పొగ, మంటలు విస్తరించాయి. గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తులో నిద్రిస్తున్న 23 మందిని చుట్టుముట్టాయి. మంటల తీవ్రతతో పాటు పొగ పీల్చడంతో అపస్మారక స్థితికి చేరుకున్న నాలుగు కుటుంబాలకు చెందిన 8 మంది చిన్నారులు సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు.నలుగుర్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడగా.. మంటల్ని తొలుత గమనించిన ఇద్దరు మహిళలు బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. మృతుల్లో కొందరికి కాలిన గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం 5.30–6.00 గంటల సమయంలో చార్మీనార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగర చరిత్రలో ఒకే అగ్ని ప్రమాదంలో ఇంత మంది చనిపోవడం, అంతా బంంధువులే కావడం ఇదే తొలిసారి. అంతా బంధువులే... రాజస్తాన్‌కు చెందిన అన్నదమ్ములు ప్రహ్లాద్ మోడీ, రాజేందర్ మోడీ, బంకట్ మోడీ, దేవనాథ్ మోడీ, సునీల్ మోడీ ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి బంగారం, వెండి, ముత్యాల వ్యాపారం చేస్తున్నారు. ప్రహ్లాద్ మోడీ, రాజేందర్ మోడీ, బంకట్ మోడీ తమ కుటుంబాలతో గుల్జార్ హౌస్‌లోని చార్మీనార్ రోడ్డులో ఉన్న భవనంలో నివసిస్తున్నారు. దీని ముందు భాగంలో శ్రీకృష్ణ పెరల్స్, మోడీ పెరల్స్ పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సునీల్ మోడీ అత్తాపూర్, దేవనాథ్ మోడీ హిమాయత్ నగర్లో ఉంటున్నారు.గుల్జార్ హౌస్‌లోని దుకాణాల (జీ ప్లస్ వన్) వెనుక ఉన్న రెండు అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్లో గోదాములు, షాపులు, కార్ఖానాలు ఉండగా..మొదటి, రెండో అంతస్తుల్లో ప్రహ్లాద్, రాజేందర్, బంకట్ కుటుంబాలు ఉంటున్నాయి. రాజస్తాన్‌లో ఉండే సునీల్ బంధువులు వేసవి సెలవులు కావడంతో అత్తాపూర్‌కు వచ్చారు. వారాంతం నేపథ్యంలో శనివారం కొందరు బంధువులు గుల్జార్ హౌస్‌లోని ముగ్గురు అన్నదమ్ముల ఇళ్లకు వచ్చారు. ఇలా మొత్తం 23 మంది ఆ భవనంలో శనివారం రాత్రి నిద్రపోయారు. మీటర్ వద్ద మొదలైన మంటలు ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కరెంట్ మీటర్లతో పాటు సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద కూడా కొన్ని రోజులుగా నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కరెంట్ మీటర్ల వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో అక్కడ మొదలైన మంటలు మొదటి, రెండో అంతస్తులకు విస్తరించాయి. మంటలకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఏసీ కంప్రెషర్ పేలడంతో అగ్ని కీలలు మరింత ఎగిశాయి. ఉదయం సుమారు 6.15 గంటల సమయంలో వీటిని గుర్తించిన గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఇద్దరు మహిళలు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు.మంటలు అంటుకున్న విషయాన్ని అక్కడి వారికి చెప్పారు. ఉదయం 6.16 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. 6.20 గంటలకు మొఘల్‌పుర నుంచి మొదటి ఫైర్ ఇంజన్ ఆ ప్రాంతానికి చేరుకుంది. అదే సమయంలో మక్కా మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు వచి్చన ఐదుగురు యువకులు ఈ భవనం వద్దకు చేరుకురు. అప్పటికే మంటలు, దట్టమైన పొగ ఆ భవనాన్ని చుట్టేశాయి. రోడ్డు పైన ఉన్న ఇద్దరు మహిళలు భవనంలో తమ కుటుంబీకులు ఉన్నారని, వారిని కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు ఐదుగురు యువకులూ ఇంట్లోకి వెళ్లే మార్గాల కోసం అన్వేíÙంచారు. భవనానికి 3 అడుగులు, 1 అడుగు మార్గాలే.. మోడీ కుటుంబాలు నివసించే ఈ భవనం ముందు రోడ్డు వైపు శ్రీకృష్ణ, మోడీ పెరల్స్‌తో పాటు ఇతర దుకాణాలు ఉన్నాయి. వెనుక వైపు ఉన్న నివాస భవనంలోకి వెళ్లడానికి ఓ చోట మూడు అడుగులు, మరోచోట అడుగు వెడల్పుతో ఉన్న మార్గాలే ఉన్నాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి, రెండో అంతస్తులకు వెళ్లడానికి కేవలం రెండున్నర అడుగుల వెడల్పుతో ఉన్న ఒకే ఒక్క మెట్లగది (స్టెయిర్ కేస్) ఉంది. మూడు అడుగుల వెడల్పు మార్గం ఉత్తర దిక్కున ఉండగా.. ఈ మెట్లు దక్షిణ దిక్కున ఉన్నాయి. దీంతో వ్యాపించిన మంటలు, పొగలో ఆ మెట్ల వద్దకు చేరుకోవడం సాధ్యం కాలేదు. భవనంలో ఎక్కువగా వుడ్ (చెక్క) పార్టీషన్‌తో ఉన్న గదులు ఎక్కువగా ఉండటం మంటలు త్వరగా వ్యాపించడానికి కారణమైంది. గోడలకు రంధ్రాలు చేసి లోపలకు.. పక్కన ఉన్న మరో భవనం మొదటి అంతస్తుకు చేరిన యువకులు, అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడ ఉన్న, ఈ భవనంలోని మరో గోడకు రంధ్రాలు చేసి ఇంట్లోకి నీళ్లు చిమ్మారు. మంటలు కొద్దిగా అదుపులోకి వచ్చాక మొదటి అంతస్తులోకి వెళ్లిన అధికారులు, యువకులు అక్కడ దాదాపుగా అపస్మారక స్థితిలో ఉన్న 17 మందితో పాటు రెండో అంతస్తు నుంచి టెర్రస్ పైకి వెళ్లి పొగతో ఉక్కిరిబిక్కిరైన నలుగురిని బయటకు తీసుకువచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న 17 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించగా వారు చనిపోయినట్లు వైద్యవర్గాలు ప్రకటించాయి. అపస్మారక స్థితిలో..సెల్‌ఫోన్ లైట్ వెలుగుతూ.. సహాయ చర్యల సందర్భంగా భవనం మొదటి అంతస్తులోని గదుల్లో అత్యంత హృదయ విదారక దృశ్యాలు కన్పించినట్లు అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లోపల నుంచి గడియ పెట్టి ఉన్న ఓ గదిలో ఓ మహిళతో పాటు నలుగురు చిన్నారులు ఒకేచోట పడిపోయి ఉన్నారు. ఇంకో గదిలో మరో నలుగురు చిన్నారులతో పాటు ఉన్న మహిళ ఓ మూలన అపస్మారక స్థితిలో కూర్చుని ఉంది. అయితే ఆమె చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లైట్ వెలుగుతూ కన్పించింది. చిన్నారులు కూడా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. దొంగల భయంతో భవనం టెర్రస్ పైకి వెళ్లే స్టెయిర్ కేస్‌కు గేటు ఏర్పాటు చేసుకున్న మోడీ కుటుంబీకులు దానికి తాళం వేశారు. మొదటి అంతస్తుకు, రెండో అంతస్తుకు మధ్య ఉన్న గేటుకు తాళం వేయడంతో పొగలో రెండో అంతస్తులో ఉన్న వాళ్లు పైకిగానీ, కిందికి గానీ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. భార్య, పిల్లల కోసం లోపలికి వెళ్లి.. ప్రహ్లాద్ మోడీ పెద్ద కుమారుడైన పంకజ్ మోడీ అగ్ని ప్రమాదాన్ని గుర్తించి మొదటి అంతస్తులోని గదిలోంచి బయటికి వచ్చి పోలీసు, ఫైర్ విభాగాలకు సమాచారం ఇచ్చారు. ఆపై తన భార్య, పిల్లల్ని రక్షించడం కోసం మళ్లీ గదిలోకి వెళ్లారు. ఇంతలో దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. భార్య పిల్లలతో సహా పంకజ్ మోడీ కూడా వాటిల్లో చిక్కుకుని బయటకు రాలేకపోయారు. తాను తప్పించుకునే అవకాశం వచి్చనా కుటుంబ సభ్యులను కాపాడాలని ప్రయత్నించిన పంకజ్ మోడీ చనిపోవడం స్థానికుల హృదయాలను కలచివేసింది. ప్రహ్లాద్ కుటుంబం అంతా మృత్యువాత ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోడీ కుటుంబంలోని అంతా చనిపోయారు. ప్రహ్లాద్ మోడీకి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. వేసవి సెలవులకు తన తండ్రి ప్రహ్లాద్ మోడీ ఇంటికి వచి్చన కుమార్తెలు వారి చిన్నారులు మృతి చెందారు. ప్రహ్లాద్ మోడీ మరో సోదరుడైన బంకట్ మోడీ టెర్రస్ పైకి వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు. అయితే ఆయన కుమారుడు అభిషేక్ మోడీ, ఆయన భార్య మృతి చెందారు. బంకట్ మోడీతో పాటు రాజేందర్ మోడీతో పాటు ఆయన భార్య, మరో వ్యక్తి టెర్రస్ పైకి వెళ్లడంతో బతికిపోయారు. గోవింద్ మోడీ కుటుంబ సభ్యులు అత్తాపూర్‌లో నివసిస్తుండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రహ్లాద్ మోడీ కుటుంబ సభ్యులతో పాటు షోరూంల్లో పనిచేసే సిబ్బంది సైతం ఇదే భవనంలో నివసిస్తుంటారు. వేసవి కాలం కావడంతో ఆ పని వారంతా టెర్రస్ పైన పడుకోవడంతో మృత్యువు నుంచి తప్పించుకున్నారు. కిషన్‌రెడ్డి, పొన్నం, డీజీపీ సందర్శన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, నగర సీపీ సీవీ ఆనంద్, అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు మీర్ జుల్పికర్ అలీ, అహ్మద్ బలాల, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. అగ్నిమాపక శాఖపై కిషన్‌రెడ్డి ఫైర్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అగ్నిమాపక శాఖపై ఆరోపణలు చేశారు. ఫైర్ ఇంజన్లు అర్ధగంట ఆలస్యంగా వచ్చాయన్నారు. అధికారుల వద్ద ప్రత్యేక, ఆధునిక అగ్నిమాపక ఉపకరణాలు లేవని మండిపడ్డారు. దీనివల్లే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమై ప్రాణ నష్టం పెరిగిందని అన్నారు. ఈ ఆరోపణల్ని అగ్నిమాపక శాఖ డీజీ ఖండించారు. తమకు ఉదయం 6.16 గంటలకు కాల్ వచి్చందని, మొఘల్‌పుర నుంచి 6.17కు బయలుదేరిన మొదటి ఫైరింజన్ 6.20 గంటలకు ప్రమాద స్థలికి చేరిందని స్పష్టం చేశారు. వెంటనే తీవ్రతను అంచనా వేసి మరో పది ఫైరింజన్లు, 70 మంది సిబ్బందిని మోహరించామని వివరించారు. ఆ భవనానికి ఒకే ఒక స్టెయిర్ కేస్ ఉండటం, అదీ ఇరుకైనది కావడంతో పాటు ఇతర కారణాలు ప్రమాద తీవ్రతను పెంచాయని అన్నారు. కాగా అగ్ని ప్రమాదంపై చార్మీనార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. మృతులు వీరే: ప్రహ్లాద్ మోడీ (70), మున్ని (70), రాజేందర్ మోడీ (25), సుమిత్ర (60) హామీ (7), అభిషేక్ (31), శీతల్ (35), ప్రియాంచ్ (4), ఇరాజ్ (2), అరుషి (3), రిషబ్ (4), ప్రథం (ఒకటిన్నర ఏళ్లు), అనియాన్ (3), వర్ష (35), పంకజ్ (36), రజిని (32) ఇద్దూ (4). మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి చూపించాడు.. ప్రతిరోజూ తెల్లవారుజామున ప్రార్థనల కోసం మక్కా మసీదుకు వస్తుంటాం. ఆదివారం ఉదయం ప్రార్థనలు ముగించుకుని బయటకు వచ్చా. ఆ సమయంలో మసీదు గేటు వద్ద నిలుచుని ఉన్న మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి డబ్బు అడగటంతో రూ.10 ఇచ్చా. అతడే గుల్జార్‌హౌస్ వద్ద పొగలు వస్తున్న భవనాన్ని చూపించాడు. నేను వెంటనే మరో నలుగురితో కలిసి అక్కడకు పరిగెత్తుకుంటూ వెళ్లా. గోడలకు రంధ్రాలు చేసి అగ్నిమాపక సిబ్బందితో కలిసి లోపలకు వెళ్లాం. అయినా 17 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిస్తోంది. – మీర్ జాహెద్, గుల్జార్ హౌస్ వద్ద గాజుల వ్యాపారి -
పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు
-
గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రమాద కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమని రేవంత్ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం ప్రకటించారు.ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని.. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాయ స్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని సీఎం రేవంత్ అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక బృందం తమ శక్తియుక్తులు ప్రయత్నించిందన్నారు. కాగా, చార్మినార్ గుల్జార్‌హౌస్‌లో ఇవాళ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా 17మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు.మృతి చెందిన వారిలో రాజేంద్రకుమార్ (67),అభిషేక్ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండటంలో భారీ ప్రాణనష్టం జరిగింది.


