దక్షిణ కొరియాలో ఘోర అగ్నిప్రమాదం | 10 dead in South Korea car plant fire | Sakshi
Sakshi News home page

దక్షిణ కొరియాలో ఘోర అగ్నిప్రమాదం

Mar 21 2026 5:09 AM | Updated on Mar 21 2026 5:57 AM

10 dead in South Korea car plant fire

వాహనాల విడిభాగాల ఫ్యాక్టరీలో మంటలు

53 మందికి గాయాలు.. 

24 మంది పరిస్థితి విషమం

మరో 14 మంది గల్లంతు 

సియోల్‌: దక్షిణ కొరియాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వాహనాల విడిభాగాల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో కనీసం 53 మంది గాయపడ్డారు. వారిలో 24 మంది పరిస్థితి విషయంగా మారింది. డెడ్‌యోక్‌ జిల్లాలోని డెజియోన్‌ నగరంలో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో 14 మంది జాడ గల్లంతయ్యింది. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. 

మధ్యాహ్నం 1.17 గంటలకు ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇంకా గుర్తించలేదు. మంటల తీవ్రతకు ఫ్యాక్టరీ నేలమట్టమైంది. కొందరు ఫ్యాక్టరీ పై నుంచి దూకడంతో గాయాలపాలయ్యారు. లోపలున్న వారు పొగ పీల్చి అస్వస్థతకు గురయ్యారు. ఫ్యాక్టరీలో రసాయనాల నిల్వలుండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement