breaking news
sajjala ramakrishna reddy
-
ఆర్య వైశ్యులపై వేధింపులను వెంటనే ఆపాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఆర్యవైశ్యులతో వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఆర్య వైశ్యుల సమస్యలపై చర్చించారు. ఆర్యవైశ్యులపై జరుగుతున్న వేధింపులను వెంటనే ఆపాలన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులపై వివక్ష బాగా పెరిగిందని సజ్జల అన్నారు.ఆర్యవైశ్యులను లక్ష్యంగా చేసుకుని అధికార యంత్రాంగం వేధింపులకు పాల్పడుతోందని.. చిన్న, మధ్య తరహా వ్యాపారులపై అకారణంగా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన వ్యాపార రంగానికి ప్రభుత్వం నుంచి భరోసా లేదన్న సజ్జల.. వైఎస్ జగన్ హయాంలో ఆర్యవైశ్యులకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. -
‘లిఫ్ట్’ తాకట్టుపై ‘సీమ’ కన్నెర్ర
సాక్షి, ప్రతినిధి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆయన ఏలుబడిలో అప్పుడు, ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు సహా రాయలసీమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబుతో మాట్లాడి ఆపించానని స్వయంగా తెలంగాణ సీఎం చెప్పడమే ఇందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగిపోయిన లిఫ్ట్ పనులను రెండు నెలల్లో తిరిగి ప్రారంభించాలని, లేదంటే ఉద్యమం మహోగ్ర రూపం దాలుస్తుందని స్పష్టం చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. రాయలసీమలో పుట్టి.. పుట్టిన గడ్డకే ద్రోహం చేయడం చంద్రబాబుకే చెల్లిందని ధ్వజమెత్తారు. లిఫ్ట్‌ను వెనువెంటనే పూర్తి చేయాల్సిందిపోయి.. ప్రాజెక్టు దండగంటూ తన టీడీపీ నేతలతో దుష్ప్రచారం చేయించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకపోతే ప్రజలు తరిమికొడతారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని తీర్మానం చేశారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి చీకటి ఒప్పందంలో భాగంగా నిలిచిపోయిన ‘రాయలసీమ లిఫ్ట్’ పనులు పూర్తి చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాడులో గురువారం ‘చలో పోతిరెడ్డిపాడు’ పేరుతో పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షత బహిరంగ సభ నిర్వహించింది. ఆగిపోయిన లిఫ్ట్ పనులను పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నేతలు పరిశీలించిన అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సభ ప్రారంభమైంది. సీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆవశ్యకత, చంద్రబాబు ప్రభుత్వం చేసిన ద్రోహం.. ‘సీమ’లోని కూటమి నేతల నిర్లిప్తత, ప్రభుత్వంపై భవిష్యత్తులో ఉద్యమించే తీరుపై పార్టీ నేతలు ప్రసంగించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలు, భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించి రెండు నెలల్లో పనులకు పూనుకోకపోతే రైతులతో కలిసి కడపలో భారీ ఎత్తున మహా సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాధాన్యతపై ఆరు జిల్లాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తామని హెచ్చరించారు. చలో పోతిరెడ్డిపాడు సభకు భారీగా తరలి వచ్చిన రైతులు ‘సీమ’లో పారే ప్రతి నీటి బొట్టుపై వైఎస్సార్ పేరు 40 ఏళ్ల కిందట వైఎస్సార్ చేసిన పాదయాత్ర, నిరాహార దీక్షతోనే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు బీజం పడింది. ఆ రోజు వైఎస్సార్‌తో పాటు నడిచిన కాటసాని, చవ్వా రాజశేఖర్‌రెడ్డి ఈ రోజు ఈ వేదికపై కూడా ఉన్నారు. రాయలసీమ, నెల్లూరుకు వెళ్లే ప్రతీ నీటి చుక్కపై వైఎస్సార్ పేరు ఉంది. ఇది చరిత్ర, ఎవ్వరూ మార్చలేరు. రాయలసీమ లిఫ్ట్ పనులు 80 శాతం పూర్తి చేశాం. తక్కిన 20 శాతం పూర్తి చేస్తే కనీసం మంచి పని చేసిన పేరైనా చంద్రబాబుకు ఉండేది. అది కూడా లేకుండా ప్రాజెక్టును ఆపి ద్రోహం చేశారు. రేవంత్‌రెడ్డి మాటలతో వాస్తవాలు వెలుగు చూశాయి. రేవంత్‌రెడ్డి తన మాటలపై కావాలంటే నిజ నిర్ధారణ కమిటీకి సిద్ధమని ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పలేదు. ప్రాజెక్టు దండగని టీడీపీ నేతలతో ప్రచారం చేయిస్తున్నాడు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు భయపడి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలు యథేచ్ఛగా అక్రమ ప్రాజెక్టులు నిర్మించి మనకు దక్కాల్సిన నీటిని తోడేస్తున్నాయి. నీళ్లు, రైతు, వ్యవసాయం బాగుంటే రాష్ట్రమంతా బాగుంటుంది. ఈ ఆలోచన వైఎస్‌కు ఉంది కాబట్టే పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేపట్టారు. 2014–19లో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆ పనులు పూర్తి చేయలేదు. 2019లోజగన్ అధికారంలోకి వచ్చాక ఆర్అండ్ఆర్ పూర్తి చేసి ప్రాజెక్టును వాడకంలోకి తెచ్చారు. రాయలసీమ లిఫ్ట్‌తో జగన్ చేసిన మేలు ప్రతీ ఇంటికీ తెలియాలి. పూర్తయ్యే దశలోని ప్రాజెక్టును చంద్రబాబు ఆపి మహాపాపం చేశారు. మూల్యం చెల్లించుకోక తప్పదు – సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప బాబుకు ఏమీ పట్టదు కరోనా సంక్షోభాన్ని లెక్క చేయకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చివరి దశకు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. రెండేళ్లలోనే 80 శాతం పనులు పూర్తి చేశారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు. రాయలసీమ లిఫ్ట్ నిలిచిపోతే కేసీ కెనాల్, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, ఎస్సార్బీసీకి నీళ్లుండవు. అనంతపురం రైతులకు మేలు చేయాలని హంద్రీ–నీవా కాలువను 3,800 నుంచి 6,500 క్యూసెక్కులకు జగన్ పెంచారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పనులు నిలిపేశారు. అంతేకాదు రూ.2 వేల కోట్లతో కాంక్రీట్ లైనింగ్ పనులు చేశారు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహించే కుప్పానికి నీరిచ్చిన ఘనత కూడా జగన్‌దే. గాలేరు–నగరి ద్వారా చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు నీళ్లిచ్చే పనులను 50 శాతం పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని కూడా పక్కన పెట్టేసింది. ‘సీమ’లోని ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కానీయకుండా చంద్రబాబు అమరావతి జపం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాట్లు పడుతున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నాడు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ ఏకతాటిపై పోరాడుదాం 1986లో లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు వైఎస్సార్‌తో కలిసి నేను పాదయాత్ర చేశాను. వైఎస్ కృషితోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఎనీ్టఆర్ 4 వేల నుంచి 11 వేల క్యూసెక్కులకు పెంచారు. దీన్ని 44 వేల క్యూసెక్కులకు వైఎస్సార్ పెంచారు. అలాగే హంద్రీ–నీవా, గాలేరు–నగరి లాంటి ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేసి భగీరథుడిగా నిలిచారు. జగన్ 80 శాతం పూర్తి చేసిన రాయలసీమ లిఫ్ట్‌ను చంద్రబాబు నిలిపేశారు. రాయలసీమ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబు సర్కారుపై పోరాడాలి. – కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు మోసాలను ప్రతి ఒక్కరికీ వివరించాలి తిరుమల లడ్డూ విషయంలోనే భక్తుల మనోభావాలతో ఆడుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై ప్రజలను మాయ చేయడం చిన్న విషయం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంద్రబాబు.. జగన్‌కు మంచి పేరొస్తుందని రాయలసీమ ప్రాజెక్టును ఆపేశాడు. ఆంధ్రాకు సీఎంగా ఉండి, చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశాడని రుజువైనా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. చంద్రబాబుకు రాయలసీమ మీద ఏమాత్రం ప్రేమ లేదని 40 ఏళ్లుగా ఆయన్ను చూసిన వారికి ఎవరికైనా తెలిసిపోతుంది. ఇలాంటి చంద్రబాబు మెడలు వంచి ఆపేసిన ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా ఒత్తిడి తీసుకొద్దాం. చంద్రబాబు మోసాలను గ్రేటర్ రాయలసీమ పరిధిలో ప్రతి పౌరుడికీ తెలిసేలా వివరిద్దాం. – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రబాబుకు వ్యవసాయం అంటే చిన్నచూపు రాయలసీమకు చంద్రబాబు చేసిన మోసం బహిర్గతం అయ్యాక ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన టీడీపీ నాయకులు ఈ ప్రాజెక్టు దండగ అన్నట్లు తప్పుడు ప్రచారం ప్రారంభించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న చంద్రబాబు.. ఇతర సీఎంలు ప్రారంభించిన ప్రాజెక్టులకు శిలాఫలకాలు వేయడం, పూర్తయిన వాటికి రిబ్బన్ కటింగ్‌లు చేసుకోవడం తప్పించి, ఆయన ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. అంటే చంద్రబాబుకు సాగు నీటి రంగమన్నా, రైతులన్నా, వ్యవసాయమన్నా చిన్నచూపు. అన్ని ప్రాజెక్టులకు నీరివ్వాలన్నా నందికొట్కూరు నుంచే పోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత రైతులు త్యాగాలు చేసి భూములు కోల్పోయారు. సర్వస్వం కోల్పోయి వలసలు పోతున్న రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఉద్యోగాలిస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు. – బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రాజకీయాలకు అతీతంగా ఉద్యమిద్దాం వైఎస్సార్ సీఎం అయిన వెంటనే దుర్భిక్ష పరిస్థితుల మధ్య వ్యవసాయం చేసే రాయలసీమ ప్రాంత రైతుల కష్టాలను తీర్చేసి దేవుడయ్యాడు. గాలేరు–నగరి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులతో రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలను తీర్చారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేసినా వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాయలసీమ రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. అనుమతులు లేకుండా పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ మనకు దక్కాల్సిన నీటిని వాడుకుంటే చంద్రబాబుకు ఇంకా జ్ఞానోదయం కలగడడం లేదు. చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలందరికీ వివరించాలి. రాయలసీమ ప్రాంత ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టు కోసం ఉద్యమించాలి. – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఎన్జీటీకి ఫిర్యాదు చేసి ప్రాజెక్టును చంద్రబాబు ఆపించాడు: నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో పుట్టి, ఇక్కడ నుంచే గెలిచి ముఖ్యమంత్రి అవుతున్నా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే వృథాగా పోతున్న నీటిని రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించాలని ఆలోచన చేస్తే ఎన్జీటీకి ఫిర్యాదు చేసి చంద్రబాబు ఆపించాడు. అయినా నిర్మాణం ఆపకుండా 80 శాతం పూర్తి చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్. ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లో తిరగలేరు. – దారా సుదీర్, నందికొట్కూరు పార్టీ ఇన్చార్జి రాయలసీమకు చంద్రబాబు ద్రోహం రాయలసీమ నుంచి కరువులు ఆగిపోయాయంటే ఆ ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్ 44 వేల క్యూసెక్కులకు పెంచితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక మరింతగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించి రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేసి 80 శాతం పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో తట్టమట్టి కూడా తీయలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం ఆయనతో కుమ్మక్కై రాయలసీమ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశాడని అర్థమైపోయింది. – అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే తల తెగ నరికినా మా మొండెం ఉద్యమిస్తుంది ‘సీమ’ అంటే చంద్రబాబుకు ఎప్పుడూ ఇష్టం లేదు. అందుకే రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపి ద్రోహం చేశాడు. కర్నూలుకు రావల్సిన హైకోర్టును, నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తీసుకెళ్లారు. ‘అనంత’కు మంజూరైన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించారు. ఆఖరుకు కడపలో ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకును కూడా తరలించుకుపోయాడు. ఆనాడు వైఎస్సార్ సీఎంగా ఉండగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే ప్రకాశం బ్యారేజీ మీద దేవినేని ఉమాతో ధర్నాలు చేయించి అడ్డుకునే ప్రయత్నం చేసిన రాయలసీమ ద్రోహి చంద్రబాబు. ఇక్కడి రైతులు, ప్రజల భవిష్యత్తును చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కాలరాస్తున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఉద్యమానికి ఇప్పుడు మళ్లీ బీజం పడింది. ఉద్యమం మొదలయ్యాక తల తెగ నరికినా మా మొండెం ఉద్యమిస్తుందే కానీ ఉద్యమం మాత్రం ఆగదు. – సాకె శైలజానాథ్, మాజీ మంత్రి ఓటుకు కోట్లు కేసుకు భయపడే.. రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు రాయలసీమ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, మనకు హక్కుగా దక్కాల్సిన నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నా సీఎంగా ఉన్న చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాడు కేసీఆర్‌కు, నేడు రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తలూపుతున్నాడు. రాయలసీమ ప్రాజెక్టును తిరిగి ప్రారంభింపజేసేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రాయలసీమ ప్రాజెక్టు కోసం రాయలసీమ పౌరుషం చూపించాలి. – ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు గోదావరి–బనకచర్ల పేరుతో కాలయాపన శ్రీశైలం డ్యాంకు ఎక్కువ శాతం భూములు కోల్పోయింది రాయలసీమ ప్రాంతమే. కృష్ణా జలాలపై అత్యధిక క్యాచ్మెంట్ ఏరియా రాయలసీమలోనే ఉంది. చంద్రబాబు ఏనాడూ రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచించ లేదు. దివంగత వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు ఎవరూ ఈ ప్రాంతం గురించి ఆలోచించలేదు. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నాడు. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు నీటిని తరలిస్తుంటే ఎగువ రాష్ట్రాలు అంగీకరించవు అని తెలిసే సాధ్యం కాని ప్రాజెక్టుతో చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడు. కృష్ణా, తుంగభద్ర నదులపై నిరి్మంచాల్సిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించడం మూర్ఖత్వం. వైఎస్ జగన్ గెలిచి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయేది కాదు. అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు లిఫ్ట్‌తోనే రాయలసీమ రైతుల భవిష్యత్తు ఈ ప్రాంతానికి సంజీవని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రాజకీయాలకు అతీతంగా రాయలసీమ వాసులంతా ఒక్కటై ఉద్యమించాలి. రాయలసీమను ఎడారిగా మార్చే చంద్రబాబు కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. మళ్లీ కరువు కాటకాలతో రాయలసీమ ప్రజలు వలసలు వెళ్లకుండా నిరోధించాలంటే రాయలసీమ ప్రాజెక్టు పూర్తి కావాలి. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావాలనే డిమాండ్‌తో త్వరలో కడపలో రెండో మహాసభ నిర్వహిస్తాం. – రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకుందాం రాష్ట్రంలో సాగు నీటి రంగానికి మేలు చేసిన ఘనత నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిదైతే, ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ లిఫ్ట్ పూర్తవుతుంది. ఈ లిప్్టతో ఉమ్మడి ప్రకాశం, నెలూర్లు, రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ ఉద్యమంలో ఎంత వరకైనా ముందుకు నడుస్తాం. ప్రాజెక్టు పూర్తి చేస్తాం. – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బాబు కుట్రలను అంతం చేద్దాం రాయలసీమ దేశంలోనే అత్యంత కరువు ప్రాంతం. నీళ్లు లేక వ్యవసాయం చేయలేక ఏడాదిలో రెండు నెలలు మినహా 10 నెలలు వలసోయి బతికే పరిస్థితి. పిల్లలు, వృద్ధులు మాత్రమే ఇళ్ల వద్ద ఉంటారు. అలాంటి ప్రాంతానికి నీళ్లిచ్చేందుకు మా నాయకుడు సిద్ధమైతే దాన్ని అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు. రాయలసీమకు చంద్రబాబు కంటే ద్రోహం చేసేవారు బహుశా ఎవ్వరూ ఉండరు. చంద్రబాబు కుట్రలను అంతం చేసి రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేస్తాం. – గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేసింది. ఎంత నిర్బంధిస్తే అంతగా తిరగబడతాం. ఎంత అణచివేస్తే అంత పైకి లేస్తాం. రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి తీసుకొచ్చిన లిఫ్టును రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు ఆపేశాడు. రాయలసీమ ప్రజలకు ద్రోహం చేశాడు. కూటమి నాయకుల వికృత రాజకీయ క్రీడను గ్రామ గ్రామానికి తీసుకెళ్తాం. నందికొట్కూరులో మొదలు పెట్టింది ప్రారంభ సభ మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం. – భూమన కరుణాకర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టేదాకా ఉద్యమిస్తాం రాష్ట్ర సాగు నీటి రంగం గురించి చర్చించాల్సి వస్తే వైఎస్సార్‌కు ముందు.. వైఎస్సార్ తర్వాత అని చెప్పుకోవాలి. నెల్లూరు జిల్లాలో కండలేరు, సోమశిల ప్రాజెక్టులను పూర్తి సామర్థ్యం మేరకు నీరు నిలిపిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే నెల్లూరు జిల్లాకు మరింత మేలు చేకూరుతుంది. తాను కోరిన మీదటే చంద్రబాబు రాయలసీమ లిఫ్టును ఆపేశాడని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఈ ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టేదాకా ఉద్యమిస్తాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే జగన్ సీఎం కావడం ఖాయం. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు -
కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటది... సజ్జల వార్నింగ్
-
‘కూటమి నేతల అరాచకాల్ని ఎదుర్కొంటాం’
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనలో టీడీపీ గూండాలకు పోలీసులకు రక్షణగా నిలిచారని వైఎస్సార్సీపీ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదుగంటల పాటు పోలీసుల సమక్షంలో అరాచకం రాజ్యమేలిందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై టీడీపీ గూండాల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిపై పరామర్శించేందుకు జోగి రమేష్ ఇంటికి సజ్జలతో పాటు ఇతర వైఎస్సార్సీపీ నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. గుంటూరు పోలీసుల సమక్షంలో అంబటి రాంబాబు ఇంటిపై దాడులు చేశారు. గుంటూరులో టీడీపీ గూండాలు ఏం చేశారో రాష్ట్రప్రజలు చూశారు. టీడీపీ గూండాలకు పోలీసులు రక్షణగా ఉన్నారు. అంబటిని కలిసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు యత్నించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన పార్టీ నేతల్ని అడ్డుకున్నారు. మాజీ హోంమంత్రి ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదు. బాధితుడినే పోలీసులు అరెస్టు చేశాను. మా నేతలను ఎస్పీ కార్యాలయంలో ఎదుట గంట సేపు ఎదురు చేయించారు. ప్లాన్ ప్రకారం అంబటి రాంబాబు,జోగి రమేష్ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. టీడీపీ గూండాలను పోలీసులు కంట్రోల్ చేస్తున్నట్లు యాక్ట్ చేశారు. జోగి రమేష్ కుటుంబానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు?’. అంబటి,జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసిన గూండాలపై కేసులు పెట్టలేదు. దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టలేదు. కూటమి నేతల అరాచకాల్ని ఎదుర్కొంటాం. కూటమి అరాచకాల్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. చంద్రబాబు వైఎస్సార్సీపీ శ్రేణులు,నేతల్ని బెదిరింపులు, దాడులు చేసి బెదిరించాలని అనుకోవద్దు. అలా అనుకుంటే భ్రమే అవుతుంది’అని వ్యాఖ్యానించారు. -
నేడు వైఎస్సార్సీపీ కీలక సమావేశాలు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఆరాచకాలు తారాస్థాయికి చేరి వైఎస్సార్సీపీ నేతలపై, నివాసాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ ఇవాళ కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలతో సీనియర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. అలాగే తిరుమల ప్రసాదం విషయంలో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలోనూ మరో సమావేశం నిర్వహించనుంది.కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ భేటీలో వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులు, పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, టీడీపీ గూండాల హింసాకాండపై సజ్జల, బొత్స.. జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. యధేచ్చగా సాగుతున్న అరాచకాలను అహింసా మార్గంలో ఎదుర్కొవడం.. చట్టపరమైన ఫిర్యాదులు తదితర అంశాలపైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. బ్రాహ్మణ నాయకులతోనూ.. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ విష ప్రచారం ముదుతున్న వేళ.. బ్రహ్మణ నేతలతోనూ సజ్జల, బొత్స భేటీ కానున్నారు. తిరుమల మహా ప్రసాద అంశంతోపాటు కూటమి ప్రభుత్వం ఆలయాల ప్రతిష్టను దెబ్బతీస్తున్న వైనంపైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. -
వారందరి పేర్లూ డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తాం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం దాడులకు తెగబడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంబటి ఇంటిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించిన వారితో పాటు వారికి సహకరించిన పోలీసులనూ వదిలి పెట్టబోమని, అందరి పేర్లు వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్‌లోకి ఎక్కిస్తామని చెప్పారు. గుంటూరులోని సిద్ధార్థనగర్‌లో శనివారం టీడీపీ రౌడీమూకల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంలో ధ్వంసమైన ఫర్నిచర్, కాలిపోయిన కారు, చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు, పుస్తకాలు, ఎల్రక్టానిక్ సామగ్రిని ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అంబటి రాంబాబు సతీమణి విజయలక్షి్మ, కుమార్తెలు మౌనిక, మనోజ్ఞను పరామర్శించారు.అధైర్య పడవద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబుపై పథకం ప్రకారం దాడి జరిగిందని, అంబటిని అంతమొందించేందుకు వందలాదిగా వచి్చన టీడీపీ రౌడీ మూకలను పెద్ద సంఖ్యలో ఉన్న పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయలేదన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేలడంతో గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో పూజలు చేసి వస్తున్న అంబటి.. గోరంట్లలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు.ఫ్లెక్సీని తొలగించాలని కోరితే ఆయనపై అక్కడే దాడికి పాల్పడ్డారని, టీడీపీ మూకలు నడిరోడ్డుపై బహిరంగంగా కర్రలు, రాడ్లతో తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని దుయ్యబట్టారు. గంటల తరబడి కొనసాగిన రౌడీ మూకల దాడిపై శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ.. డీజీపీ, అదనపు డీజీపీలకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్లు చేసినా స్పందించలేదన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీని కలిసేందుకు వెళితే మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితను ఎస్పీ ఇంటి గేటు బయటే నిలబెట్టారని చెప్పారు. గతంలో స్కిల్ స్కామ్ కేసులో దోషిగా తేలిన చంద్రబాబును చట్టపరంగా అరెస్టు చేయించామని, అంబటి రాంబాబుపై జరిగిన దాడిపై చట్ట పరంగా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సజ్జల ఇంకా ఏమన్నారంటే.. జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం ⇒ సీబీఐ సిట్ దాఖలు చేసిన చార్జిషీట్లో తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఆరోపించినట్టుగా ఆవు, పంది కొవ్వు, చేపల నూనెలు కలవలేదని దేశంలోనే ప్రతిష్టాత్మక ల్యాబ్‌లు ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టుల ఆధారంగా నిర్ధారణ అయ్యింది. దేవుడ్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, ఇతర కూటమి నాయకులు చేసిన క్షుద్ర రాజకీయాలను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. ⇒ దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఉద్దేశ పూర్వకంగా దాడికి టీడీపీ వ్యూహరచన చేసి, అమలు చేసింది. పోలీసుల సమక్షంలోనే జరిగినా వారు ఎక్కడా అడ్డుకోలేదు. మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్ రెడ్డిపై ఇదే విధంగా దాడి చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త సహా పలువురు నాయకులు స్వయంగా దాడిలో పాల్గొన్నారు. ⇒ అంబటి నిజంగా తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. నాడు వైఎస్ జగన్‌ను పలు సందర్భాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ సహా పలువురు టీడీపీ, జనసేన నాయకులు తీవ్రమైన భాషతో దూషించారు. వాటిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? వారు ఇప్పటికీ అలాగే దూషణల పర్వం కొనసాగిస్తున్నారు. వాటిపై ఆధారాలతో సహా పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరిపైనా చర్య లు తీసుకున్న దాఖలాలు లేవు. వారందరినీ శిక్షించి తీరుతాం ⇒ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రంలో అశాంతిని సృష్టించడం చంద్రబాబుకు అలవాటే. గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు పట్టాభితో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి పదే, పదే తీవ్రంగా తిట్టించారు. ఫలితంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. దానిని మనసులో పెట్టుకుని అంబటి రాంబాబును చంపాలన్న కుట్రతోనే టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారని కచి్చతంగా తెలుస్తోంది. ⇒ టీడీపీ గూండాల దాడిపై వైఎస్సార్సీపీ చట్టపరంగా న్యాయ పోరాటం చేస్తుంది. పార్లమెంటులో సైతం దీనిపై గళమెత్తుతాం. వీడియోలన్నీ తీసిపెట్టుకున్నాం. దాడి వెనుక ఉన్న వారు, దాడిలో పాల్గొన్న వారి పేర్లూ డిజిటల్ డైరీలో ఎక్కిస్తాం. నిందితులను చట్టపరంగా శిక్షించి తీరుతాం. ⇒ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నందిగం సురే‹Ù, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లా తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి దగ్గరుండి దాడి చేయించారు : అంబటి మౌనిక గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి నాయకత్వంలో ఇంట్లో ఉన్న మహిళలపై కూడా దాడి జరిగిందని మాజీ మంత్రి, కాపు నాయకుడు, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక స్పష్టం చేశారు. టీడీపీ గూండాల దాడిలో దెబ్బతిన్న వస్తువులను ఆదివారం ఆమె పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికి చూపించారు. శనివారం సాయంత్రం టీడీపీ మూకలు ఒక్కసారిగా ఇల్లు, కార్యాలయంపై దాడులకు తెగబడ్డారని చెప్పారు.టీడీపీ నాయకులు తన తండ్రిని ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టారన్నారు. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి వెంట పెద్ద సంఖ్యలో వచి్చన మహిళలు బూతులు తిడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురి చేశారన్నారు. గళ్లా మాధవి ఉసికొలి్పన తర్వాతే ఇంటితో పాటు కార్యాలయంపై దాడి జరిగిందని తెలిపారు. అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంలో ఉన్నారని తెలిసీ, టీడీపీ రౌడీమూకలు విధ్వంసానికి దిగాయన్నారు. ఆ సమయంలో తాము పిల్లలతో బిక్కుబిక్కుమంటూ గడిపామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సహాయ, సహకారాలతోనేక ఈ దాడులు జరిగాయన్నారు. -
హైకోర్టుకైనా వెళతాం.. అంబటిని బయటకు తీసుకొస్తాం..
-
దాడి ఘటనను సజ్జలకు వివరసిస్తున్న అంబటి కుమార్తె
-
చంద్రబాబు లక్షణం హింసను క్రియేట్ చేయడమే: సజ్జల
సాక్షి, గుంటూరు: ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది దేనికి?.. ప్రశ్నించే గొంతులను వేధించడానికా? అంటూ చంద్రబాబు సర్కార్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసలేం జరుగుతోందంటూ ప్రశ్నించారు. ‘‘లడ్డూలో కొవ్వు కలిసిందని సీఎం హోదాలో బాబు చెప్పారు. బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారు?’’ అంటూ సజ్జల మండిపడ్డారు.‘‘కల్తీ నిజమంటూ ప్లెక్సీలు వేసి దుష్ప్రచారానికి దిగారు. తప్పుడు ఫ్లైక్సీలను మా పార్టీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ నేతలను పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు. చట్టం.. గూండాలను, అరాచకశక్తులను రక్షించింది. మా పార్టీ నేతలకు ప్రాణాపాయం జరిగితే ఎవరిది బాధ్యత?. పోలీస్ ఉన్నతాధికారులకు బొత్స ఫోన్ చేసినా స్పందన లేదు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలి. మా పోరాటం అహింసాయుతంగా ఉంటుంది. కోర్టులను ఆశ్రయిస్తాం, గవర్నర్‌ను కూడా కలుస్తాం’’ అని సజ్జల పేర్కొన్నారు.ఊరుపేరులేని ఫ్లైక్సీలను పోలీసులే తొలగించాలి. డీజీపీ, హోంమంత్రి సమాధానం చెప్పాలి. విడుదల రజిని, భూమన, బ్రహ్మనాయుడిపైనా దాడికి యత్నించారు. గతంలో టీడీపీ నేత పట్టాభి ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారు. చంద్రబాబు లక్షణం హింసను క్రియేట్ చేయడమే. ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి దాడులు చేయించారు. టీడీపీ అరాచకాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. డిజిటల్ బుక్‌లో అరాచకవాదుల పేర్లు ఎక్కిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక అరాచక వాదులకు శిక్ష తప్పదు. మాజీ హోంమంత్రిని ఎస్పీ ఆఫీస్ గేట్ ఎదుట వెయిట్ చేయించారు. లోకేష్ నోటి వెంట వచ్చే ప్రతి మాట బూతే’’ అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అంబటి ఇంటికి వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైఎస్సార్సీపీ నేతల బృందం చేరుకుంది. నిన్న అంబటి ఇంట్లో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. అంబటి ఇంటిని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పరిశీలించారు. అనంతరం అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ నేతల వెంట వచ్చిన కార్యకర్తలను బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు.అంబటి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎంపీ మోదుగుల, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ, నియెజకవర్గ ఇన్‌ఛార్జిలు నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, బాలసాని కిరణ్, డైమండ్ బాబు, గజ్జల భార్గవ్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారు. -
టీడీపీ నేతలు ఫ్లెక్సీలపై సజ్జల రియాక్షన్...
-
నిజమేంటో.. రెండు జాతీయ ల్యాబ్ రిపోర్టులు చెప్పాయి!
-
‘చంద్రబాబు చేసింది మహాపాపం’
సాక్షి,తాడేపల్లి: తాడేపల్లి: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని, సీబీఐ ఛార్జిషీట్ ద్వారా ఈ విషయం వెల్లడైందని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన లేబొరేటరీల సాక్షిగా ఈ విషయం తేట తెల్లమైందన్న ఆయన... కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారని మండిపడ్డారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ... తన వ్యాఖ్యల ద్వారా కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసిన బాబు.. అది తప్పని తెలిసినా క్షమాపణ చెప్పకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పైగా సిట్ నివేదికతో తనను తాను సమర్థించుకోలేని సీఎం.. మరింత దిగజారి లడ్డూపై మరలా దుష్ప్రచారం చేయడాన్ని ఖండించారు. ఈ నేపధ్యంలో బాబును ప్రజా క్షేత్రంలో బోనులో నిలబెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. గతంలో చంద్రబాబు బోలే బాబా డెయిరీని ప్రోత్సహిస్తే... వైఎస్సార్సీపీ హయాంలో బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను సుప్రీం కోర్టు సైతం తప్పుపట్టిందని... తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే ఆనందపడాల్సింది పోయి.. మరలా విష ప్రచారానికి తెర లేపడాన్ని ఖండించారు. ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్లను రాక్షస తెగ అనడంలో తప్పులేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నోరెత్తకపోయినా.. మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.తన వ్యాఖ్యలకు కట్టుబడిలేకపోతే... చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే...చంద్రబాబు వ్యాఖ్యలు వెనుక రాజకీయ దురుద్దేశం..2024 సెప్టెంబరులో తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతోనే వివాదం మొదలైంది. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందులో మనం గమనించాల్సిన ప్రధాన అంశం... జాతీయ స్ధాయిలో ప్రతిష్టాత్మకమైన లేబోరేటరీ రెండూ తమ రిపోర్టులో చంద్రబాబు చేసిన నీచమైన, అన్యాయమైన, పాపిష్టి ఆరోపణలు అబద్దం అని తేల్చాయి. లడ్డూలో జంతు కొవ్వు కల్తీ జరగలేదన్న విషయం పక్కాగా నిరూపితమైంది. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారన్నది బట్టబయలైంది.అయితే తన దుర్మార్గమైన వ్యాఖ్యలతో కోట్లాది మంది స్వామి వారి భక్తులను షాక్ కి గురి చేసింది మాత్రం చంద్రబాబే. దాన్ని అంతే గట్టిగా తిప్పికొట్టకపోతే... ఆయన తనంతట తాను నేను తప్పు చేశాను, ఆ మాట వాడకుండా ఉండాల్సింది అని అనకపోతే అది అలాగే నిల్చిపోయే అవకాశం ఉంది కాబట్టి... అందరూ ముక్తకంఠంతో చంద్రబాబూ నువ్వు తప్పు చేశావని చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబుకు మాత్రం తప్పు జరిగింది.. క్షమాపణ చెప్పాలన్న విచక్షణ లేదు. పైగా మరింత దిగజారి ఆయనతో పాటు సైతాను లక్షణాలతో ఒక కూటమిగా చేరిన వారందరూ ఇంకా కల్తీ జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారు. దాన్ని కూడా కచ్చితంగా ఎండగట్టాలి. అదే విధంగా చంద్రబాబు ముందు చెప్పిన అబద్దపు ఆరోపణలనూ ఎండగట్టాలి. ప్రజాక్షేత్రంలో చంద్రబాబును బోనులో నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంది.అడ్డంగా దొరికి మరింత అడ్డగోలు ప్రచారం..అసలు నెయ్యే సరఫరా చేయలేదు, కెమికల్స్ కలిసిన నెయ్యిని వాడారని ఆరోపిస్తున్నారు. ఇవే బ్యానర్లను వేసి రాష్ట్ర మంతా ప్రచారం చేస్తున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ... దారుణమైన రాజకీయ ఆరోపణలు చేసిన చంద్రబాబు దాన్ని సమర్ధించుకోవడానికి తగిన ఆధారాలు లేని పరిస్థితుల్లో.. అడ్డగోలుగా ఇంకా మరింత దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారు. అసలు సుప్రీంకోర్టు ఆదేశాలు, సీబీఐ దర్యాప్తు ప్రధానంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆంశంపైనే సాగింది. ఇక చంద్రబాబు చెబుతున్నట్టు నెయ్యి సరఫరా దారులను చూస్తే... ప్రస్తుతం బోలే బాబా అని చెబుతున్న సరఫరాదారులు గతంలో చంద్రబాబు హయాంలో హర్ష డెయిరీ పేరుతో ఉన్నదాన్నే పేరు మార్చారు. బాబు హయాంలో 2018 ప్రాంతంలో ఆ డెయిరీ తనిఖీకి వెళ్లి, అర్హత పత్రం ఇచ్చి, సఫ్లై ఆర్డరు కూడా ఇచ్చారు. ఆ రోజు ఉన్న డెయిరీ మా హయాంలో వచ్చేసరికి రిజెక్ట్ అయింది. ఇప్పుడేమే వాళ్లే వేరే కంపెనీల ద్వారా వచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. మరలా అది కూడా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న సాంపుల్స్ ను బట్టే చెబుతున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో బోలేబాబా డెయిరీయే హర్ష డెయిరీగా పేరు మార్చుకుని వచ్చింది. మరలా 2019లో మేం దాన్ని రిజక్ట్ చేస్తే... 2024 చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత సరఫరా చేసిన నెయ్యిని టెస్ట్ చేసారు. అది కూడా ఏ ఆర్ డెయిరీ నుంచి వచ్చిన నెయ్యి శాంపిల్స్ పరీక్షించారు. అయితే ఈ ఏ ఆర్ డెయిరీతో పాటు మరో రెండు సంస్థలకు బోలేబాబా సరఫరా చేశాడు. అది కూడా 2019-24 మధ్యనే ఇదంతా జరిగిందని చెబుతున్నారు. మా విచారణలో అక్కడకి వెళ్లి ఖాలీ డ్రమ్ములు, ఇన్ వాయిస్ లు చూసి పట్టుకున్నామని ఛార్డిషీట్ లో ఉంది. వాళ్లెవరు అన్నది విచారణలో తేలుతుంది. కానీ రికార్డుల్లో బోలేబాబా అని లేదు, ఏ ఆర్ డెయిరీ అని మాత్రమే ఉంది. సిట్ ఛార్జ్ షీట్ లో బోలేబాబా అన్నది లేదు.. ఈ డెయిరీలో ద్వారా సరఫరా చేశారని చెబుతున్నారు. అది విచారణలో తేలుతుంది. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వం కానీ, టీటీడీ బోర్డు, సభ్యులు ఉన్నారని మాత్రం ఆరోపణ కానీ, ప్రస్తావన కానీ ఎక్కడా ప్రస్తావించలేదు.బోలేబాబాను ప్రోత్సహించిందే బాబు..అంటే బోలేబాబాను గతంలో ఎంకరేజ్ చేసిందీ చంద్రబాబూ, తాజాగా చంద్రబాబు జూన్ 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసిన శాంపుల్స్ నుంచే విచారణకు పంపించారు. ఈ శాంపిల్స్ కూడా బోలేబాబకు సంబంధించినది కాదు... ఏ ఆర్ డెయిరీ కి బోలేబాబా సరఫరా చేసిందన్నది మా విచారణలో తేలిందని సిట్ తెలిపింది. అది విచారణలో తేలుతుంది. అలాంటప్పుడు వైవీ సుబ్బారెడ్డి హయాంలో, వైఎస్.జగన్ హాయంలో ఏ రకంగానూ తప్పు జరగలేదు. మరో అంశం అప్పన్న లావాదేవీలపై మాట్లాడుతున్నారు. అతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పీఏగా ఉన్నారన్న విషయం కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య అప్పటి టీటీడీ పర్చేజింగ్ కమిటీలో సభ్యురాలుగా ఉన్నారన్న విషయం దర్యాప్తులో కానీ, మీడియాలో కానీ ఎందుకు ప్రస్తావనకు రావడం లేదు?. నిష్పాక్షపాతంగా విచారణ జరుగుతుంటే ఇవన్నీ ప్రస్తావనకు ఎందుకు రావడం లేదు? కేవలం సుబ్బారెడ్డి పీఏ అని చెప్పడం ద్వారా మరో నీచమైన రాజకీయాని తెరతీయాలనుకుంటున్నారు.సుప్రీం కోర్టు సైతం చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపట్టింది. బాధ్యతాయుతమైన స్ధానంలో ఉండి అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. బోర్డు తరపున నుంచి ఎలాంటి విచారణ లేకుండా ఈ రకంగా బాధ్యతలేకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే.. చంద్రబాబు ఆయన అనుచర వర్గం ఓ రాక్షస తెగ మాదిరిగా వ్యవహరిస్తూ.. సైకోల మాదిరిగా ఎదుటివాడు కోలుకోకుండా దారుణంగా దెబ్బకొట్టడంతో పాటు వారి చేతిలో ఉన్న ప్రసార సాధనాల ద్వారా దుష్ర్పచారం చేయడమే వీరి లక్ష్యం. ప్రాణాలు తీయకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డమే వీరి లక్ష్యం. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేయడమే షాక్. ఒక మనిషి ఇంత అన్యాయమైన, నీచమైన ఆరోపణ చేయగలడా? అది కూడా ముఖ్యమంత్రి స్దానంలో ఉన్న వ్యక్తి ఇంతటికి దిగజారాడా అన్న షాక్ సిబీఐ నివేదిక చూసిన తర్వాత అయినా వచ్చి ఉంటుంది.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పటిష్ట చర్యలు...సిట్ నివేదికలో పామొలిన్ ఇతర రకాలు కలిసిందని చెబుతున్న నేపధ్యంలో.. దాంతో తయారు చేసిన లడ్డూ రెండు రోజుల పాటు ఉంటుందా? ఛార్జిషీట్ లో ఫైల్ చేసిన దానికి కూడా ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది. కోర్టులు వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. టీటీడీ లాంటి పెద్ద వ్యవస్ధలు స్వతంత్రంగా పనిచేస్తుంటాయి. అయినప్పటికీ కూడా వైయస్.జగన్ హయాంలో టీటీడీలోని వ్యవస్ధలను మరింత సమర్ధవంతంగా పనిచేయించడానికి కావాల్సిన అన్ని చర్యలను తీసుకున్నారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ కోసం గతంలో కంటే మెరుగైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నారు. పరకామణి కోసం కూడా నూతన భవనాన్ని నిర్మించి, మరింత మెరుగైన టెక్నాలజీని కూడా వైయస్.జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.టీటీడీ బోర్డు ద్వారా నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. గతంలోనూ నెయ్యి సరఫరా ఈ కంపెనీలు చేశాయి. ఈ నేపధ్యంలో 2019-24 లో మాత్రమే అని ఎలా చెబుతారు?. ఒక్కటి అయితే వాస్తవం.. టీటీడీ నిర్వహణలో సాధారణంగా జరిగే తనిఖీలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అవి గతంలోనూ జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. కేవలం చంద్రబాబు అన్న ఒక్క మాట మొత్తం జాతి దృష్టిని ఆకర్షించింది. అది అబద్దం అనేది మా వాదన. మిగిలినవన్నీ కోర్టులో తేలుతాయి. ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు? ఒకవేళ ఉంటే ఆయన హయాంలోనే బోలేబాబా వచ్చింది. అప్పుడు మంచిదైన బోలేబాబా.. ఇప్పుడెలా కల్తీ అయింది, అది కూడా ఆయన హయాంలోనే తేలింది. మరో కుట్రకు తెరలేపే ప్రయత్నం..వాస్తవానికి ఎల్లో మీడియాలో చెబుతున్నట్టు మా హాయంలో బోలేబాబా అనే సంస్ద లేదు. ఒక్కసారి 2019 సెప్టెంబరులో వస్తే... అది డిస్ క్వాలిఫై చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టాం. అదే చంద్రబాబు హయాంలో సాంకేతికంగా తనిఖీ చేసి మరీ హర్ష డెయిరీ పేరుతో బోలే బాబా ను నెయ్యి సరఫరాకు ఎంపిక చేసారు. ఇప్పుడు ఈ బోలే బాబా పరోక్షంగా ఇతర సంస్థల ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని చెబుతున్నారు. అది కోర్టులో తేలుతుంది. ఒకవేళ టీటీడీ వ్యవహారాల్లో ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందను కుంటే.. ఇప్పుడున్నది చంద్రబాబు ప్రభుత్వం ఆయనకే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మా అనుమానం ఏమిటంటే.. ఇందులో కూడా మరో మహా కుట్రకు కూడా తెరలేపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సిబీఐ కోర్టుకు సమర్పించిన అఫిడివిట్ లో లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని తేలితే.. ఆనందంగా ఫీలవ్వాలి. కల్తీ జరిగిందని చెప్పినందుకు.. అది నిజం కాదని తెలిసినప్పుడు నాలుక్కరుచుకోవాలి, లేదంటే దాటవేసే ప్రయత్నం చేస్తారు. కానీ కల్తీ నిజమని హెర్డింగులు, ఫ్లెక్సీలు పెట్టడం చూస్తుంటే మరింత ఆశ్చర్యం కలుగుతోంది. ప్రసాదం కల్తీ అయిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు అనేకమంది మా మనోభావాలు దెబ్బతిన్నాయని భావించగా... లడ్డూలో జంతుకొవ్వులు కలవలేదని తెలిసి అందరూ ఆనందపడే సమయంలో మరలా అదేప్రచారం చేస్తున్న వీళ్లను రాక్షస తెగ లాగా.. అనడంలో ఏం తప్పు ఉంది?బాబు పాపం మరింత బయటపడ్డం ఖాయం..ఆరోజైనా, ఈరోజైనా చంద్రబాబుకి నిజంతో పనిలేదు. వైఎస్.జగన్ ఎప్పుడూ నిజాలనే నమ్ముతారు. కానీ చంద్రబాబు తానే కొన్ని అబద్దాలను క్రియేట్ చేసి.. వాటినే ప్రచారం చేస్తాడు. అందుకోసం తన ఎల్లో మీడియాను వాడుకుంటాడు. అందుకే నివేదికలో వాస్తవాలు ప్రజలకు తెలిస్తే తనకు రాజకీయంగా పెద్ద దెబ్బ తగులుతుందని భావించి.. ముందే ప్రజల మనస్సులో వాస్తవాలు నాటుకుంటాయి. జంతు కొవ్వు కలవలేదన్న నిజం ప్రజల గ్రహించేలోపే... వారి మైండ్ లో కల్తీ జరిగిందన్న ప్రచారం బలంగా చేయడం ప్రారంభించారు. తద్వారా అసలు నిజం మరుగునపడిపోతుంది. మరలా వైయస్సార్సీపీని టార్గెట్ చేయవచ్చు.. మేం చేసిన పాపం పోతుందని భావించారు. కానీ వాస్తవాలు ప్రజలు గ్రహించారు. చంద్రబాబు చేసిన ఆరోపణ తప్పైందని ప్రజలు గ్రహించారు. ప్రజలు ఈ మాట చెబుతున్నారు అంటే.. జాతీయ స్ధాయిలో కీలకవ్యక్తిగా చెప్పుకునే వ్యక్తి ఇలాంటి ఆరోపణ చేయడం దారుణం అన్న మాట జాతీయస్ధాయిలో కూడా వ్యక్తమవుతోంది. తాము చేసిన పాపాన్ని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు ఆయన భాగస్వామ్యులు మందుకు వెళ్లే కొద్ది వారు చేసిన పాపం మరింత బహిర్గతమవుతుంది. వాళ్లు ఎంత నికృష్టులో అన్న విషయం కూడా బయటపడుతుంది.ఇలాంటి ఆరోపణ చేశారు కాబట్టే.... వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్ళారు. సుప్రీం కోర్టు కూడా తీవ్రంగా స్పందించి దర్యాప్తునకు ఆదేశించారు. వైవీ సుబ్బారెడ్డి అత్యంత నిష్టాగరిష్ట భక్తుడు.. ఆయన 30 దఫాలుకు పైగా శబరిమల వెళ్లారు. గోవులను అమితంగా ప్రేమించి, పూజిస్తారు. అలాంటి వాళ్లపై కూడా క్రిస్టియన్ అంటూ దుష్ర్పచారం చేశారు. ఒక అబద్దాన్ని నిజం చేయడానికి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఏకంగా పందికొవ్వు, ఆవుకొవ్వు, చేపనూనె కలిసాయని ఆరోపించాడు. ఈ లడ్డూలనే అయోధ్యకు కూడా పంపించారని ఆరోపించారు. ఇప్పుడు తీరా సీబీఐ నివేదికలో అలాంటిదేమీ లేదని తెలిసిన తర్వాత వీరిద్దరూ ఎందుకు నోరు మెదపడం లేదు? ఇవాళ తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని కానీ, లేదా నోరు జారి మాట్లాడానని ఎందుకు చంద్రబాబు చెప్పడం లేదు?. ఈ మాట మీడియా చంద్రబాబును ఎందుకు అడగడం లేదు?. ఆయన తనను ప్రశ్నించని వాళ్లనే కూర్చోబెట్టుకుంటాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ని కూడా ఎందుకు ప్రశ్నించడం లేదు? వైఎస్సార్సీపీ తరపున మేం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం.. ఆయన బయటకు వచ్చి తన వ్యాఖ్యల మీద అయినా నిలబడాలి, లేదా తన తప్పైందని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. వైయస్సార్సీపీకో, టీటీడీ మాజీ చైర్మన్ లకో క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు... కనీసం దేవుడి పట్ల అపచారం చేశాననో.. భక్తుల మనోభావాలు దెబ్బతీశాననో చెబితే చాలు. అందుకు చంద్రబాబు, ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ సిద్దంగా ఉన్నారా లేదో వేచి చూడాలని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.మనకు అనుకూలంగా వస్తే ఒకలా లేదంటే మరొకలా మాట్లాడాల్సిన పనిలేదు. నివేదిక అంతా సవ్యంగా ఉందని మేం చెప్పడం లేదు.. మేం చెప్పేది ఒక్కటే దర్యాప్తు సంస్ధలు కూడా టాంపర్ చేయలేని ఫ్రూప్.. రెండు జాతీయ సంస్ధలు ఇచ్చిన రిపోర్ట్స్ లో చాలా స్పష్టంగా నెయ్యిలో జంతుకొవ్వు లేదని స్పష్టమైంది. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా చంద్రబాబు చెప్పింది పచ్చి అబద్దమని రుజువైందని ఆయన స్పష్టం చేశారు. -
జనాభా ఆధారిత యూనిట్ విధానంలో పార్టీ కమిటీలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కమిటీల నిర్మాణంలో ఇకపై జనాభా ఆధారిత యూనిట్ విధానం అనుసరించాలని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. మున్సిపల్ వార్డు, కార్పొరేషన్ డివిజన్, పంచాయతీ పరిధిలో 2,500 కంటే ఎక్కువ జనాభా ఉన్న సందర్భాల్లో ఆ పరిధిలోని ప్రతి సచివాలయ పరిధిని ఒక ప్రత్యేక యూనిట్‌గా తీసుకోవాలని.. ఆ యూనిట్‌కు ఒక కోర్ కమిటీ, ఏడు అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటుచేయాలని ఆయన చెప్పారు. వైఎస్సార్సీపీ టాస్క్‌ఫోర్స్ సభ్యులు, పార్లమెంట్ పరిశీలకులతో బుధవారం సజ్జల జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మార్పుతో పార్టీ సంస్థాగత బలాన్ని కిందిస్థాయిలో మరింత పటిష్టం చేయడం, కార్యకర్తలకు స్పష్టమైన బాధ్యతలు, మెరుగైన సమన్వయం కల్పించడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పారు. పార్టీ టెక్నికల్ టీం అవసరమైన మ్యాపింగ్, డిజిటల్ సపోర్ట్ అందిస్తూ కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ యూనిట్ విధానం పట్టణ ప్రాంతాలైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీలకు వర్తిస్తుందని సజ్జల చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్చార్జ్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 25లోగా కమిటీల నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారం కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. ఉగాది రోజు పార్టీ కేడర్‌కు ఐడీ కార్డులు అందించే ఆలోచనలో ఉన్నందున నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు. -
Sajjala: ఆర్గనైజ్డ్ మీడియా టెర్రర్... కేక్ ను ఎవడైనా గొడ్డలితో కట్ చేస్తాడా?
-
Sajjala: కోర్టు మొట్టికాయలు వేసిన బుద్ధి రావడం లేదు.. కోడి కొస్తే కేసు పెడతారా..
-
YS జగన్ ప్రశ్నిస్తే తప్పా: Sajjala
-
Sajjala : కోడి కోశారని నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు
-
Sajjala : రాయలసీమ హక్కుల పరిరక్షణలో చంద్రబాబు విఫలమయ్యారు
-
‘ఆ ప్రాంతంలో అవినీతి జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించకూడదు?’
తాడేపల్లి : అమరావతిలో అన్యాయం, అవినీతి జరుగుతుంటే ప్రశ్నించడంలో తప్పేముందన్నారు వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తన తందాన కంపెనీలకే బాబు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని, ఆ కంపెనీల నుంచి 4 శాతం కమీషన్లు బాబు తీసుకుంటున్నారని సజ్జల స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం, జనవరి 10వ తేదీ) తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన సజ్జల.. మొబలైజేషన్ అడ్వాన్స్‌లతో బాబు అండ్ కో దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. అమరావతిలో నీళ్లు తోడటానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వైఎస్ జగన్ ఇల్లు ఉన్న ఏరియా, అమరావతి ఒక్కటైనా.. అమరావతిలో నీళ్లు తోడటానికి వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు అక్రమ నివాసంలో ఉన్నారు.. ఇప్పుడు ఇల్లు కడుతున్నారు. మేం అమరావతిని తక్కువ చేయలేదుతాము ఎప్పుడూ అమరావతిని తక్కువ చేయలేదని, అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న స్కామ్‌లను ప్రశ్నిస్తున్నామన్నారు సజ్జల. ‘విశాఖలో సీఎం కూర్చుంటే మరింత అభివృద్ధి అని చెప్పాం. అమరావతిని వైఎస్సార్సీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. చంద్రబాబు బెదిరింపులు అరుపులు కాకుండా సూటిగా సమాధానం చెప్పాలి. గొంతెత్తి, కళ్లు పెద్దవి ేసి బెదిరిస్తే సమాధానం దొరకదు. రూ. లక్ష కోట్ల అప్పుకు ఏడాదికి రూ. 8 వేల కోట్ల వడ్డీ కట్టాలిరాయలసీమ ప్రయోజనాలు ఎలా.?శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ రోజుకు 8 టీఎంసీలు వాడుకుంటుంది. 777 అడుగుల నుంచే తెలంగాణ నీళ్లు తోడుకుంటుందే రాయలసీమ ప్రయోజనాలు ఎలా?, రాయలసీమ హక్కుల పరిరక్షణలో చంద్రబాబ విఫలమయ్యారు. ఆర్గనైజ్జ్ మీడియా టెర్రరిజంతో నిజాలను ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారు. చంద్రబాబు సైలెంట్ ఉండటం అంటే రేవంత్ చెప్పింది నిజమే అని అర్థం చేసుకోవాలివిష, అబద్ధపు ప్రచారంలో చంద్రబాబు పీహెచ్డీవిష, అబద్ధపు ప్రచారంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని సజ్జల విమర్శించారు. పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్ అనేది వైఎస్ జగన్ ఉన్నప్పుడే ఉందని, ఇప్పుడు దాన్ని చంద్రబాబు తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళితే అందులో దాపరికం ఎందుకని ప్రశ్నించారు. ‘లక్షా 80 కేజీల గోమాంసం విశాఖలో పట్టుబడితే ఏం చేశారు. క్వశ్చన్ చేసే వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు. మేం అడిగిన ప్రశ్నలకు బాబు సమాధానం ఇవ్వకుండా.. మమ్మల్ని ప్రశ్నలు అడుగుతాడు. అధికారం వచ్చాక కూడా వారంలో మూడు, నాలుగు రోజులే బాబు ఇక్కడ ఉంటున్నారు. ప్రతివారం హైదరాబాద్‌లో చంద్రబాబు, లోకేష్‌లకు ఏం పని? అని నిలదీశార సజ్జల. చంద్రబాబు అరాచక పాలన నుంచి ఏపీని కాపాడుకుందాంచంద్రబాబు అరాచక పాలన నుంచి ఏపీని కాపాడుకుందామన్నారు సజ్జల ‘ వైఎస్ జగన్ హయాంలో రూ. 3.30 లక్షల కోట్లు అప్పు చేశారు. రూ. 3.30 లక్షల కోట్లలో రూ. 2.73 లక్షల కోట్లు డీబీటీ ఇచ్చాం. చంద్రబాబు రెండేళ్లు తిరగకుండానే రూ. 3 లక్షల కోట్లపైగా అప్పు చేశారు. చంద్రబాబ పాలనను ప్రజలు, విజ్ఞులు మేధావులు ప్రశ్నించాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి’
తాడేపల్లి : ఏపీలొ రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 29వ తేదీ) పార్టీ లీగల్ సెల్ నేతలతో ఆయన జూమ్ కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై చర్చించారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడాన్ని తట్టుకోలేక పార్టీ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు. నిరంకుశ పాలన, నియంత పాలనకు ఇంతకు మించిన నిదర్శనం ఉంటుందా?, చంద్రబాబు, లోకేష్‌లు బరితెగించి వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి వంతపాడుతున్న పోలీసుల చర్యలను ధీటుగా ఎదుర్కుందాం.చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేద్దాం. క్యాడర్‌కు అండగా నిలుద్దాం. రెడ్ బుక్ రాజ్యాంగంపై గట్టిగా పోరాడుతున్న పార్టీ లీగల్ సెల్‌కు అభినందనలు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీకి పొట్టేళ్ళ తలలతో హారం వేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఈ మధ్య ఒకరిపై రాజద్రోహం కేసు పెట్టారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?, కమ్యూనిస్ట్ నాయకుడు హక్కుల కోసం పోరాడితే పీడీ యాక్ట్ పెట్టారు. జగన్ మరింత పట్టుదలతో పార్టీని నడిపిస్తున్నారు. ప్రతి ప్రజాసమస్యపై ముందుండి పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కూటమి ప్రభుత్వ దమనకాండను ధీటుగా ఎదుర్కొందాం. వైఎస్సార్సీపీ సైన్యం పోరాట పటిమతో దూసుకెళుతుంది’ అని స్పష్టం చేశారు. -
కమిటీల నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కమిటీల నిర్మాణంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టి పెట్టాలని.. ఇది ఒక స్పెషల్ డ్రైవ్‌లా ముందుకు తీసుకెళ్లాలని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఆదివారం(డిసెంబర్ 28) ఆయన వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘అందరూ ఫోకస్‌తో పనిచేయాలి. పార్టీ కార్యక్రమాలతో పాటు కమిటీల నిర్మాణం అనేది కూడా అత్యంత ప్రాధాన్యమైనదని వైఎస్ జగన్ ప్రత్యేకంగా చెప్పారు. కమిటీలలో నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలి, మొక్కుబడిగా ఉండకూడదని వైఎస్ జగన్ చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంకల్లా కమిటీలన్నీ నియామకాలు పూర్తి అవ్వాలి. విలేజ్, వార్డు కమిటీలు త్వరగా పూర్తిచేయాలి, డేటా అంతా ఎలాంటి తప్పులు లేకుండా సరిగా ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు.‘‘డేటా ప్రొఫైలింగ్ సరిగా ఉంటే మనకు భవిష్యత్‌లో అనేక ఉపయోగాలు ఉంటాయి. పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం జరుగుతుంది. దాదాపు 15 లక్షల మంది వైఎస్సార్సీపీ సైన్యానికి కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం నేరుగా అందేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ సోల్జర్స్‌ను రెడీ చేసే కార్యక్రమంలో భాగమే. ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి డిజిటల్ మేనేజర్లు కూడా అందుబాటులో ఉన్నారు. కమిటీల నియామకంపై నాయకులకు అవసరమైన ఓరియెంటేషన్ కూడా ఇప్పటికే ఇస్తున్నాం...ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సైంటిఫిక్‌గా కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. కడప పార్లమెంట్, వేమూరు, పుంగనూరు, మడకశిర ఇలా కొన్ని నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా మైక్రో లెవల్ లో కూడా అన్ని కమిటీలు పూర్తయ్యాయి. కమిటీల నియామకంపై పార్టీ సీనియర్ నాయకులు కొందరితో టాస్క్ ఫోర్స్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశాం, వారంతా కూడా అవసరమైన సమావేశాలు నిర్వహించుకుని ఇది ఒక డ్రైవ్ లాగా చేయాలని నిర్ధేశించాం. కమిటీల నియామకాలు అన్నీ పక్కాగా జరిగితే ఏ ఎన్నికలు జరిగినా గెలుపు సులభతరమవుతుంది. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలు పక్కగా ఉంటే పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విజయవంతం చేయవచ్చు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. -
జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది
-
జగన్ వ్యక్తిత్వంపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: తన ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజలకు ఎంత మేలు చేయాలో అంతా చేశారని.. మళ్ళీ అధికారంలోకి రాగానే చేయాల్సిన కార్యక్రమాలకు కూడా ప్లానింగ్ చేసుకున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం తాడేపల్లి కుంచనపల్లిలో జరిగిన వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సజ్జల.. భారీ కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారంలో ఉన్నా లేకపోయినా జనం జగన్ వెంటే. ప్రజలకు మేలు చేసేది జగన్ ఒక్కడే. కోట్లాది మంది జగన్‌పై ఆ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే తన ఐదేళ్ల పాలనలో అందరికీ మేలు చేశారు. ఎంతవరకు మేలు చేయాలో అంతవరకు చేశారు. రాజకీయాల్లో ఐదేళ్లు అనేది ఎక్కువేం కాదు. .. ఏదో ఆశించి జగన్ సహాయం చేయరు. తన వలన ఎంత మేరకు మేలు చేయాలా అనే నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. ఓదార్పు యాత్ర సమయంలో కూడా ఆయన ఎంతో సహాయం చేశారు. తన తండ్రి కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఆయన యాత్ర చేశారు. .. చాలా గొప్పగా సహాయం చేసినా ఆ విషయం బయటకు చెప్పుకోలేదు. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్. కరోనా సమయంలో కూడా క్వారంటైన్ సెంటర్ లో మంచి భోజనం పెట్టాలనీ, మంచి వైద్యం చేయించాలని తపన పడ్డారు. ప్రతి ఒక్కరినీ జగన్ తన కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కాలనీలే సృష్టించారు. 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, పోర్టులు, హార్బర్ లు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినా పబ్లిసిటీ చేసుకోలేదు.. .. చంద్రబాబు 18 నెలల్లోనే రూ.2.70 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ జనాలకు చంద్రబాబు చేసిన మేలు ఏదీ లేదు. జగన్ మాత్రం తన ఐదేళ్ల పాలనలోనే ఆర్ధికవేత్తలు సైతం ఆశ్చర్యపోయేలా పాలన చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనేది కూడా ఆయన ఈపాటికే ప్లానింగ్ వేసుకున్నారు’’ అని సజ్జల అన్నారు. -
కార్యకర్తల్లో జోష్.. ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
సాక్షి, తాడేపల్లి : రేపు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు.. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. తాజాగా కుంచనపల్లిలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ప్రజల్లో రియలైజేషన్ మొదలైంది. చంద్రబాబు మాయ మాటలు నమ్మినందుకు ప్రజలే బాధపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నందుకు జనం ఆవేదన పడుతున్నారు. మళ్ళీ వచ్చేది జగన్ ప్రభుత్వమే. మంచి రోజులు త్వరలోనే వస్తాయి’ అని అన్నారు. శ్రీకాళహస్తి..శ్రీకాళహస్తి లో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలుమాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలుకేక్ కట్ చేసిన మధుసూదన్ రెడ్డివైఎస్సార్సీపీ ఆఫీసు నుంచి రామసేతు బ్రిడ్జ్ మీదుగా నెహ్రు వీధిలో ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ.వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా హెల్మెట్లు పంపిణి, కళాకారులకు డప్పులు వాయిద్యాలు పంపిణీ చేసిన మధుసూదన్ రెడ్డి. -
‘వైఎస్సార్సీపీ సంస్ధాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలి’
తాడేపల్లి : 35 రోజుల పాటు వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 19వ తేదీ) ,వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షలు, జిల్లా ప్రధాన కార్యదర్శలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థాగత నిర్మాణం, కమిటీల నియామకాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ‘ రాష్ట్రస్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకూ కమిటీలు పూర్తవ్వాలి. అప్పుడు పార్టీకి 16 నుంచి 18 లక్షల సైన్యం రెడీ అవుతుంది. కమిటీల నిర్మాణం పూర్తికాగానే ఐడీ కార్డులు ఇస్తాం. కమిటీలలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉత్సాహంగా పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలి. కార్యకర్తల కష్టంతోనే కోటి సంతకాల ఉద్యమం సక్సెస్ అయింది’ అని స్పష్టం చేశారు. -
ప్రజా ఉద్యమంతో తగ్గిన చంద్రబాబు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సంచలన నిర్ణయం..
-
Sajjala: మెడికల్ కాలేజీలను అనుమతులు తేవడం చాలా కష్టం
-
ఇది పీపీపీ కాదు.. పెద్ద స్కామ్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కోటి సంతకాల ప్రతులను బుధవారం.. ఆ పార్టీ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరం అయితే ప్రభుత్వం ఉండి ఏం లాభం? అంటూ ప్రశ్నించారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కామ్‌కు పాల్పడుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రజల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. కోటిమందికి పైగా చేసిన సంతకాలే.. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజా నిరసనకు నిదర్శనమని, ప్రభుత్వ నిర్ణయంపై ఇది కచ్చితంగా రెఫరెండమే అని ఆయన తేల్చి చెప్పారు. ఏపీని మెడికల్ హబ్ గా మార్చాలని కలగన్నవైఎస్ జగన్ అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.అయితే అధికారంలోకి రాగానే కాలేజీల నిర్మాణాలను నిలిపివేసిన చంద్రబాబు.. కమిషన్ల కక్కుర్తితోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మమ్మాటికీ ముందస్తు కుట్రేనని.. . ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆక్షేపించారు. కాలేజీల ప్రైవేటీకరణతో పాటు అప్పనంగా ఆస్తులు అప్పగిస్తున్న చంద్రబాబు.. అదనంగా 2 ఏళ్ల పాటు రూ.1400 కోట్లు జీతాలు ప్రభుత్వం నుంచి చెల్లించాలన్న నిర్ణయం.. మరో భారీ కుంభకోణమని స్పష్టం చేశారు.చంద్రబాబు తీరుకు నిరసనగా రేపు సాయంత్రం(డిసెంబర్ 18, గురువారం) వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గౌరవ గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు సమర్పిస్తారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన... లేనిపక్షంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వీటిపై సమీక్షించి, బాధ్యులను బోనెక్కిస్తామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఏపీని మెడికల్ హబ్ చేయడమే వైఎస్ జగన్ లక్ష్యం:ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకుని రావటమే కష్టం, అలాంటి అనుమతులన్నీ వైఎస్ జగన్ సాధించి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కాలేజీలు తెచ్చారు. దేశంలోనే ఉత్తమ మెడికల్ హబ్‌గా ఏపీని మార్చాలని జగన్ కలలు కన్నారు. ఆ మేరకు కింది స్థాయి నుండి పటిష్ఠం చేసుకుంటూ వచ్చారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసింది. అనంతరం ప్రైవేటీకరణకు సిద్ధమైంది. ప్రైవేటు రంగంలోనే అత్యుత్తమ సేవలందుతాయని తాను నమ్ముతున్న సిధ్దాంతాన్ని అమలు చేయడం ప్రారంభించాడు. తాను అధికారంలో లేనప్పుడు ఎప్పుడూ ప్రైవేటు రంగం గురించి నోరెత్తని చంద్రబాబు.. గెలిచిన తర్వాత ప్రైవేటు రంగంలో మంచి సేవలు అందుతాయని చెప్పడం అలవాటు.ఆర్థిక వనరులు లోటు లేకున్నా ప్రైవేటీకరణ మంత్రం:వైఎస్ జగన్ ప్రభుత్వ వైద్య కళాశాలను పూర్తి చేయకుండానే, కేవలం కాలేజీలని నిర్మించాలని లక్ష్యంగా మాత్రమే చెబితే.. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం కష్టమని చెప్పడంలో అర్ధముంది. కానీ ఐదు మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ పూర్తి చేసి, ఆ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగి, విజయవంతంగా కాలేజీలు నడుస్తున్నాయి. మరో రెండు కాలేజీలు పూర్తయ్యాయి.. మరో మూడు కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి.అంటే మొత్తం 10 కాలేజీలు దాదాపు పూర్తైన దశలో ఎందుకు వాటిని ఆపాల్సి వచ్చింది. మరో కీలకమైన అంశం ఏమిటంటే... కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేకుండా వివిధ ఆర్ధికసంస్ధలతో వైయస్.జగన్ ప్రభుత్వమే టై అప్ అయింది. నీకు కావాల్సిందల్లా కాలేజీల నిర్మించాలన్న మనసు మాత్రమే. అదే చంద్రబాబుకు లేదు. చంద్రబాబు హెరిటేజ్‌తో సహా ఎవరైనా ప్రైవేటు రంగంలో ఉచితంగా సేవలు అందిస్తారా? రూపాయి పెట్టుబడి పెట్టి రూ.10, రూ.20, రూ.50 ఎలా సంపాదించాలనే వస్తారు. చంద్రబాబు ఏం చెప్పినా పీపీపీ అనేది ఓ పెద్ద స్కామ్. ఇంకా జనాల చెవిలో పువ్వులు ఎలా పెట్టగలననుకుంటున్నాడో తెలియడం లేదు? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కోసం వైఎస్ జగన్ అక్టోబరులో పిలుపునిస్తే... ఈ రెండు నెలల్లో వచ్చిన ప్రజాస్పందన చూసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల అభిప్రాయం చంద్రబాబుకు అర్థం కావడం లేదు. కోటి సంతకాలకు అక్టోబరులో పిలుపునిస్తే.. జనంలో వస్తున్న స్పందన అందరికీ తెలుసు.ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రిఫరెండంలా.. చరిత్రలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పూడూ చూడని విధంగా తొలిసారిగా ఇంత పక్కాగా ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. వైయస్సార్సీపీ ఆధ్యర్యంలో ప్రతిచోటా జనంలోని వెళ్లి సంతకాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పేదలతో పాటు సమసమాజం కావాలనుకునేవాళ్లు, సమాజంలో అసమానతలు తగ్గించాలని కోరుకునేవారు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు.ప్రైవేటీకరణే చంద్రబాబు విజన్:ఇవాల్టికి చంద్రబాబు కొంచెం తగ్గి.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం పేరు పెద్దదిగా ఉంటే.. ప్రైవేటు వాళ్ల పేరు చిన్న అక్షరాల్లో ఉంటుందని చెబుతున్నారు. కాలేజీల భవనాలు, ఆసుపత్రులు, భూమి అంతా ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెట్టిన తర్వాత వాళ్లు పేరు పెట్టినా, పెట్టకపోయినా ఏం ప్రయోజనం ఉంటుంది. పైగా వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించడానికి అంగీకరించడం మరించి ఆశ్చర్యకరం. ఇన్ని ప్రైవేటు వారికి ఇచ్చినప్పుడు... ప్రభుత్వమే ఎందుకు నిర్వహించలేకపోతుంది?మెడిసిన్ చేయాలనుకునే విద్యార్ధులు తొలుత ప్రభుత్వ కాలేజీలనే కోరుకుంటారు. కారణం ఆయా కాలేజీలకు వచ్చే పేషెంట్లు, ఉత్తమ సర్వీసులు, మంచి శిక్షణ అందుతుందన్న ఆలోచనతోనే ఎంచుకుంటారు. మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెడితే... మేం అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అన్నింటినీ రద్దు చేసి ఉచితం చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్నే నిలిపివేశారు.ప్రైవేటీకరణను అవసరం లేకపోయినా సపోర్టు చేసి నెత్తిన పెట్టుకునే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన మొదటి నుంచి ఇదే తీరు. కేవలం కాసుల కోసం కక్కుర్తి పడి ప్రైవేటీకరణ చేయడం ఒక అంశం అయితే... ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైద్యరంగంలో ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నాడు. వైయస్.జగన్ విజయవంతంగా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిస్తే... దాన్ని కొనసాగించాల్సింది పోయి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు 100 శాతం మెడికల్ సేవలు ఉచితం అని చెప్పాడు. ఇవాళ 100 శాతం అవుట్ పేషెంట్ సేవలు ఉచితంగా వస్తాయని, 70 శాతం ఇన్ పేషెంట్ కేటగిరీలో ఉచితం అని చెబుతున్నాడు. ఇవన్నీ ఎవరికి చెబుతున్నావ్ చంద్రబాబూ?జీతాలు చెల్లింపు మరో కుంభకోణం..వైఎస్ జగన్ ఇప్పటికే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించి, విజయవంతంగా నిర్వహించవచ్చని, సామర్థ్యం ఉన్న సిబ్బందిని నియమించవచ్చని నిరూపించిన తర్వాత.. ఇవాళ చంద్రబాబు దాన్నుంచి పక్కకు పోవడం అంటే ఇది పెద్ద కుంభకోణం. రెండో కుంభకోణం.. రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తామని చెప్పడం. ఒక వైపు మెడికల్ కాలేజీలను నిర్మించడానికి డబ్బుల్లేవు అని చెబుతూ... మెడికల్ కాలేజీలను, ఇన్ ఫ్రా స్ట్రక్చర్, భూమితో సహా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూనే.. వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వం నుంచి చెల్లించడం అంటే ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.8 కోట్లు చొప్పున 10 మెడికల్ కాలేజీలకు రూ.80 కోట్లు ఖర్చువుతుంది. రెండేళ్లకు రూ.1400 కోట్లు ఇవ్వాలి. ఈ డబ్బులతో కాలేజీలు పూర్తి కావా?ఇవాళ కార్పొరేట్ కాలేజీల్లో వైద్యం ఖర్చు ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఇవాళ కొత్త ట్రీట్మెంట్ వచ్చిందంటే అది ఎన్ని లక్షలు కట్టమంటే అంతా కట్టాల్సిందే? ఇక్కడ మొదలుపెట్టి ప్రైమరీ హెల్త్ కేర్‌ను కూడా ప్రైవేటుకు కచ్చితంగా అప్పగిస్తాడు. అంటే మొత్తం వైద్య ఆరోగ్యరంగం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుంది. మన ఆర్దిక వ్యవస్ధలో ప్రైవేటు ఉండడం మన మార్కెట్ ఎకానమీలో భాగం.ప్రజల పట్ల ప్రేమ - పాప భీతి లేని వ్యక్తి చంద్రబాబులాభం లేకుండా ప్రైవేటు వ్యాపారులు రారని తెలిసి, వాళ్లకు లాభాలిచ్చి, నువ్వు వేల కోట్లు కుమ్మిరించి.. ఇక్కడ అవసరమైన రూ.2-3 వేల కోట్లు పెట్టలేదంటే చంద్రబాబు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాడు. ఆయన సేవలు చేయనవసరం లేదు, కానీ ద్రోహం చేయడం మహాపాపం. నా వల్ల ఇంత నష్టం జరుగుతుందన్న భయం కానీ పాపభీతి కానీ రెండూ చంద్రబాబుకు లేవు. అందుకే నేటికీ ప్రైవేటీకరణ మంచిదని బుకాయిస్తున్నాడు.రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల వెల్లువఈ నేపధ్యంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరనసగా వైఎస్ జగన్ పిలుపు మేరకు అక్టోబర్‌లో సంతకాల సేకరణ ఉద్యమం మొదలుపెట్టి... రెండు నెలల కాలంలో 1 కోటి సంతకాలను లక్ష్యంగా పెడితే... 1,04,11,136 సంతకాలు వచ్చాయి. ఈ సంతకాలన్నీ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మీరు వ్యతిరేకిస్తే... సంతకం చేయమని అడిగితే..రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో చేసినవే. జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళంలో జిల్లాలో 4,02,833, విజయనగరం జిల్లాలో 3,99,908, పార్వతీపురం మన్యం 2,15,500, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,47,000, విశాఖపట్నం 4,19,200, అనకాపల్లి జిల్లాలో 3,73,000, కాకినాడ జిల్లాలో 4,00,600, బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,20,086, తూర్పుగోదావరి జిల్లాలో 4,06,929, పశ్చిమ గోదావరి జిల్లాలో 4,19,650, ఏలూరు జిల్లాలో 3,60,008, కృష్ణా జిల్లాలో 3,77,336, ఎన్టీఆర్ జిల్లాలో 4,31,217, గుంటూరు జిల్లాలో 4,78,059,..పల్నాడు జిల్లాలో 4,31,802, బాపట్ల జిల్లాలో 3,73,199, ప్రకాశం జిల్లాలో 5,26,168, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 6,30,040, కర్నూలు జిల్లాలో 3,98.277, నంద్యాల జిల్లాలో 4,05,500, అనంతపురం జిల్లాలో 4,55,840, శ్రీసత్యసాయి జిల్లాలో 4,40,358, వైయస్సార్ జిల్లాలో 4,80,101, అన్నమయ్య జిల్లాలో 2,60,500, చిత్తూరు జిల్లాలో 7,22,025 మొత్తం 1 కోటి 3 లక్షల 71వేల 136 సంతకాలు చేరాయి. ఇవి కాకుండా కేంద్ర కార్యాలయానికి చేరిన మరో 40వేలు సంతకాలు కలిపి మొత్తం... 1, 04,11,136 నిఖార్సైన సంతకాలతో ప్రవైటీకరణకు వ్యతిరేకంగా తమ మద్ధతు తెలిపారు.బ్యాలెట్ తీర్పు తరహాలో ప్రజాభిప్రాయం:రాష్ట్రంలో ప్రజాభిప్రాయసేకరణలో ఇంత పక్కాగా బ్యాలెట్ బాక్సులో తీర్పునిచ్చినట్లు.. రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. 1.04 కోట్ల మంది సంతకాలు అంటే అన్ని కుటుంబాలు సంతకాలు చేశారంటే... రాష్ట్రంలో మొత్తం కుటంబాలు 1.60 కోట్లు పైగా ఉంటే... అందులో 1.04 కోట్ల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు.ఇంతమంది సంతకాలు చేసిన తర్వాత చంద్రబాబు పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. క్రెడిట్ ఆయనే తీసుకుని... మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి. టిడ్కో ఇళ్ల విషయంలో కూడా గతంలో చంద్రబాబు డబ్బులు వసూలు చేసి పూర్తి చేయకుండా వదిలేస్తే.. వైఎస్ జగన్ హయాంలో క్రెడిట్ కూడా క్లెయిమ్ కూడా చేయకుండా.. ఉచితంగా అందించారు. అది వైఎస్ జగన్‌కు ఉన్న ఆలోచన. రాజకీయం కోసం ప్రజలతో ఆడుకోవడం సరికాదు. వైఎస్ జగన్ హయాంలో కట్టిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో చూపించుకున్నాడు. ఏమాత్రం జంకులేకుండా క్లెయిమ్ చేసుకోవడం చంద్రబాబుకు అలవాటు.కాలేజీల నిర్మాణానికి కుంటిసాకులు:ఇవాళ మెడికల్ కాలేజీలను కూడా తానే కట్టానని చంద్రబాబు క్లెయిమ్ చేసుకోవచ్చు.. కానీ ప్రైవేటీకరణ చేసి ప్రజల ఉసురు తీసుకోవద్దు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దు. వైఎస్ జగన్ ప్రారంభించిన వాటి నిర్మాణం కొనసాగిస్తే సరిపోతుంది. ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు చేసిన రూ. 2.60 లక్షల కోట్లకు పైగా అప్పులో .. కొంత మెడికల్ కాలేజీల కోసం వెచ్చిస్తే సరిపోయేది. కానీ కుంటిసాకులు వెదుకుతూ, పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పిందని తన అనుకూల పత్రికల్లో రాయించుకోవడం మానేసి... చేసి చూపించాలి వైఎస్సార్ ఉచిత కరెంటు ఇవ్వడం అసాధ్యమని అందరూ అన్నారు.. దాన్ని ఆయన చేసి చూపించేసరికి అందరూ దాన్ని అనుసరిస్తున్నారు.నీవు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం సాధ్యం కాదు అనుకున్నావు.. కానీ వైఎస్ జగన్ వాటిని చేసి చూపిస్తే దాన్ని కొనసాగించ లేకపోవడం దారుణం. భవిష్యత్తు తరాలకు 20, 30 ఏళ్లు గడిచిన తర్వాత... మెడిసిన్‌లో గొప్ప సిస్టమ్స్ ఉన్నాయని చెప్పుకునే అవకాశాన్ని చేతులారా చంద్రబాబు చంపేస్తున్నాడు. ఇప్పటికైనా చంద్రబాబుకు మంచి బుద్ధి కలిగి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను నిర్మించాలని కోరుతున్నాం.ఇదే విషయంపై రేపు సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ ఒక ప్రతినిధి బృందంతో... గవర్నర్‌ని కలిసి వినతి పత్రం ఇవ్వడంతో పాటు, సంతకాల ప్రతులను ఆయనకు సమర్పిస్తామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అప్పటికైనా చంద్రబాబు కుట్రపూరితమైన, తన దుర్మార్గమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మెడికల్ కాలేజీలను ప్రభుత్వరంగంలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిస్తూ..రోడ్లు పీపీపీ విధానంలో నిర్మిస్తే అవి ప్రభుత్వం వద్దే ఉంటాయి కదా అని ప్రశ్నించగా.. అలా చేయడం వల్ల టోల్ గేట్ల ఖర్చు భారీగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఇవేవీ లేవని.. ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్ష లేకుండా ఎందుకు వస్తారని నిలదీశారు. మెడికల్ కాలేజీలు ప్రజారోగ్యానికి సంబంధించిన విషయమని... ఏ దేశమైనా ప్రభుత్వ పరిధిలేకుండా వైద్యాన్ని ప్రైవేటుపరం చేయలేదని గుర్తు చేశారు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు.. వాటి ధరలను సమాజం భరించలేదని... అందుకే ప్రభుత్వం వాటిని బేలన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోటి సంతకాలు ఎవరు చేశారన్నది.. తెలుగుదేశం పార్టీ నేతలందరికీ తెలుసు. ప్రైవేటీకరణ విషయంలో మారిన చంద్రబాబు మాట తీరే ఇందుకు నిదర్శనం. అయినా మొండిగా ముందుకు వెళ్తూ చంద్రబాబు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు.వైఎస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ప్రవేశపెడితే.. ఇదే కూటమి నేతలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం సీట్లు ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా కాలేజీలనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. 108 సేవలకు సంబంధించి ప్రతిచోటా మొత్తం ప్రభుత్వం చేయాలనుకోవడం మంచి మార్గం. ఒకవేళ అది కాకపోతే ప్రభుత్వ కంట్రోల్ ఉంచేలా చూడాలి. కానీ కూటమి నేతలు మేం అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేసి మొత్తం ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పి... ఇవాళ ప్రైవేటీకరణకు వెళ్లడమే మంచిదని వితండవాదం చేయడం దుర్మార్గం.రాజధాని నిర్మాణం కోసం డిజైన్లు, లైటింగ్ వంటి వాటి కోసం కోట్లాది రూపాయులు ఖర్చుపెడుతున్నారు. కానీ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వచ్చేసరికి చేయాలన్న ఉద్దేశం లేకపోవడంతోనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో మాత్రం ఇలా చేయడం దుర్మార్గం. ఉచితంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైయస్.జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణం చేసి చూపించిన తర్వాత కూడా ఇలాంటి వాదన చేయడం అర్ధరహితమని తేల్చి చెప్పారు. -
15న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీలను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఆ పార్టీ అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికారిక ప్రతినిధులు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, అసెంబ్లీ అనుబంధ విభాగ అధ్యక్షులు. జనరల్ కార్పొరేషన్ చైర్పర్సన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిందన్నారు. ఇది ఇప్పుడు తుది అంకానికి చేరుకుందని.. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగిందని సజ్జల వివరించారు.‘‘గ్రామాలు, వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల మద్దతు కూడగట్టాం. ఇప్పటికే సంతకాలు చేసిన పత్రాలను నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు తరలించారు. ఈ మహాయజ్జంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు...వైద్య విద్యను అభ్యసించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల స్వప్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాధి చేస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై వైఎస్ జగన్ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆయన రూపొందించిన ఉద్యమాలకు ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే చలో మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని నిర్వహించగా, దీనికి కొనసాగింపుగా నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది...గ్రామగ్రామాన, పట్టణాల్లోని డివిజన్లలోనూ కొద్ది రోజులుగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ సంతకాలు సేకరించారు. ఇందులో భాగంగా కోటి సంతకాల సేకరణను ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సంతకాల సేకరణలో వివిధ గ్రామాల నేతలు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. అందుకే ఒక్కో నియోజకవర్గంలో 50 వేల నుంచి 60 వేల సంతకాల సేకరించాలనేది పెద్ద లక్ష్యంగా కాకుండా అంతకుమించి సేకరించగలిగాం...పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పార్టీలో అన్ని స్థాయిల నేతలతో పాటు అనుబంధ విభాగాల ప్రతినిధులు కూడా ఎక్కడికక్కడ రెట్టించిన ఉత్సాహంతో సంతకాల సేకరణ ముమ్మరంగా చేశారు. పట్టణాలు, నగరాల్లో అయితే డివిజన్లను క్లస్టర్లుగా విభజించి, పార్టీ నేతలంతా బాధ్యతలు పంచుకుని మరీ సంతకాల సేకరణ చేశారు. మీ అందరి కష్టం, శ్రమను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు.ఇక కోటి సంతకాల కార్యక్రమం తుది దశకు చేరుకుంది. పార్టీ నాయకత్వమంతా కూడా ఈ నాలుగు రోజుల పాటు మీ ఫోకస్ అంతా దీనిపైనే ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి. 15న జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపే రోజు ర్యాలీలతో జిల్లా కేంద్రాలు హోరెత్తాలి. అనంతరం అక్కడి నుంచి కోటి సంతకాలు ఉన్న ప్రత్యేక వాహనాలను పార్టీ నాయకులు జెండా ఊపి ప్రారంభించాలి. 18 సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను వైఎస్ జగన్, ముఖ్యమైన నాయకులు కలిసి అందజేస్తారు. ప్రతి ఒక్కరూ సొంత కార్యక్రమంలా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చించుకునేంత స్ధాయిలో విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.టెలి కాన్ఫరెన్స్ చివరిలో పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్ఆర్సీపీని లేకుండా చేయాలన్న కూటమి కుట్రలను అధిగమిస్తూ యువత, ఉద్యోగులు, మహిళలు, కార్మికుల పక్షాన పోరాడుతున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం.. ఏ వర్గానికి ఆపదొచ్చిన వారి పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ గళమెత్తుతోంది. ఆయా వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నినదిస్తూనే ఉన్నాం.అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో వైఎస్సార్సీపీ ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ తలపెట్టిన ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోటి మందికి పైగా ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సంతకాలు చేశారు. ఇకనైనా చంద్రబాబు తన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి. -
కోటి సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి అన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నియోజక వర్గాల్లో సేకరించిన సంతకాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయాలకు తరలించే ప్రక్రియతో ప్రజల మనోగతం మరోసారి స్పష్టమైందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులతో శుక్రవారం ఆయన జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.ఎమ్మెల్యే/కో–ఆర్డినేటర్లు, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్లు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు, పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు (కో ఆర్డినేషన్), ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్), జెడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీ వైస్చైర్మన్లు , జెడ్పీటీసీలు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లతోపాటు కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఈ నెల 15న జిల్లా స్థాయిలో నిర్వహించే ర్యాలీలతో రాష్ట్రం హోరెత్తాలని, తద్వారా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరోసారి గళం విప్పాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం కలి్పంచాలన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సంతకాల సేకరణ చేపట్టిన పార్టీ శ్రేణులను పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు. చంద్రబాబు అప్రజాస్వామిక నిర్ణయాలకు ఇంతకుమించిన రెఫరెండం అక్కర్లేదన్నారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం వైఎస్ జగన్.. పార్టీ ముఖ్య నేతలతో కలిసి గవర్నర్‌కు సంతకాలను అందజేస్తారని వివరించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేలా మన పార్టీ ఒత్తిడి ఉండాలన్నారు. -
కోటి కంటే ఎక్కువ సంతకాలే వచ్చాయి: సజ్జల
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి జనం నుంచి అనూహ్య స్పందన వచ్చిందని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం, డిసెంబర్ 7వ తేదీ) ఎమ్మెల్సీలు, పార్లమెంట్ కో ఆర్డినేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, జడ్సీ చైర్పర్సన్లు, జడ్సీ వైస్ చైర్పర్సన్లు, పీఏసీ, సీఈసీ, ఎస్ఈసీ మెంబర్లతో సజ్జల టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కోటి కన్నా ఎక్కువ సంతకాలు వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జనం స్పందించారు. కోటి సంతకాల ప్రతులను10వ తేదీన జిల్లా కేంద్రాలకు పంపాలి. జిల్లా స్థాయి కార్యక్రమం 13న కాకుండా 15న నిర్వహించాలి. 17న వైఎస్ జగన్ సహా ముఖ్య నేతలు.. గవర్నర్‌ను కలుస్తారు.’ అని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా సజ్జల రామకృష్ణారెడ్డి.. కోటి సంతకాల సేకరణ అంశానికి సంబంధించి వరుసగా జూమ్ మీటింగ్‌లు, టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఈ మేరకు నేతలను నుంచి కోటి సంతకాల సేకరణకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ నేతలకు పలు సలహాలు ఇస్తున్నారు సజ్జల.ఇదీ చదవండి:చంద్రబాబు క్షద్ర రాజకీయాలు: పుత్తా శివశంకర్ -
కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన: సజ్జల
తాడేపల్లి : ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వస్తుందన్నారు పార్టీ స్టేట్ కో -ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని, అందుకే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందన్నారు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 5వ తేదీ) కోటి సంతకాల సేకరణ సమీక్షలో భాగంగా వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జూమ్ మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ మేరకు సజ్జల మాట్లాడుతూ.. ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందికోటి సంతకాల సేకరణకు అనూహ్యమైన స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలూ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. వారం క్రితమే కోటికి పైగా సంతకాలు అయ్యాయి. ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలి. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు నాయకులతో అవసరమైన సమన్వయం చేసుకోవాలి’ అని స్పష్టం చేశారు. గురువారం(డిసెంబర్ 4వ తేదీ) వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. -
తుది ఘట్టానికి కోటి సంతకాల ఉద్యమం: సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అనూహ్య స్పందన వచ్చిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. గురువారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమం తుది ఘట్టంపై అందరితో మాట్లాడుతున్నారని చెప్పారు.ఈ నెల 10న అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే కోటి సంతకాలను జిల్లా కేంద్రాలలో ఉంచి, అక్కడి నుంచి 13న ఒకేసారి అన్ని నియోజకవర్గాల సంతకాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పారు. ఆ రోజు జిల్లా కేంద్రంలో వేలాది మందితో ర్యాలీగా నిర్వహించి, నాయకుల ప్రసంగాల అనంతరం కోటి సంతకాల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించాలని చెప్పారు. అప్పటి వరకు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.ఇందుకోసం జిల్లా అధ్యక్షులు సమావేశం నిర్వహించుకోవడంతోపాటు అనుబంధ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు పార్టీ అధినేత వైఎస్ జగన్, ముఖ్య నాయకులు గవర్నర్‌ను కలిసి కోటి సంతకాలు అందజేస్తారని తెలిపారు. -
16న వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్‌కు కోటి సంతకాలు అందజేత
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ జిల్లా పార్టీల అధ్యక్షులు, పార్లమెంటరీ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్, అనుబంధ విభాగాలు), రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్)తో బుధవారం రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా సాగిందన్నారు. సంతకాలు కోటి అనుకుంటే అంతకుమించి వస్తున్నాయని చెప్పారు. ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంతకాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయాలకు పంపాలని సూచించారు. 13న జిల్లా కార్యాలయాల నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లికి పంపాలని కోరారు. ఈ నెల 16న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌కు కోటి సంతకాలు అందజేయనున్నట్టు చెప్పారు.సేకరించిన సంతకాలన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల ముందు, మీడియా ముందు ప్రదర్శించి వారి సమక్షంలోనే బాక్సుల్లో సర్ది వాహనాల్లో పెట్టి నాయకులు జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన నాయకులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 13న జిల్లా కేంద్రంలో కూడా అదే స్థాయిలో కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా చెప్పారని వెల్లడించారు. జిల్లా కేంద్రం నుంచి వేలాది మందితో ర్యాలీలు చేపట్టి రాష్ట్ర కార్యాలయానికి పంపాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో కీలకపాత్ర పోషించాలని సూచించారు. -
వైఎస్సార్సీపీపై కక్ష సాధింపే టీడీపీ కూటమి టార్గెట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీపై కక్షసాధింపే టీడీపీ కూటమి సర్కారు టార్గెట్ అని, ఆ నినాదాన్ని భుజానికెత్తుకుని తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆరి్డనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఆ దిశలోనే కన్ఫెషన్ స్టేట్మెంట్స్తో కాన్సిపిరసీ థియరీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని ఆక్షేపించారు. అందులో నుంచి వచ్చినవే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి , పరకామణి, లిక్కర్ వంటి కేసులు అని వెల్లడించారు. ఏ ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసులు నమోదు చేసి ఎవరో ఒకరిని అరెస్టు చేయడం, బెదిరించడం.. ఆ తర్వాత వాంగ్మూలాలు నమోదు చేయడం.. వాటి ఆధారంగా టార్గెట్ లిస్ట్‌లో ఉన్న వారిపై కేసులు పెడుతూ, వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధిస్తున్నారని.. అదే సీఎం చంద్రబాబు నమ్ముకున్న కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీ అని సజ్జల మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. నెయ్యిపై ఏ ఆధారాలతో సిట్ విచారణ?..2019లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, మేము కూడా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్లుగా కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీని అమలు చేసి ఉంటే, అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలకే ఆయన్ను అరెస్ట్ చేసే వాళ్లం. కానీ, ఏనాడూ మేము కక్షపూరితంగా వ్యవహరించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంటూ, ఏ ఆధారాలతో సిట్ ద్వారా విచారణ చేయిస్తుందో అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై విచారణ చేస్తున్న సిట్, 2014–19 మధ్య జరిగిన నెయ్యి సరఫరాపైనా విచారణ చేస్తే అసలు నిజాలు తెలుస్తాయి. 2019 –24 మధ్య కేజీ నెయ్యి రూ.320 చొప్పున సేకరిస్తేనే కల్తీ అన్న నాయకులు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో కేజీ నెయ్యి రూ.270కే సేకరించినప్పుడు కల్తీ జరిగినట్లు కాదా? ప్రభుత్వాలు మారినా టీటీడీలో దశాబ్దాలుగా నడుస్తున్న వ్యవస్థల ప్రకారమే టెండర్ల నిర్వహణ, క్వాలిటీ చెకింగ్ జరుగుతుంది. పరకామణి చోరీ అంటూ కేసు పెట్టి, వైఎస్సార్సీపీ నాయకులను ఇరికించే ఉద్దేశంతోనే విచారణ పేరుతో ఏవీఎస్వో సతీష్ కుమార్‌ను సిట్ వేధించింది. ఆ బాధతోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మేం మాట్లాడితే.. ఆధారాలు లేకుండానే హత్యగా ప్రచారం చేసిందే కాకుండా వైఎస్సార్సీపీ నాయకులే చంపించారని మాపై బురదజల్లారు.రిజెక్ట్ చేసిన నెయ్యిని ఎలా వాడారు?..‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలైలో క్వాలిటీ చెక్ తర్వాత నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి వెనక్కి పంపారని చెబుతున్నారు. వెనక్కి పంపిన నెయ్యిని తిరిగి తీసుకొస్తే వాడినట్టు సిట్ రిపోర్టులో ఉంది. అలాంటప్పుడు రిజెక్ట్ చేసిన నెయ్యినే కూటమి ప్రభుత్వంలో ఎలా వాడారు? టీడీపీ హయాంలో జరిగిన తప్పునకు చంద్రబాబు బాధ్యత తీసుకోరా? లిక్కర్ కేసులో ఇన్నాళ్లుగా విచారణ చేస్తున్న ప్రభుత్వం ఏం సాధించినట్టు? న్యాయస్థానాల దగ్గర విచారణ పేరుతో మా నాయకులను అదుపులోకి తీసుకుని నెలల తరబడి జైలుపాలు చేశారు.’’ అని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.ఎస్ బ్యాంకులో టీటీడీ నిధుల జమ నియమాలకు విరుద్ధం కాదా?‘‘ప్రైవేట్ బ్యాంకులో 10 శాతానికి మించి టీటీడీ నిధులు డిపాజిట్ చేయకూడదనే నిబంధన ఉంది. కానీ టీటీడీ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి ఎస్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంకులో రూ.1300 కోట్లకు పైగా జమ చేశారు. వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ అయ్యాక దాన్ని జాతీయ బ్యాంకుల్లోకి మార్చారు. ఎస్ బ్యాంకులో డిపాజిట్ చేసిన దానికి చంద్రబాబే కారణమని మేం ఆరోపించామా? కుట్ర రాజకీయాలు చేశామా?’’ అని సజ్జల ప్రశ్నించారు. లాయర్‌కు రూ.8 కోట్ల ఫీజు!‘‘చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం వాదించిన లాయర్ సిద్దార్థ లూథ్రాని తీసుకొచ్చి వైఎస్సార్సీపీ నాయకుల మీద బనాయించిన అక్రమ కేసులన్నీ ఆయనకే అప్పజెప్పారు. ఈ కేసులకు ఆయనకు ఇప్పటి వరకు రూ.8 కోట్లకు పైగా జనం సొమ్మును ఫీజు కింద చెల్లించారు’’ అని సజ్జల విమర్శించారు. కేసుల క్లోజర్ కుట్ర!‘‘సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగంతో కేసులు క్లోజ్ చేయించుకునే కుట్ర చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంతోపాటు, బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు కేసులను మాఫీ చేసుకునేందుకు యత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక బాబుపై ఉన్న అన్ని కేసులూ మళ్లీ బయటకు తీస్తాం.’’ అని రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు.ఎందుకంత కడుపు మంట?‘‘తెలంగాణలో బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం మాకేంటి. వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారు. 2014 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే వైఎస్సార్సీపీకి 7శాతం ఓట్లు వచ్చాయి. అయినా తెలంగాణ రాజకీయాలు వద్దనుకుని వచ్చిన మాకు బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్‌కు జనాదరణ పెరుగుతుంటే టీడీపీ, ఎల్లోవీుడియాకు ఎందుకంత కడుపుమంట?’’ అని సజ్జల ప్రశ్నించారు.కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన‘‘వైఎస్సార్సీపీ హయాంలో తీసుకొచి్చన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అందుకే వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో భారీగా పాల్గొని సర్కారుపై గళమెత్తుతున్నారు. కోటి సంతకాల సేకరణ గొప్ప ప్రజా ఉద్యమంగా చరిత్రలో నిలిచిపోతుంది.’’ అని సజ్జల పేర్కొన్నారు. ఒక్క ఇల్లు కట్టించకపోయినా క్రెడిట్ చోరీ..‘‘వైఎస్సార్సీపీ హయాంలో పూర్తి చేసిన 3 లక్షల ఇళ్లను కూటమి ప్రభుత్వంలో ఇచ్చినట్టు చెప్పుకోవడం దారుణం. పేదల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా క్రెడిట్ చోరీకి పాల్పడటం సిగ్గుచేటు.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.అమ్మణమ్మ చెప్పిన కథలో నక్క చంద్రబాబే..‘‘చంద్రబాబు తల్లి అమ్మణమ్మ చెప్పిన కథలో నక్క చంద్రబాబే. లోకేశ్ పక్కనే ఉన్నారు కాబట్టి ఆ కథనే చాగంటి మరో రకంగా చెప్పారు. గూగుల్ డేటా సెంటర్‌కి సంబంధించి అదానీ పేరెత్తితే వైఎస్ జగన్ కి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే చంద్రబాబు కిక్కురుమనడం లేదు. విశాఖలో అనామక కంపెనీలకు బాబు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారు. అదే హెరిటేజ్ ఆస్తులైతే అంత తక్కువ ధరకు ఇస్తారా?’’ అని సజ్జల నిలదీశారు. -
Sajjala: చంద్రబాబు ఫాలో అయ్యేది ఇదే వాళ్ల అమ్మ చెప్పిన కథ
-
Sajjala: రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు
-
Sajjala: లిక్కర్ స్కామ్ అన్నారు.. ఇప్పటివరకూ ఏమైనా తేలిందా..?
-
‘తప్పు చేశారు కాబట్టే కేసుల్ని వెనక్కి తీసుకుంటున్నారు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన వ్యవస్థలను కూటమి ప్రభుత్వం కొనసాగించి ఉంటే రైతులకు మంచి జరిగేదన్నారు పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆ వ్యవస్థలు లేకనే తుపాన్ కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్సీపీ హయాంలో రైతుల సంక్షేమంపై వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కానీ, తుపాన్‌తో నష్టపోయిన రైతులను చంద్రబాబు ఆదుకోలేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరకు చంద్రబాబు వెళ్తారు?. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. ఇదంతా చంద్రబాబు నిర్వాకం వల్లే.... మాపై విష ప్రచారం చేస్తూనే అబద్ధాలు, మోసాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అన్నారు.. ఇప్పటివరకూ ఏమైనా తేలిందా?, సుప్రీంకోర్టు ఆదేశాలను సిట్ పాటించడం లేదు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైఎస్సార్సీపీపై తప్పుడు కేసులు. కుట్ర సిద్ధాంతంతో పాలన చేస్తున్నారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉన్నాయి.... చంద్రబాబు అవినీతికి సాక్ష్యాలు ఉన్నాయి. కానీ, ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులను ఎత్తివేయాలని చూస్తున్నారు. అవినీతి చేయకపోతే చంద్రబాబుకి ఎందుకంత భయం?. తప్పు చేయనప్పుడు కేసుల్ని ఎదుర్కోవాలి కదా. తప్పు చేశారు కాబట్టే కేసులు వెనక్కి తీసుకుంటున్నారు. మేం అధికారంలోకి వచ్చాక కేసులన్నీ తిరగతోడతాం. అన్ని కేసులపై పునర్విచారణ చేయిస్తాం’’ అని సజ్జల స్పష్టం చేశారు. -
తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై సజ్జల షాకింగ్ నిజాలు
-
ధైర్యముంటే లడ్డూ అంశంపై సీబీఐ విచారణ జరపాలి: సజ్జల
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా తిరుమల నెయ్యి విషయంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారన్నారు.వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రాల్లో చేయబోయే ర్యాలీలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బోలేబాబా సప్లై చేస్తున్న నేయిలో ప్రమాణాలు లేవని వచ్చిన పిర్యాదుపై పరిశీలన జరిపి, ఆ కంపెనీని బ్లాక్‌చేయించింది వైవీ. సుబ్బారెడ్డి అని,. ఇప్పుడు అలాంటి సుబ్బారెడ్డిని టార్గెట్ చేస్తున్నారన్నారు. కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకునే ఇవన్నీ చేస్తున్నారన్నారు.కూటమి ప్రభుత్వం రాద్దాంతంపై సజ్జల సంధించిన ప్రశ్నలు..రిమాండ్ రిపోర్టు చూస్తే 2024లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ రెండో వారంలో ధర్మారెడ్డిని మీరు తొలగిచిన తర్వాత, వెంటనే శ్యామలరావును పెట్టుకున్నారు. ఇది జరిగిన తర్వాత జులై మొదటివారంలో ట్యాంకర్లలో వచ్చిన నేయిని పరీక్షలకోసం ఎన్డీడీబీకి పంపారు. రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు తిరిగి ఆగస్టులో మళ్లీ వచ్చాయి, వాటిని నేయి తయారీకి వాడారని చెప్తున్నారు. అంటే తప్పు ఎవరిది అవుతుంది? ఆరోపణలు వచ్చిన ట్యాంకర్లన్నీకూడా చంద్రబాబు పరిపాలనా కాలంలోనే కదా సప్లై అయినవి?పాలు లేకుండా నేయి తయారైందని అంటున్నారు. అలాంటప్పుడు ఏ ట్యాంకర్ కూడా పరీక్షల్లో ప్యాస్ కాకూడదు కదా? నేయిలో కల్తీ జరిగితే.. మేనేజ్ చేశారను అనుకుందాం.. అసలు నేయి లేకుండానే కెమికల్స్‌తో ఆర్టిఫిషయల్ నేయి తయారు చేశారన్నట్టుగా రిమాండ్ రిపోర్టులో రాశారు. ఇన్ని లక్షలమంది భక్తులు, ఇన్ని వందలాదిమంది తయారీదారులు.. నిజంగా కనిపెట్టలేకపోయారా? అసలు అలా తయారు చేసిన లడ్డూ నిల్వ సాధ్యమేనా? ఇవన్నీ సామాన్యులకు వస్తున్న సందేహాలు. రిమాండ్ రిపోర్టులో చూస్తే.. మార్చి 27, 2025 నాటి ఎన్డీడీబీ రిపోర్టు అని కోట్ చేస్తూ.. నేయి శాంపిళ్లను పరిశీలిస్తే.. పామాయిల్, పామ్ స్టెరిన్, పామ్ కెన్నెల్ ఆయిల్ కలిసిందని నువ్వే చెప్తున్నావు, అంటే చంద్రబాబు వచ్చిన 8 నెలల తర్వాతకూడా, పైగా తిరుమల లడ్డూపై సెప్టెంబరులో చంద్రబాబు కామెంట్లు చేసిన తర్వాత కూడా ఇలాంటి రిపోర్టు వస్తే దానికి బాధ్యత చంద్రబాబుదే కదా? ఈ ప్రభుత్వానిదే కదా? దాన్ని కూడా ఏరకంగా మరొకర్ని తప్పుబడతారు. మా హయాంలో కేజీ నేయి రూ.319లకు కొంటే తప్పుబట్టారు. కాని చంద్రబాబు హయాంలో రేట్లు చూస్తే.. రూ.273, 276, 279, 295, 285గా ఉన్నాయి. మరి దాని అర్థం చంద్రబాబుగారి హయాంలో నేయిలో బాగా కల్తీ ఉందనేదిగా దాని అర్థం? వాళ్ల సిద్ధాంతం ప్రకారమే ఇది వాస్తవమే కదా మరి?ఇదీ చదవండి: ‘ఎందుకీ ఆరోపణలు.. ఆధారాలు ఉంటే సిట్ ప్రకటించవచ్చు కదా?’ -
ప్రజాస్పందనను బలంగా వినిపిద్దాం..
తాడేపల్లి :ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు(బుధవారం, నవంబర్ 12వ తేదీ) వైఎస్సార్సీపీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ర్యాలీలకు పార్టీలకతీతంగా అంతా కలిసి రావాలని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రేపు చేపట్టే ర్యాలీల ద్వారా ప్రజాస్పందనను గట్టిగా వినిపిద్దామన్నారు సజ్జల. ఈ మేరకు మంగళవారం(నవంబర్11వ తేదీ) వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రేపు గట్టిగా పోరాటం చేద్దాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలదలో కేంద్రాల్లో ర్యాలీలను సూపర్ సక్సెస్ చేద్దాం. జగన్ తెచ్చిన వైద్య విప్లవాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారు. వైద్యవిద్యార్ధుల కలలను సాకారం చేయాలన్న గొప్ప సంకల్పం జగన్‌ది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణను చూసైనా చంద్రబాబు బుద్దితెచ్చుకోవాలి. వైద్య వ్యవస్ధను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం,. ప్రజా స్పందనను బలంగా వినిపిద్దాం. అందరి భాగస్వామ్యం వలనే కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అన్ని పథకాలు నిర్వీర్యం చేసింది. ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. అన్ని రంగాలు కుదేలయ్యాయి. రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వంపై దేశంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత వచ్చింది. రేపటి ర్యాలీలకు పార్టీలకు అతీతంగా కలిసిరావాలి. విద్యార్ధులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో ర్యాలీలు విజయవంతం అవ్వాలి. మనం చేసే ఆందోళనలు, ర్యాలీల గురించి జాతీయస్ధాయిలో చర్చ జరిగేలా ఉండాలి. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం దిగివస్తుంది’ అని పేర్కొన్నారు. -
‘చంద్రబాబు సర్కార్‌కు గుణపాఠం చెబుదాం’
సాక్షి,తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 12న జరిగే ర్యాలీలను సూపర్ సక్సెస్ చేద్దాం. వైద్య వ్యవస్ధను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం. ప్రజా స్పందనను బలంగా వినిపిద్దాం’అంటూ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ సీఈసీ, ఎస్ఈసీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, జెడ్పీటీసీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మునిసిపల్ ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 12న ర్యాలీలు జరుగనున్నాయి, కోటి సంతకాల సేకరణ కోసం క్షేత్రస్ధాయిలో మీరంతా ఉన్నారు, ఇదంతా కూడా ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగుతోంది. మీ అందరి భాగస్వామ్యం వల్ల కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం విజయవంతం అవుతుంది. మనం తీసుకుంటున్న ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా 12న జరిగే ర్యాలీలు ఉండాలి. వైద్యవ్యవస్ధను జగన్ ప్రజలకు చక్కటి గొడుగులా తయారుచేస్తే చంద్రబాబు దానిని నిర్వీర్యం చేశారు. మనం చేసే ఆందోళనలు, ర్యాలీలు జాతీయస్ధాయిలో చర్చ జరిగేలా ఉండాలి. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం దిగివస్తుంది. కలిసి వచ్చే పార్టీలందరినీ కలుపుకుపోదాం. కులసంఘాలు, స్వఛ్చంద సంస్ధలు, ట్రేడ్ యూనియన్లు ఇలా అందరినీ కలుపుకుందాం. అప్పుడే సూపర్ సక్సెస్ అవుతుంది. ఇందుకు అవసరమైన కసరత్తు పూర్తిచేయాలి. ఏ మాత్రం ఏమరుపాటు వద్దు, అందరూ ఈ కార్యక్రమాన్ని పర్సనల్‌గా తీసుకుని సక్సెస్ చేయాలి. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుందాం. మీ పరిధిలో ఉన్న వారందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ర్యాలీలు సక్సెస్ చేయాలి. మీరంతా ఓనర్ షిప్ తీసుకుని లీడర్లుగా నిరూపించుకునే అవకాశం ఇది. స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీరంతా సిద్దంగా ఉండాలి, దీనిపై కూడా సీరియస్‌గా దృష్టిపెట్టాలి. క్షేత్రస్ధాయి నుంచి పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఈ కమిటీలన్నీ పూర్తయితే దాదాపు 13 లక్షల మంది సైన్యం సిద్దమవుతుంది. ఇదంతా పారదర్శకంగా డిజిటలైజేపన్ చేయాలి. పరిశీలకుల సహాకారం తీసుకుని పక్కాగా చేయండి. కేంద్ర కార్యాలయం నుంచి అవసరమైన సహకారం ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో డిజిటల్ మేనేజర్లను కూడా నియమించడం జరిగింది. కమిటీల ఏర్పాటు పకడ్భందీగా చేయాలి, డేటా అంతా కూడా డిజిటలైజ్ చేయాలి. ప్రతి ఇంట్లో మన పార్టీ ఉంటుంది, నిత్యం ప్రజా సమస్యలపై మనం చేస్తున్న పోరాటాలకు అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. ప్రజల్లో మన పార్టీకి ఉన్న ఇమేజ్ బాగా పెరుగుతుంది. దీనిని ఇంకా మరింతగా పెంచుకుందాం. కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం’అని సూచించారు. -
‘ఇమామ్ ప్రస్థానం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సజ్జల
సాక్షి, తిరుపతి: ‘ఇమామ్ ప్రస్థానం’ పుస్తకాన్ని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం ఆవిష్కరించారు. పద్మావతి పురంలోని పార్టీ కార్యాలయంలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్.కే.రోజా, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యము, రాయలసీమ మేధావులు ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మాటల్లో చెప్తే.. చేతల్లో చూపించిన నాయకుడు వైఎస్సార్. ‘వైఎస్సార్ బాటలో జగన్ నడుస్తున్నారు. రూ.16 వేల కోట్లు ఖర్చు చేసి నాడు-నేడుతో వైఎస్ జగన్.. స్కూళ్ల రూపురేఖలు మర్చారు. వైఎస్ జగన్ ఒక సంఘ సంస్కర్తగా అడుగులేశారు. ఇమామ్ ఆశీస్సులు వైఎస్ జగన్‌కు ఉండాలి..ఇమామ్ 77 ఏళ్ల వయసులో నవ యువకుడిగా ఉత్సాహంగా కొత్త ఆలోచనతో ఉన్నారు. ఏ కల్మషం లేని వ్యక్తి ఇమామ్.. ఆయన దారిలో పయనించాలి. రాయలసీమ స్ఫూర్తి, కమ్యూనిస్ట్ భావజాలంతో ముందుకు నడిచారు.’’ అని సజ్జల పేర్కొన్నారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్లలో వైఎస్ జగన్ ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ద్వారా మొదటి బ్యాచ్ పూర్తి అయ్యేది. ఏ సీఎం కూడా చేయని విధంగా దేశంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చింది ఒక్క వైఎస్ జగన్ మాత్రమే. ప్రజలకు గుర్తుండి పోయేలా వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలు చేశారు.ఆర్కే రోజా మాట్లాడుతూ.. ఇమామ్ కదలిక ద్వారా ఎన్నో సమాజంలో ఎన్నో సంస్కరణలకు కారణం అయ్యారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఇమామ్ పనిచేశారు.. కృషి చేశారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. ఇమామ్‌తో సుదీర్ఘ పరిచయం.. 21 నెలలు జైల్లో గడిపిన క్షణాలు గుర్తున్నాయి. రాజకీయం అంటే ఇతరులతో సంఘర్షణ కాదు.. ఆత్మీయతో మెలగటం -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. బాబు సర్కార్ దిగిరావాల్సిందే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పార్టీ ముఖ్య నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రచ్చబండ కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఈ నెల 12న అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ర్యాలీలను విజయవంతం చేయాలన్నారు. కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ముందుకు పోవాలని.. పార్టీ కమిటీలు, డేటా డిజిటలైజేషన్‌పై ప్రతి ఒక్కరూ సీరియస్‌గా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.‘‘పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగదు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అంతా పకడ్బందీగా సిద్ధమవ్వాలి. ప్రజలకు మరింత చేరువయ్యేలా గొంతెత్తి నినదించాలి. ప్రతి ఒక్కరూ మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలి’’ అని సజ్జల పేర్కొన్నారు.సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో ఈ నెల 12న ర్యాలీలు జరుగుతాయి. ఇందుకు రాష్ట్ర స్థాయిలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. దీనిపై రేపు అన్ని జిల్లాలలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో అసెంబ్లీ ఇంఛార్జ్‌లు, ఆ తర్వాత మండల స్ధాయిలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమాలు నిర్వహించాలి. పోస్టర్ రిలీజ్ తర్వాత ప్రెస్ మీట్లు నిర్వహించి మీడియాకు మన ఉద్దేశాన్ని వివరించాలి. కోటి సంతకాలు-రచ్చబండ కార్యక్రమంకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది...వైఎస్ జగన్ అభిప్రాయంతో ప్రజలు ఏకీభవిస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో తమ వంతుగా వివిధ వర్గాల ప్రజలను కలిసి ప్రజా స్పందనను సంతకాల రూపంలో విస్తృతంగా నమోదు చేస్తున్నారు. వచ్చే వారంలో కోటి సంతకాల సేకరణపై రివ్యూ చేద్దాం. ప్రభుత్వం దిగివచ్చే వరకూ మన పోరాటం ఆగదు. మనతో కలిసివచ్చే పార్టీలను ఆహ్వనిద్దాం. వివిధ కుల సంఘాలు, సివిల్ సొసైటీలను భాగస్వామ్యం చేద్దాం. మరింత ఫోకస్డ్గా పనిచేద్దాం...పార్టీ కమిటీల ఏర్పాటు, డేటా డిజిటలైజేషన్‌పై కూడా నాయకులు సీరియస్‌గా దృష్టిపెట్టాలి. వైఎస్ జగన్ వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇంటెన్సివ్ డ్రైవ్ లాగా చేయాలి. మనం ముందుగా అనుకున్న డెడ్ లైన్కల్లా అన్ని స్థాయిలలో కమిటీల నియామకాలు పూర్తవ్వాలి. సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం తక్షణమే ఫోకస్డ్గా పని చేయాలి. మండల, గ్రామ స్థాయి కమిటీలు నిర్ణీత టైంలైన్లోపు పూర్తి చేయాలి. డేటా ప్రొఫైలింగ్ అనేది పక్కాగా జరగాలి. అందుకు అవసరమైన సాఫ్ట్వేర్ ఇప్పటికే రూపొందించాం...పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళదాం. నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లతో సమన్వయం చేసుకోవాలి. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే సమయంలో మనం జాగ్రత్తగా పరిశీలించాలి, అలెర్ట్‌గా ఉండాలి. అందుకు అవసరమైన బూత్ లెవల్ ఏజెంట్లను సిద్ధం చేసుకుందాం. స్థానిక సంస్ధల ఎన్నికలు జరిగే నాటికి మనం అంతా పకడ్బందీగా సిద్ధమవ్వాలి. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మనం వారి తరుపున గొంతెత్తి నినదిస్తున్నాం. డిజిటల్ మీడియా వేదికగా మన వాణిని వినిపిద్దాం. ప్రతిఒక్కరూ మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలి. కమిటీల నిర్మాణానికి అవసరమైన పరిశీలకులను అవసరమైతే తక్షణం నియమించాలి. కమిటీల ఏర్పాటు ఎంత ముఖ్యమో ఆ తర్వాత ఆ కమిటీలు అంతే ఉత్సాహంగా పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు’’ అని సజ్జల వివరించారు. -
‘రాష్ట్రంలోని దుర్మార్గాలకు ఆద్యుడు నారా లోకేష్’
సాక్షి,తాడేపల్లి: రాజ్యాంగ ప్రకారం ప్రజల హక్కులను కాపాడుతూ.. రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు కరిమింగిన వెలగపండులా తయారయ్యాయని.. వైయస్సార్సీపీ స్టేటే కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ద్వారా చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృతరూపం బట్టబయలైందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రాజకీయ వ్యవస్థ శూన్యమైందని.. కూటమి ప్రభుత్వం నేర స్వభావాన్నే రూల్ ఆఫ్ లా గా నడుపుతుందని మండిపడ్డారు. రెండేళ్లలోనే ఇంతటి దారుణమైన పాలన ఉంటే... రానున్న మూడేళ్లలో మరింత వికృతంగా, విచ్చలవిడిగా తయారయ్యే ప్రమాదముందని.. సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, మీడియా వీటిని అధ్యయనం చేసి.. జరుగుతున్న దారుణాలను ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...రాష్ట్రంలో ప్రభుత్వం శూన్యం..2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ప్రభుత్వం అన్నమాటకు నిర్వచనమే మారిపోయింది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం మెజారిటీ ప్రజల కోరికలు, ఆకాంక్షలన్నింటికీ ఫలానా పార్టీ పరిష్కరిస్తుందని ఎన్నుకుంటారు. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ఒక భాగం అయితే రెండోది.. పరిపాలన. పాలనా పరమైన విధులన్నీ అధికారులు చేస్తున్నప్పుడు .. ప్రభుత్వం అవసరం ఎందుకంటే అది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. మేనిఫెస్టోను అమలు చేస్తుంది. అదే ప్రజాస్వామ్యం. అది ఏ మేరకు నెరవేరుతుందన్నది వేరే విషయం. అలా అడ్మినిస్ట్రేషన్ విభాగం ఒక పద్దతి ప్రకారం నడవడానికి అవసరమైన మార్గదర్శకం ఇచ్చి నడిపే ఒక రాజకీయ వ్యవస్థ ఉంటుంది అనుకుంటే.. అది 2024 జూన్ తర్వాత ఈ రాష్ట్రంలో శూన్యం అయింది. పాలన గాలికొదిలేయడమో, లేక చేతకాని తనంతో చేయలేకపోవడమన్నది ఒక రకం. కానీ ప్రభుత్వమే నేరస్వభావంతో దాన్నే రూల్ ఆఫ్ లా గా కార్యనిర్వహణలోకి తీసుకొస్తే... అది 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లా ఉంటుంది. ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్లే దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ నేరస్వభావాన్నే ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తూ.. బ్యూరోక్రాట్స్ లో అలాంటి వాళ్లను దగ్గరకు తీసుకుంటున్నారు. కానివాళ్లను మెడలు వంచడమే, దూరం పెట్టడమే చేస్తుండడంతో వాళ్లు కూడా గత్యంతం లేక అదే దారిలో పయనిస్తున్నారు. ఇలా ఈ ఏడాది కాలంలో వ్యవస్థలను తమ నేర స్వభావాలకు అనుకూలంగా... తాము చేసే తప్పులకు ప్రొటెక్ట్ చేసేదిలా మార్చివేస్తున్నారు.టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ...మాజీ మంత్రి, వెనుకబడిన వర్గాలకు చెందిన బలమైన నాయకుడిగా ఎదిగిన జోగి రమేష్ ను ఏ తప్పు చేయకుండా అక్రమంగా అరెస్టు చేశారు. ఈ కేసు చూస్తే... నేరం జరుగుతున్న మొలకల చెరువు, ఇబ్రహీం పట్నం, అనకాపల్లి, ఏలూరులో నకిలీ మద్యం తయారీ చేస్తున్న చోట పోలీసులు పట్టుకున్నారు. నిన్నా, మొన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే.. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో మా పాత్ర లేదు అని చెప్పడానికి అవకాశం ఉండేది. కానీ సాక్షాత్తూ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ 2024 అభ్యర్ధి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలీ లిక్కర్ తయారీ ఫ్యాక్టరీ బయటపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రెండేళ్లు అవుతుంది. ఒకవైపు వైయస్సార్సీపీ నాయకుల తప్పు లేకపోయినా... వారిని అరెస్టులు చేస్తుంటే... రెండేళ్లుగా నకిలీ లిక్కర్ తయారీ మొత్తాన్ని వైయస్సార్సీపీ నేత జోగి రమేష్ ఉన్నాడంటూ అరెస్టు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెట్టడంతో మొదలై... వైయస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా పెద్ద సంఖ్యలో అరెస్టు చేస్తూ.. తప్పుడు స్టేట్ మెంట్లతో వేరేవాళ్లను అరెస్టు చేసి నెలల తరబడి జైల్లో ఉంచారు.ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ నేతలపై కేసులు..పల్నాడు వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా తప్పుడు కేసులు నమోదు చేసారు. స్ధానిక టీడీపీ నాయకులు వాళ్ల మధ్య అంతర్గత కలహాలతో గొడవపడి జంట హత్యలు జరిగితే... దాని మీద ఎస్పీ కూడా ఇది టీడీపీ అంతర్గత విభేదాల వల్లే అని ప్రకటన ఇచ్చినా, ఘటనా స్ధలంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వాహనంతో సహా పలు ఆధారాలున్నా.. వైయస్సార్సీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను జైల్లో పెట్టారు.ఇటీవల సోషల్ మీడియా యాక్టవిస్టు సవీంద్ర రెడ్డిను ఏదో పోస్టు పెట్టారని అరెస్టు చేసి.. కన్ఫషన్ కింద వేరకొటి నమోదు చేసి.. అదీ సరిపోదనుకుని ఏకంగా గంజాయి ప్యాకెట్ పెట్టి కేసు నమోదు చేశారు. అయితే అదృష్టవశాత్తూ అరెస్టు చేసిన టైమింగ్ ఆధారాలు, పోలీసులు చెప్పిన విషయాలు సరిపోలకపోవడంతో హైకోర్టు సీబీఐకి రిఫర్ చేయడంతో ఆయన బైటపడ్డాడు. అదే కేసులు మరికొంత యువకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.టీడీపీ నేతల తప్పులనూ వైఎస్సార్సీపీకి అంటగట్టే దుర్మార్గం..ఇక తునిలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యంలో ఈ ఘాటుకానికి పాల్పడింది కూడా టీడీపీ నేతే. టీడీపీ నేతను పట్టుకుంటే... రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘాతుకంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఆందోళన రావడంతో ఉలిక్కపడ్డ ప్రభుత్వం, పోలీసులు కస్టడీలో ఉన్న వ్యక్తి చెరువులో దూకి చనిపోయాడని పోలీసులు చెప్పారు. మరుసటి రోజు లైంగిక అకృత్యానికి పాల్పడ్డ వ్యక్తి కుమారుడు తన తండ్రి మరణంపై అనుమానం ఉందని కేసు పెట్టాడు. మరోవైపు మైనర్ బాలికపై లైంగిక అఘాయిత్యానికి పాల్డడ్డ వ్యక్తిని వీడియో తీసి... బాలిక చదువుతున్న స్కూల్ కి పంపిస్తే... దానికి అతనిపై చనిపోయిన వ్యక్తి కుమారుడు చేత ఫిర్యాదు తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. అందులో అదర్స్ అని రాయడం ద్వారా వైయస్సార్సీపీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేరం చేసిన వాళ్లకు సంబంధించి అనుమానాస్పదంగా చనిపోయాడని చెబుతూ... నిందితుల తరపున ఎందుకు వకాల్తా తీసుకున్నారు. వీరికి ప్రభుత్వ అండదండలు పూర్తిగా ఉన్నాయి. జోగి రమేష్ అరెస్టులో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో టీడీపీ నేతలే ఉన్నారు.. ఆధారాలు సైతం అక్కడే ఉంటే... ఇక్కడ విజయవాడలో జోగి రమేష్ ను అరెస్టు చేస్తున్నారు. తప్పుడు కేసు పెట్టడానికి కూడా జనం నమ్ముతారా ? కోర్టులో నిలబడుతుందా? అన్నది ఆలోచించడం లేదు. ఇవాల్టికి అరెస్టు చేసి.. రెండు మూడు నెలలు జైల్లో వేస్తే.. మిగిలిన విషయాలు తర్వాత చూసుకోవచ్చు అని భావిస్తున్నారు. నకిలీ లిక్కర్ కేసులో అసలు సూత్రధారి జయచంద్రా రెడ్డి, అతనే ఫ్యాక్టరీ పెట్టాడు, అతనికి సంబంధించిన బార్లలో నకిలీ లిక్కర్ అమ్మకాలు చేస్తున్నాడని పోలీసులే చెప్పారు. అతను సాక్షాత్తూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి, కానీ వారి అరెస్టులు మాత్రం ఉండవు.నకిలీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జయచంద్రా రెడ్డికి చంద్రబాబు బీఫామ్ ఇస్తున్న దృశ్యం చూస్తే.. జనరల్ గా బీపామ్ తీసుకున్నప్పుడు పక్కనే కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ జయచంద్రారెడ్డి పక్కనే ఆయన ఆత్మలా జనార్ధనరావు పక్కనే ఉన్నాడు. ఇది పక్కన పెట్టి.. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం జోగి రమేష్ తో ఏదో పెళ్లిలో జనావర్ధన రావు ఫోటో దిగితే దాన్ని ఆధారంగా చూపిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబుతో బీపామ్ తీసుకుంటున్న జయచంద్రా రెడ్డి, పక్కనే జనార్ధన రావు ఉంటే దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు. వీళ్లద్దరూ ఆఫ్రికాలో వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. వాస్తవానికి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ వ్యవహారం బయటపడ్డంతోనే రాష్ట్రంలో ఒక దుమారం చెలరేగింది. మద్యం సేవించే వారిలోనూ ఒక భయం మొదలైంది. దీన్ని డైవర్షన్ చేయడానికి.. సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవడం అలవాటైన చంద్రబాబు... తక్షణమే నకిలీ మద్యం వ్యవహారాన్ని జోగి రమేష్ వైపు తిప్పాడు. జోగి రమేష్ , వైయస్సార్సీపీకి దెబ్బ కొట్టడంతో పాటు, తన పార్టీ నేతలైన జయచంద్రారెడ్డి ఇతరులను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఆఫ్రికాలో ఉన్న జనార్ధన రావుతో ముందే మాట్లాడుకుని అతడ్ని ఇండియాకు తీసుకొచ్చారు. ఎయిర్ పోర్టులో జనార్ధరావు చొక్కా, పోలీసుల కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయన పేరు మీద విడుదల చేసిన వీడియోలో చొక్కా రెండూ ఒకటే. ఇదెలా సాధ్యం. మరో కీలకమైన విషయం జనార్ధన రావు ఫోన్ దొరికితే అందులో జయచంద్రా రెడ్డితో పాటు టీడీపీ నేతల వివరాలు, వారి లావాదేవీలు బయటపడతాయి కాబట్టి ముంబాయిలో పోన్ పోయిందని చెప్పారు. ఆ తర్వాత జనార్ధన రావు ఒక వీడియో విడుదల చేశాడు. ఇది ఎలా అతుకుతుంది.ఆగని నకిలీ లిక్కర్ తయారీ...లిక్కర్ బాటిల్లు చూసి కొనండి.. క్యూ ఆర్ కోడ్ అమలు చేస్తున్నాం అని ప్రభుత్వం ప్రకటించింది. అంటే నకిలీ లిక్కర్ తయారిని ప్రభుత్వం అంగీకరించింది. వైన్ షాపులలో క్యూ ఆర్ కోడ్ పెడతారు సరే.. బెల్టు షాపులలో ఏం క్యూఆర్ కోడ్ ఉంటుంది. అక్కడెలా నకిలీ లిక్కర్ ని నియంత్రిస్తారు. రాష్ట్రంలో లక్షకు పైగా బెల్టు షాపులున్నాయి. వీటి ద్వారా ఈ నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. ఇవి కాక వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చారు. అక్కడ లూజ్ సేల్ ఉంటుంది. అంటే అక్కడ కూడా నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సోడా మిషన్లు మాదిరిగా కూటమి పాలనలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. దానికి సాక్ష్యం బెల్టు షాపుల్లో జరుగుతున్న అమ్మకాలే. ప్రభుత్వానికి అంతంత మాత్రం ఆదాయం పెరిగింది. లిక్కర్ అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరిగాయి. ఇదే నిదర్శనం. జోగి రమేష్ అరెస్టు అత్యంత దుర్మార్గం, అన్యాయం. నియంతల పాలనలో కూడా లేనంతగా వ్యవస్దలను కూటమి ప్రభుత్వం కంట్రోల్ చేసి... హిట్లర్ కంటే దారుణంగా పాలన సాగిస్తున్నాడు. రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఈ దారుణాలన్నీ కొనసాగిస్తున్నాడు.తప్పులు నిలదీస్తే కేసులు - నారా వారి రూల్ ఆఫ్ లా...కేవలం తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా, పూర్తి స్పృహతోనే, క్రూరమైన, అణిచివేత ధోరణితో కూడిన పాలన సాగిస్తున్నారు. ప్రత్యర్థుల వాయిస్, ప్రజల ఆకాంక్షలు బయటకు వినిపించకుండా గొంతు నొక్కడంతో పాటు వీరి చేస్తున్న దుర్మార్గాలను ఎదుట వాళ్ల మీద నెట్టడంలో వీళ్లు సిద్ధహిద్దులు. లోకేష్ వీటన్నింటికీ ఆద్యుడు. ముందు అరెస్టు చేసి.. సెల్ఫ్ కన్ఫెషన్ పేరుతో వారే స్టేట్ మెంట్లు తయారు చేస్తున్నారు. కోర్టుల్లో నిలబడినా, లేకున్నా ముందుగా జైల్లో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ కేసు తీసుకున్నా మూడు అంశాల మీదే నడుస్తుంది. తామనుకున్న వారిని అరెస్టు చేయడం, వారి పేరు మీద స్టేట్మెంట్ రాసుకోవడం, ఎవరి మీద వాళ్లకు కోపం ఉంటే.. వాళ్ల స్ధాయిలను బట్టి వారి పేర్లు కూడా కేసులో చేర్చడం పనిగా మారింది. ఇలా నెలల తరబడి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది నారా వారి కొత్త రూల్ ఆఫ్ లా. కన్ఫెషన్ పేరుతో అరెస్టు చేయడం, తమకు నచ్చిన సెక్షన్లతో కేసు నమోదు చేయడం అలవాటుగా మారింది. అరెస్టు చేసిన తర్వాత వాళ్ల ఇంట్లో సోదాలు చేసి... అక్కడ పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు చూపిస్తున్నారు. అవి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. తమకు కావాల్సిన అధారాలను వీళ్లే అక్కడ పెట్టి.. వాటినే కోర్టులో ఎవిడెన్స్ గా పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి.నిష్పాక్షపాతంగా దర్యాపు చేయడానికి ఇన్వెస్టిగేషన్ అధికారికి చట్టానికి లోబడి ఇచ్చిన వెసులుబాటును పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. కోర్టులు కూడా ఆమాత్రం వెసులు బాటు ఇవ్వకపోతే దర్యాప్తు ఎలా ముగుస్తుందని అనుకుంటున్న పరిస్థితి. దానివల్ల నేరం చేయకుండా కూడా అధికారంలోకి ఉన్నవాడికి నచ్చకపోతే శిక్షకు గురవుతావన్నది రుజువు అవుతుంది. శిక్ష కరారు కాకముందే.. నిందితుడు 50 రోజులో, 60 రోజులో... ఏ నేరం చేయకున్నా, ఆధారాలు లేకున్నా అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. ఈ కేసులో నిజానికి ఇంకా రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలీ లిక్కర్ తయారీ జరుగుతున్న మాట వాస్తవం. ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరిస్తుంది కాబట్టే... లిక్కర్ షాపులలో మద్యం బ్యాటిళ్లకు క్యూ ఆర్ కోడ్ పెట్టింది. దీన్ని అందరూ గమనించాలి.ప్రజా రక్షణ పట్టని ప్రభుత్వమిదికాశీబుగ్గ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రమాదం అంటేనే అకస్మాత్తుగా జరుగుతుంది. ఎవరూ ప్రమాదాలు జరుగుతాయని ముందే ఊహించరు. కానీ ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు అక్కడ ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పోలీసులదే. కాశీబుగ్గ ఘటన జరిగిన వెంటనే అధికార తెలుగుదేశం పార్టీ మంత్రులు మాకు సంబంధం లేదు.. అది ప్రైవేటు దేవాలయం అని ప్రకటించారు. ఘోరం జరిగిన వెంటనే అది మాది కాదు అన్నారంటే.... తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే. సిగ్గున్న ప్రభుత్వం ఇలా చేస్తుందా? ఏ మాత్రం బాధ్యత తీసుకోవాలనుకునే ప్రభుత్వం ఇలా చేస్తుందా? ప్రభుత్వాన్ని ఎందుకు తప్పుపడుతున్నారంటే.. తిరుపతిలో తొక్కిసలాట జరిగింది, సింహాచలంలో ప్రమాదం జరిగింది ఆ తర్వాత కూడా ఈ ప్రభుత్వం అప్రమత్తం కాలేదు. కారణం మీ ప్రాధాన్యాతలు వేరు. బాథ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం భావించడం లేదు. వ్యవస్ధలో పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా... దాన్నుంచి తప్పించుకోవడంతో పాటు పక్కవారిమీదకు నెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఆలయ ధర్మకర్త తాను ముందురోజే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పారు. ఒకవేళ చెప్పకపోయినా.. రెండేళ్ల నుంచి నిర్వహణలో ఉన్న ఆలయంలో పవిత్ర దినం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్న విషయం తెలియదా? పలాస లాంటి పట్టణంలో ఒకే దగ్గర అంత పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటే నాకు తెలియదని ఎలా తప్పించుకుంటారు ? చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న ప్రచార సాధనాల బలం తలకెక్కడంతో దేన్నీ పట్టించుకోవడం లేదు. ఏం జరిగినా ఎదుట వాళ్లదే తప్పు అని చెప్పడం పరిపాటిగా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయడమో.. సంబంధిత అధికారులను బాధ్యులను చేయకుండా... విచారణ చేయకుండానే, అసలేం జరగలేదని ముందే చెబితే ఇది ఏ రకమైన పాలన? ఎక్కడైనా సమస్య వచ్చినా పోలీసులో, అధికారులో చూసుకుంటారు, వారికి ఆ మేరకు అవగాహన ఉంటుందని ప్రజలు భావిస్తారు. ధైర్యంగా ఉంటారు. అలా ఉండే వారిని కూడా ప్రభుత్వం నీరుగార్చుతుంటే... ఇలాంటి పాలనే ఉంటుంది.రెండేళ్లలోనే రాష్ట్రంలో ఇంతటి దారుణంగా ఉంటే రానున్న మూడేళ్లలో మరింత వికృతంగా, విచ్చలవిడిగా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో జరుగుతున్న దారుణాలను మీడియా, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు స్టడీ చేసి ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వమే తప్పు చేసి ఎదుట వారి మీద కేసులు పెట్టి.. ఆ తప్పును కొనసాగించడం మరింత దారుణమని మండిపడ్డారు -
Sajjala: డిజిటల్ మేనేజర్లతో సజ్జల కీలక సమావేశం
-
కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సర్కారు మెడలు వంచుతాం
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో సాకారమైన కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా పోరాడతామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తమతో కలసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలసి ఉద్యమిస్తామని తెలిపారు. ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’ పోస్టర్‌ను బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, శైలజానాథ్, చెల్లుబోయిన వేణు, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణతోపాటు ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు సజ్జల చెప్పారు. నవంబర్ 24 నాటికి సంతకాల సేకరణ పూర్తి చేసి వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలసి గవర్నర్‌కి అందజేస్తారని చెప్పారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశం.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో భావి తరాలు ఎంత నష్టపోతాయో ప్రజలకు వివరిస్తున్నాం. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలంతా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈనెల 28న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో, నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తాం. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశం. ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ అక్టోబర్ 23న అన్ని జిల్లా కేంద్రాల్లో, 24న నియోజకవర్గ కేంద్రాల్లో, 25న మండల కేంద్రాల్లో జరుగుతుంది. కోటి సంతకాల ప్రతులు నవంబర్ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్ర కార్యాలయాలకు, నవంబర్ 24న కేంద్ర కార్యాలయానికి చేరతాయి. వైఎస్సార్సీపీ హయాంలోనే 7 కాలేజీలు పూర్తి.. వైఎస్సార్సీపీ దిగిపోయే నాటికి 7 కొత్త మెడికల్ కాలేజీలను పూర్తి చేశాం. మరో 3 కాలేజీలు ఆదోని, మదనపల్లె, మార్కాపురంలో 80 నుంచి 90 శాతం పనులు పూర్తి చేసుకుని అడ్వాన్స్ దశలో ఉండగా మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. మెడికల్ కాలేజీల నిర్మాణం ఒక్క రోజులో జరిగే పనికాదు. కేంద్రం నిర్మించిన ఎయిమ్స్ ఆస్పత్రి పూర్తి కావడానికి 9 ఏళ్లు పట్టిందనే విషయాన్ని చంద్రబాబు మర్చిపోతే ఎలా? ఒకపక్క మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి కట్టబెడుతూ, తాను ఉచితంగా వైద్యం అందిస్తానంటే వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రైవేటు సంస్థలు లాభాపేక్ష లేకుండా మెడికల్ కాలేజీలు ఎలా నడుపుతాయి? చంద్రబాబు చెబుతున్న పీపీపీ మోడల్ వల్ల భూమి, భవనాలు వినియోగించుకుని ప్రైవేట్ వ్యక్తులు జేబులు నింపుకొంటే పేదలు వైద్యం కోసం మరింత నిరుపేదలుగా మారిపోతారు. అలాంటప్పుడు పీపీపీతో నష్టం లేదని ఎలా చెబుతారు? -
మెడికల్ కాలేజీలను ఎవరికి దోచి పెట్టాలో రెడీ చేశారు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేతలు పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. అబద్ధాలు చెప్పి దబాయించడం చంద్రబాబు అలవాటే. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. కోవిడ్ తర్వాత ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. కూటమి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ దుర్మార్గ చర్య. దీనిపై ప్రజల్లో కూడా వ్యతిరేకత బాగా పెరిగింది. ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు పోరాటం చేస్తాం. ఇది రాజకీయాల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేస్తాం. ప్రజాస్వామ్య వాదులంతా హాజరు కావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ ఉదృతంగా జరుగుతోంది. ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. స్వచ్ఛందంగా ప్రజా సంఘాలు, మేధావులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు.అందులో భాగంగానే ఈనెల 28న అసెంబ్లీ నియోజకవర్గాలలో ర్యాలీలు చేయబోతున్నాం. తర్వాత నవంబర్ 12న జిల్లా కేంద్రాలలో కూడా ర్యాలీలు చేస్తాం. కోటి సంతకాలు పూర్తి చేసుకుని వాటిని నవంబర్ 23న జిల్లాలకు తరలిస్తాం. అనంతరం కేంద్ర కార్యాలయానికి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను ఆపాలి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్యం, వైద్య విద్యను అందించాలన్నది వైఎస్ జగన్ ఉద్దేశం. అందుకే 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. ఒక్కరోజులో ఏ కాలేజీ పూర్తి కాదు. ఎయిమ్స్ లాంటి సంస్థ పూర్తవటానికే తొమ్మిదేళ్లు పట్టింది.పులివెందుల కాలేజీ పూర్తయినా చంద్రబాబు సీట్లు రాకుండా అడ్డుకున్నారు. పాడేరు కాలేజీకి 50 సీట్లు చాలని మిగతావి రాకుండా అడ్డుకున్నారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున నాలుగైదేళ్లు ఖర్చు చేస్తే కాలేజీలన్నీ అందుబాటులోకి వస్తాయి. పీపీపీ అంటే ప్రయివేటీకరణ కాదని చంద్రబాబు కొత్త భాష్యం చెప్తున్నారు. లాభాల కోసమే ప్రైవేటు వ్యక్తులు మెడికల్ కాలేజీలతో వ్యాపారం చేస్తారు. ఇప్పటికే ఎవరెవరికి ఏ కాలేజీని దోచి పెట్టాలో నిర్ణయం తీసుకున్నారు. ఇక పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఇలాంటి విధ్వంసాన్ని ఏపీలో ఎప్పుడూ చూడలేదు. కానీ, తన మీడియా పవర్‌తో ఎదుటి వారిపై విమర్శలు చేస్తున్నారు’ అని అన్నారు. -
దివ్యాంగులపై మానవత్వం లేదా బాబూ?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల అధ్యక్షుల ఆత్మీయ సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి, దివ్యాంగుల విభాగం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆయన ఏమన్నారంటే..దివ్యాంగులకు సంబంధించిన ప్రతి సమస్యపై వైఎస్ జగన్ క్షుణ్ణంగా తెలుసుకుంటూనే ఉన్నారు. వైఎస్ జగన్ హయాంలో నిస్సహాయులుగా ఉన్న వర్గాలకు, దివ్యాంగులకు సమాన హక్కులు కల్పించడం, అంతిమంగా దివ్యాంగులకు ఎలా లబ్ధిచేయాలని తపించారు. సాంకేతిక కారణాలతో దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా, నిబంధనలు సరళీకృతం చేయాలని, అవసరమైన సవరణలు చేశారు. క్యాలెండర్ పెట్టుకుని జగనన్న పాలనలో ఏ నెలలో ఏం వస్తుందని సంక్షేమ లబ్ధిదారులకు హక్కుగా లభించేలా చేశారు...పాలన అంటే ఒక సార్ధకత దానిని నాడు వైఎస్సార్.. ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో చూశారు. అసమానతలు తొలగించి రాజ్యాంగ స్పూర్తిని అమలు చేసింది వైఎస్ జగన్ పాలనలోనే. మానవత్వంతో పాలన సాగించడం అనేది చూశాం. వైఎస్సార్సీపీ అనేది ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళుతుంది. వైఎస్ జగన్ పాలనకు పూర్తి వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగుతుంది. ఏ రకంగా వడపోసి సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించాలనేది చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబు సంక్షేమం అంతా తన కోసం, అయిన వారికే తప్ప నిజమైన లబ్ధిదారులకు కాదు. ఎల్లో మీడియా, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు చంద్రబాబు చేతిలో ఉన్నాయి.ఊత కర్రల సాయంతో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. దివ్యాంగుల విషయంలో చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సామాజిక భద్రత అనేది లేకపోతే పేద వర్గాలు ఏమవ్వాలి. దివ్యాంగులకు పింఛన్లు అవసరమా అనే చర్చ లేవనెత్తారు చంద్రబాబు. దానికి ఎల్లో మీడియా బాకా ఊదుతోంది. రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను వేధిస్తున్నారు. వికలాంగుల విషయంలో జగన్ ఏనాడు పార్టీలు చూడలేదు. వారికి ఎలా చేయూత ఇవ్వాలి, వారు ఆత్మగౌరవంతో ఎలా బతకాలి అని ఆలోచించారు. వైఎస్ జగన్ పాలన ఈ ఐదేళ్ళు కొనసాగి ఉంటే ఒక కొత్త జనరేషన్ తయారయ్యేది. ఒక మంచి వ్యవస్థలను జగన్ రూపొందిస్తే.. చంద్రబాబు దానిని కుప్పకూల్చారు.వైఎస్ జగన్ పాలనలో నాడు-నేడు పేరుతో స్కూల్స్ అభివృద్ధి జరిగితే ఇప్పుడు ఏం జరుగుతుంది. కురుపాం, తురకపాలెం ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా.? ప్రభుత్వం దృష్టికి ఇవి రాలేదా..? ఇవి వైఫల్యాలు కావా..? పాలన అనేది ఒక యజ్ఞంలా వైఎస్ జగన్ భావించారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల డెలివరీ పెడితే చంద్రబాబు లిక్కర్ షాప్‌లు, బెల్ట్ షాపులు పెట్టి లిక్కర్ డెలివరీ చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా రెడ్ బుక్ పేరుతో నాశనం చేశారు. మళ్ళీ అధికారం రాదని తెలిసి చంద్రబాబు ఆయన కుమారుడు బరితెగించి వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఒక బలీయమైన శక్తిగా రూపొందింది. అందుకు ఉదాహరణే జగన్ పర్యటనలకు వస్తున్న లక్షలాది మంది జనమే. కోటి సంతకాల సేకరణలో మీ విభాగం కూడా సమన్వయంతో పనిచేయాలి. మీ పరిధిలో ఉన్నంత మేరకు వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషిచేయండి.కూటమి సర్కార్ దివ్యాంగులను మోసగించింది: మేరుగ నాగార్జునదేశ చరిత్ర లోనే దివ్యాంగులకు భరోసా, ఆత్మస్ధైర్యం కల్పించింది జగనన్న పాలనలోనే. ఏపీలో కూటమి ప్రభుత్వం దివ్వాంగులను మోసగించింది. వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ఆసుపత్రుల చుట్టు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. పెన్షన్ల రీవెరిఫికేషన్ పేరుతో వారికి నరకయాతన చూపుతున్నారు. చంద్రబాబు ఇదేనా మానవత్వం. చంద్రబాబు దివ్యాంగుల పట్ల నువ్వు చేస్తున్నది మోసం, దగా కాదా అని ప్రశ్నిస్తున్నాం.దివ్యాంగులకు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి?: పులిపాటి దుర్గారెడ్డిచంద్రబాబు దివ్యాంగులను నిలువునా మోసం చేశారు. దివ్యాంగుల పెన్షన్లలో కోతలు, ఆంక్షలతో వేధిస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు నువ్వు దివ్యాంగులకు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి. లక్షల మంది దివ్యాంగలకు నోటీసులు ఇచ్చి మా దివ్యాంగులను దొంగలుగా చిత్రీకరిస్తున్నావు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశావ్. జగన్ హయాంలో తలెత్తుకు తిరిగిన మేమంతా ఇప్పుడు ఆత్మాభిమానం దెబ్బతిని బతుకీడుస్తున్నాం. అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం మీకు సమంజసమా అని నిలదీస్తున్నాం. -
చంద్రబాబు సర్కారు దుర్మార్గాలను సమర్ధంగా ఎదుర్కోవాలి: సజ్జల
-
చంద్రబాబు దుర్మార్గాలను గట్టిగా ఎదుర్కోవాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ‘‘వైఎస్సార్సీపీకి 18 నుంచి 20 లక్షల మంది క్షేత్రస్థాయి క్రియాశీల నాయకత్వం ఉంది.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై వైఎస్ జగన్ ఆలోచనలు, బ్లూ ప్రింట్‌ను మనం అమలు చేయాలి’’ అని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలన్నీ చిత్తశుద్ధిగా పనిచేయాలన్నారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం.. అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి సహా ఇతర నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఏపీలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలి, ఈ దుర్మార్గాలను ఆపగలగాలి. ఇందులో భాగంగా మనం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేస్తున్నాం. పార్టీ అనుబంధ విభాగాలు అన్నీ దీనిపై చిత్తశుద్దిగా పనిచేయాలి. పార్టీ సంస్ధాగత నిర్మాణంలో ప్రధానంగా అనుబంధ విభాగాలు పటిష్టంగా ఉండాలని వైఎస్ జగన్ ఆలోచించి అందుకు అనుగుణంగా స్ట్రక్చర్ నిర్మించారు..క్షేత్రస్థాయిలో కూడా మన అనుబంధ విభాగాలు ఫోకస్డ్గా పనిచేయాలి. ప్రధానంగా 7 అనుబంధ విభాగాలు కీలకపాత్ర పోషించాలి. పార్టీ లైన్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అనుబంధ విభాగాలదే ప్రధాన పాత్ర. మన సొసైటీకి ఎలా మంచి చేయాలని తపన పడే నాయకుడు జగన్. మనం ఎక్కడా అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు. మన పార్టీకి కోట్లాది మంది సైన్యం సిద్ధంగా ఉంది. అందరినీ సంఘటితం చేయాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ కసరత్తు చేస్తున్నాం. మనం ఇప్పటికే మండల స్ధాయి కమిటీలలో ఉన్నాం. ఇక గ్రామస్థాయికి వెళ్ళబోతున్నాం. డేటా ప్రొఫైలింగ్ చేస్తూ ముందుకెళుతున్నాం. దీనిపై అందరూ సీరియస్‌గా దృష్టిపెట్టాలి...వైఎస్సార్సీపీ అంటే 18 నుంచి 20 లక్షల క్రియాశీల క్షేత్రస్థాయి నాయకత్వం ఉంటుంది. వీరందరి డేటా ప్రొఫైలింగ్‌ను మనం సరిగా నమోదు చేయగలిగినప్పుడే మనం అనుకున్న ఫలితాలను అందుకోగలుగుతాం. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలి, ఈ ప్రక్రియకు అవసరమైన సపోర్ట్ సిస్టమ్‌ను మనం అందుబాటులోకి తెచ్చుకోవాలి. అన్ని విభాగాల మధ్య సమన్వయం చేసుకోవాలి. పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణంలో అలసత్వం వద్దు. ఉత్సాహం, తపన, బాధ్యతతో పనిచేయాలని ముందుకొచ్చేవారిని గుర్తించి వారికి కమిటీలలో ప్రాధాన్యతనివ్వాలి...ఏపీలో నకిలీ మద్యం ఏరులై పారుతుంది. వైఎస్ జగన్ హయాంలో డెలివరీ సిస్టమ్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చక్కగా ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తే చంద్రబాబు మాత్రం రివర్స్ పాలన సాగిస్తున్నారు. గతంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని చక్కగా చేశాం. ఇప్పుడు జరుగుతున్న రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలతో పాటు కమిటీల నియామకాలు కూడా పూర్తి చేద్దాం. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అనుబంధ విభాగాలు క్రియాశీలకంగా ఉండాలి. పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి’’ అని సజ్జల పేర్కొన్నారు. -
జోగి రమేష్ పై ఆరోపణలు.. సజ్జల స్ట్రాంగ్ రియాక్షన్
-
‘ఆ భయంతోనే చంద్రబాబు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు’
తాడేపల్లి : నకిలీ మద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా బరితెగించి వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు తప్పులు మీద తప్పులు చేస్తూ కూడా అడ్డగోలుగా బుకాయిస్తున్నారని విమర్శించారు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 14వ తేదీ) పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శులతో సజ్జల సమావేశమయ్యారు. ‘భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మద్యం అసలుదా.. నకిలీదా అని తెలుసుకునేలా యాప్ పెట్టలేదు. చంద్రబాబు యాప్ పెట్టారంటే నకిలీ మద్యం ఉన్నట్లే కదా..?, చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తూ కూడా అడ్డంగా బుకాయిస్తున్నారు. సడెన్‌గా ఒకడు ఆఫ్రికానుంచి వస్తాడు, అతనికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు. అతని వీడియో బయటికి వస్తుంది, జోగి రమేష్ పేరు చెబుతాడు.. అతను చెప్పినందుకే చేశానంటాడు, నకిలీ మద్యం కేసులో చంద్రబాబు అడ్డం దొరికారు. ఆ భయంతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. బెల్ట్ షాప్‌లు ఉన్నాయని చంద్రబాబే ఒప్పుకున్నారు.. కల్తీ మద్యాన్ని అసలు మద్యంలా చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టాం.. ఆ దుకాణాలకు వచ్చిన మద్యం ఏ డిస్టిలరీ నుంచి వచ్చిందో తెలుసేలా చేశాం. దాని అమ్మకం జరిగితేనే డిస్టిలరీకి డబ్బులు వెళ్ళే విధంగా క్యూఆర్ కోడ్ పెట్టాం. పక్కాగా పకడ్భందీగా లిక్కర్ సేల్స్ జరిగాయి. టీడీపీ ప్రభుత్వం కల్తీ మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. 24 గంటలు బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు పెట్టి నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలి. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఉవ్వెత్తున ఎగిసి పడి మనం పోరాటాలు చేస్తున్నాం. చంద్రబాబు గ్యాంగ్ బరితెగించి అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలి. పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం అయ్యేలా యాప్‌ను కూడా సిద్దం చేశాం.. డేటా ప్రొఫైలింగ్ జరుగుతుంది. స్ధానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా పూర్తిస్ధాయిలో సిద్దంగా ఉండాలి. పార్టీ కమిటీలు, సంస్ధాగత నిర్మాణం విషయంలో పుంగనూరు, మడకశిర నియోజకవర్గాలను మోడల్ గా తీసుకుని ముందుకెళ్ళాలి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహిస్తే నష్టమని చంద్రబాబు అంటున్నారు పీపీపీలో మెడికల్ కాలేజీలు మంచిదని చెబుతున్నాడు.. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?’ అని సజ్జల ప్రశ్నించారు.ఇదీ చదవండి:‘వైద్య రంగంలో జగన్ సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే’ -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
సాక్షి, అమరావతి: పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని, వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుడితే, ప్రైవేటీకరణ ద్వారా వాటిని సీఎం చంద్రబాబు పేదలకు దూరం చేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమం పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ‘‘ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి 175 నియోజకవర్గాల్లో శుక్రవారం నుంచి వైఎస్సార్సీపీ 45 రోజుల పాటు గ్రామ స్థాయి వరకూ ప్రజా ఉద్యమం చేపడుతుంది. సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచి రచ్చబండ కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండలో నాయకులు పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిస్తారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమరి్పస్తారు. నవంబర్ 23న జిల్లా కేంద్రాల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. నవంబర్ 24న ఈ పత్రాలు కేంద్ర కార్యాలయానికి చేరుకుంటాయి. అనంతరం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్ కు కోటి సంతకాలను సమర్పిస్తాం. పార్టీ మాత్రమే కాకుండా, పౌరసమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న మేధావి వర్గాలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని కోరుతున్నాం’’అని పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేయడాన్ని చూస్తే, చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు తారస్థాయికి చేరాయని అర్థం అవుతోందని సజ్జల అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి , ఎనీ్టఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, పలువురువైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. 13న నకిలీ మద్యంపై నిరసన కార్యక్రమాలు నకిలీ మద్యంపై సోమవారం (13వ తేదీ) అన్ని నియోజకవర్గాల్లో ఎక్సైజ్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు సజ్జల పిలుపునిచ్చారు. నకిలీ మద్యంపై ఇప్పటికే మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్య నాయకులతో గురువారం సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల విజయవంతంతోపాటు, పార్టీ కమిటీల నియామకంపై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను గట్టిగా నిరసించాలి: సజ్జల
-
‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను గట్టిగా నిరసించాలి’
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను గట్టిగా నిరసించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రేపటి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగే నిరసనలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి.. టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను గట్టిగా నిరసించాలి. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టాలిపార్టీ కమిటీల నియామకం నవంబర్ 20 నాటికి పూర్తి చేయాలి. పార్టీ సంస్థాగత బలోపేతంపై సీరియస్‌గా దృష్టిపెట్టాలి. నిబద్దతతో, చురుగ్గా పని చేసే వారికి కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వండి. పుంగనూరు, మడకశిర నియోజకవర్గాల తరహాలో కమిటీల నెట్వర్కింగ్ సిస్టమ్ అన్ని నియోజకవర్గాల్లో జరగాలి’ అని పేర్కొన్నారు. -
‘డిజిటల్ బుక్‌లో ఫిర్యాదులు, వీడియోలు రికార్డ్ అవుతున్నాయి’
సాక్షి, చిత్తూరు: ఏపీలో చంద్రబాబు అన్యాయ పాలన చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఓట్లను తొలగించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు తెలుసు. ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి. బూత్ లెవల్లో నిత్యం పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.చిత్తూరులో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన పుంగనూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ..‘ప్రజలకు సంక్షేమం అందించడమే అజెండాగా వైఎస్ జగన్ పాలన సాగింది. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాం. భవిష్యత్తులో వైఎస్సార్సీపీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. రాబోయే వైఎస్ జగన్ పాలనలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుంది. మీ పాత్ర ప్రత్యక్షంగా ఉంటుంది. జగన్ చేసే యజ్ఞంలో మనం క్రియాశీలక పాత్రదారులం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కానీ, వైఎస్ జగన్.. ప్రజల సంక్షేమం లక్ష్యంగా పాలన చేశారు. టీడీపీ కమిటీలు దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాయి. జగనన్న సైనికులు అని గర్వంగా చెప్పుకునే విధంగా మీరు పనిచేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము ఉన్నాము అని చెప్తున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మనకు 18 లక్షలు మంది క్రియాశీలక సైన్యం ఉంది. ఎల్లో మీడియా, సోషల్ మీడియా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. మన వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాటిని అడ్డుకుంటున్నారు. వ్యక్తిత్వ హననం, అబద్ధపు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను మన సోషల్ దీటుగా ఎదుర్కొంటోంది. వ్యక్తిగతంగా దాడికి రెడ్ బుక్ ఉపయోగించారు.మనం డిజిటల్ బుక్‌ను లాంచ్ చేశాం. కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అనే దానికి ఇది గుర్తు. ఫిర్యాదులు వస్తున్నాయి, వీడియోలు రికార్డు చేస్తున్నాం. డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా నమోదు చేయవచ్చు. చట్టబద్ధంగా వారిని శిక్షించేందుకు ఇది ఉపయోగ పడుతుంది. ప్రతీ ఒక్కరికి పార్టీ గుర్తింపు కార్డులు అందిస్తాం, టెక్నాలజీ వాడుకుని ముందు వెళ్తున్నాం. అన్యాయమైన పాలన చంద్రబాబు సాగిస్తున్నారు. ఓటర్లను తొలగించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు తెలుసు. ప్రతీ కార్యకర్త, నాయకులు అప్రమత్తంగా ఉండాలి, బూత్ లెవల్లో నిత్యం పరిశీలిస్తూ ఉండాలి. నిర్మాణాత్మకమైన పార్టీగా, సంస్థాగతంగా సిద్ధం చేస్తాం. రాబోయే 30 ఏళ్లలో తిరుగులేని శక్తిగా వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తున్నాం. ప్రత్యర్థులను వణుకు పుట్టించేలా ఈరోజు పుంగనూరు నియోజకవర్గం సమావేశానికి హాజరయ్యారు. బీటలు వారిన కోటలు టీడీపీ అని వ్యాఖ్యలు చేశారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశాం. గ్రామ కమిటీలకే పూర్తి బాధ్యత, రాబోయే ఐదేళ్లు వీరికే బాధ్యత అప్పగిస్తామన్నారు.భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో అన్ని కమిటీలు నియమించిన మొట్టమొదటి నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గం. రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యక్తలకే మొదటి ప్రాధాన్యత. జగనన్న మాటగా మీరు గ్రామస్థాయిలో తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది.ఆకేపాటి అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగనివ్వను. కార్యక్తలకే మొదటి ప్రాధాన్యత అని జగనన్న చెప్పారు. ఈసారి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని హామీ ఇచ్చారు. -
YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల
-
‘ చంద్రబాబు మళ్లీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎప్పుడూ విజన్‌తోనే ఆలోచిస్తుందని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాము నేరుగా లబ్ధిదారుడికే పథకాలు అందించామని, 2029 వరకూ అధికారంలో ఉండి ఉంటే ఏపీ పూర్తిగా అభివృద్ధి చెందేదన్నారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 12వ తేదీ) మీడియాతో మాట్లాడిన సజ్జల.. ప్రజల ఆకాంక్షల మేరకు తాము అధికార వికేంద్రీకరణ అన్నామన్నారు.‘ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేసింది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని పెడితే బాగుండేది. బాబు తన జేబు, తన కోటరీ జేబులను నింపడానికే చూస్తున్నారు. అమరావతిలో లక్షల కోట్లు రూపాయలు పెడితే రాష్ట్రం భరించే స్థితిలో లేదు. అమరావతిలో రాజధాని అంటే స్టేట్‌ను ఊబిలో దింపడమే. బాబు సెన్స్‌బుల్‌గా ఆలోచించి అప్పులు పాలు కాకుండా చూడాలి. చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ అంటుంటే అనుమానాలు వస్తున్నాయి. మేం వచ్చేలోపు బాబు అప్పులు పాలు చేయకుండా ఉంటే చాలు’ అని తెలిపారు. -
ఫేక్ ప్రచారాలను తిప్పి కొట్టాలి.. BC నాయకులతో సజ్జల కీలక సమావేశం
-
‘బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ జగన్ మాత్రమే’
తాడేపల్లి : బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 11) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం జరిగింది. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఎమ్మెల్సీ బీసీ విభాగం అధ్యక్షుడు రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెండ్ నౌడు వెంకట రమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకం రెడ్డి నారాయణమూర్తి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆలూరు సాంబ శివారెడ్డి సహా బీసీ కులాల సాధికర అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మేరకు మాట్లాడిన సజ్జల ఏమన్నారంటే.. ‘ బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ జగన్ మాత్రమే. అన్ని కులాలను గుర్తించి ప్రత్యేకంగా కార్పోరేషన్లు సైతం ఏర్పాటు చేయించారు. ఒక సమగ్ర విధానం ద్వారా బీసీలందరికీ అభివృద్ధి ఫలాలను అందించారుబీసీలందరినీ చైతన్య పరిచి మళ్లీ ఏకతాటి మీదకు తీసుకు రావాలి. మన హయాంలో జరిగిన అభివృద్ధిని అందరికీ వివరించాలి. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై విసుగు చెందారు. టీడీపీ నేతలు చేస్తున్న ఫేక్ ప్రచారాలను తిప్పి కొట్టాలి’ అని సూచించారు. -
నీ ఉచిత సలహాలు ఎవడికి కావాలి.. బాబుపై సజ్జల ఫైర్
-
ఈనెల 9న వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రైతులకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై వైఎస్సార్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఈనెల 9న వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’ కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా ‘అన్నదాత పోరు’ పోస్టర్ని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు, రాయన భాగ్యలక్ష్మి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోంది. రైతులు యూరియా అడిగితే బొక్కలో తోస్తానంటూ సీఎం మాట్లాడతారా?. రైతులను బెదిరించటం, తొక్కుతాం, నారతీస్తాం అంటారా?. రైతులంటే అంత చిన్న చూపేంటి?. ఈ ప్రభుత్వ మెడలు వంచేంత వరకు వైఎస్సార్సీపీ పార్టీ వెనుకడుగు వేయదు. రైతులకు యూరియా సరఫరా చేసే వరకు పోరాటం చేస్తాం. ఈనెల 9న ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపడతాం. రాష్ట్రంలో ఇప్పటికి 60 శాతం సాగు కూడా కాలేదు. కానీ, ఎక్కడా యూరియా మాత్రం అందటం లేదు. యూరియాను టీడీపీ నేతలే బ్లాక్ మార్కెట్‌కు తరలించుకున్నారు. సమస్యను సృష్టించి, అందులో నుంచి దోపిడీ చేయటం టీడీపీ నేతలకు బాగా తెలుసు. రైతులకు విత్తనాలు, ఎరువులు ఏవీ అందటం లేదు. ఎరువుల కొరత లేదంటున్న చంద్రబాబుకు రైతుల క్యూలు కనపడటం లేదా?. కాళ్లు అరిగేలా తిరుగుతున్న రైతులు కనపడటం లేదా?. మిర్చి, పొగాకు, మామిడి రైతులు కష్టపడుతుంటే చంద్రబాబు చోద్యం చూశారు. వైఎస్ జగన్ వెళ్తే హడావుడిగా కేంద్రానికి లేఖలు రాశారు. ఉల్లికి ధర లేదని వైఎస్సార్సీపీ నేతలు వెళ్తే మళ్ళీ హడావుడి చేశారు. ఇదేమైనా నియంతృత్వ పాలనా?. యూరియా అడిగితే బెదిరించే సీఎంని ఇప్పుడే చూస్తున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
Sajjala Ramakrishna: విజయమ్మ విషయంలో లోకేష్ రాజకీయం..!
-
రోజుకో డ్రామా సజ్జల భార్గవ్ రెడ్డిపై పచ్చ మీడియా అవాస్తవ కథనాలు
-
లోకేష్‌తోనే ప్రద్యుమ్నకు సంబంధాలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: భీమ్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదని.. బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీ ద్వారా డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతాయంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా హయాంలో పేపర్ల కోసం కథలు సృష్టించలేదన్నారు. లేని స్కాం మీద ప్రజల్లో విషం నింపాలని చంద్రబాబు చూస్తున్నారని.. అందులో భాగంగానే రోజువారి విషపు కథలు ప్రచురిస్తున్నారంటూ సజ్జల దుయ్యబట్టారు.‘‘యాక్టివిటి లేని కంపెనీని అక్రమ లిక్కర్ స్కాంలో ఇరికించాలని చూస్తున్నారు. డబ్బులతో పట్టుబడిన వ్యక్తికి చెవిరెడ్డికి లింక్ పెట్టారు. ఈనాడు, ఆంధ్రజ్యోతికి సిట్ బ్యానర్ ఐటమ్స్ అందిస్తుంది. గతంలో ప్రద్యుమ్న స్టూడియో-ఎన్లో యాక్టివ్ డైరెక్టర్. స్టూడియో-ఎన్ను నారా లోకేష్ ప్రమోట్ చేశారు. లోకేష్‌తోనే ప్రద్యుమ్నకు సంబంధాలున్నాయి. రోజుకో కథ రాసి బురద అంటించాలని చూస్తున్నారు. సజ్జల భార్గవ్‌రెడ్డికి సంబంధించి ప్రచురించిన కథనాలు అవాస్తవం.లిక్కర్ స్కాంలో సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఆరోపణలు అవాస్తవం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.‘‘సిట్ పేరు చెప్పి ఎల్లోమీడియా మాపై విష ప్రచారం చేస్తోంది. సజ్జల భార్గవ్ కంపెనీగా చెప్తున్న భీమ్ అసలు ఎలాంటి యాక్టివిటీ చేయటం లేదు. ఆ సంస్థకు కనీసం బ్యాంకు ఎకౌంట్ కూడా లేదు. మరి లిక్కర్ స్కాంలోని నిధులను భీమ్ సంస్థ ఎకౌంట్ ద్వారా ఎలా వెళ్తాయి?. సిట్ విచారణ ఎలా జరుగుతుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మా హయాంలో మద్యం పాలసీ పారదర్శకంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్టు తన మనుషులకు లాభం చేకూర్చేలాగ జరగలేదు..డిస్టలరీల్లో ఏదైనా తప్పు జరిగి వాటి ద్వారా మేమైనా లబ్ధి పొందినట్టు ఆధారాలు ఉంటే ఏదైనా జరిగిందనుకోవచ్చు. కానీ ఏమీ జరగనిది జరిగినట్టు చూపించటానికి తెగ తాపత్రయ పడుతున్నారు. లేని స్కాం ఉన్నట్టుగా చెప్పి ప్రజల్లో విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఏడాదిగా ఇలా కట్టుకథలతో విచారణ జరుపుతున్నారు. సజ్జల భార్గవరెడ్డిని కూడా లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరికో లింకులు కలుపుతూ స్కాం జరిగిందని ప్రచారం చేస్తున్నారు...ఎల్లోమీడియా ఆఫీసుల్లో కూర్చుని సిట్ అధికారులు పని చేస్తున్నారా?. లేకపోతే ఎల్లో మీడియా, సిట్ అందరూ కలిసి టీడీపీ ఆఫీసులో కూర్చుని పని చేస్తున్నారా?. ప్రద్యుమ్న స్టూడియో ఎన్ డైరెక్టర్. ప్రద్యుమ్న, నారా లోకేష్ మధ్య సంబంధాలు ఉన్నాయి. దానిని బట్టి నారా లోకేష్‌ను కూడా కేసులో ఇరికించవచ్చా?. చంద్రబాబు చిల్లర వార్తలతో రాజకీయాలు చేయటం, పరిపాలన చేయటం సిగ్గుచేటు. రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి నిత్యం ప్రజల మీద విషం చిమ్మే వార్తలు రాయిస్తున్నారు...కళ్లముందు కనిపిస్తున్న నిజాలను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజాలు మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. యూరియా కష్టాలు గురించి జగన్ ట్వీట్ చేస్తే అది ఫేక్ అంటూ ప్రచారం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. మరి ఇవన్నీ ఫేక్ అని చంద్రబాబు చెప్పగలరా?. చినముత్తేవి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను రైతులు అడ్డుకున్నారు. ఇందులో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారు. కానీ వైఎస్సార్సీపీ వారు లారీని అడ్డుకున్నారంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు...అసలు సమస్యను పరిష్కరించకుండా రైతులను దూషించటం ఎందుకు?. యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కూడా సమస్యలు సృష్టించి వారి నుండి లంచాలు మెక్కుతున్నారు. యూరియా కూడా సమృద్ధిగా ఉంటే మరి ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా?. ఫేక్ వార్తలు సృష్టిస్తున్నదే టీడీపీ...టీడీపీ ఆఫీసులోనే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టారు. తండ్రీ కొడుకులు వీకెండ్లో హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. వారికి జనం సమస్యలు పట్టటం లేదు. వీటన్నిటి నుంచి డైవర్షన్ చేయటానికి లేని లిక్కర్ స్కాంని సృష్టించారు. సీఎం స్థాయి వ్యక్తే జనాన్ని బెదిరిస్తుంటే ఇంకేం అనాలి. అంత దిగజారి వ్యవహరించాలా చంద్రబాబూ?. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరయినా ఇంకా జగన్ మీద పడి ఏడవాలా?. విష ప్రచారం చేయటంలో లోకేష్ తండ్రిని మించి పోయారు. లోకేష్ ఆఫీసే సీఎంవోగా మారిపోయింది. తండ్రి నిర్ణయాల కంటే లోకేష్ నిర్ణయాలే అమలవుతున్నాయి...వైఎస్ జగన్, విజయమ్మ విషయంలో కూడా లోకేష్ దిక్కు మాలిన రాజకీయం చేస్తోంది. ఫేక్ వీడియోలు, ఫోటోలతో శునకానందం పొందుతున్నారు. చంద్రబాబుకు అసలు కుటుంబ బంధాల గురించి తెలుసా?. చంద్రబాబు చెల్లెళ్లు ఎవరో ఈ ప్రపంచానికి తెలుసా?. కనీసం లోకేషైనా వారి మేనత్తలను గుర్తు పట్టగలడా?. చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లుకు ఏం న్యాయం చేశారు?. అత్యధిక ధనవంతుల సీఎంలలో చంద్రబాబే దేశంలో నంబర్ వన్. అలాంటి వ్యక్తి తన తమ్ముడు, చెల్లెళ్లకు ఏం న్యాయం చేశారు?. రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోని ఫేక్ సీఎం చంద్రబాబు...యూరియా సమస్యపై ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో ఆఫీసుల ఎదుట నిరసన చేపడతాం. రాష్ట్రంలో పరిపాలన సాగటం లేదు. జరుగుతున్నదల్లా దోపిడీలు, కుంభకోణాలే.. ప్రశ్నిస్తే ఎంతమందిని అరెస్టు చేయగలరు?. వైఎస్సార్సీపీ కార్యకర్తల నుంచి ఇప్పుడు సామాన్య ప్రజల మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబుకు ప్రజలు ఈస్టమన్ కలర్లో సినిమా చూపించే టైం దగ్గర పడింది. లోకేష్ ఢిల్లీ పర్యటన వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. తమ పైరవీలు చేసుకోవటానికే పదేపదే ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. ఆయనపై ఉన్న కేసులు కొట్టేయించుకునేందుకు వెళ్తున్నారు’’ అంటూ సజ్జల మండిపడ్డారు. -
‘సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో వైఎస్ జగన్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడంలో ఐటీ వింగ్ క్రియాశీలక పాత్ర పోషించాలని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీలో టెక్నాలజీ ప్రాముఖ్యత, సులభంగా అర్థమయ్యే రీతిలో పార్టీ లైన్ క్యాడర్‌కు, ప్రజలకు వివరించడంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ జరగడం మంచి పరిణామంగా సజ్జల పేర్కొన్నారు. బుధవారం.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఐటీ వింగ్ సమావేశం జరిగింది. సజ్జలతో పాటు ఐటీ వింగ్ ప్రెసిడెంట్ పోశింరెడ్డి సునీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ్ భాస్కర్ రెడ్డి, అన్ని జిల్లాల ఐటీ వింగ్ అధ్యక్షులు, పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, ఆలూరి సాంబశివారెడ్డి, తలారి రంగయ్య, టీజేఆర్ సుధాకర్ బాబు, దవులూరి దొరబాబు, పలువురు నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘సాంకేతికతను వాడుకుంటూ ఏ విధమైన మెకానిజం ఉండాలన్న దానిపై కూడా మనం చర్చిద్దాం. వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్‌పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనే మెకానిజాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్‌ను అనుసంధానించడం అనేది ఒక ముఖ్యమైన ఎజెండాగా మనం ముందుకెళ్ళాలి. అబద్దాన్ని నిజం అని చంద్రబాబు, టీడీపీ చేస్తున్న ప్రచారం బలంగా తిప్పికొట్టాలి...ఐటీ వింగ్‌లో క్రియాశీలకంగా ఉన్నవారినందరినీ ఒక గ్రిడ్ కిందకు తీసుకువచ్చి అందరినీ మమేకం చేయాలి. పార్టీలోని అన్ని కమిటీల నిర్మాణంపై సీరియస్‌గా దృష్టిపెట్టాలి, వారి బాధ్యతలు, నిర్వర్తించాల్సిన విధులపై అవగాహన కల్పించాలి. మనమంతా ఒక ఆర్గనైజ్డ్ టీమ్‌గా ముందుకెళ్ళాలి. దానికి తగిన విధంగా మనం సిద్ధం కావాలి. రాష్ట్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసుకుని అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవాలి. అందరూ ఫోకస్‌తో కష్టపడి పనిచేసి పార్టీ మెకానిజంలో భాగస్వాములవ్వాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
సామాజిక వైద్యుడు వైఎస్సార్
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలతో.. చిరునవ్వుతో కూడిన పలకరింపుతో ప్రతి గుండెను కదిలించిన సామాజిక వైద్యుడు, మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్ స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుందని నివాళులర్పించారు. మంగళవారం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, పేదలకు దుస్తుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. పేదరికం, వెనుకబాటుతనాన్ని పారద్రోలడానికి సిద్ధాంతాలు, సమీక్షల పేరుతో కాలయాపన చేయడం సరైన విధానం కాదని, సహజ స్వభావాలతో ఆలోచించి చికిత్స చేయాలని నిరూపించిన సామాజిక వైద్యుడు రాజశేఖరరెడ్డి అని చెప్పారు. రైతులు, విద్యార్థులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల వారిని ముందుకు నడిపించిన మహోన్నత నాయకుడు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పెనుమార్పులు తీసుకొచ్చిన మహనీయుడు వైఎస్ అన్నారు. ఉచిత విద్యుత్ ద్వారా ఎంతోమంది రైతులకు, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేద కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యం, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా కోట్ల మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసిన ఆదర్శప్రాయుడు వైఎస్ అని గుర్తు చేశారు.వైఎస్సార్ ఆశయాలకు ప్రతిరూపం వైఎస్ జగన్ వైఎస్సార్ మనకు దూరమైనా వైఎస్ జగన్ రూపంలో గొప్ప వారసత్వాన్ని అందించారని సజ్జల పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ విజయవంతమయ్యారని, వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసి ఈ ప్రజా సంకల్పంలో మనల్ని అందర్నీ భాగస్వాముల్ని చేసినందుకు గర్వంగా భావిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలకు వైఎస్సార్ బీజం వేస్తే ఐదేళ్ల పాలనలో అంతకన్నా మెరుగ్గా మరిన్ని పథకాలను వైఎస్ జగన్ ముందుకు తీసుకెళ్లగలిగారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర్‌రావు, పూనూరు గౌతమ్‌రెడ్డి, కాకుమాను రాజశేఖర్, పోతిన మహేష్, చల్లా మధు, కొమ్మూరి కనకరావు, పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, పార్టీ గ్రీవెన్స్, లీగల్, యువజన, మహిళా విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
ఈ అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకోండి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పునాదులను బలంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని.. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులతో అవగాహనా సమావేశం ఆదివారం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్ లాంటి వారన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని నిలబడాలి.. వైఎస్సార్సీపీది ప్రజాపక్షం అని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.‘‘మనమంతా బలమైన వ్యవస్ధగా రూపొందాం. మీరంతా మీ శక్తి సామర్ధ్యాలు నిరూపించుకునే అవకాశం మీకు పార్టీలో కల్పించబడింది. దానిని ఛాలెంజ్‌గా తీసుకుని మీరు నిలబడాలి. మండల స్ధాయి నుంచి బలమైన నాయకత్వం ఉన్నప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజలపక్షాన నిలబడాలి. ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజల గొంతుకగా మనం నిలబడాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. -
ఆకాశమే హద్దుగా.. అదే కీలకం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పబ్లిసిటీ వింగ్ ఆకాశమే హద్దుగా పనిచేయాలని.. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని.. ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీది ఎప్పటికీ ప్రజల పక్షమేనన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల ప్రచార విభాగం అధ్యక్షులతో సమావేశం ఇవాళ(శుక్రవారం) జరిగింది.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రచార విభాగం కీలకమైన విభాగం. అన్ని అనుబంధ విభాగాలలో కూడా ఈ విభాగం సభ్యులు చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పబ్లిసిటీ వింగ్‌లో మనకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని ఎంత ఉత్సాహంగా పనిచేయగలిగితే అంత గుర్తింపు వస్తుంది. ఆకాశమే హద్దుగా మనం పనిచేసే అవకాశం ఈ విభాగంలో ఉంటుంది’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘ఈ వింగ్‌లో కష్టపడి పనిచేసి తగిన గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి. పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ విభాగం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది మీరు అంచనాలు వేసుకుని తగిన విధంగా పనిచేయగలిగేలా ఉండాలి. ఇందుకు తగిన విధంగా కమిటీల నియామకం జరగాలి. పార్టీ లైన్‌కి తగ్గట్లుగా ముందుకెళుతూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచడంలో ముందుండి ఉత్సాహంగా పనిచేయాలి. క్రియాశీలకంగా పనిచేసే సైన్యంలో మీరు భాగస్వాములవ్వాలి...చంద్రబాబు తప్పుడు ప్రచారంతో, అబద్దాలను నిజమని నమ్మించడంలో ముందుంటారు. మన పార్టీ ప్రజల పక్షంగా ఉంటుంది కానీ ఎప్పుడూ తప్పుడు ప్రచారాలను నమ్ముకోలేదు. ప్రజల అభిప్రాయలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి. రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత జగన్‌ది. చంద్రబాబు అబద్ధపు మాయా ప్రపంచాన్ని ప్రజల ముందు తేటతెల్లం చేయాలి. పార్టీ అనుబంధ విభాగాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి పార్టీని, అధినేతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్ళాలి. నిర్మాణాత్మకంగా కమిటీల నియామకం చేసుకుని ముందుకెళదాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్ధేశం చేశారు. -
వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
-
ప్రజాస్వామ్యాన్ని న్యాయవ్యవస్థే రక్షిస్తుందని జగన్ నమ్ముతున్నారు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను పార్టీస్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఎగురవేశారు. ఈ వేడుకల్లో వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల రామకష్ణారెడ్డి మాట్లాడుతూ.. చాలా రాజకీయ పార్టీల్లో జవాబుదారీతనం తగ్గుతోంది. జగన్ విలువలు విశ్వసనీయత కలిగిన వ్యక్తి. ప్రజల కోసం పరితపించే వ్యక్తి. కానీ, ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రజలను మోసం చేయటం కొన్ని పార్టీలకు అలవాటుగా మారింది. ఈవీఎంలతో మోసం చేసి గెలుపు సాధించారు. గత ఎన్నికల్లో 12.5 శాతం ఓట్లు ఎలా పెరిగాయో ఎవరూ సమాధానం చెప్పటం లేదు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో వ్యవస్థలను నిర్వీర్యం చేసారు. ఎన్నికల్లో జగన్ సంయమనంతో వ్యవహరించారు. ఎన్నికల వ్యవస్థ గుడ్డిగా వ్యవహరించింది. సీసీ పుటేజీ, వెబ్ కాస్టింగ్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఎందుకు భయపడతారు.?. వీటన్నిటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం.వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తే ప్రజాస్వామ్యం ఏం అవుతుంది?. తటస్థంగా ఉండేవారు ఎవరైనా ఆ 15 గ్రామాలకు వెళ్లి విచారణ జరపాలి. ఓట్లు వేస్తే వాళ్ల చేతి వేళ్లకు చుక్కలు ఉన్నాయో లేదో చూడాలి. దాన్ని బట్టే పోలింగ్ ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు స్వేచ్చ, స్వాతంత్ర్యం నిలపడాలని కోరుకునే వారు ఎవరైనా రావొచ్చు. పులివెందుల చరిత్రలో వైసీపీ ఓడిపోలేదు. ఎన్నికలు శాంతి యుతంగా జరగాలని జగన్ మోహన్ రెడ్డి సూచించారు. మేము కూడా వారితో గొడవపడి ఉంటే ఎన్నికలు ఫలితం ఎలా ఉండేదో?. కానీ ప్రజల ప్రాణాలకు ప్రమాదం రాకూడదని భావించాం. పోలింగ్ బూతుల్లో వైసీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్ నిర్వహించారు. పదిహేను పోలింగ్ బూతులకు రెండు వేల మంది పోలీసులను పెట్టారు. జడ్పీటీసీ ఎన్నికల అక్రమాలపై మా పోరాటం కొనసాగుతుంది. న్యాయ వ్యవస్థ రక్షిస్తుందని జగన్ నమ్ముతున్నారు. ఎవరు వచ్చినా మేము అక్కడ జరిగిన విషయాలను చూపిస్తాం. మన ప్రజా స్వామ్యాన్ని మనం రక్షించుకుందాం అని అన్నారు. -
కూటమి ప్రభుత్వంలో YSRCP నేతలు, కార్యకర్తలపై వేధింపులు: సజ్జల
-
Sajjala: లిక్కర్ స్కాంలో రోజుకో పిట్ట కథ చెప్తున్నారు
-
‘లిక్కర్ స్కాంలో రోజుకో పిట్ట కథ’
సాక్షి, విజయవాడ: ఏపీలో లిక్కర్ స్కాంలో కూటమి నేతలు రోజుకో పిట్ట కథ చెబుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్ స్కాంను తెర మీదకు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద లిక్కర్ బ్రాండ్లు తీసుకువస్తే లిక్కర్ రెవెన్యూ పెరగాలి కదా? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఘోరంగా విఫలమైంది. ప్రజల తిరస్కరణకు గురైన కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది. లిక్కర్ స్కాం పేరుతో ప్రజల దృష్టిని మరల్చాలని భావిస్తుంది. అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. స్కాం ఎక్కడో ఇప్పటికీ తెలియడం లేదు. లిక్కర్ స్కాం డబ్బులు గల్ఫ్ అంటారు.. ఆఫ్రికా అంటారు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అన్నారు. రోజూ ఏదో ఒక పిట్టకథ చెప్తున్నారు. లేని.. జరగని ఒక స్టోరీ చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కాం పేరుతో ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కేసుల పేరు చెప్పు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రజల్లోకి వైఎస్ జగన్ వెళ్లకుండా అడ్డుకోవడానికి ఏదో ఒక డైవర్షన్ చేస్తున్నారు ఏపీలో ఒక ECM ఇద్దరు DCM లు ఉన్నారు. ఇద్దరు DCMలలో ఒకరు డిప్యూటీ సీఎం అయితే, మరొకరు డీఫ్యాక్టో సీఎం. వీరు ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. లిక్కర్ కేసులో అరెస్టులు ఎందుకు చేస్తున్నారు.. స్కాం ఎక్కడ జరిగిందో చెప్పాలి కదా. లిక్కర్ స్కాంలో అసలు దొంగ చంద్రబాబే. 2019-2024 మద్యం స్కాం జరగలేదు. 2014-2019 మధ్య జరిగింది అసలైన లిక్కర్ స్కాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి చంద్రబాబు గండి కొట్టారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగింది. కూటమి ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగిందా?. లిక్కర్ డోర్ డెలివరీ చేసి బలవంతం తాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 11 కోట్లు సీజ్ చేశారు.. అవి ఎవరివి?. అతని స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేశారా?. కేసిరెడ్డి ఎన్నికల ముందు డబ్బు దాస్తే ఇంతకాలం అలాగే అక్కడే ఉంటుందా?. లిక్కర్ స్కాం జరగలేదు మిథున్ రెడ్డి ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. నెల్లూరు ఏమైనా కంచుకోటా.. కంచె వేసి అడ్డుకోవడం ఏమిటి?. మెయిల్స్ చేసి అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీ మాదిరి దిగజారి వ్యవహరించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు మేనేజ్ మెంట్ స్కిల్స్ ముందు మేం సరితూగం’ అని కామెంట్స్ చేశారు. -
మన వాణిని బలంగా వినిపిద్దాం... ప్రజలను చైతన్యపరుద్దాం: సజ్జల
తాడేపల్లి: బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమానికి జిల్లా, నియోజవర్గ, మండల స్థాయి నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో కూడా సక్సెస్ చేద్దామని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు(ఆదివారం, జూలై 27) వైఎస్సార్సీపీ నగర, మున్సిపల్ క్లస్టర్, మండల పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు సజ్జల,. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆగష్టు నెలాఖరికల్లా గ్రామస్ధాయిలో పార్టీ కమిటీల నిర్మాణం పూర్తిచేయాలి. మండల స్ధాయి నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలి. మనమంతా సమిష్టిగా, సమన్వయంతో పనిచేసి వైఎస్సార్సీపీని బలోపేతం చేద్దాం’ అని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. సజ్జల ఏమన్నారంటే..బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ (రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) కార్యక్రమం మండల స్ధాయిలో కూడా గ్రాండ్ సక్సెస్ అయింది, ఇప్పుడు గ్రామాల్లోకి వెళుతున్నాం. మన నాయకుడు జగన్ తన పాలనలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలుచేసి, చక్కటి పాలన అందించారు, కానీ కూటమి ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ సాగిస్తుంది. మనం ప్రజల పక్షాన నిలుచున్నాం, ప్రజల్లో వైఎస్సార్సీపీ అంటే ఒక నమ్మకం, భరోసా కల్పించాం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది, జగన్ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ క్షేత్రస్ధాయిలోకి వెళుతున్నారు. వారి ఫేక్ న్యూస్‌ను బలంగా తిప్పికొడదాంమండల స్ధాయి నుంచి గ్రామస్ధాయిలోకి మనం వెళుతున్నాం కాబట్టి మనం క్రియాశీలకంగా ఉండాలి. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలి, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ మన వాణిని బలంగా వినిపిద్దాం. ప్రజలను చైతన్యపరుద్దాం. కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ఫేక్‌న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. దానిని బలంగా తిప్పికొడదాం.మండల స్ధాయిలో పార్టీ కమిటీల నిర్మాణంలో అవసరమైతే మరింత మందిని నియమించుకునే వెసులుబాటు కల్పించాం, మండల పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలి. నిర్ణీత కాలపరిమితిలోగా గ్రామాల్లో కూడా బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం పూర్తికావాలి. మన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. నియోజకవర్గ సమన్వయకర్తలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి. మండల, గ్రామ స్ధాయిలో ఉన్న సీనియర్ నాయకులను పరిశీలకులుగా నియమించుకుని గ్రామ కమిటీల నియామకం చేపట్టాలి. టాస్క్‌ఫోర్స్‌లాగా పనిచేసి పార్టీ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాలి. మండల స్ధాయిలో 22 అనుబంధ విభాగాలు ఉంటాయి, ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ నుంచి మండల స్ధాయి కమిటీలలో ప్రాతినిద్యం ఉండాలి. ఈ కార్యక్రమం ప్రతీ గడపకూ వెళ్లాలి..గ్రామస్దాయిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ప్రతి గడపకూ వెళ్ళాలి. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం ఉంటుంది. గ్రామమంతా ప్రజల్లో చైతన్యం వచ్చేలా మన కార్యక్రమం ఉండాలి. ఆగష్టు నెలాఖరికల్లా గ్రామ కమిటీల నియామకాలు పూర్తవ్వాలని జగన్ చెప్పారు. కాబట్టి మనం దీనిపై సీరియస్‌గా దృష్టిపెడదాం. అంకితభావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీ నియమావళికి లోబడి పార్టీ నిర్మాణంలో కష్టపడి పనిచేసేవారిని గుర్తించి తగిన విధంగా పదవులు ఇవ్వడం జరుగుతుంది. బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై కూడా దృష్టిపెట్టాలిియోజకవర్గ ఇంఛార్జ్ బలోపేతం అయినప్పుడే పార్టీ బలపడుతుంది. గ్రామ స్ధాయి నుంచి మండల స్ధాయి తర్వాత నియోజకవర్గ స్ధాయిలో వేలాదిమంది వైఎస్సార్సీపీ సైన్యం సిద్దమవుతారు. అప్పుడు ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా వేలాదిమందితో మన గొంతు వినిపించినవారు మవుతాం. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇచ్చే సమాచారం ప్రతి ఒక్కరికీ చేరాలి, సాంకేతికతపై అవగాహాన ఉన్న ఉత్సాహవంతులైన యువతీ యువకులను వినియోగించుకుని మన నెట్వర్క్ పెంచుకుందాం. డేటా బిల్డింగ్, ప్రొఫైలింగ్ చేయగలిగితే లక్షలాదిమందికి మన సందేశం, సమాచారం క్షణాల్లో చేరుకుంటుంది. బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై కూడా దృష్టిపెట్టాలి. పరిశీలకులు దీనిపై దృష్టిపెట్టాలి.మన నాయకుడు జగన్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువద్దాంకూటమి ప్రభుత్వ తప్పుడు కేసులకు ఎవరూ ఆందోళన చెందవద్దు, పార్టీ అండగా ఉంటుంది. అత్యంత కీలకమైన దశలో ఉన్నాం, మనం కమిటీలను పటిష్టంగా నియమించుకుంటే నియోజకవర్గంలో మన పార్టీ అంత బలపడుతుంది. మనమంతా సమిష్టిగా, సమన్వయంతో పార్టీ నిర్మాణం కోసం పనిచేసి మన నాయకుడు జగన్ , మన వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకువద్దాం’ అని సజ్జల స్పష్టం చేశారు. -
Sajjala Ramakrishna Reddy: లిక్కర్ స్కాంపై చర్చకు ఎవరొస్తారో రండి.. నేను రెడీ..
-
Sajjala: చంద్రబాబు మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నారు
-
లిక్కర్ స్కాం అనేది చంద్రబాబు హయాంలో జరిగింది: సజ్జల
-
అక్రమ అరెస్టుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది
సాక్షి,విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వ కుట్రలు పరాకాష్టకు చేరాయి. కక్షసాధింపు కుతంత్రాల్లో తాజా అంకానికి టీడీపీ కూటమి సర్కారు తెరతీసింది. వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టుకు తెగబడింది. ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుపై వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తప్పుడు కేసు సృష్టించి పరాకాష్టకు తీసుకెళ్తున్నారు.చంద్రబాబు సృష్టించిన కట్టు కథ, తప్పుడు కేసు.ఈ కేసులో మా పార్టీ సీనియర్ లీడర్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు.లిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబు హయాంలో జరిగింది.ఏడాదికి 1300 కోట్లు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశాడు.40 వేలకు పైగా బెల్టు షాపులు పెట్టారు.4,5 డిస్టీలరీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారు.తన హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్‌పై బయట ఉన్నాడు. ఈసారి మరింత బరి తెగించి స్కామ్ చేస్తున్నారు. సినిమా రచయిత రాసినట్టు ఇష్టానుసారం దీనిలో పాత్రలు సృష్టిస్తున్నారు.ఈ మద్యం కేసులో ఒక్క ఆధారం కూడా లేదు.ఆధారాలు ఇంకా సంపాదిస్తాం అంటారు.ప్రయివేటు మద్యం షాపులు ప్రభుత్వంలోకి మారిస్తే స్కామ్ ఎలా అవుతుంది..?మధ్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఆధీనంలోకి షాపులు తెచ్చాం. చంద్రబాబు పాలన కంటే మా హయాంలో మద్యం వినియోగం తగ్గింది.రూ.50 వేల కోట్లు అని మొదట అన్నారు. ఇప్పుడు రూ.3 వేల కోట్లు అంటున్నారు.రూ3 వేల కోట్లను 30 రకాలుగా చెప్తున్నారు.డబ్బు ఎక్కడుంది అంటే..మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు.టివి సీరియల్లా సాగదీస్తున్నారు.ఏమి ఆధారాలు లేక...ఇప్పుడు సాక్ష్యాలు లేకుండా చేశారని అంటున్నారు.ప్రజల నుండి వచ్చే ప్రశ్నలు తప్పించుకోవడానికి ఈవిధంగా చేస్తున్నాడు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అన్ని ఆధారాలతో అరెస్ట్ అయ్యాడు. ప్రభుత్వం నిధులు దారిమళ్లించిన ఆధారాలు ఉన్నాయి.కేంద్ర ఏజెన్సీ విచారణలో స్కిల్ స్కామ్ వెలికి తీసింది.ఇక్కడ లిక్కర్ కేసులో ఒక్క ఆధారం లేదుఅన్యాయంగా అందరిని అరెస్ట్ చేస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన అందరి ఉసురు చంద్రబాబు కుటుంబానికి కొడుతుంది.ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కొంటాం.పోరాడుతాం. కేసులో ఏమి లేదు..పునాది లేదని..ఈరోజు తేలిపోయిందని’ ధ్వజమెత్తారు. -
ఉప్పల హారిక కారుపై టీడీపీ గుండాలు.. సజ్జల సీరియస్ రియాక్షన్..
-
చంద్రబాబు పాలనపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: మా ఓపికను మీరు చేతగానితనంగా తీసుకోవద్దని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు అన్నింటినీ మళ్ళీ ఓపెన్ చేస్తాం.వాటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం.. తప్పుడు కేసుల్లో ప్రమేయం ఉన్న అధికారుల్ని సైతం విచారిస్తామని స్పష్టం చేశారు.సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న రాక్షస పాలనపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాజ్యాంగాన్ని, చట్టాలను చంద్రబాబు ప్రభుత్వం చాలా దారుణంగా దుర్వినియోగం చేస్తోంది. దీన్ని నియంతృత్వం అనాలా..? ఏమనాలి.?. అన్ని వ్యవస్థలను చంద్రబాబు దారుణంగా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీశారు. టీడీపీ చెప్పినట్టు వినకపోతే వేధిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా తప్పుడు కేసులు కోసం వాడుతున్నారు.వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్తున్నందుకు జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి చేశారు. టీడీపీ వాళ్ళు గుడివాడలో దారి కాసి గొడవలు చేశారు. పోలీసులు ఉండగానే గంటన్నర సేపు గుండాలు మహిళ జెడ్పి చైర్మన్‌పై దాడికి దిగారు. పోలీసులు రక్షణలో వాళ్ళు దాడులు చేశారు.కారుని పోలీసులు తాళ్ళు కట్టి తీసుకెళ్లాలని యత్నించారు.పోలీసులు దాడి చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ నాయకులు జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి చేస్తుంటే ఆపే ప్రయత్నం చేయలేదు. దాడులు జరపకుండా నిలువరించలేదు. తాము అధికారంలో ఉన్నామని,మా గురించి ఎవరు గొంతెత్తి మాట్లాడకూడదనిదాడులు చేస్తున్నారు.పోలీసులు ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు తప్పించుకోవచ్చు కానీ అందరూ చట్టం ముందు నిలబడాల్సి ఉంటుంది. దాడి చేసి తిరిగి ఉప్పాల రాముపై అక్రమ కేసు పెట్టారు. మాదాల సునీత అనే మహిళతో ఫిర్యాదు చేయించారు. ఆమె ఫ్లెక్సీలు చించారు. గాయం అయితే కారుతో గుద్దినట్టు కేసు పెట్టారు. ఉప్పాల రాము వెనకాల సీట్లు కూర్చొని ఉంటే ఆయన గుద్దించినట్టు కేసు పెట్టారు.ఎలాగైనా కేసులు పెడతాం అన్నట్టు ఇష్టానుసారం కేసులు పెట్టేస్తున్నారు. హైకోర్టు అన్ని కోర్టులకు మెకానికల్‌గా రిమాండుకు పంపొద్దు అని ఆదేశాలు ఇచ్చింది. న్యాయస్థానాలపై భయం లేకుండా ఇలాంటి కేసులు పెడుతున్నారు. వైఎస్ జగన్ బంగారు పాళ్యం పర్యటనకు వేలాది మంది రైతులు వచ్చారు. దానికి ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ వస్తే దాడి చేశారని కేసు పెట్టారు.ఎఫ్ఐఆర్ని మార్చి మరి తప్పుడు కేసు పెట్టారు.నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ వాళ్ళు దాడి చేశారు. పోలీసులు ఉండగానే ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి చేశారు.వాళ్ళ ముందే వస్తువులను కాల్చారు. వారం రోజులైనా ఎవరిపైనా కేసు పెట్టలేదు.ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.తాడిపత్రిలో పెద్దారెడ్డిని హైకోర్టు చెప్పినా నియోజకవర్గంలోకి రానివ్వలేదు. పొదిలి, బంగారు పాళ్యం అన్ని చోట్లా తప్పుడు కేసులు పెట్టారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు అన్నింటినీ మళ్ళీ ఓపెన్ చేస్తాం. తప్పుడు కేసుల్లో ఉన్న అధికారుల పైన కూడా విచారిస్తాం. మా ఓపికను చేతకాని తనంగా తీసుకోవద్దుని సూచించారు. -
కూటమి పాలనలో ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు: సజ్జల
-
ప్రాణాలతో పోరాడుతున్నాడు నాగ మల్లేశ్వరరావు ని పరామర్శించిన సజ్జల
-
ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ.. టీడీపీ నేతలకు పోలీసుల వత్తాసు: సజ్జల
సాక్షి, గుంటూరు: ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్లో పోలీసు రాజ్యాంగం నడుస్తోందన్నారు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్ ఇస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్లో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ప్రభుత్వం పెద్దలకు వత్తాసు పలుకుతున్నారు. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్ ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం చేశారు. నాగమల్లేశ్వరరావు ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. సర్పంచ్ నాగమల్లేశ్వరావు కోలుకుంటారని ఆశిస్తున్నాను. మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని భావిస్తున్నాను. నాగమల్లేశ్వరరావు పైన జరిగిన దాడి రాజకీయపరమైన హత్యాయత్నం. దాడికి సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ భయానకంగా ఉన్నాయి. అంబటి మురళి పైనే కేసు నమోదు చేశారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. దాడికి రెచ్చగొట్టేలా మాట్లాడిన ధూళిపాళ్లపై కేసు పెట్టలేదు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుంది. వైఎస్సార్సీపీ నేతల పైనే దాడులు చేయమని నేరుగా చెబుతున్నారు. నాగమల్లేశ్వరావుపై దాడి చేసిన నిందితులకు సన్మానం చేసినా చేస్తారు.పెదకూరపాడు మాజీ ఎంపీపీని ఏడాది క్రితం దారుణంగా కొట్టారు. నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి చేస్తే చర్యలేవి?. గుడివాడలో జడ్పీ చైర్‌పర్సన్‌పైన దాడి జరుగుతుంటే పోలీసులు అక్కడే ఉన్నాడు అడ్డుకోలేదు. ప్రజాస్వామ్యయుతమైన హక్కులను వైఎస్సార్సీపీ నేతల్ని వినియోగించుకోనివ్వడం లేదు. రాష్ట్రం పోలీస్ రాజ్యంగా మారిపోయింది. వైఎస్ జగన్ ఇప్పటివరకూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల్లో కేసులు నమోదు చేస్తున్నారు. మామిడి రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తే మామిడి యార్డు మూసివేశారు.చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న పోలీసు రాజ్యం ఇది. ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే. అందుకే ప్రజలకు చెబుతున్నాం. వైఎస్సార్సీపీని చంద్రబాబు దుర్మార్గంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని మానసికంగా వేధిస్తున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే జగన్ ఎందుకు బయటకొస్తారు. మిర్చి రైతుల కంట కన్నీరు కారుతుంది. ప్రైవేటు కేసు వేసేందుకు ప్రయత్నిస్తున్నాం.రైతులు పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఎస్పీ అంటున్నాడు. ఆయన పోలీసా లేక రాజకీయనాయకుడా?. ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏమైనా విధించారా అంటే అది లేదు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన కొద్దీ మేము రాటు తేలేలా చంద్రబాబు చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలను పట్టించుకోలేదు. అందుకే ఆయనొస్తే పది మంది బయటకు రావటం లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటు. ప్రజల గురించి ఆలోచించడం జగన్‌కు అలవాటు. అందుకే జగన్ పర్యటనలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. టీడీపీ నేతలు బరితెగించి దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేదు. దాడులపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తిగా లేదు. మామిడి, పొగాకు, మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు’ అని చెప్పుకొచ్చారు. -
‘మేనిఫెస్టోని అమలు చేయలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం’
తాడేపల్లి : ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇంటింటికి వెళ్లలేక టిడిపి, జనసేన నేతలు ముఖం చాటేస్తున్నారని, ఇప్పటికే కూటమీ ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఘోరంగా విఫలమైందన్నారు. ఈరోజు(ఆదివారం, జూలై 06) వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘రీకాల్ చంద్రబాబూ మేనిఫెస్టో' కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. దీన్ని మరింతగా గ్రౌండ్ లెవెల్‌కు తీసుకువెళ్లాలి. 13 నుంచి 20వ తేదీ వరకు మండలాల స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలి. 21 నుంచి ఆగస్టు 4 వరకు గ్రామీణ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలి. చంద్రబాబు సహా కూటమి నేతలు చేసిన మోసాలపై మనం గట్టిగా జనంలోకి వెళ్లాలి. రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమానికి జిల్లాల స్థాయిలో మంచి స్పందన వచ్చింది. దాన్ని గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లడాన్ని కూడా విజయవంతం చేయాలి’ అని సజ్జల సూచించారు. -
ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై వైఎస్సార్సీపీ ధ్వజం
తాడేపల్లి : తమ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై తప్పుడు రాతలు రాస్తున్న ఎల్లోమీడియాపై వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరాధార ఆరోపణలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డం ఎల్లో మీడియాకు ఒక అలవాటుగా మారిందని మండిపడింది. వైఎస్సార్సీపీని దెబ్బతీసే దురుద్దేశంతో తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి కుట్రలు చేయడం వారికి సర్వసాధారణంగా మారిపోయిందని, సజ్జలపై ఆంధ్రజ్యోతి, ఈటీవీ-2 సహా ఇతర ఎల్లో మీడియాలో ప్రచురించిన, ప్రసారమైన వార్త కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేసింది. కార్యాలయానికి వచ్చే సందర్శకులకు అనుచరుడిగా ముద్రవేసి, వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ లేకుండా, నిర్ధారించుకోకుండా, కనీస ఆధారాలు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డికి ఆపాదిస్తూ నిర్లజ్జగా వార్తా కథనం ప్రసారం చేయడం అత్యంత దారుణమని పేర్కొంది. ఆ వార్తల్లో పేర్కొన్న ప్రేమ్‌చంద్ అనే వ్యక్తితో కాని, అతనిపై వచ్చిన ఆరోపణలతో కాని సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ తెలిపింది. పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలకు వెనుకాడమని వైఎస్సార్సీపీ హెచ్చరించింది. -
సంక్షేమానికి నిజమైన అర్థం.. వైఎస్ జగన్ పాలన: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ మైనారిటీ విభాగం ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగాల అ«ధ్యక్షులతో పాటు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పట్టిష్టం చేయడం మన ప్రధాన కర్తవ్యంమన్నారు. మన పార్టీకి నిజమైన బలం కార్యకర్తలేనని.. మన నాయకుడు వైఎస్ జగన్ శక్తి కూడా కార్యకర్తలేనని.. పార్టీ తన ప్రస్థానంలో అనేక రికార్డులు సృష్టించిందన్నారు.‘‘వైఎస్ జగన్ తన పాలనలో పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. పాలనలో డెలివరీ మెకానిజం డెవలప్ చేయడంతో పాటు, విద్య, వైద్యం వంటి కోర్ సెక్టార్స్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళారు. రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో నడిపించేందుకు, ఏమేం చేయాలో ఆలోచించి, వాటిని అమలు చేశారు. సంక్షేమానికి నిజమైన అర్థం చెప్పిన పాలన మనది. అదే కూటమి ప్రభుత్వంపై ఏడాది పాలనతోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది’’ అని సజ్జల పేర్కొన్నారు.అడ్డుకుంటూ.. అరాచకం:మరో వైపు జగన్ ప్రజాదరణ నానాటికి మరింత పెరుగుతోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా, స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వస్తున్నారు. అందుకే ఆయన పర్యటనలు అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఇటీవల పలు ఆంక్షలతో జగన్ పల్నాడు జిల్లా పర్యటన అడ్డుకోవాలని చూస్తే, సాధ్యం కాలేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు పెట్టి ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తున్నారు. పొలీసులను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు.అప్రకటిత ఎమర్జెన్సీ:కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ప్రశ్నించే గొంతులు నొక్కుతోంది. ఎక్కడికక్కడ అణిచివేసే ధోరణితో పని చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపే తప్పుడు సంప్రదాయానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతోంది. అయితే ఆ కేసులు ఎదుర్కొనే సత్తా మన నాయకుడికి ఉంది. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఒక్క పథకం కూడా అమలు చేయకున్నా, లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు.వైఎస్సార్సీపీ.. మైనారిటీ సంక్షేమం:ఎన్నికలు ఎప్పుడొచ్చినా, మనం ధీటుగా ఎదుర్కోగలం. మనం సంస్థాగతంగా ఇంకా బలపడాలి. పార్టీ నెట్వర్క్ అనేది కేంద్ర కార్యాలయం నుంచి గ్రామస్థాయి వరకు వెళ్ళాలి. పార్టీలో అన్ని కమిటీల నియామకం పూర్తయితే 18 లక్షల మంది క్రియాశీలక సభ్యులవుతారు. అప్పుడు చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలు, రాష్ట్రానికి చేస్తున్న నష్టాలను ఇంకా గట్టిగా ప్రచారం చేయగలం. అలాగే మన పార్టీపై అదే పనిగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ధీటుగా ఎదుర్కోగలగుతాం.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమం గతంలో ఏనాడూ లేని విధంగా గత ప్రభుత్వంలో కొనసాగింది. మన పార్టీ ఎప్పుడూ మైనారిటీల పక్షాన నిలబడింది. ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా మైనారిటీలంతా మన వెంటే ఉండేలా, మీరంతా కృషి చేయాలి. చొరవ చూపాలి. ఇంకా వైఎస్సార్సీపీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన విషయాన్ని ముస్లింలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్న సజ్జల.. పార్టీ ఎప్పుడూ ముస్లింల సంక్షేమం కోరుకుంటుందని స్పష్టం చేశారు. -
మైనారిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం
-
సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు చేయాలో బాబు చెవిలో చెప్పాలట..!
-
గిన్నిస్ బుక్‌లోని బాబు మోసాలు, దుర్మార్గాలు: సజ్జల
ప్రజలకు ఎన్నికల వేళ హామీలను ఎంత తేలికగా ఇచ్చారో.. వాటిని అంతే తేలికగా ఇప్పుడు చంద్రబాబు కొట్టేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏడాదిలోనే ప్రజావ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూట కట్టుకుందని.. అందుకే బాబు మెడలు వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారాయన. అశేష ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్‌పై సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం ఉండదని సజ్జల తేల్చేశారాయన. సాక్షి, అనంతపురం: అబద్దాలను ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబును మించినవారు లేరని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శింగనమల నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం.. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో(Recalling Chandrababu’s Manifesto) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసాలను గుర్తుచేసేందుకే ఈ కార్యక్రమం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు... ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో, సూపర్ సిక్స్ హామీలు ఎలా అమలు చేయాలో చెవిలో చెప్పాలంటున్నారు!. హామీలను తేలికగా ఇచ్చినట్లే.. అంతే తేలికగా కొట్టిపారేస్తుంటారాయన. అందుకే ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న కుట్రలతో చంద్రబాబు సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలందరినీ జైల్లో పెట్టాలన్నది చంద్రబాబు కోరిక. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేసి.. బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అన్ని ఆధారాలతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశాం... జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మంచి చాలా ఉండేది. చంద్రబాబు దుర్మార్గాలను చెబుతూ పోతే వారం రోజులు పడుతుంది. చంద్రబాబు మోసాలు, దుర్మార్గాలను గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించొచ్చు. అబద్ధాలను ప్రచారంలో చంద్రబాబును మించినవారు లేరు. రాష్ట్రంలో మట్టి, ఇసుకను ఎల్లో మాఫియా మింగేస్తోంది. కూటమి నేతలు ఇళ్లకు వస్తే నిలదీయడానికి.. చంద్రబాబు మెడలు వంచడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో రీకాల్ సిస్టం లేదు.. లేకపోతే చంద్రబాబు సర్కార్‌కు పదవీ గండం ఉండేది. .. హామీలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. గడికోట శ్రీకాంత్ రెడ్డి పై ఎస్‌వోజీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం దారుణం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేందుకు, ఆయన్ని లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. ఆయనకు ఉన్న భద్రతను తొలగించింది. పేరుకే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత.. ఆచరణలో అమలు చేయడం లేదు. .. సింగయ్య మృతి కేసులో జగన్‌పై కేసు నమోదు.. దుర్మార్గానికి పరాకాష్ట. ఎన్ని బెదిరింపులు వచ్చినా సత్తెనపల్లి లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని చూసేందుకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్‌ను ఎంత అణచి వేయాలని చూస్తే... అంత ఎదుగుతారు. మంచి పనులు చేస్తే జనం ఆదరిస్తారన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. వైఎస్ జగన్‌కు మద్దతుగా లక్షల మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. .. హామీలను త్రికరణ శుద్ధి తో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట తప్పారు. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇంటింటికీ వచ్చే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. చంద్రబాబు మోసాలను ప్రజల్లో తీసుకెళ్లండి’’ అని సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు. ఇంకా రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్ట్ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు మోసాలను వివరించారు. ‘‘టీడీపీ కూటమి గెలుపు పై ఇప్పటికీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల అక్రమాల ద్వారా గెలిచారని ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. చంద్రబాబు అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నేతలు భయపడరు. నారా లోకేష్ రెడ్ బుక్‌ను ఎడమ కాలితో తన్ని ఎదిరిస్తాం. ప్రజలకు అండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటారు’’:::మాజీ మంత్రి శైలజానాథ్ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు?. దళిత, గిరిజన బాలికల పై అఘాయిత్యాలు జరిగితే పవన్‌కు పట్టదా?. :::మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్చంద్రబాబు మోసాలను ప్రజల్లో కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య వెన్నుపోటు. అప్పుడు ఎన్టీఆర్ కు... ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దే. నవరత్నాలను పకడ్బందీగా అమలు చేసి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ పోరాట ఫలితంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. :::వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. టీడీపీ కూటమి పై రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. టీడీపీ ఓటమి ఖాయం అని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ప్రతి రోజూ జగన్ జపం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం లో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటం లేదు. రైతులను గాలికొదిలేసి... మద్యం వ్యాపారులకు మాత్రమే చంద్రబాబు గిట్టుబాటు ధరలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ అమరావతి లో ఖర్చు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. :::వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి -
‘ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీదే అధికారం’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్‌బుక్ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుందని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజల్లో ఇదే చర్చ జరుగుతోందన్నారు సజ్జల. చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలం కావడమే కాదు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనమయ్యేలే చేశారని సజ్జల విమర్శించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగిన 'పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీలో క్రియాశీలక విభాగంలో ఉన్న మీ అందరి పాత్ర చాలా కీలకమైంది, గతంలో మనకు అసెంబ్లీ ఎన్నికలకు మించి స్దానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు, అందరూ సమిష్టిగా పనిచేయడం వల్ల అరుదైన విజయం సాధించాం, పంచాయతీరాజ్ విభాగంను బలోపేతం చేయాలని జగన్ గారు చెప్పారు, మీ విభాగం బలోపేతం అయినప్పుడే మనకు స్ధానిక సంస్ధల్లో బలంగా ఉండగలుగుతాం, ప్రజలకు, పార్టీకి ఉపయోగపడేలా మీ నాయకత్వం పటిష్టం కావాలి. ఇందులో భాగంగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. పంచాయతీరాజ్ చట్టాన్ని బలోపేతం చేసేందుకు మీరంతా చొరవ తీసుకోవాలి. రాష్ట్ర అభివృద్ది జరగాలంటే గ్రాస్ రూట్ లెవల్లో బలంగా ఉండాలి.కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్‌బుక్ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది, ప్రజల్లో, పార్టీ క్యాడర్ లో ఇదే చర్చ జరుగుతోంది. చంద్రబాబు సంక్షేమ పధకాలు అమలుచేయడం లేదు, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయింది, సామాన్యులు కూడా బలవుతున్నారు, గవర్నెన్స్ పూర్తిగా బ్రష్టుపట్టింది, మళ్ళీ గెలవలేమన్న భయంతో కూటమి నేతలు ఎవరి స్ధాయిలో వారు అడ్డంగా దోచుకుంటున్నారు, ఈ ఏడాదిలో 1.67 లక్షల కోట్ల అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం, అమరావతిలో 40 వేల ఎకరాలు చాలవన్నట్లు మరో 40 వేల ఎకరాల భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో దోపిడీ నేరుగా పదిశాతం కమిషన్ తీసుకుంటున్నారు, వేలకోట్లు దోచుకోవడం లక్ష్యం, ప్రజల ఆకాంక్షలు, కోరికలతో సంబంధం లేకుండా పాలన సాగుతోంది, కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై ప్రజలే నిలదీసేలా మన కార్యాచరణ ఉండాలి, అందుకు ప్రజలను అప్రమత్తం చేద్దాం.ప్రజలను చైతన్యం చేయడానికి అవసరమైన కార్యక్రమాలు మనం నిరంతరం చేయాలి, క్షేత్రస్ధాయి వరకు మనం బలోపేతం కావాలి, అందుకే వివిధ విభాగాలతో సమావేశాలు జరుపుతున్నాం, కమిటీలు అన్నీ పూర్తి చేయాలి, మన కమిటీలు అన్నీ పూర్తయితే వైఎస్సార్సీపీ క్రియాశీలక సైన్యంగా 18 లక్షల మంది సిద్దమవుతారు. టెక్నాలజీని ఉపయోగించుకుని మన వాయిస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళదాం. మన శక్తిసామర్ధ్యాలు జగన్‌ను మరోసారి సీఎంగా చేసుకునేందుకు, పార్టీని బలోపేతం చేసుకునేందుకు వినియోగిద్దాం’ అని సజ్జల సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం..మన పంచాయతీ రాజ్ విభాగం అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ‘ఉపాధి హామీ నిధుల దోపిడీని అడ్డుకుందాం. కూటమి నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారు, స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపును అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు, వాటిని ధీటుగా ఎదుర్కొందాం. స్ధానిక సంస్ధల్లో మన ఉనికిని చాటి చెబుదాం. అనేక అంశాలపై మన విభాగంలో క్రియాశీలకంగా ఉన్నవారంతా ఎప్పటికప్పుడు స్పందించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం’ అని పిలుపునిచ్చారు. -
5 ఏళ్ల సీరియల్ మీకు బోర్ కొట్టినా వదలరు.. సజ్జల సెటైర్లు అదుర్స్
-
రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
-
చంద్రబాబు యోగా డే పేరుతో హైడ్రామా చేస్తున్నారు: Sajjala
-
చంద్రబాబు ముఖంలో అదే క్రూరత్వం, కుటిలత్వం: సజ్జల
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని అయిపోయిందని.. ప్రజా సమస్యలపై ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా ఆయనకు లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యోగా డే పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ.. శనివారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మామిడి రైలు సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. చంద్రబాబు తీరుతో తీరుతో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. చివరకు సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఆయనకు ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా లేకుండా పోయింది. సీఎంగా చంద్రబాబు పని అయిపోయింది. 👉జగన్ మొన్నీమధ్యే వెళ్లి వచ్చాక కేంద్ర మంత్రి వెళ్లి పొగాకు రైతులను కలిశారు. గతంలో గిట్టుబాటు ధరలు లేకపోతే జగన్ పిలిచి చర్చలు జరిపేవారు. గిట్టుబాటు ధర వచ్చేదాకా చేయాల్సిందంతా చేసేవారు. కానీ, ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదు. కేవలం మీడియా హైప్‌తోనే చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారు. 👉రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. కూటమి పాలనలో వీధుల్లోనే గంజాయి అమ్ముతున్నారు. కుప్పంలో జరిగే అరాచకాలు చంద్రబాబుకి కనిపించడం లేదా?. పోలీసుల వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అమాయకులపై, వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. అడిగితే తాట తీస్తా! అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలను సజ్జల వీడియో ప్రదర్శించి చూపించారు.👉హిప్నటిస్ట్ తరహాలో చంద్రబాబు ప్రవర్తన ఉంటోంది. చంద్రబాబు తాను చేసే తప్పులను ఎదుటి వారిపై నెడతారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏది జరిగినా జగన్‌పై నెపం వేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. యోగా డే పేరుతో తండ్రీకొడుకులు డ్రామాలు చేస్తున్నారు. యోగా బాగా అలవాటు ఉండేవారికి స్థితప్రజ్ఞత కనిపిస్తుంది. కానీ, చంద్రబాబు మోహంలో అదే క్రూరత్వం, కుటిలత్వం కనిపిస్తున్నాయి. 👉చంద్రబాబు ఏడాది పాలనంతా డొల్లా. ఆయనకు అధికారం అంటే బాధ్యత లేదు. లేని స్కాం పేరు చెప్పి డ్రామా చేస్తున్నారు. ఐదేళ్లు లిక్కర్‌స్కాం పేరుతో కథ నడిపిస్తారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు విఫలం అయ్యాయి. ఆయన అధికారంలో వచ్చాక అనేక పథకాలకు కోత పట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు తప్పకుండా చంద్రబాబుని నిలదీస్తారు. 👉వైఎస్సార్సీపీ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదు. చంద్రబాబుకి అసలు పరిపక్వతే లేదు. ప్రెస్ మీట్లో జగన్ అడిగిన ప్రశ్నలకు బాబు సమాధానం ఇవ్వడం లేదు. భూస్థాపితం చేస్తారట.. తాట తీస్తారట.. ఇవేనా ఆయన ఇచ్చే సమాధానాలు. రప్పా రప్పా ఫ్లకార్డులపై నానా రాద్దాంతం చేస్తున్నారు. ఆ ఫ్లకార్డు పట్టుకుంది టీడీపీ కార్యకర్తే. పవన్ కల్యాణ్ ఎక్కడ? రాష్ట్రంలో ఆయన ఎక్కడా కనిపించడం లేదు. 👉వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ నిబద్ధతతో ఇచ్చిన హామీలు అమలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక లక్షా 67 వేల కోట్లు అప్పు చేశారు. ఎన్నికల సమయంలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేశారు. ఇప్పుడది చంద్రబాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ హామీలు అమలు చేసేదాకా ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తూనే.. పోరాడుతూనే ఉంటుంది అని సజ్జల ఉద్ఘాటించారు. -
కూటమి ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనపై వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్ చేసింది. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పేరుతో పుస్తకాన్ని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, విడదల రజని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి, జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమే. కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్నే అమలు చేశారు. దీనికి వాస్తవాలు, ఆధారాలతో వైఎస్సార్సీపీ పుస్తకాన్ని తెచ్చాం. ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారో వివరించాం. ఆధారాలతో సహా అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి.జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం.. బుక్ కోసం క్లిక్ చేయండిజగన్ పాలన రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తులాంటిది. కానీ, ఈ ఏడాది చంద్రబాబు పాలన అంతా చీకటిమయమే. చంద్రబాబు దుష్టపాలన మొత్తం బుక్ వేస్తే కనీసం 5వేల పేజీలు అవుతుంది. చంద్రబాబు దుష్ట పాలనకు ముకుతాడు వేయాలి. ఇంకా నాలుగేళ్లు ఉంది కదా అని ఆలోచించ కూడదు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని గట్టిగా ప్రశ్నించాలి. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి’ అని కోరారు. -
‘కొమ్మినేని’ అరెస్ట్.. అరాచకాలకు పరాకాష్ట
సాక్షి, అమరావతి: సాక్షిటీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఒక పథకం ప్రకారం మూడు రోజులుగా చేస్తున్న కృత్రిమ ఆందోళనలకు పరాకాష్ట సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. వ్యాఖ్యలపై దుష్ప్రచారం సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి టీవీలో నిర్వహించిన డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ అన్న మాటలను ప్రణాళిక ప్రకారం వివాదం చేయాలనుకున్న టీడీపీ, కృష్ణంరాజు అమరావతి గురించి తప్పుగా వ్యాఖ్యలు చేశారనే దు్రష్పచారాన్ని చేపట్టింది. సీఎం చంద్రబాబు తన ట్వీట్లో కృష్ణంరాజు వీడియోను పోస్ట్ చేసి తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగానే టీడీపీ, ఎల్లో మీడియా అదేపనిగా రాద్ధాంతం చేశాయి.కృష్ణంరాజు క్షమాపణ చెప్పినా.. తన వ్యాఖ్యలపై కృష్ణంరాజు క్షమాపణలు చెప్పారు. టీవీ డిబేట్లలో ఎవరు ఏ అభిప్రాయం చెప్పినా అది వారి వ్యక్తిగతమే. వాటిని టీవీ చానల్కుగానీ, ఆ కార్యక్రమ ప్రజెంటర్కుగానీ ఆపాదించడం తగదు. టీడీపీ అనుకూల చానల్స్‌లో వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నేతల వ్యక్తిత్వాలను హననం చేస్తూ వందలకొద్ది డిబేట్లు జరిగాయి. అధికారంలో ఉన్నప్పుడూ వైఎస్సార్సీపీ ఇలాంటి డిబేట్లను పట్టించుకోలేదు. ఏ టీవీపైనా, పేపర్‌పైనా కక్షపూరితంగా వ్యవహరించలేదు. అసమర్థ పాలకులే ఇలాంటి అంశాలతో డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడతారు. ప్రణాళిక ప్రకారం వ్యక్తిగత దాడిసాక్షి టీవీ డిబేట్‌ను ప్రణాళిక ప్రకారం వివాదం చేసిన టీడీపీ.. వైఎస్ జగన్, వైఎస్ భారతిపై వ్యక్తిగత దాడి ప్రారంభించింది. జర్నలిస్టు వ్యాఖ్యలను సమర్థించలేదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని సాక్షి టీవీ చాలా స్పష్టంగా ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ కూడా జర్నలిస్టు వ్యాఖ్యలను ఖండించింది. కొమ్మినేనీ క్షమాపణలు చెప్పారు. అయినా చంద్రబాబు కనుసన్నల్లోనే టీడీపీ సాక్షిటీవీ కార్యాలయాలపై దాడులకు తెగబడుతోంది. పరోక్షంగా అమరావతి పరువును టీడీపీనే బజారుకీడ్చింది. కొమ్మినేనిని గతంలోనూ ఎన్టీవీ ఉద్యోగం నుంచి చంద్రబాబు తొలగింపజేశారు. చంద్రబాబును పొగిడితేనే జర్నలిస్టులకు మనుగడ ఉంటుందనే సందేశం ఇస్తున్నారు. దీనిపై ప్రజలు, జర్నలిస్టులు, మేధావులు, ప్రజాసంఘాలు గళమెత్తాలి. హామీలు నెరవేర్చే వరకూ నిరసన గళంఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ కూటమి ప్రభుత్వంపై నిరసన గళమెత్తుతూనే ఉంటామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం యువజన విభాగం రాష్ట్ర కమిటీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.క్రియాశీల పోరాటాలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి పాల్గొన్నారు. -
కృత్రిమంగా ఆర్గనైజ్డ్ చేసిన నిరసనలే: సజ్జల
-
‘కొమ్మినేని అరెస్ట్‌కు 200 టీడీపీ అనుకూల యూట్యూబ్ ఛానెళ్ల కుట్ర’
సాక్షి,తాడేపల్లి: ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ఆ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఆర్గనైజ్డ్గా టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. మూడు రోజులుగా టీడీపీ ఎల్లో మీడియా చేస్తున్న రాద్దాంతం దారుణం. విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి, కృష్ణం రాజు మాటలను కొమ్మినేని శ్రీనివాసరావు ఆపేశారు. అసలు విషయాలు పక్కకు పోతాయని, అనసవర విషయాలు పట్టించుకునే వాళ్లం కాదు. దుర్మార్గులు, పిరికివాళ్లు అనవసర విషయాల మీద రాద్ధాంతం చేస్తారు. లేని విషయాన్ని క్రియేట్ చేసి విష ప్రచారం చేయడమే టీడీపీ పని. వాళ్లు ట్వీట్ పెట్టడంతో వారు ఆర్గనైజ్డ్గా చేస్తున్నారనే అనుమానం వచ్చింది.కృత్రిమంగా ఆర్గనైజ్డ్ చేసిన నిరసనలే. ఈనెల 6వ తేదీ ఉదయం సాక్షి టీవీలో కొమ్మినేని షోలో కృష్ణంరాజు పాల్గొన్నారు. ఆ షోలో ఓ అంశం పై కృష్ణం రాజు వ్యాఖ్యలు. 24 గంటల తర్వాత పథకం ప్రకారం రాద్ధాంతం చేస్తున్నారు. టీడీపీ, ఆ పార్టీ ప్రచార సంస్థలు, 200 యూట్యూబ్ ఛానల్స్ మూడు రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాయి. కొద్ది సేపటి క్రితం కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇదంతా చేస్తోంది అధికార పార్టీనే.6వ తేదీన జరిగిన డిబేట్ లో అమరావతి చుట్టుపక్కల గురించి ప్రస్తావన వచ్చినపుడు కొమ్మినేని వారించారు. కొమ్మినేని వారించారు...డిబేట్ కూడా అయిపోయింది. ఆ డిబేట్ తర్వాత మరోసారి ప్రసారం కాలేదు. కొమ్మినేని కానీ, కృష్ణంరాజు కానీ మళ్లీ ఎక్కడా ప్రస్తావించలేదు. 7వ తేదీ నుంచి దుష్ప్రచారం మొదలు పెట్టారు. ఏబీఎన్, టీవీ5లు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరిచేలా వందల డిబేట్లు నిర్వహించారు. కానీ మేం ఏనాడూ పట్టించుకోలేదు. కేవలం దూర్భషలాడేవాళ్లు...సత్తా లేనివాళ్లు మాత్రమే ఇలా చేస్తారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎప్పుడూ ఇలాంటి దూర్భషలాడేలా వ్యవహరించలేదు. లేని సమస్యను సృష్టించి విషప్రచారం చేయడం టీడీపీకి, చంద్రబాబుకు అలవాటు. నారా లోకేష్ ట్వీట్ పెట్టిన తర్వాత మాకు అనుమానం వచ్చింది. సాక్షి మీడియా కూడా కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించింది.ఇలాంటివి తామెప్పుడూ ప్రోత్సహించమని సాక్షి స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ కూడా ఖండన విడుదల చేసింది.8వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు, దుర్భాషలు, సాక్షి ఆఫీస్‌పై దాడులతో పరాకాష్టకు చేరింది. తన షోలో జరిగిన అంశం కాబట్టి కొమ్మినేని కూడా క్షమాపణ చెప్పారు. టీడీపీ వాళ్లు ఆర్గనైజ్ చేసి తప్పుడు కేసులు పెట్టి వేధించడానికే ఈ అంశాన్ని వాడుకుంటున్నారు. అంచెలంచెలుగా ఈ అంశాన్ని లైవ్ లో ఉంచాలని చూస్తున్నారు. అమరావతిని పొరబాటున ఎవరైనా ఏదైనా అంటే రాష్ట్రమంతా కదిలొస్తుందని చూపేందుకు ఆర్గనైజ్ గా కార్యక్రమాలు చేపట్టారు.చంద్రబాబు ట్వీట్‌తో సహా టీడీపీ అధికారిక మీడియాలో మూడు రోజుల నుంచి అమరావతి మహిళల పరువు తీస్తున్నారు. అదే పనిగా మహిళల పరువును తీసేలా వ్యవహరించినది ఎవరు? రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే రాష్ట్రం మొత్తాన్నీ అవమానించినట్లేనా. చంద్రబాబు ఒక పథకం ప్రకారం తనకు తెలిసిన ఏకైక విద్యను ప్రదర్శిస్తున్నాడు. కొమ్మినేని సుదీర్ఘకాలం జర్నలిజంలో పొరబాటున కూడా ఒకరిని ఒక మాట అనలేదు. ఎన్టీవీలో నిస్పక్షపాతంగా డిబేట్లు చేసినందుకు ఉద్యోగంలోంచి తీయించాడు. ఉద్యోగం తీసేవరకూ ఎన్టీవీ ప్రసారాలను చంద్రబాబు నిలిపివేయించాడు. ఆతర్వాత కొమ్మినేని సాక్షి టీవీలో చేరారు.ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది కాబట్టే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఏడాది కాలంలోనే ఈ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రోజూ మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలు ...పోలీసుల దుర్మార్గాలు ఎవరికీ కనబడటం లేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో మహిళల పట్ల ఏదైనా ఘటన జరిగితే స్పందించిన తీరు జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది. అనంతపురంలో 14 ఏళ్ల బాలికను చంపేస్తే ఈ ప్రభుత్వానికి కనిపించదు. కంప్లెంట్ ఇచ్చిన రోజే పోలీసులు స్పందించి ఉంటే బాలిక ప్రాణాలతో ఉండేది. వైఎస్ జగన్ మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలను ఇంటికి కేంద్రబిందువుగా గుర్తించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. అలాంటి జగన్ మోహన్ రెడ్డి మహిళలను కించపరుస్తారా. ఈ ప్రభుత్వ తీరును ప్రజలంతా గమనించాలి. అరెస్టులు చేయడానికేనా మీకు అధికారం ఇచ్చిందిఓ సీనియర్ జర్నలిస్టును ఈ విధంగా అరెస్ట్ చేయడం.. మొత్తం మీడియాకే ప్రమాద ఘంటికలు. చంద్రబాబును పొగిడితేనే మీడియాకు మనుగడ ఉంటుందనేలా హెచ్చరిస్తున్నారు. ఓ జర్నలిస్టు డిబేట్ పెడితేనే చంద్రబాబు భయపడుతున్నారు’అని వ్యాఖ్యానించారు. -
కొమ్మినేని అక్రమ అరెస్ట్ పై సంచలన ప్రెస్ మీట్
-
రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి: సజ్జల
-
రాష్ట్రవాప్తంగా వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నాయకులతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరిలోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. చంద్రబాబు పాలన ఏడాది వైఫల్యాలు, వైఎస్ జగన్ తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యంపై వివిధ రంగాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ‘‘ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా.. ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ పోరాటాలకు కొనసాగింపుగా ఈ నెలాఖరిలోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిద్దాం’’ అని సజ్జల పిలుపునిచ్చారు.‘‘ఈ సమావేశాల్లో కీలక రంగాలకు సంబంధించి గతంలో వైఎస్ జగన్ పాలన, ఈ ఏడాదిలో ఏ విధంగా నాశనం చేశారనేది, ఒక్కో రంగాన్ని ఎలా నిర్వీర్యం చేశారనేది చెప్పాలి. వ్యవస్థలు నాశనం చేయడం, ఏ విధంగా అరాచకం చేస్తున్నారనేది, ప్రభుత్వ వైఫల్యాలపై స్పష్టంగా చర్చ జరిగి ప్రజల్లోకి వెళ్ళాలి. విద్యార్థులు, మహిళలు, యువత, రైతులు ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చ జరగాలి. కూటమి ప్రభుత్వ అరాచక పాలన ద్వారా రాష్ట్రం ఎలా నష్టపోయిందనేది చెప్పగలగాలి. రెడ్‌బుక్ పాలన పేరుతో చేస్తున్న అరాచకాలు ఇలా అన్నీ బయటికి రావాలి’’ అని సజ్జల చెప్పారు.ఉమ్మడి 13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో 13 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. ఆయా రంగాల్లోని నిష్ణాతులు, మేధావులు, సివిల్ సొసైటీ సభ్యులు, రిటైరైన అధికారులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, సోషల్ వర్కర్లు, రైతుసంఘం నాయకులు, అనుభవమన్న తటస్థులు ఇలా అందరినీ భాగస్వామ్యం చేద్దాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.ఈ టెలి కాన్ఫరెన్స్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, పూడి శ్రీహరి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాలను విజయవంతం చేద్దామన్నారు. -
Sajjala Ramakrishna: బాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సుస్పష్టం
-
బాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సుస్పష్టం: సజ్జల
సాక్షి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందని, ఇవాళ అది స్పష్టంగా కనిపించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Rama Krishna Reddy) అన్నారు. వైఎస్సార్సీపీ ఇవాళ(బుధవారం, జూన్ 4) చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు విజయవంతమైనట్లు మీడియా ముఖంగా ప్రకటించారాయన. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏడాది గడిచినా అమలు కాలేదు. ఏడాది కాలంలోనే ప్రజా వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ఇవాళ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్సార్సీపీ కష్టాల నుంచే పుట్టింది. మా హయాంలో 15 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధి.. మూడేళ్లలోనే జరిగింది. అధికారంలోకి రాగానే మేం తొలి ఏడాదిలోనే 99 శాతం హామీలు అమలు చేశాం. కోవిడ్ రెండేళ్లలోనూ సంక్షేమ పథకాలు అమలు చేశాం. మిగిలిన మూడేళ్లలోనే 10, 15 ఏళ్ల అభివృద్ధి చూపించాం. విద్య, వైద్య, వ్యవసాయం రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. కానీ.. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు అన్నీ సర్వనాశనం అయ్యాయి. తొలి ఏడాదిలోనే రికార్డ్ స్థాయిలో(రూ.లక్షా 50వేల కోట్లకు పైగా) చంద్రబాబు అప్పులు చేశారు. ఆ అప్పు ఏం చేశారో తెలియదు. ఏడాదిలోనే రైతులను సంక్షోభంలోకి నెట్టేశారు. పంటలకు కనీస మద్ధతు ధరలు లేవు. ఇప్పటికే 4 లక్షల పెన్షన్లు కట్ చేశారు. వైఎస్ జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలను సైతం ఎత్తేశారు. చంద్రబాబు తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది’’ అని సజ్జల అన్నారు. -
‘ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’
తాడేపల్లి : వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు(సోమవారం, జూన్ 2) వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా ఆధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులతో సజ్జల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు బుధవారం(జూన్ 4వ తీదీ) చేపట్టబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ రేపు మండల స్థాయిలో కూడా వెన్నుపోటు దినం పోస్టర్ రిలీజ్ చేయాలి. ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమం చేయాలి. ఎక్కడైనా అడ్డంకులు కల్పిస్తే న్యాయస్థానాల ద్వారా అధిగమిద్దాం. నిరసన ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం అందజేయాలి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడైన ఆపే ప్రయత్నం చేస్తే అక్కడ మీడియాతో మాట్లాడి వివరించాలి. ఎలాంటి శషబిషలు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రభుత్వంతో ఘర్షణ పడటానికి కాదు.. ప్రజల ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టాలి’ అని సజ్జల పేర్కొన్నారు. -
గుంటూరు జైల్లో నందిగం సురేష్ ను పరామర్శించిన సజ్జల
-
ఈ దుష్ట సంప్రదాయం చంద్రబాబును వదలదు: సజ్జల
సాక్షి, గుంటూరు: ఆటవిక దేశాల్లోని నియంతల పాలనలో కొనసాగే అరాచకాన్ని ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Rama Krishna Reddy) మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత తురకా కిషోర్‌లను ఆయన పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. రెడ్‌బుక్ పేరుతో అధికార దుర్వినియోగానికి పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకోవడం అత్యంత ప్రమాదకరమనే విషయాన్ని చంద్రబాబు (Chandrababu) గ్రహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాల ప్రకారం పనిచేయాల్సిన పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటే ఏర్పడే దారుణాలను ఇప్పటికే రాష్ట్రం అంతా చూస్తున్నారని అన్నారు. దీనిపై పౌరసమాజం కూడా గళం విప్పాలని, లేని పక్షంలో సమాజానికే రక్షణం లేకుండా పోతుందని సజ్జల ఆందోళన వ్యక్తం చేశారు.ఇంకా ఆయనేమన్నారంటే... గత ఏడాది ఎన్నికల ఫలితాలు ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో హింసాకాండ ప్రారంభమైంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే లోగానే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలతో టీడీపీ శ్రేణులు చెలరేగిపోయాయి. ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాటి కొనసాగింపుగా పోలీసులతో అక్రమ కేసులు బనాయించడం, అరెస్ట్‌లు చేయించడం వంటి రాజ్యహింస ప్రారంభించారు. ముందుగా సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై అధికార దుర్వినియోగంకు పాల్పడుతూ పోలీసుల ద్వారా తప్పుడు కేసులు బనాయించారు. పెద్ద ఎత్తున వారిని అరెస్ట్ చేసి జైలుపాలు చేశారు. తరువాత దశలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దృష్టి సారించారు. అసలు ఎటువంటి తప్పు చేయకపోయినా సరే, ఒక ప్రణాళిక ప్రకారం స్క్రిప్ట్ సిద్దం చేయడం, దానికి అనుగుణంగా అరెస్ట్‌లు, జైళ్ళకు పంపడం చేస్తున్నారు.ఇక మూడోదశలో భాగంగా సామాన్యులు, జర్నలిస్ట్‌లపై కూడా రాజ్యహింసను ప్రయోగిస్తున్నారు. ఈ మొత్త వ్యవహారానికి చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థను, రాజకీయ ఒత్తిళ్ళతో ఇష్టారాజ్యంగా పనిచేయాలంటూ ప్రోత్సహించారు. దాని పరిణమాలే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్. ఇది ఇలాగే కొనసాగితే మొత్తం సమాజమే అశాంతిమయం అవుతుంది. రక్షించాల్సిన పోలీసులే చట్టాలను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలకు రక్షణ లేని పరిస్థితి ఎదురవుతుంది. తక్షణం పౌరసమాజం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విపరిణామాలు ప్రజాస్వామిక వ్యవస్థకే చేటు కలిగిస్తాయి. రాజకీయ కక్షసాధింపులతోనే పాలనమాజీ ఎంపీ నందిగం సురేష్ మీద పన్నెండు కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులో అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. ఒకదాని తరువాత మరొకటి చొప్పున కేసులు నమోదు చేయడం, బెయిల్ పై బయటకు రాగానే పాత కేసులో అరెస్ట్ అంటూ జైలుకు పంపడం చేస్తున్నారు. పార్టీ నాయకుడు తురకా కిషోర్ మీద కూడా ఇలాగే గతంలో జరిగిన సంఘటనలను తవ్వితీసి, వాటికి బాధ్యుడుగా చూపుతూ అర్థంలేని ఘటనల్లో అరెస్ట్ చూపుతున్నారు. ఆయన బెయిల్ తెచ్చుకునేందుకు సిద్దపడుతుండటంతో, బయటకు రాగానే మరో పీటీ వారెంట్‌తో సిద్దంగా ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక స్క్రిప్ట్ ను సిద్దం చేసుకుని దాని ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు.రాజకీయ అవసరాల కోసం పోలీసులను వినియోగించుకోవడం మొదలుపెట్టడంతో మొత్తం పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది. దానికి నిదర్శనమే తెనాలిలో ముగ్గురు యువకులను నడిరోడ్డుపై పట్టపగలు సీఐ స్థాయి అధికారులే లాఠీలతో హింసించడం. ఎక్కడో ఆటవిక రాజ్యం ఉన్న దేశాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయని తెలుసు. కానీ ప్రజాస్వామిక వ్యవస్థలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు, న్యాయస్థానాలు చేసే విచారణను, నేర నిర్ధారణను, శిక్షను కూడా తామే అమలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఇక న్యాయ వ్యవస్థ ఎందుకు ఉన్నట్లు? మొత్తం రాజకీయ నాయకత్వం ఇచ్చిన దన్నుతో పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర సీఎం, ఆయన కుమారుడు స్వయంగా రెడ్‌బుక్ పాలనను సాగిస్తున్నామని బహిరంగంగా ప్రకటించి, దాని ప్రకారం పనిచేసిన వారికే రివార్డులు ఉంటాయని చెప్పడం వల్లే ఇటువంటి దారుణమైన పరిణామాలు జరుగుతున్నాయి. దీనినే కొనసాగితే సమాజంలో అరాచకం ప్రబలుతుంది. సామాన్యుడు బతకడమే కష్టమవుతుంది.ఈ దుష్ట సంప్రదాయం చంద్రబాబును వదలదు నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. దానిపై ఇద్దరు ఎమ్మెల్సీలు, కాకాణి కుమార్తె జిల్లా కలెక్టర్‌ను కలవడానికి వెడితే వారిపైన కూడా కేసులు పెట్టడం చూస్తుంటే, ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానమే కలుగుతోంది. ఇటువంటి దుష్ట సంప్రదాయం తమను కూడా చుట్టుముడుతుందనే ఆలోచన చంద్రబాబుకు కలగడం లేదు. చట్టాలను పక్కకుపెట్టి, ఒక మాఫియా సైన్యాన్ని తయారు చేసుకుంటున్నారు. తాము చెప్పినట్లు వినని వారిని వీఆర్‌కు పంపడం, సస్పెండ్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిని దారుణమైన స్థితికి తీసుకువచ్చారు. అలాగే పల్నాడు జిల్లాలో హరికృష్ణ అనే యువకుడిని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు.పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి తన కుమారుడిని చూపించమంటే, అసలు మా ఆధీనంలోనే లేడని పోలీసులు జవాబు చెప్పారు. స్టేషన్ వద్ద నుంచి వెళ్ళకపోతే హరికృష్ణ కుటుంబసభ్యులపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారు. హరికృష్ణపై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మేజిస్ట్రేట్ వద్ద తనను హింసించారని చెబితే ఆయనను ఆసుపత్రికి పంపారు. ఆ ఆసుపత్రిలోని వైద్యాధికారులను పోలీసులకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయి. హరికృష్ణ నడవలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు హరికృష్ణను కలిసేందుకు ఆయన తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు కనీసం ములాఖత్ కూడా ఇవ్వకుండా కక్షసాధిస్తున్నారు. ఫిర్యాదు ఇచ్చిన వారిని వదిలేసి, ఎవరిమీద ఫిర్యాదు ఇచ్చారో వారితోనే ఫిర్యాదు తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. పులివెందులలో వైఎస్సార్సీపీ వారిపై ఇలాగే హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. వెన్నుపోటు దినం(Vennupotu Dinam) పేరుతో శాంతియుతంగా నిరసనలు చేపడతామంటే ఈ ప్రభుత్వం భయపడుతోంది. వాటికి అనుమతులు ఇవ్వకూడదని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఏడాది దుష్ట పాలనకు ప్రజల నుంచి వ్యక్తమయ్యే నిరసనలను అడ్డుకోలేరు’ అని సజ్జల స్పష్టం చేశారు. -
కాకాణి కుటుంబానికి సజ్జల పరామర్శ
-
బూట్ కాలితో తొక్కి లాఠీలతో ఆ కొట్టడం ఏంటి.. మీరు అసలు పోలీసులా, రౌడీలా
-
బాబు భవిష్యత్తుపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో వ్యవస్థలు కూటమి పాలనలో దారుణంగా విఫలమయ్యాయని, ఆధారాల్లేకుండానే మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డిని జైలుకు పంపించారని వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. శనివారం నెల్లూరు జైల్లో కాకాణితో ములాఖత్ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్సీపీ నేతలపై వరుసపెట్టి తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. కల్పిత కథనాలు సృష్టించి.. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇది పరాకాష్టకి చేరింది. అక్రమంగా అరెస్ట్ చేస్తే.. బయటకు వచ్చాక వాళ్లు మరింత రాటు తేలుతారు. వైఎస్సార్సీపీలో ఉండే సీనియర్ నేతలను టార్గెట్ చేశారని మేం ముందే అనుకున్నాం. అయితే ఎంత అణగతొక్కాలని చూస్తే అంతే బలంగా వైఎస్సార్సీపీ పైకి లేస్తుంది. చంద్రబాబు(Chandrababu) దీనిని మొదలుపెట్టారు. కానీ, దీని పరిణామాలు భవిష్యత్తులో ఘోరంగా ఉండబోతున్నాయి. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం. దేనికైనా సిద్ధం.రాష్ట్రంలో సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. పబ్లిక్‌గానే బట్టల్లేకుండా డ్యాన్సులు వేయిస్తున్నారు. ఖాకీ డ్రెస్సు వేసుకున్న పోలీసులు.. తెనాలిలో ముగ్గురిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు అని అన్నారాయన. గతంలో చంద్రబాబును పక్కా ఆధారాలతో మా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న చంద్రబాబు.. మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. వైఎస్ జగన్(YS Jagan) అనుకుని ఉంటే చంద్రబాబును మరోసారి జైలుకు పంపేవారు. చంద్రబాబుకి రాజకీయ ఉనికి లేకుండా చేయాలని రాష్ట్ర ప్రజలు సిద్దమయ్యారు. కూటమికి పాడె కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబులో మార్పు వస్తే మేలు. రాకపోతే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది’’ అని హెచ్చరించారాయన. ఇదీ చదవండి: కూటమివారి నవమోసాలు -
మహిళలకు వైఎస్ జగన్ చేసిన మేలు ఎవరూ చేయలేదు
సాక్షి, అమరావతి: మహిళలకు దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనంత మేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలు తనతో పాటు అడుగులు వేయాలని, నిర్ణయాత్మక శక్తిగా ఉండాలని వైఎస్ జగన్ నమ్మారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం వైపు దేశం మొత్తం తిరిగిచూసిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ. కూటమి పాలనలో మహిళలని కూడా చూడకుండా కేసులు పెడుతున్నారని, ప్రభుత్వంలో ఉన్నవారి ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. సంయమనం, క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఉంటుందనే సందేశం ఇవ్వాలని సూచించారు. పార్టీ ఇతర అనుబంధ సంఘాల తరహాలోనే మహిళా విభాగం కూడా జిల్లా స్థాయిలో సమావేశం కావాలని సజ్జల రామకృష్ణారెడ్డి నిర్దేశించారు.జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాన్ని కలుపుకొంటూ ముందుకెళ్లాలన్నారు. పనిచేసే క్రమంలో అడ్డంకులు సహజమని, పార్టీలోని నాయకుల సహకారంతో వాటిని తొలగించుకోవాలని సూచించారు. అపోహలతో పార్టీకి దూరమైన వర్గాలకు మళ్లీ దగ్గర కావాలని చెప్పారు. ఈ కష్ట కాలంలోనూ పార్టీలో పది పదవులకు వందమంది పోటీకి వస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏ పార్టీలోనూ ఇలా జరగదని, వైఎస్ జగన్ మీద ఉన్న అభిమానం ఎన్ని ఆటుపోట్లు వచ్చినా చెక్కుచెదరకపోగా మరింత పెరిగింది అనేందుకు నిదర్శనం ఇదేనని వివరించారు. మహిళలను నిలువునా మోసం చేసిన కూటమి: వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వం మహిళలను నిలువునా మోసం చేసిందని వరుదు కళ్యాణి అన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు సంక్షేమం కింద ఒక్క రూపాయి కూడా అందడం లేదని, మహిళా లోకం కుమిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు జగనన్న పాలనలో జరిగిన లబ్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని, సమస్యలపై పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అంటే గంజాయి, బెల్ట్ షాప్‌లు, పర్మిట్ రూమ్‌లు, పేకాట క్లబ్‌లు, డ్రగ్స్, మహిళలపై అఘాయిత్యాలు అని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలకు బదులు సూపర్ స్కామ్స్ అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కుట్రలకు, ప్రజా నాయకుడైన జగనన్నకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు నడుంబిగించాలి మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో నారా వారి నరకాసుర పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అవమానాలు, అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులు, వేధింపులు ఇవే సూపర్ సిక్స్ అని అన్నారు. వైఎస్సార్సీపీలోని ప్రతి మహిళా సత్యభామలా మారి ఈ ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మహిళా లోకాన్నే మోసం చేసిందన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ మహిళా నేతలు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారన్నారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ... వైఎస్ జగన్ ఐదేళ్లూ పరిపాలన మీదే దృష్టిపెట్టారని, మేనిఫెస్టోలో చెప్పినవాటితో పాటు, చెప్పని హామీలనూ నెరవేర్చారని అన్నారు. ఎమ్మెల్సీ కల్పలత మాట్లాడుతూ... కూటమి నాయకుడి మనసులో మెదిలితే చాలు మన మీద తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. సమావేశంలో అనుబంధ విభాగాల ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్లు, మేయర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీ మాజీ చైర్ పర్సన్లు, మాజీ మేయర్లు, మహిళా విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు. -
ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే పోలీసులు కూటమి అరాచకాలపై సజ్జల ఫైర్
-
కక్ష సాధింపు కోసమేనా పోలీసులు?.. ఇది దేనికి సంకేతం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నీరు గారుస్తూ.. రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసులను వినియోగించుకుంటున్న తీరు, దిగజారిన శాంతిభద్రతలు, తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల స్థానిక సీఐ అమానుషంగా వ్యవహరించిన వైనంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా పలువురు నాయకులు రాష్ట్రంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై ఉదాహరణలతో సహా సమావేశంలో ప్రస్తావించారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు రాష్ట్రంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనమని పలువురు నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, పోలీస్ యంత్రాంగాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వైనంను ప్రజలు ముందు పెట్టేందుకు వైఎస్సార్సీపీ ఒక కార్యాచరణను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని, ఎవరైనా ప్రభుత్వ వైఫ్యలాలను నిలదీస్తే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు సైతం కేసుల నమోదులో చట్టపరమైన నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణ అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని, డీజీపీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వక పోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.ఎన్ని సార్లు డీజీపీ అపాయింట్మెంట్ కోరినా స్పందించపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ సీరియస్‌గా తీసుకుంటోందని, వ్యవస్థలను కాపాడేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా దీనిపై స్పందిస్తుందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, జోగి రమేష్, విడదల రజిని, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నాయకులు దేవినేని అవినాష్, వేమారెడ్డి, పోతిన మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
రోజులు దగ్గర పడ్డాయి.. బాబు సర్కారుకు సజ్జల వార్నింగ్
-
ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. బాబు సర్కార్‌కు సజ్జల వార్నింగ్
సాక్షి, గుంటూరు: గుంటూరు సీఐడి కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని.. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు.‘‘దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్లో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందునుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి వరకూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘మా వాళ్లు కేసు ఇస్తే తీసుకోలేదు.. వాళ్లు ఇస్తే మాత్రం దుర్మార్గంగా అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. రేపు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుంది?. మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైనది. పోసాని ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలటం లేదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించండి’’ అంటూ సజ్జల హితవు పలికారు.‘‘మీరు ఎంతమందిని జైలులో పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కాం కూడా తప్పుడు కేసే. ఏడాది దాటింది.. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. లేకపోతే జనం తరిమికొట్టే రోజులు వస్తాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. -
YSRCP అధికార ప్రతినిధులకు సజ్జల దిశానిర్దేశం
-
చంద్రబాబు వికృత రాజకీయ క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సాక్షి, అమరావతి: రాజకీయం పేరుతో సీఎం చంద్రబాబు సాగిస్తున్న వికృత క్రీడను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులపై ఉందని పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి.దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఏం చేశామన్నది మాత్రమే రాజకీయ పార్టీ పనితీరుకు ప్రాతిపదిక అవుతుందని బలంగా నమ్మారు. చంద్రబాబు మాత్రం మీడియా ద్వారా ప్రజలను ప్రలోభపెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. టీడీపీ అనుకూలంగా ఓటు వేసింది. కానీ, టీడీపీ తిరిగి వారి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేసింది.టీడీపీ వాళ్లు చేసిన స్కామ్‌లకు ఆధారాలున్నా వాటిపై కూడా ఫేక్ ప్రచారం చేస్తూ ప్రజలు ఆలోచించే అవకాశం లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో పై స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బందిపోట్ల తరహాలో ఇసుక, కాంట్రాక్టులు, నామినేటెడ్ పనుల్లో దోపిడీ చేస్తున్నారు. అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోచేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రకటిస్తూ మొబిలైజేషన్ అడ్వాన్సులు ప్రవేశపెట్టి దాని ద్వారా మొదట్లోనే కమీషన్లు దండుకుంటున్నారు. ప్రాజెక్టులు వచ్చినా, రాకపోయినా అడ్వాన్సుల పేరిట దోచుకుంటున్నారు. ఇవి ప్రజల దృష్టిలో పడకుండా డైవర్షన్ కోసం వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. అధికారంలో ఉండగా వైఎస్ జగన్ నిబద్ధతతో కూడిన రాజకీయం చేశారు.పేదలకు, సంపన్నులకు మధ్య అంతరాలు తగ్గించడం, నిజమైన ప్రజాస్వామ్యంలో మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడం కోసం ఏం చేయాలో... అది చేసి చూపించిన నాయకుడు వైఎస్ జగన్. ఐదేళ్లు జగన్ పాలనలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమాన్ని చూశాం. చంద్రబాబు పాలనలో టీడీపీ కార్యకర్తలు, నేతల ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
పహల్గామ్ ఘటనపై సజ్జల రామకృష్ణా రెడ్డి రియాక్షన్
-
Pahalgam: పహల్గాం ఉగ్ర దుశ్చర్య.. జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ(ఫొటోలు)
-
YSRCP ఎస్సీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం
-
‘సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన నాయకుడు జగన్’
తాడేపల్లి : సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన నాయకుడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సెల్ సమావేశంలో సజ్జల పాల్గొన్నారు.ఈ సమావేశానికి మాజీ మంత్రులు జోగి రమేష్, ధర్మాన కృష్ణదాస్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్, అన్ని జిల్లాల బీసీ నేతలు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని జగన్ నిరూపించారు. చంద్రబాబుది అవకాశవాద రాజకీయం. అధికారంలోకి రాగానే దోచుకోవడం, దాచుకోవడమే. ఈసారి మరింత బరి తెగించి వ్యవహరిస్తున్నారు. ఈ పది నెల చంద్రబాబు పాలన చూస్తేనే జనానికి అర్ధమవుతుంది. ఈ దుర్మార్గపు పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయాలి. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. గతంలో కంటే మెరుగ్గా పూర్తిస్థాయి కమిటీలు నియమించుకుందాం’ అని సజ్జల పేర్కొన్నారు.రాష్ట్రంలో నియంతృత్వ పాలనను చూస్తున్నాంఅధికార యంత్రాంగమే మాఫియా ముఠాలా వ్యవహరిస్తోంది.అందరూ కలిసి ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేస్తున్నారు, విశాఖలో నానారకాలుగా అక్రమాలు చేసి బీసీ మహిళను పదవి నుంచి తప్పించారు. కూటమి నేతల ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను గట్టిగా తిప్పికొడదాం’ అని సజ్జల సూచించారు. -
ఏపీ హైకోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డిలకు ఊరట
సాక్షి,గుంటూరు: ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు సజ్జల భార్గవరెడ్డిలకు ఊరట దక్కింది. ఇద్దరు నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తమను అరెస్టు చేసే అవకాశం ఉందని, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సజ్జల రామకృష్ణ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్లపై గురువారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. సజ్జల రామకృష్ణ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
పార్టీ కమిటీలను వెంటనే పూర్తి చేయాలి: సజ్జల
తాడేపల్లి: ప్రతీ నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీ కమిటీలు వెంటనే పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ఇతర ముఖ్యనేతలు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కమిటీల విషయంలో ఎటువంటి జాప్యం జరగకూడదని సజ్జల ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో కమిటీల ఏర్పాటు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం జనరల్ సెక్రటరీలు, రీజనల్ కో ఆర్డినేటర్లు, కేంద్ర కార్యాలయం నుంచి ఇంచార్జులు అందరూ అందుబాటులో ఉంటారన్నారు. కమిటీల విషయంలో జాప్యం జరగడానికి వీల్లేదని ఇప్పటికీ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేసిన సంగతిని సజ్జల ఈ సందర్భంగా గుర్తు చేశారు. కమిటీల ఏర్పాటుపై సీరియస్ గా దృష్టిపెట్టాలని, జిల్లా అధ్యక్షులు వెంటనే వీటిపై స్పందించాలని సజ్జల సూచించారు.ప్రజా పాలనను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, పార్టీకి సంబంధించి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం సమిష్టిగా పనిచేసి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశారని సజ్జల అభినందించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారన్నారు. -
12న జరిగే 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం: సజ్జల
తాడేపల్లి : ఈ నెల 12వ తేదీన వైఎస్సార్సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీద్దామని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.. ఈ మేరకు ఆయన టెలికన్ఫరెన్స్ లో మాట్లాడారు. దీనికి వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, విద్యార్థి, యువజన విభాగం నేతలు, 13 యూనివర్శిటీల విద్యార్థి నాయకులు, మేధావులు, విద్యారంగం ప్రముఖులు హాజరయ్యారు.‘12న జరిగే 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఫీజు రీయంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ పోరాడదాం. రేపు యూనివర్శిటీల లోపల లేదా బయట "యువత పోరు" పోస్టర్ ఆవిష్కరణ చేయాలి. యూనివర్శిటీల నుంచి విద్యార్థులు ర్యాలీలో పాల్గొనేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి వారి సమస్యలు పరిష్కారమవుతాయి వైఎస్సార్సీపీ విద్యార్ధి, యువజన విభాగాలు సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించాలి’ సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతీ పల్లెలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు -
యువత పోరుపై YSRCP స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల టెలీ కాన్ఫరెన్స్
-
ప్రతీ పల్లెలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఈనెల 12న చేపట్టిన ‘యువత పోరు’ ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అలాగే, 12వ తేదీన వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు.యువత పోరు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలపై ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం రూ.3900 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్లో కేవలం రూ.2600 కోట్లు కేటాయించడం దుర్మార్గం. అంటే విద్యార్ధుల సంఖ్యను కూడా కుదించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.బకాయిలు పెండింగ్..పేద, మధ్యతరగతి విద్యార్ధులను చదువులకు దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయిదు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టడం రాక్షసత్వం. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్ధులను వెళ్లగొడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా సర్కారు చోద్యం చూస్తోంది. పేద పిల్లలకు పెద్ద చదువులు సాకారం చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చారు. నిరుపేద ఇళ్ల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు తయారు కావాలన్న సమున్నత లక్ష్యంతో నాడు ఫీజు రీయింబర్స్మెంట్ కు శ్రీకారం చుట్టారు.చంద్రబాబు సర్కార్ 2014-19 మధ్యలో ఈ పథకానికి తిలోదకాలు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా బకాయిలు పెట్టి, కాలేజీ యాజమాన్యాలను, విద్యార్ధులను ఇబ్బందుల పాలు చేసింది. వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసిన వైఎస్ జగన్ 93 శాతం మంది విద్యార్ధులకు మేలు చేసేలా ఈ పథకాన్ని విస్తరింపచేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కూటమి సర్కార్ ఈ పథకాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోంది.నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి..కూటమి ప్రభుత్వంపై యువతలోనూ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా ప్రతినెలా మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైంది?. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7200 కోట్లు అవసరం. కానీ గత బడ్జెట్ లో దీనికి కేటాయింపులు లేవు. ఈ ఏడాది బడ్జెట్ లోనూ పైసా కూడా కేటాయించలేదు.మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం..ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు వైఎస్సార్సీపీ హయాంలో పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో అయిదు కాలేజీల నిర్మాణం పూర్తై, తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటిల్లో నిర్మాణపనులు పూర్తిచేసి, తరగతులను ప్రారంభించాల్సి ఉంది. కానీ వాటిని కూడా ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇచ్చిన మెడికల్ సీట్లను కూడా వద్దంటూ రాష్ట్రప్రభుత్వమే లేఖ రాయడం దుర్మార్గం. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఒకేసారి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది.వీటిల్లో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలు 2023లో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కాలేజీలే ఉండేవి. వందేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుంది. అయితే కొత్త మెడికల్ కాలేజీలను, వాటిద్వారా వచ్చే సీట్లను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోంది. వాటిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోంది.విద్యార్థి సంఘాలు కలిసి రావాలి..ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ.. యువతకు, విద్యార్ధులకు అండగా నిలిచి ప్రభుత్వం విధానాలపై పోరాడాలి. అందుకోసం తలపెట్టిన యువత పోరులో కలిసి వచ్చే అన్ని విద్యార్థిసంఘాలు, యువజన సంఘాలతో వైఎస్సార్సీపీ నేతృత్వంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలి. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు, యవతతో కలిసి వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రదర్శన, ధర్నా కార్యక్రమం చేపట్టాలి. అనంతరం కలెక్టర్లకు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల స్థాయి నేతలు సమన్వయంతో విజయవంతం చేయాలి.వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలు..ఈనెల 12వ తేదీ వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలి. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలి. ప్రజల్లో వైఎస్సార్సీపీకి ఉన్న బలాన్ని చాటుకోవాలి. పార్టీ పట్ల సానుభూతితో ఉన్న శ్రేణులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయాలి. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటామనే భరోసాను కల్పించాలి. మండలస్థాయి కమిటీల ఏర్పాటుకు కూడా నియోజకవర్గ ఇన్చార్జీలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. -
12న ‘యువత పోరు’ బాట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆయా వర్గాల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 12న అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన యువత పోరు ర్యాలీలను, జిల్లా కలెక్టర్లకు మెమోరాండం సమర్పించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అదే రోజున వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్య నేతలతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. » నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి మోసగించిన వైనం, వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం ఇలా విద్యార్థులు, యువతను నిలువునా మోసగించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయా వర్గాల పక్షాన పోరుబాటకు సిద్ధమయ్యాం. ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం. యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విద్యార్థులు, యువకులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములయ్యేలా విస్తృతంగా ప్రచారం చేయాలి. » కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ.. రైతులకు అండగా నిలుస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. ఆ తర్వాత విద్యుత్ చార్జీలపై చేసిన కార్యక్రమం కూడా అదే స్థాయిలో విజయవంతమైంది. జిల్లాల పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ మూడో కార్యక్రమాన్నీ(యువత పోరు) విజయవంతం చేయాలి. » యువత పోరుకు సంబంధించి వైఎస్సార్సీపీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. జిల్లా స్థాయిలో జరుగుతున్న కార్యక్రమమైనందున ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని విజయవంతం చేయాలి. » 12న వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి చోటా ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి, మన పార్టీపై ఉన్న ప్రజాభిమానం ఈ సందర్భంగా వెల్లడవ్వాలి. ఈ కార్యక్రమాన్ని ఉదయాన్నే పూర్తి చేసుకుని అనంతరం యువత పోరు కార్యక్రమం నిర్వహించాలి. యువత పోరు కార్యక్రమం ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఆ రోజు యధావిధిగా కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సూచించారు. అంతేకాక పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామాల నుంచి రాష్ట్రస్థాయి వరకూ వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలి. » సోషల్ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారు. వారికి న్యాయ సహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్ధంగా ఉంది. ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్ సెల్‌ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలి. » వైఎస్సార్సీపీ మండల స్థాయి వరకూ కమిటీల నియామకం కూడా ఈ నెల 16 నాటికి పూర్తి చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. అవసరమైతే రాష్ట్ర స్థాయి నాయకుల సహకారం తీసుకుని కమిటీల నియామకాలు పూర్తిచేయాలి. -
KSR Live Show: పోసాని కేసులో సజ్జల టార్గెట్.!
-
ఆత్మవిశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సజ్జల
-
ప్రత్యర్థుల విష ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోవాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఆత్మవిశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం.. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా కమ్యూనికేషన్‌పై వర్క్‌షాపు నిర్వహించారు. మీడియా అంశాలపై పార్టీ క్రియాశీల కార్యకర్తలు, నేతలకు శిక్షణ ఇచ్చారు.ఈ శిక్షణా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు వంగీపురం శ్రీనాధాచారి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తాజా పరిణామాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని.. సమర్థ వాదనతో ప్రజల్లో సానుకూలత సాధించాలన్నారు. ప్రత్యర్థులు చేసే విషప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోవాలని సజ్జల చెప్పారు. -
ఎల్లో మీడియా ఫేక్ ఆరోపణలపై సజ్జల స్ట్రాంగ్ కౌంటర్..
-
టార్గెట్ సజ్జల.. భగ్గుమన్న వైఎస్సార్సీపీ
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వ(Kutami Prabhutvam) ప్రతీకార పాలన కొనసాగుతోంది. నిత్యం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, ఆరోపణలు, తప్పుడు కేసులతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో తాజాగా.. వైఎస్సార్సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసుకుని ఎల్లో మీడియాతో అడ్డగోలు కథనాలను అచ్చేయిస్తోంది.సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కడప జిల్లా సీకేదిన్నె మండల పరిధిలోని అటవీ భూములు ఆక్రమించిందనే ఆరోపణలను కూటమి అనుకూల మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. అయితే ఈ కథనాలపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. కబ్జా కథనాలను తీవ్రంగా ఖండించింది. ‘‘అసలు కబ్జా ఆరోపణలకు ఆస్కారమే లేదు. ఆ మీడియా చానెల్స్ చెప్తున్నట్టుగా కడప సమీపంలోని మామిడి తోటల్లో ఒక్క సెంటు భూమికూడా సజ్జల రామకృష్షారెడ్డికి లేదు. అలాంటప్పుడు కబ్జా అన్న ప్రశ్నే తలెత్తదు. 1995 ప్రాంతంలోనే అంటే ఇప్పటి చంద్రబాబు(Chandrababu) అప్పుడు సీఎంగా ఉన్న సమయంలోనే ఇక్కడ పనికిరాని భూములను సజ్జల, ఆయన సోదరులు కొనుగోలుచేశారు. మామిడితోటలు వేశారు. దీనికి దాదాపు పదేళ్ల తర్వాత సజ్జల రామకృష్షారెడ్డి తన వాటా భూములను సోదరులకు విడిచిపెట్టారు. అప్పటినుంచీ ఆయనకు ఆ భూములతో ఆయనకు సంబంధం లేదు. ఇది జరిగినప్పుడు ఆయన రాజకీయాల్లోకూడా లేరు.2014లో ఫారెస్ట్, రెవిన్యూ విభాగాల మధ్య ఈ ప్రాంతంలో మొత్తం భూముల విషయమై వివాదం నెలకొంది. ఫారెస్ట్ కిందకు వస్తుందని అటవీశాఖ, ఆ ప్రసక్తే లేదని రెవిన్యూశాఖలు తలోరకంగా చెప్తున్నాయి. ఇరుశాఖలకు మొత్తం రికార్డులు కూడా సజ్జల సోదరులు అప్పగించారు. సంయుక్తంగా సర్వే చేసి ఏదో విషయం తేల్చాలని సజ్జల సోదరులే పలుమార్లు అర్జీలు పెట్టుకున్నారు.కేవలం సజ్జల రామకృష్షారెడ్డి(Sajjala Ramakrishna Reddy) పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డమే లక్ష్యంగా ఎల్లోమీడియా ప్రయత్నిస్తోంది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై సజ్జల న్యాయపరమైన చర్యలకు దిగుతున్నారు’’ అని వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. -
‘విద్యుత్ చార్జీల పెంపుపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టండి’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని(power tariff hike) మోపడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తాడేపల్లి వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారంను విధించడం దుర్మార్గమని అన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచము అని ప్రజలకు హామీ ఇచ్చి, నేడు అధికారంలోకి రాగానే ఏకంగా రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారంను విధించడం దారుణం. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో విద్యుత్ కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించాలి. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ మెమోరాండంలను సమర్పించాలి. అన్ని నియోజకవర్గాల ఇన్ చార్జీలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో పార్టీ శ్రేణులతో సమావేశాలు జరిగాయి. అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ పోరుబాట పేరుతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ నిరసనలపై ఇప్పటికే ప్రజల్లో ఆదరణ కనిపిస్తోంది. ప్రజాసమస్యలపై వైఎస్సార్సీపీ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోంది. ‘విద్యుత్ చార్జీల పెంపుదల అన్ని వర్గాలపై ఆర్థికంగా భారంను మోపుతోంది. అయా వర్గాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. వారంతా వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇటువంటి ప్రజాసంఘాలు, సంస్థలను కూడా కలుపుకుని నిరసన ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించాలి. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ కార్యక్రమం ద్వారా పాలకులకు అర్థం కావాలి. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని, పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’ అని సూచించారు.‘పార్టీ శ్రేణులు, గ్రామ, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొనాలి. ఇందుకోసం పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీలు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించడం ద్వారానే ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం మరింత పెరుగుతుంది. ప్రజలకు వైఎస్సార్సీపీ(YSRCP కష్ట సమయంలో అండగా ఉంది అనే సంకేతాలను పంపాలి. అలాగే తాజాగా వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి, ఇబ్బంది పడుతున్న రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు పార్టీ నేతలు రైతులను కలుసుకోవాలి. వారికి వచ్చిన కష్టంలో అండగా ఉంటామనే భరోసాను అందించాలి’ అని పిలుపునిచ్చారు. -
కూటమి ప్రభుత్వంపై సజ్జల ఫైర్
-
‘‘గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్సీపీకి తెలియదు’’
సాక్షి,గుంటూరు:మాజీ ఎంపి నందిగాం సురేష్(Nandigam Suresh) అక్రమ కేసుల్లో అరెస్టై నాలుగు నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్‌పై కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishnareddy) అన్నారు. మంగళవారం(డిసెంబర్ 24) గుంటూరు జైలులో సురేష్‌ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.‘ఈ రోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసేసుకునేవాళ్ళం. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింది. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు. జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు. నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్‌ను ఎలా ఉంచాలి?అనేది చెబుతున్నారు... ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం. వైఎస్సార్సీపిని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్ట్ చేస్తున్నారు. గతంలో ముప్పై ఏళ్ళ క్రితం నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి.కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్తకొత్త పద్దతులు ఉపయోగిస్తున్నారు. గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్సీపీకి తెలియదు. మీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్సార్సీపీకి ఉంది. నాలుగేళ్ళలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు’అని సజ్జల హెచ్చరించారు. -
కోట్ల మంది గుండె చప్పుడు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చిన ధీశాలి, విజనరీ అని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యుడిగా కోట్లాది ప్రజల గుండె చప్పుడుగా మారారని తెలిపారు. గెలుపు, ఓటములకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున తరలివచి్చన అభిమానుల కోలాహలంగా మధ్య జరిగిన ఈ వేడుకల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వైఎస్ జగన్‌కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. పేద మహిళలకు చీరలు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వందలాది అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు, ప్రజలకు వైఎస్ జగన్ అందించిన సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని వివరించారు.తాడేపల్లిలో కొనసాగుతున్న బైక్ ర్యాలీ భారీ బైక్ ర్యాలీవైఎస్సార్సీపీ విద్యార్థి – యువజన – సోషల్ మీడియా విభాగాల కార్యకర్తలు శనివారం సాయంత్రం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జగనన్న.. ప్రజా సేవకా.. వర్థిల్లు వెయ్యేళ్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తాడేపల్లి పురవీధుల్లో ర్యాలీ చేశారు.మేలును గుర్తుచేసుకున్న ప్రజలుగత ఐదేళ్లలో సీఎంగా వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, ప్రజలు గుర్తుచేసుకున్నారు. ‘పేద ప్రజలకు సుపరిపాలన అందించిన ధీరుడు మా అన్న జగన్మోహనుడు.. పారిశ్రామిక ప్రగతిలో తనదైన ముద్ర వేశారు.. రాష్ట్రం ఎయిర్ కండీషన్ల తయారీ, గ్రీన్ ఎనర్జీ హబ్‌లకు వేదికైంది.. చదువుతోనే పేద బిడ్డల తల రాత మారుతుందని నమ్మిన ఏకైక నేత.. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైన వారందరికీ ప్రతీ పథకం ఇంటి వద్దనే అందించాలని తపనపడే మా జగనన్నకు హార్థిక శుభాకాంక్షలు’ అని వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. -
పిల్లల భవిష్యత్ కు బాటలు వేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం
-
జగన్ ఒక అరుదైన నేత: సజ్జల
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నేళ్ల పాలనాకాలంలో పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసింది వైఎస్ జగన్ మోహన్‌రెడ్డినే అని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇవాళ(డిసెంబర్ 21) పార్టీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.కేక్ కట్ చేసిన అనంతరం సజ్జల పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు.. జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని కోట్లాధి మంచి అభిమానుల గుండె చప్పుడు వైఎస్ జగన్. గెలుపు ఓటములకు అతీతంగా ప్రజాసంక్షేమమే ఆయన లక్ష్యం. అయిదేళ్ళ పాలనలో ప్రజల జీవితాల్లో సమూల మార్పులకు నాంధి పలికారు. రాజకీయాల్లో వైయస్ జగన్ ప్రస్థానం ఒక చరిత్ర. ఇచ్చిన మాటకు కట్టుబడే ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడు. జగన్ రియల్ విజనరీ. నేతల్లోనే జగన్ అరుదు. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేశారు. ప్రతీ ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా చేశారు. జగన్ పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు అని అన్నారు.వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి విలువలు, నిబద్దతతో కూడిన నాయకుడుగా ఆయన తన ప్రస్థానం మొదలుపెట్టారు. కేవలం పదేళ్ళలో ఒక విజనరీగా, తాను ఏం అనుకుంటున్నాడో దానిని కార్యరూపంలోకి తీసుకురాగలిగిన ప్రజాప్రతినిధిగా, మంచి పరిపాలకుడు, జనరంజకుడుగా ఎదిగారు. వైయస్ జగన్ గారు తన ఆదర్శపాలనను దేశం అంతా గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకువెళ్లారు. మాటకు కట్టుబడే నాయకుడుగా జనం ఆయనను మెచ్చారు. అందుకే అధికారంను కట్టబెట్టారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే విలువలకు వైయస్ జగన్ నిలువెత్తు నిదర్శనం. ఆయన నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడానికి ఏనాడు అంగీకరించలేదు. ప్రతిసారీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పులను సగౌరవంగా స్వీకరించారు. గెలుపు ఓటములు కాదు, ప్రజలకు మనం ఏం చేశాము, వారి జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి ఎలా వ్యవహరించాము అనేదే ముఖ్యమని పార్టీకి దిశానిర్ధేశం చేసిన మార్గదర్శకుడు వైయస్ జగన్... పేదలకు ఉచిత బస్సు ప్రయాణాలు, గ్యాస్ సిలెండర్లు వంటి తాయిలాలు ఇవ్వడం కాదు, వారి జీవితాల్లో మంచి మార్పు రావాలి, తమ తలరాతను తామే రాసుకునే స్థాయిలో వారు నిలబడేందుకు ప్రభుత్వంగా మనం అండగా ఉండాలనే లక్ష్యంతో గత అయిదేళ్ళలో ఆయన పాలన సాగింది. భవిష్యత్తును ఆలోచించి ఆయన తన పాలనలో అనేక పథకాలను అమలు చేశారు. ఏదో విజన్ అంటూ హంగామా చేయడం కాదు, అయిదేళ్ళ పాలనలో గొప్ప పునాదులతో కూడిన విధానాలను అమలులోకి తీసుకువచ్చి, భవిష్యత్తు తరాలకు మేలు చేయాలని తపించిన నేత వైయస్ జగన్. అటువంటి విజనరీ జన్మదినం సందర్భంగా ఆయన పరిపూర్ణ ఆయురారోగ్యాలతో, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడుగా ఎదగాలని కోట్లాది మంది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన మంచిపనులు, దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకు వచ్చిన సంస్కరణల వల్ల తిరుగులేని మెజారిటీతో విజయాన్ని అదుకోవాల్సి ఉంటే, గత ఎన్నికల్లో అన్ని శక్తులు ఏకమై చేసిన దాడి, చెప్పలేని అనేక కారణాల వల్ల అధికారానికి దూరమయ్యాము. కానీ ఆయన మాత్రం ప్రజల పక్షాన నిలబడాలని, నిరుత్సాహం నుంచి ప్రజల క్షేమమే ధ్యేయంగా అందరినీ ముందుకు నడిపిస్తున్న ధీశాలి అని సజ్జల అన్నారు.సజ్జలతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి, కాకుమాను రాజశేఖర్, కొమ్మూరి కనకారావు, చిల్లపల్లి మోహన్ రావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాలు పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక.. బర్త్ డే వేడుకల్లో తొలుత.. జగన్ కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఆపై పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ జెండాలతో.. జగన్‌కు విషెస్ చెబుతూ పార్టీ నేతలు జోరుగా నృత్యాలు చేశారు. జగన్‌పై అభిమానంతో స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చినవాళ్లను సజ్జల అభినందించారు. -
ఇది ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం
తాడేపల్లి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిన కూటమి ప్రభుత్వం...ఈ విషయంలో తక్షణమే పెంచిన భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజల తరుపున వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ..ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంరాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా ఏఈ లేదా డీఈ కార్యాలయంకు వెళ్ళి, అధికారులకు మెమోరాండంను సమర్పించాలి. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలని సూచించారు.‘ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి, వారికి న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, ప్రజాసమస్యలపై ఎంత దృఢంగా ఉందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడయింది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ రెండో కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి’ అని పిలుపునిచ్చారు.ఇందుకు సంబంధించి వైఎస్సార్ సిపి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. ఈ కార్యక్రమాన్ని ముందు జిల్లా స్ధాయిలో నిర్వహించాలని భావించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నియోజకవర్గ స్ధాయిలో చేయాలని మన అధినేత జగన్ అందుబాటులో ఉన్న నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్ధాయిలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు అందరూ తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. నియోజకవర్గ ఇంఛార్జ్‌లంతా కూడా తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ దోపిడినీ ఎండగట్టాలని సజ్జల పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి..ఈ నెల 21 న మన అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి, జగన్‌గారిపై ఉన్న ప్రజాభిమానం ఈ సందర్భంగా వెల్లడవ్వాలి, పార్టీ క్యాడర్ అంతా ఉత్సాహంగా పాల్గొని జగన్‌గారిపై ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలి, ఈ వేడుకలను అందరం విజయవంతం చేద్దాం’ అని సజ్జల పేర్కొన్నారు.సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉందాంసోషల్ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారు, వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్దంగా ఉంది, ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్ సెల్‌ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలి. ఇటీవల సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులకు తెలియజేసి, దానిని అతిక్రమిస్తే వచ్చే ఇబ్బందులను పోలీసులకు తెలియజేయాలి. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు అవసరమైన సహాయం చేసేందుకు పార్టీ నాయకులు కూడా వెంటనే అందుబాటులో ఉండాలి’ అని సజ్జల హితవు పలికారు. -
ఇది రైతుల పక్షాన నిలబడాల్సిన సమయం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేవారు లేక, గిట్టుబాటుధర అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు...అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, రైతులు సంయుక్తంగా ర్యాలీగా కలెక్టర్ కార్యాలయంకు వెళ్లీ, అధికారులకు మెమోరాండంను సమర్పించాలి. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలి...ఇది రైతులకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వం ధాన్యం సేకరణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, రైతులకు న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. శాంతియుతంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి కావాలని అనుమతులు నిరాకరించి, కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తే, దానిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం.కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపడుతున్న ఈ కార్యక్రమంపై జాతీయ స్థాయిలోనూ ఆసక్తి వ్యక్తమవుతుంది. వైఎస్సార్సీపీ ఎంత బలంగా ఉందో, ప్రజా సమస్యలపై ఎంత దృఢంగా ఉందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడవుతుంది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ దీనిని విజయవంతం చేయాలి.ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులకు అండగా, ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని వైఎస్సార్సీపీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, రైతుల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట
-
సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మంగళవారం(డిసెంబర్10) ఏపీ హైకోర్టు విచారించింది. సజ్జల కేసు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు మరో రెండు వారాలపాటు పొడిగించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్పీ నేతలకు వేధింపులు ఎక్కువయ్యాయని సజ్జల తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనపై 41ఏ నోటీసుకు వీలులేని సెక్షన్లు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఇదీ చదవండి: బరితెగించిన ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటం -
‘బరితెగించిన ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటం’
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలపై కూటమి సర్కార్‌తో పోరాడాల్సిన సమయం వచ్చిందని.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజాపక్షాన నిలబడాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ పోరాటంలో రాజీ ప్రస్తావన ఎంతమాత్రం ఉండబోదని స్పష్టం చేశారాయన. మంగళవారం వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రజా పోరాట కార్యాచరణను ఈ సందర్భంగా ఆయన వాళ్లతో చర్చించారు. ఈ సమావేశంలో ఆయన ఏమన్నారంటే.. ‘ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఉందనే మెసేజ్ బలంగా వెళ్ళాలి. వారి గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ మనం వారికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. బరితెగించి వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడుదాం’ అని పార్టీ నేతలతో అన్నారు. 👉అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే నుంచే అధికార తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా హామీలను వేటినీ నిలబెట్టుకోలేకపోయింది.పైగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన పనులను, నెలకొల్పిన వ్యవస్ధలను ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేసింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన పథకాలను.. వాళ్లకు అందకుండా చేశారు. ఇంటింటికే డెలివరీలాంటి వ్యవస్థలను కూకటివేళ్లతో పెకిలించారు. ఇదేకాదు..👉రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారు. కుట్ర పూరితంగా కేసులు నమోదు చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. ఈ పరిస్థితుల నడుమ ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా స్పందించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ప్రజల పక్షంగా వారి తరపున నిలబడాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది.ఈ పోరాట కార్యాచరణను అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం ప్రకటించారు. ‘రైతాంగానికి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. వైఎస్సార్సీపీ శ్రేణులంతా రైతాంగం వెంట నడవాలి. రైతులకు సంబంధించి వారికి అండగా నిర్వహిస్తున్న కార్యక్రమం డిసెంబరు 13వ తేదీన చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. వచ్చిన ఆరు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.17వేల కోట్ల కరెంట్ భారం ప్రజలపై మోపింది. రెండో కార్యక్రమం విద్యుత్ ఛార్జీల భారంపై డిసెంబరు 27న చేపట్టబోతున్నాం. పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టనున్నాం.అదే విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తూ జనవరి ౩వ తేదీన మూడో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం. ఇప్పటికే 4 క్వార్టర్లు ఫీజు చెల్లించకపోవడంతో విద్యార్ధులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా కాలేజీల యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి. కాబట్టి వాళ్లకు అండగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం.👉మనం చేసిన మంచినంతా నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వ తీరును నిరసిస్తూ... ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేపడుతున్నాం. మనం చేపట్టబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ గట్టిగా తీర్మానం చేసింది. ఎలాంటి రాజీ లేకుండా గ్రామస్ధాయి వరకు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అన్నివర్గాల తరపున పోరాడుతూ.. ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్సార్సీపీ ఏ స్ధాయిలోనైనా అండగా నిలబడుతుందనే విషయం ఆ వర్గాలకు తెలియజేయాలి.👉రైతులకు అండగా వైఎస్సార్సీపీ అనే మొట్టమొదటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేలా అందరూ ముందుకు రావాలి. ఆయా జిల్లాల్లో చేపట్టబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రేణులు, రైతులు తరలి వచ్చేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీ కేడర్ గ్రామస్ధాయి నుంచి జిల్లా స్ధాయి వరకు వెళ్లి ర్యాలీలో పాల్గొనడంతోపాటు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలి అని సజ్జల తెలిపారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మునిసిపల్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లు, జేసీఎస్ మండల ఇంఛార్జ్‌లకు ఆయన దిశానిర్దేశం చేశారు. -
మనం చంద్రబాబులాగా కాదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని సంక్షేమ యజ్ఞం వైఎస్ జగన్ చేశారని.. కానీ 2024 ఎన్నికలు మనకు రకరకాల అనుభవాలను మిగిల్చిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీలను ఉద్దేశించి ఆయన దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..‘‘వైఎస్సార్సీపీ అనేది అందరికీ అందుబాటులో ఉండే పార్టీ. పార్టీలోని నలుగురు కూర్చుని తీర్మానం చేసుకుని దాన్ని అమలు చేసే పార్టీ మనది కాదు. అభిమానులతో నడిచే పార్టీ ఇది.. అందరి అభిప్రాయాలను తీసుకుని నడిచే పార్టీ. అందరిలోనూ తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలన్న కసి ఉంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఓడిపోవటానికి కారణమేంటనే చర్చ పార్టీలో ఉంది’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘వైఎస్సార్సీపీని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఐదారు నెలలుగా అందుకు ఆయన ఏం చేస్తున్నారో చూస్తున్నాం. అందరూ గట్టిగా నిలబడాల్సిన సమయం వచ్చింది. 2019 తర్వాత చంద్రబాబు రెండు మూడేళ్లపాటు అసలు కనపడలేదు. తర్వాత కూడా రకరకాల రాజకీయాలు చేస్తూ వచ్చారు. మనం ఎప్పుడూ జనంలోనే ఉన్నాం. ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకోవాల్సిన అవసరం వచ్చింది..మన సంక్షేమ పథకాల వలన ప్రజల్లో కూడా చెక్కుచెదరని అభిమానం ఉంది. ప్రజల కోసం మళ్లీ మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంలో మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకోవటానికి దోపిడీలు చేసేస్తున్నారు. 2014-19 మధ్యలో ఉన్నట్లు కొంతైనా మొహమాటం కూడా లేకుండా దోపిడీ చేస్తున్నారు..ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. సీఎంగా ప్రమాణం చేయకముందే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారు. ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో అక్రమాలు చేశారు. అధికారంలోకి వచ్చాక రోజుకొక కొత్త ఇష్యూతో రచ్చ చేస్తున్నారు. చివరికి తిరుపతి లడ్డూ మీద కూడా రాజకీయం చేశారు. జగన్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తే.. చంద్రబాబు అన్నిటినీ ప్రయివేటు పరం చేస్తున్నారు. పోర్టులు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, చివరికి రోడ్లు కూడా ప్రయివేటు పరం చేస్తున్నారు. వచ్చిన మెడికల్ కాలేజీ సీట్లను పోగొట్టారు. ఐదు, ఆరు వందల మంది విద్యార్థులకు అన్యాయం చేశారు..ఇప్పుడు ఏం చేసినా జనం ఏమీ పట్టించుకోరని, ఎన్నికల నాటికి అన్నీ మర్చిపోతారని చంద్రబాబు భావిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. మన హయాంలో చేసిన మంచి పనులు ప్రజల్లో ఇంకా ఉన్నాయి. మన పార్టీ కార్యకర్తలు, నాయకులకు జనంలో గౌరవం ఉంది. పార్టీ కార్యకర్యక్రమాలను ప్రతిస్థాయిలోనూ గట్టిగా తీసుకెళ్లాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్వీప్ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా ఎవరూ వెనుకడుగు వేయలేదు. కార్యకర్తలు కసిగా పనిచేసి 2019లో గెలిపించారు. మనవెంట నడుస్తున్న వారి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: ఇక ప్రజా పోరాటాలే.. 4న వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి సమావేశం..ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండలాధ్యక్షులకు ఇకనుంచి కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. అనేక అభివృద్ది కార్యక్రమాలను భుజాన వేసుకుని ఐదేళ్లలో పూర్తి చేయాలనే తపనతో పని చేశాం. దానివలన కొన్ని సమస్యలు వచ్చిన మాట నిజమే. ప్రభుత్వ పనిలో పడి, పార్టీకి ఏం అవసరమో అది చేయలేకపోయాం. ఇకమీదట అలా ఉండదు. మీకే ప్రాధాన్యత ఉంటుంది...ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపాల్సిన బాధ్యత ఇప్పుడు మనమీద ఉంది. జడ్పీ అధ్యక్షులతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. సోషల్ మీడియాను యాక్టీవ్ చేయాల్సిన అసవరం ఉంది. సమస్యల మీద ఎంపీపీలు కూడా చిన్న వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టాలి. ఎంపీపీలందరితోనూ వైఎస్ జగన్ సమావేశమయ్యే ఏర్పాటు కూడా చేద్దాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్‌గా సజ్జల
-
వైఎస్సార్సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్‌గా సజ్జల
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా నియమించారు.అంతకుముందు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరు రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ (శ్రీకాకుళం జిల్లా), బొడ్డేడ ప్రసాద్, (అనకాపల్లి జిల్లా) నియమితులయ్యారు. కాగా, ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను నియమించిన సంగతి తెలిసిందే.


