రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సజ్జల
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం
భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి,అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సీఎం చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం తాడేç³ల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ భవిష్యత్ కార్యాచరణపై కీలక సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించారు. జిల్లాల స్థాయిలో టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేసుకుని కార్యాచరణ చేపట్టాలని, వచ్చే రెండు మూడు నెలలు ప్రతి వారం పది రోజులకు ఒకసారి జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని, విద్యారి్థ, యువజన, రైతు విభాగాలను మరింత భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.
రాయలసీమ జిల్లాల్లో ప్రతి ఇంటికి కరపత్రాల ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఆగిపోవడం వల్ల జరుగుతున్న నష్టం, ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల జరుగుతున్న అన్యాయాలను తెలియజేయాలని, అల్మట్టి ఎత్తుపెంపు, పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టం తదితర అంశాలపై జిల్లాల్లో సమావేశాలు నిర్వహించుకుని కార్యాచరణ రూపొందించుకోవాలని సమావేశం తీర్మానించింది.
రాష్ట్రస్థాయిలో సమన్వయం చేసే బాధ్యతను మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌కు అప్పగించారు. సమావేశంలో పార్టీ నాయకులు సాకే శైలజానాథ్, ఎస్‌వీ సతీష్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఉషాశ్రీచరణ్, భూమన కరుణాకర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మలసాని మనోహర్‌రెడ్డి, జిన్నూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.


