ఎస్ఐఆర్‌పై అలర్ట్‌గా ఉండాలి: సజ్జల | Sajjala Ramakrishna Reddy Meeting With Key Ysrcp Leaders | Sakshi
Sakshi News home page

ఎస్ఐఆర్‌పై అలర్ట్‌గా ఉండాలి: సజ్జల

May 6 2026 7:09 PM | Updated on May 6 2026 7:24 PM

Sajjala Ramakrishna Reddy Meeting With Key Ysrcp Leaders

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కీలక నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ(మే 6, బుధవారం) జూమ్ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యకులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్) మెంబర్లతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సవరణ)పై మరింత అప్రమత్తంగా ఉండాలని.. 175 అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలి. అందుకు అవసరమైన టెక్నికల్ నాలెడ్జ్‌ను పెంచుకోవాలని సూచించారు. ‘‘ఎస్ఐఆర్ పేరుతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో 90 లక్షలకు పైగా(బెంగాల్‌, తమిళనాడు)లో తొలగించడం జరిగింది. మనం వైఎస్సార్సీపీ ఓటర్లు, సానుభూతిపరుల ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఒకసారి ఓటు తొలగిస్తే తిరిగి చేర్చడం ఇబ్బందికరం’’ అని సజ్జల పేర్కొన్నారు.

‘‘వైఎస్సార్‌సీపీ ఓటర్లపై చంద్రబాబు, ఆయన టీమ్‌ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. బీఎల్ఓలపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కావున మన తరుపున ఉండే బీఎల్ఏలు కూడా సమర్థుడై, బీఎల్వోతో సమన్వయం చేసుకోవాలి. మనం ఎస్ఐఆర్‌ను అవకాశంగా తీసుకుని మన ఓటర్లను కాపాడుకోవాలి. బీఎల్ఓలు ఇప్పటికే మ్యాపింగ్‌ చేశారు.. కావున మనం ఏర్పాటుచేసుకున్న బీఎల్ఏలు కూడా అందుకు సన్నద్దంగా ఉండాలి. ఎస్ఐఆర్‌ మొదలయ్యోలోగా మనం అందుకు అవసరమైన విధంగా సిద్దంగా ఉండాలి. 

బీఎల్ఏలు సాంకేతికపరంగా ఎక్స్‌పర్ట్‌ అయి ఉండి అందరితో సమన్వయం చేసుకోవాలి. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ సిద్దంగా ఉంటుంది. బీఎల్ఏలకు అవసరమైన ఓరియెంటేషన్‌ కూడా ఇద్దాం. మనం నిరంతరం దీనిపై దృష్టిపెడితే సార్వత్రిక ఎన్నికలను సులువుగా గెలవచ్చు. అంతేకాక స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనం విజయం సాధించవచ్చు. ఎస్ఐఆర్‌ పై చర్చ అనంతరం రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఈ వారంలో వచ్చేవారం ఆసుపత్రుల సందర్శన, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం వంటి కార్యక్రమాలను మనం షెడ్యూల్ చేసుకున్నాం. అందరితో సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాలి.

కమిటీల వెరిఫికేషన్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తోంది, మీరు మరింత వేగవంతం చేయాలి. అందుకు అవసరమైన సపోర్టింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. మనకు సంబంధించి ప్రతి కార్యక్రమం కూడా మీడియాలో, సోషల్ మీడియాలో హైలెట్ చేసుకోవాలి. మన ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచి, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. చంద్రబాబు ప్రభుత్వ దోపిడీ, ఉన్మాదం, అవినీతి, రెడ్ బుక్ పాలనపై కూడా నియోజకవర్గాల్లో మీరు కార్యక్రమాల ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ విషయంలో జిల్లా అధ్యక్షులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.

ఈ సమావేశంలో మాట్లాడిన కన్నబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, వరికూటి అశోక్ బాబు, అబ్బయ్య చౌదరి, కొరుముట్ల శ్రీనివాసులు, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మల్లాది విష్ణు ఎస్‌ఐఆర్‌పై తమకు ఉన్న అవగాహన, అనుమానాలపై చర్చించి పార్టీ క్యాడర్‌ అంతా అప్రమత్తంగా ఉండాలని, ఎస్ఐఆర్‌ పూర్తయ్యేవరకు ఏ మాత్రం అజాగ్రత్త లేకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement