తాడేపల్లి: పక్క రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ ఎక్కడ లేని పెట్రోల్, డీజిల్ కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందని నిలదీశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కావాలనే ఏపీలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించిందని, అందుకు కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు.
ఏపీలోని పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై తాడేపల్లి నుంచి మాట్లాడిన సజ్జల.. ‘పెట్రోల్,డీజిల్ కొరతలో ఏపీలో ప్రజా జీవనం స్తంభించింది. ఏపీలో పెట్రోల్ కొరత తీవ్రంగా ఉంది. నాలుగైదు రోజులుగా పెట్రోల్ కొరత ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా అక్కడ కొరత లేదు.
ఏపీలో పెట్రోల్,డీజిల్ కొరతకు కూటమి ప్రభుత్వమే కారణం. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన సంక్షోభం. ఇక్కడ పానిక్ భయంతో.. 0 సంక్షోభం అంతా మీరు క్రియేట్ చేసిందే. కావాలనే ఏపీలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించారు. సమస్య పరిష్కరించకుండా ఏదో మాట్లాడుతున్నారు. 24న సివిల్ సప్లై కమిషనర్ ఆయిల్ కంపెనీలకు లేఖ రాశారు. అమరావతి పనులకు పెట్రోల్, డీజిల్ కేటాయించాలని కోరారు.
ఇది చట్టానికి విరుద్ధమని ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని కేంద్రం సూచించింది. మరో 20 ఏళ్ల రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లడంలో బాబు సిద్ధహస్తుడు. డీజిల్ తీసుకురాని వాళ్లు.. పరిశ్రమలు ఏం తీసుకొస్తారు?’ అని ప్రశ్నించారు.


