
సాక్షి,విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వ కుట్రలు పరాకాష్టకు చేరాయి. కక్షసాధింపు కుతంత్రాల్లో తాజా అంకానికి టీడీపీ కూటమి సర్కారు తెరతీసింది. వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టుకు తెగబడింది. ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుపై వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పుడు కేసు సృష్టించి పరాకాష్టకు తీసుకెళ్తున్నారు.చంద్రబాబు సృష్టించిన కట్టు కథ, తప్పుడు కేసు.ఈ కేసులో మా పార్టీ సీనియర్ లీడర్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు.లిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబు హయాంలో జరిగింది.ఏడాదికి 1300 కోట్లు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశాడు.40 వేలకు పైగా బెల్టు షాపులు పెట్టారు.4,5 డిస్టీలరీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారు.
తన హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్‌పై బయట ఉన్నాడు. ఈసారి మరింత బరి తెగించి స్కామ్ చేస్తున్నారు. సినిమా రచయిత రాసినట్టు ఇష్టానుసారం దీనిలో పాత్రలు సృష్టిస్తున్నారు.ఈ మద్యం కేసులో ఒక్క ఆధారం కూడా లేదు.ఆధారాలు ఇంకా సంపాదిస్తాం అంటారు.ప్రయివేటు మద్యం షాపులు ప్రభుత్వంలోకి మారిస్తే స్కామ్ ఎలా అవుతుంది..?మధ్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఆధీనంలోకి షాపులు తెచ్చాం. చంద్రబాబు పాలన కంటే మా హయాంలో మద్యం వినియోగం తగ్గింది.రూ.50 వేల కోట్లు అని మొదట అన్నారు. ఇప్పుడు రూ.3 వేల కోట్లు అంటున్నారు.
రూ3 వేల కోట్లను 30 రకాలుగా చెప్తున్నారు.డబ్బు ఎక్కడుంది అంటే..మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు.టివి సీరియల్లా సాగదీస్తున్నారు.ఏమి ఆధారాలు లేక...ఇప్పుడు సాక్ష్యాలు లేకుండా చేశారని అంటున్నారు.ప్రజల నుండి వచ్చే ప్రశ్నలు తప్పించుకోవడానికి ఈవిధంగా చేస్తున్నాడు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అన్ని ఆధారాలతో అరెస్ట్ అయ్యాడు. ప్రభుత్వం నిధులు దారిమళ్లించిన ఆధారాలు ఉన్నాయి.కేంద్ర ఏజెన్సీ విచారణలో స్కిల్ స్కామ్ వెలికి తీసింది.ఇక్కడ లిక్కర్ కేసులో ఒక్క ఆధారం లేదు
అన్యాయంగా అందరిని అరెస్ట్ చేస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన అందరి ఉసురు చంద్రబాబు కుటుంబానికి కొడుతుంది.ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కొంటాం.పోరాడుతాం. కేసులో ఏమి లేదు..పునాది లేదని..ఈరోజు తేలిపోయిందని’ ధ్వజమెత్తారు.