
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను గట్టిగా నిరసించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రేపటి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగే నిరసనలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి.. టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను గట్టిగా నిరసించాలి. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టాలిపార్టీ కమిటీల నియామకం నవంబర్ 20 నాటికి పూర్తి చేయాలి. పార్టీ సంస్థాగత బలోపేతంపై సీరియస్‌గా దృష్టిపెట్టాలి. నిబద్దతతో, చురుగ్గా పని చేసే వారికి కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వండి. పుంగనూరు, మడకశిర నియోజకవర్గాల తరహాలో కమిటీల నెట్‌వర్కింగ్ సిస్టమ్ అన్ని నియోజకవర్గాల్లో జరగాలి’ అని పేర్కొన్నారు.