తాడేపల్లి : అమరావతి పేరుతో బారీ దోపిడీ జరుగుతోందని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలన్నారు సజ్జల. ఈ రోజు(శనివారం, ఏప్రిల్ 11వ తేదీ) తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ఆర్టీఐ విభాగం రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల మాట్లాడుతూ..
‘ప్రజాసమస్యలపై బలమైన గళం వినిపించాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు సిద్ధంగా ఉండాలి. సిస్టమాటిక్‌గా అవినీతి, దోపిడీ జరుగుతోంది. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జరుగుతున్న అవినీతి దాచిపెడుతున్నారు. జగన్‌పై ఇంకా తప్పుడు ప్రచారం కొనసాగుతోంది. 2047 పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు.
రాజధాని పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది. లక్షల కోట్ల రూపాయిల అవినీతికి రంగం సిద్ధమైంది. అమరావతి పేరుతో దోపిడీ కొనసాగుతోంది. ఉద్యమంలా అవినీతిని ఎండగట్టేందుకు సిద్ధం కావాలి’ అని సజ్జల పిలుపునిచ్చారు.


