విశాఖ: మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధన్యవాదాలు తెలియజేశారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో మహిళలకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారన్నారు వరుదు కళ్యాణి.
ఈ రోజు(శనివారం, ఏప్రిల్ 11వ తేదీ) విశాఖ నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు వరుదు కళ్యాణి. ‘ దేశంలో ఏ నాయకుడు ఇవ్వలేనన్ని పదవులు మహిళలకు వైఎస్ జగన్ ఇచ్చారు. దేశం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. నామినేటెడ్ పదవులు పనుల్లో మహిళలకు పెద్ద పీట వేశారు. మహిళకు 50 శాతం పదవులు, నామినేట్ పనులు కట్టబెడుటు అసెంబ్లీలో చట్టం చేశారు. మహిళలు కోసం వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించారు. చట్ట సభల్లో మహిళలకు కీలకమైన పదవులు అప్పగించారు.
జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 50% పైగా మహిళలకు ఇచ్చారు. మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించారు. వైఎస్ జగన్ పాలనలో మహిళలు మహారాణుల్లా బతికారు. మహిళల కోసం దిశ చట్టాన్ని యాప్, పోలీస్ స్టేషన్ తెచ్చారు. కుటమి పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి.. ఎమ్మెల్యేలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మహిళలంతా జగనన్నకు రుణపడి ఉంటారు’ అని తెలిపారు. ఇక చంద్రబాబు పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని వరుదు కళ్యాణి విమర్శించారు.


