‘తెలంగాణలో రేవంత్‌ పని అయిపోయింది’ | Former Congress Leader Jeevan Reddy Slams Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘తెలంగాణలో రేవంత్‌ పని అయిపోయింది’

Apr 11 2026 4:11 PM | Updated on Apr 11 2026 4:39 PM

Former Congress Leader Jeevan Reddy Slams Revanth Reddy

జగిత్యాల:  సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలపై కాంగ్రెస్‌ మాజీ నేత జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో  ఇక రేవంత్‌ పని అయిపోయిందంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు.   తెలంగాణలో తదుపరి వచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమేని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక తాను పీసీసీ ప్రెసిడెంట్‌ కాకుండా అడ్డుకున్నది  జానారెడ్డినే అంటూ మండిపడ్డారు. 

ఈరోజు(శనివారం, ఏప్రిల్‌ 11వ తేదీ) జగిత్యాల నుంచి మీడియా మాట్లాడిన జీవన్‌రెడ్డి.. ‘ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్రానికి షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు. 

తెలంగాణ షాడో సీఎం చంద్రబాబు..
కాంగ్రెస్‌లో చేరేటప్పుడు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న రేవంత్‌ శానసమండలి చైర్మన్‌కు రాజీనామా లేఖ పంపకుండా చంద్రబాబుకు పంపినప్పుడే ఆయన విధేయత అర్థమైంది. ఇప్పుడున్నది ఒర్జినల్ కాంగ్రెస్ కాదు. దానికి ప్రధాన కారకుడు సీఎం రేవంత్. మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఏడు శాసనసభ స్థానాల్లో ఎక్కడా గెలిపించుకోలేని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. 

ముఖ్యమంత్రి అయినాక కూడా మహబూబ్ నగర్ లో వంశీచంద్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకోలేని అసమర్థ నాయకుడు రేవంత్. నేను పార్టీ నుంచి వెళ్లిపోవడానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ని ఓ టూల్‌గా వాడారు. నేను పీసీసీ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్నది జానారెడ్డి. ఉప ఎన్నిక నేపథ్యాన్ని ముందుపెట్టి జానారెడ్డి నన్ను అడ్డుకున్న కుట్రదారులు. కేసీఆర్ దగ్గరకు వెళ్లితే ఏమవుతుందో తెలుసానని చాలామంది మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం చేశాడు, తుమ్మలను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశాడు, కేకేను సెక్రటరీ జనరల్ చేశాడు, ఆయన కూతురికి మేయర్ ఇచ్చాడు. ఇంకేం కావాలి..?, ప్రజల్లో బీఆర్ఎస్ రావాలనే చర్చ ఉధృతంగా జరుగుతోంది

కేసీఆర్ తో దోస్తీ...రేవంత్ తో కటీఫ్.. పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ..

కాంగ్రెస్‌పై సమరశంఖం పూరిస్తా..
రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీపై సమరశంఖం పూరిస్తానని జీవన్‌రెడ్డి తెలిపారు. జీవన్ రెడ్డి ఎవరో సంధించే అస్త్రం కాదు.. జీవన్ రెడ్డే అస్త్రాలు సంధించే నాయకుడన్నారు. ఈనెల ఏప్రిల్ 20వ తేదీన కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకుంటా. భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతారు’ అని పేర్కొన్నారు. 

చిన్నారెడ్డికి టిక్కెట్‌ ఇస్తానని మొండిచేయి చూపించారని. రాజ్యసభ ఇస్తానని చెప్పి రేవంత్‌ అనుచరుడికి కట్టబెట్టారన్నారు.  ఇవన్నీ కాంగ్రెస్‌ దృష్టికి తీసుకెళ్లానని, లేఖలు రాశానన్నారు. కాంగ్రెస్‌ వైఖరితో తీవ్రంగా కలత చెందే రాజీనామా చేశాననన్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement