సింగర్‌ మంగ్లీపై చీటింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! | Singer Mangli filed a police complaint against lawyer Subbarao at Narsingi police station | Sakshi
Sakshi News home page

సింగర్‌ మంగ్లీపై చీటింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌!

Apr 11 2026 4:12 PM | Updated on Apr 11 2026 4:26 PM

Singer Mangli filed a police complaint against lawyer Subbarao at Narsingi police station

సాక్షి,హైదరాబాద్‌: సింగర్‌ మంగ్లీపై చీటింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తనపై ఆరోపణులు చేస్తున్న న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆ ఫిర్యాదులో రూ.10కోట్ల మేర మోసం చేసినట్లు.. నాపై లాయర్‌ సుబ్బారావు దుష్ప్రచారం చేస్తున్నారు. గతనెల 21న తానే పరిచయం చేసుకుని అమర్యాదగా మాట్లాడారు. తనను కలవాలని ఒత్తిడి చేశారు.. నేను నిరాకరించా. నోట్ల కట్టల వీడియో చూపించి నన్ను బెదిరించారు. సుబ్బారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరా’నని తెలిపారు. మంగ్లీ ఫిర్యాదుతో న్యాయవాది సుబ్బారావుపై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 79,351(3)కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

అంతకుముందు.. మంగ్లీపై ఆరోపణలు చేస్తూ సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. మంగ్లీ పేరుతో మోసం చేశార‌ని రెండు నెల‌ల క్రితం బాధితులు న‌న్ను క‌లిశారు. విచార‌ణ చేప‌ట్ట‌గా ఈ మోసంలో మంగ్లీతో పాటు ఆమో సోద‌రుడు శివ‌,మ‌ధు ఉన్న‌ట్లు తేలింది. బాధితులు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం మంగ్లీని క‌లిసే ప్ర‌య‌త్నం చేశా. మంగ్లీతో మాట్లాడిన స‌మ‌యంలో చాలా యార‌గెంట్‌గా మాట్లాడారు. ప్ర‌ధాన నిందితుడు మ‌ధు రూ.200కోట్ల  పెట్టుబ‌డి రూపంలో సేక‌రించారు. భారీ లాభాలు ఇస్తాయ‌ని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. పెట్టుబడి కూడా ఇవ్వకపోవడంతో బాధితులు మమ్మల్ని కలిశారు. కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే పేరు చెప్పి న‌న్ను బెదిరించారు. ఇప్ప‌టికే బెదిరింపుల మీద కేసు న‌మోదైంది. సివిల్ కేసు కూడా ఫైల్ చేస్తాం. తెలుగు రాష్ట్రాల‌తో పాటు క‌ర్ణాట‌క‌లోనూ బాధితులు ఉన్నారని వ్యాఖ్యానించారు. 

సింగర్‌ మంగ్లీపై కేసు
సింగర్‌ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్‌ పేరిట రూ.10 కోట్లు మోసం చేశారని.. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. దీంతో మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement