రక్తపు మడుగులో: ఏపీ టెకీ రిషి కేష్‌ హత్య కలకలం | Andhra pradesh telugu Techie Found Dead in Haryana Panchkula | Sakshi
Sakshi News home page

రక్తపు మడుగులో: ఏపీ టెకీ రిషి కేష్‌ హత్య కలకలం

Apr 11 2026 3:36 PM | Updated on Apr 11 2026 4:01 PM

Andhra pradesh telugu Techie Found Dead in Haryana Panchkula

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, గుడివాడ పట్టణానికి చెందిన ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హర్యానాలోని పంచకుల జిల్లాలో శుక్రవారం ఉదయం హత్యకు గురయ్యాడు.  పదిరోజుల క్రితమే కంపెనీలో చేరిన యువ ఇంజనీర్ బండ్ల రిషికేష్ (27) రక్తపు మడుగులో కనిపించిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

రిషికేష్  పంచకులలోని 'వేది టెక్నాలజీస్' అనే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. అతను సుమారు పది రోజుల క్రితం కంపెనీలో చేరడానికి ఇంటి నుండి బయలుదేరాడు. అయితే అనూహ్యంగా కన్నుమూసిన వైనం కుటుంబంలో  తీవ్ర దిగ్భ్రాంతి  రేపింది. కంపెనీ అందించిన వసతి గృహంలో రిషికేష్ రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉండటాన్ని అతని సహోద్యోగులు కనుగొన్నారు. కంపెనీ యాజమాన్యం వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించింది.  హర్యానా పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా, గుడివాడ వన్ టౌన్ పోలీసులు బెతవోలులోని రిషికేష్ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. విధుల్లో చేరిన పది రోజుల్లోనే తమ కుమారుడు విగతజీవిగా మారిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీర వుతున్నారు.  పుట్టెడు  దుఃఖంతో హర్యానాకు బయలుదేరారు. 

ఇదీ చదవండి: నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్‌ చేస్తే!

హర్యానా పోలీసులు ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రిషికేష్‌ చాలా సౌమ్యుడని ప్రాథమిక విచారణ ద్వారా తెలుస్తోంది. సహోద్యోగులతో గొడవలా? పాత కక్షలు ఉన్నాయా?. దోపిడీ ఏమైనా జరిగిందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని, కాల్ డేటా రికార్డులను తనిఖీ చేస్తున్నారు.  లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి బీటెక్ పూర్తి చేసిన రుషికేష్, మెరుగైన అవకాశాల కోసం హర్యానాకు వెళ్లడానికి ముందు మూడేళ్లపాటు హైదరాబాద్‌లో పనిచేసినట్టు లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ వివరాలను బట్టి తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement