ఇరాన్‌తో యుద్ధం, శాంతి చర్చల మధ్య అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2028 అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయడానికి ఆమె రెడీ అవుతున్నారు. గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన కమలా శుక్రవారం న్యూయార్క్‌లో జరిగిన 'నేషనల్ యాక్షన్ నెట్‌వర్క్' (NAN) సదస్సులో తొలిసారి ఆ విషయంపై స్పందించడం గమనార్హం.
2024లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, 2028లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. న్యూయార్క్ నగరంలో రెవరెండ్ అల్ షార్ప్టన్ స్థాపించిన 'నేషనల్ యాక్షన్ నెట్‌వర్క్' సమావేశంలో పాల్గొన్న కమలా హారిస్ తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028లో మళ్ళీ పోటీ చేస్తారా అని ప్రశ్నించినపుడు చేయవచ్చు.. దాని గురించి ఆలోచిస్తున్నాను పోటీ చేసే అవకాశం ఉంది అని హారిస్ సమాధానమిచ్చారు. 2028లో "అమెరికా ప్రజల కోసం" అధ్యక్షుడిగా ఎవరు ఉత్తమంగా పని చేయగలరు అనే దానిని బట్టి తాను పోటీ చేసే విషయాన్ని పరిశీలిస్తానని హారిస్ తెలిపారు. ఈ సమాధానంతో అక్కడికి వచ్చిన వారంతా హర్షధ్వానాలు చేశారు. 2028 నాటికి అమెరికా ప్రజల కోసం ఎవరు అత్యుత్తమంగా పనిచేయగలరు అనే కోణంలోనే తన పోటీపై నిర్ణయం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చాలా మంది ప్రజలకు సంతృప్తిని ఇవ్వడం లేదని, మార్పు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. "స్టేటస్ కో" ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని, ప్రజల కోసం చేయాల్సిన పని ఇంకా చాలా ఉందని కమలా హారిస్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
BREAKING - Kamala Harris just now:
"So while [Trump] struts around boasting about how he will annihilate a whole people, what he is in fact doing, is making us weaker, unreliable and less influential."
BRAVO!! pic.twitter.com/hySsz9ZPr5— Brian Krassenstein (@krassenstein) April 10, 2026
"> ఈ సమావేశానికి కమలా హారిస్‌తో పాటు 2028లో అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం ఉన్న ఇతర కీలక డెమోక్రాటిక్ నేతలు కూడా హాజరు కావడం విశేషం. వీరిలో పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, మాజీ రవాణా శాఖ కార్యదర్శి పీట్ బుట్టిగీగ్, ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్‌కర్ తదితరులు సహా పలువురు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులున్నారు.
ఇదీ చదవండి: నో మెన్... ఓన్లీ విమెన్ : 300మంది వీడియో వైరల్
2024 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన హారిస్, డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయారు. ట్రంప్ ప్రజా ఓటుతో పాటు ఎలక్టోరల్ కాలేజీని కూడా గెలుచుకున్నారు. హారిస్ గతంలో అమెరికా సెనేటర్‌గా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. హారిస్ ఓటమి తర్వాత, డెమోక్రాటిక్ పార్టీలో కొత్త నాయకత్వం రావాలని మెజారిటీ ఓటర్లు కోరుకుంటున్నట్లు పోలింగ్ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు డెమోక్రాటిక్ పార్టీ తరపున పలువురు రేస్‌లో నిలిస్తే, గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం, ఇజ్రాయెల్‌తో దోస్తీ కారణంగా, రాజకీయపరంగా, పరిపాలనా పరంగా పలు విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కమలా హారిస్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.


