ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ : ఈ షాపింగ్‌మాల్స్‌ అదుర్స్‌ ! | Low Price High Value in these Shopping Malls Are Fantastic At siricilla | Sakshi
Sakshi News home page

ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ : ఈ షాపింగ్‌మాల్స్‌ అదుర్స్‌ !

Apr 11 2026 12:44 PM | Updated on Apr 11 2026 1:12 PM

Low Price High Value in these Shopping Malls Are Fantastic At siricilla

 

పాత బట్టలతో బతుకుబాట

రోజుకో ఊరు.. బతుకుదెరువు పోరు

స్టీల్‌ సామాన్లతో పాతడ్రెస్‌ల సేకరణ

ఆ బట్టలతోనే 40 ఏళ్లుగా బతుకుబాట

సిరిసిల్ల పట్టణంలోని గాంధీచౌక్‌లో డ్రెస్సులు కొనుగోలు చేస్తున్న ఇతను నాగిండ్ల నర్సయ్య(40). కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన నర్సయ్య సిరిసిల్ల లేబర్‌ అడ్డాపై కూలీ పని కోసం వస్తారు. సిరిసిల్లలో ప్రతీ ఆదివారం పాతబట్టలు(డ్రెస్‌లు) అమ్మకాలు సాగుతుంటే తక్కువ ధరకే లభించడంతో పనిలో అక్కరకు వస్తాయని తనకు అవసమైనవి ఇలా కొనుగోలు చేస్తూ ఉంటాడు.

డ్రెస్సులు కొనుగోలు చేస్తున్న ఇతను సోమిడి నగేశ్‌(45). జిల్లా కేంద్రంలోని బీ.వై.నగర్‌కు చెందిన నగేశ్‌ పెయింటర్‌గా పనిచేస్తారు. నిత్యం పనిలో బట్టలపై రంగులు పడడంతో పాడవుతుంటాయి. అందుకే పాత డ్రెస్సులను కొనుగోలు చేసి పనిలో వాడుతుంటారు. డ్రెస్సులు బాగుంటే.. ఫంక్షన్లకు కూడా వినియోగిస్తారు. నగేశ్‌ తనకు కావాల్సిన డ్రెస్సులను ఏళ్లుగా ఇక్కడే కొనుగోలు చేయడం విశేషం.

సిరిసిల్ల: కాటన్‌ జీన్స్‌.. జీన్స్‌.. టీషర్ట్స్‌.. షర్ట్స్‌.. ఇలా అన్ని రూ.150, రూ.100లకే లభిస్తాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రతీ ఆదివారం రోడ్లపైన చౌకధరలకే డ్రెస్సులు లభిస్తున్నాయి. గాంధీచౌక్‌ అడ్డాగా పేదల షాపింగ్‌మాల్స్‌ సందడిగా కనిపిస్తుంటాయి. లేబర్‌ అడ్డాపై పనిచేసే కూలీలు, నిత్యం కష్టమైన పనుల్లో నిమగ్నమయ్యే పేదలు ఇక్కడ సెకండ్‌హ్యాండ్‌ బట్టలను కొనుగోలు చేస్తుంటారు. తక్కువ ధరలకే డ్రెస్సులు వస్తుండడంతో ఆనందంగా రోడ్‌సైడ్‌ షాపింగ్‌ చేస్తున్నారు. 
ఆదివారం.. ఆరు దుకాణాలు

సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్‌ అడ్డాగా ప్రతీ ఆదివారం ఆరు దుకాణాలను సిద్దిపేటకు చెందిన పాతబట్టల వ్యాపారులు వీటిని ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నారు. ప్రతీ ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం వరకు విక్రయాల ద్వారా రోజుకు రూ.1500 నుంచి రూ.3వేల వరకు ఒక్కో దుకాణదారుడికి గిరాకీ అవుతుంది. 

రోజుకో ఊరు
సిద్దిపేటకు చెందిన పాతబట్టల వ్యాపారులు రోజుకో ఊరిలో ఇలా దుకాణాలు పెట్టి పాత డ్రెస్సులు విక్రయిస్తుంటారు. ఆదివారం సిరిసిల్లలో, సోమవారం వేములవాడలో, శనివారం దుబ్బాకలో, శుక్రవారం హుస్నాబాద్‌లో, మంగళవారం చేర్యాలలో రోడ్డుపైనే దుకాణాలు పెట్టి బట్టలను విక్రయిస్తారు. ఇక సిద్దిపేటలో మాత్రం వారం రోజులు నిత్యం పాతబట్టలను అమ్ముతుంటారు. యువకులు ఇలా బట్టలను విక్రయిస్తుంటే.. వారింట్లో మహిళలు.. పట్టణాలు, కాలనీల్లో తిరుగుతూ పాతబట్టలకు స్టీల్‌ సామాన్లు ఇస్తామంటూ వాటిని సేకరిస్తారు. అలా సేకరించిన బట్టలను శుభ్రంగా ఉతికి, ఆరబెట్టి, ఇస్త్రీ చేసి విక్రయాలకు సిద్ధం చేస్తారు. ఇలా రోజుకో ఊరిలో వ్యాపారం చేస్తూ బతుకుదెరువు సాధిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఈ పాతబట్టల వ్యాపారులు పాతిక కుటుంబాలు సిద్దిపేటలో స్థిరపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement