వైఎస్‌ జ‌గ‌న్ పాల‌న‌లోనే బీసీల‌కు న్యాయం | Jyotirao Phule Jayanti At The YSRCP Central Office Tadepalli | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జ‌గ‌న్ పాల‌న‌లోనే బీసీల‌కు న్యాయం

Apr 11 2026 12:34 PM | Updated on Apr 11 2026 3:52 PM

Jyotirao Phule Jayanti At The YSRCP Central Office Tadepalli

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతీరావ్ పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బీవై రామయ్య, నారాయణమూర్తి, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, రమేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. 2019 నుంచి 24 వరకు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్. ఐదేళ్ల పరిపాలన కాలంలో చదువుకు పెద్దపీట వేశారన్నారు.

మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించాం. సంఘ సంస్కర్త, సామాజికవేత్త జ్యోతి రావు పూలే.. సమాజం కోసం అహర్నిశలు పాటు పడిన వ్యక్తి పూలే అయితే, ఆయన ఆశయాలని అమలు చేసిన మహనీయుడు వైఎస్సార్‌. సామాజిక న్యాయం ఉంటే చంద్రబాబు చెప్పాలి. సవాల్ స్వీకరించాలి. నలుగురు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వైఎస్‌ జగన్‌.. డిప్యూటీ సీఎం ఇచ్చారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేకపోయాడు. సామాజిక న్యాయం చేస్తా బీసీలే నా వెన్నుముకని చెప్పిన చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. యావద్దేశం జ్యోతిబాపూలేకి ఘనమైన నివాళులర్పిస్తుంది. అనేక సంస్కరణలకు మూలపురుషుడు జ్యోతిరావు పూలే. చంద్రబాబు క్యాబినెట్‌లో 8 మంది బీసీలు ఉంటే జగన్ క్యాబినెట్‌లో 11 మంది బీసీలు ఉన్నారు. రాజ్యసభ సీట్ల కేటాయింపులో కూడా  బీసీలకు పెద్ద పేట వేశారు. డీబీటీ ద్వారా లక్షలా కోట్ల రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్ వేశారు. అన్ని పదవుల్లో పారదర్శకంగా  వ్యవహరిస్తూ 50 శాతం సీట్లు బీసీలకు ఇచ్చారు. చంద్రబాబు బీసీలకు వ్యతిరేకి.. సీనియర్ ఎందుకు పక్కన పెట్టాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి. బీసీలు స్థితిగతులు మెరుగుపడాలంటే.. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే అది వైఎస్సార్‌సీపీలోనే సాధ్యం.

లోకేష్ కి చిప్ దొబ్బింది అంటే... జోగి రమేష్ స్ట్రాంగ్ వార్నింగ్

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement