
తాడేపల్లి : బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 11) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం జరిగింది.
దీనికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఎమ్మెల్సీ బీసీ విభాగం అధ్యక్షుడు రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెండ్ నౌడు వెంకట రమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకం రెడ్డి నారాయణమూర్తి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆలూరు సాంబ శివారెడ్డి సహా బీసీ కులాల సాధికర అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మేరకు మాట్లాడిన సజ్జల ఏమన్నారంటే.. ‘ బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ జగన్ మాత్రమే. అన్ని కులాలను గుర్తించి ప్రత్యేకంగా కార్పోరేషన్లు సైతం ఏర్పాటు చేయించారు. ఒక సమగ్ర విధానం ద్వారా బీసీలందరికీ అభివృద్ధి ఫలాలను అందించారు
బీసీలందరినీ చైతన్య పరిచి మళ్లీ ఏకతాటి మీదకు తీసుకు రావాలి. మన హయాంలో జరిగిన అభివృద్ధిని అందరికీ వివరించాలి. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై విసుగు చెందారు. టీడీపీ నేతలు చేస్తున్న ఫేక్ ప్రచారాలను తిప్పి కొట్టాలి’ అని సూచించారు.
