తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబుది దాపరికం లేని బహిరంగ దోపిడీ అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అమరావతిలో చిన్న చిన్న పనులకు వందల కోట్లు ఖర్చు చేయడం బహిరంగ దోపిడీకి నిదర్శమన్నారు. తన సంపద సృష్టికోసమే అమరావతినే చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు.
ఈరోజు(శుక్రవారం, మే 1వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన సజ్జల.. ప్రజల సొమ్మును చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ట్విన్ టవర్స్ పేరుతో మరో రూ. 12 వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కేవలం అసెంబ్లీ సచివాలయం భవనాల అద్దాల కోసం రూ. 3 వ వేల కోట్లు ఖర్చా?, చిన్న చిన్న పనులకే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. టెండర్లకు కేబినెట్ ఆమోదం ఏమిటో నాకు అర్థం కావడం లేదు.
కేబినెట్ ఎప్పుడు జరిగినా ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు ఉండవు. భూముల కేటాయింపులు, రాజధాని నిధులపైనే నిర్ణయాలు ఉంటున్నాయి. అమరావతిని తన సంపద సృష్టికోసం వాడుకుంటున్నారు.
తనకు కావాల్సిన వాళ్లు లే ఔట్లకు అనుమతులు ఇస్తున్నారు. అమరావతి అద్భుత నగరం కాబోతుందని నమ్మిస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే దళారీ వ్యవస్థ మొదలైంది. ఇప్పుడు బాబు హయాంలో దళారీ వ్యవస్థ తారాస్థాయికి చేరింది. ఈ దుబారా ఖర్చు తప్పితే ఇప్పటివరకూ రైతులకు మద్దతు ధర లేదు’ అని విమర్శించారు.
సజ్జల ఏమన్నారంటే..
- మావిగన్ ప్రతిపాదనకు ప్రజల్లో సానుకూలత వచ్చింది
- ఎల్లీ బ్యాచ్ దీన్ని తట్టుకోలేక జగన్, ఆయన కుటుంబ సభ్యులను దూషించారు
- మావిగన్ మొదటి రోజు నుండే రాజధానిగా మారుతుంది
- అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఉండదని అందరికీ తెలిసిపోయింది
- అందుకే టీడీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేశారు
- అమరావతిలో సెక్రటరియేట్ భవనాల అద్దాలకు రూ.2,540 కోట్లా?
- దీనికి క్యాబినెట్ ఆమోదం తెలపటమా?
- ఇది చూసి జనం బిత్తరపోతున్నారు
- బిల్డింగుల నిర్మాణమే అడుగుకు ప్రస్తుతం రూ.12 నుంచి రూ 14 వేలు అయింది
- ఈ అద్దాలకు అయ్యే ఖర్చు అదనం
- ఇదంతా కలుపుకుంటే రూ.18 వేలకు ఒక్కో అడుగుకు ఖర్చు అవుతోంది
- ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ లో కూడా ఇంత ఖర్చు కాదు
- పాలవాగు డిజైన్ త్వరలోనే రూపొందిస్తారట
- బిల్డింగుల చుట్టూ తిరుగుతూ పాలవాగు వెళ్తుందంట
- దానికి ఇంకెంత ఖర్చు చేస్తారో తెలియదు
- ట్విన్ టవర్ పేరుతో మరో రూ.12 వందల కోట్లు ఖర్చు
- నగిషీలు, డిజైన్లు, అద్దాలు.. ఖర్చులు ఇది నిరంతరమైన ప్రక్రియ
- ప్రజల సొమ్మును అమరావతిలో కృష్ణానదిలా పారిస్తున్నారు
- అమరావతి పూర్తికాకూడదు, అది నిరంతర ప్రక్రియలా ఉండాలని చూస్తున్నారు
- దీని ద్వారా సంపద సృష్టించుకోవాలన్నది చంద్రబాబు ప్లాన్
- టెండర్లకు క్యాబినెట్ అప్రూవల్ ఏంటో అర్థం కాదు
- గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వమూ అలా చేయలేదు
- ప్రజలకు పనికి వచ్చే ఏ పని గురించి క్యాబినెట్ లో చర్చించలేదు
- అమరావతిలో దోచుకోవటానికి అవకాశం కల్పించినందున అక్కడి రైతులు అదృష్టవంతులంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు
- రెండో దశ ల్యాండ్ పూలింగ్ 13వ తేదీనుంచి ప్రారంభించారు
- దానికంటే ముందే ఆరో తేదీన లే అవుట్లకు అనుమతులు ఎలా ఇస్తారు?
- రైతులు భూములు ఇచ్చిన వారికి ఏం ప్రయోజనం చేయలేదు
- కానీ తనకు కావాల్సిన వారి లేఅవుట్లకు ఎలా అనుమతులు ఇస్తారు?
- ఇంత బరితెగింపు దేశంలో ఎక్కడా జరగటం లేదు
- ఈదోపిడీకి దేవతల రాజధాని అని అందమైన పేరు పెట్టుకున్నారు
- మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు ఇవ్వట్లేదు
- రైతులకు మద్దతు ధర లేదు
- ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు లేవు
- కానీ అమరావతిలో దోచుకునేందుకు మాత్రం భారీగా నిధుల విడుదల చేస్తున్నారు
- ఇంధన సంక్షోభం సృష్టించి మరీ దోపిడీ చేశారు
- ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ దోపిడీ చేస్తూనే ఉన్నారు
- రాజధానిలో పేదలకు యాభై వేల ఇళ్ల పట్టాలు ఇస్తే దాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది
- పేదల స్థలాలను నిర్దాక్షిన్యంగా లాగేసుకున్నారు
- చంద్రబాబు చేసే దోపిడీని అడ్డుకుంటున్నందుకు మమ్మల్ని విలన్ లాగా చూస్తున్నారు
- వారిని ప్రశ్నించిందుకు మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటున్నారు
- మేము అలాంటి వాటిపై స్పందించం
- ప్రజా సమస్యలు, అవినీతిపై నిలదీస్తాం
- అసలు అద్దాల కోసం రూ.2,540 కోట్లు ఖర్చు చేయటం ఏంటి?
- అమరావతిలో మీడియా వాళ్లు వెళ్లే పరిస్థితే ఎందుకు లేదు?
- అక్కడేమైనా అణుకేంద్రాలు కడుతున్నారా?
- ప్రజల సంక్షేమాన్ని వదిలేసి వారిని జలగల్లాగ పట్టి రక్తం పీల్చుతున్నారు
- పూడి శ్రీహరిపై ప్రభుత్వం వేధింపులకు దిగింది
- ఒకే ఇష్యూ మీద ఎన్ని కేసులు పెడతారు?
- దీనిపై హైకోర్టు ఒకటి కంటే ఎక్కవ ఎఫ్ఐఆర్ లు పెట్టవద్దని కూడా చెప్పింది
- ఐనప్పటికీ పోలీసులు బరితెగింపుకు నిదర్శనమే
- ఆటోలో, అంబులెన్సులో ఎక్కించుకుని శ్రీహరిని తిప్పారు
- ఇలాంటి బెదిరింపులకు ఎవరూ లెక్కచేయరు
- చంద్రబాబు, లోకేష్ గుర్తు పెట్టుకోండి.. మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తాం
- ఆ శక్తి వైఎస్సార్‌సీపీకి ఉంది
- తిరుమల లడ్డూపై చేసింది కల్పిత గాధ
- దేవుని సొమ్ముని దోచుకోవటానికి అల్లిన కథ ఇది
- దినేష్ కుమార్ కమిషన్ రిపోర్టులో మాపై ఆరోపణలు చేయలేదు
- నెయ్యి కాంట్రాక్టును పెంచుకోవటానికే ఈ మొత్తం కథ నడిపారు
- ఒక్క సంవత్సరంలోనే డబుల్ రేటు చేశారు
- ధర పెంచి దేవుని సొమ్ము దోచుకోవటానికి పన్నిన కుట్ర
- అందుకోసం భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు
- అంత ఘోరాన్ని, నీచానికి చంద్రబాబు పాల్పడ్డారు


