Kakinada
-
కూటమి నుంచి టీడీపీ ఎన్నిసార్లు బయటకు రాలేదు: జ్యోతుల నెహ్రూ
సాక్షి, కాకినాడ: టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు.. కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు?. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకొచ్చారు.టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ..‘కాకినాడ జిల్లాలో పదవులు ఏ పార్టీకి వెళ్లాయో ఆలోచించండి. మెజారిటీ ఉన్న తెలుగుదేశం పరిస్థితి ఏంటి?. ఒక వ్యక్తికి రెండు పదవులు అవసరమా?.(కుడా చైర్మన్, డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు). కూటమిలో పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుంది. కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు. ఎన్నిసార్లు బయటకు రాలేదు.టీడీపీతో పొత్తు వల్ల కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి. అదే పరిస్థితి టీడీపీకి రాకుండా చూడాలి. నేను వాళ్లకు ఇవ్వకూడదు అని అనడం లేదు. మా నిష్పత్తి ప్రకారం టీడీపీకి కూడా ఇవ్వండి అంటున్నాను. ద్వితీయ శ్రేణి నేతలు తమ ఇంట్లో వారికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. మా వాటా పదవులు మాకు సక్రమంగా ఇవ్వండి’ అని డిమాండ్ చేశారు. -
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.55 కోట్లు
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 26 రోజులకు గాను రూ.1,55,04,639 ఆదాయం వచ్చింది. హుండీల ఆదాయం బుధవారం లెక్కించారు. ఈ కానుకల్లో నగదు రూ.1,46,96,779, చిల్లర నాణేలు రూ.8,07,860 వచ్చాయని చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. బంగారం 48 గ్రాములు, వెండి 730 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. రోజుకి సరాసరి రూ. 5,96,332 హుండీ ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. అమెరికా డాలర్లు 184, కెనడా డాలర్లు 15, సింగపూర్ డాలర్లు రెండు, ఇంగ్లాండ్ పౌండ్లు ఐదు, స్కాట్లాండ్ పౌండ్లు పది, కువైట్ దీనార్లు 20, యూఏఈ దీరామ్స్ 25, ఖతార్ రియాల్స్ పది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహరెన్ దీనార్ ఒకటి లభించాయి. వేసవి సెలవులు, వివాహాలు, ఈ నెల ఏడో తేదీ నుంచి 13 వ తేదీ వరకు సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు కారణంగా వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వీరంతా కానుకలు వేయడంతో భారీగా హుండీ ఆదాయం సమకూరింది. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్రావు లెక్కింపులో పాల్గొన్నారు. -
అత్యధికంగా కరపలో 71.8 మిల్లీమీటర్ల వర్షపాతం
కాకినాడ సిటీ: జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం 8 గంటల వరకు సరాసరిన 20.5 ెమిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కరప మండలంలో 71.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా ఏలేశ్వరం మండలంలో 5.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీ వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పెదపూడి మండలంలో 38.2 మిల్లీమీటర్లు, శంఖవరం 30.2, జగ్గంపేట 29.2, తాళ్లరేవు 27, కాజులూరు 24.4, కాకినాడ అర్బన్ 22.4, పెద్దాపురం 18,6 గండేపల్లి 17.2, రౌతులపూడి 16.4, కిర్లంపూడి 15.4, తొండంగి 15.2, గొల్లప్రోలు 14.8, తుని 14.8, ప్రత్తిపాడు 14, కాకినాడ రూరల్ 14, పిఠాపురం 12, యు కొత్తపల్లి 11.8, కోటనందూరు 8.8, సామర్లకోట 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈఏపీ సెట్‌కు 95.83 శాతం హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీఈఏపీ సెట్–25 ఆన్లైన్ పరీక్షలు బుధవారం మూడవ రోజు కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు ఆన్లైన్ కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి నిర్వహించిన పరీక్షకు 1,719 మంది హాజరుకాగా 64 మంది గైర్హాజరయ్యారు. ఉదయం పరీక్షకు 851 మంది హాజరుకాగా 37మంది, మధ్యాహ్నం పరీక్షకు 868మంది హాజరుకాగా 27మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ వీ.వీ.సుబ్బారావు తెలిపారు. పార్టీ తప్పిదం వల్లనే కార్యకర్తల్లో అసహనం – టీడీపీ కాకినాడ రూరల్ మినీ మహానాడులో జ్యోతుల నవీన్ కాకినాడ రూరల్: తెలుగుదేశం పార్టీ తప్పిదం వల్ల కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఎన్నికల ముందు నుంచి ఇన్చార్జిని ప్రకటించాలని కార్యకర్తలు మొర పెట్టుకుంటున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ వద్ద స్పందన ఫంక్షన్ హాలులో బుధవారం కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడును నిర్వహించారు. పరిశీలకుడిగా శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూరి సత్తిబాబు హాజరయ్యారు. పలువురు మాట్లాడుతూ కాకినాడ రూరల్‌లో జనసేన ఎమ్మెల్యేను నెగ్గించుకున్నామని, ఆయన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా వైఫల్యంతోనే ఉగ్రవాదుల చొరబాటు అమలాపురం టౌన్: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పారా మిలటరీ దళాలు, లోకల్ పోలీసులు, ఎల్ఓసీతో పాటు పలు రకాల కేంద్ర ప్రభుత్వ నిఘా ఏజెన్సీల నిరంతర పర్యవేక్షణ ఉన్నప్పుడు పహల్గామ్లోకి ఉగ్రవాదుల చొరబాటు భద్రతా వైఫల్యంతోనే జరిగిందని ఏఐసీసీ ఆహ్వాన కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిలల్లా అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రుద్రరాజు మాట్లాడారు. ఇంతటి భద్రతా వలయాలను దాటుకుని ఉగ్రవాదులు ఎలా వచ్చారు. ఎలా మట్టుపెట్టారు అనే దానిపై దేశ ప్రజలు ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. ఇన్ని కోణాల్లో భద్రతా వైఫల్యం వల్లే పహల్గామ్లో ఉగ్రవాదులు చొరబడి పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. అందుకు కారణమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పహల్గామ్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దేశ ప్రజలకు, ప్రతిపక్షాలకు వివరణ ఇవ్వాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి మోదీ గత 11 సంవత్సరాల్లో 176 దేశాల్లో పర్యటించి ఆయా దేశాలతో సత్ సంబంధాలు మెరుగుపరిచే ప్రయత్నం చేశారు. అయితే పహల్గామ్ ఘటన అనంతరం అనివార్యమైన యుద్ధ సమయంలో ఏ ఒక్క దేశం కూడా మన దేశానికి మద్దుతు ఇచ్చేందుకు ముందుకు రాలేదంటే దేశ ప్రజలు ఆలోచించాలని రుద్రరాజు అన్నారు. సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొత్తూరి శ్రీను, రాష్ట్ర అధికార ప్రతినిధి వంటెద్దు బాబి, ఏఐసీసీ సభ్యుడు యార్లగడ్డ రవీంద్ర పాల్గొన్నారు. -
బాబొచ్చారు.. కష్టాలు తెచ్చారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇంటింటికీ రేషన్ పథకానికి కూటమి సర్కార్ మంగళం పాడేస్తోంది. నాడు చంద్రబాబు హయాంలో పడ్డ రేషన్ కష్టాలు మరో 10 రోజులలో తిరిగొచ్చేస్తున్నాయి. రేషన్ తీసుకోవడానికి చౌకధరల దుకాణాల వద్ద ప్రజలు పడుతున్న కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసి చలించిపోయిన జగన్మోహన్రెడ్డి ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరాకు శ్రీకారం చుట్టారు. దాదాపు ఐదేళ్ల పాటు ఇంటి ముంగిటకే అందించిన రేషన్ ఇక ఇంటికి రాదని తెలిసిన దగ్గర నుంచి కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చౌకధరల దుకాణాల డీలర్లు తమకు నచ్చిన సమయాల్లో రేషన్ సరకులు సరఫరా చేసే పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతోనే నాడు జగన్ కార్డుదారుల ఇంటి ముంగిటకే ఎండీయూ వాహనాలను తీసుకువచ్చారు. రేషన్‌కార్డుదారులకు సౌకర్యంతో పాటు ఎండీయూ వ్యవస్థ ద్వారా వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పించారు. అటువంటి ఎండీయూ వ్యవస్థ ఒప్పంద కాలపరిమితి ఏడాదిన్నర ఉండగానే చంద్రబాబు సర్కార్ మంగళవారం కేబినెట్ భేటీలో తీసుకున్న రద్దు నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సర్కారు నిర్వాకాన్ని తప్పు పడుతున్న జనం రేషన్‌కార్డు అంటేనే నిరుపేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల కోసం ఉద్దేశించింది. అటువంటి వారి ఇళ్ల ముంగిటకు నేరుగా వెళ్లి రేషన్ సరకులను అందిస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ)వాహనాలను రద్దు చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఒకప్పుడు రేషన్ తీసుకోవడానికి చౌకధరల దుకాణాల వద్ద క్యూ లలో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులను చవి చూసిన జనం ఎండీయూ వాహనాలు వచ్చాక చాలా సంతోషంగా ఉన్నారు. గడచిన ఐదేళ్లుగా దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, చిన్నా, చితకా పనులు చేసుకునే వారి దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబాలు ఇంటి ముంగిటకే రేషన్ సరకులు వచ్చేస్తుండటంతో సంబరపడ్డారు. రేషన్ దుకాణాల వద్ద నిరీక్షించడంతో సామాన్యుల జీవనోపాధి దెబ్బతింటుందనే ఉద్దేశంతో తీసుకువచ్చిన వ్యవస్థను లేకుండా చేస్తున్న కూటమి సర్కార్ నిర్వాకాన్ని ప్రజలు తూర్పార పడుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా ఒకటి నుంచి 17 తేదీ వరకూ ఎండీయూ ఆపరేటర్లు కచ్చితంగా ఇంటికి వచ్చి రేషన్ ఇస్తారనే భరోసా కల్పించారు. ఇప్పుడు ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా గత ప్రభుత్వ పథకాలు ఉండకూడదనే కూటమి దుర్బుద్ధి బయట పడిందంటున్నారు. కాకినాడ జిల్లాలో 515 గ్రామ సచివాలయాల పరిధిలో 6.43 లక్షల రేషన్‌కార్డులు ఉంటే 1,060 రేషన్ దుకాణాలున్నాయి. ఈ కార్డుదారులకు ఇంతవరకు 428 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరకులు అందిస్తున్నారు. అటువంటి ఎండీయూ వ్యవస్థను ఇప్పుడు హఠాత్తుగా రద్దు చేస్తామనడమంటే ప్రజలకు తిరిగి కష్టాలు చూపించడమేనంటున్నారు. గత ప్రభుత్వంలో ఒక్కొక్క వాహనానికి డ్రైవర్, ఆపరేటర్, హెల్పర్ పోస్టులను మంజూరు చేసి జిల్లాలో 1,284 మంది నిరుద్యోగులకు ఉపాధి చూపించారు. అలాగని రేషన్ డీలర్లను తొలగించకుండా వారి ఉపాధికి భంగం కలగకుండా నెలనెలా కమీషన్‌తో పాటు, గోనె సంచులను కూడా డీలర్లకే అప్పగించేవారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడమంటే వందలాది మంది ఆపరేటర్లను రోడ్డున పడేయడమే. ఎండీయూ వాహన వ్యవస్థను అమలులోకి తెచ్చినప్పుడు జిల్లాలో పౌరసరఫరాలశాఖ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు, బ్యాంక్ ఆఫ్‌బరోడా, ఎండీయూ వాహనాల ఆపరేటర్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కుదిర్చిన ఒప్పందం గడువు ఇంకా ఏడాదిన్నర ఉంది. ఒక ఎండీయూ ఆపరేటర్‌కు ఇచ్చే రూ.18వేలులో డీజిల్‌కు రూ.3,000, హెల్పర్‌కు రూ.5,000 పోతే మిగిలే రూ.10వేలతో ఆపరేటర్ కుటుంబం జీవనోపాధి పొందేది. వాహనాలకు ఒప్పంద గడువు ఉండగానే ఈ వ్యవస్థ రద్దు చేయడం ద్వారా ఇన్ని వందల కుటుంబాల ఉసురుపోసుకుంటోందని ప్రభుత్వంపై వారు నిప్పులు చెరుగుతున్నారు. నెలకు రూ.10వేల జీతం ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కి మొత్తం వలంటీరు వ్యవస్థనే రద్దు చేసిన కూటమి సర్కార్ ఇప్పుడు రద్దుల పద్దులో ఇంటింటికీ రేషన్ సరఫరా ఎండీయూ వాహనాలను చేర్చి వారిని రోడ్డున పడేస్తోంది. ఇంటింటికీ సరకుల పంపిణీకి మంగళం రేషన్ దుకాణాల వద్ద నిరీక్షణ తప్పదు రోడ్డున పడనున్న ఎండీయూ వాహనదారులు జగన్ పుణ్యాన ఐదేళ్లూ ఇంటి ముంగిటకే సరకులు రేషన్ కోసం పని మానుకోవాల్సి వస్తుంది వచ్చే నెల నుంచి ఇంటింటికీ తీసుకొచ్చే రేషన్ బళ్లు రద్దు చేయడం మంచిది కాదు. చౌకధరల దుకాణానికి వె ళ్లి గంటలకొద్దీ లైన్లో నిలబడాల్సి ఉంటుంది. సిగ్నల్స్ లేకపోతే ఒక్కోసారి ఒకపూట పడుతుంది. రేషన్‌కోసం ఒకరోజు పని మానుకోవాల్సి వస్తుంది. రేషన్ షాపులు ఎప్పుడు తీస్తారో తెలియని పరిస్థితులు గతంలో చూశాం. కూలీ చేసుకునేవారు సాయంత్రం సమయంలో షాపులకు వెళతారు, అయితే ఆ సమయంలో షాపులు మూసివేస్తే రేషన్ తీసుకునే అవకాశం కనిపించదు. – మేర్నీడి సత్యవతి, వాకాడ, కరప మండలం రేషన్ బియ్యాన్ని ఎత్తివేసినా ఆశ్చర్యపోనక్కరలేదు చంద్రబాబు ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ విధానం రద్దు చేయడం అన్యాయం. దూరంగా ఉన్న రేషన్ డిపోలకు వెళ్లి క్యూలో నిలబడి రేషన్ తెచ్చుకోవాలి. దినసరి కూలీ చేసుకునే వారికి కష్టకాలమే. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కిలో 2 బియ్యం ఎత్తివేస్తే, 2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చి పునరుద్ధరించారు. భవిష్యత్‌లో రేషన్ బియ్యాన్ని ఎత్తివేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. – రావూరి వెంకటేశ్వరరావు, రమణయ్యపేట, కాకినాడ రూరల్ పడిగాపులు తప్పవు ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో ప్రజలు రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడాల్సి వుంది. రేషన్ షాపులో తూకాలలో మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎండీయూ వాహనం వద్ద ఎదురుగానే ఎలక్ట్రానిక్ కాటాతో తూకం వేయడంతో తేడా వచ్చేది కాదు. వినియోగదారులు రేషన్ షాపునకు వెళ్లిన సమయంలో డీలర్ ఉంటారో లేదో తెలియని పరిస్థితి – రేలంగి వెంకటలక్ష్మి, వీకే రాయపురం, సామర్లకోట మండలం బలహీనవర్గాలను రోడ్డున పడేస్తున్నారు ఎండీయూ వాహనాల రద్దుతో 95 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆపరేటర్లను రోడ్డున పడేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలలో భాగంగా తెల్ల రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం, కందిపప్పు ఇంటింటికీ చేరవేసే ఎండీయు వ్యవస్థను రద్దు చేయడం దుర్మార్గం. ఎండీయూ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో ఎండియూ ఆపరేటర్లు చేసే ఆందోళనలకు మా పార్టీ మద్దతుగా నిలుస్తుంది. – అల్లి రాజబాబు, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ -
బదిలీలకు గ్రీన్ సిగ్నల్
రాయవరం: ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. రెండేళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న బదిలీలను పాఠశాలల పునఃప్రారంభంలోపు నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు బదిలీల జీవో 22ను ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి విడుదల చేసింది. దీంతో బుధవారం నుంచి బదిలీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన.. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్–2 హెచ్ఎంలకు బదిలీలు జరగనున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన వీటిని నిర్వహిస్తారు. 2017 ఆగస్టు 31కి ముందు ఆ పాఠశాలలో విధుల్లో చేరిన స్కూల్ అసిస్టెంట్/ఎస్జీటీ తత్సమాన క్యాడర్, 2020 ఆగస్టు 31 ముందు విధుల్లో చేరిన గ్రేడ్–2 హెచ్ఎంలు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. అలాగే 2027 మే నెలాఖరు లోపు ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని క్యాడర్లకు చెందిన సుమారు 18 వేల మంది వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన తేదీలు ● బదిలీల ప్రక్రియకు సంబంధించి బుధవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు ఈ నెల 21, 22 తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలి. 28న ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంది. ● స్కూల్ అసిస్టెంట్లు ఈనెల 21 నుంచి 24 వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌న్1, 2 తేదీల్లో ఆప్షన్లు పెట్టుకోవాలి. ● ఎస్జీటీలు ఈ నెల 21 నుంచి 27 వరకూ దరఖాస్తులు చేసుకోవాలి. వీరికి జూన్ ఏడు నుంచి 10వ తేదీ వరకూ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది. హామీలకు కట్టుబడాలి ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలి. బదిలీ జీవోలో ప్రధానంగా మూడు అంశాల్లో స్పష్టత కొరవడింది. ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్, ఖాళీలు బ్లాక్ చేయకుండా ఉండడం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల స్టడీ లీవ్ ఖాళీల విషయంలో హామీలను అమలు చేయాలి. – పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్ స్పష్టత లేదు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులతో జరిపిన చర్చల ప్రకారం మరికొన్ని విషయాల్లో అధికారులు స్పష్టంగా జీవోలు విడుదల చేయాలి. ఇంగ్లిషు మీడియంతో సమానంగా తెలుగు మీడియం నిర్వహించాలన్న అంశం, మిగులు స్కూల్ అసిస్టెంట్లను ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయాలన్న అంశాలపై స్పష్టత లేదు. – నరాల కృష్ణకుమార్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ నిబంధనల ప్రకారమే.. బదిలీ షెడ్యూల్ విడుదలైంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు చేపడుతున్నాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బదిలీలు నిర్వహిస్తాం. విద్యాశాఖ నుంచి వచ్చిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కిందస్థాయికి చేరవేసి, ఎటువంటి గందరగోళానికి తావులేకుండా నిర్వహిస్తాం. – పి.రమేష్, డీఈవో, కాకినాడ జిల్లా విడుదలైన జీవో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కొన్ని అంశాలపై స్పష్టత లేదంటున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు -
ఆ ఇద్దరి వల్లే రాష్ట్రం దివాళా
తుని: రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడే కారణమని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. బుధవారం తుని మండలం ఎస్.అన్నవరం క్యాంపు కార్యాలయంలో రాజా మీడియా సమావేశంలో మాట్లాడారు. మంగళవారం తునిలో జరిగిన మినీ మహానాడులో యనమల రామకృష్ణుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చేసిన ఏకవచన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మద్యం పాలసీలో జగన్మోహన్రెడ్డికి రూ.3,200 కోట్లు వెళ్లాయని చెప్పడం, ఎల్లో మీడియాలో విస్తృత ప్రచారం చేయడం వెనుక టీడీపీ ఉందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 2019లో జగన్మోహన్రెడ్డి లిక్కర్‌ను ఎంకరేజ్ చేయనని చెప్పారని, లిక్కర్ ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచారన్నారు. మద్యం అమ్మకాలు తగ్గి రాష్ట్రానికి ఆదాయం పెరిగిందని, ఇటువంటి సమయంలో స్కామ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండుసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రాన్ని దివాళా స్థాయికి తీసుకువచ్చారని, 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి రూ.100 కోట్లతో అప్పగించినట్టు చెప్పారని గుర్తు చేశారు. అప్పుల గురించి గాలి పోగు చేసి మాట్లాడుతున్న టీడీపీ నాయకులు ఏడాది పాలనలో రూ.3లక్షల కోట్లు అప్పు చేసి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. చంద్రబాబునాయుడు 15 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అప్పు ఎంత? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత అప్పు ఉందని లెక్కలు చూసి మాట్లాడాలని రాజా సూచించారు. రాష్ట్రంలో వేధింపుల రాజకీయం, రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఇందుకు వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపైన వేల సంఖ్యలో పోలీసులతో కేసులు పెట్టించారన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి నాయకులను, కార్యకర్తలను దూరం చేసేందుకు టీడీపీ యత్నిస్తోందని, దీనికి భయపడేదిలేదని అన్నారు. మీరు ఏది చేస్తున్నారో భవిష్యత్‌లో అదే జరుగుతుందన్నారు. చంద్రబాబు నిరపరాధి అని కోర్టు బెయిల్ ఇవ్వలేదని, అనారోగ్యం కారణంగానే బెయిల్ వచ్చిందన్న విషయాన్ని మరచిపోవద్దన్నారు. కేసుల పేరుతో కాలయాపన చేయకుండా పాలన గాడిలో పెట్టేందుకు పని చేయాలని సూచించారు. యనమల సొంత ఊరు ఏవీ నగరంలో విద్యార్థులకు చదువుకోవడానికి ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయలేదని, రాష్ట్ర కేబినెట్లో కీలక మంత్రి పదవులు చేసిన యనమల ఎందుకు విద్యను ప్రోత్సహించలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక నాడు–నేడులో అన్ని వసతులతో కూడిన స్కూల్‌ను నిర్మించామని, టీడీపీ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతున్నా ప్రారంభం చేయలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు తీర ప్రాంత ప్రజలకు పారిశ్రామిక సంస్థల నుంచి రూ.15 వేలు ఇప్పిస్తామని చెప్పి రేషన్‌కార్డులను తీసుకుని మోసం చేశారన్నారు. విజయవాడలో బుడమేరు వాగు పొంగిన ఘటనలో రూ.300 కోట్లు ఖర్చు చేసి వరద బాధితులకు పులిహోర పంపిణీ చేశామని చంద్రబాబు చెప్పుకున్నారని, తునిలో ఇదే రీతిలో 11 నెలల్లో రూ.170 కోట్లు అభివృద్ధి చేశామంటూ చెప్పడం చూస్తే దొందూ దొందేనన్న చందంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి చంద్రబాబు, యనమలే కారణం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
కారు ఢీకొని మహిళ మృతి
రాజానగరం: జాతీయ రహదారిపై జీఎస్ఎల్ జనరల్ ఆస్పత్రి వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కలవచర్లకు చెందిన యర్రా మాణిక్యం (54) కంటి చూపు సరిగా కనిపించక ఇబ్బంది పడుతోంది. కంటి పరీక్ష చేయించుకుందామని జీఎస్ఎల్ ఆస్పత్రికి వచ్చిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైంది. టు వే గా ఉన్న రహదారిపై డివైడర్ దాటి అవతలి వైపుకు వెళ్తుండగా రాజమహేంద్రవరం నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై నాగార్జున తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ముగ్గురు పిల్లలకు వివాహాలు చేశారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మోటార్ బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి గండేపల్లి: వర్షం కారణంగా మోటారు బైక్ అదుపు తప్పడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎసై యూవీ శివనాగబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గండేపల్లికి చెందిన షేక్ నాగూర్ సాహెబ్ (57) రాజానగరంలోని గైట్ కళాశాలలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం మోటార్ సైకిల్‌పై డ్యూటీకి బయలుదేరారు. వర్షం పడుతున్న సమయంలో మురారి శివారు మాతారాణి దాబా ఎదురుగా మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజానగరం జీఎస్‌ఎల్‌కు, అక్కడి వైద్యుల సూచనల మేరకు కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. నాగూర్ సాహెబ్‌కు భార్య నూర్జహాన్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కొత్తపేట: అవిడి పెదపేట గ్రామానికి చెందిన నామాడి సుధాకర్ అలియాస్ బుజ్జి (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అవిడి రేవు సమీపంలో పంట కాలువ కల్వర్టు గోడపై అతడు మృతి చెంది ఉండటాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సుధాకర్‌కు భార్య కల్యాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉండగా, పెద్ద కుమార్తె ఎంసెట్ పరీక్ష రాసింది. చిన్న కుమార్తె పదో తరగతి పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న సుధాకర్ మంగళవారం ఉదయం నుంచి మద్యం తాగుతూనే ఉన్నాడు. రాత్రి 9 గంటల సమయంలో పంట కాలువ కల్వర్టు వద్ద అతడు మద్యం మత్తులో ఉండగా స్థానికులు చూశారు. ఉదయానికి రక్తపు వాంతులు చేసుకుని చనిపోయి ఉండగా గుర్తించి, అతడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సురేంద్ర సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్నయ్య నామాడి రవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
సముద్రంలో ముమ్మరంగా గాలింపు
కొత్తపల్లి: సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ప్రమాదవశాత్తూ బోల్తా పడడంతో గల్లంతైన మేరుగు శ్యామ్ కోసం బుధవారం కుడా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగించారు. మత్స్యకారులు, అధికారులు నాలుగు బోట్లపై అతడి కోసం వెతుకుతున్నారు. అయితే తుపాను కారణంగా సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సారా నిందితుడిపై పీడీ యాక్ట్ ప్రత్తిపాడు: పెద్దిపాలెం గ్రామంలో సారా నిందితుడిపై పీడీ యాక్టు అమలు చేసినట్టు ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ బుధవారం తెలిపారు. పలుమార్లు సారా కేసులో నిందితుడిగా ఉన్న నడిగట్ల నూకరాజును అరెస్టు చేసి, పీడీ యాక్ట్ అమలు చేశామన్నారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచి, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించినట్టు చెప్పారు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరి అరెస్టు కపిలేశ్వరపురం: నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను బుధవారం అంగర పోలీస్ స్టేషన్లో మండపేట రూరల్ సీఐ దొరరాజు వెల్లడించారు. ఆ ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం అంగర ఆర్అండ్బీ రహదారిలోని రైస్‌మిల్లు సమీపంలోని కిళ్లీకొట్టు వద్దకు మంగళవారం రాజమహేంద్రవరానికి చెందిన మన్యం వీర వెంకట సత్య సీతారామారావు వచ్చాడు. తన దగ్గర ఉన్న రూ.500 నోటు ఇచ్చి సిగరెట్ పెట్టె కొన్నాడు. ఆ నోటు నకిలీదని కిళ్లీకొట్టు యజమాని సత్యనారాయణ గుర్తించాడు. స్థానికుల సహాయంతో సీతారామారావును పట్టుకుని అంగర పోలీసులకు అప్పగించాడు. ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాలపై నిందితుడిని సీఐ దొరరాజు, ఎస్సై డి.రవికుమార్ విచారించారు. అతడి సమాచారం మేరకు పోలీసులు విజయవాడకు చెందిన వారా నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నవీన్ నుంచి 44 నకిలీ రూ.500 నోట్లు, లాప్టాప్, పెన్ డ్రైవ్, ముద్రణ సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు సీఐ దొరరాజు తెలిపారు. ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య యానాం: పట్టణ పరిధిలోని న్యూరాజీవ్ నగర్‌కు చెందిన దంగుడుబియ్యం సత్యవతి (75) బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కుమారై ఫంక్షన్‌కు వెళ్లిన సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం యానాం జీజీహెచ్‌కు తరలించామని, ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై పంపన మూర్తి తెలిపారు. ఏడాదిగా సత్యవతి మానసికస్థితి బాగోలేదని, మందులు వాడుతోందని స్థానికులు తెలిపారు. -
కంప్యూటర్లు చోరీ చేసిన ఇద్దరి అరెస్టు
శంఖవరం: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లను చోరీ చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్టు ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో విలేకర్లతో మాట్లాడారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల 18న రూ.15 వేలు విలువైన కంప్యూటర్లు, సీపీయూలు, ప్రింటర్లు చోరీకి గురైనట్లు ప్రధానోపాధ్యాయులు టి.భాస్కరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో నెల్లిపూడి – బెండపూడి రోడ్డు మధ్యలో శంఖవరానికి చెందిన గామాల అశోక్, బోడపాటి చిన్నోడు ఆటోలో కంప్యూటర్లను వేరే చోటుకు తరలిస్తుండగా అరెస్టు చేశారు. -
నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకం
మలికిపురం: నేరాల దర్యాప్తు, పరిశోధనలలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయని, అందుకే ప్రతి కూడళ్లలో వాటిని ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఆయన బుధవారం మలికిపురం పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల జరిగిన అనేక నేరాలు, చోరీ కేసులలో నేరస్తుల గుర్తింపునకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. అన్ని ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, వర్తక సంఘాలు కూడా సహకరించాయన్నారు. జిల్లాలో గంజాయి నేరాలు తగ్గాయని, ఈ కేసులలో పాత నేరస్తులపై నిఘా ఉంచి కట్టడి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో నాయకుల విగ్రహాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజాసంఘాలకు సూచించామన్నారు. గల్ఫ్ ఉద్యోగాల పేరుతో కోనసీమలో మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. లైసెన్స్ కలిగిన ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ సుంకర మురళీ మోహన్, సీఐ నగేష్ కుమార్, ఎస్సైలు పీవీఎస్‌ఎస్‌ఎన్ సురేష్, రాజేష్ కుమార్, కె.దుర్గా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
140 గ్రాముల బంగారు ఆభరణాల చోరీ
కాజులూరు: అయితపూడిలోని మాజీ సర్పంచ్, పారిశ్రామిక వేత్త కొల్లు వెంకటేశ్వరరావు ఇంట్లో దొంగలు పడి, సుమారు 140 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. గొల్లపాలెం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు గత బుధవారం తిరుపతి, ఇతర తీర్థయాత్రలకు వెళ్లి మంగళవారం రాత్రి 10 గంటల సమయానికి తిరిగి వచ్చారు. లోపలకు వెళ్లి చూడగా ఇంటిలోని ఇనుప బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దానిలో 140 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు బుధవారం గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్ కుమార్ కేసు నమోదు చేసి, డాగ్ స్క్యాడ్, క్లూస్క్యాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ పాటిల్, రూరల్ సీఐ చైతన్య కృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. -
‘పట్టు’ వదిలేశారా?
పట్టు (సిల్క్) ఉత్పత్తిలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు మండలం రాష్ట్రంలోనే కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి మల్బరీ సాగు, పట్టుగూళ్ల ఉత్పత్తిని చూసిన స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కె.పవన్‌కళ్యాణ్ గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలును సిల్క్ హబ్‌గా, సిల్క్ సిటీగా మారుస్తానని హామీలిచ్చారు. తీరాచూస్తే ఆ హామీ నెరవేరకపోగా.. రాష్ట్రానికే వన్నే తెచ్చిన పట్టు పరిశ్రమ ఇప్పుడు మూతపడే పరిస్థితులు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. – పిఠాపురంమంగళం పాడేసినట్టేనా! ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వాలంటూ పట్టు రైతులు ఇటీవల గుంటూరులోని రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ కమిషనర్‌కు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ క్రమంలో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ చైత్రవర్షిణికి సోమవారం వినతిపత్రం అందజేయగా.. ఆమె సూచన మేరకు కాకినాడలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌ను కలిశారు. పంటలు పోయి నష్టాల పాలయ్యామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని గ్రీవెన్స్‌లో వినతిపత్రం ఇచ్చారు. ఆ సందర్భంగా ‘ఇబ్బందులు పడుతూ పట్టు సాగు చేయడం ఎందుకు. అది మానేసి పామాయిల్ సాగు చేసుకోండి’ అని కలెక్టర్ సలహా ఇచ్చారని రైతులు చెబుతున్నారు. కలెక్టర్ మాటలనుబట్టి పట్టు పరిశ్రమకు ప్రభుత్వం ఇక మంగళం పాడేసినట్టేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.పంటను దున్నేస్తున్న రైతులుపట్టు పురుగులకు ఆహారం కోసం వినియోగించే మల్బరీ తోటల్ని సాగు చేసేందుకు కొత్త రైతులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదే సందర్భంలో పట్టు పురుగుల పెంపకం చేపట్టిన రైతులు కూడా గిట్టుబాటుకాక సాగును వదిలేస్తున్నారు. ఒక్క గొల్లప్రోలు మండలం చేబ్రోలులోనే సుమారు 400 ఎకరాల్లో మల్బరీ సాగు చేయగా, ఇప్పటికే వందల ఎకరాల్లో పంటను దున్నేశారు. రాష్ట్రంలో పలమనేరు, హిందూపురంతో పాటు కాకినాడ జిల్లాలోని చేబ్రోలులో పట్టు పరిశ్రమ కేంద్రాలు ఉన్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీలో 5, పెద్దాపురం డివిజన్లో 12, కాకినాడ డివిజన్లో 2 మండలాల్లో 4,500 ఎకరాల్లో 1,150 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పట్టు పరిశ్రమ సుమారు 50 ఏళ్లుగా ఓ వెలుగు వెలుగుతోంది. ఇలాంటిచోట కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో సరైన ధర రాక, పంట కొనేవారు లేక, పెట్టుబడి దక్కక, కనీసం కౌలుకు తీసుకునే వారు కూడా ఉత్సాహం చూపకపోవడంతో పట్టు రైతులు పంటకు విరామం ప్రకటిస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో మల్బరీ సాగుకు రూ.లక్ష పెట్టుబడి అవుతోంది. పట్టు పురుగుల పెంపకానికి 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పున షెడ్ నిర్మాణానికి రూ.15 లక్షల వరకూ ఖర్చవుతోంది. దీని నిర్వహణకు రూ.50 వేల వరకూ ఖర్చవుతోంది. గతంలో ఇక్కడ పండించిన పట్టుగూళ్లకు కేజీకి రూ.550 వరకూ ధర వచ్చేది. ప్రస్తుతం రూ.250కి కూడా కొనేవారు లేకపోవడంతో తీవ్ర నష్టాల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు.మరోవైపు ప్రభుత్వం మల్బరీ రైతులకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాల్సి ఉండగా.. ప్రతి రైతుకు రూ.లక్షల్లో బకాయి పెట్టింది. పైగా షెడ్ల నిర్మాణానికి ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం ఇవ్వడం లేదు. దీనికి తోడు ఊజీ ఈగ దాడితో పాటు వివిధ రకాల తెగుళ్లతో పట్టు పురుగులు గూళ్లు కట్టలేదు. ఫలితంగా పట్టు సాగు తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో సగానికి పైగా రైతులు తమ మల్బరీ తోటలను దున్నేశారు.కాకినాడ జిల్లాలో మల్బరీ సాగు వివరాలుసాగు చేస్తున్న మండలాలు 19గ్రామాలు 155పట్టు రైతుల సంఖ్య 1,150సాగు విస్తీర్ణం 4,500ఎకరాలురోజుకు పట్టుగూళ్ల దిగుబడి 5 టన్నులుఆదుకుంటారనుకుంటే ఆపేయమంటున్నారు ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ మా ఊరొచ్చి మాకు న్యాయం చేస్తానని మాటిచ్చారు. సిల్క్ సిటీ కడతానన్నారు. కానీ ఆయన పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తే.. ‘నష్టాలు వచ్చేటప్పుడు ఆ పంట ఎందుకు? వేరే పంటలు సాగు చేసుకోవచ్చు కదా’ అని అంటున్నారు. ‘ముందు మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు ఇప్పించండి. తరువాత పంట వేయాలో మానేయాలో నిర్ణయించుకుంటాం’ అని చెప్పాం. అధికారుల తీరు చూస్తుంటే పట్టు సాగు చేయనిచ్చేలా లేరు. – ఓరుగంటి ఏసుబాబు, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం పామాయిల్ వేసుకోమంటున్నారు పట్టు సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అడిగితే ఈ పంట మానేసి పామాయిల్ వేసుకోవాలని చెప్పడం విస్మయం కలిగించింది. నష్టం వస్తోందని ఆపుకుంటూ పోతే ఇక్కడ ఇక ఏ పంటలూ ఉండవు. నష్టాలు రాకుండా ఏం చేయాలన్నది ఎవరూ ఆలోచించడం లేదు. మాకు రావాల్సిన ప్రోత్సాహకాల గురించి మాట్లాడటం లేదు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం. రాజకీయ నాయకుల చుట్టూ తిరిగాం. అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. మమ్మల్ని పట్టించుకున్న వారు కనిపించడం లేదు. – ఓరుగంటి శ్రీను, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం -
కొనసాగిన ఏపీ ఈఏపీ సెట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు రెండో రోజైన మంగళవారం కొనసాగాయి. జిల్లాలోని ఐదు ఆన్లైన్ కేంద్రాల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల్లో నిర్వహించిన పరీక్షకు 1,718 మంది హాజరవగా, 120 మంది గైర్హాజరయ్యారు. ఉదయం పరీక్ష 856 మంది రాయగా, 62 మంది రాయలేదు. మధ్యాహ్నం పరీక్షకు 862 మంది హాజరు కాగా, 58 మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ వీవీ సుబ్బారావు తెలిపారు. జేఎన్టీయూకేలోని ఎంసెట్ కార్యాలయం నుంచి కో కన్వీనర్లు, టీసీఎస్ ప్రతినిధులు పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. నేటి నుంచి ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ఈఏపీ సెట్లో భాగంగా బుధవారం నుంచి ఇంజినీరింగ్ విభాగంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 27 వరకూ ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలు జరుగుతాయి. దీనికి జిల్లావ్యాప్తంగా 8,957 మంది దరఖాస్తు చేశారు. నేడు హుండీల ఆదాయం లెక్కింపు అన్నవరం: సత్యదేవుని హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించనున్నారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకూ జరిగిన సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. మరోవైపు దేవస్థానంలో నెల రోజులుగా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడంతో నవదంపతులతో పాటు భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో, ఈసారి హుండీల ద్వారా రూ.1.50 కోట్లు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఉదయం 7 నుంచి సాయంత్రం వరకూ హుండీల ఆదాయం లెక్కించనున్నారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం సిబ్బంది అందరూ హాజరు కావాలని ఈఓ ఆదేశించారు. ఐసెట్‌లో 96.96 శాతం ఉత్తీర్ణత బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్‌లో జిల్లా విద్యార్థులు 96.96 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రా యూనివర్సిటీ ఈ నెల 7న ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 1,747 మంది హాజరవగా 1,700 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 696 మందికి గాను 681 మంది, బాలికలు 1,051 మందికి గాను 1,019 మంది అర్హత సాధించారు. గడ్డర్ల ఏర్పాటు వాయిదా కాకినాడ సిటీ: భారత్ మాల జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సామర్లకోట – అచ్చంపేట మధ్య నిర్మిస్తున్న వంతెనలపై గడ్డర్లు ఏర్పాటు చేసే పనులను వాయిదా వేశారు. కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం ఈ విషయం తెలిపారు. సామర్లకోట – కాకినాడ మధ్య ముత్యాలమ్మ గుడి వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఈ పనులు ఈ పనులు బుధవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకూ చేపట్టాలని తొలుత నిర్ణయించారు. అయితే, వర్షాల కారణంగా దీనిని వాయిదా వేశారు. అందువలన సామర్లకోట – కాకినాడ కెనాల్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు లేదని, ప్రయాణికులు, వాహనదారులు యథాతథంగా ప్రయాణించవచ్చని వివరించారు. విఘ్నేశ్వరస్వామివారి హుండీ ఆదాయం రూ.27,68,281 అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామివారి హుండీ ఆదాయాన్ని అమలాపురం ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం లెక్కించారు. 61 రోజులకు గాను స్వామివారికి హుండీల ద్వారా రూ.27,68,281 లభించిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 4.4 గ్రాముల బంగారం, 436 గ్రాముల వెండి లభించాయన్నారు. 30 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రంలో ముగ్గురే విద్యార్థులు! అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు ముగ్గురంటే ముగ్గురే ఒకే ఒక్క కేంద్రంలో మంగళవారం జాగ్రఫీ పరీక్ష రాశారని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఈ పరీక్ష రాయాల్సిన ముగ్గురు విద్యార్థులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. -
ఈవీఎంల భద్రతకు చర్యలు చేపట్టాలి
కాకినాడ సిటీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీ ప్యాట్ల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం గోదామును ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎం గోదాము భద్రతను తనిఖీ చేసి, నివేదిక పంపిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం, అగ్నిమాపక, పోలీసు అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి యోగా అవగాహన కార్యక్రమాలు కాకినాడ సిటీ: యోగా పట్ల అందరికీ అవగాహన కల్పించే లక్ష్యంతో బుధవారం నుంచి వచ్చే నెల 21 వరకూ నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీలు, మారథాన్, రంగోలి, విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించాలని సూచించారు. మండల, వార్డుల్లో జరిగే యోగా కార్యక్రమాలకు శిక్షకులను ఏర్పాటు చేయాలన్నారు. మండల స్థాయి కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాముల్ని చేయాలని పేర్కొన్నారు. దేవదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాల్లోనూ ఈ నెల రోజులూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ భావన, డీఆర్ఓ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
నా బిడ్డల్ని రక్షించండి
కాకినాడ క్రైం: ఏ దిక్కూ లేక.. కాకినాడ బస్టాండ్ సమీపాన తన ముగ్గురు పిల్లలతో కలిసి హోరు వానలో ఆకలి, బిడ్డల అనారోగ్యంతో రోదిస్తున్న ఓ తల్లిని, ఆమె పిల్లల్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు రక్షించారు. చుట్టుపక్కల వారు స్పందించకపోయినా కాకినాడ ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి వనుము పరమేశ్వర్, మత్స్యకారుడు రాజు మానవత్వాన్ని చాటుకోవడంతో ప్రొటెక్షన్ ఆఫీసర్ కె.విజయ తన బృందంతో అక్కడకు చేరుకున్నారు. రోదిస్తున్న తల్లికి ధైర్యం చెప్పి, ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. వాన నీటిలో తడిసి, నానిపోయి చిగురుటాకుల్లా వణికిపోతున్న పిల్లల్ని కాపాడి, సపర్యలు చేశారు. తల్లి నుంచి వివరాలు సేకరించారు. భర్త వదిలేయడంతో తాను ముగ్గురు పిల్లలతో రోడ్డున పడ్డానని ఆ మహిళ తన కష్టాన్ని విజయ బృందం వద్ద చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది. తనకు ఇద్దరు నాలుగు, రెండేళ్ల మగపిల్లలతో పాటు నాలుగు నెలల వయసు బిడ్డ కూడా ఉందని చెబుతూ గుండెలకు హత్తుకున్న శిశువును చూపింది. ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావని వారు ప్రశ్నించగా.. తన నాలుగేళ్ల కుమారుడికి పోలియో వల్ల కాళ్లు చచ్చుబడి నడవలేకపోతున్నాడని, పాకడం వల్ల రెండు కాళ్లు పుండ్లు పడ్డాయని, చూసి తట్టుకోలేక ఏడ్చానని విలపించింది. తన బిడ్డల్ని కాపాడాలని వేడుకుంది. కన్నబిడ్డల దుస్థితి చూసి తాళలేక ఆ తల్లి మానసిక వేదనకు గురైందని గుర్తించిన విజయ, ఆమె బృందం వారిని కాకినాడ జీజీహెచ్‌లోని దిశ వన్‌స్టాప్ సెంటర్‌కు పరమేశ్వర్, రాజుల సాయంతో తరలించింది. కాళ్లు చచ్చుబడిన నాలుగేళ్ల బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అంతకు ముందు పిల్లల్ని రాజమహేంద్రవరంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు వర్చువల్‌గా హాజరుపరిచారు. కమిటీ ఆదేశాల మేరకు ముగ్గురు పిల్లలతో పాటు తల్లిని వన్‌స్టాప్ సెంటర్ పర్యవేక్షణలో ఉంచి సంరక్షిస్తున్నారు. తల్లీబిడ్డలను రక్షించిన వారిలో విజయతో పాటు కౌన్సిలర్ దుర్గారాణి, సోషల్ వర్కర్ ఎస్.చినబాబు కూడా ఉన్నారు. ఫ నడిరోడ్డుపై.. హోరువానలో ఓ అమ్మ ఆక్రందన ఫ పిల్లలకు ఆహారం, వైద్యం అందించలేక వేదన ఫ తక్షణమే స్పందించిన డీసీపీయూ బృందం ఫ తల్లి, ముగ్గురు పిల్లలకు రక్షణ ముగ్గురు పసికందులు.. నాలుగేళ్లు, రెండేళ్లు, నాలుగు నెలల వయసు.. తండ్రి వదిలి పోయాడు. కానీ, అమ్మ అలా చేయలేదు. రక్తం పంచి ఇచ్చింది కదా.. వివాహేతర సంబంధాల అడ్డదారిలో వెళ్లిపోయిన భర్తలా.. పేగు బంధాన్ని తెంచేసుకోలేకపోయింది. నాలుగేళ్ల కొడుక్కి కాళ్లు లేవు.. నాలుగు నెలల పాపకు పాలిద్దామన్నా దేహం సహకరించడం లేదు. అవిటితనం అంటిన బిడ్డ చచ్చుబడిన కాళ్లతో పాకుతూంటే పుండ్లు పడ్డాయి. వర్షం నీటిలో తడిసి పచ్చిబడ్డాయి. నొప్పితో అరిచేందుకై నా గొంతు దాటి బాధ బయటకు రానంత నిస్సత్తువ.. ఆ స్థితిని కన్నతల్లి చూడలేకపోయింది. తినడానికి తిండి లేదు. హోరు వానలో నడిరోడ్డులో నరక యాతన అనుభవిస్తున్న పేగుబంధాలను రోడ్డు మీదే పడుకోబెట్టి గుండెలు బాదుకుంటోంది. వర్షంలో కన్నీళ్లు కలిసి పోవడం వల్లనేమో.. పిచ్చిదనుకున్నారు. కానీ, బిడ్డల కోసం ఏడుస్తోందని తెలుసుకునేందుకు అక్కడి వారికి గంట పైగా సమయం పట్టింది.. ఈ హృదయ విదారక సంఘటన కాకినాడ బస్టాండ్ ఆవరణలో మంగళవారం చోటు చేసుకుంది. ఐసీడీఎస్ అధికారుల కథనం ప్రకారం... -
పంపా.. ఆహ్లాదకరంగా..
నెల రోజుల కిందటి వరకూ నీరుంటుందా.. ఆవిరైపోయి.. నీటిమట్టం 79 అడుగులకు పడిపోయి.. డెడ్ స్టోరేజ్‌కు చేరుకుని.. రిజర్వాయర్ ఎండిపోతుందా అనే పరిస్థితి. అన్నవరం గ్రామానికి, దేవస్థానానికి నీటి ఎద్దడి తప్పదేమోననే ఆందోళన.. అటువంటి పరిస్థితుల్లో వరుణుడు కరుణ ధారలు కురిపిస్తూండటంతో పావన పంపా రిజర్వాయర్ జలకళతో తొణికిసలాడుతోంది. ఓవైపు ఎండలు మండిపోతున్నా.. పరీవాహక ప్రాంతాలైన శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని కొండల్లో నెల రోజుల నుంచి తరచుగా కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో, రిజర్వాయర్ నీటిమట్టం సోమవారం నాటికి 84.60 అడుగులకు పెరిగింది. పంపా రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 103 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 0.43 టీఎంసీలు. ప్రస్తుతం 0.028 టీఎంసీలకు నీటి నిల్వలు పెరిగాయి. ప్రస్తుతం 105 క్యూసెక్కుల చొప్పున నీరు వస్తుండడంతో జలాశయం నీటిమట్టం 85 అడుగుల వరకూ పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి వస్తున్న భక్తులు జలకళతో తొణికిసలాడుతున్న పంపా రిజర్వాయర్‌ను చూసి ఆనందిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తురాయి చెట్లు కూడా ఎర్రని పూలు పూస్తూండటంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. పలువురు భక్తులు రత్నగిరి నుంచి పంపా రిజర్వాయర్ కవరయ్యేలా సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటున్నారు. పంపా ఘాట్ల వద్ద స్నానాలు చేస్తూ సేద తీరుతున్నారు. – అన్నవరం పంపా ఘాట్ల వద్ద పెరిగిన నీటిమట్టం -
చరిత్ర చాటేలా.. చక్కదిద్దేలా..
అన్నవరం: అన్నవరం.. ఈ పేరు వింటేనే ప్రతి భక్తుని మది మురిసిపోతుంది.. ఆధ్యాత్మిక భావం వెల్లివిరుస్తుంది.. అలాంటి రత్నగిరిపై లోటుపాట్లు విమర్శలకు తావిచ్చాయి.. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ స్పందించారు. చక్కదిద్దే చర్యలకు ముందుకు వచ్చారు.. ఇక నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నిత్యం జరిగే పూజాదికాలు, స్వామివారి కల్యాణోత్సవాలు, వేడుకల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై త్వరలో శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామివారి సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు రోహిత్ వెల్లడించారు. ఈ ఏడాది మే ఏడో తేదీ నుంచి 13వ తేదీ వరకూ జరిగిన సత్యదేవుని దివ్య కల్యాణోత్సవాల్లో గతంలో జరిగిన ఉత్సవాలకు భిన్నంగా వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలు నిలిపివేయడంపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు వచ్చిన విషయం విదితమే. అదే విధంగా 13న జరిగిన స్వామివారి శ్రీపుష్పయాగంలో అమ్మవారిని స్వామివారికి ఎడుమవైపు కాకుండా కుడివైపునకు వచ్చేలా ఏర్పాటు చేయడంపై కూడా భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. కల్యాణోత్సవాల్లో చోటు చేసుకున్న అపశ్రుతులపై కూడా ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ‘ప్చ్..కళ కట్టలేదు’ శీర్షికన కథనం వచ్చింది. దేవస్థానంలో వైదిక కార్యక్రమాల విధి విధానాలు రూపొందించాల్సిన వైదిక కమిటీ సరైన శ్రద్ధ చూపకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శృంగేరి పీఠాధిపతితో చర్చించి వారి సూచనల మేరకు దేవస్థానంలో వైదిక కార్యక్రమాల రూపకల్పన, ఉత్సవాల్లో చేయాల్సిన క్రతువులు, హోమాలు నిలుపుదల చేయాలా వద్దా తదితర విషయాలపై కూడా స్పష్టత వచ్చేలా మార్గదర్శకాలు రూపొందించనున్నారు. దాని ప్రకారం భవిష్యత్తులో దేవస్థానంలో వైదిక కార్యక్రమాలు అమలు చేయనున్నారు. వైదిక సలహాదారుడు లేక ఇబ్బంది దేవస్థానంలో గతంలో వైదిక కార్యక్రమాలపై సలహాలకు ప్రముఖ పండితుడిని వైదిక సలహాదారుగా నియమించి పూజలు నిర్వహించేవారు. తొలుత ప్రముఖ పండితుడు తంగిరాల బాలగంగాధరశాస్త్రి దేవస్థానం వైదిక సలహాదారుగా ఉండేవారు. ఆయన తరువాత రాజమహేంద్రవరానికి చెందిన పండితుడు మధుర కృష్ణమూర్తిశాస్త్రి 2010 వరకూ కొనసాగారు. 2014లో రాజమహేంద్రవరానికి చెందిన జాంపండు మాస్టారుగా పేరు పొందిన ప్రముఖ పండితుడు శ్రీసత్యనారాయణ మూర్తిని నియమించారు. ఆ తరువాత మరో సలహాదారుడిని నియమించలేదు. దీంతో దేవస్థానం వైదిక కమిటీ సూచనల మేరకే వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయాలు తీవ్ర విమర్శలకు తావిచ్చిన నేపథ్యంలో వైదిక సలహాదారు లేని లోటు కనిపిస్తోంది. దేవస్థానంతో 50 ఏళ్ల అనుబంధం కలిగిన ప్రముఖ వేద, జ్యోతిష పండితుడు, మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు, కంచి కామకోటి పీథం, శృంగేరీ పీఠాధిపతులతో సాన్నిహిత్యం కలిగిన రాజమహేంద్రవరానికి చెందిన శ్రీవిశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రిని వైదిక సలహాదారునిగా నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సత్యదేవుని సన్నిధిలో వైదిక కార్యక్రమాలు ‘సాక్షి’లో వరుస కథనాలతో చర్యలు శృంగేరి పీఠాధిపతి సూచనలతో ముందుకు.. అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ వెల్లడి విధి విధానాలు రూపొందిస్తాం.. ఈ ఏడాది కల్యాణోత్సవాల్లో వనదుర్గ అమ్మవారి హోమాల నిలిపివేత, శ్రీపుష్పయాగం రోజున స్వామి, అమ్మవారి అలంకరణపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్‌లో ఇటువంటి వివాదాలు రాకుండా చర్యలు తీసుకుంటాం. దేవస్థానంలో జరిగే వైదిక కార్యక్రమాలు, ఉత్సవాల్లో అనుసరించాల్సిన పద్ధతులు, అలంకరణలపై శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామివారిని మార్గదర్శనం చేయాలని కోరతాం. వారి సూచనలు, సలహాలు ప్రకారం నడుచుకుంటాం. వీటిని అతిక్రమించకుండా చూస్తాం. –ఐవీ రోహిత్, చైర్మన్, అన్నవరం దేవస్థానం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
జంట ఆత్మహత్యపై కేసు
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ పరిధి వేట్లపాలెంలో ఒక జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాకినాడ సిద్ధార్ధ ఆస్పత్రి, గైడ్ ఆస్పత్రిలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న ఉప్పల పోసిబాబు (40), గైడ్ మెడికల్ షాపులో పని చేస్తున్న గెద్దం దివ్యనాగలక్ష్మి (35) ఈ నెల 17న రైలుకు అడ్డుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వారి మధ్య ఉన్న వివాహేతర సంబంధం బయట పడుతుందనే అనుమానంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని కాకినాడ నుంచి సామర్లకోట మోటారు సైకిల్‌పై వచ్చారు. అక్కడి నుంచి వేట్లపాలెం వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను రైల్వే ట్రాలీ మేన్ డి.లక్ష్మణరావు గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతులిద్దరికీ వివాహాలు కాగా పోసిబాబుకు ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోసిబాబు తన పెద్ద కుమారుడికి ఫోన్‌చేసి చనిపోతున్నట్లు చెప్పాడని వివరించారు. మృతుడి జేబులో ఉన్న సూసైడ్ నోట్లో వివరాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్సై వాసు తెలిపారు. శ్యాంబాబు మృతి మాదిగలకు తీరని లోటు కాకినాడ సిటీ: ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన కొండేపూడి శ్యాంబాబు మాదిగ మృతి జాతికి తీరని లోటని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. కాకినాడ మధురానగర్‌లో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పూర్వ అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత శ్యాంబాబు కుటుంబ సభ్యులను మందకృష్ణ పరామర్శించి ధైర్యాన్ని నింపారు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణ ఉద్యమాన్ని అడ్డుకున్నది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే అన్నారు. అనేక సవాలను ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో శ్యాంబాబు కీలకపాత్ర పోషించారన్నారు. అనంతరం శ్యాంబాబు చేసిన ఉద్యమాలకు సంబంధించిన ఫొటోలను, శ్యాంబాబు నిలువెత్తు ఫొటోలను కుటుంబ సభ్యులతో కలసి కృష్ణమాదిగ తిలకించి ఆవిష్కరించారు. జాంబవ నిధికి కొండేపూడి శ్యాంబాబు కుటుంబ సభ్యులు రూ.లక్ష చెక్కును కృష్ణమాదిగకు అందజేశారు. కార్యక్రమానికి కొండేపూడి శ్యాంబాబుమాదిగ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. గుండెపోటుతో హెడ్ నర్స్ మృతి పి.గన్నవరం: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో హెడ్ నర్సుగా పనిచేస్తున్న జీఎల్ అనంత కుమారి (59) సోమవారం గుండెపోటుతో మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన అనంత కుమారి సోమవారం మధ్యాహ్నం తనకు నీరసంగా ఉందని ఇంట్లో చెప్పి తణుకులోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అక్కడ గుండెపోటుతో మృతి చెందారు. గత 20 రోజుల నుంచి ఆమె సెలవులో ఉన్నారు. ఈనెల 23న విధులకు హాజరు కావాల్సి ఉంది. పి.గన్నవరం సీహెచ్‌సీలో 2023 జూన్‌లో ఆమె హెడ్ నర్సుగా బాధ్యతలు చేపట్టారు. ఆమె మృతితో ఆస్పత్రి వైద్య సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అమలాపురం రూరల్: తన పేరుపై ఉన్న భూమిని వేరే వ్యక్తి పేరున ఆన్లైన్లో మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి చెందిన రైతు అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. సదరు భూమిని తిరిగి తన పేరున మార్చాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం చుట్టూ పలుసార్లు తిరిగినప్పటికీ పట్టించుకోవడం లేదని, ప్రలోభాలకు గురై వేరొకరి పేరున ఆన్లైన్ చేసిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతు ఆకుల నాగేశ్వరరావు తదితరులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భూమికి ఏవిధమైన దస్తావేజులు లేకుండా కుంపట్ల ఆదినారాయణ పేరున ఆన్లైన్లో అక్రమంగా నమోదు చేశారన్నారు. దీనిపై తనకు తగిన న్యాయం చేయాలని నాగేశ్వరరావు కోరారు. -
ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతిగా ముత్యాల నాయుడు
అంబాజీపేట: స్థానిక డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతిగా డాక్టర్ ఎం.ముత్యాల నాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు జిల్లా, నంధ్యాలలోని మహానంది ఉద్యాన పరిశోధన కేంద్ర నుంచి ఆయన ఇక్కడకు బదిలీపై వచ్చారు. ముత్యాల నాయుడు కొవ్వూరు, దర్శి, మహానంది తదితర పరిశోధన స్థానాల్లో సుగంధ ద్రవ్య పంటలు, అరటి, నిమ్మ, దుంప పంటలు, పండ్లు, కూరగాయల పంటలపై పరిశోధనలు చేసి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేసి మంచి గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తానన్నారు. కొబ్బరిలో తెగుళ్లు, పురుగుల నివారణ, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వారికి చేరువలో ఉంటానన్నారు. కొబ్బరిని ఆశించిన తెల్లదోమ నివారణకు ఎప్పటికప్పుడు రైతులతో మమేకమై నివారణకు కృషి చేస్తానన్నారు. ముత్యాల నాయుడిని స్థానిక శాస్త్రవేత్తలు, సిబ్బంది అభినందించారు. ఇక్కడ విధులు నిర్వహించిన డాక్టర్ ఎన్‌బీవీ చలపతిరావు తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉద్యాన సమాచార కేంద్రంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ హోదాతో పాటు ముఖ్య ప్రజా సంబంధ అధికారిగా బదిలీపై వెళ్లారు. -
ఐఎఫ్ఎస్కు ములగపూడి విద్యార్థి ఎంపిక
రౌతులపూడి: మండలంలోని ములగపూడికి చెందిన చింతకాయల లవకుమార్ ఇండియన్ ఫారెస్టు సర్వీసు(ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యారు. సోమవారం విడుదలైన 2024 ఐఎఫ్ఎస్ పరీక్షా ఫలితాల్లో ఆయన 49వ ర్యాంకు సాధించారు. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరసర్వ చక్రవర్తి, వీర వరహాలు దంపతులకు లవకుమార్ జన్మించారు. ఆయనకు సోదరి స్వాతి ఉన్నారు. లవకుమార్ ఒకటి నుంచి మూడో తరగతి వరకూ ములగపూడిలో చదువుకున్నారు. 4 నుంచి 8వ తరగతి వరకూ కత్తిపూడి రిఫరల్ పాఠశాలలోను, 9, 10 తరగతులు తుని శ్రీప్రకాష్ విద్యాసంస్థలోను, ఇంటర్మీడియెట్ విజయవాడ చైతన్య జూనియర్ కళాశాలలో, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో బీవీఎస్సీ డిగ్రీ చదివారు. కొంతకాలం వెటర్నరీ అంబులెన్స్‌లో సేవలందిస్తూ యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరయ్యారు. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. ఎటువంటి కోచింగ్ లేకుండా, సెల్ఫోన్లు వాడకుండా పట్టుదలతో చదివారు. నిరంతర కృషితో ఎట్టకేలకు ఐఎఫ్ఎస్ సాధించాడని తల్లిదండ్రులు తెలిపారు. ఐఎఫ్ఎస్ సాధించిన మొదటి వ్యక్తి తమ కుమారుడు కావడం ఆనందంగా ఉందన్నారు. లవకుమార్ విజయంపై కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. -
గోదావరిలో స్నానానికి దిగి యువకుడి మృతి
తాళ్లపూడి (కొవ్వూరు): గోదావరిలో స్నానానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... చాగల్లు మండలం ధారవరం గ్రామానికి చెందిన గాడి రాకేష్ (17) స్నేహితులతో కలసి కొవ్వూరు మండలం సీతంపేట వద్ద గోదావరిలో స్నానానికి దిగాడు. ఈ నేపథ్యంలో గోదావరిలో గల్లంతయ్యాడు. స్థానికుల సాయంతో అతన్ని బయటకు తీసి నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాకేష్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి తండ్రి శ్రీను, తల్లి, ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. శ్రీను కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నట్లు చెబుతున్నారు. మృతి ఘటనపై కొవ్వూరు పోలీసులకు సమాచారం అందాల్సి ఉంది. ఇదిలాఉంటే పలు ప్రాంతాల నుంచి సీతంపేట వద్దకు నిత్యం అధిక సంఖ్యలో స్నానాలకు వస్తున్నారు. ఇక్కడ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణంకొత్తపేట: స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై జి.సురేంద్ర కథనం ప్రకారం.. మండల పరిధిలోని వాడపాలెం గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు (40) ఆదివారం రాత్రి స్థానిక దేవాలయంలో బంధువుల పెళ్లికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి కొత్తపేట వచ్చాడు. నాగేశ్వరరావు పాత బస్టాండ్ వద్ద నిలబడి ఉండగా అమలాపురం వైపు నుంచి రావులపాలెం వైపుకు వెళుతున్న ఆర్టీసీ బస్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతని బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీనిపై మృతుని భార్య దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర వివరించారు. -
కోకో కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు
అంబాజీపేట: ఆరుగాలం శ్రమించి పండించిన కోకో గింజలను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర కోకో సాగురైతు సంఘ సహాయ కార్యదర్శి కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్ అన్నారు. అంబాజీపేట కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ కార్యాలయంలో జిల్లా కోకో రైతుల సమావేశం జిల్లా బీకేఎస్ అధ్యక్షుడు చేకూరి సూర్యనారాయణరాజు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆనంద వెంకటప్రసాద్ మాట్లాడుతూ కొన్ని ప్రైవేట్ కంపెనీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నచ్చిన ధరలకు కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కోకో గింజలు నాణ్యత ఉన్నప్పటికీ సరైన ధర లేకపోవడం, విక్రయాలు జరగకపోవడంతో కోకో రైతులకు పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. కోకో గింజలకు ప్రస్తుతం అంతర్జాతీయ ధర కిలో రూ.940లు ఉండగా ప్రైవేట్ వ్యక్తులు కిలో రూ.500లోపు కొంటున్నారన్నారు. అంతర్జాతీయ ధరకే కోకో గింజలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా విదేశీ గింజల దిగుమతులు నిలుపుదల చెయ్యాలని, ధరలు నిర్ణయించే వరకూ రైతులు, కంపెనీలు కొనుగోలు, అమ్మకాలు ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే కోకో రైతులను ఆదుకునేందుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోకో గింజల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కోకో రైతుల సంఘ అధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావు, రైతులు దంగేటి గిరిధర్, అడబాల రాజమోహన్, రెడ్డి రామకృష్ణ, అయ్యగారి శ్రీనివాస్, సరెళ్ల అప్పారావు, ప్రకాష్, సమయవంతుల పండు తదితరులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు 418 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 418 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ సత్యనారాయణ, సీపీఓ త్రినాథ్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా అర్జీలను నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారులు తమ అర్జీ స్థితి తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని చెప్పారు.తెలుసుకోవచ్చన్నారు. -
రత్నగిరి.. భక్తజనఝరి
అన్నవరం: సత్యదేవుని సన్నిధి సోమవారం భక్తజనఝరిని తలపించింది. రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధువులతో పాటు ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయం కిక్కిరిసిపోయింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరులను ముత్యాల కవచాలతో అలంకరించి (ముత్తంగి సేవ) పూజించారు. -
ఈ కట్టడాలు.. మహా స్ట్రాంగ్
మెయిన్ రోడ్డు నుంచి టోల్‌గేట్‌కు.. గతంలో భక్తులు వాహనాల్లో రత్నగిరికి వెళ్లాలంటే అన్నవరం మెయిన్ రోడ్డు నుంచి నేరుగా టోల్గేట్ వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఆర్టీసీ బస్సులను మెయిన్ రోడ్డు మీద టోల్గేట్ ఎదురుగా ఆపి భక్తులను దింపేవారు. దీనివలన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగేది. అడపాదడపా ప్రమాదాలు కూడా జరిగేవి. అయితే 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ హయాంలో మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న కళాశాల మైదానం గేటు నుంచి సర్వీస్ రోడ్డు మాదిరిగా మరో రోడ్డును టోల్గేట్ వరకూ నిర్మించారు. రత్నగిరికి వెళ్లే వాహనాలు అక్కడే ఆ రోడ్డులోకి మారి నేరుగా టోల్గేట్ వద్దకు చేరుతూండటంతో మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ రద్దీ తగ్గింది. ప్రమాదాలు కూడా జరగడం లేదు. టూరిస్టు బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చే భక్తుల కోసం 2023లో కొండ దిగువన కళాశాల మైదానంలో ఆరు విశ్రాంతి షెడ్లు నిర్మించారు. ఇవన్నీ భక్తులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అన్నవరం: కూటమి ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానంలో కట్టిన గోడ వారం రోజుల వ్యవధిలోనే.. ఒక్క వానకే క్పుకూలిపోయింది. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి చందనోత్సవం నాడు జరిగిన ఈ దుర్ఘటన ఏడుగురు భక్తులను బలిగొంది. ఆ గోడ నిర్మాణంలో ఉపయోగించిన నాశిరకం మెటీరియల్ వాడారని తెలిసి అందరూ నిర్ఘాంతపోయారు. దీనికి భిన్నంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నవరం దేవస్థానంలో చేపట్టిన పలు నిర్మాణాలు మహా స్ట్రాంగ్‌గా నిలచి, భక్తులకు, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సింహాచలం దేవస్థానం దుర్ఘటన నేపథ్యంలో.. అన్నవరం దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.30 కోట్లతో పూర్తి నాణ్యతా ప్రమాణాలతో వివిధ నిర్మాణాలు చేపట్టారంటూ సానుకూల చర్చ నడుస్తోంది. శివసదన్ సత్రం సత్యగిరిపై సుమారు రూ.20 కోట్లతో 135 గదులతో నిర్మించిన శివసదన్ సత్రం 2023 నవంబర్ నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి ఈ నిర్మాణం 2018లోనే మొదలైనా.. కరోనా వైరస్ కారణంగా రెండేళ్లు, దానివల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరో ఏడాది పనులు నెమ్మదిగా సాగాయి. చంద్రశేఖర్ ఆజాద్ 2023లో ఈఓగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దీని నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ సత్రం భక్తులకు అందుబాటులోకి రావడంతో వసతి సమస్య చాలా వరకూ పరిష్కారమైంది. దీని ద్వారా దేవస్థానానికి రోజుకు సుమారు రూ.2 లక్షల ఆదాయం వస్తోంది. సత్యదేవుని నమూనా ఆలయం జాతీయ రహదారిపై రూ.4 కోట్లతో సత్యదేవుని నమూనా ఆలయం నిర్మాణ పనులు 2023లో ప్రారంభించారు. గత ఏడాది మే నాటికి నమూనా ఆలయం, ప్రసాదం కౌంటర్, ప్రహరీ నిర్మాణాలు పూర్తి చేశారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుల మూర్తులను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే భక్తులు ఇక్కడ ఆగి, స్వామివారిని దర్శించుకుని, ప్రసాదాలు కొనుగోలు చేయడానికి వీలుగా ఈ నమూనా ఆలయం నిర్మించారు. చెక్కు చెదరని నమూనా ఆలయం గోడ నమూనా ఆలయం చుట్టూ కాంక్రీట్‌తో బలమైన ప్రహరీ నిర్మించారు. వర్షాకాలంలో పంపా బ్యారేజీ గేట్లు ఎత్తినపుడు వరద నీరంతా జాతీయ రహదారి మీదుగా.. ప్రధానంగా ఉత్తరం, తూర్పు వైపు నిర్మించిన నమూనా ఆలయం ప్రహరీని ఆనుకుని ప్రవహిస్తుంది. గత ఏడాది సుమారు 5 వేల క్యూసెక్కుల వరద నీరు దీనిని ఆనుకుని ప్రవహించినప్పటికీ గోడలు బీటలివ్వడం కానీ, కృంగడం కానీ జరగలేదంటే.. దీనిని ఎంత పటిష్టంగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. ఆదిశంకర మార్గ్ పాత సీఆర్ఓ కార్యాలయం వెనుక నుంచి రెండో ఘాట్ రోడ్డుకు కలిపే ఆదిశంకర మార్గ్ నిర్మాణం భక్తులకు ఎంతో ఉపయోగపడింది. 2023, 2024 కార్తిక మాసాల్లో ఈ రోడ్డు మీదుగా వందలాది వాహనాలు కొండ దిగువకు వెళ్లడంతో రత్నగిరిపై ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగలేదు. అలాగే, ప్రకాష్ సదన్ పక్క నుంచి నిర్మించిన ర్యాంపు రోడ్డు ద్వారా వాహనాలు నేరుగా పశ్చిమ రాజగోపురం వైపు వెళ్లే అవకాశం కలిగింది. అదే విధంగా సత్యగిరి రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన మల్టీ లెవెల్ పార్కింగ్ ద్వారా వందలాది వాహనాలను నిలుపు చేయడానికి అవకాశం ఏర్పడి, భక్తులకు ఇబ్బంది తొలగింది. ఎటువంటి విమర్శలకు తావు లేకుండా.. ఈ నిర్మాణాలన్నీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగినప్పటికీ ఎక్కడా చెక్కు చెదరకపోవడం విశేషం. నాణ్యతపై ఎటువంటి విమర్శలూ రాలేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నాటి దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ నిర్మాణాలను రెండుసార్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సత్యదేవుని సన్నిధిలో చెక్కుచెదరని రీతిలో నిర్మాణాలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.30 కోట్లతో పనులు పూర్తి నాణ్యతతో నిర్మాణం అధికారులు దృష్టి పెట్టాలి సింహాచలం దేవస్థానంలో ఐదుగురు మంత్రులు, దేవదాయ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనులు జరిగినా గోడ కూలిపోవడం అక్కడి నిర్మాణాల్లో నాణ్యతను ప్రశ్నార్థకం చేసింది. కూటమి ప్రభుత్వంలో నిర్మాణాలన్నీ ఇంతేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ స్కీమ్ కింద రూ.23 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలు, రూ.12 కోట్లతో చేపట్టే సీతారామ సత్రం నిర్మాణ నాణ్యతపై అధికారులు దృష్టి సారించాలి. లేకుంటే సింహాచలం పరిణామాలే ఇక్కడ కూడా పునరావృతమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
గుల్జార్ హౌస్‌లు!
మనకీ ఉన్నాయి..ఈ జాగ్రత్తలు అవసరం ఇళ్లు, అపార్టుమెంట్లు, గ్రూప్ హౌస్‌ల వంటి నివాస సముదాయాలు, వ్యాపార కేంద్రాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించడం అక్షరాలా ప్రాణ రక్షణతో సమానం. అగ్నిమాపక విభాగం, నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా (ఎన్బీసీ) సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ప్రమాణాలు ఈ అగ్ని ప్రమాదాల నివారణకు ఎంతగానో దోహదపడతాయి. ఫ ప్రతి భవంతిలో రెండు ఫైర్ ఎగ్జిట్లు తప్పనిసరి. అవి ఎక్కడున్నాయో అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ తెలియాలి. వినియోగించడంపై అవగాహన ఉండాలి. ఫ ఫైర్ అలారం వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలి. పొగ, మంటలు చెలరేగినప్పుడు స్పీకర్లు, హెచ్చరిక లైట్లతో అప్రమత్తం చేసే ఏర్పాట్లు అవసరం. ఫ ప్రతి ఫ్లోర్లో ఫైర్ ఎక్ట్సింగ్విషర్లు తగినన్ని ఉండాలి. వాటి పని తీరును ప్రతి నాలుగు నెలలకోకసారి పరిశీలించుకోవాలి. ఫ భారీ భవంతుల్లో ఫైర్ హైడ్రెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అనూహ్యంగా ప్రమాదాలేవైనా జరిగితే వీటి ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే చర్యలను మరింత సులువుగా చేపట్టగలుగుతారు. ఫ 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రతి భవనంలోనూ వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి. ఫ కనీసం ప్రతి ఆరు నెలలకోసారి ఫైర్ డ్రిల్స్ నిర్వహిస్తే నివాసితుల్లో అవగాహన పెరుగుతుంది. ఫ విద్యుత్ వైరింగ్, ఉపకరణాల్లో లోపాలే చాలా అగ్నిప్రమాదాలకు మూలం. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ సేఫ్టీకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భవన యజమానులకు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. విద్యుత్ తీగలు, సాకెట్లు క్రమం తప్పకుండా నాణ్యంగా ఉన్నాయో లేదో పరిశీలించుకుంటూ ఉండాలి. షార్ట్ సర్క్యూట్ సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ ప్రతి భవనం నిర్మాణ సమయంలో అగ్నిమాపక విభాగం నుంచి ఫైర్ సేఫ్టీ అప్రూవల్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఫ హైదరాబాద్ పాతబస్తీ అగ్ని ప్రమాదంతో ఉలికిపాటు ఫ మన భద్రతపై తలెత్తుతున్న ప్రశ్నలు ఫ కాకినాడ, రాజమహేంద్రవరం సహా పలుచోట్ల ప్రమాదకరంగా భవనాలు ఫ ముందే మేల్కొంటే మేలు కాకినాడ క్రైం: హైదరాబాద్‌లో చార్మినార్ దగ్గరలోని గుల్జార్ హౌస్‌లో ఆదివారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం 17 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న సంఘటన అందరినీ భయాందోళనకు గురి చేసింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన ఈ ప్రమాదంలో అందరూ సజీవ దహనమైపోయారు. చనిపోయిన వారిలో ఐదేళ్ల లోపు పిల్లలు ఎనిమిది మంది, 60 ఏళ్ల పైబడ్డ వారు ఐదుగురు ఉన్నారు. ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని ఘోర అగ్ని ప్రమాదమిది. ఈ ప్రమాదంలో తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారిలో అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో బయటపడడం ఏ ఒక్కరికీ సాధ్యం కాలేదు. ఈ ఘోర కలి మన నగరాల్లోని భవనాలల్లో భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇటువంటి ఇరుకై న వ్యాపార సముదాయాలు, నివాస భవనాలు కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. మనమూ ముందస్తుగా మేల్కోవలసిన ఆవశ్యకతను గుల్జార్ హౌస్ ప్రమాదం గుర్తు చేస్తోంది. ఇరుకు ప్రాంతాలు.. భద్రత లేని భవనాలు కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో చాలా ప్రాంతాలు ఎంతో ఇరుకుగా ఉన్నాయి. మెయిన్ రోడ్లు సహా మార్కెట్ వీధులు, ఇతర ప్రాంతాల్లో ఇటువంటి భవనాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. కాకినాడ మెయిన్ రోడ్డులో మసీద్ సెంటర్ మొదలు జగన్నాథపురం వంతెన వరకూ కుడి, ఎడమ వైపున అనేక దుకాణాలను గ్రౌండ్ ఫ్లోర్లలోనే నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్‌తో స్టాక్ పెట్టి, రెండో అంతస్తులో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న అనేక వ్యాపార సముదాయాలు, నివాస భవనాలు ఇదే రీతిలో ఉన్నాయి. దాదాపు వీటన్నింటిలోనూ పై అంతస్తుల నుంచి కిందకి దిగడానికి ఒకటే మార్గం ఉంటోంది. ఊహించని విధంగా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేని పరిస్థితి. ఫ కొద్ది రోజుల క్రితం కాకినాడ సంతచెరువు జంక్షన్‌లోని ఓ భవంతి ఒకటో అంతస్తులో ఏసీ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఫ కాకినాడ భానుగుడి కూడలిలో వ్యాపార సముదాయాలు కలిగిన సుభద్ర ఆర్కేడ్‌లో కొన్నాళ్ల క్రితం అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ ప్యానళ్లు కాలిపోయి మంటలు వ్యాపించాయి. ఉదయం వేళ కావడంతో స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి, ప్రమాదాన్ని నిలువరించారు. నిలిచిన తనిఖీలు ఫైర్ సేఫ్టీ ఇన్స్పెక్షన్లు నిలిపి వేయాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి, అగ్నిమాపక శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలున్నాయి. జిల్లా స్థాయిలో ప్రస్తుతం తనిఖీలేవీ జరగడం లేదు. గతంలో భవనాల్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేసి, ఒకే మార్గాలున్న భవనాలన్నింటికీ అదనపు మెట్ల మార్గాలు ఏర్పాటు చేయించారు. అయితే, కొన్ని నెలల క్రితం నుంచి ఆ తనిఖీలకు తిలోదకాలిచ్చారు. పొగే ప్రమాదకారి మంటలు వ్యాప్తి చెందే తొలి దశలో మంటల కంటే పొగే ప్రమాదకారి. హైదరాబాద్ ఘటనలో 17 మరణాలు సంభవించడానికి కారణం కూడా పొగ వ్యాపించి, ఊపిరి ఆడకపోవడమే. మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నాన్ని సైతం ఈ పొగ అడ్డుకుంటుంది. ఊపిరాడకుండా చేసి, ప్రాణాలు తీస్తుంది. ఇరుకై న నివాస, వర్తక సముదాయాలు అగ్నిప్రమాదాలకు నిలయాలు. ఆయా ప్రాంతాల్లో జీవనం సాగిస్తూ, వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. నిర్ణీత మార్గదర్శకాలు పాటిస్తూ మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్ రాజేష్ ఆధ్వర్యంలో తరచుగా చేపడుతున్న మాక్ డ్రిల్, అవగాహన సదస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. – ఉద్దండురావు సుబ్బారావు, జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి, కాకినాడ -
కక్ష సాధింపు మానాలి
కాకినాడ రూరల్: కక్ష సాధింపులు మానుకుని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు. గైగోలుపాడులోని తన నివాసంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మద్యం విధానంపై పెట్టిన కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును సీఐడీ నుంచి సిట్‌కు అప్పజెప్పడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. మద్యం అమ్మకాలు పెరిగినప్పుడు అవినీతి జరుగుతుందా, తగ్గినప్పుడు జరుగుతుందా గమనించాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్ష సాధింపులో భాగంగానే ఆయన అనుచరులను వేధిస్తున్నారన్నారని పేర్కొన్నారు. గతంలో ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, బీపీ ఆచారిలను ఇదే మాదిరిగా వేధించారని, వారు ఆ కేసుల నుంచి క్లీన్‌చిట్‌తో బయటకు వచ్చారని అన్నారు. అటవీ భూములు ఆక్రమించారంటూ పెద్దిరెడ్డి కుటుంబంపై కేసులు బనాయిస్తున్నారన్నారు. భోగాపురంలో నిర్మించిన రిసార్ట్‌లో 51 ఎకరాల అటవీ భూమి ఉందనే ఆరోపణలను నిగ్గు తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులపై, గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులపై అక్రమ కేసులు బనాయించడం మానుకోవాలని నాగమణి హితవు పలికారు. ప్రశాంతంగా ఏపీ ఈఏపీ సెట్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చరల్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీ సెట్–2025 ఆన్లైన్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్ష నిర్వహించారు. కాకినాడ ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల, రాయుడుపాలెం సాఫ్ట్ టెక్నాలజీ, సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం కలిపి 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆయా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. జిల్లాలో అక్కడక్కడ ప్రారంభ సమయంలో కొద్ది నిమిషాల పాటు సర్వర్ సమస్య మినహా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా పరీక్షలు సజావుగా సాగాయి. జిల్లాలో ఉదయం పరీక్షకు 922 మంది దరఖాస్తు చేసుకోగా 844 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 923 మంది దరఖాస్తు చేసుకోగా 869 మంది హాజరయ్యారు. ఉదయం, సాయంత్రం కలిపి 92.85 శాతం హాజరు నమోదైంది. -
నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్
ఫ పూర్తయిన ఏర్పాట్లు ఫ నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజనీరింగ్, ఫార్మశీ, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జేఎన్టీయూ–కాకినాడ ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు నుంచి ఆన్లైన్ టెస్ట్ పూర్తి చేయడంలో పాటించాల్సిన నిబంధనలు, జాగ్రత్తలను ఇన్విజిలేటర్లు వివరిస్తారు. ఈఏపీ సెట్ ద్వారా విద్యార్థులకు ఇంజినీరింగ్ (బీటెక్), బయో టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ (అగ్రికల్చర్), హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్జెండరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, బీ.ఫార్మసీ, ఫార్మ్.డి కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఫ విద్యార్థులు గంటన్నర ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఫ హాల్ టికెట్, ఐడీ కార్డు, పెన్సిల్ మినహా ఇతర ఎటువంటి వస్తువులనూ తమ వెంట తీసుకురాకూడదు. ఫ సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీలు సహా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ఫ పరీక్ష కేంద్రానికి బయలుదేరే ముందు హాల్ టికెట్లపై పరీక్ష వివరాలు, కేంద్రం పేరు, సమయం, తేదీ, ఇతర వివరాలను అభ్యర్థులు క్షుణ్ణంగా పరిశీలించుకోలి. ఫ హాల్ టికెట్టుతో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్, పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్) వెంట తీసుకుని వెళ్లాలి. ఫ ఏపీ ఈఏపీ సెట్ ఆన్లైన్ దరఖాస్తు ప్రింటవుట్, బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల విద్యార్థులు గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన కుల ధ్రువీకరణ పత్రం కాపీ వెంట తీసుకుని వెళ్లాలి. ఫ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింటవుట్ కాపీ దిగువన ఫొటో అతికించి, కళాశాల ప్రిన్సిపాల్, గెజిటెడ్ అధికారి నుంచి సంతకం తీసుకోవాలి. ఫ హాల్ టికెట్‌పై ఎటువంటి రాతలు రాసినా, పరీక్ష రాసే అవకాశం కోల్పోతారు. ఫ పరీక్ష కేంద్రంలో విద్యార్థి సంతకంతో పాటు ఎడమ చేతి బొటన వేలి ముద్రను ఇన్విజిలేటర్ పర్యవేక్షణలో వేయాలి. ఏర్పాట్లు పూర్తి పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని ఆయా శాఖల సమన్వయంతో వైద్య సేవలు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పిస్తున్నాం. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. – డాక్టర్ వీవీ సుబ్బారావు, సెట్ కన్వీనర్ పరీక్షల తేదీలు అగ్రికల్చర్, ఫార్మసీ : నేడు, రేపు ఇంజినీరింగ్ : 21 నుంచి 27వ తేదీ వరకూ సమయం : ఉదయం 9.00 – 12.00, మధ్యాహ్నం 2.00 – 5.00 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు : 5 కాకినాడ సాఫ్ట్ టెక్నాలజీ (రాయుడుపాలెం), ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల (సూరంపాలెం), ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో 3 కేంద్రాలు (సూరంపాలెం) హెల్ప్‌లైన్ నంబర్లు : 0884–2342499, 2359599 జిల్లాలో ఏపీ ఈఏపీ సెట్ వివరాలు ఇంజినీరింగ్ ఎంట్రన్స్ దరఖాస్తుదారులు : 8,961 అగ్రికల్చరల్, ఫార్మసీ : 3,671 రెండు విభాగాలు : 10 -
క్లోజర్ పనులకు మంగళం?
ఫ పూడుకుపోయిన తూములు, కాలువలు ఫ పిఠాపురంలో సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తం ఫ సార్వా సీజన్ దగ్గర పడుతున్నా చేపట్టని వైనం పిఠాపురం: రబీ సీజన్ ముగిసింది.. పంట కాలువలకు నీటి విడుదల నిలిపివేసి మూడు వారాలు అయింది. 20 రోజుల్లో మళ్లీ కాలువలకు నీటి విడుదలకు రంగం సిద్ధమవుతోంది. కాని ఈ మధ్యలో చేపట్టాల్సిన పంట కాలువల అభివృద్ధి (క్లోజర్) పనులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు, పీబీసీ కాలువ ద్వారా పంటలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. పుణ్యకాలం పూర్తవుతున్నా ఎక్కడా కాలువల్లో పూడికతీత తీస్తున్న దాఖలాలు లేక ఇంకెప్పుడు చేస్తారో పనులు అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది సార్వాలో ఏలేరు వరదలు నియోజకవర్గంలో పంటలను నట్టేట ముంచేయగా రబీలో అకాల వర్షాలు పంటలను నాశనం చేశాయి. ఒకపక్క కాలువలు, తూములు, స్లూయిజ్లన్నీ మరమ్మతులకు గురై శిథిలావస్థలో ఉన్నాయి. ఎక్కడా సాగునీరు సక్రమంగా పారే పరిస్థితి లేదు. పంట విరామ సమయంలో అన్నీ పూర్తి చేస్తారని ఆశగా ఎదురు చూశామని, కానీ ఎక్కడా పనులు చేయకపోవడంతో ఈ ఏడాది నష్టాలు తప్పవని రైతులు వేదన వ్యక్తం చేస్తున్నారు. -
ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై..
ఫ దైనందిన జీవనంలోకి సత్య చంద్రశేఖరేంద్రుని తల్లిదండ్రులు ఫ ధన్వంతరి దంపతులకు ఘనంగా సన్మానం అన్నవరం: కడుపున పుట్టిన పుత్రుడు ప్రయోజకుడైతే ఆ తల్లిదండ్రుల ఆనందం మాటల్లో చెప్పలేనిది. అటువంటిది తమ పుత్రుడు దుడ్డు వేంకట సత్య సూర్య గణేష్ శర్మ ద్రావిడ్.. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా సన్యాస దీక్ష స్వీకరించి.. సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా ప్రభవించి.. సాక్షాత్తూ ఆదిశంకరాచార్యుడే పీఠాధిపత్యం వహించిన కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా.. తదుపరి పీఠాధిపతిగా పూజ్యనీయ స్థానం పొందడం చూసి.. ఆయన తల్లితండ్రులు మంగాదేవి, ధన్వంతరి దంపతులు ఎంతో పొంగిపోతున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అన్నవరానికి చెందిన యువ పండితుడు, చతుర్వేది గణేష్ శర్మకు గత నెల 30న అక్షయ తృతీయ పర్వదినం నాడు కంచి కామకోటి పీఠంలో సన్యాస దీక్ష ఇచ్చి, ఉత్తరాధికారిగా నియమించిన విషయం తెలిసిందే. అంతకు ముందే ఏప్రిల్ 29న గణేష్ శర్మ జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకుని, వారి బంధాలను విడనాడి, సన్యాస దీక్షకు సమాయత్తమయ్యారు. దీనికి సంబంధించిన వైదిక క్రతువులు వరుసగా నాలుగు రోజుల పాటు జరిగాయి. అప్పటి నుంచీ మంగాదేవి, ధన్వంతరి దంపతులు సుమారు 20 రోజుల పాటు కంచి పీఠంలోనే ఉన్నారు. గణేష్ శర్మను తమ కుమారుడిగా కాకుండా కంచి పీఠం ఉత్తరాధికారిగా, సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా దర్శిస్తూ వచ్చారు. అనంతరం, ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై.. ఆ దంపతులు నాలుగు రోజుల కిందట అన్నవరం చేరుకున్నారు. శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆదేశానుసారం దైనందిన జీవితం గడుపుతున్నారు. వారిని వారి బంధువు, అన్నవరం దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ ఆదివారం ఉదయం దేవస్థానానికి తీసుకుని వచ్చారు. సత్యదేవుని దర్శనానంతరం ఆలయంలో పండితులు ఆ దంపతులకు వేదాశీస్సులు అందజేశారు. అనంతరం, వారిని సత్యదేవుని కండువాతో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ సత్కరించారు. ఈఓ వీర్ల సుబ్బారావు సత్యదేవుని చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం వేద పండితులు, అర్చకులు, వ్రత పురోహితులు ఆ దంపతులను అభినందించారు. యథాప్రకారం సత్యదేవుని సేవలో.. నేను యథాప్రకారం సత్యదేవుని సేవలో పాల్గొంటాను. తెలిపారు. వ్రత పురోహితునిగా వ్రతాలు నిర్వహించడంతో పాటు సత్యదేవుని పూజలు, ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాను. – దుడ్డు ధన్వంతరి భిన్నమైన జీవనం గడుపుతున్నారు ధన్వంతరి భార్య మంగాదేవి నా మేనకోడలు. వారి ఏకై క కుమారుడికి సన్యాస దీక్ష ఇచ్చి, కంచి పీఠం ఉత్తరాధికారిగా నియమించేందుకు అంగీకరించిన ఆ దంపతుల త్యాగం వెల కట్టలేనిది. సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి సేవలో సుమారు 20 రోజులు గడిపి, తిరిగి అన్నవరం వచ్చిన ఆ దంపతులు గతానికి భిన్నమైన జీవనం గడుపుతున్నారు.వారితో పాటు మా జన్మ కూడా ధన్యమైంది. – నాగాభట్ల కామేశ్వరశర్మ -
21 నుంచి ట్రాఫిక్ మళ్లింపు
సామర్లకోట: భారత్ మాల జాతీయ రహదారి బ్రిడ్జి పనుల నేపథ్యంలో ఈ నెల 21 నుంచి సామర్లకోట – కాకినాడ కెనాల్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లించనున్నారు. అచ్చంపేట జంక్షన్ నుంచి సామర్లకోట ఏడీబీ రోడ్డులోని రాక్ సిరామిక్స్ వరకూ ఈ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జికి స్తంభాల నిర్మాణం అధునాతన సాంకేతిక పద్ధతిలో పూర్తి చేశారు. ఈ స్తంభాలను కలుపుతూ రెడీమేడ్ గర్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వాటిని ఆయా ప్రదేశాలకు చేర్చారు. సామర్లకోట – కాకినాడ రోడ్డులో ముత్యాలమ్మ ఆలయం వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జికి ఈ నెల 21 నుంచి ఈ గర్డర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సామర్లకోట – కాకినాడ కెనాల్ రోడ్డులో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకూ ట్రాఫిక్ మళ్లించాలని కలెక్టర్ షణ్మోహన్ ఇప్పటికే ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సామర్లకోట – కాకినాడ మధ్య ప్రయాణించే వారు అచ్చంపేట, పనసపాడు, సర్పవరం మీదుగా వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, అచ్చంపేట – సామర్లకోట మధ్య ఉన్న బ్రిడ్జిలో ఈ నెల 27 నుంచి గర్డర్లు ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో సామర్లకోట – అచ్చంపేట ఏడీబీ రోడ్డులో వాహనాలను ఈ నెల 27, 28 తేదీల్లో కెనాల్ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు. -
ప్రసాద్ నిర్మాణాలకు మూడోసారి టెండర్
ఫ రూ.18.98 కోట్లతో ఒకే ప్యాకేజీగా ఆహ్వానం ఫ 24 తుది గడువు అన్నవరం: కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ నిర్మాణాలకు అధికారులు ముచ్చటగా మూడోసారి టెండర్లు పిలిచారు. గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారి టెండర్లు పిలిచి, జనవరిలో రద్దు చేశారు. అనంతరం, రూ.18.98 కోట్ల అంచనాతో గత జనవరిలో రెండోసారి టెండర్లు పిలిచారు. విశాఖపట్నానికి చెందిన అనంత రాములు అండ్ కో 16 శాతం లెస్‌కు కొటేషన్ దాఖలు చేసి, ఈ టెండర్ దక్కించుకుంది. కొద్ది రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈలోగా గత నెల 30న సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా నిర్మించిన గోడ కూలిపోయి ఏడుగురు మృతి చెందారు. దీంతో, ఆ గోడ నిర్మించిన కాంట్రాక్టర్ అనంత రాములు అండ్ కోను ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ కాంట్రాక్టర్ కూడా ఆ కంపెనీయే కావడంతో ఇక్కడ కూడా ఆ సంస్ధ కాంట్రాక్ట్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో రూ.18.98 కోట్ల అంచనాతో ప్రసాద్ నిర్మాణాలకు ఈ నెల 15వ తేదీన ముచ్చటగా మూడోసారి షార్టు టెండర్లు పిలిచారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 24 ఆఖరు తేదీ. అనంతరం, వాటిని తెరచి, ఖరారు చేస్తారని టూరిజం శాఖ ఈఈ ఈశ్వరయ్య శ్రీసాక్షిశ్రీకి ఆదివారం తెలిపారు. -
చల్లగా చూడు స్వామీ!
పిఠాపురం: పట్టణంలో వేంచేసియున్న రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారు శనివారం విసనకర్రల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉగ్రరూపం చూపిస్తున్న వేసవిలో అందరినీ చల్లగా చూడాలని కోరుతూ స్వామివారికి తాటాకు విసనకర్రలతో అలంకారం చేశామని అర్చకుడు విజయ జనార్దనాచార్యులు తెలిపారు. వ్యాయామోపాధ్యాయ సంఘ అధ్యక్షుడిగా శ్రీనివాస్ నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా వ్యాయామోపాధ్యాయ సంఘ అధ్యక్షుడిగా పెద్దిశెట్టి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. సంఘం అధ్యక్ష ఎన్నికలు రామ్‌కుమార్ వ్యాయామోపాధ్యాయ సంఘ భవన్లో ఎన్నికల అధికారి వి.రవిరాజు ఆధ్వర్యాన శనివారం జరిగాయి. మొత్తం 191 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న శ్రీనివాస్‌కు 139 మంది, రవి సుందర్ కౌర్‌కు 51 మంది ఓట్లు వేశారు. దీంతో నూతన అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఎన్నికై నట్లు ప్రకటించారు. -
మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా ఉపసంహరణ
సామర్లకోట: తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నానని మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ శనివారం మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్యకు వినతిపత్రం అందజేశారు. సొంత పార్టీకి చెందిన 22 మంది సభ్యులు చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం కోరుతూ గత నెల 2న జిల్లా కలెక్టర్‌కు విజ్ఞాపన అందజేశారు. ఆ మేరకు ఈ నెల 15న అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ అనుమతించారు. దీనికి ముందుగానే అరుణ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, కమిషనర్‌కు అందజేశారు. ఈ నేపథ్యంలో రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు తిరిగి ఆమె లేఖ ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చైర్పర్సన్ రాజీనామా చేయడంతో అవిశ్వాస తీర్మానానికి మెజార్టీ సభ్యులు రాకపోతే తీర్మానం వీగిపోయిందనే ఎత్తుగడలో భాగంగానే రాజీనామా డ్రామా ఆడారనే వాదనలు వినిపిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 21 మంది సభ్యులు హాజరు కావాల్సి ఉండగా.. ఆ సమావేశానికి 25 మంది హాజరై అవిశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే, అలా అవిశ్వాస తీర్మానం చేయడానికి వీలులేదని చైర్పర్సన్ అరుణ కోర్టును ఆశ్రయించారు. దీంతో, అవిశ్వాస తీర్మానంపై అధికారికంగా ప్రకటన చేయలేదు. దీనిని ఆధారంగా చేసుకొని అరుణ రాజీనామాను ఉపసంహరించుకుని ఉండవచ్చనే వాదనలు ఉన్నాయి. ఇప్పటికే చైర్పర్సన్ అరుణ, ఆమె భర్త కృష్ణమూర్తిలను వైఎస్సార్ సీపీ సస్పెండ్ చేసింది. ఈ నెలలో జరిగే కౌన్సిల్ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించే అవకాశం ఉన్నప్పటికీ, అజెండాలోని అంశాలను ఆమోదించకుండా మెజార్టీ సభ్యులు బహిష్కరించే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం ఆమో దం పొందిన తరువాత అజెండాపై ఆమె ఏవిధంగా సంతకం చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ప్చ్.. కళ కట్టలే..
అన్నవరం: గతంతో పోలిస్తే ఈ ఏడాది సత్యదేవుని కల్యాణోత్సవాలు పెద్దగా కళ కట్టలేదనే విమర్శ భక్తుల నుంచి వస్తోంది. అలంకరణల నుంచి సంప్రదాయానికి విరుద్ధంగా కొన్ని క్రతువులు నిర్వహించడం వరకూ ఇప్పటికీ చర్చ నడుస్తోంది. పూర్తి స్థాయిలో కానరాని అలంకరణ ఫ సత్యదేవుని కల్యాణోత్సవాలు ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకూ నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల దివ్యకల్యాణం 8వ తేదీ రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణ వేదిక అలంకరణ బాగుంది. కానీ, వేదిక ముందున్న విశ్రాంతి షెడ్డు పై భాగంలో ఎటువంటి అలంకరణా చేయలేదు. ఏటా కల్యాణోత్సవాల సందర్భంగా ఈ షెడ్డు పై భాగాన్ని అందమైన వస్త్రంతో కవర్ చేసి, దానికి పూలమాలలు, విద్యుద్దీపాలతో అలంకరించేవారు. ఈసారి అటువంటిదేమీ లేకపోవడంతో షెడ్ వెలవెలబోయినట్లు కనిపించింది. ఫ కల్యాణోత్సవానికి వచ్చిన వీఐపీలకు స్వామివారి ప్రసాదాలు, కల్యాణ అక్షతలతో పాటు నూతన వస్త్రాలు బహూకరించడం ఆనవాయితీ. ఈసారి ముగ్గురు ఎమ్మెల్యేలకు వీటిని అందజేశారు. కానీ, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌కు కనీసం అక్షతలు కూడా ఇవ్వకపోవడం వివాదానికి తావిచ్చింది. దీనిపై ఆయన కల్యాణ వేదిక వద్దనే ఈఓ ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. హోమాల నిలిపివేత రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి ప్రతి శుక్రవారం చండీహోమం, అమావాస్య, పౌర్ణమి నాడు ప్రత్యంగిర హోమం నిర్వహిస్తారు. సత్యదేవుని కల్యాణోత్సవాల్లో కూడా ఈ హోమాలు ఎప్పుడూ ఆపలేదు. ఈసారి మాత్రం ఈ హోమాలు నిలిపివేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై అన్నివైపుల నుంచీ విమర్శలు రావడంతో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు వైదిక కమిటీ సభ్యులతో గత మంగళవారం సమావేశమయ్యారు. హోమాలు ఎందుకు నిలిపివేశారో వివరణ ఇవ్వాలని నిలదీశారు. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి వైదిక కార్యక్రమాల నిర్వహణపై శృంగేరి పీఠాధిపతి సూచనలు పాటించాలని నిర్ణయించారు. హోమాల నిలిపివేతపై ‘సాక్షి’ ఈ నెల 8వ తేదీ నుంచి వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై మొదట్లోనే స్పందించి, హోమాలు నిర్వహించాలని ఆదేశించి ఉంటే అసలు ఈ వివాదమే తలెత్తేది కాదు. రథోత్సవం వెలవెల ఫ అసలే మే నెల ఎండ.. దానికి తోడు అగ్నికత్తెరలు.. నిప్పులు కక్కుతున్న సూరీడు.. సాయంత్రం ఆరు గంటలకు కూడా బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి. ఇటువంటి వాతావరణంలో ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు సత్యదేవుని రథోత్సవం నిర్వహించారు. వాతావరణం వేడిగా ఉండటంతో ఈ ఉత్సవం ప్రారంభంలో పట్టుమని వంద మంది భక్తులు లేరు. చివరిలో అంటే రాత్రి 7.30 గంటల సమయానికి రెండు మూడు వేల మంది మాత్రం వచ్చారు. ఫ సాధారణంగా రథోత్సవం సందర్భంగా రథానికి కట్టిన పగ్గాలను భక్తులు లాగుతారు. కానీ, భద్రత పేరుతో సత్యదేవుని రథం పగ్గాలను భక్తులను పట్టుకోనివ్వలేదు. ముందు ట్రాక్టర్ ఉంచి, దానికి కట్టి లాగించారు. రథానికి వెనుక సపోర్టుగా జేసీబీకి పగ్గాలు కట్టారు. దీంతో, ఇదేం రథోత్సవమని విస్తుపోవడం భక్తుల వంతైంది. ఫ ఉత్సవాల్లో ఎప్పుడు ఊరేగింపులు నిర్వహించినా భక్తులకు ప్రసాదాలుగా పులిహోర, శనగలు పంిపిణీ చేసేవారు. ఈసారి అటువంటిదేమీ లేదు.సంప్రదాయానికి విరుద్ధంగా..ఉత్సవాల చివరి రోజున నిర్వహించిన శ్రీపుష్పయాగం నిర్వహణపై కూడా విమర్శలు వచ్చాయి. ఏటా స్వామివారు పడుకుని ఉండగా, అమ్మవారు ఎడమవైపు ఉండి కాళ్లు ఒత్తుతున్నట్టు పవళింపు సేవలో అలంకరణ చేసేవారు. ఈసారి స్వామివారు అమ్మవారి తొడ మీద పడుకుంటే అమ్మవారు విసన కర్రతో విసురుతున్నట్టు అలంకరించారు. ఈ క్రమంలో సంప్రదాయానికి విరుద్ధంగా స్వామివారికి అమ్మవారు కుడివైపు వచ్చారు. ఇది ఎబ్బెట్టుగా ఉందని పలువురు విమర్శించారు. అమ్మవారి చేతిలో అందమైన రంగురంగుల విసనకర్ర లేదా నెమలి ఈకల విసనకర్రనో ఉంచితే బాగుండేదని, చిన్న తాటాకుల విసనకర్రతో సరిపెట్టేశారని పలువురు పెదవి విరిచారు. ఈసారి శ్రీపుష్పయాగంలో పుష్పాలు కూడా తక్కువగానే ఉపయోగించారు. ఏటా పెద్ద వయస్సున్న వేదపండితుల దంపతులు, ఆ తరువాత అదే వయస్సు కలిగిన ప్రధానార్చకుల ఐదు జంటలకు దంపత తాంబూలాలు ఇచ్చేవారు. కానీ, ఈసారి పెద్దలను పక్కన పెట్టి, చిన్న వయసులో ఉన్న దంపతులకు ఈ తాంబూలం ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. దంపత తాంబూలంలో ఇచ్చిన కొబ్బరి బొండాలు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయనే అసంతృప్తి వ్యక్తమైంది.ఫ కల్యాణం నాడు అంతంత మాత్రంగా అలంకరణ ఫ వనదుర్గ అమ్మవారికి హోమాల నిలిపివేతపై వివాదం ఫ రథోత్సవానికి ఎండదెబ్బ ఫ శ్రీపుష్పయాగంలో సంప్రదాయానికి భిన్నంగా స్వామికి కుడివైపు అమ్మవారు ఫ సత్యదేవుని కల్యాణోత్సవాలపై భక్తుల పెదవి విరుపు -
మన్నించండి మహారాజా..
పిఠాపురం: వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలు కరవు బారిన పడకూడదని.. పంటలు పుష్కలంగా పండాలనే సమున్నత లక్ష్యంతో పిఠాపురం మహారాజా సమకూర్చిన అపార జలనిధిపై జలవనరుల శాఖ అధికారులు అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారు. వేల ఎకరాలకు సాగు నీరు, లక్షలాది మందికి తాగునీరు అందించేందుకు ఆ మహనీయుడు నిర్మించిన భారీ చెరువు నిర్వహణను గాలికొదిలేశారు. కనీసం తూములు కూడా బాగు చేయించకపోవడంతో వందల క్యూసెక్కుల నీరు కడలి పాలవుతోంది. మరోవైపు చెరువు ఆక్రమణల పాలవుతున్నా కబ్జాదారులకు అండగా నిలుస్తూ రైతులు, ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పిఠాపురం మహారాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూర్ వంశం దాతృత్వానికి ఈ చెరువు మచ్చుతునక. దీనిని నిర్మించిన పిఠాపురం మహారాజా విగ్రహాన్ని ప్రజలు ఆ చెరువు గట్టుపై ఏర్పాటు చేసుకుంటే.. దాని నిర్వహణనూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆ విగ్రహం చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్లతుప్పలు పెరిగిపోయాయి. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 వేల ఎకరాల ఆయకట్టు పూర్వం తరచూ వర్షాభావ పరిస్థితులతో సాగునీరు లేక, పంటలు పండక రైతులు.. తాగునీరు లేక ప్రజలు, పశువులు అల్లాడిపోవడం చూసి మహారాజా కలత చెందారు. భవిష్యత్తులో ఎంత కరవు వచ్చినా తన రాజ్యంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని భావించారు. ఈ నేపథ్యంలో రాజా రావు బహద్దూరు (ఆర్ఆర్బీ) పేరిట 1841లో గొల్లప్రోలు మండలం చేబ్రోలు – మల్లవరం మధ్య 1,416 ఎకరాల విస్తీర్ణంలో పిఠాపురం మహారాజా అతి పెద్దదైన ఈ చెరువును నిర్మించారు. పదేళ్ల పాటు వానలు కురవక పోయినా సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరు, 2 లక్షల మందికి తాగునీరు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా పిఠాపురం మహారాజా చర్యలు తీసుకున్నారు. కొత్తపల్లి, గొల్లప్రోలు, తొండంగి మండలాల్లోని నాగులాపల్లి, రమణక్కపేట, ఏకే మల్లవరం, ఏపీ మల్లవరం, శ్రీరాంపురం, రావివారిపోడు, ముమ్మిడివారిపోడు, ఏవీ నగరం, కోదాడ, రావికంపాడు, ఎ.విజయనగరం, దుర్గాడ, తొండంగి తదితర 30 గ్రామాల్లోని దాదాపు లక్ష కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి ఉన్నాయి. పిఠాపురం బ్రాంచి కెనాల్, సుద్దగెడ్డ కాలువల నుంచి ఈ చెరువులోకి నీరు ప్రవహిస్తూంటుంది. ఈ చెరువు కింద ప్రస్తుతం సుమారు 15 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 50 వేల మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. మహారాజా సాక్షిగా మట్టి పాలవుతున్న జలనిధి ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ చెరువు నిర్వహణపై జలవనరుల శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపుతూండటంతో ఇది కాస్తా మట్టిదిబ్బగా మారుతోంది. ఈ చెరువుకు 14 తూములు, ఒక కళింగలు ఉన్నాయి. చెరువు నిండా నీరు పెడితే పదేళ్ల పాటు 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందుతుంది. అయితే తూములు, కళింగలు పూర్తి అధ్వాన స్థితికి చేరుకోవడంతో వర్షాలు కురిసినప్పుడు అదనపు నీరు వచ్చినా.. నిల్వ చేసే అవకాశం ఉండటం లేదు. ఈ తూముల షట్టర్లు పూర్తిగా శిథిలమై, మట్టితో పూడుకుపోవడంతో ఎప్పటి నీరు అప్పుడే సముద్రంలోకి పోతోందని రైతులు వాపోతున్నారు. ఈ విధంగా సుమారు 2 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని అంచనా. మరోవైపు తూములు పూడుకుపోయి సాగు నీరు అందక పంటలు నష్టపోతున్నారు. ఏటా కోట్లాది రూపాయలతో పనులు చేస్తున్నట్లు చెప్పుకునే ఇరిగేషన్ అధికారులు ఈ చెరువు వంక కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపిస్తున్నారు. పట్టించుకోని ప్రభుత్వం ప్రాచీన చరిత్ర, అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ చెరువు అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో, వరదలు, అధిక వర్షాలు వచ్చినప్పుడు ఆయకట్టులోని వేలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడి, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెరువులో నీటిని నిల్వ చేసే వీలు ఉండటం లేదు. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ చెరువును అభివృద్ధి చేయాలని, కళింగలు, తూములకు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. తాత్కాలిక మరమ్మతులు ఆర్ఆర్బీ చెరువు తాత్కాలిక మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. తాత్కాలిక మరమ్మతులకు మాత్రమే నిధులు విడుదలవుతున్నాయి. పూర్తి స్థాయిలో అభివృద్ధికి ఇంకా ఎటువంటి నిధులూ విడుదల కాలేదు. – సంతోష్ కుమార్, డీఈ, జలవనరుల శాఖఫ 1,400 ఎకరాల చెరువును పట్టించుకోని జలవనరుల శాఖ ఫ మహారాజా సాక్షిగా వందల క్యూసెక్కులు కడలి పాలు ఫ వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం -
మట్టి తవ్వకాలపై కన్నెర్ర
·˘ పాపిడిదొడ్డి చెరువులో అడ్డుకున్న ఎఫ్‌కే పాలెం రైతులు ·˘ ఇరు వర్గాల మధ్య ఘర్షణ, తోపులాటపిఠాపురం: ఎఫ్‌కే పాలెం పాపిడిదొడ్డి చెరువులో అక్రమంగా మట్టి తవ్వుతున్నారంటూ రైతులు శనివారం కన్నెర్ర చేశారు. మట్టి తవ్వడానికి తీసుకువచ్చిన యంత్రాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు, మట్టి మాఫియాకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాటలు, వాదోపవాదాలు జరగడంతో సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంతో సంబంధం లేని ఇటుక బట్టీల వ్యాపారులు దాడికి ప్రయత్నించడంతో స్థానిక రైతులు కొందరు కింద పడిపోయారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితం కావడంతో రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మట్టి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా కనీసంగా కూడా నోరు మెదపడం లేదని, మట్టి అక్రమార్కులకు వత్తాసు పలకడమేమిటని ప్రశ్నించారు. అయితే, మట్టి తవ్వకాలకు అనుమతులున్నాయని, అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని పోలీసులు పరోక్షంగా హెచ్చరించారు. మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకుని తీరుతామని రైతులు స్పష్టం చేశారు. మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్న చెరువును సీపీఎం జిల్లా సీనియర్ నాయకుడు డి.శేషుబాబ్జీ, స్థానిక నాయకులు కుంచె చిన్న, కోనేటి రాజు శనివారం పరిశీలించారు. రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. మరోవైపు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ చైత్రవర్షిణి, కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, సీఐ శ్రీనివాస్, తహసీల్దార్ గోపాలకృష్ణ ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మరొకరికి గాయాలు పిఠాపురం: దైవ దర్శనానికి కాలి నడకన వెళ్తున్న ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైన సంఘటన పిఠాపురం శివారు రాపర్తి జంక్షన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. పిఠాపురం పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. గొల్లప్రోలుకు చెందిన తొగర సూర్యలక్ష్మి, అడపా చంద్రకళ (35)లు శనివారం తెల్లవారుజామున గొల్లప్రో లు నుంచి పెద్దాపురం మండలం చిన తిరుపతి బయలుదేరారు. నడుచుకుంటూ వెళుతుండగా పిఠాపురం శివారు రాపర్తి జంక్షన్ వద్దకు వచ్చేసరికి అతి వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం వారిద్దరినీ బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలైన అడపా చంద్రకళ అక్కడికక్కడే మృతి చెందగా, సూర్యలక్ష్మికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన సూర్యలక్ష్మిని హైవే అంబులెన్సులో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. పిఠాపురం పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్త త్రిమూర్తులు అనారోగ్యంతో ఇంటి వద్దే ఉంటుండగా, కుమారుడు రాజేష్ ఇటీవలే పదో తరగతి పాసై ఇంటర్లో జాయిన్ అయ్యేందుకు సిద్ధపడుతున్నాడు. వీరిది నిరుపేద కుటుంబం. అంతా తానై కుటుంబాన్ని చూసుకునే చంద్రకళ మృత్యువాత పడడంతో ఆ కుటుంబం వీధిన పడిందని స్థానికులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు. నీకు నాలాగ పేదరికం ఉండకూడదని, తనను తల్లి చదివిస్తుందంటూ కుమారుడు రాజేష్ గుండెలవిసేలా విలపించాడు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఆ ఇంట్లో పెద్ద కష్టం
ఫ సైకిల్‌పై నుంచి పడిపోవడంతో ప్రమాదం ఫ మంచానికే పరిమితమైన ఇంటి పెద్ద ఫ ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు కొత్తపేట: ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది.. రెక్కాడితే గాని డొక్కాడని ఆ ఇంటి పెద్ద ప్రమాదానికి గురై మంచాన పడటంతో అతని 15 ఏళ్ల కుమారుడిపైనే భారం పడింది. ఒకపక్క తండ్రికి వైద్యం, మరోపక్క కుటుంబాన్ని నెట్టుకురావడం ఈ బాలుడికి ఇబ్బందిగా మారింది. ఇలా నలుగురు సభ్యుల ఆ కుటుంబం తీవ్ర దయనీయ స్థితిలో ఉంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేట కొప్పిశెట్టివారి వీధికి చెందిన షేక్ అహ్మద్ యాకూబ్ ఆలీషా (48)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తాపీమేస్త్రి వద్ద కూలీగా పనిచేస్తూ ఆలీషా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. గతేడాది నవంబరులో ఒకరోజు రాత్రి కూలిపని ముగించుకుని సైకిల్‌పై ఇంటికి వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ హెడ్లైట్లు కాంతి కంట్లోకి కొట్టి కళ్లు కనిపించక సైకిల్ అదుపుతప్పి రోడ్డు మార్జిన్లో రాళ్లపై పడిపోయాడు. మెడ కింద వెన్నెపూస నరాలు నలిగిపోయి కాళ్లు చచ్చుబడిపోయాయి. మొదట్లో రావులపాలెంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా కొన్ని రోజులు వైద్యం చేశారు. రోగం ముదిరిందే తప్ప తగ్గలేదు. తర్వాత అమలాపురంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వివిధ పరీక్షలు, కొన్ని రోజులు వైద్యం చేసి ఆపరేషన్ పడుతుందని, రూ.6 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఆపరేషన్‌కు రూ.30 వేలు మాత్రమే వస్తుందని, మిగిలింది బాధితులే భరించాలన్నారు. అప్పటికే అప్పులు చేసి, బంధువులు, తెలిసిన వారు చేసిన సాయంతో సుమారు రూ.3 లక్షల వరకూ ఖర్చు చేశారు. కానీ ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. సరికదా అనారోగ్యం ముదిరి పక్షవాతం వచ్చింది. ఇక ఆర్థిక స్తోమత లేక కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షలు చేసి ఆపరేషన్ చేస్తాం కానీ పూర్తిగా కోలుకుంటాడని చెప్పలేమని అక్కడి వైద్యులు చెప్పారని బంధువులు అంటున్నారు. దాంతో వద్దని చెప్పడంతో కొన్ని రోజులు వైద్యం చేసి డిచ్చార్జ్ చేశారు. నడవలేక మంచానికే పరిమితమైన ఆలీషాను నెలా, రెండు నెలలకోసారి ఫిజియోథెరపీకి కాకినాడ తీసుకు వెళుతున్నారు. వెళ్లిన ప్రతిసారి అంబులెన్స్‌కు రూ.10 వేలు, అక్కడ సిబ్బందికి రెండు, మూడొందలు ఇవ్వాల్సి వస్తుందని అతని భార్య బీబీజా వాపోయారు. భర్త మంచాన పడి, ఆదాయం లేకపోవడంతో పదో తరగతి పాసైన కుమారుడిపైనే వైద్యం ఖర్చులు, కుటుంబ పోషణ పడిందన్నారు. చదువుకు స్వస్తి చెప్పి కూలి పనికి వెళ్తున్నాడని, అయ్యే ఖర్చులకు తన కొడుకు సంపాదన సరిపోక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని బీబీజా ఆవేదనతో చెప్పారు. మంచాన పడిన వారికి ఇచ్చే పింఛను కోసం సదరం క్యాంపునకు వెళితే, 83 శాతం అంగవైకల్యం అని సర్టిఫికెట్లో పేర్కొన్నారు. కానీ టెంపరరీ అని రాశారని, దీనివల్ల పింఛను రాదన్నారని బీబీజా వాపోయారు. దీనావస్థలో ఉన్న ఈ కుటుంబానికి దాతలు ఆపన్నహస్తం అందించాలని స్థానిక పీఎంపీ షేక్ హైదర్, మెడికల్ రిప్రజంటేటివ్ షేక్ మక్బుల్ కోరారు. -
అనాథరక్షకా.. ఆపద్బాంధవా..
ఫ గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి ఫ ఒక్కరోజే రూ.51.96 లక్షల ఆదాయం కొత్తపేట: అనాథరక్షకా.. ఆపద్బాంధవా.. గోవిందా.. అంటూ వేలాది భక్తులు ఆ స్వామిని కొలిచారు. గోవింద నామస్మరణతో ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మార్మోగింది. శనివారం వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు వాడపల్లి బాట పట్టారు. గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. భారీ క్యూలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కుబడులు సమర్పించారు. ఏడు శనివారాల నోము ఆచరించే భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఇతర అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో ప్రారంభించి వివిధ సేవలు నిర్వహించారు. రంగురంగుల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. స్వామి దర్శనం, తీర్థప్రసాదాలు స్వీకరణ అనంతరం అన్నసమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఒక్కరోజు దేవస్థానానికి వివిధ సేవల ద్వారా రూ.51,96,999 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆలయం వద్ద రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము బందోబస్తు పర్యవేక్షించారు. అలాగే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా వాడపల్లికి ప్రత్యేక బస్సులు నడిచాయి. -
అనుమానాస్పద స్థితిలో జంట ఆత్మహత్య?
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలో ఒక జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం కలకలం రేపింది. సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ కథనం ప్రకారం.. సామర్లకోట నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఓ రైలుకు అడ్డుగా ఆ జంట నిలబడి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాల వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో రైల్వే పోలీసులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వాటిని తరలించారు. అయితే కాకినాడలోని ఓ ఆఫీస్‌లో అకౌంటెంట్‌గా సదరు వ్యక్తి పని చేస్తున్నట్లు, ఆ మహిళ నర్సుగా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారని రైల్వే మేనేజర్ రమేష్ వివరించారు. ఆ జంటకు వేర్వేరుగా వివాహాలు కాగా, ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు రాత్రి వరకూ ఎటువంటి వివరాలు చెప్పకపోవడం గమనార్హం. -
రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
తుని: తుని– అన్నవరం మధ్యలో రైలు నుంచి జారిపడి అర్లి ఈశ్వరరావు (23) మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొంపంగి గ్రామానికి చెందిన ఈశ్వరరావు తొండంగి మండలం దివీస్ ఫార్మా కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇటీవల సొంత గ్రామానికి సెలవుపై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గజపతినగరంలో రైలు ఎక్కి అన్నవరం రైల్వే స్టేషన్‌కు వస్తుండగా జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద సెల్ ఫోన్ ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
అంబాజీపేట: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబాజీపేట మండలం ముక్కామల, వక్కలంక వంతెనకు మధ్య ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. స్థానికులు, సమీప బంధువుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా నిజామ్పేటకు చెందిన దొమ్మేటి శ్రావణ్‌కుమార్, అతని భార్య రేఖాలక్ష్మి (38), వీరి కుమార్తెలు లాస్య, మోహనగన ప్రియతో పాటు రేఖాలక్ష్మి అమ్మమ్మ కె.ధనలక్ష్మితో కలసి కారులో శనివారం ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. అనంతరం అమలాపురం వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ముక్కామల వచ్చేసరికి అమలాపురం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్‌ను వీరి కారు బలంగా ఢీకొంది. దాంతో కారులో ఉన్న రేఖాలక్ష్మికి తీవ్రగాయాలు కాగా 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. శ్రావణ్‌కుమార్, లాస్య, మోహనగన ప్రియ, ధనలక్ష్మిలకు తీవ్ర గాయాలు కాగా అమలాపురంలో ఓ ఆస్పత్రికి తరలించారు. రేఖాలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై కె.చిరంజీవి పరిశీలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రావణ్‌కుమార్ నిజామ్‌పేటలో స్థిరపడి అక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇతనిది యానం కాగా, మృతురాలి తల్లిదండ్రులది అమలాపురం. పళ్లాలమ్మ జాతరకు వచ్చి... వారం రోజుల కిందట నిజామ్పేట నుంచి వానపల్లి పళ్లాలమ్మ అమ్మవారి జాతర చూసేందుకు వచ్చి అమలాపురంలో మృతురాలి తల్లి ఇంటి వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులంతా కలసి వెళ్లారు. అనంతరం యానం వెళ్దామనుకుని అమలాపురం వస్తుండగా ప్రమాదం జరిగిందని బంధువులు చెప్పారు. వారం రోజుల పాటు బంధువులతో సంతోషంగా గడిపిన ఆ కుటుంబానికి ఇంతలో ప్రమాదం జరగడంతో అంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. వేసవి సెలవులకు వచ్చిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంటుందని అనుకోలేదని బంధువులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. వివాహిత మృతి, నలుగురికి తీవ్ర గాయాలు -
పిఠాపురం రూరల్‌లో మరోసారి ఉద్రిక్తత
కాకినాడ జిల్లా: పిఠాపురం రూరల్‌లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫక్రుద్దీన్ పాలెం( ఎఫ్.కే.పాలెం) పాపిడి దొడ్డి చెరువులో మట్టి తవ్వేందుకు యత్నించగా.. జేసీబీని రైతులు అడ్డుకున్నారు. చెరువును పరిశీలించిన సీపీఎం నేతలు.. చెరువులో మట్టి తవ్వుకునేందుకు ఎమ్మార్వో అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.3.5 ఎకరాల కోసం 360 ఎకరాలను బీడుగా మారుస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పొలం మెరక పేరుతో చెరువులో మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తారని ఆరోపించారు. పంచాయితీ తీర్మానం, రైతులు అభిప్రాయం తీసుకోకుండా ఎమ్మార్వో మట్టి తవ్వకాలకు ఏలా అనుమతి ఇస్తారంటూ సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన ఉంటారో లేక వ్యాపారుల పక్షాన ఉంటారో తేల్చుకోవాలంటూ సీపీఎం నేతలు హెచ్చరించారు. -
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
కాకినాడ జిల్లా: తుని రూరల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు రాజమండ్రి అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు. మరో ఘటనలో కడియం-రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ల మధ్య రైలునుంచి జారి పడి సుమారు 50 ఏళ్ల వయసుగల వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని జీఆర్ఫీ ఎస్సై మావుళ్లు తెలిపారు. గాయపడి ఉండగా శుక్రవారం తెల్లవారు జామున గుర్తించి 108 అంబులెన్సు ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.మృతుడు నలుపు రంగుపై పసుపు రంగు గడులు గల హాఫ్ హాండ్స్ షర్ట్, నీలం రంగు లుంగీ ధరించాడు. మృతుడి కుడి చేయి మీద సన్ ఫ్లవర్ గుర్తుతో పచ్చబొట్టు ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94406 27551, 94910 03239 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
సమస్యలపై ప్రజాపోరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సమస్యలపై ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని మేలుకొల్పేలా పోరుబాటకు వైఎస్సార్ సీపీ సిద్ధమవుతోంది. ఇందుకు పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా రానున్న రెండు నెలల్లో మండల, గ్రామ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే జూన్ లోగా ఇంకా మిగిలిన మండలాలు, జూలైకల్లా గ్రామ స్థాయి కమిటీల నియామకాలు పూర్తి చేయాలని సూచించారు. కాకినాడ డి–కన్వెన్షన్‌లో శుక్రవారం జరిగిన పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమవ్వాలనేది ప్రధాన అజెండాగా నిర్ణయించారు. ఇందుకోసం ప్రజల సమస్యలపై పార్టీ స్థానిక నాయకత్వాలు శాంతియుత పంథాలో నిరసన కార్యక్రమాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వాన నిర్వహించిన ఆందోళనలపై ఈ సమీక్షలో చర్చించారు. ఇదే తరహాలో సమస్యలపై పోరుబాటకు సన్నద్ధం కావాలని నేతలకు బొత్స సూచించారు. జిల్లా స్థాయిలో సైతం పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని తీర్మానించారు. దీని కోసం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 50 రోజుల కార్యక్రమాన్ని ఖరారు చేశారు. వచ్చే జూన్ 1 నుంచి ప్రతి 10 రోజులకు ఒక జిల్లాలో పార్టీ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలను ఐదు జిల్లాల్లో 50 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. రైతులకు అండగా.. ఫ ప్రధానంగా వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలవాలని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారని బొత్స తెలిపారు. కళ్లాల్లో ధాన్యం ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయంపై ఈ సందర్భంగా చర్చించారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్న మాటలకు.. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితికి అసలు పొంతనే లేదని నేతలు సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయంలో రైతుల ఇబ్బందులు తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించి, వారితో మాట్లాడి, అండగా నిలవాలని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఫ ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని నిర్ధారించారు. రొయ్యల ధరలు పడిపోవడం, మేత ధరలు అడ్డగోలుగా పెరిగిపోయి రైతులు నష్టపోతున్నా సర్కార్‌కు చీమ కుట్టినట్టయినా లేదని, ఆక్వా రైతులకు వెన్నంటి నిలవాలని తీర్మానించారు. ఫ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాదిరిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పొగాకు రైతులకు అండగా నిలిచి, పోరాడటానికి సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. ఫ ప్రధానమైన ప్రజా సమస్యలపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు సైతం సిద్ధంగా ఉన్నారని బొత్స వివరించారు. ఫ సూపర్ సిక్స్ సహా కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ ప్రభుత్వంపై ప్రజాపోరులో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా బాధ్యత తీసుకోవడానికి నాయకులు ముందుకు వచ్చారు. ఫ క్షేత్ర స్థాయిలో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజలకు అండగా నిలిచి, మనోధైర్యం కల్పించాలని తీర్మానించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పండుల రవీంద్రబాబు, అనంత బాబు, బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, తానేటి వనిత, తోట నరసింహం, గొల్లపల్లి సూర్యారావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్‌రామ్, గిరజాల స్వామినాయుడు, పార్లమెంటరీ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పొన్నాడ సతీష్ కుమార్, జ్యోతుల చంటిబాబు, రౌతు సూర్యప్రకాశరావు, తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, పాముల రాజేశ్వరిదేవి, అంగూరి లక్ష్మీశివకుమారి, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు ముద్రగడ గిరిబాబు, పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, మహిళా నేతలు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మేడపాటి షర్మిలారెడ్డి, సుంకర శివప్రసన్న, జమ్మలమడక నాగమణి, పతివాడ నూక దుర్గారాణి, గాధంశెట్టి శ్రీదేవి, నేతలు సుంకర విద్యాసాగర్, అల్లి రాజబాబు, రాగిరెడ్డి బన్నీ, గండేపల్లి బాబీ, వాసిరెడ్డి జమీలు, చెల్లుబోయిన శ్రీనివాస్, గొల్లపల్లి డేవిడ్, మార్గాని గంగాధరరావు, పేరి శ్రీనివాసరావు, గుత్తుల మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రజలతో నేతలు మమేకమవ్వాలి ఫ ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అండ ఫ ఆక్వా రైతులకు వెన్నుదన్ను ఫ క్షేత్ర స్థాయి పర్యటనలకు అధినేత జగన్ ఫ ప్రతి 10 రోజులకు వైఎస్సార్ సీపీ జిల్లా సమావేశం ఫ జూన్ లోగా మండల కమిటీలు ఫ జూలైనాటికి గ్రామ కమిటీలు ఫ కాకినాడ సమీక్షలో పార్టీ నేత బొత్స దిశానిర్దేశం -
ఆకట్టుకున్న మాక్ డ్రిల్
కాకినాడ సిటీ: కలెక్టరేట్ పై అంతస్తులో అగ్నిప్రమాదం.. వెంటనే విపత్తు స్పందన సిబ్బంది నిచ్చెన సహాయంతో భవనం లోపలకు చేరుకుని, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిందికి తీసుకువచ్చారు.. బాధితులకు తక్షణం వైద్య సహాయం అందించేందుకు అప్పటికే సిద్ధంగా ఉంచిన 108 వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు.. ఇదంతా నిజమనుకునేరు.. అనుకోకుండా సంభవించే విపత్తులను ఎదుర్కొనేలా ఉద్యోగులు, ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో సంబంధిత శాఖల సిబ్బంది కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన మాక్ డ్రిల్‌లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఇందులో అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, వైద్య, ఆరోగ్య, విద్యుత్ తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. అగ్నిప్రమాదాల నుంచి ప్రజలను రక్షించే విధానాన్ని ఆ శాఖ సిబ్బంది కళ్లకు కట్టినట్లు చూపారు. అలాగే, ప్రమాద ప్రాంతం నుంచి ప్రజలను కాపాడటం, సహాయక చర్యలు తదితర అంశాలను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వివరించారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ భవనంలో కొంత భాగం కూలిపోయినట్లు ఊహించి.. అందులోని వారిని కాపాడే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. కూలిన భవనంలో చిక్కుకున్నవారిని గుర్తించేందుకు అధునాతన పరికరాల వినియోగాన్ని వివరించారు. గోడను కట్టర్లతో కట్ చేసి, భవనంలోకి ప్రవేశించి, లోపలున్న వారిని బయటకు తరలించడం తదితర అంశాలను చూపించారు. సీపీఆర్, అత్యవసర వైద్యంపై ఆ శాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ మాక్ డ్రిల్‌ను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా స్వయంగా పర్యవేక్షించారు. మాక్ డ్రిల్స్ ద్వారా భవిష్యత్తులో జరిగే నష్టాన్ని అరికట్టవచ్చని ఆయనన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ జె.వెంకటరావు, మూడో బెటాలియన్ ఎస్డీర్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ ఎం.మోహన్‌రావు, జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్ రాజేష్, డీఈఓసీ నోడల్ అధికారి, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఏఎస్‌డీసీ డి.భారతి తదితరులు పాల్గొన్నారు. -
అప్పులతో ఏపీ మరో పాకిస్తానే
ఫ మెడలు వంచైనా హామీలు అమలు చేయిస్తాం ఫ ధాన్యం కొనుగోలులో సర్కార్ ఘోర వైఫల్యం ఫ పౌర సరఫరాల మంత్రి చెప్పేదంతా బూటకమే ఫ సమస్యలపై ప్రజాక్షేత్రంలోకి జగన్ ఫ కాకినాడ సమీక్షలో రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తోందని, ఈ లెక్కలు చూస్తూంటే ఏపీకి ఆర్థికంగా పాకిస్తాన్‌కు పట్టిన గతే పడుతుందని వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. చెత్తతో కూడా సంపద సృష్టిస్తామని చెప్పి, ఆ చెత్తను తరలించే ట్రాక్టర్లను తీసేశారని, రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోవడం చంద్రబాబు ఘనతని ఆక్షేపించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పీఏసీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, పార్లమెంటరీ పరిశీలకులు, ముఖ్య నేతలతో కాకినాడలో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా చెప్పుకోదగ్గ ఉత్పత్తి ఆధారంగా ఒక్క పని అయినా చేయగలిగారా అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో మిగిల్చిన అప్పులతో కలిపి గడచిన ఐదేళ్లలో అప్పులు రూ.4.30 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో ఏటా రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లు మాత్రమే అప్పులు పెరిగాయన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏడాదిలోనే రూ.1.59 లక్షల కోట్ల అప్పులు చేసిన నిర్వాకం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇంతా చేసి పేదల సంక్షేమానికి ఏమీ ఖర్చు చేయలేదని చేసిన కోట్ల రూపాయల అప్పు ఎవరి ఖాతాల్లోకి పోయాయో, ఎవరు దోపిడీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో దళారీ వ్యవస్థ లేకుండా పేదలు, మధ్యతరగతి సంక్షేమం కోసం డీబీటీ ద్వారా నేరుగా వ్యక్తిగత ఖాతాలకు రూ.2.50 లక్షల కోట్లు జమ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు అప్పు చేసిన సొమ్ము పౌడర్లు, మేకప్‌లకు ఖర్చు చేశారని బొత్స ఎద్దేవా చేశారు. బాబు చెబుతున్నది చూస్తూంటే ఆయన చేతిలో అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. మద్యం విధానంపై వేధిస్తున్నారు మద్యం కుంభకోణం పేరుతో కొందరిని టార్గెట్ చేసి వేధిస్తూ, అప్రతిష్టపాల్జేస్తున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదన్నారు. మద్యం వ్యవహారంలో నిష్పక్షపాత విచారణను స్వాగతిస్తామని, కావాలని అన్యాయంగా కేసులు పెడుతూ పోతారా అని నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని తీర ప్రాంతంలో హార్బర్లు, వైద్య కళాశాలలు, ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రి, భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం వంటి ఉత్పత్తి, ఉపాధి ఆధారంగా పెట్టుబడులు పెట్టామని వివరించారు. సమస్యలపై ఆందోళనలు సమస్యలపై పార్టీ స్థానిక నాయకత్వం ఎక్కడికక్కడ ఆందోళనలకు సిద్ధమవుతోందని బొత్స చెప్పారు. ప్రధానమైన పొగాకు, ధాన్యం, ఆక్వా రైతుల సమస్యలపై వారికి అండగా నిలిచేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుని జగన్మోహన్రెడ్డి త్వరలో క్షేత్ర స్థాయికి వస్తారని తెలిపారు. పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా జూన్‌లో మండల, జూలై నెలాఖరుకు గ్రామ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని కాకినాడ సమీక్షలో తీర్మానించినట్లు చెప్పారు. జూన్ 1 నుంచి ప్రతి 10 రోజులకు ఒక జిల్లాలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని బొత్స వెల్లడించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, వంకా రవీంద్ర, బొమ్మి ఇజ్రాయిల్, పండుల రవీంద్రబాబు, అనంత ఉదయ్ భాస్కర్, కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం, ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేర్ కురసాల కన్నబాబు, ఉమ్మడి తూర్పు గోదావరి జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ జిల్లాల అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (తూర్పు గోదావరి), దాడిశెట్టి రాజా (కాకినాడ), చిర్ల జగ్గిరెడ్డి (కోనసీమ), పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ మంత్రులు తానేటి వనిత, పినిపే విశ్వరూప్, తోట నరసింహం, కారుమూరి నాగేశ్వరరావు, గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్‌రామ్, కోటగిరి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, దూలం నాగేశ్వరరావు, పొన్నాడ సతీష్‌కుమార్, తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, రౌతు సూర్యప్రకాశరావు, పాముల రాజేశ్వరిదేవి, పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు పాల్గొన్నారు. రైతుల ఇబ్బందులు పవన్‌కు పట్టవా? ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ ఘోర వైఫల్యం ప్రధానంగా గోదావరి జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తోందని బొత్స దుయ్యబట్టారు. కనీస మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం కొంటున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పేదంతా బూటకమన్నారు. గోదావరి ప్రాంతం నుంచి గెలుపొందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రైతుల వద్దకు రాకపోవడం వారి దురదృష్టమని అన్నారు. ధాన్యం కొనే నాథుడు లేక గోదావరి జిల్లాల రైతులు నానా యాతనా పడుతూంటే పవన్ కల్యాణ్ ఒక్కసారైనా ఈ ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించారా అని ప్రశ్నించారు. కోకో ధర కోసం అధికార పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే తదితరులు ఆందోళనకు దిగడం రాష్ట్రంలోని పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగాకు, ఆక్వా రైతుల ఇబ్బందులపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డితో చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా మరో రెండు హామీలివ్వాలని తామంతా ఒత్తిడి తెచ్చినా జగన్మోహన్రెడ్డి చేయగలిగిందే చెబుదామన్నారని, చంద్రబాబు మాదిరిగా అధికారం కోసం ఎడాపెడా హామీలు గుప్పించ లేదని బొత్స చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ సహా అన్ని హామీలనూ ప్రభుత్వ మెడలు వంచైనా సరే అమలు చేసేలా వైఎస్సార్ సీపీ ఒత్తిడి తెస్తుందని అన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలపై ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తమ పార్టీకి ప్రజలిచ్చిన 40 శాతం ఓటింగ్ చిన్న విషయం కాదన్నారు. ప్రజల తరఫున పోరాడేందుకు ప్రజలే వైఎస్సార్ సీపీకి రెండంకెల ఓటింగ్ ఇచ్చారన్నారు. -
కేదార్నాథ్ యాత్రలో రోటరీ క్లబ్ సభ్యుడి మృతి
రాజమహేంద్రవరం సిటీ: ఉత్తరాంచల్‌లోని కేదార్నాథ్ యాత్రకు వెళ్లిన రాజమహేంద్రవరానికి చెందిన రోటరీ క్లబ్ ఐకాన్ సభ్యుడు బిలిసెట్టి శ్రీరంగ కృష్ణ బదరి(33) బుధవారం కేదార్‌నాథ్‌లో మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా శుక్రవారం మృతదేహాన్ని నగరంలోని కంబాలసత్రం సమీపంలోని కృష్ణ బదరి నివాసానికి తీసుకువచ్చారు. కృష్ణ బదరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా, క్లబ్ అధ్యక్షుడు యిమ్మన్ని వెంకట్, క్లబ్ సభ్యులు మృతదేహానికి నివాళులు అర్పించారు. తీగల రాజా మాట్లాడుతూ చిన్న వయసులోనే సమాజ శ్రేయస్సుకు శ్రద్ధగా పనిచేసే క్లబ్ సభ్యుడు అకాల మరణం సమాజానికి తీరని లోటు అన్నారు. కృష్ణ బదరి అంత్యక్రియలను ఇన్నీసుపేట రోటరీ కై లాస భూమిలో నిర్వహించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
మంచి ఆర్కిటెక్ట్‌గా స్థిరపడతా..
28వ ర్యాంకర్ యజ్ఞేశ్వరి అమలాపురం టౌన్: ఏపీ ఈ సెట్ ఫలితాల్లో అమలాపురానికి చెందిన పితాని యజ్ఞేశ్వరి రాష్ట్ర స్థాయిలో 28వ ర్యాంక్ సాధించింది. ఆమె సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఈ ర్యాంక్‌ను కై వసం చేసుకుంది. ఆమె అమలాపురం ఆరు నెలలుగా పీఆర్ ప్రాజెక్ట్స్ విభాగంలో ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ఈమె తండ్రి వెంకటరమణ వడ్రంగి మేస్త్రిగా పనిచేస్తున్నారు. భవిష్యత్‌లో మంచి ఆర్కిటెక్ట్‌గా స్థిరపడాలన్నది తన లక్ష్యమని ఆమె పేర్కొంది. అమలాపురం పంచాయతీరాజ్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అభినందన సభలో యజ్ఞేశ్వరిని ఈఈ పులి రామకృష్ణారెడ్డి, డీఈఈ అన్యం రాంబాబు ప్రశంసించారు. -
ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్
60 గ్రాముల బంగారం, రూ.1.50 లక్షల నగదు స్వాధీనం అన్నవరం: ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులను మాటలతో మభ్యపెట్టి వారి బ్యాగుల్లో గల విలువైన ఆభరణాలు, నగదు అపహరిస్తున్న ఇద్దరు మహిళా దొంగలను శుక్రవారం స్థానిక బస్ కాంప్లెక్స్ వద్ద అరెస్ట్ చేసినట్టు ప్రత్తిపాడు సీఐ బీ సూర్య అప్పారావు తెలిపారు. అన్నవరం, ప్రత్తిపాడు బస్స్టేషన్ల వద్ద తమ బంగారు వస్తువులు దొంగలు అపహరించారని మహిళలు ఆయా పోలీస్స్టేషన్లలో కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. బస్టాండ్ల వద్ద నిఘా పెట్టారు. శుక్రవారం అన్నవరం బస్ కాంప్లెక్స్ వద్ద దొంగతనం చేస్తున్న ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వీరిని ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన నక్కా వెంకటలక్ష్మి, రామవరప్పాడుకు చెందిన నక్కా మంగగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 60 గ్రాముల బంగారం, రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి ప్రత్తిపాడు కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. సమావేశంలో అన్నవరం ఎస్ఐ శ్రీహరి బాబు, అడిషనల్ ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు. -
రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
రాజమహేంద్రవరం సిటీ: కడియం – రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ల మధ్య రైలునుంచి జారి పడి సుమారు 50 ఏళ్ల వయసుగల వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై మావుళ్లు తెలిపారు. గాయపడి ఉండగా శుక్రవారం తెల్లవారు జామున గుర్తించి 108 అంబులెన్సు ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. మృతుడు నలుపు రంగుపై పసుపు రంగు గడులు గల హాఫ్ హాండ్స్ షర్ట్, నీలం రంగు లుంగీ ధరించాడు. మృతుడి కుడిచేయి మీద సన్ ఫ్లవర్ గుర్తుతో పచ్చబొట్టు ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94406 27551, 94910 03239 నంబర్లలో సంప్రదించాలన్నారు. నిడదవోలులో.. నిడదవోలు : చాగల్లు –నిడదవోలు రైల్వేస్టేషన్ మధ్యలో శుక్రవారం విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న రైలు నుంచి జారిపడి 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడు నలుపు, సిమెంటు రంగు నెక్ బనియన్, నీలం రంగు ప్యాంట్ ధరించాడు. మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసినవారు 94906 17090, 99480 10061 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై అప్పారావు తెలిపారు. -
సివిల్స్ చదవడమే లక్ష్యం
జిల్లా 8వ ర్యాంకర్ స్పందన మామిడికుదురు: బీటెక్ పూర్తి చేసి సివిల్స్ చదవాలన్నదే తన లక్ష్యమని ఏపీ ఈసెట్‌లో కోనసీమ జిల్లా స్థాయిలో 8వ ర్యాంకు సాధించిన మొగలికుదురు గ్రామానికి చెందిన గోగి మోహిని స్పందన శుక్రవారం తెలిపింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన స్పందన బీఎస్సీ మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రతిభ చూపింది. తండ్రి సత్యనారాయణ రైతు, తల్లి వెంకటలక్ష్మి గృహిణి. పేరెంట్స్ ప్రోత్సాహంతో తాను చదువుకున్నానని తెలిపింది. ఏపీ ఈసెట్‌లో ప్రతిభ చూపిన మోహిని స్పందనను స్థానికులు అభినందించారు. వ్యవసాయ శాస్త్రవేత్తనవుతా.. మామిడికుదురు: ఏపీ ఈసెట్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో ఆదుర్రు గ్రామానికి చెందిన గుబ్బల సాయిమణిరత్నం రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సాధించాడు. తాను వ్యవసాయ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నానని అన్నాడు. శాస్త్రవేత్తగా రైతులకు మేలైన యంత్ర పరికరాలను తయారు చేసి, మంచి దిగుబడులు సాధించేలా కృషి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. సాయిమణిరత్నం తండ్రి లక్ష్మణరావు, తల్లి శ్యామలాదేవి దంపతులు రైతు కుటుంబానికి చెందినవారు. సాయిమణిరత్నంను స్థానికులు శుక్రవారం అభినందించారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
రూ.6,50,000 విలువైన వస్తువుల రికవరీ కోరుకొండ: మండలంలోని దోసకాయలపల్లిలో ఈ నెల 11వ తేదీన చోరీకి గురయిన రోవర్ మెషీన్, ల్యాబ్, లైటర్లను శుక్రవారం రికవరీ చేసినట్టు కోరుకొండ సీఐ సత్యకిషోర్ తెలిపారు. సర్వేయరు నాగేంద్ర రూ.6,50,000 విలువైన రోవర్ మెషీన్, ట్యాబ్, లైటర్లను దోసకాయలపల్లి సెంటర్లోని కిరాణాషాపులో చార్జింగ్ కోసం ఉంచాడు. తెల్లవారు దుకాణం తెరిచేటప్పటికే చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వగా, సీఐ సత్యకిషోర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. రాజమహేంద్రవరం బాలాజీపేటకు చెందిన రవివర్మ, అతని తమ్ముడు, క్వారి మార్కె ట్ సెంటర్‌కు చెందిన యేసును పట్టుకున్నారు. వారి నుంచి వస్తువులను స్వాధీనం చేసుకొని బాధితులకు అందజేశారు. -
‘కుట్రతోనే లిక్కర్ స్కామ్ అంటూ అక్రమ కేసు’
కాకినాడ: తమ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ,వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో పని చేస్తోందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో నిజంగా తప్పు జరిగి ఉంటే, నిష్పాక్షికంగా జరిపే ఎలాంటి విచారణనైనా స్వాగతిస్తామని ఆయన వెల్లడించారు. కానీ రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు విచారణల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదని, ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండ గడతామని కాకినాడలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు.బొత్స ఇంకా ఏం మాట్లాడారంటే..కూటమి ప్రభుత్వం దారుణ వ్యవహారంకూటమి ఏడాది పాలనలో పార్టీల హనీమూన్ ముగిసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. కూటమి పాలనలో అవినీతి, దోపిడీ తప్ప ప్రజా సంక్షేమం, అభివృద్ది ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయ కక్ష సాధింపులకే మొత్తం సమయాన్ని వెచ్చిస్తున్నారు.ఎన్నికల మందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు పెట్టుబడి సాయం, ప్రతి కుటుంబానికి ఏటా మూడు ఉచిత సిలిండర్లు, ఏటా 4 లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నెలా ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేల భృతి, ఆడబిడ్డ నిధి కింది ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. కానీ, ఏడాది గడుస్తున్నా వాటిలో ఏదీ అమలు చేయడం లేదు.మరోవైపు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అంతులేని అవినీతి. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కేవలం 99 పైసలకే దాదాపు 3 వేల కోట్ల విలువైన భూముల అప్పగింత. ఇంకా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ.. ‘సీజ్ ది షిప్’ అని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నానా హంగామా చేశారు. ఒక్క బియ్యం గింజ కూడా అక్రమంగా రవాణా చేయడానికి వీలులేదని అన్నారు. కానీ ఒక్క దానిపైనా చర్యలు లేవు. పోలీసుల జులుంతో ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు. అందుకే ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు.తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారు?ఏడాది పాలనలోనే ఏకంగా రూ.1.59 లక్షల కోట్లు అప్పులు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతలా ఏడాదిలో అప్పులు చేయలేదు. ఇంత అప్పులు తెచ్చి ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమానికి ఖర్చు చేశారు? మా హయాంలో అప్పులు చేసినా, వివిధ పథకాల కింద రూ.2.73 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. మరి కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు దేనికి వినియోగించారో చెప్పాలి. సంపద సృష్టిస్తాను. అది తనకు బాగా తెలుసు అని ప్రచారం చేసిన చంద్రబాబు, మరి ఇన్ని అప్పులు, ఇంత తక్కువ సమయంలో ఎందుకు చేశారు? అప్పు చేయడం. ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేయడం చంద్రబాబుకు బాగా అలవాటు.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొంత అప్పు చేసినా, ఆ ఖర్చులకు ఒక అర్థం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, తీర ప్రాంతాల్లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, బోగాపురం ఎయిర్పోర్ట్.. ఇలా ఉత్పాదకతకు దోహదం చేసే వాటికి ఖర్చు చేశాం. మాట ఇస్తే, దాన్ని తప్పకుండా నెరవేర్చాలనేది జగన్‌గారి విధానం. అందుకే ఎన్నికల ముందు, టీడీపీ కూటమి మాదిరిగా, అడ్డగోలు హామీలు ఇవ్వలేదు.పార్టీ కార్యాచరణ. నిర్ణయాలువైఎస్సార్సీపీ అయిదు జిల్లాల ముఖ్య నేతలతో ఈరోజు (శుక్రవారం) సమావేశం నిర్వహించాం. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ కమిటీల ఏర్పాటు, ప్రతి జిల్లాలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకున్నాం. అలాగే గోదావరి జిల్లాల్లో ధాన్యం సేకరణపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడంతో పాటు, తీర ప్రాంతాల్లోని ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని నిర్ణయించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో పొగాకు రైతులు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పొగాకు రైతులు ఇదే సమస్యలపై ఇబ్బంది పడుతున్నారు.దీనిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, పొగాకు రైతులను కలిసి నేరుగా వారితో మాట్లాడనున్నారు. తదుపరి పొగాకు కొనుగోళ్ళపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పార్టీ పరంగా కార్యాచరణను ఖరారు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పొగాకు మద్దతు ధర లభించని సందర్భంగా మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆ మొద్దునిద్ర నుంచి ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు రైతుల పక్షాన పోరాడతామని బొత్య సత్యనారాయణ హెచ్చరించారు. -
గడువులోగా హైవేల నిర్మాణం
కాకినాడ సిటీ: జిల్లాలో చేపట్టిన వివిధ జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), రెవెన్యూ, సర్వే, ఏపీఈపీడీసీఎల్, పోలవం ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జాతీయ రహదారి 216 కాకినాడ–కత్తిపూడి, కాకినాడ పోర్టు–అచ్చంపేట, అచ్చంపేట–సామర్లకోట, వాకలపూడి–అన్నవరం వరకు నిర్మించనున్న జాతీయ రహదారులు, నిర్మాణ దిశలో ఉన్న రహదారుల పనులు పురోగతి, ఇతర భూసేకరణ, టెండర్లు ప్రక్రియలపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులతో చర్చించారు. ఎన్హెచ్ఎఐ పీడీ డి.సురేంద్ర, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జి ప్రసాద్, తహసీల్దార్లు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛదివస్ కార్యక్రమాన్ని బీట్ ది హీట్ థీమ్‌తో నిర్వహించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర ఉష్ణోగ్రతలు, హ్యుమిడ్ వాతావరణంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం సూచించిన వివిధ అంశాలతో ఈ నెల స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. -
టెన్త్ సప్లిమెంటరీకి ఏర్పాట్లు
కాకినాడ సిటీ: ఈ నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పదో తరగతి విద్యార్థులకు, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై డీఆర్వో జె.వెంకటరావు, రెవెన్యూ, పాఠశాల విద్య, ఓపెన్ స్కూల్ సొసైటీ, పోస్టల్, జిల్లా పరిషత్, పోలీస్, ట్రెజరీ, రవాణా, విద్యుత్, వైద్య ఆరోగ్యం, ఆర్టీసీ, పంచాయతీ, మునిసిపల్ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాల్లో 5,956 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ప్రశ్నాపత్రాలు స్టోరేజీ నిమిత్తం 18 పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో పదోతరగతి (ఓపెన్ ఎస్ఎస్సీ), ఓపెన్ ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని డీఆర్వో తెలిపారు. రెగ్యులర్ పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలతో పాటు ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడిట్ సప్లమెంటరీ పరీక్షలు ఉదయం పూట నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి జిల్లాలో 1,151 మంది విద్యార్థులకు నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి పి రమేష్, డీటీసీ లక్ష్మికిరణ్, పోస్టల్ పీఆర్ఐపీ కె.ప్రసాదరావు, డీసీఈబీ సెక్రటరీ ఎం.వెంకటరావు, ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారి పి సాయివెంకటరమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ నేత కన్ను
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీలో జరుగుతోన్న భూ భాగోతమిది. ఈ భాగోతం ప్రస్తుతం కాకినాడ రెవెన్యూలో హాట్‌టాపిక్‌గా మారింది. నగర పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 579లో గ్రామ పంచాయతీకి 1.52 ఎకరాల భూమి గ్రామ కంఠంగా ఉంది. ఈ విషయం గొల్లప్రోలు ఫెయిర్ అడంగల్‌లో స్పష్టంగా ఉందని అక్కడి ప్రజలు, నేతలు చెబుతున్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో ఇళ్ల నిర్మాణాలు పెరగడంతో ఇక్కడ భూముల ధరలు బాగా పెరిగాయి. ఈ ఎకరా 52 సెంట్లు భూమి 7,296 గజాలు వస్తోంది. తహసీల్దార్ కార్యాలయానికి సమీపాన తాటిపర్తి రోడ్డు పక్కన గజం రూ.30వేలు పైనే పలుకుతోంది. అదే ఈ భూమికి పరిసరాల్లో గజం రూ.20వేలు ఉంది. ఈ లెక్కన చూసుకుంటే గ్రామకంఠంగా చెబుతోన్న ఈ భూమి విలువ సుమారు రూ.15 కోట్లు పలుకుతోంది. ఈ ప్రాంతంలో భూముల విలువ పెరిగిపోవడంతో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత కన్ను దీనిపై పడింది. అలాగని ఆయన ఎక్కడా బయట పడకుండా తెరవెనుక చక్రం తిప్పుతూ భూ బదలాయింపు ప్రక్రియ నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రజల ఆస్తిని కాపాడాలి
వివిధ దశల్లో రెవెన్యూ అధికారులు, మున్సిపల్ ఆర్డీ సర్వే నంబర్ 579లో 1.52 ఎకరాల భూమిని పక్కాగా ప్రభుత్వ భూమి అని నిర్థారించారు. గొల్లప్రోలు నగర పంచాయతీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఇదే విషయాన్ని న్యాయస్థానానికి నివేదించింది. మూడేళ్లుగా నడుస్తోన్న ఈ వ్యవహారంలో అధికారులు పక్కాగా రికార్డులు ప్రకారం గ్రామ కంఠం, ప్రభుత్వ భూమి అని చెబుతూనే ఉన్నారు. ఈ భూమిలో ప్రజాప్రయోజనార్థం గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయం, కమ్యునిటీ హాళ్లు నిర్మించాలని ప్రజలు నుంచి డిమాండ్లు ఉన్నాయి. రూ.15 కోట్లకు పైగా విలువైన ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను జిల్లా యంత్రాంగం గుర్తించి కట్టడి చేయాల్సి ఉంది. – గండ్రేటి మంగతాయారు, చైర్పర్సన్, నగర పంచాయతీ, గొల్లప్రోలు -
నేడు వైఎస్సార్ సీపీ సమావేశం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ ముఖ్యనేతల సమావేశం శుక్రవారం కాకినాడలో జరగనుంది. పార్టీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కాకినాడ డి కన్వెన్షన్‌లో జరిగే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, డీసీసీబీ, డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు, సిటీ అధ్యక్షులను ఆహ్వానించారు. ఈ విషయాన్ని పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి దాడిశెట్టి రాజా గురువారం మీడియాకు తెలియజేశారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బొత్స మీడియాకు వివరించనున్నారు. రీజనల్ కోఆర్డినేటర్ బొత్స రాక -
‘కోట’ మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా
సామర్లకోట: మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఆపై వైఎస్సార్ సీపీ సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కౌన్సిల్ సమావేశం అవుతున్న రెండు గంటల ముందు అరుణ రాజీనామా చేశారు. అందుకు దారితీసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 31 వార్డులు ఉన్న పట్టణంలో వైఎస్సార్ సీపీ 29 వార్డులను కై వసం చేసుకుంది. చైర్పర్సన్ పదవి పార్టీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు తల్లి పార్వతికి ఇవ్వాలని ముందుగా నిర్ణయించారు. అయితే పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి కుటుంబంలో ఒకే పదవి ఉండాలని నిర్ణయించడంతో 27వ వార్డు నుంచి ఎన్నిక అయిన గంగిరెడ్డి అరుణకు ఉహించని పరిస్థితిలో చైర్పర్సన్ పదవి లభించింది. 26వ వార్డు కౌన్సిలర్ నక్కా లలిత అనారోగ్యంతో మృతి చెందారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. దాంతో టీడీపీ బలం నాలుగుకు చేరింది. చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ గత కొంతకాలంగా పార్టీ సభ్యుల వార్డులలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదని, అజెండాలో అంశాలు సభ్యులకు తెలియపర్చడం లేదని మెజార్టీ సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. దాంతో ఆమైపె ఆవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా గత నెల 2వ తేదీన బలనిరూపణ కోసం 22 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టరు షణ్మోహన్, మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్యలకు వినతి పత్రాలు అందజేశారు. మూడవ తేదీన చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఫిర్యాదులు రావడంతో ఆమెను గత నెల మూడవ తేదీన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బలనిరూపణకు కలెక్టరు అవకాశం ఇచ్చారు. ఈ ప్రత్యేక సమావేశానికి కాకినాడ ఆర్డీఓ మల్లిబాబును ప్రత్యేకాధికారిగా నియమించారు. దాంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అందరూ ఎదురుచూస్తూ ఉండగా ప్రత్యేక సమావేశానికి రెండు గంటల ముందుగా ఉదయం 9 గంటలకు చైర్పర్సన్ అరుణ కమిషనర్ ఎ.శ్రీవిద్యను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. దాంతో గత నెల రోజులుగా పట్టణంలో నెల కొన్న ఉత్కంఠకు తెరపడింది. అనంతరం 11 గంటలకు ఆర్డీఓ మల్లిబాబు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశానికి 25 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు హాజరై చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కాగా డీఎస్పీ డి.శ్రీహరిరాజు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల రోజుల ఉత్కంఠకు తెర మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు -
యువకుడి దారుణ హత్య
కాకినాడ క్రైం: నగరానికి చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జగన్నాథపురం ఏటిమొగకు చెందిన వాడ్రేవు కిరణ్ (20) అవివాహితుడు. చేపల వేటతో జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా నివాసం పెమ్మాడి హరీష్ అలియాస్ చిన్న భార్యతో కిరణ్‌కు వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిరణ్‌పై హరీష్ కోపం పెంచుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం కిరణ్ తన స్నేహితుడు శ్యామ్‌తో కలిసి పెంపుడు కుక్కను టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలోని పశువైద్యశాలకు తీసుకెళ్లాడు. అక్కడకు హరీష్ తన స్నేహితుడు మహేష్‌తో కలిసి ఆటోలో వెళ్లాడు. మాట్లాడే పని ఉందంటూ కిరణ్‌ను ఆటోలో ఎక్కించాడు. అనంతరం వివాహేతర సంబంధంపై వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో హరీష్ తనతో తెచ్చుకున్న బీరు సీసాతో కిరణ్ గుండెల్లో పొడిచాడు. పలుమార్లు గొంతుకోసి ఆటోలోనే చంపేశాడు. మృతదేహాన్ని స్నేహితుడి సాయంతో తిమ్మాపురం సమీపంలోని నేమం వద్ద రోడ్ కం బిడ్జి వద్ద సముద్రంలోకి విసిరేశాడు. తల్లి ఫిర్యాదుతో.. తన కుమారుడు కనిపించడం లేదంటూ కిరణ్ తల్లి దుర్గ బుధవారం రాత్రి పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పొరుగు వారు సముద్ర తీరంలో ఉన్న కిరణ్ మృతదేహాన్ని చూసి దుర్గకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు వెళ్లి ఆ మృతదేహాన్ని గుర్తించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోర్టు పీఎస్ సీఐ సునీల్ ఆధ్వర్యంలోని పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. నిందితులు పరారీలో ఉన్నారని సీఐ సునీల్ తెలిపారు. ఈ ఘటనపై గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాకినాడ డిపో నుంచి ప్రత్యేక బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సరస్వతీ దాయం – పుష్కరయాత్ర పేరిట స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సును గురువారం ఆయన ప్రారంభించారు. ఈ బస్సు కాళేశ్వరంలో పుణ్యస్నానాలు, మహాకాళ్వేరుని దర్శనం అనంతరం రామప్ప దేవాలయం, వరంగల్లు వేయి స్తంభాల మంటపం, భద్రకాళీ దర్శనం, ధర్మపురిలో స్నానాలు, లక్ష్మీనరసింహస్వామి దర్శనం, కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం, వేములవాడ క్షేత్ర దర్శనం అనంతరం ఈనెల 18న ఉదయానికి కాకినాడ చేరుకుంటుందన్నారు. ఈ నెల 22న సూపర్ లగ్జరీ బస్సు బయలు దేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాలం చెల్లిన బీరు బాటిళ్ల ధ్వంసం తాళ్లపూడి: తుపాకులగూడెం పరిధిలోని ఎలియస్ బేవరెజన్ ప్రైవేటు లిమిటెడ్‌లో కాలం చెల్లిన 9,193 కేసుల బీరు బాటిళ్లను ధ్వంసం చేసినట్టు ఎకై ్సజ్ సీఐ కేవైఎంబీ కుమార్ తెలిపారు. ఆ ఫ్యాక్టరీలో కాలం చెల్లిపోయి నిల్వ ఉన్న బీరులను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని గురువారం అసిస్టెంట్ ఎకై ్సజ్ కమిషనర్ బి.స్వాతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇసుక లారీ ఢీకొని మహిళ మృతి తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు గామన్ బ్రిడ్జి అండర్ పాస్ సర్వీస్ రోడ్డు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరుకు చెందిన దాసరపూడి సుధ (45) తన కుమారుడు చరణ్‌తో కలిసి దొమ్మేరు నుంచి కొవ్వూరుకు మోటార్ బైక్‌పై వస్తున్నారు. కొవ్వూరు అండర్ పాస్ సర్వీస్ రోడ్డుకు వచ్చేసరికీ వారిని వెనక నుంచి ఇసుక లారీ ఢీకొంది. రోడ్డుపై పడిన సుధ మీద నుంచి లారీ చక్రాలు వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి కొవ్వూరు పట్టణ సీఐ విశ్వం చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. సుధ భర్త సాయికృష్ణ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. చెక్కు బౌన్స్ కేసులో జరిమానా, జైలు కాకినాడ లీగల్: చెల్లని చెక్కులు ఇచ్చి ఒక వ్యక్తిని మోసం చేసిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి న్యాయస్థానం జరిమానా, జైలు శిక్ష విధించింది. కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎన్.ఉషాలక్ష్మి కుమారి ఈ మేరకు తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కేబీ ప్రతాప్ కుమార్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన దూడల శ్రీనివాసరావు వ్యాపార అవసరాల కోసమని కాకినాడలోని వెంకటరత్నంపురానికి చెందిన వెంట్రాప్రగడ మురళీ వద్ద అప్పు తీసుకున్నాడు. ఇందుకోసం శ్రీనివాసరావు రూ.1,40,66,666 విలువైన ఒక చెక్కు ఇచ్చారు. సమయానికి అప్పు తీర్చక పోవడంతో చెక్కును మురళీ బ్యాంక్‌లో వేయగా బౌన్స్ అయ్యింది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు విచారణలో శ్రీనివాసరావుపై నేరం రుజువు కావడంతో 18 నెలల జైలు, రూ.1,40,66,666లు పరిహారంగా చెల్లించాలని మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు. కాగా, ఇదే శ్రీనివాసరావు మురళీకి ఇచ్చిన మరో చెక్కు కూడా బౌన్స్ అయ్యింది. దీనిలో శ్రీనివాసరావుకు 18 నెలల జైలు, రూ.3.60 కోట్లు పరిహారం విధిస్తూ తీర్పు వెలువడింది. -
రాజుల తూరంగిలో భారీ చోరీ
కాకినాడ రూరల్: రాజుల తూరంగి గ్రామంలోని పురోహితుడు చంద్రమౌళి శ్రీనివాసశర్మ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును దొంగలు దోచుకున్నారు. ఇంద్రపాలెం పోలీసులు వివరాలు ప్రకారం.. శ్రీనివాసశర్మ గృహ ప్రవేశం పూజ కోసం రాత్రి 10.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆయన భార్య పుట్టింటికి వెళ్లడంలో ఇంట్లో ఎవరూ లేదు. ఇది గమనించిన దొంగలు లోపలకు ప్రవేశించి బంగారం, నగదు చోరీ చేశారు. పూజా కార్యక్రమం అనంతరం గురువారం ఉదయం 6 గంటలకు వచ్చిన శ్రీనివాస శర్మ.. ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించారు. లోపలకు వెళ్లి చూడగా చోరీ విషయం బయటపడింది. వెంటనే ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్సీ మనీష్ దేవరాజు పాటిల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దింపి వేలి ముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. ఇంద్రపాలెం అదనపు ఎస్సై సూర్య కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అన్నవరం.. భక్తజన సంద్రం
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి గురువారం వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్దసంఖ్యలో వివాహాలు జరిగాయి. నవ దంపతులు, వారి బంధువులతో కలిసి, రత్నగిరిపై స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. దీంతో ఆలయంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావి చెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 35 వేల మంది భక్తులు దర్శించగా, వ్రతాలు 1,800 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మంది భక్తులు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భోజనం చేశారు. సత్యదేవుని కల్యాణోత్సవాలు ముగియడంతో మరలా సత్యదేవుడు, అమ్మవార్లకు స్వామివారి నిత్య కల్యాణం,ఆయుష్య హోమం, వనదుర్గ అమ్మవారికి హోమాలు, సహస్ర దీపాలంకారణ, పంచహారతుల సేవలు యథావిధిగా నిర్వహిస్తున్నారు. దాత మట్టే సత్యప్రసాద్ దంపతులు స్వామి, అమ్మవార్లకు చేయించిన వజ్ర కిరీటాలను సోమ, గురువారాలు మినహ మిగిలిన ఐదు రోజులు అలంకరిస్తున్నారు. గురువారం పర్వదినం సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, లింగాకారంలోని శివుడు నిజరూప దర్శనం ఇచ్చారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులు దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం -
జల్‌జీవన్ మిషన్ పనుల్లో చిన్నారులు
రామచంద్రపురం రూరల్: తోటపేట గ్రామంలో రూ. 79 లక్షల నిధులతో చేపట్టిన జల్‌జీవన్ మిషన్ పనుల్లో భాగంగా జరుగుతున్న పైపులైన్ పనుల్లో సుమారు 10, 12 సంవత్సరాల చిన్నారులు పనులు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే చిన్నారులను ప్రభుత్వం తరఫున జరుగుతున్న పనుల్లో ఉపయోగించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఎస్.రాహుల్ వివరణ కోరగా వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. -
ఉపాధి శ్రామికులపై తేనెటీగల దాడి
కపిలేశ్వరపురం: మాచర గ్రామ శివారు శ్రీరామపురం ఏటిగట్టుపై జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా తుప్పలను తొలగిస్తున్న గ్రామీణ వికాస్ శ్రామికులపై గురువారం తేనెటీగలు దాడి చేశాయి. కోరుమిల్లి గ్రామ శివారు చిన్నకోరుమిల్లికి చెందిన కొండమూరి ఏసును తీవ్రంగా కుట్టడంతో అతడు అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. వెంటనే సహచర శ్రామికులు మోటారు సైకిల్‌పై కపిలేశ్వరపురం సీహెచ్‌సీకి తరలించారు. ఆస్పత్రి వైద్యాధికారి పి.రాజ్ కుమార్ పర్యవేక్షణలో వైద్యులు చికిత్స అందించారు. ఏసు కోలుకొంటున్నాడని, మరో రెండు రోజులు పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పినట్టు ఎన్ఆర్ఈజీఎస్ ఇన్చార్జి ఏపీఓ రజిత్సింగ్ తెలిపారు. అలాగే తేనెటీగల దాడిలో గంగుమళ్ల కృష్ణ, కోలపల్లి త్రిమూర్తులు స్వల్పంగా గాయపడ్డారు. వాడపల్లి ఆలయంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో గురువారం రాత్రి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో భక్తుల భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా ఈ తనిఖీలు జరిపారు. ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణం, క్యూలైన్లు, ఏడు ప్రదక్షిణలు చేస్తున్న మాడ వీధులు, అన్నప్రసాద ప్రాంగణాలు, తలనీలాలు సమర్పించే ప్రాంతాలను తనిఖీ చేశారు. ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు వాడపల్లి ఆలయంతో పాటు రావులపాలెం బస్ కాంప్లెక్స్‌లో తనిఖీలు జరిపినట్టు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. -
కుట్టిందో మరణమే..
జాగ్రత్తలు అవసరం ● డెంగీ వ్యాధి బాధితులు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాలి ● ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరంలో ఎర్ర రక్తకణాలు (ప్లేట్లెట్స్) సాధారణంగా 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకూ ఉండాలి. ● తెల్ల రక్త కణాలు నాలుగు వేల నుంచి 11 వేల వరకూ ఉండాలి. ● డెంగీ జ్వరం ద్వారా రక్త కణాలు లక్ష దిగువకు పడిపోతే సత్వరమే వైద్యుడిని సంప్రదించాలి. ● ధీర్ఘకాలం తక్కువ రక్తకణాలు ఉంటే ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు. ● డెంగీ జ్వరం బారిన పడిన వ్యక్తి సరైన విశ్రాంతి, పౌష్టికాహారం తీసుకుంటే రక్తకణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ● తరచూ పండ్లు, ఆకుకూరలతో పాటు ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆలమూరు: రాత్రయితే చాలు పిలవని అతిథుల్లా మన ఇంటికి వచ్చి, తెల్లవార్లూ రక్తాన్ని పీల్చేసే దోమలతో పడే బాధలు అందరికీ అనుభవమే. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ వీటి బాధితులే. అందుకనే దోమల భారిన పడకుండా నిత్యం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అయితే దోమలు కట్టడం వల్ల అనేక రోగాలు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే డెంగీ జ్వరం అత్యంత ప్రాణాంతకమైంది. నేడు జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ఆ వ్యాధి లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. దోమ కాటుతో.. దోమ కాటు ద్వారా డెంగీ జ్వరం వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తిని కుట్టిన దోమ మరొకరిని కుడితే అతడి రక్తంలో వైరస్ వెంటనే ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారు సరైన సమయంలో చికిత్స చేయించుకోకుంటే ఒక్కోసారి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. డెంగీ జ్వరం సోకిన వెంటనే శరీరంలోని ఎముకల్లో ఉన్న గుజ్జు తగ్గిపోయి క్రమేపీ రక్త కణాల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపి అంతిమంగా మరణానికి దారి తీస్తుంది. ఏడిస్ దోమల నుంచి సోకే డెంగీ వైరస్ నాలుగు రకాలుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. తొలి రెండు దశల్లో జ్వర తీవ్రత రోగిపై ఒక మోస్తారు ప్రభావం చూపగా, మూడో దశలో హెమరేజిక్ జ్వరం తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుంది. తుది దశ అయిన డెంగీ షాక్ సిండ్రోమ్ సోకితే మృతి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు పగటి సమయంలో మనుషులను కుడతాయి. మంచినీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో గుడ్లు పెట్టి దోమల వృద్ధికి కారణమవుతాయి. వ్యాధి నిర్ధారణ డెంగీ వ్యాధిని ఏలీసా (ఎన్ఐవీ) పరీక్ష ద్వారా నిర్దారణ చేస్తారు. వ్యాధి సోకిన వ్యక్తికి వివిధ రక్త పరీక్షలు నిర్వహించి, వ్యాధి తీవ్రతను గుర్తిస్తారు. డెంగీ జ్వరం తరచూ వస్తుంటే వైరస్ సంబంధిత వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స తీసుకోవాలి. సాధారణంగా ఉష్ణ మండల ప్రాంతంలో ఉండే దోమలు కాటు వేయడం వల్ల్ల ఈ వైరస్ ఎక్కువగా సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఏడిస్ దోమల తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2010 మే 16వ తేదీ నుంచి జాతీయ డెంగీ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. దానిలో భాగంగా ఏటా ఆ రోజున దోమల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దోమలతో అనేక వ్యాధులు డెంగీ అత్యంత ప్రమాదకరం జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర నష్టం నేడు జాతీయ డెంగీ దినోత్సవం డెంగీ లక్షణాలు ఆకస్మికంగా అధిక జ్వరం సంభవించడం (104 డిగ్రీలు) తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి తీవ్రమైన కండరాల నొప్పి అలసట, వికారం, వాంతులు చర్మంపై దద్దుర్లు, తేలికపాటి రక్తస్రావం చిగుళ్ల లేదా ముక్కు నుంచి రక్తస్రావం మూత్రం, మలం, వాంతిలో రక్తం శ్వాస ఆడకపోవడం అలసిపోవడం, చిరాకు అప్రమత్తంగా ఉండాలి దోమకాటు వల్ల సంభవించే డెంగీ జ్వరంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వేసవిలో సైతం వర్షాలు కురుస్తుండటం వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టాలి. జ్వర లక్షణాలు ఉంటే సత్వరమే సమీప వైద్యులను సంప్రదించి, సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి. – కె.స్వర్ణలత, వైద్యాధికారి, సామాజిక ప్రభుత్వ ఆస్పత్రి, ఆలమూరు. -
క్వారీ లారీ బోల్తా
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు – లంపకలోవ రహదారిలో గురువారం ఓ క్వారీ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లాటరైట్ ఖనిజాన్ని తరలించేందుకు వెళుతున్న ఆ లారీ రైతు గౌతు గంగ పొలంలో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనిపై ఫిర్యాదు అందలేదని ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ రహదారిలో లాటరైట్ ఖనిజాన్ని రవాణా చేసే లారీలే రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే మితిమీరిన వేగంతో వెళుతుండడంతో స్థానికులు భయపడుతున్నారు. ఇటీవలే క్వారీ లారీ ఢీకొని గేదే మృతి చెందింది. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు దేవరపల్లి: గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి గాయపడ్డారు. రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఆటోను వెనుక వైపు నుంచి వస్తున్న వ్యాన్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదేళ్ల చిన్నారిని, ఇద్దరు మహిళలకు రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. కాగా.. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన కుటుంబ సభ్యులు ఏలూరులో శుభ కార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. -
ఇటీవలే శుభకార్యం.. అంతలోనే విషాదం..
రాయవరం: ఆ కుటుంబంలోని పెద్ద కుమార్తె ఓణీల ఫంక్షన్‌ను రెండు రోజుల క్రితమే ఎంతో ఘనంగా నిర్వహించారు. బంధువులు, స్నేహితులతో కలిసి కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపారు. అక్క ఫంక్షన్లో చిన్న కుమార్తె ఎంతో సందడి చేసింది. రెండు రోజులు అవకుండానే ఆ బాలికను ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. శుభకార్యం జరిగిన ఇంటిలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామానికి చెందిన పాలపర్తి వీర వెంకట సత్యనారాయణ, ఉమా మహేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఓణీల ఫంక్షన్‌ను రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో నిర్వహించారు. వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ ఇంట శుభకార్యం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. కాగా.. సత్యనారాయణ వరసకు మేనల్లుడైన నెల్లూరుకు చెందిన పవన్ సత్యస్వరూప్ గురువారం సత్యనారాయణ రెండో కుమార్తె నాగవర్షిణి (11)ని మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని రాయవరం వచ్చాడు. లొల్ల వైపునకు వెళ్లిన వీరు తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేయబోయారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యారు. నాగవర్షిణిపై నుంచి ట్రాక్టర్ తొట్టె వెనుక చక్రాల వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడింది. పవన్ సత్య స్వరూప్ స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. విలవిల్లాడిన బాలిక ట్రాక్టర్ చక్రాలు ఎక్కేయడంతో తీవ్రంగా గాయపడిన నాగవర్షిణి విలవిలలాడింది. ఆమె వద్దకు వెళ్లడానికి ఎవ్వరూ సాహసించలేదు. సుమారు పావుగంట తర్వాత సమీపంలోని ఫొటో స్టూడియో నిర్వాహకుడు కారంపూడి సత్తిబాబు అక్కడకు వచ్చి బాలిక శరీరంపై క్లాత్‌ను కప్పాడు. ఆ తర్వాత స్థానికులు వచ్చి సాయమందించారు. ఘటనా స్థలానికి పోలీసులు ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న రాయవరం ఎస్సై డి.సురేష్ బాబు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికను 108లో రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మండపేటకు తీసుకువెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. సంఘటనా స్థలాన్ని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని బాలిక మృతి రాయవరంలో ఘటన -
మహిళా బాక్సర్లు సత్తా చాటుతున్నారు
నేను 8 సంవత్సరాల నుంచి పిఠాపురంలో బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నాను. నా దగ్గర 150 మంది 10 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న పురుషులు, మహిళలు ఉన్నారు. వారిలో మహిళా బాక్సర్లు 70 మంది వరకు ఉన్నారు. ఇప్పటివరకు 30 మంది మహిళా బాక్సర్లు రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నారు. 40 మంది జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. నలుగురు రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పతకాలు సాధించారు. బాక్సింగ్ యుద్ధ కళ. బాక్సింగ్‌లో సబ్ జూనియర్, జూనియర్, యూత్, సీనియర్స్ మెన్ అండ్ వుమెన్ విభాగాలు ఉంటాయి. వయసును బట్టి బరువును బట్టి పోటీ ఉంటుంది. బాక్సింగ్ నేర్చుకుని పతకాలు సాధిస్తే విద్య, ఉద్యోగాల్లో 3 శాతం స్పోర్ట్స్ కోటా ఎంతగానో ఉపయోగపడుతుంది. బాలికలు ఎక్కువగా ఈ క్రీడ పట్ల మక్కువ చూపుతున్నారు. – పి.లక్ష్మణరావు, బాక్సింగ్ కోచ్, పిఠాపురం ● -
ఫలిస్తున్న పంచ్‌తంత్రం!
పిఠాపురం: నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచన వారిని క్రీడల వైపు అడుగులు వేసేలా చేసింది. ఈ ఆటకు ఆడవారెందుకు అనే క్రీడలోనే పట్టుదల వారిని బాక్సింగ్ వైపు నడిపించింది. రింగ్‌లోకి దిగితే పతకం ఖాయం అనే రీతిలో తమ ప్రతిభా పాటవాలను చూపిస్తున్నారు పిఠాపురానికి చెందిన మహిళా బాక్సర్లు. ఒలింపిక్ పతకాన్ని అందించడమే తమ లక్ష్యం అంటున్నారు వీరు. ఇటీవల భారత్ బాక్సింగ్‌లో దూసుకెళ్తోంది. ప్రపంచ చాంపియన్న్షిప్లతో పాటు ఆసియా, కామన్వెల్త్, అంతర్జాతీయ ఈవెంట్లలో భారత ఆటగాళ్లు రాణిస్తున్నారు. బాక్సింగ్‌లో టాప్ 5 దేశాలలో ఒకటిగా భారత్ నిలుస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా భారత మహిళలు ఆడిన 12 చాంపియన్ షిప్‌లలో 10 గోల్డ్ మెడళ్లతో సహా 39 పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ మెడల్స్ సాధించిన వారి జాబితాలో తదుపరి తమ పేరు నమోదు చేసుకుంటామంటున్నారు ఇక్కడి మహిళా బాక్సింగ్ క్రీడాకారులు. రింగ్‌లోకి దిగితే పతకం రావాల్సిందే సత్తా చాటుతున్న పిఠాపురం మహిళా బాక్సర్లు -
సబ్ ప్లాన్ టెండర్లు ఎస్సీలకే కేటాయించాలి
మలికిపురం: రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేసే అభివృద్ధి పనులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు అవసరమయ్యే సరకుల సరఫరా టెండర్లు దళితులకే కేటాయించాలని విస్తృత దళిత సంఘాల (విదసం), ఐక్య వేదిక రాష్ట్ర సమితి సమావేశం డిమాండ్ చేసింది. బుధవారం విదసం ఐక్యవేదిక రాష్ట్ర సమితి, రాజోలు పరిరక్షణ సమితి సంయుక్త సమావేశం మలికిపురం మండలం శంకరగుప్తంలో సభ్యులు చింతా సత్య ఇంటి వద్ద జరిగింది. విదసం కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ సక్రమ అమలు కోసం ప్రభుత్వం ఎస్టీఎస్ (సబ్ ప్లాన్ టెండర్లు ఎస్సీలకే) అనే కొత్త స్కీమ్ ప్రవేశ పెట్టాలని సలహా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న 750 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, 50 రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న లక్షా నాలుగు వేల మంది విద్యార్థులకు సరకుల సరఫరా కోసం కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లు చెల్లిస్తోందని, ఈ సరఫరా దారుల్లో ఒక్క టెండర్లో కూడా దళితుడు లేడన్నారు. రాష్ట్రంలో దళిత వాడల్లో 12 వేల అంగన్వాడీ కేంద్రాల్లో సరకులు సరఫరా టెండర్లు దళితులకు ఇస్తే 1,000 నుంచి 1,500 కుటుంబాలకు జీవనోపాధి కల్పించవచ్చన్నారు. రాజోలు పరిరక్షణ చైతన్య సమితి చింతా సత్య మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కులగణన పూర్తయ్యే వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. కొంకి రాజమణి , ముత్యాల శ్రీనివాస్, జాజి ఓంకార్, గుడివాడ ప్రసాద్, ఉప్పాడ రాము పాల్గొన్నారు. విదసం, రాజోలు ప్రదర్శన చైతన్య సమితి డిమాండ్ -
సరిగా ఆడిట్ చేయకుంటే మెమో
కాకినాడ సిటీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి అందిన అర్జీలను గ్రీవెన్స్ అధికారి మాత్రమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. కాకినాడ కార్యాలయంలోని వివేకానంద హాలులో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంపై బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డీఎల్డీవో వాసుదేవరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణలతో కలిసి డీఆర్వో గ్రీవెన్స్ దరఖాస్తులు పరిష్కారం చేసే విధానంపై పలు సూచనలు చేశారు. సమస్యను గ్రీవెన్స్ దారు సంతృప్తి పొందే విధంగా పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కరించిన గ్రీవెన్స్‌లను జిల్లా స్థాయి అధికారి మొదటి సారి ఆడిట్ చేస్తారని, దానిని జిల్లా స్థాయి కమిటీ రెండవసారి ఆడిట్ చేస్తుందని ఆ సమస్యను సక్రమంగా పరిష్కరించకపోతే సంబంధిత అధికారికి మెమో జరీ చేస్తామని తెలిపారు. దానిపై జిల్లా అధికారి సక్రమంగా ఆడిట్ చేయకపోతే ఆ జిల్లా అధికారికి కూడా మెమో జారీ చేస్తామని తెలిపారు. జగనన్న కాలనీలో ట్రాన్స్ఫార్మర్ల తొలగింపు స్థానికుల ఆందోళన జగ్గంపేట: స్థానిక జగనన్న కాలనీలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఐదు అధికారులు తొలగించడంపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. దీనితో జగనన్నకాలనీ వాసులు ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి తోట నరసింహానికి, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు తెలియజేశారు. దీంతోవారు జగ్గంపేట విద్యుత్ డీఈ వీరభధ్రరావుతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్లు జగనన్నకాలనీలో వున్నవి తీయడం సరికాదని తెలిపారు. అయితే వేసవి కారణంగా గ్రామంలో పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు పనిచేయకపోవడంతో జగనన్న కాలనీలో ప్రస్తుతం ఉపయోగించని ట్రాన్స్ఫార్మర్లు మారుస్తున్నామని విద్యుత్ డీఈ వారికి వివరించారు. జగ్గంపేట గ్రామంలో రెండు రోజులుగా ఎండవేడిమికి పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, పాడైపోవడంతో పలు కాలనీలలో విద్యుత్ సరఫరా లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడానికి జగనన్న కాలనీలో ట్రాన్స్ఫార్మర్లు వాడుతున్నట్లు, కొత్తవి వచ్చిన వెంటనే జగనన్న కాలనీలో యథావిధిగా ఏర్పాటు చేస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. పాలిసెట్–25లో 94.06 శాతం ఉత్తీర్ణత బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పాలిసెట్–15 ఫలితాల్లో కాకినాడ జిల్లా 94.06 శాతం ఉత్తీర్ణత సాఽధించింది. గత నెల 30వ తేదీన కాకినాడ, పిఠాపురం కలిపి 28 కేంద్రాల్లో 8,849 మంది పరీక్షలు రాయగా వీరిలో 8.371 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 5,212 మందికిగాను 4,865 మంది ఉత్తీర్ణులు కాగా బాలికలు 3,637కుగాను 3,506 మంది ఉత్తీర్ణత సాఽధించారు. కాకినాడకు చెందిన కొప్పిశెట్టి అభిజత్ 15వ ర్యాంక్, ఏ.సత్యసూర్యతేజ 25వ ర్యాంక్, సి.కృష్ణరామవర్షిత్ 34వ ర్యాంక్ సాధించారు. కిక్కిరిసిన విఘ్నేశ్వరుని సన్నిధి అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామివారిని బుధవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. ఆర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహానివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. ఆదివారం స్వామివారికి పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.1,96,054 ఆదాయం లభించినట్లు ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
స్పోర్ట్స్ కోటాలో ఉన్నత స్థానం సాధిస్తా
ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పూర్తి చేశాను. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాను. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం మా తల్లిదండ్రులు నా ఇష్టాన్ని గమనించి కోచ్ లక్ష్మణరావు దగ్గర జాయిన్ చేశారు. ఆయన నాకు ముందుగా ధైర్యం చెప్పి బాక్సింగ్‌లో మెళుకువలు నేర్పించారు. ఇప్పుడు నేను రాష్ట్ర బాక్సర్‌గా పేరు పొందాను. స్పోర్ట్స్ కోటాలో డాక్టర్ అయి పేదలకు ఉచిత వైద్యం చేయడమే నా లక్ష్యం. – కాకాడ హరిణి, బాక్సింగ్ క్రీడాకారిణి, పిఠాపురం -
ఒలింపిక్ మెడల్ సాధించడమే ధ్యేయం
నేను ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నా తండ్రి బ్యాంక్ ఉద్యోగి. నాకు చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే ఇష్టం. నా సరదాను చూసి నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నేను మా కోచ్ లక్ష్మణరావు దగ్గర చేరి బాక్సింగ్ నేర్చుకున్నాను. ఏడాదిన్నర కాలంలోనే అన్ని మెళుకువలు నేర్చుకుని కాకినాడ డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీలో జరిగిన అండర్ 19 స్కూల్ గేమ్స్ బాక్సింగ్‌కు జిల్లా స్థాయిలో ఎంపికయ్యాను. పిఠాపురంలో జరిగిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలలో స్వర్ణ పతకం సాధించాను. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 19 బాక్సింగ్ పోటీలలో కాంస్య పతకం సాధించాను. విశాఖపట్నంలో జరిగిన యూత్ వుమెన్ బాక్సింగ్ పోటీల్లో రజత పతకం సాధించాను. ఒలింపిక్ మెడల్ సాధించడమే నా ధ్యేయం. – జే ఐశ్వర్య సూరి దీపిక, బాక్సింగ్ క్రీడాకారిణి, పిఠాపురం ● -
ధూప, దీప నైవేద్యాలకు దరఖాస్తుల ఆహ్వానం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామాల్లో ఆదాయం లేని ఆలయాలకు ధూప, దీప నైవేద్యాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా దేవదాయశాఖాధికారి సుబ్బారావు తెలిపారు. కాకినాడ దేవదాయశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న చిన్న ఆలయాల్లో ఆదాయం లేకపోవడంతో ధూప, దీప నైవేద్యాలకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయా ఆలయాలకు ప్రతీ నెలా రూ.10 వేలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యే ద్వారా అందివ్వాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్న ఆలయాలకు చెందిన కమిటీ సభ్యులు, అర్చకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్నవరం దేవస్థానం వైదిక కమిటీ పునర్ వ్యవస్థీకరణ అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వైదిక కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. కమిటీలో ఆరుగురు సభ్యులకు అదనంగా మరో ఇద్దరు పండితులను నియమించారు. గొల్లపల్లి గణపతి ఘనపాఠీ, వేదుల సూర్యనారాయణ ఘనపాఠీ, గంగాధరబట్ల గంగబాబు ఘనపాఠీ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, వ్రత పురోహిత స్పెషల్‌గ్రేడ్ సూపర్వైజర్ ఛామర్తి కన్నబాబు వైదిక కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరితో బాటు చిట్టి శివ ఘనపాఠీని, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభిరామ్మూర్తిని సభ్యులుగా చేర్చారు. ఈ ఎనిమిది మంది దేవస్థానంలో జరిగే వైదిక కార్యక్రమాల గురించి చైర్మన్, ఈఓలకు సలహాలిస్తారు. -
ప్రాథమిక విద్యకు సర్దుపోటు!
గురువారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2025ఉపాధ్యాయుల నియామకం ఇలా.. ● ఫౌండేషన్ స్కూల్ (పీపీ1, పీపీ2 1–2వ తరగతి) 1–30 మంది విద్యార్థులకు 1 ఎస్జీటీ, 31–60 విద్యార్థులకు 2 ఎస్జీటీలను నియమించారు. ● బేసీక్ ప్రైమరీ స్కూల్ (పీపీ–1, పీపీ2, 1–5వ తరగతి)లో 20 మందికి ఒక ఎస్జీటీ, 60 మందికి ఇద్దరు ఎస్జీటీలను నియమించారు. ● మోడల్ ప్రైమరీ స్కూల్స్ (పీపీ1, 2, 1–5వ తరగతి వరకు) 59 మంది విద్యార్థులకు ముగ్గురు (హెచ్ఎం లేదా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ) ఉపాధ్యాయులను కేటాయించారు. అంతేగాక 150 మంది విద్యార్థులకు నలుగురిని నియమిస్తారు. ● అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో 1–10 వరకు ఒక స్కూల్ అసిస్టెంట్, 11 నుంచి 30 వరకు ఇద్దరు, 31 నుంచి 140 విద్యార్థులుంటే నలుగురు, 141 నుంచి 175 మందికి ఐదుగురు స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నిందా..? ఇందులో భాగంగానే పాఠశాలల పునర్మిర్మాణ ప్రక్రియ పేరుతో గందరగోళానికి తెర తీసిందా..? ఈ పరిణామం ప్రాథమిక విద్యపై తీవ్ర ప్రభావం చూపనుందా..? మిగులు ఉపాధ్యాయులు పెరిగి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి భంగం కలగనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నుంచి. ఇదీ సంగతి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం అసంబద్ధ విధానాల అమలుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన క్లస్టర్ విధానాన్ని తొలగించి మోడల్ స్కూల్స్ విధానానికి శ్రీకారం చుట్టింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా గత ప్రభుత్వం జీవో 117 పేరిట పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టింది. కూటమి అధికారంలోకి వచ్చాక జీఓను రద్దు చేసింది. ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలోనూ ఉపాధ్యాయుల నుంచి విమర్శలు ఎదుర్కొంది. తాజాగా పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో కొత్త విధానానికి తెర తీసింది. ఇందులో భాగంగా తొమ్మిది రకాల పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని రోజులుగా చేసిన కసరత్తు మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలతో మిగులు పోస్టులు పెరిగి, ప్రాథమిక విద్యకు నష్టం తప్పదని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. యూపీ స్కూళ్ల కొనసాగింపు పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రాథమికోన్నత (యూపీ) పాఠశాలలను ఎత్తివేయాలని భావించింది. తల్లిదండ్రులు, ఆయా ప్రాంతాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న యూపీ స్కూళ్లను యథావిధిగా కొనసాగించేందుకు అంగీకరించింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 72 అప్పర్ ప్రైమరీ పాఠశాలలున్నాయి. ఇవి యథావిధిగా కొనసాగనున్నాయి. 767 పోస్టుల సర్దుబాటు ఉపాధ్యాయుల సర్దుబాటుపై గురువులు గుర్రుగా ఉన్నారు. అసంబద్ధ విధానాలతో ప్రక్రియ చేపట్టిందని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించగా సర్దుబాటు ప్రక్రియ కాస్తా గందరగోళంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల వారీగా మంగళవారం జాబితా విడుదల చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 767 మిగులు ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భవిష్యత్తులో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్) పోస్టుల భర్తీ కలగానే మారనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 371 మంది ఉపాధ్యాయులను వివిధ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, హెచ్ఎం పోస్టులకు, మోడల్ ప్రైమరీ పాఠశాల్లో సర్దుబాటు చేశారు. 31 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్లుగా సర్దుబాటు చేశారు. హెచ్ఓడీ పూల్‌లో ఉన్న 355 మంది ఉపాధ్యాయులను సైతం వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు. డీఎస్సీని మరిపించేందుకు ఎత్తులు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు, లోకేష్ ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక డీఎస్సీ నిర్వహించాల్సిన సమయం ఆసన్నం కావడంతో ఎలాగోలా మెగా డీఎస్సీని కాలయాపన చేసేందుకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సర్దుబాటుకు ఉన్న అర్థాన్నే మార్చేశారని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. వర్క్ అడ్జెస్ట్మెంట్ (సర్దుబాటు) అంటే ఒకటి లేదా రెండు నెలల పాటు మిగులు టీచర్లను అవసరమైన చోట తాత్కాలికంగా వినియోగించుకోవడం. ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న వాదన ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది. విద్యా వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కుట్ర అంతా అస్తవ్యస్తం..! పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో ఉపాధ్యాయ పోస్టుల కుదింపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 767 పోస్టుల సర్దుబాటు క్లస్టర్ వ్యవస్థకు మంగళం.. మోడల్ స్కూల్ విధానానికి నాంది కూటమి ప్రభుత్వ చర్యలతో మిగులు పోస్టులు పెరిగే అవకాశం -
పట్టుదలతో నేర్చుకున్నా
క్రీడల్లో మంచి ప్రతిభ చూపి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఆలోచన ఉండేది. ఏ ఆటలో నాకు మంచి జరుగుతుందనేది అర్థమయ్యేది కాదు. కాని పిఠాపురంలో బాక్సింగ్ క్రీడలో శిక్షణ ఇస్తున్న కోచ్ లక్ష్మణరావు వద్దకు వెళ్లి మాట్లాడగా నీవు బాక్సింగ్ బాగా ఆడగలుగుతావు అంటు ప్రోత్సాహించారు. ముందు కొంత భయమేసింది ఇంట్లో వాళ్లు బాక్సింగ్ అంటే చాలా ధైర్యం ఉండాలి.. జాగ్రత్త అన్నారు. కాని మా కోచ్ చాలా ధైర్యం చెప్పారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో బాక్సింగ్ నేర్చుకున్నా. పిఠాపురంలో జరిగిన యూత్ వుమెన్ బాక్సింగ్ జిల్లా స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించాను. విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి యూత్ వుమెన్ బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించాను. ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాను. జాతీయ స్థాయిలో మంచి పతకాలు సాధించడమే ధ్యేయం. – అడబాల వైష్ణవి, బాక్సింగ్ క్రీడాకారిణి, మల్లాం, పిఠాపురం మండలం ● -
నేడు ‘కోట’ మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం
సామర్లకోట: మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం ప్రవేశ పెట్టడానికి రంగం సిద్ధం అయింది. మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణపై బలనిరూపణకు 22 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టరుకు గత నెల 2వ తేదీన వినతిపత్రం అందజేశారు. చైర్పర్సన్ అరుణ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కౌన్సిల్ సభ్యుల వినతి మేరకు గురువారం బలనిరూపణ చేసుకోవాలని కలెక్టరు ఆదేశించారు. ప్రత్యేకాధికారిగా కాకినాడ ఆర్డీఓ మల్లిబాబును నియమించారు. ఈ మేరకు బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయానికి వచ్చి బలనిరూపణకు చేయవలసిన ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య, సీఐ ఎ.కృష్ణభగవాన్లతో సమీక్ష నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి విప్ జారీ చేసే అధికారాన్ని జిల్లా ఽఅధ్యక్షుడు దాడిశెట్టి రాజాకు ఇవ్వగా, ఆయన పట్టణ పార్టీ అధ్యక్షుడు పాగా సురేష్‌కుమార్‌కు విప్ జారీ చేసే అధికారం ఇచ్చారు. ఈ మేరకు విప్ పత్రాన్ని పాగా సురేష్‌కుమార్ ఆర్డీఓ మల్లిబాబుకు అందజేశారు. కౌన్సిలర్ కరణం రాజ్‌కుమార్ పాల్గొన్నారు. గురువారం మున్సిపల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి కోరమ్ ఉన్న సమయంలో బలనిరూపణకు అవకాశం ఇస్తామని, కోరమ్ లేకుంటే అదే రోజు మధ్యాహ్నం మరో పర్యాయం అవకాశం ఇస్తామని అప్పటికీ కోరమ్ లేక పోతే సమావేశం నిరవధికంగా వాయిదా వేస్తామని ఆర్డీవో అన్నారు. దాంతో ఏడాది వరకు చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండదని ఆర్డీఓ మల్లిబాబు చెప్పారు. కౌన్సిల్ సభ్యులు గుర్తింపు కార్డులో హాజరయ్యే విధంగా చూడాలని సీఐకు ఆర్డీఓ సూచించారు. కౌన్సిల్ హాల్లో చేయవలసిన ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ పరిధిలో ఒక కిలోమీటరు వరకు 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. చేతులు ఎత్తే పద్ధతిలో బల నిరూపణ ఉంటుంది. వైఎస్సార్సీపీకి చెందిన సభ్యులు పార్టీ సూచించిన విధంగా కాకుండా వ్యతిరేకంగా ఓటు వేస్తే పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు కౌన్సిల్ పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల వినతితో కౌన్సిల్ సమావేశం విప్ జారీచేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజా కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్ అమలు -
రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
తుని: రైలు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ ఎస్సై జీ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం..తుని–హంసవరం రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి 20 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు మృతి చెందాడు. మృతుడు నలుపురంగు ట్రాక్ ధరించి ఉన్నాడు. చేతిపై శ్రావణి అనే పచ్చబొట్టు ఉంది. మృతుడి దగ్గర ఇతర ఏ ఆధారాలూ లభించలేదు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94906 19020 నంబరులో సంప్రదించవచ్చన్నారు. ఏలూరులో కలవచర్ల మహిళ... రాజానగరం: భర్తతో కోపంతో పుట్టింటికి వెళ్లిన మహిళ ఊహించని ప్రమాదానికి గురై అందరికీ దూరమైంది. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ వెళ్తున్న మండలంలోని కలవచర్లకు చెందిన బొమ్మోతు కుమారి (40) ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోవడంతో మృతిచెందింది. ఏలూరు రైల్వే స్టేషను సమీపంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలావున్నాయి. మండలంలోని ముక్కినాడకు చెందిన కుమారికి కలవచర్లకు చెందిన ఏసుతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం కాగా, కుమార్తెకు వివాహం చేశారు. ఈ క్రమంలో కుటుంబ పరంగా భార్యాభర్తల నడుమ ఏర్పడిన గొడవలతో కుమారి కోపంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తల్లిదండ్రులు మండెల సత్యనారాయణ, పాపలు పనుల కోసం హైదరాబాద్‌కి పయనమవడంతో వారితోపాటు తాను కూడా గౌతమీ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరింది. డోరులో నిలబడివున్న ఆమె ఏలూరు సమీపంలోకి వచ్చే సరికి ప్రమాదానికి గురైంది. వెంటనే ఆమెను రైల్వే పోలీసులు ఏలూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త ఏసు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి, మృతురాలిని తన భార్యగా నిర్ధారించాడు. కేసును ఏలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో శ్రీప్రకాష్ ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సీబీఎస్ఈ పదవ తరగతి, ప్లస్‌టూ ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు ప్రతిభ చూపారని విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి విజయప్రకాష్ మంగళవారం తెలిపారు. పదవ తరగతి ఫలితాల్లో ఎన్.సత్యసాయి 483, ఎం.యశస్వి 482, పి.తరుణ్‌కుమార్ 481, మహర్షి4 79, ఎస్.రఘవందన 478మార్కులు సాధించారన్నారు. ప్లస్‌టూ ఫలితాల్లో జి.సాయి అనీష్ 469, ధాత్రి నిహారిక 466 సాధించి ప్రతిభ చాటారన్నారు. మ్యాథ్స్, సైన్స్, సబ్జెక్టుల నుంచి నూటికి నూరుశాతం మార్కులు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను కార్యదర్శి నరసింహారావు, అధ్యాపకులు అభినందించారు. -
పెనకనమెట్ట సావరంలో చోరీ
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు మండలంలోని పెనకనమెట్ట సావరంలో ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కొవ్వూరు రూరల్ సీఐ బి.విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి సత్తిబాబు, వారి కుటుంబ సభ్యుల తో పాటు ఈ నెల 11వ తేదీన పందలపర్రులో బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లారు. 12వ తేదీ ఉదయం తిరిగి వచ్చి చూసుకుని సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దుండగులు ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి సుమారు 8 కాసుల బంగారు వస్తువులను, రూ.8 లక్షల నగదు, 250 గ్రాముల బరువు గల వెండి వస్తువులను దొంగిలించినట్టుగా తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఇన్చార్జి డీఎస్పీ కేవీ సత్యనారాయణ, క్లూస్ టీం ఇన్స్పెక్టర్ స్వరూప్, సీఐ శ్రీధర్ తదితరులు పరిశీలించి, వివరాలు సేకరించారు. -
ఇసుక లారీ ఢీకొని కౌలు రైతు మృతి
తుని రూరల్: తుని మండలం వి.కొత్తూరు గ్రామానికి చెందిన సూరెడ్డి రమణ (48)ను ఇసుక లారీ ఢీకొనడంతో మృతి చెందినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి తెలిపారు. మంగళవారం కౌలు రైతు అయిన సూరెడ్డి రమణ తుని రైతుబజారులో కూరగాయలు విక్రయించుకుని మోపెడ్‌పై స్వగ్రామానికి వస్తుండగా వెలంపేట వై.జంక్షన్లో రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఇసుక లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రమణను తుని ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘరానా దొంగ అరెస్టు బనశంకరి: బెంగళూరులో చోరీలకు పాల్పడుతున్న ఏపీలోని తూర్పు గోదావరికి చెందిన ఘరానా దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల నగరంలో కొడిగేహళ్లిలో ఇంటి తాళం బద్దలు కొట్టి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. పోలీసులు గాలించి జేబీ నగరలో నివసించే గోదావరి వాసి కామేపల్లి శ్రీనివాస్ అలియాస్ కార్తీక్ (39)ను అరెస్ట్‌చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.9.20 లక్షల విలువచేసే 148 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 16వ తేదీన చోరీ చేసిన తరువాత ఓ ప్రైవేటు హాస్టల్లో మకాం వేశాడు. పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలు, ఇతర ఆధారాల ప్రకారం పట్టుకున్నారు. కార్తీక్‌కు దొంగతనాలే వృత్తి అని, బీదర్, హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు 10 పోలీస్ స్టేషన్లలో పాత నేరస్తుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కార్తీక్, మోహన్రుద్ర అనే పేర్లతో తిరుగుతూ చోరీలకు పాల్పడేవాడు. ఇతడిపై ల్యాప్‌టాప్, ఇళ్లలో చోరీలతో పాటు 88 కి పైగా కేసులు ఉన్నట్లు చెప్పారు. -
కుక్కలు, పందుల నివారణకు చర్యలు
అమలాపురం టౌన్: మున్సిపల్ రీజనల్ పరిఽధిలోని నగరాలు, పట్టణాల్లో కుక్కలు, పందుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు రాజమహేంద్రవరం మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ (ఆర్డీ) సీహెచ్ నాగ నరసింహరావు స్పష్టం చేశారు. అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసే ఏర్పాట్లు చేశామని ఆర్డీ చెప్పారు. ఇందు కోసం ప్రతి మున్సిపాలిటీలో కుక్కుల కుటుంబ నియంత్రణ కోసం ఆపరేషన్ కేంద్రాలు నిర్మిస్తున్నామని తెలిపారు. అమలాపురం మున్సిపాలిటీలో రూ.15 లక్షలతో కుక్కల ఆపరేషన్ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ మున్సిపాలిటీలో పందులను నివారించే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. పట్టణాల్లో జరుగుతున్న అక్రమ కట్టడాలను ఉపేక్షించవద్దని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. పన్నుల వసూళ్లు నూరు శాతం జరిగేలా రెవెన్యూ విభాగాలు నిమగ్నం కావాలని ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీటి సరాఫరా విభాగాలపై ఆయన చర్చించారు. తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అమలాపురం కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు, మండపేట కమిషనర్ టీవీ రంగారావు, కొవ్వూరు కమిషనర్ నాగేంద్రకుమార్, నిడదవోలు కమిషనర్ కృష్ణవేణి, రామచంద్రపురం డీఈఈ శ్రీకాంత్, ముమ్మిడివరం కమిషనర్ వర్మతో పాటు అధికారులు పాల్గొన్నారు. కుక్కుల ఆపరేషన్ కేంద్ర భవన నిర్మాణం పరిశీలన: స్థానిక 27వ వార్డులో రూ.15 లక్షలతో నిర్మితమవుతున్న కుక్కుల ఆపరేషన్ కేంద్ర భవనాన్ని ఆర్డీ నాగ నరసింహరావు పరిశీలించారు. సమీక్షా సమావేశం అనంతరం పట్టణంలో ఆయన పర్యటించి పలు విభాగాలను సందర్శించారు. డ్రెయిన్లతో పూడిక తీయాల్సిన డీఈఈ నాగ సతీష్‌తో ఆర్డీ చర్చించారు.మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహరావు -
జిల్లా బ్యాడ్మింటన్ సంఘ కార్యవర్గం ఎన్నిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా బ్యాడ్మింటన్ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం కాకినాడలో ఓ హోటల్లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్‌వర్మ, కార్యదర్శిగా ఫణిగోపాల్, కోశాధికారిగా భాస్కరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా చుండ్రుగోవిందరాజు, కర్రి భామిరెడ్డి, ద్వారంపూడి వీరభద్రారెడ్డిని సంఘం ఎన్నుకుంది. ఉపాధ్యక్షులుగా ఎమ్.మురళీధర్, పీఎస్ గణేష్‌కుమార్, సహాయ కార్యదర్శులుగా కృష్ణమూర్తి, అడ్డాల సత్యనారాయణ, జగన్నాఽథ్, సభ్యులుగా కేవీబీ కృష్ణంరాజు, యు.రామకృష్ణ, కె.నరసింహరావు, వి.శారదాదేవి, కె.శ్రీనివాస్, లక్ష్మణ్‌కుమార్, రామ్మోహన్రావు ఎన్నికయ్యారు. -
ప్రత్యంగిర హోమానికి బ్రేక్
● సత్యదేవుని కల్యాణోత్సవాల పేరిట నిలుపుదల ● గతంలో ఎప్పుడూ ఇలా లేదని భక్తుల అసంతృప్తి అన్నవరం: రత్నగిరి వన దేవత వనదుర్గ అమ్మవారికి వైశాఖ పౌర్ణమి సందర్భంగా నిర్వహించాల్సిన ప్రత్యంగిర హోమం సోమవారం నిర్వహించలేదు. సత్యదేవుని కల్యాణోత్సవాల సందర్భంగా పలు వైదిక కార్యక్రమాలు నిలుపు చేసిన దేవస్థానం అధికారులు ఈసారి కొత్తగా వనదుర్గ అమ్మవారి హోమాలు కూడా నిలిపివేశారు. గత శుక్రవారం చండీ హోమం, తాజాగా ప్రత్యంగిర హోమం నిర్వహించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2019 నుంచి 2024 వరకూ దేవదాయ శాఖ అధికారులే అన్నవరం దేవస్థానం ఈఓలుగా వ్యవహరించారు. అప్పట్లో ఏ సంవత్సరంలోనూ సత్యదేవుని కల్యాణోత్సవాల పేరిట ఈ హోమాలు నిలిపివేయలేదు. 2019 కల్యాణోత్సవాలకు దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ పి.సురేష్‌బాబు, 2021, 2022 సంవత్సరాల్లో వి.త్రినాథరావు, 2023లో చంద్రశేఖర్ ఆజాద్, గత ఏడాది కల్యాణోత్సవాల సమయంలో ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఈఓలుగా పని చేశారు. వీరి హయాంలో వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలు యథావిదిగా జరిగాయి. ఏటా వైశాఖ పౌర్ణమి సందర్భంగా జరిగే సత్యదేవుని చక్రస్నానం నాడే ప్రత్యంగిర హోమం నిర్వహించేవారు. చక్రస్నానం అనంతరం ప్రత్యంగిర హోమం పూర్ణాహుతిలో అప్పట్లో ఈఓలు పాల్గొనేవారు. 2021లో సత్యదేవుని చక్రస్నానం, వనదుర్గ అమ్మవారి ప్రత్యంగిర హోమం పూర్ణాహుతిలో అప్పటి ఈఓ త్రినాథరావు దంపతులు పాల్గొన్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖకు చెందిన వీర్ల సుబ్బారావు ఈఓగా ఉన్నారు. ఈ ఏడాది హోమాలు నిలిపివేయడం ద్వారా కొత్త సంప్రదాయం నెలకొల్పారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైర్మన్ పట్టించుకోవాలి రత్నగిరిపై సత్యదేవుని ఆవిర్భావం నుంచి కొద్ది కాలం ఇతరులు చైర్మన్లుగా ఉన్నా గత 135 సంవత్సరాలుగా వ్యవస్థాపక ధర్మకర్తలు, చైర్మన్లుగా దాదాపు ఇనుగంటి వంశీకులే వ్యవహరిస్తున్నారు. రాజా ఇనుగంటి వేంకట రామారాయణం, రాజా ఇనుగంటి ప్రకాశరావు, ఇనుగంటి గోపాలరావు, తరువాత రాజా ఐవీ రామ్‌కుమార్ ధర్మకర్తలుగా వ్యవహరించారు. వారందరూ దేవుని కార్యక్రమాలకు ఏ లోటూ రానిచ్చేవారు కాదు. పూజలు, హోమాలు ఏవి నిలుపు చేసినా ఊరుకునేవారు కాదు. ప్రస్తుతం ఇనుగంటి వంశంలో ఐదో తరానికి చెందిన ఐవీ రోహిత్ వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఏటా స్వామివారి కల్యాణోత్సవాల్లో యథావిధిగా జరిగే వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలు నిలిపివేస్తే ఆయన పట్టించుకోకపోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అమ్మవార్లకు అపచారం జరుగుతూంటే ఎందుకు అడ్డుకోవడం లేదని, ఇప్పుడైనా ఆయన పట్టించుకుని, పరిస్థితిని చక్కదిద్దాలని భక్తులు సూచిస్తున్నారు. -
అడ్డుగా ఉందని పసిగుడ్డును చంపేశారు
● కేసును ఛేదించిన పోలీసులు ● కన్నబిడ్డను కడతేర్చింది తల్లి, అమ్మమ్మే! ● కేసును తప్పుదారి పట్టించడానికే క్షుద్రపూజల నాటకం ● వివరాలు వెల్లడించిన పిఠాపురం సీఐ శ్రీనివాస్ పిఠాపురం: పాపం పుణ్యం తెలియని పసికందును తమకు అడ్డు వస్తుందనే కారణంగో కడతేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయినట్లు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో ఇటీవల పసికందును హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు వివరాలను పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో చనిపోయిన యశ్విత తల్లి అయిన పసుపులేటి శైలజ నరసింగపురానికి చెందిన పెదపాటి సతీష్‌ను ప్రేమించి ఇరు కుటుంబాలకు ఇష్టం లేకపోయినా వివాహం చేసుకున్నారు. 2024లో వారికి పాప యశ్విత జన్మించింది. వివాహం అయినప్పటి నుంచి భర్త తనను అత్తగారింటికి తీసుకెళ్లలేదని, పాప పుట్టిన తర్వాత భర్త కుటుంబ సభ్యులు చూడ్డానికి రాలేదని, తన భర్త కూడా తనతో మునుపటిలా సఖ్యతగా ఉండడం లేదని శైలజ ద్వేషం పెంచుకుంది. తన తల్లిదండ్రులు చూసిన సంబంధం కాదని, వేరే కులానికి చెందిన సతీష్‌ను వివాహం చేసుకోవడం ఆమె తల్లి పసుపులేటి అన్నవరానికి మొదటి నుంచి ఇష్టం లేకపోవడంతో సతీష్‌కు పుట్టిన యశ్వితను అడ్డు తొలగిస్తే శైలజకు రెండో పెళ్లి చేయవచ్చనే ఉద్దేశంతో ఆ తల్లి ఉంది. దీంతో ఇద్దరూ కలిసి పసికందును అడ్డు తొలగించుకోడానికి పథకం వేశారు. అందులో భాగంగా ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 5 నెలల వయసు గల యశ్వితను వారి ఇంటిలోనే వారిద్దరూ పీక నొక్కి చంపేశారు. అనంతరం పాప మృతదేహాన్ని ఇంటి వెనక గల నీటి బావిలో పడవేశారు. అనంతరం హత్యను కప్పిపుచ్చడానికి పాపకు ఎవరో మాంత్రికుడు చేతబడి చేసి చంపి ఉంటాడని నమ్మించి కేసును తప్పుదోవ పట్టించడానికి వారి గుమ్మం ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయ పెట్టి గుట్టుచప్పుడు కాకుండా కొంతసేపు నిద్ర పోయినట్లు నటించారు. అనంతరం లేచి తమ పాపను ఎవరో ఎత్తుకు పోయారంటు పెద్దగా కేకలు వేస్తూ హడావుడి చేసి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఏమీ తెలియనట్లు నటిస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాప ఆచూకీ కోసం గాలించగా వారి ఇంటి పక్కనే ఉన్న బావిలో పాప మృతదేహం లభించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్లతో ఆధారాలు సేకరించారు. పాప తల్లి శైలజ, అమ్మమ్మ పసికందును చంపి నూతిలో పడవేసి క్షుద్ర పూజల నాటకం ఆడినట్లు సాంకేతిక ఆధారాల సహాయంతో గుర్తించామన్నారు. పాప తండ్రి సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈ కేసులో నిందితులు ఇద్దరిని సోమవారం అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించినట్టు ఆయన తెలిపారు. -
బడి బస్సుల భద్రత ఎంత?!
ఆన్లైన్లో తేదీల ఖరారు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల బస్సుల సామర్థ్య పరీక్షలు చేపట్టడానికి మండపేట, రామచంద్రపురం, అమలాపురం రవాణాశాఖ కార్యాలయాలు సన్నద్ధమయ్యాయి. వాహన ఫిట్నెస్ ధ్రువీకరణ కోసం ముందుగా ఆన్లైన్లో నమోదు చేశాక ఓ తేదీని కేటాయిస్తారు. ఆ ప్రకారం వాహనాన్ని రవాణా శాఖ కార్యాలయానికి తీసుకొస్తే, అందరి సమక్షంలో వాహన ఫిట్నెస్ తనిఖీ చేస్తారు. వాహన కండిషన్‌పై సమగ్ర పరిశీలన అనంతరం ఽఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. బస్సులు ఏ విధంగా ఉండాలన్న దానిపై విస్తృతమైన ప్రచారం చేయాల్సిన బాధ్యత రవాణాశాఖ అధికారులపై ఉంది. ● ఈ నెల 15తో ముగుస్తున్న పాత ఎఫ్‌సీ గడువు ● కొత్తగా ఎఫ్‌సీలు జారీచేస్తున్న అధికారులు ● స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు తప్పనిసరి ● జిల్లాలో 835 పాఠశాల, కళాశాల బస్సులు రాయవరం: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో బస్సుల వినియోగం పెరిగింది. జిల్లాలో వివిధ రకాల ప్రైవేట్ విద్యా సంస్థలు 580 వరకు ఉన్నాయి. వచ్చే నెల 12వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అధిక శాతం మంది బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. బస్సు సామర్థ్యం సరిగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఫలితంగా విద్యార్థుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. అందుకే ఏటా మోటార్ వెహికల్ తనిఖీ అధికారులు బస్సు కండిషన్ చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ) జారీ చేస్తుంటారు. గతేడాది జారీ చేసిన ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ఈ నెల 14తో ముగియడంతో, ఈ నెల 15 నుంచి కొత్తగా ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రారంభమైంది. విద్యార్థులను సురక్షితంగా ఇంటి నుంచి పాఠశాలలకు, పాఠశాల నుంచి ఇంటికి చేరవేసే వాహనాల సామర్థ్యం (ఫిట్నెస్) ఎలా ఉంది? అన్న విషయాన్ని తేల్చే పనిని రవాణా శాఖ అధికారులు చేపట్టనున్నారు. 835 పాఠశాల బస్సులు కోనసీమ జిల్లాలో 580 వరకు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల పరిధిలో 835 ప్రైవేట్ బస్సులు, వ్యాన్లు ఉన్నాయి. జూన్ 15వ తేదీలోగా ఫిట్నెస్ సర్టిఫికెట్లను ఆయా పాఠశాలల యాజమాన్యాలు పొందాల్సి ఉంది. 2017 నుంచి స్కూల్ బస్సులకు స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి చేశారు. స్కూల్ బస్సుల వేగం గంటకు 60 కిటోమీటర్లు మించి ఉండకూడదు. ఫిట్నెస్ సర్టిఫికెట్ నిబంధనలివీ.. బస్సు డ్రైవర్‌కు బీపీ, సుగర్, కంటి సంబంధిత సమస్యలు లేవని సర్టిఫికెట్ సమర్పించాలి. ఈ సర్టిఫికెట్ బస్సులో ఒకటి, యజమాని వద్ద ఒకటి ఉంచాలి. బస్సు అన్ని లైట్లు పనిచేయాలి. రిఫ్లెక్టివ్ టేపును బస్సుకు నాలుగు వైపులా అతికించాలి. బస్సుకు ఉన్న గ్లాసులు అన్నీ పటిష్టంగా ఉండేలా చూడాలి. బస్సు నుంచి పొగ రాకుండా చూడాలి. బ్రేక్ కండిషన్లో ఉండాలి. స్పీడో మీటర్ పనిచేయాలి. స్టీరింగ్, టైర్లు కండిషన్లో ఉండాలి. డ్రైవర్‌కు ఐదేళ్ల అనుభవం ఉండాలి. 60 ఏళ్ల లోపు వయసు ఉండాలి. బస్సులో అత్యవసర ద్వారం, మంటలను ఆర్పే పరికరం ఉండాలి. బస్సులో మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉంచాలి. వారానికి ఒకసారి ప్రిన్సిపాల్ లేదా సంబంధిత అధికారి దీన్ని తనిఖీ చేయాలి. నెలకొకసారి పేరెంట్స్ కమిటీ ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను తనిఖీ చేయాలి. దీనికోసం ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించాలి. బస్సులో సీట్ల కింద బ్యాగులు ఉంచుకునేందుకు అరల ఏర్పాటు ఉండాలి. సైడ్ విండోలకు మధ్యలో 31 అంగుళాలకు మించని దూరంలో అడ్డంగా మూడు లోహపు కడ్డీలు అమర్చి ఉండాలి. ప్రతి విద్యా సంస్థ యాజమాన్యం విద్యాశాఖ, ట్రాన్స్పోర్ట్, పోలీస్, సౌజన్యంతో విద్యార్థులకు ఏడాదికి ఒక రోజు రోడ్ సేఫ్టీ తరగతులు నిర్వహించాలి. బస్సు ఫుట్ బోర్డుపై మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తుకు మించరాదు. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చబడి ఉండాలి. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకునేందుకు వీలుగా బస్సు ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రైలింగ్‌లు ఏర్పాటు చేయాలి. బస్సు అటెండెంట్ బస్సు బయట దగ్గరగా నిలబడి విద్యార్థులు బస్సు నుంచి సురక్షితంగా దిగేలా, ఎక్కేలా చూడాలి. పాఠశాల వద్ద బస్సుల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం ఉండాలి. బస్సులో అటెండర్ ఉండాలి. సీటింగ్ కెపాసిటికి మించి విద్యార్థులను ఎక్కించకూడదు. శ్రీబస్సు ఎడమవైపు ముందు భాగంలో యాజమాన్యం వివరాలు పొందుపర్చాలి. రూట్ ప్లాన్ బస్సులో ఉంచాలి. విద్యార్థుల సంఖ్య, వారి పూర్తి వివరాలు బస్సులో ఏర్పాటు చేయాలి. బస్సులో ఫిర్యాదుల పుస్తకాన్ని ప్రతి నెలా యాజమాన్యం తనిఖీ చేయాలి. బస్సులో అటెండర్ తప్పకుండా యూనిఫామ్ ధరించాలి. నిబంధనలు పాటించకుంటే సీజ్ చేస్తాం మోటార్ వాహనాల నిబంధనలు పాటించని పాఠశాల, కళాశాలల బస్సులను సీజ్ చేస్తాం. పాఠశాలలు తెరిచిన నాటి నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. గడువు ముగిసిన తర్వాత ఎఫ్‌సీ, పర్మిట్, కండిషన్ లేని బస్సులను సీజ్ చేస్తాం. – డి.శ్రీనివాసరావు, జిల్లా రవాణాశాఖ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఘనంగా సత్యదేవుని చక్రస్నానం
● వేడుకగా నాగవల్లీ పట్టు, దండియాడింపు కార్యక్రమాలు ● రత్నగిరిపై నేడు శ్రీపుష్పయాగం అన్నవరం: వార్షిక దివ్యకల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం పంపా జలాల్లో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు చక్రస్నానం, సాయంత్రం రత్నగిరిపై నాగవల్లి, దండియాడింపు కార్యక్రమాలను పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెళ్లి పెద్దలు సీతారాములు వెంట రాగా నవ దంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను ఉదయం 8.30 గంటలకు ఊరేగింపుగా పంపా నదీ తీరానికి తీసుకువచ్చారు. అక్కడి మండపం లోపల సింహాసనంపై స్వామి, అమ్మవార్లను, మరో ఆసనం మీద సీతారాములను వేంచేయించి, పూజలు చేశారు. పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి, శూలానికి పంచామృతాలతో అవభృథ స్నానం చేయించారు. అనంతరం బలిమూర్తికి, సుదర్శన చక్రాన్ని ఊరేగింపుగా పంపా నది లోపలకు తీసుకువెళ్లి నదిలో మూడుసార్లు చక్రస్నానం చేయించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు దత్తు శర్మ, సుధీర్, పవన్, దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, వైదిక కమిటీ సభ్యుడు, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్ తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు. రత్నగిరిపై అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్లకు సాయంత్రం నాగవల్లి పట్టు, నీలలోహిత ధారణ, దండియాడింపు కార్యక్రమాలను పండితులు ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్లను ప్రత్యేక వేదిక మీద, పెళ్లిపెద్దలు సీతారాములను మరో ఆసనం మీద ఆశీనులను చేసి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగులతో నాగవల్లి తీర్చిదిద్ది పూజలు చేశారు. అమ్మవారికి నీలలోహిత ధారణ చేశారు. ధ్వజావరోహణ చేసిన తరువాత అర్చకులు కంకణ విమోచనం చేశారు. అనంతరం వధూవరులైన అమ్మవారు, సత్యదేవుని తరఫున అర్చకులు బంతులాట, బిందెలో ఉంగరం వెతకడం వంటి వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు కొండవీటి రాజా, పవన్, యడవిల్లి ప్రసాద్ తదితరులు స్వామి, అమ్మవార్ల విగ్రహాలు పట్టుకుని నృత్యం చేస్తూ, ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్నారు. ప్రధానాలయంలో సత్యదేవుడు, అమ్మవార్లకు, రామాలయంలో సీతారాముల విగ్రహాలపై కూడా రంగులు జల్లారు. సిబ్బంది కూడా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని వేడుక చేశారు. నేడు కల్యాణోత్సవాల ముగింపు సత్యదేవుడు, అమ్మవార్ల శ్రీపుష్పయాగం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, మహిళలకు జాకెట్టు ముక్కలు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నిత్య కల్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఈ వేడుకతో సత్యదేవుని దివ్యకల్యాణోత్సవాలు ముగియనున్నాయి. అన్నవరంలో నేడు తెల్లవారుజామున 3.00 : సుప్రభాత సేవ ఉదయం 8.00 : చతుర్వేద పారాయణ రాత్రి 7.30 : రత్నగిరిపై స్వామివారి నిత్యకల్యాణ మండపంలో సత్యదేవుని శ్రీపుష్పయాగ మహోత్సవం ఉదయం 7.00 – 10.00, సాయంత్రం 5.00 – రాత్రి 11.00 : సాంస్కృతిక కార్యక్రమాలు -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
● ఆర్టీసీ బస్ నుంచి ఊడిన డీజిల్ ట్యాంక్ ● డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్ నిలిపివేత సీతానగరం: మండలంలోని వంగలపూడి ఏటిగట్టుపై పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్ డీజిల్ ట్యాంక్ ఊడి పోవడంతో గమనించిన డ్రైవర్ బస్‌ను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. లేకుంటే ఫైర్ అయితే తమ పరిస్థితి ఏంటని ప్రమాణికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్లితే సోమవారం ఉదయం 9 గంటలకు పురుషోత్తపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళ్లుతున్న ఆర్టీసీ బస్ డీజిల్ ట్యాంక్ వంగలపూడి – సింగవరం మధ్యలో ఊడి అందులోని డీజిల్ బయటకు లీకై ంది. డ్రైవర్‌కు బస్ నుంచి శబ్ధం రావడంతో ఏటిగట్టుపై బస్ని నిలిపివేశాడు. బస్‌ను గమనించగా డీజిల్ ట్యాంక్ ఒక వైపు ఊడి రోడ్డుపై రాసుకుంటూ వచ్చింది. బస్‌ను అలాగే నడిపి ఉంటే రోడ్డుపై ట్యాంక్ రాచుకుని నిప్పు రవ్వలు వచ్చి డీజిల్‌కు అంటుకుంటే ప్రయాణికుల పరిస్తితి ఏంటని, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు, స్థానికులు డ్రైవర్‌ను అభినందించారు. ప్రయాణికులను వేరే ఆర్టీసీ బస్‌లో పంపించారు. పది కిలోమీటర్ల సీతానగరం – పురుషోత్తపట్నం రోడ్డు శిథిలం అవ్వడంతో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. గత నెలలో కూటమి నాయకులు రోడ్డుకు శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు రోడ్డు పనులు చేపట్టలేదు. రోడ్డు శిథిలమవ్వడంతో ఆర్టీసీ బస్‌లు తరచు పాడవుతున్నాయి. వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. -
పీజీఆర్ఎస్కు 373 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 373 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ వెంకటరావు, జెడ్పీ సీఈఓ వీవీ లక్ష్మణరావు, హౌసింగ్ బోర్డు పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, సీపీఓ పి.త్రినాథ్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఎండార్స్మెంట్ చేయాలని సూచించారు. సక్రమంగా పరిష్కరించని వాటిని రెండు స్థాయిల్లో ఆడిట్ జరిపి, రీ ఓపెన్ చేస్తారని, అలా ఎక్కువ రీ ఓపెన్ చేసిన శాఖ అధికారులకు మెమోలు జారీ చేస్తారని హెచ్చరించారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీకి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే 1100 నంబర్‌కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. సీహెచ్‌ఓల భిక్షాటన కాకినాడ సిటీ: తమ డిమాండ్ల పరిష్కారానికి గత పది రోజులు నుంచి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ) సోమవారం భిక్షాటన చేశారు. మానవ హారంగా ఏర్పడి ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని నినదించారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు వైద్యం చేస్తున్న సీహెచ్‌ఓలు ఇలా భిక్షాటన చేయడంతో ప్రజలు వారి పట్ల సానుభూతి ప్రకటించారు. ఉద్యమాన్ని కొనసాగిస్తామని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. పోలీస్ గ్రీవెన్స్‌కు 47 ఫిర్యాదులు కాకినాడ క్రైం: తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 47 ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులను ఆయన నేరుగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్గీకరణలో మాదిగలకు అన్యాయంసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఎస్సీ వర్గీకరణ అమలులో మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లలో మాలలకు 8 శాతం, మాదిగలకు 6 శాతం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాదిగలకు చంద్రబాబు అన్యాయం చేస్తూంటే మంద కృష్ణ మాదిగ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా మాదిగలు పోరాటం చేస్తే, ఫలాలు మాలలకు అందించడం దురదృష్టకరమన్నారు. వర్గీకరణ అమలులో మాల, మాదిగలకు చెరో 7 శాతం, ఉప కులాలకు ఒక శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఇతర పథకాలకు దారి మళ్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఉమ్మడిగా కాకుండా ఎ, బి, సి, డి గ్రూపులుగా కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి, జూన్ 5న అమరావతిలో మాదిగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెంకటేశ్వరరావు చెప్పారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బలంకుల రాజు తదితరులు పాల్గొన్నారు. సరస్వతీ నదీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు రావులపాలెం: సరస్వతీ నదీ పుష్కరాలకు రావులపాలెం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ జీజీవీ రమణ సోమవారం తెలిపారు. రావులపాలెం డిపో నుంచి వరంగల్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామప్ప దేవాలయాల దర్శనాలతో పాటు సరస్వతీ నదిలో పుష్కర స్నానం చేసే విధంగా రెండు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఈ నెల 15 తేదీన రావులపాలెం నుంచి బయలుదేరుతున్నట్టు తెలిపారు. ప్రయాణికుల నుంచి విశేష స్పందన ఉన్న కారణంగా ఈ నెల 20వ తేదీన మరో రెండు బస్సులు పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. -
పదోన్నతుల కోసం ఏఎన్ఎంల ధర్నా
కాకినాడ క్రైం: అర్హులైన తమకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఎన్ఎంలు నిరసన బాట పట్టారు. సోమవారం సాయంత్రం కాకినాడలోని కార్యాలయ ఆవరణలో ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సంయుక్తాధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అస్కరరావు, శ్రీకాంత్‌రాజు మాట్లాడుతూ, ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పించడంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పదోన్నతులపై తాత్సారం చేయడం తగదన్నారు. డీఎంహెచ్‌వో సహా డిప్యూటీ డెమో వైఖరే ఇందుకు కారణమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో డీఎంహెచ్‌వోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్పందించిన డీఎంహెచ్‌వో మంగళవారం మెరిట్ లిస్ట్ ప్రదర్శించి, 22వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఏఎన్ఎంలు నిరసన విరమించారు. -
పవన్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు
సాక్షి, కాకినాడ జిల్లా: పవన్ కల్యాణ్‌పై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆయన్ను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. మల్లాం భాధితులకు న్యాయం చేయాలని పిఠాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.‘‘కంప్యూటర్ యుగంలో దళితుల సాంఘిక బహిష్కరణ సిగ్గుచేటు. పిఠాపురంలో మనువాదం అమలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాంలో సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించకపోవడం దారుణం. ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయం’’ అంటూ దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు.దళితుడన్న కారణంగా కరెంటు షాక్‌తో చనిపోయిన జనసేన కార్యకర్త పల్లపు సురేష్ కుటుంబాన్ని కూడా పరామర్శిచలేదు. పవన్‌కు మనసు నిండా కుల వివక్ష ఉంది. కులం, మతం రంగు పూసుకుని బతుకుతున్నాడు. మల్లాం దళితుల సాంఘిక బహిష్కరణపై సుప్రీం కోర్టును ఆశ్రయించాం. చట్టాన్ని ఉల్లంఘించినందుకు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, కాకినాడ కలెక్టర్, ఆర్డీవో, పోలీసు అధికారులపై కేసు పెట్టాం...మల్లాం ఘటనపై నేటికి పవన్ కళ్యాణ్ స్పందిక పోవడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం పదవి నుండి తొలగించాలని పిటిషన్ వేశాం’’ అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశోక్ బాబు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఫిట్స్‌తో వ్యక్తి మృతి
కడియం: స్థానిక కాలువగట్టున ఆలమూరు మండలం నర్శిపూడి గ్రామానికి చెందిన గుబ్బల వెంకటరమణ (40) అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. వారి కథనం మేరకు నర్శిపూడి గ్రామానికి చెందిన వెంకటరమణ కాలువలో గేలంతో చేపలు పట్టి అమ్ముతుంటాడు. శనివారం మధ్యాహ్నం కడియం కాలువగట్టుకు చేపలు పట్టడానికి వెళ్లాడు. ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన స్థానికులు వెంకటరమణ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆరా తీశారు. వెంకటరమణకు తరుచూ ఫిట్స్ వస్తుంటాయని, అలా శనివారం ఫిట్స్ వచ్చి కాలువగట్టున పడిపోయి ఉండి ఉంటాడని, ఎవరూ గమనించకపోవడంతో మృతిచెంది ఉంటాడని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.డీసీసీబీ చైర్మన్‌గా తుమ్మల బాబుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్‌గా తుమ్మల రామస్వామి (బాబు)ను, డీసీఎంఎస్ చైర్మన్‌గా పెచ్చెట్టి చంద్రమౌళిని నియమించారు. గత కొన్ని రోజులుగా డీసీసీబీ చైర్మన్ పదవులకు పలువురి పేర్లు వినిపించినా చివరికి రామస్వామిని నియమించారు. -
భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టు
అమలాపురం రూరల్: మండలం కామనగరువు పంచాయతీ పరిధిలోని మిక్చర్ కాలనీకి చెందిన పూజారి రాజు అనే యువకుడు ఇటీవల జై పాకిస్థాన్ అంటూ ఫేస్బుక్ పోస్టు పెట్టాడు. ఆ పోస్ట్ అదివారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమలాపురం తాలూకా ఎస్సై శేఖర్‌బాబు అధ్వర్యంలో పోలీసులు రాజు ఇంటికి చేరుకుని తనిఖీ చేశారు. అతడు ప్రస్తుతం విజయనగరం జిల్లా సాలూరులో ఉన్నట్లు అతని తండ్రి ఏసుబాబు పోలీసులకు తెలిపారు. తెలియక ఈ పోస్టు పెట్టినట్లు రాజు చెప్పినట్లు ఎస్సై శేఖర్‌బాబు తెలిపారు. ఈ కుటుంబం గతంలో మిక్చర్ కాలనీలో ఉండే వారని, సోఫా పనుల కోసం వెళ్లి కుటుంబ మొత్తం విజయనగరం జిల్లా సాలూరులో నివసిస్తున్నారని స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు విజయనగరం పోలీసులకు సమాచారం అందించారు. ● యువకుడి కోసం పోలీసుల గాలింపు -
కోరుకొండలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కోరుకొండ: స్థానిక దేవునికోనేరు వద్ద ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై కూన నాగరాజు తెలిపారు. 45 ఏళ్ల వయసున్న మృతదేహాన్ని గుర్తించినట్టు వీఆర్వో కొవ్వాడ రామకృష్ణ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించేందుకు వీలుగా 72 గంటల పర్యవేక్షణ నిమిత్తం రాజమమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు ఎస్సై తెలిపారు.బాల్య వివాహం అడ్డగింతయానాం: చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న ఓ బాల్య వివాహాన్ని యానాం చైల్డ్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన సమాచారం ఆధారంగా సిబ్బంది వెళ్లి అడ్డుకున్నారు. ఆదివారం చైల్డ్ హెల్ప్‌లైన్ కో ఆర్డినేటర్ సంసాని రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం నియోజకవర్గ పరిధిలో బాలయోగి నగర్లో 15 ఏళ్ల బాలికకు 22 ఏళ్ల యువకుడితో వివాహం చేస్తున్నారని తమకు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు యానాం ఏఎస్సై పంపన మూర్తి, ప్రకాష్‌లను వెంటపెట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్లి బాల్యవివాహాల నిరోధక చట్టం–2006 గూర్చి ఇరువురు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించామని, చట్టరీత్యా ఈ వివాహం నేరమని చెప్పి చెప్పినట్టు తెలిపారు. యానాంలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతుంటే 1098కు సమాచారం అందించాలని, వివరాలను గోప్యంగా ఉంచుతారని తెలిపారు. -
తొలిదశలో గుర్తిస్తే బోన్ క్యాన్సర్ నివారణ
● అమోర్ ఆసుపత్రి ఎండీ, బోన్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ కిశోర్‌రెడ్డి ● ఎముకలు, కీళ్లు, కండరాల క్యాన్సర్లపై పీఎంపీలకు అవగాహన కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బోన్ క్యాన్సర్ వచ్చిందంటే ఇక చివరిదశే అని చాలామంది అనుకుంటారు. అది పూర్తి అపోహేనని హైదరాబాద్‌కు చెందిన అమోర్ ఆస్పత్రి ఎండీ, బోన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కిశోర్‌రెడ్డి తెలిపారు. స్థానిక మోడల్‌కాలనీలో ఉన్న ఎఫ్ కెఫే హోటల్లోని ఫంక్షన్ హాలులో ఆదివారం ఉభయగోదావరి జిల్లాల్లోని పీఎంపీ వైద్యులకు ఎముకలు, కీళ్లు, కండరాల క్యాన్సర్ స్పెషలిస్టు డాక్టర్ కిశోర్‌రెడ్డి ఆదివారం అవగాహన కల్పించారు. కమ్యూనిటీ పారామెడిక్స్, ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పీఎంపీ అసోసియేషన్) తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎముకలకు కండరాలకు సంబంధించిన క్యాన్సర్‌కు కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్సలను వివరించారు. క్యాన్సర్లు వ్యక్తి జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, ముఖ్యంగా బోన్ క్యాన్సర్లపై అవగాహన అవసరమన్నారు. బోన్ క్యాన్సర్‌కు గురైన ఎందరికో నేటి ఆధునిక వైద్యంతో నయం చేశామన్నారు. మూడేళ్ల చిన్నారికి సైతం బోన్ క్యాన్సర్ చికిత్స చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బళ్లా శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు తోరాటి ప్రభాకరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుమళ్ల రాంబాబు, రాష్ట్ర గౌరవ సలహాదారులు కోన చిన్నారావు, జిల్లా కార్యదర్శి పి.దేవానందం, కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేఎస్ ప్రసాద్, ఎండీ తానీషా, కోనసీమ జిల్లా అధ్యక్షుడు కోన సత్యనారాయణ, సూరంపూడి వీరభద్రరావు, రాజమహేంద్రవరం అధ్యక్షుడు రహమాన్ ఖాన్, జిల్లా సహాయ కార్యదర్శి ఎ.ధనుంజయ్, కార్యదర్శి మట్టా రమేష్‌లతో పాటు అన్ని మండలాల నాయకులు హాజరయ్యారు. -
నర్సింగ్ నైటింగేల్!
కపిలేశ్వరపురం: సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి సంపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యంతో జీవించాలి. రోగభయం లేని సమాజానికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. జనాభా, ఆరోగ్య ప్రమాణాల ప్రాతిపదికన తగినన్ని ఆస్పత్రులను, వైద్యులను, సిబ్బందిని నియమించాలి. వారి పూర్తి సేవలు రోగులకు అందేలా సహకరించాలి. వైద్యం ఎంత ఉన్నతంగా చేసినా సిబ్బంది, నర్సుల సహకారం లేకపోతే అంతా వృథా అయినట్టే. సమాజ ఆరోగ్య పరిరక్షణలో నర్సుల పాత్ర ఎంతో కీలకం. ఉమ్మడి జిల్లాలో నర్సులు ఇలా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 135 పీహెచ్‌సీలు, 22 సీహెచ్‌సీలు, 7 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. కాకినాడలో జీజీహెచ్, రాజమహేంద్రవరంలో ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నాయి. ప్రభుత్వ, గ్రామీణ, అర్బన్ సీహెచ్‌సీల్లో 1,445 మంది హెల్త్ సెక్రటరీలున్నారు. 200 మంది ఏఎన్ఎంలు, 473 మంది స్టాఫ్ నర్సులు, 1232 మంది ఎంఎల్‌హెచ్‌పీలు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,396 మంది ఆశా కార్యకర్తలు పని చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 480, కాకినాడ జిల్లాలో 450, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 165 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులుగా పనిచేస్తున్నారు. నర్సుల డిమాండ్లు వినేవారేరీ! ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల తీరు ఆందోళనకరంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఆస్పత్రులు నడుస్తున్నాయి. ప్రతి వెయ్యి మంది జనానాకు ముగ్గురు నర్సులు చొప్పున ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన నిర్దేశకాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నర్సులపై పనిభారం అధికమవుతోంది. కార్మిక చట్టానికి భిన్నంగా వారు 8 గంటలకు బదులు 11 గంటలు పని చేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు పని ప్రదేశంలో ప్రత్యేక సదుపాయాలు లేవు. హెల్త్ సెక్రటరీలకు వైద్య సేవలకు తోడు ఇతర ప్రభుత్వ అనుబంధ పనులు సైతం చెప్పడంతో వైద్య సేవల్లో నాణ్యత కొరవడుతోంది. ఉద్యోగ ఉన్నతి ప్రక్రియ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిలిచిపోవడంతో నర్సులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాకినాడ జీజీహెచ్‌లో ఐసీయూ విభాగంలో ఒక్కో బెడ్‌కు ముగ్గురు చొప్పున నర్సులు ఉండాలన్నది ఆచరణకు నోచుకోవడంలేదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా సేవలందిస్తు ఆశా కార్యకర్తలు క్షేత్ర స్ధాయిలో వేధింపులకు గురవుతున్నారు. మార్చి 1న నిర్వహించిన ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో గ్రాట్యుటీ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, 30 ఏళ్ల సర్వీసు ఉంటేనే రూ.1.5 లక్షల గ్రాట్యుటీ ఇస్తామంటూ మెలిక పెట్టింది. 2024 డిసెంబర్లో సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఆందోళనలు చేశారు. వారి పోరాటాన్ని వేధింపులు, పోలీస్ చర్యలతో అణచివేసింది. పలు దఫాలుగా నిర్వహించిన నర్సుల ఉద్యమాలు ఫలితంగా ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచింది. 180 రోజుల ప్రసూతి సెలవులకు అంగీకరించింది. నర్సుల దినోత్సవ నేపథ్యం ఇదీ... 1820, మే 12న ఇటలీలో ధనిక కుటుంబంలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజును ప్రపంచ నర్సుల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ నర్సెస్ 1965లో నర్సింగ్ డేను గుర్తించింది. యుద్ధ సమయంలో గాయాలపాలైన వారికీ, ప్రకృతి వైపరీత్యాలకు గురైనవారికీ ధైర్య సాహసాలతో వైద్య సేవలందించడంలో నర్సింగ్‌లో నైటింగేల్ తీసుకువచ్చిన సంస్కరణలు ఎంతో దోహదం చేశాయి. ఆమె రాసిన రచనలు వైద్యరంగాన్ని మరో మెట్టు ఎక్కించాయి. నైటింగేల్ ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సెస్ పేరుతో సంస్థను స్థాపించి ఎందరో నర్సులను తయారు చేశారు. 1910 ఆగస్టు 13న లండన్‌లో ఆమె మృతి చెందారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఆస్పత్రుల ప్రగతి స్వాతంత్య్రం వచ్చాకా రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ఏర్పాటైతే, వైఎస్సార్ సీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను తీసుకొచ్చింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ విధానంతో ప్రైవేటుపరం చేయాలని చూస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నర్సింగ్ కౌన్సిల్‌తో ఎంవోయూ కుదుర్చుకుని నర్సింగ్ కోర్సులు చేసిన యువతలో నైపుణ్యాల పెంపునకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. 2019 ఆగస్టులో ఆశాల వేతనాలను రూ.10 వేలకు పెంచారు. సేవే లక్ష్యం, ప్రేమే మార్గంగా రోగుల సేవ ప్రపంచానికి ఆదర్శంగా నిలచిన ఫ్లోరెన్స్ ఆమె మార్గంలో నేడు ఎందరో పయనం వారి శ్రేయస్సు ప్రభుత్వాల కనీస బాధ్యత మాటే మంత్రం.. మంత్రం లక్షణం.. మనసుపై బలమైన ముద్రవేసి సమస్య పరిష్కరించడం. ఈ లక్షణాన్ని నూరు శాతం కలిగి ఉన్న మన ఊరి మంత్రసాని ఆమె. కాలక్రమంలో నామాంతరం.. రూపాంతరం చెంది నర్సులుగా సమాజ సేవ చేస్తోంది. రోగం ఎంత క్షిష్టమైనదైనా.. రోగి శరీరం.. మనసు ఎంత అవసానంలో ఉన్నా తన అనునయ వాక్యాలతో మనసును ఊరడించి రోగభయాన్ని తగ్గించి మానసికంగా రోగం తగ్గడానికి ఉద్యుక్తుడిని చేసి వైద్యుడు ఇచ్చిన ఔషధం ఒంటబట్టేలా చేస్తుంది. ఎంత పెద్ద ఆస్పత్రి అయినా.. వైద్యుడు ఎంతటి ప్రవీణుడైనా ఆమె మాటల అనుపానం లేకపోతే ఎందరో రోగులు అంత తీవ్రతరమైన రోగం లేకపోయినా మానసిక భయంతో విలువైన ప్రాణాలు కోల్పోయేవారు. ఎంతో దూరం పోనవసరం లేకుండా ఇటీవల కొన్ని వేల మందిని కబళించిన కరోనాయే ఇందుకు సాక్ష్యం. ఆ కష్టకాలంలో ఎందరో రోగులు మానసికమైన ఒత్తిడిని తట్టుకోలేకే మృతి చెందారన్నది నిర్వివాదాంశం. సరైన వైద్యాన్ని సకాలంలో అందిస్తూ సేవ చేసే మంత్రముగ్ధలైన నర్సులు నిజమైన సమాజ సేవకులు. వారికి ప్రేరణ.. ఆదర్శం ఫ్లోరెన్స్ నైటింగేల్. నిజంగా ఆమె సార్థకనామధేయురాలు. నైటింగేల్ అంటే మధురమైన గానం చేసే పక్షి అని అర్థం. ఆమె మాటల ప్రభావం ఎంతటిదో ప్రపంచం నేడు గుర్తిస్తోంది. ఇటలీలో జన్మించి ఐర్లాండులో నర్సింగ్‌లో సంస్కరణలకు నాంది పలికిన మహోన్నత సేవా శిఖరం. నేడు ఆమె జయంతిని పురస్కరించుకుని నర్సుల దినోత్సవం సందర్భంగా కథనం. చాకిరీ మూరెడు... వేతనం బెత్తెడు... నర్సులు ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు 12 గంటలు పాటు సేవలందిస్తున్నారు. నెలకు వారికి ఇచ్చే వేతనం రూ.15 వేల లోపే. ప్రభుత్వ రంగంలోని నర్సులు సైతం వేతనాలు పెంచాలన్న డిమాండ్ అపరిష్కృతంగానే ఉంది. పీఎంఎంవీవై పథకం ద్వారా గర్భిణులను ప్రతి నెలా 9న ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్య పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కిల్కారీ, మొబైల్ అకాడమీ సేవల్లో నర్సులు భాగస్వాములవుతున్నారు. జిల్లాకు సుమారుగా ఐదు వేల మంది చిన్నారుల చొప్పున ప్రతి నెల బుధ, శనివారాల్లో క్రమం తప్పకుండా టీకాలు వేస్తున్నారు. వైద్య, ఆరోగ్య సేవలకు అవకాశం కల్పించాలి పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు చేసేందుకు పూర్తి స్ధాయిలో అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా సచివాలయ పరిధిలోని పనుల భారాన్ని మోపడం సరికాదు. హెల్త్ సెక్రటరీలను యాప్‌ల నిర్వహణకు మినహాయించాలి. ఫీల్డ్ వర్క్‌లో ఉన్నందున ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – జి.నాగ వరలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ యునైటెడ్ విలేజ్ అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ వెల్ఫేర్ అసోసియేషన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ -
వాహనం అదుపుతప్పి యువకుడి మృతి
ఆలమూరు: స్థానిక జాతీయ రహదారిలోని చొప్పెల్ల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపల్లి ఆనంద్ (29) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం మడికి గ్రామానికి చెందిన ఆనంద్ రాజమహేంద్రవరంలోని ఐసీఐసీఐ క్రెడిట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వ్యక్తిగత పని మీద తన బైక్‌పై రావులపాలెం వైపు వెళ్తుండగా స్థానిక లాకుల వద్ద అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టాడు. దీంతో ఆనంద్‌కు తలపై బలమైన గాయమై రక్తం పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై అశోక్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టంకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆనంద్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏడాది క్రితం అతడికి వివాహం కాగా భార్య, ఒక పాప ఉన్నారు. ట్రాక్టర్ ఢీకొని.. పిఠాపురం: గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం రైల్వే గేటు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కథనం మేరకు అల్లూరిసీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండలం మచ్చేపురానికి చెందిన కోడ మోహన్ గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురంలో చేపల చెరువుల వద్ద పని చేస్తున్నాడు. ఆదివారం చేపల పట్టుబడి ఉండడంతో ఇతర కూలీలకు భోజనాలు తేవడానికి మోటారు సైకిల్‌పై చేబ్రోలు వెళ్లి తిరిగి వస్తుండగా ఏకే మల్లవరం రైల్వే గేటు వద్ద అత్యంత వేగంగా వచ్చిన ట్రాక్టర్ మోహన్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్సులో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని.. తుని రూరల్: తుని మండలం టి.తిమ్మాపురం జంక్షన్ సమీపంలో లారీ ఢీ కొనడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి తెలిపారు. ఆదివారం విజయవాడ రాణీపేటకు చెందిన బూరాడ పట్టాభినాయుడు శుభలేఖలు ఇచ్చేందుకు శ్రీకాకుళం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. లారీ ఢీ కొనడంతో పట్టాభినాయుడు అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. -
పాడైన గుడ్లే పోషకాహారం!
● గొర్రిపూడి అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ ● ఆందోళన వ్యక్తం చేసిన లబ్ధిదారులు కరప: అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ లేక అక్కడి చిన్నారులు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులకు, గర్భిణులకు పోషకాహారం నిమిత్తం అందించే కోడిగుడ్లపై అంగన్వాడీ కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండలం గొర్రిపూడి మార్కెట్సెంటర్లోని అంగన్వాడీ కేంద్రంలో ఈ నెల 7వ తేదీన సరఫరా చేసిన కోడిగుడ్లను ఆదివారం లబ్ధిదారులు ఇంటి వద్ద ఉడకబెట్టగా దుర్వాసనతో కుళ్లిపోయాయి. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికీ, ఎండకూ పాడయ్యాయి ఈ విషయమై సెక్టార్ సూపర్వైజర్ విజయలక్ష్మి వివరణ ఇస్తూ కోడిగుడ్లు చెడిపోవడం వాస్తవమేనని, అయితే వాటిని ఎవరికీ పంపిణీ చేయలేదన్నారు. నాలుగు రోజుల క్రితం కోడిగుడ్లు తీసుకు వచ్చే వ్యాన్ డ్రైవర్‌కు అకస్మాత్తుగా ప్లేట్లెట్లు పడిపోవడంతో కాకినాడ ఆసుపత్రిలో చేరారని, కోడిగుడ్లతో ఉన్న వ్యాన్‌ను బయట ఉంచేయడంతో వర్షానికి తడిసి, ఎండకు పాడైపోయాయని తెలిపారు. డ్రైవర్ కోలుకున్నాక ఈ విషయం ఏజన్సీ యజమానికి చెప్పకుండా అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చి వెళ్లిపోయాడు. ఆదివారం కోడిగుడ్లు పాడైనట్టు గుర్తించిన వెంటనే ఏజన్సీస్కి తెలియజేస్తే, పాడైన గుడ్లను వెనక్కి తీసుకుని, మంచివి ఇచ్చేందుకు అంగీకరించారని, ఇదే విషయాన్ని సీడీపీఓకు కూడా తెలియజేసినట్టు విజయలక్ష్మి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తాళ్లపూడి (కొవ్వూరు): మండంలోని దోమ్మేరు శివారులో ఎదురుగా వస్తున్న ట్రాలీ ట్రాక్టర్ మోటార్ సైకిల్‌ను ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడి క్కడే మృతి చెందాడు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు దోమ్మేరు గ్రామానికి చెందిన చిగురుపల్లి విద్యాసాగర్ (18) కాపవరం వెళ్లి అక్కడ నుంచి మోటార్ సైకిల్‌పై వస్తుండగా కొవ్వూరు వైపు నుంచి పంగిడికి గడ్డితో వెళుతున్న ట్రాలీ ట్రాక్టర్ ఎదురుగా ఢీకొనడంతో విద్యాసాగర్ దాని చక్రాల కింద పడిపోయాడు. దీంతో అతని తల, ఇతర శరీరభాగాలు నుజ్జయ్యి మృతి చెందాడు. విద్యాసాగర్ కొవ్వూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి అరవింద్ కుమార్ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి వెంకటలక్ష్మి, చెల్లి జోత్స్న ఉన్నారు. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన కొడుకు మృతి చెందడంతో వారి రోదన వర్ణనాతీతమైంది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించి తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. సీఐ విజయబాబు ఘటనా ప్రదేశానికి చేరుకుని వారికి నచ్చ చెప్పి యువకుడి మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాలీ ట్రాక్టర్ న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల బైఠాయింపు సీఐ జోక్యంతో పరిస్థితి ప్రశాంతం -
మండు వేసవిలోనూ లోవకు భక్తుల తాకిడి
తుని రూరల్: మండు వేసవిలోనూ తలుపులమ్మ అమ్మవారి సన్నిధి వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని డిప్యూటీ కమిషనర్ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,24,140, పూజా టికెట్లకు రూ.73 వేలు, కేశఖండన శాలకు రూ.16,130, వాహన పూజలకు రూ.9,860, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలుగా రూ.63,772, విరాళాలు రూ.77,577 కలిపి మొత్తం రూ.3,64,479 ఆదాయం సమకూరిందని వివరించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా వేద పండితులు, ప్రధానార్చకులు అమ్మవారికి పంచామృతాభి షేకాలు నిర్వహించారు. రత్నగిరిపై భక్తజన ప్రవాహం అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం భక్తజన ప్రవాహాన్ని తలపించింది. కొండపై ఎక్కడ చూసినా భక్తులు గుంపులు గుంపులుగా కనిపించారు. రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయంలో తీవ్ర రద్దీ నెలకొంది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 50 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఎండ వేడికి అల్లాడుతున్న భక్తులు సత్యదేవుని దర్శనానికి, వ్రతాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులు రత్నగిరిపై ఎండవేడికి అల్లాడిపోతున్నారు. ఆదివారం 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత నమోదవడంతో భక్తులు ఆలయ ప్రాంగణంలోని చలువ పందిళ్ల కింద సేద తీరారు. విపరీతమైన ఉక్కపోతతో ఆపసోపాలు పడ్డారు. గతంలో పశ్చిమ రాజగోపురం వద్ద కూడా మజ్జిగ పంపిణీ చేసేవారు. ఈ ఏడాది ఎందుకనో పంపిణీ చేయడం లేదు. దీంతో భక్తులు శీతలపానీయీలను కొనుగోలు చేసి తాగాల్సి వస్తోంది. దేవస్థానం తరఫున భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని పలువురు సూచిస్తున్నారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్స్ మే 28 నుండి జూన్ 1 వరకూ నిర్వహించనున్నారు. జిల్లాలోని 36 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లావ్యాప్తంగా ఫస్టియర్‌కు 15,933 మంది, సెకండియర్‌కు 5,608 మంది కలిపి, 21,541 మంది ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి ఐ.శారద తెలిపారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలనూ అనుమతించబోమని, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామని తెలిపారు. -
మాజీ మంత్రి రజనీపై పోలీసుల తీరు అమానుషం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా తుని రూరల్: ఆపరేషన్ సిందూర్‌లో విశేష సేవలు అందిస్తున్న మహిళా సైనిక అధికారులను చూసి దేశం గర్విస్తోందని, కానీ, రాష్ట్రంలో మహిళల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీసీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఎస్.అన్నవరంలోని తన కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. దేశ మహిళల శక్తిసామర్థ్యాలకు సంబంధించి ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ, త్రివిధ దళాధిపతులతో సహా దేశప్రజలు ముక్తకంఠంతో అభినందిస్తున్నారని అన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో మహిళల పట్ల పోలీసుల తీరు దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. మాజీ మంత్రి, మహిళ అయిన విడుదల రజనీని సీఐ కారులోంచి లాగేసి, తోసేసి, దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. సతీష్ అనే నాయకుడిని తీసుకువెళ్లేందుకు మాజీ మహిళా మంత్రిపై అమానుషంగా ప్రవర్తించడం సరికాదన్నారు. పోలీసులు ఉద్యోగం చేస్తున్నారా.. టీడీపీ నాయకుల ప్రాపకం కోసం నాటకాలాడుతున్నారా అని ప్రశ్నించారు. దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానన్నారు. సంక్షోభంలో సంక్షేమం, రాజకీయం, డబ్బులు, అవినీతిని వెతుక్కోవడంలో చంద్రబాబు అంత పనోడు దేశంలో మరెవ్వరూ ఉండరని విమర్శించారు. ఒకపక్క దేశం యుద్ధంలో ఉంటే ఆయన ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు, రైతులకు, మహిళలకు ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయం అందించడం లేదన్నారు. ప్రతిపక్షాలను వేధిస్తున్నారని, పోలీసులను ఉపయోగించుకుని ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్నారని అన్నారు. తునిలో సైతం మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి భర్తను అదుపులోకి తీసుకుని, ఇంటిపై టీడీపీ నాయకులు దాడి చేసి, ఆమె పైనే కేసులు పెట్టి వేధించారని చెప్పారు. ఈ వేధింపులు భరించలేక చైర్పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా చేశారన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న ఎనిమిది మంది నాయకులపై కేసులు పెట్టారని, కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారం ఉందని ఇదే తీరు అనుసరిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మొన్నటి వరకూ ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించిందని, ఏమీ లేనప్పటికీ మద్యం కేసుల ముసుగులో అధికారులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంస్థలు శాశ్వతమని, అధికారులు, అధికారాలు తాత్కాలికమని, బాధ్యతతో వ్యవస్థలకు వన్నె తెచ్చే విధంగా మెలగాలని హితవు పలికారు. పరిధి దాటి ప్రవర్తించడం భవిష్యత్తులో ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఏ పార్టీకి అధికారం శాశ్వతం కాదని రాజా స్పష్టం చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పక మానరని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రేలంగి రమణగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి రాయి మేరీ అవినాష్, నియోజకవర్గ అధ్యక్షురాలు అంగుళూరి సుశీలరాణి, కౌన్సిలర్ సునితాలక్ష్మి పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు
● మాజీ మంత్రి రజనీపై పోలీసుల దౌర్జన్యం దారుణం ● సీఐ సుబ్బనాయుడిపై చర్య తీసుకోవాలి ● మాజీ ఎంపీ వంగా గీత, మహిళా నేతల డిమాండ్ బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత అన్నారు. కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా ఎటువంటి రక్షణా లేదని అన్నారు. మాజీ మహిళా మంత్రి అనే గౌరవం కూడా లేకుండా విడదల రజనీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడి, చేయి చేసుకోవడం దారుణమని, మహిళల ఆత్మగౌరవం కాపాడతామని చెప్పే కూటమి నాయకులు ఏమైపోయారని మండిపడ్డారు. విషయం ఏమిటో చెప్పాలని రజనీ కోరినా సీఐ సుబ్బనాయుడు దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. ఒక బీసీ ప్రజాప్రతినిధిపై ఇలా ప్రవర్తించడం సరి కాదన్నారు. మాజీ మంత్రి వద్ద ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్టు చేయాలంటే వారెంట్ లేదా ఎఫ్ఐఆర్ చూపాలని, ఎటువంటి నోటీసులూ లేకుండా అరెస్టు చేయడం వెనుక ఆంతర్యమేమిటని గీత ప్రశ్నించారు. మాజీ మహిళా ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేస్తే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారని భ్రమపడుతున్నారని అన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు కల్పనపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు. దుస్తులు మార్చుకుని వస్తానన్నా కూడా సమయం ఇవ్వకుండా ప్రవర్తించిన తీరు బాధాకరమన్నారు. పోలీసులు ఎవరి మెప్పు కోసం పని చేస్తున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి కక్ష సాధింపుపై ఉన్న శ్రద్ధ సంక్షేమంపై లేదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా ఏ సంక్షేమ పథకమూ అమలు చేయలేదన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మహిళలు అధిక ప్రాధాన్యం, రక్షణ కల్పించారని గీత అన్నారు. పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మాట్లాడుతూ, మాజీ మంత్రి రజనీపై పోలీసులు తీరు అమానుషమన్నారు. మహిళలకు ఎంతో గౌరవం ఇస్తామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత మాట్లాడుతూ, పోలీసులు తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని, నారా లోకేష్ మెప్పు కోసం రెడ్‌బుక్ రాజ్యాంగా అమలు చేస్తున్నారని అన్నారు. రజనీపై అనుచితంగా ప్రవర్తించిన సీఐ సుబ్బనాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నగర మహిళా అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
రథోత్సవంపై సూర్య ప్రతాపం
● జనం రాక కళ తప్పిన ఉత్సవం ● నూతన రథంపై సత్యదేవుడు, అమ్మవారి ఊరేగింపుఅన్నవరం: సత్యదేవుని రథోత్సవంపై సూర్యుడు ప్రతాపం చూపించాడు. నిప్పుల వర్షం కురిసినట్టుగా ఎండ కాయడంతో ఆశించిన స్థాయిలో భక్తులు రాకపోవడంతో ఉత్సవం కళ తప్పింది. వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం సాయంత్రం సత్యదేవుని రథోత్సవం నిర్వహించారు. ఎండ తీవ్రతకు తోడు సరైన ప్రణాళిక లేకపోవడంతో రథోత్సవం ప్రారంభ సమయానికి గ్రామస్తులు, భక్తులు పెద్దగా రాలేదు. గత ఏడాది సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభమై రాత్రి 9.30 గంటల వరకూ కొనసాగగా, ఈసారి 4 గంటలకు మొదలై రాత్రి 7.30 గంటలకే ముగిసింది. గత ఏడాది రథోత్సవం సాయంత్రం 5 గంటలకు మొదలైంది. అప్పటికి ఎండ తగ్గడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈసారి ఉత్సవం మొదలయ్యే సమయానికి 35 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి ఉష్ణోగ్రత ఉండటంతో గ్రామస్తులు, భక్తులు పెద్దగా రాలేదు. వారితో పోలిస్తే దేవస్థానం సిబ్బంది, పోలీసులు, కళాకారులే అధికంగా కనిపించారు. ప్రారంభ సమయానికి 250 మంది దేవస్థానం సిబ్బంది, 150 మంది పోలీసులు, 200 మంది కళాకారులు మాత్రమే ఉన్నారు. సాయంత్రం 5.30 గంటల సమయానికి కాస్త ఎండ తగ్గడంతో గ్రామస్తులు వచ్చారు. ఉత్సవం ముగిసే సమయానికి సుమారు 3 వేల మంది మాత్రమే ఉన్నారు. రథోత్సవంలో కోలాటం, కేరళ డప్పులు, విచిత్ర వేషాలు తదితర కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాత్రి అయితే ఎక్కువ మంది భక్తులు వీటిని తిలకించే అవకాశముండేది. ఉత్సవం జరిగిందిలా.. సత్యరథాన్ని ఉదయం 8 గంటలకు పంపా సత్రం నుంచి రత్నగిరి తొలి పావంచా వద్దకు తీసుకువచ్చారు. రంగురంగుల పువ్వులు, విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. సాయంత్రం 4 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు ఊరేగింపుగా తొలి పావంచా వద్దకు తీసుకువచ్చి, రథంపై వేంచేయించి, పూజలు నిర్వహించారు. రథం ముందు కుంభం పోసి, గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు రథోత్సవాన్ని ప్రారంభించారు. దేవస్థానం సిబ్బంది, ధవళేశ్వరం, అంతర్వేది తదితర గ్రామాల నుంచి వచ్చిన నిపుణులు రథాన్ని లాగారు. ముందు ట్రాక్టర్, వెనుక జేసీబీకి పగ్గాలు కట్టి, వాటితో రథాన్ని నియంత్రించారు. రథం తయారు చేసిన కొల్లాటి శ్రీనివాస్ బృందం ఆద్యంతం రథం వద్దనే ఉంది. ప్రధానంగా రథం మలుపు తిప్పే సమయంలో చాకచక్యంగా పని చేశారు. తొలి పావంచా నుంచి ఆంధ్రా బ్యాంక్ వరకూ, అక్కడి నుంచి తిరిగి తొలి పావంచా మీదుగా దేవస్థానం టోల్గేట్ వరకూ, అక్కడి నుంచి కొత్తగా నిర్మించిన రథం షెడ్డు మీదుగా తొలి పావంచా వరకూ రథోత్సవం సాగింది. అనంతరం, స్వామి, అమ్మవార్లను రథం నుంచి కిందకు దించి, ఊరేగింపుగా కొండపై ఆలయానికి చేర్చారు. రథాన్ని షెడ్డులోకి తరలించారు. దేవస్థానం డిప్యూటీ ఈఓ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథరాజు, ఇంజినీరింగ్ ఈఈలు నూకరత్నం, రామకృష్ణ, డీఈలు ఉదయ్, బీఎస్ రాంబాబు, ఎలక్ట్రికల్ డీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యాన ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు, సుమారు 150 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. రథం వద్దకు రాకుండా భక్తులను నియంత్రించేందుకు రెండు రోప్ పార్టీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఊహించినంతగా భక్తులు రాకపోవడంతో పోలీసులకు కూడా పెద్దగా పని లేకుండా పోయింది. రథం లాగే అవకాశం కల్పించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేత రథోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం 3 గంటల నుంచి మెయిన్ రోడ్డులో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలోని వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే రథోత్సవం త్వరగా పూర్తి కావడంతో రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. గత ఏడాది రాత్రి 12 గంటలకు కానీ విద్యుత్ సరఫరా ఇవ్వలేకపోయారు. రథోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వరకూ అన్నవరం మెయిన్ రోడ్డులో వాహనాలు నిలిపివేశారు. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి వచ్చే వాహనాలను జాతీయ రహదారి మీదుగా మళ్లించారు. అన్నవరంలో నేడు తెల్లవారుజామున 3.00 : సుప్రభాత సేవ ఉదయం 8.00 : చతుర్వేద పారాయణ ఉదయం 9.00 : కొండ దిగువన పంపా నది వద్ద సత్యదేవుడు, అమ్మవారికి చక్రస్నానం సాయంత్రం 4.00 : అనివేటి మండపం వద్ద నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచనం ఉదయం 7.00 – 10.00 వరకూ, సాయంత్రం 5.00 – రాత్రి 11.00 వరకూ : రత్నగిరి కళావేదిక మీద, కొండ దిగువన సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా వన విహారోత్సవం కల్యాణోత్సవాల్లో భాగంగా నవదంపతులు సత్యదేవుడు, అమ్మవార్లకు వన విహారోత్సవం ఘనంగా నిర్వహించారు. పెళ్లి పెద్దలు సీతారాములు వెంట రాగా నవదంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను రత్నగిరి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ఊరేగింపుగా కొండ దిగువన ఉద్యానవనంలోని మండపం వద్దకు తీసుకువచ్చి, అక్కడి వేదికపై వేంచేయించారు. సాయంత్రం 4 గంటలకు పండితులు పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలను దేవస్థానం చైర్మన్, ఈఓల తరఫున పండితులు సమర్పించి, వేదాశీస్సులు అందజేశారు. కార్యక్రమాన్ని వేద పండితులు యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, కొంపెల్ల మూర్తి, అర్చకుడు గంగాధరభట్ల శ్రీనివాస్, పవన్ తదితరులు నిర్వహించారు. -
ట్రావెల్ బస్సు ఢీకొని ముగ్గురికి గాయాలు
పెరవలి: మండలం ఖండవల్లి వద్ద మోటార్ సైకిళ్లను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. పెరవలి ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు తాడేపల్లిగూడేనికి చెందిన కపిలేశ్వరపు రామకృష్ణ అతని భార్య ఆదిలక్ష్మి, కుమారుడు హర్షతో కలసి మోటార్ సైకిల్‌పై పెనుగొండ మండలం రామన్న పాలెం వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టటంతో వారు ముగ్గురు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. మహిళకు ముఖంపై తగలటంతో తీవ్ర రక్తస్రావం అయ్యిందని, మిగిలిన ఇద్దరికి గాయాలయ్యాయని చెప్పారు. వీరు ముగ్గురిని వైద్యం కోసం తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని, ప్రాణ హాని లేదని వైద్యులు తెలిపారన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘విడదల రజిని పట్ల సీఐ అనుచితంగా ప్రవర్తించారు’
కాకినాడ: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకురాలు విడదల రజిని పట్ల సీఐ సుబ్బారాయుడు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. విడదల రజిని పట్ల సీఐ వ్యవహరించిన తీరు అమానుషమన్నారు. ఈరోజు(ఆదివారం) మీడియాతో మాట్లాడిన దాడిశెట్టి రాజా.. సీఐ తీరును ఖండించారు. ‘మాజీ మంత్రి అని చూడకుండా విడదల రజిని పట్ల అమానుషంగా ప్రవర్తించారు.దీనిపై మేము పోరాడతాము.వ్యవస్ధలకు వన్నె తెచ్చే విధంగా ఉద్యోగులు బాధ్యతతో పని చేయాలి. సంక్షోభంలో అవినీతిని వెతుకునే మగోడు చంద్రబాబు తప్పా మరో నాయకుడు లేడు.గత ఏడాదిగా ఉద్యోగులు, రైతులకు, విద్యార్ధులు,మహిళలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు.రాష్ట్రంలో మహిళలను వేధించడం టీడీపీకి అలవాటుగా మారిపోయింది. టీడీపీ, పోలీసుల వేధింపులు తాళ్ళలేక ఇటీవల తుని మున్సిపల్ ఛైర్మన్ సుధారాణీ తన పదవికి రాజీనామా చేశారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రెడ్ బుక్ రాజ్యాన్ని అమలు చేస్తున్నారు. కూటమి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఏపీలో మహిళలు వేధింపులు జీవిస్తున్నారు’ అని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. -
ప్రతి మహిళా శక్తిగా మారాలి
రాజానగరం: మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలు అమలు చేస్తోందని, వాటిపై అవగాహన పెంచుకుని ప్రతి మహిళా స్వీయరక్షణతో ఒక శక్తిలా ఉండాలని శక్తి టీమ్ జిల్లా ఇన్చార్జి, డీఎస్పీ కేవీ సత్యనారాయణ అన్నారు. దివాన్ చెరువులోని షిరిడీసాయి జూనియర్ కళాశాలలో శక్తి టీమ్ ఆధ్వర్యంలో శనివారం మహిళా చైతన్య కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి ప్రస్తావిస్తూ స్వీయ రక్షణ చర్యలు, సైబర్ నేరాల అదుపు, సోషల్ మీడియా యాప్స్‌తో వచ్చే నష్టాలు, పోక్సో చట్టం, శక్తి యాప్‌లపై అవ గాహన కల్పించారు. మహిళలందరూ శక్తి యాప్‌ను తమ సెల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆ యాప్ ఉపయోగించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ కె.మంగాదేవి, ఎౖస్సై రామకృష్ణ, విద్యార్థినులు పాల్గొన్నారు. -
నేడు సత్యదేవుని రథోత్సవం
● భారీ టేకు రథంపై ఊరేగనున్న స్వామి, అమ్మవార్లు ● తొలి పావంచా వద్దప్రారంభం కానున్న రథోత్సవం ● ఏర్పాట్లు పూర్తి అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్వామివారి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. 36 అడుగుల ఎత్తయిన నూతన టేకు రథంపై స్వామి, అమ్మవార్లను కొండ దిగువన గల మెయిన్ రోడ్డులో ఊరేగిస్తారు. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ వైభవంగా ఈ కార్యక్రమం జరపనున్నారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమ వివరాలు ఇవే.. ● సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా స్వామి, అమ్మవార్లను ఊరేగించేందుకు రూ.1,04 కోట్లతో 36 అడుగుల ఎత్తు, 14.6 అడుగుల వెడల్పు, 21 అడుగుల పొడవు గల భారీ రథాన్ని తయారు చేశారు. ఇది అంతర్వేది దేవస్థానం రథం కన్నా రెండు అడుగులు మాత్రమే చిన్నది. ● రథాన్ని ఎత్తే జాకీకి 2 హెచ్‌పీ మోటార్ ఏర్పాటు చేశారు. దీని ఆధారంగా రథాన్ని చుట్టూ తిప్పే వీలుంది. బరువంతా ఈ జాకీ మీద పెట్టినా ఏమీ కాదు. ● రథోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల మధ్య ఈ రథాన్ని పంపా సత్రం నుంచి తొలిపావంచా వద్దకు తీసుకువస్తారు. మధ్యాహ్నం రెండు నుంచి 2.30 గంటల వరకు పుష్పాలతో, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేస్తారు. 2.30 నుంచి 3.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు అర్చకస్వాములు అలంకరణ చేస్తారు. ● నాలుగు గంటలకు సత్యదేవుడు, అమ్మవారికి పూజలు చేస్తారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, వీర్ల సుబ్బారావు కొబ్బరికాయలు కొట్టి రథం ముందు పోసిన కుంభం మీదుగా రథాన్ని లాగి ప్రారంభిస్తారు. ● రథోత్సవంలో భాగంగా సుమారు 200 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు. ● రథోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి మెయిన్ రోడ్డులో విద్యుత్‌కు అంతరాయం కలుగుతుంది. 36 అడుగుల రథానికి విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రథోత్సవం పూర్తయ్యేవరకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ● అన్నవరం మెయిన్ రోడ్డులో ఉదయం నుంచి వాహనాలను అనుమతించరు. తుని వైపు నుంచి వచ్చే వాహనాలను మండపం వద్ద గల ఆర్చి నుంచి జాతీయ రహదారి వైపు మళ్లిస్తారు. కాకినాడ, రాజమండ్రి వైపు నుంచి వచ్చే వాహనాలను ఎంవీఆర్ సెంటర్ ఆర్చి నుంచి జాతీయ రహదారి వైపు మళ్లిస్తారు. ● సుమారు 500 మంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐ బి.సూర్య అప్పారావు, మరో పది మంది ఎస్ఐలు ఈ బందోబస్తులో పాల్గొంటారు. ● రథోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. -
అక్కడ అంతా క్షేమమేనా..
● ఇక్కడ స్థిరపడిన రాజస్థానీయుల ఆవేదన ● తమ వారి యోగక్షేమాలపై ఆరా పిఠాపురం: పాకిస్థాన్‌తో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఆ దేశ సరిహద్దులోని మన రాష్ట్రాల్లో హై అలర్టు ప్రకటించారు. బ్లాక్ అవుట్లు, సైరన్ల మోతతో ఆ ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో మన ప్రాంతంలో స్థిరపడిన రాజస్థానీయులు అక్కడి తమ వారి కోసం ఆందోళన చెందుతున్నారు. వీరందరూ వివిధ వ్యాపారాల కోసం రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి అనేక ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో తమ స్వగ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నారు. అక్కడి వారి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్‌లోని బార్మీర్, జైసల్మేర్, పోక్రాన్ వంటి ప్రాంతాలకు చెందిన తమ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. మూడు రోజులుగా ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. భారత ఆర్మీ తమకు అండగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేకుండా చూస్తున్నారని అక్కడి వారు తమ బంధువులకు సమాచారం ఇస్తున్నారు. -
సర్వాంతర్యామి.. సదా స్మరామి..
● వాడపల్లికి పోటెత్తిన భక్తులు ● ఒక్కరోజే దేవస్థానానికి రూ.47.78 లక్షల ఆదాయం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రానికి శనివారం రాష్ట్రం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూ ర్యచక్రధరరావు పర్యవేక్షణలో, ఆలయ ప్రధాన అర్చ కుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున అర్చక స్వాములు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అభిషేకార్చన లు, ప్రత్యేక పూజలు నిర్వహించి, అలంకార ప్రియుడై న స్వామిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. సా ధారణ భక్తులతో పాటు ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులతో వాడపల్లి క్షేత్రం కిక్కిరిసింది. క్షేత్రపాలకుడికి పూజలు ఆలయ ఆవరణలో క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్న ప్రసాదం స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం డీసీ అండ్ ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటల వరకూ స్వామి వారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్న ప్రసాద విరాళం, సేవలు, లడ్డూ విక్రయం, ఆన్లైన్ తదితర సేవల ద్వారా ఒక్కరోజు దేవస్థానానికి రూ.47,78,296 వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. షామియానాల ఏర్పాటు శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు, కురిసిన భారీ వర్షానికి వాడపల్లి క్షేత్రంలో అన్నప్రసాదం తాత్కాలిక షెడ్డు పడిపోయింది. దీంతో శనివారం తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదం స్వీకరించడానికి ఇబ్బందులు లేకుండా డీసీ అండ్ ఈఓ చక్రధరరావు పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన షామియానాలు ఏర్పాటు చేయించారు. -
జాతీయ చదరంగం పోటీలకు సాన్వీ
అమలాపురం రూరల్: గుంటూరులో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి చదరంగం అండర్ – 7 పోటీల్లో అమలాపురంలోని కామనగరువు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న బి.సాన్వీ అత్యుత్తమ ప్రతిభ చూపి, 5 బై 6 పాయింట్లు సాధించింది. రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచి జాతీయ చదరంగ పోటీలకు అర్హత సాధించింది. ఆమెకు కోనేరు హంపి తల్లిదండ్రులైన అశోక్, లత చేతుల మీదుగా ట్రోఫీ అందించారు. ఈ నేపథ్యంలో ఒడిశాలో జూన్‌లో జరిగే జాతీయ పోటీల్లో సాన్వీ పాల్గొంటుందని కోచ్ వి.శ్రీనుబాబు తెలిపారు. సాన్వీని స్కూల్ డైరెక్టర్ నంద్యాల మనువిహార్, ప్రిన్సిపాల్ దేవీదీక్షిత్ శనివారం అభినందించారు. కాలువలో పడి మహిళ మృతి కాకినాడ రూరల్: మండలంలోని సూర్యారావుపేట పరకాలువలో పడి పితాని రమణమ్మ (57) మృతి చెందింది. తిమ్మాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాలువకు చెందిన రమణమ్మ ఉపాధి హామీ కూలీగా పనిచేస్తుంది. ఆమె భర్త గతంలోనే చనిపోయాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న రమణమ్మ ఈ నెల 7న ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యు లు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరకాల్వ తూటి కాడపై ఆమె మృతదేహం శనివారం స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిమ్మాపురం ఇన్చార్జి ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో.. ముమ్మిడివరం: ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొని బైక్‌పై వెళుతున్న యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. అల్లవరం మండలం కోడూరుపాడు శివారు నక్కల పుంతకు చెందిన సవరపు నాగబాబు (28) శనివారం సాయంత్రం యానాం వెళ్లి తిరిగి వస్తున్నాడు. నగర పంచాయతీలోని కొండాలమ్మ గుడి వద్ద 216 జాతీయ రహదారిపై అమలాపురం నుంచి వస్తున్న వ్యాన్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగబాబుకు భార్య రేణుక, ఇద్దరు పిల్ల లు ఉన్నారు. ఈ మేరకు ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భవిష్యత్‌లో చైనా టెక్నాలజీతో విగ్రహాలు
● సెమినార్లో పాల్గొన్న శిల్పి రాజ్‌కుమార్ ● తయారీలో కొత్త పోకడలపై అధ్యయనం కొత్తపేట: చైనా టెక్నాలజీని భవిష్యత్‌లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆ తరహా విగ్రహాలు రూపకల్పనపై దృష్టి సారించనున్నట్టు అంతర్జాతీయ శిల్పి డాక్టర్ డీ రాజ్‌కుమార్‌వుడయార్ తెలిపారు. చైనాలో నూతన టెక్నాలజీతో విగ్రహాల తయారీపై జరిగిన సెమినార్లో రాష్ట్రం నుంచి ఆయన పాల్గొన్నారు. శుక్రవారం ఆ సెమినార్ విశేషాలను వివరించారు. వారం రోజుల పాటు సాగిన సెమినార్లో 250 దేశాల నుంచి వివిధ రకాల విగ్రహాల శిల్పులు పాల్గొన్నారన్నారు. ఇక్కడ సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కాంస్యంతో విగ్రహాలు తయారు చేస్తున్నామని, అక్కడ వీటితో పాటు ఇంకా అనేక రకాల లోహాలతో విగ్రహాలు తయారు చేస్తున్నారని తెలిపారు. భారీ కాంస్య విగ్రహాలను నిర్మించడంలో చైనా కంపెనీలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుందన్నారు. సంప్రదాయ క్యాస్టింగ్ పద్ధతులకు ఆధునిక టెక్నాలజీని కలిపి భారీ స్థాయి విగ్రహాలను చైనా కంపెనీలు తయారు చేస్తున్నాయని, అత్యంత ఎల్తైన విగ్రహాలు కూడా ఆ దేశం టెక్నాలజీ ద్వారానే తయారవుతున్నాయన్నారు. ముందు చిన్న నమూనా విగ్రహం తయారుచేసి, దానిని 3 డీ స్కానింగ్ చేసి, కంప్యూటర్ డిజైనింగ్ ద్వారా కోరుకున్న సైజుకు ఇమేజ్ను పెంచుతారని తెలిపారు. ఎత్తైన విగ్రహాల విడి భాగాలను సులభంగా పోత పోసేందుకు ఫౌండ్రీలు ఉన్నాయని తెలిపారు. పెద్ద పెద్ద ఫౌండ్రీల వల్ల తక్కువ సమయంలో విడి భాగాలను తయారుచేసే వీలు ఉంటుందన్నారు. భారీ విగ్రహాలు నెలకొల్పే విషయంలో వివిధ దేశాలు, రాష్ట్రాలు చైనా కంపెనీల వైపు మొగ్గు చూపుతున్నాయన్నారు. విగ్రహాలే కాక పార్కులు, సాంస్కృతిక చిహ్నాలు, వివిధ కళాకృతులు నిర్మిస్తారని తెలిపారు. -
నమ్మండి ఇది రైల్వే ప్లాట్‌ఫామ్
తుప్పలు, ముళ్లపొదలు మొలిచిన ఇది రైల్వే ట్రాక్, రైల్వే ప్లాట్‌ఫామ్ అంటే నమ్మడం కష్టమే అయినా ఇది నిజం. కాకినాడ – నర్సాపురం రైల్వే ప్రాజెక్టు పరిధిలో కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ గతంలో నిర్మించిన రైల్వే ట్రాక్ పరిస్థితి ఇది. ట్రాక్ మీద, ప్లాట్‌ఫామ్ మీద పిచ్చి మొక్కలు మొలిచాయి. రామచంద్రపురంలో ఉన్న రైల్వే స్టేషన్ ధ్వంసమైంది. గతంలో ఇక్కడ నుంచి రైలు మీద కాకినాడకు, కోటిపల్లికి ప్రయాణికులు వెళ్లేవారు. రూ.కోట్ల విలువైన బియ్యం ఎగుమతి జరిగేది. ఈ స్టేషన్లో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉండేది. ఇప్పుడు రైల్వే రాకపోకలు లేక స్టేషన్ ఇలా శిథిలావస్థకు చేరింది. -
ఎన్నేళ్లీ రెడ్ సిగ్నల్?
చిట్టడవిలా కోటిపల్లి రైల్వే స్టేషన్ అడవుల్లో రైల్వే స్టేషన్లను చూడడం కోనసీమ జిల్లా వాసులకు అరుదు. కాని కోటిపల్లి రైల్వే స్టేషన్, దాని పరిసరాలను చూస్తే అడవిలోని రైల్వే స్టేషన్ చూసినట్టు ఉంటోంది. ఒకప్పుడు కొబ్బరి, క్రోటన్ మొక్కలు.. స్టేషన్‌ను ఆనుకుని పచ్చని వరిచేలతో అందంగా ఉండే ఈ స్టేషన్ చుట్టూ ఏపుగా పెరిగిన వివిధ రకాల పిచ్చి మొక్కలతో ఇప్పుడు చిట్టడవిని తలపిస్తోంది.సాక్షి, అమలాపురం: కోనసీమ ప్రజల చిరకాల వాంఛ కాకినాడ – నర్సాపురం రైల్వే లైన్. దీని నిర్మాణానికి 2004లో పునాది పడింది. 21 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్టు పొడవు 102.507 కిలోమీటర్లు కాగా, కోటిపల్లి వరకూ 45.30 మేర పూర్తయ్యింది. బ్రిటిష్ కాలంలో 1928 నుంచి 1940 వరకు కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైల్వే లైన్ ఉండేది. తరువాత నిలిచిపోగా 2004లో తిరిగి మొదలైంది. తొలుత చైన్నె నుంచి కాకినాడ మధ్య తిరిగే సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను కాకినాడ – కోటిపల్లి మధ్య ప్యాసింజర్‌గా తిప్పేవారు. భారీ నష్టాలు వస్తూండటంతో తరువాత రైలు బస్సు ప్రవేశపెట్టారు. ఇది చాలాకాలం సేవలందించింది. ఇది కూడా నష్టదాయకమని నిలిపివేశారు. ఆరేళ్లుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే సమయంలో కోట్ల రూపాయల లాభాలు తెచ్చిపెట్టిన బియ్యం ఎగుమతులను కూడా నిలిపివేయడం గమనార్హం. కోటిపల్లి నుంచి వ్యాగన్ల ద్వారా ఇసుక కూడా ఎగుమతి అయ్యేది. గతంలో రామచంద్రపురం స్టేషన్ నుంచి బియ్యం ఎగుమతులు జోరుగా సాగేవి. నెలకు రూ.5 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే ఇతర ప్రాంతాల ఎగుమతిదారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఇక్కడకు రైల్వే అధికారులు గూడ్స్ రైలు పంపలేదనే విమర్శలున్నాయి. ట్రాక్ మీద తుప్పలు.. శిథిలమైన స్టేషన్లు కాకినాడ – కోటిపల్లి మధ్య ఆరేళ్లుగా రైలు రాకపోకలు నిలిచిపోవడంతో రైల్వే ట్రాక్, స్టేషన్లు ధ్వంసమవుతున్నాయి. రైల్వే ట్రాక్‌పై పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. ట్రాక్ మీద వేసిన రాళ్లు చెల్లాచెదురయ్యాయి. రోడ్డు క్రాస్ చేసే చోట ఏర్పాటు చేసిన గేట్లు ఊడిపోయాయి. చిన్నచిన్న ఇనుప, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. స్టేషన్లు సైతం ధ్వంసమయ్యాయి. గుమ్మాలు, ఇతర వస్తువులు తరలించుకుపోయారు. భవనాల కిటికీలు కూడా ఊడిపోయాయి. స్టేషన్, ప్లాట్‌ఫామ్‌ల మీద కూడా పిచ్చి మొక్కలు మొలిచాయి. ఈ రైల్వే లైన్లో అతి పెద్ద స్టేషన్ అయిన రామచంద్రపురం పరిస్థితి మరీ దారుణం. బహిరంగ మరుగుదొడ్డిగా మారిపోయింది. జిల్లా పరిధిలోకి వచ్చే కోటిపల్లి, దంగేరు, ద్రాక్షారామ, రామచంద్రపురం వంటి స్టేషన్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. కాకినాడ – కోటిపల్లి రైల్వే లైన్ విద్యుద్దీకరణకు నిధులు కేటాయించినా పనులు జరగడం లేదు. మొత్తం రూ.90 కోట్లు అయ్యే ఈ పనులకు 2023–24లో రూ.9 కోట్లు, 2024–25లో రూ.21 కోట్ల చొప్పున మొత్తం రూ.30 కోట్లు కేటాయించారు. కానీ పనులు మొదలు కాలేదు. పాత రైల్వే లైన్ మరమ్మతులకు రూ.10 కోట్లు కేటాయించినా పనులు చేయడం లేదని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. కనీసం ఉన్న రైల్వే లైన్‌ను వినియోగంలోకి తీసుకు రావాలని కోరుతున్నారు.కాకినాడ – కోటిపల్లి మధ్య తిరిగిన రైలు బస్సు నిరుపయోగంగా మారిన కోటిపల్లి రైల్వేలైన్ కాకినాడ – కోటిపల్లి లైన్‌ను పట్టించుకోరా? రైల్వే ట్రాక్ మీదనే పిచ్చిమొక్కలు ధ్వంసమైన రైల్వే స్టేషన్లు గతంలో 45.30 కిలోమీటర్ల పొడవున ట్రాక్ నిర్మాణం విద్యుద్దీకరణకు రూ.90 కోట్లు రెండు విడతలుగా రూ.30 కోట్ల కేటాయింపు పట్టాలెక్కని పనులు తొలి దశలో కాకినాడ నుంచి కోటిపల్లి ప్యాసింజర్ తరువాత రైల్ బస్సు రాకపోకలు గూడ్స్ నిర్వహణతో ఆదాయం ఆరేళ్లుగా పూర్తిగా నిలిచిన రాకపోకలుఅమలాపురం వరకు పూర్తి చేయాలి కాకినాడ – నర్సాపురం రైల్వేలైన్‌లో గౌతమీ వంతెనకు సంబంధించి పియర్ల నిర్మాణం పూర్తయ్యింది. గెడ్డర్లకు టెండర్లు పూర్తి కావడంతో పనులు జరుగుతున్నాయి. వంతెన దాటిన తరువాత పది కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం పూర్తయితే అమలాపురం వరకు రైలు వచ్చే అవకాశముంది. దీనివల్ల రైల్వేకు ప్రయాణికుల ఆదాయం, గూడ్స్ ఆదాయం కూడా పెరుగుతుంది. – బండారు రామ్మోహనరావు,కోనసీమ జేఏసీ కన్వీనర్, అమలాపురం గూడ్స్ రైళ్ల ద్వారా ఆదాయం ప్రయాణికుల కన్నా గూడ్స్ ద్వారా రైల్వేకు ఆదాయం వస్తోంది. ఈ విషయం రైల్వే గుర్తుంచుకోవాల్సి ఉంది. రామచంద్రపురం పరిసర ప్రాంతాల నుంచి కేరళకు బొండాల రకంతో పాటు పలు రకాల ధాన్యం దేశంలో పలు ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. గూడ్స్ రాకపోకలు మొదలైతే రైల్వే ట్రాక్‌కు ఇప్పుడున్న దుస్థితి ఉండదు. – కొవ్వూరి త్రినాఽథ్‌రెడ్డి, రామచంద్రపురం రైల్వే ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు -
అనుమానాస్పద స్థితిలో మహిళా హాస్టల్ వార్డెన్ మృతి
● పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన పెద్దాపురం: మండలంలోని సూరంపాలెం ఆదిత్య ఇంంంంజినీరింగ్ కళాశాలలో మహిళా హాస్టల్ వార్డెన్ నిండుకుండల నాగమల్లి (23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రౌతులపూడి మండలం మెరక సోమవారనికి చెందిన ఈమె ఏడాదిగా హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడటంతో కళాశాల సిబ్బంది పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రికి చేరుకున్న మృతురాలి తల్లితండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఉదయం మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి యాజమాన్యం తప్పిందం వల్లే ఈ ఘటన జరిగిందని ఆత్మహత్య కాదు హత్యేనంటూ నినాదాలు చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయలంటూ డిమాండ్ చేస్తూ మెరక సోమవరం గ్రామస్తులు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు అక్కడకు చేరుకుని పూర్తిన్యాయం చేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మనస్థాపంతోనే యువతి ఆత్మహత్య గండేపల్లి: మనస్థాపంతోనే ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు గండేపల్లి ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపారు. ఆమె తన గ్రామానికి చెందిన శెట్టిబత్తుల శివ దుర్గను ప్రేమించిందన్నారు. శివ దుర్గ ఆమెను వివాహం చేసుకునేందుకు నిరాకరించడంతో మనస్థాపాం చెంది ఆమె ఉంటున్న గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందినట్టు తెలిపారు. మృతురాలి తల్లి దేవుడమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు. -
మన్నికై నవే ఎన్నుకోండి
● ఆటలు ఆడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త ● రక్షణ కవచాలు లేకుంటే గాయాల పాలే.. ● నాసికరం కొన్నారంటే...మూన్నాళ్లే! నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆటలు అంటే అందరికీ ఇష్టమే. ఆరేళ్ల వయస్సు నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలు వివిధ రకాలైన ఆటలు ఆడడానికి ఉత్సాహం చూపుతారు. ఆసక్తి, అభిరుచి ఉన్న ఆటల్లో రాణించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని కలలు కంటారు. వేసవి సెలవులు ఇవ్వడంతో జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ రకాల వేసవి శిక్షణ శిబిరాల్లో చేరేందుకు బాల బాలికలు ఆసక్తి కనపరుస్తున్నారు. క్రీడలకు సంబంధించి ఆడేటప్పుడు లేదా శిక్షణ పొందే సమయంలో క్రీడాపరికరాలు, దుస్తులు, బూట్లు వినియోగించకపోతే గాయాలపాలై ఒక్కోసారి క్రీడలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వివిధ రకాల క్రీడల్లో వినియోగించే వస్తువులు, క్రీడాపరికరాలు, వాటి ధరలపై కథనం బాస్కెట్‌బాల్ టీ షర్ట్, షాట్, షూ వినియోగిస్తారు. బాస్కెట్బాల్స్ రూ.750 నుంచి రూ.2,500 వరకు, డ్రస్ రూ.900 నుంచి రూ.3,000, షూ రూ.1,500 నుంచి రూ.8,000, నెట్ రూ.400 నుంచి రూ.5,000 వరకు ఉన్నాయి. హాకీ రూ.650 నుంచి రూ.5,000 వరకు, నెట్ రూ. 25,000, గోల్‌కీపర్ కిట్ రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ఉన్నాయి. ఇందులో హెల్మెట్, చెస్ట్ప్యాడ్, బాడీ ప్రొటెక్షన్, గ్లౌజ్, ప్యాడ్, నీగార్డ్స్, ఎల్బోగార్డ్స్ను వినియోగిస్తారు. బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్‌లో రిస్ట్బ్యాన్ ్డ్స, నీక్యాప్స్, షూ, టీ షర్ట్, షార్ట్స్ వినియోగిస్తారు. ఫెదర్ కాక్స్ కొరత కారణంగా ఎక్కువ కాలం మన్నిక కోసం నైలాన్ కాక్స్ ఉపయోగిస్తున్నారు. బ్యాట్స్ రూ.650 నుంచి రూ.15,000 వరకు, నెట్స్ రూ.350 నుంచి రూ.3,000 వరకు, కాక్స్ బ్యారర్ రూ.300 నుంచి రూ.4,000 వరకు అమ్ముతున్నారు. హ్యాండ్‌బాల్ హ్యాండ్‌బాల్‌లో టీషర్ట్, షార్ట్, షూ వినియోగిస్తారు. బాల్స్ రూ.700 నుంచి రూ.5,000 వరకు, నెట్స్ రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి. త్రోబాల్ బాల్స్ రూ.700 నుంచి రూ.1,500 వరకు, నెట్ రూ.600 నుంచి రూ.2,500 వరకు ఉన్నాయి. ఈ ఆటలో షార్ట్, టీ షర్ట్, షూ వినియోగిస్తారు. స్కేటింగ్ స్కేట్స్, హెడ్‌గార్డ్, ఎల్బో గార్డ్, నీగార్ట్స్, షూ, స్కేటింగ్ డ్రస్ వినియోగిస్తారు. స్కేటింగ్ షూ రూ.400 నుంచి రూ.10,000, డ్రస్ రూ.500 నుంచి రూ.5,000 వరకు, ప్రొటెక్షన్ కిట్ రూ.400 నుంచి రూ.4,000 వరకు ఉన్నాయి. టెన్నిస్ ర్యాకెట్లు రూ.1,500 నుంచి రూ.15,000 వరకు, బాల్స్ రూ.500 నుంచి రూ.1,200 వరకు ఉన్నాయి. తైక్వాండో.. తైక్వాండో డ్రస్ రూ.500 నుంచి రూ.1,200 వరకు ఉన్నాయి. బాల్ బ్యాడ్మింటన్ బ్యాట్స్ రూ.500 నుంచి రూ.5,000 వరకు, బాల్స్ రూ.60 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. షాట్‌పుట్ 8ఎల్బీ, 16ఎల్బీ, 12ఎల్బీబీ రూ.1000 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి. స్విమ్మింగ్ క్యాప్స్, గాగుల్స్, ఇయర్ ప్లగ్స్ డ్రస్ వినియోగిస్తారు. స్విమ్ సూట్స్ రూ.100 నుంచి రూ.2,000 వరకు, గాగుల్స్ రూ.150 నుంచి రూ.5,000 వరకు, షాట్స్ రూ.250 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి. స్పోర్ట్స్ షూ స్పోర్ట్స్ షూ రూ.600 నుంచి రూ.10,000 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. క్రీడా పరికరాల కొనుగోలులో తీసుకోవల్సిన జాగ్రత్తలు క్రీడాపరికరాలు ఆథరైజ్డ్ డీలర్ల వద్ద కొనుగోలు చేయాలి. నాసిరకం కంపెనీలు, డూప్లికేట్ కంపెనీ వస్తువుల పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి. క్రీడాపరికరాలు తయారు చేసి ఎక్కువ సంవత్సరాలు కానివి కొనుగోలు చేయాలి. క్రికెట్, షటిల్, టెన్నిస్ బ్యాట్స్ కొనుగోలులో హ్యాండిల్స్, పగుళ్లు, ఫ్రేమ్ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. నెట్ నాణ్యత కలిగినది కొనుగోలు చేయాలి. తక్కువకు వస్తున్నాయని డూప్లికేట్ కంపెనీలు కొనుగోలు చేస్తే మూన్నాళ్లకే మూలకు చేరడం ఖాయం. చెస్ చెస్ బోర్డ్స్ రూ.200 నుంచి రూ.2,000 వరకు, పాన్స్ రూ.100 నుంచి రూ.1,000 వరకు, టైమర్ రూ.2,000 నుంచి రూ.10,000, చెస్ మ్యాట్ రూ.100 నుంచి రూ.500 వరకు ఉన్నాయి. చెస్ బోర్డు, పాన్స్ క్యారమ్స్ క్యారమ్ బోర్డులు చిన్నవి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు, పెద్దవి రూ.1,200 నుంచి రూ.15వేల వరకు, క్వాయిన్స్ రూ.100 నుంచి రూ.500 వరకు, స్టైగర్స్ రూ.50 నుంచి రూ.500 వరకు, స్టాండ్ రూ.2,000, పౌడర్ రూ.40 నుంచి అందుబాటులో ఉన్నాయి. టేబుల్ టెన్నిస్ టీటీ బ్యాట్స్ రూ.400 నుంచి రూ.5,000 వరకు, బాల్స్ రూ.30 నుంచి రూ.250 వరకు ఉన్నాయి. టీటీ బోర్డ్స్ రూ.25,000 నుంచి రూ.80,000 వేలు వరకు దొరుకుతున్నాయి. క్రికెట్ క్రికెట్లో హెల్మెట్, గ్లౌజ్, ప్యాడ్స్, ఆర్మ్గార్డ్, థైగార్డ్, క్రికెట్ బ్యాట్స్ వినియోగిస్తారు. క్యాస్ట్ బ్యాట్ రూ.1,800 నుంచి రూ.3,500, ఇంగ్లిష్ బ్యాట్ రూ.3,500 నుంచి రూ.60 వేల వరకు, బాల్స్ రూ.200 నుంచి రూ.250 వరకు, మ్యాచ్ బాల్స్ రూ.450 నుంచి రూ.900 వరకు, డ్రస్ రూ.650 నుంచి రూ.3 వేల వరకు, వికెట్స్, ప్యాడ్స్ రూ.1,200 నుంచి రూ.1,500 వరకు, కిట్ బ్యాగ్ రూ.800 నుంచి రూ.15 వేల వరకు, హెల్మెట్ రూ.1,100 నుంచి రూ.9 వేల వరకు ఉన్నాయి. ఫుట్‌బాల్ ఫుట్‌బాల్‌లో చిన్గార్డ్స్ వినియోగిస్తారు. బాల్స్ రూ.800 నుంచి రూ.2,500 వరకు, నెట్స్ రూ.500 నుంచి రూ.15,000 వరకు ఉన్నాయి. డ్రస్ రూ.800 నుంచి రూ.1,500 వరకు అందుబాటులో ఉంది. వాలీబాల్ బాల్స్ రూ.600 నుంచి రూ.1,800 వరకు, నెట్ రూ.400 నుంచి రూ.5,000 వరకు, డ్రస్ రూ.800 నుంచి రూ.8,000 వరకు ఉన్నాయి. -
ప్రశ్నించే గొంతుపై కత్తి
● మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తారా? ● సోషల్ మీడియాపై ఉక్కుపాదమా? ● అప్రజాస్వామిక పోకడలు వీడండి ● ప్రజాసంఘాల నేతలు, మేధావుల విమర్శ సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని, ప్రశ్నించడమే పాపం అన్నట్టుగా ఉందని, ప్రశ్నించే గొంతులపై నిరంకుశ ఖడ్గం పెడుతున్నారని ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, జర్నలిస్టు నాయకులు విమర్శిస్తున్నారు. ప్రజల హక్కుల కోసం మొదటి వరుసలో నిలిచే పత్రికలు, ప్రజాస్వామ్యవాదులపై అక్రమంగా కేసులు పెట్టడం తగదని కూటమి ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో పలు జిల్లాల్లో సాక్షి విలేకర్లపై అక్రమంగా కేసులు నమోదు చేసి భయోత్పాతం సృష్టించే సంస్కృతిని ఖండిస్తున్నారు. గడచిన 11 నెలలుగా ఎక్కడ, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా అక్రమంగా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదం నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాల్లో మీడియా ప్రతినిధులపై కేసుల నమోదు, తాజాగా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లోకి ఎటువంటి సెర్చ్ వారెంటు లేకుండా పోలీసులు చొరబడటం ద్వారా పాలకులు ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటివి చూడలేదు. సూపర్ సిక్స్‌తో పాటు యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మెగా డీఎస్పీ, ఏటా జాబ్ క్యాలెండర్ వంటి హామీలు అమలు చేయాలని అడగడం ఎలా తప్పవుతుంది? పేద, మధ్యతరగతి వర్గాల శ్రేయస్సును కాంక్షించే వారిని అక్రమ కేసులతో వేధించడం ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరం. క్షేత్ర స్థాయి పరిణామాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం పెద్ద నేరమన్నట్టు పోలీసులు వ్యవహరించడాన్ని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలి. ఇటువంటి దుష్ట సంప్రదాయాన్ని కట్టడి చేయాలి. ప్రజలకు జవాబుదారీ గా ఉండాల్సిన ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవ హరిస్తే ప్రజాస్వామ్యవాదులు చూస్తూ ఊరుకుంటారనుకోవడం అవివేకం. అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కేసి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు. – కర్నాకుల వీరాంజనేయులు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతు కూలీ సంఘం అవివేకం.. అప్రజాస్వామికం ప్రజాస్వామ్య దేశంలో పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రభుత్వ వ్యతిరేకతను ఆకళింపు చేసుకుని తగిన సంస్కరణల దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. అంతే కానీ ప్రశ్నించే వారిని వేధించాలనుకోవడం అప్రజాస్వామికమే అవుతుంది. పత్రికలు, జర్నలిస్టులపై వేధింపులను రాజ్య హింసగానే పరిగణించాలి. పత్రిక ఎడిటర్‌ను సైతం వేధించడం సరి కాదు. సమాజ పరిస్థితులతో పాటు ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే మీడియా నైతిక ధైర్యాన్ని దెబ్బ తీయాలనుకోవడం అవివేకం. – వలవల శ్రీనివాసరావు, రిటైర్డ్ ఇంగ్లిష్ ప్రొఫెసర్, పీఆర్ డిగ్రీ కళాశాల, కాకినాడ ఈ సంస్కృతి మంచిది కాదు పత్రికలు, మీడియా ప్రతినిధులపై వేధింపులు, కేసుల సంస్కృతి మంచిది కాదు. పాలనా వైఫల్యాలను పత్రికలు ఎత్తి చూపడం ద్వారా వాటిని సరిదిద్దుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగేలా మీడియా స్పందించడం తప్పెలా అవుతుంది? పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఏ ఒక్కరికీ లేదు. మీడియా స్వేచ్ఛను హరించడం ద్వారా నియంతృత్వం వైపు పయనిస్తారా అని ప్రజలు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితి ఉత్పన్నం కాకుండా పాలకులు గుర్తెరిగి వ్యవహరించాలి. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి. – నదీముల్లాఖాన్ దురానీ, ఏపీయూడబ్ల్యూజే సీనియర్ సభ్యుడు, కాకినాడ -
చండీ హోమం నిలిపివేత
● సత్యదేవుని కల్యాణోత్సవాల వేళ భక్తులకు నిరాశ ● నిర్వహణకు రుత్విక్కులు లేరన్న వైదిక కమిటీ ● గతంలో సరిపోయి, ఇప్పుడు ఎందుకు సరిపోరని ప్రశ్న ● వెలవెలబోయిన వనదుర్గ ఆలయం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఏడాదికో రూలు పాటిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సత్యదేవుని కల్యాణోత్సవాల సందర్భంగా 2023, 2024 సంవత్సరాల్లో రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి చండీ, ప్రత్యంగిర హోమాలను దేవస్థానం పండితులు యథావిధిగా నిర్వహించారు. ఈ ఏడాది కల్యాణోత్సవాల్లో మాత్రం ఇతర వైదిక కార్యక్రమాలతో పాటు అమ్మవారి హోమాలు కూడా నిలుపు చేశారు. దీంతో, శుక్రవారం జరగాల్సిన చండీ హోమం జరగలేదు. ఈ విషయం తెలియక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చండీ హోమం నిర్వహించడం లేదని తెలిసి నిరాశగా వెనుదిరిగారు. ఈ నెల 12న పౌర్ణమి నాడు జరగాల్సిన ప్రత్యంగిర హోమం కూడా నిలుపు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఇలా ఎందుకు నిలుపు చేశారని వైదిక కమిటీలోని పండితులను అడిగితే హోమాల నిర్వహణకు రుత్విక్కులు చాలరని ఒకరు.. స్వామివారి కల్యాణ మహోత్సవాల సమయంలో మరే ఇతర కార్యక్రమాలూ జరగకూడదని మరొకరు చెబుతున్నారు. గతంలో జరిగాయని అడిగితే అప్పుడు చేశారు కానీ, ఇప్పుడు నిలిపివేశామని అంటున్నారు. అన్నీ తెలిసిన వారుంటే.. వాస్తవానికి సత్యదేవుని కల్యాణోత్సవాలు నిర్వహించినప్పుడు ఇప్పటిలా గతంలో ఎప్పుడూ హోమాలు నిలిపివేయలేదు. గతంలో కరోనా సమయంలో సైతం హోమాలు నిర్వహించారు. భక్తుల్ని మాత్రం అనుమతించలేదు. 2023లో దేవదాయ శాఖ సీనియర్ రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) చంద్రశేఖర్ ఆజాద్ కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా ఉన్నారు. ఆయన ఊరుకోరనే ఉద్దేశంతో అప్పట్లో హోమాలు నిలుపు చేయలేదు. అలాగే, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గత ఏడాది ఈఓగా ఉన్నారు. ఆయనకు అన్నీ తెలుసు. అందువలన అప్పుడు కూడా హోమాలు నిలుపు చేయలేదు. ఈసారి మాత్రం వనదుర్గ అమ్మవారి హోమాలు నిలుపు చేయాలని పండితులు చెప్పగానే ప్రస్తుత ఈఓ వీర్ల సుబ్బారావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పండితులు సలహా ఇచ్చినా గతంలో కల్యాణోత్సవాల సందర్భంగా ఈ హోమాలు నిర్వహించారో లేదో పరిశీలిస్తే వాస్తవం తెలిసి ఉండేది. పూర్వపు దేవస్థానం చైర్మన్ ఐవీ రామ్‌కుమార్‌కు వనదుర్గ అమ్మవారంటే ఎంతో భక్తి. 1995లో అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ సమయంలో వనదుర్గ అమ్మవారి మూలవిరాట్టును కదిపి బాలాలయంలో పెట్టారు. ఆ సమయంలో కొన్ని అపచారాలు జరిగాయి. అప్పట్లో రామ్‌కుమార్ పదవికి కోర్టు ద్వారా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ తరువాత ఆయన అమ్మవారి కార్యక్రమాల్లో ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఒప్పుకునేవారు కాదు. ఒకవేళ ఆయన ఇప్పుడు ఉండి ఉంటే వనదుర్గ అమ్మవారి హోమాలు నిలిపివేయడానికి అంగీకరించి ఉండేవారు కాదని పలువురు అంటున్నారు. ప్రస్తుత చైర్మన్ ఐవీ రోహిత్‌కు అంత అనుభవం లేకపోవడంతో చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటన్నింటి నేపథ్యంలో అన్నీ తెలిసిన వారుంటే ఒకలా.. ఏమీ తెలియని వారుంటే మరోలా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శ వస్తోంది. గతంలోనూ.. చంద్రశేఖర్ ఆజాద్ 2023లో ఈఓగా ఉన్నప్పుడు క్యూ లైన్ కోసం పాత నివేదన శాలను తొలగించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అప్పట్లో నివేదన శాలకు భూస్పర్శ లేకపోయినా ఫర్వాలేదని చెప్పి సర్క్యులర్ మండపం పై అంతస్తు మీద దాత చేత నివేదన శాల నిర్మింపజేశారు. అలాగే, జ్యోతిర్మయి సత్యదేవుని వ్రతం నిర్వహణపై ఆజాద్‌కు లిఖిత పూర్వకంగా సలహా ఇచ్చారు. ఈ వ్రతం నిర్వహణకు రూ.30 లక్షలతో అకౌంట్స్ సెక్షన్ కార్యాలయాన్ని మండపంగా మార్చి, ఏసీలు కూడా ఏర్పాటు చేయించారు. ఆజాద్ తరువాత రామచంద్ర మోహన్ ఈఓగా వచ్చాక సర్క్యులర్ మండపం పైనున్న నివేదన శాలలో నివేదనలు చేయడం తప్పని, నివేదన శాలకు భూస్పర్శ ఉండాలని, అలాగే, జ్యోతిర్మయి వ్రతం చేయకూడదని పండితులు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికై నా 12వ తేదీన ప్రత్యంగిర హోమం నిలుపుదలను పునఃపరిశీలించాలని భక్తులు కోరుతున్నారు. -
కిక్ బాక్సర్‌కు ఎస్పీ అభినందన
కాకినాడ క్రైం: కిక్ బాక్సింగ్‌లో రాణిస్తున్న కాకినాడ నగరానికి చెందిన యువతి లేఖా నిహారికను ఎస్పీ బిందుమాధవ్ శుక్రవారం ఆయన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లేఖా నిహారిక కేరళలో జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ శిక్షణలో రాణించి హంగేరియన్ వాకో వరల్డ్ కప్ పోటీలకు ఎంపికయ్యారని అన్నారు. వచ్చే నెల 12 నుంచి 15వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయని అన్నారు. ఈ పోటీలలో ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
ఘనంగా అరుంధతీ నక్షత్ర దర్శనం
● శాస్త్రోక్తంగా స్థాలీపాక హోమాలు ● రావణబ్రహ్మ వాహనంపై కోలాహలంగా ఊరేగింపుఅన్నవరం: వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శుక్రవారం సాయంత్రం నవ దంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవార్లకు దర్బారు మండపంలో స్థాలీపాక హోమాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లను తూర్పు రాజగోపురం ముందుకు మంగళవాయిద్య ఘోష నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు పండితులు అరుంధతీ నక్షత్రం చూపించి, పూజలు చేశారు. కార్యక్రమంలో వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, వైదిక కమిటీ సభ్యుడు చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, కొంపెల్ల మూర్తి, అర్చకులు దత్తాత్రేయశర్మ, సుధీర్, పరిచారకులు పవన్ పాల్గొన్నారు. రావణబ్రహ్మ వాహనంపై సత్యదేవుని ఊరేగింపుసత్యదేవుడు, అమ్మవారిని రాత్రి రావణబ్రహ్మ, వాహనంపై ఘనంగా ఊరేగించారు. రాత్రి 9 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పండితులు కొండ దిగువన ఉన్న తొలి పావంచా వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన రావణబ్రహ్మ వాహనంపై వేంచేయించి, పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దర్శించి పూజలు చేశారు. అనంతరం రావణబ్రహ్మ వాహనం ముందు కుంభపు రాశి వేసి, కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. తొలి పావంచా నుంచి ఆంధ్రా బ్యాంక్ సెంటర్ వరకూ, తిరిగి తొలి పావంచా వరకూ ఈ ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా పలువురు కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. ఊరేగింపును చూసేందుకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా, ఊరేగింపులో పోలీసులు లేకపోవడం, వాహనాలను నియంత్రించకపోవడంతో మెయిన్ రోడ్డుపై కొద్ది సేపు ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు గ్రామంలోకి రాకుండా పోలీసులు, అధికారులు మళ్లించకపోవడంతో రెండు వైపుల నుంచీ వాహనాలు వన్‌వేలో రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఊరేగింపులో పోలీసులు లేకపోవడం ఆశ్చర్యం. అన్నవరంలో నేడు తెల్లవారుజామున 3.00 : సుప్రభాత సేవ ఉదయం 8.00 : చతుర్వేద పారాయణ మధ్యాహ్నం 2.30 : అనివేటి మండపంలో సత్యదేవుడు, అమ్మవారి సమక్షంలో సరస్వతీ పూజ, వేద పండిత సదస్సు రాత్రి 9.00 : కొండ దిగువన పొన్నచెట్టు వాహనంపై సత్యదేవుడు, అమ్మవారి ఊరేగింపు ఉదయం 7.00 – 10.00, సాయంత్రం 5.00 – రాత్రి 11.00 : రత్నగిరి కళావేదికపై, కొండ దిగువన సాంస్కృతిక కార్యక్రమాలు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తాళ్లరేవు: యానాం–ద్రాక్షారామ రహదారిలో సుంకరపాలెంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మడికి సత్యనారాయణ(69) మృతిచెందాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు స్థానిక అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మడికి సత్యపారాయణ రహదారి చెంతన ఉన్న కుళాయి వద్దకు నీరు పట్టుకునేందుకు రాగా ఆ సమయంలో ద్రాక్షారామ నుంచి యానాం వేగంగా వెళుతున్న వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
ప్రథమ చికిత్సతో ప్రాణ రక్షణ
అగ్ని ప్రమాదాల బారిన పడితే.. గ్రామాల్లో ముఖ్యంగా పశువులు పాకలు అగ్ని ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఆ సమయంలో పశువుల పాకల్లో ఉన్న గేదెలు, ఆవులు ప్రమాదంలో చిక్కుకుని కాలిపోతాయి. పశువుల కొట్టాం అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే ముందుగా పలుపుతాళ్లు కోసి పశువులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కాలిన గాయాలపై తరచు చన్నీళ్లు పోయాలి. వీలైతే పశువును చెరువులోనికి దింపి శరీరం పూర్తిగా తడిసేలా చేయాలి. పశువులను అరటి ఆకులపై పడుకొనేలా చూడాలి. పశువులకు అయిన గాయాలపై వరిపిండిలో ఏక్రిఫ్లేవిన్ పౌడర్‌ను వరిపిండి, కొబ్బరినూనె కలిపి పూయాలి. నడవలేని స్థితిలో ఉంటే పశువెద్యుడిని ఘటనా స్థలికి తీసుకుని వచ్చి వైద్యం చేయించాలి. రాయవరం: గ్రామీణ ప్రాంతాల్లోని పశువులు తోటలు, పొలాల్లోకి మేతకు వెళ్తుంటాయి. చెట్టుచేమల్లో గడ్డిని మేసే సమయంలో ఒక్కొక్కసారి విష పురుగులు, విద్యుత్ ప్రమాదాల బారిన పడుతుంటాయి. పశువులు ప్రమాదాల్లో చిక్కుకున్న సమయంలో పాడిరైతులు ఆందోళన చెందకుండా వెంటనే ప్రథమ చికిత్స అందిస్తే పశువులను ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చునంటున్నారు రాయవరం మండల పశువైద్యాధికారి ఎ.నాగశ్రావణి. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. పాముకాటుకు గురైతే.. పశువులు పాముకాటుకు గురైతే విషం రక్తనాళాల ద్వారా శరీరమంతా వ్యాపించి రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి పశువులు వెంటనే మరణించే అవకాశం ఉంది. పాముకాటు వేసినచోట ఎర్రగా మారి వాపు వస్తుంది. రెండు గాట్లు వెంబడి రక్తం వస్తుంది. పశువులు కింద పడిపోవడం, నోటి నుంచి చొంగ రావడం, కళ్లు తేలేయడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. చికిత్స ఇలా.. అటువంటి సమయంలో పాముకాటు గుర్తించిన చోట రక్తం బయటకు వచ్చేలా గట్టిగా నొక్కాలి. అందుబాటులో టించర్ అయోడిన్ ఉంటే పాముకాటు వేసిన చోట పూయాలి. విషం పశువు శరీరంలోనికి ప్రవేశించకుండా పై భాగంలో తాడు/గుడ్డతో గట్టిగా కట్టాలి. ఆ తర్వాత పశువైద్యుడిని సంప్రదించి యాంటివీనమ్ టీకా వేయించాలి. పశువులను బాగా గాలి సోకే ప్రదేశంలో ఉంచాలి. శ్వాస బాగా ఆడేలా చూసుకోవాలి. విద్యుదాఘాతానికి గురైతే.. పశువులు విద్యుదాఘాతానికి గురైతే కొన్నిసార్లు వెంటనే మరణిస్తాయి. ఓల్టేజీ తక్కువగా ఉండి షాక్‌కు గురైతే శరీరంపై కాలిన మచ్చలు వస్తాయి. విద్యుదాఘాతానికి గురైన సమయంలో గిలగిలా కొట్టుకుని స్పృహ కోల్పోతాయి. కొన్ని సందర్భాల్లో పక్షవాతానికి కూడా గురవుతాయి. ముట్టుకుంటే అతిగా స్పందిస్తాయి. ఇలాంటి సమయంలో పశువులను నేరుగా తాకరాదు. విద్యుత్ నిలిపివేసిన తర్వాతనే పశువును ముట్టుకోవాలి. ప్రాణం ఉందని గుర్తించిన వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి. విషాహారం తింటే.. పంటను ఆశించే చీడపీడల నివారణకు రైతులు విషపూరితమైన రసాయనిక ఎరువులను పిచికారీ చేస్తారు. అనుకోకుండా పశువులు వాటిని తినడం వలన శరీరంలోనికి విషం ప్రవేశిస్తుంది. దీనివల్ల కళ్లు తేలేయడం, నోటి వెంట చొంగ కారడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఇలాంటి సమయంలో పశువుకు కలప బొగ్గుపొడి కలిపిన నీటిని తాగించాలి. అది విష పదార్థాలను కొంత వరకు పీల్చుకుని పశువుకు హాని కలగకుండా చేస్తుంది. అలాగే వంట నూనె అరలీటరు, పది కోడిగుడ్ల తెల్లసొనను పశువులకు తాగించాలి. అనంతరం మెరుగైన వైద్యం కోసం పశువైద్యుడిని సంప్రదించాలి. పశువులు ప్రమాదంలో చిక్కుకుంటే ఆందోళన చెందవద్దు ప్రథమ చికిత్స అందించి వైద్యులను సంప్రదించాలి -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
కార్పొరేట్ లాభాల కోసమే లేబర్ కోడ్లు
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు కాకినాడ సిటీ: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం యూటీఎఫ్ హోంలో జరిగిన జిల్లా కార్మిక సంఘాల జిల్లా సదస్సులో వారు మాట్లాడారు. మోదీ మతోన్మాద ప్రభుత్వం భారతీయ కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు బానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. స్వతంత్రానికి ముందుగానీ, తర్వాత గానీ వచ్చిన కార్మిక చట్టాలు ఒకరి దయతో వచ్చినవి కాదని, వేలాది మంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్నవని గుర్తు చేశారు. మూడు నల్ల చట్టాలతో రైతులను, నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కరోనా సంక్షాభాన్ని, ఉగ్రవాద సంక్షోభ పరిస్థితులను మోదీ మతోన్మాద ఎజెండాను అమలు పరిచేందుకు, కార్పొరేట్ శక్తులను సంతృప్తి పరిచేందుకు వాడుకుంటోందని విమర్శించారు. సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్, ఎల్ఐసీ, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ పాల్గొంటున్నాయని, ప్రభుత్వ పథకాలలో పని చేసే ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు కూడా సమ్మెను బలపరచాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రాజు, ఏఐసీసీటీయూ రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాల నాయకులు చెక్కల రాజ్‌కుమార్, కాళ్ల నాగేశ్వరరావు, షేక్ పద్మ, మలకా రమణ, నక్కెళ్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు, మేడిశెట్టి వెంకటరమణ, చంద్రమళ్ల పద్మ, వేణి, వెంకటలక్ష్మి, గుబ్బల ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు. సదస్సు ప్రారంభోత్సవానికి ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ట్రాక్టర్ దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్
రాయవరం: చెడు వ్యసనాలకు బానిసై..ఈజీ మనీ కోసం ఒక వ్యక్తి రహదారి పక్కన పుల్లల లోడుతో ఆపి ఉన్న ట్రాక్టర్ విత్ ట్రైలర్‌ను అపహరించుకు పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న రాయవరం పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేశారు. మండలంలోని పసలపూడిలోని గోదావరి రైసు మిల్లు సమీపంలో అదే గ్రామానికి చెందిన పిల్లి జానకిరామయ్య గత నెల 10న పుల్లల లోడుతో ఉన్న ట్రైలర్‌తో కూడిన ట్రాక్టర్‌ను నిలిపి ఉంచాడు. ఉదయం చూసుకునే సరికి ట్రైలర్‌తో కూడిన ట్రాక్టర్ అక్కడ లేకపోవడంతో దొంగతనానికి గురైనట్లుగా భావించిన జానకిరామయ్య రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై సురేష్‌బాబు దర్యాప్తు చేపట్టారు. వెదురుపాక గీతామందిరం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, కొంకుదురు వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నల్లమిల్లి సూర్యనారాయణరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. చెడు వ్యసనాలకు బానిసై, సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లుగా నిందితుడు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన సీఐ దొరరాజు, ఎస్సై సురేష్‌బాబు, హెచ్‌సీ సత్యకుమార్, పీసీలు వీరేంద్రను ఎస్పీ కృష్ణారావు అభినందించారు. -
ప్రతిష్టాత్మకంగా సాహితీ సంబరాల ఈవెంట్
సఖినేటిపల్లి: శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీలలో ఏలూరులో రెండు వేల మంది కవులు, కళాకారులతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు ఏర్పాటు చేసినట్టు వేదిక సీఈఓ కత్తిమండ ప్రతాప్ అన్నారు. గురువారం సఖినేటిపల్లిలో ఈ మేరకు ఆయన ఈవెంట్లో ప్రదర్శించే వివిధ కళల ప్రదర్శనల బ్రోచర్ విడుదల చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సాహితీ సంబరాలలో ఏ విధమైన ఫీజులు లేకుండా పాల్గొనే కవులు, కళాకారులు అందరినీ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో సత్కరించనున్నట్టు వెల్లడించారు. కాగా సాహితీ చరిత్రలో అతి పెద్ద కార్యక్రమంగా రూపొందించిన ఈ ఈవెంట్‌ను కన్వీనర్లు కొల్లి రమావతి, డాక్టర్ పార్థసారధి, జి.ఈశ్వరీ భూషణం పర్యవేక్షిస్తారన్నారు. ఈవెంట్లో తెలుగు కవితోత్సవం, తెలుగు సాహిత్య సదస్సు, పుస్తకావిష్కరణలు, రంగస్థల ప్రదర్శనలు, జానపద కళలు, కూచిపూడి, భరతనాట్యం వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్టు ప్రతాప్ పేర్కొన్నారు. -
కావాలనే కడ తేర్చారా?
పిఠాపురం: పాపం పుణ్యం తెలియని పసికందును తమకు అడ్డు వస్తుందనే, కావాలనే కడతేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పసికందు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఒక పథకం ప్రకారం కొందరు వ్యక్తులు పసికందును హత్య చేసి దానిని తప్పుదోవ పట్టించడానికి క్షుద్ర పూజల నాటకం ఆడినట్టు పోలీసులు గుర్తించారు. ఆ దిశలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హత్య కేసు చిక్కుముడి విడదీసిన పోలీసులు హత్య ఎందుకు చేశారు? ఎవరు చేశారు? ఎలా చేశారు? అనే విషయాలపై దృష్టి సారించి వాటికి సంబంధించిన క్లూ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారనే బలమైన ఆధారాలు సేకరించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకరితో బంధాన్ని తెంచుకోడానికి మరొకరితో బంధాన్ని కలుపుకోడానికి పేగు బంధాన్ని నిర్దాక్షిణ్యంగా తెంచేసినట్లు పోలీసుల దర్యాప్తు తేటతెల్లమైనట్టు తెలుస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసినట్లు చెబుతున్నారు. గుట్టువిప్పిన పసుపు కుంకుమ పసికందును హత్య చేసిన ఇంట్లో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ప్రస్తుత సమాజంలో ఎక్కడా లేని క్షుద్రపూజలు పిఠాపురం పట్టణంలో జనసంచారం ఎక్కువగా ఉండే జగ్గయ్య చెరువులో కలకలం సృష్టించాయి. దీనిపై దృష్టి సారించిన పోలీసులు అసలు క్షుద్ర పూజలు జరిగాయా అన్న విషయంపై ఆరా తీయగా తీగ లాగితే డొంక కదిలినట్లు తెలిసింది. క్షుద్ర పూజలు చేసినట్లుగా ఏర్పాటు చేసిన పసుపు, కుంకుమ, నిమ్మకాయలను పరిశీలించిన పోలీసులు వాటి శాంపిల్ సేకరించి సంఘటన జరిగిన ఇంట్లో ఉన్న పసుపు, కుంకుమతో పోల్చి చూడగా రెండు ఒకటేనని తేలినట్లు సమాచారం. క్షుద్రపూజలు జరిగినట్టు జనాన్ని, పోలీసులను నమ్మించాలని నిందితులు ఏర్పాటు చేసిన పసుపు, కుంకుమ హత్య కేసు చిక్కుముడిని విప్పినట్టు తెలిసింది. కుటుంబ సభ్యులే ఇవి ఏర్పాటు చేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు వినికిడి. సాంకేతికత ఆధారంగా వాటిని ల్యాబ్‌కు పంపి నిర్ధారించే పనిలో పోలీసులు ఉన్నట్టు సమాచారం. అవి క్షుద్ర పూజలు కాదు పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీలో బాలిక హత్య జరిగిన ఇంట్లో క్షుద్ర పూజలు, చేతబడులు జరగలేదని అది కేవలం ఒక నాటకమని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి బుధవారం పోలీసు స్టేషన్‌కు వచ్చి తన మనుమరాలు అయిన ఐదు నెలల పాప కనిపించడం లేదని ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పట్టణ ఎస్సై మణికుమార్ తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారన్నారు. గాలింపులో ఒక నూతిలో ఐదు నెలల పాప పడి చనిపోయి ఉండడాన్ని గమనించి బయటకు తీశారన్నారు. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో వెంటనే కేసు నమోదు చేసి, నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసును తప్పుదోవ పట్టించడానికి క్షుద్రపూజల నాటక మాడినట్లు సాంకేతికత ఆధారంగా గుర్తించామన్నారు. త్వరలోనే పసికందును హతమార్చిన వారిని పట్టుకుంటామని ఆయన తెలిపారు. పిఠాపురం ప్రాంతంలో ఎప్పుడూ క్షుద్ర పూజలు, చేతబడులు వంటివి లేవని, ఇవి కేవలం కల్పితమే కాబట్టి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. హత్య కేసును తప్పుదారి పట్టించడానికే క్షుద్రపూజల నాటకం పసికందు హత్య కేసులో ముమ్మర దర్యాప్తు -
డైట్‌కు నూతన అధ్యాపకులు
రాయవరం: ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించబోయే వారికి శిక్షణనిచ్చే డిస్ట్రిక్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(డైట్) సంస్థకు నూతనంగా అధ్యాపకులు నియామకం చేపట్టారు. డైట్లో రెగ్యులర్ అధ్యాపకులను నియమించకుండా వారి స్థానంలో ప్రభుత్వ/జెడ్పీ/మున్సిపల్ తదితర యాజమాన్యాల్లో స్కూల్ అసిస్టెంట్లు, ప్రిన్సిపాల్స్ నుంచి అర్హత ఉన్న ఉపాధ్యాయులను డెప్యుటేషన్‌పై నియమిస్తున్నారు. మూడేళ్ల కాలపరిమితికి నియమించిన అధ్యాపకులను ఇటీవల విధుల నుంచి విడుదల చేసి పంపించడంతో వారి స్థానంలో అవసరమైన సబ్జెక్టులకు కొత్త అధ్యాపకుల నియామక ప్రక్రియ చేపట్టారు. అందులో భాగంగా గత నెల ఒకటో తేదీన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం గత నెల 10వ తేది వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తుదారుల్లో అర్హులైన వారికి కాకినాడలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించి, వారిలో ఉత్తీర్ణత సాధించిన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గత నెల 22న ఇంటర్వ్యూలు నిర్వహించి, మెరిట్ కమ్ సెలక్షన్ జాబితాను సిద్ధం చేశారు. దాని ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 మంది అధ్యాపకులను వివిద సబ్జెక్టులకు ఎంపిక చేశారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం ఎంపికై న అధ్యాపకులు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశాల్లో విధుల నుంచి విడుదలై డైట్లో విధుల్లో చేరాల్సి ఉంది. డైట్‌కు ఎంపికై న అధ్యాపకుల స్థానాలను బదిలీలు/పదోన్నతులతో భర్తీ చేసే అవకాశముంది. -
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
అల్లవరం: అమలాపురం మండలం కామనగరువు గ్రామానికి చెందిన కామన భార్గవ్ (24) బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి వైనతేయ నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కామనగరువు గ్రామానికి చెందిన భార్గవ్ అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో మోటార్ సైకిల్ని బోడసకుర్రు బ్రిడ్జిపై పార్కు చేసి నదిలోకి దూకేశాడని తెలిపారు. భార్గవ్ నదిలోకి దూకడంతో తన తమ్ముడిని రక్షించేందుకు అన్న రాజేష్ కుడా నదిలోకి దూకాడు. అయితే రాజేష్‌కు భార్గవ్ దక్కకపోవడంతో తన ప్రాణాలకు మీదకు తెచ్చుకున్నాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండి, చాలా లోతుగా ఉండడంతో రాజేష్ ప్రాణాపాయ స్థితిలోకి చేరాడు. ఇంతలో బ్రిడ్జిపై నుంచి లారీ డ్రైవర్ పగ్గాన్ని రాజేష్‌కు అందించడంతో తాడుని పట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇంతలో స్థానికంగా ఉన్న మత్స్యకారులు పడవలో వెళ్లి రాజేష్‌ని కాపాడి ఒడ్డుకి చేర్చారని పోలీసులు తెలిపారు. అయితే నదిలోకి దూకిన భార్గవ్ నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. అయితే సాయంత్రానికి భార్గవ్ మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకి చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చూసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుమలరావు తెలిపారు. భార్గవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
కుట్టు శిక్షణ కుంభకోణంపై చర్యలు తీసుకోండి
కాకినాడ సిటీ: బీసీ, ఈబీసీ మహిళలకు కుట్టు మెషీన్ల పంపిణీ, శిక్షణ పేరుతో రూ.245 కోట్ల కుంభకోణానికి ప్రభుత్వం తెర తీసిందని, బాధ్యులపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు ఆధ్వర్యంలో నాయకులు గురువారం జేసీ రాహుల్ మీనాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్లో రాబాబు విలేకర్లతో మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న సీఎం చంద్రబాబునాయుడు బీసీ మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఉచిత కుట్టు మెషీన్లు, శిక్షణ పేరుతో బలోపేతం చేస్తామని ప్రకటించారని, ఆ హామీని అడ్డుపెట్టుకుని వారికి కేటాయించిన నిధులతో ఖజానాకు కన్నం పెట్టేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారని అన్నారు. నిధుల దోపిడీయే కాకుండా ఈ పథకం అంచనాలను అమాంతం పెంచేసి తక్కువ కోట్ చేసిన సంస్థను కాదని, ఎక్కువ కోట్ చేసి సిండికేట్‌గా మారిన రెండు కంపెనీలకు ఇస్తూ టెండర్ల ప్రక్రియ దశలోనే అక్రమాలకు తెరతీయడం దారుణమని రాజబాబు అన్నారు. ఈ పథకం ద్వారా 1.02 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.23 వేల చొప్పున కేటాయిస్తున్నారని ప్రకటించారన్నారు. కుట్టు మెషీన్ కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.4,300, శిక్షణ నిమిత్తం రూ.3 వేల చొప్పున కేటాయిస్తే లక్ష మందికి రూ.73 కోట్లు ఖర్చవుతుందన్నారు. మిగిలిన రూ.167 కోట్లు ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు. -
ఇంటర్ సప్లిమెంటరీకి పక్కా ఏర్పాట్లు
కాకినాడ సిటీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) జె.వెంకటరావు వివిధ శాఖల అధికారులను కోరారు. ఈ పరీక్షల నిర్వహణపై తన చాంబర్లో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకూ జిల్లాలోని 36 కేంద్రాల్లో జరిగే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 21,541 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. వీరిలో 15,933 మంది ఫస్టియర్, 5,608 మంది సెకండియర్ పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూము ఏర్పాటు చేశారని తెలిపారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, వాటి సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్షల సమయలో మూసివేయించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆయా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు తగినవిధంగా బస్సులు నడపాలని ఆర్డీసీ అధికారులకు డీఆర్ఓ సూచించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి ఐ.శారద, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌కు రెడ్‌క్రాస్ అవార్డు కాకినాడ సిటీ: గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి రెడ్‌క్రాస్ పురస్కారం అందుకున్నారు. ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయనకు గవర్నర్ బంగారు పతకం, ప్రశంసా పత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రథమ మహిళ సమీరా నజీర్, గవర్నర్ కార్యదర్శి డాక్టర్ ఎం.హరి జవహర్లాల్, ఇండియన్ రెడక్రాస్ సొసైటీ చైర్మన్ వైడీ రామారావు, రెడ్‌క్రాస్ ఏపీ శాఖ సీఈఓ, ప్రధాన కార్యదర్శి ఏకే ఫరీదా పాల్గొన్నారు. సత్యదేవుని కల్యాణోత్సవాలకు ప్రత్యేకాధికారులుఅన్నవరం: సత్యదేవుని కల్యాణోత్సవాలకు ప్రత్యేకాధికారులుగా దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్‌బాబు, లోవ దేవస్థానం ఈఓ విశ్వనాథరాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 11న జరగనున్న రథోత్సవం ఏర్పాట్ల పర్యవేక్షణకు అంతర్వేది దేవస్థానం ఈఓ వి.సత్యనారాయణ, ఈఓలు మురళీ వీరభద్రరావు, శివబాబు, టీవీ సూర్యనారాయణలను నియమించారు. -
ప్రజాస్వామ్యానికి సంకెళ్లా?
పత్రికా స్వేచ్ఛపై దాడే.. ఎటువంటి నోటీసూ ఇవ్వకుండా సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంట్లో సోదాలు పత్రికా స్వేచ్ఛపై దాడిగానే భావించాల్సి వస్తుంది. తమకు అనుకూలంగా లేని పత్రికలపై పోలీసులను అడ్డం పెట్టుకుని లొంగదీసుకోవాలనుకోవడం అవివేకమైన చర్య. కార్డన్ సెర్చ్ పేరుతో సాక్షి దినపత్రిక సంపాదకుడి ఇంట్లో తనిఖీలు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించినట్లుగానే ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) భావిస్తోంది. ఈ దాడిని ఖండిస్తోంది. ఇంట్లోకి పోలీసులు బలవంతంగా చొరబడి తనిఖీలు చేసిన ధోరణి దిగ్భ్రాంతి కలిగించింది. పాత్రికేయులను భయపెట్టడానికి మాత్రమే పోలీసులు ఇలాంటి చర్యలను పూనుకుంటున్నట్లు భావిస్తున్నాం. సాక్షి పాత్రికేయులపై అక్రమ కేసులు సరి కాదు. సాక్షి యాజమాన్యంపై ఉన్న రాజకీయ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు సాక్షి జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటున్నట్లు భావించాల్సి వస్తోంది. ఈ తరహా తీరును ప్రభుత్వం మార్చుకోవాలి. – స్వాతి ప్రసాద్, ఐజేయూ జాతీయ సమితి సభ్యుడు, కాకినాడ ● ప్రశ్నించే సాక్షి గొంతు నొక్కేస్తారా? ● ఎడిటర్ ఇంట్లో చొరబాటు, సోదాలు అన్యాయం ● గళం విప్పిన జర్నలిస్టులు, ప్రజాసంఘాలుసాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే విధానాలకు కూటమి ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు గురువారం నిరసనలు హోరెత్తించారు. ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు.. విజయవాడలో సాక్షి సంపాదకులు ధనంజయరెడ్డి ఇంట్లోకి చొరబడి, అక్రమంగా సోదాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సెర్చ్ వారెంట్ ఇవ్వకపోగా.. అది అడిగినందుకు డీఎస్పీ దురుసుగా ప్రవర్తించడం చూస్తూంటే.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల ముందుకు తీసుకువెళుతున్న సాక్షి గొంతు నొక్కే ప్రయత్నంలా ఉందని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ధ్వజమెత్తారు. అక్రమ సోదాలను ప్రజాసంఘాలు, పౌర సమాజం ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడలోని కలెక్టరేట్ సహా తుని, కోటనందూరు, ప్రత్తిపాడు, జగ్గంపేట, ఏలేశ్వరం, పెద్దాపురం, పెదపూడి తదితర ప్రాంతాల్లో జర్నలిస్టులు ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ నల్లబ్యాడ్జీలతో బ్లాక్‌డే పాటించి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెద్దాపురంలో ఆర్డీఓ శ్రీరమణికి, ఆయా మండలాల్లో తహసీల్దార్లు, పోలీసు అధికారులకు వినతిత్రాలు అందజేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏపీయూడబ్లూజే జిల్లా నేతలు, కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ప్రతినిధుల ఆధ్వర్యాన జర్నలిస్టులు కాకినాడ కలెక్టరేట్ మెయిన్ గేటు ఎదుట నల్లబ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు అంజిబాబు, సాంబశివరావు మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సాక్షి పత్రిక పైన, పత్రిక సంపాదకులు ధనంజయరెడ్డి పైన వేధింపులు తగవని అన్నారు. ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు చొరబడి తనిఖీలు నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం ఇటువంటి చర్యల ద్వారా ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం అవివేకమే అవుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం లాంటి పత్రికలపై దాడులు, కక్షపూరిత చర్యలు సరికావని హితవు పలికారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఇటువంటి విధానాలు అప్రజాస్వామికమని ఖండించారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో సోదాలు చేసిన పోలీసుల వైఖరిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఇటువంటి విధానాలను ప్రభుత్వాలు మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు వీధి గోపీనాథ్, గోన సురేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి చిక్కం పల్లంరాజు, కార్యవర్గ సభ్యులు కె.ధర్మరాజు, దడాల ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడు ఎం.ప్రకాష్, సీనియర్ జర్నలిస్టులు సబ్బెళ్ల శివనారాయణరెడ్డి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సాక్షి బ్యూరో చీఫ్ లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి టీవీ జర్నలిస్టు బొక్కినాల రాజు, కెమెరామెన్ రమణ, జర్నలిస్టులు తోట చక్రధర్, విశ్వనాథుల రాజబాబు, బొత్స వెంకట్, తలాటం సత్యనారాయణ, దొమ్మేటి నాగరాజు, కొమ్మిరెడ్డి శ్రీధర్, రాజకమల్ తదితరులు పాల్గొన్నారు.పోలీసుల తీరు అన్యాయం సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లోకి చొరబడి పోలీసులు భయభ్రాంతులకు గురి చేయడం అన్యాయం. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపడం పత్రిక కనీస బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్న సాక్షిపై, ఆ పత్రిక ఎడిటర్‌పై అన్యాయంగా కేసులు పెడుతున్న తీరు సమర్థనీయం కాదు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు వ్యవస్థలో ఏ ఒక్క విభాగానికీ లేదనే విషయం గుర్తించాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులు.. అందుకు భిన్నంగా పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజల గొంతుకై న పత్రికా స్వేచ్ఛను హరించడాన్ని ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలి. – వి.నవీన్‌రాజు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాకినాడ ఏం సందేశం ఇద్దామని..! విజయవాడలో సాక్షి ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా ప్రవేశించడం అన్యాయం. ఏదైనా విషయం ఉంటే చట్ట ప్రకారం సెర్చ్ వారెంట్ ఇచ్చి, సోదాలు చేసుకునే హక్కు పోలీసులకు ఉంటుంది. లేదంటే 41 నోటీసు ఇచ్చి చట్ట ప్రకారం విచారించవచ్చు. ఇవేమీ లేకుండా ఒక పత్రికా సంపాదకుని ఇంట్లోకి చొరబడడం, దురుసుగా ప్రవర్తించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఏ సందేశం ఇవ్వదలుచుకుందో అర్థం కావడం లేదు. ఇటీవల ఒక వార్తకు సంబంధించి సాక్షి ఎడిటర్‌తో సహా జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసిన విషయం మరవక ముందే ఇప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరును సమాజం ఖండించాల్సిందే. – తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి -
విమానాశ్రయంలో మాక్‌డ్రిల్
కోరుకొండ: యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు ఏవిధంగా స్పందించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఏఎస్పీ చెంచిరెడ్డి ఆధ్వర్యాన గురువారం సాయంత్రం మాక్‌డ్రిల్ నిర్వహించారు. బాంబు పేలుళ్లు జరిగినప్పుడు విమాన ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. బాంబింగ్ సమయంలో ప్రయాణికులు పరుగులు తీయకుండా నేలకు వాలి ఉండటం సురక్షితమని చెప్పారు. కార్యక్రమంలో విమానాశ్రయం ఇన్చార్జి డైరెక్టర్ శ్రీకాంత్, ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రసాదరావు, అగ్నిమాపక అధికారి గుప్తా, కోరుకొండ సీఐ సత్యకిషోర్, ఎస్సై కూన నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరి వనదుర్గకు అపచారమా?
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కొన్ని నిర్ణయాలు విమర్శలకు తావిస్తున్నాయి. తాజాగా సత్యదేవుని కల్యాణ మహోత్సవాలలో రద్దు చేసిన వైదిక కార్యక్రమాలలో రత్నగిరి వన సంరక్షుకురాలు వనదుర్గ అమ్మవారికి శుక్రవారం నిర్వహించే చండీహోమం, పౌర్ణిమ రోజు నిర్వహించే ప్రత్యంగిర హోమాలు కూడా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వాస్తవానికి గతంలో జరిగిన కల్యాణ మహోత్సవాలలో ఈ హోమాలు యథావిధిగా నిర్వహించారు. కల్యాణోత్సవాల వేడుకలకు ఆటంకం అని కొన్ని వైదిక కార్యక్రమాల రద్దు సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు వారం రోజులు జరుగుతాయి. ఈ సందర్భంగా కొన్ని వైదిక కార్యక్రమాలు రద్దు చేస్తారు. రద్దు చేసిన కార్యక్రమాలన్నీ స్వామి, అమ్మవారికి చేసేవే. సత్యదేవుని నిత్యకల్యాణం, ఆయుష్యహోమం, సహస్ర దీపాలంకార సేవ, పంచహారతుల సేవ, పవళింపుసేవ ఉన్నాయి. వీటితో బాటు వనదుర్గ అమ్మవారికి తొమ్మిదో తేదీన నిర్వహించే చండీహోమం, 12వ తేదీన నిర్వహించే ప్రత్యంగిర హోమాలు కూడా నిలిపివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వందేళ్ల క్రితం శృంగేరీ పీఠాధిపతులు అన్నవరంలో రత్నగిరి వనాన్ని రక్షించే దేవతగా వనదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి అమ్మవారికి చండీహోమం, ప్రత్యంగిర హోమాలు నిర్వహిస్తున్నారు. గతంలో హోమాల నిర్వహణ ● 2023లో ఎస్ఎస్ చంద్రశేఖర్ అజాద్ ఈఓగా ఉన్నపుడు జరిగిన సత్యదేవుని కల్యాణ మహోత్సవాలలో మే నెల ఐదో తేదీన వైశాఖ పౌర్ణిమ, శుక్రవారం రెండూ కలిసి రావడంతో వనదుర్గ అమ్మవారికి చండీ, ప్రత్యంగిర హోమాలు నిర్వహించారు. ● 2024 కల్యాణోత్సవాలలో ప్రస్తుత దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ అప్పటి ఈఓగా మే 23న వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం నిర్వహించారు. మే 24న వనదుర్గ అమ్మవారికి చండీహోమం నిర్వహించారు. అయితే ఈ ఉత్సవాలలో చండీహోమం, ప్రత్యంగిర హోమం రద్దు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ హోమాలు నిర్వహించే రుత్విక్కులు, అర్చకులు వేరు. వీరు స్వామివారి ఉత్సవాలలో పాల్గొనరు. హోమాల సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే. స్వామి కల్యాణ వేడుకలన్నీ సాయంత్రం, రాత్రి జరిగేవే. అధికారులు పునరాలోచన చేసి ఆ హోమాలు యథావిధిగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.ఎన్నడూ లేని విధంగా చండీ, ప్రత్యంగిర హోమాల నిలుపుదల -
పాపేం చేసింది పాపం!
పిఠాపురం: అన్నెంపుణ్యం తెలియని పసిగుడ్డును పొట్టన పెట్టుకున్నారు. పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న పసికందు మృతి, క్షుద్ర పూజల ఆనవాళ్లు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ సంఘటనకు సంభందించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం జగ్గయ్య చెరువులో నివాసముంటున్న పెదపాటి సతీష్, శైలజ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి యశ్వంతి అనే ఆరునెలల పాప ఉంది. మంగళవారం రాత్రి శైలజ పెద్దమ్మ గంటా మరిడమ్మ పెదనాన్న గంటా రాంబాబులు మేడపై నిద్రించారు. తమ్ముడు పసుపులేటి లోవరాజు, తండ్రి పసుపులేటి దుర్గారావు, తల్లి అన్నవరంలతో కలిసి శైలజ, ఆమె కుమార్తె యశ్వంతి (6 నెలలు) కింద గదులలో నిద్రించారు. రాత్రి 12.30 గంటల సమయంలో పాపకు పాలిద్దామని చూసిన శైలజకు చిన్నారి కనపడకపోవడంతో పెద్దగా కేకలు వేసింది. దీంతో ఇంట్లోని వారందరూ, పక్కింటి వారు కూడా వచ్చి పాప కోసం ఇల్లంతా వెదికారు. చివరకు వారు బావిలో పడి ఉన్న పాపను, ఇంటి గుమ్మం మెట్లపై ఉన్న నిమ్మకాయ, పసుపు, కుంకాలను గమనించారు.ఘోరానికి ఒడిగట్టిందెవరు..!ఈ విషయాన్ని బంధువులకు చెప్పేందుకు శైలజ తల్లి అన్నవరం తన సెల్ కోసం వెతికి అది కనిపించకపోవడంతో వేరొక సెల్ నుంచి తన మొబైల్‌కు ఫోన్ చేశారు. ఆ ఫోన్ ఇంటి గోడ అవతల రింగ్ అవుతూ కనిపించింది. దానిని తీసుకుని బంధువులకు విషయాన్ని తెలియజేశారు. సమాచారం అందుకుని అక్కడ చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బావిలోని పాప మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో పరిసరాలను తనిఖీ చేశారు. పాప అమ్మమ్మ అన్నవరం వద్దకు వెళ్లి నిలవడంతో పాటు ఆమె ఫోన్ నూతి పక్కన దొరకడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో పోలీసులు అన్నవరంను, ఆమెతో పాటు, కొందరు కుటుంబ సభ్యులను అనుమానితులుగా విచారిస్తున్నారు. శైలజ యానాదులు కాగా తండ్రి సతీష్ ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. వీరి ప్రేమ వివాహం నచ్చని శైలజ కుటుంబ సభ్యులు బాలిక మృతికి కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.క్షుద్ర పూజలు నాటకమేనాఆడ పిల్ల అనో, లేక అడ్డుగా ఉందనో పసికందును పొట్టన పెట్టుకున్న అగంతకులు ఎవరికీ అనుమానం రాకుండా క్షుద్ర పూజలు జరిగినట్లు చిత్రీకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుంకుమ, పసుపు నమూనాలు సేకరించి, ఇంటిలో ఉన్న పసుపు కుంకుమ ఒకటేనా అని పరిశీలించారు. కేసును తప్పుదోవ పట్టించడానికే క్షుద్ర పూజల నాటకం ఆడి ఉంటారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే చిన్నారి అమ్మమ్మ, తాతయ్య, మేనమామ, తండ్రి తదితరులను అనుమానితులుగా విచారిస్తున్నారు.బంతితో ఆడుతూ బావిలోకి.. ఏడేళ్ల బాలుడి మృతిసామర్లకోట: బంతితో ఆడుతూ పొరపాటు బావిలో పడి ఒక చిన్నారి మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం అయోధ్యరామపురానికి చెందిన చెవా హేమంత్ (7) బుధవారం సాయంత్రం తన ఇంటి సమీపంలో బంధువుల ఇంటి వద్ద బంతితో ఆడుతూ బావి సమీపంలోని సిమెంటు దిమ్మ ఎక్కాడు. బంతి బావి వైపు పోవడంతో దానిని అందుకునే క్రమంలో ఆ చిన్నారి బావిలో పడిపోయాడు. సుమారు 60 అడుగుల లోతులో బావి ఉండడంతో స్థానికులు దిగలేక పోయారు. దాంతో విద్యాకమిటీ చైర్మన్ నక్కా జానికిరామయ్య పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది బావిలోనికి దిగే ప్రయత్నం చేశారు. అయితే వారి వద్ద లైట్ లేక పోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు లైట్ ఏర్పాటు చేయడంతో అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు బావిలోనికి దిగారు. బాలుడు బావిలోనికి పడిన సమయంలో అతని తలకు గాయం తగలడం, సుమారు రెండు గంటల సేపు బావిలో ఉండిపోవడంతో మృతి చెందాడు. బాలుడి తండ్రి సతీష్ ఏడీబీ రోడ్డులోని ఒక రెయ్యల చెరువు వద్ద పని చేస్తూ ఉంటాడు. తల్లి రాధ గృహిణి. హేమంత్ తాత సుబ్బారావు సాయంత్రం 6 గంటల సమయంలో ముంజులు తీసుకు వచ్చి తినరా అంటే ఇప్పుడే రెండు నిమిషాలల్లో వస్తానని చెప్పి వెళ్లిన మనవడు ఐదు నిమిషాలలో బావిలో పడిపోయాడనే వార్త వినాల్సి వచ్చిందని గుండెలు బాదుకుంటూ రోదించాడు. ఎస్సై మూర్తి తన సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగులను మోసం చేసిన చంద్రబాబు
ప్రత్తిపాడు: పరిపాలనానుభవం అపారంగా ఉందని పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలనే కాక ఉద్యోగులను సైతం మోసం చేశారని వైఎస్సార్ సీపీ పెన్షనర్ల వింగ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలకమర్తి సాయి ప్రసాద్ విమర్శించారు. ప్రత్తిపాడులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీపీఎస్ రద్దు కోసం మూడు లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయన్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అనేక హామీలిచ్చిన కూటమి నేతలు గద్దెనెక్కిన తర్వాత హామీలన్నీ గాలికి వదిలేశారన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం రూ. 30 వేల కోట్లు బకాయిలు ఉండగా కేవలం రూ.7,300 కోట్లు విడుదల చేసిందన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ స్కేలు ఇవ్వాలని, ఐఆర్ 30 శాతం ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ప్రధానిని కించపరచినందుకు అరెస్టు
మామిడికుదురు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరుస్తూ అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు చేసిన గోగన్నమఠం గ్రామం ముత్యాలపాలేనికి చెందిన కర్రి మోహనకనకదుర్గారావును అరెస్టు చేసినట్టు సీఐ రుద్రరాజు భీమరాజు, ఎస్సై ఎ.చైతన్యకుమార్ బుధవారం తెలిపారు. నగరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించామన్నారు. సోషల్ మీడియాలో పెట్టె ప్రతి పోస్టుపైన రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైబర్ పోలీసుల ఆధ్వర్యంలో ఒక వింగ్ పరిశీలిస్తుందన్నారు. అభ్యంతరకరమైన, అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ప్రధానంగా యువత అప్రమత్తంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, అనుచిత వ్యాఖ్యలు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. -
స్వామిపేరు చెప్పి స్వకార్యం
● సౌకర్యాల మాటున స్వలాభం ● వాడపల్లి వెంకన్న క్షేత్రంలో నిబంధనలకు తిలోదకాలు ● అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతున్న అధికారులు కొత్తపేట: జిల్లాలోని వాడపల్లి క్షేత్రంలో కూటమి నేతల స్వాహాకారాలు మిన్నంటుతున్నాయి. ఆలయంలో భక్తులకు కల్పించే వసతులు, సౌకర్యాలు, ప్లైఓవర్స్, క్యూలైన్లకు సంబంధించి ప్రతి పనిలో అధికారులు నిబంధనలకు తిలోదాలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలకవర్గం నియామకం కాకపోయినా పాలకుల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పుకొంటున్న ఒక నాయకుడు అనధికార చైర్మన్‌గా పెత్తనం సాగిస్తున్నాడు. అంతా తన కనుసన్నల్లోనే జరగాలన్నట్టు వ్యవహరిస్తున్నారని, దీంతో అధికారులు సిబ్బంది ఆయన అడుగులకు మడుగులొత్తుతున్నారని స్వయంగా అధికార పార్టీ వారితో పాటు స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు కేటాయించిన సుమారు 8 ఎకరాల విస్తీర్ణాన్ని ఎలాంటి అనుమతులు, టెండర్లు లేకుండానే రూ.కోట్ల వ్యయంతో మెరగ చేయిస్తున్నారు. ఫ్లై ఓవర్లు, క్యూలైన్లు, ఇతర సౌకర్యాలకు సంబంధించి నిర్మాణాల్లో నిబందనలకు తిలోదకాలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అంతవరకూ పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులను తొలగించి తమ అనుయాయులను పలు పోస్టుల్లో నియమించుకుని ఇష్టానుసారం వేతనాలు ఇస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు వస్తే వాహనాలు దిగబడకుండా వాహనాల పార్కింగ్ స్థలాన్ని నాలుగు అడుగుల మేర మెరక చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు వచ్చాక టెండర్లు పిలుస్తాం. వర్షాకాలం సమీపిస్తుండడంతో వాహనాలు దిగబడిపోకుండా గోతులు పూడ్చాలని మండలంలోని ఇసుక ర్యాంపుల వారిని కోరాము. వారు మట్టిని ఉచితంగానే తోలి మెరకకు సాయం చేస్తున్నారు. రెండు ఫ్లైఓవర్లలో ఒకటి డోనర్ ఇచ్చిన రూ.ఐదు లక్షలతో నిర్మించగా మరొకటి డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూషన్ మేరకు రూ.6 లక్షలతో నిర్మించినట్టు తెలిపారు. వాడపల్లి క్షేత్రంలో అన్ని పనులు నిబంధనలకు అనుగుణంగానే చేస్తున్నట్టు తెలిపారు. – నల్లం సూర్య చక్రధరరావు, ఈవో -
జగన్‌ను కలసిన ముదునూరి
సాక్షిప్రతినిధి, కాకినాడ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకులుగా నియమితులైన ప్రత్తిపాడు నాయకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు బుధవారం తాడేపల్లిలో కలిశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల మీద నిరంతరం పార్లమెంట్ పరిశీలకులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి ప్రజల పక్షాన పోరాటాలు చేయాలని జగన్ సూచించారని మురళీకృష్ణంరాజు తెలియచేశారు. ఎప్పటికప్పుడు ప్రాంతీయ సమన్వయకర్తల సూచనలను కింది స్థాయికి తీసుకువెళ్లాలని చెప్పారన్నారు. సచివాలయాల్లో మరో ఆరు సేవలు కాకినాడ సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో నూతన రైస్ కార్డుల నమోదుతో పాటు రైస్ కార్డులకు సంబంధించి మరో ఆరు సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బుధవారం నుంచి ప్రారంభించినట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నూతన రైస్ కార్డుల కోసం ఇప్పటి వరకూ అందిన దరఖాస్తులను, కొత్తగా పెట్టుకునే దరఖాస్తులను సచివాలయాల్లో ఏపీ సేవా ప్లాట్ ఫారమ్ ద్వారా నమోదు చేసేందుకు మండల, సచివాలయ సిబ్బందిని సిద్ధం చేశామన్నారు. నూతన రైస్‌కార్డుల నమోదుతో బాటు రైస్ కార్డుల విభజన, రైస్ కార్డులలో సభ్యులను చేర్చడం, సభ్యుల తొలగింపు, రైస్ కార్డు సరెండర్ చేయడం, కార్డులో చిరునామా మార్పు, తప్పుగా నమోదైన రైస్ కార్డు ఆధార్ సీడింగ్ సవరణ సేవల కోసం కూడా ప్రజలు సచివాలయాలను సంప్రదించవచ్చన్నారు. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్‌గా విష్ణువర్ధన్ కాకినాడ క్రైం: ప్రతిష్టాత్మక కాకినాడ రంగరాయ వైద్య కళాశాల 51వ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్ఎంసీ అనస్థీషియా హెచ్వోడీగా పనిచేసిన డాక్టర్ విష్ణువర్ధన్ తాజా పదోన్నతులలో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు(డీఎంఈ) డాక్టర్ డీఎస్విఎల్ నరసింహం ఈ మేరకు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ విష్ణువర్ధన్ మీడియాతో మాట్లాడుతూ కళాశాల సర్వతోముఖాభివృద్దికి శాయశక్తులా శ్రమిస్తానని అన్నారు. విద్యార్థులు, బోధకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందేలా చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. పీఈటీ సంఘ ఎన్నికలకు 6 నామినేషన్లు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ఎన్నికలు ఈ నెల 17న రాంకుమార్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘ భవన్లో జరగనున్నాయి. ఈ ఎన్నికలకు నామినేషన్లు బుధవారం మధ్యాహ్నం అభ్యర్థులు దాఖలు చేశారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు వి.రవిరాజు నామినేషన్లు స్వీకరించారు. అధ్యక్ష పదవికి పి.శ్రీనివాస్, జి.రవికౌర్, ఊం.హరిబాబు, కార్యదర్శి పదవికి వి.మాచరరావు, కేవీవీ నరసింహమూర్తి, కోశాధికారి పదవికి కె.నాగలింగేశ్వరరావు నామినేషన్లు వేశారు. శుక్రవారం సాయంత్రం లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చునని రవిరాజు తెలిపారు. రాష్ట్ర పీఈటీ సంఘ మాజీ అధ్యక్షుడు జార్జి, సీనియర్ పీడీలు బంగార్రాజు, పట్టాభి, సునీల్ పాల్గొన్నారు. ఆన్లైన్లో ఫైనల్ మెరిట్ లిస్టు కాకినాడ క్రైం: గత ఏడాది జనవరి 21వ తేదీన రంగరాయ వైద్య కళాశాల పరిధిలో విడుదల చేసిన పారామెడికల్ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్‌కు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్టును విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు ఎన్ఐసీ వెబ్సైట్లో ఈ లిస్టును పొందవచ్చు. -
ఖైదీలకు ఈ– ములాఖత్
జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ కంబాల చెరువు (రాజమహేంద్రవరం): జైళ్ల శాఖలో చేపట్టనున్న సంస్కరణలలో భాగంగా రాష్ట్రంలో ఉన్న జైళ్లలో కృత్రిమ మేధ ఉపయోగించి సిబ్బందిపై ఉన్న ప్రస్తుత పనిభారాన్ని తగ్గించనున్నామని జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ తెలిపారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఖైదీల బ్యారక్‌లు, ఆరుబయలు జైలు, జైలు ఆవరణలోని వ్యవసాయ క్షేత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కారాగారంలో పనిచేస్తున్న గార్డెనింగ్ సిబ్బందితో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకుని సూచనలు చేశారు. ‘కృత్తిమ మేధ’’ ద్వారా గార్డెనింగ్ సిబ్బంది పై ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించి పటిష్టమైన భద్రతాచర్యలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఖైదీలు ఈ – ములాఖత్ ద్వారా కారాగారం నుంచి కుటుంబ సభ్యులతో, బంధువులతో నేరుగా వీడియో కాల్ ద్వారా మాట్లాడేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్, మునిసిపల్ కమిషనరు కేతన్కార్గే ఆయనను కలిశారు. ఆయన వెంట జైళ్ళ శాఖ కోస్తా ప్రాంత ఉపశాఖాధికారి రవి కిరణ్, జైలు సూపరింటెండెంట్ రాహుల్, జైలు అధికారులు ఉన్నారు.