
జిల్లా బ్యాడ్మింటన్ సంఘ కార్యవర్గం ఎన్నిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా బ్యాడ్మింటన్ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం కాకినాడలో ఓ హోటల్‌లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్‌వర్మ, కార్యదర్శిగా ఫణిగోపాల్, కోశాధికారిగా భాస్కరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా చుండ్రుగోవిందరాజు, కర్రి భామిరెడ్డి, ద్వారంపూడి వీరభద్రారెడ్డిని సంఘం ఎన్నుకుంది. ఉపాధ్యక్షులుగా ఎమ్.మురళీధర్, పీఎస్ గణేష్‌కుమార్, సహాయ కార్యదర్శులుగా కృష్ణమూర్తి, అడ్డాల సత్యనారాయణ, జగన్నాఽథ్, సభ్యులుగా కేవీబీ కృష్ణంరాజు, యు.రామకృష్ణ, కె.నరసింహరావు, వి.శారదాదేవి, కె.శ్రీనివాస్, లక్ష్మణ్‌కుమార్, రామ్‌మోహన్‌రావు ఎన్నికయ్యారు.