
రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
తుని: తుని– అన్నవరం మధ్యలో రైలు నుంచి జారిపడి అర్లి ఈశ్వరరావు (23) మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొంపంగి గ్రామానికి చెందిన ఈశ్వరరావు తొండంగి మండలం దివీస్ ఫార్మా కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇటీవల సొంత గ్రామానికి సెలవుపై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గజపతినగరంలో రైలు ఎక్కి అన్నవరం రైల్వే స్టేషన్‌కు వస్తుండగా జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద సెల్ ఫోన్ ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.