
కాకినాడ జిల్లా: పిఠాపురం రూరల్‌లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫక్రుద్దీన్ పాలెం( ఎఫ్.కే.పాలెం) పాపిడి దొడ్డి చెరువులో మట్టి తవ్వేందుకు యత్నించగా.. జేసీబీని రైతులు అడ్డుకున్నారు. చెరువును పరిశీలించిన సీపీఎం నేతలు.. చెరువులో మట్టి తవ్వుకునేందుకు ఎమ్మార్వో అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
3.5 ఎకరాల కోసం 360 ఎకరాలను బీడుగా మారుస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పొలం మెరక పేరుతో చెరువులో మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తారని ఆరోపించారు. పంచాయితీ తీర్మానం, రైతులు అభిప్రాయం తీసుకోకుండా ఎమ్మార్వో మట్టి తవ్వకాలకు ఏలా అనుమతి ఇస్తారంటూ సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన ఉంటారో లేక వ్యాపారుల పక్షాన ఉంటారో తేల్చుకోవాలంటూ సీపీఎం నేతలు హెచ్చరించారు.