breaking news
pithapuram rural mandal
-
పిఠాపురం రూరల్‌లో మరోసారి ఉద్రిక్తత
కాకినాడ జిల్లా: పిఠాపురం రూరల్‌లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫక్రుద్దీన్ పాలెం( ఎఫ్.కే.పాలెం) పాపిడి దొడ్డి చెరువులో మట్టి తవ్వేందుకు యత్నించగా.. జేసీబీని రైతులు అడ్డుకున్నారు. చెరువును పరిశీలించిన సీపీఎం నేతలు.. చెరువులో మట్టి తవ్వుకునేందుకు ఎమ్మార్వో అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.3.5 ఎకరాల కోసం 360 ఎకరాలను బీడుగా మారుస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పొలం మెరక పేరుతో చెరువులో మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తారని ఆరోపించారు. పంచాయితీ తీర్మానం, రైతులు అభిప్రాయం తీసుకోకుండా ఎమ్మార్వో మట్టి తవ్వకాలకు ఏలా అనుమతి ఇస్తారంటూ సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన ఉంటారో లేక వ్యాపారుల పక్షాన ఉంటారో తేల్చుకోవాలంటూ సీపీఎం నేతలు హెచ్చరించారు. -
‘ఉపాధి’లో అక్రమాల పథకం
అవకతవకలపై నిలదీసిన వైఎస్సార్ సీపీ నాయకులు తనిఖీలపై ఎమ్మెల్యే వర్గీయుల అసంతృప్తి రసాభాసగా సోషల్ ఆడిట్ విచారణ పిఠాపురం రూరల్ (పిఠాపురం) : పిఠాపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన సోషల్ ఆడిట్ విచారణలో గత ఏడాది నిర్వహించిన ఉపాధి పథకం పనుల్లో అక్రమాలు బయటపడ్డాయి. మండల పరిధిలో గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకూ రూ.8,53,03,598తో 24 గ్రామ పంచాయతీల్లో 3190 పనులు నిర్వహించారు. ఈ పనులపై ఆయా పంచాయతీల్లో సామాజిక తనిఖీ బృందం సభ్యులు గత నెల 24 నుంచి పర్యటించి తనిఖీలు జరిపారు. మండల స్థాయిలో బుధవారం నిర్వహించిన బహిరంగ విచారణలో తనిఖీ బృందం సభ్యులు పి.తిమ్మాపురం పంచా యతీలో అక్రమాలను వెల్లడిస్తుండగా, అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. రైతుల పొలాల్లో పనులు చేసినట్టుగా చూపించి బిల్లులు స్వాహా చేయడంతో పాటు తమ గ్రామంలో జరిగిన రూ.49, 61,742తో చేసిన పనుల్లో జరిగిన అక్రమాలపై తక్షణం చర్యలు చేపట్టాలంటూ పి.తిమ్మాపురం సర్పంచి పైల లక్ష్మి అనుచరులు డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడడంతో పాటు ప్రభుత్వం నుంచి ఫీల్డ్ అసిస్టెంట్‌గా జీతం తీసుకుంటూ అదే సమయంలో రోజు వారి కూలీ వేతనం తీసుకున్న సీనియర్ మేట్ (ఇ¯ŒSచార్జి ఫీల్డ్ అసిస్టెంట్) బర్ల సత్తిబాబుపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. సామాజిక తనిఖీ బృందం సభ్యులు తనిఖీలు సక్రమంగా జరపలేదని, అక్రమాలు జరగలేదని అదే గ్రామానికి చెందిన అధికార తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు బర్ల అప్పారావు వర్గీయులు ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. చర్యలు తీసుకోని అధికారులు వారం రోజులుగా సామాజిక తనిఖీ బృందం సభ్యులు పలు అక్రమాలను గుర్తించి ఆధారాలతో సహా విచారణలో వెల్లడించినా కారకులపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా ఉపాధి పథకం ప్రాజెక్టు డైరెక్టర్ విచారణాధికారిగా వ్యవహరించాల్సి ఉండగా ఏపీడీలు ఎం.శ్రీరంగనాయకులు, ఎస్.బులి్లబాబు హాజరయ్యారు. తమకు సిబ్బందిపై చర్యలు తీసుకునే అధికారం లేదని చెప్పడంపై అధికార పార్టీ నేతలు వారిపై ఒత్తిడి తెచ్చినట్టు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, 9 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఒక సీనియర్ మేట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్టు ఏపీడీ రంగనాయకులు ప్రకటించారు. సిబ్బంది నుంచి రూ.4,800 జరిమానాతో పాటు కూలీలకు చెల్లించాల్సి న రూ.8,966 కలిసి మొత్తం రూ.39,175 తక్షణ రికవరీకి ఆదేశాలు జారీ చేశామన్నారు. 9 అంశాలపై ఏపీడీ స్థాయి అధికారి విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. ఉపాధి అవకతవకలపై జిల్లా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని పి.తిమ్మాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత పైల కృష్ణమూర్తి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కేఎస్ఎస్ సుబ్బారావు, ఎంపీపీ ఎం.విజయలత, జెడ్పీటీసీ సభ్యుడు బర్ల అప్పారావు, వైస్ ఎంపీపీ మలిరెడ్డి వెంకటరమణ, స్టేట్ రీసోర్స్ పర్స¯ŒS సిహెచ్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.