ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై.. | - | Sakshi
Sakshi News home page

ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై..

May 19 2025 2:40 AM | Updated on May 19 2025 2:40 AM

ధర్మన

ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై..

దైనందిన జీవనంలోకి

సత్య చంద్రశేఖరేంద్రుని తల్లిదండ్రులు

ధన్వంతరి దంపతులకు

ఘనంగా సన్మానం

అన్నవరం: కడుపున పుట్టిన పుత్రుడు ప్రయోజకుడైతే ఆ తల్లిదండ్రుల ఆనందం మాటల్లో చెప్పలేనిది. అటువంటిది తమ పుత్రుడు దుడ్డు వేంకట సత్య సూర్య గణేష్‌ శర్మ ద్రావిడ్‌.. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా సన్యాస దీక్ష స్వీకరించి.. సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా ప్రభవించి.. సాక్షాత్తూ ఆదిశంకరాచార్యుడే పీఠాధిపత్యం వహించిన కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా.. తదుపరి పీఠాధిపతిగా పూజ్యనీయ స్థానం పొందడం చూసి.. ఆయన తల్లితండ్రులు మంగాదేవి, ధన్వంతరి దంపతులు ఎంతో పొంగిపోతున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అన్నవరానికి చెందిన యువ పండితుడు, చతుర్వేది గణేష్‌ శర్మకు గత నెల 30న అక్షయ తృతీయ పర్వదినం నాడు కంచి కామకోటి పీఠంలో సన్యాస దీక్ష ఇచ్చి, ఉత్తరాధికారిగా నియమించిన విషయం తెలిసిందే.

అంతకు ముందే ఏప్రిల్‌ 29న గణేష్‌ శర్మ జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకుని, వారి బంధాలను విడనాడి, సన్యాస దీక్షకు సమాయత్తమయ్యారు. దీనికి సంబంధించిన వైదిక క్రతువులు వరుసగా నాలుగు రోజుల పాటు జరిగాయి. అప్పటి నుంచీ మంగాదేవి, ధన్వంతరి దంపతులు సుమారు 20 రోజుల పాటు కంచి పీఠంలోనే ఉన్నారు. గణేష్‌ శర్మను తమ కుమారుడిగా కాకుండా కంచి పీఠం ఉత్తరాధికారిగా, సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా దర్శిస్తూ వచ్చారు. అనంతరం, ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై.. ఆ దంపతులు నాలుగు రోజుల కిందట అన్నవరం చేరుకున్నారు. శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆదేశానుసారం దైనందిన జీవితం గడుపుతున్నారు. వారిని వారి బంధువు, అన్నవరం దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ ఆదివారం ఉదయం దేవస్థానానికి తీసుకుని వచ్చారు. సత్యదేవుని దర్శనానంతరం ఆలయంలో పండితులు ఆ దంపతులకు వేదాశీస్సులు అందజేశారు. అనంతరం, వారిని సత్యదేవుని కండువాతో దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌ సత్కరించారు. ఈఓ వీర్ల సుబ్బారావు సత్యదేవుని చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం వేద పండితులు, అర్చకులు, వ్రత పురోహితులు ఆ దంపతులను అభినందించారు.

యథాప్రకారం సత్యదేవుని సేవలో..

నేను యథాప్రకారం సత్యదేవుని సేవలో పాల్గొంటాను. తెలిపారు. వ్రత పురోహితునిగా వ్రతాలు నిర్వహించడంతో పాటు సత్యదేవుని పూజలు, ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాను.

– దుడ్డు ధన్వంతరి

భిన్నమైన జీవనం గడుపుతున్నారు

ధన్వంతరి భార్య మంగాదేవి నా మేనకోడలు. వారి ఏకై క కుమారుడికి సన్యాస దీక్ష ఇచ్చి, కంచి పీఠం ఉత్తరాధికారిగా నియమించేందుకు అంగీకరించిన ఆ దంపతుల త్యాగం వెల కట్టలేనిది. సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి సేవలో సుమారు 20 రోజులు గడిపి, తిరిగి అన్నవరం వచ్చిన ఆ దంపతులు గతానికి భిన్నమైన జీవనం గడుపుతున్నారు.వారితో పాటు మా జన్మ కూడా ధన్యమైంది.

– నాగాభట్ల కామేశ్వరశర్మ

ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై.. 1
1/4

ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై..

ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై.. 2
2/4

ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై..

ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై.. 3
3/4

ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై..

ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై.. 4
4/4

ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement