బాబు మనసు మారాలి
రైతుల ప్రభుత్వమంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాకు తీరని అన్యాయం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలు చేశారు. ప్రీమియాన్ని నాటి ప్రభుత్వమే చెల్లించేది. ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం సైతం సకాలంలో అందేవి. చంద్రబాబు ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం భారాన్ని మాపై మోపారు. కొత్త సంవత్సరంలోనైనా బాబు పెద్ద మనసు చేసుకుని ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలి. ప్రీమియం చెల్లించకపోవడంతో పంట నష్టపరిహారం కోల్పోతున్నాం. మోంథా తుపానుతో నష్టపోయిన పంటకు కొత్త సంవత్సరంలోనైనా పరిహారం ఇవ్వాలి. కొత్త సంవత్సరంలోనైనా బాబు మనసు మారి మాబోటి రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నాం. – మిరియాల లోవరాజు,
రైతు, మర్లావ, పెద్దాపురం మండలం
మా ఆశలకు ఊపిరి పోయండి
ఏడాదిన్నరగా నిరుద్యోగుల ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఉద్యోగం ఇస్తాను లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్న మాటనే చంద్రబాబు ప్రభుత్వం మరచిపోయింది. కనీసం కొత్త సంవత్సరంలోనైనా గత ఏడాది నిరుద్యోగ భృతి బకాయిలు విడుదల చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎంతవరకూ చదువుకున్నా ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగులు కూలీలుగా మారుతున్నారు. హాస్టళ్లలోని విద్యార్థులకు కనీస మెస్ చార్జీలను కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. ప్రభుత్వ ఐటీఐలో చదువుతున్న విద్యార్థులకు వారి ట్రేడ్‌లతో సంబంధం లేకుండా ఇంటర్న్‌షిప్ ఇస్తున్నారు. వారి ట్రేడ్‌లకు సంబంధించి మాత్రమే పరిశ్రమల్లో మాత్రమే ఇంటర్న్‌షిప్ ఇవ్వాలి. కొత్త సంవత్సరంలోనైనా నిరుద్యోగుల ఆశలకు చంద్రబాబు ప్రభుత్వం ఊపిరి పోయాలి.
– పెంకే రవితేజ, నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్, కాకినాడ
2026లోనైనా
రూ.1,500 ఇవ్వు బాబూ
ఆడబిడ్డ నిధి పేరిట 18 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకూ రూ.1,500 భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి 19 నెలలైనా ఇంత వరకూ ఇవ్వలేదు. కనీసం కొత్త సంవత్సరంలోనైనా చంద్రబాబు ఈ మాట నిలబెట్టుకోవాలి. కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళల స్వయం ఉపాధి కోసం కుట్టు మెషీన్లు ఇస్తామన్న మాటను ఇంతవరకూ నెరవేర్చలేదు. ఈ ఏడాదైనా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా పథకాలు అమలు చేసి, మహిళల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
– కమిడి మంగాదేవి, సర్పంచ్,
వేములవాడ, కరప మండలం
ఉద్యోగుల ఆశలు చివురించాలి
నూతన సంవత్సరంలో పీఆర్‌సీ కమిటీ త్వరగా వేసి, ఆ నివేదిక ఆధారంగా జీతాలు పెంచాలి. ఉద్యోగులకు రావలసిన సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. సీపీఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు చేయాలి. పని ప్రదేశాల్లో ఉద్యోగులకు భద్రత కల్పించాలి. ఉద్యోగులపై దాడులు చేసే వారిపై చర్యల కోసం రూపొందించిన చట్టాలు కట్టుదిట్టంగా అమలు చేయాలి. ఆస్పత్రుల్లో పని చేసే వైద్య, వైద్యేతర ఉద్యోగులపై దాడులు జరగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలి. విశ్రాంత ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరితగతిన అందేలా చొరవ చూపాలి.
– పసుపులేటి శ్రీనివాస్,
రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీఎన్‌జీజీవో సంఘం
బాబు మనసు మారాలి
బాబు మనసు మారాలి
బాబు మనసు మారాలి


