
కేదార్‌నాథ్ యాత్రలో రోటరీ క్లబ్ సభ్యుడి మృతి
రాజమహేంద్రవరం సిటీ: ఉత్తరాంచల్‌లోని కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లిన రాజమహేంద్రవరానికి చెందిన రోటరీ క్లబ్ ఐకాన్ సభ్యుడు బిలిసెట్టి శ్రీరంగ కృష్ణ బదరి(33) బుధవారం కేదార్‌నాథ్‌లో మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా శుక్రవారం మృతదేహాన్ని నగరంలోని కంబాలసత్రం సమీపంలోని కృష్ణ బదరి నివాసానికి తీసుకువచ్చారు. కృష్ణ బదరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా, క్లబ్ అధ్యక్షుడు యిమ్మన్ని వెంకట్, క్లబ్ సభ్యులు మృతదేహానికి నివాళులు అర్పించారు. తీగల రాజా మాట్లాడుతూ చిన్న వయసులోనే సమాజ శ్రేయస్సుకు శ్రద్ధగా పనిచేసే క్లబ్ సభ్యుడు అకాల మరణం సమాజానికి తీరని లోటు అన్నారు. కృష్ణ బదరి అంత్యక్రియలను ఇన్నీసుపేట రోటరీ కై లాస భూమిలో నిర్వహించారు.