ప్రాథమిక విద్యకు సర్దుపోటు! | - | Sakshi
Sakshi News home page

ప్రాథమిక విద్యకు సర్దుపోటు!

May 15 2025 12:16 AM | Updated on May 15 2025 12:16 AM

ప్రాథ

ప్రాథమిక విద్యకు సర్దుపోటు!

గురువారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2025

ఉపాధ్యాయుల

నియామకం ఇలా..

● ఫౌండేషన్‌ స్కూల్‌ (పీపీ1, పీపీ2 1–2వ తరగతి)

1–30 మంది విద్యార్థులకు 1 ఎస్జీటీ, 31–60 విద్యార్థులకు 2 ఎస్జీటీలను నియమించారు.

● బేసీక్‌ ప్రైమరీ స్కూల్‌ (పీపీ–1, పీపీ2, 1–5వ తరగతి)లో 20 మందికి ఒక ఎస్జీటీ, 60 మందికి ఇద్దరు ఎస్జీటీలను నియమించారు.

● మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌ (పీపీ1, 2, 1–5వ తరగతి వరకు)

59 మంది విద్యార్థులకు ముగ్గురు (హెచ్‌ఎం లేదా స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ) ఉపాధ్యాయులను కేటాయించారు. అంతేగాక 150 మంది విద్యార్థులకు నలుగురిని నియమిస్తారు.

● అప్పర్‌ ప్రైమరీ పాఠశాలల్లో 1–10 వరకు ఒక స్కూల్‌ అసిస్టెంట్‌, 11 నుంచి 30 వరకు ఇద్దరు, 31 నుంచి 140 విద్యార్థులుంటే నలుగురు, 141 నుంచి 175 మందికి ఐదుగురు స్కూల్‌ అసిస్టెంట్లను నియమిస్తున్నారు.

సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నిందా..? ఇందులో భాగంగానే పాఠశాలల పునర్మిర్మాణ ప్రక్రియ పేరుతో గందరగోళానికి తెర తీసిందా..? ఈ పరిణామం ప్రాథమిక విద్యపై తీవ్ర ప్రభావం చూపనుందా..? మిగులు ఉపాధ్యాయులు పెరిగి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి భంగం కలగనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నుంచి.

ఇదీ సంగతి

ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం అసంబద్ధ విధానాల అమలుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన క్లస్టర్‌ విధానాన్ని తొలగించి మోడల్‌ స్కూల్స్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా గత ప్రభుత్వం జీవో 117 పేరిట పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టింది. కూటమి అధికారంలోకి వచ్చాక జీఓను రద్దు చేసింది. ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలోనూ ఉపాధ్యాయుల నుంచి విమర్శలు ఎదుర్కొంది. తాజాగా పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో కొత్త విధానానికి తెర తీసింది. ఇందులో భాగంగా తొమ్మిది రకాల పాఠశాలలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొన్ని రోజులుగా చేసిన కసరత్తు మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలతో మిగులు పోస్టులు పెరిగి, ప్రాథమిక విద్యకు నష్టం తప్పదని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

యూపీ స్కూళ్ల కొనసాగింపు

పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రాథమికోన్నత (యూపీ) పాఠశాలలను ఎత్తివేయాలని భావించింది. తల్లిదండ్రులు, ఆయా ప్రాంతాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న యూపీ స్కూళ్లను యథావిధిగా కొనసాగించేందుకు అంగీకరించింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 72 అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలున్నాయి. ఇవి యథావిధిగా కొనసాగనున్నాయి.

767 పోస్టుల సర్దుబాటు

ఉపాధ్యాయుల సర్దుబాటుపై గురువులు గుర్రుగా ఉన్నారు. అసంబద్ధ విధానాలతో ప్రక్రియ చేపట్టిందని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించగా సర్దుబాటు ప్రక్రియ కాస్తా గందరగోళంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాలల వారీగా మంగళవారం జాబితా విడుదల చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 767 మిగులు ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భవిష్యత్తులో ఎస్‌జీటీ (సెకండరీ గ్రేడ్‌) పోస్టుల భర్తీ కలగానే మారనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 371 మంది ఉపాధ్యాయులను వివిధ పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌, హెచ్‌ఎం పోస్టులకు, మోడల్‌ ప్రైమరీ పాఠశాల్లో సర్దుబాటు చేశారు. 31 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా సర్దుబాటు చేశారు. హెచ్‌ఓడీ పూల్‌లో ఉన్న 355 మంది ఉపాధ్యాయులను సైతం వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు.

డీఎస్సీని మరిపించేందుకు ఎత్తులు

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు, లోకేష్‌ ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక డీఎస్సీ నిర్వహించాల్సిన సమయం ఆసన్నం కావడంతో ఎలాగోలా మెగా డీఎస్సీని కాలయాపన చేసేందుకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సర్దుబాటుకు ఉన్న అర్థాన్నే మార్చేశారని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ (సర్దుబాటు) అంటే ఒకటి లేదా రెండు నెలల పాటు మిగులు టీచర్లను అవసరమైన చోట తాత్కాలికంగా వినియోగించుకోవడం. ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న వాదన ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది.

విద్యా వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కుట్ర

అంతా అస్తవ్యస్తం..!

పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో

ఉపాధ్యాయ పోస్టుల కుదింపు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 767 పోస్టుల సర్దుబాటు

క్లస్టర్‌ వ్యవస్థకు మంగళం..

మోడల్‌ స్కూల్‌ విధానానికి నాంది

కూటమి ప్రభుత్వ చర్యలతో

మిగులు పోస్టులు పెరిగే అవకాశం

ప్రాథమిక విద్యకు సర్దుపోటు!1
1/1

ప్రాథమిక విద్యకు సర్దుపోటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement