
ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతిగా ముత్యాల నాయుడు
అంబాజీపేట: స్థానిక డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతిగా డాక్టర్ ఎం.ముత్యాల నాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు జిల్లా, నంధ్యాలలోని మహానంది ఉద్యాన పరిశోధన కేంద్ర నుంచి ఆయన ఇక్కడకు బదిలీపై వచ్చారు. ముత్యాల నాయుడు కొవ్వూరు, దర్శి, మహానంది తదితర పరిశోధన స్థానాల్లో సుగంధ ద్రవ్య పంటలు, అరటి, నిమ్మ, దుంప పంటలు, పండ్లు, కూరగాయల పంటలపై పరిశోధనలు చేసి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేసి మంచి గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తానన్నారు. కొబ్బరిలో తెగుళ్లు, పురుగుల నివారణ, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వారికి చేరువలో ఉంటానన్నారు. కొబ్బరిని ఆశించిన తెల్లదోమ నివారణకు ఎప్పటికప్పుడు రైతులతో మమేకమై నివారణకు కృషి చేస్తానన్నారు. ముత్యాల నాయుడిని స్థానిక శాస్త్రవేత్తలు, సిబ్బంది అభినందించారు. ఇక్కడ విధులు నిర్వహించిన డాక్టర్ ఎన్‌బీవీ చలపతిరావు తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉద్యాన సమాచార కేంద్రంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ హోదాతో పాటు ముఖ్య ప్రజా సంబంధ అధికారిగా బదిలీపై వెళ్లారు.