
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్స్ మే 28 నుండి జూన్ 1 వరకూ నిర్వహించనున్నారు. జిల్లాలోని 36 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లావ్యాప్తంగా ఫస్టియర్‌కు 15,933 మంది, సెకండియర్‌కు 5,608 మంది కలిపి, 21,541 మంది ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి ఐ.శారద తెలిపారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలనూ అనుమతించబోమని, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించామని తెలిపారు.