
ప్రజల ఆస్తిని కాపాడాలి
వివిధ దశల్లో రెవెన్యూ అధికారులు, మున్సిపల్ ఆర్డీ సర్వే నంబర్ 579లో 1.52 ఎకరాల భూమిని పక్కాగా ప్రభుత్వ భూమి అని నిర్థారించారు. గొల్లప్రోలు నగర పంచాయతీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఇదే విషయాన్ని న్యాయస్థానానికి నివేదించింది. మూడేళ్లుగా నడుస్తోన్న ఈ వ్యవహారంలో అధికారులు పక్కాగా రికార్డులు ప్రకారం గ్రామ కంఠం, ప్రభుత్వ భూమి అని చెబుతూనే ఉన్నారు. ఈ భూమిలో ప్రజాప్రయోజనార్థం గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయం, కమ్యునిటీ హాళ్లు నిర్మించాలని ప్రజలు నుంచి డిమాండ్‌లు ఉన్నాయి. రూ.15 కోట్లకు పైగా విలువైన ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను జిల్లా యంత్రాంగం గుర్తించి కట్టడి చేయాల్సి ఉంది.
– గండ్రేటి మంగతాయారు,
చైర్‌పర్సన్, నగర పంచాయతీ, గొల్లప్రోలు