
సీబీఎస్‌ఈ ఫలితాల్లో శ్రీప్రకాష్ ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సీబీఎస్‌ఈ పదవ తరగతి, ప్లస్‌టూ ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు ప్రతిభ చూపారని విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి విజయప్రకాష్ మంగళవారం తెలిపారు. పదవ తరగతి ఫలితాల్లో ఎన్.సత్యసాయి 483, ఎం.యశస్వి 482, పి.తరుణ్‌కుమార్ 481, మహర్షి4 79, ఎస్.రఘవందన 478మార్కులు సాధించారన్నారు. ప్లస్‌టూ ఫలితాల్లో జి.సాయి అనీష్ 469, ధాత్రి నిహారిక 466 సాధించి ప్రతిభ చాటారన్నారు. మ్యాథ్స్, సైన్స్, సబ్జెక్టుల నుంచి నూటికి నూరుశాతం మార్కులు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను కార్యదర్శి నరసింహారావు, అధ్యాపకులు అభినందించారు.

సీబీఎస్‌ఈ ఫలితాల్లో శ్రీప్రకాష్ ప్రతిభ

సీబీఎస్‌ఈ ఫలితాల్లో శ్రీప్రకాష్ ప్రతిభ