
నేడు ‘కోట’ మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం
సామర్లకోట: మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం ప్రవేశ పెట్టడానికి రంగం సిద్ధం అయింది. మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణపై బలనిరూపణకు 22 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టరుకు గత నెల 2వ తేదీన వినతిపత్రం అందజేశారు. చైర్‌పర్సన్ అరుణ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కౌన్సిల్ సభ్యుల వినతి మేరకు గురువారం బలనిరూపణ చేసుకోవాలని కలెక్టరు ఆదేశించారు. ప్రత్యేకాధికారిగా కాకినాడ ఆర్డీఓ మల్లిబాబును నియమించారు. ఈ మేరకు బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయానికి వచ్చి బలనిరూపణకు చేయవలసిన ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య, సీఐ ఎ.కృష్ణభగవాన్‌లతో సమీక్ష నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విప్ జారీ చేసే అధికారాన్ని జిల్లా ఽఅధ్యక్షుడు దాడిశెట్టి రాజాకు ఇవ్వగా, ఆయన పట్టణ పార్టీ అధ్యక్షుడు పాగా సురేష్‌కుమార్‌కు విప్ జారీ చేసే అధికారం ఇచ్చారు. ఈ మేరకు విప్ పత్రాన్ని పాగా సురేష్‌కుమార్ ఆర్డీఓ మల్లిబాబుకు అందజేశారు. కౌన్సిలర్ కరణం రాజ్‌కుమార్ పాల్గొన్నారు. గురువారం మున్సిపల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి కోరమ్ ఉన్న సమయంలో బలనిరూపణకు అవకాశం ఇస్తామని, కోరమ్ లేకుంటే అదే రోజు మధ్యాహ్నం మరో పర్యాయం అవకాశం ఇస్తామని అప్పటికీ కోరమ్ లేక పోతే సమావేశం నిరవధికంగా వాయిదా వేస్తామని ఆర్డీవో అన్నారు. దాంతో ఏడాది వరకు చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండదని ఆర్డీఓ మల్లిబాబు చెప్పారు. కౌన్సిల్ సభ్యులు గుర్తింపు కార్డులో హాజరయ్యే విధంగా చూడాలని సీఐకు ఆర్డీఓ సూచించారు. కౌన్సిల్ హాల్‌లో చేయవలసిన ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ పరిధిలో ఒక కిలోమీటరు వరకు 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. చేతులు ఎత్తే పద్ధతిలో బల నిరూపణ ఉంటుంది. వైఎస్సార్‌సీపీకి చెందిన సభ్యులు పార్టీ సూచించిన విధంగా కాకుండా వ్యతిరేకంగా ఓటు వేస్తే పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు కౌన్సిల్ పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది.
వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల వినతితో
కౌన్సిల్ సమావేశం
విప్ జారీచేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజా
కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్ అమలు