కోరుకొండ: స్థానిక దేవునికోనేరు వద్ద ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై కూన నాగరాజు తెలిపారు. 45 ఏళ్ల వయసున్న మృతదేహాన్ని గుర్తించినట్టు వీఆర్వో కొవ్వాడ రామకృష్ణ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించేందుకు వీలుగా 72 గంటల పర్యవేక్షణ నిమిత్తం రాజమమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు ఎస్సై తెలిపారు.
బాల్య వివాహం అడ్డగింత
యానాం: చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న ఓ బాల్య వివాహాన్ని యానాం చైల్డ్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన సమాచారం ఆధారంగా సిబ్బంది వెళ్లి అడ్డుకున్నారు. ఆదివారం చైల్డ్ హెల్ప్‌లైన్ కో ఆర్డినేటర్ సంసాని రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం నియోజకవర్గ పరిధిలో బాలయోగి నగర్‌లో 15 ఏళ్ల బాలికకు 22 ఏళ్ల యువకుడితో వివాహం చేస్తున్నారని తమకు సమాచారం వచ్చిందన్నారు.
ఈ మేరకు యానాం ఏఎస్సై పంపన మూర్తి, ప్రకాష్‌లను వెంటపెట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్లి బాల్యవివాహాల నిరోధక చట్టం–2006 గూర్చి ఇరువురు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించామని, చట్టరీత్యా ఈ వివాహం నేరమని చెప్పి చెప్పినట్టు తెలిపారు. యానాంలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతుంటే 1098కు సమాచారం అందించాలని, వివరాలను గోప్యంగా ఉంచుతారని తెలిపారు.